Former Prime Minister
-
హసీనాను రప్పించడమే ప్రాథమ్యం
ఢాకా: భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఉద్ఘాటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలం తెలిపారు. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి. ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా, వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పారీ్టలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే’’అని నొక్కి చెప్పారు. హసీనా ప్రభుత్వం మానవాళిపై నేరాలకు పాల్పడుతోందంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఇచ్చిన నివేదికను ఉదాహరించారు. ఈ నేపథ్యంలో హసీనాను అప్పగించే విషయమై భారత్‌పై ఒత్తిడి పెరిగిందన్నారు. యూనస్‌కు శిక్ష తప్పదు: హసీనా మహమ్మద్ యూనస్ బంగ్లాలో అరాచకాలకు పాల్పడుతున్నారని హసీనా ఆరోపించారు. ‘‘నన్ను అధికారానికి దూరం చేసే కుట్రలో భాగంగానే హత్యలకు పాల్పడ్డారు. అందుకు కారణమైన ‘దుండగుడు’యూనస్‌ను, ఇతరులను బంగ్లా గడ్డపై శిక్షిస్తా’’అని ప్రతినబూనారు. జూలై తిరుగుబాటులో మరణించిన పోలీసుల కుటుంబాలతో ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె వర్చువల్‌గా పాల్గొన్నారు. మృతుల భార్యలతో ముఖాముఖి మాట్లాడారు. యూనస్ వచ్చాక గతంలో ఎన్నడూ లేనంతగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. 2024 తిరుగుబాటు నేపథ్యంలో తన ప్రభుత్వం కుప్పకూలడంతో హసీనా భారత్‌కు పారిపోయి వచ్చి ఆశ్రయం పొందుతుండటం తెలిసిందే. ‘‘విచారణ కమిటీలన్నింటినీ యూనస్ రద్దు చేశారు. ప్రజలను చంపడానికి ఉగ్రవాదులను మధ్యంతర ప్రభుత్వం విడుదల చేసింది. వారు బంగ్లాను నాశనం చేస్తున్నారు. హత్యాయత్నం నుంచి నేను త్రుటిలో తప్పించుకున్నా. ఏదో మంచి చేయడానికే దేవుడు నన్ను బతికించాడని భావిస్తున్నా. నేను బంగ్లా తిరిగొచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తా’’ఆమె ప్రకటించారు. -
హసీనా వీసా గడువు పెంపు
న్యూఢిల్లీ: విద్యార్థుల ఉద్యమం, ఎగసిన అల్లర్లతో స్వదేశం వీడి భారత్‌లో తలదాచుకుంటున్న పదవీచ్యుత బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా విషయంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెకు ఇచ్చిన వీసా గడువును పొడిగించింది. గత ఏడాది జూలై–ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో దేశ విమోచన పోరాటయోధుల కుటుంబాలు, వారసులకు నియామకాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమాన్ని హసీనా ఉక్కుపాదంతో అణిచేసి దారుణాలకు పాల్పడ్డారని ఆమెను విచారిస్తామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించడం తెల్సిందే. ఆమె పాస్ట్‌పోర్ట్‌ను రద్దుచేస్తున్నట్లు మొహమ్మద్ యూనుస్ సర్కార్ మంగళవారం ప్రకటించిన వేళ ఆమె వీసా గడువను భారత్ తాజాగా పొడిగించడం గమనార్హం. ఆమెతోపాటు 75 మంది పాస్ట్‌పోర్ట్‌లను రద్దుచేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. -
ముగిసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
-
Magazine Story: ఆర్థిక మహర్షి - అడుగులు
-
సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
-
మన్మోహన్ సింగ్ అంటే అందరి నోటా ఒకటే మాట
-
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
-
దేశం గొప్ప భూమిపుత్రున్ని కోల్పోయింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు గురువారం రాత్రి ‘ఎక్స్’వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ‘దేశంలోనే గొప్ప ఆర్థిక వేత్త, నాయకుడు, సంస్కరణవాది, అన్నిటికంటే మించి మానవతావాది మన్మోహన్ సింగ్ ఇకలేరు. ధర్మానికి ప్రతీకగా, నిష్కలంకమైన సమగ్రత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన మన్మోహన్ నవభారత నిర్మాతల్లో ఒకరు. తన రాజకీయ, ప్రజా జీవితంలో ఔన్నత్యాన్ని ప్రదర్శించిన భూమి పుత్రుడిని దేశం కోల్పోయింది. మన్మోహన్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’అని ట్వీట్లో రేవంత్ పేర్కొన్నారు. దేశానికి తీరని లోటు: డిప్యూటీ సీఎం భట్టి మన్మోహన్ సింగ్ మరణం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. దూరదృష్టి గల నాయకుడు, ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, భారతదేశ పురోగతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నా రు. దేశానికి మన్మోహన్ చేసిన కృషి, అభివృద్ధిలో ఆయన పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. ఉద్యమాన్ని అర్థం చేసుకున్నారు: కేసీఆర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. ‘పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ అనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డ. భారత ప్రధానిగా మన్మోహన్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’అని కేసీఆర్ పేర్కొన్నారు. మన్మోహన్ పాత్రను దేశం మర్చిపోదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ‘ఆర్బీఐ గవర్నర్ గా, ప్రణాళికా సంఘంలో కీలక బాధ్యతల్లో, యూ జీసీ చైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక శాఖమంత్రిగా మన్మోహన్ దేశానికి వన్నెతీసుకొచ్చారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు, దేశ ఆర్థిక మంత్రిగా దేశంలో సంస్కరణలు తీసుకురావడంలో మన్మోహన్ పోషించిన పా త్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన మరణం దేశానికి తీరని లోటు’అని పేర్కొన్నారు. ఆధునిక భారత నిశ్శబ్ద నిర్మాత : కేటీఆర్ ‘ఆధునిక భారత నిశ్శబ్ద నిర్మాత, దూర దృష్టి గల నేత, మేధావి, అద్భుతమైన మానవతావాది మన్మోహన్ సింగ్. చరిత్ర పుటల్లో వారి కీర్తి ఎల్లప్పుడూ అజరామరంగా నిలిచిపోతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి’ దేశ ప్రగతిలో కీలక భూమిక: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ మొదట పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికశాఖ మంత్రిగా సంస్కరణలను అమలుచేసి దేశం అభివృద్ధి పథంలో నడవడానికి పునాదులు వేశారు. 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రగతికి తోడ్పడ్డారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్థస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. పలువురు నేతల సంతాపం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపాన్ని తెలియజేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ చిన్నారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. -
మన్మోహన్ అస్తమయం
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) ఇక లేరు. వయో సంబంధిత సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆయన గురువారం ఢిల్లీలోని తన నివాసంలో చికిత్స పొందుతూ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. దాంతో అత్యంత విషమ స్థితిలో రాత్రి 8 గంటల వేళ హుటాహుటిగా ఎయిమ్స్ ఎమర్జెన్సీ విభాగానికి తరలించారు. ‘‘అన్నిరకాలుగా అత్యవసర చికిత్స అందించినా లాభం లేకపోయింది. 9.51 గంటల ప్రాంతంలో మన్మోహన్ తుదిశ్వాస విడిచారు’’ అని ఎయిమ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. వివాద రహితునిగా, అత్యంత సౌమ్యునిగా, మృదుభాషిగా, మచ్చలేని రాజనీతిజు్ఞడిగా పేరొందిన మన్మోహన్ మృతి పట్ల రాజకీయ తదితర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాందీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు. మన్మోహన్ అస్వస్థత గురించి తెలియగానే సోనియా తన కుమార్తె ప్రియాంకతో కలిసి హుటాహుటిన ఎయిమ్స్‌కు చేరుకున్నారు. మన్మోహన్ పార్థివదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయన మరణ వార్త తెలిసి సీడబ్ల్యూసీ భేటీ కోసం కర్ణాటకలోని బెల్గావీలో ఉన్న ఖర్గే, రాహుల్ తదితరులంతా హస్తిన బయల్దేరారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం ప్రకటించింది. మన్మోహన్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని ఆదేశించింది. కాంగ్రెస్ కూడా వారం పాటు పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుంది. కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఉదయం సమావేశమై మన్మోహన్‌కు ఘనంగా నివాళులు అర్పించనుంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ రెండుసార్లు ప్రధానిగా చేశారు. ఆయనకు భార్య గురుచరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలున్నారు. ⇒ శాంతి, శ్రేయస్సు విడదీయలేనివి. శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అదే సమయంలో అభివృద్ధి లేకుంటే శాంతి ఉండదు. భారతదేశ అసలైన భవితవ్యం దాని సహనశీలత, సమ్మిళిత, సమానత్వ సమాజంగా ఎదగగల సామర్థ్యంలో దాగి ఉంది.⇒ 1991లో మేం చేపట్టిన సంస్కరణలు ఎవరినీ సంతోషపరిచేందుకు కాదు. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు స్థిరమైన వృద్ధికి పునాది వేయడమే వాటి ఉద్దేశం.⇒ మన ప్రజల తలసరి ఆదాయం గురించి కంటే వారి ఆదాయాల్లోని అసమానతల గురించే నాకు ఎక్కువ ఆందోళన ఉంది.⇒ మన దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కానీ వాటిని ప్రతిసారీ మనం మరింత బలంగా, మరింత ఐక్యంగా, మరింత పట్టుదలతో ఎదుర్కొని బయటపడ్డాం. మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కానీ కష్టపడేతత్వం, చిత్తశుద్ధి, సరైన విధానాలతో మనం మనుగడ సాగించగలం. -
నెహ్రూకు నివాళులర్పించిన మోదీ
-
విపక్ష నేత పదవికి సునాక్ గుడ్‌బై
లండన్: బ్రిటన్ విపక్ష నేత పదవి నుంచి రిషి సునాక్ (44) బుధవారం తప్పుకున్నారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా రెండేళ్ల క్రితం ఆయన చరిత్ర సృష్టించడం తెలిసిందే. ఆయన సారథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ గత జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతుల్లో ఘోర పరాజయం పాలైంది. నాటినుంచి సునాక్ తాత్కాలికంగా విపక్ష నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం పార్లమెంటులో ప్రకటించారు. ‘రెండేళ్ల నాడు దీపావళి సంబరాల సందర్భంగానే నా పార్టీ నాయకునిగా ఎన్నికయ్యా. మళ్లీ అవే సంబరాల వేళ తప్పుకుంటున్నా’ అంటూ హాస్యం చిలికించారు. ‘‘ఈ గొప్ప దేశానికి తొలి బ్రిటిష్ ఏషియన్ ప్రధాని కావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నా. బ్రిటన్ అనుసరించే గొప్ప విలువలకు ఇది తార్కాణంగా నిలిచింది’’ అన్నారు. తన చివరి ప్రైమ్‌మినిస్టర్స్ క్వశ్చన్స్ (పీఎంక్యూస్)లో భాగంగా ప్రధాని కియర్ స్టార్మర్‌కు సునాక్ పలు సరదా ప్రశ్నలు వేసి అందరినీ నవ్వించారు. వెనక బెంచీల్లో కూచుంటాఅమెరికాలో స్థిరపడాలని తాను భావిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను ఈ సందర్భంగా సునాక్ తోసిపుచ్చారు. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ ఎంపీగా పారల్మెంటులో వెనక బెంచీల్లో కూర్చుని కనిపిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. దాంతో సహచర ఎంపీలంతా నవ్వుల్లో మునిగిపోయారు. -
Muhammad Yunus: అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనుస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎదురు లేకుండా అధికారంలో కొనసాగేందుకు దేశంలోని అన్ని వ్యవస్థలను హసీనా నాశనం చేశారన్నారు. ‘న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టింది. దాదాపు 15 ఏళ్లపాటు సాగించిన దుర్మార్గపు పాలనలో ప్రజాస్వామిక హక్కులను ఆమె అణగదొక్కారు. ప్రభుత్వ ఖజానాను దోచుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు’అని ఆయన నిప్పులు చెరిగారు. హసీనా క్రూరమైన నియంతృత్వ విధానాల ఫలితంగా దేశంలో అన్నిరకాలుగా పూర్తి గందరగోళంలోకి నెట్టివేయబడిందని పేర్కొన్నారు. భద్రతా బలగాలు, మీడియాతోపాటు పౌర యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వంటి కీలక విభాగాల్లో ముఖ్యమైన సంస్కరణలను తేవాలన్నది తమ ప్రధాన ఉద్దేశమన్నారు. జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయ సాధనకు చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు. శాంతి నెలకొనే వరకు సాయుధ బలగాలు పౌర విభాగాలకు సాయంగా పనిచేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు, భద్రతా బలగాల సహకారంతో అతి తక్కువ సమయంలోనే సాధారణ పరిస్థితులను తీసుకువస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు భద్రతను, రక్షణను కల్పించేందుకు ప్రభుత్వ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. -
Bangladesh: ఎన్నికలవేళ హసీనా తిరిగొస్తారు: సాజీబ్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగొస్తారని ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ వెల్లడించారు. ‘‘ బంగ్లా మధ్యంతర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన మరుక్షణమే ఆమె భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తారు’ అని వాజెద్ అన్నారు. ప్రస్తుతం హసీనా న్యూఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె బ్రిటన్‌లో ఆశ్రయం పొందాలని యోచిస్తున్నట్లు భారత మీడియా కథనాలు ప్రచురించింది. అయితే బ్రిటన్ హోం శాఖ దీనిపై స్పందించడానికి నిరాకరించింది. బంగ్లాదేశ్ గురించి బ్రిటన్ విదేశాంగ మంత్రితో మాట్లాడానని, ఆయన ఎలాంటి వివరాలను పంచుకోలేదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం చెప్పారు. ఈ నేపథ్యంలో వాజెద్ మీడియాతో మాట్లాడారు. అనివార్య పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వాజెద్ ప్రకటించారు. -
పెళ్లి కేసులో ఇమ్రాన్‌కు ఊరట
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట. ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకంగా పెళ్లాడారన్న కేసులో ఇమ్రాన్ (71), బుష్రా బీబీ (49) దంపతులను న్యాయస్థానం నిర్దోషులుగా తేలి్చంది. వారిపై మోపిన అభియోగాలను ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు శనివారం తోసిపుచి్చంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను కొట్టేసింది. మత ప్రబోధకురాలైన బుష్రా తన మొదటి భర్త ఖవర్ ఫరీద్ మనేకాతో 28 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకుని ఇమ్రాన్‌ను పెళ్లా డారు. అయితే విడాకులకు, పునర్వివాహానికి మధ్య ముస్లిం మహిళ విధి గా పాటించాల్సిన 4 నెలల గడువు (ఇద్దత్)ను ఆమె ఉల్లంఘించిందంటూ ఫరీద్ కేసు పెట్టారు. ఈ కేసులో గత ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికల ముంగిట ఇమ్రాన్ దంపతులకు ఏడేళ్ల శిక్ష పడింది. ఇమ్రాన్‌కు జైలు శిక్ష పడ్డ మూడు కేసుల్లో ఇదొకటి. తోషా ఖానా కేసులో జైలు శిక్షను కోర్టు ని లుపుదల చేయగా, సిఫర్ కేసుల్లో నిర్దోíÙగా బయటపడ్డారు. దాంతో గత ఆగస్టు నుంచీ జైల్లోనే ఉన్న ఇమ్రాన్ విడుదలవుతారని భావించారు. కానీ తాజా తీర్పు వెలువడ్డ కాసేపటికే అల్లర్ల కేసులో ఆయన అరెస్టుకు ఉగ్ర వాద వ్యతిరేక కోర్టు అనుమతినిచ్చింది. దాంతో ఆయన జైల్లోనే ఉండనున్నారు. -
మరణశయ్యపై ఖలీదా జియా!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు సరైన వైద్య అందించకుండా ఆమెపై ప్రధాని షేక్ హసీనా పగ తీర్చుకుంటున్నారని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆరోపించింది. ఖలీదా ‘మరణశయ్య’పై ఉన్నారని, ఆమెకు సరైన వైద్య చికిత్స అందడం లేదని ఆ పార్టీ సెక్రటరీ జేనరల్ ఫక్రుల్ ఇస్లామ్ అలంగీర్ ఆదివారం తెలిపారు. గృహ నిర్బంధంలో ఉన్న 78 ఏళ్ల ఖలీదా జియా శనివారం రాత్రి తన నివాసంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని, వెంటనే అంబులెన్స్‌లో ఎవర్‌కేర్ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. 1991 నుంచి 96 వరకు, 2001 నుంచి 2006 రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన ఖలీదా ఓ అవినీతి కేసులో జైలు పాలయ్యారు. అయితే జియా ఓల్డ్ ఢాకా సెంట్రల్ జైల్లోనే అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలోనే ఆమెకు సరైన వైద్యం అందలేదని అలంగీర్ ఆరోపించారు. ఆ తరువాత ఆమె ఇంట్లో ఉండటానికి అనుమతించినప్పటికీ పూర్తి నిర్బంధంలో జైలులాంటి జీవితాన్నే అనుభవిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఖలీదాకు విదేశాల్లో చికిత్స అవసరమని మెడికల్ బోర్డు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, సరైన వైద్యం అందకుండా చంపేసి, రాజకీయంగా అడ్డు తొలగంచుకోవాలని ప్రధాని షేక్ హసీనా చూస్తున్నారని అలంగీర్ ఆరోపించారు. -
HD Deve Gowda: ఫ్యామిలీ ప్యాకేజీ
కర్నాటక జనాలకు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ‘కుటుంబ కథాచిత్రమ్’ చూపిస్తున్నారు! ఆ కుటుంబం నుంచి ఈసారి కూడా ముగ్గురు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండటం విశేషం. తమ వొక్కళిక సామాజికవర్గ ప్రాబల్యం అధికంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో వారు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాంతో ప్రత్యర్థులు జేడీ(ఎస్)ను ‘ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ ఆఫ్ ఫ్యామిలీ’ అంటూ జోరుగా ఎద్దేవా చేస్తున్నారు. ఇటీవలి కాలం దాకా ఇవే విమర్శలు చేసిన బీజేపీ ఈసారి జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకోవడం విశేషం!కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాల్లో బీజేపీతో పొత్తులో భాగంగా జేడీ(ఎస్)కు మూడు దక్కాయి. వాటిలో జేడీ(ఎస్) కంచుకోట అయిన మండ్య నుంచి దేవేగౌడ కుమారుడు హెచ్డీ కుమారస్వామి, హసన్ నుంచి మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తున్నారు. దేవెగౌడ అల్లుడు సి.ఎన్.మంజునాథ్ బీజేపీ టికెట్‌పై బెంగళూరు రూరల్ నుంచి బరిలో ఉండటం విశేషం! చన్నపట్న అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కుమారస్వామికి ఇవి ఆరో లోక్‌సభ ఎన్నికలు.వరుసగా రెండోసారి...ఇలా దేవెగౌడ కుటుంబంనుంచి ముగ్గురు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండటం ఇది వరుసగా రెండోసారి. దక్షిణ కర్ణాటకగా భావించే పాత మైసూర్ ప్రాంతంలో జేడీ(ఎస్)కు బాగా పట్టుంది. ఇక్కడ దేవెగౌడకు చెందిన వొక్కళిగ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. 2019లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా జేడీ (ఎస్)కు 9 సీట్లు దక్కాయి. తుముకూరు నుంచి దేవెగౌడ, హసన్ నుంచి ప్రజ్వల్, మండ్య నుంచి కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేశారు. ప్రజ్వల్ ఒక్కరే గెలిచారు.ఏ ఎన్నికల్లో చూసినా...దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారుల్లో రేవణ్ణ, కుమారస్వామి రాజకీయాల్లో ఉన్నారు. రేవణ్ణ హోలెనర్సిపుర ఎమ్మెల్యే. ఆయన భార్య భవాని జిల్లా పరిషత్ సభ్యురాలిగా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇప్పించుకునేందుకు రేవణ్ణ విఫలయత్నం చేశారు. వారి ఇద్దరు కుమారుల్లో ప్రజ్వల్ హాసన్ ఎంపీ కాగా సూరజ్ ఎమ్మెల్సీ. రెండుసార్లు సీఎంగా చేసిన కుమారస్వామి తన కొడుకు నిఖిల్‌ను రాజకీయాల్లో నిలబెట్టేందుకు 2019 నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.జేడీ(ఎస్) యువజన విభాగం నేతగా ఉన్న నిఖిల్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నుంచి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నుంచి పోటీ చేసినా ఓటమి పాలే అయ్యారు. ఈసారి మండ్యలో కుమారస్వామి గెలిస్తే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చన్నపట్న అసెంబ్లీ స్థానం ఖాళీ అవుతుంది. అక్కడి నుంచి ఉప ఎన్నికలో నిఖిల్ పోటీ చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. కుమారస్వామి భార్య అనిత రామనగర ఎమ్మెల్యేగా చేశారు. దేవెగౌడ మరో కుమారుడు రమేశ్ భార్య సౌమ్య కూడా గత ఎన్నికల్లో పోటీకి విఫలయత్నం చేశారు. ఆమె తండ్రి డీసీ తమ్మన్న మద్దూరు జేడీ(ఎస్) ఎమ్మెల్యే. ఇదంతా పార్టీ ప్రయోజనాల కోసమేనని కుమారస్వామి సమరి్థంచుకుంటున్నారు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
పీవీ, చరణ్ సింగ్ సహా నలుగురికి భారతరత్న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్లకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రదానం చేశారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌదరి, ఎంఎస్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ తరఫున కుమారుడు రాంనాథ్ ఠాకూర్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సేవలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీజేపీ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఆదివారం ఆయన నివాసంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. -
Britain: క్రియాశీల రాజకీయాలకు థెరెసా మే గుడ్‌బై
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి థెరెసా మే(67) క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని శుక్రవారం ప్రకటించారు. అయితే, ప్రస్తుత ప్రధాని రిషి సునాక్‌కు తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2016–2019 కాలంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న థెరెసా మే హౌస్ ఆఫ్ కామన్స్‌లో 27 ఏళ్లపాటు ఎంపీగా కొనసాగారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా 1997 నుంచి ఏడు పర్యాయాలు ఆమె ఎన్నికయ్యారు. మార్గరెట్ థాచర్ తర్వాత బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ థెరెసా మే ‘న్యూ ఐరన్ లేడీ’గా పేరు తెచ్చుకున్నారు. 2016 జూన్‌లో రెఫరెండం నేపథ్యంలో కుదిరిన బ్రెగ్జిట్ ఒప్పందం పార్లమెంట్ తిరస్కరించడంతో ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. -
వెబ్ సిరీస్‌గా పీవీ నరసింహారావు బయోపిక్
భారతదేశ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జీవితంతో వెబ్ సిరీస్ రూ΄÷ందనుంది. ఆహా స్టూడియో, అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్ కలిసి ‘హాఫ్ లయన్’ పేరుతో ఈ వెబ్ సిరీస్ నిర్మించనున్నట్లు ప్రకటించాయి. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన ‘హాఫ్ లయన్’ పుస్తకం ఆధారంగా జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ ఝా ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించ నున్నారు. ‘‘1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు అందించిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం అత్యున్నత ΄ûర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సిరీస్‌ను రూ΄÷ందిస్తాం’’ అని మేకర్స్ అన్నారు. -
థాయ్ మాజీ ప్రధానికి పెరోల్
బ్యాంకాక్: జైలు శిక్ష అనుభవిస్తున్న థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్షిన్ షినవత్ర(76) పెరోల్ మీద విడుదలయ్యారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ప్రభుత్వం అతడిని పెరోల్‌పై విడుదల చేసింది. మరో ఆరు నెలల్లో షినవత్ర శిక్ష ముగియనుంది. 15 ఏళ్ల ప్రవాసం వీడి గతేడాది దేశంలో అడుగు పెట్టిన వెంటనే ఆయనను జైలుకు తరలించారు. అనారోగ్యం కారణంగా జైలు నుంచి వెంటనే పోలీస్ ఆస్పత్రికి తరలించి నిర్బంధంలో ఉంచారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన షినవత్రకు అవినీతి ఆరోపణలపై 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో షినవత్ర కుటుంబ సభ్యులే కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 70 ఏళ్లు దాటి అనారోగ్యం బారిన పడినందున మిగిలిఉన్న జైలు శిక్షను ప్రభుత్వం రద్దు చేసింది. ఇదీ చదవండి.. కనీసం చివరిచూపు చూసుకోనువ్వండి -
‘ఆర్థిక’ భారతానికి ఊపిరి పీవీ
విదేశాలకు చెల్లింపులు చేయలేక దివాలా అంచుల్లో ఉన్న దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో గట్టెక్కించిన మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావును భారతరత్న వరించింది. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగానే కాదు.. దేశానికి గాందీ, నెహ్రూ కుటుంబేతర వ్యక్తుల్లో పూర్తికాలం పనిచేసిన తొలి ప్రధానిగా, మైనార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా ఐదేళ్లూ కొనసాగించిన రాజకీయ చాణక్యుడిగా పీవీ పేరు పొందారు. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి కూడా పీవీనే కావడం గమనార్హం. ఆయన రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా తాను పనిచేసిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. – సాక్షి, హైదరాబాద్ గడ్డు పరిస్థితిలో బాధ్యతలు చేపట్టి.. పీవీ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే నాటికి దేశం గడ్డు పరిస్థితుల్లో ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు బిలియన్ డాలర్ల కంటే తగ్గిపోయాయి. విదేశాలకు చెల్లించాల్సిన అప్పులు, దిగుమతుల కోసం చేయాల్సిన చెల్లింపులు పేరుకుపోయాయి. ద్రవ్యోల్బణం గరిష్టంగా రెండంకెలకు చేరింది. ఏతావాతా దేశం ఆర్థికంగా దివాలా అంచున ఉన్న సమయంలో.. దేశాన్ని ముందుకు నడిపించేందుకు పీవీ సిద్ధమయ్యారు. వెంటనే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేపని మొదలుపెట్టారు. అప్పట్లో రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఉన్న ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ను పిలిపించి నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మన్మోహన్తోపాటు ఇతర ఆర్థికవేత్తలతో చర్చించి సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం సమకూరేందుకు వీలుగా రూపాయి విలువను తగ్గించారు. తాను ప్రధాని బాధ్యతలు స్వీకరించిన నెలలోనే రిజర్వుబ్యాంకు వద్ద ఉన్న బంగారం నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో తాకట్టు పెట్టి 400 మిలియన్ డాలర్ల రుణం తెచ్చారు. కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. లైసెన్సుల విధానాన్ని సరళీకృతం చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యాన్ని తగ్గిస్తూ.. ప్రైవేటు సంస్థల స్థాపనకు అవకాశం కల్పించారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. 1991 జూలై 24న ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్లో అనేక సంస్కరణలను ప్రకటించారు. కార్పొరేట్ పన్ను పెంపు, టీడీఎస్ విధానం అమల్లోకి తేవడం, వంట గ్యాస్, కిరోసిన్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంపు, చక్కెరపై సబ్సిడీ తొలగింపు, దిగుమతుల పన్ను తొలగింపు వంటి విధానాలను అమల్లోకి తెచ్చారు. ఈ చర్యలతో పీవీ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)కు దేశాన్ని అమ్మేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. అయినా మొక్కవోని ధైర్యంతో పారీ్టలో, ప్రభుత్వంలో అసమ్మతివాదులను ఒప్పిస్తూ సంస్కరణలను కొనసాగించారు. ఎగుమతుల కోసం ప్రత్యేక వాణిజ్య విధానాన్ని తేవడంతోపాటు చిన్న సంస్థలకు ప్రోత్సాహకాలు అందించారు. ఈ చర్యలన్నింటి ఫలితంగా రెండున్నరేళ్లలో ద్రవ్యోల్బణం 17 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గింది. బిలియన్ డాలర్లలోపే ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు 15 బిలియన్ డాలర్లకు చేరాయి. ద్రవ్యలోటు 8.4 నుంచి 5.7 శాతానికి తగ్గింది. ఎగుమతులు రెండింతలయ్యాయి. వృద్ధిరేటు 4 శాతానికి పెరిగింది. అక్కడి నుంచి ఇక భారత్ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి తలెత్తలేదు. ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానానికి చేరింది. దీనంతటికీ నాడు పీవీ వేసిన ఆర్థిక సంస్కరణలే పునాది. బేగంపేట.. బ్రాహ్మణవాడి అడ్డాగా.. పీవీ నరసింహారావు హైదరాబాద్‌లో ఉన్నంతకాలం బేగంపేటలోని బ్రాహ్మణవాడి కేంద్రంగానే కార్యకలాపాలను నిర్వహించారు. తొలుత స్వామి రామానంద తీర్థ ఇక్కడ నివాసం ఏర్పర్చుకోగా.. ఆయన అనుచరుడిగా పీవీ ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారు. 1973లో రామానంద తీర్థ పరమపదించగా.. పీవీ అక్కడ స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రస్తుతం పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణిదేవి ఈ కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె ఈ కమిటీ భవనంలో పీవీ స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పీవీ రాసిన, సేకరించిన వేలాది పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి. 60 ఏళ్ల వయసులో కంప్యూటర్‌తో కుస్తీ పట్టి.. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడంలో పీవీ ఎప్పుడూ ముందుండే వారు. ఆయన అసాధారణ ప్రతిభతో త్వరగానే పట్టు సాధించేవారు. అలా ఏకంగా దేశ, విదేశ భాషలు సహా 13 భాషలను నేర్చుకున్నారు. రాజీవ్‌గాంధీ హయాంలో మన దేశంలోకి కంప్యూటర్లను ప్రవేశపెట్టినప్పుడు.. పీవీ ఓ కంప్యూటర్ తెప్పించుకుని పట్టుపట్టాడు. 60 ఏళ్ల వయసులో కూడా రోజూ గంటల పాటు కూర్చుని టైపింగ్ మాత్రమేకాదు.. కంప్యూటర్ లాంగ్వేజ్‌నూ నేర్చుకున్నారు. ఉస్మానియాలో విద్యాభ్యాసం.. కలం పేరుతో వ్యాసాలు.. అపర మేధావి, బహుభాషా కోవిదుడుగా పేరుపొందిన పీవీ నరసింహారావు.. 1921 జూన్ 28న నాటి హైదరాబాద్ సంస్థానంలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన నియోగి బ్రాహ్మణ దంపతులు సీతారామారావు, రుక్మాబాయిలకు జన్మించారు. మూడేళ్ల వయసులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణి దంపతులు ఆయన్ను దత్తత తీసుకున్నారు. భీమదేవరపల్లి మండలం కట్కూరులోని బంధువు గబ్బెట రాధాకిషన్‌రావు ఇంట్లో ఉంటూ పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివారు. 1938 సమయంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరారు. నిజాం నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో ఆయనను ఉస్మానియా వర్సిటీ నుంచి బహిష్కరించగా.. ఓ మిత్రుడి సాయంతో నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చేరి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. కొంతకాలం జర్నలిస్టుగానూ పనిచేశారు. తన సోదరుడు పాములపర్తి సదాశివరావుతో కలసి ‘జయ–విజయ’ అనే కలం పేరుతో కాకతీయ వారపత్రికకు వ్యాసాలు రాశారు. ఎమ్మెల్యే నుంచి ప్రధాని వరకు.. కాలేజీలో రోజుల నుంచే పీవీ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పారీ్టలో సభ్యుడిగా చేరారు. 1957–77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మంథని నుంచి ప్రాతినిధ్యం వహించారు. అందులో 1962–71 మధ్య వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ► సీఎంగా పలు భూసంస్కరణలను ప్రవేశపెట్టారు. భూగరిష్ట పరిమితి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయించారు. గురుకుల విద్యా వ్యవస్థకు పునాది వేశారు. ► 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిన సమయంలో ఇందిరాగాంధీ వెన్నంటి నిలిచారు. 1978లో ఇందిరాగాంధీ స్థాపించిన కాంగ్రెస్ (ఐ)లో చేరారు. ► 1977లో తొలిసారిగా హన్మకొండ ఎంపీగా గెలిచిన ఆయన.. 1984, 1989, 1991, 1996లలో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని రాంటెక్, కర్నూల్ జిల్లా నంద్యాల, ఒడిశాలోని బరంపురం లోక్‌సభ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. కేంద్రంలో హోం, రక్షణ, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేశారు. ► 1991లో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని పీవీ భావించారు. ఆ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేయలేదు కూడా. కానీ రాజీవ్‌గాంధీ హత్యతో పీవీ క్రియాశీలకంగా వ్యవహరించాల్సి వచ్చింది. ► రక్షణ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పారీ్టలోని ఇతర పోటీదారులను వెనక్కినెట్టి మైనారీ్టలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించే అవకాశం దక్కించుకున్నారు. 1991 జూన్ 21న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి ఎంపీ కాకపోవడంతో.. నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఏకంగా ఐదు లక్షల ఓట్ల భారీ మెజార్టీ సాధించి గిన్నిస్ రికార్డుల్లో ఎక్కారు. ► 1995 మే 16 వరకు మైనార్టీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి రాజకీయ దురంధరుడిగా నిలిచారు. ► ఆర్థిక రంగమైనా, రాజకీయ రంగమైనా, అభివృద్ధి పథమైనా, సంక్షేమ బాటలోనైనా.. తాను నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చిన పీవీ 83 ఏళ్ల వయసులో.. 2004 డిసెంబర్ 23న ఢిల్లీలో కన్నుమూశారు. తర్వాత 19 ఏళ్ల అనంతరం ఆయనకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. పీవీ ఇంట్లోనే పనిజేసిన.. ప్యాంట్లు వేసుకుని సిగ్గుపడ్డం నా చిన్నప్పుడు పీవీ ఇంట్ల, వారి పొలాల్లో పనిచేసిన. ఊర్లో అందరం ఆయన ఇంటిని గడి అని పిలిచేటోళ్లం. పీవీ ఇంటివాళ్లు అందరితో కలివిడిగా ఉండేవారు. మాది చిన్న పల్లెటూరు. ధోవతులు తప్ప ప్యాంట్లు తెలియవు. ఎవరన్నా ప్యాంట్ వేసుకుంటే వింతగా జూసేది. ఏ ఊరి దొరనో అని గొప్పగా అనుకునే వాళ్లం. ఒకనాడు ఇంటికి వచ్చిన పీవీ దొరను.. మీరెందుకు ప్యాంట్లు వేసుకోరని అడిగిన. ఆయన చిన్నగా నవి్వండు. తర్వాత మా ఊళ్లనే బావులకాడ పనిచేసే పది మందికి ప్యాంట్లు కుట్టిచిండు. వాళ్లు బజార్ల తిరగాలంటే ఒకటే సిగ్గుపడుడు. గుర్తొస్తే నవ్వొస్తది. పీవీకి భారతరత్న వచ్చిందంటే.. మా ఊరికి కాదు దేశానికి గౌరవం ఇచ్చినట్టే.. – కాల్వ రాజయ్య, వంగర గ్రామస్తుడు వంగరలో సంబురాలు సాక్షి ప్రతినిధి, వరంగల్/మంథని: పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో.. ఆయన స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో.. కుటుంబసభ్యులు, గ్రామస్తులు సంబురాలు జరుపుకొన్నారు. పీవీ ఇంటి ఆవరణలో టపాసులు కాల్చారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. స్వీట్లు పంచుకున్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పీవీ సేవలను ఆలస్యంగానైనా గుర్తించి భారతరత్న ఇచ్చినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. అందరు ప్రధానమంత్రులను గౌరవించినట్టుగానే.. పీవీకి కూడా ఢిల్లీలో ఘాట్ నిర్మించాలని కోరారు. మరోవైపు పీవీ రాజకీయ అరంగేట్రం చేసి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంథని నియోజకవర్గంలోనూ స్థానికులు సంబురాలు చేసుకున్నారు. తెలుగు ప్రజలందరికీ గౌరవం పీవీకి భారతరత్నపై ఏపీ సీఎం జగన్ హర్షం సాక్షి, అమరావతి : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించటంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ‘పీవీ నరసింహారావు రాజనీతిజు్ఞడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు కలిగిన పండితుడు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గౌరవం’అని సీఎం పేర్కొన్నారు. అలాగే, రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చరణ్‌సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా భారతరత్న ప్రకటించడం యావత్ జాతి గరి్వంచదగ్గ విషయమని శుక్రవారం రాత్రి ‘ఎక్స్’లో సీఎం ట్వీట్ చేశారు. -
Marriage law violation: ఇమ్రాన్, ఆయన భార్యకు ఏడేళ్ల జైలు
ఇస్లామాబాద్: అతి త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(71)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామ్ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్న ఆరోపణలపై ఇమ్రాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీ(49)కి ఓ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు పెళ్లిళ్ల మధ్య విరామం పాటించాలనే నిబంధనకు విరుద్ధంగా బుష్రా బీబీ ఇమ్రాన్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ ఆమె మాజీ భర్త ఖవార్ ఫరీద్ మనేకా కేసు పెట్టారు. వివాహానికి ముందు నుంచే వారిద్దరి మధ్య అక్రమ సంబంధం నడిచిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై ప్రస్తుతం ఇమ్రాన్, బుష్రా బీబీ ఉన్న అడియాలా జైలులోనే 14 గంటలపాటు విచారణ జరిపిన సీనియర్ సివిల్ జడ్జి ఖుద్రతుల్లా.. ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెలువరించినట్లు జియో న్యూస్ పేర్కొంది. తోషఖానా కేసులో 14 ఏళ్లు, రహస్య పత్రాల కేసులో 10 ఏళ్ల జైలు శిక్షను ఇమ్రాన్‌కు విధిస్తూ ఇటీవలే కోర్టులు తీర్పిచి్చన విషయం తెలిసిందే. ఫెయిత్ హీలర్గా పేరున్న బుష్రాబీబీ వద్దకు తరచూ ఇమ్రాన్ వెళుతుండేవారు. అలా మొదలైన వారిద్దరి మధ్య పరిచయం పరిణయానికి దారి తీసింది. 2018 జనవరి ఒకటో తేదీన ఇమ్రాన్, బుష్రాబీబీల వివాహం ఘనంగా జరిగింది. -
Toshakhana corruption case: తోషఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. తోషఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్ కోర్టు 14 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. విదేశీ నాయకులు ఇచ్చిన ఖరీదైన బహుమతులను విక్రయించి, సొమ్ము చేసుకున్నట్లు ఇమ్రాన్ దంపతులపై అభియోగాలు నమోదయ్యాయి. దర్యాప్తులో అదంతా నిజమేనని తేలడంతో న్యాయస్థానం బుధవారం శిక్ష ఖరారు చేసింది. దోషులకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదంటూ కోర్టు ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు కూడా వేసింది. 1.5 బిలియన్ల జరిమానా చెల్లించాలని ఇమ్రాన్ దంపతులను ఆదేశించింది. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. విదేశాలకు అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి దేశాధినేతలు బహుమతులు ఇస్తుంటారు. అవన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. తోషఖానాలో భద్రపర్చాల్సి ఉంటుంది. ఇమ్రాన్ మాత్రం సొంత ఆస్తిలాగా అమ్మేసుకున్నారు. అధికార రహస్యాల వెల్లడి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు మూడు రోజుల క్రితం 10 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. -
ఇమ్రాన్ స్థానంలో గోహర్ అలీ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్–ఇ– ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చీఫ్‌గా గోహర్ అలీ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎన్నికల గుర్తుగా ‘బ్యాట్’ కొనసాగాలంటే సంస్థాగత ఎన్నికలు జరపాల్సిందేనన్న ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఈ ఎన్నిక జరిగినట్లుగా భావిస్తున్నారు. గోహర్ పేరును ఇమ్రాన్ ప్రతిపాదించారు. శనివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో గోహర్(45) పార్టీ అధ్యక్ష పదవికి పోటీ లేకుండా ఎన్నికైనట్లు డాన్ పత్రిక తెలిపింది. తోషఖానా అవినీతి కేసు సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇమ్రాన్ సెప్టెంబర్ నుంచి జైలులో∙ఉన్నారు. అందుకే, సంస్థాగత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేకపోయారు. -
ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురు దెబ్బ
ఇస్లామాబాద్: అల్–ఖదీర్ ట్రస్టు అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రహస్య పత్రాల లీకేజీ కేసులో రావలి్పండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) అల్–ఖదీర్ ట్రస్ట్ కేసులో ఈ నెల 14న అదుపులోకి తీసుకుంది. రూ.2 వేల కోట్లు మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తున్న ఈ కేసులో ఇమ్రాన్‌ను కస్టడీకివ్వాలన్న ఎన్ఏబీ వాదనను జడ్జి తోసిపుచ్చుతూ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. -
పాకిస్తాన్‌కు షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (73) నాలుగేళ్ల స్వీయ ప్రవాసం అనంతరం స్వదేశానికి తిరిగొచ్చారు. జనవరిలో సాధారణ ఎన్ని కలు జరగనున్న నేపథ్యంలో శనివారం ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ నుంచి బయల్దేరి ఇస్లామాబాద్ చేరుకున్నారు. కోర్టుకు సమరి్పంచాల్సిన బెయిల్ పత్రాలపై సంతకం తదితరాల అనంతరం అదే విమానంలో లాహోర్ వెళ్లి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. తన తల్లి, భార్య రాజకీయాలకు బలయ్యారని గుర్తు చేసుకుంటూ భా వోద్వేగానికి లోనయ్యారు. వారి చివరిచూపుకూ నోచుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
నేడు స్వదేశానికి నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(73) దాదాపు నాలుగేళ్ల తర్వాత శనివారం స్వదేశానికి రానున్నారు.లండన్ నుంచి దుబాయ్‌కి, అక్కడి నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నారు. అక్కడి నుంచి చార్టెర్డ్ విమానంలో శనివారం పాకిస్తాన్‌కు చేరుకుంటారు. లాహోర్‌లో శనివారం సాయంత్రం తమ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ –నవాజ్(పీఎంఎల్–ఎన్) నిర్వహించే బహిరంగ సభలో షరీఫ్ పాల్గొంటారు. అయితే, ఆయన భద్రతకు ముప్పు ఉందన్న నిఘా సమాచారం మేరకు పంజాబ్ పోలీస్ యంత్రాంగం హై అలెర్ట్ ప్రకటించింది. -
షినవత్రకు థాయ్‌లాండ్ రాజు క్షమాభిక్ష
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాజీ ప్రధానమంత్రి థక్సిన్ షినవత్ర(74)కు రాజు క్షమాభిక్ష ప్రసాదించారు. అవినీతి ఆరోపణలపై ఆయనకు కోర్టు విధించిన ఎనిమిదేళ్ల జైలు శిక్షను ఒక్క ఏడాదికి తగ్గించారు. ఇందుకు సంబంధించి రాజు మహా వజ్రాలొంగ్కర్న్ నిర్ణయాన్ని రాయల్ గజెట్ శుక్రవారం ప్రచురించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దేశంలో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే అంతిమ అధికారం రాజుదే. 2001, 2005ల్లో జరిగిన ఎన్నికల్లో షినవత్ర ప్రధాని అయ్యారు. 2006లో జరిగిన సైనిక కుట్రలో ప్రధాని పదవి నుంచి షినవత్రను గద్దె దించారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2008లో ఆయన దేశం విడిచి వెళ్లిపోయి, అజ్ఞాతంలో గడిపారు. వారం క్రితం దేశంలోకి ప్రవేశించిన వెంటనే అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆరోగ్యం క్షీణిస్తున్నందున క్షమాభిక్ష కోరుతూ రాజుకు విజ్ఞాపన పంపారు. షినవత్ర రాకతో దేశంలో మూడు నెలలుగా నెలకొన్న రాజకీయ అస్థిరత సమసిపోయే పరిణామాలు సంభవించాయి. షినవత్ర స్థాపించిన ఫ్యూథాయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా పార్లమెంట్లో మద్దతు పెరగడం విశేషం. -
వచ్చే 13 వరకు జైల్లోనే ఇమ్రాన్
ఇస్లామాబాద్: అధికార రహస్య పత్రాల లీకేజీ కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు సెప్టెంబర్ 13వ తేదీ వరకు ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది. తోషఖానా కేసులో ఇమ్రాన్‌కు దిగువ కోర్టు విధించిన మూడేళ్ల జైలుశిక్షను కొట్టివేస్తూ మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, రహస్య పత్రాల లీకేజీ కేసు విచారణలో ఉన్నందున ఆయనకు ఒక రోజు రిమాండ్ విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశాలిచ్చారు. భద్రతా కారణాల రీత్యా ఇమ్రాన్ విచారణను పంజాబ్ ప్రావిన్స్‌లోని అటోక్ జైలులోనే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జడ్జి అబువల్ హస్నత్ జుల్కర్నయిన్ బుధవారం జైలుకు చేరుకున్నారు. జైలు లోపలే కేసును విచారించి, ఇమ్రాన్ రిమాండ్‌ను వచ్చే 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారని జియో న్యూస్ తెలిపింది. దీంతో, ఆగస్ట్ 5 నుంచి ఉంటున్న అటోక్ జైలు నుంచి వెంటనే విడుదల కావాలన్న ఇమ్రాన్ ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లయిందని జియో న్యూస్ పేర్కొంది. విచారణ సమయంలో ఇమ్రాన్ తరఫు లాయర్ల బృందంలోని ముగ్గురికి మాత్రమే లోపలికి వెళ్లేందుకు అవకాశం కల్పించారని తెలిపింది. గత ఏడాది మార్చిలో పార్లమెంట్లో ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కొద్ది రోజులు ముందు జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్.. తనను గద్దె దించేందుకు విదేశీ శక్తి కుట్ర పన్నిందనేందుకు ఇదే సాక్ష్యమంటూ ఓ డాక్యుమెంట్‌ను తీసి బహిరంగంగా చూపించారు. అమెరికా విదేశాంగశాఖ అధికారులు అక్కడి పాక్ రాయబారితో భేటీ అయ్యారని, దానికి సంబంధించిన వివరాలున్న డాక్యుమెంట్లను చట్ట విరుద్ధంగా పొందిన ఇమ్రాన్ వాటిని బహిరంగ పరిచారని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయనపై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. -
తోషఖానా కేసులో దిగువ కోర్టు తీర్పు తప్పు
ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులున్నట్లు ఇస్లామాబాద్ హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’కు అందిన ఖరీదైన బహుమతుల విక్రయంలో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ అవినీతికి పాల్పడ్డారంటూ పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) వేసిన కేసుపై విచారణ జరిపిన ఇస్లామాబాద్ కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధారించింది. ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 5న తీర్పు వెలువరించింది. దీంతో, మరో అయిదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన అర్హత కోల్పోయారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ వేసిన పిటిషన్‌ను శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆమెర్ ఫరూఖ్ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, విచారణకు ఈసీపీ తరఫు లాయర్ అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు. విచారణను వాయిదా వేయాలని ఆయన సహాయక లాయర్లు ధర్మాసనాన్ని కోరారు. ధర్మాసనం వినతిని తోసిపుచ్చింది. ‘ట్రయల్ కోర్టు తప్పు చేసింది. ఆ తప్పుల్ని మేం చేయదలుచుకోలేదు. పిటిషన్‌పై విచారణ కీలక దశలో ఉంది. అందుకే విచారణను సోమవారానికి మాత్రమే వాయిదాగలం. సోమవారం ఎవరూ రాకున్నా మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం’అని స్పష్టం చేసింది. పాక్ సుప్రీంకోర్టు కూడా ఇమ్రాన్‌కు జైలు శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులున్నట్లు బుధవారం వ్యాఖ్యానించింది. ఇమ్రాన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్నందున వేచి చూస్తామని తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ ఇరవై రోజులుగా అటోక్ జైలులో ఉన్నారు. -
‘అడియాలా’కి బదులు ‘అటోక్’కి ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో మూడేళ్లు జైలు పడిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రభుత్వం అటోక్ జైలుకు తరలించింది. కానీ ఇమ్రాన్‌ను రావలి్పండిలోని అడియాలా జైల్లో ఉంచాలని ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఇమ్రాన్‌కు అడియాలా జైల్లో భద్రత కల్పించాలని పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా అటోక్ జైలుకి తరలించినట్టుగా ఒక నివేదిక వెల్లడించింది. అటోక్ జైలుకి తరలించడం కోసమే లాహోర్ పోలీసులు ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసినట్టు ఆ నివేదిక పేర్కొంది. ఇమ్రాన్‌ను కలవడానికి అనుమతించడం లేదు: పీటీఐ ఆందోళన జైల్లో ఉన్న ఇమ్రాన్‌ను కలవడానికి పార్టీ న్యాయవాదులకి అనుమతించడం లేదని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ ఆరోపించింది. కోర్టు కు సమర్పించాల్సిన డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకోవడానికి అనుమతి కోరినా అధికారులు నిరాకరించినట్టు ఒక ప్రకటనలో పే ర్కొంది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయలేదని కిడ్నా ప్ చేసి తీసుకువెళ్లారని విరుచుకుపడింది. -
కొన్ని కానుకలు.. ఒక మాజీ ప్రధాని.. ఏమిటీ తోషఖానా కేసు?
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ జైలుపాలయ్యే పరిస్థితి వస్తుందని ముందే ఊహించినట్టున్నారు. గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో ఆఖరి బంతి వరకు పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. తనని జైలు పాలు చేసినా, అనర్హత వేటు వేసినా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీయే విజయం సాధిస్తుందని పలు సందర్భాల్లో ధీమాగా చెప్పారు. మరి ఆయన విశ్వాసానికి తగ్గట్టుగా భవిష్యత్ ఉండబోతోందా ? ఇమ్రాన్‌కు జైలు శిక్ష పడిన కేసు ఏమిటి ? ముందుండి నడిపించాల్సిన నాయకుడు కటకటాల పాలైతే పార్టీ పరిస్థితి ఏంటి? ఏమిటీ తోషఖానా కేసు..? ► తోషఖానా.. అంటే ప్రభుత్వానికి దేశ విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చే కానుకల ఖజానా. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోషఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న మూడేళ్లలో 58 కానుకలు వచ్చాయి. అలా వచ్చిన కానుకల్ని ప్రధాని తీసుకోవాలంటే దాని ధరలో సగం చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఇమ్రాన్ ప్రభుత్వం నిబంధనల్ని సవరించి అసలు ధరలో 20 శాతం మాత్రమే చెల్లించి కానుకలు తన సొంతం చేసుకున్నారు. 2018, సెప్టెబర్ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 15.4 కోట్ల విలువైన కానుకల్ని కేవలం 3 కోట్లకే ఆయన సొంతం చేసుకున్నట్టుగా ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదైంది. పీటీఐపై నీలినీడలు? ► పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ (పీటీఐ)ఇమ్రాన్‌ఖాన్ ప్రజలపై వేసిన ప్రభావం గత అయిదు దశాబ్దాల్లో మరే నాయకుడు వెయ్యలేకపోయాడు. ప్రజల్లో ఆయనకున్న ఫాలోయింగ్ తిరుగులేనిది. గత మేలో అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసినప్పుడు పీటీఐ కార్యకర్తలు దేశంలో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. వారిని నియంత్రించడం ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్‌గా మారింది. గతంలో పాకిస్తాన్ మాజీ ప్రధా నులు బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్, షాహిద్‌ఖాన్ అబ్బాసి వంటి వారు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ పట్టించుకోని ప్రజలు ఇమ్రాన్ ఖాన్ విషయంలో మిలటరీకే ఎదురు తిరిగారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఇమ్రాన్‌ఖాన్ అభిమానుల్లో అప్పట్లో కనిపించిన ఆగ్రహావేశాలు చూస్తే పార్టీ పునాదులు ఎవరూ కదపలేరన్న భావన కలుగుతుంది. ఇమ్రాన్‌ఖాన్ ఒక్కడే నిజాయితీపరుడని, ఆర్థికంగా కుదేలైన దేశాన్ని ఆయన మాత్రమే గాడిలో పెట్టగలరన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. కానీ పవర్ పాలిటిక్స్ వేరుగా ఉంటాయి. చదవండి: ఇమ్రాన్ ఖాన్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఐదేళ్ల అనర్హత వేటు.. ఆ వెంటనే అరెస్ట్ ఇమ్రాన్‌ఖాన్‌కు బాగా మొండివాడన్న పేరుంది. రాజకీయాల్లో ఆయనకి స్నేహితుల కంటే శత్రువులే ఎక్కువ మంది ఉన్నారు. ఇమ్రాన్ ప్రధాని కావడానికి కారకుడైన అప్పటి ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వాతో ఆయ న ఎక్కువ కాలం సత్సంబంధాలు నడపలేకపోవడమే దీనికి నిలువెత్తు నిదర్శనం. ఇమ్రాన్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్, పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ సంకీర్ణ సర్కార్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇమ్రాన్‌ను కేసుల ఉచ్చులో బిగించాయి. గత రెండు నెలల్లో పారీ్టకి చెందిన సీనియర్ నాయకులు 80 మందికి పైగా పార్టీని వీడారు. వారిని బెదిరించి పార్టీని వీడేలా చేశా రని ఇమ్రాన్ ఆరోపించినప్పటికీ వరసపెట్టి కీలకమైన నాయకులు వెళ్లిపోవడం పార్టీ భవిష్యత్ పై ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు. ఇమ్రాన్ గతంలో అరెస్ట్ అయినప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన వేలాది మంది పార్టీ కార్యకర్తలు మిలటరీ జైళ్లలో ఉన్నారు. పాకిస్తాన్లో ఈ నెల 9న జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ జైలు పాలవడం ఆయన పారీ్టకి శరాఘాతంలా తగిలింది. పార్లమెంటు రద్దయిన 3 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇమ్రాన్‌పై ఐదేళ్లు అనర్హత వేటు పడడంతో ఆయన ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా అయింది. పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకుడు కటకటాల మధ్య ఉంటే పార్టీ ఎంతవరకు మనుగడ సాగించగలదన్న ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి. అయితే ఇమ్రాన్ ఆశలన్నీ ఇప్పుడు పై కోర్టులోనే ఉన్నాయి. కోర్టు ఇచ్చిన తీర్పుని పీటీఐ లాహోర్ హైకోర్టులో సవాల్ చేసింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయలేదని, ఆయ నపై తుపాకీ గురిపెట్టి అపహరించుకొని వెళ్లిపోయారని పీటీఐ తన పిటిషన్లో విమర్శించింది. వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఇమ్రాన్ కూడా శాంతి మార్గాన్నే అనుసరిస్తున్నారు. అరెస్ట్‌కు ముందే చేసి ఉంచిన రికార్డు మెసేజ్‌లో ఆయన కార్యకర్తలకి శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే తోషఖానాతో సహా 150 కేసుల్ని ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఆ ఉచ్చులోంచి ఎలా బయటకి రాగలరన్న సందేహాలైతే ఉన్నాయి. -
బోరిస్ కావాలనే తప్పుదోవ పట్టించారు
లండన్: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పార్లమెంట్‌ను ఉద్దేశపూర్వకంగా పదేపదే తప్పుదోవ పట్టించారని పార్లమెంటరీ కమిటీ ఆరోపించింది. ప్రధానిగా ఉండగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ డౌనింగ్ స్ట్రీట్‌లోని అధికార నివాసంలో జరిగిన విందుల గురించి తనకు తెలియదనడంపై ఈ వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ సమయంలో జరిగిన విందులనే పార్టీ గేట్ కుంభకోణంగా పేర్కొంటున్నారు. ‘సభను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించిన జాన్సన్ తీవ్రమైన ధిక్కారానికి పాల్పడ్డారని భావిస్తున్నాం. ఈ ధిక్కారం మరింత తీవ్రమైంది’అని పార్లమెంట్ హక్కుల కమిటీ పేర్కొంది. పార్లమెంటరీ కమిటీ సభ్యులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ జాన్సన్ ఇటీవల ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో జాన్సన్ చేసిన వ్యాఖ్యలపైనా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు ఆయన్ను 90 రోజుల పాటు బహిష్కరించాలని సూచించింది. రాజీనామా చేసినందున..మాజీ సభ్యులకిచ్చే పాస్‌ను జాన్సన్‌కు ఇవ్వొద్దని పేర్కొంది. -
ఆనందంలో బోరిస్ జాన్సన్, తండ్రిగా మరోసారి ప్రమోషన్.. ఎనిమిదోసారి
లండన్: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఇప్పటికే ఏడుగురు పిల్లల తండ్రయిన ఆయన మరోసారి తండ్రి అవుతున్న ఆనందంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య కేరీ ఇన్స్టాగ్రాం వేదికగా పంచుకున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ లోకంలోకి రానున్న బుజ్జాయి కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. జాన్సన్ మూడో భార్య కేరీ. మొదటి భార్యతో ఆయనకి పిల్లలు లేరు. రెండో భార్య వీలర్‌తో నలుగురు పిల్లలు ఉన్నారు. 2021లో కేరిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో మరో మహిళతోనూ జాన్సన్ అఫైర్ కొనసాగించడంతో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇప్పటిదాకా జాన్సన్‌కు ఏడుగురు సంతానం ఉన్నారు. -
Pakistan Supreme Court: చట్టవిరుద్ధం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. అల్–ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్‌ను అరెసుŠట్ చేసి జాతీయ జవాబుదారీ బ్యూరో(ఎన్ఏబీ) కస్టడీలో ఉంచడాన్ని పాక్ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ‘ ఇమ్రాన్‌ను అరెస్ట్చేయడం పూర్తిగా చట్టవ్యతిరేకం. ఆయనను వెంటనే విడుదల చేయండి. విడుదలయ్యాక ఇస్లామాబాద్‌లో సురక్షిత ప్రాంతంలో ఉంచి రక్షణ కల్పించండి’అని అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో ఇస్లామాబాద్ హైకోర్టులో అరెస్టయిన ఇమ్రాన్‌కు పెద్ద ఉపశమనం లభించింది. గంటలో హాజరుపరచండి అంతకుముందు మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో లాక్కెళ్లి అరెస్ట్ చేయడాన్ని ఇమ్రాన్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఆ పిటిషన్ గురువారం మధ్యాహ్నం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఎన్ఏబీ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘గంటలోగా ఇమ్రాన్‌ను మా ముందుకు తీసుకురండి’ అని మధ్యాహ్నం 3.30కి ఎన్ఏబీని ఆదేశించింది. దీంతో వెంటనే ఖాన్‌ను కోర్టుకు తీసుకొచ్చారు.‘హైకోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండా ఒక వ్యక్తిని కోర్టు ప్రాంగణంలో ఎలా అరెస్ట్ చేస్తారు? న్యాయం కోసం కోర్టుకొచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? ఒకవేళ కోర్టులో లొంగిపోవడానికే వస్తుంటే అరెస్ట్ చేయడంలో అర్థమేముంది? అరెస్ట్ చేసేందుకు ఏకంగా 90 మంది పోలీసులు కోర్టులో చొరబడితే హైకోర్టుకు ఏం విలువ ఇచ్చినట్టు? అని అధికారులపై ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అతా బందియాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తదుపరి న్యాయపర ఆదేశాల అభ్యర్థన కోసం శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లండి. ఆ కోర్టు నిర్ణయమే తుది నిర్ణయం’ అని ఇమ్రాన్‌కు సుప్రీంకోర్టు సూచించింది. అరెస్ట్‌తో రణరంగంలా మారిన పాక్‌లో ఇప్పటిదాకా ఎనిమిది మంది చనిపోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. కాగా, ‘ఒక నేరగాడిని విడుదల చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ఎంతో సంతోషంగా ఉన్నారు. నేరగాడికి రక్షణ కవచంగా ఉంటూ దేశంలో చెలరేగుతున్న హింసకు మరింత ఆజ్యం పోస్తున్నారు’ అని పాకిస్తాన్ ముస్లింలీగ్–నవాజ్ పార్టీ నాయకురాలు మరియం నవాజ్ ఆరోపించారు. -
ఇమ్రాన్ ఖాన్ ముమ్మాటికీ దోషే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ (70)ను వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. అక్రమ భూ బదలాయింపు కేసులో అరెస్టయిన ఆయనను 8 రోజులపాటు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. మరోవైపు తోషఖానా కేసులో ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. ఆయన ముమ్మాటికీ దోషేనని న్యాయమూర్తి హుమాయూన్ దిలావర్ నిర్ధారించారు. కాగా తనకు ప్రాణభయం ఉందని ఇమ్రాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 24 గంటలుగా వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేదని చెప్పారు. తన వైద్యున్ని కలిసే అవకాశమివ్వాలని కోర్టును కోరారు. ప్రధాని షహబాజ్ షరీఫ్ భాగస్వామిగా ఉన్న మనీ లాండరింగ్ కేసులో సాక్షి ‘గుండెపోటు’తో మరణించాడని, తనకూ అదే గతి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రణరంగంగా పాక్ ఇమ్రాన్ అరెస్టును ఖండిస్తూ పీటీఐ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేప ట్టారు. మంగళవారం ప్రా రంభమైన ఆందోళనలు బుధవారమూ కొనసా గాయి. 144 సెక్షన్‌ను సైతం లెక్కచేయకుండా ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు. లాహోర్, పెషావర్, క్వెట్టా, కరాచీ, రావల్పిండి తదితర నగరాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. వాహనాలను దహనం చేశారు. దాంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అదనపు బలగాలను మోహరించారు. అన్ని విద్యాసంస్థలను మూసేశారు. పరీక్షలను వాయిదా వేశారు. -
Imran Khan: ఒక ఇమ్రాన్.. రెండు కేసులు
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను రెండు కేసులు చిక్కుల్లో పడేశాయి. ఒక కేసు ఆయన అరెస్ట్‌కి దారి తీస్తే, మరో కేసులో న్యాయస్థానం ఆయనని దోషిగా తేల్చింది. ఈ రెండు కేసులు దేనికవే భిన్నమైనవి. బ్రిటన్‌లో మూలాలున్న ఒక కేసులో మనీ లాండరింగ్ వ్యవహారాలు ప్రధానంగా ఉంటే , మరో కేసులో ప్రభుత్వానికి వచ్చిన ఖరీదైన బహుమతుల్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అల్ ఖదీర్ ట్రస్ట్ కేసు ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు కారణమైన అల్ ఖదీర్ ట్రస్ట్ కేసుది ఆసక్తికరమైన నేపథ్యం. దీని మూలాలు బ్రిటన్‌లో ఉన్నాయి. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు 2019లో అల్ ఖదర్ యూనివర్సిటీ ట్రస్ట్ ఏర్పాటు ముసుగులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాలిక్ రియాజ్‌కు, ఇమ్రాన్‌ఖాన్ మధ్య జరిగిన క్విడ్ ప్రోకో ఒప్పందంతో దేశ ఖజానాకు రూ.5 వేల కోట్లు నష్టం వాటిల్లిందనేది ప్రధానమైన ఆరోపణ. గత ఏడాది జూన్‌లో మొట్టమొదటిసారిగా అల్ ఖదీర్ యూనివర్సిటీ ట్రస్ట్ కేసు అవినీతిపై అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్ బహిరంగంగా ఆరోపణలు చేసింది. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనుల్లా వివరాల ప్రకారం పంజాబ్‌లోని జీలం జిల్లా సొహావా ప్రాంతంలో సూఫీయిజాన్ని బోధించడం కోసం అల్ ఖదీర్ యూనివర్సిటీని నిర్మించడానికి ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ, ఆయనకు అత్యంత సన్నిహితులైన అనుచరులు జుల్ఫికర్ బుఖారీ, బాబర్ అవాన్ కలిసి అల్ ఖదీర్ ట్రస్ట్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2019లో ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ బహ్రియా పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి విరాళాలు తీసుకోవడానికి ఒప్పందం చేసుకున్నారు. ట్రస్ట్‌కు వందలాది కోట్ల విలువైన 57.25 ఎకరాలను ఆ సంస్థ విరాళంగా అందించింది. అందులో 240 కనాల్స్ భూమిని (30 ఎకరాలు) బుష్రా బీబీకి ప్రాణ స్నేహితురాలైన ఫరా గోగి పేరిట బదలాయించారు. బహ్రియాలో రియల్ ఎస్టేట్ సంస్థ అధిపతే మాలిక్ రియాజ్. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్ని బ్రిటన్‌లో విచారించే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్సీఏ) ఒకానొక కేసులో మాలిక్ రియాజ్ నుంచి ఏకంగా 19 కోట్ల పౌండ్ల (అప్పట్లో పాకిస్తాన్ కరెన్సీలో రూ. 5,000 కోట్లు) నల్లధనం జప్తు చేసింది. బ్రిటన్‌లో చట్టాల ప్రకారం విదేశీయుడికి చెందిన డబ్బుల్ని స్వాధీనం చేసుకుంటే తిరిగి వారి మాతృ దేశంలో ప్రభుత్వానికి అప్పగించాలి. అదే ప్రకారం పాకిస్తాన్లో ఇమ్రాన్ ప్రభుత్వానికి అప్పగించింది. అయితే ఇమ్రాన్‌కు, మాలిక్ రియాజ్‌కు మధ్య కుదిరిన ఒప్పందంతో ఇమ్రాన్ సర్కార్ ఆ వ్యాపారి బ్రిటన్ ఖాతాకు తిరిగి డబ్బులు పంపినట్టుగా ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి ప్రతిఫలంగా మాలిక్ రియాజ్ యూనివర్సిటీ నిర్మాణం కోసం భూములతో పాటు రూ.500 కోట్ల రూపాయల్ని కూడా ముట్టజెప్పారన్నది ఆరోపణ. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్‌ను ఈ ఒప్పందంతో ఇమ్రాన్ సర్కార్ పూర్తిగా ముంచేసిందని షహబాజ్ సర్కార్ ఆరోపించింది. ఈ కేసులో మే 1న ఇమ్రాన్‌పై అరెస్ట్‌కి వారెంట్లు జారీ కాగా మే9న ఆయన అరెస్టయ్యారు. తోషాఖానా కేసు.. ►ప్రభుత్వానికి వచ్చే కానుకలను భద్రపరిచే ఖజానాను తోషఖానా అంటారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోష ఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవిలో ఉండగా 101 కానుకలు వచ్చాయి. వాటిల్లో అత్యంత ఖరీదైన వజ్రాల రిస్ట్ వాచీలు, ఉంగరాలు, కఫ్లింక్స్ పెయిర్, రోలాక్స్ వాచీలు, పెన్నులు పెర్ఫ్యూమ్స్, ఐ ఫోన్లు, మసీదు, అత్తర్ బాటిల్స్ నమూనాల వంటి కళాకృతులు వంటివి ఉన్నా యి. ఇమ్రాన్ తనకు వచ్చిన కానుకలేమిటో చెప్పడానికి నిరాకరించడంతో పాటు వాటిని అమ్ముకోవడానికి అనుమతినివ్వాలంటూ ఈసీకి లేఖ కూడా రాశారు. 2018, సెప్టెంబర్ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలువైన కానుకల్ని ప్రభుత్వానికి 2 కోట్లు చెల్లించి ఇమ్రాన్ తీసుకున్నారని, వాటిని మార్కెట్లో అధిక ధరకు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. కేవలం మూడు వాచీలను అమ్మేసి ఇమ్రాన్ సొమ్ము చేసుకున్న మొత్తం రూ.3.6 కోట్లుగా తేలింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ తనకు వచ్చిన కానుకల వివరాలు చెప్పకుండా కొన్ని అక్రమ మార్గాల్లో అమ్ము కున్నారంటూ కేసు పెట్టింది. ఇమ్రాన్ గద్దె దిగిన తర్వాత తోషఖానాలో కొన్ని పుస్తకాలు తప్ప మరే వస్తువు మిగల్లేదు. ఇప్పుడు పాక్ కోర్టు ఆయనని ఈ కేసులో దోషిగా తేల్చింది. – సాక్షి,సెంట్రల్ డెస్క్ -
నన్ను చంపేందుకే అరెస్ట్ కుట్రలు : ఇమ్రాన్ ఖాన్
-
ఇమ్రాన్‌కు ఊరట
ఇస్లామాబాద్: తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది. శనివారం ఆయన ఇస్లామాబాద్‌లోని జిల్లా కోర్టులో హాజరయ్యారు. చేరుకున్నారు. పరిస్థితులు తీవ్రంగా ఉద్రిక్తంగా మారడంతో ఇమ్రాన్ హాజరైనట్టు కోర్టు ఆవరణలో వాహనంలోనే సంతకం తీసుకున్నారు. కోర్టు కాంప్లెక్స్‌లోకి ఇమ్రాన్ మద్దతుదారులు రాళ్లు రువ్వగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో విచారణ సాగదన్న జడ్జి, ఇమ్రాన్‌పై జారీ అయిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి అభియోగపత్రం లేకుండానే అక్కడి నుంచే తిరిగి వెళ్లేందుకు ఆయన్ను అనుమతించారు. విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు. ఇమ్రాన్ ఇస్లామాబాద్‌లో ఉండగానే లాహోర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు జరిపారు. 20 రైఫిళ్లు, పెట్రోల్ బాంబులు దొరికాయన్నారు. విచారణకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇమ్రాన్ కాన్వాయ్‌లో మూడు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. -
సూర్యకళ: రైతుల అక్కయ్య.. నేల రుణం తీర్చుకుందాం!
సూర్యకళ పుట్టింది పెరిగింది హైదరాబాద్ నగరంలో. ఆమె సాంత్వన పొందుతున్నది మాత్రం గ్రామసీమల్లో. ప్రకృతిమాత కోసం మొదలు పెట్టిన సేవను రైతుల సేవతో పరిపూర్ణం చేస్తున్నారామె. హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సూర్యకళ రెండు దశాబ్దాలుగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘ఆ ఉద్యోగం బతకడానికి మాత్రమే. గ్రామాలు, రైతుల కోసం చేస్తున్న పని జీవితానికి ఒక అర్థం, పరమార్థం’ అంటారామె. ఆమె తన ఫార్మర్ ఫ్రెండ్లీ జర్నీ గురించి ‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘రైతును బతికించుకోకపోతే మనకు బతుకు ఉండదు. నేలను కాపాడుకోక పోతే మనకు భూమ్మీద కాలం చెల్లినట్లే. మనిషిగా పుట్టిన తరవాత మన పుట్టుకకు అర్థం ఉండేలా జీవించాలి. ఎంతసేపూ మనకోసం మనం చేసుకోవడం కాదు, మనకు బతుకునిస్తున్న నేలకు కూడా పని చేయాలి. మనం పోయిన తర్వాత కూడా మనం చేసిన పని భూమ్మీద ఉండాలి. మన స్ఫూర్తి మిగిలి ఉండాలి. ఇదీ నా జీవిత లక్ష్యం. నా లక్ష్యం కోసం నేను పని చేస్తున్నాను. ఒక దశాబ్దకాలంగా మొదలైందీ మిషన్. తెలంగాణ జల్లాల్లో 2016 నుంచి యాభైకి పైగా రైతు శిక్షణ సదస్సులు నిర్వహించాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఇళ్లకు వెళ్లి, వాళ్లందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చాను. రైతు సేవల నిలయం భావసారూప్యత ఉన్న వాళ్లందరం కలిసి నల్గొండ జిల్లా, మర్రిగూడలో గ్రామ భారతి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో రైతు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నాటికి ఒక రూపానికి వస్తుంది. రైతులకు ఉపయోగపడేవిధంగా పాలేకర్ మోడల్, సుథారియా అభివృద్ధి చేసిన గోకృపామృతం మోడల్, చౌరాసియా మోడల్ వంటి వివిధ రకాల మోడల్స్‌ని మరింతగా అభివృద్ధి చేయడం ఈ శిక్షణాకేంద్రం ఉద్దేశం. రైతులకు ఉపయోగపడే సేవలను ఒక గొడుగు కిందకు తీసుకురావడమన్నమాట. వ్యవసాయం కోసం చెక్ డ్యామ్‌ల నిర్మాణం, మొక్కల పెంపకం కోసం లక్షల్లో సీడ్ బాల్స్ తయారు చేయించి ఖాళీ నేలల్లో విస్తరింపచేయడం వంటి పనుల్లో నాకు సంతృప్తి లభిస్తోంది. నింగి– నేలకు బంధం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు తన కాళ్ల మీద తాను నిలబడడం అంత సులువు కాదు. అందుకే సమాజంలో ఆర్థిక పరిపుష్టి కలిగిన వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రైతును దత్తత తీసుకోవలసిందిగా కోరుతున్నాను. నా అభ్యర్థన మేరకు కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్లు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన రైతులకు సహాయం చేస్తున్నారు కూడా. వ్యవసాయంలో మంచి దిగుబడులు తెస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచిన రైతులకు రైతు దినోత్సవం నాడు ఐదేళ్లుగా సన్మానం చేస్తున్నాం. మొదట్లో చిన్న చిన్న ఖర్చులు సొంతంగా పెట్టుకున్నాం. రైతు శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం మా కొలీగ్స్, స్నేహితులతోపాటు కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుకు సహాయం చేయడమంటే ఒక వ్యక్తికి సహాయం చేయడం కాదు. మనం కంచంలో ఆరోగ్యకరమైన అన్నానికి చేయూతనివ్వడం. మనల్ని బతికిస్తున్న నేల రుణం తీర్చుకోవడం’’ అన్నారు సూర్యకళ. మనదేశ మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్‌సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రైతుల కోసం పని చేయడంలో జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటున్న సూర్యకళ పుట్టింది కూడా ఇదే రోజు కావడం విశేషం. రైతులను కలుపుతున్నారు రెండున్నరేళ్ల కిందట సిద్ధిపేటలో గోకృపామృతం రూపకర్త గోపాల్ భాయ్ సుథారియా గారి మీటింగ్‌కి వెళ్లాను. ఆ సదస్సును నిర్వహించిన సూర్యకళ మేడమ్ అప్పుడే పరిచయమమ్యారు. రైతుల సమావేశాలు, కరోనా సమయంలో జూమ్ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. వారి సూచనలతో రెండెకరాల్లో వరి సాగుతోపాటు పండ్ల మొక్కల పెంపకం కూడా మొదలు పెట్టాను. – పద్మాల రాజశేఖర్, శిర్నాపల్లి గ్రామం, మండలం ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా నీటి నిల్వ నేర్పించారు మేము ఎనిమిది ఎకరాల్లో సేద్యం చేస్తున్నాం. అప్పట్లో మాకు పొలంలో నీళ్లు లేవు. సూర్యకళ మేడమ్‌కి మా పరిస్థితి తెలిసి, శర్మ గారనే రిటైర్డ్ ఇంజనీర్ గారిని మా పొలానికి పంపించారు. ఆయన మాకు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులు నేర్పించారు. అలాగే ప్రకృతి సేద్యం చేయడానికి ప్రోత్సహించడంతోపాటు మేము పండించిన పంటను కొనుక్కునే వారిని మాతో కలిపారు. అలా రైతులకు– వినియోగదారులను అనుసంధానం చేస్తూ ఒక నెట్వర్క్ రూపొందించారు మా మేడమ్. – వాకాటి రజిత, చౌటుప్పల్, నల్గొండ జిల్లా పంట వేయకముందే ఆర్డర్లు మూడున్నర ఎకరాల్లో వరి, కూరగాయలు, పశువుల కోసం నాలుగు రకాల గ్రాసం వేస్తుంటాను. ఈ ఏడాది 60 కొబ్బరి మొక్కలు కూడా పెట్టాను. మా పంటలు అమ్ముకోవడానికి వాట్సప్ గ్రూప్‌లున్నాయి. మాకు తెలియని పంట పెట్టడానికి ప్రయత్నం చేసి సందేహాలు అడిగితే, ఆ పంటలు సాగు చేస్తున్న రైతు సోదరులతో కలుపుతారు. సూర్యకళ అక్కయ్య మమ్మల్నందరినీ కలపడం కోసం ‘రైతులతో భోజనం’ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. రైతు దినోత్సవం రోజు సన్మానాలు చేస్తారు. మంచి దిగుబడి తెచ్చినందుకు నాకూ ఓ సారి సన్మానం చేశారు. – ఒగ్గు సిద్దులు, ఇటికాలపల్లి, జనగామ జిల్లా – వాకా మంజులారెడ్డి -
ఇమ్రాన్ ఖాన్‌కు ఊహించని షాక్..!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్థాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) చీఫ్ పదవి నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించింది ఆ దేశ ఎన్నికల సంఘం. తోషాఖానా(ఖజానా) కేసుకు సంబంధించి ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలుపుతూ ఇమ్రాన్‌కు నోటీసులు సైతం జారీ చేసిందని డౌన్ న్యూస్‌పేపర్ పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్ 13న చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన విలువైన బహుమతులను దేశ ఖజానా తోషాఖానా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వాటిని ఎక్కువ ధరకు విక్రయించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో తప్పుడు సమాచారం, తప్పుడు వాంగ్మూలం ఇచ్చారన్న ఆరోపణలతో ఆర్టికల్ 63(i) ప్రకారం ఆయనను అనర్హుడిగా గుర్తించింది ఎన్నికల సంఘం. ఈసీ రికార్డ్స్ ప్రకారం.. తోషాఖానా నుంచి బహుమతులను రూ.21.5 మిలియన్లకు కొనుగోలు చేసి రూ.108 మిలియన్లకు విక్రయించినట్లు తేలింది. తోషాఖానా బహుమతుల విక్రయంపై వార్తలు వచ్చిన క్రమంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పాకిస్థాన్ చట్టాల ప్రకారం విదేశాల్లో బహుమతిగా లభించిన వాటిని తోషాఖానా(ఖజానా) విభాగంలో వాటి విలువను లెక్కించాలి. ఆ తర్వాతే వాటిని 50 శాతం డిస్కౌంట్‌తో తీసుకునేందుకు వీలుంటుంది. ఇదీ చదవండి: భారీ వర్షాలతో బస్సును కమ్మేసిన బురద.. 34 మంది సజీవ సమాధి -
Pankaj Tripathi: వెండితెర వాజ్‌పేయి
భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ దివంగత ప్రముఖ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వాజ్‌పేయీగా పంకజ్ త్రిపాఠి నటిస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు. ‘‘అటల్ బిహారి వాజ్‌పేయి కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు...మంచి మానవతావాది, రచయిత, కవి కూడా. ఇలాంటి వ్యక్తి పాత్రలో నటిస్తున్నందుకు ఓ నటుడిగా నాకు సంతోషంగా ఉంది’’ అని పంకజ్ త్రిపాఠి పేర్కొన్నారు. ఈ సినిమాను అటల్ బిహారి వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహూ
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (73)కు చెందిన లికడ్ పార్టీ ఆధ్వర్యంలోని సంకీర్ణ కూటమి విజయం సాధించింది. దాంతో, రికార్డు స్థాయిలో 15 ఏళ్లకుగా పైగా ప్రధానిగా చేసిన ఆయన మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. 120 స్థానాలున్న పార్లమెంటులో 64 స్థానాలతో లికడ్ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఫలితాలను నవంబర్ 9న ధ్రువీకరిస్తారు. ప్రధాని లపిడ్ ఓటమి అంగీకరించారు. నెతన్యాహూకు ఫోన్ చేసి అభినందించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా రాకెట్ దాడులు ఎన్నికల ఫలితాల వేళ పాలస్తీనాలోని గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి నాలుగు రాకెట్లను ప్రయోగించారు. మూడు లక్ష్యం చేరలేదు. ఒకదాన్ని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చేసింది. అంతేగాక ప్రతిదాడులతో గట్టిగా బదులిచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాలో హమాస్ గ్రూప్ రహస్యంగా నిర్వహిస్తున్న రాకెట్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి. -
చారిత్రక విజయం దిశగా నెతన్యాహు పార్టీ
జెరుసలేం: ఇజ్రాయెల్‌లో తాజా ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(73) సారథ్యంలోని సంకీర్ణ కూటమి చరిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. వామపక్ష మెరెట్జ్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నా 85 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికే 120 మంది సభ్యుల పార్లమెంట్లో 65 సీట్లు నెతన్యాహు కూటమికి దక్కేలా కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక గత నాలుగేళ్లలో దేశంలో ఏకంగా ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. తాజా ఫలితాలతో రాజకీయ సందిగ్ధానికి తెరపడనుంది. నెతన్యాహు కూటమికి 65 వరకు సీట్లు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్‌లోనూ వెల్లడైంది. ఈ కూటమిలో నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ, యూదు మతవాద పార్టీలు ఉన్నాయి. -
ట్రస్‌కు ఏటా రూ.కోటి!
లండన్: బ్రిటన్ ప్రధానిగా పని చేసింది కేవలం 45 రోజులే. అయితేనేం... మాజీ ప్రధాని హోదాలో లిజ్ ట్రస్ జీవితాంతం ఏటా ఏకంగా 1.15 లక్షల పౌండ్లు రూ.1,06,36,463) పెన్షన్‌గా అందుకోనున్నారు. ప్రజా జీవితంలో చురుగ్గా ఉండే మాజీ ప్రధానులకు ఆర్థిక సాయం నిమిత్తం ఏర్పాటు చేసిన పబ్లిక్ డ్యూటీ కాస్ట్స్ అలవెన్సుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. 1990లో బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ రాజీనామా అనంతరం ఈ అలవెన్సును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏకంగా ఆరుగురు బ్రిటన్ మాజీ ప్రధానులు ఈ అలవెన్సు పొందుతున్నారు! ట్రస్‌తో కలిపి ఏడుగురు మాజీ పీఎంల అలవెన్సుల రూపంలో ఏటా ఖజానాపై పడే భారం 8 లక్షల పౌండ్లు. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. ఐదేళ్లు వేటు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఆయనపై ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశాల నుంచి పొందిన ఖరీదైన బహుమతులను చట్టవిరుద్ధంగా సొంతం చేసుకుని భారీ ధరకు అమ్ముకున్నారనే ఆరోపణలపై విచారణ జరిపింది. అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం ఈ మేరకు వెలువరించింది. ఎన్నికల సంఘం తీర్పుతో ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో తన పదవిని కోల్పోనున్నారు. అంతేకాదు మరో ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసి ఏ పదవి చేపట్టడానికి వీల్లేదు. అయితే ఈ తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని ఇమ్రాన్ సన్నిహితులు తెలిపారు. ఏంటీ వివాదం..? 2018లో పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ దుబాయ్ వంటి అరబ్ దేశాల్లో పర్యటించారు. ఈ సమయంలో ఖరీదైన వస్తువులు బాహుమతులుగా అందుకున్నారు. చట్ట ప్రకారం వీటిని కేబినెట్ నేతృత్వంలోని ప్రభుత్వ శాఖ అయిన తోషఖానాలో భద్రపరిచారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులకు కానుకలుగా వచ్చే విలువైన వస్తువులను ఈ శాఖ భద్రపరుస్తుంది. వాటిని వాళ్లు సొంతం చేసుకోవాలనుకుంటే డిస్కౌంట్‌తో విక్రయిస్తుంది. అయితే సాధారణంగా 20శాతం ఉండే డిస్కౌంట్‌ను ఇమ్రాన్ ఖాన్ 50 శాతానికి పెంచారు. ఆ తర్వాత తనకు వచ్చిన ఖరీదైన కానుకలను తక్కువ ధరకే సొంతం చేసుకున్నారు. అనంతరం వాటిని భారీ ధరకు ఇతరులకు విక్రయించారు. ఈ ఆరోపణలపైనే విచారణ జరిపిన ఎన్నికల సంఘం ఇమ్రాన్‌పై అనర్హత వేటు వేసింది. చదవండి: అతితక్కువ కాలం పదవుల్లో కొనసాగింది వీళ్లే! -
పాకిస్థాన్ మాజీ ప్రధాని అరెస్టుకు రంగం సిద్ధం!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విదేశీ నిధుల కేసులో ఆయనను అదుపులోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పీటీఐ నాయకులు తారిఖ్ షమి, హమీద్ జమాన్, సైఫ్ నియాజీని శుక్రవారం అరెస్టు చేశారు అధికారులు. ఇమ్రాన్‌పై కేసు పెట్టాలని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనావుల్లా సంబంధిత అధికారులను ఆదేశించారని ఆ దేశ మీడియా తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీకి ఇమ్రాన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అధికారులు చూస్తున్నారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మీడియా పేర్కొంది. అనధికారికంగా వెబ్సైట్ నిర్వహిస్తూ విదేశాల నుంచి నిధుల సమకూర్చుకున్నారనే ఆరోపణలతో మొదట పీటీఐ నేత సైఫుల్లా నియాజిని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైబర్ క్రైం విభాగం శుక్రవారం అరెస్టు చేసింది. ఆ తర్వాత కాసేపటికే మరికొంతమంది నేతలను అరెస్టు చేసింది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది. చదవండి: షాకింగ్.. ఆ కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు ముప్పు! -
అవినీతి కేసులో దోషిగా మలేసియా మాజీ ప్రధాని.. 12 ఏళ్ల జైలు శిక్ష
పుత్రజయ(మలేసియా): అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌ను దోషిగా తేలుస్తూ ఆ దేశ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. దీంతో మాజీ ప్రధానుల్లో చెరసాలకు వెళ్తున్న తొలి వ్యక్తిగా నజీబ్ అప్రతిష్ట మూటగట్టుకోనున్నారు. దోషిగా నిర్ధారణ కావడంతో ఆయనకు హైకోర్టు గతంలోనే 12 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ‘ఆయన చేసిన అధికార దుర్వినియోగం, నమ్మకద్రోహం, మనీ లాండరింగ్ నేరాలకు తగిన శిక్షే ఇది’ అని హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల ఫెడరల్(సుప్రీం) కోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. వెంటనే ఆయన తన జైలుజీవితం మొదలుపెట్టాలని ఆజ్ఞాపించింది. మలేసియా అభివృద్ధికి ఉద్దేశించిన 1 మలేసియా డెవలప్మెంట్ బెహ్రాత్(1ఎండీబీ) నుంచి ఏకంగా 450 కోట్ల అమెరికన్ డాలర్లను నజీబ్ దోచుకున్నారని, 1ఎండీజీ విదేశీ విభాగమైన ఎస్ఆర్సీ ఇంటర్నేషనల్ నుంచి 94 లక్షల డాలర్లు అక్రమంగా పొందారని దర్యాప్తులో తేలింది. దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి మైమన్‌ను ఈ కేసు విచారణ ప్యానెల్ నుంచి తప్పించాలంటూ నజీబ్ అంతకుముందు చేసిన అభ్యర్థననూ కోర్టు తిరస్కరించింది. ఇదీ చదవండి: మరణ శిక్ష రద్దు చేసేందుకు సమ్మతించిన ప్రభుత్వం! -
మత సంస్థపై ద్వేషంతోనే షింజో హత్య
టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెను పొట్టనపెట్టుకున్న హంతకుడు తెత్సుయా యమగామీ(41) అసలు లక్ష్యం ఓ మత సంస్థ నాయకుడేనట! సదరు నాయకుడిని అంతం చేయాలని ముందుగానే పథకం సిద్ధం చేసుకున్నాడట! చివరకు అతడి కోపమంతా షింజోపైకి మళ్లింది. ఆ మత సంస్థకు మద్దతు ఇవ్వడమే షింజో చేసిన నేరమయ్యింది. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో యమగామీ అంగీకరించినట్లు జపాన్ మీడియా వెల్లడించింది. మత సంస్థను యమగామీ తల్లి ఆరాధించేవారు. ఇది అతడికి ఎంతమాత్రం నచ్చేదికాదు. ఆ సంస్థపై అంతులేని ద్వేషం పెంచుకున్నాడు. మత సంస్థతో షింజో అబెకు బలమైన సంబంధాలు ఉన్నాయని నమ్మేవాడు. యమగామీకి తొలుత టార్గెట్‌గా మారిన మత సంస్థ, మతాధికారి ఎవరన్నది బయటపెట్టలేదు. శుక్రవారం నరా సిటీలో కాల్పుల్లో షింజో మరణించిన సంగతి తెలిసందే. ఘటనా స్థలంలో హంతకుడు యమగామీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ కారణాలు లేవని, అబె రాజకీయ వైఖరిపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని పోలీసుల విచారణలో యమగామీ చెప్పినట్లు సమాచారం. అలసిపోయా.. రాజీనామా చేస్తా ఉద్యోగం, ఉపాధి లేని అస్థిరమైన జీవితం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం యమగామీని హంతకుడిగా మార్చినట్లు తెలుస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత చాలాకాలం ఖాళీగా ఉన్నాడు. 2005లో జపాన్ నావికాదళంలో మారీటైమ్ సెల్ఫ్–డిఫెన్స్ ఆఫీసర్‌గా పనిచేశాడు. హిరోషిమాలోని కురే బేస్‌లో సేవలందించాడు. మూడేళ్లు పనిచేసి, సైన్యం నుంచి తప్పుకున్నాడు. 2020లో కాన్సాయ్లో ఓ తయారీ కంపెనీలో చేరాడు. విధి నిర్వహణలో అలసిపోయానని, రాజీనామా చేస్తానని ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. మే నెలలో రాజీనామా సమర్పించాడు. అప్పటి నుంచి ఖాళీగా తిరుగుతున్నాడు. భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై తనకు ఎలాంటి స్పష్టత లేదని యమగామీ తన గ్రాడ్యుయేషన్ ఇయర్బుక్లో రాశాడు. జపాన్ ప్రజల కన్నీటి నివాళులు షింజో అబె పార్థివ దేహాన్ని శుక్రవారం రాజధాని టోక్యోలో షిబువా ప్రాంతంలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ సందర్భంగా షింజో భార్య అఖీ కూడా ఉన్నారు. వేలాది మంది జనం బారులుతీరి తమ అభిమాన నాయకుడికి కన్నీటి నివాళులర్పించారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్ శనివారం జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు సంతాపం సందేశం పంపించారు. చైనా–జపాన్ సంబంధాలను మెరుగుపర్చేందుకు షింజో ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. సంబంధాలను బలోపేతం చేసుకొనేవిషయంలో తాను, షింజో ఒక ముఖ్యమైన ఒప్పందానికి వచ్చామని గుర్తుచేశారు. మోదీ, బైడెన్, ఆంథోనీ ఉమ్మడి ప్రకటన షింజో అబె మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ శనివారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మూడు దేశాల అధినేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేయడం అత్యంత అరుదు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం, చతుర్భుజ కూటమి(క్వాడ్) ఏర్పాటు వెనుక షింజో కృషిని గుర్తుచేసుకున్నారు. షింజో హత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. ఆయన గౌరవార్థం శాంతియుత, సౌభాగ్యవంతమైన ఇండో–పసిఫిక్ కోసం రెట్టింపు కృషి సాగిద్దామని నేతలు ప్రతినబూనారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వాములుగా ‘క్వాడ్’ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
అంతర్జాతీయ రాజకీయాలపై... చెరగని ముద్ర
షింజో అబె. జీవితమంతా రాజకీయాల్లోనే గడిపిన నేత. అత్యంత ఎక్కువ కాలం పాలించిన ప్రధానిగా జపాన్‌కు సైనికంగా, ఆర్థికంగా నూతన దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రపంచ రాజకీయాలపైనా చెరగని ముద్ర వేశారు. జపాన్‌లోని శక్తిమంతమైన రాజకీయ కుటుంబంలో పుట్టారాయన. అబె తాత నొబుసుకే కిషి జపాన్ ప్రధానిగా పని చేశారు. మరో తాత ఎయ్‌సాకు సాతో కూడా ఎనిమిదేళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు. అనంతర కాలంలో జపాన్ను అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా ఆయన రికార్డునే అబె అధిగమించడం విశేషం. అబెనామిక్స్‌తో ఆర్థిక చికిత్స అబె 1954 సెప్టెంబర్ 21న టోక్యోలో జన్మించారు. తండ్రి షింటారో అబె విదేశాంగ మంత్రిగా పని చేశారు. టోక్యోలోని సెయ్‌కీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశాక అబె అమెరికా వెళ్లి సౌత్ కాలిఫోర్నియా వర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. కొంతకాలం కోబే స్టీల్‌లో పని చేసి 1982లో విదేశాంగ శాఖలో చేరారు. తర్వాత యమగూచి స్థానం నుంచి ఎల్డీపీ తరఫున పార్లమెంటుకు ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశారు. 2005లో జునిచిరో కొయిజుమి ప్రభుత్వంలో చీఫ్ కేబినెట్ సెక్రెటరీ అయ్యారు. 2006లో 52వ ఏట తొలిసారి ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కునిగా రికార్డు సృష్టించారు. కానీ అనారోగ్యం వేధించడంతో ఏడాదికే తప్పుకోవాల్సి వచ్చింది. దేశంలో ఐదేళ్ల రాజకీయ అస్థిరత అనంతరం 2012లో రెండోసారి ప్రధాని అయ్యారు. 2020 ఆగస్టు దాకా కొనసాగారు. పాలనలో తనదైన మార్కు చూపించారు. ఏకంగా ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచారు. అబెనామిక్స్ పేరుతో పలు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సమర్థ విధానాల ద్వారా ఆర్థిక కష్టాల నుంచి దేశాన్ని గట్టెక్కించారు. తిరుగులేని ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిపెట్టారు. ఆగర్భ శత్రువైన చైనాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. ప్రపంచ దేశాధినేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. సైనికపరంగా కూడా జపాన్ను అత్యంత బలోపేతం చేయాలని చివరిదాకా తపించారు. జపాన్ జాతీయవాదానికి పోస్టర్ బోయ్‌గా నిలిచి యువతలో క్రేజ్ సంపాదించుకున్నారు. అత్యంత బలోపేతమైన సైన్యాన్ని కేవలం ఆత్మరక్షణకే పరిమితం చేస్తూ అంతర్జాతీయ సంఘర్షణల్లో జోక్యం చేసుకోవడాన్ని నిషేధిస్తున్న దేశ రాజ్యాంగాన్ని మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. దీన్ని చైనా, కొరియాలనే గాక స్వదేశంలోని సంప్రదాయవాదులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓడాక జపాన్‌పై అమెరికా తదితర దేశాలు విధించిన ఆంక్షలను, బలవంతపు ఒప్పందాలను పక్కన పెట్టేందుకూ ప్రయత్నించారు. అంతర్జాతీయ వేదికపై మరింత కీలక పాత్ర పోషించేలా జపాన్ను తీర్చిదిద్దాలని తపించారు. దేశంలో జాతీయవాద విద్యా విధానాన్ని బాగా ప్రోత్సహించారు. అందరు దేశాధినేతలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించినా, భారత్ అంటే మాత్రం అబెకు ప్రత్యేకమైన అభిమానం. అది 1950ల్లో జపాన్ ప్రధానిగా చేసిన ఆయన తాత నుంచి ఒకరకంగా ఆయనకు వారసత్వంగా వచ్చిందని చెప్పడం అతిశయోక్తి కాబోదు. తనకు నెహ్రూ ఇచ్చిన ఆతిథ్యాన్ని తాత తనకు వర్ణించిన తీరును ఎప్పటికీ మర్చిపోలేనని పలుమార్లు అబె చెప్పారు. ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిడాపై అబె ప్రభావం చాలా ఉంది. అమెరికాతో జపాన్ బంధాన్ని పటిష్టంగా మార్చిన ప్రధానిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ‘క్వాడ్’తో చైనాకు ముకుతాడు రాజనీతిజ్ఞుడిగా అబె ముందుచూపు అత్యంత నిశితమైనది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాతో ఎప్పటికైనా పెను ముప్పేనని ముందే ఊహించారాయన. దాని ఫలితమే చైనాను ఇప్పుడు నిత్యం భయపెడుతున్న అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ సంయుక్త కూటమి (క్వాడ్). దీని రూపకర్త అబెనే. భారత పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ చేసిన ప్రతిపాదనే క్వాడ్‌గా రూపుదాల్చింది. అది జపాన్‌తో పాటు భారత్‌నూ అమెరికాకు సన్నిహితం చేసింది. -
Shinzo Abe: చెరగని ముద్ర వేసిన షింజో అబే
నేరగాళ్లు రెచ్చిపోవడం, ఎక్కడో ఒకచోట తుపాకులు పేలడం, పౌరులు ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణంగా మారిన వర్తమానంలో కూడా జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యో దంతం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. జపాన్‌లో హింసాత్మక ఘటనల శాతం తక్కువ. తుపాకుల వినియోగం దాదాపు శూన్యం. అటువంటి ఉదంతాలు ఏడాదికి పది కూడా ఉండవు. ఇటు చూస్తే షింజో అబే వివాదాస్పద వ్యక్తి కాదు. పైపెచ్చు జపాన్ ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న కష్టకాలంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి దాన్ని గట్టెక్కించిన చరిత్ర ఆయనది. అందువల్లే 2012 నుంచి ఎనిమిదేళ్లపాటు అధికారంలో కొనసాగారు. రెండేళ్ల క్రితం ఆరోగ్యం సహకరించక పదవి నుంచి తప్పుకున్నారుగానీ ఆ సమయానికి కూడా ఆయన తిరుగులేని నేతగానే ఉన్నారు. పాలకులు తీసుకునే నిర్ణయాలన్నీ అందరినీ మెప్పించాలని లేదు. వాటివల్ల ఇబ్బందులకు గురయ్యే వర్గాలు కూడా ఉంటాయి. కానీ మెజారిటీ ప్రజల సంక్షేమానికీ, శ్రేయస్సుకూ ఏది మంచి దన్నదే అంతిమంగా గీటురాయి అవుతుంది. అబేను పొట్టనబెట్టుకున్న దుండగుడు ఎందుకంత దారుణానికి ఒడిగట్టాడన్నది మున్ముందు తెలుస్తుంది. కానీ అబే ఆర్థిక విధానాలు 2012 నాటికి నీరసించి ఉన్న జపాన్‌కు జవసత్వాలు ఇచ్చాయనడంలో సందేహం లేదు. ఒకప్పుడు అతి సంపన్న దేశంగా వెలుగులీని, ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న జపాన్ 80వ దశకం మధ్యనుంచి వెలవెలబోవడం మొదలైంది. ఆ స్థానాన్ని చూస్తుండగానే గతంలో తన వలస దేశమైన చైనా ఆక్రమించింది. ఇది జపాన్ను కుంగదీసింది. రాజకీయ రంగంలో అస్థిరత చోటుచేసుకుంది. అస్థిర ప్రభుత్వాలు ఒకపక్క, ప్రకృతి వైపరీత్యాలు మరోపక్క దాన్ని పట్టి పీడించాయి. సహజంగానే ఇవన్నీ నేరాలు పెరగడానికి దోహదపడ్డాయి. అలాంటి సమయంలో అబే అధికార పగ్గాలు స్వీక రించి ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. ఆ విధానాలు ‘అబేనామిక్స్’ పేరిట ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి. ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు పడినా త్వరలోనే వాటివల్ల మెరుగైన ఫలితాలొచ్చాయి. జపాన్ పుంజుకుంది. ప్రారంభంలో జాతీయవాదిగా, స్వేచ్ఛా విపణికి తీవ్ర వ్యతిరేకిగా ఉన్న అ»ే తన వైఖరిని మార్చుకున్నారు. 2012కు ముందు విశాల పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం (టీపీపీ) జపాన్ ప్రయోజనాలు దెబ్బతీస్తుందని వాదించిన ఆయనే, అధికారంలోకొచ్చాక దాన్ని నెత్తికెత్తుకున్నారు. ట్రంప్ ఏలుబడిలో ఆ ఒప్పందం నుంచి అమెరికా బయటికొచ్చినా 2018లో వేరే దేశాలను కలుపుకొని దాన్ని మరింత విస్తరించారు. సంస్కరణలపై ఎంత మొగ్గు చూపినప్పటికీ అన్నిటినీ ప్రైవేటుపరం చేయాలన్న స్వేచ్ఛా మార్కెట్ ఉదారవాది కాదాయన. ప్రభుత్వ రంగ సంస్థల పాత్రను ఏమాత్రం తగ్గించలేదు. దేశానికొక కొత్త రాజ్యాంగం కావాలనీ, సైనికంగా బలపడాలనీ ఆయన కలలుగన్నారు. కరోనా అవాంతరం లేకపోతే అది కూడా జరిగేదే. అమెరికా, కొన్ని యూరప్ దేశాల మాదిరిగా వలసలపై ఆంక్షలు విధించడం కాక, వాటిని ప్రోత్సహించారు. పర్యవసానంగా లక్షలాదిమంది విదేశీ నిపుణులకు ఉద్యోగావకాశాలు లభించాయి. మన దేశానికి మంచి మిత్రుడిగా మెలిగారు. చైనాతో మనకు సమస్యలు వచ్చినప్పుడు గట్టిగా సమర్థించారు. బహుశా కరోనా విరుచుకుపడకపోతే ఆయన ఆర్థిక విధానాలు మరింత మెరుగైన ఫలితాలు తీసుకొచ్చేవేమో! కానీ కరోనా సమయంలో కఠినమైన లాక్డౌన్లు అమలు చేయడం వల్ల చాలామంది ఉపాధి కోల్పో యారు. ప్రకటించిన ఉద్దీపన పథకాలు ప్రజలకు పెద్దగా తోడ్పడలేదు. దాంతో ఆయనపట్ల వ్యతి రేకత మొదలైంది. ఒకపక్క అనారోగ్యం, మరోపక్క ఆర్థిక వ్యవస్థలో ఒడుదొడుకులు ఆయన్ను కుంగదీసి చివరకు పదవినుంచి వైదొలగారు. జపాన్‌లో హింసాత్మక ఉదంతాలు లేనేలేవని చెప్పలేం. కానీ ఒక రాజకీయ నాయకుడిపై దాడి జరగడం చాలా అరుదు. 1960లో సోషలిస్టు నాయకుడు ఇనెజిరో అసానుమోపై ఒక దుండగుడు కత్తితో దాడి చేశాడు. 2007లో నాగసాకి నగర మేయర్‌ను కాల్చిచంపారు. ఆ తర్వాత ఈ స్థాయి ఘటన జరగడం ఇదే ప్రథమం. ఆ దేశంలో సాయుధ బృందాల ఉనికి లేకపోలేదు. అయితే కరుడు గట్టిన యకుజా ముఠా సైతం తుపాకుల వినియోగం విషయంలో జంకుతుంది. తుపాకుల అమ్మ కంపై కఠిన ఆంక్షలు, వాటిని వినియోగించేవారికి కఠిన శిక్షల అమలు ఇందుకు కారణం. హింసా త్మక ఘటనలు అరుదు గనుక నేతలు భద్రత గురించి పెద్దగా పట్టించుకోరు. ఎన్నికల ప్రచార మంతా వీధి సభల ద్వారానే సాగుతుంది. నిజానికి దాడి జరిగే సమయానికి అలాంటి చిన్న సభ లోనే అబే మాట్లాడుతున్నారు. 1986లో అప్పటి స్వీడన్ ప్రధాని ఓలోఫ్ పామే నడుచుకుంటూ వెళ్తుండగా దుండగుడు ఆయన్ను నడి బజారులో కాల్చిచంపాడు. ఆ తర్వాత ప్రపంచాన్ని తీవ్రంగా దిగ్భ్రాంతిపరిచిన ఘటన అబే హత్యోదంతమే. సంక్షోభాలకు ఏ దేశమూ అతీతం కాని వర్తమాన పరిస్థితుల్లో హింసకు ఏ ప్రాంతమూ మినహాయింపు కాదు. పైగా సంఘటిత నేర బృందాలకు బదులు ఎవరితోనూ సంబంధాలు లేనట్టు కనబడే వ్యక్తులే హింసకు దిగుతున్న ఉదంతాలు అమె రికా వంటిచోట్ల ఎక్కువయ్యాయి. కనుక నిరంతర అప్రమత్తత, నేతలకు తగిన భద్రత కల్పించడం తప్పనిసరి. వర్తమాన ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన నేతల్లో ఒకరిగా, భారత్‌కు చిరకాల మిత్రునిగా ఉన్న అబే ఒక దుండగుడి కాల్పుల్లో కనుమరుగు కావడం అత్యంత విచారకరం. -
పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ఆరోపణలు
లాహోర్: పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావెద్ బజ్వాపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరోక్ష విమర్శలు చేశారు. తన పదవి పోయేందుకు కీలక స్థానాల్లో ఉన్న కొందరు కారణమని దుయ్యబట్టారు. తన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ‘ప్రతి సంస్థలో మనుషులుంటారు. అందులో ఒకరిద్దరు తప్పుడువారైనంత మాత్రాన మొత్తం సంస్థను బాధ్యురాలిగా చేయలేము. ఒకవేళ ఒకరు (జనరల్ బజ్వా) తప్పు చేస్తే అది మొత్తం సంస్థ తప్పు చేసినట్లు కాదు.’’ అని ఆయన ట్వీట్ చేశారు. సైన్యానికి తమ పార్టీకి మధ్య సంబంధాలు గత కొద్ది నెలలుగా క్షీణించాయని పాక్ మాజీ మంత్రి ఫవాద్ చెప్పారు. ఐఎస్ఐ చీఫ్‌గా నదీమ్ అంజుమ్ నియామకాన్ని ఇమ్రాన్ గతేడాది తొలుత తిరస్కరించి తర్వాత ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయనకు సైన్యంతో చెడింది. దేశ చరిత్రలో గుర్తుండే ర్యాలీ నిర్వహణకు తన మద్దతుదారులంతా గురువారం మినార్ ఐ పాకిస్తాన్‌కు చేరాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఒకపక్క ఆర్మీ చీఫ్‌ను విమర్శిస్తూ మరోపక్క సైన్యాన్ని ఆయన ప్రశంసించారు. -
పాక్ మాజీ ప్రధాని కన్నుమూత
ఇస్లామాబాద్ : పాక్ మాజీ ప్రధాని మీర్ జఫారుల్లా ఖాన్ జమాలి కన్నుమూశారు. బుధవారం రావల్పిండిలోని ఓ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారని జమాలి కుమారుడు మొహమ్మద్ ఖాన్ జమాలి వెల్లడించారు. 76 ఏళ్ల జమాలీ కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురికావడంతో.. రావల్పిండిలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ (ఏఎఫ్‌ఐసీ- ఎన్ఐహెచ్‌డీ)లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ వస్తున్నారు. కాగా జమాలి ఆరోగ్యం మరింత విషమించి మరోసారి గుండెపోటు రావడంతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. (చదవండి : 2024లో పోటీ చేస్తాను: ట్రంప్) మాజీ మిలటరీ నియంత పర్వేజ్ ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2002 నవంబర్ నుంచి 2004 జూన్ వరకు జమాలీ ప్రధానిగా కొనసాగారు. కాగా ఆ తర్వాత ముషారఫ్‌తో వచ్చిన విభేదాల కారణంగా 2004లో ప్రధాని పదవికి అర్థంతరంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. -
ఫ్రాన్స్‌ను ముస్లింలు శిక్షించవచ్చు
పారిస్: ఫ్రాన్స్‌ను శిక్షించే అధికారం ముస్లింలకు ఉందంటూ మలేసియా మాజీ ప్రధానమంత్రి మహథిర్ మహ్మద్ చేసిన ట్వీట్ తీవ్ర సంచలనానికి తెరతీసింది. ఆయన శుక్రవారం తన ట్విట్టర్ ఖాతా నుంచి వరుసగా 13 ట్వీట్లు చేశారు. ‘‘ఫ్రాన్స్ గతంలో నరమేధం సాగించింది. అందుకు ప్రతీకారంగా లక్షలాది మంది ఫ్రెంచ్ పౌరులను హతమార్చే అధికారం ముస్లింలకు ఉంది. కానీ, కంటికి కన్ను అనే సిద్ధాంతాన్ని ముస్లింలు పాటించరు. ఫ్రాన్స్ కూడా అందుకు కట్టుబడి ఉండాలి. ఇతర మతస్తుల మనోభావాలను గౌరవించడం ఫ్రాన్స్ ప్రజలకు అక్కడి ప్రభుత్వం నేర్పాలి’’అని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. మహథిర్ మహ్మద్‌పై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ డిజిటల్ సెక్టార్ సెక్రెటరీ సెడ్రిక్ ఓ వెంటనే రంగంలోకి దిగారు. మహథిర్ చేసిన ట్వీట్‌ను తక్షణమే తొలగించాలని ట్విట్టర్ యాజమాన్యాన్ని కోరారు. దీంతో ట్విట్టర్ యాజమాన్యం మహథిర్ మహ్మద్ ట్వీట్‌ను తొలగించింది. చర్చి ఘటనలో మరొకరి అరెస్టు నైస్(ఫ్రాన్స్): ఫ్రాన్స్‌లో నైస్ నగరంలోని చర్చిలో జరిగిన నరమేధంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ట్యునీషియాకు చెందిన ఇబ్రహీం ఇస్సాయ్ అనే ముష్కరుడు చర్చిలో కత్తితో దాడి చేయడంతో ముగ్గురు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో సంబంధం ఉందని అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 47 ఏళ్ల ఈ అనుమానితుడు కత్తితో దాడి చేసిన ముష్కరుడితో అంతకు మందు రోజు రాత్రే మాట్లాడినట్లు తెలుస్తోంది. -
మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష
కౌలాలంపూర్ : మలేషియా డెవలప్మెంట్ బెర్హాద్(వన్ ఎండీబీ) ఫండ్ కేసులో భారీ అవినీతి ఆరోపణలపై మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ దోషిగా తేలారు. దీంతో మాజీ ప్రధానికి కౌలాలంపూర్‌లోని హైకోర్టు 12 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. 2009 నుంచి 2018 వరకు నజీబ్ మలేషియా ప్రధానిగా చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆయన అవినీతి బయటపడటంతో అధికారాన్ని కోల్పోయారు. మలేసియాలో ఓ మాజీ ప్రధానిని దోషిగా కోర్టు నిర్ధారించడం ఇదే మొదటిసారి. అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్, నమ్మక ద్రోహంకు పాల్పడ్డారని నజీబ్ పై అభియోగాలున్నాయి. కాగా.. మలేషియాలో ఎన్ఆర్సీ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి 9.8 మిలియన్ డాలర్లను, అలాగే తన హయాంలో 4 నుంచి 5 బిలియన్ డాలర్లను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి ఆయన మళ్లించుకున్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధిపై పూర్తి నియంత్రణ ప్రధానికే ఉంటుంది. ఈ కుంభకోణం కూడా ఆయన హయాంలోనే జరగడంతో పాటు, ఢిఫెన్స్ వాదనలు కూడా ఆయన నిర్ధోషిత్వాన్ని నిరూపించేలా లేవని హైకోర్టు పేర్కొంది. దీంతోపాటు నజీబ్‌పై అభియోగాలు రుజువు కావడంతో కౌలాలంపూర్ హైకోర్టు ఆయనకు ఏకకాలంలో మూడు శిక్షలు అమలయ్యేలా 12 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. (దుర్గమ్మతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది..!) -
మెరుగుపడిన మన్మోహన్ ఆరోగ్యం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి, నిలకడగా ఉందని ఎయిమ్స్ తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా వచ్చిందని సోమవారం వెల్లడించింది. ఆదివారం ఆయనకు కొత్త మెడికేషన్ సరిపడక జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఎయిమ్స్‌లో చేర్చారు. ‘ఆయన్ను కార్డియో థొరాసిక్ ఐసీయూ నుంచి కార్డియో–న్యూరో టవర్లోని ప్రైవేట్ వార్డుకు తరలించాం. ఇవాళో రేపో డిశ్చార్జి చేసే అవకాశం ఉంది’ అని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. -
నవాజ్ షరీఫ్‌కు బెయిల్
లాహోర్: అనారోగ్యంతో బాధపడుతున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఆయన రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య ప్రమాదకర స్థా యికి తగ్గడంతో సోమవా రం రాత్రి ఆయనను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూ రో(ఎన్ఏబీ) కార్యాల యం నుంచి లాహోర్‌లోని సర్వీసెస్ ఆసుపత్రికి తరలించారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ అధినేత అయిన నవాజ్ షరీఫ్ అనారోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తక్షణమే బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సోదరుడు షాబాజ్ పెట్టుకు న్న పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు శుక్రవారం విచారించింది. అనంతరం రూ.రెండు కోట్ల విలువైన రెండు సొంత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. నగదు అక్రమ చెలామణీ కేసులో షరీఫ్ ఎన్ఏబీ అదుపులో ఉన్నారు. -
మాజీ ప్రధానుల కోసం మ్యూజియం
న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానులందరి సమగ్ర సమాచారంతో తమ ప్రభుత్వం ఓ భారీ మ్యూజియంను ఏర్పాటు చేయనుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. రాజకీయ అంటరానితనాన్ని రూపుమాపేలా కొత్త రాజకీయ సంస్కృతిని తాము తీసుకొస్తామని ఆయన అన్నారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌పై రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ హరివంశ్ రాసిన ఓ పుస్తకాన్ని మోదీ ఢిల్లీలో ఆవిష్కరించారు. అక్కడ మాట్లాడుతూ ‘ఓ కుటుంబానికి చెందిన మాజీ ప్రధాన మంత్రుల జ్ఞాపకాలు తప్ప మిగిలిన ప్రధానుల వివరాలు ఏ మాత్రం లేకుండా చెరిపేసేందుకు ఓ వర్గం రాజకీయ నాయకులు ప్రయత్నించారు. చంద్రశేఖర్ నాడు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపడితే, దానికి వ్యాపారవేత్తలు డబ్బులిచ్చారని ఆ వర్గం రాజకీయ నాయకులు ఆరోపణలు చేసి ఆయన ప్రతిష్ట దిగజార్చాలని చూశారని మోదీ గుర్తుచేశారు. ఇలాగే బీఆర్.అంబేడ్కర్, సర్దార్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ తదితర అనేక మంది గొప్ప నేతల ప్రతిష్టను మసకబార్చేందుకు కూడా స్వాతంత్య్రానంతరం కుటిల ప్రయత్నాలు జరిగాయని మోదీ అన్నారు. ఈనాటి యువతరంలో లాల్ బహదూర్ శాస్త్రి లాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎంత మందికి తెలుసని ఆయన ప్రశ్నించారు. ‘వాళ్లంతా మొదట ప్రజల మెదళ్ల నుంచి అదృశ్యమయ్యారు. ఇది చెప్పడానికి నాకు బాధాకరంగా ఉండొచ్చు కానీ ఓ వర్గం రాజకీయ నేతలే అలా చేశారు. కానీ మీ అందరి ఆశీస్సులతో మాజీ ప్రధానులందరికీ కలిపి ఓ పెద్ద మ్యూజియంను నిర్మించాలని నేను నిర్ణయించాను. ఆనాటి నుంచి ఇటీవలి ఐకే గుజ్రాల్, దేవె గౌడ, మన్మోహన్ సింగ్‌ల వరకు.. ప్రతి ఒక్కరూ ఈ దేశాభివృద్ధికి కృషి చేశారు. వారి సేవలను మనం గుర్తించాలి. గౌరవించాలి’ అని మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌కు చెందిన మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్‌ను కాదని జవహర్లాల్ నెహ్రూను తొలి ప్రధానిగా నియమించిన విషయాన్ని మోదీ హాస్యంతో చెప్పారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతనేత గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. -
ఊచకోత కారకుడు మృతి
బీజింగ్: చైనా మాజీ ప్రధాని, తియానన్మెన్ స్క్వేర్‌లో వేలాది మంది ఊచకోతకు కారకుడు లీపెంగ్(90) కన్నుమూశారు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ లీపెంగ్ అనారోగ్యంతో సోమవారం బీజింగ్‌లో మృతి చెందినట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. ఇంతకుముందు ఆయన మూత్రాశయ కేన్సర్‌తో బాధపడ్డారు. 1989లో దేశ రాజధాని బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్‌లో ప్రజాస్వామ్యవాదులు కొన్ని వారాలపాటు శాంతియుత నిరసనలు తెలిపారు. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న లీపెంగ్ బీజింగ్‌లో మార్షల్ లా విధించారు. అయినప్పటికీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో 1989 జూన్ 3, 4వ తేదీల్లో తియానన్మెన్ స్క్వేర్‌లో బైఠాయించిన నిరసనకారుల పైకి సైన్యాన్ని పంపారు. యుద్ధట్యాంకులతో వారిని నిర్దాక్షిణ్యంగా తొక్కించారు. దీంతో నిరాయుధులైన వెయ్యి మందికి పైగా యువకులు, కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటాన్ని చైనా ఉక్కుపాదంతో అణచివేయడంపై అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. అప్పటి నుంచి లీ పెంగ్ ప్రపంచం దృష్టిలో అణచివేతకు ప్రతిరూపంగా, బీజింగ్ కసాయి (బుచర్ ఆఫ్ బీజింగ్)గా నిలిచిపోయారు. సైనిక చర్య చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ ఏకగ్రీవ నిర్ణయమైనప్పటికీ, ఈ ఘటనకు లీపెంగ్‌నే బాధ్యుడిగా భావిస్తారు. ఆయన ఆ తర్వాత కూడా తన నిర్ణయాన్ని ‘అవసరమైన చర్య’గా సమర్థించుకున్నారు. ‘ఇలాంటి చర్యలు తీసుకోకుంటే ఒకప్పటి సోవియట్ యూనియన్, పశ్చిమ యూరప్ల్లోని కమ్యూనిస్టు ప్రభుత్వాలకు పట్టిన గతే చైనాకూ పట్టేది’ అని 1994లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా లీపెంగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని అరెస్ట్
ఇస్లామాబాద్ : సహజ వాయువు దిగుమతి కాంట్రాక్టుకు సంబంధించి ఓ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ అబ్బాసీని గురువారం నేషనల్ అకౌంటబిలిటీ బోర్డు (ఎన్ఏబీ) అరెస్ట్ చేసింది. అబ్బాసీ ఓ మీడియా సమావేశానికి వెళుతుండగా 12 మంది సభ్యులతో కూడిన ఎన్ఏబీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుందని డాన్ పత్రిక పేర్కొంది. తన అరెస్ట్‌ను తొలుత ప్రతిఘటించిన అబ్బాసీ ఆ తర్వాత ఎన్ఏబీ బృందానికి సహకరించారని తెలిపింది. అబ్బాసీ పెట్రోలియం, సహజ వనరుల మంత్రిగా పనిచేసిన సమయంలో ఎల్ఎన్జీ దిగుమతి కాంట్రాక్టుకు సంబంధించిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. అబ్బాసీని ఎన్ఏబీ ఎదుట శుక్రవారం రిమాండ్‌కు తరలిస్తారని భావిస్తున్నారు. ఇక 2017లోఅవినీతి ఆరోపణలపై నవాజ్ షరీఫ్ ప్రధానిగా వైదొలగిన అనంతరం అబ్బాసీ పాక్ ప్రధానిగా పనిచేశారు. కాగా అబ్బాసీ అరెస్ట్‌ను నేషనల్ అసెంబ్లీలో విపక్ష నేత షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఎన్ఏబీ ఇమ్రాన్ ఖాన్ జేబు సంస్ధగా మారిందని విమర్శించారు. -
బాత్రూమ్లో జారిపడిన హెచ్డీ దేవెగౌడ
బెంగళూరు : మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బాత్రూమ్లో జారి పడటంతో ఆయన కుడికాలికి గాయమైంది. తన నివాసంలో జారిపడిన దేవెగౌడను పద్మనాభ నగర్ సమీపంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాగా, దేవెగౌడ కాలికి అయిన గాయం చిన్నదేనని, కుడి మోకాలు బెణికిందని వైద్యులు తెలిపారు. 85 ఏళ్ల దేవెగౌడ కాలికి గాయం కావడంతో కష్టంమీద నడుస్తున్నట్టు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఒకరు తెలిపారు. -
బంగ్లా మాజీ ప్రధానికి మరో ఎదురు దెబ్బ
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా(72)కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న ఆమెకు అధికార దుర్వినియోగం కేసులో జైలు శిక్ష ఖరారైంది. బంగ్లాదేశ్ రాజధానిలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఖలేదాకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జియా తన భర్త పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థకోసం అక్రమంగా నిధులను సేకరించిన ఆరోపణలనువిచారించిన కోర్టు సోమవారం ఈ తీర్పునిచ్చింది. మాజీ ప్రధానితోపాటు హారిస్ చౌదరి సహా మరో ముగ్గురికి కూడా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పది లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. ఢాకాలోని జియా చారిటబుల్ ట్రస్ట్ ఫండ్ కోసం 375 వేల డాలర్ల గుప్త విరాళాలను సేకరించడంలో ప్రధానమంత్రిగా ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జడ్జి వ్యాఖ్యనించారు. కాగా విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో ఢాకా ప్రత్యేక కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను దోషిగా నిర్ధారించింది. ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నందున జియా కోర్టుకు హాజరు కాలేదు. మరోవైపు రెండు కేసులకు సంబంధించిన ఆరోపణలను ఖలీదా జియా పార్టీ ఖండించింది. రాజకీయ కుట్రగా అభివర్ణించింది. -
పాక్ మాజీ ప్రధాని షాబాజ్ అరెస్టు
లాహోర్: పాక్ మాజీ ప్రధాని, విపక్షనేత షాబాజ్ షరీఫ్ (67) అవినీతి కేసులో అరెస్టయ్యారు. రూ.1,400 కోట్ల (పాక్ కరెన్సీ) హౌజింగ్ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పాక్ అవినీతి నిరోధక విభాగం శుక్రవారం షరీఫ్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (పీఎంఎల్–ఎన్) అధ్యక్షుడిగా ఉన్నారు. ‘లాహోర్‌లోని నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో ముందు విచారణకు షాబాజ్ హాజరయ్యారు. ఆషియానా హౌజింగ్ స్కీమ్, పంజాబ్ సాఫ్ పానీ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇచ్చారంటూ ఈయనపై ఆరోపణలు వచ్చాయి. -
మహానేతకు సేవ చేయడం మా అదృష్టం...
దేశవ్యాప్తంగా తన వాక్పటిమ, రాజనీతిజ్ఞతతో ఆకట్టుకున్న మహానేతకు వారు సేవలందించారు. వాజ్‌పేయికి అంతమ శ్వాసవరకు సేవ చేసే అవకాశం లభించడాన్ని ఢిల్లీలోని ఆల్ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) డాక్టర్లు, నర్సులు తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఏయిమ్స్‌లో వాజ్‌పేయికి 9 వారాల పాటు చికిత్స అందించిన సందర్భంగా తమకెదురైన జ్థాపకాలను వారు పదిలం చేసుకుంటున్నారు. వృద్ధాప్యంతో పాటు న్యూమోనియా, వివిధ అవయవాలు పనిచేయని కారణంగా గురువారం సాయంత్రం ఆయన కన్నుమూశారు. వాజ్‌పేయి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో గత కొన్నిరోజులుగా తాము తీవ్ర వత్తిడిలో పనిచేయాల్సి వచ్చిందని, అయినా అలాంటి నేతకు సేవలు చేయడంలో ఆ శ్రమ మరిచిపోయామని చెబుతున్నారు. ’ చిన్నప్పటి నుంచి ఏ నాయకుడి ఉపన్యాసాలు టీవీల్లో చూస్తూ పెరిగామో ఆ నేతే ఆసుపత్రి మంచంపై తీవ్ర అనారోగ్య స్థితిలో కనిపించడాన్ని వివరించడానికి కష్టంగా ఉంది. వాజ్‌పేయి లాహోర్ బస్సుయాత్రకు వెళ్లిన దృశ్యాలు ఇంకా కళ్లకు కట్టినట్టుగా ఇప్పటికీ నాకు కనిపిస్తున్నాయి’ అని ఓ నర్సు చెప్పారు. మామూలు ఆరోగ్య పరీక్షల కోసం జూన్ 11న ఏయిమ్స్‌కు వచ్చిన సందర్భంగా ముత్రాశయ ద్వారంలో ఇన్ఫెక్షన్తో పాటు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్,తక్కువ మోతాదులో మూత్రం విడుదల, ఛాతీ సమస్యలను డాక్టర్లు గుర్తించారు. ఆయనకు అవసరమైన వైద్యం అందించేందుకు ఆ వెంటనే ఏయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో ఐదుగురు డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యపరిస్థితిని గురించి ప్రధాని కార్యాలయం ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఉండేదని అక్కడి డాక్టర్లు తెలిపారు. గత శనివారం నుంచి వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించడం మొదలైందని, బుధవారం మరింత విశమించిందని వారు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నానానికి రెండు ఊపరితిత్తుల్లో న్యూమోనియా తీవ్రస్థాయికి చేరుకుందని, ఆ వెంటనే ’ఎక్స్ట్రా మెంబ్రేన్ ఆక్సిజెనెషన్’ (ఈసీఎంఓ) సేవలు అందించారు. ఈ ప్రక్రియ గుండెకు, శ్వాసక్రియకు సహాయకారిగా ఉండడంతో పాటు, కృత్రిమ గుండెగా, ఊపిరితిత్తులుగాను ఇది పనిచేస్తుంది. దిగజారుతున్న వాజ్‌పేయి ఆరోగ్యాన్ని బాగు చేసేందుకు వైద్యసిబ్బంది ఓ వైపు తీవ్రంగా శ్రమిస్తుండగా, విశమిస్తున్న ఆరోగ్యం పట్ల దేశవ్యాప్తంగా ఆందోళన పెరిగింది. చివరకు ప్రధాని మోదీ ఏయిమ్స్‌ను సందర్శించాక, వాజ్‌పేయి మరణవార్తను ఏయిమ్స్ మీడియా, ప్రోటోకాల్ డివిజన్ చైర్పర్సన్ డా. ఆర్తి విజ్ ప్రకటించారు. వాజ్‌పేయి మరణం రూపంలో ఎంతో నష్టం వాటిల్లిందని, దేశవ్యాప్తంగా పెల్లుబికుతున్న సంతాపంలో తాము కూడా భాగస్వాములం అవుతున్నామంటూ పేర్కొన్నారు. -
తరగతి గదిలో దస్తూరి తిలకం
గ్వాలియర్‌లో వాజ్‌పేయి చదువుకున్న పాఠశాల ఆయన జ్ఞాపకాల్లో తడిసిముద్దవుతోంది. ఆయన చేతిరాతతో ఉన్న రిజిస్టర్ తమకు పెన్నిధి అంటూ గర్వంగా చెప్పుకుంటోంది. కృష్ణాదేవి, కృష్ణ బిహారి వాజ్‌పేయి దంపతులకు 1924 సంవత్సరం క్రిస్మస్ పర్వదినం రోజు జన్మించిన అటల్ బిహారి వాజ్‌పేయి గోరఖి పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో ఆ పాఠశాలకు వాజ్‌పేయి తండ్రే ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. వాజ్‌పేయి స్కూలు రిజిస్టర్లో తన స్వదస్తూరితో పేరును రాసుకున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ, వాజ్‌పేయి చేతిరాత ఉన్న రిజిస్టర్ మాత్రం పదిలంగా ఉంది. ‘ఈ రిజిస్టర్ మాకో నిధిలాంటిది. నెంబర్ 101 దగ్గర ఉన్న పేరు వాజ్‌పేయిదే. 1935లో ఆరో తరగతిలో చేరడానికి వచ్చినప్పుడు వాజపేయి స్వయంగా తన పేరుని రాసుకున్నారు. ఇప్పుడే ఇది ఒక చారిత్రక పత్రంగా మారింది‘ అని స్కూలు ప్రిన్సిపాల్ కె.ఎస్.రాథోడ్ ఉద్వేగంగా చెప్పారు. అంతేకాదు ఆ పాఠశాలను కూడా స్థానికులు అటల్ జీ అంటూ ప్రేమగా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ పాఠశాల అలాగే గుర్తింపు ఉంది. స్కూల్ రోజుల్లో వాజ్‌పేయి కబడ్డీ, హాకీ ఆటలు ఆడేవారు. అందరు విద్యార్థుల మాదిరిగానే సైకిల్ వేసుకొని పట్టణం అంతా చక్కెర్లు కొట్టేవారు. చిన్నప్పట్నుంచి అటల్జీకి స్వీట్లు అంటే ప్రాణం. గ్వాలియర్ ఎప్పుడు వచ్చినా తనకిష్టమైన మిఠాయి దుకాణానికి వెళ్లి లడ్డూలు, గులాబ్‌జాములు లాగించేవారు. తాను పుట్టిన గడ్డ, చిన్నతనంలో గడిపిన పరిసరాలు, చదువుకున్న స్కూలు, నోరూరించే మిఠాయిలుండే దుకాణాలు ఇవంటే వాజపేయికి ఎంతో మమకారం. ఆ అనుబంధంతోనే 1984 లోక్‌సభ ఎన్నికల్లో గ్వాలియర్ నుంచి పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి మాధవ్ రావు సింధియా చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. సొంత గడ్డ తనని ఓడించడాన్ని తట్టుకోలేకపోయారు. అందుకే మరోసారి గ్వాలియర్ నుంచి పోటీ చేయడానికి ఆయన సాహసించలేదు. కానీ తరచూ గ్వాలియర్ వెళ్లి వస్తూ ఉండేవారు. 2006లో చివరిసారిగా వాజపేయి గ్వాలియర్‌కు వెళ్లారు. అనారోగ్యం కబళించడంతో ఆయన ఆ తర్వాత వెళ్లలేకపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినా, చివరి రోజుల్లో వెళ్లలేకపోయినా గ్వాలియర్‌తో అటల్జీకున్న అనుబంధం మరువలేనిది. ఉత్తమ గేయ రచయిత వాజ్‌పేయి వాజ్‌పేయి కవిత్వం కొత్త చిగుళ్లు తొడుక్కున్న ఆమనిలా ఆహ్లాదాన్ని పంచుతుంది. సహజంగానే సున్నిత మనస్కుడు, ప్రేమమూర్తి , భావకుడు అయిన వాజ్‌పేయి కలం నుంచి మరువలేని, మరపురాని అద్భుతమైన కవితలెన్నో జాలువారాయి. అలాంటి కవిత్వానికి ఒక సినిమా అవార్డు వస్తుందని ఎవరైనా ఊహించగలరా ? అసలు వాజపేయి కూడా అనుకోలేదు తన కవిత్వానికి ఒక అవార్డు వస్తుందని.. స్క్రీన్ అవార్డుల కమిటీ మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ వాజపేయిని ఉత్తమ గేయ రచయితగా ఎంపిక చేశారు. వాజ్‌పేయి కవితల్లో ఆణిముత్యాల్లాంటివి కొన్నింటిని ఏరి గజల్మాస్ట్రో జగిత్ సింగ్ ఆలపించారు. అవన్నీ నవి దిశ పేరుతో 1999లో ఆల్బమ్‌గా వచ్చాయి. ఈ ఆల్బమ్‌కు 2000 సంవత్సరంలో నాన్ ఫిల్మ్ కేటగిరీలో ఉత్తమ గేయ రచయితగా వాజపేయి అవార్డు దక్కించుకున్నారు. అయితే అప్పుడు వాజ్‌పేయి ప్ర«ధానమంత్రిగా ఊపిరి సలపని పనుల్లో ఉండడంతో అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి అవార్డుని అందజేశారు. -
వైఎస్సార్సీపీ ఎంపీల సంతాపం
తాను నమ్మిన సిద్ధాంతాలను మానవతా ధృక్పథంతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమర్థవంతంగా అమలు చేసి సుపరిపాలన అందించిన ఒక పాలనాధక్షుడిగా వాజ్‌పేయి చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటారు. 10 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు పనిచేసి దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు వాజ్‌పేయి. ఆయన మరణంతో దేశం ఒక మహోన్నత నాయకుడిని కోల్పోయింది. – వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాదరావు -
స్నేహం కోసం ఎంతో శ్రమించారు
ఇస్లామాబాద్/వాషింగ్టన్/మాస్కో: భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిపట్ల అమెరికా, రష్యా, చైనా, పాకిస్తాన్ సహా పలు ప్రపంచ దేశాలు సంతాపం వ్యక్తం చేశాయి. విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా విదేశాలతో భారత స్నేహపూర్వక సంబంధాల కోసం వాజ్‌పేయి ఎంతో శ్రమించారని ఆయా దేశాలు గుర్తుచేసుకున్నాయి. భారత్–పాక్ల్లో శాంతిస్థాపన కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని పాక్‌కు కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలోనే భారత్–పాక్ సంబంధాల్లో మంచి పురోగతి కనిపించదని గుర్తుచేసుకున్నారు. -
వాజ్‌పేయి మరణాన్ని ధ్రువీకరిస్తూ గెజిట్ నోటిఫికేషన్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణాన్ని ధ్రువీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ ఈ నోటిఫికేషన్‌ను ఇంగ్లిష్, హిందీ భాషల్లో జారీ చేశారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో 2018 ఆగస్టు 16న సాయంత్రం 5.05 గంటలకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణించారని నోటిఫికేషన్లో పేర్కొంది. ఏడు రోజుల సంతాప దినాల్లో భాగంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని తెలిపింది. మాజీ ప్రధాని మరణిస్తే వారి మరణాన్ని ధ్రువీకరిస్తూ నిబంధనల ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం ఆనవాయితీగా వస్తోందని కేంద్ర హోం శాఖ అధికారులు తెలిపారు. -
ఆ పలకరింపు మరువలేం...
లక్నో : లోక్‌సభ సభ్యుడిగా తాను ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన లక్నో అంటే మాజీ ప్రధాని వాజ్‌పేయికి ప్రత్యేక అనుబంధముంది. లక్నోకే ప్రతిష్టాత్మకంగా మారిన 24 కి.మీ ఔటర్‌రింగ్‌రోడ్డు లాంటి ’పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ హై’ను అక్కడివారు గుర్తుచేసుకుంటున్నారు. అమరుల మార్గం (షహీద్ పథ్) పేరుతో నిర్మించిన ఈ రోడ్డు ఇప్పుడు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. ’షహీద్ పథ్ అనేది లక్నోకు వాజ్‌పేయికి ప్రత్యక్షంగా ఇచ్చిన పెద్ద బహుమతి. దేశవ్యాప్తంగానూ స్వర్ణ చతుర్భుజిని నిర్మించింది ఆయనే. అంతకుముందు లక్నోలో ఒకసారి, ఢిల్లీలో మరోసారి తాను వాజ్‌పేయిని కలుసుకోవడం మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని రతన్‌కుమార్ అనే వ్యాపారవేత్త చెప్పారు. ఎప్పుడు కలిసినా ఆత్మీయంగా పలకరించడంతో పాటు, ఏ సమస్య మీద అయినా ఆయనను సులభంగా కలుసుకునేందుకు వీలుండేదని ఆ నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ’పార్టీ అవసరాలు, ఫ్రస్తావన పక్కన పెడితే వాజ్‌పేయికి ఎవరితోనూ వ్యక్తిగత శతృత్వం లేదు. ఈ రోడ్డుపై ఏ మతానికి చెందిన వారైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడగలరేమో చూపించండి ’ అని అక్కడి దుకాణదారు తేజ్‌బహదూర్ వ్యాఖ్యానించాడు.’ మోదీ ప్రభుత్వం కూడా వాజ్‌పేయి ప్రభుత్వ పాలన నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రస్తుత బీజేపీకి, వాజ్‌పేయి కాలం నాటి బీజేపీకి ఎంతో వ్యత్యాసముంది’ అన్నది పాత సామాన్ల కొనుగోలు వ్యాపారి షంషేర్ అలీ అభిప్రాయం. రాజకీయ ప్రత్యర్థులు వచ్చేవాళ్లు... చిన్న పిల్లాడిగా తన తండ్రి ద్విచక్రవాహనం లూనాపై లక్నోలో జరిగిన వాజ్‌పేయి ర్యాలీకి హాజరైన అనుభవాన్ని యూపీ డిప్యూటీ సీఎం దినేశ్‌శర్మ గుర్తుచేసుకున్నారు. ’చలికాలం రాత్రి 11.30 గంటలకు వాజ్‌పేయి ప్రసంగం మొదలుకాగా, దుప్పటిలో ముఖాన్ని పూర్తిగా కప్పుకున్న ఓ వ్యక్తిని మా నాన్న గుర్తుపట్టి దానిని లాగేశారు. సిద్ధాంతాల రీత్యా జనసంఘ్‌ను వ్యతిరేకించే ఆ వ్యక్తి పేరున్న కమ్యూనిస్టు నేత, పైగా ముస్లిం. జనసంఘ్‌లో ఏమైనా చేరుతున్నారా అంటూ మా నాన్న అడిగిన ప్రశ్నకు అరే అటువైపు చూడండి ప్రముఖ సమాజ్‌వాది సిద్ధాంతకర్త కూడా వాజ్‌పేయి ప్రసంగం వినడానికి ముసుగు ధరించి వచ్చారు అంటూ అటువైపు చూపారు’ అని దినేశ్‌శర్మ తెలిపారు. సంఘ్ కార్యకలాపాలు, సిద్ధాంతాలు వ్యతిరేకించే ఇతర పార్టీల వారికి కూడా వాజ్‌పేయి ఎలా ఆమోదయోగ్యుడో తెలిపేందుకు ఈ ఉదంతం సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. -
ప్రముఖుల తుది మజిలీ ‘స్మృతి స్థల్’
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు దేశ రాజధాని ఢిల్లీలోని స్మృతి స్థల్లో జరిగాయి. యమునా నది తీరంలో పచ్చిక బయలుతో అలరారే సువిశాల ప్రాంగణం స్మృతి స్థల్. గాంధీ సమాధి(రాజ్‌ఘాట్)కి సమీపంలో శాంతివన్ (నెహ్రూ సమాధి), విజయ్ ఘాట్ (లాల్ బహదూర్ శాస్త్రి సమాధి)ల మధ్య ఈ స్మృతి వనం ఉంది. రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధాన మంత్రుల వంటి అత్యంత ప్రముఖుల అంత్యక్రియల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ స్మృతి స్థల్‌ను ఏర్పాటు చేసింది. గతంలో రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు మరణించినప్పుడు వారికోసం దేశ రాజధానిలో ప్రత్యేకంగా స్థలాల కేటాయింపులు జరిగాయి. రాజ్‌ఘాట్ సమీపంలో వారికి కూడా స్మారక స్థలాలను కేటాయించేవారు. శాంతివన్, శక్తి స్థల్, వీర్ భూమి, ఏక్తా స్థల్, సమతా స్థల్, కిసాన్ ఘాట్ వంటి పేర్లతో ఏర్పాటు చేసిన ఈ స్మారకాల కోసం రాజధానిలో అత్యంత విలువైన 245 ఎకరాలకు పైగా కేటాయించారు. ఇలా కేటాయిస్తూ పోతే రాజధానిలో భూమి కొరత వస్తుందన్న ఆందోళనతో 2000లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇకపై ప్రముఖులకు స్థలాలు కేటాయించకూడదని నిర్ణయించింది. 2013లో కేంద్ర మంత్రివర్గం స్మతి స్థల్ నిర్మాణానికి ఆమోదం తెలపగా, 2015లో రాజ్‌ఘాట్ సమీపంలో నిర్మాణం పూర్తయింది. స్మతి స్థల్లో మొదటి సమాధి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది. 2015లో ఎన్డీయే ప్రభుత్వం ఈ స్మృతి స్థల్లో ఆయన స్మారకాన్ని నిర్మించింది. అయితే ఇందుకు ఆయన కుటుంబీకులు పదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. పీవీ నరసింహారావు ఢిల్లీలో మరణించారు. అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలు రాజధానిలో జరిపేందుకు అంగీకరించలేదు. దాంతో కుటుంబీకులు పీవీ అంత్యక్రియలను హైదరాబాద్‌లో నిర్వహించి స్మారకం ఏర్పాటు చేశారు. తమ తండ్రికి దేశ రాజధానిలో స్మారకం ఏర్పాటు చేయాలని పీవీ కుటుంబీకులు కోరడంతో 2015లో ఎన్డీయే ప్రభుత్వం పీవీకి స్మృతి స్థల్లో స్మారకం ఏర్పాటు చేసింది. మరో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు 2012 డిసెంబర్లో స్మృతి స్థల్లో అంత్య క్రియలు నిర్వహించారు. కొందరు మాజీ ప్రధానుల స్మారక స్థలాలు– వాటి పేర్లు–కేటాయించిన స్థలం మహాత్మా గాంధీ రాజ్‌ఘాట్ 44.35 ఎకరాలు జవహర్లాల్ నెహ్రూ శాంతి వన్, న్యూఢిల్లీ 52.6 ఎకరాలు లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్, న్యూఢిల్లీ 40 ఎకరాలు ఇందిరా గాంధీ శక్తి స్థల్,న్యూఢిల్లీ 45 ఎకరాలు రాజీవ్ గాంధీ వీర్ భూమి, న్యూఢిల్లీ 15 ఎకరాలు చరణ్ సింగ్ కిసాన్ భూమి 19 ఎకరాలు జైల్ సింగ్ ఏక్తా స్థల్ 22.56 ఎకరాలు చంద్ర శేఖర్ ఏక్తా స్థల్, న్యూఢిల్లీ ఈ స్థలం ఇప్పుడు స్మృతి స్థల్లో కలిసింది ఐకే గుజ్రాల్ ఏక్తా స్థల్,న్యూఢిల్లీ ఈ స్థలం ఇప్పుడు స్మృతి స్థల్లో కలిసింది వీపీ సింగ్ దియా గ్రామం, రామ్‌ఘడ్, అలహాబాద్ మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్, గుజరాత్ -
మదురై మహిళకు పాదాభివందనం
మదురై జిల్లా పుల్లచ్చేరి గ్రామానికి చెందిన చిన్నపిళ్లై అనే మహిళకు 2001లో వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా పాదాభివందనం చేశారు. కళంజియం అనే పేరుతో చిన్నపిళ్లై ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రజల్లో పొదుపు చేసే అలవాటును బాగా ప్రోత్సహించారు. ఆమె సమాజ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ‘శ్రీ స్త్రీశక్తి’పురస్కారాన్ని అందజేసింది. నాడు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి చిన్నపిళ్లైకి అవార్డు బహూకరిస్తూ ఆమె పాదాలకు నమస్కారం చేశారు. దీంతో ఆమె పేరు దేశమంతా మార్మోగిపోయింది. వాజ్‌పేయి కన్నుమూశారన్న వార్త విని చిన్నపిళ్లై కన్నీరు పెట్టుకున్నారు. -
ఏ బంధమో...
ఏ బంధం లేకున్నా ... బలమైన అనుబంధమేదో కలిపింది వీరందరినీ. వాజ్‌పేయితో వ్యక్తిగత అనుబంధం లేకపోవచ్చు. ఆయన్నసలు చూసి కూడా ఉండకపోవచ్చు. కానీ ఆయన చేసిన పనులేవో వారిని తట్టిలేపాయి. ఆయన మాటలేవో వారి మదిని కదిలించాయి. అందుకే జనం తరలి వచ్చారు. కడసారి ఆ మహానేతను చూసిపోదామని వచ్చిన బహుదూరపు బాటసారులెందరో వాజ్‌పేయి ఇంటిముందు బారులు తీరారు. ఎక్కడ నుంచో తరలి వచ్చిన పీహెచ్డీ విద్యార్థి ఒకరు.. రాష్ట్రీయ స్మృతి స్థల్లో పనిచేసే రోడ్డు నిర్మాణ కార్మికుడొకరు.. బీహార్ నుంచి వచ్చిన ఓ సివిల్ సర్వీసెస్ విద్యార్థి, ఒక న్యాయవాది..ఉత్తరప్రదేశ్‌నుంచి వచ్చిన వలస కార్మికుడొకరు. వాజ్‌పేయి ఎదిగివచ్చిన సమాజం ఒకవైపూ, వాజ్‌పేయి స్ఫూర్తినొందిన సిద్ధాంతాన్ని విశ్వసించిన ప్రజలు మరోవైపూ, ఏ సంబంధమూ లేని వీరందరినీ 6–ఎ క్రిష్ణ మీనన్ మార్గ్..దగ్గరికి చేర్చేందుకు కారణమయ్యారు అటల్ బిహారి వాజ్‌పేయి. ఒకరికొకరు సంబంధంలేని వేనవేల ప్రజానీకం ఆఖరి చూపుకోసం, తన ప్రియతమ నేత మహాభినిష్క్రమణం వేళ అశ్రునివాళులర్పించేందుకు శుక్రవారం వరకు అక్కడే వేచి ఉన్నారు. ఆఖరిచూపు కోసం సైనిక పటాలాలు, సెక్యూరిటీ సిబ్బంది, వ్యక్తిగత రక్షక సిబ్బంది, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ మధ్య 6–ఎ, క్రిష్ణ మీనన్ మార్గ్ వద్ద జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ నుంచి వచ్చిన 52 ఏళ్ళ యోగేశ్ కుమార్, ఆయనతో సహా అనేక మంది 500 కిలోమీటర్ల సుదూర తీరాలనుంచి ప్రయాణించి వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు తెల్లవారేసరికి వాజ్‌పేయి ఇంటి వద్దకు చేరుకున్నారు. గంగాజలం తెచ్చాను.. ‘‘1984లో వాజ్‌పేయి ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వెళుతుండగా మార్గం మధ్యలో మొదటిసారి వాజ్‌పేయిని కలిసాను. మళ్లీ రెండేళ్ల తరువాత 1986లో ఉత్తరకాశీలో రెండోసారి వాజ్‌పేయిని చూశానంటూ వాజ్‌పేయితో దిగిన ఫొటోని చూపిస్తూ కనిపించారు యోగేష్ కుమార్. తనతో పాటు గంగోత్రి నుంచి గంగాజలాన్ని తెచ్చాననీ, ఒక్కసారి వాజ్‌పేయి పార్థివ దేహాన్ని చూసే అవకాశం వస్తే చాలన్నారు. అందరూ ఆయన ఆరాధికులే ‘‘హిందువా, ముస్లిమా అన్నది చర్చనీయాంశం కాదు. ఏ మతానికి చెందిన వారైనా అందరికీ ఆయనపై విశ్వాసం ఉంది. ఆయన జాతిజనులకోసం పరిశ్రమించారు’’అని బిహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి వచ్చిన 49 ఏళ్ళ న్యాయవాది సుధీర్‌కుమార్ ఝా పేర్కొన్నారు. వార్తల్లో చూసి... ‘‘వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉందన్న వార్త విని నా స్నేహితుడూ, నేనూ కడసారి ఆయన చూడాలని పట్నా నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చాము’’అని ఆశీష్ ఉపాధ్యాయ అనే ఇంజనీర్ తెలిపారు. జామియా మిలియా ఇస్లామియాలో పీహెచ్డీ చదువుతున్న దీన్‌నాథ్ గుప్తా అనే విద్యార్థి తాను మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఉన్నాననీ, మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టు తెలిసి తన రీసెర్చ్పనిని విడిచి ఎయిమ్స్‌కి వచ్చినట్టు తెలిపారు. ఆయన కవిత్వమే నాకు స్ఫూర్తి వాజ్పేయే కవిత్వమే తనకు స్ఫూర్తి అని సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న రాహుల్ అహ్వద్ అంటారు. 2013, 2015లో రెండుసార్లు వాజ్‌పేయిని చూశానంటారు. అప్పుడు కూడా ఆయన ఆరోగ్యంగా లేరని, చివరిసారిగా ఆ మహానేతని ఒకసారి చూడాలని వచ్చినట్లు చెప్పారు. ‘‘వాజ్‌పేయి అన్ని పార్టీలతో సత్సంబంధాలు నెలకొల్పారు. అందరి మన్ననలూ అందుకున్నారు’’అన్నారు రాహుల్ అహ్వద్. ఓ మంచి మనిషి... ‘‘నేను స్కూల్లోనూ, కాలేజీలోనూ చదువుకునేటప్పుడు వాజ్‌పేయి గురించి తెలుసుకున్నానని, ఆయన్ని గురించి చదివానని చెప్పిన 19 ఏళ్ళ బిపిన్ కుమార్ ‘‘వాజ్‌పేయి ఓ మంచి మనిషి’’అంటారు. అసంఘటిత రంగ కార్మికుడి నుంచి సంఘటిత ఆర్ఎస్ఎస్ వాలంటీర్ల వరకూ అందరూ తమ అధినేతకు అశ్రునివాళులు అర్పించామన్న సంతృప్తితో వెనుదిరిగారు. వాజ్‌పేయి మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. వాజ్‌పేయితో కలసి పనిచేయడం మరిచిపోలేని అనుభవం. దేశ ప్రజలంతా అమితంగా ఆరాధించే మాజీ ప్రధాని, విభిన్న జాతీయ నేత, ఆధునిక భారత రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయి. స్వాతంత్య్ర సమరయోధుడిగా, రచయితగా, కవిగా, ఎంపీగా, పరిపాలకుడిగా, చివరకు ప్రధానిగా ప్రజా జీవితంలో ఆయన ఎన్నో పాత్రలు పోషించారు. ఆయన మరణం దేశానికే కాదు ప్రపంచమంతటికీ లోటు – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాజ్‌పేయి అస్తమయంతో ఒక శకం ముగిసిందని అందరూ అంటున్నారు. అయితే నేను మాత్రం భావించడం లేదు. ఆయనతో పాటు మరికొందరు వేసిన పునాదిపై నిర్మితమైన ఆ శకం కొనసాగింపుగా నేను భావిస్తున్నాను. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మొదటి కొన్ని దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యమే కొనసాగింది. దానికి ముగింపు పలుకుతూ వాజ్‌పేయి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపారు. అడ్వాణీతో కలిసి కేంద్ర, రాష్ట్రాల్లో రెండో తరం నేతల్ని తయారు చేసిన ఘనత వాజ్‌పేయిదే. – కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ వాజ్‌పేయి మరణంతో దేశం ఒక మహాపురుషుడిని కోల్పోయింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా దేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. మానవత్వానికి ప్రతీక అటల్ జీ. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నా. – గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దేశాభివృద్ధికి, జాతీయ సమస్యల పరిష్కారానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చూపిన బాట నేటికికూడా అనుసరణీయమే. 1975లో నేను కరీంనగర్ జన్‌సంఘ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాజ్‌పేయితో ఏర్పడిన బంధం ఆయన మంత్రివర్గంలో చోటు దక్కేస్థాయికి చేరింది. నా కూతురి వివాహానికి హాజరై ఆశీర్వదించారు. మనం స్నేహితులను మార్చుకోవచ్చుకానీ పక్కింటివారిని మార్చుకోలేమని అనేవారు. ఆ దృక్పథంతోనే పాక్ విషయంలో ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. – మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు దేశంలో మలిదశ సంస్కరణలకు ఆద్యుడు వాజ్‌పేయి. టెలికమ్యూనికేషన్స్ రంగంలో, జాతీయ రహదారులు, హరిత విమానాశ్రయాలు, సూక్ష్మ నీటిపారుదల రంగాల్లో వాజ్‌పేయి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎంతో హుం దాగా నడుపుతూ మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయనకు ఆయనే సాటి. ఆయన వ్యక్తిత్వం, విలువలు ఎవరికీ లేవు. – ఏపీ సీఎం చంద్రబాబు అజాత శత్రువు అయిన వాజ్‌పేయి మరణం దేశానికి తీరని లోటు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎంతో సమర్థవంతంగా వాజ్‌పేయి నడపగలిగారు. ఎవరినీ శత్రువులా చూడకుండా అన్ని పార్టీల అభిమానాన్ని ఆయన సంపాదించగలిగారు. – టీఆర్ఎస్ ఎంపీలు కేకే, జితేందర్‌రెడ్డి రాజకీయ విలువలను కాపాడుతూ వాజ్‌పేయి తీసుకున్న నిర్ణయాలు నేటి తరానికి ఆదర్శం. వాజ్‌పేయి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. – దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ -
భారతీయుల గుండెల్లో ఉంటారు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రధాని నరేంద్ర మోదీ కన్నీటి వీడ్కోలు తెలిపారు. వాజ్‌పేయి వంటి అసాధారణ వ్యక్తి ప్రతి భారతీయుడి గుండెల్లో చిరకాలం నిలిచే ఉంటారని ఆయన పేర్కొన్నారు. ‘దేశాన్ని మహోన్నతంగా మార్చడంలో జీవితాన్నే త్యాగం చేసిన వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు సరైన పదాలే లేవు. నేడు దేశం నలుమూలల నుంచి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ అరుదైన వ్యక్తికి నివాళులర్పించేందుకు ఢిల్లీ వచ్చారు. అటల్ జీ దేశం మీకు సెల్యూట్ చేస్తోంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఉదయం తన బ్లాగ్‌లోనూ ‘స్ఫూర్తి, సుహృద్భావం, అద్భుతమైన వాక్చాతుర్యం కలబోసిన మహనీయుడిని దేశం నేతగా ఎంచుకుంది. దేశం సమస్యల్లో ఉన్నప్పుడు నీతిమంతమైన, స్ఫూర్తిదాయకమైన దీర్ఘదృష్టి గల నేతగా ప్రజలకు సరైన మార్గదర్శనం చేశారు’ అని పేర్కొన్నారు. 1990వ దశకంలో దేశంలో, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక దుర్భర పరిస్థితులున్న సమయంలోనూ.. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడుకొచ్చిన గొప్ప వ్యక్తి, రెండు దశాబ్దాలుగా మనం అనుభవిస్తున్న ఆర్థిక ఫలాలకు ఆయన వేసిన బీజాలే కారణం. వాజ్‌పేయి దృష్టిలో అభివృద్ధి అంటే పేద, బడుగు, బలహీన వర్గాలకు సాధికారత దక్కడమే. ఆయన ఆలోచనలతోనే మా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించుకుని ముందు కెళ్తోంది’ అని పేర్కొన్నారు. భారతదేశాన్ని అణుశక్తిగా మార్చేందుకు ఎవరినీ లెక్కచేయని ధైర్యవంతుడని కొనియాడారు. ‘వ్యక్తిగతంగా ఆయన నా ఆదర్శం, నా గురువు, నాలో స్ఫూర్తి రగిలించిన అసాధారణ మహనీయుడు. 2001 అక్టోబర్‌లో ఓ రోజు నన్ను పిలిచి.. గుజరాత్ ముఖ్యమంత్రిగా వెళ్లమన్నారు. వ్యవస్థ పరంగా పనిచేశానని.. పరిపాలనలో అనుభవం లేదని చెప్పాను. అయినా నాలో ధైర్యాన్ని నింపి ప్రజల ఆకాంక్షలను పూర్తిచేయాలని చెప్పి పంపించారు. నాపై ఆ నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞుడిని. అందుకే ఆయన చూపిన బాటలో.. ఆయన నేర్పిన విధానాలతోనే మేం ప్రపంచంతో పోటీపడగలుగు తున్నాం’ అని పేర్కొన్నారు. ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని పరిపాలనలో (గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు) ఆయన ఇచ్చిన సూచనలను మోదీ గుర్తుచేసుకున్నారు. సిమ్లాలో జాతీయ జెండా అవనతం... వాజ్‌పేయికి నివాళులర్పిస్తున్న అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, పాక్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక తదితర దేశాల ప్రతినిధులు, సుష్మాస్వరాజ్, భూటాన్ రాజు జిగ్మే -
అంతిమయాత్రలో..
పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి అంత్యక్రియలు జరిగిన స్మృతి స్థల్ వరకు ఏడు కిలోమీటర్ల పాటు అంతిమయాత్ర కొనసాగింది. రోడ్డుపొడవునా కార్యకర్తలు, అభిమానులు తమ అభిమాన నేతకు పుష్పాంజలి ఘటించారు. పార్టీ కార్యాలయం నుంచి జరిగే చివరి యాత్రలో తాను నడుస్తానని మోదీ ముందే తెలిపారు. ఉగ్రవాదుల ముప్పు ఉన్నప్పటికీ.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి అమిత్ షాతోపాటుగా నడిచారు. దీంతో పార్ధివదేహం వెనక ఎన్ఎస్జీ కమాండోలు, ఢిల్లీ పోలీసులతో ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటుచేశారు. మోదీ, షాలతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు శివ్‌రాజ్ సింగ్, యోగి, ఫడ్నవిస్‌లు కూడా నడిచే వచ్చారు. రోడ్డుపై భారీ సంఖ్యలో జనం వాజ్‌పేయి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పార్థివదేహాన్ని తీసుకెళ్తున్న వాహనంపై పూలు చల్లుతూ భారతరత్నంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. యువకులు, చిన్నా పెద్దా, ఆడామగా తేడా లేకుండా అశేష అభిమానులు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. వాజ్‌పేయిని చివరిసారి చూసేందుకు అవకాశం దొరకని కొందరైతే.. రోడ్డుపక్కనున్న చెట్లు కూడా ఎక్కేశారు. చాలా మంది ఉబికివస్తున్న కన్నీరును ఆపుకుంటూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో రోడ్లు మార్మోగాయి. -
ప్రియతమ నేత
ఒక మంచి మనిషి, గొప్ప కవి, మహానేత, దార్శనికుడు, హృదయవాది, భరతమాత ముద్దుబిడ్డ శాశ్వతంగా కన్ను మూశారు. అటల్ బిహారీ వాజ్ పేయి మహా శూన్యాన్ని సృష్టించి వెళ్లిపోయారు. దాదాపు దశాబ్దంగా ఈ కర్మ యోగి యోగనిద్రలో ఉన్నట్టుగా ఉన్నారు. ప్రజాజీవితానికి దూరంగా ఉన్నా.. ప్రభుత్వాలు, ప్రజలు ఆయన్ని తలుచుకోని క్షణం లేదు. విలక్షణమైన వ్యక్తిత్వం. అనుకరణీయుడేగానీ అనుసరణకు అసాధ్యుడు. ‘‘మీరు ప్రధాని అయ్యారు. రేపట్నించి జన సామాన్యంలోకి వెళ్లలేరు. బోలెడు సెక్యూరిటీ కంచెలుంటాయ్’’ అని ఒక పాత్రి కేయుడు వ్యాఖ్యానించినప్పుడు, అటల్జీ దుఃఖిస్తూ కంటనీరు పెట్టారు. ‘‘నాకు శిఖరంలా ఎదగాలని లేదు, నలుగురిలో నలుగురితో ఉండాలని ఉంది. కొండ శిఖ రాల మీద రాళ్లు రప్పలు తప్ప పచ్చదనం ఉండదు. చెమ్మ అసలే ఉండద’’ని కవితామయంగా అన్నారు. సభల్లో, సమావేశాల్లో వాజ్‌పేయి నోరు విప్పితే అమృతం కురిసేది. వేద రుక్కులు, ఉపనిషత్ వాక్యాలు సందర్భోచితంగా వచ్చి వర్షించేవి. ఇంగ్లిష్, హిందీ, సంస్కృత మాధ్యమాలలో డిగ్రీ తీసు కున్నారు. రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. తర్వాత ఆ శాస్త్రానికి ఆయనే పాఠ్యగ్రంథంలో నిలిచారు. కవితలు ఆశువుగా భావోద్వేగంతో చెప్పడం తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్నానని చెప్పుకు న్నారు. కబీర్ రామచరితమానస్, మహాదేవి వర్మ ‘గీత’ తనకి గొప్ప ప్రేరణనిచ్చాయనేవారు. అటల్‌జీపై అవిశ్వాసం పెట్టినప్పుడు, పదవి నుంచి దిగిపోతూ ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగం, ప్రపంచంలోనే అతి గొప్ప విశ్లేషణాత్మక సందేశంగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న విశ్వాసానికి కూడా ఆ సన్నివేశం నిదర్శనం. వాజ్‌పేయి మేథలో సరస్వతీ, హృదయంలో సిద్ధార్థుడు కొలువుతీరి ఉన్నారని పెద్దలు అంటారు. ఆయన ప్రసంగాలు శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసేవి. అటల్జీ ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’ గురించి చెప్పాలంటే వెయ్యి సందర్భాలు ఉటంకించాలి. ఆయన పరిపాలనా దక్షతకి, వాజ్‌పేయి హయాంలో దృష్టిపెట్టిన రోడ్లు, కరెంటు, నీళ్లు ఈ మూడు మౌలిక అంశాలను చెబుతారు. పోఖ్రాన్ అణుపరీక్షని గుర్తు చేసుకుంటారు. కార్గిల్ యుద్ధం మన సేనల్లో ఆత్మ స్థయిర్యం పెంచింది. ప్రైవేటైజేషన్‌లో ఆయన వేయించిన ముందడుగులు దేశ ఆర్థిక స్థితిని మార్చాయి. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చిత్రకారుడు బాపు రచించిన రామాయణ వర్ణచిత్రాలు వాజ్‌పేయి ఆవిష్కరించారు. ‘‘రాముడు మనుషుల్లో దేవుడు. ఆదర్శప్రాయుడు. అందుకే ఆయనకు గుళ్లు కడతాం. ఆయన సన్మార్గానికి, ఆయన ఆదర్శాలకు చిహ్నంగా కడతాం. యుగాలుగా స్ఫూర్తి పొందుతున్నాం. రాముడు దేవుడు కాదు కాబట్టి నాస్తికులు కూడా దణ్ణం పెట్టుకోవచ్చు. తప్పులేదు’’ అని సభలో నవ్వులు పూయించారు. ‘అజాత శత్రువు’ అనే మాట ద్వాపరయుగంలో ధర్మరాజుకి చెల్లిపోయింది. మళ్లీ కలియుగంలో అటల్ బిహారీ వాజ్‌పేయికి చెల్లింది. అందరూ ఆమోదించారు. వాజ్‌పేయికి ప్రాంతం వర్తించదు. పూర్తిగా దేశవాసి. కనుకనే అన్ని ప్రాంతాలనించి గెలిచి సభకి వచ్చారు. ఏ పార్టీకి చెందిన వారైనా ఆయనకు మిత్రులంటే మిత్రులే! అటల్జీ ఇంట్లో పీవీ ఫొటో ప్రముఖంగా ఉండటం చూసి, ఇదేమిటని అడిగారట ఒకాయన. రాజకీయ లబ్ధి కోసం మిత్రులను వదులుకోలేను అని జవాబు ఇచ్చారట. ‘‘ఒక పల్లెటూరి బడిపంతులు కొడుకునైన నా వంటి సాధారణ పౌరుడికి ప్రధాన పదవి కట్ట బెట్టారు. మన ప్రజాస్వామ్య శక్తికిది నిదర్శనం. ఈ దేశంలో వంశపాలనకు కాలం చెల్లింది’’ అంటూ హెచ్చరించారు. దీని వెనుక ఒకే ఒక్క ఓటు బలంతో ఆయనను గద్దె దింపిన సంఘటన తాలూకు ఉద్వేగం ఉంది. రోషం ఉంది. ‘‘నా విధి నిర్వహణలో విజయం వరించినా, అపజయం ఎదురైనా జంకను. రెంటినీ స్వీకరిస్తా. ఎందుకంటే రెండూ నిజమే కాబట్టి’’ ఇదీ అటల్జీ మనోభావం. భారతీయత ఆయన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. హిమాలయాల్లోని కులుమనాలి ప్రాంతం అంటే ఆయ నకు ఇష్టం. విశ్రాంతికి వెళ్లాలంటే మనాలిని కోరుకునే వారు. నాట్యం, సంగీతంపట్ల అభిరుచి ఆసక్తి ఉన్నవారు. మంచి భోజనప్రియులు. తెలుగువాళ్లం గర్వంగా చెప్పుకో తగింది– వాజ్‌పేయికి మన పుల్లారెడ్డి మిఠాయిలంటే పరమ ఇష్టం. తెలుగువారితో ఆయనిది తీయని అను బంధం. తరచూ ఆయన కవితా రచనలలో మృత్యువుతో పరిహాసమాడేవారు. సవాళ్లు విసిరేవారు. ఆ మహా మనీ షిని ఏ మృత్యువూ తీసికెళ్లలేదు. కోట్లాదిమంది హృద యాలలో అటల్జీ నిలిచే ఉంటారు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
శాంతి సాధన ఓ ముళ్లబాట...!
పాకిస్తాన్ నూతన ప్రధానికి అనేక గుణపాఠాలు ఉన్నాయి. మొదటగా, భారత్‌తో శాంతి ప్రక్రియకు ప్రయత్నించడం ప్రమాదకరమైన ఆలోచన. సైనికాధికారుల తలపై కూర్చుని అలా చేయడం ఆత్మహత్యా సదృశం అవుతుంది. రెండోది. ఎన్నికైన ఏ ప్రధానమంత్రినీ పాక్ సైనిక వ్యవస్థ పూర్తి కాలం పదవిలో కొనసాగడానికి అనుమతించ లేదు. ఇక మూడోది, ఎన్నికైన ప్రతి ప్రధాని ప్రవాసం పాలయ్యారు, జైలుపాలయ్యారు, హత్యకు గురయ్యారు. పాక్‌లో ప్రజాస్వామ్యానికి ఊపిరిపోయడానికి సంకల్పిం చిన ప్రతి ప్రయత్నమూ బెడిసికొట్టింది. ఇవన్నీ దాటుకుని ఇమ్రాన్ శాంతిసాధనకు ప్రయత్నించాడంటే, పాక్ సైన్యం చెప్పి ఉంటుంది కాబట్టి దానికి పూనుకుంటాడు. భారత్, పాక్ మధ్య శాంతి స్థాపనకు అత్యంత సాహసోపేత, నాటకీయ ప్రయత్నం గురించి తెలియని విషయాలు వెల్లడించ డానికి పాకిస్థాన్ 30వ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణం చేస్తున్న రోజే తగిన రోజని భావిస్తున్నా. ఈ ప్రయత్నం చేసిన ఇద్దరు ఎన్నికైన నేతల్లో ఒకరు గురువారం కన్నుమూయగా, రెండో నాయకుడు క్రూరమైన రావల్పిండి జైల్లో మగ్గుతున్నారు. దీనిలో ఈ వ్యాస రచయితకు కూడా చిన్న పాత్ర ఉంది. మియా నవాజ్ షరీఫ్ 1997లో రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. కొన్నాళ్లకే అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇండియాలో అధి కారంలోకి వచ్చింది. అప్పటికి కొంత కాలంగా భారత–పాక్ సంబంధాలు మందగించిన స్థితిలో ఉన్నాయి. వాజ్‌పేయి సర్కారు పోఖ్రాన్–2 పేరుతో అణుపరీక్ష జరపడంతో ఇవి మరింత క్షీణించాయి. పాకిస్తాన్ చాగైలో అణుపరీక్షతో పదునైన జవాబి చ్చింది. 1998 చివరి మాసాల నాటికి రెండు వైపులా ఓర్పు నశించిన సూచనలు కనిపించాయి. ఇద్దరు కొత్త నేతలూ రెండు దేశాల సంబంధాలు మెరుగుప డాలని కోరుకున్నాగాని, పరస్పర అవిశ్వాసం అందుకు అడ్డు నిలిచింది. ఢిల్లీ–లాహోర్ బస్సు సర్వీసు ప్రారంభించాలన్న ఆలోచన కూడా ఉభయ దేశాల ఉన్నతాధికారుల వల్ల ముందుకు సాగలేదు. ఈ దశలో చలికాలం ఆరంభంలో పాకిస్థాన్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి నుంచి అని రాసి ఉన్న ఈ లేఖ కవరుపై ఉన్న పోస్టల్ ముద్రలను బట్టి చూస్తే ఇది ఢిల్లీ చేరడానికి చాలా వారాలు పట్టిందని అర్థమైంది. మధ్యలో ఈ లేఖ ఎన్వలప్‌ను రెండు దేశాలకు చెందిన వివిధ శాఖలు తెరచి, చదవి మళ్లీ మళ్లీ సీలు చేశాయి. ఎందుకంటే, పాక్ ప్రధాని సాధారణ పోస్టులో గతంలో ఉత్తరం పంపలేదు. కొన్ని నెలల క్రితం ఇంటర్వ్యూ కోసం నేను రాసిన లేఖకు జవాబుగా ఆలస్యంగా పంపినా ఆత్మీయంగా పంపిన స్పందన ఇది. నేను ఇస్లామా బాద్‌లోని పాక్ ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి విషయం చెప్పాను. నవాజ్ షరీఫ్ నాకు ఫోన్ చేసి, ఇంటర్వ్యూ చేయడానికి పాకిస్థాన్ ఎందుకు రాకూడదని నన్ను అడిగారు. కొద్దిసేపు నేను మాట్లాడాక, ‘‘ఇద్దరు ప్రధానులూ సంబంధాలు ముందుకు సాగ డానికి ఏమీ చేయలేకపోతున్నప్పుడు ఇంటర్వ్యూల వల్ల ప్రయోజనం ఏముంటుంది? పెద్ద ఒప్పందాల సంగతి వదిలేయండి. కనీసం బస్సు సర్వీసు కూడా మొదలు కాలేదు’’ అన్నాను. దీనికి షరీఫ్ దౌత్య వేత్తలు మాట్లాడే రీతిలో కొన్ని కారణాలు చెప్పారు. నేను సరదాగా పంజాబీలోనే మాట్లాడుతూ ‘‘ నాకు మీరిచ్చే ఇంటర్వ్యూలోనే బస్సు సర్వీసు ప్రారంభించే విషయం ప్రకటించడంతోపాటు, మొదటి బస్సులో రావాలని మా ప్రధానిని ఎందుకు ఆహ్వానించకూడదు?’’ అని ప్రశ్నించాను. నా సలహాను నవాజ్ షరీఫ్ సీరియస్‌గా తీసుకుని ఆలోచించారు. నా ఐడియా ఆయనకు నచ్చింది. అయితే, తాను ఆహ్వానించాక భారత ప్రధాని అందుకు నిరాకరిస్తే ఏం చేయాలి? అనే అనుమానం ఆయనను పీడించింది. అదే జరిగితే బావుండదు కదా. నేను విషయం కనుక్కుని చెబుతానని ఆయనతో అన్నాను. వాజ్‌పేయికీ నచ్చిందీ ప్రతిపాదన! విషయం తెలియజేయగానే, ఈ ప్రతిపాదన వాజ్‌పేయికి కూడా నచ్చింది. అయితే, పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చాకే నేను ఆయనను కలవాలనీ, అప్పటిదాకా ఇది ప్రచురించవద్దని వాజ్‌పేయి చెప్పారు. లాహోర్‌లోని సొంత ఇంట్లో నవాజ్ షరీ ఫ్ను ఇంటర్వ్యూ చేశాను. మధ్యమధ్యలో భారత– పాక్ క్రికెట్ టెస్ట్ ప్రత్యక్ష ప్రసారంతో మా సంభాష ణకు బ్రేకులు పడ్డాయి. ఆయన తన మాట నిలబెట్టు కున్నారు. బస్సు సర్వీసుకు అంగీకారం తెలపడమే గాక, వాజ్‌పేయిని ఈ బస్సులో రావాలని ఆహ్వానిం చారు. చరిత్రలో నిలిచిపోయేలా తాను భారత ప్రధా నికి స్వాగతం పలుకుతానని షరీఫ్ తెలిపారు. షరీఫ్‌తో ఇంటర్వ్యూను ఒక రోజు ఆపాలనీ, తాను విమానంలో లక్నోలో దిగే రోజు అది ప్రచురితమయ్యేలా చాడాలని వాజ్‌పేయి నన్ను కోరారు. ఆనవాయితీగా భారత విదేశాంగశాఖ అనుమానాలు వ్యక్తం చేయక ముందే తాను ఆహ్వానం అంగీకరిస్తానని వాజ్‌పేయి చెప్పారు. ఆ తర్వాత జరిగిదంతా అందరికీ తెలిసిన చరిత్రే. అత్యంత నాటకీయ పరిణామాల తర్వాత అటల్ బస్సు యాత్ర జరిగింది. కొన్ని ఇబ్బందికర పరిణామాలు తలెత్తాయి. ముఖ్యంగా వాజ్ పేయికి స్వాగతం పలికే సమయంలో ఆయనకు శాల్యూట్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ అంగీకరించలేదు. బస్సు దిగాక వాజ్‌పేయి మీనారే పాకిస్తాన్ మెట్ల వరకూ వచ్చి, పాక్ సుస్థిరతతో సుసపన్నంగా ఉండడం భారతదేశా నికి మేలని ప్రకటించారు. నేను ఈ యాత్రలో భాగం కావడం నాకెంతో చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ఇది నాకు మొదటి ఏకైక అనుభవం. బస్సు యాత్ర విషయం నేను ఇంటర్వ్యూ ద్వారా ప్రకటించడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక్కడితో కథ ముగిసిపోలేదు. ఓ పక్క ఇద్దరు ప్రధానులూ తమకు పూర్తిగా అవగాహన లేని శాంతి చర్చలు జరుపు తుంటే, మరో పక్క పాకిస్తానీ ఆర్మీ కార్గిల్ ప్రాంతం లోని విశాల సరిహద్దు గుండా తన సైనికులు భారత భూభాగంలోకి చొరబడేలా చేసింది. మే నెల మధ్య నాటికి ఉభయ దేశాల దళాల మధ్య తొలి ఘర్షణలు జరిగాయి. మే 26న ఇండియా తన వైమానికి దళాన్ని రంగంలోకి దింపింది. మరుసటి రోజు రెండు భారత మిగ్ విమానాలను పాక్ సైనికులు భుజాలపై నుంచి ప్రయోగించే క్షిపణులతో కూల్చివేశారు. శత్రు శిబిరం వివరాలు తెలుసుకునే క్రమంలో నెమ్మదిగా పోతున్న మూడో యుద్ధవిమానం ఇంజన్లలో ఒకదానికి క్షిపణి దెబ్బతగిలింది. అయితే, అది అదృష్టవశాత్తూ కూలి పోకుండా తిరిగి తన స్థావరానికి సురక్షితంగా వచ్చే సింది. ఇలాంటి నాటకీయ మలుపునకు ఎవరూ సిద్ధంగా లేరు. ప్రధాని నుంచి నా హోటల్ రూముకు ఫోన్! ఉదయం ఆరున్నరకు ముంబైలో నేను బసచేస్తున్న హోటెల్ రూములో ఫోను మోగింది. ప్రధానమంత్రి నాతో మాట్లాడాలనుకుంటున్నారని అవతలి వ్యక్తి చెప్పారు. వెంటనే వాజ్‌పేయి ఫోన్లైన్లోకి వచ్చి ‘‘యే క్యా కర్ రహాహై మిత్ర్ ఆప్కా?(మీ స్నేహి తుడు చేస్తున్న ఈ పనేంటి?)’’అని ప్రశ్నించారు. పాకి స్తాన్ ఆర్మీ చీఫ్ చైనా పర్యటనలో ఉండగా కశ్మీర్ ముజాహదీన్ల చేతుల్లోకి క్షిపణులు రావడంపై అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారని ఆయన అన్నారు. ‘అసలేం జరుగుతోంది? ఈ విషయం మీరు మీ మిత్రుణ్ని అడగగలరా?’ అని ఆయన నన్ను ప్రశ్నించారు. వెంటనే నేను ఇస్లామాబాద్‌లోని నాకు తెలిసిన పాత ఫోన్ నంబర్‌కే డయల్ చేసి ఓ కబురు పంపాను. ఆ రోజు రాత్రి నాకు పాక్ రాజదాని నుంచి ఫోనొచ్చింది. నవాజ్ షరీఫ్ కూడా వాజ్‌పేయి మాదిరిగానే కలవరపాటుతోనే మాట్లా డారు. ‘‘నేను ఆయనకు ద్రోహం చేయబోనని ఆయ నకు మీరు చెప్పండి. అధీనరేఖపై ఎప్పటిలా కొన్ని మామూలు ఘర్షణలు జరిగాయని నిన్న నాకు చెప్పారు. నేడు గగనతల ఉల్లంఘనలు జరిగాయి. నాకు కూడా ఈ పరిణామాలపై ఆశ్చర్యంగా ఉంది’’ అంటూ వైమానిక ఘర్షణలను ప్రస్తావిస్తూ షరీఫ్ నాతో అన్నారు. రాజధానికి రాగానే వాజ్‌పేయి, ఆయన సహాయకుడు బ్రజేష్ మిశ్రా నాతో ఫోన్లో మాట్లాడారు. జనరల్ ముషారఫ్, ఆయన డెప్యూటీ సైనికాధికారి మధ్య జరిగిన సంభాషణలను ‘మన మనుషులు’ రహస్యంగా విన్నారనీ, ఇది పూర్తిగా పాక్ చేపట్టిన సైనిక చర్యయేనని తేలిందని వారు నాకు చెప్పారు. ‘‘కాబట్టి, మీరు ఇంటర్వూ్య పేరుతో ఇస్లామాబాద్ వెళ్లి, పాక్ సైనికాధిపతుల మధ్య జరిగిన ఈ రహస్య సంభాషణ గురించి నవాజ్ షరీఫ్‌కు చెప్పగలరా?’’ అని నన్ను అడిగారు. కానీ, నాకు ఈసారి విషయం తీవ్రత అర్థమైంది. నేను మొదట చేసింది నిజమైన ఇంటర్వూ్య. దాని సత్ఫలి తమే బస్సు యాత్ర. వారు చెప్పినట్టు చేస్తే జర్నలిజం పరిధి దాటినట్టే అవుతుందని వారికి తెగేసి చెప్పాను. వారిద్దరూ అర్థం చేసుకున్నారు. వారు అంతటితో ఆగకుండా మాజీ ఎడిటర్ ఆర్.కె.మిశ్రాకు ఈ పని అప్పగించారు. ఆయన అప్పుడు అబ్జర్వర్ ఫౌండే షన్లో పనిచేస్తున్నారు. వారు చెప్పినట్టే ఆయన ఇస్లా మాబాద్‌కు అనేకసార్లు వెళ్లొచ్చారు. పాక్ సేనల చర్య లకు సాక్ష్యంగా పైన చెప్పిన రహస్య సంభాషణల టేపులను కూడా ఆయన పాక్ ప్రధానికి అందజే శారు. దీంతో పాత్రికేయ పరిధిని దాటిన నా సాహసం ఇంతటితో ముగిసింది. పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రికి ఇక్కడ అనేక గుణపాఠాలు ఉన్నాయి. మొదటగా, భారత్‌తో శాంతి ప్రక్రియకు ప్రయత్నించడం ప్రమాదకరమైన ఆలోచన. సైనికాధికారులు తలపై కూర్చుని అలా చేయడం ఆత్మహత్యా సదృశం అవుతుంది. రెండోది. ఎన్నికైన ఏ ప్రధానమంత్రినీ పాక్ సైనిక వ్యవస్థ పూర్తి కాలం పదవిలో కొనసాగడానికి అనుమతించలేదు. ఇక మూడోది ఏమిటంటే ఎన్నికైన ప్రతి ప్రధాన మంత్రీ ప్రవాసం పాలయ్యారు, జైలుపాలయ్యారు, హత్యకు గురయ్యారు. గత దశాబ్ది కాలంలో ప్రజా స్వామ్యానికి ఊపిరిపోయడానికి సంకల్పించిన ప్రతి ప్రయత్నమూ ఎదురుదెబ్బ తిన్నది. ఇవన్నీ దాటు కుని ఇమ్రాన శాంతిసాధనకు ప్రయత్నించాడంటే, పాక్ సైన్యం చెప్పి ఉంటుంది కాబట్టి దానికి పూను కుంటాడు. అంతే తప్ప సైన్యాన్ని ధిక్కరించి కాదు. చివరగా, ఇరుదేశాల సంబంధాల్లో నూతన శకం మొదలైనట్లయితే అది అందరిలో ఆశలు రేపవచ్చు కానీ కపటత్వంతో కూడి ఉంటుంది. అప్పటికి కూడా అది ఆ తర్వాత ఎప్పుడో చెప్పాల్సిన చక్కటి గాథగా మారవచ్చు. ఈ విషయాలను ఇప్పుడు చెప్పడానికి నాకు నాలుగు కారణాలున్నాయి. వాజపేయి నిష్క్ర మణం, నవాజ్ షరీప్ జైలు శిక్ష, ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం, అన్నిటి కంటే ముఖ్యంగా ఆనాటి ఘటన జరిగి ప్రస్తుతం 20 సంవత్సరాలు గడిచిపోయాయి. శేఖర్ గుప్తా(వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్) twitter@shekargupta -
వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించడంతో..
-
‘వాజ్‌పేయికి నివాళి అర్పించను’.. రచ్చ రచ్చ!
సాక్షి, ముంబై, ఔరంగాబాద్ : మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి సంతాప తీర్మానంను వ్యతిరేకించిన ఓ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) కార్పొరేటర్‌పై బీజేపీ కార్పొరేటర్లు దాడి చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో చోటుచేసుకుంది. వాజ్‌పేయి మృతికి సంతాపంగా మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులందరూ నివాళి అర్పించేందుకు శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాజ్‌పేయి మృతికి సంతాపం వ్యక్తం చేయాలని బీజేపీ కార్పొరేటర్ రాజు విద్యా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అతడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎంఐఎం సభ్యుడు సయ్యద్ మటీన్ వ్యతిరేకించారు. దీంతో రగిలిపోయిన బీజేపీ సభ్యులు ఒక్కసారిగి అతనిపై దాడికి దిగి సయ్యద్‌ను చితకబాదారు. వెంటనే అక్కడున్న సిబ్బంది అప్రమత్తం కావడంతో వారి నుంచి సయ్యద్ తప్పించుకున్నారు. తీవ్ర గాయాలపాలైన మటీన్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై బీజేపీకి చెందిన ఓ నేత మాట్లాడుతూ... మాజీ ప్రధాని మృతికి సంతాపం వ్యక్తం చేయవల్సిందిగా తీర్మానం ప్రవేశపెడితే దానిని వ్యతిరేకించారని, గతంలో కూడా సభలో జాతీయ గీతం పాడటానికి అతను వ్యతిరేకించారని తెలిపారు. తమ సభ్యుడిపై దాడి చేశారన్న వార్తను తెలుసుకున్న స్థానిక ఎంఐఎం కార్యకర్తలు అక్కడున్న బీజేపీ నేతల కార్లను ధ్వంసం చేసి, కారు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. మటీన్‌పై దాడి చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
వాజ్‌పేయి కవితలు
-
తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయా!
-
తండ్రి క్లాస్‌కు రాకపోతే వాజ్‌పేయికి చిక్కుప్రశ్నలు!
‘తండ్రీ, కొడుకులు ఒకే కాలేజీలో చదవడం మీరెప్పుడైనా చూశారా... అది కూడా ఒకే తరగతిలో.. మీరు ఈ విషయం తెలుసుకోలేదంటే కాన్పూర్ దయానంద్ ఆంగ్లో- వేదిక్ కాలేజీ గురించి పూర్తిగా తెలుసుకోనట్లే’ అంటూ అటల్ బిహారీ వాజ్‌పేయి రాసిన ఆర్టికల్‌ను ఉటంకిస్తూ ఆ కాలేజీ ప్రిన్సిపల్ అమిత్ కుమార్ శ్రీవాస్తవ అటల్ జీతో తమ కాలేజీకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాజ్‌పేయి అంచెలంచెలుగా ఎదుగుతూ... భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ తన మూలాలు ఎప్పుడూ మర్చిపోలేదు అనేందుకు అటల్ జీ రాసిన ఈ వ్యాసం చిన్న ఉదాహరణ అంటూ నివాళులు అర్పించారు. అటల్ జీ వ్యాసంలోని అంశాలు సంక్షిప్తంగా... ‘1945లో గ్వాలియర్‌లోని విక్టోరియా కాలేజీలో బీఏ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసిన మా నాన్న గారు అప్పుడే రిటైర్ అయ్యారు. సరిగ్గా అదే సమయంలో నా సోదరీమణుల పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నాయి. పెళ్లి తంతు పూర్తవ్వాలంటే కట్నకానుకలు ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయగలనా అనే సందేహం, భవిష్యత్తుపై బెంగ... అపుడే గ్వాలియర్ మహారాజా శ్రీమంత్ జీవాజీ రావు సింధియా గారి చొరవతో... నాకు 75 రూపాయల ఉపకార వేతనం లభించింది. దాంతో ఈ సమస్యల నుంచి నాకు ఉపశమనం లభించింది. నేను సంతోషంగా నా చదువు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాను. అయితే అప్పుడు మా నాన్న గారు తీసుకున్న నిర్ణయం నన్నెంతగానో ఆశ్చర్యపరిచింది. 30 ఏళ్ల పాటు ఉపాధ్యాయునిగా సేవలందించిన ఆయన ఉన్నత విద్యనభ్యసించాలని నిర్ణయించుకున్నారు. నాతో పాటే కాన్పూరు వచ్చి లా చదవాలని భావించారు. అప్పుడు ఆయన వయస్సు 50 ఏళ్లు. తెల్లటి జుట్టు, చేతి కర్రతో మా నాన్న అదే.. పండిట్ కృష్ణ బిహారీలాల్ వాజ్‌పేయి... ప్రిన్సిపాల్ ఆఫీసుకు వచ్చారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్‌గా ఉన్న భట్నాగర్ మా నాన్నగారు ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చారేమో అనుకున్నారు. కానీ నేను కూడా మీ కాలేజీలో విద్యార్థిగా చేరేందుకు వచ్చానని నాన్న చెప్పినప్పుడు.. ఆయన ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి, నిలబడి మీరు చాలా గొప్ప పని చేయబోతున్నారంటూ నాన్న గారిని అభినందించారు. ఇక అప్పుడు మొదలైంది కాలేజీ విద్యార్థుల్లో ఆసక్తి. తండ్రీ కొడుకులు ఇద్దరు ఒకే కాలేజీ, ఒకే తరగతి, ఒకే సెక్షన్ అట. వారు హాస్టల్లో ఉన్నారట అంటూ మమ్మల్ని చూసేందుకు గుంపులు గుంపులుగా విద్యార్థులు మా గదికి వచ్చారు. నాన్న గారు, నేను ఒకే సెక్షన్ అయ్యేసరికి లెక్చరర్ల నుంచి మా ఇద్దరికీ ఒకే రకమైన ప్రశ్నలు ఎదురయ్యేవి. తరగతి గదికి నేను ఆలస్యంగా వచ్చిన రోజు నాన్న గారిని, నాన్న గారు ఆలస్యంగా వచ్చిన రోజు నన్ను.. ఆలస్యానికి కారణమేంటో అంటూ ప్రశ్నించేవారు. దీంతో నాన్నా, నేను ఓ నిర్ణయానికి వచ్చేశాం. సెక్షన్లు మారిపోవాలని. వెంటనే ప్రిన్సిపాల్‌కు చెప్పి చెరో సెక్షన్‌కు మారిపోయాం. ఆ సమంయలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. అలా రెండేళ్లు గడిచిపోయాయి’ అంటూ కర్మయోగి తన తండ్రితో కాలేజీలో గడిపిన క్షణాల గురించి 2002లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. అయితే స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత వివిధ కారణాల వల్ల వాజ్‌పేయి మధ్యలోనే లా చదువును ఆపేశారు. ఆ సమయంలో కాలేజీని, స్నేహితులను వదిలివెళ్లడం తననెంతో బాధించిందని వ్యాసంలో రాసుకొచ్చారు. -
ఆయనే నాకు మార్గనిర్దేశి: అఖిలేశ్
భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికే దేశవిదేశాల నుంచి నేతలు, అభిమానులు తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు ఢిల్లీకి తరలివచ్చారు. వాజ్‌పేయితో తమకున్న అనుబంధాన్ని పలువురు ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వాజ్‌పేయితో కలిసిఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. 1999లో అఖిలేష్-డింపుల్ వివాహానికి హాజరైన వాజ్‌పేయి ఫోటోను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘అటల్ బిహారి వాజ్‌పేయి రాజకీయాలకు సరికొత్త అర్థాన్ని చెప్పిన మహానేత, పార్టీ సిద్దాంతాలను పాటిస్తూనే వ్యక్తిత్వాన్ని మరిచిపోని గొప్పనేత వాజ్‌పేయి. ఆయన మాలాంటి ఎంతో మంది యువ రాజకీయ నాయకులకు మార్గనిర్దేశి. ఆయన మరణంతో ప్రపంచం గొప్ప నాయకున్ని, రచయితను, గొప్ప వక్తను కోల్పోయాం. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అంటూ అఖిలేశ్ ట్వీట్ చేశారు. వాజ్‌పేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అంతిమయాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల, బీజేపీ ఆగ్రనేతలు కాలి నడకన వాజ్‌పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు. स्व. अटल जी ने राजनीति को दलगत राजनीति से ऊपर उठाया, सदैव अपने दल के सिद्धांतों व अपने दर्शन पर अडिग रहना सिखाया, जब भी राजनीति भटकी उसको सही मार्ग दिखाया, विदेशों से मित्रता का पाठ पढ़ाया. अटल जी का जाना भारतीय राजनीति एवं साहित्यिक जगत के मुखरित स्वर का मौन हो जाना है. मौन नमन! pic.twitter.com/1w4EOgr9qG — Akhilesh Yadav (@yadavakhilesh) August 17, 2018 -
వాజ్‌పేయికి నివాళి; స్వామి అగ్నివేష్‌కు చేదు అనుభవం
-
లైవ్ అప్డేట్స్ : ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి
న్యూఢిల్లీ: భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా నిర్వహించారు. దత్త పుత్రిక నమితా భట్టాచార్య చేతుల మీదుగా బహుముఖ ప్రజ్ఞాశాలి వాజ్‌పేయి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందు స్మృతిస్థల్‌లో త్రివిద దళాధిపతులు మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు బహుముఖ ప్రజ్ఞాశాలి వాజ్‌పేయికి తుది వీడ్కోలు పలికారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు వాజ్‌పేయికి కడసారి నివాళులర్పించారు. మరోవైపు అంతియయాత్రలో దారి పొడవునా అటల్ జీ అమర్ రహే నినాదాలతో మార్మోగిపోయింది. తొలుత వాజ్‌పేయి కన్నుమూసిన అనంతరం ఆయన పార్థివదేహాన్ని తొలుత ఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గ్‌కు తరలించారు. అనంతరం వాజ్‌పేయి పార్థివదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించగా, ఆయనకు ఘనంగా తుది వీడ్కోలు పలికేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతకు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యూపీ సీఎం ఆదిత్యానాథ్ యోగిలు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. పార్టీలకు అతీతంగా బీజేపీ కేంద్ర కార్యాలయానికి నేతలు, ప్రజలు తరలివచ్చి వాజ్‌పేయికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. దత్త పుత్రిక నమితా భట్టాచార్య తన చేతుల మీదుగా చితికి నిప్పంటించి మాజీ ప్రధాని వాజ్‌పేయి అంతిమ సంస్కారాలను శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం వేద పండితుల సాయంతో వాజ్‌పేయి అంత్యక్రియలు నిర్వహిస్తోన్న దత్త పుత్రిక నమితా భట్టాచార్య, ఇతర కుటుంబసభ్యులు తాత అటల్జీ నుంచి తరచుగా బహుమతులు అందుకునే నిహారిక చివరిసారి కానుకగా ఆయన పార్థీవదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని అందుకున్నారు. ఉద్వేగానికి లోనవుతూ త్రివర్ణ పతాకాన్ని వెంట తీసుకెళ్లారు. త్రివిధ దళాధిపతులు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ ప్రధానికి తుది వీడ్కోలు. మహానేత వాజ్‌పేయికి నివాళుతర్పించిన పలువురు కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాజీ ప్రధాని వాజ్‌పేయి అంతిమయాత్ర అశేష జనవాహిని మధ్య స్మృతి స్థల్‌కు చేరుకుంది. వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం స్మృతి స్థల్‌కు బయలుదేరిన బూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రులు పీకే గ్యావల్, లక్ష్మణ్ కిరిల్లా, అబ్దుల్ హసన్ మహ్మద్ అలీ, పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్లు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుని వాజ్‌పేయి పార్థివ దేహానికి అంజలి ఘటించనున్నారు. వాజ్‌పేయి అంతియయాత్రలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, పార్టీ నేతలు విజయ్ ఘాట్ పక్కన 1.5 ఎకరాల్లో వాజ్‌పేయి మెమోరియల్‌కు ఏర్పాట్లు పూర్తి ఢిల్లీకి చేరుకున్న అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ ఖర్జాయ్. వాజ్‌పేయి అంతియాత్ర స్థలానికి బయలుదేరిన ఖర్జాయ్ రాష్ట్రీయ స్మృతి స్థల్లో రాజనీతిజ్ఞుడు, ప్రజల నేత వాజ్‌పేయి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు అంతిమయాత్ర కొనసాగుతున్న దీన్ దయాల్ మార్గ్ రాజకీయ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు కాలి నడకన వాజ్‌పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు కృష్ణ మీనన్ మార్గ్‌లోని నివాసంలో వాజ్‌పేయి పార్థివదేహానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు బీజేపీ కురు వృద్ధుడు ఎల్ కే అద్వానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్, కేరళ, తమిళనాడు గవర్నర్లు సదాశివం, భన్వరీలాల్ పురోహిత్‌లు నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ నేతల విజయసాయి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వరప్రసాద్‌లు వాజ్‌పేయి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. బాలీవుడ్ ప్రముఖులు జావేద్ అక్తర్, షబానా అజ్మీలు వాజ్‌పేయికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. -
వాజ్‌పేయికి నివాళి; స్వామి అగ్నివేష్‌పై దాడి
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. కడసారి వాజ్‌పేయిని దర్శించుకునేందుకు వచ్చిన అగ్నివేష్‌పై బీజేపీ కార్యకర్తలు సామూహికంగా దాడి చేశారు. ఈ విషయం గురించి అగ్నివేష్ మాట్లాడుతూ ‘వాజ్‌పేయి గారికి నివాళులర్పించేందుకు నేను ఇక్కడకు వచ్చాను. కానీ పోలీసు బందోబస్తు ఉండటం వల్ల నడుచుకుంటూ వస్తున్నాను. ఇంతలో ఉన్నట్టుండి కొందరు యువకులు వచ్చి నా మీద దాడి చేయడం ప్రారంభించారు. మేము ఇద్దరం, ముగ్గరమే ఉన్నాం.. కానీ వాళ్లు గుంపుగా వచ్చారు. వాళ్లు నా తలపాగాను పడేసి, మమ్మల్ని తిడుతూ, మా పై దాడి చేశార’ని తెలిపారు. అంతేకాక ‘వారిలో కొందరు నన్ను ఉద్దేశిస్తూ అతను దేశద్రోహి.. కొట్టండి, కొట్టండి అంటూ నా మీద దాడికి పురిగొల్పార’ని అగ్నివేష్ తెలిపారు. అయితే అగ్నివేష్‌పై దాడి జరగడం ఇది రెండో సారి. గతంలో ఒకసారి జార్ఖండ్‌లో బీజేపీ కార్యకర్తలు అగ్నివేష్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. -
భారత్‌కు విదేశీ నేతలు
న్యూఢిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు పలువురు పొరుగు దేశాల నేతలు భారత్‌కు రానున్నారు. ముందుగా బూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్..భారత్‌కు చేరుకుని వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కాగా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రులు పీకే గ్యావల్, లక్ష్మణ్ కిరిల్లా, అబ్దుల్ హసన్ మహ్మద్ అలీ, పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్లు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుని వాజ్‌పేయి పార్థివ దేహానికి అంజలి ఘటించనున్నారు. ప్రజల సందర్శనార్థం వాజ్‌పేయి భౌతికకాయాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. సాయంత్రం స్మృతి స్థల్లో అధికారిక లాంఛనాల మధ్య వాజ్‌పేయీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ ఖర్జాయ్ ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం వాజ్‌పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ మృతిపట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రష్యా, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక తదితర దేశాల అధ్యక్షులు భారత రాష్ట్రపతికి సంతాప సందేశాలు పంపారు. ‘భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి విచారకరం. ఆయన గొప్ప నాయకుడే కాదు.. సాహిత్యం, కళల్లో మంచి స్కాలర్ కూడా. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో మాల్దీవుల్లో పర్యటించారు. ఓ గొప్ప నేతను కోల్పోయిన భారత్‌కు మాల్దీవులు ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అబ్దుల్ గయూమ్ తన సంతాపం తెలియజేశారు. ‘భారత గొప్ప నేతల్లో వాజ్‌పేయి ఒకరు. ఆయన మృతి విచారకరం. యూకే ప్రభుత్వానికి ఆయన మంచి సన్నిహితుడు’ అని యూకే మంత్రి మార్క్ ఫీల్డ్ సానుభూతి తెలిపారు. ‘వాజ్‌పేయి ప్రపంచం గర్వించదగ్గ నేత. గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్, రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆయన మృతిపట్ల సానుభూతి ప్రకటిస్తున్నాం’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తన సంతాప సందేశాన్ని పంపారు. ‘ఈ రోజు ఓ గొప్ప మానవతావాదిని, నిజమైన స్నేహితుడిని మనం కోల్పోయాం. ఆయన అద్భుతమైన నాయకుడు, ప్రజాస్వామ్య రక్షకుడు’ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంతాపం తెలియజేశారు. -
గోంగూర అన్నా...ఆవకాయ అన్నా ఎంతో మక్కువ
రైలుపేట(గుంటూరు): భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(93) మృతి పట్ల గుంటూరు జిల్లాకు చెందిన బీజేపీ నేతలు పలువురు సంతాపం తెలియజేశారు. వాజ్‌పేయితో తమకున్న అనుబంధాలను నెమరువేసుకున్నారు. రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న గుంటూరు జిల్లా కు 15 సార్లు వచ్చిన వాజ్‌పేయి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు సైతం గుంటూరులోనే జరిగింది. అనేకమార్లు రాజకీయ తీర్మానాలు గుంటూరు వేదికగా తీసుకున్నారు. అఖిల భారత జనసంఘం జాతీయ అధ్యక్షుడిగా, ఎంపీగా పనిచేస్తున్న కాలంలో 1968లో గుంటూరు జిన్నాటవర్ సెంటర్లో వీరసావర్కర్ రోడ్డును వాజ్‌పేయి ప్రారంభించారు. జిన్నాటవర్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ఈ రోడ్డును నిర్మించారు. మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పనిచేస్తున్న చేబ్రోలు హనుమయ్య కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పటికీ వాజ్‌పేయితో ఈ రోడ్డును ప్రారంభింపచేశారు. చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వద్ద ఆయనకు పౌరసన్మానం కూడా చేశారు. తదుపరి జనసంఘ్ నగర అధ్యక్షుడు వనమా పూర్ణచంద్రరావు 1983లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ఆయనకు మద్దతుగా వాజ్‌పేయి గుంటూరులో ఎన్నికల ప్రచారం చేశారు. తన గెలుపుకోసం ప్రచారం చేసిన వాజ్‌పేయి లేరనే మాటను జీర్ణించుకోలేక పోతున్నామని వనమా ఆవేదనగా అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నలబోతు వెంకట్రావు, నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెలవర్తిపాటి పాండురంగవిఠల్, జిల్లా కార్యదర్శి పునుగుళ్ల రవిశంకర్, ఉపాధ్యక్షులు సత్యన్నారాయణ వాజ్‌పేయి మృతికి సంతాపం తెలిపి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. వాజ్‌పేయి మృతిపై వైఎస్సార్ సీపీ నేతల దిగ్బ్రాంతి పట్నంబజారు(గుంటూరు): భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి మృతి చెందటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాజ్‌పేయి మృతి భారతదేశానికి, దేశ రాజకీయాలకు తీరని లోటని పార్టీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ, సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆతుకూరి ఆంజనేయులు, కిలారి రోశయ్య, పార్టీ నేత పాదర్తి రమేష్‌గాంధీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి శ్రీనివాసరావు, అనుబంధ విభాగాల అధ్యక్షులు షేక్ జిలాని, బూరెల దుర్గాప్రసాద్, ఆళ్ళ పూర్ణచంద్రరావు, సాయిబాబుతో పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి దేశంలో అత్యున్నత పదవులు చేపట్టిన గొప్ప వ్యక్తి వాజ్‌పేయి అని కీర్తించారు. కేంద్రంలో ఐదేళ్ల పాటు కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నడిపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి, ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించారని పేర్కొన్నారు. వాజ్‌పేయి మృతికి ఎమ్మెల్యే ఆర్కే సంతాపం మంగళగిరిటౌన్: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిపట్ల మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. నిజాయితీపరుడైన రాజకీయ వేత్తను కోల్పోయామని, విలువలతో కూడిన రాజకీయాలను నడిపి భారతదేశానికే కాకుండా, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వాజపేయి మృతి దేశానికి తీరని లోటని అన్నారు. మా కుటుంబంతో ఎంతో అనుబంధం వాజ్‌పేయి జనసంఘ్ జాతీయ అ«ధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో మా తండ్రి జూపూడి యజ్ఙనారాయణ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తల్లి హైమావతమ్మతో పాటు నేను కూడా జన్‌సంఘ్‌లో పనిచేశాం. ఈ నేపథ్యంలో సుమారు 15 సార్లు వాజ్‌పేయి గుంటూరులోని మా ఇంటికి వచ్చి బసచేశారు. పలుమార్లు ఆయన గుంటూరు నుంచి ఇతర ప్రాంతాలకు సభలకు వెళ్లే సమయంలో నేనే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వాజ్‌పేయిను తీసుకెళ్లాను. ఎన్నో విషయాలను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. కారులో వెళ్తున్న సమయంలో రోడ్డు అంతా గుంతల మయంగా ఉండి డ్రైవింగ్ ఇబ్బందిగా ఉండటాన్ని గమనించిన వాజ్‌పేయి ప్రభుత్వమే రోడ్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని భావించారు. అందుకే ఆయన ప్రధాని అవగానే నాలుగులైన్ల జాతీయ రహదారులను వేయించి రవాణా రంగం అభివృద్ధి చేశారు. గుంటూరు గోంగూర అంటే ఆయనకు ఎంతో ఇష్టం. మా ఇంటికి వచ్చినప్పుడు గోంగూరను అడిగి వడ్డించమనేవారు. అవకాయపచ్చడి సైతం ఎంతో ఇష్టంగా తినేవారు. ఆయన ప్రధాని అయ్యాక కూడా అదే పిలుపు, అదే ఆప్యాయత చూపించారు. ప్రధాని అయ్యాక ఢిల్లీకి వెళ్లిన సమయంలో మమ్ముల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. ఆయన మృతిని మా కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. –బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు తెనాలిలో వాజ్‌పేయి జ్ఞాపకాలు తెనాలి: భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి కన్నుమూశారన్న సమాచారం బీజేపీ అభిమానులనే కాదు, పట్టణానికి చెందిన పలువురు నాటి తరం పెద్దల మనసుల్లో విచారం నింపింది. అఖిల భారత జనసంఘ పార్టీ, బీజేపీ పార్టీ అధ్యక్షుడి హోదాలోనూ రెండు పర్యాయాలు ఆయన తెనాలిని సందర్శించారు. అప్పట్లో జిల్లా కేంద్రం కూడా కాని తెనాలి పట్టణానికి రావటానికి, జిల్లాలో ఆయా పార్టీలకు మూలస్తంభం వంటి ప్రముఖుడు దివంగత తమిరిశ రామాచార్యులు ఆహ్వానం ప్రధాన కారణం. ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితుడై జనసంఘ్ పార్టీ, తర్వాత బీజేపీలోనూ జీవితాంతం కొనసాగిన రాజకీయనేత టి.రామాచార్యులు, తెనాలిలో ఆయా పార్టీల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలే కాదు, పార్టీ నిర్దేశించిన అనేక కార్యక్రమాల నిర్వహణలో చొరవ చూపారు. ఆయన ఆహ్వానంపైనే జనసంఘ సమావేశంలో పాల్గొనేందుకు 1971లో వాజ్‌పేయి అఖిల భారత జనసంఘ అధ్యక్షుని హోదాలో తొలిసారిగా తెనాలికి వచ్చారు. స్వరాజ్ టాకీస్‌లో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన ఢిల్లీలో వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే నూతన పార్టీ ఏర్పాటుకు నిర్ణయం జరిగి, భారతీయ జనతా పార్టీ అవిర్భవించింది. తెనాలి నుంచి ఆ సమావేశానికి టి.రామాచార్యులు హాజరై వాజ్‌పేయిని అభినందించారు. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ శాఖ ఏర్పాటైంది. జిల్లా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన టి.రామాచార్యులు ఆహ్వానంపై మరోసారి వాజ్‌పేయి తెనాలికి వచ్చారు. తెనాలి మార్కెట్ సెంటర్లో జరిగిన సభలో వాజ్‌పేయితో అప్పటి ఎమ్మెల్సీ జూపూడి యజ్ఞనారాయణ, బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు డీఎస్పీ రెడ్డి, జానా కృష్ణమూర్తి వేదికపై ఉన్నారు. మాచర్లతో ఎనలేని అనుబంధం మాచర్లరూరల్: మాజీ ప్రధాని వాజ్‌పేయికి మాచర్ల నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉంది. ఈయన 1983లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కర్పూరపు కోటయ్య తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోదండ రామాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
ఢిల్లీ ఛోడ్ దో : మోదీకి వాజ్‌పేయి ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ : భరత మాత ముద్దుబిడ్డ, బీజేపీ పెద్ద దిక్కు అటల్ బిహారీ వాజ్‌పేయి(93) దివికెగిశారు. వాజ్‌పేయి ఇక లేరని వార్తను యావత్ భారత్ దేశం తట్టుకోలేకపోతుంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అయితే అటల్జీ మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. వాజ్‌పేయి లేకపోవడం ఒక యుగాంతంలా ఉంది అని కన్నీరు పెట్టుకున్నారు. వాజ్‌పేయికి, ప్రధాని నరేంద్ర మోదీ అవినాభావ సంబంధం ఉంది. మోదీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వాజ్‌పేయితో మంచి సంబంధాలు కొనసాగేవి. 1995, 1998లలో జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా మోదీ పోషించిన పాత్రను వాజ్‌పేయి ఎంతో అభినందించారు. 1998 ఎన్నికల సమయంలో హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలన్నీ మోదీనే తన భుజంపై వేసుకున్నారు. ఆ సమయంలోనే గుజరాత్‌కు కూడా మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో మోదీ ఢిల్లీలోనే ఉన్నారు. కానీ అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. 1995, 1998 ఎన్నికల్లో మోదీ వ్యూహాల రూపకల్పనపై వాజ్‌పేయి ఎంతో ఇంప్రెస్ అయ్యారట. ఆ తర్వాత రెండు మూడేళ్లకు గుజరాత్ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ ఆరోగ్యం క్షీణించడం, అడ్మినిస్ట్రేషన్ కుదుపులకు లోనుకావడం జరిగింది. ఇక 2001 రిపబ్లిక్ డే రోజునే గుజరాత్‌ను పెను భూకంపం కబళించింది. ఈ పర్యావరణ విపత్తులో 15వేల మంది నుంచి 20 వేల మంది వరకు మరణించారు. ఆ సమయంలో ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాజ్‌పేయి నుంచి మోదీకి పిలుపు అందింది. వెంటనే వచ్చిన 7 రేస్ కోర్స్ రోడ్డు(ప్రస్తుతం 7, లోక్ కల్యాణ్ మార్గ్)లో ఉన్న తన అధికారిక నివాసంలో తనను కలవాల్సిందిగా వాజ్‌పేయి మోదీని ఆదేశించారు. వాజ్‌పేయి ఆదేశాల మేరకు, మోదీ వెళ్లి ఆయన్ను కలిశారు. ‘వెంటనే నీవు ఢిల్లీ వదిలి వెళ్లాలి. ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే’ అన్నారట. వాజ్‌పేయి మాటలకు ఏమైందోనని తీవ్ర షాకింగ్‌కు గురైన మోదీ, ఎక్కడికి వెళ్లాలి అని అడిగారట? కేవలం ఒక్క పదంలోనే వాజ్‌పేయి సమాధానం కూడా చెప్పారు. గుజరాత్ అని. కొన్ని రోజుల అనంతరం 2001 అక్టోబర్ 7న కేశుభాయ్ పటేల్ స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నాలుగు నెలలకు అంటే 2002 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నుంచి గోద్రా రైలులో వస్తున్న కర్ సేవకులకు, దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తదనంతరం గుజరాత్లో పెద్ద ఎత్తున్న మతహింస కాండ జరిగింది. ఆ అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారం 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులూ మరణించినట్టు తెలిసింది. కానీ వాస్తవానికి 2,000 కు పైగా మరణించి ఉంటారని అంచనా. ఈ అల్లర్ల సమయంలో మోదీకి, వాజ్‌పేయి ఒక్కటే సూచించారట. ఎట్టిపరిస్థితుల్లో ‘రాజధర్మా’న్ని వదలొద్దని. రాజధర్మం అంటే అధికారంలో ఉన్న వాళ్లు ఎగువ, దిగువ కులాల మధ్య వ్యత్యాసం చూపరాదని సమాజంలోని అన్ని మతాల ప్రజల పట్ల సమాదరణ కలిగి ఉండాలని స్పష్టంచేశారట. ఈ అల్లర్లు మోదీ ఇమేజ్ను ఏ మాత్రం దెబ్బతీయలేదు. 2002 గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ.. సమర్థంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి, మంచి ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరు తెచ్చుకున్నారు. 2007, 2012 ఎన్నికల్లో గుజరాత్లో మోదీనే ఘన విజయం సాధించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ వేవ్, 2014 గుజరాత్ ఎన్నికల్లో కూడా సఫలమై, ఎన్డీయే తరుఫున భారత్ ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. -
రాజకీయ భీష్ముడి జ్ఞాపకాలు
కర్నూలు(హాస్పిటల్): రాజకీయ భీష్ముడు, భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం మరణించడంతో ఆయనతో ఉన్న జ్ఞాపకాలు జిల్లా నేతలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన నాయకులు అప్పటి సంఘటనలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుని ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని, సేవలను, అభివృద్ధిని కొనియాడారు. బీజేపీ అగ్రనేతగా ఆయన కర్నూలు జిల్లాకు నాలుగుసార్లు వచ్చారు. 1969లో జేఎస్ నాగప్ప జనసంఘ్ అభ్యర్థిగా కర్నూలు పార్లమెంట్ స్థానానికి పోటీచేయగా.. ఆయన తరపున ప్రచారానికి వచ్చారు. అలాగే 1973లోనూ జనసంఘ్ పార్టీ తరపున ఆయన జిల్లాలో పర్యటించారు. జనతా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మరోసారి కర్నూలు నగరంలోని మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత 1989–90 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కర్నూలు, నంద్యాలలో బీజేపీ అభ్యర్థులు కపిలేశ్వరయ్య(కర్నూలు), ఎస్పీవై రెడ్డి(నంద్యాల) తరపున ఆయన ప్రచారం చేశారు. ఎంతో మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాజ్‌పేయి గురించి ఆయనతో సన్నిహితంగా మెలిగిన పలువురు బీజేపీ నాయకుల మనోభావాలు ఇలా.. కమలాలతో నివాళి నంద్యాల విద్య: భారత మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి మృతికి నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ తన సూక్ష్మచిత్రాల ద్వారా చిత్రనివాళులర్పించారు. ఆయన కేవలం రెండు గంటల వ్యవధిలో వాజ్‌పేయి చిత్రపటాన్ని 620 కమలాలతో చిత్రించి నివాళులర్పించారు. కారులోనే వచ్చారు 1991లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో నేను బీజేపీ అభ్యర్థిగా ఉన్నాను. నంద్యాల నుంచి ఎస్పీవై రెడ్డి పోటీలో ఉన్నారు. ఉదయం 10 గంటలకు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సభకు రావాల్సి ఉండగా భారీ వర్షాలు పడటంతో విమానంలో రావడానికి కుదరలేదు. దీంతో కారులో సాయంత్రం 5.30 గంటలకు వచ్చారు. ఆయన భోజనం కూడా చేయకుండా మీటింగ్‌కు వచ్చారు. ఆ తర్వాత నంద్యాల వెళ్లాము. ఆ మీటింగ్ పూర్తయ్యే సరికి రాత్రి 11 గంటలకు అయ్యింది. అప్పుడు మధ్యాహ్నం కూడా భోజనం చేయకపోవడంతో ఆకలిగా ఉందని చెప్పారు. చేపట్టిన పని కోసం ఏ విధంగా శ్రమిస్తారనేది ఆ సంఘటన ద్వారా తెలుసుకున్నాను. భారతమాత దేశభక్తి కలిగిన వ్యక్తిని కోల్పోయింది. ఢిల్లీ నుంచి పాకిస్తాన్‌కు బస్సు ప్రయాణం చేసిన ఏకైక ప్రధాని ఆయనే. ముస్లింలకు హజ్ యాత్ర వెళ్లేందుకు 35 శాతం సబ్సిడీ ఇచ్చారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న లక్నో నుంచి ఆయన పలుమార్లు ఎన్నికయ్యారు. – కపిలేశ్వరయ్య, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాకు స్వయంగా భోజనం వడ్డించారు 1980లో గుంతకల్‌లో, 1981లో బళ్లారికి వచ్చిన సందర్భంగా వాజ్‌పేయిని నేను కలిశాను. ఆయన బాగోగులు చూసుకునేందుకు కర్నూలు నుంచి నన్ను బళ్లారికి పంపించారు. బళ్లారిలోనే నేను ఉండి ఆయనతో పాటు డోన్ వరకు రైలులో ప్రయాణించాను. ఆయన భోజనం చేసిన తర్వాత ప్లేటు కడిగేందుకు వెళ్లగా ఒప్పుకోలేదు. ఆయనే స్వయంగా ప్లేటు కడిగారు. ఆ తర్వాత ఆయన మాకూ స్వయంగా భోజనం వడ్డించారు. 1989–90 ఎన్నికల్లో కపిలేశ్వరయ్య కోసం ప్రచారానికి ఆయన వచ్చినప్పుడు కూడా కలిశాను. అప్పట్లో అలంపూర్ వద్ద ఆయన కోసం ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేశాము. అయితే వర్షాలు అధికంగా ఉండటంతో పైలెట్ ఒప్పుకోకపోవడంతో ఆయన కారులోనే కర్నూలుకు వచ్చారు. – ఇ. మల్లికార్జున్‌రెడ్డి, ఏబీపీఎం సభ్యులు, ఏకలవ్యాన్ భుజం తట్టింది ఇప్పటికీ గుర్తే వాజ్‌పేయితో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న మురళీమనోహర్ జోషి ఏక్తాయాత్ర చేపట్టి జమ్మూలోని వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లారు. ఆ సమయంలో వాజ్‌పేయిని కలిసేందుకు నేనూ వెళ్లాను. ఆలయం వద్ద ఆయనను కలిసి మాట్లాడాను. అంత పెద్ద నాయకుడైన ఆయన మాతో కొద్దిసేపు ముచ్చటించారు. నేను 8వ తరగతి చదువుతున్న సమయంలో కర్నూలు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే ఓ కార్యక్రమానికి వాజ్‌పేయి వచ్చారు. ఆ సందర్భంగా మా తండ్రి కాళింగి పుల్లయ్యవర్మ సూచనతో నేను వాజ్‌పేయికి పూల దండ వేశాను. అప్పడు ఆయన నా భుజం తట్టారు. ఆ విషయం ఇంకా గుర్తుంది. – కాళింగి నరసింహవర్మ, బీజేపీ సీనియర్ నాయకులు -
స్వర్ణ చతుర్భుజి ఎంత బాగుందో..
జ్ఞాపకం :తన కలల రహదారి ‘స్వర్ణ చతుర్భుజి’పై ప్రయాణించడం మంచి అనుభూతిని మిగిల్చిందని అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యాఖ్యానించారు. ‘ఈ రోడ్డు ఎంత బాగుందో’ అని మురిసిపోయారు. ప్రధాని హోదాలో 2004 సంవత్సరంలో ఆయన నెల్లూరు నగరానికి వచ్చారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. నెల్లూరు వంటకాలను వాజ్‌పేయి రుచి చూశారు. సాయంత్రం జరిగిన బహిరంగ సభ అనంతరం ఆయన హెలికాప్టర్లో చెన్నైకి వెళ్లాల్సి ఉంది. కానీ సభ ముగిసే సరికి చీకటి పడింది. హెలికాప్టర్ ద్వారా ప్రయాణించేందుకు భద్రతా అధికారులు అంగీకరించలేదు. దీంతో ఆయన రహదారి మీదుగా చెన్నైకు బయలుదేరారు. హెలికాప్టర్లో కాకుండా రహదారి మీదుగా వెళ్లాల్సి ఉంటుందని వాజ్‌పేయికి వెంకయ్యనాయుడుతోపాటు అధికారులు చెప్పినపుడు ఆయన ఎంతో çసంతోషాన్ని వ్యక్తం చేశారు. తన కలకల రహదారైన స్వర్ణ చతుర్భుజి మీదుగా ప్రయాణించడం తనకు మంచి అనుభూతిని కలిగించిందని చెన్నైకి వెళ్లిన తరువాత అటల్ వ్యాఖ్యానించారు. దేశంలోని నాలుగు మెట్రో నగరాలను కలుపుతూ నాలుగు వరుసల రహదారి నిర్మాణం వాజ్‌పేయి చేపట్టి పూర్తి చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబయి నుంచి కోల్‌కతా వరకు అనుసంధానం చేస్తూ జాతీయ రహదారి(నాలుగు లేన్లు) నిర్మించారు. అందులో భాగంగా జిల్లాలో 190 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. గురువారం ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు. జిల్లాతో ఆయనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. ఐదుసార్లు జిల్లాకు వచ్చి వెళ్లారు. ఆయన జ్ఞాపకాలను జిల్లావాసులు గుర్తుచేసుకుంటున్నారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం అందరికీ ఆదర్శం అని, ఆయన మృతి దేశానికి తీరని లోటని జిల్లాకు చెందిన పలువురు నాయకులు, ప్రజాపతినిధులు పార్టీలకు అతీతంగా పేర్కొన్నారు. వాజ్‌పేయికి నెల్లూరు జిల్లాతో ఉన్న అనుబంధంపై ప్రత్యేక కథనం నెల్లూరు(బారకాసు):జనసంఘ్ పార్టీని స్థాపించిన తరువాత పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రక్రియలో భాగంగా 1977లో ఆయన నెల్లూరుకు వచ్చారు. అప్పుడు పార్టీ నేతలతో ఆయన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తలందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి అనుమానాలను నివృత్తి చేశారు. నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసంఘ్ తరపున అన్నదాత మాధవ రావు విజయం సాధించి పార్టీకి ఒక గుర్తింపును తీసుకొచ్చారు. ఆ తరువాత జనతా పార్టీలో జనసంఘ్ విలీనమైన తరువాత అందులో నుంచి బయటకు వచ్చేసి 1980లో బీజేపీని ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటైన మొదటి సంవత్సరంలో నగరంలోని పురమందిరం(టౌన్‌హాల్)లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యారు. 1983లో ఆయన ఉదయగిరిలో ఆ పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేసిన ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు మద§ద్దతుగా ప్రచారం చేసేందుకు వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ తరపున ఇందిరాగాంధీ కూడా జిల్లాకు వచ్చారు. అప్పట్లో ఆయన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకునేవి. హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడినా.. కొద్దిపాటి భాషా పరిజ్ఞానం ఉన్నవారికి కూడా సులభంగా అర్థమయ్యేది. ప్రసంగంలో ఆయన ఉపయోగించే కవితలు, చమత్కారాలు ఎంతగానో ఆకట్టుకునేవి. అంతేగాక విమర్శలు చేసేటప్పుడు కూడా ఎంతో సంస్కారవంతమైన పదాలను ఉపయోగించి తన హుందాతనాన్ని నిలుపుకునే వారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వూరు రాధాకృష్ణారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. అందులో పాల్గొన్న వాజ్‌పేయి కాంగ్రెస్, టీడీపీపై చేసిన విమర్శలను కూడా ప్రజలను ఆసక్తిగా వినడం గమనార్హం. వీఆర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో కూడా వాజ్‌పేయి పాల్గొన్నారు. రాజకీయాల్లో విలువలకు అధికంగా ప్రాధాన్యం ఇచ్చే వాజ్ పేయి సభలకు పార్టీలకు అతీతంగా ప్రజలు హాజరయ్యేవారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా ఆయన సభలకు హాజరై ఆయన ప్రసంగాలు విని ఆనందించేవారు. 2004లో భారత ప్రధానిగా ఆయన నెల్లూరు నగరానికి వచ్చారు. అప్పట్లో ఏసీ సుబ్బారెడ్ది స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పా ల్గొన్నారు. ఆ రోజున వాజ్ పేయికి మోకాలు నొప్పి అధికం కావడంతో ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన గంటన్నర పాటు విశ్రాంతి తీసుకున్నారు. వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అతిథి గృహానికి పిలిపించుకుని వారితో ముచ్చటించారు. వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్‌ను రాజకీయాలలోకి రావాలని కూడా ఆయన ఆహ్వనించారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కు చెందిన షార్ కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు. 2003లో షార్ కేంద్రానికి ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త సతీష్ ధావన్ పేరును పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పేరును ప్రధానిగా వాజ్‌పేయి పెట్టారు. షార్ ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో ఆవిష్కరించారు. షార్ కేంద్రాన్ని చూస్తే తనలో నూతనోత్సాహం వస్తుందని పలుమార్లు ఆయన శాస్త్రవేత్తలకు తన మనసులోని మాటను తెలిపారు. సతీష్ దవన్ స్పేస్ సెంటర్ నామకరణం చేసింది వాజ్‌పేయి సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్స్పేస్సెంటర్ (షార్) కేంద్రంతో మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి విడదీయరాని అనుబంధాన్ని పెంచుకున్నారు. ఆయన 1999 నుంచి 2004 దాకా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1999 మే 26న షార్‌లో నిర్వహించిన పీఎస్ఎల్వీ సీ2 ప్రయోగానికి విచ్చేశారు. ఆ ప్రయోగంలో సముద్రాల మీద ఆధ్యయనం చేసేందుకు ఐఆర్ఎస్–పీ4 (ఓషన్‌శాట్)తో పాటు కిట్‌శాట్–3, ఉత్తరకొరియాకు చెందిన డీఎల్ఆర్ మైక్రోశాటిలైట్స్, జర్మనీ టబ్‌శాట్ అనే ఐదు ఉపగ్రహాలను రోదసీలోకి పంపించారు. ఈ ప్రయోగాన్ని తిలకించేందుకు వాజ్‌పాయి ప్రధాని హోదాలో విచ్చేశారు. అప్పటిదాకా అందరు ప్రధానులు మిషన కంట్రోల్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని తిలకించేవారు. అలాంటింది ప్రయోగాన్ని దగ్గరగా తిలకించాలని కోరడంతో ఆయన కోసం ప్రయోగవేదికకు సుమారు ఐదు కిలోమీటర్లు దూరంలో ఒక కూడలిలో అప్పట్లో సుమారు రూ.5 లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా ఒక షెడ్డు వేశారు. దీనికి త్రీడీ గ్లాసులు కూడా ఏర్పాటు చేశారు. ఆ త్రీడీ గ్లాసుల్లో నుంచి ప్రయోగాన్ని మొదటి దశలో మండే దగ్గర నుంచి ఆయన ప్రత్యక్షంగా తిలకించారు. ప్రయోగాన్ని తిలకించిన తరువాత మిషన్ కంట్రోల్ సెంటర్‌కు విచ్చేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత 2004లో షార్ కేంద్రానికి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌గా పేరు మార్పుచేసినపుడు వాజ్‌పేయి చేతులు మీదుగా ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఆవిష్కరించారు. ఆయన షార్కు విచ్చేసినపుడు అప్పటి ఇస్రో చైర్మన్ కస్తూరిరంగన్, అప్పటికి షార్ డైరెక్టర్ వసంత్ ఘనంగా స్వాగతం పలికారు. వాజ్‌పేయి మరణం తీరనిలోటు నెల్లూరు(బారకాసు):మాజీ ప్రధాని వాజ్‌పేయి మరణం బీజేపీ శ్రేణులకు తీరని బాధ కలిగిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల రమేష్ తెలిపారు. ఆయన మరణానికి తాము సంతాపాన్ని ప్రకటిస్తున్నామన్నారు. రోడ్లు, నదులు అనుసంధానం, ప్రోక్రాన్ అణుపరీక్షలతో దేశాన్ని అభివృద్ధి పథంలో వాజ్‌పేయి తీసుకెళ్లారన్నారు. ఆయనకు నెల్లూరుజిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే ఆవేదన కలుగుతుందన్నారు. వాజ్‌పేయి మృతికి మేకపాటి సంతాపం నెల్లూరు(సెంట్రల్): మాజీ ప్రధాని, భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిపై నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యతరగతి కుటుంబం లో జన్మించి, అత్యున్నత శిఖరాలను చేరిన ఆయన జీవితం దేశానికే గర్వకారణం అని తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాలను కలు పుతూ రహదారులను నిర్మించిన గొప్ప దార్శనికుడని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రధానిగా ఉండి కూడా ఏ మాత్రం ఎవరినీ ఇబ్బందులకు గురిచేయకుండా ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రధానంగా కార్గిల్ యుద్ధంలోనూ , ప్రోక్రాన్–2 అణుపరీక్షల నిర్వహణలోనూ ఆయన స్థిర చిత్తంగా వ్యవహరించారని పేర్కొన్నారు. 1999లో ఆయన ప్రభుత్వం ఒకే ఒక ఓటుతో విశ్వాసం కోల్పోయిన ఘటన ఆయనకు ప్రజాస్వామ్యం పట్ల ఉన్న నిబద్ధతకు తార్కాణం తెలిపారు. పదవిని తృణపాయంగా విడిచిపెట్టి భావి తరాలకు ప్రజాస్వామ్య విలువలను తెలియజేశారని రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చిరంజీవి యువతకు అభినందనలు నెల్లూరు(బృందావనం):గుజరాత్లో 2001సంవత్సరం జనవరిలో జరిగిన భూకంపం కారణంగా బాధితులైన వారిని ఆదుకున్న అఖిలభారత చిరంజీవి యువతను అప్పటి భారత ప్ర«ధాని అటల్‌బిహారీవాజ్‌పేయి అభినందించారని యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరుకు చెందిన చిరంజీవి అభిమాని కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం రాత్రి విలేకరులకు తెలిపారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో భూకంప బాధితులను అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు ఆర్.స్వామినాయుడు ఆధ్వర్యంలో ఉభయ తెలుగురాష్ట్రాలకు చెందిన చిరంజీవి యువత నాయకులు సురేష్(కర్నూలు), బషీర్(ఒంగోలు), ఆనందరాజు(హైదరాబాద్), రవీంద్రబాబు(గుంటూరు) తదితరులతో కలసి రెండునెలలకు పైగా కచ్‌ప్రాంతంలో విశేష సేవలందించామన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తామంతా అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయిని ఆయన కార్యాలయంలో కలసి తమ సేవలను వివరించామన్నారు. అలాగే తాము అఖిలభారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో సేకరించిన రూ.3లక్షల చెక్కును అందజేశామని కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన తాముచేసిన సేవలను గుర్తించి ఎంతో ప్రశంసించారని, అలాగే అభిమానులుగా స్వయంగా వచ్చి సేవలందించడంపట్ల, నటుడిగా ఉన్న చిరంజీవికి అభినందనలు తెలిపారన్నారు. -
తిరుమదిలో వాజ్‌పేయి
రాజకీయాల్లో మెరిసిన భారత రత్నం అటల్ బిహారీ వాజపేయి. పార్లమెంటరీ విలువలకు నిలు వెత్తు నిదర్శనం ఈ నిష్కళంక రాజనీతిజ్ఞుడు. ఒక్క ఓటుతో ప్రధాని పదవి పోతుందని తెలిసినా నీతిమాలిన చర్యలకు పాల్పడని గొప్ప ఆదర్శవాది. ప్రతిభ ఆధారంగా వరించి వచ్చిన పదవులకు వన్నెలద్దిన మహనీయుడు. భారత పార్లమెంటరీ చరిత్ర పుటల్లో తనదైన ముద్రవేసుకున్న మహానుభావుడు. గురువారం ఆయన దివంగతులయ్యారని తెలియగానే జిల్లా ప్రజానీకం శోకతప్త హృదయాలతో నివాళులర్పించింది. ఆయనకు జిల్లాకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంది. సాక్షి, తిరుపతి: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తిరుమల వాసులకు చిరకాలం గుర్తుండే నాయకుడు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్న సమయంలో కళ్యాణీ డ్యాం నుంచి నీటి పంపింగ్ వ్యవస్థను ప్రారంభించిన ప్రధాని అని తిరుమల వాసులు చెప్పుకుంటున్నారు. ఆయన మరణంతో తిరుమల వాసులు సంతాపం తెలియజేశారు. 1997–98 మధ్య కాలంలో తిరుమలలో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. ఆ సమయంలో అప్పటి టీటీడీ ఈఓ ఐవీ సుబ్బారావు నీటి సమస్య తీర్చేం దుకు అధికారులతో సమావేశమయ్యారు. తిరుపతి సమీపంలోని కళ్యాణీ డ్యాం నుంచి నీటిని తిరుమలకు తీసుకురావాలని నిర్ణయించారు. 1999 నవంబర్ 18న కళ్యాణీ డ్యాం నుంచి తిరుమలకు నీటిని పంపింగ్ చేయటానికి భూమిపూజ చేశారు. పంపిం గ్ పనులను 61 రోజుల్లో పూర్తి చేశారు. 2000లో తిరుమలకు వచ్చిన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నీటి పంపింగ్ వ్యవస్థను ప్రారంభించా రు. దానికి కళ్యాణి గంగ అని నామకరణం చేశారు. ఆ సందర్భంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు అప్పటి టీటీడీ తొలి స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ రాంబాబు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు 1999, ఆ తర్వాత 2003లో ప్రధాన మంత్రి హోదాలో తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రధాన మంత్రి హోదాలో తిరుపతి దూరదర్శన్ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. 1981లో బీజేపీ జాతీయ పార్టీ అ«ధ్యక్షుని హోదాలో అటల్ బీహార్ వాజ్‌పేయి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచార సభలో వాజ్‌పేయి.. ప్రధాని కాకముందు నుంచే వాజ్‌పేయి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. 1981లో బీజేపీ తిరుపతి కోనేటి కట్ట వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 1994లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తంబళ్లపల్లె, మదనపల్లె, వాయల్పాడు, పీలేరు, తిరుపతిలో పర్యటించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా సంతాప సభలు.. వాజ్‌పేయి మృతి పట్ల జిల్లాలోని బీజేపీ నాయకులు సంతాప సభలు నిర్వహించి ఆయన సేవలను కొనియాడారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మదనపల్లెలో చల్లపల్లి నరసింహారెడ్డి వాజ్‌పేయితో ఉన్న అనుబంధం గురించి ప్రస్తావించారు. 1980లో తాను పార్టీలో చేరిన సమయంలో వాజ్‌పేయిని కలిసినట్లు తెలిపారు. ఆయన పలుకరింపు ఎప్పటికీ మరచిపోలేనన్నారు. -
‘తండ్రిని రాముడిగా, కూతుర్ని దుర్గగా వర్ణించారు’
న్యూఢిల్లీ : రాజకీయాల్లో అజాతశత్రవుగా ఎదిగిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. పదిసార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. నిక్కచ్చిగా, సూటిగా మాట్లాడే వాజ్‌పేయి అంటే విపక్ష నేతలకు కూడా అభిమానమే. జవహర్లాల్ నెహ్రూ అంటే తనకు చాలా ఇష్టమని బహిరంగంగానే ప్రకటించేవారు వాజ్‌పేయి. రాజకీయ రంగంలో ఆయన ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. అయితే వాజ్‌పేయి ప్రధాని అవుతారని నెహ్రూ ఎప్పుడో జోస్యం చెప్పారు. అతనికి గొప్ప భవిష్యత్తు ఉంది వివరాలు.. 1957లో వాజ్‌పేయి తొలిసారిగా ఉత్తర ప్రదేశ్ బలరాంపూర్ నుంచి రెండో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా లోక్‌సభలో క్రీయాశీలంగా ఉండేవారు వాజ్‌పేయి. ఆయన ఉత్సాహం నెహ్రూను ఎంతో ఆకర్షించింది. ఒకసారి నెహ్రూ, వాజ్‌పేయిని బ్రిటీష్ ప్రధానికి పరిచయం చేస్తూ.. ‘ఇతను మా లోక్‌సభలో యువ ప్రతిపక్ష నేత. నన్ను ఎప్పుడూ విమర్శిస్తుంటాడు. నాకు మాత్రం ఇతనికి గొప్ప భవిష్యత్తు ఉండబోతోందనిపిస్తోంది. మా దేశంలో వికసిస్తోన్న యువ పార్లమెంటేరియన్లకు ఇతను ప్రతీక’ అంటూ వాజ్‌పేయి భవిష్యత్తు గురించి స్వయంగా నెహ్రూ అనాడే జోస్యం చెప్పారు. వ్యక్తిగతంగా అభిమాని.. రాజకీయాల్లో ప్రత్యర్థి ఒకసారి వాజ్‌పేయి నెహ్రూని విమర్శిస్తూ.. ‘పండిట్జీ మీరు శీర్షాసనం వేస్తారని నాకు తెలుసు. ఆరోగ్యానికి అది ఎంతో మేలు చేస్తుంది కూడా. కానీ దేశంలో జరిగే విషయాలను కూడా అలా తలకిందులుగానే చూస్తానంటే కుదరదం’టూ విమర్శించారు. వ్యక్తిగతంగా నెహ్రూ అంటే ఎంతో అభిమానమున్నప్పటికీ ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్‌పేయి తన బాధ్యతలను విస్మరించేవారు కారు. అందువల్లే నెహ్రూ 1961లో ఏర్పాటు చేసిన జాతీయ సమగ్రతా మండలీలో వాజ్‌పేయిని నియమించారు. ఆయన శ్రీరాముడిలాంటి వారు నెహ్రూ పట్ల తన గౌరవాన్ని చూపించడంలో వాజ్‌పేయి ఎవరికి భయపడేవారు కారు. 1964లో నెహ్రూ మరణించినప్పడు వాజ్‌పేయి మాట్లాడుతూ.. ‘ఒక కల చెదిరిపోయింది.. విశ్వంలో ఒక జ్వాల మరుగునపడిపోయింది. ఆకలి, భయమంటే తెలియని ప్రపంచం గురించి కలగన్న గులాబీ నేడు రాలిపోయింది. చీకటితో పొరాడి మాకు దారి చూపిన వెలుగు అస్తమించిందం’టూ నివాళులు అర్పించారు. అంతేకాక నెహ్రూ చాలా నిజాయితీ గల వ్యక్తి, చర్చలంటే భయపడే వారు కారంటూ నెహ్రూను, వాజ్‌పేయి శ్రీరామునితో పోల్చారు. కూతురితోనూ ఢీ... అయితే వాజ్‌పేయికి నెహ్రూతో ఉన్నంత మంచి సంబంధాలు ఆయన కూతురు ఇందిరా గాంధీతో లేవు. 1970లో ఒకసారి పార్లమెంట్లో వాడివేడి చర్చలు జరుగుతున్న సందర్భంలో ఇందిరా గాంధీ జన్ సంఘ్‌ను ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ విమర్శలు చేశారు. అంతేకాక తాను తల్చుకుంటే జన్‌సంఘ్‌ను 5 నిమిషాల్లో నాశనం చేస్తానంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు ఇందిరా గాంధీ. అయితే తర్వాత మాట్లాడిన వాజ్‌పేయి ప్రధాని ఇందిరా గాంధీ మాటలకు ధీటుగా బదులిస్తూ ‘ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రధాని ఇలా మాట్లాడటం సమంజసమేనా’ అంటూ విమర్శించారు. అంతేకాక ఆమె(ప్రధాని ఇందిర) జన్‌సంఘ్‌ను కేవలం 5 నిమిషాల్లో నాశనం చేస్తానని అన్నారు... 5 నిమిషాల్లో ఆవిడ తన జుట్టునే సరిచేసుకోలేరు అలాంటిది జన్‌సంఘ్‌ను ఎలా మారుస్తారంటూ’ వాజ్‌పేయి ప్రశ్నించారు. అంతేకాక నెహ్రూజీ కూడా కోప్పడేవారని, కానీ ఇలా మాత్రం మాట్లాడేవారు కారంటూ గుర్తు చేశారు. ఇందిరను దుర్గా దేవిగా అయితే మంచి పనులు చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులను పొగడటానికి వాజ్‌పేయి ఏ మాత్రం సిగ్గుపడే వారు కారు. అందుకే1971 పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించడంతో వాజ్‌పేయి, పార్లమెంట్ సాక్షిగా ఇందిరా గాంధీని దుర్గామాతాతో పోల్చారు. అలానే కాంగ్రెస్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోను వాజ్‌పేయికి మంచి స్నేహం ఉండేది. వాజ్‌పేయి చివరి వరకూ నమ్మిన సిద్ధాంతం ‘రాజకీయ చదరంగం కొనసాగుతూనే ఉంటుంది. పార్టీలు, ప్రభుత్వాలు ఏర్పడతాయి, పడిపోతాయి. కానీ ఈ దేశం, ప్రజస్వామ్యం ఎన్నటికి నిలిచి ఉంటాయి’. -
కరుణపైనే ఆయనకు మక్కువ
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో నామమాత్రంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి జవసత్వాలు కల్పించి అధికారంలోకి వచ్చేలా బలోపేతం చేసిన ఆ పార్టీ నేతల్లో ప్రథముడు అటల్ బిహారీ వాజ్‌పేయి అని చెప్పక తప్పదు. అయితే అంతటి మహానేత జీవితంలో చారిత్రాత్మక చేదు అనుభవాన్ని తమిళనాడు మిగిల్చింది. 1996లో అటల్ ప్రభుత్వం తొలిసారిగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా తగిన మెజార్టీ లేకపోవడంతో ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేశారు. ఎన్డీఏలో లేని కొన్ని ఇతర పార్టీల వారు వాజ్‌పేయ్‌కి లోపాయికారితనంగా మద్దతుపలుకుతామన్నా అయన అంగీకరించలేదు. ఎంపీలను కొనుగోలు చేయడం వంటి నీతిబాహ్యమైన పనులకు పాల్పడడం తనకు నచ్చదు. అందుకే మెజార్టీ లేదని ఒప్పుకుంటూ రాజీనామా చేస్తున్నానని వాజ్‌పేయ్ నిజాయితీగా తప్పుకున్నారు. ఇంద్రకుమార్ గుజ్రాల్ ప్రభుత్వం కూలిపోయిన తరువాత 1998–99లో వచ్చిన మద్యంతర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రాగా వాజ్‌పేయి ప్రధాని అయ్యారు. ఆనాటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే మద్దతు పలికింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కూటమి తమిళనాడులో 39కి గానూ 30 సీట్లు గెలుచుకుని జాతీయస్థాయిలో ప్రాముఖ్యతను పొందింది. అన్నాడీఎంకే కీలకపాత్ర పోషించగా అప్పటి ఎన్నికల్లో ఎన్డీఏకి 255 సీట్లు దక్కగా 37.5 శాతం మెజార్టీతో అత్యధిక శాతం సీట్లు కలిగిన కూటమిగా కేంద్రంలో వాజ్‌పేయ్ నేతృత్వంలో ప్రభుత్వం అవతరించింది. కేంద్రంపై తనకు పూర్తి పట్టు ఉండడంతో జయ కొన్ని కోర్కెలను వాజ్‌పేయ్ ముందుంచింది. తనపై ఉన్న అన్ని అవినీతి కేసులను ఎత్తివేయాలని, రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని జయ కోరారు. ఇందుకు వాజ్‌పేయ్ ప్రభుత్వం నిరాకరించడం జయకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఎన్డీఏ ప్రభుత్వ బలపరీక్ష సమయంలో జయ తన చేతిలో ఉన్న ఒకే ఒక ఓటును వ్యతిరేకంగా వేయడం ద్వారా 13 నెలల వాజ్‌పేయ్ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ఈ రకంగా వాజ్‌పేయ్‌కి తమిళనాడుతో శాశ్వతమైన చేదు అనుభవమే మిగిలింది. తమిళనాడుతో తరగని అనుబంధం: ♦ 1983–84 మధ్యకాలంలో బీజేపీ నేతగా వాజ్‌పేయ్ తొలిసారి తమిళనాడులో కాలుమోపి కోయంబత్తూరుకు వచ్చారు. ♦ 1995లో ఎండీఎంకే మహానాడుకు వాజ్‌పేయ్ హాజరయ్యారు. ♦ 1995లో మదురైకి, 1997లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని హోదాలో తిరుచ్చిరాపల్లికి వచ్చారు. ♦ రెండోసారి ప్రధాని అయినపుడు 1999లో శ్రీలంక ఈలం తమిళుల రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలపై అప్పటి తమిళనాడుముఖ్యమంత్రి కరుణానిధితో పలుమార్లు మాట్లాడారు. ♦ 2001లో తిరుచ్చిరాపల్లి పర్యటనలో వాజ్పేయితోపాటూ వైగో, డాక్టర్ రాందాస్, కాంగ్రెస్ నేత కుమారమంగళంతోపాటూ ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉండడం చెరిగిపోని చరిత్ర. ♦ కావేరి జలవివాదంపై 2002–03 మధ్య కాలంలో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత శ్రీకృష్ణ, తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వంతో చర్చలు జరిపారు. ♦ 2004 ఏప్రిల్‌లో రోడ్డు మార్గంలో నెల్లూరుకు వెళ్లేందుకు చెన్నై ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధాని వాజ్‌పేయ్‌కి ముఖ్యమంత్రి జయలలిత స్వాగతం పలకడం ద్వారా స్నేహాన్ని పెంచుకున్నారు. ♦ తమిళనాడులోని అందరు నేతల కంటే కరుణానిధి అంటే వాజ్‌పేయ్‌కి ఎంతో ప్రేమాభినాలు కనబరిచేవారు. -
వాజ్‌పేయికి ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: అనారోగ్యంతో కన్నుమూసిన భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మూత్రపిండ నాళాల ఇన్ఫెక్షన్, మూత్రనాళాల ఇన్ఫెక్షన్, ఛాతీ సంబంధిత సమస్యతో గత కొన్ని రోజులు ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన గురువారం కన్నుమూశారు. దీంతో ఆయన పార్థివదేహాన్ని ఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గ్‌కు తరలించారు. కృష్ణ మీనన్ మార్గ్‌లోని నివాసంలో వాజ్‌పేయిని కడసారి చూసేందుకు హాజరైన పలువురు నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కృష్ణ మీనన్ మార్గ్‌లోని నివాసంలో వాజ్‌పేయి పార్థివదేహానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు బీజేపీ కురు వృద్ధుడు ఎల్ కే అద్వానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్, కేరళ, తమిళనాడు గవర్నర్లు సదాశివం, భన్వరీలాల్ పురోహిత్‌లు నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ నేతల విజయసాయి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వరప్రసాద్‌లు వాజ్‌పేయి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. బాలీవుడ్ ప్రముఖులు జావేద్ అక్తర్, షబానా అజ్మీలు వాజ్‌పేయికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం వాజ్‌పేయి పార్థివదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించగా, ఆయనకు ఘనంగా తుది వీడ్కోలు పలికేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివస్తున్నారు. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతకు నివాళులర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యూపీ సీఎం ఆదిత్యానాథ్ యోగిలు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. పార్టీలకు అతీతంగా బీజేపీ కేంద్ర కార్యాలయానికి నేతలు, ప్రజలు తరలివస్తున్నారు. వాజ్‌పేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంట దాటిన తర్వాత వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాజ్‌పేయి మృతి నేపథ్యంలో కేంద్రం ఈ నెల 22 వరకు సంతాప దినాలుగా ప్రకటించింది. -
బీజేపీ కార్యాలయంలో అటల్జీ పార్థివదేహం..
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పార్ధివ దేహాన్ని ఆయన నివాసం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. పార్టీ కార్యాలయంలో దివంగత నేత భౌతిక కాయానికి పెద్దసంఖ్యలో తరలివచ్చిన పార్టీ నేతలు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు బీజేపీ కార్యాలయంలో దివంగత నేతకు తుది నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 1 గంట వరకూ కడసారి దర్శనం చేసుకునేందుకు ప్రజలను అనుమతిస్తారు. ప్రియతమ నేతకు వీడ్కోలు పలికేందుకు బాధాతప్త హృదయాలతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పార్టీలకతీతంగా జనం పెద్దసంఖ్యలో దేశ రాజధానికి తరలివచ్చారు. ఇక మధ్యాహ్నం నాలుగు గంటలకు దివంగత నేత అంతిమ యాత్ర ప్రారంభమవనుంది. రాష్ర్టీయ స్మృతి స్ధల్లో వాజ్‌పేయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లాల్ బహుదూర్ శాస్ర్తి విజయ్ ఘాట్, నెహ్రూ మెమోరియల్ శాంతి వన్ల మధ్య స్మృతి స్థల్లో అంత్యక్రియలు జరగనున్నాయి. -
మీ నవ్వును మిస్సవుతాం బాప్జీ : షారూఖ్
కోల్‌కతా: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఇకలేరనే వార్త విషాదాన్ని నింపింది. రాజకీయా, క్రీడా, సినిమా, వ్యాపార రంగాల్లోని ప్రముఖులంతా ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయనతో ఉన్న మధుర క్షణాలను నెమరు వేసుకుంటున్నారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సైతం ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ లేఖను ట్వీట్ చేశాడు. ‘ఢిల్లీలో ఉన్నప్పుడు నా తండ్రి వాజ్‌పేయీ ప్రసంగాలకు తీసుకెళ్లేవారు. ఆ తర్వాత నేను పెద్దవాడిని అయ్యేకొద్ది వాజ్పేయీతో కలిసి సమయం గడిపే అవకాశం వచ్చింది. మేం ఎప్పుడు కలుసుకున్నా కవిత్వాలు, సినిమాలు, రాజకీయాలు, నయమవుతున్న మోకాలి నొప్పుల గురించే మాట్లాడుకునేవాళ్లం. ఆయన రాసిన పద్యాల్లోని ఓ పాటలో నాకు నటించే గౌరవం దక్కింది. మా ఇంట్లో ఆయన్ను అందరూ బాప్జీ అని పిలుస్తారు. ఈరోజు దేశం ఓ గొప్ప తండ్రిని, నేతను కోల్పోయింది. చెప్పాలంటే చిన్నతనంలో నేను ఆయనతో గడిపిన క్షణాలను, కవిత్వాలను కోల్పోతున్నట్లుగా ఉంది. నేను సినిమాల్లో రాణిస్తున్న రోజుల్లో ఆయన ప్రభావం నాపై ఎంతో ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబీకులకు సంతాపం తెలుపుతున్నాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మిమ్మల్ని మిస్సవుతాం బాప్జీ’ అని షారూఖ్ పేర్కొన్నాడు. దీనికి ఓ పాట వీడియో లింక్‌ను జత చేశాడు. For The Poet Prime Minister of our country, love you Baapji...https://t.co/IKTYouMdiy pic.twitter.com/kLO4JAHvNu — Shah Rukh Khan (@iamsrk) August 16, 2018 -
మహాశిఖరానికి నివాళులు అర్పించేందుకు..
ఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులు అర్పించేందుకు పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. కృష్ణ మీనన్ మార్గ్‌లోని నివాసంలో వాజ్‌పేయిని కడసారి చూసేందుకు జనం పోటెత్తారు. ఈ క్రమంలోనే వాజ్‌పేయి స్మృతులను గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి పార్ధివ దేహానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్‌లు లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వాజ్‌పేయి మృతి దేశానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఆయన అందరితో బాగుంటూ, గొప్ప మానవతావాదిగా ఉండేవారన్నారు. కేరళ, తమిళనాడు గవర్నర్లు సదాశివం, భన్వరీలాల్ పురోహిత్‌లతో పాటు వైఎస్సార్సీపీ నేతల విజయసాయి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వరప్రసాద్‌లు వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. బాలీవుడ్ ప్రముఖులు జావేద్ అక్తర్, షబానా అజ్మీలు వాజ్‌పేయికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. -
వాజ్‌పేయి కేవలం ముసుగు మాత్రమే!
న్యూఢిల్లీ : భారత్‌లోని వైవిధ్య సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలకు ఓ సరికొత్త నిర్వచనం చెప్పిన దార్శనికుడు.. పార్టీల సిద్ధాంతాలకతీతంగా విస్తృత జనావళి అభిమానం చూరగొన్న నేత మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి (93) కన్నుమూశారు. ‘ఏ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ’ (సరిపోని శిబిరంలో సరైన వ్యక్తి)గా ప్రజల చేత పిలువబడిన వ్యక్తి వాజ్‌పేయి. పార్టీలకు, సిద్ధాంతాలకతీతంగా ఆయన అవలంభించిన ఆదర్శాలే ఇందుకు కారణం. వాజ్‌పేయి తన జీవితంలో పాటించిన ఆదర్శాల గురించి ఆయనతో సుదీర్ఘంగా కలిసి ప్రయాణించిన సంఘ్ ప్రచారకర్త, తెలుగువారైన కేఎన్ గోవిందాచార్య ఏమన్నారంటే.. ‘రాజకీయాల్లో వాజ్‌పేయి పాటించిన కొన్ని ఆదర్శాలే నేడు ఆయనను అజాతశత్రువుగా నిలిపాయి. ఆయన ‘అధికారం కావాలి కానీ దానికోసం ఎవరి ముందు చేయి చాచను.. దేనికి తలవంచను’ అనే వారు. ‘ఉత్తమమైన రాజకీయాలంటే ప్రజలతో కూడినవే కానీ అధికారంతో కూడినవి కాదు అనే వారు. రాజకీయాలు ఎప్పుడైనా ప్రజలకు మేలు చేసేవిలానే ఉండాలి కానీ అధికారం కోసం అర్రులు చాచేవిగా ఉండకూడదు అనేవారని’ గోవిందాచార్య తెలిపారు. వాజ్‌పేయ్ నమ్మిన అతి ముఖ్యమైన మరో విషయం ఏంటంటే వ్యక్తిగత, రాజకీయ ఆశయాలు పార్టీకి లోబడి ఉండాలి.. పార్టీ ఆశయాలు దేశ, సామాజిక ప్రయోజనాలకు లోబడి ఉండాలనేవారు. ఆయన కూడా అలానే నడుచుకునే వారన్నారు గోవిందాచార్య. వాజ్‌పేయి నమ్మిన మరో రెండు సిద్ధాంతాలు ‘ఎవరూ కూడా వివాదాస్పద రాజకీయాల్లో మునిగిపోకూడదు. మన చేతలు, మాటల ద్వారా ప్రజలకు సన్నిహితంగా ఉండాలి అనే వారు. అంతేకాక పార్టీలో ఉన్న వారు వారి వారి ఆశయాల సాధన కోసం వివాదరహితంగా ఉంటూ పనిచేయాలి’ అనే కోరుకునే వారని గోవిందాచార్య తెలిపారు. అయితే వాజ్‌పేయి, గోవిందాచార్యలకు 1997లో మనస్పర్థలు వచ్చాయి. అప్పటి రిపోర్టుల ప్రకారం జనరల్ సెక్రటరీగా పని చేస్తోన్న గోవిందాచార్య ‘ఎల్కే అడ్వాణీయే అసలైన నాయకుడు .. వాజ్‌పేయి కేవలం ముసుగు మాత్రమే’ అనే ఆరోపణలు చేశారనే వార్తలు వచ్చాయి. ఈ మాటలు తన ప్రధాని హోదాకు భంగం కల్గించేవిగా ఉన్నాయంటూ వాజ్‌పేయి అడ్వాణీకి లేఖ రాశారు. ఈ విషయం గురించి గోవిందాచార్య ‘ఆ వివాదం 1997, అక్టోబర్ 3 న మొదలై.. అక్టోబర్ 30 1997 ముగిసింది. నేను వాజ్‌పేయిని బీజేపీ ముసుగు అన్నాను. కానీ మీడియా నా మాటలను వక్రీకరించింది. అందులో నా తప్పేం లేదు అని ఆయనకు తెలియజేయడం కోసం 17 పేజీల లేఖ రాశాను. ఆయన అప్పుడు దాని గురించి స్పందించలేదు. కానీ 1998లో నన్ను మరోసారి జనరల్ సెక్రటరీగా నియమించారు. అంటే ఆ వివాదం అప్పటికే ముగిసినట్లే కదా’ అన్నారు. అంతే కాక కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి (బీజేపీ), ఆర్ఎస్ఎస్కి బేధాభిప్రాయాలు వచ్చేవి. ఆ సమయంలో వారు ఒకరికొకరు ఎదురు పడేవారు కాదు అని తెలిపారు. ఇన్సూరెన్స్‌లో ఎఫ్‌డీఐలను అనుమతించడం, ప్రపంచ వాణిజ్య సంస్థ, పెటేంట్ చట్టాలు, తెహ్రీ డ్యాం, రామజన్మభూమి వంటి అంశాల్లో బీజేపీకి, సంఘ్‌కి మధ్య విబేధాలు తలెత్తాయి అని తెలిపారు. -
అటల్ జీ.. ఓ జ్ఞాపకం
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు. శత్రు దేశంలో సైతంఅభిమానులను సంపాదించుకున్న గొప్ప దార్శనికుడిగా మాజీ ప్రధాని అటల్ బిహారివాజ్‌పేయి గుర్తింపు పొందారు. అంతటి గొప్పనేత గురువారం సాయంత్రం మృతి చెందారు. అటల్ మరణంతో నగరం కన్నీటి పర్యంతమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా,ప్రధానమంత్రిగా వివిధ సందర్భాల్లో వాజ్‌పేయి గ్రేటర్లో పలుమార్లు పర్యటించారు.ఇక్కడితో ఆయనకున్న అనుభవాలు, బంధాలను సిటీ నేతలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సాక్షి,సిటీబ్యూరో, మేడ్చల్/బంజారాహిల్స్/నాగోలు: మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి ఇక లేరనే వార్త నగర వాసుల్లో విషాదాన్ని నింపింది. ఆయన మృతితో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను తీవ్రంగా కలచివేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా వివిధ సందర్భాల్లో వాజ్‌పేయి గ్రేటర్లో పలుమార్లు పర్యటించారు. ప్రధానిగా ఉన్న సమయంలో నగరంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన చేతులమీదుగానే ప్రారంభించారు. ఈ సందర్భంగా అటల్జీతో గడిపిన ఆత్మీయ క్షణాల్ని పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. ముందస్తు ఎన్నికల ప్రకటన.. 2004 లోక్‌సభకు జరిగిన ముందస్తు ఎన్నికల నిర్ణయం ట్యాంక్‌బండ్ సమీపంలోని మారియట్ హోటల్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్నదే కావటం విశేషం. ముషీరాబాద్ నియోజకవర్గంలో వాజ్‌పేయి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. గతంలో ఆయన రెండుసార్లు ఈ నియోజకవర్గంలో పర్యటించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే లక్ష్మణ్ తదితర నేతలు వాజ్‌పేయితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మాదాపూర్‌లోని సైబర్ టవర్‌ను 1998 నవంబర్ 22న ప్రధాని హోదాలో ఆయన ప్రారంభించారు. 1994లో మేడ్చల్ పట్టణానికి వాజ్‌పేయి వచ్చారు. ఐఎస్బీ ప్రారంభోత్సవానికి.. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ బిజినెస్ (ఐఎస్బీ)ను 2001 డిసెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. 1989లో నిజాం కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనేందుకు రైలులో వచ్చిన ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దిగి కొంత సేపు ఈ ప్రాంత బీజేపీ నాయకులతో ముచ్చటించారు. పలువురు నేతల సంతాపం ఉగ్రవాదంపై అంతర్జాతీయ యూత్ కన్ఫరెన్స్‌ను ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో 2003లో నిర్వహించిన సమావేశంలో ప్రధాని హోదాలో అటల్ బీహారీ వాజ్‌పేయి పాల్గొన్నారు. వాజ్‌పేయితో తన స్ఫూర్తిదాయక అనుబంధం ఉందని ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి అన్నారు. సంస్కరణలకు జీవం పోసిన మహోన్నత వ్యక్తి వాజ్‌పేయి అని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. వాజ్‌పేయి మృతి పట్ల రాష్ట్ర మంత్రి పద్మారావు సంతాపం వ్యక్తం చేశారు. అప్పటి యువమోర్చా నాయకుడు స్వామిగౌడ్, బీజేపీ ఓబీసీ సెల్ కార్యదర్శి కటకం నర్సింగ్‌రావులు వాజ్‌పేయితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి మృతికి సంతాపం సాక్షి, సిటీబ్యూరో: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గొప్ప కవి, సాహితీవేత్త మహోన్నతుడని తెలుగు టీవీ రచయితల సంఘం అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ అన్నారు. గురువారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కవి సమయం, భారత్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీమాన్ వానమామలై వరదాచార్యుల 106వ జయంతి, స్మారక పురస్కార ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది పెద్దలు కనిపించని లోకానికి వెళ్లారని, అయినా వారు అందించిన పరిమళాలు ఇప్పటికి ఉన్నాయని తెలిపారు. తెలుగు చరిత్రలో వానమామలై వరదాచార్యులది సుస్థిర స్థానమన్నారు. ఈ సందర్భంగా భారత్ భాషా భూషణ్ డాక్టర్ తిరునగరికి స్మారక పురస్కార ప్రదానం చేశారు. సభలో ప్రారంభంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ మృతికి సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో కవి సమయం నిర్వాహకులు తాళ్లపల్లి మురళీధరగౌడ్, సీనియర్ జర్నలిస్టు ఉడయవర్లు, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీలకు చేయూతనిచ్చారు.. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా బలపడడానికి మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఎంతో సేవ చేశారని బీజేపీ మైనార్టీ మోర్చా అధికార ప్రతినిధి ఫీరాసత్అలీ బాక్రీ పేర్కొన్నారు. గురువారం వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం చీరాగ్అలీలైన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. 1977– 79లో వాజ్‌పాయి విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ నగరంలో పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పొషించారని కొనియాడారు. 1996లో ధూల్‌పేట్‌కు.. అబిడ్స్: 1996లో ధూల్‌పేట్‌ను అటల్ బిహారీ వాజ్‌పేయి సందర్శించారు. ధూల్‌పేట మినీ స్టేడియంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్‌సింగ్ జెమేదార్ నిర్వహించిన అటల్ కేసరి కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కుస్తీ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. నిర్వాహకులు వాజ్‌పేయిని ఘనంగా సత్కరించి మార్వాడీ టోపీ, తల్వార్‌ను బహూకరించారు. -
అయితే టీ తాగుదాం పదండి..
సాక్షి, న్యూఢిల్లీ : అటల్ బిహారి వాజ్‌పేయి ఎంత మృధు స్వభావో అంతటి చమత్కారి కూడా అంటుంటారు. వాజ్‌పేయి ప్రధానిగా వ్యవహరించిన సమయంలో ఆయన క్యాబినెట్ సహచరుడు అరుణ్ శౌరి తనకు ఎదురైన పలు అనుభవాలను పంచుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై విశ్లేషణకు పార్టీ నేతలు, మంత్రులతో వాజ్‌పేయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. గంభీరవాతావరణంలో సమావేశం ప్రారంభమైంది. నేతలు ఒక్కొక్కరే ఓటిమికి దారితీసిన పరిస్థితులను వివరించారు. భాగస్వామ్య పక్షం శివసేన బీజేపీ అవకాశాలను దెబ్బతీసిందని ఒక నేత అంటే. పార్టీకి వ్యతిరేకంగా ముస్లింలు ఏకమయ్యారని మరో నేత చెప్పుకొచ్చారు. మరో నేత పార్టీ యంత్రాంగం బలహీనపడిందని విశ్లేషించారు. సమావేశంలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఓటమికి మరొకరిని బాధ్యుల్ని చేసి చేతులు దులుపుకునేలా వ్యవహరించారు. వారి అభిప్రాయాలను ఓపిగ్గా విన్న వాజ్‌పేయి ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు. సమావేశ మందిరంలో అందరిలో ఉద్వేగ వాతావరణం నెలకొనగా ఒకే ఒక్క మాటతో వాజ్‌పేయి అక్కడి వాతావరణాన్ని తేలికపరిచారు.‘ పార్టీ ఓటమికి కొత్త కారణాలు ఏమీ లేవంటారు అంతేగా..అయితే టీ తాగుదాం పదండి’ అంటూ లేచారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనతో సన్నిహితంగా పనిచేసిన అరుణ్ శౌరి మాజీ ప్రధాని సామర్థ్యం, నైపుణ్యాలను కొనియాడారు. తన వద్ద పనిచేసే వారిలో అత్యుత్తమమైన పనితనాన్ని ఆయన రాబడతారని అరుణ్ శౌరి గుర్తుచేసుకున్నారు. ఇతరుల నుంచి మెరుగైన పనిరాబట్టడంలో వాజ్‌పేయి చతురత దాగుందని..మరికొందరు ఇతరుల నుంచి పేలవమైన సామర్థ్యం రాబడతారని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి చురకలు అంటించారు. అరుణ్ శౌరి గత కొంతకాలంగా మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. -
హైటెక్ సిటీ ప్రారంభించింది ఆయనే!
సాక్షి, హైదరాబాద్ : దేశసేవ కోసమే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి.. భరతమాత ముద్దుబిడ్డ.. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం సాయంత్రం అనంత లోకాలకు వెళ్లిపోయారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయన విలువల కోసమే పోరాడిన యోధుడతను. వాజ్‌పేయికి అన్ని రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల నేతలు, ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగేవి. దేశ ప్రధానిగా వాజ్‌పేయికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో ప్రత్యేక అనుబంధం ఉండేది. ప్రధానిగా హోదాలో ఆయన నాలుగు సార్లు హైదరాబాద్ సందర్శించారు. నగరానికి ఐటీ హబ్‌గా ఉన్న హైటెక్ సిటీ(సైబర్ టవర్స్)ని 1998లో వాజ్‌పేయినే ప్రారంభించారు. ప్రతిష్ఠాత్మక ఈ సిటీ ప్రారంభోత్సవానికి వాజ్‌పేయి ముఖ్యఅతిథిగా రావడం ఎంతో గర్వకారణం. హైటెక్ సిటీనే మన హైదరాబాద్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఐటీ సౌకర్యం. హైటెక్ సిటీ మైక్రోసాఫ్ట్, జీఈ, ఒరాకిల్ వంటి అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు మెట్టునిల్లుగా ఉంటుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా(1980-86) కొనసాగిన సమయంలో వాజ్‌పేయి టాక్సీలో వచ్చి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. కర్ణాటకకు వెళుతూ ఆయన బేగంపేట విమానాశ్రయంలో ఆగారు. ఆ సమయంలో హెగ్డేవార్ శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకుని నేరుగా టాక్సీ తీసుకుని, ఆ ఉత్సవానికి వచ్చారు. ఎన్నికల సమయంలో, ఎమర్జెన్సీ కాలంలో, ప్రధాన మంత్రిగా నగరంలో జరిగిన పలు బహిరంగ సమావేశాలకు వాజ్‌పేయి హాజరయ్యారని బీజేపీ నేతలు గుర్తు చేసుకున్నారు. పేదలకు నివాస యోగ్యం కల్పించేందుకు ఏర్పాటుచేసిన పథకం వాంబే స్కీమ్(వాల్మికి అంబేద్కర్ ఆవాస్ యోజన)ను ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే లాంచ్ చేశారు. ఆ పథకాన్ని లాంచ్ చేసిన అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు కూడా ఆయనే శంకుస్థాపన చేశారు. అంతేకాక 2000 జూన్‌లో హైదరాబాద్‌లోని ప్రముఖ బసవతారక ఇండో-అమెరికన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్, రీసెర్చి సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరై వాజ్‌పేయి తన అభిమానాన్ని చాటుకున్నారు. 2004లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా వాజ్‌పేయి హాజరయ్యారు. అంతకుముందు 1984లో వాజ్‌పేయి రెండుసార్లు హైదరాబాద్ వచ్చారు. అదీ ఎన్టీఆర్‌కు మద్దతుగా. తన ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు నిరసనగా ఎన్టీఆర్ అప్పట్లో నిరసనకు దిగగా, వాజ్‌పేయి అండగా నిలిచారు. ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కాగా.. ప్రమాణస్వీకారానికి వాజ్‌పేయి హాజరయ్యారు. హైదరాబాద్‌తో పాటు, ఏపీలోని గుంటూరు నగరాన్ని కూడా వాజ్‌పేయి పలుసార్లు సందర్శించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన పలు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. వాజ్‌పేయి జన్ సంఘ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, గుంటూరుకు చెందిన అడ్వకేట్ జూపూడి యజ్ఞ నారాయణ జన్ సంఘ్‌కు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో నారాయణ కుటుంబ సభ్యులకు, వాజ్‌పేయి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఎప్పుడూ గుంటూరు వచ్చినా.. నారాయణ ఇంటికి వెళ్లేవారు. నారాయణ ఎంఎల్ఏగా పోటీచేసినప్పుడు, వాజ్‌పేయి ఆయన మద్దతుగా పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇలా పలువురు బీజేపీ నాయకులకు మద్దతుగా వాజ్‌పేయి ప్రచారాల్లో పాల్గొనేవారు కూడా. గుంటూరులో జిన్నా టవర్ నుంచి బీఆర్ స్టేడియంకు వెళ్లే వీరసవకార్ రోడ్డును వాజ్‌పేయినే ప్రారంభించారు. -
వాజ్‌పేయికి ప్రముఖుల నివాళి
-
వాజ్‌పేయి మృతి : సెలవు ప్రకటించిన రాష్ట్రాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతికి సంతాపసూచకంగా శుక్రవారం పలు రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో గురువారం వాజ్‌పేయి తుదిశ్వాస విడవడంతో కేంద్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించడంతో కొన్ని రాష్ట్రాలు సైతం ఈనెల 16 నుంచి 22 వరకూ సంతాపదినాలను ప్రకటించాయి. ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు శుక్రవారం విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించాయి. కర్నాటక ప్రభుత్వం కూడా నేడు సెలవు ప్రకటించింది. వరద సహాయక కార్యక్రమాలు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని పేర్కొంది. తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, యూపీ, కర్ణాటక, జార్ఖండ్, ఒడిషా, తమిళనాడు, అసోం, గోవా వంటి 14 రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హాఫ్ డే సెలవును ప్రకటించింది. -
వాజ్‌పేయీ.. విశాఖ నిను మరువదోయి
దేశం గర్వించే నేత..భాష పులకించిన కవి..దాయాదిదేశానికి సవాల్‌తో పాటుస్నేహాన్ని స్వాగతించిన ధీరోదాత్త ప్రధాని..ఆయన వ్యక్తిత్వం ఓ పాఠం..ఆయన ప్రసంగం.. విలువైన పుస్తకం.. ఆయన నిర్ణయం.. దేశంలో మార్పునకు చిహ్నం..ఆయన రాజనీతి.. ఎందరికో దిక్సూచిఆయన మరణం.. ముగిసిన ఓ రాజకీయ శకంవ్యక్తిత్వానికి నిలువుటద్దంగా, నిస్వార్థ రాజకీయాలకు సరైన నిర్వచనంగా.. మానవతా విలువలకు అసలైన చిరునామాగా వెలుగొందిన వాజ్‌పేయి అస్తమించారన్న విషయం జీర్ణించుకోలేనిది. ఆర్ఎస్ఎస్ భావజాలంతో, నీతి నిజాయితీలే అసలైన సిద్ధాంతాలుగా జీవించారు. విలువలన్నీ ఒకటైతే.. అతనే వాజ్‌పేయి అని ప్రతిపక్ష నేతలు సైతం ప్రశంసించడం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఆయన మరణవార్త విన్న విశాఖ విలపించింది. ఆయనతో పంచుకున్న జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటోంది. సాక్షి, విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మధురానుబంధం ఉంది. విశాఖపై ఆయన ప్రత్యేక అభిమానం ఉండటంతో రావడానికి ఆసక్తి చూపేవారు. విశాఖకు జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెట్టిన స్టీల్‌ప్లాంట్, విశాఖ పోర్టు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల అభివృద్ధి, మనుగడకు ఆయన ఎంతో కృషి చేశారు. వాజ్‌పేయి ప్రధాని హోదాతో పాటు వివిధ హోదాల్లో పలుసార్లు వైజాగ్ వచ్చారు. ఇక్కడ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు రూ.1300 కోట్ల మూలనిధి : వాజ్‌పేయి 1998లో ప్రధానిగా ఉన్న సమయంలో స్టీల్‌ప్లాంట్‌కు రూ. 1300కోట్ల మూలనిధి ఇచ్చి ఆదుకున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ, విశాఖ పోర్టుకు కనెక్టివిటీ రో డ్లు, నేవీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ని అప్‌గ్రేడ్, యూనివర్సిటీల పటిష్టతలో భాగంగా ఏయూలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభా గాల స్థాపన వంటి వాటికి కృషి చేశారు. విశాఖ బీచ్‌లో వాకింగ్ : వాజ్‌పేయికి విశాఖ బీచ్ అంటే ఎంతో ఇష్టం. ఆయన ప్రధాని కాకముందు వరకు వైజాగ్ వచ్చినప్పుడల్లా తోటి నాయకులతో బీచ్‌కు Ððవెళ్లేవారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసేవారు. వాకింగ్‌కు వీలు కాని పరిస్థితుల్లో కారులో సాగరతీరంలో షికారుకు వెళ్తామనేవారు. ఆయన అభీష్టం మేరకు కారులో బీచ్ తిప్పేవారు. సాగరతీరం, ప్రకృతి అందాలను చూసి వాజ్‌పేయి ఎంతో మురిసిపోయేవారని ఆయనతో సన్నిహితంగా గడిపిన పీవీ చలపతిరావు ‘సాక్షి’తో చెప్పారు. ఆయన మృతికి బీజేపీ శ్రేణులు సంతాపం తెలిపాయి. విశాఖలో గుండెపోటు.. కేజీహెచ్‌లో చికిత్స అటల్ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో ప్రాణ సంబంధమైన అనుబంధం కూడా ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో విశాఖ వచ్చినప్పుడు (దాదాపు 35 ఏళ్ల క్రితం) ఆయనకు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు పీవీ చలపతిరావు హుటాహుటిన కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. కార్డియాలజీ చీఫ్ డాక్టర్ సిన్హా ఆయనకు తక్షణ వైద్యం అందించారు. సోదరిగా పిలిచే చలపతిరావు సతీమణి అనూరాధ ఆస్పత్రిలో వాజ్‌పేయికి సపర్యలు చేశారు. రెండ్రోజుల విశ్రాంతి అనంతరం వాజ్‌పేయి ఢిల్లీ పయనమయ్యారు. అప్పట్నుంచి విశాఖ అంటే వాజ్‌పేయికి మరింత అభిమానం పెరిగింది. ఒకే రూమ్‌లో ఉండే అరుదైన అవకాశం దక్కింది వాజ్‌పేయితో అత్యంత సన్నిహితంగా మెలిగాను. ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. వాజ్‌పేయి తొలిసారి 1961లో విశాఖలో పర్యటించారు.ఆ ఏర్పాట్లు నేనే చేశాను. ప్రధాని హోదాలోనూ చాలా సార్లు పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారు. గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆయన అభినందించడం ఎవ్వరూ మర్చిపోలేని జ్ఞాపకం. అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం ..ఇలా చాలా సార్లు సభలకు వాజ్‌పేయి హాజరయ్యారు. ఆయనకు విశాఖ చాలా ఇష్టం. ఆయన ఓసారి పుట్టిన రోజు వేడుకల్ని కూడా ఇక్కడ చేసుకున్నారు. శ్రీకాకుళం ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రచారానికి వాజ్‌పేయ్ కుశభావ్ ఠాక్రే కలిసి వచ్చారు. శ్రీకాకుళంలోని అతిథి గృహంలో ఒక గదిలో ఠాక్రే, మరో గదిలో వాజ్‌పేయి విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో ఆయనతో కలిసి ఒకే రూమ్‌లో ఉండే అరుదైన అవకాశం లభించినందుకు చాలా గర్వంగా అనిపించింది. – పీవీ చలపతిరావు, బీజేపీ సీనియర్ నేత ఆయన ప్రసంగం కోసం సభకు వెళ్లాను వాజ్‌పేయి ప్రసంగమంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన సభకు వాజ్‌పేయి హాజరయ్యారు. అప్పుటికి నేను రాజకీయాల్లోకి ఇంకా రాలే దు. కేవలం ఆయన ప్రసంగం వినాలని వచ్చి సభ ముగిసేవరకూ ఉన్నాను. ఆయనంటే అంత అభిమానం నాకు. ఉభయసభలకు 12 సార్లు పార్లమెంట్‌కు వెళ్లడం సామాన్యమైన విషయం కాదు. 1999లో ఒక్క ఓటు తక్కువ వచ్చి ప్రధాని పదవిని 13 నెలల్లోనే కోల్పోయారు. ఆ ఒక్క ఓటు ఉంటే ఐదేళ్లు పాలించేవారు. అయినా.. డబ్బులిచ్చి, ప్రలోభపెట్టి ఎంపీల్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలేవీ చెయ్యలేదు. అదే ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. హైవే విస్తరణ ప్లాన్‌లో మధురవాడ క్రికెట్ మైదానం కొంత రోడ్డులో కలిసిపోయింది. విషయం తెలిసి అప్పటిæ మేయర్ డీవీ సుబ్బారావుతో కలిసి ప్రధాని వాజ్‌పేయికి రిప్రజెంటేషన్ పంపించాం. ఆయన స్పందించి, ప్లాన్ మార్చడంతో.. ఇప్పుడా మైదానం అంతర్జాతీయ క్రికెట్‌కు వేదికైంది. – విష్ణుకుమార్ రాజు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విశాఖతో మధురానుబంధం ♦ వాజ్‌పేయి తొలిసారి ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించడానికి ముందు 1977లో ఆయన జన్‌సంఘ్ పార్టీ నాయకుని హోదాలో విశాఖలో అడుగుపెట్టారు. ♦ 1980లో బీజేపీ ఏర్పాటయ్యాక ఆయన 1982లో విశాఖ వచ్చారు. ♦ 1981లో జరిగిన ఎన్నికలలో విశాఖ మున్సిపాలిటీలో 50 వార్డులకు గాను బీజేపీ 25వార్డులలో విజయభేరి మోగించింది. ఫలితంగా విశాఖ తొలి మేయర్‌గా ఎన్ఎస్ఎన్ రెడ్డి ఎన్నికయ్యారు. వాజ్‌పేయి అప్పట్లో బీజేపీ మేయర్ ఎన్నికల విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు వన్‌టౌన్‌లోని ప్రస్తుత జీవీఎంసీ స్టేడియం ఉన్న స్థలంలో పౌరసన్మానం చేశారు. ♦ 1983లో మరోసారి విశాఖ వచ్చారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ తరపున ప్రచారం చేశారు. ♦ 1997లో విశాఖ మేయర్ ఎన్నికల సమయంలో విశాఖ వచ్చారు. ఎన్నికల ప్రచారం చేసి వెళ్లారు. ♦ వాజ్‌పేయికి 1988లో షíష్టిపూర్తి సందర్భంగా ఏయూ కాన్వొకేష¯Œన్ హాలులో ఘన సన్మానం చేశారు. వాజ్‌పేయి 1993లో భారత్ పరిక్రమ్ యాత్ర సందర్భంగా విశాఖ వచ్చారు. అప్పటి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రస్తుత అధికార ప్రతినిధి పృథ్వారాజ్ ఆయనను కలుసుకున్నారు. ♦ 1998 సార్వత్రిక ఎన్నికల సమయంలో డీవీ సుబ్బారావు విశాఖ ఎంపీగా, పీవీ చలపతిరావు అనకాపల్లి ఎంపీగా బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిద్దరి తరపునా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ♦ 2004 ఎన్నికల సమయంలో కె. హరిబాబు వన్‌టౌన్ ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎంవీవీఎస్ మూర్తి పోటీ చేశారు. అప్పట్లో టీడీపీ–బీజేపీ పొత్తు కారణంగా ఇరు పార్టీల అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేశారు. -
వాజ్‌పేయి సహాయకుడిగా..
అద్వానీ తన జీవిత చరిత్ర ‘మై కంట్రీ మై లైఫ్’ పుస్తకంలో.. వాజ్‌పేయితో అనుబంధాన్ని పంచు కున్నారు. అప్పుడే లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన వాజ్‌పేయికి రాజకీయ సహయకుడిగా తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించానని ఆయన గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ.. ‘వాజ్‌పేయి తీసుకున్న అణుపరీక్షల నిర్ణయం, పాకిస్తాన్‌తో సంబంధాల పునరుద్ధరణకు నిజాయతీగా చేసిన ప్రయత్నాలు మన దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి’ అని కొనియాడారు. ఎలాంటి గొడవలు జరగకుండా వాజ్‌పేయి నాయకత్వంలో మూడు కొత్త రాష్ట్రాలు చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లు ఏర్పాటయ్యాయయని ప్రస్తుతించారు. ఏకాభిప్రాయాన్ని సాధించగల గొప్ప నేత వాజ్‌పేయి అని ఒక సందర్భంలో ఆయన పాలనాదక్షతను మెచ్చుకున్నారు. వాజ్‌పేయి భారతరత్నకు అన్ని విధాల అర్హుడని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అద్వానీ లేఖ కూడా రాశారు. 1998–2004 మధ్య కాలంలో వాజ్‌పేయి ప్రధానిగా పనిచేసిన సమయంలో అద్వానీ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. పానీపూరీ తింటూ.. స్కూటర్‌పై షికారు చేస్తూ రాజకీయాల్లో అలాంటి మిత్రుల్ని అరుదుగా చూస్తుంటాం. వారే వాజ్‌పేయి, ఎల్కే అద్వానీలు.. దాదాపు ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. వారిద్దరి అనుబంధం 1950ల నాటిది. అప్పటి నుంచి వారి మధ్య ఒక ప్రత్యేక స్నేహబంధం కొనసాగింది. దాదాపు ఐదు దశాబ్దాలు నమ్మకమైన సన్నిహితులుగా కొనసాగిన వాజ్‌పేయి, అద్వానీలు ప్రతీ సమయంలోను ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగారు. ఆ అనుబంధం దేశ రాజకీయాల్లో బీజేపీ రూపంలో పెనుమార్పులే తీసుకొచ్చింది. 1980, ఏప్రిల్‌లో వారిద్దరి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రూపుదిద్దుకుంది. వాజ్‌పేయితో చిన్ననాటి స్నేహాన్ని అద్వానీ గుర్తుచేసుకుంటూ.. ‘ఇద్దరం యువకులుగా ఉన్నప్పుడు వీధుల్లో పానీపూరీలు తింటూ షికార్లు చేసేవాళ్లం. నేను స్కూటర్ నడుపుతుంటే వెనుక వాజ్‌పేయి కూర్చునేవారు. నేను పెద్దగా చాట్ తినకపోయినా వాజ్‌పేయి చాలా ఇష్టంగా తినేవారు’ అని ఒక సందర్భంలో వెల్లడించారు. -
పాలనాదక్షుడు...
స్వేచ్ఛా వాణిజ్యానికీ, సరళతర ఆర్థిక విధానాలకు దన్ను ఇచ్చిన వాజ్‌పేయి ఆర్థిక సంస్కరణల్లో తనదైన ముద్రవేశారు. 1991లో పీవీ నరసింహరావు ప్రవేశపెట్టిన సరళీకరణ ఆర్థిక విధానాల స్ఫూర్తిని వాజ్‌పేయి కొనసాగించారు. వాజ్‌పేయి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలనే తరువాతి ప్రధానులు కొనసాగించారు. దేశాన్ని నూతన శకంవైపు నడిపించడానికి రాజమార్గాలు వేశారు. ప్రధానంగా ‘పెట్టుబడుల ఉపసంహరణ’‘ఆర్థిక దుబారా’లాంటి ఆర్థిక సంస్కరణలను ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. వాజ్‌పేయి హయాంలో ఆర్థిక సంస్కరణలు.. మౌలిక సదుపాయాల కల్పన: మౌలిక సదుపాయాల కల్పనకు వాజ్‌పేయి ప్రభుత్వం పెట్టింది పేరు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా విడివడి ఉన్న గ్రామాలన్నింటినీ కలిపే గొప్పకార్యాన్ని చేపట్టారు. దీంతో గ్రామాల నుంచి వ్యవసాయ ఉత్పాదనలు దేశ వ్యాప్తంగా రవాణా చేసేందుకు వీలు అయ్యింది. అలాగే చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలను కలుపుతూ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే నిర్మించడంలో కృత కృత్యులయ్యారు. ఆర్థిక దుబారా నియంత్రణకు చట్టం... ఆర్థిక దుబారాని నియంత్రించేందుకు వాజ్‌పేయి ప్రభుత్వం కృషి చేసింది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఆర్థిక దుబారా నియంత్రణకు వాజ్‌పేయి ప్రభుత్వం పూనుకుంది. 2000 ఆర్థిక సంవత్సరం నాటికి జీడీపీలో 0.8 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ పొదుపుని 2005 కల్లా 2.3 శాతానికి వృద్ధి చేసిన ఘనత వాజ్‌పేయిదే. జీడీపీ సైతం రెండంకెల స్థాయికి చేరువయ్యింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ప్రైవేటైజేషన్... వ్యాపార రంగంలో ప్రభుత్వ పాత్రను వాజ్‌పేయి వ్యతిరేకించేవారు. అందులో భాగంగానే పెట్టుబడుల ఉపసంహరణను ప్రోత్సహించారు. దానికి ప్రత్యేకించి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు. ప్రస్తుత ఆర్థికశాఖా మంత్రి అరున్జైట్లీయే ఆ శాఖకు తొలి మంత్రి. భారత్ అల్యూమినియం కంపెనీ, హిందూస్థాన్ జింక్, ఇండియన్ పెట్రో కెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అలాగే వీఎస్ఎన్ఎల్లు నాటి ప్రధాన పెట్టుబడుల ఉపసంహరణల్లోనివి. టెలికం విప్లవం... దేశంలో మొబైల్ ఫోన్ విప్లవానికి ఆద్యుడు వాజ్‌పేయి. కాల్‌రేట్లను తగ్గించి, టెలికాం కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి దారులువేస్తూ సరికొత్త టెలికాం విధానానికి శ్రీకారం చుట్టారు. నిర్ణీత లైసెన్స్ ఫీజు, ఆదాయం పంచుకునే పద్ధతి స్థానంలో సరికొత్త టెలికాం విధానాన్ని ప్రవేశపెట్టి విప్లవాత్మకమైన మార్పులకు కారణమయ్యారు వాజ్‌పేయి. టెలికాం రంగంలో వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్‌ని ఏర్పాటుచేసి, ప్రభుత్వ నియంత్రణ, వివాదాల పరిష్కారాల పాత్రను వేరుచేసారు. ఇప్పుడు మొబైల్ కనెక్టివిటీ ఎంతగా ఎదిగిందంటే ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధి మంత్రం అయిన జన్‌ధన్, ఆధార్, మొబైల్ (జేఏఎం–జామ్)లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఢిల్లీ మెట్రో రైలుకి అంకురార్పణ... ఢిల్లీలో మెట్రో రైలు నిర్మాణానికి అంకురార్పణ జరిగింది వాజ్‌పేయి హయాంలోనే. మెట్రో రాకతో పట్టణ ప్రజల రవాణా సమస్య పరిష్కార మైంది. టెలికం విధానం ప్రవేశపెట్టడం ద్వారా టెలికాం రంగంలో విప్లవాన్ని సృష్టించారు. మౌలిక సదుపాయాల కల్పనకు రోడ్లు, రైల్వే, ఎయిర్‌పోర్టుల్లాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కి నిధులు ... భారతదేశంలోనే తొలి ఆధునిక మెట్రోరైలు ప్రాజెక్టుకి అంకురార్పణ. విద్యా హక్కును ప్రాథమిక హక్కుల్లో భాగం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో ప్రభుత్వ రంగ కంపెనీల వాటాలు విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం పెంచారు. ఈశాన్య రాష్ట్రాల ప్రాధాన్యాన్ని గర్తించి ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం ఢిల్లీ లాహోర్ బస్సు ప్రారంభంతో పాకిస్తాన్‌తో స్నేహానికి దారులు వేసారు... -
సిసలైన స్టేట్స్‌మన్
అనుభవజ్ఞుడైన రాజకీయ నేత. మరీ ముఖ్యంగా మంచి నిర్ణయాలు తీసుకో గలిగిన వాడిగా గౌరవం పొందిన వ్యక్తి కేంబ్రిడ్జ్ ఇంగ్లిష్ నిఘంటువులో స్టేట్స్‌మన్ అన్న పదానికి ఇచ్చిన విపులార్థం ఇది. భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయికి ఈ వర్ణన అచ్చు గుద్దినట్లు సరిపోతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వ పక్షం తరఫున ఐక్యరాజ్య సమితిలో దేశం వాణిని వినిపించడమైనా.. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలన్నట్లు గోధ్రా అల్లర్ల విషయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ‘రాజ ధర్మం’పాటించాల్సిందేనని చెప్పడమైనా. వాజ్‌పేయి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన్ను ఓ మంచి స్టేట్స్‌మన్‌గా నిలబెట్టే సంఘటనలు బోలెడు. పార్టీ సిద్ధాంతాల కంటే దేశం ముఖ్యమని మనసా వాచా కర్మేణా నమ్మి ఆచరించిన వ్యక్తి! అమెరికాను ధిక్కరించిన ధీరత్వం.. అణ్వాయుధాలు దాచుకున్నారన్న నెపంపై అమెరికా 2003, మార్చి 20న ఇరాక్‌పై యుద్ధం ప్రకటించింది. బ్రిటన్, పోలండ్, ఆస్ట్రేలియా తదితర 48 దేశాలు అమెరికా పక్షాన ఇరాక్‌పై కదన రంగంలోకి దిగాయి. యుద్ధం మొదలైందో లేదో.. 20 వేల మంది సైనికులను పంపాల్సిందిగా అమెరికా భారత్‌ను కోరింది. మూడేళ్ల క్రితమే భారత్ తన సహజ భాగస్వామి అని గొప్పగా ప్రకటించింది. ఇంకోవైపు రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, హోం శాఖ మంత్రి ఎల్.కె.అద్వానీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జశ్వంత్ సింగ్‌లు అమెరికాతో చేయి కలపడం మేలన్న సలహాలు ఇచ్చారు. మరోవైపు ఒక వర్గం మీడియా ఇరాక్ యుద్ధంలో భారత్ పాల్గొంటేనే మేలని కథనాలు ప్రచురించాయి. అమెరికా అధ్యక్షుడి రోజువారీ ఫోన్లు ఇంకోవైపు!! ఇంత ఒత్తిడి, గందరగోళం మధ్య కూడా స్థిర చిత్తంతో అమెరికా నిర్ణయాన్ని తోసిపుచ్చగలిగింది ఒక్క వాజ్‌పేయి మాత్రమే. యుద్ధంలో పాల్గొనేది లేదని ఆయన పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేశారు. ప్రధానిగా తనకున్న అనుమానాలకు, ప్రజాభిప్రాయాన్ని కూడా జోడించి తీసుకున్న ఈ నిర్ణయం తరువాతి కాలంలో అంతర్జాతీయ వేదికలపై దేశం గౌరవాన్ని కాపాడిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. జెనీవా వేదికగా భారతీయ గళం.. 1994లో జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసేందుకు తద్వారా భారత్ పరువు తీసేందుకు పాక్ పన్నాగం పన్నింది. మానవహక్కుల ఉల్లంఘన పేరుతో ఇస్లామిక్ దేశాల మద్దతు కూడగట్టి కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వివాదం చేయాలన్న ఈ కుట్రను ఛేదించేందుకు ప్రధాని హోదాలో పి.వి.నరసింహారావు ఎవరిని నియమించారో తెలుసా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజ్‌పేయిని!! ఈ కాలం రాజకీయ నేతల్లా వాజ్‌పేయి.. ‘‘ప్రభుత్వం చేయాల్సిన పని మేమెందుకు చేయాలి? మీకు చేతకాకపోతే దిగిపోండి.. మేము చేసి చూపిస్తాం’’టైపు గంభీరోపన్యాసాలు ఇవ్వలేదు. పీవీ తనకు ఇచ్చిన గౌరవాన్ని అంతే హుందాగా నిలుపుకున్నాడు. జెనీవా వేదికగా పాకిస్థాన్ కుట్రలను తన వాగ్ధాటితో ఛిన్నాభిన్నం చేశాడు. కశ్మీర్ విషయానికి వస్తే భారతీయులంతా ఒక్కటేనని.. మా భూభాగాన్ని కాపాడుకోవడం ఎలాగో మాకు బాగా తెలుసునని పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పారు. నిజాయితీ రాజకీయాలు.. 1976.. డిసెంబర్ 31. ఎమర్జెన్సీ కాలం. ఢిల్లీలోని వాజ్‌పేయి నివాసానికి ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి రామ్ బహదూర్ రాయ్ వచ్చాడు. కాంగ్రెస్ మంత్రి ఓమ్ మెహతా అటల్‌జీని కలిశాడన్న వార్త వినడంతో రాయ్ హడావుడిగా విచ్చేశాడు. ‘‘వాజ్‌పేయిగారు.. ఇది నిజమేనా? ఓం మెహతా మిమ్మల్ని కలిశారట’’అని రాయ్ అడిగాడు. ‘‘ఆయన చాలా పెద్దమనిషి.. నేనే ఆయన్ని కలవడానికి వెళ్లాను’’అంటూ ఠక్కున వచ్చింది సమాధానం! కొంత నిశ్శబ్దం తరువాత వాజ్‌పేయి మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అల్లరిమూకలు చేస్తున్న విధ్వంసాన్ని వివరించారు. ఏబీవీపీ కూడా తన తప్పులను ఒప్పుకుని ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పడం మంచిదని, ఇలా చేస్తే ఎమర్జెన్సీ ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వాజ్‌పేయి రామ్ బహదూర్‌కు సూచించారు కూడా. ఆ అల్లర్లకు.. ఏబీవీపీకి సంబంధం లేదని రాయ్ అనడం.. ‘‘మీ లాంటి వాళ్లు ఇలా మాట్లాడటం సహజమే. మా లాంటి వాళ్లు ఇప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎక్కువ నమ్ముతూంటారు’’అని వాజ్‌పేయి అనడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ మీటింగ్ అక్కడితో ముగిసింది. ఏబీవీపీ క్షమాపణలు చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఏడాది తరువాతగానీ ఎమర్జెన్సీ ఎత్తివేయలేదు. రాజధర్మం పాటించాల్సిందే.. గోధ్రా అల్లర్ల తరువాత గుజరాత్లో మత హింస చెలరేగడంపై వాజ్‌పేయి ఎంతో ఆవేదన చెందారు. అక్కడ అధికారంలో ఉన్నదీ బీజేపీనే కావడం వల్ల కేంద్రంలోని తమ ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తోందని ఆయన ఆందోళన చెందారు. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించలేదని ఆయన సమక్షంలోనే ప్రకటించడం వాజ్‌పేయి నిష్పాక్షికతకు ఒక నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు చెబుతారు. గోధ్రా అల్లర్ల విషయంలో గుజరాత్ ముఖ్యమంత్రికి మీరే సలహా ఇస్తారని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘మోదీ రాజ ధర్మం పాటించాల్సిందే’’అని స్పష్టం చేశారు. రాజధర్మం అంటే ఏమిటన్నది వివరిస్తూ.. అధికారంలో ఉన్నవాళ్లు ఎగువ, దిగువ కులాల మధ్య వ్యత్యాసం చూపరాదని సమాజంలోని అన్ని మతాల ప్రజలపట్ల సమాదరణ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై కూడా పార్టీకి భిన్నంగా వాజ్‌పేయి స్పందించారు. ‘వివాదాస్పద కట్టడానికి ఎలాంటి హాని తలపెట్టమని హామీ ఇచ్చారు. అదుపు తప్పిన కొందరు కరసేవకులు కట్టడాన్ని కూల్చేశారు. అది జరగకుండా ఉండాల్సింది. దీనికి మేము చింతిస్తున్నాము’ అని స్పష్టంగా చెప్పారు. సిద్ధాంతాల చట్రంలో ఇమడని వ్యక్తి.. బీజేపీకి, సైద్ధాంతిక గురువుగా ఆర్ఎస్ఎస్ను చెప్పుకుంటారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ విధానాల రూపకల్పన మొదలుకొని, అనేక ఇతర అంశాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం ఉంటుందని ప్రచారంలో ఉన్న విషయం తెలి సిందే. వాజ్‌పేయి మాత్రం ఆర్ఎస్ఎస్ సిద్ధాంత చట్రంలో ఇమడని వ్యక్తిగా పేరుపడ్డారు. కాంగ్రెస్ వ్యతిరేకత... హిం దుత్వ విధానాల ప్రచారం ఆర్ఎస్ఎస్ ముఖ్యమైన విధానాలైతే.. చాలా సందర్భాల్లో వాజ్‌పేయి వీటిని తోసిరాజన్నా డు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా.. భారత్ తర ఫున జెనీవాలో కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితి సమావేశంలో మాట్లాడటం ఇలాంటిదే. సిద్ధాంతాలకంటే దేశం గొప్పదన్న ఆలోచన వాజ్‌పేయిది అంటారు కొందరు. -
తెలంగాణలో నేడు సెలవు
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతికి సంతాపంగా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్ర పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ అధీనంలో పనిచేస్తోన్న సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు తదితరాలు నేడు పనిచేయవని తెలంగాణ సీఎంవో కార్యాలయం ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఏడు రోజులు సంతాప దినాలు మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 7 రోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. -
అప్పుడాయన పొగిడారు కానీ.. ఇప్పుడైతేనా?
న్యూఢిల్లీ: అది 70వ దశకం. అటల్జీ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో నెహ్రూ చిత్రపటం కనబడలేదు. వెంటనే కల్పించుకున్న అటల్.. దాన్ని అక్కడే తిరిగి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయాన్ని పార్లమెంటు భేటీలోనూ ప్రస్తావించారు. ‘కాంగ్రెస్ మిత్రులు ఇది నమ్మకపోవచ్చు. సౌత్ బ్లాక్‌లో నేను వెళ్లే దారిలో నెహ్రూ చిత్రపటం ఉండేది. కానీ అకస్మాత్తుగా అది కనబడకుండా పోయింది’ అంటూ సభలో ప్రస్తావిం చారు. ‘సిబ్బందిని అడిగాను. ఆ పటం ఏదని. వారి నుంచి సమాధానం రాలేదు. తర్వాత మళ్లీ దాన్ని ఆ స్థానంలోనే పెట్టారు’ అన్నారు. దీంతో సభ ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగింది. ఇతరుల విమర్శలనూ స్వీకరించే గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి నెహ్రూ అంటూ పొగిడారు అటల్జీ. ‘విన్స్టన్ చర్చిల్, నెవిలే చాంబర్లీన్‌ల వ్యక్తిత్వాలు కలబోసిన వ్యక్తి నెహ్రూజీ అని ఓ సారి విమర్శించాను. దానికి ఆయన ఏమాత్రం కలత చెందలేదు. సాయంత్రం ఆయన్ను కలసినపుడు చాలా బాగా మాట్లాడావని పొగిడారు. ఇప్పుడలాంటి విమర్శలు చేస్తే నాతో మాట్లాడటమే మానేస్తారు’ అన్నారు. -
రాజమాత కారు కాదని.. సైకిల్‌పైనే?
గ్వాలియర్ : అప్పటికే వాజ్‌పేయి ప్రముఖ రాజకీయ నాయకుడు. ఎన్నోఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్నారు. అయినా సరే ఎంతో సాదాసీదాగా ఉండడమే ఆయనకు ఇష్టం. తాను పుట్టి పెరిగిన గ్వాలియర్‌లో సైకిల్‌పై తిరుగుతూ చిన్ననాటి స్నేహితుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తడం అంటే వాజ్‌పేయికి ఎంతో సరదా. ఈ విషయాల్ని వాజ్‌పేయి మేనకోడలు క్రాంతి మిశ్రా పంచుకున్నారు. ‘గతంలో అటల్జీ గ్వాలియర్ వచ్చినప్పుడు నా కుమారుడి సైకిల్ తీసుకుని చిన్ననాటి స్నేహితుడు దీపక్‌తో పాటు ఇతర స్నేహితుల ఇళ్లకు వెళ్లేవారు’ అని మిశ్రా పాత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు. ఒకసారి ఈ విషయం తెలిసి అప్పటి బీజేపీ నాయకురాలు, రాజమాత విజయ రాజే సింధియా.. గ్వాలియర్‌కు వచ్చినప్పుడు తనకు చెపితే ప్రత్యేకంగా కారును ఏర్పాటు చేస్తానని చెప్పినా నిరాడంబరంగా ఉండేందుకు వాజ్‌పేయి ఇష్టపడేవారు. -
విదేశీ విధానంపై చెరగని ముద్ర..
1998–2004 మధ్యకాలంలో ప్రధాని పదవిని నిర్వహించిన తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్‌పేయి నిలిచారు. ప్రధానిగా విదేశాంగ విధానంపై వాజ్‌పేయి తనదైన ముద్ర వేశారు. ఈ కాలంలో ప్రధానంగా పోఖ్రాన్–2 అణుపరీక్షలు, పాకిస్తాన్‌తో స్నేహసంబంధాల పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలు, చొరవతో పాటు 1999లో లాహోర్ డిక్లరేషన్‌ను రూపొందించడంలోనూ తన ప్రభావాన్ని చూపారు. పోఖ్రాన్ అణుపరీక్షల నేపథ్యంలో పాకిస్తాన్ కూడా పరీక్షలు జరపడంతో దక్షిణాసియాలో ఉద్రిక్తతలకు దారితీసింది. భారత్ వైఖరిని పశ్చిమదేశాలు ఖండించడంతో పాటు వివిధ రూపాల్లో ఆర్థిక ఆంక్షలు కూడా విధించారు. దీంతో అమెరికా ఇతర ఆర్థికసంస్థల నుంచి అందే ఆర్థికసహాయం కూడా నిలిచిపోయింది. సైనిక ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా కఠినమైన ఆంక్షలు అమలయ్యాయి. పాక్‌తో పాటు అమెరికాతో కూడా బంధాన్ని పెంచుకునే ప్రయత్నాలు 1998లో మొదలయ్యాయి. ఈ కారణంగా రెండుదేశాల మధ్య మూడేళ్లపాటు ద్వైపాక్షిక చర్చలకు ఆస్కారం ఏర్పడింది. ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడేందుకు ఇవి దోహదపడ్డాయి. అమెరికా ప్రోద్భలంతో భారత–పాక్‌లమధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు పునఃప్రారంభమయ్యాయి. వాజ్‌పేయి చొరవ కారణంగా 1999 ఫిబ్రవరిలో లాహోర్‌కు బస్సుయాత్రలో వెళ్లి అక్కడ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో లాహోర్ ఒప్పందంపై సంతకం చేశారు. రెండుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు అణ్వాయుధాల పోటీకి దిగరాదని, అణ్వాయుధాల వినియోగాన్ని విడనాడాలని, ఇరుదేశాల మధ్య ఘర్షణలు తగ్గించేందుకు కషి చేయాలని నిర్ణయించారు. 1988లో రాజీవ్ –బేనజీర్‌ల మధ్య అణ్వాయుధ రహిత ఒప్పందం కుదరగా, దీన్ని రెండోదిగా పరిగణిస్తున్నారు. అయితే నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ముషార్రఫ్ నేతత్వంలోని సైన్యం కూలదోయడంతో ఒప్పందం నిరుపయోగంగా మారింది. తర్వాత కార్గిల్ యుద్ధం నేపథ్యంలో దీనికి విలువలేకుండా పోయింది. కశ్మీర్‌లోని కార్గిల్ మంచుకొండల్లోకి పాకిస్తాన్ బలగాలు చొచ్చుకురావడంతో భారత్–పాక్‌ల మధ్య పరిమిత యుద్ధానికి దారితీసింది. పాక్ దురాక్రమణను అమెరికాతో పాటు పశ్చిమదేశాలు ఖండించాయి.ఈ ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కు పిలిపించాల్సిందిగా నవాజ్‌షరీఫ్‌ను అమెరికాకు పిలిపించి మరీ హెచ్చరించారు. ఈ విధంగా రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారిగా భారత్ పట్ల అమెరికా అనుకూల వైఖరి తీసుకుంది. 1999 జూలైలో కార్గిల్ నుంచి పాక్ దళాలు వెళ్లిపోవడంతో భారత సైన్యం ఆపరేషన్ విజయ్‌లో విజయం సాధించింది. 1978లో జిమ్మీకార్టర్ భారత్‌లో పర్యటించాక 22 ఏళ్ల అనంతరం 2000లో అమెరికా అధ్యక్షుడి హోదాలో బిల్ క్లింటన్ మన దేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ‘ఇండియా రిలేషన్స్ : ఏ విజన్ ఫర్ ది 21 ఫస్ట్ సెంచరీ’పత్రంపై సంతకాలు చేశారు. ఆ తర్వాతి కాలంలో అమెరికాతో భారత్ సంబంధాలు బలపడేందుకు ఈ పర్యటన, తదనంతర పరిణామాలు దోహదపడ్డాయి. 2001లో జూలైలో భారత్‌తో సంబంధాల పునరుద్ధరణలో భాగంగా పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ మనదేశాన్ని సందర్శించారు. కశ్మీర్ అంశంపై ముషార్రఫ్ మొండిపట్టుదల కారణంగా ఆగ్రాలో జరిగిన ఈ శిఖరాగ్రభేటీ నుంచి ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదు. ‘లుక్ ఈస్ట్ పాలసీ’లో భాగంగా వియత్నాం, ఇండోనేసియా దేశాల్లో పర్యటించిన వాజ్‌పేయి వ్యాపార, వాణిజ్య అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఆసియాన్ దేశాలతో వాజ్‌పేయి ప్రభుత్వం మంచి సంబంధాలు నెలకొల్పగలిగింది. 2000 జూన్‌లో లిస్బన్లో మొట్టమొదటి భారత్–ఐరోపా దేశాల సంఘం (ఈయూ) శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2003లో చైనాతో సంబంధాలు మెరగయ్యేందుకు, సరిహద్దు సమస్యలపై చర్చించుకునే దిశలో చర్యలు మొదలయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించిన సందర్భంగా రెండుదేశాల మధ్య ఆయుధాల సరఫరా, విమానాల కొనుగోలు, తదితర అంశాలపై సైనిక ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాతి ఏడాదే వాజ్‌పేయి రష్యాలో పర్యటించినపుడు ఇరుదేశాల మధ్య వాణిజ్య, భద్రతా, రాజకీయ రంగాల్లో సహకారం కోసం ‘మాస్కో డిక్లరేషన్’పై సంతకాలు జరిగాయి. -
భరతమాత ముద్దుబిడ్డ
రాజకీయవేత్తగా.. ఒప్పుకోను పరాజయం కొత్తదారి నా ధ్యేయం కాలం తలరాతను చెరిపేస్తా సరికొత్త గీతాన్ని ఆలపిస్తా తెగి పడగలం... కానీ తల వంచం పాలకులతో పేచీ నిరంకుశంపై తిరుగుబాటు అంధకారంతో లడాయి వెలుతురు కోసం పెనుగులాట తెగి పడగలం గాని తల వంచం.... కవిగా, రాజకీయవేత్తగా వాజ్‌పేయి ధోరణి ఇదే కవిగా... బాధలు చుట్టుముట్టనీ ప్రళయం కరాళనృత్యం చేయనీ కాళ్ల కింద భూమి కదలనీ శిరస్సు మీద అగ్నివాన కురవనీ ఆగొద్దు... కలసి నడవడం ఆపొద్దు దేశ రాజకీయ చరిత్రలో, బీజేపీ ప్రస్థానంలో వాజ్‌పేయిది ఓ చెరగని ముద్ర! అబ్బురపరిచే వాగ్ధాటి.. అచంచల ఆత్మవిశ్వాసం.. రాజకీయ చతురత.. రాజనీతిజ్ఞతకు చిరునామాగా నిలిచిన ఆయన ప్రతి అడుగూ ఓ మైలురాయే!! పోఖ్రాన్ అణు పరీక్షలైనా దాయాది దేశం పాకిస్తాన్‌తో శాంతిచర్చలైనా తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగారు. మూడుసార్లు ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆయన.. గొప్ప కవి కూడా. నరేంద్ర మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టగానే ఆయనకు భారతరత్న ప్రకటించారు. వాజ్‌పేయి జన్మదినాన్ని(డిసెంబర్ 25) కేంద్రం ‘సుపరిపాలన దినోత్సవం’గా నిర్వహిస్తోంది. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం నుంచి.. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాజ్‌పేయి అంచెలంచెలుగా ఎదిగారు. కృష్ణాదేవి, కృష్ణా బిహారీ వాజ్‌పేయి దంపతులకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25న ఆయన జన్మించారు. వాజ్‌పేయి తండ్రి కృష్ణ స్కూల్ టీచర్. కవి కూడా. గ్వాలియర్‌లోని సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో వాజ్‌పేయి ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తర్వాత గ్వాలియర్లోనే విక్టోరియా కాలేజీ గ్రాడ్యుయేషన్, కాన్పూర్‌లోని దయానంద్ ఆంగ్లో–వేదిక్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1939లో ఆరెస్సెస్‌లో చేరారు. 1947లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా చురుగ్గా పాల్గొన్నారు. హిందీ మాసపత్రిక రాష్ట్రధర్మ, వారపత్రిక పాంచజన్య, దినపత్రికలు స్వదేశ్, వీర్ అర్జున్‌లలో పని చేశారు. రాజకీయ ప్రస్థానం ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న వాజ్‌పేయి రాజకీయ రంగంలో ఒక్కో మెట్టు అధిష్టించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆయన అప్పటి హిందూత్వ పునాదులపై డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పడిన భారతీయ జనసంఘ్(బీజేఎస్)లో చేరారు. అనతికాలంలోనే పార్టీ ఉత్తరాది జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. 1957లో బలరాంపూర్ నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1968లో జనసంఘ్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. అప్పట్నుంచి తన సహచరులు నానాజీ దేశ్‌ముఖ్, బల్రాజ్ మధోక్, ఎల్కే అద్వానీలతో కలసి పార్టీని కొత్త తీరాలకు తీసుకువెళ్లారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నేతృత్వంలో ఉధృతంగా సాగిన సంపూర్ణ విప్లవోద్యమంలో వాజ్‌పేయి చురుగ్గా పాల్గొన్నారు. 1977లో జనసంఘ్ మద్దతుతో కేంద్రంలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా సర్కారు కొలువుదీరింది. అందులో వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితిలో తొలిసారి హిందీలో ప్రసంగించారు. 1979లో మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేయడంతో వాజ్‌పేయి కేంద్రమంత్రిగా కొద్దికాలం పాటే పనిచేయాల్సి వచ్చింది. అయితే అప్పటికే గొప్పనేతగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 3 సార్లు ప్రధాని పీఠం.. 1984 ఎన్నికల నాటికే దేశంలో ముఖ్యమైన పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ వాజ్‌పేయి నేతృత్వంలో 1996 సార్వత్రిక ఎన్నికల నాటికి తన సత్తా చాటింది. ఆ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశ పదో ప్రధానిగా వాజ్‌పేయి ప్రమాణం చేశారు. అయితే మిత్రపక్షాలు సహకరించకపోవడంతో బలపరీక్షలో ఓడిపోయి 13 రోజులకే గద్దె దిగాల్సి వచ్చింది. తర్వాత 1998లో మిత్రపక్షాలను కూడగట్టిన బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఈ సమయం(1998 మే)లోనే ఆయన రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించారు. మరోవైపు పాక్‌తో శాంతిచర్చలకు శ్రీకారం చుట్టారు. 1999లో ఢిల్లీ–లాహోర్ మధ్య చరిత్రాత్మక బస్సు సర్వీసును ప్రారంభించారు. కానీ పాక్ కయ్యానికి కాలుదువ్వి కార్గిల్ వార్‌కు కారణమైంది. ఆ యుద్ధంలో భారత ఆర్మీ ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో పాక్ సైనికులను సరిహద్దుల నుంచి తరిమేసి జయకేతనం ఎగుర వేసింది. ఈసారి కూడా వాజ్‌పేయి ప్రభుత్వం పూర్తికాలంపాటు ప్రభుత్వాన్ని నడపలేదు. మిత్రపక్షం అన్నా డీఎంకే తన మద్దతు ఉపసంహరించుకోవడంతో 13 నెలలకే ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగించింది. 1999 అక్టోబర్ 13న వాజ్‌పేయి ముచ్చటగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడి పూర్తికాలంపాటు(1999–2004) అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి కావడం విశేషం. సంస్కరణల బాటలో.. మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన వాజ్‌పేయి కీలక ఆర్థిక సంస్కరణలకు బాటలు వేశారు. విదేశీ పెట్టుబడులు, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. స్వేచ్ఛా వాణిజ్యం, సరళీకృత విధానాలతో ఆర్థికరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతీయ రహదారుల అభివృద్ధి పథకం, ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన పథకాన్ని చేపట్టారు. అమెరికా–భారత్ మధ్య స్నేహబంధం బలోపేతమైంది. 2000 మార్చిలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలోనే ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి బీజాలు వేస్తూ అనేక కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమెరికాకు దగ్గరవుతూనే పాక్‌కు స్నేహహస్తం చాచారు వాజ్‌పేయి. అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌తో ఆగ్రా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కశ్మీర్ అంశంపై ముషార్రఫ్ పట్టుపట్టడంతో ఇరుదేశాల మధ్య చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. మరోవైపు ఉగ్రవాదం కూడా వాజ్‌పేయి సర్కారుకు సవాలుగా నిలిచింది. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మూడునెలలకే.. అంటే 1999 డిసెంబర్లో కాందహార్‌లో భారత విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ప్రయాణికులను ముష్కర చెర నుంచి విడిపించేందుకు జైల్లో ఉన్న కరడుగట్టిన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. అలాగే 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. 2002లో గుజరాత్లో గోధ్రా ఘటనతో అల్లర్లు చెలరేగాయి. బీజేపీకి బీజాలు 1980లో అద్వానీ, భైరాన్‌సింగ్ షెకావత్ తదితరులతో కలసి వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని స్థాపించారు. జనతా సర్కారు తర్వాత కేంద్రంలో పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్(ఐ) ప్రభుత్వంపై వాజ్‌పేయి సునిశిత విమర్శలతో విరుచుకుపడేవారు. 1984లో ఇందిర హత్య అనంతరం సిక్కుల ఊచకోత సమయంలో ప్రభుత్వ తీరును, అది చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్‌ను తీవ్రంగా ఖండించారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండే రెండు స్థానాలను గెల్చుకుంది. ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని నడుపుతూనే లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా వాజ్‌పేయి తన వాణిని బలంగా వినిపించారు. ఉదారవాదిగా గుర్తింపు పొందిన ఆయన 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ‘అనాలోచిత చర్య’గా అభివర్ణించారు. అవార్డులు 1992: పద్మవిభూషణ్ 1994:లోకమాన్య తిలక్ అవార్డు, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డు 2015: భారతరత్న రాజకీయాల నుంచి నిష్క్రమణ 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమిపాలైంది. యూపీఏ ప్రభుత్వం అధికారం చేపట్టింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టేందుకు వాజ్‌పేయి నిరాకరించారు. పార్టీ బాధ్యతలను అద్వానీకి అప్పగించారు. 2005 డిసెంబర్లో ముంబైలో జరిగిన బీజేపీ సిల్వర్‌జూబ్లీ ర్యాలీలో క్రియాశీలక రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్నుంచి లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. సాక్షి, తెలంగాణ డెస్క్ -
వాజ్‌పేయి మరణంపై ప్రముఖుల స్పందనలు
తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయా! న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతితో ప్రధాని మోదీ విచారంలో మునిగిపోయారు. గొప్ప రాజనీతిజ్ఞుడైన వాజ్‌పేయి మృతితో దేశ రాజకీయాల్లో ఓ శకం ముగిసిందని ఆయన పేర్కొన్నారు. తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోవడం వ్యక్తిగతంగా తనకు, దేశానికి ‘పూడ్చుకోలేని లోటు’అని మోదీ వెల్లడించారు. వాజ్‌పేయి దేశం కోసమే జీవితాన్ని పణంగా పెట్టి దశాబ్దాల తరపడి అలుపెరగకుండా దేశ సేవలో తరించారన్నారు. 21వ శతాబ్దంలో భారత్ సుసంపన్న దేశంగా ఎదిగేందుకు జరుగుతున్న కృషిలో వాజ్‌పేయి వేసిన బలమైన పునాదులను దేశం ఎన్నటికీ మరవబోదన్నారు. గురువారం రాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో.. ‘అటల్జీ మనల్ని వదలి వెళ్లడం నాకు వ్యక్తిగతంగా తీరనిలోటు. ఆయన దీర్ఘదృష్టితో వివిధ రంగాల్లో రూపొందించిన విధివిధానాలు, భారతదేశం మూలమూలన ఉన్న ప్రజల జీవితాలను స్పృశించాయి. వాజ్‌పేయితో నాకు లెక్కలేనన్ని జ్ఞాపకాలున్నాయి. నాలాంటి ప్రతి కార్యకర్తకు ఆయనే స్ఫూర్తి. జన్‌సంఘ్‌ను, బీజేపీని బలోపేతం చేయడంలో తీవ్రంగా శ్రమించారు. సంఘటన్, శాసన్ (పాలన) గురించిన చాలా అంశాలను ఆయన నాకు బోధించారు. ఆయన్ను కలిసిన ప్రతిసారీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ప్రేమను కురిపించారు. నేడు మా స్ఫూర్తిని, అటల్ రత్నాన్ని కోల్పోయాం. అటల్జీ వ్యక్తిత్వాన్ని మాటల్లో వర్ణించలేం. ఆయన లేని లోటును ఏం చేసినా పూడ్చలేం. ఆయన దేశం గురించే ఎప్పుడూ ఆలోచించే గొప్ప రచయిత. ఆయన పదునైన వ్యాఖ్యలు, అద్భుతమైన చమత్కారాన్ని ఎన్నటికీ మరువలేను. బీజేపీ నేడు ఈ స్థితికి చేరుకోవడంలో వాజ్‌పేయి పాత్ర అత్యంత కీలకం. దేశం మూలమూలన తిరిగారు. దీని కారణంగానే నేడు పార్టీ ఓ బలమైన శక్తిగా ఎదగగలిగింది. వాజ్‌పేయి కుటుంబసభ్యులకు, దేశవ్యాప్తంగా, కోట్లాది కార్యకర్తలకు మహనీయుడి మరణం నుంచి త్వరగా కోలుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’అని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ సంతాపం న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతికి కేంద్ర కేబినెట్ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమై సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రివర్గ సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ నేతలు మరణించినప్పుడు కేంద్ర కేబినెట్ సమావేశమై సంతాపం తెలపడం రివాజు. దివంగత నేతకు గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 16 నుంచి 22 వరకూ ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఈ ఏడు రోజులు జాతీయ జెండాను అవనతం చేయాలని కేంద్ర హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం ఒకపూట సెలవుదినం ప్రకటించారు. గొప్ప రాజనీతిజ్ఞుడు: పాక్ ఇస్లామాబాద్ : మాజీ ప్రధాని వాజ్‌పేయిని గొప్ప రాజనీతిజ్ఞుడిగా కొనియాడుతూ పాకిస్తాన్ నివాళులర్పించింది. వాజ్‌పేయి మరణవార్త తెలుసుకుని ఎంతో విచారిస్తున్నామని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘వాజ్‌పేయి గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్–పాకిస్తాన్ సంబంధాల్లో మార్పు కోసం కృషిచేశారు. అలాగే దక్షిణాసియా కూటమి సార్క్‌కు కీలక మద్దతుదారుగా ఉండడమే కాకుండా ప్రాంతీయ సహకారం కోసం పాటుపడ్డారు’ అని పాక్ విదేశాంగ ప్రతినిధి సంతాప సందేశంలో పేర్కొన్నారు. వాజ్‌పేయి కుటుంబానికి, అలాగే భారత ప్రభుత్వం, ప్రజలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని ఆయన చెప్పారు. దిగ్గజుడిని కోల్పోయాం ‘వాజ్‌పేయి మరణం అత్యంత విషాదకరం. ఆయన దేశంలోని నిజమైన రాజనీతిజ్ఞుడు. ఆ మృదు స్వభావ దిగ్గజుడిని మనమంతా కోల్పోయాం. అద్భుత నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి, పరిణతి, వాక్పటిమల్లో ఆయనకు ఆయనే సాటి’ – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గొప్ప బిడ్డను కోల్పోయింది ‘ఒక శకం ముగిసింది. భారత్ గొప్ప బిడ్డను కోల్పోయింది. ఈ వార్త తీవ్ర విషాదం కలిగిస్తోంది. వాజ్‌పేయి ప్రతిపక్షంలో ఉంటే హేతుబద్ధంగా విమర్శించేవారు. అధికారంలో ఉన్నప్పుడు ఏకాభిప్రాయం కోసం శ్రమించేవారు. అసలైన ప్రజాస్వామ్య వాది ఆయన. ఆయనకు నా ప్రగాఢ సంతాపం’ – ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ఈ బాధ చెప్పేందుకు మాటలు లేవు: అడ్వాణీ ‘దేశ అత్యున్నత రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం వల్ల కలిగిన తీవ్ర బాధ, దుఃఖాన్ని వ్యక్తపరిచేందుకు నా వద్ద మాటలు లేవు. అటల్ జీ నాకు సీనియర్ మాత్రమే కాదు.. 65 ఏళ్లకు పైగా నా ఆత్మీయ నేస్తం. ఆరెస్సెస్ ప్రచారక్‌లుగా కలిసి పనిచేయడం నుంచి, భారతీయ జనసంఘ్ స్థాపనలోనూ, అలాగే ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో పుట్టిన ఆందోళన నుంచి 1980లో బీజేపీ ఆవిర్భావంలోనూ వాజ్‌పేయితో నాకు సుదీర్ఘంగా అనుబంధం ఉంది. కాంగ్రెసేతర సుస్థిర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గదర్శిగా ఆయన గుర్తుండిపోతారు. ఆయన మంత్రి మండలిలో ఆరేళ్లపాటు ఉప ప్రధానిగా పనిచేయడం నాకు గర్వంగా ఉంది. సీనియర్‌గా నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు. మార్గదర్శనం చేసేవారు. ఆకట్టుకునే నాయకత్వ లక్షణాలు, మంత్రముగ్ధులను చేసే ప్రసంగాలు, దేశభక్తి, అన్నింటికన్నా మిన్నగా కరుణ, వినయం వంటి మానవీయ విలువలు, సైద్ధాంతిక విభేదాలు ఉన్నా ప్రత్యర్థులపై గెలవడానికి అవసరమైన అద్భుత సామర్థ్యాలను కలిగి ఆయన నా ప్రజా జీవితంపై ప్రభావం చూపారు. అటల్‌జీని కోల్పోవడం చాలా బాధగా ఉంది’ –-ఎల్.కె.అడ్వాణీ, బీజేపీ సీనియర్ నేత పార్టీని మర్రిచెట్టుగా మలిచారు ‘బీజేపీ అనే మొక్కను తన ధైర్యం, నిరంతర శ్రమతో అత్యంత జాగ్రత్తగా పెంచి మర్రిచెట్టుగా మలిచిన వ్యక్తి వాజ్‌పేయి. భారత రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. అధికారం ఉన్నది సేవ చేసేందుకేనని నమ్మి జాతీయ స్థాయిలో గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడిగా ఎదిగారు. దేశ ప్రయోజనాలపై రాజీపడకుండా మచ్చలేని రాజకీయ జీవితం గడిపారు. అందుకే పార్టీలు, వర్గాలకతీతంగా అందరూ ఆయనను ప్రేమిస్తారు. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు మా పార్టీ పని చేస్తుంది’ – అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు చాలా బాధాకరం ‘అటల్జీ ఇక లేరని తెలియడం బాధాకరం. ఇంత త్వరగా ఆయనను కోల్పోతామని ఊహించలేదు. స్వాతంత్య్రం అనంతరం దేశంలోని అత్యున్నత నేతల్లో వాజ్‌పేయి ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర గొప్పది. 23 పార్టీల సంకీర్ణాన్ని ఆయన విజయవంతంగా నడిపారు. దేశంలో రవాణా సదుపాయాలు విప్లవాత్మకంగా మెరుగుపరిచిన ప్రధాని ఆయన. వ్యక్తిత్వ, వక్తృత్వ, కర్తృత్వ, మితృత్వ లక్షణాలన్నీ కలగలిపిన నేతృత్వగా భారత రత్న అటల్ జీ ఎప్పటికీ గుర్తుండిపోతారు’ – వెంకయ్య నాయుడు, ఉప రాష్ట్రపతి ఆధునిక భారతంలో ఉద్దండ నేత వాజ్‌పేయి దత్తపుత్రిక నమితా కౌల్ భట్టాచార్యకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ లేఖ రాస్తూ సంతాపం తెలిపారు. ‘వాజ్‌పేయి గొప్ప దేశభక్తుడు. ఆధునిక భారతంలో జీవితం మొత్తం ప్రజా సేవలో గడిపిన ఉద్దండ నాయకుడు. ప్రధానిగా, పార్లమెంటు సభ్యుడిగానూ అద్భుతంగా పనిచేశారు. ఆకట్టుకునేలా రచనలు చేసిన కవి, గొప్ప వక్త. పార్టీలకతీతంగా నాయకులు, అన్ని వర్గాల ప్రజలు ఆయనను గౌరవించారు. ప్రేమించారు. దేశీయంగా, అంతర్జాతీయంగా తన సామర్థ్యాలను నిరూపించుకుని, ఇతర దేశాలతో భారత సంబంధాలను గణనీయంగా మెరుగుపరిచిన గొప్ప రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయి. ఆయన మరణం నన్ను తీవ్రంగా బాధిస్తోంది’ – మాజీ ప్రధాని మన్మోహన్ గొప్ప మానవతావాది: నరసింహన్ సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి పట్ల తెలంగాణ, ఏపీ గవర్నర్ నరసింహన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. వాజ్‌పేయి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వాజ్‌పేయి గొప్ప మానవతావాది, రాజనీతిజ్ఞుడు, పాలనాదక్షుడు, కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. వాజ్‌పేయి మృతి దేశానికి పెద్ద లోటు అన్నారు. ప్రజాస్వామిక విలువలను కాపాడటంలో వాజ్‌పేయి ఆదర్శనీయుడని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు నడిపారు: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశా రు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, మాజీ ప్రధానిగా విలువలతో కూడిన రాజకీయాలను నడిపి దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వాజ్‌పేయి మృతి తీరని లోటు అని సీఎం అన్నారు. ఉదారవాది, మానవతావాది, కవి, సిద్ధాంతకర్త, మంచి వక్త, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన అటల్జీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాజకీయ భీష్ముడు: చంద్రబాబు ‘వాజ్‌పేయి మృతితో దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని, రాజకీయ భీష్ముడిని కోల్పోయింది. నమ్మిన సూత్రాలను నిజ జీవితంలో ఆచరించి చూపిన వ్యక్తి ఆయన. ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎంపీగా బహుముఖ పాత్ర పోషించారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించడంలో నేనే చొరవ తీసుకుని వాజ్‌పేయితో మాట్లాడాను. ఏపీ అభివృద్ధికి ఆయన తోడ్పాటు అందించారు. ఆయన పరిపాలన, రాజకీయ అనుభవాలతో వాజ్‌పేయి శకం భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది’ గొప్ప నేతను కోల్పోయాం: వైఎస్ జగన్ ‘భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిచెందారన్న వార్త ఎంతగానో బాధించింది. అటల్జీ మరణంతో మన దేశ రాజకీయాల్లో ఓ గొప్ప శకం ముగిసినట్టయింది. విభేదించే రాజకీయ పార్టీల వారికి కూడా ఆమోదయోగ్యుడిగా, అద్భుతమైన–ఆకట్టుకునే వక్తగా, కవిగా, రాజకీ య విలువలు, మర్యాదల పరంగా శిఖర సమానుడిగా, విదేశీ దౌత్య దురంధరుడిగా వాజ్‌పేయి అందరి మన్ననలూ పొందారు. దేశానికి ఆయన చేసిన సేవలు, రాజకీయాల్లో ఆయన నెలకొల్పిన విలువలు కలకాలం గుర్తుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’. వాజ్‌పేయి నాయకులకు మార్గదర్శి: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్ : సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, మేధావి, మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఈ దేశానికి తీరని లోటు అని, గొప్ప రాజకీయ మేధావిగా, సౌమ్యునిగా వాజ్‌పేయి రాజకీయ నాయకులకు స్ఫూర్తి, మార్గదర్శి అని ఆయన గురువారం ఓ ప్రకటనలో కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రకటనకు ముందే యడ్యూరప్ప నివాళి సాక్షి బెంగళూరు : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మరణంపై అధికారిక ప్రకటన రాకముందే బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తన ట్విటర్ ఖాతాలో నివాళి అర్పించడం చర్చనీయాంశమైంది. గురువారం సాయంత్రం 05.05 గంటలకు వాజ్‌పేయి మరణవార్త వెలువడింది. యడ్యూరప్ప అరగంట ముందే ట్విట్టర్లో శ్రద్ధాంజలి ప్రకటనను పోస్ట్ చేయడం విశేషం. ‘నాకు ఎంతో ప్రేరణ ఇచ్చిన మాజీ ప్రధాని వాజ్‌పేయి ఇకలేరన్న వార్తతో నా మనసు ఎంతో భారమైంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’అని పేర్కొన్నారు. వాజ్‌పేయి మరణంపై అధికారికంగా ప్రకటన వెలువడక ముందే సామాజిక మాధ్యమాల్లో చాలా మంది నెటిజన్లు సంతాపం వ్యక్తం చేశారు. యడ్డి కూడా ఇలాగే చేశారా?, లేక ఆయన మరణ సమాచారం ముందే తెలిసిందా? అనేది తేలాల్సి ఉంది. కోట్లాది మంది ప్రేమిస్తారు ‘భారత్ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. కోట్లాది మంది వాజ్‌పేయిని ప్రేమిస్తారు. గౌరవిస్తారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సానుభూతి. ఆయన మరణం మనకందరికీ తీరని లోటు’ – కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సత్సంబంధాలు నెరిపారు ‘ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కంటే ఎంతో భిన్నంగా వాజ్‌పేయి పనిచేశారు. సిద్ధాంతాల పరంగా, రాజకీయంగా విభేదాలు ఉన్నా, వ్యక్తిగతంగా ఆయనకు అందరితో సత్సంబంధాలు ఉండేవి. అది ఈ రోజుల్లో లేదు. అందుకే వాజ్‌పేయి అంటే అందరికీ ఆమోదయోగ్యుడు.’ –సీతారాం ఏచూరి, సీపీఎం తీరని లోటు ‘వాజ్‌పేయితో కలిసి మేం పనిచేశాం. ఆయన ప్రభుత్వానికి బయటినుంచి మద్దతిచ్చాం. వాజ్‌పేయి అందరితో కలిసి పనిచేశారు. అది ఆయన వ్యక్తిత్వం. భాగస్వామ్య పక్షంలోనే కాకుండా, విపక్షాల్లోని సభ్యులనూ అన్ని విషయాలపై అభిప్రాయాలు కోరి నిర్ణయాలు తీసుకునేవారు. ఆయన మృతి తీరని లోటు’ – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఆమోదయోగ్య నాయకుడు ‘అందరికీ ఆమోదయోగ్యమైన, నిర్ణయాత్మక నాయకుడు వాజ్‌పేయి. తన ఆలోచనలు, సత్ప్రవర్తనతో భారతీయ సాంస్కృతిక విలువలను ఆయన తన జీవన విధానంలో ఇముడ్చుకున్నారు’ – ఆరెస్సెస్ తీవ్ర విషాదంలో ఉన్నాం ‘వాజ్‌పేయి మరణం భారత్‌కు తీరని లోటు. తీవ్ర విషాదంలో ఉన్నాం’ –ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన రాజకీయం ఆచరణీయం ‘భారత్‌ను అణుశక్తి దేశంగా ఆవిష్కరించడంలో ఆయన చూపిన వజ్రసంకల్పం దేశానికి రక్షణ కవచంగా మారింది. విలువలతో కూడిన ఆయన రాజకీయం ఈ నాటి నేతలకు సర్వదా ఆచరణీయం. ఆయన ఈ దేశంలో జన్మించడం మన అదృష్టం. ప్రధానిగా ఆయన సాధించిన విజయాలు ఎల్లప్పుడూ కీర్తించదగినవి’ – జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ -
లోకయాత్రికుడి విశేషయాత్ర
అటల్ బిహారీ వాజ్‌పేయి. ఆయన పేరుకి అర్థమే లోక యాత్రికుడని. ఐక్యరాజ్యసమితిలో యువ రాజకీయవేత్తగా అత్యద్భుత ప్రసంగం చేసి భారతీయ ప్రతిభను విశ్వవ్యాప్తం చేసినా, అణు పరోక్ష వలసవాదానికి (ఇండైరెక్ట్ నూక్లియర్ కలోనియలిజం) వ్యతిరేకంగా, అమెరికా నిఘా సంస్థలు కనిపెట్టలేని వ్యూహంతో భారతీయ అణు వైజ్ఞానిక రంగాన్ని సాహసోపేతమైన అణు బాంబు పరీక్ష ద్వారా ముందుకు తీసుకు వెళ్లినా.. భిన్నరంగాల్లో జీవన ఆసక్తులు, నైపుణ్యాలు కలి గిన ఈ దేశ రాజకీయవేత్తల తరానికి చెందిన చివరి దార్శనికుడుగా భావించదగిన వాడు. పదవులకు వన్నె తెచ్చిన మానవ శిఖరం ఆయన. తను ప్రధానిగా ఉన్న కాలంలో, అలవి గాని ముఖ్యమంత్రులకు ‘రాజధర్మం’ అంటే ఏమిటో తెలియచెప్పేందుకు సహనశీల ప్రయత్నం చేసినవాడు అటల్ బిహారీ వాజ్‌పేయి. ఆయన ఉన్నత సంస్కారం గల భారతీయ పౌరుడు. భారత మాత పుత్రుడు. వక్త, రచయిత, కవి, భారతీయ సంస్కృతీ జ్ఞాన సంపన్నుడు, ఇటువంటి విశిష్టమూర్తి ప్రస్తుత ఓట్ల, నోట్ల, సీట్ల, ఫీట్ల రాజకీయ రంగంలో కనిపిం చడు. హిందీ కవిగా కూడా ఉత్తర భారత సాహిత్య లోకానికి చిరపరిచితుడు. విలువల రాజకీయాల స్థాపనలో వజ్ర సమానుడు. ఆయన్ని మనం కోల్పోయిన ఈ క్షణాల్లో, విభేదాలకు అతీతంగా భారతీయ పౌరసమాజం, రాజకీయ నాయకులు, ఇతర వర్గాలు, ముక్తకంఠంతో ఈ నవభారత సేనానికి నివాళి ఆర్పిస్తున్న వేళ, కవిగా ఆయన పలికిన వివేక వాణి నుంచి కొన్ని మంచి ముత్యాలు. రెండు రోజులు దొరికాయి ప్రసాదంగా గాయాల ఈ వ్యాపారంలో ప్రతిక్షణం లెక్క చూసుకోనా లేదూ నిధి శేషాన్ని ఖర్చు పెట్టేయనా ఏ దారమ్మట వెళ్ళాలి నేను? పగిలిన కలల వెక్కిళ్లు వినేదెవరు లోలోపలి తెగని వెత కనురెప్పలపై నిలిచింది ఓటమి ఒప్పుకోను, వెనుతిరగను పోరులో కాల కపాలం మీది రాత చెరిపేస్తాను నవగీతం పాడుతాను, నవగీతం పాడుతాను ఎందుకు నేను క్షణ క్షణంగా బతకకూడదు కణ కణంలో అలరిన అందాల్ని తాగకూడదు రేపు రేపంటూ ఉంటే ఇవాళ అన్నీ చేజారుతాయి గతం, భవిత వీటి తలపోతలో ఓడి పోతావు నేడు అనే పందెం నన్ను నేను ఇతరుల అంచనాల్లో చూసుకోగలుగుతున్నాను నేను మౌనంగానూ లేను, పాడడమూ లేదు నిన్న ఉన్నది నేడు లేదు నేడున్నది రేపుండదు ఉండడం, ఉండక పోవడమనే దశ ఇలాగే సాగుతూ ఉంటుంది. నేనున్నాను, నేనుంటాను అనే భ్రమ మాత్రం ఉంటుంది నిత్యం మండుటెండలో కమ్మింది చీకటి సూర్యుడు నీడ చేతిలో ఓడాడు లోలోని స్నేహాలకు ఒత్తిడే దక్కింది ఆరిన దీపాలకు వెలుగిద్దాము రండి మళ్ళీ దివ్వెలు వెలిగిద్దాము మూలం – అటల్ బిహారీ వాజ్‌పేయి రచన – హిందీ నుంచి కవితాపంక్తుల అనువాదం రామతీర్థ, కవి, విమర్శకులు మొబైల్ : 98492 00385 -
ఒక శిఖరం ఒరిగింది
భారత రాజకీయాలున్నంతకాలం గుర్తుండిపోయే ఓ మహాశిఖరం ఒరిగింది. దేశ సేవకోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తిత్వం.. ఇక సెలవంటూ వెళ్లిపోయింది.. అద్భుతమైన వాక్పటిమ.. అందరినీ మెప్పించే చాతుర్యం మూగబోయింది. ‘హార్ నహీ మానూంగా’ అంటూ రాజకీయాల్లో ఉన్నంతవరకు విలువల కోసం పోరాడిన యోధుడు.. అందరి గుండెల్లో అజాతశత్రువుగా నిలిచిపోయాడు. దేశ ప్రగతికి కొత్త బాటలు వేసిన దార్శనికుడు అలిసిపోయానంటూ శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ‘మై గీత్ నహీ గాతాహూ’ అన్నా.. ‘మై గీత్ నయా గాతాహూ’ అన్నా.. హిందీ భాషలోని ప్రతిపదం ఆయన కలం, కవిత్వంలో ఆనంద నృత్యం చేశాయి. అధికారంలో లేకున్నాసరే ప్రపంచవేదికలపై భారతీయ వాణిని వినిపించిన దేశభక్తుడు ఆయన. పేరులో కఠినత్వం (అటల్) ఉన్నా.. ప్రేమ, ఆప్యాయతలను పంచడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అటువంటి ఆ మహామనీషి మృత్యువుని కౌగిలించుకుని అనంతలోకాలకు వెళ్లిపోయారు. న్యూఢిల్లీ : కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పిన రాజకీయ శిఖరంకుప్పకూలింది. మహనీయుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) ఇకలేరు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి గురువారం సాయంత్రం 05.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. దేశ రాజకీయాల్లో సంకీర్ణ రాజకీయాలతో కొత్త ఒరవడిని సృష్టించి.. నొప్పించక, తానొవ్వకనే దేశానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకున్న మహానుభావుడు వాజ్‌పేయి. బ్రహ్మచారిగానే జీవితాన్ని ముగించిన ఆయన.. నమితా కౌల్ భట్టాచార్యను దత్తత తీసుకున్నారు. పేరులో అటల్ (కఠినత్వం) ఉన్నా అందరిపట్ల ప్రేమ చూపించిన మృదుస్వభావి. అజాత శత్రువుగా దేశ రాజకీయాల్లో ఆయన అజరామరంగా నిలిచిపోతారు. జూన్ 11నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వివిధ అనారోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, బీజేపీ అగ్రనేత అడ్వాణీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా సహా పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖులు వాజ్‌పేయి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణమీనన్ మార్గ్‌లోని వాజ్‌పేయి నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి కార్యకర్తల సందర్శనార్థం పార్థివదేహాన్ని తరలిస్తారు. అక్కడినుంచి మధ్యాహ్నం 1గంటకు అంతిమయాత్ర మొదలవుతుంది. సాయంత్రం 4 గంటలకు.. రాజ్‌ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని మృతితో కేంద్రం ఏడురోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. భారత ప్రధాని పీఠంపై ఐదేళ్లు పూర్తిచేసిన తొలి కాంగ్రెసేతర వ్యక్తి.. సంకీర్ణ రాజకీయాలను ఎలా నడపాలో తెలిసిన మహనీయుడు. పదిసార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచిన వాజ్‌పేయి 2005లో రాజకీయాలనుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. ఆయన 1924, డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ బడిపంతులు కుటుంబంలో జన్మించారు. ఆయన జన్మదినాన్ని కేంద్రం ‘సుపరిపాలన దినోత్సవం’గా అధికారికంగా నిర్వహిస్తోంది. తీర్చలేని లోటు గురువారం ఉదయం నుంచి ఎయిమ్స్‌కు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు, రాహుల్, పలువురు సీఎంలు వచ్చి వెళ్లారు. దీంతో ప్రజల్లో వాజ్‌పేయి ఆరోగ్యంపై మరింత ఆందోళన పెరిగింది. దేశవ్యాప్తంగా వాజ్‌పేయి తిరిగి కోలుకోవాలంటూ పూజలు, హోమాలు నిర్వహించారు. అటు వాజ్‌పేయి నివాసం వద్ద భద్రతను పెంచడం, బారికేడ్లను ఏర్పాటుచేయడంతో ఆయన ఆరోగ్యంపై మరింత ఉద్విగ్నత నెలకొంది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఐదున్నర గంటలకు ఎయిమ్స్ మీడియా, ప్రొటోకాల్ విభాగం ‘మాజీ ప్రధాని ఇక లేర’నే ప్రకటన విడుదల చేసింది. ‘మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఇకలేరనే అత్యంత బాధాకరమైన వార్తను తెలియజేసేందుకు చింతిస్తున్నాం. 16 ఆగస్టు 2018 సాయంత్రం 05.05 గంటలకు ఆయన కన్నుమూశారు. జూన్ 11న ఎయిమ్స్‌లో చేరినప్పటినుంచి వైద్యుల సంరక్షణలో 9 వారాలుగా ఆయన కోలుకున్నారు. దురదృష్టవశాత్తూ 36 గంటలుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో లైఫ్ సపోర్ట్ సిస్టమ్ సాయంతో ఆయన్ను మళ్లీ కోలుకునేలా చేసేందుకు మా వైద్యులు తీవ్రంగా కృషిచేశారు. కానీ గొప్ప నాయకుడు మననుండి దూరమయ్యారు’ అని ఎయిమ్స్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఆసుపత్రికి ప్రముఖులు వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించిందన్న సమాచారంతో ప్రధాని సహా వివిధ పార్టీల నేతలు గురువారం ఉదయం నుంచే ఎయిమ్స్‌కు వరుసకట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆసుపత్రికి వచ్చి దాదాపు 45 నిమిషాల పాటు ఎయిమ్స్‌లోనే ఉన్నారు. బుధవారం రాత్రి మోదీ ఆసుపత్రికి వచ్చి వాజ్‌పేయి ఆరోగ్యం గురించి వాకబు చేసిన సంగతి తెలిసిందే. 24 గంటల్లోపే మోదీ రెండోసారి ఎయిమ్స్‌కు వచ్చారు. ‘21వ శతాబ్దంలో సుసంపన్న భారత నిర్మాణానికి పునాదులు వేసింది వాజ్‌పేయి నాయకత్వమే. ఆయన పట్టుదల, పోరాటం కారణంగానే బీజేపీ ఒక్కో ఇటుక పేర్చుకుంటూ నేడు ఈ స్థాయికి చేరింది’ అని మోదీ ట్వీట్ చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా గురువారం ఉదయమే రెండుసార్లు ఆసు పత్రికి వచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, జేపీ నడ్డా, రవిశంకర్ ప్రసాద్, జవదేకర్, విజయ్ గోయల్ సహా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా చాలాసేపు ఆసుపత్రిలోనే ఉన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్‌లు కూడా ఆసుపత్రికెళ్లి వాజ్‌పేయి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఇంటి వద్ద ఏర్పాట్లతో ఆందోళన వాజ్‌పేయి ఆరోగ్యం పరిస్థితిపై గురువారం ఉదయం 11గంటలకు ఎయిమ్స్ బులెటిన్ విడుదల చేసిన తర్వాత.. సాయంత్రం వరకు ఎలాంటి ప్రకటన లేకపోవడంతో.. అందరిలో ఆందోళన నెలకొంది. ఈలోపే సాయంత్రం నుంచి కృష్ణ మీనన్ మార్ ్గలోని వాజ్‌పేయి నివాసం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించి భద్రతా ఏర్పాట్లు ఏర్పాటుచేశారు. దీంతో ఆందోళన రెట్టింపైంది. ఎయిమ్స్ ప్రకటనతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. ప్రముఖుల నివాళి ‘భారతీయులందరూ ఐకమత్యంగా, శాంతి సహనాలతో ఉండాలని అభిలషించిన వాజ్‌పేయి ఇక లేరనే విషయం బాధాకరం. ఇది నాకు వ్యక్తిగతంగా పూడ్చుకోలేని లోటు’ అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ప్రజలు తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు వీలు కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ సహా వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఏడ్రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించడంతో.. గురువారం నుంచి ఏడ్రోజులపాటు (16 నుంచి 22 వరకు) దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను అవనతం చేయనున్నారు. అన్నిదేశాల్లోని దౌత్యకార్యాలయాల్లోనూ శుక్రవారం జాతీయ జెండాలను అవనతం చేస్తారు. న్యుమోనియా, అవయవాల వైఫల్యం న్యూఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. ఆయన మృతికి న్యుమోనియా, వివిధ అవయవాల వైఫల్యమే ప్రధాన కారణమని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. బుధవారం రాత్రి నుంచీ ఈసీఎమ్వో (ఎక్స్ట్రాకార్పోరీల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్ – ఎక్మో) యంత్రంపైనే ఉన్నారని తెలిపారు. ‘న్యుమోనియా, మూత్రపిండాలు పనిచేయకపోవడం కారణంగా చివరిరోజుల్లో ఆయన చాలా ఇబ్బందిపడ్డారు’ అని సీనియర్ ఎయిమ్స్ వైద్యుడొకరు తెలిపారు. దీర్ఘకాలంగా గుండె, శ్వాసకోస సమస్యలతో బాధపడే వారికి శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను తీసుకోవడం సాధ్యం కాదు. అలాంటి వారిని ఎక్మోపై ఉంచి శ్వాసతీసుకునేలా చేస్తారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్, యూరిన్ ఔట్పుట్ తక్కువగా ఉండటం, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన్ను జూన్ 11న ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఆయనకు డయాలసిస్ చేసిన వైద్యులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చాలాఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్న వాజ్‌పేయి.. 1984 నుంచి ఒకే కిడ్నీతో వెళ్లదీస్తున్నారు. 2009లో స్ట్రోక్ రావడంతో ఆయన గ్రహణ, స్పర్శ సామర్థ్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొంతకాలానికే ఆయన డిమెన్షియా (చిత్తవైకల్యం) బారిన పడ్డారు. వాజ్‌పేయి మృతిచెందిన వెంటనే అనాటమీ విభాగంలో ఎంబామింగ్ నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. -
బీజేపీ కార్యాలయంలో విషాదఛాయలు
సాక్షి, హైదరాబాద్: రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణంతో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణ వార్త తెలియగానే పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించి, ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మృతి పార్టీకే కాకుండా దేశ ప్రజలకు తీరని లోటని పేర్కొంది. పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, నేతలు చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, మహిళ మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ తదితరులు సమావేశంలో వాజ్‌పేయి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం పట్ల సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి తదితరులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వాజ్‌పేయి మరణం దేశ ప్రజలకు తీరని లోటని బీజేపీ జాతీయ నాయకుడు, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ వాయిదా: లక్ష్మణ్ వాజ్‌పేయి అజాతశత్రువని, అన్ని వర్గాల ప్రజల మన్ననలను చూరగొన్న గొప్ప నాయకుడు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు పాటించిన మహా నాయకుడని అన్నారు. వాజ్‌పేయికి హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉందన్నారు. బార్కాస్, ఖైరతాబాద్, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారన్నారు. వాజ్‌పేయి ఇక లేరన్న వార్త తమను ఎంతగానో కలచివేసిందన్నారు. ప్రధానిగా ఆయన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ఎంతో ముందుండేవారన్నారు. టెలికాం విప్లవం, స్వర్ణ ఛతుర్భుజి వంటి అనేక పథకాలతో చరిత్ర సృష్టించారన్నారు. వాజ్‌పేయి మరణం నేపథ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలను వారం పాటు వాయిదా వేస్తున్నామన్నారు. పార్టీ జిల్లా, మండల, గ్రామ కార్యాలయాల్లో సంతాప కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఆయన వెన్నంటే ఉన్నా: కిషన్‌రెడ్డి వాజ్‌పేయి హైదరాబాద్‌కు ఎప్పుడు వచ్చినా పార్టీ కార్యాలయంలో ఉన్న తానే ఆయనకు సంబంధిం చిన అన్ని విషయాలను చూశానని బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మరణం తమను కలచివేస్తోందన్నారు. తాను బీజేవైఎం జాతీయ అధ్యక్షునిగా ఉన్న సమయంలో తనపై ఉన్న నమ్మకంతో ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక సదస్సు నిర్వహణకు అంగీకరించారన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలతో మన శాస్త్రవేత్తల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటడంతోపాటు, అణుసంపత్తి కలిగిన దేశంగా ప్రపంచ దేశాలకు తెలియజెప్పారన్నారు. కార్గిల్ యుద్ధంలో సైనికులకు మనోబలాన్ని ఇచ్చి విజయం చేకూర్చారన్నారు. రూ.80 వేల కోట్ల స్వర్ణ ఛతుర్భుజి, ఎయిర్‌పోర్టు, కనెక్టివిటీని పెంచారన్నారు. జీర్ణించుకోలేకపోతున్నా: దత్తాత్రేయ వాజ్‌పేయి లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని, ఆ వార్త తనను ఎంతగానో కలచివేసిందని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో సమావేశం అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో దత్తాత్రేయ మాట్లాడారు. వాజ్‌పేయితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మంత్రివర్గంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేసినప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. దేశమే గర్వించదగిన గొప్ప దార్శనికుడు వాజ్‌పేయి అని పేర్కొన్నారు. మాజీ ప్రధాని నెహ్రూ, పీవీల మన్ననలను చూరగొన్న గొప్పనేత అని పేర్కొన్నారు. -
ఆదర్శంలో ఆణిముత్యం అటల్జీ
అటల్ బిహారీ వాజపేయిని అభిమానించని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. భారతదేశ కీర్తిని ఖండాం తరాలకు వ్యాపింప చేసిన మహా నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అటల్జీ. జర్నలిస్టుగా, కవిగా, రచయితగా, ఎడిటర్‌గా, శాంతిదూతగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, ఆధునిక భారతదేశ నిర్మాతగా ప్రతి భారతీ యుడి హృదయంలో తనదైన ముద్రను వేసుకున్న నిజమైన నాయకుడు అటల్జీ. చిన్ననాటి నుంచి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌లో చురుకైన పాత్రను పోషిస్తూ.. జనసంఘ్ విస్తరణలో, భారతీయ జనతాపార్టీ విస్తరణలో కీలక పాత్ర వహించారు. తన వాక్పటిమతో నిజాయితీ, నిబద్ధతలతో, వ్యాసాలతో, రచనలతో, కవితలతో, స్నేహంతో లక్షలాది కార్యకర్తలకు మార్గదర్శకుడిగా దిశానిర్దేశకుడిగా ప్రేరణనిచ్చారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు ప్రతిపక్షంలో ఉన్న అటల్‌జీని పంపడం ఆయన రాజనీతిజ్ఞతకు నిదర్శనం. అలాగే ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించి మన దేశ ఔన్నత్యాన్ని చాటిన నాయకుడు అటల్జీ. చిన్నవయసులోనే భావి ప్రధాని అని నెహ్రూతోనే కితాబు అందుకున్న వ్యక్తి అటల్జీ. ప్రధానులతో, సమకాలీన నేతలతో రాజకీయాలకు అతీతంగా పనిచేసిన నేత. ప్రధానిగా ఒక్క ఓటుతో పదవీచ్యుతుడైనా, హుందాగా ఓటమిని అంగీకరించి ప్రజాస్వామ్య విలువలను పెంచిన నాయకుడిగా వేనోళ్ళ ప్రశంసలు అందుకున్నారు అటల్జీ. ప్రధానిగా 23 పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని దిగ్విజయంగా ఐదు సంవత్సరాలు నడిపించిన కాంగ్రెస్సేతర ప్రధానిగా చరి త్రలో నిలిచారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో బాధ్యతలు చేపట్టి నూతన భారతదేశ ఆవి ష్కరణకు కృషిచేశారు. పొరుగుదేశాలకు స్నేహహస్తం అందించి నూతన విదేశీ విధానానికి తెరలేపారు. కార్గిల్ ద్వారా పాకిస్తాన్‌కి గట్టి సమాధానం చెప్పినప్పటికీ ఆ దేశానికి స్నేహహస్తం అందించి శాంతి చర్యలకు పూనుకున్నారు. 1998 వరకు సామాన్యులకి దూరంగా ఉన్న టెలిఫోన్, గ్యాస్ వంటి వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత అటల్జీదే. అగ్రరాజ్యాలు ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ వాటిని అధిగమించి దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిన దృఢమైన నాయకుడు అటల్జీ. ఆధునిక భారతదేశాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు నడిపించడానికి, ఉద్యోగకల్పనకు సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి అనేక కంపెనీలను ప్రారంభింపజేశారు. పట్టణ ప్రాంత ప్రజల కోసం వాంబే గృహనిర్మాణ పథకం లాంటివి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో రహదారుల కోసం గ్రామీణ సడక్ యోజనను ప్రారంభించారు. స్వర్ణ చతుర్భుజి పేరున దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను అనుసంధానం చేశారు. జాతీయ రహదారుల ద్వారా ఆటోమొబైల్ రంగం, సిమెంట్ రంగం, ఇనుము మొదలైన రంగాలను విస్తరింప చేసి వాటి ద్వారా కొన్ని కోట్ల ఉద్యోగాలు కల్పించారు. విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణ, ప్రైవేటు రంగాల ప్రవేశం ద్వారా వాటిని పురోగమింపజేసి ఆ రంగంలో ప్రయాణ సౌకర్యం, ఉద్యోగాల కల్పన చేశారు. రైల్వేల ఆధునీ కరణ, రైలు ప్రయాణ వేగం పెంచడం, రైలుస్టేషన్ల అభివృద్ధి ఈయన హయాంలోనే జరిగింది. పంచాయతీలను పటిష్టపరిచారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపికను ప్రారంభించినది వాజ్‌పేయి. పోఖ్రాన్ అణు పరీక్ష ద్వారా ప్రపంచానికి భారతదేశ శక్తిని చాటిచెప్పారు. దేశంలో మెట్రోరైలును ప్రవేశపెట్టిన ఘనత వాజ్‌పేయిది. మొట్టమొదటి ఢిల్లీ మెట్రోని ప్రారంభించారు. దేశంలో పట్టణాలు పెరగడం, పట్టణ రహదారుల సమస్య, నిత్యం ట్రాఫిక్‌తో సతమతమవుతున్న ప్రజలకు మెట్రో రైలు ద్వారా పట్టణ రవాణా వ్యవస్థల తీరును మార్చారు అటల్జీ. అటల్జీ చిన్ననాడు క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు వెళ్లినా, 1977 ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లినా దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం మాత్రమే. జీవితాంతం ఆదర్శంగానే జీవించారు. ప్రజలతో ఎప్పుడూ మమేకమయ్యే ఉండేవారు. తన మంత్రివర్గంలో ఉన్న అందరు మంత్రులకు స్వేచ్ఛనిచ్చారు వాజ్‌పేయి. ముఖ్యంగా అద్వానీతో కలిసి పని చేసిన తీరు అద్భుతం. వీరిద్దరూ 50 ఏళ్లకు పైగా కలిసి సహచరులుగా పనిచేసి ఏనాడూ ఎలాంటి స్పర్ధలు, మనస్పర్ధలు రానీయకుండా పార్టీలోని మిగతావారికి, తర్వాతి తరానికి ఒక గొప్ప సందేశం ఇచ్చారు. అవినీతి మచ్చలేని ప్రధానిగా, రాజకీయ నాయకుడిగా ప్రజాజీవితం సాగించారు అటల్జీ. భారతదేశ రాజకీయాల్లో కలియుగ భీష్మాచార్యులు అటల్ బిహారీ వాజ్‌పేయి. (మాజీ ప్రధాని, బీజేపీ అత్యున్నత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి అస్తమయం సందర్భంగా) పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ ఈ–మెయిల్ :raghuram.delhi@gmail.com -
తనో రాజధర్మ దీపస్తంభం
భారత్ వైవిధ్య సామాజిక పరిస్థితుల నేపథ్యంలోనూ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం చెప్పిన దార్శనికుడు అటల్ బిహారీ వాజ్‌పేయి. మూడుమార్లు దేశ ప్రధాని అయి, దేశంలో అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డులకెక్కారు. పార్టీలకు, సిద్ధాంతాలకతీతంగా విస్తృత జనావళి అభిమానం చూరగొన్న నేత అయ్యారు. ‘సరిపోని శిబిరంలో సరైన వ్యక్తి’ (ఎ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ) అన్న విమర్శే ఆయన పట్ల జనాదరణకు గీటురాయిగా నిలిచే పొగడ్తయింది! బాబ్రీ మసీదు కూల్చివేతను నిర్ద్వంద్వంగా ఖండించారు. గోద్రా నరమేధం ఆపే ‘రాజధర్మం’ లోపించిందన్నారు. సరిహద్దులు చెరిపే శాంతికపోతమయ్యారు. ‘‘హార్ నహీ మానూంగా... రార్ నహీ థానుంగా కాల్కే కపాల్ పర్ దిఖాతా మిఠాతాహూ, గీత్ నయా గాతాహు...’’ ‘‘ఓటమిని ఒప్పుకోను... పోరుకు వెనుకాడను కాలం నుదుట పాతను చెరిపి, కొత్తను లిఖిస్తా... సరికొత్త గీతాన్ని ఆలపిస్తా!’’ జీవిత పర్యంతం పలు సందర్భాల్లో పాత రాతల్ని చెరిపి కొత్త రాతలు లిఖించిన రాజనీతిజ్ఞుడు, భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆఖరి గీతం పాడారు. యావద్భారతం నిండైన అభిమా నంతో నివాళి అర్పించేలా సాగిందా గీతం! మృత్యు వును అంత తేలిగ్గా అంగీకరించని ఆయన, సుదీర్ఘ పోరు తర్వాత తుది శ్వాసతో విశ్రమించారు. సంఘ ర్షణ–సంయమనం, జాతీయత–కవితాత్మకత, అవ కాశాలు–సవాళ్ల మధ్య సాగిన 93 ఏళ్ల ఆయన జీవన గమనమే ఓ విలక్షణ గీతం! భారత్ వైవిధ్య సామా జిక పరిస్థితుల నేపథ్యంలోనూ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం చెప్పిన దార్శనికుడు. మూడు మార్లు దేశ ప్రధాని అయి, దేశంలో అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డులకెక్కారు. పార్టీలకు, సిద్ధాంతాలకతీతంగా విస్తృత జనా వళి అభిమానం చూరగొన్న నేత అయ్యారు. ‘సరి పోని శిబిరంలో సరైన వ్యక్తి’ (ఎ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ) అన్న విమర్శే ఆయన పట్ల జనాదరణకు గీటురాయిగా నిలిచే పొగడ్తయింది! ప్రత్యర్థులూ ప్రశంసించే విశిష్ట వ్యక్తిత్వమాయనది. స్వాతంత్ర పోరు సాగిన తన చిన్నతనం నుంచే దేశభక్తి భావాలు, జాతీయతా దృక్పథం ఉన్న వాజ్‌పేయి క్రమంగా ఎదిగి భారత రాజకీయ యవనికపై తనదైన చెరగని ముద్రవేశారు. అధికారంలో కన్నా విపక్షంలోనే అధికకాలం ఉండి భవిష్యత్తరాలకు ఆదర్శ వంతమైన రాజకీయ బాట పరిచారు. ఉదాత్త వ్యక్తిత్వం, ఉన్నత వక్తృత్వంతో పలు రూపాల్లో భారత ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేశారు. విశ్వ పటంలో భారత్ స్థానాన్ని పదిలపరిచారు. ఆయన ఓ స్ఫూర్తి, ప్రేరణ యువకుడిగా శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వంటి పెద్దల మెప్పు పొందిన అటల్జీ తర్వాత తానే ఎందరెందరికో స్ఫూర్తి అయ్యారు. విషయాల్ని సులభంగా గ్రహించే శక్తి, పనిపట్ల నిబద్దత, స్పష్టమైన అభివ్యక్తి తక్కువ కాలంలో ఆయనకు పేరు తెచ్చాయి. దానికి తోడు స్పష్టమైన, ప్రభావవంతమైన హిందీలో అనర్గళంగా మాట్లాడగలగటం అదనపు శక్తి అయింది. సభల్లో జరిపే ప్రసంగాల్లోనే కాకుండా నలుగురు చేరి ముచ్చటించుకునే చోట కూడా హాస్యస్పోరకంగా మాట్లా డటం, మధ్యలో కవితల్ని వినిపించడం ద్వారా పలు వుర్ని ఆకట్టుకోగలిగేవారు. ప్రతి మాటలో వాస్తవిక తను ప్రతిబింబించడం, శ్రోతల్లో నిజమనే భావన కలిగించడం ఆయన ప్రత్యేకత. భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసిన కొత్తలో ఒకసారి ఆయన మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డికి వచ్చారు. మున్సి పల్ మైదానంలో ఆయన సభ, ప్రసంగం ఉందని తెలిసి జోగిపేట పట్టణపు డిగ్రీ విద్యార్థులుగా యువ కులు కొందరం వెళ్లాం. ఆయన ప్రసంగానికి మేమే కాకుండా సామాన్యులూ మంత్రముగ్దులైనట్టు నిలబడిపోయారు. సభ ముగిసిందని నిర్వహకులు ప్రకటించే వరకు ఎవరూ తమ స్థానాల నుంచి కదల నంత నిశ్చేష్టులయ్యారు. ‘‘1952లో నేను తొలిసారి అటల్‌జీని కలిశాను. ఆయన అప్పుడు డా‘‘ శ్యామా ప్రసాద్ ముఖర్జీ రాజకీయ కార్యదర్శిగా ఉండేవారు.. రాజస్థాన్ కోట నుంచి వెళుతున్నారని తెలిసి, ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా నేను వెళ్లాను... యవ్వనపు ఆదర్శ భావాలు ఆయన పుణికి పుచ్చుకున్నారని నాకు సులభంగా అర్థమైంది. రాజకీయాల్లోకి ప్రవేశించినా, ఆయన చుట్టూ ఒక కవితాత్మక ఆకర్షణ నెలకొని ఉండేది. ఆయనలో ఏదో ఒక శక్తి జ్వలిస్తున్నట్టు, ఆ అంతర్జ్వాల ముఖంపై ప్రస్పుటంగా గోచరించేది, అప్పుడాయన వయసు 27 ఉండవచ్చు...’’ అని బీజేపీ సీనియర్ నాయకుడు లాల్‌క్రిష్ణ అడ్వాణీ తన ఆత్మకథ (నాదేశం, నా జీవితం)లో రాశారు. అప్పు డేర్పడ్డ తన తొలి అభిప్రాయమే అటల్‌జీపై చివరి అభిప్రాయమన్నారు. పార్టీలకు అతీతమైన విశాల దృక్పథం వాజ్‌పేయిది పార్టీల, సిద్దాంతాల మూసలో ఇరుక్కు పోయే హస్వ్ర దృష్టి కాదు. విషయాల్ని సమగ్రంగా పరిశీలించి భూత, వర్తమాన, భవిష్యత్ పరిణా మాల్ని పరిగణనలోకి తీసుకునే వాస్తవిక, విశాల దృక్పథం. అందుకే, ఆయన అత్యధికులకు నచ్చే వారు. జనతా ప్రభుత్వపు మురార్జీదేశాయ్ మంత్రి వర్గంలో విదేశీవ్యవహారాల మంత్రిగా తన కార్యాల యంలో ప్రవేశించినపుడు సిబ్బందిని ఒకింత విస్మ యానికి గురిచేశారు. ‘అంతకు మున్నొచ్చినపుడు గోడపై కనిపించిన చిత్రపటం ఇప్పుడు లేదేంట’ని అడిగి, ‘మీరొస్తున్నారని తీసేశామం’టే, అప్పటిక ప్పుడు దాన్ని తెప్పించి మరీ గోడకు పెట్టించారా యన. ఆ ఫోటో వేరెవరిదో కాదు, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూది. రాజకీయంగా ఎన్ని అంశాల్లో విభేదించినా, పార్లమెంటు వేదికగా తానెన్ని పోరాటాలు చేసినా... రాజకీయాల్లో తనకు ఆదర్శం నెహ్రూ అని బహిరంగంగా చెప్పగలిగిన ధీరోదాత్తుడు అటల్జీ. ‘స్పష్టమైన భావాలు, నిక్కచ్చి అభివ్యక్తి, సమ్యక్దృష్టీ ఉన్న ఈ యువకుడికి ఎంతో భవిష్యత్తు ఉంది, ఏదో ఒక రోజు దేశానికి గొప్ప నేత అవుతాడ’ని అదే నెహ్రూతో ప్రశంసలు పొందారాయన. మానవహక్కుల విషయమై జెనీవా అంతర్జాతీయ న్యాయస్థానంలో దేశం తరపు వాదనలు వినిపించడానికి వెళుతున్న ప్రతినిధి బృందానికి అటల్‌జీనే నేతృత్వం వహించాలని నాటి ప్రధాని పి.వి. నర్సింహారావు కోరి పంపారు. బాబ్రీమసీద్ కూల్చారనే మకిలి అంటి, అంటరాని పార్టీగా ఉన్న బీజేపీతో ఇతర పార్టీల్ని భాగస్వాముల్ని చేసి జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ఏర్పర చడం వాజ్‌పేయి వల్లే సాధ్యపడింది. ‘1996లో అట ల్‌జీ 13 రోజుల ప్రధానిగా ఉన్నపుడు స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిన పార్టీ వైఫల్యం నుంచి, 1998లో విజయవంతంగా అధికారం చేప ట్టడం వరకూ... ఆయన వ్యక్తిగత ఆదరణే ప్రధానాం శమైందని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఈ ఆక ర్షణ పార్టీకున్న మద్దతు కంటే అధికమైంది, అతీత మైంది’ అని అడ్వాణీ స్వయంగా పేర్కొన్నారు. జర్నలిజంపై ఉదాత్త భావన దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని స్థాయిల జర్నలిస్టులకు వాజ్‌పేయి అంటే ఓ ప్రత్యేక గౌరవం, ఆరాధ్య భావం ఉండేది. సమాజ ఉన్నతికోసం జర్నలిస్టులు కూడా గురుతర బాధ్యత కలిగిన వృత్తిపని వారనేది ఆయన అభిప్రాయం. దేశంలో ఏ మూలకు వెళ్లినా అటల్జీ–జర్నలిస్టులది ఓ అవినాభావ బంధం! రాజకీయాలకు ముందు జర్నలిజంలోనూ వాజ్‌పేయి తనదైన ముద్ర వేశారు. 1948లో ‘పాంచజన్య’కు సంస్థాపక సంపాదకుడిగా పనిచేశారు. శక్తి వంతమైన ఆయన సంపాదకీయాలు చదివి ఉత్తేజితు లైన రాజకీయ నాయకులు దేశంలో ఎందరో! హిందీ మాసపత్రిక ‘రాష్ట్రధర్మ’కు, దినపత్రిక ‘స్వదేశ్’కు ఆయన సంపాదకుడిగా వ్యవహరించారు. 1996లో అటల్జీ విపక్షనేతగా ఉన్నపుడు ఒక అధ్యయన బృందంలో సభ్యుడిగా నేను ఆయన్ని తొలిసారి, వారి అధికార నివాసంలో కలిసినపుడు రెండు గొప్ప మాటలు చెప్పారు. ఇచ్చిన సమయం కన్నా కాస్త ఆల స్యంగా వెళ్లిన మా బృందాన్ని ఆహ్వానిస్తూ, ‘‘రండి... మీ ఆలస్యం వల్ల నేనీరోజు ‘క్వశ్చన్ అవర్’ అందుకోలేకపోతున్నా, పార్లమెంటు కార్యకలాపాల్లో ప్రజా సమస్యలకు సమాధానాలు వెతికే ఆ సమయమే అత్యంత కీలకమైంది’’ అన్నారు. తర్వాత మా వృత్తి గురించి చెబుతూ, ‘జర్నలిజం ఉద్యోగం కాదు, ఒక వృత్తి, వృత్తిని మించి ఉదాత్త కార్యం (మిషన్)’ అని స్ఫూర్తినిచ్చారు. తొలిసారి ప్రధానిగా ఉన్నపుడు హైదరాబాద్ వచ్చిన అటల్జీ, తనకు పూర్వ పరిచయమున్న ఓ జర్నలిస్టు ఇంటర్వ్యూ కోరితే 5 నిమిషాల సమయమిచ్చారు. ఓ ఆసక్తికర ప్రశ్నకు ముగ్దుడై, ‘మరో 5 నిమిషాలు పొడిగించాను పో!’ అని పగలబడి నవ్వారు. సంస్కరణ రథం, శాంతి కపోతం ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినపుడు (1998–99) దేశంలో 5.8 ఆర్థిక వృద్ధి రేటు సాధిం చింది వాజ్‌పేయి ప్రభుత్వం. మౌలికసదుపాయాల కల్పనకు మున్నెన్నడు లేనంత ప్రాధాన్యత దక్కింది. ఎన్నో సంస్కరణలు తెచ్చారు. రావణ కాష్టంలా రగిలే భారత్–పాక్ మధ్య, ఉద్రిక్త సరిహద్దుల్ని చెరిపి సౌహార్ద్ర బస్సుయాత్ర నడిపిన శాంతి కపోత మాయన! జనతా ప్రభుత్వంలో తాను విదేశాంగ మంత్రిగా విత్తిన విత్తనాలు మొక్కై ఎదిగిన సందర్భం. నమ్మిన నిజమైన లౌకికవాదం పునాదులపై విశ్వాసంతో, తన రాజకీయ భవిష్యత్తునే పణంగా పెట్టి సాగించిన లాహోర్ యాత్ర అది! దౌత్య ప్రపం చంలోనే పెను సంచలనం! బాబ్రీ మసీదు కూల్చివేతను నిర్ద్వంద్వంగా ఖండించారు. గోద్రా నరమేధం ఆపే ‘రాజధర్మం’ లోపించిందన్నారు. అన్ని కాలా ల్లోనూ... రాజకీయ వ్యవస్థను సంస్కరించాలనుకునే ప్రజాస్వామ్యవాదులకు అస్త్రంగా ఆయన అందించిన ఒక గొప్ప కవితతో ముగిస్తా. ‘‘అధికారంతో సత్యం పోరాడుతుంది, నిరంకుశత్వంతో న్యాయం యుద్దం చేస్తుంది, చీకటి ఓ సవాల్ విసిరింది, వెలుగే కడపటి అస్త్రమౌతుంది, అన్నీ పణంగా పెట్టాం... ఇక ఆగలేం! విరిగైనా పొతాం కానీ, వంగేది లేదు!’’ దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
అచ్చమైన రాజనీతిజ్ఞుడు
అంపశయ్యపై మేను వాల్చిన భీష్మ పితామహుణ్ణి తలపిస్తూ ఎయిమ్స్‌లో దాదాపు రెండు నెల లుగా చికిత్స తీసుకుంటున్న రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం కన్నుమూశారు. పార్టీ ఏదైనా, సిద్ధాంతాలు వేరైనా రాజకీయాల్లో అందరూ అభిమానించే, ప్రేమించే నాయకులు అతి కొద్ది మంది ఉంటారు. అటువంటివారిలో వాజ్‌పేయి అగ్రగణ్యులు. 1957లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని బల్రామ్పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికై లోక్‌సభలో అడుగిడిన వాజ్‌పేయి ఆదినుంచీ తన వాక్పటిమతో ఆకట్టుకునేవారు. కనుకనే మన దేశంలో పర్యటిస్తున్న ఒక దేశాధినేతకు వాజ్‌పేయిని పరిచయం చేస్తూ ‘ఈ యువ కుడు ఏదో ఒక రోజు ప్రధాని అవుతాడ’ని తొలి ప్రధాని నెహ్రూ అన్నారట. నాలుగు దశాబ్దాలు గడవకముందే ఆ వాక్కును వాజ్‌పేయి నిజం చేశారు. తొలిసారి 1996లో బీజేపీ అతి పెద్ద రాజ కీయ పక్షంగా అవతరించినప్పుడు 13 రోజుల వ్యవధిలో ప్రధాని కొలువు పోగొట్టుకున్నా... రెండో సారి 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మెజారిటీ స్థానాలు కైవసం చేసు కుని 13 నెలలపాటు మాత్రమే అధికారంలో ఉన్నా ఎప్పుడూ ఫిరాయింపులకూ, బేరసారాలకూ ఆయన తావీయలేదు. రెండోసారి కేవలం ఒకే ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోతుందని తెలిసినా ఆయన చెక్కు చెదరలేదు. ‘ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. పార్టీలు పుడతాయి, గిడతాయి. వీటన్నిటికీ అతీతంగా దేశం వెలుగులీనాలి. ప్రజాస్వామ్యం చిరస్థాయిగా వర్థిల్లాలి’ అంటూ అప్పుడా యన చెప్పిన మాటలు అందరినీ ఉద్వేగభరితుల్ని చేశాయి. ఆయన నీతినిజాయితీలను గమనించే 1999లో ఎన్డీఏకు జనం సుస్థిరమైన మెజారిటీ కట్టబెట్టారు. యువకుడిగా ఉన్నప్పుడు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్ ముఖర్జీకి కుడి భుజంగా మెలగుతూ... పాత్రికేయుడిగా పనిచేస్తూ... కవిగా తన సున్నిత మనోభావాలకు పదును పెట్టుకుంటూ... జనాన్ని మంత్రముగ్ధుల్ని చేసే ఉపన్యాసాలిస్తూ రాజకీయాల్లో వాజపేయి ఒక్కో మెట్టే అధిరోహించారు. అలా ఎదుగుతూనే ఉన్నత విలువలను ఒడిసి పట్టుకున్నారు. సాధారణ పార్లమెంటేరియన్‌గా ప్రతిపక్షంలో ఉన్నా... మంత్రి పదవిలో కొనసాగినా... ప్రధాని పదవిని అధిష్టించినా ఆయన ఈ విలువలను చేజారనీయ లేదు. దేశంలో తొలిసారి విజయవంతంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపటంలో ఆయనకు అందివచ్చి నవి ఈ విలువలే. 2004లో అప్పటి ఎన్డీఏ కన్వీనర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు ఇచ్చిన తప్పుడు సలహాతో గడువుకు ముందే లోక్‌సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి ఊహించని రీతిలో ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అత్యవసర పరిస్థితి ఎత్తేశాక 1977లో జరిగిన ఎన్నికల్లో జనతాపార్టీ అధికారంలోకొచ్చిన ప్పుడు మొరార్జీ ప్రభుత్వంలో ఆయన విదేశాంగమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అటు పాకి స్తాన్‌తో, ఇటు చైనాతో మనకెన్నో సమస్యలుండగా తీవ్ర జాతీయవాద భావాలను తలకెత్తుకునే జనసంఘ్ నేపథ్యం ఉన్న నేతకు ఈ పదవిని కట్టబెట్టడంలోని ఔచిత్యమేమిటని పలువురు ప్రశ్నిం చారు. కానీ అలాంటివారి అంచనాలన్నిటినీ తలకిందులు చేస్తూ దేశ చరిత్రలో ఆయన ఉత్తమ విదేశాంగమంత్రి అనిపించుకున్నారు. అంతక్రితం అనేక ఏళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న చైనాతో సత్సంబంధాలు నెలకొల్పారు. పాకిస్తాన్‌తో సైతం సామరస్య వాతావరణం ఏర్పడటానికి కృషి చేశారు. ‘మీరు స్నేహితుల్ని మార్చుకోగలరు తప్ప పొరుగును మార్చుకోవడం అసాధ్యమ’ని ఆ సందర్భంలో ఆయనన్న మాటలు ఎన్నదగినవి. ప్రధానిగా కూడా ఈ రెండు దేశా లతో ఉన్న వైషమ్యాలు సమసిపోవాలని భావించారు. కశ్మీర్ సమస్యపై మూడో పక్షం జోక్యం లేకుండా భారత్–పాక్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగాలని ప్రతిపాదించారు. ఢిల్లీ–లాహోర్ బస్సు సర్వీసును ప్రారంభించి రెండు దేశాల మధ్యా సుహృద్భావ వాతావరణం ఏర్పర్చడానికి ప్రయత్నించారు. అయితే పాకిస్తాన్ నుంచి ఆ చర్యలకు సానుకూల స్పందన రాకపోగా కార్గిల్‌లో చొరబాట్లు చోటు చేసుకుని ఇరు దేశాల మధ్యా ఘర్షణలు తలెత్తాయి. పోఖ్రాన్లో అమెరికా కన్ను గప్పి అణు పరీక్ష నిర్వహించటంలో ఆయన సర్కారు విజయం సాధించింది. అయితే ఈ చర్య పాకి స్తాన్‌ను సైతం అణ్వస్త్ర దేశంగా మార్చిందన్నది మరవలేం. నెహ్రూ ప్రధానిగా ఉండగా ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చరిత్ర వాజ్‌పేయిది. కేరళలో ఏర్పడ్డ తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినప్పుడైనా, చైనాతో కయ్యం ఏర్పడి నప్పుడు దానితో సక్రమంగా వ్యవహరించలేని అశక్తత ప్రదర్శించినప్పుడైనా ఆయన నెహ్రూ సర్కారును నిశితంగా విమర్శించారు. అదే సమయంలో నెహ్రూ ఉదారవాద భావాల ప్రభావం ఆయనపై ఉంది. స్వాతంత్రోద్యమ నేతగా, ప్రధానిగా ఆయన పాత్రను ఏనాడూ తక్కువ చేసి చూడలేదు. నెహ్రూ కన్నుమూసినప్పుడు వాజ్పేయిఅర్పించిన నివాళే ఇందుకు నిదర్శనం. హిందూత్వ సిద్ధాంతాన్ని విశ్వసించే బీజేపీకి అధినాయకుడిగా ఉన్నా, ఎన్డీఏ సర్కారుకు సారథ్యం వహించినా తప్పును తప్పుగా ఎత్తిచూపటంలో ఏనాడూ తడబడలేదు. బాబ్రీ మసీదు విధ్వంస సమయంలో, గుజరాత్ మారణకాండ సమయంలో ఆయన తన అభిప్రాయాలు దాచుకోలేదు. రాజకీయవేత్తగా ఆయన ఎన్నో నిమ్నోన్నతాలను చూసి ఉండొచ్చు. కానీ కవిగా ఆయన సున్నిత హృదయుడు. ‘సంవేదన్’ శీర్షికతో రాసిన కవితలో– ‘‘క్యా ఖోయా, క్యా పాయా జగ్ మే/మిల్తే ఔర్ బిచడ్తే మగ్ మే/ముఝే కిసీ సే నహీ( షికాయత్/యద్‌యాపీ చలా గయా పగ్–పగ్ మే/ఏక్ దృష్టి బీతీ పర్ డాలే యాదోంకి పోట్లి టటోలే(’’(కలిసి విడిపోయే ఈ ప్రయాణంలో/భూమ్మీద నాకు దక్కిందీ, పోగొట్టుకున్నదీ ఏమిటి?/ ప్రతి అడుగులో మోసాన్ని చూశాను/కానీ నాకు బాధలూ లేవు, ఫిర్యాదులూ లేవు/ఎందుకంటే, గతాన్ని మథిస్తూ స్మృతులు చెరుగుతున్నాను) అంటా రాయన. రాజనీతిజ్ఞుడు వాజపేయికి ‘సాక్షి’ వినమ్రంగా నివాళులర్పిస్తోంది. -
ఆ నంబర్‌తో దురదృష్టం వెంటాడిందా?
భారతీయ జనతా పార్టీకే కాదు.. ఎందరికో ఆయన స్ఫూర్తినిచ్చిన నాయకుడు. ఇతర పార్టీలు సైతం ఆయన రాజనీతిజ్ఞతను పొగిడారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత. గొప్పవాళ్లు అని చెప్పుకునే వారెందరో ఆయనను కీర్తించినవారే. బీజేపీని స్థాపించిన వారిలో ఆయన ఒకరు. విలువలు గల రాజకీయ నేత. మూడుసార్లు ప్రధాని పీఠమెక్కి చాలా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచిన గొప్పనేత. జాతీయ రహదారులను అనుసంధానిస్తూ చేపట్టిన స్వర్ణ చతుర్భుజి పథకం, పాకిస్తాన్‌తో శాంతి ప్రయత్నం, పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధ విజయం ఆయన హయాంలోనే.. తమ పార్టీ నేతలు తప్పు చేసినా ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించేవారు కాదు. ఉత్తమ నేతగా ఎందరితోనో ప్రశంసలు అందుకున్నది మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి. ఇలాంటి మహనీయుడి అస్తమయంతో దేశం మహా నాయకుడిని కోల్పోయిందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. నంబర్ 13 దురదృష్ట సంఖ్యేనా? 1996 మే 16వ తేదీన మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వాజ్‌పేయి 13 రోజులు మాత్రమే పని చేశారు. 1998లో రెండవసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టి పదమూడు నెలలకు ప్రభుత్వం మైనారిటీలో పడింది. అనంతరం 1999లో జరిగిన 13వ లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు సుపరిపాలన అందించారు. ఆయన హయాంలో పార్లమెంటుపై దాడి జరిగిందీ 13వ తేదీనే. అందుకున్న అవార్డులు: వాజ్‌పేయికి 1992లో పద్మవిభూషణ్ అవార్డు, 1993లో కాన్పూరు విశ్వవిద్యాలయం నుంచి డీలిట్ గౌరవ పురస్కారం, 1994లో లోక్మాన్య తిలక్ అవార్డు, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ అవార్డులు లభించాయి. దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న 2015లో అందుకున్నారు. -
వాజ్‌పేయి ఇక లేరు.. రేపు అంత్యక్రియలు!
-
ఏడు రోజులు సంతాప దినాలు.. రేపు అంత్యక్రియలు!
సాక్షి, న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. వాజ్‌పేయి మృతి పట్ల రాజకీయ నేతలు, ప్రముఖులు, విదేశీ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. వాజ్‌పేయిని కడసారిచూపు చూసేందుకు ఇప్పటికే దేశ నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఢిల్లీకి తరలివస్తున్నారు. వాజ్‌పేయి మరణంతో ఆగస్టు 22వరకు ఏడు రోజులు సంతాపదినాలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వాజ్‌పేయి మృతికి సంతాపంగా భారతీయ జెండాను సగం వరకు అవతనం చేయనున్నారు. కాసేపట్లో వాజ్‌పేయి పార్థీవదేహాన్ని కృష్ణమీనన్ మార్గంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. శుక్రవారం ఉదయం అభిమానుల సందర్శనార్థం వాజ్‌పేయి భౌతికకాయాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి రేపు మధ్యాహ్నం ఒకటిన్నరకు వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదు గంటలకు స్మృతిస్థల్‌లో వాజ్‌పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. -
వైరల్ వీడియో: ఆనందంగా వాజ్‌పేయి స్టెప్పులు వేసిన వేళ!
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఓ కార్యక్రమంలో స్టెప్పులు వేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. గత కొంతకాలంగా మూత్రపిండాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాజ్‌పేయి గురువారం కన్నుమూశారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఎయిమ్స్ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. గురువారం సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో బీజేపీ శ్రేణులు, అటల్జీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే వార్త సంస్థ ఏఎన్ఐ విడుదల చేసిన ఓ వీడియో నెట్‌ఇంట్లో హల్ చల్ చేస్తోంది. ఓ కార్యక్రమంలో భాగంగా వాజ్‌పేయి నృత్యం చేశారు. ఈ వీడియో పోస్టయిన కొద్ది సమయంలోనే వైరల్ అయింది. -
వాజపేయి ప్రసంగం ఇప్పటికీ ఎందరినో వెంటాడుతోంది
-
అటల్ బిహారీ వాజ్‌పేయి ఫోటో గ్యాలరీ
-
వాజ్‌పేయి అభిరుచులు, ఆసక్తులపై ప్రత్యేక కథనం
విషాద సందర్భం... తన జీవితంలోని విషాద సందర్భం తనకి స్ఫూర్తినిచ్చిన దీన్ దయాల్ ఉపాధ్యాయ మరణించిన సందర్భమేనంటారు. ఇష్టమైన నాయకుడు.. వాజ్‌పేయ్ తనకిష్టమైన నాయకుడు తొలి ప్ర«ధాని జవహర్లాల్ నెహ్రూ అని అంటారు. అభిమాన రచయితలు.. రాజకీయాల్తో పాటు సాహిత్యాన్నీ అమితంగా ప్రేమించిన వాజ్‌పేయికి ప్రముఖ రచయితలు శరత్ చంద్ర, ప్రేమ్ చంద్ అంటే చాలా ఇష్టం. అలాగే హరివంశరాయ్ బచ్చన్, రామనాథ్ అవస్తి, డాక్టర్ శిమంగల్ సింఘ్ సుమన్, సూర్యకాంత్ త్రిపాఠీ ‘నిరళ’, బాలకృష్ణ శర్మ నవీన్, జగన్నాథ్ ప్రసాద్ మిలండి, ఫియాజ్ అహ్మద్ ఫియాజ్ల నుంచి కవితాస్ఫూర్తి పొందానంటారు వాజ్‌పేయి. కవి హృదయాన్ని మెప్పించిన క్లాసికల్ కళాకారులు! భీమ్సేన్ జోషి, అమ్జాద్ అలీఖాన్, హరిప్రసాద్ చౌరాసియా వాజ్‌పేయి మదిమెచ్చిన కళాకారులు. అలాగే లతా మంగేష్కర్ పాటలన్నా, ముఖేష్ , ఎస్డి బర్మన్ అన్నా చెవికోసుకునేవాడట. ఇష్టమైన మ్యూజీషియన్ సచిన్ దేవ్ బర్మన్, ఇష్టమైన నటులు సంజీవ్ కుమార్, దిలీప్ కుమార్, సుచ్రిత సేన్, రాఖీ, నూతన్ అని చెపుతారు. ఎస్డి బర్మన్ ‘‘ఓ....మేరే మాజీ’’‘‘సన్ మేరే బంధూ రే’’పాటలన్నా, ముఖేష్ కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై’’పాటన్నా, ప్రాణం అంటారు. ముఖ్యంగా ముఖేష్, లతామంగేష్కర్ లంటే వాజ్‌పేయికి అమితమైన ఇష్టం. ఒకానొక సందర్భంలో లతామంగేష్కర్‌తో మాట్లాడుతూ వాజ్‌పేయి ‘‘మీకూ నాకూ చాలా దగ్గరి పోలికలున్నాయి. మీరూ ఒంటరివాళ్ళే, నేనూ ఒంటరినే, అలాగే నా పేరులో అటల్‌ని తిరగేస్తే (ఆంగ్ల అక్షరాల్లో) లత అని వస్తుంది’’అంటారు. వాజ్‌పేయికి నచ్చిన సినిమాలు దేవదాస్, బాంధినీ, తీస్రీ కసమ్, మౌసమ్, ఆంధీ వాజ్‌పేయ్‌కి నచ్చిన సినిమాలు. ‘‘బ్రిడ్జి ఓవ ర్ ద రివర్ క్వై’’, ‘‘బార్న్ ఫ్రీ’’, ‘‘గాంధీ’’ ఇంగ్లీషు సినిమాలు తనకిష్టమైనవంటారు వాజ్‌పేయి. అటల్జీకి రుచించేవి.. అటల్జీ బాగా వంటలు చేసేవారట. వాజ్‌పేయి తండ్రికి బయటి భోజనం ఇష్టం లేకపోవడంతో తన తండ్రితో కలిసి ఉండేటప్పుడు తనే స్వయంగా వంట చేసి తండ్రికి వడ్డించేవారు. కిచిడీ, పూరి కచోరీ, దాల్–పకోరీ, పాంథ, ఖీర్ , మాల్‌పావ్, కచోరీ, మంగౌరీ వంటకాలు వాజ్‌పేయికి అత్యంత ఇష్టమైన వంటకాలు. అటల్జీ మదిమెచ్చినవి లతామంగేష్కర్ పాటా, హరిప్రసాద్ చౌరాసియామురళీగానం, గాంధీ సినిమా, శరత్ చంద్ర, ప్రేమ్‌చంద్ అక్షరం... పూరీ కచోరీ, ఖీర్, మాల్‌పావ్! అభిరుచుల్లో సున్నితత్వం, ఆహార్యంలో సాదాత్వం, అవసరమైనప్పుడు కటుత్వం మొత్తంగా ఆయన వ్యక్తిత్వం. మాటలతోనే కట్టిపడేసే మాంత్రికుడు, రాజకీయాటలో నేర్పూ, జనం మది గెలుపులో ఓర్పూ అటల్ బిహారీ వాజ్‌పేయిని రాజకీయాలకతీతంగా అభిమానించేలా చేశాయి. ఓ అనుభవజ్ఞుడైన రాజనీతిజ్ఞుడిగానే కాక కవిగా, రచయితగా, మంచి వక్తగా ప్రజలమెప్పునొందిన వాజ్‌పేయి వ్యక్తిగత ఇష్టాఇష్టాలు అతని స్వభావాన్ని చెప్పకనే చెబుతాయి. ఆయన జీవితాన్ని అమితంగా ప్రభావితం చేసిన వ్యక్తులూ, అతనికిష్టమైన సంగీతం, అతని మదిని చెదిరిపోని సందర్భాల్లో మచ్చుకి కొన్ని ... అదే చేదు ఘడియ ఒంటరి జీవితాన్ని జీవితాంతం గడిపిన వ్యక్తి వాజ్‌పేయ్. కవిత్వంతోనే రాజకీయరంగ ప్రవేశం చేసానని చెప్పుకున్న వాజ్‌పేయి తన జీవితంలో అత్యంత చేదు ఘడియలేవైనా ఉన్నాయంటే అది ఐదవ తరగతిలో తన మాస్టారు చెంపఛెళ్ళుమనిపించిన సందర్భమేనంటారు. అందుకు సమయం లేదు మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదని ప్రశ్నిస్తే పెళ్ళి చేసుకునే తీరిక తనకు లేదన్నారు. థ్రిల్లింగ్ మూవ్మెంట్ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తనని ఆçహ్వానించినప్పుడు అత్యంత థ్రిల్లింగ్‌గా ఫీలయ్యానంటారు. ప్రియ మిత్రులు... ఆనాటి ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, భైరాన్‌సింగ్ షెకావత్, అప్పా ఘటాటే, నాటి ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్, డాక్టర్ ముకుంద్ మోడీ, అలాగే శివకుమార్‌లు తనకు అత్యంత సన్నిహిత మిత్రులంటారు. మరపురాని ఘటన.. ఐరాస జనరల్ అసెంబ్లీలో తొలిసారిగా, అదీ కూడా హిందీలో ఉపన్యసించడం తన జీవితంలో మరపురాని ఘటన అంటారు. స్ఫూర్తి... తన తండ్రి కృష్ణ బిహారీ వాజ్‌పేయి తనకు స్ఫూర్తి ప్రదాత అనీ, గురు గోల్వాకర్జీ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, ఆర్ఎస్ఎస్ బాబూరావ్ డియోరాజ్ లు తనకి స్ఫూర్తినిచ్చినవారంటారు. -
వాగ్ధాటి.. లేరు సాటి!
వాజ్‌పేయి మంచి వక్త. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ప్రధానిగా ఉన్నా ఆయన ప్రసంగం మొదలు పెడితే చాలు పార్లమెంటు సభ్యులందరూ నిశ్శబ్దంగా చెవులు రిక్కించి వినేవారు. సునిశితమైన హాస్యాన్ని పండిస్తూ, కవితా పరిమళాలు వెదజల్లుతూ, విమర్శకుల నోళ్లను మూయిస్తూ, చమత్కారపూరితంగా ఒక గంగా ప్రవాహంలా ఆయన ప్రసంగాలు సాగిపోయేవి. ఆయనలోని సంభాషణాచాతుర్యానికి స్వపక్ష నేతలే కాదు ఇతర పార్టీల నాయకులు కూడా మంత్రముగ్ధులయ్యేవారు. తొలి ప్రసంగంతోనే నెహ్రూ ఫిదా 1957లో వాజ్‌పేయి పార్లమెంటేరియన్‌గా తన తొలి ప్రసంగంతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వాజపేయి విదేశాంగ విధానంపై చేసిన ప్రసంగానికి విస్తుపోయారు. అంత చిన్న వయసులో అపారమైన పరిజ్ఞానంతో మాట్లాడిన వాజ్‌పేయిని ఆకాశానికెత్తేశారు. రాజకీయాల్లో ఆ యువకుడికి ఉజ్వల భవిష్యత్ ఉందని, ఎప్పటికైనా దేశ ప్రధాని అవుతారంటూ అప్పట్లోనే జోస్యం చెప్పారు. ఆగ్రహావేశాలు ప్రదర్శించగలరు వాజ్‌పేయి మృదుస్వభావి. ఆయన ప్రసంగాలు కూడా ఎప్పుడూ సుతిమెత్తగా సాగిపోయేవి. కానీ అవసరమైతే ఆ స్వరం నిప్పులు కూడా కురిపించగలదు. 1997లో ఐకే గుజ్రాల్ ప్రధాని గా ఉన్న సమయంలో బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంపై చర్చ జరిగే సమయంలో వాజ్‌పేయి ప్రసంగంలో ఆగ్రహావేశాలు కనిపిస్తాయి. వాజ్‌పేయిలో ఆ కోణాన్ని చూసి సభ యావత్తూ విస్తుపోయింది. శాంతే ప్రధానం లేదంటే సమరమే మిత్రులను మార్చుకోవచ్చు, కానీ ఇరుగుపొరుగుని మార్చలేం. మేము శాంతినే కోరుకుంటాం కాదంటారా సమరానికైనా సిద్ధం అంటూ పాక్‌కు రిటార్ట్ ఇచ్చారు. 1998లో పోఖ్రాన్ –2 (ఆపరేషన్ శక్తి) అణు పరీక్షలపై సర్వ త్రా ఆందోళనలు వ్యక్తమైనప్పుడు వాజ్‌పేయి బాగా సమర్థించుకున్నారు. ‘ఇప్పటికే మూడు సార్లు దాడులకు బలయ్యాము. అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదు. ఒకవైపు లాహోర్ బస్సు సర్వీసు అంటూ ఈ అణుపరీక్షలేమిటని అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ రెండూ ఒకే నాణేనికి చెరోవైపులాంటివి. నీతి నిజాయితీతో స్నేహహస్తం జాపాం. తోకజాడిస్తారేమోనని రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం’అంటూ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. శ్రమయేవజయతే నినాదం ‘నేను ఓటమిని అంగీకరించను. పోరు బాట పట్టడమే నాకిష్టం. ఆకాశాన్నంటే ఆశయాలను సాధించాలంటే కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా తలవంచకూడదు‘అంటూ వాజపేయి తన ప్రసంగాల్లో శ్రమయేవ జయతే నినాదాన్నే ఎప్పుడూ వినిపించేవారు. కష్టపడి పనిచేస్తేనే బంగారు భవిష్యత్ సాధ్యపడుతుందని ఆయన యువతరానికి పదే పదే పిలుపునిచ్చేవారు. 2002 స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలోనూ మన ముందున్న లక్ష్యం చాలా పెద్దదే కావొచ్చు, కానీ చేయి చేయి కలిపితే, కష్టపడి పోరాడితే విజయం మన ముందు తలవంచుతుంది అంటూ ఎందరిలోనో ఉత్తేజాన్ని నింపారు. కొత్త సంబంధాలు 2000 సంవత్సరంలో అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి వాజ్‌పేయి చేసిన ప్రసంగం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసిందనే చెప్పాలి. ప్రపంచ దేశాల మధ్య శాంతి, సుస్థిరతలకు పాటు పడాలని, అన్ని రంగాల్లోనూ సహకరిస్తూ కొత్త అధ్యాయానికి తెరతీయాలంటూ వాజ్‌పేయి చేసిన ప్రసంగాన్ని అమెరికన్లు ఎప్పటికీ మర్చిపోలేమని అంటారు. అద్భుతమైన వాదనా పటిమ వాజ్‌పేయి ఏదైనా అంశంపై మాట్లాడితే ముందస్తుగా సుదీర్ఘమైన కసరత్తు చేసేవారు. రకరకాల గణాంకాలను ప్రస్తావిస్తూ, వాస్తవాలనే మాట్లాడుతూ తన వాదనకు బలమైన పునాదులు ఏర్పాటు చేసుకోవడం ఆయన ప్రసంగాల్లో విలక్షణంగా కనపడేది. అందుకే ఆయన ఆరెస్సెస్‌కి అనుకూలంగా మాట్లాడినా కూడా సభలో ఎలాంటి అలజడి చెలరేగేది కాదు. ఇతర పక్షాల సభ్యులు నోరు మెదపలేకపోయేవారు. పీవీ నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జెనీవాలో కశ్మీర్ అంశంపై జరిగే చర్చలకు ప్రతిపక్ష నాయకుడైన వాజ్‌పేయిని భారత్ ప్రతినిధిగా పంపించారంటే ఆయనకున్న వాదనాపటిమ ఎంతటిదో, ఇతర పక్ష నేతలూ వాజ్‌పేయి అంటే ఎంత గౌరవం ఇస్తారో అర్థమవుతుంది. నేటికీ వెంటాడే ప్రసంగం 1996లో 13 రోజుల పాటు ప్రధాని పదవిలో కొనసాగిన వాజ్‌పేయి గద్దె దిగిపోతూ మంద్రస్వరంతో నీతి నిజాయితీ ఉట్టిపడేలా చేసిన ప్రసంగం భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఒక కీలక ఘట్టం. నాటి ప్రసంగాన్ని దూరదర్శన్‌లో లైవ్ టెలికాస్ట్ అయింది. ఇలా చట్టసభల సమావేశాలను లైవ్ ఇవ్వడం అదే తొలిసారి. అప్పట్లో వాజ్‌పేయి సభ విశ్వాసాన్ని పొందలేకపోయినా తన ప్రసంగం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ‘మీకు ఎంత శాతం ఓట్లు వచ్చాయని నన్ను అడుగుతున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లు ముఖ్యమా? సీట్లు ముఖ్యమా? మన పార్లమెంటరీ వ్యవస్థలో నెగటివ్ ఓట్లను ఎవరూ లెక్కపెట్టరు. అలాంటప్పుడు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని మీరెలా అంటారు’ అంటూ వాజ్‌పేయి చేసిన ప్రసంగం ఈనాటి రాజకీయాలకు కూడా అద్దం పడుతోంది. అంతటి వక్తకి నోట మాట రాలేదు.. వాజ్‌పేయి మృదుస్వభావి. వెన్నలాంటి మనసు. ఏ అంశం మీదైనా అనర్గళంగా మాట్లా డే ఆయన నోటి వెంట మాటరాని సందర్భం ఒకసారి ఎదురైంది. 1988లో బిహార్‌లోని పరారి యా గ్రామంపై దాడి చేసిన ఖాకీలు తమ కర్కశత్వాన్ని చాటుకున్నారు. వెనుకబడిన కులాల ఇళ్లౖ పె దాడులు చేసి వారి సామాన్లను లూటీ చేశారు. మహిళల్ని పాశవికంగా సామూ హిక అత్యాచారం చేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన వాజ్‌పేయి చలించారు. చెవి కమ్మలు, ముక్కెరలు తెగిపోయి రక్తంతో దీనస్థితిలో ఉన్న వారిని చూసి విస్తుపోయారు. నోట మాట రాక మౌనంగా ఉండిపోయారు. కన్నీరు పెట్టుకు న్నారు. బుగ్గల మీద నుంచి జారిపడిన కన్నీటి చారికలతో వాజపేయి చెప్పిన మాట ఒక్కటే. ‘రేపిస్టుల్ని ఉరితీయాలి‘. ఆ ఒక్క మాటతోనే అత్యాచార బాధితులకు కొండంత ఊరట ఇచ్చారు. ఏకాభిప్రాయంతోనే 3 రాష్ట్రాల ఏర్పాటు న్యూఢిల్లీ: వాజ్‌పేయి ఏకాభిప్రాయం కోసం తీవ్రంగా శ్రమిస్తారన్నది అందరూ చెప్పేమాట అయితే, 2000 ఏడాదిలో ఆయన ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం ఇందుకు చక్కని ఉదాహరణ. ఆ ఏడాది నవంబర్ 1న మధ్యప్రదేశ్‌ను విభజించి ఛత్తీస్‌గఢ్‌ను, అదే నెల 9న ఉత్తరప్రదేశ్‌ను విభజించి ఉత్తరాఖండ్‌ను, 15న బిహార్‌ను విభజించి జార్ఖండ్‌ను వాజ్‌పేయి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. అయితే ఎక్కడా ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఈ మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇటీవల అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలోనూ ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఆ మూడు రాష్ట్రాలూ ప్రశాంతంగా ఏర్పడ్డాయి’ అన్నారు. (పెరిగిన పెట్రోలు, కిరోసిన్ ధరలకు నిరసనగా ఎడ్లబండిపై పార్లమెంటు సమావేశాలకు వెళుతున్న వాజ్‌పేయి) 12 సార్లు ఎంపీగా.. న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 47 సంవత్సరాల పాటు మాజీ ప్రధాని వాజ్‌పేయి సేవలందించారు. 12 సార్లు పనిచేసిన అతికొద్ది మందిలో ఆయన ఒకరు. 10 సార్లు లోక్‌సభకు ఎన్నిక కాగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఒక్కసారి మాత్రమే ఆయన ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. 1984లో గ్వాలియర్ నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు సింధియా చేతిలో 2 లక్షల ఓట్ల తేడాతో వాజ్‌పేయి ఓడిపోయారు. రెండు భాషల్లోనూ పట్టు ఇంగ్లిష్, హిందీ రెండు భాషల్లోనూ వాజ్‌పేయి అనర్గళంగా మాట్లాడగలరు. 1977లో ఐరాసలో హిందీలో మాట్లాడి మాతృభాషపై మమకారాన్ని చాటుకున్నారు. ఏ భాషలో మాట్లాడినా హాస్యం, వ్యంగ్యాన్ని విడిచిపెట్టలేదు వ్యంగ్యపూరిత వ్యాఖ్యలు ♦ బీజేపీలో వాజ్‌పేయి దళం ఉంది, అడ్వాణీ దళం ఉంది అని విపక్షాలు విమర్శిస్తే, వాజపేయి ‘నేను ఏ దళ్‌దళ్ (బురద)లో లేను. కానీ అవతలి వారి బురదలో కమలదళాన్ని వికసింపజేయగలను’ అంటూ ఎదురుదాడి చేశారు. ♦కశ్మీర్ లేకుండా పాకిస్తాన్ అసంపూర్ణం అని పాకిస్తాన్ మంత్రి ఒకరు అంటే దానికి వాజ్‌పేయి ఇచ్చిన సమాధానం పాకిస్తాన్ లేకుండా హిందూస్తాన్ కూడా అసంపూర్ణమే. ♦ ఒక చేత్తో ఎవరూ చప్పట్లు కొట్టలేరు కదాని పాక్ నేతలు పరోక్షంగా భారత్ కయ్యానికి కాలు దువ్వుతోందని ప్రస్తావిస్తే వాజ్‌పేయి చప్పట్లు కొట్టలేం నిజమే. కానీ చిటికెలు వెయ్యగలం కదా అంటూ పాక్ నోరు మూయించారు. ♦ విపక్షాలు రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ, తప్పుడు పార్టీలో మంచి మనిషి అని వ్యాఖ్యానిస్తే, అయితే ఈ మంచి మనిషిని ఏం చేయాలని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ♦ బిహార్‌లో ఒక సభలో ‘నేను అటల్‌ని. ఒక్క క్షణం ఆగి బిహారిని కూడా ‘అంటూ ప్రసంగాన్ని ప్రారంభించగానే చప్పట్లే చప్పట్లు. -
ఆయన కేబినెట్లో పనిచేయడం గర్వకారణం
భారతరత్న అటల్ బిహారి వాజ్‌పేయి ఆరోగ్యం విషమించటంతో దేశమంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ తరుణంలో వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ ఆగ్రశ్రేణులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏయిమ్స్ చేరుకొని వాజ్‌పేయి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. దేశ నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఢిల్లీ చేరుకుంటున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యం కుదుటపడాలని పలువురు నేతలు కోరుకున్నారు. ‘ఈ రోజటి కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నాను.. వాజ్‌పేయిని చూడటానికి తక్షణమే ఢిల్లీ వెళుతున్నాను. ఆ మహనాయకుడి కేబినెట్లో పనిచేసే అవకాశం లభించింనందుకు గర్వంగా ఉంది. వాజ్‌పేయి ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా పార్టీ అండగా నిలిచింది. వాజ్‌పేయి లాంటి రాజనీతిజ్ఞుడిని మరలా ఇంత వరకు చూడలేదు. అయన త్వరగా కోలుకోవాలి’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరుకున్నారు. ఎయిమ్స్‌లో వాజ్‌పేయిని పరామర్శించిన రాహుల్ గాంధీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మన దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలి’ అని ఆకాంక్షించారు. ‘వాజ్‌పేయి కేబినెట్లో రెండు సంవత్సరాలు పనిచేశాను. అలాంటి మహానాయకుడి నాయకత్వంలో పనిచేసినందుకు గర్వంగా, సంతోషంగా ఉంది. వాజ్‌పేయి ఆరోగ్యం విషమించడం బాధాకరం. నేను వెంటనే ఢిల్లీకి వెళుతున్నాను’ అంటూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ‘వాజ్‌పేయి ఆరోగ్యం విషమించడం చాలా బాధాకరం. దేశం గర్వించదగ్గ నాయకుల్లో వాజ్‌పేయి ఒకరు. ఆ మహనీయుడి ఆరోగ్యం కుదుటపడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ట్వీట్ చేశారు. -
వాజ్‌పేయి నివాసం వద్ద ఉద్విగ్న వాతావరణం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని మాజీప్రధాని వాజ్‌పేయి నివాసం వద్ద తీవ్ర ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో ఆయన నివాసానికి బీజేపీ అగ్రనేతలు, శ్రేణులు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థి గురించి వాకబు చేసిన ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు అనంతరం నేరుగా వాజ్‌పేయి నివాసానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వాజ్‌పేయి నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున వాజ్‌పేయి నివాసానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాజ్‌పేయి నివాసానికి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు వాజ్‌పేయి చికిత్స పొందుతున్న ఎయిమ్స్ పరిసర ప్రాంతల్లోనూ వాహనాలన్నింటినీ ఖాళీ చేయించారు. మరికాసేపట్లో వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బుటెటిన్‌ను ఎయిమ్స్ వైద్యులు విడుదల చేయనున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. ఢిల్లీకి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ రావాలని అధిష్టానం ఆదేశించింది. -
చావు ఆయుష్షు ఎంత? రెండు క్షణాలే!
అటల్ బిహారీ వాజపేయి రాజకీయ వేత్తగా కంటే సాహితీ వేత్తగా, కవిగా ప్రాచుర్యం పొందారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయనలోని కవిని గౌరవించేవారు.ఆయన ప్రసంగాలు కూడా కవితాత్మకంగా ఉండటం ఆయనలోని కవితాభినివేశానికి నిదర్శనం.’నువ్వు ఏదో ఒక రోజు మాజీ ప్రధానివి కావచ్చు.అయితే, మాజీ కవివి మాత్రం ఎప్పటికీ కాలేవు.అని వాజ్‌పేయి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆయనలోని సాహిత్య ప్రతిభను గౌరవిస్తూ అందరూ అటల్జీ అని పిలిచేవారు. తన కవితలు, వ్యాఖ్యల ద్వారా ఆయన ఎందరినో ఉత్తేజితుల్ని చేశారు. మరెందరిలోనో ధైర్య సాహసాలు నింపారు. బుధవారం నాటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ వాజపేయి వ్యాఖ్యల గురించి ప్రస్తావించారంటే ఆయన దేశ రాజకీయాల్లో కవిగా ఎంత బలమైన ముద్ర వేశారో స్పష్టమవుతోంది.నిరాశావాదాన్ని పారదోలాలని చెబుతూ...’ మధ్యాహ్నాం పూట చీకటి ఆవరించింది, సూర్యుడు తన నీడచేత పరాజితుడయ్యాడు. నీ హృదయం నుంచి తైలం పిండి దీపాన్ని వెలిగించు మరో దీపం వెలిగించేందుకు కదిలిరా... అంటూ పిలుపు నిచ్చారు. మరో సందర్భంలో... ప్రభూ.. నన్నెప్పుడూ అత్యున్నత స్థాయికి చేరనివ్వకు అక్కడుండి ఇతరులను ఇబ్బంది పెట్టలేను అలాంటి పరిస్థితి నుంచి నన్నెప్పుడూ విముక్తుడిని చేయి..అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాజపేయి కవితలు జీవిత సత్యాలను వెల్లడిస్తాయి. చట్ట సభల్లో ప్రసంగిస్తున్నప్పుడు కూడా ఆశువుగా కవితలల్లి సభ్యులను రంజిపచేయడం వాజపేయికి వెన్నతో పెట్టిన విద్య. మరణాన్ని కూడా ఆయన కవితాత్మకంగా ఇలా చిత్రించారు. ’చావు ఆయుష్షు ఎంత? రెండు క్షణాలు కూడా ఉండదు జీవితమన్నది ప్రగతిశీలం..అది ఒకటి రెండు రోజుల్లో ముగిసిపోదు’ -
నవాజ్ షరీఫ్ అరెస్ట్
లాహోర్: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ స్వదేశంలో అడుగుపెట్టిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మరియమ్ అరెస్టయ్యారు. పనామా పత్రాల కేసులో షరీఫ్‌కు పదేళ్లు, మరియమ్‌కు ఏడేళ్ల జైలుశిక్ష పడింది. శుక్రవారం రాత్రి లాహోర్ విమానాశ్ర యంలో దిగిన వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. భద్రతా అధికారులు విమానంలోకి ప్రవేశించి వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఎదురుచూస్తున్న షరీఫ్ తల్లిని కలుసుకునేందుకు వారికి అనుమతిచ్చారు. తర్వాత ఇద్దరినీ ప్రత్యేక హెలికాప్టర్లో ఇస్లామాబాద్‌కు తరలించారు. అనంతరం షరీఫ్‌ను రావల్పిండిలోని అదియాలా జైలుకు, మరియమ్‌ను తాత్కాలిక సబ్‌జైలుగా ఏర్పాటుచేసిన సీహాలా రెస్ట్ హౌజ్‌కు తీసుకెళ్లారు. లాహోర్‌లో ఉత్కంఠ.. పాక్‌కు రాగానే షరీఫ్‌ను అరెస్ట్ చేస్తామని అధికారులు ప్రకటించడంతో లాహోర్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 10 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 300 మంది షరీఫ్ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. లాహోర్ వెళ్లే అన్ని దారులను మూసివేశారు. విమానాశ్రయానికి రాకపోకలపై ఆంక్షలు విధించారు. 144వ సెక్షన్ అమల్లో ఉన్నా షరీఫ్ సోదరుడు షాబాజ్ తన అనుచరులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. విమానాశ్రయం సమీపంలో షరీఫ్ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. లాహోర్‌లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. లండన్ నుంచి పాకిస్తాన్‌కు బయల్దేరిన షరీఫ్, మరియమ్‌లు మూడు గంటలు ఆలస్యంగా లాహోర్ చేరుకున్నారు. లండన్ నుంచి అబుదాబికి నిర్ణీత సమయంలోనే చేరుకున్నా అక్కడి నుంచి లాహోర్ రావాల్సిన విమానం ఆలస్యంగా బయల్దేరింది. ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్‌లో అడుగుపెట్టడం మంచి నిర్ణయమేనా? అని అబుదాబి విమానాశ్రయంలో విలేకరులు షరీఫ్‌ను ప్రశ్నించగా..దేశంలోని పరిస్థితుల గురించి తనకు తెలుసని అన్నారు. దేశ తలరాత మార్చేందుకే తాను తిరిగొస్తున్నట్లు చెప్పారు. గుడ్డిగా ప్రతీకారం తీర్చుకునేందుకే.. అంతకుముందు, నవాజ్ షరీఫ్ తన దేశ పౌరులనుద్దేశించి ప్రసంగించిన వీడియోను మరియమ్ ట్వీట్ చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దేశ భవిష్యత్తును మార్చడానికి తనకు మద్దతుగా నిలవాలని షరీఫ్ కోరారు. ‘అసలు ఇందులో కేసు లేదు, తీర్పు లేదు. గుడ్డిగా ప్రతీకారం తీర్చుకునేందుకు ఆటలు ఆడుతున్నారు. నాకు వ్యతిరేకంగా కేసులే లేవు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనుకున్నాను కాబట్టే.. ఫిక్సింగ్‌కు పాల్పడి రాజకీయాల నుంచి నన్ను దూరంగా ఉంచడానికి పనామా పత్రాల కేసును తెరపైకి తెచ్చారు. నేనేం చేయాలో అదే చేశాను. నాకు పదేళ్ల శిక్ష పడిందని తెలుసు. పాక్‌లో అడుగుపెట్టిన మరుక్షణమే జైలుకు తరలిస్తారని తెలుసు. నేను చేస్తున్నదంతా మీకోసమేనన్న సంగతిని గ్రహించండి’ అని అన్నారు. పంజాబ్ ప్రావిన్సులో తన అనుచరులపై కొనసాగుతున్న అణచివేత..ప్రభుత్వానికి తానంటే ఉన్న భయాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. అందుకే లాహోర్ విమానాశ్రయానికి వేలాది మంది మంది మద్దతుదారులు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆసుపత్రిలో తన తల్లి వెంటిలేటర్‌పై ఉన్న చిత్రాలను కూడా మరియమ్ పోస్ట్ చేశారు. -
‘నేను దొంగను కాదు.. తిరిగి వస్తా’
ఇస్లామాబాద్ : పనామా పేపర్స్ కుంభకోణం కేసులో పదేళ్లు జైలు శిక్ష పడిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీర్పు అనంతరం తొలిసారి స్పందించారు. తాను తప్పించుకొవాడానికి దొంగను కానని, శిక్షను ఎదుర్కొవడానికి పాక్ తప్పనిసరి వస్తానని తెలిపారు. పనామా పేపర్స్ కేసులో షరీఫ్, అతని కుమార్తె మరియం నవాజ్‌కు శిక్షవిధిస్తూ ఇస్లామాబాద్‌లోని ఓ అకౌంటబులిటీ కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం లండన్‌లో ఆయన కుమర్తెతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోర్టుపై తనకు గౌరవం ఉందని, శిక్షను అనుభవించడానికి తప్పకుండా పాక్ వస్తానని పేర్కొన్నారు. తన భార్యకు క్యాన్సర్ కారణంగా ప్రస్తుతం లండన్‌లో చికిత్స తీసుకుంటున్నారని, కొంత సమయం తరువాత కోర్టుకు హాజరవుతానని తెలిపారు. పాకిస్తాన్‌కు వలస పాలన నుంచి విముక్తి లభించినా, దేశ ప్రజలు మాత్రం ఇంకా బానిసత్వంలోనే ఉన్నారని నవాజ్ షరీఫ్ అన్నారు. పనామా పేపర్స్ కుంభకోణంలో షరీఫ్‌ను నిందితుడిగా పేర్కొంటు పాక్ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో గత ఏడాది జూలై 25న ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జూలై 25న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలకు షరీఫ్, ఆయన కుమార్తె, అల్లుడు దూరంగా ఉండనున్న నేపథ్యంలో ఆయన సోదరుడు షహాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్‌ను బాధ్యతలను స్వీకరించనున్నారు. -
నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: పనామా పేపర్ల కుంభకోణంలో ఓ కేసుకు సంబంధించి పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఓ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు ఆయనకు 80 లక్షల పౌండ్ల (దాదాపు 73 కోట్ల రూపాయలు) జరిమానా కూడా విధిస్తూ పాకిస్తాన్‌లోని ఓ అవినీతి వ్యతిరేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పాక్‌లో ఈ నెల 25నే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (పీఎంఎల్–ఎన్) పార్టీకి ఈ తీర్పు గట్టి ఎదురుదెబ్బ కానుంది. షరీఫ్‌తోపాటు ఆయన కూతురు మరియంకు కూడా కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, 20 లక్షల పౌండ్ల (దాదాపు 18 కోట్ల రూపాయలు) జరిమానా విధించింది. విచారణకు సహకరించని కారణంగా షరీఫ్, మరియంతోపాటు ఆమె భర్త మహ్మద్ సఫ్దార్కు కూడా చెరో ఏడాది జైలు శిక్ష పడింది. అయితే శిక్షలన్నీ ఏకకాలంలో అమలవనున్నందున షరీఫ్ పదేళ్లు, మరియం ఏడేళ్లపాటు మాత్రమే జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇస్లామాబాద్‌లోని ఓ అకౌంటబులిటీ కోర్టు, భారీ భద్రత నడుమ రహస్యంగా ఈ తీర్పును వెలువరించింది. అనంతరం తీర్పు వివరాలను నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో (ఎన్ఏబీ) న్యాయవాది మీడియాకు వెల్లడించారు. అంతకుముందు ఈ తీర్పును వారంపాటు వాయిదా వేయాలంటూ షరీఫ్ కుటుంబసభ్యులు కోరినా న్యాయమూర్తి పట్టించుకోలేదు. గతేడాది పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీర్పుతో పదవీచ్యుతుడిగా మారిన నవాజ్ షరీఫ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తాజా తీర్పులో ఆయన కూతురు, అల్లుడికి జైలు శిక్ష పడినందున వారు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అయితే ఈ తీర్పుపై వారు 10 రోజుల్లోపు పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని ఎన్ఏబీ న్యాయవాది చెప్పారు. అసలు కేసు ఏంటి? పనామా పేపర్ల కుంభకోణానికి సంబంధించి షరీఫ్ కుటుంబంపై మొత్తం 3 కేసులుండగా, అవెన్‌ఫీల్డ్ కేసులో శుక్రవారం తీర్పు వెలువడింది. 1990ల్లోనూ నవాజ్ షరీప్ పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు. అప్పట్లో అవినీతి సొమ్మును కూడబెట్టి లండన్‌లోని పార్క్‌లేన్‌లో ఉన్న అవెన్‌ఫీల్డ్ హౌస్ అనే భవంతిలో ఖరీదైన నాలుగు ఫ్లాట్లను షరీఫ్ కుటుంబ సభ్యులు కొన్నారు. 1993 నుంచీ ఈ ఫ్లాట్లు వారి పేరనే ఉన్నాయి. గతేడాది సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎన్ఏబీ ఈ కేసులో విచారణ చేపట్టింది. షరీఫ్‌తోపాటు ఆయన కొడుకులు, కూతురు, అల్లుడిని కూడా ఎన్ఏబీ ఈ కేసులో నిందితులుగా చేర్చింది. 9 నెలలకు పైగా విచారించిన అనంతరం కోర్టు షరీఫ్, ఆయన కూతురిని దోషులుగా తేలుస్తూ తీర్పిచ్చింది. పాకిస్తాన్‌కు తిరిగొస్తారా? కేన్సర్‌కు చికిత్స పొందుతున్న తన భార్యకు తోడుగా నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్‌లోనే ఉన్నారు. కోర్టు తీర్పు వెలువరించిన సమయంలో ఆయన తన కూతురితో కలసి అవెన్యూఫీల్డ్లోని ఫ్లాట్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు కోర్టు వీరిని దోషులుగా తేల్చి, శిక్ష విధించడంతో షరీఫ్, మరియంలు పాక్‌కు తిరిగొచ్చి జైలు శిక్షను అనుభవిస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 25నే ఎన్నికలు జరగనున్నందున వారు దేశానికి తిరిగొచ్చి జైలుకు వెళితే సానుభూతితో పీఎంఎల్–ఎన్ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దొంగను కాదు.. తిరిగొస్తా: షరీఫ్ పాకిస్తాన్‌కు వలస పాలన నుంచి విముక్తి లభించినా, దేశ ప్రజలు మాత్రం ఇంకా బానిసత్వంలోనే ఉన్నారని నవాజ్ షరీఫ్ అన్నారు. తీర్పు అనంతరం ఆయన లండన్‌లో విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్‌కు ఉన్న 70 ఏళ్ల చరిత్ర గతిని తాను మార్చాలనుకున్నందుకు, ఓటుకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేసినందుకే తనకు ఈ శిక్ష పడిందని నవాజ్ షరీఫ్ అన్నారు. తానేమీ దొంగను కాదనీ, పాకిస్తాన్‌కు తెరిగి వెళ్తానని స్పష్టం చేశారు. నిజం మాట్లాడినందుకు పాకిస్తానీలను బంధించడమనే ప్రక్రియ ఆగిపోయేంత వరకు, కొందరు ఆర్మీ జనరళ్లు, న్యాయమూర్తులు పాకిస్తానీలకు విధిస్తున్న బానిసత్వం తొలగిపోయేంత వరకు తన పోరాటం కొనసాగుతుందని షరీఫ్ పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ సోదరుడు, పీఎంఎల్–ఎన్ పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కూడా తమ వాళ్లను కోర్టు దోషులుగా తేల్చడాన్ని తిరస్కరించారు. కోర్టు నవాజ్ షరీఫ్, మరియంలను దోషులుగా తేల్చడం అన్యాయమనీ, రాజకీయ దురుద్దేశం వల్లే ఇలా జరిగిందని ఆయన ఆరోపించారు. జూలై 25న ప్రజా న్యాయస్థానంలో తమ వాళ్లు నిర్దోషులుగా బయటకొస్తారన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీ పీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి, కెన్యా మాజీ ప్రధాని రైలా ఓడింగాలకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ..శక్తిని ప్రసాదించే తిరుమల క్షేత్రంలో అనేక అవకతవకలు, ఆరోపణలు రావడం చాలా బాధాకరమన్నారు. అధికారులు, అర్చకులు, పాలక వర్గాల మధ్య సమన్వయ లోపమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. వెంటనే టీటీడీపై వస్తోన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. లేకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. కెన్యా మాజీ ప్రధాని రైలా ఓడింగా మాట్లాడుతూ..హిందూమతాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పర్యటన బాగా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. తనకు సరైన ఆతిధ్యం ఇచ్చినందుకు భారతదేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. రైలా ఓడింగా 2008 నుంచి 2013 మధ్య కెన్యా ప్రధానిగా పనిచేశారు. -
రజాక్ 1,875 కోట్ల ‘ఖజానా’ స్వాధీనం
కౌలాలంపూర్: మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు చెందిన భారీ ‘ఖజానా’ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 273 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,875 కోట్లు) ఆస్తిని జప్తు చేసినట్లు చెప్పారు. అందులో నగదుతోపాటు, ఆభరణాలు, లగ్జరీ వస్తువులు ఉన్నట్లు తెలిపారు. 1ఎండీబీ (1మలేసియా డెవలప్మెంట్ బెర్హాడ్) నిధుల కుంభకోణం కేసులో భాగంగా సోదాలు నిర్వహించిన పోలీసులు.. 12 వేల ఆభరణాలు, సుమారు రూ.205 కోట్ల విదేశీ కరెన్సీ, సుమారు రూ.132 కోట్ల విలువైన గడియారాలు, ఇతర ఖరీదైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో కౌలాలంపూర్‌లో జరిపిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న భారీ ‘ఖజానా’ విలువను అధికారులు బుధవారం లెక్కించారు. నజీబ్‌తోపాటు ఆయన సన్నిహితులు 1ఎండీబీకి చెందిన మిలియన్ డాలర్ల నిధులతో కళాఖండాలు, ఆభరణాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
వాజ్‌పేయి ఆరోగ్యంపై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహార్ వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగా ఉన్నందుకు సంతోషంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలియజేశారు. వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాక్షించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా వైఎస్ జగన్ తెలియజేశారు. -
190 కోట్ల నగదు.. 400 హ్యాండ్‌బ్యాగ్‌లు
కౌలాలంపూర్: మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు చెందిన అపార్ట్మెంట్లలో పోలీసులు సోదాలు నిర్వహించి దాదాపు రూ.190 కోట్ల (2.86 కోట్ల డాలర్ల) విలువైన నగదు, అత్యంత ఖరీదైన 400 హ్యాండ్‌బ్యాగ్‌లను జప్తు చేశారు. మరెన్నో ఆభరణాలు, చేతి గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై ఉన్న తీవ్ర అవినీతి ఆరోపణలే తాజా ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం. మలేసియా ప్రభుత్వానికి చెందిన 1ఎండీబీ అనే సంస్థ డబ్బునూ నజీబ్, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు కలసి కాజేశారనే ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలపై కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో గతవారం రోజుల్లో నజీబ్ ఇల్లు సహా 12 చోట్ల పోలీసులు సోదాలు నిర్వహించారు. -
నవాజ్ షరీఫ్‌కు షూ దెబ్బ!
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం జమియా నమీయా ఇస్లామిక్ విశ్వవిద్యాలయంలో ఓ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నవాజ్‌పై ఓ విద్యార్థి షూ విసిరాడు. ఆయన ప్రసంగించేందుకు మైక్ వద్దకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షూ నేరుగా నవాజ్ భుజాలు, చెవులకు బలంగా తాకడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం నిందితుడితో పాటు అతని సహాయకుడ్ని భద్రతాధికారులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. -
93వ పడిలోకి వాజ్‌పేయ్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ సోమవారం 93వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వాజ్‌పేయ్ నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వాజ్‌పేయ్ ఇంటికి వెళ్లాను. ఆయన కుటుంబంతో కూడా కొద్దిసేపు గడిపాను’ అని అనంతరం ట్వీటర్లో పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య సైతం వాజ్‌పేయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, వాజ్‌పేయ్ జన్మదినం సందర్భంగా 93 మంది ఖైదీల్ని యూపీ సర్కారు విడుదలచేసింది. శిక్షాకాలం పూర్తయినా కోర్టు విధించిన జరిమానా చెల్లించలేకపోవడంతో వీరందరూ ఇన్నాళ్లూ జైలులోనే ఉండాల్సి వచ్చింది. -
మాజీ ప్రధాని ర్యాలీలో అపశృతి
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీకొని 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. తన కుటుంబసభ్యులకు విదేశాల్లో అక్రమాస్తులు ఉన్నాయంటూ పనామా పేపర్లో ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గద్దెదిగిన షరీఫ్ తిరిగి అధికారం దక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రజల మద్ధతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం గుజ్రాత్ లో బహిరంగ సభకు హాజరయ్యేందుకు మద్ధతుదారులతో లాహోర్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. లాలామూస వద్దకు రాగానే డివైడర్ దాటుతున్న బాలుడిని కాన్వాయ్ లోని ఓ కారు ఢీకొట్టగ్గా, అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. పాక్ ప్రజాస్వామిక పోరాటంలో అసువులు బాసిన తొలి అమరవీరుడు ఆ బాలుడేనని రైల్వే మంత్రి ఖవాజా పేర్కొనగా, బాలుడి కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి అన్ని విధాల ఆదుకుంటానని షరీఫ్ గుజ్రాత్ సభలో ప్రకటించారు. -
దేవెగౌడతో ఆర్.కృష్ణయ్య భేటీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దేవెగౌడతో బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీలను నామినేటెడ్ సభ్యులుగా నియమించేందుకు రాజ్యాంగ సవరణ చేసి 20 శాతం అదనపు సీట్లను సృష్టించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరితో కృష్ణయ్య సుదీర్ఘంగా చర్చించారు. -
శ్రీలంక మాజీ ప్రధాని కన్నుమూత
కొలంబో: శ్రీలంక మాజీ ప్రధాని రత్నసిరి విక్రం నాయకే (83) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. 1933, మే 5 జన్మించిన రత్నసిరి దేశానికి ఆయన రెండు సార్లు (2000 -2001, 2005- 2010) ప్రధానమంత్రిగా దేశానికి తన సేవలందించారు. కాగా 1960 లో రాజకీయాల్లోకి ప్రవేశించిన విక్రం నాయకే పీపుల్స్ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ శాసన సభ్యుడిగాఎన్నికయ్యారు. 1970 లో న్యాయ సహాయ మంత్రి నియమించారు. 1994 సార్వత్రిక ఎన్నికలలో ఎంపీ గా ఎన్నికై హోం వ్యవహారాల మంత్రి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు ప్లాంటేషన్ ఇండస్ట్రీస్ నియమితులయ్యారు. -
దేశంకోసం ఇందిర ప్రాణత్యాగం: రోశయ్య
-
దేశంకోసం ఇందిర ప్రాణత్యాగం
మాజీ ప్రధానికి రోశయ్య నివాళి సాక్షి, హైదరాబాద్: పేద ప్రజల బతుకుల్లో మార్పుకోసం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ఇందిరాగాంధీ దేశంకోసం ప్రాణ త్యాగం చేశారని తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ శతజయంతి ఉత్సవాలను శనివారం గాంధీభవన్‌లో ప్రారంభించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీనేత కె.జానారెడ్డి, పార్టీనేతలు పొన్నాల లక్ష్మయ్య, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోశయ్య మాట్లాడుతూ ఎంతో సంపన్నమైన కుటుంబంలో జన్మించినా బాల్యంలో చాలా కష్టాలు ఎదుర్కొన్న మహిళ.. ఇందిరాగాంధీ అని అన్నారు. దేశ సంక్షేమంకోసం ఆమె కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కుమహిళగా పేరుతెచ్చుకున్నారని గుర్తుచేశారు. ఇందిరాగాంధీ సూచించిన మార్గంలో నడవడమే ఆమెకు అర్పించే నిజమైన నివాళి అని రోశయ్య పేర్కొన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిర శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు రాష్ట్రంలో నిర్వహిస్తామన్నారు. రోశయ్యకు సన్మానం మాజీ గవర్నర్ రోశయ్యను శనివారం కాంగ్రెస్ నేతలు గాంధీభవన్లోనూ, అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలోనూ సన్మానించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీనేత కె.జానారెడ్డి, నేతలు టి.జీవన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తదితరులు రోశయ్యను సత్కరించారు. గాంధీ భవన్‌కు రావడం తనకు సొంతఇంటికి వచ్చి నంత సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రోశయ్య అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొ నాలని ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా రాలేకపోతున్నానని చెప్పారు. -
ఇందిర అరుదైన ఫొటోలు చూడాలని ఉందా..!
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ.. భారత రాజకీయాల్లోనే ఆమె తిరుగులేని ముద్ర వేసిన నాయకురాలు. దేశం మొత్తాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకొని కనుసన్నల్లో మెదిలేలా చేసిన శక్తిమంతమైన మహిళ. వైఫల్యాలు, స్వార్థపూరిత చర్యలు అనే విమర్శలను పక్కనపెడితే.. ఇప్పటికీ భారత రాజకీయాల అధ్యయనం ఆమె ప్రస్తావన లేకుండా చేయడం సాధ్యంకాని పని. ప్రధానిగా చెరగని ముద్ర వేసుకున్న ఇందిరాగాంధీ.. ఇప్పటికీ గ్రామాల్లోని ప్రతి ఒక్కరు ఆమె తమకు బాగా కావాల్సినవారు అన్నట్లుగా మాట్లాడతారంటే ఆశ్చర్యపోక తప్పదు కూడా. అంతగా సుపరిచితురాలైన ఆమె ఆహార్యం, దర్పం, హుందాతనం, ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్ ఒక ప్రత్యేకతను చాటుకుంది. అలాంటి ఇందిరాగాంధీకి సంబంధించిన అరుదైన ఛాయ చిత్రాలు ఇప్పుడు దర్శనం ఇస్తున్నాయి. యుక్త వయసులోవి, భర్త ఫీరోజ్ గాంధీతో పెళ్లినాటివి, కశ్మీర్ లో హనీమూన్ సందర్భంలోనివి, రాజీవ్‌ను ఒడిలోపెట్టుకొని నెహ్రూతో దిగిన సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే చిత్రాలు ప్రదర్శనకు ఉంచారు. మొత్తం 220 ఆనాటి ఇందిర ఫొటోల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే సేకరించారు. వీటన్నింటిని అలహా బాద్‌లో ఎగ్జిబిషన్‌కు ఏర్పాటు చేయగా సోనియా కూతురు ప్రియాంక గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సోనియా, రాహుల్, ప్రియాంక ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. (మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అరుదైన చిత్రాల ఎగ్జిబిషన్ ను ప్రారంభించి తిలకిస్తున్న ప్రియాంకా గాంధీ) (మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అరుదైన చిత్రాలు వీక్షిస్తున్న సోనియా గాంధీ) (మహాత్మాగాంధీ చితాభస్మాన్ని రైలులో తీసుకెళుతూ ఇందిర) (ముగ్గురు ప్రధానులు నెహ్రూ, ఇందిర, రాజీవ్(ఒడిలోని బాలుడు) (తన కోడలు సోనియా గాంధీతో ఇందిర) (పెళ్లినాడు తన భర్త ఫిరోజ్ గాంధీ, బంధువులతో ఇందిర) -
వర్మకు పిచ్చి ముదిరిందా?
ముంబై: సినిమాలతోనే కాదు ట్వీట్లతో కూడా వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారుతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా మరోసారి దారుణమైన ట్వీట్లతో చెలరేగిపోయాడు. దేశ మాజీ ప్రధానమంత్రులు ముగ్గురిపై విచక్షణారహితంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వీరి ముగ్గురు ఉన్న ఒక ఫోటో ఆధారంగా విచిత్రకరమైన వాదనకు దిగాడు. పార్లమెంటులో ముగ్గురు మాజీ ప్రధానమంత్రులు అటల్ బిహారీ వాజ్ పేయి, పీవీ నరసింహారావు, చంద్ర శేఖర్.. ఈ ముగ్గురికీ ముందు సోనియా గాంధీ ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. దానిపై హద్దు మీరి వ్యాఖ్యలు చేశాడు. పార్లమెంటులో ముందువరుసలో కూర్చున్న సోనియాపై వెనక కూర్చున్న ప్రధానమంత్రులు ముగ్గురు కుళ్లు జోకులు వేసుకుంటున్నారంటూ లేనిపోని భాష్యాలు చెప్పుకొచ్చి వివాదాన్ని సృష్టించాడు. అంతేకాదు.. దీనిపై పోలీసు విచారణ జరగాలంటూ నోటికొచ్చినట్టు చెలరేగిపోయాడు. పురుషులు ఎక్కడున్నా పురుషులేనని, బ్యాక్ బెంచ్ లో కూర్చున్నవాళ్లు ఎపుడూ బ్యాడ్ అని ట్వీట్ చేశాడు. పాఠశాల అయినా.. పార్లమెంట్ అయినా.. పురుషులు పురుషులే అంటూ కామెంటు చేశాడు. Whoever these 3 men r am shocked they are cracking dirty jokes about such a classy dignified woman whoever she is pic.twitter.com/sbRJ07vpt7 — Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2016 Back benchers r always bad whether in school or parliament .Dont know who these 3 r but they look badder than each pic.twitter.com/iJ9GgqKFlM — Ram Gopal Varma (@RGVzoomin) October 29, 2016 -
భద్రాద్రిలో మాజీ ప్రధాని పూజలు
భద్రాచలం: మాజీ ప్రధానమంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హరదనహళ్లి దొడ్డేగౌడ దేవే గౌడ (హెచ్.డి.దేవేగౌడ) ఆదివారం తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. సతీమణి చెన్నమ్మతో కలిసి ఆదివారం భద్రాద్రి ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం పురోహితులు, అధికారులు.. మాజీ ప్రధాని దంపతులకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి గౌరవించారు. తర్వాత తీర్థప్రసాదాలు అందజేశారు. దేవేగౌడ దంపతుల వెంట కొందరు జేడీ(ఎస్) నాయకులు కూడా ఉన్నారు. మాజీ ప్రధాని రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. పోలీసు అధికారులు భద్రతను కట్టుదిట్టంచేశారు. దేవేగౌడ దంపతుల పాతఫొటోలు కొన్ని మీకోసం.. -
రాజీవ్ గాంధీకి సోనియా, రాహుల్ నివాళి
-
మన్మోహన్ సింగ్ కథతో బాలీవుడ్ సినిమా
ప్రస్తుతం ఇండియన్ స్క్రీన్ మీద బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఎక్కువగా స్పోర్ట్స్ స్టార్ల జీవితాలనే వెండితెర మీద ఆవిష్కరిస్తుండగా.. తాజాగా ఓ పొలిటికల్ లీడర్ జీవితంపై సినిమాను తెరకెక్కిస్తున్నారు. అది కూడా ఈ జనరేషన్ మొత్తానికి తెలిసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా కావటంతో.. ఈ వార్త టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. నాలుగేళ్ల పాటు మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ బారు రాసిన 'ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ - ద మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత సునీల్ బోరా ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసిన చిత్రయూనిట్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి కీలక పాత్రలకు నటీనటుల కోసం అన్వేషిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను స్టార్ట్ చేసిన ఆగస్టు 30న ఫస్ట్ లుక్‌ను, 2017లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను దాదాపు 12 భారతీయ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
ఎన్నికల వేళ 'అమ్మ'కు షాక్!
రాజీవ్ హంతకుల విడుదలకు కేంద్రం నో సుప్రీంలో కేసు ఉందంటూ దాటవేత సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 1991 మే 21వ తేదీన ఎన్నికల ప్రచారం నిమిత్తం తమిళనాడులోని శ్రీపెరంబుదూరుకు చేరుకున్న సమయంలో ఎల్టీటీఈ మానవబాంబు చేతిలో దారుణహత్యకు గురైన సంగతి పాఠకులకు విదితమే. సంవత్సరాల తరబడి సాగిన ఈ కేసు విచారణలో చివరకు ఏడుగురికి ఉరిశిక్ష పడగా రాష్ట్రపతి క్షమాభిక్షతో యావజ్జీవంగా మారింది. మురుగన్, పేరరివాళన్, శాంతన్, నళిని, జయకుమార్, రవిచంద్రన్, రాబర్ట్ బయాస్ ఈ ఏడుగురు గత 20 ఏళ్లుగా వేలూరు సెంట్రల్ జైలు జీవితం గడుపుతున్నారు. యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలు 14 ఏళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపిన పక్షంలో రాష్ట్రప్రభుత్వమే స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని విడుదల చేయవచ్చని చట్టం చెబుతోంది. రెండేళ్ల క్రితం అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం సైతం ఇదే విషయాన్ని ఆనాడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జయలలిత సైతం సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని దీపావళి కానుకగా ఏడుగురిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు 2014లో ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి అనుమతి కోసం కేంద్రానికి పంపారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇందుకు అభ్యంతరం తెలిపింది. మాజీ ప్రధాని హత్య కేసుకే ఈ గతా అంటూ రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. అంతేగాక హంతకుల విడుదలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు చేపట్టిన విచారణలో శిక్షపడినందున వారిని విడుదల చేసే హక్కు రాష్ట్రప్రభుత్వానికి లేదని గత ఏడాది డిశంబరు 2 వ తేదీన తీర్పుచెప్పింది. దీంతో ఏడు మంది హంతకుల విడుదల అంశంపై అప్పటికి అటకెక్కేసింది. అయితే, 24 ఏళ్లుగా జైలులో ఉన్న ఏడు మంది అర్హులు కాబట్టి వెంటనే విడుదల చేయాల్సిందిగా రాష్ట్రంలోని అనేక ప్రజా సంఘాలు, పార్టీలు డిమాండ్ చేయడంతోపాటు నిరసనలు వ్యక్తం చేశాయి. ఈ పరిణామంతో సీఎం జయలలిత ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్ గత నెల 2వ తేదీన ఇటీవల కేంద్రహోంశాఖకు ఉత్తరం రాశారు. 24 ఏళ్లగా జైలులో ఉన్న ఏడుగురు రాజీవ్ హంతకులను విడుదల చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ అంశంలో కే ంద్రం అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరారు. మేమేమీ చెప్పలేం తమిళనాడు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర హోంశాఖ ఓ ఉత్తరం రాసింది. ఏడుగురు ఖైదీల విడుదల అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించలేమని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం నుంచి అందిన ఉత్తరంపై న్యాయనిపుణులను సంప్రదించగా తమ నిర్ణయాన్నే సమర్థించినట్లు కేంద్రం తెలిపింది. ఏడుగురు ఖైదీలను విడుదల చేసే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని సైతం న్యాయనిపుణులు స్పష్టం చేశారని తెలిపింది. ఎన్నికల వేళ ఎదురుగాలి రాష్ట్రంలో దాదాపుగా ప్రతి అంశానికి రాజకీయాలు ముడిపడి ఉండగా, రాజీవ్ హంతకుల అంశానికి సైతం రాజకీయ రంగు పులుముకుంది. తమిళులకు ఎంతో ప్రీతిపాత్రమైన దీపావళి రోజున ఏడు మంది హంతకులను విడుదల చేయడం ద్వారా మార్కులు కొట్టేయాలని సీఎం జయలలిత భావించారు. అయితే అనుకోని అవాంతరాలు వచ్చిపడటంతో నిరాశచెందారు. ఎన్నికల సమయంలో ఏడుమందిని విడుదల చేయడం ద్వారా సానుభూతిపరులను ఓట్లు రాబట్టుకోవాలని అన్నాడీఎంకే ప్రభుత్వం సహజంగానే ఆశించి ఉండవచ్చు. అందుకే సరిగ్గా ఎన్నికల ప్రకటన వెలువడే సమయంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. అయితే ఇదే సానుభూతిని పొందాలని ఎదురుచూస్తున్న బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు కోసం అర్రులుచాచి భంగపడింది. రెండుపార్టీల మధ్య పొత్తు చర్చలు ప్రారంభం కాక ముందే బెడిసికొట్టాయి. హంతకుల విడుదల అంశం తమ చేతుల్లో లేదని బీజేపీ ప్రభుత్వం తెలివిగా తప్పుకున్నట్లు భావించవచ్చు. తాజా పరిణామంతో సీఎం జయ, ఏడు మంది హంతకుల ఆశ నిరాశగా మిగిలిపోయింది.