ఇస్లామాబాద్: తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది. శనివారం ఆయన ఇస్లామాబాద్‌లోని జిల్లా కోర్టులో హాజరయ్యారు. చేరుకున్నారు. పరిస్థితులు తీవ్రంగా ఉద్రిక్తంగా మారడంతో ఇమ్రాన్ హాజరైనట్టు కోర్టు ఆవరణలో వాహనంలోనే సంతకం తీసుకున్నారు. కోర్టు కాంప్లెక్స్‌లోకి ఇమ్రాన్ మద్దతుదారులు రాళ్లు రువ్వగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
దాంతో విచారణ సాగదన్న జడ్జి, ఇమ్రాన్‌పై జారీ అయిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి అభియోగపత్రం లేకుండానే అక్కడి నుంచే తిరిగి వెళ్లేందుకు ఆయన్ను అనుమతించారు. విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు. ఇమ్రాన్ ఇస్లామాబాద్‌లో ఉండగానే లాహోర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు జరిపారు. 20 రైఫిళ్లు, పెట్రోల్ బాంబులు దొరికాయన్నారు. విచారణకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇమ్రాన్ కాన్వాయ్‌లో మూడు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment