
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(73) దాదాపు నాలుగేళ్ల తర్వాత శనివారం స్వదేశానికి రానున్నారు.లండన్ నుంచి దుబాయ్‌కి, అక్కడి నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నారు. అక్కడి నుంచి చార్టెర్డ్ విమానంలో శనివారం పాకిస్తాన్‌కు చేరుకుంటారు.
లాహోర్‌లో శనివారం సాయంత్రం తమ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ –నవాజ్(పీఎంఎల్–ఎన్) నిర్వహించే బహిరంగ సభలో షరీఫ్ పాల్గొంటారు. అయితే, ఆయన భద్రతకు ముప్పు ఉందన్న నిఘా సమాచారం మేరకు పంజాబ్ పోలీస్ యంత్రాంగం హై అలెర్ట్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment