
ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో మూడేళ్లు జైలు పడిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రభుత్వం అటోక్ జైలుకు తరలించింది. కానీ ఇమ్రాన్‌ను రావలి్పండిలోని అడియాలా జైల్లో ఉంచాలని ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఇమ్రాన్‌కు అడియాలా జైల్లో భద్రత కల్పించాలని పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా అటోక్ జైలుకి తరలించినట్టుగా ఒక నివేదిక వెల్లడించింది. అటోక్ జైలుకి తరలించడం కోసమే లాహోర్ పోలీసులు ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసినట్టు ఆ నివేదిక పేర్కొంది.
ఇమ్రాన్‌ను కలవడానికి అనుమతించడం లేదు: పీటీఐ ఆందోళన
జైల్లో ఉన్న ఇమ్రాన్‌ను కలవడానికి పార్టీ న్యాయవాదులకి అనుమతించడం లేదని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ ఆరోపించింది. కోర్టు కు సమర్పించాల్సిన డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకోవడానికి అనుమతి కోరినా అధికారులు నిరాకరించినట్టు ఒక ప్రకటనలో పే ర్కొంది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయలేదని కిడ్నా ప్ చేసి తీసుకువెళ్లారని విరుచుకుపడింది.
Comments
Please login to add a commentAdd a comment