Imran Khan
-
ఇమ్రాన్‌కు 14 ఏళ్ల జైలు
ఇస్లామాబాద్: అల్ ఖదీర్ ట్రస్ట్ భూ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు శుక్రవారం 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన బుష్రాను తీర్పు రాగానే కోర్టు ఆవరణలోనే అరెస్టు చేశారు. ఇక ఇమ్రాన్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉండటం తెలిసిందే. అల్ ఖదీర్ ఉదంతంలో ప్రభుత్వ ఖజానాకు ఇమ్రాన్ దంపతులు కోట్లలో నష్టం కలిగించారంటూ పాక్ ఎన్ఏబీ 2023 డిసెంబర్లో కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ ప్రధానిగా ఉండగా మాలిక్ రియాజ్ హుసేన్ అనే లండన్‌కు చెందిన పాక్ రియల్టీ వ్యాపారి నుంచి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లలో కొంత మొత్తాన్ని ఖజానాకు జమ చేయలేదన్నది, బదులుగా తమ అల్ ఖదీర్ వర్సిటీ ట్రస్ట్‌కు హుసేన్ నుంచి 57 ఎకరాల భూమి తీసుకున్నారని ఎన్ఏబీ ఆరోపించింది. -
పాకిస్తాన్ లో హై అలర్ట్.. అమెరికా పౌరులకు హెచ్చరికలు జారీ
వాషింగ్టన్: పాకిస్తాన్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలని పార్టీ మద్దతుదారులు తలపెట్టిన ఆందోళనల కారణంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉన్న అమెరికా పౌరులను ఆ దేశ అడ్వైజరీ హెచ్చరించింది. డిసెంబర్ 16వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది.పాకిస్తాన్ లో శాంతి భద్రతలు అదుపు తప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్న అమెరికా పౌరులను అడ్వైజరీ హెచ్చరించింది. తమ దేశ పౌరులు పెషావర్‌లోని సెరెనా హోటల్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప ఖైబర్ ఫకున్ ఖ్వా ప్రాంతాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచనలు చేసింది. అయితే, సెరెనా హోటల్ పరిసర ప్రాంతాల్లో మిలిటెంట్లు దాడులు చేసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీ వరకు తాము చేసే సూచనలు తప్పకుండా పాటించాలని ఓ ప్రకటనలో పేర్కొంది.ఇదిలా ఉండగా.. పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలని పార్టీ మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు మరణించగా.. మరికొందరు ఆందోళనకారులు గాయపడ్డారు. దీంతో, దాదాపు పదివేల మంది పీటీఐ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
PAK: పీటీఐ నిరసనలు.. ట్విస్ట్ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ భార్య
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలన్న డిమాండ్ వేళ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్ విడుదల డిమాండ్ చేస్తూ పార్టీ మద్దతుదారులు నిరసనలకు దిగారు.ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో, నిరసనలకు నేతృత్వం వహిస్తున్న ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ, సన్నిహితుడు.. మద్దతుదారులకు హ్యాండ్ ఇచ్చారు. నిరసనల వద్ద నుంచి వారిద్దరూ పారిపోయారు. దీంతో, నిరసనకారులు వెనుదిరిగినట్టు అక్కడి మీడియా పేర్కొంది.ఇక, ఇమ్రాన్ ను విడుదల చేయాలంటూ బుష్రా బీబీ, ఆయన సన్నిహితుడు ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం అలీ అమీన్ నేతృత్వంలోపీటీఐ మద్దతుదారులు ఆదివారం నుంచి నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో నిరసనకారులు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పీటీఐ మద్దతుదారులు, పోలీసులకు మధ్య ఘర్షణల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయినట్టు స్థానిక మీడియా తెలిపింది. పదుల సంఖ్యలో మద్దతుదారులు గాయపడ్డారు. మరోవైపు.. పోలీసుల కాల్పుల హెచ్చరికల నేపథ్యంలో బుష్రా బీబీ, ఖైబర్ నిరసనల నుంచి పారిపోయారు. అక్కడే ఉండి నిరసనలు కొనసాగించాలని పార్టీ మద్దతుదారులు విజ్ఞప్తి చేసినప్పటికీ వారిద్దరూ దొంగచాటుగా ట్రక్కులో పారిపోవడం గమనార్హం. ఈ క్రమంలో వారిపై పార్టీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
Pakistan: నిరసన ప్రదర్శనలకు పీటీఐ పార్టీ స్వస్తి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని అధికార షాబాజ్ షరీఫ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నేతలు, కార్యకర్తలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపధంయలో ఈ నిరసనలను అణచి వేసేందుకు ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు నిరసన ప్రదర్శనలు హింసాత్మక ఘటనలకు దారితీయడంతో పీటీఐ పార్టీ ఆందోళనలకు స్వస్త పలుకుతున్నట్లు ప్రకటించింది. పీటీఐ నిసరనల నేపధ్యంలో రాజధాని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్‌తో ఆ పరిసర ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేధ్యంలో పాక్ భద్రతా సిబ్బంది కఠిన చర్యలు చేపట్టారు. దీంతో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు నిరసనలు విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తదుపరి వ్యూహం ఏమిటనేది పార్టీ ఇంకా వెల్లడించలేదు. భద్రతా సిబ్బంది చేపట్టిన చర్యలను పీటీఐ ‘ఫాసిస్ట్ మిలిటరీ పాలన’ చేపట్టిన జాతి నిర్మూలన ప్రయత్నంగా అభివర్ణించింది.ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న 450 మంది ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పీటీఐ నేతలు మీడియాతో మాట్లాడుతూ వీలైనంత ఎక్కువ మందిని చంపాలనే ఉద్దేశ్యంతోనే భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరిపాయని ఆరోపించారు. పీటీఐ మద్దతుదారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాగా షాబాజ్-జర్దారీ-అసిమ్ కూటమి నేతృత్వంలో భద్రతా దళాలు మారణహోమం కోసం ప్రయత్నించాయని పీటీఐ ట్విట్టర్లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. గత ఏడాది ఆగస్టు నుంచి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాణ్ నవంబర్ 24న దేశవ్యాప్త నిరసనలకు చివరి పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: తానా ఆధ్వర్యంలో వైభవంగా 'మన భాష–మన యాస’ 'మాండలిక భాషా అస్తిత్వం' -
ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)అధినేత ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారుల ఆందోళనతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ మద్దతుదారులు ఆదివారం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఖైబర్ పఖ్తుంఖా ముఖ్యమంత్రి అలీ అమీన్ నేతృత్వం వహించిన ఈ కవాతు సోమవారం సాయంత్రం నాటికి ఇస్లామాబాద్ చేరుకుంది.సోమవారం రాత్రి లక్షలాది తరలి వచ్చిన ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. నిరసన కారులు రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. రహదారులను మూసివేశారు. ఇస్లామాబాద్ చుట్టూ బారీకేడ్లు ఏర్పాటుచేశారు. తొలగించుకుంటూ నిరసనకారులు ముందుకు రాగా టియర్ గ్యాస్ ప్రయోగించి కట్టడి చేశారు. దీంతో ఆందోళన కారులు పోలీసులపై దాడికి పాల్పడటంతో అయిదుగురు భద్రతా సిబ్బంది మరణించినట్లు, అనేకమంది గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు.పంజాబ్ ప్రావిన్స్‌లో నిరసనకారులు చేసిన దాడిలో ఒక పోలీసు అధికారి మరణించగా, 119మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. 22 పోలీసు వాహనాలకు నిప్పంటించారని తెలిపారు. ఆందోళనకారుల్లోనూ నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ నిరసనలు మంగళవారం కూడా కొనసాగుతుండటంతో పాక్ వ్యాప్తంగా హైటెన్షన్ నెలకొంది. -
Pakistan: ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలు.. కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వ ఆదేశం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యారు. ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్’ (పీటీఐ) కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు.దేశం నలుమూలలకు చెందిన పీటీఐ కార్యకర్తలు నిరసనలు చేపడుతూ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పుతోంది. చాలా చోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలతో అతని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ‘డూ ఆర్ డై’ నిరసనను నిర్వహించడానికి రాజధానికి తరలి వెళుతున్నారు.ఇప్పటికే పలువురు పీటీఐ నేతలు, కార్యకర్తలు ఇస్లామాబాద్ నగరంలోనికి ప్రవేశించారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఇస్లామాబాద్‌ను రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఇక్కడ పాక్ సైన్యాన్ని భారీ ఎత్తున మోహరించారు. ఈ రెడ్ జోన్ లోపల ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధానమంత్రి నివాసం, పార్లమెంట్, రాయబార కార్యాలయం ఉన్నాయి. ఈ రెడ్‌జోన్‌లో ఎవరైనా నిరసనకారులు కనిపిస్తే, వెంటనే వారిని కాల్చివేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ నేతలు అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలుసుకున్నారు. ఖాన్ గత సంవత్సరం నుండి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. అతనిపై 200కు పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్నింటిలో ఖాన్‌కు బెయిల్ లభించగా, కొన్నింటిలో ఆయన దోషిగా తేలాడు. మరికొన్నింటిపై విచారణ జరుగుతోంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా -
పాక్ సర్కారుకు ‘ఇమ్రాన్’ భయం..మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు రద్దు
ఇస్లామాబాద్:పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో ఆదివారం(నవంబర్24) మొబైల్‌ఫోన్, ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అభిమానులు ఆందోళనలకు సిద్ధమైన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేసింది. కాగా,పాకిస్తాన్లో ఎక్స్‌ను ఇప్పటికే నిషేధించడం గమనార్హం. ఏయే ప్రాంతాల్లో మొబైల్,ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేయనున్నారు, వాటిని తిరిగి ఎప్పుడు పునరుద్ధిరిస్తారన్నదానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. కాగా,మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలు పాలై ఇప్పటికి ఏడాది పూర్తయింది. అయినా ఇప్పటికీ ఇమ్రాన్ క్రేజ్ ప్రజల్లో ఏ మాత్రం తగ్గలేదు.ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఈ పాకిస్తాన్(పీటీఐ)కార్యకర్తలు, ఆయన అభిమానులు ప్రభుత్వంపై పోరాడేందుకు ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతుంటారు.తాజాగా ఇమ్రాన్ విడుదలను డిమాండ్ చేస్తూ పీటీఈ కార్యకర్తలు ర్యాలీకి పిలుపునివ్వడంతో ప్రభుత్వం సోషల్‌మీడియాను నిషేధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వాట్సాప్ బ్యాక్ఎండ్ను బ్లాక్‌చేసినట్లు సమాచారం.వాట్సాప్ ద్వారానే నిరసన ర్యాలీల సమాచారాన్ని పీటీఐ శ్రేణులు చేరవేస్తుండడం ఇందుకు కారణం. మరోవైపు పీటీఐకి గట్టి పట్టున్న ప్రావిన్సులైన పంజాబ్, ఖైబర్ ప్రావిన్సుల నుంచి రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లే ప్రధాన రోడ్లన్నింటిపై అడ్డుగా కంటెయినర్లు పెట్టి బ్లాక్ చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చెమటోడ్చాల్సి వస్తోంది. -
ఇమ్రాన్ ఖాన్ (మాజీ ప్రధాని) రాయని డైరీ
జైలు గదులకు ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే... అవసరమైనవి మాత్రమే కాదు, అనవసరమైనవి కూడా ఇక్కడ ఏ మూలా కనిపించవు! ఇరుకే అయినా ఇదొక సువిశాల సుఖమయ జీవితం. ఒకటి తీస్తుంటే ఒకటి పడిపోదు. అవసరం పడిందని వెతకటానికి కనిపించకుండా పోయేదేమీ ఉండదు.ఇల్లు అలాక్కాదు! అవసరమైనవి లేకున్నా పూట గడిచిపోతుంది కానీ, అనవసరమైనవి ఇంట్లో చేరిపోతుంటే చివరికి నడవటానికి కూడా దారి లేకుండా పోతుంది.ప్రధానిగా ఉన్నప్పుడు నేను, బుష్రా బీబీ ఉన్న మా నివాస భవనం నిరంతరం గిఫ్టుల రూపంలో వచ్చి పడుతుండే విలువైన చెత్తతో నిండిపోతూ ఉండేది. డైమండ్ జ్యూయలరీ, రోలెక్స్ వాచీలు, షాండ్లియర్లు, చెయిర్లు, సోఫాలు, ఆర్ట్ పీస్‌లు... వాటిని ఉంచుకోలేం, పడేయలేం. జ్యూయలరీకి ఒక మెడ, వాచీకి ఒక చెయ్యే కదా ఉంటాయి. అన్నన్ని ఏం చేస్కోను?! ఆరు రోలెక్స్ లు, కిలోల కొద్దీ జ్యూయలరీ, లివింగ్ రూమ్‌ని అమాంతం మింగేసే భారీ కలప ఫర్నిచర్!బుష్రా బీబీతో అన్నానొక రోజు, ‘‘బీబీ... మనింట్లో మనం వాడకుండా ఉండిపోయిన వస్తువులన్నీ వాటి విలువను బట్టి ఎక్కడివక్కడ ఏ మాయ వల్లనో కరెన్సీగా మారిపోతే ఎలా ఉంటుంది?!’’ అని. ఆ మాటకు బుష్రా బీబీ ఎంతో ఆహ్లాదకరంగా నవ్వారు. ‘‘వాడని వస్తువులు కూడా ఉంటేనే కదా అది ఇల్లవుతుంది ఇమ్రాన్‌జీ...’’ అన్నారు.ఆమె అలా నవ్వినప్పుడు బాబా ఫరీద్ దర్గాలోని ప్రశాంతత నన్నావరించినట్లౌతుంది. మేము తొలిసారి కలుసుకున్నది ఆ దర్గా ప్రాంగణంలోనే! ‘‘పోనీ ఇమ్రాన్‌జీ! మీరన్నట్లు ఇంట్లో వాడనివన్నీ వాటి విలువను బట్టి ఎక్కడివక్కడ కరెన్సీగా మారిపోతే మాత్రం... ‘ఇంతింత కరెన్సీ ఏంటి చెత్తలా కాలికీ చేతికీ తగులుతూ...’ అని అనకుండా ఉంటారా మీరు...’’ అన్నారు బుష్రా బీబీ నవ్వుతూ!జైలు గదికి ఉన్నట్లే బుష్రా బీబీ నవ్వుకు ఇరుకును అలవాటు చేయించే ‘గతి తాత్విక’ గుణం ఏదో ఉన్నట్లుంది! ‘‘ఇమ్రాన్ జీ! మీకు బెయిల్ వచ్చిందట!మీ లాయర్ వచ్చారు రండి...’’ అని నా సెల్ దగ్గరకు వచ్చి మరీ నన్ను వెంటబెట్టుకుని వెళ్లారు అసద్ జావేద్. నేనున్న రావల్పిండి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఆయన. విజిటర్స్ రూమ్‌లో సల్మాన్ సఫ్దర్ నాకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన చేతుల్లో బెయిలు పత్రాలు ఉన్నాయి. కానీ వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదని సఫ్దర్కి, నాకు, బుష్రాకు, జైలు సూపరింటెండెంట్‌కి, పాక్ ప్రధానికి, నా పార్టీకి, పార్టీ కార్యకర్తలకు, ఇంకా... యావత్ ప్రపంచానికీ తెలుసు. గిఫ్టుగా వచ్చిన జ్యూయలరీ, రోలెక్స్ వాచీలను అమ్మేయగా జమ అయిన అమౌంట్‌కి సరిగా లెక్కలు చూపించలేదన్న కేసులో మాత్రమే నాకు వచ్చిన బెయిల్ అది. నాపై ఇంకా 149 కేసులు ఉన్నాయి. మూడేళ్ల శిక్ష, ఏడేళ్ల శిక్ష, పదేళ్ల శిక్ష, పద్నాలుగేళ్ల శిక్ష పడిన కేసులు కూడా వాటిల్లో ఉన్నాయి. కేసులన్నిటినీ కలిపి ఒకేసారి బెయిల్ ఇస్తేనే నేను బయటికి వచ్చినట్లు! గిఫ్టుల కేసులో నా భార్య బుష్రా బీబీ కూడా జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది! బుష్రాను జనవరి 31న అరెస్టు చేసి, తొమ్మిది నెలల తర్వాత, నెల క్రితమే అక్టోబర్ 24న బెయిల్ మీద విడుదల చేశారు. ఇద్దరం ఉన్నది ఒకే జైలు. ఏడాది పైగా నేను జైల్లోనే ఉంటున్నా... నేను కఠిన కారాగార శిక్ష అనుభవించింది మాత్రం ఆ తొమ్మిది నెలలే. ఒక నిశ్శబ్దపు నిట్టూర్పుతో సఫ్దర్ వైపు చూశాను.‘‘తనెలా ఉన్నారు సఫ్దర్జీ?’’ అని అడిగాను... బుష్రాను ఉద్దేశించి.‘‘మీరెలా ఉన్నారని తను అడుగుతున్నారు ఇమ్రాన్‌జీ...’’ అన్నారు సఫ్దర్!! -
పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్‌పై మరో కేసు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు మరో కొత్త సమస్యలో చిక్కుకున్నారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్తాన్ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఈ కేసు నమోదు చేసింది. సోషల్ మీడియాను ఉపయోగించి, ప్రభుత్వ అధికారులను తిరుగుబాటుకు ప్రేరేపించారంటూ ఖాన్‌పై ఈ కేసు నమోదు చేశారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో వివాదాస్పద పోస్ట్‌కు సంబంధించి ప్రశ్నించడానికి దర్యాప్తు, సాంకేతిక అధికారులతో కూడిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) బృందం అడియాలా జైలును సందర్శించింది.ప్రభుత్వ అధికారులను తిరుగుబాటుకు ప్రేరేపించినందుకు ఖాన్‌పై ఎఫ్ఐఏ కేసు నమోదు చేసిందని ‘డాన్’ వార్తాపత్రిక తెలిపింది. అయితే తన న్యాయవాదులు లేకుండా తాను విచారణకు సహకరించనని ఖాన్ వారికి తెలిపారు. దీంతో ఎఫ్ఐఏ సిబ్బంది వెనుదిరిగారు. గత ఏడాది నుంచి అడియాలా జైలులో ఉన్న ఖాన్ తరచూ 'ఎక్స్'వేదికగా సైన్యాన్ని విమర్శిస్తూ వస్తున్నారు.ఇది కూడా చదవండి: మూడంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి -
Pakistan: ఇమ్రాన్‌ఖాన్ పార్టీ నేతలు అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన పలువురు అగ్రనేతలను జాతీయ అసెంబ్లీ సమావేశాల అనంతరం పార్లమెంట్ వెలుపల పోలీసులు అరెస్టు చేశారు. పలు మీడియా కథనాలలో ఇది ప్రముఖంగా ప్రచురితమయ్యింది.పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేతలు బారిస్టర్ గౌహర్ అలీ ఖాన్, షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్, అడ్వకేట్ షోయబ్ షాహీన్‌లను ఇస్లామాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికార ప్రతినిధి జావేద్ తాకీ తెలిపారని డాన్ పత్రిక పేర్కొంది. ఈ అరెస్టుకు స్పందిస్తూ పీటీఐ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో ‘నేషనల్ అసెంబ్లీలో సిట్టింగ్ సభ్యునిపై ఇటువంటి చర్య తీసుకున్నందుకు పీఎంఎల్ఎన్ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇది ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి.ఇస్లామాబాద్ పోలీసులు చట్టవిరుద్ధమైన ఆదేశాలను పాటిస్తున్నారు. ఈ చర్యను ఆపాలి’ అని ఇస్లామాబాద్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ)ని కోరింది.‘ఇమ్రాన్ ఖాన్‌తో పాటు అతని అనుచరులకు ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో మరోసారి రుజువు అయ్యింది’ అని మార్వాత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ప్రతిపక్ష నేత ఒమర్ అయూబ్ ఖాన్ ఈ అరెస్టులను ఖండించారు. ఇస్లామాబాద్ పోలీసులు వారిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారని ఆరోపించారు. నేషనల్ అసెంబ్లీలో పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్వాత్‌ను అరెస్టు చేసినట్లు సోర్సెస్ జియో న్యూస్‌కి తెలిపింది. పోలీసు సిబ్బందితో పీటీఐ ఎంపీ గొడవకు దిగారని ఆ మీడియా పేర్కొంది.రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ (71) పలు చట్టపరమైన కేసులను ఎదుర్కొంటున్నారు. అవినీతి కేసులో ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కాగా పీటీఐ నేతలు ఒమర్, జర్తాజ్లతో పాటు హమ్మద్ అజర్, కన్వాల్ షౌజాబ్, నయీమ్ హైదర్ పంజుతా, అమీర్ మొఘల్, ఖలీద్ ఖుర్షీద్‌లతో సహా ఇతర పీటీఐ నేతలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. A slap to the face of an already decimated democracy in Pakistan.The military backed, authoritarian, illegitimate regime is now illegally arresting & abducting PTI’s elected members of Parliament, from the premises of the Parliament itself.Interim Chairman PTI, Barrister… pic.twitter.com/43VD3Oal8U— PTI (@PTIofficial) September 9, 2024 -
Pakistan: ఇమ్రాన్ ఖాన్ పార్టీ ర్యాలీలో కాల్పులు.. పలువురు మృతి?
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్’(పీటీఐ) చేపట్టిన ర్యాలీపై కాల్పులు జరిగాయి. ఈ ర్యాలీకి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. కాల్పుల అనంతరం తొక్కిసలాట జరిగింది.ఈ పరిస్థితుల నేపధ్యంలో అధికారులు ఇస్లామాబాద్‌కి వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. ఈ సందర్భంగా పీటీఐ నేత ఫవాద్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు మృతిచెందారని తెలిపారు. పాకిస్థాన్‌లో మార్షల్ లా తరహా పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.కాగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు జరిపిన రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుండి విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ పార్టీ ఇస్లామాబాద్‌లో ర్యాలీ చేపట్టింది. కాగా ఇమ్రాన్ ఖాన్ గత 400 రోజులుగా జైలులో ఉన్నారు. తోషాఖానా కేసులో దోషిగా తేలడంతో 2023 ఆగస్టు 5న ఆయన అరెస్టయ్యారు. -
ప్లీజ్! సైన్యానికి అసలు అప్పగించొద్దు
-
పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు: పీసీబీ చీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ ఫైర్
బంగ్లాదేశ్ చేతిలో ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. టెస్టుల్లో తొలిసారి పాక్ బంగ్లాతో మ్యాచ్‌లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అది కూడా సొంతగడ్డపై ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి షాన్ మసూద్ బృందం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరాడు. అయితే, ఈ ఘోర పరాభవానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న విధానాలే కారణమంటూ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై సంచలన ఆరోపణలు చేశాడు. అవినీతిలో కూరుకుపోయిన నక్వీ నేతృత్వంలోని బోర్డు పాక్ క్రికెట్‌ను భ్రష్టు పట్టిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు‘‘దేశ ప్రజలు టీవీలో ఆసక్తిగా చూసే ఏకైక క్రీడ క్రికెట్. కానీ ఇప్పుడు దానిని కూడా నాశనం చేస్తున్నారు. సమర్థత లేని, తమకు ప్రియమైన అధికారులను నియమించుకోవడం వల్లే పాక్ బోర్డుకు ఈ గతి పట్టింది. వాళ్ల హయాంలో తొలిసారి మన జట్టు వన్డే వరల్డ్‌కప్ టాప్-4కు చేరలేకపోయింది.టీ20 ప్రపంచకప్-2024 టాప్-8లోనూ నిలవలేకపోయింది. ఇప్పుడు ఏకంగా కనీవినీ ఎరుగని రీతిలో బంగ్లాదేశ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడి పూర్తిగా దిగజారిపోయింది. రెండున్నరేళ్ల క్రితం ఇదే జట్టు టీమిండియాను ఓడించింది కదా! మరి ఈ స్వల్ప కాలంలో అంతగా ఏం జరిగిందని.. ఇంతటి ఘోర పరాభవాలు. ఇందుకు ఎవరిని బాధ్యులను చేయాలి? దీనంతటికీ ఒకే వ్యవస్థ కారణం’’ అంటూ ఇమ్రాన్ ఖాన్ పాక్ బోర్డుపై నిప్పులు చెరిగాడు.పీసీబీ చీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలుఅదే విధంగా.. నక్వీ దుబాయ్‌లో తన భార్య పేరు మీద ఐదు మిలియన్ డాలర్ల మేర ఆస్తులు కూడబెట్టాడని.. 2008లో అవినీతి ఆరోపణలపై విచారణ కూడా ఎదుర్కొన్నాడని ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్‌కు ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాడు. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అనే పార్టీని స్థాపించిన ఇమ్రాన్ ఖాన్.. ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయ్యాడు. అయితే, అవినీతి ఆరోపణలపై అరెస్టైన ఈ మాజీ క్రికెటర్‌పై ఇతరత్రా కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం అతడు రావల్పిండి సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. అక్కడి నుంచే సోషల్ మీడియా వేదికగా ఈమేరకు సందేశం పంపించాడు.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు(ఆగష్టు 21- 25)వేదిక: రావల్పిండిటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/6 డిక్లేర్డ్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 565పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 30/0ఫలితం: పాకిస్తాన్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన బంగ్లాదేశ్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముష్ఫికర్ రహీం(191 పరుగులు).చదవండి: రిజ్వాన్ ముఖంపైకి బంతి విసిరిన షకీబ్.. ఐసీసీ చర్యలు -
పొంతన లేని వింత కథ!
కొన్నిసార్లిది తలకిందుల పిచ్చి మాలోకంగా అయిపోగలదు. ‘మ్యాడ్’ మేగజీన్లోని ఒక కార్టూన్ నిజరూపం లోనికి రూపాంతరం చెందినట్లే ఈ ప్రపంచం ఉంటుంది. ప్రస్తుతం పక్కింట్లో అదే జరిగిందని అనిపిస్తోంది. అయితే ఏ విధంగానూ అది అందరికీ జరిగినట్లు కాదు. కచ్చితంగా జరిగిందైతే అక్కడి ప్రభుత్వానికి, భయానకమైన ‘ఐఎస్ఐ’కి. నేను చెప్ప వలసి ఉన్నది అతి వింతైన కథ కనుక చాలామందికి అది కనీసం కల్పనగా కూడా నమ్మదగనిది. అయినప్పటికీ, నన్ను నమ్మండి... అది నిజంగా జరిగింది.పాకిస్తాన్‌లోని యూట్యూబర్లు, అక్కడి ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ వంటి వార్తా పత్రికలు, ఆ దేశపు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఆఖరికి స్వయానా ఆ శాఖ మంత్రి కూడా నన్ను పాకిస్తాన్ వ్యతిరేకిననీ, మోదీ ప్రభుత్వానికి సన్నిహితుడిననీ, ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్)తో చేతులు కలిపాననీ ప్రకటించటం జరిగింది. ఇప్పుడిది, చివరిసారి నేను చేసిన ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే లేచి బయటికి వెళ్లిపోయిన ప్రస్తుత ప్రధాన మంత్రికీ, దశాబ్దాలుగా నన్ను పాకిస్తాన్ పక్షపాతిగా నిందిస్తూ వస్తున్న విమర్శకులకూ నిస్సందేహంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే సరిహద్దు వెంబడి గస్తీ సైనికులు, వారి పౌర ప్రభుత్వాలు, నిఘా అధికారులకు ఇది... అవునా! నిజమా... అనిపించేలా ఉంటుంది.ఇదెలా జరిగిందో వివరించటానికి నన్ను ప్రయత్నించనివ్వండి. కొన్ని వారాల క్రితం పాక్ అధికారులు తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (ఇమ్రాన్ ఖాన్ పార్టీ) సమాచార కార్యదర్శి, అధికార ప్రతినిధి అయిన రవూఫ్ హసన్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై దేశద్రోహ నేరం మోపాలన్న కృతనిశ్చయంతో నిర్బంధించి అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈమెయిల్స్‌ను, వాట్సాప్ మెసేజ్‌లను పరిశీలించారు. అక్కడ వారికి రవూఫ్ నాతో పంచుకున్న – 2022 నవంబర్ వెనకటి – మెసేజ్‌లు కొన్ని కనిపించాయి. ఆహా! ఇకనేం, భారతదేశంలోని వ్యక్తులతో అతడు మాట్లాడుతున్నాడన్న నిర్ధారణకు వారు వచ్చేశారు. అది అత డిని దేశ వ్యతిరేకిని చేసేసింది. ఇంకా దారుణం, ఇమ్రాన్‌తో పాక్ ఎలా వ్యవహరిస్తోందో రవూఫ్ తన మెసేజ్‌లలో వ్యాఖ్యానిం^è టం, పాకి స్తాన్ రాజకీయాలపై చర్చించటం, చివరికి ఆర్మీ చీఫ్ గురించి కూడా మాట్లాడటం! ఇవన్నీ కూడా నిస్సందేహంగా పాక్ దృష్టిలో దేశ వ్యతి రేకమైనవే.ఇప్పుడిది రూఢీ అవ్వాలంటే పాక్‌ని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తిగా నన్ను చిత్రీకరించాలి. ఆ దేశంలోని ఎంతోమంది నియంతలు, ప్రధానులు నాకు తెలుసనీ, వారిని నేను ఇంటర్వ్యూ చేశాననీ, తరచు నేను ఆ దేశాన్ని సందర్శిస్తుంటాననీ; ఇస్లామాబాద్‌లో, లాహోర్‌లో, కరాచీలో నా సన్నిహిత మిత్రుల జాబితా పెద్ద చాంతాడంత ఉంటుందనీ గుర్తించటం వంటివేవీ పాక్ చిత్రీకరణ ఉద్దేశాన్ని నెరవేర్చేవి కావు. బేనజీర్ భుట్టో నాకు ఆప్త నేస్తం అనీ, నవాజ్ షరీఫ్ ఆఖరుగా 2014లో ఇండియా వచ్చినప్పుడు నన్ను కలుసుకోవాలని కోరారనీ, షెహబాజ్ షరీఫ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన, నేను కలిసి పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో కూర్చొని స్నేహపూర్వకంగా లేదా, పిచ్చాపాటీగా కబుర్లు చెప్పుకున్నామనీ అంగీకరించటం కూడా పాక్ అనుమానాలను బలపరిచేందుకు ఉపయోగపడదు. అలా అంగీ కరించటం అన్నది రవూఫ్‌కు వ్యతిరేకంగా నిర్మిస్తున్న కేసును కుప్ప కూల్చి ఉండేది.కాబట్టి తన అధికారిక ప్రకటనలో పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ: ‘‘భారతదేశ జర్నలిస్టు కరణ్ థాపర్‌కు రవూఫ్ హసన్ జాగ్రత్త లేకుండా పంపిన మెసేజ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయి. నిజా నికి ఈ మెసేజ్‌లు కరణ్ థాపర్‌కు మద్దతుగా ఉన్న ‘రా’ అధికారులకు అమూల్యమైన సంపద వంటి సమాచారం అని రక్షణశాఖ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మెసేజ్‌లను బట్టి పాక్ వ్యతిరేక ప్రచారాన్ని రాజేసేందుకు పి.టి.ఐ. (పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్) ప్రతినిధి దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఒక భారతీ యుడికి చేరవేస్తున్నట్లు బహిర్గతం అయిందని వారు తెలిపారు’’ అని పేర్కొంది. పాక్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అతావుల్లా తరార్, ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’తో మాట్లాడుతూ... ‘‘పాక్ వ్యతి రేక భావాలకు పేరుమోసిన ఒక భారతీయ జర్నలిస్టుతో హసన్‌కు ఉన్న సంబంధాలు స్వదేశం పట్ల పి.టి.ఐ. అవిధేయతను మరింతగా తేటతెల్లం చేస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.పర్యవసానంగా, రవూఫ్ నాతో నెరిపిన సంక్షిప్తమైన, చాలా అరుదైన, ఏమాత్రం హానికరం కానివైన మెసేజ్‌లు – నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేశానన్న వాస్తవం కూడా – మార్మికమైన రీతిలో పాకిస్తాన్ సార్వభౌమాధికారతకు, సమగ్రతకు, భవిష్య త్తుకు ముప్పుగా పరి వర్తనం చెందాయి. నిస్సందేహంగా ఇది ఆయనపై విచారణ జరిపించేందుకు ఉపయోపడుతుంది. వారి దృష్టిలో అదే న్యాయం. మా మధ్య సాగిన ఉద్దేశపూర్వకం కాని వాట్సాప్ మెసేజ్‌లు, ఇంటర్వ్యూ లాంటి మాటామంతీ, ఇంకా చెప్పాలంటే ఓ రెండు సంభాషణలు... వీటన్నిటినీ దాటి అసలు నిజం ఏమిటంటే రవూఫ్ నాకు తెలియదు. అతడికీ నేను తెలియదు. మేము ఒకరికొకరం అపరిచితులం. కాబట్టి ఇదెప్పటికీ మారదు.వాస్తవానికి, వారు రవూఫ్ బాస్ అయిన ఇమ్రాన్ ఖాన్ నాతో మంతనాలు జరిపారని ఆరోపించినట్లయితే వారి కేసుకు మరింత బలం చేకూరి ఉండేది. ఇమ్రాన్‌ను నేను అనేకసార్లు ఇంటర్వ్యూ చేశాను. బని గలా (ఇస్లామాబాద్) లేదా ఢిల్లీలో మాత్రమే కాదు... ఒక సందర్భంలో నేను లండన్ వెళ్లి మరీ, అక్కడి రిచ్మండ్లో ఇమ్రాన్ మాజీ అత్తమామలు ఉండే భవనం లోపలి తోటల్లో ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. పాకిస్తాన్ చార్జిషీట్లో అది నేరంగా కనిపించటం లేదా? అంతకుమించిన నేరం, తనెప్పటికైనా ప్రధాని అయితే ఆర్మీ చీఫ్ తనకు లోబడి పని చేయవలసి ఉంటుందని కూడా ఇమ్రాన్ అనటం. నవ్వుతూ ఏమీ ఆయన ఆ మాట అనలేదు. పాకిస్తాన్‌లోని నా ప్రియ స్నేహితుడు ఒకరు ఈ అస్థిమితం నుంచి నన్ను శాంతింపజేయటానికి ఇలా అన్నారు: ‘‘అలీస్ ఇన్ ది వండర్ల్యాండ్’తో నీకు పరిచయం ఉంది. ఇప్పుడిక, మాలిస్ (దుష్ట బుద్ధి) ఇన్ ది ఫౌజీలాండ్ (సైనికదేశం)కు స్వాగతం.’’– కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నాలో అభద్రతా భావం.. అందుకే స్టెరాయిడ్స్ తీసుకున్నా: స్టార్ హీరో మేనల్లుడు
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటుడు ఇమ్రాన్ ఖాన్. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరో.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో తాను పడిన ఇబ్బందులపై మాట్లాడారు. తనలో అభద్రతా భావం ఎక్కువగా ఉండేదని తెలిపారు. అసలు నటుడి నేను రాణించగలనా? అని భావించేవాడినని అన్నారు. ఇలా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు పడినట్లు వెల్లడించారు.హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్‌లా శరీరాకృతి కలిగి ఉండాలని ప్రయత్నించినట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అందుకోసం స్టెరాయిడ్స్‌ను వినియోగించినట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. సిక్స్ ప్యాక్ బాడీతో సూపర్ హీరో లుక్‌లో కనిపించేందుకు ఇలా చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత మన లుక్ కోసం ఇలాంటి కెమికల్స్‌తో ఎలాంటి ఉపయోగం లేదని అర్థమైందని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో ఉంటే ఫేమ్ మాత్రమే కాదు.. చాలా ఇబ్బందులు కూడా పడాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో నటీమణులు మాత్రమే గ్లామర్‌పై దృష్టిపెట్టేవారని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయి నటులు సైతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు.కాగా.. కిడ్నాప్, ఐ హేట్ లవ్ స్టోరీస్, లక్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్ పలు చిత్రాల్లో నటించారు. చివరిసారిగా 2015లో కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. -
సౌతాఫ్రికా బ్యాటింగ్ లీడ్‌గా ఇమ్రాన్ ఖాన్
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు బ్యాటింగ్ లీడ్‌గా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఎంపికయ్యాడు. అశ్వెల్ ప్రిన్స్ స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికన ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా సౌతాఫ్రికా తరఫున 2009లో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడాడు ఇమ్రాన్ ఖాన్. ఆ తర్వాత ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌కు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కలేదు. కాగా పదిహేనేళ్లపాటు దేశవాళీ జట్టు డాల్ఫిన్స్ జట్టు టాపార్డర్‌లో బ్యాటర్‌గా కొనసాగిన ఇమ్రాన్ ఖాన్.. రెడ్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. 161 మ్యాచ్‌లు ఆడి 20 శతకాల సాయంతో 9367 పరుగులు సాధించాడు.ఇక తన కెరీర్లో 121 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 51 టీ20లలోనూ భాగమయ్యాడు. జాతీయ జట్టులో పెద్దగా అవకాశాలు రాకపోయినా.. కోచ్‌గా మాత్రం విజయవంతమయ్యాడు. దేశవాళీ క్రికెట్లో డాల్ఫిన్స్ జట్టు శిక్షకుడిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్.. ఆ జట్టుకు రెండుసార్లు ట్రోఫీ అందించాడు. అంతేకాదు..అతడి మార్గదర్శనంలో డాల్ఫిన్స్ టీమ్ వన్డే కప్‌లో ఒకసారి, సీఎస్ఏ టీ20 టోర్నమెంట్లలో మూడుసార్లు ఫైనల్ చేరింది.తొలిసారి సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా..వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న సౌతాఫ్రికా జట్టు ఆగష్టు 7 నుంచి టెస్టు సిరీస్ ఆడనుంది. ఆగష్టు 7- 11, ఆగష్టు 15- 19 వరకు రెండు మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో తొలిసారిగా ఇమ్రాన్ ఖాన్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. తన నియామకంపై హర్షం వ్యక్తం చేసిన ఇమ్రాన్ ఖాన్.. కోచ్‌గా తన అంతిమ లక్ష్యానికి చేరువయ్యానని ఉద్వేగానికి లోనయ్యాడు.చదవండి: WI vs SA: సౌతాఫ్రికాతో సిరీస్.. ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు -
పాక్ సైన్యం క్షమాపణ చెప్పాలి: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి సైన్యంపై విమర్శల యుద్ధానికి దిగారు. కోర్టు నుంచి పలు కేసుల్లో ఉపశమనం లభించడంతో ఇమ్రాన్‌లో నైతిక స్థైర్యం పెరిగినట్లు కనిపిస్తోంది. గత ఏడాది మే 9న అరెస్టయిన మాజీ ప్రధాని ఇమ్రాన్ నాడు చెలరేగిన అల్లర్లకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. అయితే హింసాకాండ జరిగిన రోజున పాక్ రేంజర్లు తనను కిడ్నాప్ చేసినందున ఆర్మీ తనకు క్షమాపణ చెప్పాలని ఖాన్ డిమాండ్ చేశారు.ఇమ్రాన్ అరెస్టు తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఇది దేశవ్యాప్తంగా పౌర, సైనిక సంస్థలకు నష్టం కలిగించింది. నాడు ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ పీటీఐ (ఇమ్రాన్ పార్టీ) అరాచక రాజకీయాలకు పాల్పడినందుకు క్షమాపణలు కోరితే చర్చలు జరపవచ్చని అన్నారు. ఈ ప్రకటన తరువాత బ్లాక్ డే హింసకు ఖాన్ పార్టీ క్షమాపణ చెప్పాలని వివిధ వర్గాల నుండి డిమాండ్లు వచ్చాయి.డాన్ వార్తాపత్రిక తెలిపిన వివరాల ప్రకారం రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా మే 9న చెలరేగిన హింస విషయంలో క్షమాపణ చెప్పడానికి తన దగ్గర ఎటువంటి కారణం లేదని అన్నారు. నాడు ఇస్లామాబాద్ హైకోర్టు కాంప్లెక్స్ నుండి మేజర్ జనరల్ నేతృత్వంలోని రేంజర్లు తనను అరెస్టు చేశారని ఖాన్ ఆరోపించారు. హింస జరిగిన రోజున తనను పాక్ రేంజర్లు కిడ్నాప్ చేశారని, అందుకు ప్రతిగా ఆర్మీ తనకు క్షమాపణలు చెప్పాలని ఖాన్ డిమాండ్ చేశారు. -
ఆక్స్ఫర్డ్ చాన్సలర్ పదవికి ఇమ్రాన్ పోటీ!
ఇస్లామాబాద్/లండన్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ విఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ చాన్సలర్ పదవికి పోటీపడనున్నారు. ప్రస్తుతం జైళ్లో ఉన్న ఇమ్రాన్ ఆన్లైన్ బ్యాలట్ విధానంలో జరిగే ఎన్నికల్లో పాల్గొంటారని అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆయనకు సలహాదారుడైన వ్యాపారవేత్త సయ్యద్ జుల్ఫీ బుఖారీ శుక్రవారం జియో న్యూస్‌కు తెలిపారు. ఇమ్రాన్ ఆక్స్‌ఫర్ యూనివర్శిటీ పూర్వ విద్యారి్థ. ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్ చదివారు. 2005–2014 దాకా ఆయన బ్రాడ్ఫోర్డ్ యూనివర్శిటీ చాన్సలర్‌గా పనిచేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ చాన్సలర్ పదవికి గౌరవ హోదా.. పూర్వ విద్యార్థులు దీని కోసం పోటీపడటానికి అర్హులు. రాజకీయ నాయకులకు ఈ పదవి దక్కడం ఆనవాయితీగా వస్తోంది. బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్‌లు కూడా ఈసారి పోటీలో ఉన్నారు. -
ఇమ్రాన్ ఖాన్ పార్టీపై నిషేధం విధిస్తాం: పాక్ మంత్రి ప్రకటన
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించనున్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నాం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంలో పాక్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించనుందని పాక్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. నమ్మదగిన ఆధారాలు లభిస్తే ఇమ్రాన్ పార్టీపై నిషేధం విధిస్తామని అత్తావుల్లా తరార్ తెలిపారు. ‘విదేశీ ఫండ్స్ కేసు, మే 9న జరిగిన అల్లర్లు, చిపర్ ఎపిసోడ్ వంటి కేసులతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు నమ్మదగిన ఆధారాలు లభిస్తే.. ఇమ్రాన్ ఖాన్ పార్టీపై బాన్ విధిస్తాం’ అని మంతి అత్తావుల్లా తరార్ తెలిపారు. -
పెళ్లి కేసులో ఇమ్రాన్‌కు ఊరట
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట. ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకంగా పెళ్లాడారన్న కేసులో ఇమ్రాన్ (71), బుష్రా బీబీ (49) దంపతులను న్యాయస్థానం నిర్దోషులుగా తేలి్చంది. వారిపై మోపిన అభియోగాలను ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు శనివారం తోసిపుచి్చంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను కొట్టేసింది. మత ప్రబోధకురాలైన బుష్రా తన మొదటి భర్త ఖవర్ ఫరీద్ మనేకాతో 28 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకుని ఇమ్రాన్‌ను పెళ్లా డారు. అయితే విడాకులకు, పునర్వివాహానికి మధ్య ముస్లిం మహిళ విధి గా పాటించాల్సిన 4 నెలల గడువు (ఇద్దత్)ను ఆమె ఉల్లంఘించిందంటూ ఫరీద్ కేసు పెట్టారు. ఈ కేసులో గత ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికల ముంగిట ఇమ్రాన్ దంపతులకు ఏడేళ్ల శిక్ష పడింది. ఇమ్రాన్‌కు జైలు శిక్ష పడ్డ మూడు కేసుల్లో ఇదొకటి. తోషా ఖానా కేసులో జైలు శిక్షను కోర్టు ని లుపుదల చేయగా, సిఫర్ కేసుల్లో నిర్దోíÙగా బయటపడ్డారు. దాంతో గత ఆగస్టు నుంచీ జైల్లోనే ఉన్న ఇమ్రాన్ విడుదలవుతారని భావించారు. కానీ తాజా తీర్పు వెలువడ్డ కాసేపటికే అల్లర్ల కేసులో ఆయన అరెస్టుకు ఉగ్ర వాద వ్యతిరేక కోర్టు అనుమతినిచ్చింది. దాంతో ఆయన జైల్లోనే ఉండనున్నారు. -
ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా సుప్రీం కోర్టు తీర్పు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి భారీ ఉపశమనం లభించింది. ఆయన సొంత పార్టీ విషయంలో పాకిస్తాన్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) 109 సీట్లతో దేశంలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మహిళలు, మైనారిటీలకు రిజర్వు చేసిన సీట్లను కేటాయించేందుకు ఆ పార్టీకి అర్హత ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.పీటీఐకి న్యాయపరమైన విజయం అందించడంలో పాక్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫైజ్ ఇసా నేతృత్వంలోని 13 మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ మద్దతు పలికింది. ఈ ఉదంతంలో సుప్రీంకోర్టు.. పెషావర్ హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. నేషనల్ అసెంబ్లీ, ప్రావిన్షియల్ అసెంబ్లీలలో రిజర్వ్ చేసిన సీట్లలో పార్టీకి వాటాను నిరాకరించిన పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ చర్యను పెషావర్ హైకోర్టు తిప్పికొట్టింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం చెల్లదని బెంచ్ ప్రకటించింది. ఈ చర్య పాకిస్తాన్ రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాక్ సుప్రీం కోర్టు తీర్పుతో పీటీఐ జాతీయ అసెంబ్లీలో 23 రిజర్వ్డ్ స్థానాలను దక్కించుకుంది. దీంతో పార్టీ సీట్లు 86 నుండి 109కి పెరిగాయి. దీంతో పీటీఐ దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష కూటమి సీట్ల సంఖ్య కూడా 120కి పెరిగింది. ప్రస్తుతం పీటీఐతో సహా ఉమ్మడి ప్రతిపక్షంలో 97 మంది సభ్యులున్నారు. -
నిరాహార దీక్షకు దిగుతా: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరగకుంటే నిరాహార దీక్షకు దిగుతానని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖాజీ ఫైజ్ ఇసా తన కేసులలో న్యాయం చేయడంలో విఫలమైతే నిరాహార దీక్షకు దిగుతానని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.తమ పీటీఐ పార్టీకి సంబంధించిన కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఇసా ఉండటంపై ఇమ్రాన్ ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరగని పక్షంలో నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. తమ పార్టీ కేసులను విచారించే బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి ఈసాను చేర్చడంపై తమ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారని ఇమ్రాన్‌ఖాన్ మీడియాకు తెలిపారు. తమకు న్యాయం జరగదని పీటీఐ తరపు న్యాయవాదులు విశ్వసిస్తున్నారని, అందుకే తమ కేసులను మరొకరు విచారించాలని కోరారు. -
IND Vs PAK: పాక్-భారత్ మ్యాచ్‌లో అనూహ్య పరిణామం
న్యూయార్క్: దాయాది దేశాల మధ్య పోరులో మరోసారి భారత్‌దే పైచేయి అయ్యింది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టీమిండియా విజయం సాధించింది. అయితే.. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో జరిగిన ఓ అనూహ్య పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది.మ్యాచ్ జరుగుతున్న టైంలో స్టేడియంపై ఓ ఎయిర్‌క్రాఫ్ట్ ఎగిరింది. అది ఓ బ్యానర్ ను ప్రదర్శిస్తూ వెళ్లింది. ఆ బ్యానర్ పై ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి (Release Imran Khan) అని రాసి ఉంది. మరోవైపు మ్యాచ్ జరుగుతున్న టైంలో స్టేడియంలో కొందరు ఇమ్రాన్ ఖాన్ ఫొటోలతో జిందాబాద్ నినాదాలు చేయడమూ కనిపించింది.A plane with the message "Release Imran Khan" flies over the stadium during the India vs. Pakistan T20 World Cup match. #Imrankhan #T20WC24 #viral #BreakingPedia pic.twitter.com/OHlCuQUFRZ— Breakingpedia (@breakingpediaBP) June 10, 2024 Credits: Breakingpedia VIDEO CREDITS: TOP POSTఅయితే.. పాక్-భారత్ మ్యాచ్‌కు గట్టి భద్రత ఉంటుందని న్యూయార్క్ పోలీసులు ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలో ఆ విమానాన్ని స్టేడియం మీద ఎగరడానికి ఎలా అనుమతించారు?. దానిని నడిపిందెవరు?. దీనంతటి వెనుక ఉంది ఎవరు? ఇలాంటి అంశాలపై అక్కడి అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
ప్రకృతి ఒడిలో ఒకప్పటి హీరో కొత్తిల్లు.. 'నీకంత డబ్బు ఎక్కడిది?'
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా, తర్వాత హీరోగా సినిమాలు చేశాడు ఇమ్రాన్ ఖాన్. అయితే ఈ గ్లామర్ ప్రపంచంలో ఎక్కువకాలం ఉండలేకపోయాడు. 2015లో కట్టి బట్టి అనే చిత్రంలో చివరిసారిగా కనిపించాడు. దాదాపు తొమ్మిదేళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. తను ప్రేమించి పెళ్లాడిన భార్యకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నాడు.ప్రకృతి ఒడిలో ఇల్లుఇటీవల అతడు ఓ ఇల్లు కట్టాడు. కొండకోనల నడుమ ప్రకృతి ఒడిలో ఆ ఇల్లు ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. 'నేను కొన్ని సినిమాల్లో ఆర్కిటెక్ట్‌గా పని చేశాను. కానీ నాకు దానిపై ఎటువంటి అవగాహన లేదు. అయితే తెలియనివాటి గురించి తెలుసుకోవడమన్నా, కొత్తవి నేర్చుకోవడమన్నా నాకు భలే ఇష్టం. ఫోటోలో కనిపిస్తున్న ప్రదేశం చాలా స్పెషల్‌గా అనిపించింది. అందుకే దీన్ని ఎంచుకున్నాను. కొండవాలు ప్రదేశంలో సూర్యోదయాన్ని ఆస్వాదించేందుకు ఇంతకంటే మంచి ప్లేస్ మరొకటి ఉండదనిపించింది. విల్లా కాదు షెల్టర్..ఇక్కడ నేను విలాసవంతమైన విల్లా కట్టాలనుకోలేదు. ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఒక షెల్టర్ ఉంటే చాలనుకున్నాను. మొదట ఇక్కడికి వెళ్లి సూర్యోదయ, సూర్యాస్తమయాలను చూస్తూ ఉండిపోయేవాడిని. అన్ని సీజన్లలోనూ అక్కడికి వెళ్లి పరిస్థితులను గమనించాను. వర్షాలు పడ్డప్పుడు ఆ నీరు ఎటువైపు వెళ్తుంది. మట్టి ఎటు కొట్టుకుపోతుంది? ఇలా అన్నీ దగ్గరుండి పరిశీలించాను. ఆ తర్వాతే నా పని మొదలుపెట్టాను. తక్కువ ఖర్చు..కాంక్రీట్ బిల్డింగ్‌కు బదులుగా దగ్గరి గ్రామాల్లోని ప్రజల ఇళ్లలా సింపుల్‌గా నిర్మించాలనుకున్నాను. విల్లా కంటే కూడా ఇది చాలా తక్కువలోనే అయిపోయింది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు ఇమ్రాన్ ఖాన్ ఇల్లు చాలా బాగుంది అని కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని అడిగాడు. అందుకు ఇమ్రాన్.. నేను గతంలో కొన్ని సినిమాలు చేశాను కదా.. అని ఆన్సరిచ్చాడు. View this post on Instagram A post shared by Imran Khan (@imrankhan) చదవండి: ఓటీటీలో రూ. 100 కోట్ల హారర్ మూవీ.. అఫీషియల్ ఫ్రకటన -
ఆమెతో పెళ్లి.. విడాకులు.. అసలు కారణం వెల్లడించిన హీరో!
బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ చివరిసారిగా కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో కంగనా రనౌత్ అతనికి జంటగా నటించింది 2008లో జెనీలియాతో కలిసి జానే తూ...యా జానే నా చిత్రంలో తొలిసారిగా మెరిసన ఇమ్రాన్.. ప్రస్తుతం గూఢచారి అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అయితే 2011లోనే అవంతిక మాలిక్‌ను ఇమ్రాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇమారా అనే కూతురు కూడా జన్మించారు. అయితే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తన భార్య అవంతిక మాలిక్‌తో వివాహాబంధానికి గుడ్ బై చెప్పారు హీరో. అప్పట్లో ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ ఆమెతో విడాకులపై తొలిసారి స్పందించారు. విడిపోవడానికి గల కారణాలను వివరించారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ..'ఆ విషయంలోకి పెద్దగా వెళ్లాలనుకోవడం లేదు. గాసిప్స్‌కు ఆజ్యం పోయడానికి నేను సంకోచిస్తున్నా. అయితే నేను అంతర్గతంగా చాలా ఇబ్బందులు పడ్డా. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన బంధం ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య బంధం బలంగా తయారవుతుంది. అంతేకాదు ఒకరికొకరు మద్దతు ఉంటూ ఉత్తమంగా నిలుస్తారు. కానీ మా ఇద్దరి మధ్య అదే లోపించింది. అందుకే విడిపోవాల్సి వచ్చింది.' అని పంచుకున్నారు. కాగా.. అవంతికను 2011లో ఇమ్రాన్‌తో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఇమారా అనే కుమార్తెకు తల్లిదండ్రులయ్యారు. 2019లో వీరి వివాహాబంధానికి ముగింపు పలికారు. -
అదొక.. 'AI పొలిటికల్ అవతార్'!
ఈ సంవత్సరమే జరిగిన పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో.. అవినీతి ఆరోపణల కింద ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. అతని పార్టీ పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్) తరఫున అతను పోటీ చేయడానికే కాదు.. ప్రచారం చేయడానికీ వీల్లేదని ఆ దేశపు సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. దాంతో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రంగా బరిలోకి దిగారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికలుగా ఇమ్రాన్ ప్రచారం చేసిపెట్టాడు. ప్రసంగాలిచ్చాడు. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ కోర్టు తీర్పును ధిక్కరించాడా? అయ్యో అస్సలు కాదు. జైల్లోనే ఉన్నాడు. మరి? ప్రచారం, ప్రసంగాలు చేసింది ఇమ్రాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతార్!ఒక్క పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచ రాజకీయాల్లో తన చిప్‌ని దూర్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్! దాదాపు 50కి పైగా దేశాలకు ఇది ఎన్నికల సంవత్సరం. సుమారు రెండు బిలియన్ల (రెండువందల కోట్లు) మంది ఓటును వినియోగించుకుంటున్నారు. అమెరికా టు ఆఫ్రికా, ఆసియా టు ఐరోపాలోని దేశాల్లో జరిగే ఈ ఎన్నికల్లో పాలసీ మ్యాటర్స్, ప్రచారం .. పాజిటివ్, నెగటివ్ రెండు కోణాల్లో ఏఐదే ప్రధాన పాత్ర! అందుకే 2024, గ్లోబల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ సంవత్సరాన్ని ఏఐ ఎలక్షన్స్ ఇయర్ అంటున్నారు. ఈ సందర్భంగా.. మన దగ్గర స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సాంకేతికత అందిపుచ్చుకుంటున్న ఈ క్షణం దాకా ఎన్నికల ప్రచారాల్లో వస్తున్న మార్పుల వెంట సరదాగా నడిచొద్దాం..దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొన్ని దశాబ్దాల వరకు ఎన్నికల ప్రచారమంటే అగ్రనేతలు నిర్వహించే బహిరంగ సభలే! ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలకి వస్తే.. ఖాదీ వస్త్రధారణ, పవర్ఫుల్ స్లోగన్సే ప్రచారస్త్రాలుగా ఉండేవి. 1965లో లాల్‌బహదూర్ శాస్త్రి ‘జైజవాన్ జై కిసాన్’తో మొదలైందీ ఎన్నికల నినాద యాత్ర. ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని ఉరువా బహిరంగ సభలో ఆ నినాదాన్నిచ్చారు ఆయన. చైనా, పాకిస్తాన్లను దృష్టిలో పెట్టుకుని.. సరిహద్దు గట్టి రక్షణకు సైనికుల బలాన్ని, వ్యవసాయాధారిత మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రైతులే కాబట్టి వాళ్ల సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. ఆ రెండు వర్గాలకు తమ సర్కారు అండగా ఉంటుందనే భరోసాను కల్పించడానికి శాస్త్రి ఆ స్లోగన్ని అందుకున్నారు. అది వైరలై నేటికీ లైవ్‌గానే ఉంది.1971లో ఇందిరాగాంధీ ఇచ్చిన ‘గరీబీ హటావో (పేదరిక నిర్మూలన)’ నినాదం కాంగ్రెస్‌కి ల్యాండ్‌స్లైడ్ విక్టరీని తెచ్చిపెట్టింది. అయితే ఆ నినాదానికి యాంటీగా ప్రతిపక్షాలు.. ‘గరీబీ కాదు గరీబోంకో హటారహే (పేదరికాన్ని కాదు పేదలను నిర్మూలిస్తోంది)’ అంటూ ఆమెను ట్రోల్ చేశాయి. 1975 ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికలప్పుడు జనతా పార్టీ ‘ఇందిరా హటావో దేశ్ బచావో’ స్లోగన్‌తో విజయం సాధించింది. ఇందిరా హత్య తర్వాత 1984 ఎన్నికల్లో ‘జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా.. ఇందిరా తేరా నామ్ రహేగా (సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఇందిరా నీ పేరుంటుంది)’ నినాదంతో కాంగ్రెస్ గెలుపొందింది.1989లో వీపీ సింగ్ ‘రాజా నహీ ఫకీర్ హై.. దేశ్ కీ తక్దీర్ హై (రాజు కాదు పేద.. ఆయనే ఈ దేశపు భాగ్యప్రదాత)’ స్లోగన్‌తో ఎన్నికలను జయించి ప్రధాని అయ్యాడు.1996 స్లోగన్ ‘బారీ బారీ అబ్ కీ బారీ అటల్ బిహారీ’ ఎంత పాపులరో వేరేగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత వరుసగా ‘ఇండియా ఈజ్ షైనింగ్’, ‘కాంగ్రెస్ కే హాత్ ఆమ్ ఆద్మీ కే సాథ్ (కాంగ్రెస్ హస్తం.. సామాన్యుడికి ఆపన్న హస్తం)’ నినాదాలు ఆయా పార్టీల ఐడెంటిటీలుగా మారాయి. అయితే నినాదాల పవర్ సోషల్ మీడియా ఇరాలోనూ కొనసాగుతోంది. ‘అచ్ఛే దిన్ ఆలే వాలే హై (మంచి రోజులు రానున్నాయి)’, ‘హాత్ బద్లేగా హాలాత్ (హస్తం మార్పును తెస్తుంది), ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’, ‘అబ్ కీ బార్ చార్సౌ పార్’ వంటి నినాదాలే అందుకు నిదర్శనం.స్వాతంత్య్రం వచ్చిన ఓ రెండుమూడు దశాబ్దాల వరకు ఎన్నికల ప్రచారంలో రేడియో కూడా ప్రధాన పాత్ర పోషించింది. దశాబ్దం కిందటి వరకు పత్రికలు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఆ రోల్‌ని తీసుకున్నాయి. వీటితోపాటు గోడ పత్రికలు, పాంప్లెట్స్, వాల్ రైటింగ్స్ కూడా తమ ఉనికిని చాటాయి. ప్రైవేట్ చానళ్ల పర్వం మొదలయ్యాక అవీ తమ ఇన్‌ఫ్లుయెన్స్‌ని చూపించాయి. నేతల ప్రచార యాత్రలూ ఆయా పార్టీల జయాపజయాలను ప్రభావితం చేశాయి. వాటిల్లో ఆడ్వాణీ రథ యాత్ర ఒకటి. ఇది వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచినప్పటికీ రైట్ వింగ్ ఐడియాలజీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఫలితంగా ఆ తర్వాత ఐదేళ్లలోనే కేంద్రంలో ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేలా చేసింది.రిగ్గింగ్ చేస్తున్నట్టు..స్లొవేకియాలో నిరుడు జరిగిన ఎన్నికల్లో.. ప్రధాన పార్టీల తరఫున నిలబడిన వ్యక్తి ఆడియో టేప్ సంచలనంగా మారింది. ఆ టేప్‌లో.. తాను ఎలా రిగ్గింగ్ చేయబోతున్నాడో మరొకరికి విపులంగా వివరిస్తున్నాడు. ఆ ఆడియో బయటకు వచ్చాక సదరు నేత ఎన్నికల్లో ఓడిపోయాడు. అతనికి అమెరికా, నాటో దేశాలను సమర్థించే వ్యక్తిగా పేరుంది. అందుకే అతన్ని ఎన్నికల్లో ఓడించేందుకు ఏఐ సాయంతో రష్యన్ ఏజెన్సీలు డీప్‌ఫేక్ ఆడియోను çసృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశాయి అమెరికా అనుకూల అభ్యర్థి ఓటమికి దారులు వేసి, రష్యన్ అనుకూల వ్యక్తిని గెలిపించుకున్నాయి. ఎన్నికల అనంతరం యూఎస్ చేపట్టిన సమగ్ర విచారణలో ఈ అంశం వెలుగు చూసింది.జంతువులతో పోల్చినట్టు..ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండోనేషియా ఎన్నికలపైనా ఏఐ ఎఫెక్ట్ పడింది. ప్రభుత్వాధినేత ప్రభోవో సుబియాంటో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉపాధ్యక్షుడు గిబ్రాన్ రకాబుమ్మింగ్ తీవ్రంగా విమర్శిస్తున్న వీడియో అక్కడ సంచలనమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకునే వ్యక్తులను ఉపాధ్యక్షుడు ‘జూ’లోని జంతువులతో పోల్చినట్టుగా ఉందీ వీడియోలో. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ వీడియోపై విచారణ జరిపించింది. గిబ్రాన్ పాత వీడియోకు ఏఐ జనరేటెడ్ వాయిస్‌ను జోడించి ఫేక్ వీడియో క్రియేట్ చేసినట్టుగా తేలింది.తప్పుకుంటున్నట్టు..ఈ సంవత్సరం మొదట్లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో అబ్దుల్లా నహీద్.. స్వతంత్ర అభ్యర్థిగా గాయ్బంధా నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల పోరులో గెలుపు కోసం అతను శ్రమిస్తుండగా.. హఠాత్తుగా ఓ వీడియో బయటకు వచ్చింది. అతను పోటీ నుంచి తప్పుకుని ప్రత్యర్థికి మద్దతు ఇస్తున్నట్టుగా! దీంతో అప్పటి వరకు నహీద్‌కు వచ్చిన ప్రచార ఊపంతా గంగపాలైంది. చివరకు ఆ వీడియో డీప్ ఫేక్‌గా నిర్ధారణైంది.సోషల్ మీడియా..తొంభైయ్యవ దశకంలో ఎన్నికల ప్రచారం పేరుతో అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం మొదలైంది. సామాన్యులు పోటీలో నిలబడి తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో రాజకీయ ప్రచారంపై ఎన్నికల కమిషన్ నజర్ పెట్టింది. కొత్త నియమ నిబంధనలను తీసుకొచ్చింది. అలా రాజకీయ ప్రచారానికి హద్దులు నిర్దేశమవుతున్న తరుణంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ఎన్నికల ప్రచారంలో భాగం పంచుకున్నాయి. ఆ తర్వాత కొద్ది కాలానికే ఇంటర్నెట్ విప్లవం వచ్చి పడింది. సోషల్ మీడియాను మోసుకొచ్చింది. అంతే ఈమెయిల్స్, వాట్సాప్ మొదలు యూట్యూబ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఎక్స్, ఇన్‌స్టా లాంటి సోషల్ మీడియా పాపులర్ ప్లాట్‌ఫామ్స్ జనాలకు చేరువయ్యాయి. ఆదిలోనే వాటి ఇంపాక్ట్‌ని గ్రహించి.. సమర్థవంతంగా వాడుకున్న పార్టీగా బీజేపీకి పేరుంది. గుజరాత్లో మొదలైన మోదీ వేవ్ 2014లో సోషల్ మీడియా వేదికగా దేశమంతటా విస్తరించడానికి కారణమైంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీ..సోషల్ మీడియా ప్రచారాన్ని రాకెట్లోకి ఎక్కించి ఆకాశం అందుకునేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్స(ఏఐ) ఎంట్రీ ఇచ్చింది. 2013 నుంచే ఏఐ వాడకం మొదలైనా అది శైశవ దశ. ఇప్పుడు ఏఐ యవ్వన దశకు చేరుకుంది. సరదాగా మొదలైన ఏఐ వాడకం ప్రొఫెషన్స్సకి ఉపకరణంలా మారింది. ఇప్పుడు మరింతగా ముదిరి ఎన్నికల ప్రక్రియలో భాగమైంది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఓటును వినియోగించుకునేందుకు అందుబాటులో ఉన్న సమాచారం ఎంతో కీలకం. తమకు తెలిసిన, తమ దగ్గరకు వస్తున్న సమాచారం ఆధారంగానే ఓటరు నిర్ణయం ప్రభావితం అవుతుంది. కానీ ఇప్పుడు గెలుపే పరమావధిగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏఐని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి వినియోగిస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో రాజకీయాల్లోని వ్యక్తులతో పాటు ఆకతాయిలూ ఉంటున్నారు. ఫలితంగా అగ్రరాజ్యమైన అమెరికా నుంచి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ వరకు అంతటా ఎన్నికల ప్రక్రియ కుదుపునకు లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏఐ వాడి, వేడికి అమెరికా, యూరప్‌లలో ఫెయిర్ ఎలక్షన్స్స కోరుకునే ప్రజాస్వామ్యవాదులకు దడ మొదలైంది.ఆర్థిక, ఆయుధ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం తెలియంది కాదు. అమెరికా తన దగ్గరున్న టెక్నాలజీ సాయంతో ఇండియాలో మన చేతికి ఉన్న వాచిలో టైమ్ ఎంతో చూడగలదని చెబుతుంటారు. అంతటి అమెరికా అధ్యక్షుడికే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్స చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో! డెమొక్రాట్ల తరఫున బైడెన్, రిపబ్లికన్ ల తరఫున డోనాల్డ్ ట్రంప్‌లు ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఏఐ ద్వారా వచ్చే సమస్యలను ఎదుర్కోవడం వారికీ సవాలుగా మారిందనడంలో సందేహం లేదు.ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తున్న వీడియోఇద్దరినీ..తైవాన్ ఎన్నికల సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సైయింగ్ వెన్ లక్ష్యంగా అనేక ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వాటిల్లో ఆ దేశానికి చెందిన ప్రముఖ న్యూస్ యాంకర్‡దేశాధ్యక్షుడిని ఇంటర్వ్యూ చేసినట్టుగా ఉన్ని వీడియో ఒకటి. అందులో చైనా – తైవాన్ సంబంధాలపై దేశ అధ్యక్షుడి ప్రతిష్ఠకు భంగం కలిగేలా సమాచారం వ్యాప్తి చేశారు. ఈ డీప్‌ఫేక్ వీడియోలో అధ్యక్షుడి వాయిస్‌నే కాదు న్యూస్ యాంకర్‌నూ ఏఐ ద్వారా సృష్టించారు.ఘాటైన వ్యాఖ్యలు!బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఇటీవల వారణాసి వెళ్లారు. అక్కడ జరిగిన అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. అయితే కొద్ది రోజులకే ఏఐ సాయంతో రణ్‌వీర్‌సింగ్ వాయిస్‌ను క్లోన్ చేసి అదే వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. అందులో.. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, మోడీ అసంబద్ధ విధానాలపై రణ్‌వీర్‌సింగ్ ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. అంతేకాదు దేశ భవిష్యత్తు కోసం రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరినట్టుగా ఉంది. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. వెంటనే తేరుకున్న రణ్వీర్ సింగ్ కుటుంబం సదరు తప్పుడు సమాచారాన్ని షేర్ చేసిన వారిపై కేసు పెట్టింది. మరో హీరో ఆమిర్‌ఖాన్ కూ ఇలాంటి అనుభమే ఎదురైంది.ఇమ్రాన్ .. నీకు నేనున్నాను!ఈ మార్చి మొదట్లో ట్రంప్ మాట్లాడుతున్న వీడియో ఒకటి అమెరికాలో వైరల్ అయింది. అందులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ును ఉద్దేశిస్తూ ట్రంప్ చెప్పిన మాటలు అమెరికాలో సంచలనం కలిగించాయి. త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే, ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను విడిపిస్తానని, అమెరికా– పాకిస్తాన్ ల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తానని ట్రంప్ మాట్లాడినట్టుగా ఆ వీడియోలో ఉంది. దీనిపై నలువైపులా విమర్శలు చుట్టుముట్టాయి. చివరకు టెక్నోక్రాట్స్, అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపితే.. అది ఏఐ యాప్ ద్వారా తయారైన డీప్ ఫేక్ వీడియో అని తేలింది. ట్రంప్ మాట్లాడుతున్న పాత వీడియోలు, ట్రంప్‌ను పోలిన ఏఐ వాయిస్ సాయంతో కొత్త వీడియోను తయారుచేసి వదిలారు. అది నిజామా.. కాదా? అని తెలుసుకునేలోపు ఆ వీడియో సగం అమెరికాను చుట్టొచ్చింది.అంతేకాదు న్యూహాంప్‌షైర్ ప్రైమరీ ఎన్నికలప్పుడు.. అక్కడి ఓటర్లకు ఫోన్ కాల్స్ వచ్చాయి. అందులో బైడెన్ స్వయంగా.. ప్రైమరీ ఎన్నికల్లో ఓటు వేయద్దంటూ ఆ ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల్లో సేవ్ చేసిన ఓటును త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు కోసం ఉపయోగించాలంటూ విజ్ఞప్తి చేశారు. గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, ట్రంప్‌ల మధ్య విజయం దోబూచులాడింది. ఓట్ల లెక్కింపు అంశం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో బైడెన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ నిజమేనేమోనని సగటు అమెరికన్ ఓటరు నమ్మే పరిస్థితి నెలకొంది. కానీ విచారణలో ఏఐ సాయంతో బైడెన్ వాయిస్‌ను సృష్టించి ఆ కాల్స్ చేసినట్టు తేలింది. ఇలా అసలు జరగని విషయాన్ని కచ్చితంగా జరిగిందన్నట్టుగా మన పంచేద్రియాలను నమ్మించడం సులువైపోయింది.మన దగ్గర..అమెరికన్ ర్యాపర్ లిల్ యాచీ నడక ఆధారంగా.. ప్రధాని నరేంద్ర మోదీని డిక్టేటర్‌గా పేర్కొంటూ రూపొందిన ఏఐ మీమ్.. ఎక్స్‌లో పోస్ట్ అయిన క్షణాల్లోనే వైరల్ అయింది. ఆ వెంటనే దేశంలో అనేక మంది రాజకీయ నాయకుల ఏఐ మీమ్స్, ఏఐ అవతార్లు స్క్రీన్ మీదకు వచ్చాయి. ఆఖరికి ఈ ఏఐ మీమ్స్ ట్రెండ్‌పై సాక్షాత్తు ప్రధాని ‘నా మీద చేసిన మీమ్ చాలా క్రియేటివ్‌గా ఉంది. ఎన్నికల ఒత్తిడితో సతమతమవుతున్న నేను దీన్ని చూసి భలే రిలాక్స్ అయ్యాను’ అని స్పందించారు. భారతీయ జనతా పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారానికి ఏఐని వాడుకుంటోంది. ప్రధాని మోదీ హిందీ సంభాషణను ఏఐ సాయంతో ఎనిమిది ప్రాంతీయ భాషల్లోకి మార్చింది.నేరుగా దేశ ప్రధానే తమ సొంత భాషలో తమతో మాట్లాడారు అని ప్రజలు మురిసిపోయారు. సాంకేతికతను ఒడిసిపట్టుకున్నామని బీజేపీ ఆనందంతో గంతులేసింది. అదే విధంగా గడిచిన పదేళ్లలో భారత్ ఎలా అభివృద్ధి చెందిందనే అంశాలపైనా ఏఐ సాయంతో వీడియో రూపొందించి జనాల్లోకి వదిలింది. ప్రచారంలో దూసుకుపోయింది. ఏఐని మంచికి వాడుకుంటే తప్పులేదు. ప్రజలను భ్రమల్లోకి నెట్టాలనుకుంటేనే ప్రమాదం. ప్రపంచంలోనే ఏ దేశానికి లేనంత యువ జనాభా మన సొంతం. ఈ యువ భారతానికి స్పీడెక్కువ.సోషల్ మీడియా అధికంగా ఉపయోగించేది వీళ్లే. ఈ ఉడుకు రక్తానికి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా.. నిజాన్ని తలదన్నేలా ఏఐ తయారుచేస్తున్న తప్పుడు సమాచారం అందితే? దాని ఆధారంగా వారి ప్రయాణం సాగితే? వ్యక్తులుగా వారికి, వ్యవస్థగా దేశానికి తీరని నష్టం. రెచ్చగొట్టే సభలు, సమావేశాలు, తప్పుడు ప్రకటనలనైతే అడ్డుకోవచ్చు. కానీ చేతిలో ఇమిడిపోయే ఫోన్లను టాయిలెట్లకు సైతం తీసుకుపోతున్న కాలంలో.. నియంత్రణ లేకుండా కనురెప్ప పాటులో సోషల్ మీడియా ద్వారా బట్వాడా అవుతున్న అబ్ధాలను అడ్డుకోవడమెలా?మరణించిన వ్యక్తి ప్రచారం..2019లో.. తమిళనాడు, కన్యాకుమారి నుంచి వసంత్ కుమార్ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2020లో ఆయన మరణించారు. మొన్నటి ఏప్రిల్ 19న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కొడుకు విజయ్‌కుమార్ పోటీ చేశారు. అయితే పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు తన కొడుకు విజయ్ను గెలిపించాలంటూ వసంత్‌కుమార్ కోరుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. 2020లో చనిపోయిన వసంత్ 2024లో ఎలా ప్రచారం చేశాడా అని జనాలు అవాక్కయ్యారు. అయితే అది డీప్‌ఫేక్ సాయంతో రూపొందించిన వీడియోగా తేలింది.ఫ్యాక్ట్ చెక్ ఉన్నా..సాంకేతికంగా రోజుకో కొత్త ఆవిష్కరణ పుట్టుకొస్తున్న ఆధునిక యుగంలో ప్రతి చెడును చట్టాలతో అరికట్టడం ఒకింత కష్టమే! అనుమానం ఉన్న కంటెంట్‌ను పట్టుకుని, దానికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి నిజానిజాలు తేల్చడం ఖర్చు, కాలంతో కూడుకున్న పని. ఫ్యాక్ట్ చెక్, ట్రూత్ ఫైండర్, ఫేక్‌న్యూస్ తదితర పద్ధతుల్లో అసలు ఏదో నకిలీ ఏదో తెలుసుకోవడం సంక్లిష్టంగా మారింది. డిజిటల్ లిటరేట్సే కానీ డిజిటల్ ఎడ్యుకేట్స్ లేదా డిజిటల్లీ చాలెంజ్డ్ జనాభా ఉన్న దేశాల్లో.. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పలురకాలుగా వడబోస్తే తప్ప అసలైన విషయం బటయకు రాదు. కానీ అసలు నిజం వెలుగు చూసేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తోంది.ముల్లును ముల్లుతోనే..ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా టెక్నాలజీ ఆధారంగా జరుగుతున్న తప్పుడు సమాచార ప్రచారానికి చెక్ పెట్టాలంటే తిరిగి టెక్నాలజీనే ఆయుధంగా మలచుకోవాలి. సాంకెతిక నైపుణ్యంతో సృష్టిస్తున్న అభూత కల్పనలను ఇట్టే పసిగట్టి హెచ్చరించి, నిరోధించే ప్రత్యామ్నాయ యాప్‌లను డెవలప్ చేయడంపై భావి ఆవిష్కర్తలు దృష్టి సారించాలి. లేదంటే నీడే నిజమనే భ్రాంతిలో బతకాల్సి వస్తుంది. ఇప్పటికే గూగుల్, మెటా, ఎక్స్, ఓపెన్ ఏఐ, టిక్‌టాక్‌లు తమ ఫ్లాట్‌ఫామ్స్‌పై డీప్‌ఫేక్ ద్వారా జరిగే ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చాయి. ఈ మేరకు ఫేక్ను గుర్తించే వ్యవస్థలను మరింత సమర్థంగా రూపొందిస్తామని వెల్లడించాయి.ఎన్నికల వ్యవస్థలోకి ఏఐని జొప్పించి చేస్తున్న విష ప్రచారంపై పాశ్చాత్య ప్రపంచం మేల్కొంది. ఏఐని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై చర్చలను నిర్వహిస్తోంది. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా చట్టాలను రూపొందించాలని ప్రపంచ దేశాలకు సూచనలు చేస్తోంది. ఏఐని అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల సహకారంతో అంతర్జాతీయ స్థాయి చట్టాల రూపకల్పనకు సమయం ఆసన్నమైందని పోరుతోంది.యంత్రమా.. హృదయ స్పందనా..వందమంది చేసే పనిని ఒక్క యంత్రమే చేయగలదు. మనిషి కంటే ఎన్నో రెట్లు శక్తి సామర్థ్యాలు యంత్రాల సొంతం. ఇప్పుడా యంత్రాలకు మరింత మెరుగ్గా ఆలోచించే శక్తిని ఏఐ అందిస్తోంది. అయితే ఎన్ని శక్తియుక్తులు ఉన్నా మనిషి స్పృహ, హృదయ స్పందన ముందు అవన్నీ దిగదుడుపే.ముగింపు..సంప్రదాయం, సాంకేతికతకు ఎప్పుడూ ముడిపడదు. ఆ పోరులో టెక్నాలజే ఓ మెట్టు పైన ఉంటుంది. కాలానికి తగ్గట్టు మారాల్సిందే. తప్పదు.. తప్పు లేదు. అయితే మంచిచెడులను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల పర్యవసానాలు అనుభవించిన తర్వాత ప్రపంచ దేశాలు అణ్వాయుధాల తయారీ మీద స్వీయ నియంత్రణను పాటిస్తున్నాయి. జీవాయుధాల తయారీ, సాగులో బయోటెక్నాలజీ వినియోగం తదితర అంశాల మీద ఓ కన్నేసి ఉంచాయి. కానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఏఐ వాడకం వంటి వాటి నియంత్రణ మీదే ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఐక్యం కావాల్సిన సందర్భం వచ్చింది అంటున్నారు సామాజిక, రాజకీయ విశ్లేషకులు. – తాండ్ర కృష్ణ గోవింద్ -
సినిమాలకు హీరో గుడ్‌బై.. నాలుగురోజులే ఉండే కూతురు.. తనకోసం అన్నీ చేస్తా!
ఇమ్రాన్ ఖాన్.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా, తర్వాత హీరోగా హిందీలో సినిమాలు చేసిన ఈయన తర్వాత ఉన్నట్లుండి గ్లామర్ ప్రపంచానికి గుడ్‌బై చెప్పేశాడు. 2015లో కట్టి బట్టి అనే మూవీలో చివరిసారిగా కనిపించాడు. అతడికి ఏడాదిన్నర వయసున్నప్పుడు పేరెంట్స్ విడాకులు తీసుకున్నారు. తర్వాత తల్లి రాజ్ జుట్షి అనే నటుడిని రెండో పెళ్లి చేసుకుంది. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2006లోనే విడాకులు తీసుకున్నారు.ప్రేమ పెళ్లిపెద్దయ్యాక ఇమ్రాన్ పరిస్థితి కూడా అదే అయ్యింది. అవంతిక అనే అమ్మాయిని ప్రేమించి 2011లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2014లో ఓ పాప పుట్టింది. ఆమెకు ఇమారా మాలిక్ అని నామకరణం చేశారు. ఏమైందో ఏమో కానీ తర్వాత భార్యాభర్తల మధ్య బంధం బలహీనం కాసాగింది. 2019లో అవంతిక తన కూతుర్ని తీసుకుని భర్త ఇంటి నుంచి వెళ్లిపోయింది. అలా విడివిడిగా జీవించిన ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.ఏదైనా చేస్తాతాజాగా ఇమ్రాన్ ఖాన్ తన కూతురి గురించి మాట్లాడాడు. 'నా బిడ్డ ఇమారా కోసం నేను ఏదైనా చేస్తాను. తనను చూసుకునేందుకు ఏ మనిషినీ పెట్టుకోలేదు. నేనే తనకు వంట చేసి పెడతాను. స్కూల్లో డ్రాప్ చేస్తాను. బడి అయిపోగానే తీసుకొస్తాను. నిద్రపుచ్చుతాను. మళ్లీ సినిమాల్లో ప్రయత్నించడం కంటే నా కూతుర్ని బాధ్యతగా, జాగ్రత్తగా చూసుకోవడమే బాగుంది.వారంలో నాలుగు రోజులుమరీ ముఖ్యంగా తను పెద్దయ్యాక.. మా నాన్న చిన్నప్పుడు నన్నిలా చూసుకున్నాడు, నాకోసం ఈ పని చేశాడు, తనే స్కూలు దగ్గర దిగబెట్టేవాడు అని చెప్పుకోవడానికి జ్ఞాపకాలను కూడబెడుతున్నాను. తన కస్టడీని ఇద్దరం తీసుకున్నాం. వారంలో నాలుగు రోజులు నా దగ్గర, తర్వాతి రోజులు నా మాజీ భార్య దగ్గర ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు.చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి జరిగే గొప్ప ఘట్టం. అది అందరికి ఓ మర్చిపోని గొప్ప మధురానుభూతి. అలాంటి గొప్ప క్షణాన్ని పదిలంగా ఉంచుకునేలా కొందరూ బహుమతులు ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఓ వరుడు అలానే ఓ బహుమతిని వధువకి ఇచ్చాడు. అయితే ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేసి చూసిన వారందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా అని ఆశ్చర్యపోయారు. చెప్పాలంటే అది ఊహకే అందని బహుతి అది. ఇంతకీ ఆ వధువుకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే..ఈ అరుదైన ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. పెండ్లి రోజున పాకిస్తానీ వరుడు తన కాబోయే భార్యకు ఓ విచిత్రమైన గిఫ్ట్‌ని అందజేశాడు. ఆమె ఆనందంగా ఆ గిప్ట్ ఏంటని తెరిచి చూసి ఒక్కసారిగి నివ్వెరపోయింది. అది పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటో. తాను ఊహించని ఆ బహుమతిని చూసి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ఫోటోలకి ఆనందంగా ఫోచ్చింది. ఆ వేదిక వద్ద ఉన్న అతిథులు సైతం ఆ ఫోటో ఫ్రైమ్ని చూసి ఆశ్చర్యపోతు వారిపై పూల వర్షం కురిపించిగా..ఆ వధువరులిద్దరు ఆ ఫోటో ప్రేమ్‌ని కలిసి పట్టుకుని ఫోటోలకు నవ్వుతూ ఫోజులిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీన్ని చూసి నెటిజన్లు విమర్శలు కురిపించగా, మరికొంందరూ జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ విడిపించేందుకు పాక్‌లోని కొందరు ప్రజలు చేస్తున్న ఎత్తుగడ అని కామెంట్లు చేశారు. కాగా, 2018 నుంచి 2022 వరకు ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్, రాష్ట్ర బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు గానూ అతనికి, ఇమ్రాన్ భార్యకు 14 సంవత్సరాల జైలు శిక్షతో సహా పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. Becoming a common occurrence now. How long before they put a ban on this? pic.twitter.com/c0BJHjTdkQ— Mahvish- (@halfbakedtruths) April 30, 2024 (చదవండి: ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
నా భార్యకు ఏమైనా జరిగితే వదలిపెట్టను: ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్
ఇస్లామాబాద్: తన భార్య జైలుపాలు కావడానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఆసీమ్ మునీర్ కారమంటూ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్( పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. తన భార్య బుష్రా బీబీ జైలు శిక్ష పడినందుకు ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యత వహించాలన్నారు. అవినీతి కేసుకు సంబంధించి బీబీ బుష్రా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారు. అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నా భార్య బుష్రాకు జైలు శిక్ష పడటంలో ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. కోర్టులో న్యాయమూర్తిపై అసిమ్ మునీర్ ఒత్తిడి తెచ్చారు. నా భార్యకు ఏదైనా జరిగితే.. అసిమ్‌ను వదిలిపెట్టను. నేను బతికి ఉన్నంతవరకు అసిమ్‌ను అస్సలు వదిలేయను. అసిమ్ చేసిన చట్టవ్యతిరేక చర్యలన్నీ బయటపెడతాను. ..పాకిస్తాన్లో ఆటవిక రాజ్యంలో కొనసాగుతోంది. అడవి(పాకిస్తాన్) రాజు(నవాజ్ షరీఫ్) తల్చుకుంటే అన్ని కేసులు మాఫీ చేయబడుతాయి. లేదంటే ఐదు రోజుల్లో మూడు కేసులు బనాయిస్తారు. శిక్ష కూడా పడుతుంది. ఆటవిక రాజ్యంలో పెట్టుబడలు రావు. పెట్టుబడుల పెట్టడానికి సౌదీ అరేబియా ముందురావటం మంచిదే. కానీ, చట్టబద్ద కల్పించరు’ అని ఇమ్రాన్ మండిపడ్డారు. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ భార్యపై విష ప్రయోగం?
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి ఆర్మీ చీఫ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఒక కేసు విచారణకు హాజరైన ఆయన మాట్లాడుతూ గృహనిర్బంధంలోవున్న తన భార్య బుష్రా బీబీపై విషప్రయోగం జరిగిందని ఆరోపించారు. తన భార్యకు ఎటువంటి హాని జరిగినా అందుకు ఆర్మీ చీఫ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అడియాలా జైలులో 190 మిలియన్ పౌండ్ల తోషాఖానా అవినీతి కేసు విచారణ సందర్భంగా పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐఐ) నేత ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతూ తన భార్య బుష్రాకు విషమిచ్చి చంపే ప్రయత్నం జరిగిందని న్యాయమూర్తి నాసిర్ జావేద్ రాణా ఎదుట ఆరోపించారు. ఆమె శరీరంపై గాయాల ఆనవాళ్లు ఉన్నాయని, దీని వెనుక ఎవరి హస్తం ఉందో తనకు తెలుసని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. తన భార్య బుష్రాకు ఏదైనా హాని జరిగితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యత వహించాలని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. షౌకత్ ఖానుమ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అసిమ్ సాయంతో తన భార్యకు వైద్య పరీక్షలు చేయించాలని ఇమ్రాన్ ఖాన్ కోర్టును కోరారు. ఇంతకుముందు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యునిపై తనకు, తన పార్టీకి నమ్మకం లేదని ఇమ్రాన్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విజ్ఞప్తి మేరకు ఆయన భార్య బుష్రా వైద్య పరీక్షలకు సంబంధించి దరఖాస్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ అనంతరం విలేకరులతో మాట్లాడిన బుష్రా తాను అమెరికన్ ఏజెంట్ అంటూ పార్టీలో వదంతులు వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. తన ఆహారంలో టాయిలెట్ క్లీనర్ చుక్కలు కలిశాయని ఆమె ఆరోపించారు. ఫలితంగా తన కళ్లు వాచిపోయాయని, ఛాతీ, కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతున్నానని ఆమె వాపోయారు. బుష్రా బీబీ కస్టడీలో ఉన్నప్పుడు ఆమెపై విషప్రయోగం జరిగిందని పీటీఐ ప్రతినిధి ఒకరు మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు. బుష్రా బీబీని కలుసుకోకూడదంటూ ఆమె కుటుంబ సభ్యులను నిర్బంధించారని, ఈ చర్య రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయన ఆరోపించారు. -
ఇమ్రాన్‌ఖాన్‌కు రెండు కేసుల్లో ఊరట.. నిర్దోషిగా ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు రెండు కేసుల్లో ఊరట లభించింది. 2022 నాటి ప్రభుత్వ వ్యతిరేక ‘లాంగ్ మార్చ్’ విధ్వంసం ఘటన కేసుల్లో జిల్లా సెషన్స్ కోర్టు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ షైస్టా కుండి ఇమ్రాన్ ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించారు. ఇస్లామాబాద్‌లోని లోహిభైర్, సహలా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో ఆయన మంగళవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ తరఫున న్యాయవాది నయీ పంజోథా వాదనలు వినిపించారు. తన క్లైంట్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేత ఇమ్రాన్‌ఖాన్‌పై ఒకే రోజు అనేక కేసులు అక్రమంగా నమోదు చేశారని తెలిపారు. సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయటం, సమాచారం అందించటం లేదని పేర్కొన్నారు. ఇక..ఫిర్యాదుదారుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్(SHO)అని.. కేసు నమోదు చేసే అధికారం ఆయనకు లేదని స్పష్టం చేశారని తెలిపారు. అదే విధంగా ఇమ్రాన్‌ఖాన్‌పై దాఖలైన కేసుల్లో ఏ సాక్షి స్టేట్మెంట్ ఇవ్వలేదని తెలిపారు. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.. ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్‌లోని రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన తోషాఖానా, ఇద్దత్ (ఇస్లామేతర వివాహం), ప్రభుత్వ రహస్య పత్రాల లీక్ తదితర కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే 2022లో అధికారం కోల్పోయిన తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ ‘లాంగ్ మార్చ్’ చేపట్టిన విషయం తెలిసిందే. -
పాక్ రాజకీయాల్లో అదిరిపోయే ట్విస్ట్
ఇస్లామాబాద్: తీవ్ర గందరగోళం.. రిగ్గింగ్ ఆరోపణల నడుమ ఎన్నికలు పూర్తి చేసుకున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి కాబోయే ప్రధాని ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే అస్పష్టతతో కూడిన ఫలితాలతో.. అనిశ్చితి నెలకొన్న పాకిస్థాన్‌లో రాజకీయం ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఇప్పటికే నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ ప్రభుత్వ ఏర్పాటునకు తీవ్రంగా యత్నిస్తుండగా.. ప్రతిపక్ష పాత్రకైనా రెడీ అని ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ మద్ధతుదారులు ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు యత్నాల్లోకి దిగడం విశేషం. మెజారిటీ రాకున్నా.. మిత్రపక్షం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP)తో.. మరికొన్ని చిన్నచిన్న పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది ముస్లిం లీగ్ నవాజ్(PML-N) యత్నిస్తోంది. తన సోదరుడిని షెహబాజ్‌ను ఎలాగైనా మరోసారి ప్రధానిని చేయాలని నవాజ్ షరీఫ్ తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈలోపు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భలే ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మద్ధతుగా ఆయన మద్ధతుదారులు.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇండిపెండెంట్లు కావడంతో వాళ్లకు ప్రభుత్వ ఏర్పాటునకు వీలు లేకుండా పోయింది. దీంతో.. ప్రతిపక్ష పాత్రకే వీళ్లంతా పరిమితం కావొచ్చనే చర్చ నడిచింది. ఈ లోపు.. పీటీఐ వర్గం ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. అయితే.. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీని పాక్ ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. దీంతోనే వాళ్లు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి నెగ్గారు. అక్కడి నిబంధనల ప్రకారం.. పాక్ ఎన్నికల్లో నెగ్గిన ఒక పార్టీకి గెలిచిన సీట్ల సంఖ్యకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే ఖాన్ మద్ధతుదారులంతా స్వతంత్ర అభ్యర్థులుగా గెలవడంతో.. ఆ వర్గానికి రిజర్వ్డ్ సీట్లు దక్కవు. అందుకే ఒక పార్టీగా వాళ్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. పాక్‌లో ఇస్లామిక్ పొలిటికల్ పార్టీస్ గ్రూప్‌గా పేరున్న ‘‘ఇస్లామిక్ పొలిటికల్ అండ్ రెలిజియస్ పార్టీస్ గ్రూప్’’లోని ఓ చిన్న పార్టీ అయిన సున్నీ ఇత్తేహద్ కౌన్సిల్(SIC). ఈ పార్టీలో చేరేందుకు ఖాన్ మద్దతుదారులంతా సిద్దం అయ్యారు. ఎస్ఐసీ తరఫున ఆ పార్టీ చైర్మన్ సయ్యద్ మహ్ఫూజ్ ఒక్కరే మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. ఈ కూటమిలో చేరడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది పీటీఐ ప్లాన్‌గా స్పష్టం అవుతోంది. ‘‘ఈ కూటమికి గనుక అనుమతి లభిస్తే.. పాకిస్థాన్‌లోని వివిధ ప్రావిన్స్‌లోనే కాదు కేంద్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి పీటీఐ చేరుకుంటుంది’’ అని పీటీఐ తరఫున ప్రధాని అభ్యర్థి అయూబ్ ఖాన్ చెబుతున్నారు. ‘‘మా సభ్యులంతా సున్నీ ఇత్తేహద్‌కౌన్సిల్‌లో చేరాలని నిర్ణయించుకున్నాం. ఈ మేరకు చర్చలు సఫలం అయ్యాయి. మళ్లీ ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని అయ్యేందుకు అవకాశమూ లేకపోలేదు’’ అని పీటీఐ చైర్మన్(ఆపద్ధర్మ) గోహర్ అలీఖాన్ మీడియాకు తెలిపారు. ఈ వారంలోనే ఎస్ఐసీలో చేరేందుకు దరఖాస్తులను పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారాయన. ఒకవేళ.. ఈ కూటమికి గనుక పాక్ ఈసీ అంగీకరిస్తే మాత్రం.. పాక్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. -
ఇంకా వుంది!
ఎక్కడైనా ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చాక రాజకీయంగా సుస్థిరత నెలకొంటుందని ఆశించడం సహజం. పాకిస్తాన్లో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. దాయాది దేశంలోని ఇటీవలి 12వ జనరల్ ఎలక్షన్ ఓటింగ్ సరళి, తాజా ఫలితాలు చూస్తే... ఎన్నికలు ముగిశాయి కానీ, అసలు కథ ఇంకా మిగిలే ఉందని అర్థమవుతోంది. చిత్రమేమిటంటే, సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం లేకపోయినా పాక్ మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్లు ఇరువురూ ఎన్నికల్లో తమదే విజయమని ప్రకటించుకోవడం! ఇక, 2018 ఎన్నికల్లో ఇమ్రాన్‌కు అనుకూలంగా వ్యవహరించిన సైన్యం జనరల్ ఆసిమ్ మునీర్ సారథ్యంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణం దిశగా పావులు కదుపుతోంది. పోలింగ్‌కు ముందూ, తర్వాత నిస్సిగ్గుగా రిగ్గింగ్‌కు పాల్పడి ఎన్నికలను ప్రహస నంగా మార్చిన ఆర్మీ ఇప్పటికీ పగ్గాలను తన చేతుల్లో ఉంచుకొని, ‘హైబ్రిడ్’ నమూనా ప్రభుత్వాన్ని నడపాలని చూస్తోంది. కౌంటింగ్‌లో రిగ్గింగ్ సాగకుంటే, జాతీయ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ ఇమ్రాన్‌కే వచ్చి ఉండేదని అభిప్రాయం. ఇప్పుడు రెండోస్థానంలో నిలిచిన నవాజ్ షరీఫ్ గద్దెనెక్కినా, కొత్త సర్కార్ సైతం సైన్యం చేతిలో కీలుబొమ్మగానే కొనసాగనుంది. ఎన్నికల్లో ఓటర్లు ఇమ్రాన్ వైపు మొగ్గారన్నది సుస్పష్టం. కానీ ఒకపక్క రకరకాల కేసుల్లో శిక్షలు పడి, కారాగారంలో ఉన్న ఇమ్రాన్ రాజకీయ పదవిని అధిష్ఠించడంపై నిషేధం ఎదుర్కొంటున్నారు. పైగా, ఆయన నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ)కు ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్ సైతం ఈసారి దూరమైంది. దాంతో ఆ పార్టీ తరఫున అభ్యర్థులందరూ స్వతంత్రులుగానే గెలిచారు. కాబట్టి ఏదో ఒక రిజిస్టర్డ్ పార్టీతో జతకడితే తప్ప... సాంకేతికంగా చూసినా, చట్టపరంగా చూసినా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఏ ఇతర పార్టీతోనూ కలిసేందుకు పీటీఐ ఇష్టపడక పోవడం పెద్ద ఇబ్బంది. మరోపక్క ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కోసం వివిధ పార్టీల మధ్య చర్చోపచర్చలు సాగుతున్నాయి. పీటీఐ పక్షాన గెలిచిన వారిలో కొందరు ఇప్పటికే గోడ దూకుతున్నట్టు వార్త. వేరొకపక్క ఎన్నికల్లో రిగ్గింగ్, కౌంటింగ్ ప్రక్రియలో తప్పులు సహా పలు అక్రమాలు జరిగాయంటూ పలువురు కోర్టుకెక్కుతున్నారు. వెరసి, జాతీయ ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చాయన్న మాటే కానీ... పాకిస్తాన్లో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు, చివరకు వాటి పర్యవసానాలు ఏమైనప్పటికీ... ఒకరకంగా ఈ ఎన్నికల్లో అసలైన విజేతలు సాధారణ పాకిస్తానీ ప్రజలు. సర్వశక్తిమంతమైన సైన్యం ఆ దేశంలో ప్రజా స్వామ్యం వేళ్ళూనుకోకుండా చేయడంలో పేరుమోసింది గనక ఎన్నికలు తూతూమంత్రమనీ, ప్రధాని ఎవరు కావాలన్నది మిలటరీ ముందే నిర్ణయించేసిందనే భావన నెలకొంది. అందుకు తగ్గట్టే, గతంలో సైన్యంతో సత్సంబంధాలు లేకపోవడంతో 1999లో పదవీచ్యుతుడైన నవాజ్ షరీఫ్ సరిగ్గా ఎన్నికల వేళకు ప్రవాసం నుంచి పాక్‌కు తరలివచ్చారు. వస్తూనే ఆయనపై ఆరోపణలన్నీ గాలికి పోయాయి. అలాగే ఒకప్పుడు సైన్యం సాయంతో గద్దెనెక్కి, ప్రస్తుతం దాని కరుణాకటాక్షాలకు దూరమైన ఇమ్రాన్, ఆయన పార్టీ అరెస్టులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పాక్‌లో అధికార వ్యవస్థకు పర్యాయపదంగా మారిన సైన్యం ఎన్నికల్ని రిగ్ చేయాలని చూసింది. ఇన్నింటి మధ్య కూడా ప్రజలు ధైర్యంగా ఓటేశారు. ప్రజాస్వామ్య ఆకాంక్ష పట్ల ఆశలు రేకెత్తించారు. ఇమ్రాన్‌ను పోటీకి దూరంగా ఉంచి, ఆ పార్టీని గద్దెనెక్కకుండా చేయాలన్న ఆర్మీ వ్యూహాలను ప్రజలు తిరస్కరించారు. తెర వెనుక నుంచి ఆడించేది ఆర్మీయే అని అంతర్జాతీయంగా అందరూ అనుకున్నా సామాన్యులకు నిన్న మొన్నటి వరకు ఆర్మీ పట్ల గౌరవం ఉండేది. కానీ, ప్రస్తుతం సైనిక జోక్యం పట్ల ప్రజలు సుముఖంగా లేరని తాజా ఎన్నికల ఫలితాలు తొలిసారిగా నిరూపించాయి. జాతీయ అసెంబ్లీలో నేరుగా ఎన్నికలు జరిగే 266 స్థానాల్లో ఎక్కువ సీట్లను ఇమ్రాన్ పార్టీ సమర్థించిన స్వతంత్రులే గెలిచారు. అతిపెద్ద పక్షంగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో నవాజ్ షరీఫ్ ‘పాకిస్తాన్ ముస్లిమ్ లీగ్ – నవాజ్’ (పీఎంఎల్–ఎన్), బిలావల్ భుట్టో ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’ (పీపీపీ) నిలిచాయి. హంగ్ పార్లమెంట్ ఏర్పడినా ప్రజాతీర్పు ఇమ్రాన్ వైపుందనేది స్పష్టం. దాన్ని తోసిపుచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. పీఎంఎల్–ఎన్, పీపీపీ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి కట్టాలని చర్చలు చేస్తున్నారు. పీటీఐ సైతం తమ సమర్థనతో గెలిచినవారంతా పార్లమెంట్లో కలసి కట్టు కూటమిగా నిలిచేందుకు ఏం చేయాలా అని చూస్తోంది. ఏమైనా, ఇప్పటికే పలు సంక్షోభాల్లో కూరుకుపోయిన పొరుగుదేశం దీర్ఘకాలిక రాజకీయ అనిశ్చితిలో కొనసాగడం వాంఛనీయం కాదు. రాగల రోజుల్లో సైన్యం పర్యవేక్షణలో పీఎంఎల్, పీపీపీల మధ్య కొత్త కూటమి ఏర్పాటుకై బేర సారాలు తప్పవు. పరస్పర ప్రయోజనాలే ప్రాతిపదికైన ఆ సర్కారైనా ఎంత స్థిరంగా ఉంటుందో ఊహించలేం. పాకిస్తానీ పెద్దలు ఇకనైనా ప్రజల భావావేశాలను గ్రహించాలి. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంది! ‘గులామీ న మంజూర్’ (బానిసత్వాన్ని సమర్థించబోము) అని వినిపిస్తున్న నినాదాల్నీ, మంగళవారం నుంచి పీటీఐ చేపట్టదలచిన నిరసనల్నీ కొట్టేయలేం. ‘ప్రజాస్వామ్య విక్రయానికి విపణి సిద్ధమైం’దన్న విమర్శల్ని నిజం చేస్తే అంత కన్నా ఘోరం లేదు. పేరుకు మిగిలిన ప్రజాస్వామ్యం, ఎన్నికల తర్వాత సైతం అనిశ్చితి నెలకొనడం... పాకిస్తాన్ ప్రజల పాలిట శాపం. సరిహద్దు సమస్యలు, మరోమారు తలెత్తిన మతపరమైన హింసాత్మక తీవ్రవాదం, ఆర్థికరంగ సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుతానికి పాక్ కథ సశేషమే! -
Pakistan Elections 2024: సంకీర్ణం దిశగానే పాక్...
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పారీ్టకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడం తెలిసిందే. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్) 75 సీట్లతో ఏకైక అతిపెద్ద పారీ్టగా నిలిచింది. బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీకి 54, ముత్తాహిదా ఖ్వామి మూవ్మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం–పీ)కి 17, ఇతరులకు 12 సీట్లొచ్చాయి. 101 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు గెలిచారు. ప్రభుత్వ ఏర్పాటు యత్నాల్లో నవాజ్ ముందంజలో ఉన్నారు.ఇతర పార్టీలతో చర్చల బాధ్యతను సోదరుడు షహబాజ్ షరీఫ్‌కు అప్పగించారు. ఆయన ఆదివారం ఎంక్యూఎం–పీతో ఆదివారం చర్చలు జరిపారు. అనంతరం కలిసి పని చేయాలని అంగీకారానికి వచి్చనట్లు సమాచారం. నవాజ్ షరీఫ్ పార్టీతోనే తమకు పొత్తు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నామని ఎంక్యూఎం–పీ నాయకుడు హైదర్ రిజ్వీ చెప్పారు. పీపీపీ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో కూడా షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే చర్చలు జరిపారు. కానీ ప్రధానమంత్రి పదవిని తన కుమారుడు బిలావల్ భుట్టోకే కట్టబెట్టాలని జర్దారీ షరత్ విధించారు. అందుకు పీఎంఎల్–ఎన్ అంగీకరించడం లేదు. పాకిస్తాన్లో పారీ్టల మధ్య పొత్తులు, ప్రభుత్వ ఏర్పాటుపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. నవాజ్ షరీఫ్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ కూడా మద్దతు పలుకుతున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 266 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అభ్యర్థి మరణంతో ఒక చోట పోలింగ్ వాయిదా పడింది. రిగ్గింగ్ ఆరోపణలతో కొన్ని స్థానాల్లో తుది ఫలితాలను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 133 సీట్లు అవసరం. సత్తా చాటిన ఇమ్రాన్ మద్దతుదారులు అవినీతి ఆరోపణలతో జైలుపాలైనా పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికల్లో సత్తా చాటారు. ఆయన పార్టీ అధికారికంగా పోటీలో లేదు. దాంతో ఆయన మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీ చేశారు. వారికి ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కూడా కేటాయించలేదు. అయినా జాతీయ అసెంబ్లీలో ఏకంగా 101 స్థానాలను గెలుచుకుని సత్తా చాటారు. ఈ ఫలితాలు తమకు నైతిక విజయమంటూ ఇమ్రాన్ జైలునుంచే ప్రకటన విడుదల చేశారు. -
పాక్‌లో ఎన్నికల కౌంటింగ్.. ఈసీ కీలక నిర్ణయం
పాకిస్తాన్లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోన్న వేళ పలు పోలింగ్ బూత్‌ల్లో రిగ్గింగ్ ఆరోపణలు తీవ్రమయ్యాయి. దీంతోపై పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 40 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ప్రకటించింది. ఈ నెల15వ తేదీన 40 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తామని పేర్కొంది. దేశ 12వ సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతన్న నేపథ్యంలో ఈసీ రీపోలింగ్ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలుపాలవడమే గాక పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఎన్నికల గుర్తూ రద్దవడంతో స్వతంత్రులుగా బరిలో దిగిన ఆయన మద్దతుదారులు సుమారు 93 స్థానాల్లో విజయం సాధించగా ఫలితాల కౌంటింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 73 సీట్లు సాధించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్), 54 సీట్లొచ్చిన బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరోసారి చేతులు కలిపాయి. ఇప్పటి వరకు 256 స్థానాల్లో ఈసీ ఫలితాలను విడుదల చేసింది. తాజాగా ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పార్టీల్లో సీట్ల సంఖ్యలో మార్పులు చోటుచేసుకోనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: పాక్‌లో సంకీర్ణం..! -
పాక్‌లో సంకీర్ణం..!
ఇస్లామాబాద్/లాహోర్: పాకిస్తాన్లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలుపాలవడమే గాక పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ ఎన్నికల గుర్తూ రద్దవడంతో స్వతంత్రులుగా బరిలో దిగిన ఆయన మద్దతుదారులు 100 స్థానాల్లో నెగ్గి ప్రబల శక్తిగా ఆవిర్భవించారు. అయితే 73 సీట్లు సాధించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్), 54 సీట్లొచ్చిన బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరోసారి చేతులు కలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు అవసరం కాగా ఆ రెండింటికి కలిపి 127 స్థానాలున్నాయి. శుక్రవారం రాత్రే పలు దఫాలుగా చర్చోపచర్చలు జరిపి ప్రభుత్వ ఏర్పాటుకు చేతులు కలిపేందుకు పీఎంఎల్, పీపీపీ అంగీకారానికి వచ్చాయి. మెజారిటీ సాధనకు 28 స్థానాల్లో నెగ్గిన చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం శనివారమంతా జోరుగా మంతనాలు సాగాయి. నవాజ్ ప్రయత్నాలు ఫలిస్తే రికార్డు స్థాయిలో నాలుగోసారి పాక్ ప్రధాని అవుతారు. అయితే ప్రధానిగా బిలావల్కే అవకాశమివ్వాలని పలువురు పీపీపీ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తుండటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది! కాకపోతే సైన్యం దన్ను నవాజ్‌కు కలిసొస్తుందంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయన ఇచ్చిన పిలుపుకు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా మద్దతు పలకడం విశేషం. ‘‘రాజకీయ సుస్థిరత పాక్‌కు తక్షణావసరం. అందుకు ప్రజాస్వామిక శక్తులన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఏకీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి’’ అని శనివారం ఒక ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు! నవాజ్ పేరుకు పీపీపీ ఒప్పుకోని పక్షంలో బిలావల్‌కు అవకాశమిచ్చేందుకు పీఎంఎల్ కూడా అంగీకరించే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు. మధ్యేమార్గంగా మరోసారి నవాజ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ పేరును ప్రధాని పదవికి ప్రతిపాదించవచ్చని చెబుతున్నారు. దీనికి సైన్యం నుంచి కూడా అభ్యంతరం ఉండకవపోచ్చన్నది రాజకీయ వర్గాల మాట. యథేచ్ఛగా అక్రమాలు! మొత్తం 265 జాతీయ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసి రెండు రోజులు దాటినా 10 చోట్ల ఇంకా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఎన్నికల ఫలితాల వెల్లడి విపరీతంగా ఆలస్యమవుతుండటంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. నిజానికి తమకే మెజారిటీ సమకూరిందని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. కానీ అక్రమంగా ఫలితాలను పీఎంఎల్‌కు అనుకూలంగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఫలితాల వెల్లడిలో జాప్యం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. గత ఏడాది మే నెలలో సైనిక స్థావరాలపై దాడులకు సంబంధించిన 12 కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ సహా పాక్ మాజీ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీలకు ఉగ్రవాద నిరోధక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్ వర్గీయులైన స్వతంత్ర అభ్యర్థులు ఎక్కవ మంది గెలిచిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో అప్పట్లో నిరసనలు చెలరేగాయి. ఆ హింసాత్మక ఘటనల్లో రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంతో సహా 20కి పైగా సైనిక స్థావరాలు, రాష్ట్ర భవనాలు దెబ్బతిన్నాయి. ఈ నిరసనలకు సంబంధించిన కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)కి చెందిన పలువురు నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు కోర్టు పదేళ్ల జేలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీకి కూడా కోర్టు పదేళ్ల జైలు శిక్షవిధించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 8న పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ వర్గీయులకు ఊహించని ప్రజా మద్దతు లభించింది. మెజారిటీ మార్కు 133 కాగా పీటీఐ 97 సీట్లు నెగ్గి ఏకైక పెద్ద పార్టిగా నిలిచింది. ఇమ్రాన్ జైలుపాలై పోటీకే దూరమైనా, ఎన్నికల గుర్తు రద్దై అభ్యర్థులంతా స్వతంత్రులుగా నానారకాల గుర్తులపై పోటీ చేయాల్సి వచ్చినా దేశవ్యాప్తంగా వారి జోరు కొనసాగడం విశేషం. నవాజ్ పార్టికి 66, బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టికి 51 స్థానాలు దక్కాయి. మిగతా పార్టిలకు 24 సీట్లొచ్చాయి. ఇదీ చదవండి: Pakistan Elections 2024: ‘పాక్’ ఫలితాల మధ్య ఇమ్రాన్ ‘విక్టరీ స్పీచ్’ -
పాక్ ప్రధాని పదవికి నవాజ్ రెండు ప్లాన్లు?
పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒక అంచనాకు వచ్చాయి. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు పొందిన స్వతంత్ర అభ్యర్థులకు భారీ ప్రజా మద్దతు లభించింది. పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు 99 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ‘నూన్ లీగ్’గా పేరొందిన నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’కి చెందిన 71 మంది ఎంపీల విజయంతో ఇది అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పాక్‌లో సంకీర్ణం ఏర్పడే పరిస్థితులు తలెత్తడంతో నవాజ్ షరీఫ్ తాజాగా రెండు ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్లాన్ ‘ఏ’ నవాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన సోదరుడు పాకిస్తాన్ మాజీ ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను సహాయకునిగా నియమించారు. ఇతను ఇప్పటికే ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్ భుట్టోతో మంతనాలు జరిపారు. వీరు లాహోర్‌లోని షరీఫ్ కుటుంబాన్ని కలుసుకోనున్నారు. దీనితోపాటు నవాజ్ షరీఫ్ మరికొన్ని పార్టీలతో మ్యాజిక్ ఫిగర్ రాబట్టేందుకు చర్చలు జరుపుతున్నారని సమాచారం. ప్లాన్ ‘బి’ మరోవైపు నవాజ్ షరీఫ్ 60 మంది స్వతంత్ర ఎంపీలతో టచ్‌లో ఉన్నారని ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు ఇస్తున్న స్వతంత్ర ఎంపీలు తెలిపారు. వీరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు నవాజ్, ఆయన కుమార్తె మరియం నవాజ్ ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. -
పాక్ ప్రధానిగా స్వతంత్ర అభ్యర్థి?
పాకిస్తాన్ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాల్లో ముందంజలో ఉండటం రాజకీయ పండితులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాక్‌లో గత 24 గంటలుగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జాతీయ అసెంబ్లీలోని మొత్తం 266 స్థానాలకుగాను స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటి వరకు దాదాపు 99 స్థానాల్లో విజయం సాధించారు. ఈ స్థానాల్లో చాలా వరకు ఇమ్రాన్ ఖాన్ మద్దతు కలిగిన స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. పీఎంఎల్ఎన్ (పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్) 71 సీట్లు, పీపీపీ (పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ) 53 సీట్లు గెలుచుకున్నాయి. ఇంకా కొన్ని సీట్ల ఫలితాలు రావాల్సి ఉంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల సంఖ్య అధికంగా ఉండటంతో పాకిస్తాన్లో తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థుల ప్రభుత్వం ఏర్పడనుండే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మెజారిటీ మార్కును తాకకపోవడంతో పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు నవాజ్ షరీఫ్ ప్రకటించారు. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పీటీఐ మద్దతు కలిగిన అభ్యర్థులు మెజారిటీతో గెలిస్తే, వారు తమ సొంత గ్రూపును ఏర్పాటు చేసి, దానికి ఇన్సాఫ్ గ్రూప్ లేదా మరేదైనా పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
‘పాక్’ ఫలితాల మధ్య ఇమ్రాన్ ‘విక్టరీ స్పీచ్’
పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడబోతున్నదనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అటు ఇమ్రాన్‌ఖాన్.. ఇటు నవాజ్ షరీఫ్ విజయం తమదేనని చెబుతున్నారు. ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడంపై పాకిస్తాన్ ఎన్నికల సంఘంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ మాజీ ప్రధాని, ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (సీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఏఐ ఆధారిత ‘విక్టరీ స్పీచ్’ను విడుదల చేశారు. ఈ ప్రసంగంలో ఆయన ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్’ (పిఎంఎల్-ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ ‘లండన్ ప్లాన్’ విఫలమైందని, పోలింగ్ రోజున ఓటర్లు ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో ‘నా ప్రియమైన దేశప్రజలారా.. ఇంత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని, మీ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నారు. పౌర స్వేచ్ఛను పునరుద్ధరించడానికి మీరు పునాది వేశారు. నేను కూడా ఓటు వేశాను. ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించేందుకు మీరు సహాయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు నా నమ్మకాన్ని నిలబెట్టారు. ఎన్నికల్లో భారీ ఓటింగ్ చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. మీరంతా ప్రజాస్వామ్య కసరత్తులో చురుకుగా పాల్గొనడం వల్ల ‘లండన్ ప్లాన్’ విఫలమైంది’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఇమ్రాన్ జైలులో ఉన్నా.. పాక్ యువత ఎందుకు మద్దతు పలికింది? -
పాక్ యువతకు ఇమ్రాన్ ‘అవినీతి’ పట్టలేదా?
పాకిస్తాన్లో నేషనల్ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం పలు అవినీతి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు కలిగిన స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్లుగా కనిపిస్తున్నారు. నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మూడో స్థానంలో ఉంది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. వీటిలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పలు వార్తా సంస్థల కథనాల ప్రకారం పాకిస్తాన్ యువ ఓటర్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి మద్దతు పలికారు. దీని వెనుకనున్న కారణమేమిటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ జైల్లో ఉన్నారు. ఈ నేపధ్యంలో అతని పార్టీ పేరు, గుర్తును రద్దు చేశారు. అయితే ఈ పార్టీకి చెందిన నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగారు. వీరు స్వతంత్ర అభ్యర్థుల కంటే మెరున ఫలితాలు దక్కించుకోవడం విశేషం. 2022లో ఇమ్రాన్‌ఖాన్‌ను అధికారం నుంచి తొలగించారు. ఆయనపై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. 2023 ఆగస్టులో ఇమ్రాన్‌ను జైలుకు తరలించారు. దీనితోపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ ఖాన్‌పై కొన్నాళ్ల పాటు నిషేధం విధించారు. అయితే ఈ ఎన్నికల్లో పాక్ యువత ఇమ్రాన్‌కు మద్దతు పలికింది. పాక్‌లో సైనిక మద్దతుతో అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువ ఓటర్లు ఇమ్రాన్‌కు అండగా నిలిచారు. అయితే ఈ వాదనను పాక్ ఆర్మీ ఖండించింది. మరోవైపు రాజకీయాలలో మిలటరీ ప్రమేయంపై పాక్ యువతకు అవగాహన ఏర్పడిన కారణంగా వారు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు ఓటు వేశారని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం పెరగడం, ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకు పంపడంపై పాక్ యువత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. పాక్‌కు చెందిన న్యాయ విద్యార్థి నైలా ఖాన్ మార్వాత్ మాట్లాడుతూ ‘నేను 2016లో పీటీఐ పార్టీలో చేరాను. 2018లో నా మొదటి ఓటు ఈ పార్టీకే వేశాను. ఇమ్రాన్ ఖాన్ మాటలు నన్ను, నా సహోద్యోగులను ఎంతగానో ఉత్సాహపరిచాయి. నెల్సన్ మండేలా లాంటి పలువురు నేతలు జైలులో ఉంటూనే తమ సత్తా చాటారు’ అని పేర్కొన్నారు. -
Pakistan General Elections 2024: పాకిస్తాన్లో హంగ్
ఇస్లామాబాద్/లాహోర్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో హంగ్ నెలకొంది. గురువారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టికీ స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు. పోరు ఏకపక్షమేనని, సైన్యం దన్నుతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్) విజయం ఖాయమని వెలువడ్డ ముందస్తు అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. శుక్రవారం రాత్రికల్లా ఫలితాల సరళి దాదాపుగా ముగింపుకు వచ్చింది. మెజారిటీ మార్కు 133 కాగా పీటీఐ 97 సీట్లు నెగ్గి ఏకైక పెద్ద పార్టిగా నిలిచింది. ఇమ్రాన్ జైలుపాలై పోటీకే దూరమైనా, ఎన్నికల గుర్తు రద్దై అభ్యర్థులంతా స్వతంత్రులుగా నానారకాల గుర్తులపై పోటీ చేయాల్సి వచ్చినా దేశవ్యాప్తంగా వారి జోరు కొనసాగడం విశేషం. నవాజ్ పార్టికి 66, బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టికి 51 స్థానాలు దక్కాయి. మిగతా పార్టిలకు 24 సీట్లొచ్చాయి. మరో 27 స్థానాల ఫలితాలు వెల్లడవాల్సి ఉంది. పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 336 కాగా 266 సీట్లకే ఎన్నికలు జరుగుతాయి. మహిళలకు, మైనారిటీలకు రిజర్వు చేసిన 70 సీట్లను పార్టీలు గెలుచుకునే స్థానాల ఆధారంగా వాటికి దామాషా పద్ధతిలో కేటాయిస్తారు. ఒక అభ్యర్థి మృతి నేపథ్యంలో ఈసారి 265 స్థానాల్లో పోలింగ్ జరగ్గా ఇప్పటిదాకా 238 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానికి తోడు ఫలితాల వెల్లడి విపరీతంగా ఆలస్యమవుతుండటంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల అధికారులే ఫలితాలను పీఎంఎల్‌కు అనుకూలంగా మార్చేస్తున్నారని పీటీఐ దుమ్మెత్తిపోస్తోంది. లాహోర్ స్థానంలో చాలాసేపటిదాకా వెనకబడి ఉన్న నవాజ్ చివరికి మంచి మెజారిటీతో నెగ్గినట్టు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాహోర్‌లోని మరో మూడు స్థానాల్లో ఆయన కూతురు, సోదరుడు, మరో బంధువు గెలిచినట్టు ఈసీ ప్రకటించింది. అయితే మరో స్థానంలో మాత్రం పీటీఐ మద్దతుతో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి చేతిలో నవాజ్ ఓటమి చవిచూడటం విశేషం. ఈ నేపథ్యంలో పీటీఐ ప్రదర్శనను షరీఫ్ అభినందించడం విశేషం. కాకపోతే పీఎంఎల్ అత్యధిక స్థానాల్లో నెగ్గి అతి పెద్ద పార్టిగా అవతరించిందని ఆయన చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాల రీత్యా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటూ పిలుపునిచ్చారు. పీటీఐ చైర్మన్ గోహర్ ఖాన్ మాత్రం ఏ పార్టితోనూ పొత్తు పెట్టుకోబోమంటూ కుండబద్దలు కొట్టారు. స్వతంత్రులుగా నెగ్గిన ఆ పార్టీ అభ్యర్థులకు ఎర వేసి లాక్కునేందుకు పీఎంఎల్ జోరుగా ప్రయతి్నస్తోందని వార్తలొస్తున్నాయి. -
నవాజ్ షరీఫ్ సంచలన ప్రకటన
పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల వేళ నెలకొన్న గందరగోళం నడుమ.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మీడియా ముందుకు వచ్చారు. అశేష సంఖ్యాక మద్దతుదారుల నడుమ.. తమ పార్టీ పీఎంఎల్-ఎన్(పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్) ఘన విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. అయితే.. పాక్ ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేయకముందే.. షరీఫ్ స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాదు.. అత్యధిక స్థానాలు తమ పార్టీ కైవసం చేసుకుందని తెలిపిన ఆయన.. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన బలం లేదని, సంక్షోభంతో గాయపడ్డ పాక్‌ను పునరుద్ధరించేందుకు మిగతా పార్టీలు ముందుకు రావాలని.. ప్రభుత్వ ఏర్పాటులో సహకరించాలని కోరడం గమనార్హం. ఇందుకోసం పీపీపీ(Pakistan Peoples Party) నేత పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారినీ సైతం ఆయన ఆహ్వానించారు. అంటే పాక్ ఎన్నికల ఫలితాలు దాదాపు హంగ్ అనే సంకేతాను షరీఫ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. అంతేకాదు.. ప్రపంచంతో సంబంధాలు బలోపేతం కోసం త్వరలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారాయన. #WATCH | Lahore | Former Pakistan PM and Pakistan Muslim League (N) leader Nawaz Sharif says, "...We want our relations with the world to be better...We will improve our relations with them and resolve all our issues with them..." (Video: Reuters) pic.twitter.com/MJbxcV2Dox — ANI (@ANI) February 9, 2024 Lahore | Former Pakistan PM and Pakistan Muslim League (N) leader Nawaz Sharif says, "We congratulate you all because, with God's blessings, Pakistan Muslim League (N) has emerged as the largest party...We respect the mandate given to every party...We invite them to sit with us… pic.twitter.com/im2DqIDeRG — ANI (@ANI) February 9, 2024 కానీ, ఎన్నికల్లో పీఎల్‌ఎం-ఎన్ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుందనేది షరీఫ్ స్పష్టంగా చెప్పలేదు. మొత్తం 366 స్థానాలు ఉన్న పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రస్తుతం 265 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 133 సీట్లు రావాలి. అయితే.. పాక్ ఈసీ ప్యానెల్లో మాత్రం పీఎంఎల్-ఎన్ 61 స్థానాల దగ్గరే ఉందని తెలుస్తోంది. అయితే పాక్‌లో ఎన్నికల ఫలితాలపై.. ప్రభుత్వ ఏర్పాటుపై శనివారం ఒక స్పష్టత రావొచ్చు. ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ పీటీఐ మద్దతుదారులు(స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి) అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నట్లు రోజంతా ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. అయితే ఈసీ మాత్రం ఇటు షరీఫ్ ప్రకటనను.. అటు ఇమ్రాన్ మద్దతుదారుల ప్రకటనను దేనిని ధృవీకరించకపోవడం గమనార్హం. సంబంధిత వార్త: నెట్ కట్ చేస్తే.. ట్విస్టులు.. ఝలక్‌లు -
పాక్ కౌంటింగ్ వేళ.. ట్విస్టులు, ఝలక్‌లు!!
పాకిస్థాన్‌లో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ.. అయోమయం, గందరగోళం నెలకొంది. అక్కడ హింస చెలరేగినట్లు సోషల్ మీడియాలో ఉవ్వెత్తున్న ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (PTI) పార్టీని పోటీ చేయకుండా.. కనీసం గుర్తు క్రికెట్ బ్యాట్‌ను వినియోగించకుండా అక్కడి ఎన్నికల సంఘం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఖాన్ మద్దతుదారులు.. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటున్నట్లు సమాచారం. ఫలితాల ప్రకటనలో జాప్యం.. ఫలితాల తారుమారు చేసేందుకేనంటూ పీటీఐ ఆందోళనకు దిగగా.. ఆందోళనకారులపై ఆర్మీ, అక్కడి పోలీసు బలగాలు దాడులకు తెగబడినట్లు ప్రచారం నడుస్తోంది. కాల్పుల్లో పలువురు మరణించినట్లు.. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు ఫొటోలు, వీడియోల్ని వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ఆర్మీ రిగ్గింగ్‌కు దిగిందంటూ కొన్ని వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. పాకిస్థాన్ ఎన్నికల సంఘం మాత్రం ఎవరు ఆధిక్యంలో ఉన్నారో అధికారికంగా ప్రకటించలేదు. అయితే కొందరు మాత్రం నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ వెనుకంజలో ఉందని(షరీఫ్ మాత్రం గెలిచారు).. ఖాన్ మద్దతుదారులు విజయ దుందుభి మోగిస్తున్నట్లు పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అయితే పీఎంఎల్-ఎన్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తోంది. షరీఫ్ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమంటూ ఆయన వర్గీయులు ప్రచారానికి దిగగా.. ఇమ్రాన్ ఖాన్ పేరిట ఎన్నికల్లో నెగ్గుతున్న అభ్యర్థులు సైతం తమకే మద్దతు ఇస్తారంటూ పీఎంఎల్-ఎన్ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. Social media is flooded with hundreds of such rigging videos. What other evidence could there be than a present on-duty police officer involved in rigging? #ElectionResultspic.twitter.com/eps8QWQ9WX — Usama Butt 🇵🇰 🇬🇧 (@OsamaAhmedButt) February 9, 2024 పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇప్పటికే సగానికిపైగా సీట్లు సాధించినట్లు పోస్టులు కనిపిస్తున్నాయి. I have never seen visuals like these in Bahawalpur in my whole life - not even on 9th May.#ElectionResults pic.twitter.com/yU0fumVsEM — نورالہدی 🇵🇰 (@raqsyjunoon) February 9, 2024 ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లో గురువారం సాయంత్రం ఎన్నికలు ముగియగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తొలి ఫలితాన్ని (Pak Poll Results) ప్రకటించారు. పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సమియుల్లా ఖాన్ గెలుపొందినట్లు ఈసీపీ ప్రత్యేక కార్యదర్శి జాఫర్ ఇక్బాల్ మీడియాకు వెల్లడించారు. అయితే.. ఆ తర్వాత ఏం ఫలితాల వెల్లడిని నిలిపివేశారు. یہ توقع نہیں تھی کہ ہماری فوجی جوان اس ناکارہ عمل کا کھلم کھلا حصہ بنے گے pic.twitter.com/sp8yWUuyfC — Sabir Shakir ARY 𝓯𝓪𝓷𝓼 (@ARYSabiirShakir) February 9, 2024 కొన్ని గంటల తర్వాత తిరిగి ప్రకటించడం ప్రారంభించారు. అయితే.. ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ (ECP)’ కావాలనే ఫలితాలను ఆలస్యం చేస్తోందని పీటీఐ ఆరోపించింది. మరోవైపు జాప్యంపై పాక్ హోంశాఖ వివరణ ఇచ్చింది. భద్రతా కారణాలు, కమ్యూనికేషన్ లోపం కారణంగానే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని తెలిపింది. ఓటింగ్ ప్రారంభానికి ముందు గురువారం ఉదయం 8 గంటల నుంచి పాక్ కేర్‌టేకర్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్, మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. వాటిని ఇంకా పునరుద్ధరించకపోగా.. కొందరు మాత్రం పాక్‌లో ఇదీ పరిస్థితి అంటూ నెట్లో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. -
Pakistan Elections: పాకిస్తాన్లో ఓట్ల లెక్కింపు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తీవ్ర ఆరోపణలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నెమ్మదిగా సాగుతోంది. దీంతో ఫలితాల వెల్లడి మరింత ఆలస్యం కానుంది. అయితే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికలకు ముందు రిగ్గింగ్, అణచివేత సంఘటనలు ఎదురైనప్పటికీ పాకిస్థాన్ ప్రజలు తమవైపే నిలిచినట్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పేర్కొంది. ప్రతి ఫలితం తామే అఖండ మెజారిటీతో గెలవబోతున్నట్లు సూచిస్తున్నాయంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో తమ పోలింగ్ ఏజెంట్లు అందుకున్న ఫారం 45 కాపీల ప్రకారం తాము అధిక మెజారిటీతో గెలుపొందబోతున్నట్లు పీటీఐ పార్టీ పేర్కొంది. అయితే, రిటర్నింగ్ అధికారులు ఇప్పుడు ఫారం 47 ఉపయోగించి ఫలితాలను తారుమారు చేస్తున్నారని ఆరోపించింది. ఈమేరకు పీటీఐ పార్టీ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక ప్రకటన విడుదల చేసింది. "పాకిస్తాన్ ప్రజల స్పష్టమైన తీర్పును తారుమారు చేస్తున్నారని ప్రపంచమంతా తెలుసుకోవాలి. ఎన్నికలకు ముందు రిగ్గింగ్, అణచివేత సంఘనలు జరిగిప్పటికీ, పోలింగ్ రోజున భారీ ఓటింగ్ జరిగింది. ప్రతి ఫలితం పీటీఐ భారీ గెలుపును సూచిస్తోంది. ఫారం 45లే ఎన్నికల ఫలితాలకు ప్రాథమిక మూలం. మా పోలింగ్ ఏజెంట్లు అందుకున్న ఆ ఫారం కాపీలు మేము భారీ మెజారిటీతో గెలిచినట్లు చూపుతున్నాయి. అయితే రిటర్నింగ్ అధికారులు ఇప్పుడు ఫారం 47లతో ఫలితాలను తారుమారు చేస్తున్నారు" అని పేర్కొంది. పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేసి నకిలీ ఫారం 45లపై సంతకం చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని పీటీఐ పార్టీ ఆరోపించింది. రిగ్గింగ్‌కు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ తెలిపింది. రిగ్గింగ్ ఎన్నికలను పాకిస్థాన్ ప్రజలు అంగీకరించరని పేర్కొంది. ఫలితాల ట్రెండ్స్‌లో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ జోరు నెమ్మదిగా విడుదలవుతున్న ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్ పార్టీ జోరు కనబరుస్తోంది. ప్రస్తుతానికి విడుదలైన ఫలితాల్లో ఇమ్రాన్ ఖాణ్ పార్టీ ఐదు స్థానాల్లో గెలిచి ముందంజలో ఉంది. నవాజ్ షరీఫ్ పీఎంఎల్ నాలుగు స్థానాల్లో విజయం సాధించగా, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఒక స్థానం ఆధిక్యంలో ఉంది. కాగా, పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉండగా, 266 స్థానాలకు మాత్రమే నేరుగా ఎన్నికలు నిర్వహించగా 265 చోట్లే పోలింగ్ జరిగింది. కనీసం 133 సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. మిగతా 70 సీట్లను మైనార్టీలు, మహిళలకు కేటాయించారు. -
జైలు నుంచే పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ ఓటు!
