Corruption
-
కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR)పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ACB)కి మరో ఫిర్యాదు వెళ్లింది. అవుటర్ రింగ్‌రోడ్‌లో భారీ అవినీతి జరిగిందని చెబుతూ.. బీసీ పొలిటికల్ జేఏసీ బుధవారం ఫిర్యాదు చేసింది. ఓఆర్ఆర్(ORR)లో రూ.7,380 కోట్ల అవినీతి జరిగిందని, ఆ అక్రమాలపై దర్యాప్తు జరపాలని పేర్కొంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీకి ఫిర్యాదు వెళ్లింది. ‘‘ఫార్ములా ఈ రేస్ కేసుతోపాటు ఓఆర్ఆర్ అక్రమాల పై కూడా దర్యాప్తు జరపాలి. సీఎం, సీఎస్, ఈడీలతో పాటు ఇవాళ ఏసీబీకి ఫిర్యాదు చేశాం. ఓఆర్ఆర్ చుట్టూ మెయింటనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉన్న ప్రాంతం అంతా హెచ్ఎండీఏ పరిధిలోనే ఉంది. ఆదయం వచ్చే రోడ్డును మాత్రం కంపెనీలకు ఇచ్చారు. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 2023 ఏప్రిల్ నుండి ముపై ఏళ్ళ పాటు లీజ్‌కు ఇచ్చారు. అయితే.. ఆ కంపెనీ రూ. 25 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. కైటెక్స్ గార్మెన్స్ సైతం ఎక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసింది. కైటెక్స్ కు సైతం హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి లో భూకెటాయింపులు జరిగాయి. క్విడ్ ప్రోకో(quid pro quo) ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతోంది. హెచ్ఎండీఏ నిధుల పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి. నిధులు దుర్వినియోగంలో అధికారుల పాత్ర పై దర్యాప్తు జరపాలి’’ అని బీసీ పోలిటికల్ జేఏసీ నేత యుగంధర్ గౌడ్ చెప్తున్నారు.ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లు.. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?: కేటీఆర్ఏసీబీ నోటీసుల్లో ఏముందంటే.. ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలంటూ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అందులో ఏసీబీ కీలకాంశాలకు ప్రస్తావించింది..‘‘విచారణకు హాజరు కాకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ నెల 6వ తేదీన విచారణకు వచ్చినప్పుడు మీ లాయర్‌ను అనుమతించాలని మీరు కోరారు. కానీ, చట్ట ప్రకారం అది సాధ్యం కాదని మీకు తెలియజేశాం. కాబట్టి, 9వ తేదీన మీ విచారణకు కూడా లాయర్‌ను అనుమతించడం కుదరదు. మీరు విచారణకు హాజరుకండి. మీరిచ్చిన సమాచారం ప్రకారం ఏం డాక్యుమెంట్లు కావాలో అడుగుతాం’’ అని ఏసీబీ పేర్కొంది. మరోవైపు విచారణకు తన లాయర్‌ను అనుమతించేలా కోర్టు నుంచి అనుమతి కోసం కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. -
చంద్రబాబే సుప్రీం.. రెడ్బుక్కే రాజ్యాంగం!
సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగమే ప్రామాణికం.. సుప్రీంకోర్టు తీర్పులే మార్గ నిర్దేశం.. అన్నది దేశంలో పరిపాలన వ్యవస్థకు దిక్సూచి. పాలకులు, అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు అందరూ పాటించాల్సిన విధివిధానాలవి. కానీ రాష్ట్ర సీఐడీ విభాగం అందుకు పూర్తి విరుద్ధంగా బరితెగిస్తోంది. ‘చంద్రబాబే మాకు సుప్రీం.. టీడీపీ రెడ్బుక్కే మాకు రాజ్యాంగం.. చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చడమే ఏకైక లక్ష్యం’ అని చెలరేగిపోతోంది. అందుకోసం ఏకంగా న్యాయస్థానాల్లో సీఆర్పీసీ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలం పవిత్రత, ప్రమాణికతనే దెబ్బ తీసేలా కుట్రలకు పదును పెడుతోంది. ఓసారి సీఆర్పీసీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బరితెగించి మరీ ఉల్లంఘిస్తోంది. చంద్రబాబు సూత్రధారి, పాత్రధారిగా సాగిన కుంభకోణాల గురించి గతంలో పలువురు ఐఏఎస్ అధికారులు న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలాలకు భిన్నంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు సీఐడీ సన్నాహాలు వేగవంతం చేస్తోంది. డీజీపీ పోస్టు ఇస్తానని ముఖ్య నేత ఎర వేయగానే సుప్రీంకోర్టు మార్గరద్శకాలను కూడా తోసిరాజంటూ సీఐడీ ఉన్నతాధికారి చెలరేగిపోతుండటం విస్మయ పరుస్తోంది. ఈ వ్యవహారం యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తోంది.కుంభకోణాల కుట్రదారు చంద్రబాబే..2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాల కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం.. ఇలా వివిధ కుంభకోణాలతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వాటిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కేసు నమోదు చేసి పూర్తి ఆధారాలతోసహా ఆ భారీ దోపిడీని బట్టబయలు చేసింది. ఆ వ్యవహారాల్లో కీలక పాత్రధారులగా ఉన్న ఐఏఎస్ అధికారులను విచారించింది. నిబంధనలకు విరద్ధమని తాము అభ్యంతరం తెలిపినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని వారు చెప్పారు. చంద్రబాబు ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల బదలాయింపు, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్లో మార్పులు, కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల విడుదల.. ఇలా అన్ని వ్యవహారాలు సాగాయని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్, ఫైబర్‌నెట్ ఎండీగా వ్యవహరించిన అజయ్ జైన్, గుంటూరు కలెక్టర్‌గా చేసిన కాంతిలాల్ దండే తదితరులు ఆ వాస్తవాలను ‘సిట్’కు తెలిపారు. అంతే కాకుండా ఆ విషయాలను న్యాయస్థానంలోనూ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఆర్పీసీ 164 కింద వారు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేసింది. అందుకే ఆ కేసుల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడు(ఏ1)గా పేర్కొంటూ సిట్ కేసులు నమోదు చేసింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేయగా, ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.తప్పుడు వాంగ్మూలాల నమోదుకు ప్రభుత్వ కుట్రగత ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు అవినీతి కేసులను నీరుగార్చేందుకు కుట్రకు తెరతీసింది. అందుకోసం డీజీపీ, సీఐడీ అధికారులు ఆ కేసుల దర్యాప్తు వివరాలను చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అంటే ప్రధాన నిందితుడే ఆ కేసులను సమీక్షించారు. ఆ కేసులను ఎలా నీరుగార్చాలనే కుట్రకు అప్పుడే బీజం పడింది. అనంతరం చంద్రబాబు తరఫున గతంలో వాదించిన ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా రంగ ప్రవేశం చేశారు. డీజీపీ, సీఐడీ అధికారులతో సమావేశమై చంద్రబాబుపై కేసులను నీరుగార్చే కుట్రకు కార్యాచరణ రూపొందించారు. గతంలో చంద్రబాబే కుట్రదారు.. కుంభకోణాలకు ఆయనే సూత్రధారి.. అని న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన వారితో తాజాగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలని పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను సీఐడీకి అప్పగించారు. గతంలో సిట్‌లో సభ్యులుగా ఉన్న కింది స్థాయి అధికారులను డీజీపీ, సీఐడీ చీఫ్ పిలిపించుకుని మరీ తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియను వివరించారు. బాధిత రైతులు, సాధారణ సాక్షులను కింది స్థాయి అధికారులు బెదిరిస్తుండగా, ఐఏఎస్ అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే బాధ్యతను సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ భుజానికెత్తుకున్నారు.బెదిరించి.. భయపెట్టి..కుట్రలో భాగంగా ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్‌లతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ బరితెగించింది. గతంలో న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరద్ధుంగా వాంగ్మూలం ఇవ్వాలని వారిపై సీఐడి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. బెదిరింపులకు పాల్పడింది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే సంగతి తేలుస్తామని హెచ్చరించింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం సాధ్యం కాదని, అది నేరమని కూడా ఆ అధికారులు, న్యాయ నిపుణులు చెప్పినా సరే సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్ ఏమాత్రం వినిపించుకోలేదని సమాచారం. ఇలా సీఐడీ సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించి చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్లను బెంబేలెత్తించారు. దాంతో వారు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించినట్టుగా సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరితో గుంటూరులోని న్యాయస్థానంలో శుక్రవారం తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించేందుకు సీఐడీ అధికారులు తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే న్యాయాధికారి సెలవులో ఉండటంతో ఆ ప్రయత్నాన్ని శనివారానికి వాయిదా వేశారు. తీరా శనివారం చెరుకూరి శ్రీధర్ ఒక్కరినే తీసుకెళ్లారు. కోర్టు బయట కొద్ది సేపు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత కోర్టు హాలు లోపలికి వెళ్లకుండానే శ్రీధర్ వెనుదిరిగారు. మళ్లీ ఈ నెల 8వ తేదీన ఆయన్ను న్యాయస్థానానికి తీసుకొచ్చి వాంగ్మూలం నమోదు చేయించాలని సీఐడీ నిర్ణయించినట్లు తెలిసింది.నాడు గూండాల బెదిరింపులు.. నేడు సర్కారు వేధింపులు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణాల గురించి న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్.. తనను ఆ కేసుల్లో సాక్షిగా పరిగణించాలని కోరారు. దాంతో ఆయన అంతు చూస్తామని టీడీపీ గూండాలు బెదిరించారు. తీవ్ర ఆందోళన చెందిన ఆయన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శికి ఫిర్యాదు చేశారు. టీడీపీ గూండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా పోలీసు శాఖను కోరారు. దాంతో ఆయనకు పోలీసు శాఖ ప్రత్యేకంగా గన్‌మెన్‌ను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు గన్‌మెన్ భద్రత కొనసాగుతోంది. అప్పట్లో టీడీపీ గుండాలు బెదిరింపులకు పాల్పడగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా ఆయన్ను బెదిరిస్తోంది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే అంతు తేలుస్తామని సీఐడీ ద్వారా వేధిస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్సీపీ 164 వాంగ్మూలాల గురించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతోపాటు గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తున్నారు.మొదటి వాంగ్మూలానికి విరుద్ధంగా ఉండకూడదు సీఆర్సీపీ 164 కింద ఓసారి న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలం అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణిస్తాం. ఎందుకంటే న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా నమోదు చేసిన వాంగ్మూలమది. ఆ వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ప్రయత్నిస్తే వారిని సంబంధిత న్యాయస్థానం ప్రశ్నించాలి. మొదట ఇచ్చిన వాంగ్మూలాన్నే సాక్షంగా పరిగణలోకి తీసుకోవాలి.– 2024 నవంబరు 25న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు. ఈ మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విస్పష్టమైన తీర్పునిచ్చింది.విరుద్ధంగా ఇస్తే కఠిన చర్యలు ఓసారి సీఆర్సీపీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇస్తే అది నేరంగా పరిగణిస్తాం. ఎందుకంటే ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి చదవి వినిపించిన తర్వాత సమ్మతించి, మరీ సంతకం చేసి ఇచ్చిన వాంగ్మూలమది. మొదటిసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడమంటే.. మొదట ఇచ్చింది తప్పుడు వాంగ్మూలమని అంగీకరించినట్టే. అత్యంత విశ్వసనీయమైన న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసి మరీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టు అవుతుంది. అంటే అబద్ధపు వాంగ్మూలం ఇచ్చినందుకు నేరంగా పరిగణిస్తాం. ఆ విధంగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వారిపై ఐపీసీ 193, సీఆర్సీపీ 340 కింద కఠిన చర్యలు తీసుకుంటాం. – వినోద కుమారి వర్సస్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుఎదుర్కోవాల్సిన పరిణామాలను న్యాయమూర్తి వివరించాలి సీఆర్పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షి ప్రయత్నిస్తే.. దాని వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ఎదుర్కోవాల్సి వచ్చే పరిణామాల గురించి న్యాయమూర్తి ఆ సాక్షికి వివరించాలి.– అలహాబాద్ హైకోర్టు తీర్పుఏడేళ్ల వరకూ జైలు శిక్ష న్యాయస్థానాల్లో కేసుల విచారణ ప్రక్రియలో ఏ సందర్భంలో అయినా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరం అని సెక్షన్ 229 (1) స్పష్టం చేస్తోంది. అటువంటి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తోంది. అంటే సీఆర్పీసీ 164 కింద న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా రెండు విరుద్ధ వాంగ్మూలాలు ఇస్తే అందులో ఒకటి అబద్ధపు వాంగ్మూలమే అవుతుంది. మొదటి వాంగ్మూలం గానీ రెండో వాంగ్మూలం గానీ ఏది అబద్ధపు వాంగ్మూలం అయినా శిక్షార్హమే. దాన్ని నేరంగా పరిగణించి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. -
అంత డబ్బు నేనెప్పుడూ చూడలేదు: షేక్ హసీనా కుమారుడు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)పై అక్రమార్జన ఆరోపణలు సంచలనంగా మారాయి. షేక్ హసీనా 5 బిలియన్ డాలర్ల అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలపై హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ స్పందించారు. తమ కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు.బంగ్లాదేశ్(Bangladesh) షేక్ హసీనాపై వచ్చిన అక్రమార్జనల ఆరోపణలు తాజాగా సాజీబ్ వాజెద్ స్పందించారు. ఈ క్రమంలో వాజెద్(Sajeeb Wazed) మాట్లాడుతూ..‘అంత డబ్బు మేము ఎన్నడూ చూడలేదు. రూప్పూర్ పవర్‌ప్లాంట్ ప్రాజెక్టులో షేక్ హసీనా 5 బిలియన్ డాలర్లు దోచుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. బోగస్ ఆరోపణలు చేస్తూ మా కుటుంబం బురదజల్లే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ ప్రాజెక్టుల విషయంలో మా కుటుంబం ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. ఈ ప్రాజెక్ట్‌లపై డబ్బు తీసుకోలేదు. 10 బిలియన్ డాలర్ల ప్రాజెక్టులో అంత మొత్తం తీసుకోవడం సాధ్యం కాదు. గత 30 ఏళ్లుగా నేను యూఎస్‌లో ఉన్నా.. మా ఆంటీ, ఇతర సోదరులు యూకేలో ఉంటున్నారు. అంత డబ్బు మా అకౌంట్లలో ఎన్నడూ చూడలేదు అంటూ వివరణ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. షేక్ హసీనాపై అక్రమార్జన ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ చేపట్టాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు బంగ్లాదేశ్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 160 కిలోమీటర్లు దూరంలో రష్యా ప్రభుత్వం పద్మ నది ఒడ్డున ఈశ్వర్ది జిల్లాలోని రూప్పూర్ వద్ద రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (Rooppur Nuclear Power Plant) పేరుతో రెండు అణు విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తోంది. వాటిల్లో మొదటి అణు విద్యుత్ ప్లాంట్ కార్యకలాపాలు వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ అణు విద్యుత్ ఏర్పాటులో షేక్ హసీనా భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అనంతరం షేక్ హసీనాతో పాటు కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, ఆమె మేనకోడలు, యూకే ట్రెజరీ మంత్రి తులిప్ సిద్ధిక్‌లను కూడా ప్రశ్నించేలా బంగ్లా మధ్యంతర ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి.అయితే రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నిధుల్ని హసీనా, జాయ్, తులిప్‌లు మలేషియా బ్యాంకుకు 5 బిలియన్ డాలర్లను బదిలీ చేయడంపై స్థానిక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజా విచారణలో భాగంగా నిధులు దుర్వినియోగం అవుతున్నా అవినీతి నిరోధక కమిషన్ ఎందుకు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుందని ప్రశ్నించింది. ఈ పరిణామం తర్వాతనే షేక్ హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను విచారణకు మహ్మద్ యూనిస్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. -
మూడు నెలల్లో ముగించేద్దాం
సాక్షి,టాస్క్ ఫోర్స్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన కేసులను యుద్ధప్రాతిపదికన మూసివేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇప్పుడు ఈ వ్యవహారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. పోలీసు, సీఐడీ విభాగాలను వీలైనంత మేర ఉపయోగించుకోవడం, కేసులను నీరుగార్చడం.. ఇదీ పథకం. ఈ పథకాన్ని సిద్ధార్థ్ లూథ్రా స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. విజయవాడలోని నోవాటెల్ హోటల్ కేంద్రంగా ఆది, సోమవారాల్లో నిర్వహించిన రహస్య సమావేశాల్లో ఈ మేరకు ఓ కుట్రను ఖరారు చేశారని వినిపిస్తోంది. లూథ్రాతో పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా భేటీ అయ్యారని విశ్వసనీయ సమాచారం. సాక్షులను బెదిరించండి... వాంగ్మూలాలు మార్చండి.. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు బరితెగించి పాల్పడిన దోపిడీని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతోసహా నిగ్గు తేల్చింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణాల కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబేనన్నది ఆధారాలతో బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధమని చెప్పినా సరే సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించడంతోనే అక్రమాలకు పాల్పడాల్సి వచ్చిందని ఆనాటి ఉన్నతాధికారులతోపాటు ఇతరులు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అక్రమ నిధులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి, టీడీపీ బ్యాంకు ఖాతాలకు చేరినట్టు ఆధారాలను సిట్ సేకరించింది. దాంతోనే ఆ కేసుల్లో చంద్రబాబు అడ్డంగా దొరికినట్టైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసుల నుంచి చంద్రబాబు పేరు తప్పించేందుకు కుట్ర పన్నుతోంది. అందుకు గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారులను, ఇతరులను తీవ్రస్థాయిలో బెదిరించి బెంబేలెత్తించాలని పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులకు ఆదేశాలందాయని తెలుస్తోంది. అవసరమైతే వారిపై ఇతరత్రా అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయాలని కూడా లూథ్రా సలహా ఇచి్చనట్లు సమాచారం. సాక్షులను బెదిరించి దారికి తెచ్చుకోకపోతే చంద్రబాబును ఈ అవినీతి కేసుల నుంచి బయటపడేయడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎంతమందిని బెదిరించారు... ఎంతమంది ఇంకా బెదిరించాల్సిన జాబితాలో ఉన్నారనే వివరాలు కూడా లూథ్రా అడిగి తెలుసుకున్నారట.అన్నీ మూసేద్దాం..చంద్రబాబు అవినీతి కేసుల్లో గతంలో సిట్ సేకరించిన డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేయాలనేది కూడా ఈ రెండు రోజుల సమావేశాల్లో ఖరారు చేసిన కుట్రలో భాగంగా ఉంది. గతంలో సిట్‌లో పనిచేసిన కిందిస్థాయి అధికారులను పిలిపించి బెదిరించాలని కూడా లూథ్రా సలహా ఇచ్చారట. ఇప్పటికే తాము నాలుగైదు సార్లు ఆ కిందిస్థాయి అధికారులను తీవ్రస్థాయిలో బెదిరించామని పోలీసు, సీఐడీ అధికారులు ఆయనకు చెప్పారు. అది సరిపోదని....ఆ వేధింపులను ఇంకా తీవ్రతరం చేయాలని లూథ్రా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ గరిష్టంగా మూడు నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉందని, ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ రోజువారీగా తనకు నివేదిక ఇవ్వాలని ఓ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారికి లూథ్రా సూచించినట్లు పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఈ పనులు పూర్తి చేస్తే అనంతరం చంద్రబాబుపై కేసులను మూసివేసే సంగతి తాను చూసుకుంటానని సీనియర్ న్యాయవాది లూథ్రా ఈ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై కేసులను నీరుగార్చే పన్నాగాన్ని కచ్చితంగా అమలు చేస్తామని... త్వరలోనే టాస్క్ పూర్తి చేస్తామని పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో లూథ్రా వ్యాఖ్యానించినట్లు పోలీసు వర్గాలంటున్నాయి. రెండు రోజుల సమావేశాల అనంతరం లూథ్రా ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారని సమాచారం.అంతా లూథ్రా చెప్పినట్లే..సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో యావత్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవçÜ్థకు సూపర్ బాస్‌గా అవతరించారు. గతంలో చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలిపోయిన ఆ సీనియర్ న్యాయవాది వ్యవహారం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. రోజుకు రూ.కోటి ఫీజుతోపాటు అదనపు ఖర్చులు వసూలు చేసే లూథ్రా ప్రస్తుతం చంద్రబాబు అవినీతి కేసులను అడ్డగోలుగా క్లోజ్ చేసే పన్నాగానికి సర్వం తానై వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అవినీతి కేసులను మూసివేయడంతోపాటు...వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో వేధింపులకు గురిచేసే కుట్రను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. లూథ్రాయే సుప్రీం అని, ప్రభుత్వ కీలక విభాగాల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి తేల్చి చెప్పారని కూడా వినిపిస్తోంది. అందువల్లే పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్, న్యాయ విభాగాలు పూర్తిగా లూథ్రా నియంత్రణలోకి వచ్చేశాయి. ఆయన ఆదేశాలకు రాష్ట్ర పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు జీ హుజూర్ అంటున్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులే కాదు... జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అవసరమని భావిస్తే చివరికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కూడా ఆయన ఫోన్లు చేసి ఆదేశిస్తున్నారు. వారు చిత్తం మహా ప్రభో.. అని ఆయన ఆదేశాలను శిరసావహిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదు మేరకు నమోదుచేసిన అక్రమ కేసులో రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌పై అక్రమ కేసు నమోదు చేయడంతో పాటు విచారణ పేరుతో ఎలా వేధించాలో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారికి లూథ్రాయే స్వయంగా నిర్దేశించారని పోలీసులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, ఇతర అక్రమ కేసులతో వేధింపులను కూడా లూథ్రా నిశితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారట. సిద్ధార్థ్ లూథ్రా రాజ్యాంగేతర శక్తిగా ఆవిర్భవించారని ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
కూటమి సర్కారు నిర్ణయం.. ముఖ్య నేత ఆదేశాలతో రంగంలోకి ఢిల్లీ సీనియర్ న్యాయవాది
నారా చంద్రబాబు నాయుడు కుట్రదారుగా, లబ్ధిదారుగా సాగించిన కుంభకోణాల కేసులను పూర్తిగా నీరుగార్చే కుతంత్రానికి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం పదును పెడుతోంది!
-
కేసులపై కుతంత్రం!
చంద్రబాబుపై కొనసాగుతున్న కేసులను ఎత్తేద్దాం..! విపక్ష ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టేద్దాం!! ఇదీ కూటమి సర్కారు కుట్రల కుతంత్రం! ఒకపక్క ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తూ మరోవైపు స్పష్టమైన ఆధారాలతో బాబుపై కోర్టుల్లో కొనసాగుతున్న కేసుల విచారణను నీరుగార్చి అటకెక్కించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాది ఏకంగా పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో సమావేశమై స్కిల్‌స్కామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడంపై మార్గనిర్దేశం చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి..? ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి..? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి? అనే విషయాలను ఆ సీనియర్ న్యాయవాది కూలంకషంగా ఉద్బోధించినట్లు తెలుస్తోంది.చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను మూసివేయడమే ఏకైక అజెండాగా ఓ ప్రైవేట్ న్యాయవాది ఈ సమావేశాన్ని నిర్వహించడం.. రానున్న రెండు నెలల్లోనే ఆ కేసులను క్లోజ్ చేసేలా పోలీసు, సీఐడీ వ్యవస్థలను సిద్ధం చేయడంపై పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. నేడు కూడా ఈ సమావేశాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకవైపు తమపై ఉన్న కేసులను నీరుగారుస్తున్న ప్రభుత్వ పెద్దలు మరో వైపు విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించే వ్యూహాన్ని రచించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నారు. ‘ముఖ్య’ నేత ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ ఉన్నతాధికారి ఒకరు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆ ఇద్దరినీ అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ‘ముఖ్య’ నేత ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది!! – సాక్షి, అమరావతి -
నిఖేశ్ లీలలు ఇన్నిన్ని కాదయా!
సాక్షి, హైదరాబాద్: అనతి కాలంలో అంతులేని అవినీతితో వందల కోట్లకు పగడలెత్తిన నీటి పారుదల ఏఈఈ నిఖేశ్‌కుమార్ లీలలు చూసి ఏసీబీ అధికారులే విస్తుపోతున్నారు. తనవద్దకు పనికోసం వచ్చిన ప్రజలతోపాటు చిన్ననాటి స్నేహితులు, సొంత కుటుంబ సభ్యులను కూడా ఆయన మోసగించిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.తన మిత్రులు, కుటుంబ సభ్యులకు తెలియకుండానే వారిని నిఖేశ్ బినామీ లుగా మార్చు కున్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన నిఖేశ్‌కుమార్‌ను.. ఏసీబీ అధికారులు వరుసగా మూడో రోజు శనివారం కూడా ప్రశ్నించారు. చిన్న పని ఉందంటూ.. అవినీతిలో నిఖేశ్‌కుమార్ స్టైలే వేరుగా ఉన్నది. తన పదేళ్ల ఉద్యోగ జీవితంలో ఆయన 2020 – 2024 మధ్యే ఎక్కువ ఆస్తులు పోగేశాడు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బాగా పీక్‌లో ఉన్నప్పుడు ఆయన గండిపేట్‌లో పనిచేశాడు. అక్కడ రియల్ ఎస్టేట్ నిర్మాణాల కోసం అనుమతులు ఇవ్వటంలో కీలకంగా మారాడు. ఫీల్డ్ లెవల్ ఆఫీసర్ కాబట్టి ఏ స్థలం ఎఫ్టీఎల్లోకి వస్తుంది..ఏది రాదు అన్నది ఆయనే మార్క్ చేయాల్సి ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి కోట్లలో డబ్బులు గుంజాడు. ఒక్కో ఫైల్ క్లియర్ చేసేందుకు లక్షల్లో లంచంగా తీసుకున్నాడు. నగదు రూపంలో మాత్రమే లంచాలు తీసుకొనేవాడు. ఆ డబ్బును స్థిరాస్తులుగా మార్చుకోవడానికి తన చిన్ననాటి స్నేహితులను వాడడం ప్రారంభించాడు. ఏదో ఒక సాకుతో, లేదంటే చిన్న పని ఉందని చెప్పి తన ఇంటర్మీడియెట్ స్నేహితుల నుంచి ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు తీసుకున్నాడు. తన సొంత అన్న, ఇతర కుటుంబ సభ్యుల ఆధార్, పాన్ కార్డులను కూడా తీసుకుని ఆస్తుల కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.లా బినామీలను పిలిచి విచారించగా.. ‘అసలు మేం ఎప్పుడు ఈ ఆస్తులు కొన్నాం? మాకు ఏమీ తెలియదు? ఏదో పని ఉందని మా దగ్గరి నుంచి ఆధార్‌కార్డు, పాన్‌కార్డులు తీసుకున్నాడు’ అని వారు సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇంకా చదువులు కూడా పూర్తికాని తన కుటుంబ సభ్యుల పేర్లమీద కూడా కొన్ని ఆస్తులు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. సాక్షుల స్టేట్మెంట్లు రికార్డు సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను విశ్లేషించిన ఏసీబీ అధికారులు.. వాటి గురించి నిఖేశ్‌ను గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను ఆయన ముందుంచి వివరాలు సేకరిస్తున్నారు. నిఖేశ్‌కుమార్ ఆస్తులు కొనుగోలు చేసిన పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులను పిలిచి, వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. మైలాన్, బ్లిస్, కపిల్ ఇన్ఫ్రా కంపెనీల్లో నిఖేశ్‌కుమార్ మొత్తం నగదు రూపంలోనే పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు, సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. పలు బ్యాంకు లాకర్లలో నిఖేశ్ దాచి ఉంచిన బంగారం ఇతర ఖరీదైన వస్తువులు, ఆస్తుల పత్రాలపైనా వివరాలు సేకరించారు. కాగా నిఖేశ్‌ను ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఇచ్చిన గడువు ఆదివారంతో ముగియనున్నది. -
వాట్సప్ లో లంచాల దందా..
-
రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కు రిమాండ్
-
ఆర్జీ కర్ ఆస్పత్రిలో అవినీతి.. సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి సంబంధించిన అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ప్రధాన నిందితునిగా పేర్కొంటూ సీబీఐ ఆ ఛార్జ్ షీట్లో పేర్కొంది. 1000 పేజీల చార్జిషీటును సీబీఐ సిద్ధం చేసింది. అయితే ఈ ఛార్జ్‌షీట్‌ను అంగీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ చార్జిషీటులో ఐదుగురిని నిందితుల జాబితాలో చేర్చారు.సీబీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ (సస్పెండ్ అయ్యారు)తో పాటు మరో నలుగురు అరెస్టయిన నిందితుల పేర్లు ఛార్జ్ షీట్లో ఉన్నాయన్నారు. ఇందులో బిప్లబ్ సింగ్, అఫ్సర్ అలీ, సుమన్ హజ్రా, ఆశిష్ పాండే పేర్లు ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిపై చార్జిషీట్ దాఖలు చేయడానికి అవసరమైన అధికారిక అనుమతి పొందలేనందున అలీపూర్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ ఛార్జిషీట్‌ను అంగీకరించలేదు.ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇదే సమయంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో భారీ అవినీతి జరిగిందంటూ విద్యార్థులు, కొంతమంది వైద్యులు ఆరోపించారు. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేసింది. విచారణలో పలు ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి. వైద్యసామగ్రి కొనుగోలులో నిందితులు అవినీతికి పాల్పడ్డారని సీబీఐ విచారణలో తేలింది. ఇది కూడా చదవండి: కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి -
అమెరికా ఆరోపణలకు ఆధారాలు లేవు తేల్చి చెప్పేసిన...
-
ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖకు అవినీతి రోగం పట్టుకుంది. లంచాలు మరిగిన కొందరు అధికారులు సొంత శాఖ ఉద్యోగులనే డబ్బు కోసం వేధింపులకు గురిచేస్తున్న వ్యవహారం ఆ శాఖలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ముఖ్యంగా కొన్ని డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో ఇంక్రిమెంట్లు, సెలవులు, ఎస్ఆర్ ప్రారంభానికి.. ఇలా ప్రతి పనికీ రేటు కట్టి మరీ తమ రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారని వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంచం ఇవ్వకుంటే నెలల తరబడి ఫైళ్లను తొక్కిపెడుతున్నారని వాపోతున్నారు. లంచాల వ్యవహారంపై విసిగిపోయిన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొందరు వైద్యులు ఏకంగా మెడికల్ ఆఫీసర్ల వాట్సప్ గ్రూప్‌లోనే అవినీతి తంతును బహిర్గతం చేసినట్టు తెలిసింది. ప్రసూతి సెలవుల ఆమోదానికి రూ. 3 వేలు, మాజీ ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు రూ. 4 వేలు, ఎస్ఆర్ ప్రారంభించడానికి రూ. 5 వేలు ఇలా ప్రతి పనికీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఓ రేటు ఖరారు చేశారని ఆరోపించారు. ఇక ప్రొబేషన్ డిక్లరేషన్‌కు రూ. 15 వేలు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులకు రూ. 2 వేల నుంచి రూ.15 వేలు ఇస్తే కానీ ఫైళ్లు ముందుకు కదలడంలేదని, ఈ అవినీతి దందాకు అడ్డుకట్ట పడాలన్న మెసేజ్‌లు జిల్లా వైద్య శాఖలో కలకలంరేపాయి. దీంతో ఉలిక్కిపడ్డ జిల్లా స్థాయి అధికారి మెసేజ్‌లు పెట్టిన మెడికల్ ఆఫీసర్లకు ఫోన్ చేసి తన కార్యాలయానికి వస్తే మాట్లాడుకుందామని బ్రతిమాలుకున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వసూళ్లకు పాల్పడుతున్న కొందరు డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌లకు కార్యాలయాల్లో పనిచేస్తున్న ఏవో, క్లర్కులు, కాంట్రాక్టు ఉద్యోగులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైద్య శాఖ ఉద్యోగి ఒకరు మెడికల్‌గా అన్‌ఫిట్ అవడంతో నిబంధనల ప్రకారం కుమారుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడానికి ఫైల్‌ను కలెక్టర్‌కు పంపడానికి చిత్తూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో రూ.లక్షలు వసూలు చేశారు. ప్రైవేటుఆస్పత్రుల్లో బెడ్ల సామర్థ్యం ఆధారంగా రిజి్రస్టేషన్, రెన్యువల్‌కు బెడ్‌కు రూ. వెయ్యి చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారు. అనధికారికంగా డిప్యుటేషన్లు ఉన్నతాధికారుల అనుమతుల్లేకుండా జిల్లాల్లో అనధికార డిప్యుటేషన్ల్లోనూ డీఎంహెచ్‌వోలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లాలో 20 మందికిపైగా ఉద్యోగులు డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులందాయి. పనిచేయాల్సిన చోట కాకుండా జిల్లా కేంద్రంలో కొనసాగడానికి వీరు పెద్ద ఎత్తున ఓ ఉన్నతాధికారికి లంచాలు ముట్టజెప్పినట్టు విమర్శలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గుంటూరు డీఎంహెచ్‌వో ఆఫీస్‌లోనూ అధికారుల అనుమతుల్లేకుండానే కొందరు శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. అర్బన్ పీహెచ్‌సీల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు,చిరుద్యోగులను క్లర్కులుగా కొనసాగిస్తూ వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. -
రవాణా కాంట్రాక్టుల్లో ‘మనీ ట్రాన్స్ఫర్’!
సాక్షి, అమరావతి: పౌరసరఫరాల సంస్థలో స్టేజ్–1 ట్రాన్స్‌పోర్టు టెండర్లలో భారీ అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఇటీవల టెక్నికల్ బిడ్‌లో క్వాలిఫై అయినట్టు ప్రకటించిన కాంట్రాక్టర్లను మళ్లీ డిస్క్వాలిఫై చేయడం పెను దుమారం రేపింది. ఓ మహిళా మేనేజర్ నేతృత్వంలో ఈ కాంట్రాక్టులను అధికార కూటమి నేతల అనుంగులకు అప్పజెప్పేందుకు నిబంధనలను సైతం తుంగలో తొక్కేస్తున్నారు. పౌర సరఫరాల సంస్థ బఫర్ గోడౌన్ల నుంచి మండల గోడౌన్లకు నిత్యావసరాలు రవాణా చేసేందుకు పిలిచిన ఈ టెండర్లలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు సమాచారం. ఈ మేనేజర్, అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కలిసి టెండర్ ప్రక్రియను పూర్తిగా పక్కదారి పట్టించి, వీలైనన్ని జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్‌తోనే అనుకూలమైన వారికి కాంట్రాక్టు అప్పజెప్పేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ మంత్రి, వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తొలుత క్వాలిఫై చేసిన ట్రాన్స్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ కంపెనీని తర్వాత డిస్క్వాలిఫై చేసినట్లుగా ఉద్యోగులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట ట్రాన్స్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ కంపెనీ కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అనంతపురంలో స్టేజ్–1 ట్రాన్స్‌పోర్టు టెండర్లు వేసింది. రోజులు గడిచినా టెక్నికల్ బిడ్‌లో ఎటువంటి రిమార్క్ చూపించని అధికారులు ఫైనాన్షియల్ బిడ్‌కు వచ్చేసరికి సంస్థ నిర్వహకులపై పోలీసు కేసులు ఉన్నాయంటూ ఊహాజనిత సాకును చూపించి తొలుత కర్నూలు జిల్లాలో డిస్క్వాలిఫై చేశారు. తర్వాత మిగిలిన జిల్లాల్లోనూ డిస్క్వాలిఫై చేశారు. దీంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి, టెండర్లలో పాల్గొనేలా ఆర్డరు తెచ్చుకొంది.రీ టెండర్‌కు ఎందుకు వెళ్లట్లేదు?నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్ వస్తే రీ టెండర్‌కు వెళ్లాలి. టెండర్లలో టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించిన సంస్థలు ఫైనాన్షియల్ బిడ్‌కు వెళ్తాయి. సరైన పత్రాలు, అర్హతలు లేని టెండర్లు డిస్క్వాలిఫై అవుతాయి. ఇక్కడే అధికారులు చాకచక్యంగా చాలా జిల్లాల్లో ఫైనాన్షియల్ బిడ్‌కు అర్హత పొందిన టెండర్లు ఒక్కటే (సింగిల్) ఉండేలా చక్రం తిప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రీటెండర్‌కు వెళ్లకుండా టెక్నికల్ బిడ్‌లో డిస్క్వాలిఫై అయిన టెండర్లను కూడా కలిపి చూపించి, ఎక్కువ టెండర్లు వచ్చినట్టు మాయ చేస్తున్నారు. పోటీ ఉంటే షెడ్యూల్ ఆఫ్ రేట్ల (ఎస్‌వోఆర్) కంటే తక్కువ రేట్లకు కోట్ చేసే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ బిడ్‌లో సింగిల్ టెండర్ ఉంటే అసలు పోటీనే ఉండదు. ఫలితంగా కాంట్రాక్టరు అధిక రేట్లను కోట్ చేస్తారు. ఇప్పుడు స్టేజ్–1 టెండర్లలోనూ ఎస్ఓఆర్కు మించి 20 నుంచి 25 శాతం అధికంగా రేట్లు కోట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సింగిల్ టెండర్లు ఖరారైతే పౌరసరఫరాల సంస్థకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీన్ని పట్టించుకోని ఆ మేనేజర్.. సింగిల్ టెండర్లను ఒకే చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడితో ట్రాన్స్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ టెండర్లు దాఖలు చేసిన నాలుగు జిల్లాలతో పాటు కర్నూలు, వైఎస్సార్‌లో జిల్లాల టెండర్లను టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్‌కు అప్పజెప్పేందుకు సర్వం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ట్రాన్స్‌పోర్టు సంస్థకు సరైన ఫర్మ్ అంటూ లేదు. అసలు యజమాని పేరుపై ఒక్క వాహనం కూడా లేదు.ఆమెదంతా క్విడ్ ప్రోకోనే..ఈ టెండర్ల ప్రక్రియలో మహిళా మేనేజర్‌తో పాటు ఇటీవల బదిలీపై ప్రధాన కార్యాలయానికి వచ్చిన గ్రేడ్–1 ఉద్యోగి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఆ ఉద్యోగికి టెండర్లతో సంబంధం లేకపోయినా, మేనేజర్‌కు సహకరిస్తూ ముడుపులు మూటగడుతున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఇలా సింగిల్ టెండర్లను ఖరారు చేయించేందుకు రూ.25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి తోడు ఆ మహిళా మేనేజర్ కోనసీమ జిల్లాకు డీఎంగా వెళ్లాలని అనుకున్నప్పటికీ, అక్కడ ఆమెపై ఏసీబీకి ఫిర్యాదులు ఉండటంతో.. తూర్పుగోదావరి జిల్లాకు డీఎంగా వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు తూర్పు గోదావరి జిల్లాలో మునుపటి స్టేజ్–1 టెండర్ కాంట్రాక్టర్, తాడేపల్లిగూడేనికి చెందిన కూటమి నాయకుడొకరు సహకరిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు ప్రతిగా ఆయనకు తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో సింగిల్ టెండర్ ద్వారా రవాణా కాంట్రాక్టును అప్పజెప్పేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అన్నమయ్య, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ సింగిల్ టెండర్లనే ఎంపిక చేస్తున్నట్టు తెలిసింది. -