పాకిస్తాన్‌కు త్వరలో కొత్త ప్రధాని ఎన్నికకానున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీకి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఇమ్రాన్ ఖాన్‌తో పాటు జైలులో ఉన్న ఇతర రాజకీయ ప్రముఖులు జైలు నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ ఓటు వేయలేకపోయారు. బుష్రా అరెస్ట్ అయ్యే సమయానికి పోస్ట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మెయిల్ ద్వారా ఓటు వేసిన వారిలో మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చౌదరి పర్వేజ్ ఎలాహి, అవామీ ముస్లిం లీగ్ చీఫ్ షేక్ రషీద్, సమాచార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కూడా ఉన్నారని అడియాలా జైలు వర్గాలు తెలిపాయి. అడియాలా జైలులో 100 మంది ఖైదీలు ఓటు వేయనున్నారు. జైలులోని 7,000 మంది ఖైదీల్లో ఒక శాతం మంది మాత్రమే ఓటువేయనున్నారు. కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ ఉన్న ఖైదీలను మాత్రమే ఓటు వేయడానికి జైలు అధికారులు అనుమతించించారు. -
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు.. అప్డేట్స్
Updates ► ఎన్నికల నేపథ్యంలో పాక్‌లో నేడు మొబైల్ సేవలను నిలిపివేశారు. భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. Pakistan's Interior Ministry temporarily suspends mobile services across the country in light of the deteriorating security situation, reports local media Parliamentary general elections are underway in Pakistan. — ANI (@ANI) February 8, 2024 ► ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్లు గుమిగూడారు. #WATCH | Voters arrive at a polling booth in Islamabad, as parliamentary general elections get underway in Pakistan. (Source: Reuters) pic.twitter.com/twAWVomysU — ANI (@ANI) February 8, 2024 ► పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలకు నేడు పోలింగ్ ప్రారంభమైంది. #WATCH | Parliamentary general elections get underway in Pakistan. (Video Source: Reuters) pic.twitter.com/BeSNFGKR4r — ANI (@ANI) February 8, 2024 పెచ్చరిల్లిన హింస, పెట్రేగిన ఉగ్రదాడులు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్లో గురువారం సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మాజీ ప్రధానిఇమ్రాన్‌ఖాన్ ఊచలు లెక్కపెడుతున్న వేళ ఆరేళ్ల ప్రవాసం నుంచి తిరిగొచ్చిన మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యం దన్నుతో అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే 74 ఏళ్ల షరీఫ్ రికార్డుస్థాయిలో నాలుగోసారి పాక్ ప్రధాని అవుతారు. Pakistan Election Day: Polarization, violence, and dire challenges ahead Read @ANI Story | https://t.co/58OXNzvgJt #PakistanElection #Pakistan pic.twitter.com/LgDvQkxuVe — ANI Digital (@ani_digital) February 8, 2024 నవాజ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ పార్టీ అత్యధిక సీట్లు సాధించేలా కన్పిస్తోంది. ఇమ్రాన్ పార్టీ పీటీఐ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్‌పై ఈసీ నిషేధం విధించింది. దాంతో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలో దిగారు. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) సైతం ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 12.85 కోట్ల ఓటర్లు ఈసారి ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోనున్నారు. #WATCH | Delhi: On the unrest in Pakistan ahead of the country's upcoming Parliamentary Elections, Defence Expert Qamar Agha says, "The result of these elections is pre-decided, right from who will be the Prime Minister to how many seats will each party win. If you see there are… pic.twitter.com/kBku35WXQ4 — ANI (@ANI) February 8, 2024 బుధవారమే బలూచిస్తాన్ ప్రావిన్స్న్స్లో ఉగ్రవాదులు జంట బాంబుదాడులతో పదుల సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకున్న నేపథ్యంలో 6.5 లక్షల మంది భద్రతా సిబ్బందితో పోలింగ్స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టంచేశారు. నేషనల్ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికల్లో ఈసారి 5,121 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 336 సీట్లకుగాను 266 సీట్లకు బుధవారం పోలింగ్ జరగనుంది. మరో 60 సీట్లు మహిళలకు రిజర్వ్‌చేశారు. మరో 10 సీట్లు మైనారిటీలకు రిజర్వ్‌చేశారు. ఇంకొన్ని సీట్లు పార్టీలు గెలిచిన సీట్లను బట్టి దామాషా పద్ధతిలో కేటాయిస్తారు. -
పాక్‌లో ఎన్నికల ప్రహసనం
సైన్యం పడగనీడలో ఎన్నికల తంతుకు పాకిస్తాన్ సిద్ధమైంది. జాతీయ అసెంబ్లీకి గురువారం జరిగే పోలింగ్‌లో గెలిచేదెవరో ఎవరూ నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు. అయితే ఎప్పటిలాగే అక్కడ ప్రజాస్వామ్యం ఓటమి పాలవటం ఖాయమన్నది విశ్లేషకుల జోస్యం. 2018లో జరిగిన ఎన్నికల్లో కేవలం తన దయాదాక్షిణ్యాలతో అధికారంలోకొచ్చి తననే ధిక్కరించిన మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సైన్యం ఆగ్రహంతో వుంది. ఫలితంగా పదవి కోల్పోయి రెండు అవినీతి కేసుల్లో పదేళ్లు, పద్నాలుగేళ్ల్ల చొప్పున శిక్షపడి ఆయన జైలుపాలయ్యారు. చట్టవిరుద్ధంగా పెళ్లాడిన కేసులో మరో ఏడేళ్ల శిక్ష కూడా పడింది. భార్య సైతం ఈ కేసులో జైలుకు పోయారు. ఎలాగైతేనేం సకాలంలోనే ఎన్నికల తంతు మొదలైంది. ఇమ్రాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రికే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఏటికి ఎదురీదుతోంది. పీటీఐకి న్యాయస్థానాల పుణ్యమా అని బ్యాట్ గుర్తు గల్లంతుకాగా, పార్టీ అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగా బరిలో వున్నారు. పీటీఐ అభ్యర్థినని చెప్పుకున్నవారిని సైన్యం అరెస్టు చేసింది. వారి ఇళ్లపై దాడులకు తెగబడింది. అభ్యర్థులు నామినేషన్ వేసిన వెంటనే అజ్ఞాతంలోకి పోగా, ప్రచారంలో పాల్గొంటున్న అభ్యర్థుల కుటుంబాలకు సైతం వేధింపులు తప్పలేదు. కొందరు అభ్యర్థులు పీటీఐతో తెగదెంపులు చేసుకున్నామని ప్రకటించి, బతుకుజీవుడా అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో మొన్న జరిగిన పీటీఐ ఎన్నికల ప్రచారసభలో వేదికపై రెండు డజన్లమంది బిక్కుబిక్కుమని కూర్చోగా, ఆ సభకు కనీసం మైక్ పెట్టుకునేందుకు కూడా అనుమతి ఇవ్వలేదనీ, పోస్టర్లు వేయనీయలేదనీ ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కథనం. యధాప్రకారం ఇక్కడి అభ్యర్థి కూడా కేసుల్లో చిక్కుకుని పరారీలో వున్నాడు. ఇమ్రాన్ ఖాన్‌ను అందలం ఎక్కించిన 2018 నాటి ఎన్నికల్లో కూడా ఆయన ప్రత్యర్థులను సైన్యం వేధించిందిగానీ, పాక్ 76 ఏళ్ల చరిత్రలో ఇంతటి అణచివేత ఎప్పుడూ లేదని పౌరసమాజ కార్యకర్తలు చెబుతున్నారు. నిరుడు ఏప్రిల్‌లో పదవీభ్రష్టుడయ్యాక ఆయన సైన్యాన్ని తూర్పారపట్టడం మొదలెట్టారు. రాజకీయ నేతలకు సైన్యంపై ఎంతటి ఆగ్రహావేశాలున్నా దాన్ని ‘అధికార వ్యవస్థ’ పదం చాటున నిందించటం అలవాటు. ఇమ్రాన్ ఆ సంప్రదాయానికి స్వస్తిపలికారు. నేరుగా సైన్యాన్నీ, దాని అధినేతలనూ ఉద్దేశిస్తూ దూషించారు. పైగా నిరుడు మే నెలలో ఇమ్రాన్‌కు అనుకూలంగా పీటీఐ నిర్వహించిన ర్యాలీలో హింస చోటుచేసుకుంది. ఊహకందని రీతిలో సైనిక కార్యాలయాలపైనా, సైనిక ఉన్నతాధికారుల నివాసాలపైనా యువజనం దాడులకు పాల్పడ్డారు. ఇవన్నీ సైన్యానికి ఆగ్రహం కలిగించాయి. తమ దయతో అందలం ఎక్కినవాడు తమనే సవాలు చేయటం సైనికాధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. రంగంలో వున్న రెండు ప్రధాన పక్షాలు– మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్–ఎన్), మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో ఆధ్వర్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మాత్రం స్వేచ్ఛగా ప్రచారం చేసుకోగలిగాయి. ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీవుండటం ఆనవాయితీ. ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ నెగ్గిన 2018 ఎన్నికలొక్కటే దీనికి మినహాయింపు. చెప్పాలంటే ఇతరులకన్నా పీపీపీ చాలా ముందుగా ఎన్నికల బరిలోకి దిగింది. విస్తృతంగా ప్రచారం చేసింది. మొదట్నుంచి బలంగా వున్న సింద్ ప్రాంతంలో ఈసారి ఆ పార్టీ బలహీనపడింది. ప్రచారావకాశాలు బొత్తిగా లేని పీటీఐకి యువత బలమైన శక్తిగా వున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వారు సాగిస్తున్న ప్రచారం రెండు పార్టీలనూ బెంబేలెత్తిస్తున్నది. పాకిస్తాన్లో మరీ ముఖ్యంగా... బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వాల్లో భారీయెత్తున హింస చోటుచేసుకున్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించటాన్నిబట్టి ఈ ఎన్నికల సరళి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులకు ఈసారి పెద్దగా చోటు దక్కలేదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ అంటున్నది. ఈ విషయంలో మీ సంజాయిషీ ఏమిటని పాకిస్తాన్ ఎన్నికల సంఘానికి ఆ సంస్థ తాఖీదులు పంపింది. పాకిస్తాన్ పార్లమెంటులో మహిళా కోటా 22 శాతం వుంది. దీంతోపాటు చట్టప్రకారం ప్రతి పార్టీ మహిళలకు తప్పనిసరిగా 5 శాతం స్థానాలు కేటాయించాలి. అయితే ప్రధాన పార్టీలు మూడూ ఈ విషయంలో మొహం చాటేశాయి. ఎన్నికలు, గెలుపోటముల సంగతలావుంచితే... రాబోయే ప్రభుత్వానికి చాలా సవాళ్లున్నాయి. నిరుడు మే నెలలో పాకిస్తాన్ దాదాపు దివాలా అంచులకు చేరింది. ఆఖరి నిమిషంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) 300 కోట్ల డాలర్ల రుణం అందించి ఆదుకుంది. ఆ సాయం కూడా వచ్చే నెలాఖరుతో ఆగిపోతుంది. దాన్ని పొడిగించేలా చూసుకోవటం, అందుకు సంస్థ విధించబోయే షరతులకు తలొగ్గటం కొత్త పాలకులకు తప్పనిసరి. అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికంతో సతమతమవుతున్న ప్రజానీకంలో ఇది మరింత నిరాశానిస్పృహలను రేకెత్తిస్తుంది. ప్రభుత్వ మద్దతు కోసం ఎదురుచూస్తున్న పారిశ్రామిక రంగానికి కూడా సహకారం అందకపోవచ్చు. మన దేశంతో ఆది నుంచీ పాకిస్తాన్‌ది శత్రుపూరిత వైఖరే. దీనికితోడు దశాబ్దాలుగా పాక్‌లో వుంటున్న వేలాదిమంది అఫ్గాన్ పౌరులను నిరుడు వెనక్కి పంపటంతో తాలిబన్ పాలకులతో తగాదాలు మొదలయ్యాయి. ఇవన్నీ దేశంలో మిలిటెన్సీ మరింత పెరగటానికి దోహదపడతాయి. వీటిని ఒడుపుగా ఎదుర్కొంటూ, సైన్యానికి ఆగ్రహం కలగకుండా చూసుకోవటం కొత్త పాలకులకు జీవన్మరణ సమస్య. ఇన్ని భారాలు మోసేదెవరో తాజా ఎన్నికలు తేల్చబోతున్నాయి. -
స్టార్ హీరోయిన్లతో సినిమాలు.. ఇప్పుడేమో ఖరీదైన కారును అమ్మేసి!
సినిమా రంగం అంటేనే కలల ప్రపంచం. ఇక్కడ స్టార్డమ్ అనేది అంత ఈజీగా రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం అనేది మన టాలెంట్‌పై ఆధారపడి ఉంటుంది. అలా ఒక్క సినిమాతో మెరిసి.. ఇలా వచ్చిన వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్‌గా వెలుగొందిన హీరోలకు సైతం అవకాశాలు రాక ఇబ్బందులు పడినా సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ ముందువరుసలో ఉంటారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్.. జానే తూ.. య జానేనా అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, కంగనా రనౌత్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేశారు. చివరిసారిగా కంగనాతో కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. అంతే కాదు స్టార్ హీరో అమీర్ ఖాన్ మేనల్లుడు కూడా. 2015లో విడుదలైన చివరిసారిగా కట్టి బట్టీలో కనిపించిన ఇమ్రాన్ ఖాన్ అప్పటి నుంచి దాదాపు సినిమాల్లో కనిపించలేదు. అతను సినిమాలకు దూరమై దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. అయితే ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లు బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు మానేశాక తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం తన కూతురు కోసమే సమయం కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?) ఖరీదైన కారు అమ్మేసి..సింపుల్‌గా సినిమాలు చేసే సమయంలో ఫుల్ లగ్జరీ లైఫ్‌ను అనుభవించిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నారు. గతంలో తాను వినియోగించిన ఖరీదైన ఫెరారీ కారును సైతం అమ్మేశారు. ప్రస్తుతం వోక్స్ వాగన్ కారును ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలోని పాలి హిల్‌లోని లగ్జరీ బంగ్లా నుంచి బయటకొచ్చారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఓ చిన్న అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. 'నేను ఇటీవలే తండ్రిని అయ్యా. ఈ సమయం నాకు చాలా విలువైనది. నా కూతురు ఇమారా కోసం నేను సమయం కేటాయించాలని కోరుకుంటున్నా. ఇకపై నటుడిగా ఉండటం నా పని కాదని నిర్ణయించుకున్నా. నేను నన్ను సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. నా కుమార్తె, నా ఫ్యామిలీతో పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నా' అని తెలిపారు. అయితే కంగనాతో చేసిన కట్టి బట్టీ ఫ్లాప్ అయిన తర్వాత తనకు అవకాశాలు రాలేదన్నారు. కానీ అదృష్టవశాత్తూ అప్పటికే ఆర్థికంగా నిలదొక్కుకున్నట్లు తెలిపారు. అందుకే 30 ఏళ్లు వచ్చేసరికి డబ్బుల కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం రాలేదని వెల్లడించారు. ప్రస్తుతం కెరీర్ కోసం గతంలో మాదిరి కష్టపడేంత ఉత్సాహం ఇప్పుడు లేదని అన్నారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్ మేరీ బ్రదర్ కీ దుల్హాన్, ఏక్ మైన్ ఔర్ ఏక్ తూ, ఢిల్లీ బెల్లీ, గోరీ తేరే ప్యార్ మే లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. -
Marriage law violation: ఇమ్రాన్, ఆయన భార్యకు ఏడేళ్ల జైలు
ఇస్లామాబాద్: అతి త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(71)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామ్ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్న ఆరోపణలపై ఇమ్రాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీ(49)కి ఓ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు పెళ్లిళ్ల మధ్య విరామం పాటించాలనే నిబంధనకు విరుద్ధంగా బుష్రా బీబీ ఇమ్రాన్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ ఆమె మాజీ భర్త ఖవార్ ఫరీద్ మనేకా కేసు పెట్టారు. వివాహానికి ముందు నుంచే వారిద్దరి మధ్య అక్రమ సంబంధం నడిచిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై ప్రస్తుతం ఇమ్రాన్, బుష్రా బీబీ ఉన్న అడియాలా జైలులోనే 14 గంటలపాటు విచారణ జరిపిన సీనియర్ సివిల్ జడ్జి ఖుద్రతుల్లా.. ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెలువరించినట్లు జియో న్యూస్ పేర్కొంది. తోషఖానా కేసులో 14 ఏళ్లు, రహస్య పత్రాల కేసులో 10 ఏళ్ల జైలు శిక్షను ఇమ్రాన్‌కు విధిస్తూ ఇటీవలే కోర్టులు తీర్పిచి్చన విషయం తెలిసిందే. ఫెయిత్ హీలర్గా పేరున్న బుష్రాబీబీ వద్దకు తరచూ ఇమ్రాన్ వెళుతుండేవారు. అలా మొదలైన వారిద్దరి మధ్య పరిచయం పరిణయానికి దారి తీసింది. 2018 జనవరి ఒకటో తేదీన ఇమ్రాన్, బుష్రాబీబీల వివాహం ఘనంగా జరిగింది. -
సైన్యం పడగ నీడన... పాక్‌లో ఎన్నికలకు వేళాయె
అది 2018. పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల సమయం. సైన్యం ఆగ్రహానికి గురై అవినీతి కేసుల్లో దోషిగా తేలడంతో నవాజ్ షరీఫ్ అప్పటికి ఏడాది క్రితమే ప్రధాని పదవి పోగొట్టుకున్నారు. జైల్లో మగ్గుతున్నందున ఎన్నికల్లో పోటీకీ దూరమయ్యారు. క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్‌ఖాన్ సైన్యం ఆశీస్సులతో ఎన్నికల్లో నెగ్గి ఏకంగా ప్రధాని పీఠమెక్కారు. ఆరేళ్లు గడిచి పాక్ మళ్లీ సాధారణ ఎన్నికల ముంగిట నిలిచేనాటికి ఈ ఇద్దరు మాజీ ప్రధానుల విషయంలో ఓడలు బళ్లు, బళ్లు ఓడలూ అయ్యాయి. సైన్యం కన్నెర్రతో ఇమ్రాన్ పదవి పోగొట్టుకోవడమే గాక అవినీతి కేసుల్లో జైలుపాలయ్యారు. శిక్షల మీద శిక్షలు అనుభవిస్తూ ఎన్నికలకు దూరమయ్యారు. పార్టీకి కనీసం ఎన్నికల గుర్తు కూడా దక్కని దుస్థితి నెలకొంది! చికిత్స పేరుతో ఆరేళ్ల కింద లండన్ చేరి బతుకు జీవుడా అంటూ ప్రవాసంలో కాలం వెళ్లదీసిన నవాజ్ మళ్లీ సైన్యం దన్నుతో దర్జాగా స్వదేశాగమనం చేశారు. సైన్యం స్క్రిప్టులో భాగంగా అవినీతి కేసులన్నీ కొట్టుకుపోయి నాలుగోసారి ప్రధాని అయ్యేందుకు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇలా దశాబ్దాలుగా పాక్‌లో నేతల భాగ్యరేఖలను ఇష్టానికి నిర్దేశిస్తూ వస్తున్న సైన్యం కనుసన్నల్లో ఎప్పట్లాగే మరో ఎన్నికల తంతుకు సర్వం సిద్ధమవుతోంది... ఏ పౌర ప్రభుత్వమూ పూర్తి పదవీకాలం మనుగడ సాగించని చరిత్ర పాక్ సొంతం. చాలాకాలం పాటు ప్రత్యక్షంగా, మిగతా సమయంలో పరోక్షంగా సైనిక నియంతృత్వపు పడగ నీడలోనే ఆ దేశంలో పాలన సాగుతూ వస్తోంది. అలాంటి దేశంలో సైనిక పాలన ఊసు లేకుండా వరుసగా మూడోసారి సాధారణ ఎన్నికలు జరగబోతుండటం విశేషం! ఇలా జరగడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న పోలింగ్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఎప్పటి మాదిరే ఈసారి కూడా ఏయే పార్టీలు పోటీ చేయాలో, వాటి తరఫున ఎక్కణ్నుంచి ఎవరు బరిలో ఉండాలో కూడా సైన్యమే నిర్దేశిస్తూ వస్తోంది. దేశ ఆర్థికంగా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి, నిత్యావసరాలతో పాటు అన్ని ధరలూ ఆకాశాన్నంటుతూ ప్రజల బతుకే దుర్భరంగా మారిన వేళ జరుగుతున్న ఎన్నికలివి. అక్కడ ఏ ఎన్నికలూ వివాదరహితంగా జరగలేదు. కానీ ఈసారి మాత్రం అవి పరాకాష్టకు చేరాయి. నిజానికి గత నవంబర్‌లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సింది. జనగణనను కారణంగా చూపి ఫిబ్రవరి దాకా వాయిదా వేశారు. నవాజ్ స్వీయ ప్రవాసం నుంచి తిరిగొచ్చి కాలూచేయీ కూడదీసుకుని బరిలో దిగేందుకు వీలుగానే ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి. ఏదెలా ఉన్నా కనీసం ఈసారన్న కాస్త సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నది సగటు పాక్ పౌరుల ఆశ. అమెరికాతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి అవసరమైన ఆర్థిక సాయం రాబట్టి అవ్యవస్థను చక్కదిద్దడంతో పాటు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న భారత్‌తో సంబంధాలను మెరుగు పరుచుకోవాలన్నది వారి ఆకాంక్ష. కానీ సర్వం సైన్యం కనుసన్నల్లో సాగుతున్న తీరును బట్టి చూస్తే ఈసారీ అది అత్యాశే అయ్యేలా కనిపిస్తోంది. నవాజ్ షరీఫ్ పాక్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు 74 ఏళ్ల నవాజ్ సొంతం. భారత్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే నేతగానూ పేరుంది. దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడని కూడా చెబుతారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) సారథిగా మూడోసారి ప్రధానిగా ఉండగా 2017లో పనామా పేపర్స్, లండన్ అపార్ట్మెంట్స్ వంటి నానారకాల కేసుల్లో ఇరుక్కున్నారు. పదవి పోగొట్టుకుని జైలుపాలై ప్రాణ భయంతో లండన్ పారిపోయారు. అనంతరం పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్‌కూ నాలుగేళ్లలోపే అదే గతి పట్టింది. 2022లో నవాజ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవడంతో నవాజ్‌కు మంచి రోజులు తిరిగొచ్చాయి. గత అక్టోబర్‌లో ఆయన తిరిగొచ్చి పీఎంఎల్ (ఎన్) పగ్గాలు చేపట్టడం, సైన్యంతో పాటు న్యాయ వ్యవస్థ దన్నూ తోడై ఆయనపై అవినీతి కేసులు, శిక్షలూ ఒక్కొక్కటిగా రద్దవడం చకచకా జరిగిపోయాయి. అడ్డంకులన్నీ తొలిగి ఎన్నికల బరిలో నిలిచిన నవాజ్ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమేనంటున్నారు. ఇమ్రాన్‌ఖాన్ అనితరసాధ్యమైన క్రికెట్ నైపుణ్యంతో పాక్ ప్రజలను ఉర్రూతలూగించి నేషనల్ హీరోగా వెలుగు వెలిగిన 71 ఇమ్రాన్ రాజకీయ పిచ్‌పై మాత్రం నిలదొక్కుకోలేక చతికిలపడ్డారు. అవినీతిని రూపుమాపి, కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టి సర్వం చక్కదిద్దుతానంటూ మార్పు నినాదంతో 2018లో ప్రధాని అయ్యారాయన. కానీ ఇమ్రాన్ హయాంలో ఆర్థికంగానే గాక అన్ని రంగాల్లోనూ దేశం కుప్పకూలింది. హింసతో, అశాంతితో పాక్ అట్టుడికిపోయింది. ఆయనకు ఆదరణా అడుగంటింది. నిజానికి సైన్యం చేతిలో పావుగానే ఇమ్రాన్ రాజకీయ ప్రవేశం జరిగిందంటారు. అలాంటి సైన్యానికే ఎదురు తిరగడంతో ఇమ్రాన్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఎంత ప్రయతి్నంచినా పదవిని కాపాడుకోలేకపోయారు. పైగా జైలు శిక్ష వల్ల తాను పోటీ చేసే అవకాశం లేదు. ఆయన పార్టీ తరఫున కొందరు ధైర్యం చేసి ఇండిపెండెంట్లుగా బరిలో దిగుతున్నా చాలామంది జైలుపాలయ్యారు. పలువురు ఫిరాయించగా మిగిలిన వారు అజ్ఞతంలోకి వెళ్లిపోయారు. ఈ సమస్యలు చాలవన్నట్టు పీటీఐ ఎన్నికల గుర్తు బ్యాట్‌పైనా ఎన్నికల సంఘం వేటు వేసింది. దాంతో లక్షలాది మంది నిరక్షరాస్య ఓటర్లు బ్యాలెట్ పత్రాలపై ఇమ్రాన్ పార్టీని గుర్తించను కూడా లేరంటున్నారు. బిలావల్ భుట్టో 35 ఏళ్ల బిలావల్ భుట్టో జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్. దారుణ హత్యకు గురైన మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు. షహబాజ్ షరీఫ్ సర్కారులో విదేశాంగ మంత్రిగా తన పనితీరుతో స్వదేశంలో విమర్శలపాలు, భారత్‌లో నవ్వులపాలయ్యారు. గత ఎన్నికల్లో పీపీపీ మూడో స్థానంలో నిలిచింది. ఈసారి అన్నీ కలిసొస్తే బహుశా కింగ్‌మేకర్ అవ్వొచ్చంటున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులుంటారు. 266 మందిని నేరుగా ఉన్నుకుంటారు. 70 సీట్లను మహిళలు, మతపరమైన మైనారిటీలకు; ఆరింటిని గిరిజన ప్రాంతాల వారికి రిజర్వు చేశారు. ఈ స్థానాలను పార్టీలకు గెలుచుకున్న స్థానాలను బట్టి నైష్పత్తిక ప్రాతిపదికన కేటాయిస్తారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇమ్రాన్ పని అయిపోయినట్టేనా.. 10 ఏళ్ళు జైల్లోనే
-
Toshakhana corruption case: తోషఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. తోషఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్ కోర్టు 14 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. విదేశీ నాయకులు ఇచ్చిన ఖరీదైన బహుమతులను విక్రయించి, సొమ్ము చేసుకున్నట్లు ఇమ్రాన్ దంపతులపై అభియోగాలు నమోదయ్యాయి. దర్యాప్తులో అదంతా నిజమేనని తేలడంతో న్యాయస్థానం బుధవారం శిక్ష ఖరారు చేసింది. దోషులకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదంటూ కోర్టు ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు కూడా వేసింది. 1.5 బిలియన్ల జరిమానా చెల్లించాలని ఇమ్రాన్ దంపతులను ఆదేశించింది. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. విదేశాలకు అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి దేశాధినేతలు బహుమతులు ఇస్తుంటారు. అవన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. తోషఖానాలో భద్రపర్చాల్సి ఉంటుంది. ఇమ్రాన్ మాత్రం సొంత ఆస్తిలాగా అమ్మేసుకున్నారు. అధికార రహస్యాల వెల్లడి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు మూడు రోజుల క్రితం 10 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. -
పాక్ ప్రజాస్వామ్య ప్రహసనం
మరో ఎనిమిది రోజుల్లో దేశంలో ఎన్నికలు. ఆరు నెలలుగా జైలులో ఉన్న మాజీ ప్రధాని. అవినీతి ఆరోపణలతో కటకటాల వెనక ఉన్న ఆయనపై... రెండు రోజుల్లో మరో రెండు కేసుల్లో వేర్వేరుగా 10 ఏళ్ళు, 14 ఏళ్ళ శిక్షలు. కనీసం మరో పదేళ్ళ పాటు ప్రభుత్వహోదా ఏదీ నిర్వహించనివ్వని నిషేధం. పార్టీ ఎన్నికల చిహ్నానికి కూడా తిరస్కరణ. మాజీ ప్రధాని గారి పార్టీ వైపు మొగ్గకుండా యువతరానికి హితోపదేశాల ఊదరగొడుతున్న ఆర్మీ ఛీఫ్. ఇలాంటి నాటకీయ పరిణామాలు ఒక్క పాకిస్తాన్‌లోనే సాధ్యం. గతంలోనూ ఆ దేశంలో మాజీ ప్రధానులు పలువురు ఇలానే న్యాయ విచారణలు, జైలుశిక్షలు ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం. నమ్మలేని ఈ న్యాయవిచారణల ద్వారా నేతల్ని బరిలో లేకుండా చేసే సిగ్గుమాలిన రాజకీయ దుస్సంప్రదాయం పాకిస్తాన్లో దీర్ఘకాలంగా ఉన్నదే. దాదాపు 14 వేల కోట్ల డాలర్ల అప్పులో కూరుకుపోయి, ఏటా ఆహార ధరలు 38.5 శాతం మేర పెరుగుతూ, ఆసియాలోనే అత్యధిక ద్రవ్యోల్బణంతో సామాన్యులు సమరం చేస్తున్న పొరుగుదేశానికి ఇది ఏ రకంగానూ మేలు కాదు. దేశరహస్య పత్రాలను లీక్ చేశారనే కేసులో కోర్టు మంగళవారం ఇమ్రాన్‌కు పదేళ్ళ జైలుశిక్ష ప్రకటిస్తే, మర్నాడే బుధవారం ప్రభుత్వ కానుకల అక్రమ విక్రయం (తోషాఖానా) కేసులో ఆయనకూ, ఆయన భార్యకూ కూడా చెరొక 14 ఏళ్ళ కారాగారవాస శిక్ష వేసింది. 150 కోట్ల రూపాయల జుల్మానా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఏమైనా, 2022 ఏప్రిల్‌లో ప్రత్యర్థుల చేతిలో పదవీచ్యుతుడైన ఇమ్రాన్ ఇప్పటికే అవినీతి ఆరోపణలపై మూడేళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఎన్నికలు అతి దగ్గరలో ఉండగా ఈ తీర్పులు, శిక్షల ప్రకటన యాదృచ్ఛికం అనుకోలేం. ఇప్పటికే పదేళ్ళ పాటు అన్ని రకాల ప్రభుత్వ పదవులకూ తమ నేతను అనర్హుణ్ణి చేసిన శక్తులు ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణకూ బ్రేకులు వేయదలిచారని ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) ఆరోపిస్తోంది. తాజాగా శిక్షలు పడ్డ రెండు కేసుల్లోనూ తమ వకీళ్ళు పాకిస్తాన్ హైకోర్ట్‌కు అప్పీల్ చేశాక కథ కొత్త మలుపులు తిరగవచ్చని ఆ పార్టీ ఆశ. రావల్పిండిలోని అడియాలా జైలులో 9 బై 11 అడుగుల పరిమాణంలోని చిన్న జైలు గదిలో గడచిన ఆగస్టు నుంచి గడుపుతూ, హింసాకాండ నుంచి తీవ్రవాదం దాకా సుమారు 180కి పైగా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు 71 ఏళ్ళ ఇమ్రాన్. కేసులు, కోర్టులు, శిక్షలతో సంబంధం లేకుండా ఆయనకు ఇప్పటికీ ప్రజాదరణ మెండుగా ఉంది. ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్‌ను సైతం ఈ అంతర్జాతీయ క్రికెటర్ పార్టీకి దూరం చేశారు. ఎదురుదెబ్బ తగిలినా, జనంలో ఆయన పట్ల సానుభూతి, సానుకూలత ఆ పార్టీ అభ్యర్థులకు కాస్తంత సాంత్వన. వారు గెలిచినా ఇండిపెండెంట్ల కిందే లెక్క. అసలు చిక్కంతా ఇతర ప్రధాన రాజకీయ పార్టీలతో కలసి సైనిక వ్యవస్థ ఆడుతున్న అధికార క్రీడతోనే! తెర వెనుక చక్రం తిప్పే పాక్ సైన్యం కొన్ని నెలలుగా వేలాది పార్టీ కార్యకర్తల్ని అరెస్టు చేసింది. సుదీర్ఘ విచారణల దెబ్బతో డజన్లకొద్దీ పార్టీ నేతలు రాజీనామాలు చేశారు. ప్రధాన స్రవంతి మీడియాలో ఇమ్రాన్ పేరు నిషేధించారు. ఇమ్రాన్ ప్రత్యర్థులకు కలిసొచ్చేలా నియోజక వర్గాల సరిహద్దుల్ని తిరగరాశారు. చివరకు ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. మాజీ ప్రధాని 74 ఏళ్ళ నవాజ్ షరీఫ్‌కు మాత్రం తెర వెనుక అండ పుష్కలం. అచ్చం ఇమ్రాన్ లానే అవినీతి ఆరోపణలతో 2017లో ఆయన పదవీచ్యుతుడయ్యారు. పదేళ్ళ జైలుశిక్ష పడింది. కానీ, వైద్య చికిత్సకంటూ 2018లో బెయిల్ మీద లండన్ వెళ్ళిన ఆయన తప్పించుకొని ప్రవాసంలో కాందిశీకుడిగా గడిపారు. చివరకు గత అక్టోబర్ 21 పాక్‌కు తిరిగొచ్చారు. వస్తూ్తనే జైలుశిక్ష రద్దయింది. రాజకీయాల నుంచి జీవితకాల నిషేధమూ ఎత్తేశారు. నాలుగోసారి ప్రధాని పీఠానికై పోటీ చేస్తున్న ఆయనకు గతంలో మూడుసార్లు ఆయనను గద్దె దింపిన సైన్యమే మళ్ళీ సాయంగా నిలవడం పాక్ రాజకీయ వైచిత్రికి తార్కాణం. ఇవన్నీ చూశాకే ఈ ఎన్నికలలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలుండవని విశ్లేషకులు తీర్మానించేశారు. పాక్ ఓటర్లలో 40 శాతం మంది నిరక్షరాస్యులే. అయి తేనేం, ప్రజానీకానికి సైతం ఎన్నికల ప్రక్రియపై భ్రమలు ఎంతగా తొలగిపోయాయంటే, బరిలో మిగిలిన పార్టీల ప్రచారానికి సైతం స్పందన అంతంత మాత్రమే. అయితే, ఇమ్రాన్‌కు కోర్టు శిక్షలతో పాక్‌లో రాజకీయంగా చీలిక పెరగవచ్చు. అస్థిరత హెచ్చి, ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదం రావచ్చు. రేపు ఫలితాలు వెలువడిన తర్వాతా దేశంలో సుస్థిరత నెలకొనే అవకాశాలు అత్యల్పం. పాక్ అధికార వ్యవస్థపై సైనిక యంత్రాంగపు క్రీనీడ విస్తరించి, ప్రజాస్వామ్య రాజకీయ ప్రక్రియను పూర్తిగా బలహీనపరిచింది. సైనికాధికారులు తమ పరిధిలోకి ఏ మాత్రం రాని రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ నుంచి మతం, విదేశాంగ విధానం దాకా విద్యార్థులతో ముచ్చటిస్తుండడమే అందుకు మచ్చుతునక. అన్ని రకాలుగా సందేహాస్పదమైన ఈ ఎన్నికల ద్వారా, సైనిక వ్యవస్థ అండతో వచ్చే బలహీన పౌరప్రభుత్వం రేపు పరిపాలన ఎంత అందంగా చేస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. పాక్ ఆర్థిక, జాతీయ భద్రతా రంగాల్లో దాని పని తీరు ఏమంత గొప్పగా ఉంటుందో వివరించనక్కర లేదు. దేశాన్ని సక్రమ మార్గంలో నడిపించడమెలాగో తమకు తెలుసని గతంలో అప్పటి పాక్ ఆర్మీ ఛీఫ్ జనరల్ జావేద్ బజ్వా ఒక సిద్ధాంతం చెబితే, ఇప్పుడు జనరల్ ఆసిమ్ మునీర్ సిద్ధాంత ప్రవచనం చేస్తున్నారు. వెరసి, ఈ ఫిబ్రవరి 8 నాటి ఎన్నికలు చివరకు ఓ తంతుగానే మారడం ఖాయం. బాహాటంగా పగ్గాలను సైన్యం చేత పట్టకున్నా, పేరుకు ఎన్నికైన పౌర ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా పనిచేయనిచ్చే పరిస్థితి మాత్రం ఉండదనేది నిస్సందేహం. -
ఇమ్రాన్ ఖాన్‌కు మరో షాక్.. అవినీతి కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మరో వారం రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలనితీవ్రంగా ప్రయతిస్తున్న ఇమ్రాన్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అధికార రహస్య పత్రాల లీకేజీ కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి అబ్దుల్ హస్నత్ మంగళవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇమ్రాన్‌కు మరోషాక్ తగిలింది. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు బుధవారం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆయన భార్య బుస్రా బీబీకి కూడా 14 ఏళ్ల శిక్షను విధించింది. అంతేగాక ఇద్దరూ పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు కూడా వేసింది. సుమారు రూ.1.5 బిలియన్లు జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ ఖైదీగా ఉన్న రావల్పిండిలోని అడియాలా జైలులో ఈ కేసు విచారణ జరిగింది. కాగా గత ఆగస్టు నుంచి ఇమ్రాన్ జైలులోనే ఉన్నారు. ఆయనపై వివిధ నేరాల కింద దాదాపు 100కుపైగా కేసులు నమోదైనట్లు సమాచారం. చదవండి: Imran Khan Jailed: ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసు(సైఫర్)లో న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు పాకిస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ తీర్పును వెలువరించింది. సైఫర్ కేసు.. సైఫర్ కేసు అనేది దౌత్య పరమైన సమాచారానికి సంబంధించినది. గత ఏడాది మార్చిలో వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను బహిర్గతం చేశారని ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ సైఫర్ కేసులో తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి కుట్ర జరుగుతోందని అప్పట్లోనే ఖాన్ ఆరోపించారు. ఏప్రిల్ 2022లో అవిశ్వాస తీర్మానంలో ఓడి పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవి నుండి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగారు. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు మూడు ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆగస్టు 5, 2023న ఇమ్రాన్ జైలు పాలయ్యారు. పోలీసులు ఆయన్ని అటాక్ జైలులో ఉంచారు. అయితే.. ఇస్లామాబాద్ హైకోర్టు ఈ శిక్షను రద్దు చేసింది. కానీ ఇతర కేసులలో ఇమ్రాన్‌ను నిర్బంధంలో ఉంచారు. ఇదీ చదవండి: పాకిస్థాన్ నావికుల్ని కాపాడిన భారత నేవీ -
ఫిబ్రవరి 8న పాక్ ఎన్నికలు...‘బ్యాట్’ పట్టని ఇమ్రాన్!
వచ్చే నెల 8న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. అవినీతి కేసులతో ప్రస్తుతం జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (71) సొంత రాజకీయ పార్టీ పేరు పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ). దీని ఎన్నికల చిహ్నం- క్రికెట్ బ్యాట్. మరో రెండు వారాల్లో జరగనున్న దేశ సాధారణ ఎన్నికల్లో క్రికెట్ బ్యాట్ ఎన్నికల గుర్తును వాడకుండా పీటీఐపై దేశ ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. తమ ఎన్నికల గుర్తు మీద ఈసీ నిషేధం విధించడంపై ఇమ్రాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పీటీఐ ఓటమికి కోసం మిలిటరీ మద్దతున్న ఆపద్ధర్మ ప్రభుత్వం పన్నిన కుట్రగా ఇమ్రాన్ మద్దతుదారులు అభివర్ణిస్తున్నారు. ఇమ్రాన్ పార్టీ పీటీఐ నిబంధనల ప్రకారం అంతర్గత ఎన్నికలు నిర్వహించనందునే ఎన్నికల గుర్తు వినియోగంపై ఆంక్షలు విధించామని ఎన్నికల సంఘం అంటోంది. వాస్తవానికి గత సంవత్సరం జూన్ 8న ఇమ్రాన్ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించింది. అయితే సజావుగా జరగలేదంటూ ఆ ఎన్నికలను గుర్తించడానికి పాక్ ఎన్నికల సంఘం నిరాకరించింది. ఈసీ చర్య అన్యాయం, అక్రమం, రాజకీయ దురుద్దేశపూరితమని, ఇదంతా ఎన్నికల్లో తమ పార్టీ విజయాన్ని నిరోధించేందుకేనని ఇమ్రాన్ మద్దతుదారులు ఆక్రోశిస్తున్నారు. 13 చిన్నాచితకా రాజకీయ పార్టీల విషయంలోనూ ఈసీ ఇలాంటి ఉత్తర్వులే వెలువరించింది. ఎన్నికల చిహ్నంపై నిషేధాన్ని తొలగించుకునేందుకు పీటీఐ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ వారికి చుక్కెదురైంది. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. పీటీఐకి ఈ తీర్పు శరాఘాతంలా తగులుతోంది. ఎన్నికల్లో పార్టీ గుర్తులను రాజకీయ పార్టీలు కోల్పోవడం పాకిస్తాన్లో కొత్తేమీ కాకపోయినప్పటికీ, పీటీఐ తమ అభ్యర్థులందరికీ ఇతరత్రా ఓ గుర్తును ఎంచుకునే సమయం, అవకాశం సైతం లేకుండా పోయింది. అందుకు ఉద్దేశించిన నిర్ణీత గడువు ముగిసింది. చిహ్నాల్ని మార్చే ప్రక్రియ ఇంకా కొనసాగితే ఎన్నికల నిర్వహణలో మరింత జాప్యం జరుగుతుందని ఈసీ చెబుతోంది. ఈ గందరగోళాన్ని తొలగించేలా తమ పార్టీ అభ్యర్థుల పేర్లు-చిహ్నాలను ఓటర్లు అన్వేషించేందుకు వీలుగా ఇమ్రాన్ పార్టీ సామాజిక మాధ్యమాల బృందం ఓ పోర్టల్ నడుపుతోంది. పాకిస్తాన్లో సగం మంది ప్రజలకే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. దీంతో ఓటర్ల వద్దకు చేరడంలో ఇమ్రాన్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏదేమైనా క్రికెట్ బ్యాట్ గుర్తును కోల్పోవడం తమ పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీస్తుందని పీటీఐ నేతలు ఆందోళన చెందుతున్నారు. క్రికెట్ మీద మహా మోజున్న పాక్ లాంటి దేశంలో ఓటర్లను ఇమ్రాన్ పార్టీ వైపు ఆకర్షించడానికి బ్యాట్ గుర్తు సమ్మోహనాస్త్రంలా ఉపయోగపడింది. ‘త్రాసు’ కోసం న్యాయపోరాటం! క్రికెట్ బ్యాట్ గుర్తుతో ఇమ్రాన్ రాజకీయ పార్టీ పీటీఐకి విడదీయరాని అనుబంధం ఉన్నప్పటికీ నిజానికి దాని తొలి ఎన్నికల గుర్తు ‘దీపం’. పీటీఐ పేరులోని ‘ఇన్సాఫ్’ అంటే ఉర్దూలో న్యాయం అనే అర్థం వస్తుంది. 2013 ఎన్నికలకు ముందు పీటీఐ న్యాయానికి ప్రతీకగా ‘సమ త్రాసు’ గుర్తును వాడుకోవాలని భావించింది. కానీ, ‘సమ త్రాసు’ 1970 సాధారణ ఎన్నికల్లో జమాతే ఇస్లామీ పార్టీ గుర్తుగా ఉంది. ఈ గుర్తు కోసం ఇరు పార్టీల మధ్య సాగిన న్యాయపోరాటంలో చివరికి జమాతే ఇస్లామీ పార్టీదే పైచేయి అయింది. 1977 సార్వత్రిక ఎన్నికల అనంతరం జనరల్ జియా-ఉల్-హక్ నేతృత్వంలోని సైనిక సర్కారు కొన్ని ఎన్నికల చిహ్నాల్ని ఆమోదిత జాబితా నుంచి తొలగించింది. అలా తొలగించిన వాటిలో త్రాసు గుర్తు ఉంది. తర్వాత 2010 సంవత్సరంలో పాకిస్తాన్ ఎన్నికల సంఘం త్రాసు గుర్తును పునరుద్ధరించింది. పాక్ ఎన్నికల్లో గుర్తుల ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ‘’పాకిస్తాన్ జనాభాలో 40% మంది నిరక్ష్యరాస్యులు. విద్యావంతులు కాని ఓటర్లు ఓటు వేయడానికి గుర్తులపై ఆధారపడతారు, పేర్లు చదవగలిగిన పౌరుల్లోనూ చాలామంది ఎల్లప్పుడూ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరు. కానీ వారికి పార్టీ గుర్తు మాత్రం తెలుసు” అని ‘జియో’ జర్నలిస్టు మాలిక్ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాల్లోని నినాదాలు, గీతాలు వాటి గుర్తుల చుట్టూ అల్లుకుని వుంటాయి అని ఆమె చెప్పారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు 150 గుర్తులు కేటాయించగా మరో 174 గుర్తుల్ని స్వతంత్ర అభ్యర్థులకు ఇస్తున్నారు. మూడు సార్లు దేశ ప్రధాన మంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ (74) ఆధ్వర్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) పార్టీ పులి గుర్తుతో, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో తనయుడు బిలావల్ భుట్టో జర్దారీ సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) బాణం గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. మిలిటరీ మ్యాన్ నవాజ్ షరీఫ్! ప్రజాదరణ ఎంత బలంగా ఉన్నప్పటికీ రాజకీయ క్రీజులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ ఫామ్ లోకి రావడం దుర్లభం గానే కనిపిస్తోంది. ఇంత ఎదురుగాలిలోనూ గత డిసెంబరులో నిర్వహించిన ఓ ఒపీనియన్ పోల్ ప్రకారం... నవాజ్ షరీఫ్ (52%)తో పోలిస్తే ఇమ్రాన్ ఖాన్ (57%)కే అధిక అప్రూవల్ రేటింగ్స్ దక్కడం విశేషం. పీటీఐని అణచివేసేందుకు మిలిటరీ ట్రిక్స్ ప్రయోగిస్తోంది. ఇటీవలి కాలంలో పీటీఐ కార్యకర్తలు పలువురు అరెస్టయ్యారు. కొందరు నేతలు ‘ఇంటరాగేషన్స్’ తట్టుకోలేక పార్టీకి రాజీనామాలు చేశారు. ప్రధాన సమాచార మాధ్యమాల్లో ఇమ్రాన్ పేరు ఉచ్చరించడాన్ని నిషేధించారు. ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. చివరికి... ప్రతిపాదించేవారు, బలపరిచేవారు దొరక్క (కిడ్నాప్స్/అపహరణలకు గురై)... ఇమ్రాన్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు కూడా పెద్ద సంఖ్యలో (దాదాపు 90%) తిరస్కృతికి గురయ్యాయి. నవాజ్ షరీఫ్ పాక్ మిలిటరీ నుంచి సహకారం పొందుతున్నారు. పాక్ ప్రధానమంత్రి పీఠంపై కూర్చొని పూర్తి పదవీకాలాన్ని అనుభవించిన వారెవరూ లేరు. ఆ అదృష్టం తొలిసారిగా, నాలుగో విడతలో షరీఫ్ ను వరిస్తుందేమో చూడాలి. మిలిటరీతో షరీఫ్ ఒప్పందం: బిలావల్ తూర్పు పంజాబ్ ప్రావిన్సులో పోటీ చేస్తున్న తమ పార్టీ జాతీయ, అసెంబ్లీ అభ్యర్థులకు తప్పుడు ఎన్నికల గుర్తులు కేటాయించారని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత బిలావల్ భుట్టో-జర్దారీ అంటున్నారు. నవాజ్ షరీఫ్ ఒత్తిడి మేరకే దేశ ఎన్నికల సంఘం ఇలా వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు. తెర వెనుక ఉంటూ రాజ్యాధికార శక్తుల్ని నియంత్రించే మిలిటరీతో షరీఫ్ ఒప్పందం కుదుర్చుకున్నారని బిలావల్ ఆరోపిస్తున్నారు. కొన్నేళ్లు స్వయం ప్రకటిత ప్రవాసం గడిపి నిరుడు అక్టోబరులో స్వదేశానికి వచ్చిన నవాజ్ షరీఫ్... బిలావల్ ఆరోపణలను కొట్టిపారేశారు. అవినీతి కేసుల్లో పదవి నుంచి 2017లో ఉద్వాసనకు గురై పదేళ్ళ జైలు శిక్ష పడిన నవాజ్ షరీఫ్... వైద్యచికిత్స కోసమంటూ బెయిల్ మీద లండన్ వెళ్ళి అక్కడే (పరారై ప్రవాసం) తలదాచుకున్నారు. ఆయన అకస్మాత్తుగా నిరుడు అక్టోబరు 21న స్వదేశానికి విచ్చేశారు. ‘అవినీతి మరకల్ని, రాజాకీయాల నుంచి శాశ్వత నిషేధాన్ని’ వదిలించుకుని 4వ సారి ప్రధాని అయ్యే ఆశతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. - జమ్ముల శ్రీకాంత్ -
ఇమ్రాన్ ఖాన్ పార్టీ జెండా ఎగురవేసినందుకు.. కన్న కొడుకునే హత్య
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల ముందు ఓ కుటుంబంలో పార్టీ జెండా చిచ్చు పెట్టింది. ఆ చిచ్చు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తనకు నచ్చని పార్టీకి సంబంధించిన జెండాను ఇంటిపై ఎగురువేసినందుకు ఓ తండ్రి తన కన్న కొడుకునే హతమార్చాడు. ఈ ఘటన పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్ శివార్లలో ఉన్న ఓ కుటుంబంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెషావర్ శివార్లలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. తండ్రి ఎంత వద్దని చెప్పినా కొడుకు తనకు నచ్చిన పాక్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీకి చెందిన జెండాను ఇంటిపై ఎగురవేశాడు. దీంతో తండ్రీ కొడుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన తండ్రి తుపాకితో కొడుకును కాల్చాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయిన ఫలితం లేదు. మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కొడుకును చంపిన తండ్రి పారారీలో ఉన్నారుని చెప్పారు. కొడుకును హత్య చేసిన తండ్రి కోసం వెతుకుతున్నామని పోలీసు అధికారి నసీర్ ఫరీద్ మీడియాకు వెల్లడించారు చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు -
ఎన్నికల సంఘ బాధ్యతలను మేము తీసుకోబోం
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్– ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)కు బ్యాట్ గుర్తు కేటాయింపు వివాదంపై ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం విధుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని సీజేపీ జస్టిస్ క్వాజీ ఫయీజ్ ఇసా పేర్కొన్నారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించనందున పీటీఐకి ఎన్నికల గుర్తు బ్యాట్‌ను కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించడం, దానిపై రాజకీయ దుమారం రేగడం తెలిసిందే. దీనిపై పీటీఐ పెషావర్ హైకోర్టును ఆశ్రయించగా, ఊరట లభించింది. అనంతరం ఎన్నికల సంఘం నిర్ణయాన్ని పెషావర్ హైకోర్టు తప్పుపట్టింది. బ్యాట్ గుర్తును పునరుద్ధరించాలంటూ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా సీజేపీ జస్టిస్ ఇసా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగ, చట్టబద్ధమైన సంస్థ విధుల మధ్య చాలా స్పష్టమైన విభజన రేఖ ఉంది. ఈసీ తన బాధ్యతలను నిర్వరిస్తున్నప్పుడు న్యాయవ్యవస్థకు అత్యున్నత ప్రతినిధిగా మేమెలా జోక్యం చేసుకోగలం? అదెలా సరైన చర్య అవుతుంది? ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ. రాజకీయ పార్టీల వ్యవహారాలను నియంత్రించడం, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడం’’ అని ఆయన పేర్కొన్నారు. -
బ్యాట్ గుర్తు ఇమ్రాన్ పార్టీదే
పెషావర్: పాకిస్థాన్‌లో కీలకమైన జాతీయ ఎన్నికల ముందు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ)కి భారీ ఊరట దొరికింది. పార్టీ ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్‌ను దానికే తిరిగి కేటాయిస్తూ పెషావర్ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. పీటీఐకి బ్యాట్ చిహ్నాన్ని రద్దు చేస్తూ దేశ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది. అది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. -
పాక్‌లో స్థంభించిన ఇంటర్నెట్.. మండిపడ్డ నెటిజన్లు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అంతటా ఇంటర్నెట్ స్థంబించిపోయింది. ఇంటర్నెట్ అంతరాయంతో పలు సోషల్‌మీడియా అకౌంట్స్ ఓపెన్ కాలేదు. దీంతో నెటిజనట్లు తీవ్రమైన నిరాశ వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) రాబోయే ఎన్నికల కోసం నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించిన క్రమంలోనే ఇంటర్నెట్ అంతరాయం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. Is #internet down in some areas or all over #Pakistan? Social media sites are either not opening or are very slow. #InternetShutDown pic.twitter.com/bxax9qp8oT — Ather Kazmi (@2Kazmi) January 7, 2024 ‘ఎక్స్’(ట్వీటర్)తో పాటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్‌టాక్, పలు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్ సైతం ఓపెన్ కాకుండా మొరాయించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు, నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో వెబ్సైట్లు కూడా ఓపెన్ కాకపోవటం గమనర్హం. ఇంటర్నెట్ అంతరాయంతో గ్లోబల్ ఇంటర్నెట్ అబ్జర్వేటరీ, నెట్ బ్లాక్స్, సోషల్ మీడియా అప్లికేషన్లు కూడా దేశవ్యాప్తంగా ఓపన్ అవ్వలేదని తెలుస్తోంది. దీంతో ప్రజలు, సోషల్ మీడియా నెటిజన్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ఇది ఖచ్చితంగా సిగ్గుచేటు! అయిన విషయమని ప్రజలకు ఇంటర్నెట్ అంతరాయంతో జరిగిన నష్టానికి కేర్‌టేకర్ ఐటీ మంత్రి రాజీనామా చేయాలి’ అని పీటీఐ ట్విటర్ హ్యాండిల్ డిమాండ్ చేసింది. Absolutely shameful! Caretaker IT Minister should resign for this continuing damage to Pakistanis https://t.co/W9pyXzRr6A — PTI (@PTIofficial) January 7, 2024 చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవులు మంత్రులపై వేటు! -
ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. నామినేషన్ తిరస్కరణ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ ఆ దేశ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 2024లో జరగబోయే పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించింది. ఈ మేరకు ఆయన నామినేషన్ పాకిస్తాన్ ఎన్నికల సంఘం తిరస్కరించిందని ఆ పార్టీ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. అయితే ఇమ్రాన్ ఖాన్ స్వస్థలమైన మియాన్వాలి నుంచి ఆయన పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇక ఆయన అధికార రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో ఆగస్టు నుంచి రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన న్యాయస్థానంలో దోషిగా నిర్ధారించబడినందుకే నామినేషన్‌ను తిరస్కరించామని ఎన్నికల సంఘం పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకస్తాన్ లెక్కల ప్రకారం.. 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 28, 626 మంది తమ నామినేషన్లను దాఖలు చేసిట్లు పేర్కొంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పలు కేసుల్లో జైల్లో ఉన్నాడని.. పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి జైలు నుంచి బయటకు రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని పీటీఐ పార్టీ వర్గాలు చర్చించుకోవటం గమనార్హం. కాగా.. సాధరాణ ఎన్నికల సమయంలో తనను జైలులోనే ఉంచడానికి తనపై తప్పుడు, రాజకీయ ప్రేరేపితమైన కేసులు పెట్టారని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. చదవండి: ఇజ్రాయెల్ భీకర దాడులు.. 24 గంటల్లో 200 మంది మృతి -
భారత అనుకూల వైఖరి గెలిపించేనా?
అనుకున్నట్టే జరిగితే, 2024 ఫిబ్రవరిలో పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగాలి! ఇప్పుడున్న అంచనా ప్రకారం, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్ ) మెజారిటీ సాధిస్తుంది. ప్రధానిగా మూడు దఫాలు కూడా పదవీకాలం ముగియకుండానే ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. మిలిటరీ, న్యాయవ్యవస్థ రెండూ కుమ్మక్కై తన ప్రభుత్వాన్ని ఎలా పడదోశాయో చెబుతున్న షరీఫ్ ప్రకటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారత్‌తో కనీస స్థాయి సంబంధాలు కలిగి ఉండాలన్న వాదన వినిపించే భారమిప్పుడు కూడా ఆయనే మోస్తున్నారని చెప్పాలి. ఇది షరీఫ్ బలమని కొందరి నమ్మకం. కొందరు బలహీనతగానూ చూస్తున్నారు. అలాగని షరీఫ్ గద్దెనెక్కగానే అంతా సమూలంగా మారిపోతుందని కూడా కాదు. మిలిటరీ, న్యాయవ్యవస్థ రెండూ కుమ్మక్కై తన ప్రభుత్వాన్ని ఎలా పడదోశాయో వివ రిస్తూ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవలి కాలంలో చేస్తున్న ప్రకటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం పాక్‌లో ఉన్న పరిస్థితులు, 2024 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్ ) పార్టీని దృష్టిలో పెట్టుకుంటే ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం లభిస్తుంది. ఇంకో రెండు నెలల్లో, అంటే 2024 ఫిబ్రవరిలో అక్కడ సాధారణ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అటు మిలిటరీ, ఇటు నవాజ్ షరీఫ్ అంగీకరిస్తున్న విషయం ఏదైనా ఉందీ అంటే అది మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఎలాగైనా అధికారానికి దూరంగా ఉంచాలన్నది! భారత్‌లోనే ఎక్కువ ఆసక్తి ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, షరీఫ్ ప్రకటనలకు పాక్‌లో కంటే భారత్‌లోనే ఎక్కువ ఆదరణ లభించడం. ఎందుకిలా? పాకిస్తాన్లో అధికార పక్షానికి భిన్నంగా చేసే వ్యాఖ్యలు, వార్తలు సెన్సార్‌కు గురవుతాయి కాబట్టి అని కొందరు అంటారు. అయితే, పాకిస్తాన్ లో చాలా అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. మీడియా కూడా వాటిని జనానికి చేర్చుతుంటుంది. కానీ ప్రధాన మీడియా వర్గాలు ముట్టుకోకూడదనుకున్న అంశాలకు సోషల్ మీడియా వేదికగా నిలుస్తోంది. బహుశా మనం దూరం నుంచి పాక్ వ్యవహారాలను గమనిస్తూంటాం కాబట్టి... మన దృష్టంతా అక్కడ మిలిటరీకీ, ప్రభుత్వానికీ మధ్య ఉన్న వివాదాలపైనే ఉంటుంది. నవాజ్ షరీఫ్ ఇలాంటి విషయాల్లో పాతికేళ్లుగా కేంద్ర బిందువుగా నిలిచారు. ప్రధానిగా ఉన్న మూడు దఫాలు కూడా పదవీ కాలం ముగి యకుండానే వేర్వేరు కారణాల వల్ల ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. మిలిటరీ కుట్రలు లేదా మిలిటరీ–న్యాయవ్యవస్థ కుమ్మక్కులతో అన్నమాట! పాకిస్తాన్లో షరీఫ్ ఇటీవలి ప్రకటనలను కొంచెం భిన్నమైనదృష్టితో చూస్తారేమో. నవాజ్ షరీఫ్ నడిపే రాజకీయాలకు ఇలాంటి ప్రకటనలే ఆధారం. ఇందులో సందేహం ఏమీ లేదు. మిలిటరీ వ్యతి రేకతను ఒక అంశంగా నిత్యం ఉంచుతారు ఆయన. కానీ రాజకీయ వైచిత్రి ఏమిటంటే, ఇప్పుడు మిలిటరీతో కలిసిపోయి అధికారంలోకి వచ్చేందుకు షరీఫ్ ప్రయత్నిస్తూండటం! ఇమ్రాన్ ఖాన్ తప్పటడు గులు, అతడి అనుచరుల చేష్టల పుణ్యమా అని షరీఫ్, మిలిటరీ మధ్య రాజీ కుదిరిపోయింది. అయినప్పటికీ ప్రస్తుతం షరీఫ్ ఒక రకమైన ఇబ్బందికరమైన స్థితిలోనే ఉన్నాడని చెప్పాలి. ఒకవేళ ప్రజల్లో మిలి టరీపై వ్యతిరేకత అంటూ ఉంటే దాని ఫలాలు అనుభవించేది ఇమ్రాన్ ఖానే అవుతాడు కానీ షరీఫ్ కాదు. ఈ నేపథ్యంలోనే భారత్‌తో సంబంధాల విషయమై షరీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగాకొంత ప్రాధాన్యం ఏర్పడుతోంది. అలాగని షరీఫ్ గద్దెనెక్కగానే అంతా సమూలంగా మారిపోతుందని కూడా ఏమీ కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఎన్నికల సీజన్ , అంతే! మార్పులపై తీవ్రమైన అంచనాలు! పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏవో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయన్న అంచనాలైతే బల పడుతున్నాయి. దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే పాక్‌లోనూ ఎన్నికల ప్రక్రియ మూడు దశల్లో పూర్తవుతుంది. ఇప్పు డున్న సాధారణ అంచనా ప్రకారం షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్ ) మెజారిటీ సాధిస్తుంది. షరీఫ్‌ను నాలుగోసారి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైందని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ విషయానికి వస్తే జైల్లో ఉన్న ఈ మాజీ ప్రధానికి చెందిన పార్టీ ముక్కలు ముక్కలై ఉంది. పార్టీలో ఒకప్పుడు దిగ్గజాలుగా ఉన్నవారు ఇప్పుడు మాకేంసంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీరు గతంలో ఇమ్రాన్ వైపు మొగ్గిన సందర్భంలోనూ మిలిటరీకి వ్యతిరేకంగా ఉండాల్సి వస్తుందని ఊహించి ఉండరు. వీరిని మినహాయిస్తే మిగిలిన మద్దతు దారులు అనేక రకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎందరు ఎన్నికల్లో పోటీకి దిగుతారన్నది కూడా అనుమానమే. ఇంకోపక్క ఈ వాదనకు ప్రతివాదనలు రెండు వినిపిస్తున్నాయి. ఏవీ కొట్టిపారేసేవి కాదు. అవేమిటంటే... ఇమ్రాన్ ఖాన్‌కు ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఉందన్న అంశం మొదటిది. ఆయన ఆశీస్సులున్న నేతలు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారన్నది రెండో విషయం. నవాజ్ షరీఫ్ చరిత్రను తరచి చూస్తే అతడేమంత నమ్మదగ్గ వ్యక్తి కాదని ఆర్మీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి చాలాకాలంగా ఉన్నవే. గతంలో ఇమ్రాన్ ఖాన్ కు చేసినట్లే ఇప్పుడు కూడా నవాజ్‌కు అడ్డంగా ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ తొలగిస్తే గతానుభ వాలు మళ్లీ ఎదురు కావన్న గ్యారెంటీ ఏమిటని ఆర్మీ వర్గాల్లో కొందరు సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది చెబుతున్నదేమిటంటే... వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ రాదూ, హంగ్ ఏర్పడుతుందీ అని! తద్వారా పగ్గాలు ఆర్మీ ఆధీనంలోనే ఉంటాయని భావిసు ్తన్నారు. ఆసక్తికరమైన ఇంకో విషయం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఈ రెండు వాదనలకు బలం చేకూరుతూండగానే... అసలు ఎన్నికలే జరగవన్న మూడో వాదన కూడా మొదలైంది. ఒకవేళ జరిగినా అవి ఫిబ్రవరిలో కాకుండా, బాగా జాప్యం తరువాతేనని అంటున్నారు. అసలు విషయాలు వేరే... ఇప్పటివరకూ చెప్పుకొన్న అంచనాలు ఎన్నికలు జరిగేంతవరకూ కొనసాగడం గ్యారెంటీ. కానీ వీటిన్నింటికంటే అతి ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఎదు ర్కోవాల్సిన సవాళ్లు ఇవి. దయనీయ స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వీటిల్లో ఒకటైతే, అంతర్గత భద్రత రెండోది. అఫ్గానిస్తాన్‌లో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతూండటం కూడా పాక్‌కు ఒక సవాలే. వచ్చే ఏడాది పాక్ భవిష్యత్తును నిర్ణయించేవి ఈ మూడు అంశాలే అన్నా అతిశయోక్తి లేదు. నవాజ్ షరీఫ్ ప్రకటనల్లో భారత్ ప్రస్తావన తరచూ వస్తోంది. పైగా ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవి కాదు. సానుకూలంగా ఉన్నవే. భారత్‌తో కనీస స్థాయి సంబంధాలు కలిగి ఉండాలన్న వాదన వినిపించే భారమిప్పుడు ఈయనే మోస్తున్నారని చెప్పాలి. ఇది షరీఫ్ బలమని కొందరి నమ్మకం. కొందరు బలహీనతగానూ చూస్తున్నారు. ఈ చర్చలో మనమూ భాగస్వాములం కాగలమా? ఎన్నికల ఫలితాల తరువాత కానీ అర్థం కాదు. భారత్, పాక్ సంబంధాలిప్పుడు కీలక దశలో ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. ఈసారి ఉగ్రవాదం, కశ్మీర్, వ్యూహాత్మకంగా ఇరుదేశాల మధ్య ఉన్న అపనమ్మకం వంటివి మును పటిలాగానే సమస్యను పీటముడి స్థాయికి తీసుకొచ్చాయి. ఇరువైపుల నుంచి చొరవ, చేతలు రెండూ ఉంటేగానీ ఈ పీటముడి విడిపడదు. ఒక్కటైతే నిజం. ఈ పీటముడి పూర్తిగా విడిపోకపోయినా, కనీసంకొంత వదులుగానైతే తప్పకుండా మారాలి. ఈ దిశగా భారత దేశమే చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనపరచాలి. దక్షిణాసియా రాజకీయాల్లో, భారత పాకిస్తాన్ చరిత్రలోనూ ఇదేమీ తెలియని అంశమైతే కాదు. - టి.సి.ఎ. రాఘవన్ వ్యాసకర్త పాకిస్తాన్లో భారత మాజీ హై కమిషనర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఇమ్రాన్ స్థానంలో గోహర్ అలీ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్–ఇ– ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చీఫ్‌గా గోహర్ అలీ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎన్నికల గుర్తుగా ‘బ్యాట్’ కొనసాగాలంటే సంస్థాగత ఎన్నికలు జరపాల్సిందేనన్న ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఈ ఎన్నిక జరిగినట్లుగా భావిస్తున్నారు. గోహర్ పేరును ఇమ్రాన్ ప్రతిపాదించారు. శనివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో గోహర్(45) పార్టీ అధ్యక్ష పదవికి పోటీ లేకుండా ఎన్నికైనట్లు డాన్ పత్రిక తెలిపింది. తోషఖానా అవినీతి కేసు సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇమ్రాన్ సెప్టెంబర్ నుంచి జైలులో∙ఉన్నారు. అందుకే, సంస్థాగత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేకపోయారు. -
ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురు దెబ్బ
ఇస్లామాబాద్: అల్–ఖదీర్ ట్రస్టు అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రహస్య పత్రాల లీకేజీ కేసులో రావలి్పండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) అల్–ఖదీర్ ట్రస్ట్ కేసులో ఈ నెల 14న అదుపులోకి తీసుకుంది. రూ.2 వేల కోట్లు మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తున్న ఈ కేసులో ఇమ్రాన్‌ను కస్టడీకివ్వాలన్న ఎన్ఏబీ వాదనను జడ్జి తోసిపుచ్చుతూ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. -
పాక్‌లోనూ ఎన్నికల హడావిడి
పాకిస్తాన్ వార్షిక వృద్ధిరేటు అసాధారణంగా అత్యంత తక్కువగా మైనస్ 0.5 శాతం దగ్గర ఉంది. ఐఎమ్ఎఫ్ నుండి అందే బెయిల్ అవుట్లు, స్నేహ పూర్వక అరబ్ దేశాల నుండి, ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ నుండి కాలానుగుణంగా అందుతున్న ఆర్థిక సహాయాల మీదే పాక్ నిరంతరం ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ 2024 జనవరిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. పోటీ నుండి తప్పించబడినప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ ప్రభావాన్ని విస్మరించలేము. నవాజ్ షరీఫ్ స్వయంగా విధించుకున్న ప్రవాసం నుండి తిరిగి రావడం ఆయన మద్దతుదారులను ఉత్సాహపరిచింది. అయినప్పటికీ, సైన్యం వల్ల ప్రభావితమయ్యే నాయకులతో కూడిన మరో సంకీర్ణ ప్రభుత్వమే అక్కడ ఏర్పడనుందనడంలో ఏ సందేహమూ లేదు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌లో అఫ్గానిస్తాన్ చేతిలో పాకిస్తాన్ పొందిన ఘోర పరాజయం ఆ దేశ ప్రజలకు తీవ్ర నిరాశను కలిగించింది. సహజంగానే క్రికెట్లో తమ విజయాల రికార్డ్ గురించి పాకిస్తానీలు ఎంతో గర్వపడతారు. అసలే పాకిస్తాన్ ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో వారికి ఈ నిరాశ ఎదురైంది. వార్షిక వృద్ధిరేటు అసాధారణంగా అత్యంత తక్కువగా మైనస్ 0.5 శాతం దగ్గర ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీనిని ప్రస్తుతం 29.6 శాతంగా అంచనా వేశారు. ఇప్పుడు 22 శాతంగా అంచనా వేస్తున్న వడ్డీ రేట్లు, దేశంలోని వ్యాపార కార్యకలాపాలను ధ్వంసం చేస్తున్నాయి. కేవలం కొన్ని వారాల క్రితం, విదేశీ మారక ద్రవ్య వనరులు 4.19 బిలియన్ డాలర్లకు క్షీణించాయని పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. ఇవి ఒక నెల కఠినంగా క్రమబద్ధీకరించిన దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఇది ఆర్థికవేత్తలకు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలకు కూడా ఒక పీడకలగా మారింది. దీనికితోడు గత సంవత్సరం కురిసిన కుండపోత వర్షాలు, కనీవినీ ఎరుగని వరదలు దేశవ్యాప్తంగా 3.3 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపాయి. వరదల ఫలితంగా సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేశారు. ఇమ్రాన్ వర్సెస్ మునీర్ ఈ ఆర్థిక ఒడుదొడుకులు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తొలగించడానికి దారితీసిన రాజకీయ పరిణామాలతో జతకూడి ఉన్నాయి. పంజాబ్‌లో విజయవంతమైన ముఖ్యమంత్రిగా పనిచేసిన షెహ బాజ్ షరీఫ్ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రధానిగా నాయకత్వం వహించారు. ఆయన ఆర్థిక గందరగోళాన్ని, దేశవ్యాప్తంగా పెరుగు తున్న రాజకీయ విభజనను ఎదుర్కోవలసి వచ్చింది. అనివార్యమైన ఐఎమ్ఎఫ్(అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) కఠిన షరతులను షెహబాజ్ అంగీకరించడానికి చాలా తీవ్రమైన చర్చలు జరిగాయి. భారీ విదేశీ సహాయం కోసం తలుపులు తట్టాలంటే, పాకిస్తాన్‌కు ఐఎమ్ఎఫ్ వెన్నుదన్ను అనేది కనీసం అవసరం. ఐఎమ్ఎఫ్ నుండి అందే బెయిల్ అవుట్లు, స్నేహపూర్వక అరబ్ దేశాల నుండి, ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ నుండి కాలనుగుణంగా అందుతున్న ఆర్థిక సహాయాల మీదే పాకిస్తాన్ నిరంతరం ఆధారపడుతోంది. ఈలోగా, తనకు ముందటివాడు, గురువు అయిన జనరల్ కమర్ జావేద్ బాజ్వాకు ఎంతో ఇష్టుడైన జనరల్ సయ్యద్ అసీమ్ మునీర్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇమ్రాన్ తనను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించి, రొటీన్ పనులు, అప్రధానమైన అసైన్ మెంట్లు ఇచ్చిన రోజుల గురించి జనరల్ మునీర్‌కు సంతోషకరమైన జ్ఞాపకాలు ఉండే అవకాశం లేదు. ఈ పరిణామాలు ఇమ్రాన్, జనరల్ మునీర్ నేతృత్వంలోని సాయుధ దళాల మధ్య నిష్ఫలమైన పోరాటానికి దారితీశాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాజీ ఫైజ్ ఇసా మద్దతును పొందుతున్న ఇమ్రాన్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. కానీ ప్రధాన న్యాయమూర్తి ఇసాకు ఇప్పుడు తన మార్గం అంత తేలిక కాదు. ఎందుకంటే ఆయన జూనియర్ సహోద్యోగులు ఆయన పదవీ విరమణ అనంతర పరిస్థితులను ఊహిస్తున్నారు. వారు ఇమ్రాన్ ను రక్షించడంలో ఆయన ఉత్సాహాన్ని ఇప్పుడు పంచుకోవడం లేదు. పైగా ఈ ప్రక్రియలో, ఇప్పుడు కూడా విస్తారమైన అధికారాలను, ప్రభావాన్ని కలిగి ఉన్న సాయుధ దళాల ఆగ్రహానికి గురవుతారు. ఇదే సమయంలో, దేశం ఎన్నికల ప్రక్రియ కోసం సమాయత్తమవుతోంది. 2024 జనవరిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. సెన్యం నుండి తగిన మద్దతుతో, పాకిస్తాన్ ఎన్నికల యంత్రాంగం, శాంతి భద్రతల యంత్రాంగం విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తాయని ఎవరైనా ఆశించవచ్చు. అయితే, సైన్యం కష్టాలు కూడా కొనసాగుతున్నాయి. జనరల్ బాజ్వాకు జనరల్ మునీర్ ఇష్టమైనవాడు అయినప్పటికీ, పదవి నుండి తొలగించబడిన ఏడాదిన్నర తర్వాత కూడా మంచి ప్రజాకర్షణ కలిగిన ఇమ్రాన్ తో ఆయనకు తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. అదే సమయంలో ఇమ్రాన్ కూడా తన అహంకారపూరితమైన, దుర్మార్గపు ప్రవర్తన వల్ల రాజకీయ వర్గాల్లో చాలామంది స్నేహితులను కోల్పో యారు. ముఖ్యంగా, తన పార్టీ ఎన్నికల ఓటమిని నిర్ధారించడానికి సిద్ధంగా ఉన్న ఆర్మీ నాయకత్వంలోని మిత్రులకు దూరమయ్యారు. భారత్‌తో ఎలా వ్యవహరిస్తారు? ఇమ్రాన్ లా కాకుండా, జనరల్ బాజ్వా స్వాభావికంగా భారత్ వ్యతిరేకి కాదు. భారత్‌తో సంబంధాలను మెరుగు పరుచు కునేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఆయన అమెరికాకు సన్నిహితుడు. అమెరికా ఆదేశాల మేరకు ఉక్రెయిన్ కు పాకిస్తాన్ ఆయుధాల అమ్మకాలను కూడా ఆమోదించారు. ఈ చర్య కచ్చితంగా ఐఎమ్ఎఫ్ సహాయం కోసం అమెరికా సహకారాన్ని పొందడంలో, దివాళా తీయకుండా కాపాడటంలో పాకిస్తాన్ కు సహాయపడింది. జనరల్ బాజ్వా అనుసరించిన వాస్తవిక దృష్టిని జనరల్ మునీర్ చూపించగలడా, 1971లో జనరల్ యాహ్యా ఖాన్ అనుసరించిన వినాశకరమైన మార్గాన్ని ఇష్టపడతాడా అనేది చూడాలి. జనరల్ ముషారఫ్ హయాంలో జరిగినట్టుగా జమ్మూ కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలోని పురోగతిలోనే భారతదేశంతో సంబంధాలలో శాంతి నెలకొల్పవచ్చని ఆయన గుర్తుంచుకోవాలి. తాను నాయకత్వం వహించిన కార్గిల్ విపత్తు తర్వాత, భారత దేశంతో వివాదాన్ని ప్రోత్సహించడం లేదా రెచ్చగొట్టడం లోని నిష్ప్రయోజకత్వం గురించి, దాంట్లో ఉన్న ప్రమాదాలను గురించి ముషారఫ్ పాఠాలు నేర్చుకున్నారు. జనరల్ మునీర్ భారతదేశంపై గట్టి ప్రకటనలు జారీ చేయడంలో ఖ్యాతిని సంపాదించుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల నియంత్రణ రేఖ వెంబడి, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు, చొరబాట్లు కూడా జరిగాయి. పాకిస్తాన్ ఆర్థిక అవసరాలు, పరిమితుల గురించి జనరల్ మునీర్ వాస్తవిక దృక్పథాన్ని తీసుకుంటారని అందరూ ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది భారత్, పాకిస్తాన్లలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. విదేశాంగ, భద్రతా విధానాల సమస్యలపై భారతదేశంలో ఉన్న విస్తృత జాతీయ ఏకాభిప్రాయంలా కాకుండా, సైన్యం ఆధిపత్యం కొనసాగడం వల్ల కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఏ దిశలో నడుస్తుందో విశ్లేషించడం కష్టతరం అవుతోంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా విధించుకున్న ప్రవాసం నుండి తిరిగి రావడం పాకిస్తాన్ ముస్లిం లీగ్‌లోని ఆయన మద్దతుదారులను ఉత్సాహపరిచింది. అయినప్పటికీ, సైన్యం వల్ల ప్రభావితమయ్యే నాయకులతో కూడిన మరో సంకీర్ణ ప్రభుత్వమే పాకిస్తాన్లో ఏర్పడుతుందనడంలో ఏ సందేహమూ లేదు. పోటీ నుండి తప్పించబడినప్పటికీ, ప్రజా జీవితంలో ఇమ్రాన్ ప్రభావాన్ని కూడా విస్మరించలేము. జి. పార్థసారథి వ్యాసకర్త జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్స్లర్, పాకిస్తాన్ లో భారత మాజీ హైకమిషనర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో మేనల్లుడు.. దాదాపు 8 ఏళ్ల తర్వాత!
ప్రముఖ బాలీవుడ్ నటుడు, అమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాను త్వరలోనే సినిమాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అతను చివరిగా కంగనా రనౌత్‌తో కలిసి 2015లో విడుదలైన కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. ఆదివారం ముంబయిలో జరిగిన ముంబయిలో జరిగిన ఐఎఫ్‌పీ ఫెస్టివల్ సీజన్ -13 ముఖ్య అతిథిగా హాజరైన ఇమ్రాన్ ఖాన్ తన పునరాగమనంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. "రీ ఎంట్రీపై నా దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. కానీ ప్రస్తుతం స్క్రిప్ట్‌లను చదువుతున్నా. బాలీవుడ్ చిత్రనిర్మాతలతోనూ మాట్లాడుతున్నా. వచ్చే ఏడాది రీ ఎంట్రీ ఉంటుందని ఆశిస్తున్నా.' అని అన్నారు. సినిమాల గురించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. 'సినిమాలను చూడటం, హీరోల నుంచి ప్రేరణ పొందడం వల్ల ప్రేక్షకుల నుంచి తనకు ప్రశంసలు వచ్చాయి. సినిమా చూస్తున్న అనుభూతిని ఆస్వాదించానని.. ఈ ప్రపంచంతో తాను భావోద్వేగాలతో ముడిపడి ఉన్నట్లు చెప్పాడు. నా చిన్నప్పుడు సినిమాలు చూసి ఆనందించాను. నాకు 8 ఏళ్ల వయస్సులో ఇండియానా జోన్స్ చూడటం ఇప్పటికీ గుర్తుంది. అది నా మనసును కదిలించింది. నేను ఇండియానా జోన్స్ హీరో లాగే గోధుమ రంగు లెదర్ జాకెట్ కొన్నాను. ఇదే నేను ఓ హీరోని అనుకరించడానికి ప్రయత్నించిన తొలి జ్ఞాపకం" అని గుర్తు చేసుకున్నారు. తన సినిమా 'జానే తు యా జానే నా' సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 80వ దశకంలో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ లాంటి యాక్షన్ చిత్రాలు ఉండేవి.. ఇండియన్ సినిమాలో ఈ పాత్రలు తక్కువగా ఉన్నాయని నేను భావించానని తెలిపారు. కాగా.. ఇటీవలే ఇమ్రాన్ అబ్బాస్ టైర్వాలాతో వెబ్ సిరీస్ నటించనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. View this post on Instagram A post shared by Imran Khan (@imrankhan) -
స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..
మంచి కండలు తిరిగే బాడీ కావాలని ఎవరికి ఉండుదు. యువకులు దీని గురించి జిమ్ సెంటర్లలో గంటల తరబడి నానా హైరానా పడుతుంటారు. కండలు తిరిగిన దేహదారుఢ్యం రావాలంటే టైం పడుతుంది. అందులో ఎలాంటి డౌంట్ లేదు. కానీ కొందరూ ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా కండల వంటి దేహం కోసం పక్కదారుల్లో ప్రయాణిస్తారు. అందుకోసం స్టెరాయిడ్స్‌ను వాడతారు. ముందు బాగానే ఉన్నా రానురాను దాని దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. సినితారలు దగ్గర నుంచి కాలేజ్ కుర్రాళ్ల వరకు కండలు తిరిగే దేహం కోసం స్టెరాయిడ్లు వాడి లేనిపోని అనారోగ్య సమస్యల బారిన పడిన ఉదంతాలు కోకొల్లలు. ఈ స్టెరాయిడ్స్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించే ఈ కథనం. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ సైతం తాను కూడా ఈ స్టెరాయిడ్లు వాడానని, ఏమాత్రం సంకోచించకుండా చెప్పడమే కాకుండా వాడొద్దని హెచ్చరిస్తున్నాడు. తాను 'జానే తు యా జానే' సినిమాలోని ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ దీని గురించి వివరించాడు. తాను సన్నగా ఉండటంతో అందరూ ఎగతాళి చేసేవారని, బాడీ బిల్డర్లాగా దేహాన్ని తయారుచేయమని ఒత్తిడి చేసేవారేని చెప్పుకొచ్చాడు. కానీ తాను ఎంత తిన్న.. సన్నగా కనబడే బాడీ తత్వం కారణంగా లావు అవ్వడం కష్టంగా ఉండేది. మొదట్లో ఎస్ సైజు దుస్తులే తనకు చాలా లూజ్‌గా ఉండేవని చెప్పుకొచ్చాడు. అంతేగాదు తన తొలి సినిమా జానే తులో సన్నగా కనిపంచకుండా ఉండటం కోసం రెండు షర్ట్లు వేసుకుని నటించినట్లు తెలిపాడు ఆ తర్వాత బాడీ పెంచడం కోసం స్టెరాయిడ్లు వాడి తన దుస్తుల సైజుని పెంచానని నిర్మొహమాటంగా చెప్పాడు. దీని వల్ల తాను చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను వాడటం లేదని, కేవలం సహజసిద్ధమైన వాల్నట్స్, పసుపు వంటి వాటినే తీసుకుంటున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపాడు. స్టెరాయిడ్స్ అంటే.. అనాబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్లు(ఏఏఎస్) లేదా కండరాలను పెంచడానికి ఉపయోగించే టెస్టోస్టెరాన్ సింథటిక్ రూపం. నిపుణుల అభిప్రాయం ప్రకారం..స్టెరాయిడ్స్ శరీరంలోని కండరాలు, వెంట్రుకలు, కుదుళ్లు, ఎముకలు, కాలేయం,మూత్రపిండాలు వంటి వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి. మగవాళ్లలో ఉండే హార్మోన్ అయినా ఇది మహిళల్లో కూడా 15-70 ఎన్జీ/డీఎల్ వరకు ఉంటాయి. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. ఎదురయ్యే దుష్పరిణామాలు.. వ్యాయమం చేయక్కర్లే కుండా మంచి దేహ సౌష్టవం రావడం కోసం వాడినప్పడు ఇది శరీరంలో రక్తపోటు తోపాటు గుండె ఎడమ జఠరిక పరిమాణాన్ని పెంచుతుంది. ఫలితంగా గుండె జబ్బులు బారిన పడి ఆకస్మిక మరణాల సంభవించే అవకాశం ఉంది. ఇది దూకుడుగా ప్రవర్తించేలా లేదా ఉద్రేకతను పెంచుతుంది. కాలేయానికి హాని కలిగించొచ్చు నిరంతరంగా ఉపయోగించడం వల్ల హైపోగోనాడిజమ్కు కారణమవుతుంది. వృషణాల పనితీరు తగ్గిపోయాల చేసి చివరకు వంధ్యత్వానికి దారితీస్తుంది. ఇది నెమ్మదిగా స్పెర్మ్ కౌంట్‌ని తగ్గించేస్తుంది. ఫలితంగా పిల్లలను కనే సామర్థ్యం తగ్గిపోతుంది. View this post on Instagram A post shared by Imran Khan (@imrankhan) (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా) -
వచ్చే 13 వరకు జైల్లోనే ఇమ్రాన్
ఇస్లామాబాద్: అధికార రహస్య పత్రాల లీకేజీ కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు సెప్టెంబర్ 13వ తేదీ వరకు ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది. తోషఖానా కేసులో ఇమ్రాన్‌కు దిగువ కోర్టు విధించిన మూడేళ్ల జైలుశిక్షను కొట్టివేస్తూ మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, రహస్య పత్రాల లీకేజీ కేసు విచారణలో ఉన్నందున ఆయనకు ఒక రోజు రిమాండ్ విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశాలిచ్చారు. భద్రతా కారణాల రీత్యా ఇమ్రాన్ విచారణను పంజాబ్ ప్రావిన్స్‌లోని అటోక్ జైలులోనే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జడ్జి అబువల్ హస్నత్ జుల్కర్నయిన్ బుధవారం జైలుకు చేరుకున్నారు. జైలు లోపలే కేసును విచారించి, ఇమ్రాన్ రిమాండ్‌ను వచ్చే 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారని జియో న్యూస్ తెలిపింది. దీంతో, ఆగస్ట్ 5 నుంచి ఉంటున్న అటోక్ జైలు నుంచి వెంటనే విడుదల కావాలన్న ఇమ్రాన్ ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లయిందని జియో న్యూస్ పేర్కొంది. విచారణ సమయంలో ఇమ్రాన్ తరఫు లాయర్ల బృందంలోని ముగ్గురికి మాత్రమే లోపలికి వెళ్లేందుకు అవకాశం కల్పించారని తెలిపింది. గత ఏడాది మార్చిలో పార్లమెంట్లో ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కొద్ది రోజులు ముందు జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్.. తనను గద్దె దించేందుకు విదేశీ శక్తి కుట్ర పన్నిందనేందుకు ఇదే సాక్ష్యమంటూ ఓ డాక్యుమెంట్‌ను తీసి బహిరంగంగా చూపించారు. అమెరికా విదేశాంగశాఖ అధికారులు అక్కడి పాక్ రాయబారితో భేటీ అయ్యారని, దానికి సంబంధించిన వివరాలున్న డాక్యుమెంట్లను చట్ట విరుద్ధంగా పొందిన ఇమ్రాన్ వాటిని బహిరంగ పరిచారని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయనపై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం
ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరటనిచ్చింది ఇస్లామాబాద్ హైకోర్టు. ఈ కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ళ జైలు శిక్షను నిలిపివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. తోషఖానా అవినీతి కేసులో ట్రయల్ కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి అమిర్ ఫరూఖ్, న్యాయమూర్తి తరీఖ్ మహమూద్ జహంగిరిలతో కూడిన డివిజన్ బెంచ్ తోషఖానా కేసులో ఉత్కంఠతకు తెరదించుతూ సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఇమ్రాన్ ఖాన్‌కు విధించిన మూడేళ్ళ జైలుశిక్షను నిలిపివేసింది. 2018 నుండి 2022 వరకు పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై దేశ సంపదను అక్రమంగా అమ్ముకున్నారన్న నేరంపై పంజాబ్ ప్రావిన్స్‌లోని అటక్ జిల్లా జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఇదే కేసులో మరో ఐదేళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా వీల్లేదని తెలుపుతూ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఆ తీర్పును నిలిపివేయడంతో ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం లభించినట్లయింది. ఇది కూడా చదవండి: అమెరికా పర్యటనలో కేటీఆర్...క్రిటికల్ రివర్ కంపెనీతో భేటీ -
తోషఖానా కేసులో దిగువ కోర్టు తీర్పు తప్పు
ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులున్నట్లు ఇస్లామాబాద్ హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’కు అందిన ఖరీదైన బహుమతుల విక్రయంలో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ అవినీతికి పాల్పడ్డారంటూ పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) వేసిన కేసుపై విచారణ జరిపిన ఇస్లామాబాద్ కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధారించింది. ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 5న తీర్పు వెలువరించింది. దీంతో, మరో అయిదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన అర్హత కోల్పోయారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ వేసిన పిటిషన్‌ను శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆమెర్ ఫరూఖ్ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, విచారణకు ఈసీపీ తరఫు లాయర్ అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు. విచారణను వాయిదా వేయాలని ఆయన సహాయక లాయర్లు ధర్మాసనాన్ని కోరారు. ధర్మాసనం వినతిని తోసిపుచ్చింది. ‘ట్రయల్ కోర్టు తప్పు చేసింది. ఆ తప్పుల్ని మేం చేయదలుచుకోలేదు. పిటిషన్‌పై విచారణ కీలక దశలో ఉంది. అందుకే విచారణను సోమవారానికి మాత్రమే వాయిదాగలం. సోమవారం ఎవరూ రాకున్నా మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం’అని స్పష్టం చేసింది. పాక్ సుప్రీంకోర్టు కూడా ఇమ్రాన్‌కు జైలు శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులున్నట్లు బుధవారం వ్యాఖ్యానించింది. ఇమ్రాన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్నందున వేచి చూస్తామని తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ ఇరవై రోజులుగా అటోక్ జైలులో ఉన్నారు. -
అగ్నికి ఆజ్యం పోసిన అరెస్టు
రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయ కనుసన్నల్లో ఇస్లామాబాద్ ప్రభుత్వం మెలగాల్సి రావడం పాకిస్తాన్ రాజకీయాలకు సంబంధించిన ఒక క్రూరమైన వ్యంగ్యాన్ని సూచిస్తుంది. ప్రధాని పదవికి ఇమ్రాన్ ఖాన్ చేరువకావడం, ఆ తర్వాత ఆయన అవమానకరమైన పతనం రెండూ సైనిక నాయ కత్వపు స్థిరత్వానికి చక్కటి ఉదాహరణ. పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక, భద్రతకు సంబంధించిన అనేక సవాళ్లను ఇమ్రాన్ అరెస్టు ఉదంతం మరింతగా పెంచుతుంది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి 282 రూపాయల కంటే తక్కువగా ఉండటంతో ఆర్థిక అవకాశాలు వట్టిపోతున్నాయి. దాతల సహాయాన్ని కోరుతున్నప్పుడు తరచుగా తిరస్కారానికి గురయినట్లు పాక్ తాజా మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన తర్వాత ఆగస్టు 5న అరెస్టు చేశారు. చట్టం నిర్దేశించినట్లుగా ‘విచారణ ప్రక్రియ’ మార్గంలో వెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండానే, ప్రభుత్వ వ్యవస్థ ప్రధాన అంగం మాజీ ప్రధానమంత్రిపై దాడి చేసింది. ఇమ్రాన్ ఖాన్‌కు మునుపటి పాలకుల్లో కొందరు ఇటీవలి దశాబ్దాలలో అను భవించిన సుపరిచితమైన శిక్షా క్రమంలో ఇదీ భాగమే. రాజకీయ నేతగా మారిన ఈ ప్రజాకర్షక క్రికెటర్‌ను 2023 మే 9న అరెస్టు చేశారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఈ అరెస్టును ‘చట్టవిరుద్ధం’గా ప్రకటించి, ఆయన్ని విడుదల చేయగా, అది హింసాత్మక నిరసనలకు దారి తీసింది. ఫలితంగా 10 మంది మరణించారు. ప్రజా ఆస్తులకు గణనీ యమైన నష్టం వాటిల్లింది. ఈసారి ఇమ్రాన్ అరెస్టుకు వీధుల్లో ప్రజల ప్రత్యక్ష మద్దతు ఇంకా లభించలేదు. ఇమ్రాన్ సొంత పార్టీ అయిన పాకిస్తాన్ తహరీక్–ఎ– ఇన్సాఫ్ (పీటీఐ), ఆయన్ని పంజాబ్ రాష్ట్రంలోని అటక్ జైలు నుండి రావల్పిండిలోని అత్యంత భద్రత కలిగి వున్న అదియాలా జైలుకు మార్చాలని ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇమ్రాన్‌కు మునుపు దేశాన్ని పాలించిన మాజీ ప్రధానులు షాహిద్ ఖాకన్ అబ్బాసీ, నవాజ్ షరీఫ్, బేనజీర్ భుట్టో కూడా అదే విధంగా క్రూర బెదిరింపులకు గురయ్యారు. విచారణను ఎదుర్కుంటూ, 1979లో ఉరిశిక్షకు గురైన జుల్ఫికర్ అలీ భుట్టోకు పట్టిన గతి తెలిసిందే. రాజకీయ అదృష్టం ముఖం చాటేసినప్పుడు, పాకిస్తాన్ రాజ్యవ్యవస్థ తన సొంత అగ్రనేతలకు విధించే తీవ్రమైన శిక్ష ఎలాంటిదో భుట్టో ఉదంతం గుర్తుచేస్తుంది. ఇమ్రాన్ పొందిన ఈ పతనం, పాకిస్తాన్ సైన్యం ఆయన పట్ల అభిమానం కోల్పోయిందని సూచిస్తుంది. ప్రత్య క్షంగా లేదా పరోక్షంగా పాక్ సైన్యం చేతుల్లో పగ్గాలు ఉంటాయి. సైనిక ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ నాయకత్వం మసలుకోన ప్పుడు లేదా మరీ ఎక్కువగా స్వతంత్రత ప్రదర్శించినప్పుడు పాక్ సైన్యం రాజకీయ నాయకత్వాన్ని అధికారం నుండి దింపేస్తుంది. రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయ కనుసన్నల్లో ఇస్లామాబాద్ ప్రభుత్వం మెలగాల్సి రావడం పాక్ రాజకీయాలకు సంబంధించిన ఒక క్రూరమైన వ్యంగ్యాన్ని సూచిస్తుంది. శాసన సభ్యులు ఎంత ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించవచ్చో నిర్ణయించేది సైన్యమే. స్పష్టంగా, సైన్యం మద్దతిచ్చి మరీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చో బెట్టిన ఇమ్రాన్ ఆ సైన్యం చేతినే కొరకడంతో పాక్ సైనిక నాయకత్వం చాలా అసౌకర్యాన్ని అనుభవించింది. పాకిస్తాన్లో అత్యు న్నత కార్యా లయానికి (ఆగస్టు 2018) ఇమ్రాన్ ఒక్కసారిగా చేరువ కావడం, ఆ తర్వాత ఆయన అవమానకరమైన పతనం రెండూ సైనిక నాయ కత్వపు స్థిరత్వానికి చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. 1996లో ఇమ్రాన్ స్థాపించిన పాకిస్తాన్ తహరీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) ఒకప్పుడు దేశ రాజకీయాల్లో పరాయి పార్టీగా ఉండేది. దశాబ్ద కాలంలోనే, పాక్‌లో బలంగా ఉన్న పార్టీలకు ఇది గట్టి ప్రత్యర్థిగా నిలిచింది. నైతికంగా తన ఉన్నత స్థానాన్ని ప్రకటిస్తూ, పాత నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించింది. ఎన్నికైతే స్వచ్ఛ మైన ప్రభుత్వాన్ని అందిస్తానని వాగ్దానం చేసింది. 2013 జూన్‌లో మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నవాజ్ షరీఫ్ ఎప్పుడూ పూర్తి కాలంపాటు దేశాన్ని పాలించ లేకపోయారు. ప్రభుత్వం లోపలి ప్రభుత్వం, అంటే సైనిక వ్యవస్థ ప్రయోజనాలకు ఎంతో కాలం సేవచేయడని రావల్పిండిలోని సైనిక హెడ్ క్వార్టర్స్ నిర్ణయించుకున్న ప్రతిసారీ షరీఫ్ తన ప్రధాని పదవి కోల్పోయారు. ఇమ్రాన్ పార్టీ ఆయన్ని లక్ష్యంగా చేసుకున్న తర్వాత 2017 జూలైలో షరీఫ్ చివరిసారిగా బలవంతంగా అధికారం నుంచి నిష్క్రమించారు. వివిధ నేరాలకు పాల్పడ్డారని అభియోగాలు మోప బడి, అవమానకరమైన రీతిలో దేశం విడిచి వెళ్లడానికి ముందు నవాజ్ షరీఫ్ జైలు పాలయ్యారు. అనంతరం ఆయన సోదరుడు షెహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యారు. పెద్ద షరీఫ్ త్వరలో దేశానికి తిరిగి వస్తారనీ, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ పీఎమ్ఎల్(ఎన్)ను అధికారంలోకి తేవడానికి నాయకత్వం వహిస్తారనీ షెహబాజ్‌కు తెలుసు. పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక, భద్రతకు సంబంధించిన అనేక సవాళ్లను ఇమ్రాన్ అరెస్టు ఉదంతం మరింతగా పెంచుతుంది. ప్రస్తుత జాతీయ అసెంబ్లీ తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకొని, ఆపద్ధర్మ ప్రభుత్వానికి పగ్గాలు అప్పగించడానికి మూడు రోజుల ముందు, ఆగస్టు 9న జాతీయ అసెంబ్లీ రద్దవుతుందని షెహబాజ్ షరీఫ్ గత వారం ప్రకటించారు (అనుకున్నట్టుగానే ఆగస్టు 9న రద్దయింది). ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించేందుకే ప్రజాదరణ ఉన్న ఇమ్రాన్ అరెస్టును ప్లాన్ చేశారనీ, ఈ అంశంపై షరీఫ్, భుట్టో–జర్దారీ నేతృత్వంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు రావల్పిండి సైనిక నాయకత్వంతో కుమ్మక్కయ్యాయనీ విమర్శకులు అంటున్నారు. రాజకీయ దుమారాన్ని మరింతగా పెంచడానికి, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా డిజిటల్‌గా ప్రారంభించిన జాతీయ జనాభా గణన ఫలితాన్ని ఆమోదించింది. తద్వారా అక్టోబర్, నవంబర్‌లో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయవచ్చనే ఊహాగా నాలకు తెరలేచింది. పాకిస్తాన్ ప్రస్తుత ఆర్థిక ద్రవ్య స్థితి శుష్కించి ఉంది. దాతల సహాయాన్ని కోరుతున్నప్పుడు తరచుగా తిరస్కారానికి గురవు తున్నట్లు షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. ‘ఈరోజు మనం తలెత్తు కుని జీవించాలా లేక భిక్షాటన చేస్తూ బతకాలా అనేది నిర్ణయించు కోవాలి’ అని ఆయన అన్నారు. ‘భారతదేశం ముందుకు సాగింది, కానీ మన సొంత తప్పిదాల వల్ల మనం వెనుకబడిపోయాము’ అని కూడా అంగీకరించారు. దాయాది దేశం పట్ల ఇది అరుదైన దాపరికం లేని మాట అనే చెప్పాలి. పాకిస్తాన్ లోపాలు దాని డీఎన్ఏలో నిక్షిప్తమై ఉన్నాయి. వలస పాలన అనంతర ఎన్నో దేశాలు సమర్థవంతమైన పౌర పాలనకు పరివర్తన చెందడానికి అనుసరించిన సూత్రప్రాయ రాజకీయ ప్రక్రి యలను అణచివేయడంలో ఉన్నాయి. విచారకరంగా, పాక్ సైన్యం, కశ్మీర్‌ను తన శాశ్వత బోగీగా ఉపయోగించుకుని, రాజ్యాధికారం, ఆర్థిక ప్రాధాన్యతలకు చెందిన చాలా ముఖ్యమైన మీటలను ఏకీకృతం చేసుకుంది. అటువంటి ఆధిపత్య ప్రదర్శనకు సైన్యాన్ని అనుమతించడం వల్ల ప్రభుత్వంపై పడే ఖర్చు గురించి పాకిస్తాన్ పౌర సమాజంలోని కొన్ని వర్గాలు జాతిని హెచ్చరించాయి కానీ అవి ఫలించలేదు. ఈ ప్రాణాంతకమైన వ్రణం జనరల్ జియా–ఉల్–హక్ పాలనలో సమ్మిళితం అయింది. ఇది ప్రభుత్వం, సమాజం స్థిరంగా ఇస్లామీకర ణకు గురవడానికి నాంది పలికింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ప్రాంతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు (1979లో అఫ్గానిస్తా న్పై సోవియట్ దండయాత్ర వంటివి) అంతర్జాతీయ పర్యవసానా లకు దారి తీశాయి. ఈ కారణాలన్నీ పాక్‌కు భద్రతా సవాలును మరింత తీవ్రతరం చేశాయి. ఖైబర్–పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని బాజౌర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి, 60 మందికిపైగా మరణానికి కార ణమైంది. ఈ చర్యకు కారణం తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఖురా సాన్) ప్రకటించింది. అంతర్గత భద్రతా పరిస్థితికి ఇది విషాద సాక్ష్యం. యూఎస్ డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి 282 రూపా యల కంటే తక్కువగా ఉండటంతో ఆర్థిక అవకాశాలు వట్టిపోతు న్నాయి. ఇమ్రాన్ అరెస్టు అనేది తాత్కాలిక ప్రభుత్వం పరిష్కరించాల్సిన సంక్లిష్టమైన అనేక పెను సవాళ్లకు చెందిన మురికి మంచు కొండ కొస మాత్రమే. ఎప్పటిలాగే రావల్పిండి సైనిక నాయకత్వం మోసపోయిన పాకిస్తానీ ప్రజల అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త, సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. మూడు రోజులు ముందుగానే
ఇస్లామాబాద్: గత కొన్నాళ్లుగా పాకిస్తాన్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక పరిస్థితులు దిగజారడం, అవినీతి ఆరోపణల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కావడం వంటి ఘటనలు వల్ల ఎప్పటికప్పుడు ఆ దేశం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా బుధవారం రాత్రి పాక్ ప్రభుత్వం జాతీయ అసెంబ్లీని రద్దు చేసింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి మేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడు అరీఫ్ అల్వీకి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు. అంతకుముందు ఇస్లామాబాద్‌లో ఫెడరల్ క్యాబినెట్ చివరి సమావేశానికి కూడా ప్రధాని అధ్యక్షత వహించారు. బుధవారం నేషనల్ అసెంబ్లీలో తన వీడ్కోలు ప్రసంగంలో, షరీఫ్ మాట్లాడుతూ.. ఈ రాత్రి, సభ అనుమతితో, జాతీయ అసెంబ్లీ రద్దుకు సంబంధించిన సలహాను అధ్యక్షుడికి పంపుతాను అని పేర్కొన్నారు. దీంతో పాక్ పార్లమెంట్ దిగువసభతో పాటు ముస్లిం లీగ్- నవాజ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మూడు రోజుల ముందుగానే రద్దు అయ్యింది. ఈ నేపథ్యంలో త్వరలోనే పాక్‌లో ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా అయితే పాక్ ప్రభుత్వం పదవీ కాలం పూర్తయిన తర్వాత రెండు నెలలులోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ, ముందస్తుగానే జాతీయ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఎన్నికల నిర్వహనకు 90 రోజుల సమయం ఉంది. చదవండి: ప్రపంచ బ్యాంక్‌లో తెలుగమ్మాయి -
'ఇంత భయంకరమైన జైలులో ఉండలేను..'
ఇస్లామాబాద్: తొషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను అతి దారుణమైన సెల్లో ఉంచారనే విషయాన్ని ఇటీవల ఆయన తరుపు లాయర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. తనను ఆ జైలు నుంచి బయటకు తీసుకురావాలని ఇమ్రాన్ ఖాన్ కోరినట్లు ఆయన తరుపు న్యాయవ్యాది చెప్పారు. పగలు ఈగలు, రాత్రి కీటకాలు ఇబ్బంది పెడుతున్న భయంకరమైన జైలులో జీవితాంతం ఉండలేనని చెప్పినట్లు వెల్లడించారు. అవినీతి కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఇమ్రాన్ ఖాన్ దోషిగా నిర్ధారించిన కొద్దిసేపటికే లాహోర్‌లోని అతని ఇంటి నుండి ఖాన్‌ను అరెస్టు చేశారు. అనంతరం రావల్పిండిలోని అడియాలా జైలుకు పంపాలని అధికారులను ఆదేశించినప్పటికీ, అతన్ని పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ నగరంలోని అటాక్ జైలుకు తరలించారు. కోర్టు తీర్పును సవాలు చేసేందుకు ఖాన్ తరపు న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తీర్పును సవాలు చేసే క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్ హైదర్ పంతోజీ ఇటీవల జైలుకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌తో ఆయన దాదాపు గంట పాటు మాట్లాడారు. తనకు జైల్లో కల్పిస్తున్న సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్ చెప్పినట్లు న్యాయవాది మీడియాతో వెల్లడించారు. ఇదీ చదవండి: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు? -
పురుగులున్న చీకటి గదిలో ఉంచారు, జీవితాంతం జైల్లోనే ఉంటా: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: తోషాఖానా కేసులో అరెస్టైన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కోర్టు తీర్పును సవాలు చేసే క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్ హైదర్ పంతోజీ జైలుకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌తో ఆయన దాదాపు గంట పాటు మాట్లాడారు. తనకు జైల్లో కల్పిస్తున్న సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్ చెప్పినట్లు న్యాయవాది మీడియాతో వెల్లడించారు. అరెస్టు చేసే సమయంలోనూ పోలీసులు కనీసం వారెంటు చూపించలేదని, అంతేకాకుండా తన భార్య గది తలుపులను పగలగొట్టేందుకు ప్రయత్నించారని ఇమ్రాన్ ఆరోపించినట్లు చెప్పారు. ‘ నన్ను ఓపన్ వాష్‌రూం ఉన్న ఓ చిన్న చీకటి గదిలో ఉంచారు. టీవీ, వార్తాపత్రిక కూడా లేదు. ఈగలు, చీమల బెడద ఎక్కువగా ఉంది. ఉగ్రవాదిగా చూస్తున్నారు! ఎవరినీ కలిసేందుకు అనుమతించడం లేదు. అయినప్పటికీ.. జీవితమంతా జైలులో గడపడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ చెప్పారని ఆయన తరఫున న్యాయవాది తెలిపారు. కాగా అవినీతి కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించిన కొద్దిసేపటికే లాహోర్‌లోని అతని ఇంటి నుండి ఖాన్‌ను శనివారం అరెస్టు చేశారు. అనంతరం రావల్పిండిలోని అడియాలా జైలుకు పంపాలని అధికారులను ఆదేశించినప్పటికీ, అతన్ని పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ నగరంలోని అటాక్ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుత జాతీయ అసెంబ్లీ గడువు ఆగస్టు 12న పూర్తికానుండగా, ఈ ఏడాది చివర్లో పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు మూడేళ్ల శిక్ష పడింది. దీంతో ఇమ్రాన్ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లే కనిపిస్తోంది. చదవండి: స్మార్ట్ఫోనే కొంపముంచిందా? పాపులర్ పబ్లిషింగ్ హౌస్ సీఈవో దుర్మరణం -
పాక్‌లో మళ్ళీ పాత కథే!
నేతల పేర్లు మారవచ్చు... ఆరోపణలు మారవచ్చు... పాక్‌లో మాత్రం ఒకే కథ పునరావృత మవుతూ ఉంటుంది. ప్రధాని పీఠమెక్కినవారు సైన్యం అనుగ్రహం కోల్పోయాక ఏదోక ఆరోపణలో జైలుపాలవుతారు. అదృష్టం బాగుంటే బతికిబట్టకడతారు. లేదంటే శంకరగిరి మాన్యాలు పడతారు. జుల్ఫికర్ అలీ భుట్టో నుంచి బెనజీర్, నవాజ్ షరీఫ్‌ల దాకా ఇదే పరిస్థితి. ఇప్పుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ వంతు. తీవ్రవాదానికి ప్రోత్సాహం, సైనిక స్థావరాలపై దాడులకు పథకరచన లాంటి తీవ్ర ఆరోపణల నుంచి వచ్చిన కానుకల్ని అక్రమంగా అమ్ముకున్నారనే ‘తోషా ఖానా’ కేసు దాకా 150 దాకా కేసులున్న ఇమ్రాన్‌ను ఊహించినట్టే జైలులో పెట్టారు. ఎప్పటిలానే మిగతా వ్యవస్థంతా పరోక్ష మద్దతు నివ్వగా, పాక్ కోర్టు మరో పాపులర్ నేత రాజకీయ జీవితానికి తెరదించేందుకు తెగించింది. తోషాఖానా కేసులో పాకిస్తానీ కోర్ట్ ఆగస్ట్ 5న ఇమ్రాన్‌కు మూడేళ్ళ గరిష్ఠ శిక్ష వేసింది. రాజ్యాంగం ప్రకారం శిక్షపడ్డవారు అయిదేళ్ళ పాటు ఎన్నికల్లో పాల్గొనరాదు గనక, ఈ మాజీ ప్రధానిని అలా బరిలో లేకుండా చేసింది. చివరకు సొంత పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ)కి అధినేతగానూ ఇమ్రాన్ కొనసాగరాదు. వెరసి, షరీఫ్‌లు, జర్దారీలు, మౌలానా ఫజల్ ఉర్ రెహ్మాన్ లాంటి సైన్యం ఆశీస్సులున్న వారికి ఎన్నికల బరిలో మార్గం సుగమం చేసింది. ఇమ్రాన్ జైలు పాలయ్యీ కాగానే, ఈ క్షణం కోసమే ఆగినట్టున్న ప్రధాని షెహజాబ్ షరీఫ్ ఆగస్ట్ 9న పార్లమెంట్‌ను రద్దు చేయనున్నారు. నవంబర్ మధ్యలో జరగాల్సిన ఎన్నికలు ఓటర్ల జాబితా సవరణ, నియోజకవర్గ విభజన సాకులతో ఆరు నెలల దాకా వాయిదా పడతాయని అంచనా. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణల్లో అగ్రస్థానంలో ఉన్న ఇమ్రాన్ జైలులో ఉంటారు గనక ఆ లోగా ఓటర్లలో తాము పట్టు సంపాదించాలన్నది షెహబాజ్ సారథ్యంలోని అధికార పార్టీ, మిత్రపక్షాల వ్యూహం. ఇమ్రాన్‌పై మోపింది పెద్దగా పసలేని అభియోగమైనా, విధించినది మాత్రం కఠిన శిక్షే! చరిత్ర చూస్తే పాకిస్తాన్ మాజీ ప్రధానులు షాహిద్ ఖకాన్ అబ్బాసీ, నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో, జుల్ఫికర్ అలీ భుట్టో, హుస్సేన్ షహీద్ సుఖ్రావర్దీలకు కూడా రాజ్యవ్యవస్థ చేతిలో ఇదే పరిస్థితే ఎదురైంది. వారంతా ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. అయితే, చివరకు వారిపైన మోపిన అభియోగాలేవీ కాల పరీక్షకు నిలబడలేదు. గతంలో జీతం విషయంలో నేరం మోపి, నవాజ్ షరీఫ్ రాజకీయ ఆకాంక్షలకు గండి కొట్టారు. ఇప్పుడు ఇమ్రాన్‌కూ సరిగ్గా అలాగే చేశారు. ప్రధానిగా ఉన్నప్పుడు అందుకున్న కానుకల వివరాలను ఇమ్రాన్ సరిగ్గా వెల్లడించలేదనే మిష చూపారు. షరీఫ్, ఇమ్రాన్‌ల ఇద్దరి విష యంలోనూ చేసిన నేరానికీ, వేసిన శిక్ష తాలూకు తీవ్రతకూ పొంతన లేదన్నది బహిరంగ రహస్యం. వచ్చిన కానుకల రికార్డులు, ఆస్తుల ప్రకటన విషయంలో నిబంధనల్ని పాటించకుండా ఇమ్రాన్ తప్పు చేసిన మాట నిజమే. కానీ, తోషాఖానా రికార్డుల్ని నిశితంగా పరిశీలించి, అధికారిక హోదాలో కానుకలు అందుకున్న ఎవరెవరు సరిగ్గా ఆ వివరాలు అందించారనే లెక్కలను గనక ఇంతే కఠినంగా బయటకు తీస్తే మునుపున్న ఎవరూ నిర్దోషులుగా మిగలకపోవచ్చు. అలాంటప్పుడు ఇమ్రాన్‌కు మాత్రం అదే నేరానికి కోర్టు గరిష్ఠ శిక్ష విధించడమేమిటి? అసలీ మొత్తం వ్యవహారంలో విచారణ జరిగిన తీరు, ఎక్కడ లేని హడావిడితో కోర్టు తీర్పు ప్రకటించిన వైనం ప్రశ్నలకు తావిస్తోంది. విధించిన కఠినశిక్షపై ఇమ్రాన్ పై కోర్టుకు వెళ్ళే వీలు, అక్కడ ఊరట దక్కే అవకాశం లేకపోలేదు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తీవ్రనేరాలను సైతం నిత్యం ఉపేక్షించే రాజ్యవ్యవస్థ ప్రజానేతలపై మాత్రం మామూలు అంశాలపైనా అభియోగాలతో, శిక్షలు విధించడమే గమనార్హం. ఇమ్రాన్ తన ముందువారిలా ఆర్మీ ఆదేశాలకు తలాడించకపోవడం తప్పయింది. 2022 ఏప్రిల్‌లో పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయినప్పటి నుంచి సైనిక నాయకత్వాన్ని సవాలు చేశారు. ర్యాలీలు చేశారు. మొన్న మేలో ఆయనను అరెస్టు చేసినప్పుడు జరిగిన భారీ కల్లోలాల్లో సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. దీన్ని అందిపుచ్చుకున్న ఆర్మీ ఛీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ నిరసన కారుల్ని అణచివేశారు. మీడియా నోరునొక్కారు. ఇమ్రాన్ సొంత పార్టీ నుంచి ఫిరాయింపులు చేయించారు. ఇప్పుడు ఇమ్రాన్ జైలు పాలయ్యేలా చూశారు. ఎన్నడూ పెద్దగా ప్రజాస్వామ్యం పరిఢ విల్లని పాక్‌లో అంతకంతకూ సైనిక జోక్యం పెరుగుతున్న తీరుకు ఇది తాజా ఉదాహరణ. నిజానికి, 2017లో నవాజ్ షరీఫ్‌ను దించి, ఇమ్రాన్‌ను గద్దెనెక్కించిందీ సైన్యమే. 2018 జనరల్ ఎన్నికల్లో ఫలి తాల్ని అనుకూలంగా మలిచి, ఆనక పార్లమెంట్లో ఇమ్రాన్‌కు మెజారిటీ వచ్చేలా చేసిందీ సైన్యమే. అధికారంలో ఉండగా ప్రజాస్వామ్యంపై గౌరవమే చూపని ఈ మాజీ క్రికెటర్ ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. కొత్త ఆర్మీ ఛీఫ్ మునీర్ పట్టు బిగిస్తున్నారు. అయితే సాంకేతిక కారణాలతో పోటీకి అనర్హులుగా ప్రకటించినంతనే జనాకర్షక నేతల కథకు తెరపడుతుందనుకోలేం. నవాజ్, బెనజీర్‌ల విషయంలో ఇదే జరిగింది. రేపు ఇమ్రానైనా అంతే! సైన్యమేమో తన స్వార్థం కోసం రాజకీయ నాయకత్వాన్ని అదిలించి, బెదిరించి పబ్బం గడుపుకుంటూ ఉంటే, కోర్టులేమో పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తున్నాయి. రెంటి మధ్య పాకిస్తాన్ రాజకీయాలు చిక్కుకుపోయాయి. ప్రతీకారాలతో నిలువునా చీలిపోయాయి. దేశంలో ఆర్థిక సంక్షోభానికి తోడు రాజకీయ అలక్ష్యంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కావాల్సింది – దేశాన్ని ఆర్థిక పురోగతి పథంలో నడిపించే దీర్ఘదృష్టి. పాలకులు, వ్యవస్థలు అది మర్చిపోయి, ప్రత్యర్థుల్ని వేటాడే పనిలో మునిగి పోవడమే విచారకరం. వ్యవస్థలు రాజకీయమయమైతే ఇలాంటి దురవస్థలే దాపురిస్తాయి. -
‘అడియాలా’కి బదులు ‘అటోక్’కి ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో మూడేళ్లు జైలు పడిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రభుత్వం అటోక్ జైలుకు తరలించింది. కానీ ఇమ్రాన్‌ను రావలి్పండిలోని అడియాలా జైల్లో ఉంచాలని ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఇమ్రాన్‌కు అడియాలా జైల్లో భద్రత కల్పించాలని పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా అటోక్ జైలుకి తరలించినట్టుగా ఒక నివేదిక వెల్లడించింది. అటోక్ జైలుకి తరలించడం కోసమే లాహోర్ పోలీసులు ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసినట్టు ఆ నివేదిక పేర్కొంది. ఇమ్రాన్‌ను కలవడానికి అనుమతించడం లేదు: పీటీఐ ఆందోళన జైల్లో ఉన్న ఇమ్రాన్‌ను కలవడానికి పార్టీ న్యాయవాదులకి అనుమతించడం లేదని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ ఆరోపించింది. కోర్టు కు సమర్పించాల్సిన డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకోవడానికి అనుమతి కోరినా అధికారులు నిరాకరించినట్టు ఒక ప్రకటనలో పే ర్కొంది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయలేదని కిడ్నా ప్ చేసి తీసుకువెళ్లారని విరుచుకుపడింది. -
కొన్ని కానుకలు.. ఒక మాజీ ప్రధాని.. ఏమిటీ తోషఖానా కేసు?
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ జైలుపాలయ్యే పరిస్థితి వస్తుందని ముందే ఊహించినట్టున్నారు. గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో ఆఖరి బంతి వరకు పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. తనని జైలు పాలు చేసినా, అనర్హత వేటు వేసినా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీయే విజయం సాధిస్తుందని పలు సందర్భాల్లో ధీమాగా చెప్పారు. మరి ఆయన విశ్వాసానికి తగ్గట్టుగా భవిష్యత్ ఉండబోతోందా ? ఇమ్రాన్‌కు జైలు శిక్ష పడిన కేసు ఏమిటి ? ముందుండి నడిపించాల్సిన నాయకుడు కటకటాల పాలైతే పార్టీ పరిస్థితి ఏంటి? ఏమిటీ తోషఖానా కేసు..? ► తోషఖానా.. అంటే ప్రభుత్వానికి దేశ విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చే కానుకల ఖజానా. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోషఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న మూడేళ్లలో 58 కానుకలు వచ్చాయి. అలా వచ్చిన కానుకల్ని ప్రధాని తీసుకోవాలంటే దాని ధరలో సగం చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఇమ్రాన్ ప్రభుత్వం నిబంధనల్ని సవరించి అసలు ధరలో 20 శాతం మాత్రమే చెల్లించి కానుకలు తన సొంతం చేసుకున్నారు. 2018, సెప్టెబర్ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 15.4 కోట్ల విలువైన కానుకల్ని కేవలం 3 కోట్లకే ఆయన సొంతం చేసుకున్నట్టుగా ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదైంది. పీటీఐపై నీలినీడలు? ► పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ (పీటీఐ)ఇమ్రాన్‌ఖాన్ ప్రజలపై వేసిన ప్రభావం గత అయిదు దశాబ్దాల్లో మరే నాయకుడు వెయ్యలేకపోయాడు. ప్రజల్లో ఆయనకున్న ఫాలోయింగ్ తిరుగులేనిది. గత మేలో అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసినప్పుడు పీటీఐ కార్యకర్తలు దేశంలో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. వారిని నియంత్రించడం ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్‌గా మారింది. గతంలో పాకిస్తాన్ మాజీ ప్రధా నులు బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్, షాహిద్‌ఖాన్ అబ్బాసి వంటి వారు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ పట్టించుకోని ప్రజలు ఇమ్రాన్ ఖాన్ విషయంలో మిలటరీకే ఎదురు తిరిగారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఇమ్రాన్‌ఖాన్ అభిమానుల్లో అప్పట్లో కనిపించిన ఆగ్రహావేశాలు చూస్తే పార్టీ పునాదులు ఎవరూ కదపలేరన్న భావన కలుగుతుంది. ఇమ్రాన్‌ఖాన్ ఒక్కడే నిజాయితీపరుడని, ఆర్థికంగా కుదేలైన దేశాన్ని ఆయన మాత్రమే గాడిలో పెట్టగలరన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. కానీ పవర్ పాలిటిక్స్ వేరుగా ఉంటాయి. చదవండి: ఇమ్రాన్ ఖాన్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఐదేళ్ల అనర్హత వేటు.. ఆ వెంటనే అరెస్ట్ ఇమ్రాన్‌ఖాన్‌కు బాగా మొండివాడన్న పేరుంది. రాజకీయాల్లో ఆయనకి స్నేహితుల కంటే శత్రువులే ఎక్కువ మంది ఉన్నారు. ఇమ్రాన్ ప్రధాని కావడానికి కారకుడైన అప్పటి ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వాతో ఆయ న ఎక్కువ కాలం సత్సంబంధాలు నడపలేకపోవడమే దీనికి నిలువెత్తు నిదర్శనం. ఇమ్రాన్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్, పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ సంకీర్ణ సర్కార్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇమ్రాన్‌ను కేసుల ఉచ్చులో బిగించాయి. గత రెండు నెలల్లో పారీ్టకి చెందిన సీనియర్ నాయకులు 80 మందికి పైగా పార్టీని వీడారు. వారిని బెదిరించి పార్టీని వీడేలా చేశా రని ఇమ్రాన్ ఆరోపించినప్పటికీ వరసపెట్టి కీలకమైన నాయకులు వెళ్లిపోవడం పార్టీ భవిష్యత్ పై ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు. ఇమ్రాన్ గతంలో అరెస్ట్ అయినప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన వేలాది మంది పార్టీ కార్యకర్తలు మిలటరీ జైళ్లలో ఉన్నారు. పాకిస్తాన్లో ఈ నెల 9న జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ జైలు పాలవడం ఆయన పారీ్టకి శరాఘాతంలా తగిలింది. పార్లమెంటు రద్దయిన 3 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇమ్రాన్‌పై ఐదేళ్లు అనర్హత వేటు పడడంతో ఆయన ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా అయింది. పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకుడు కటకటాల మధ్య ఉంటే పార్టీ ఎంతవరకు మనుగడ సాగించగలదన్న ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి. అయితే ఇమ్రాన్ ఆశలన్నీ ఇప్పుడు పై కోర్టులోనే ఉన్నాయి. కోర్టు ఇచ్చిన తీర్పుని పీటీఐ లాహోర్ హైకోర్టులో సవాల్ చేసింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయలేదని, ఆయ నపై తుపాకీ గురిపెట్టి అపహరించుకొని వెళ్లిపోయారని పీటీఐ తన పిటిషన్లో విమర్శించింది. వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఇమ్రాన్ కూడా శాంతి మార్గాన్నే అనుసరిస్తున్నారు. అరెస్ట్‌కు ముందే చేసి ఉంచిన రికార్డు మెసేజ్‌లో ఆయన కార్యకర్తలకి శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే తోషఖానాతో సహా 150 కేసుల్ని ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఆ ఉచ్చులోంచి ఎలా బయటకి రాగలరన్న సందేహాలైతే ఉన్నాయి. -
ఇమ్రాన్, బాబర్ కాదు; వరల్డ్ నంబర్ 1 కెప్టెన్ ఈ టీమిండియా స్టార్: పాక్ మాజీ సారథి
ప్రపంచంలోని క్రికెట్ జట్ల కెప్టెన్లందరిలో టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని అత్యుత్తమ సారథి అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అన్నాడు. గొప్ప విజయాలెన్నో సాధించినా నిరాండంబరంగా ఉండటం అతడికే చెల్లిందన్నాడు. అందుకే వరల్డ్ నంబర్ 1 కెప్టెన్ అంటే తనకు ధోనినే గుర్తుకొస్తాడని సల్మాన్ పేర్కొన్నాడు. కాగా 2004లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ధోని. అనతికాలంలోనే టీమిండియా పగ్గాలు చేపట్టి.. మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ గెలిచి భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఇటు వికెట్ కీపర్ బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చిన ధోని ఖాతాలో ఏకంగా మూడు ఐసీసీ టైటిళ్లు ఉండటం విశేషం. ధోని హయాంలోనే.. ప్రస్తుతం టీమిండియా ముఖచిత్రంగా మారిన విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంచెలంచెలుగా ఎదిగారన్న సంగతి తెలిసిందే. తలా ప్రోత్సాహంతో రోహిత్ ఓపెనర్‌గా ప్రమోట్ కాగా.. కోహ్లికి పెద్దన్నలా మారి అన్ని విషయాల్లో ధోని అతడికి అండగా నిలిచాడు. ఇక సంచలన నిర్ణయాలతో జట్టు రూపురేఖలు మార్చిన భారత కెప్టెన్లలో ధోనికి చోటు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మైదానంలో మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్న ధోని లీగ్ క్రికెట్లోనూ సత్తా చాటుతున్నాడు. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఏకంగా ఐదోసారి చాంపియన్‌గా నిలిపాడు. ఈ నేపథ్యంలో నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన పాక్ మాజీ సారథి సల్మాన్ బట్.. ధోని గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘గత 15 ఏళ్ల చరిత్రను ఒక్కసారి గమనిస్తే.. ప్రపంచంలో నంబర్ 1 కెప్టెన్ అంటే మహేంద్ర సింగ్ ధోని గుర్తుకువస్తాడు. మైదానంలో అతిగా ప్రవర్తించిన దాఖలాలు లేవు. సహచరులతో గానీ, ప్రత్యర్థులతో గానీ గొడవ పడిన సందర్భాలు కూడా లేవు. అతిపెద్ద విజయాలు సాధించిన సమయంలో జట్టు సభ్యులు సెలబ్రేట్ చేసుకుంటున్నపుడు కూడా ఓ పక్కన సాధారణ వ్యక్తిలా నిలబడతాడు. అంత నిరాండంబరంగా, ప్రశాంతంగా ఉండే వ్యక్తులు ఎవరుంటారు?’’ అంటూ ధోనిని కొనియాడాడు. కాగా పాకిస్తాన్‌కు 1992లో.. వన్డే వరల్డ్‌కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్, ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజంలను కాదని దాయాది జట్టు మాజీ సారథి.. ధోని పేరును చెప్పడం విశేషం. చదవండి: 50 ఓవర్ల ఫార్మాట్లో భారీ స్కోర్.. ఇంగ్లండ్ 498 పరుగులు చేస్తే..! గిల్, జైశ్వాల్, కిషన్ కాదు.. అతడే టీమిండియా ఫ్యూచర్ స్టార్! -
Imran Khan:ఇమ్రాన్ క్లీన్‌బౌల్డ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికలకి సన్నాహాలు జరుగుతున్న వేళ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తోషఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ జిల్లా కోర్టు ఆయనను దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. వచ్చే అయిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా ఇమ్రాన్‌పై అనర్హత వేటు వేసింది. ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి హుమాయూన్ దిలావర్ శనివారం ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన కాసేపటికే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 2018 నుంచి 2022 మధ్య కాలంలో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి వచ్చిన కానుకల్ని అక్రమ మార్గాల్లో కారు చౌకగా తానే కొనుగోలు చేశారని తోషఖానా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో మూడేళ్ల జైలు శిక్షతో పాటుగా న్యాయమూర్తి లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైల్లో ఉండాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేశారు. ‘‘ఇమ్రాన్‌ఖాన్ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి వచ్చిన కానుకల్ని తీసుకున్నారు. ఆ కానుకల ద్వారా తాను పొందిన ఆర్థిక లబ్ధిని దాచి ఉంచడానికి ప్రయత్నించారు. తోషఖానా కానుకలకు సంబంధించిన సమాచారం అందించడంలో ఇమ్రాన్‌ఖాన్ మోసం చేశారనడానికి తగిన ఆధారాలున్నాయి. ఇమ్రాన్ఖా న్ నిస్సందేహంగా అవినీతిపరుడని రుజువైంది’’ అని న్యాయమూర్తి హుమయూన్ ఆ తీర్పులో పేర్కొన్నారు. ఎప్పుడైతే మూడేళ్ల జైలు శిక్ష పడిందో రాజ్యాంగంలోకి ఆర్టికల్ 63(1)(హెచ్) ప్రకారం అయిదేళ్లపాటు ఇమ్రాన్‌పై అనర్హత వేటు పడింది. ఇమ్రాన్‌ఖాన్ పదవిలో ఉన్న మూడున్నరేళ్ల కాలంలో ప్రపంచ దేశాల అధినేతల నుంచి రూ.14 కోట్ల విలువైన 58 కానుకలు పొందారు. ఆగస్టు 9న జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మూడు నెలల్లోగా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో ఇమ్రాన్‌కు శిక్ష పడడం చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తి తీర్పు వెలువరించిన కొద్ది సేపటికే లాహోర్‌లోని జమన్ పార్క్‌లో ఇమ్రాన్‌ఖాన్ నివాసం నుంచి ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. లాహోర్ నుంచి ఇమ్రాన్‌ను హెలికాఫ్టర్‌లో ఇస్లామాబాద్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసనలు చేయండి: ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్‌ను ముందే ఊహించిన ఇమ్రాన్.. కార్యకర్తలనుద్దేశిస్తూ చేసిన ప్రసంగాన్ని రికార్డు చేసి ఉంచారు. ఇమ్రాన్ అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఆయన సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ‘సందేశం మీరు వినే సమయానికి నేను జైల్లో ఉంటాను. పార్టీ సభ్యులందరూ ఇళ్లలో కూర్చోకుండా బయటకు వచ్చి శాంతియుతంగా నిరసనలు చేయండి. నేను చేస్తున్న పోరాటం నా కోసం కాదు. మీ కోసం. మీ పిల్లల భవిష్యత్ కోసం. మీరు మీ హక్కుల కోసం పోరాడకపోతే బానిసలుగా బతకాల్సి వస్తుంది. బానిసలకు ఎప్పుడూ బతుకు ఉండదు. బానిసలంటే నేల మీద పాకే చీమలతో సమానం. వారు పైకి ఎగరలేరు. ఎదగలేరు. మీ హక్కుల్ని మీరు కాపాడుకునే వరకు శాంతియుత నిరసనలు చేయండి. భవిష్యత్‌లో మీరు ఎన్నుకునే ప్రభుత్వం ఉండాలి కానీ కబ్జా మాఫియా కాదు’’ అని ఇమ్రాన్ తన సందేశంలో పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేయడానికి ఒక్క రోజు ముందు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందన్న భయం ప్రభుత్వానికి ఉందని విమర్శించారు. గణనీయంగా ఓటు బ్యాంకు పెరుగుతున్న తమ పార్టీని ఎలా నిర్వీర్యం చేస్తారని ఇమ్రాన్ ప్రశ్నించారు. భుట్టో నుంచి ఇమ్రాన్ వరకు పాకిస్తాన్ ప్రధానులు, మాజీ ప్రధానులు జైలు పాలవడం సర్వసాధారణంగా మారింది. ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే ఎందరో తమ చరమాంకంలో జైలు జీవితాన్నే గడిపారు. మిలటరీయే శక్తిమంతంగా ఉండే దేశంలో జనరల్ అయూబ్‌ఖాన్, యాహ్యాఖాన్, జియా ఉల్ హక్, పర్వేజ్ ముషార్రఫ్ వంటి వారు నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వాల్ని కూలదోసి పగ్గాలు చేపట్టారు. ► పాకిస్తాన్ అయిదో ప్రధానిగా సేవలందించిన షాహీద్ సుహ్రావార్డీ జాతి వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై 1962లో జైలు పాలయ్యారు. అప్పటి మిలటరీ పాలకుడు జనరల్ అయూబ్ ఖాన్‌కు మద్దతు ఇవ్వడానికి నిరాకరించడంతోనే ఆయనపై కేసులు పెట్టారు. ► దేశ తొమ్మిదో ప్రధాని జుల్ఫీకర్ ఆలీ భుట్టో తన రాజకీయ ప్రత్యర్థి హత్యకు కుట్ర పన్నారన్న అభియోగాలపై 1974లో అరెస్ట్ చేశారు. 1979, ఏప్రిల్ 4న ఆయనని ఉరి తీశారు. ► దేశానికి ఏకైక మహిళా ప్రధాని అయిన బెనజీర్ భుట్టో పలుమార్లు అరెస్టయ్యారు. 1985లో తొలిసారిగా ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. తిరిగి 1999లో అవినీతి కేసులో ఆమెకు అయిదేళ్లు జైలు శిక్ష పడింది. శిక్షను తప్పించుకోవడానికి ఆమె ప్రవాసం వెళ్లిపోయారు. తిరిగి దేశానికి వచ్చాక 2007లో రావల్పిండిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నాక బెనజీర్ దారుణ హత్యకు గురయ్యారు. ► 1999లో జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ పదవీ పగ్గాలను తీసుకున్నాక అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన పదేళ్ల పాటు ప్రవాసంలో ఉన్నారు. 2018 జూలైలో నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె అవినీతి కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది. 2019లో చికిత్స కోసం లండన్ వెళ్లిన ఆయన ఇప్పటికీ తిరిగి రాలేదు.