సోమిరెడ్డి పై కాకాణి సెటైర్లు ..
-
కేసులు నీరుగార్చే కుట్ర
ఈ కేసులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎదుట ప్రదర్శించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా రూపొందించాలో దర్యాప్తు అధికారులకు కొందరు సీనియర్ ఉన్నతాధికారులు నిర్దేశించారు. ప్రధాన నిందితుడికి తనపై ఉన్న కేసులకు సంబంధించిన దర్యాప్తు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం దేశంలో ఇదే తొలిసారి. ఆ కేసులను ఎప్పటిలోగా నీరుగార్చాలో దర్యాప్తు అధికారులకు గడువు కూడా విధించారు.ఇప్పటికే స్కిల్ స్కామ్‌లో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ.. చంద్రబాబుతోపాటు ఆయన మంత్రివర్గ సహచరుల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. ఈ కీలక తరుణంలో ఈ కేసులకు సంబంధించిన కీలక రికార్డులు చంద్రబాబుతోపాటు ఇతర నిందితులకు అందుబాటులో ఉన్నాయి. దాంతో రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉంది. – ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ప్రస్తుత ప్రభుత్వంలో నలుగురు మంత్రులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వారిపై అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు అనుమతించాలని గవర్నర్‌ను కోరే ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. ఆ ప్రతిపాదనను మంత్రివర్గం అజెండాలో చేర్చే సాహసం అధికారులు చేయగలరా? అలాంటప్పుడు వారి అవినీతిపై దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది?– ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖసాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై నమోదైన ఏడు కేసుల నుంచి ఆయన పేరు తొలగించేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు..’ అని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి... డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వ ఒత్తిడితో ప్రస్తుత పోలీస్, సీఐడీ ఉన్నతాధికారులు ఆ కేసుల విచారణలో న్యాయస్థానానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. చార్జ్షీట్లను న్యాయస్థానానికి పునఃసమర్పించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. తద్వారా కేసుల దర్యాప్తు సాగకుండా అడ్డుకుంటున్నారు’ అని వెల్లడించారు. ‘చంద్రబాబుపై అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారు. అప్పటి సీఐడీ అదనపు డీజీ సంజయ్, సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇన్చార్జ్ కె.రఘురామ్‌రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేసి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు నిందితులుగా ఉన్న ఈ కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థిస్తూ ఓ సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కూడా పొన్నవోలు తన లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. కేసుల దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ న్యాయస్థానానికి పూర్తిగా సహకరించాలని... దర్యాప్తు అధికారులకు రక్షణగా నిలవాలని అందులో డీజీపీని కోరారు. పూర్తి ఆధారాలతో, న్యాయపరమైన అంశాలను ఉటంకిస్తూ డీజీపీకి రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ..చంద్రబాబు పేరు తొలగించే కుట్ర.. ఉన్నతాధికారులకు బెదిరింపులురాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కేసు సహా దర్యాప్తులో ఉన్న ఏడు కేసుల్లో నిందితుల జాబితా నుంచి ప్రధాన నిందితుడు చంద్రబాబు పేరు తొలగించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకోసం సీఐడీ, పోలీసు ఉన్నతాధికారులను తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. ఆ కేసుల తుది దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి సమర్పించే ముందు నిందితుల జాబితా నుంచి చంద్రబాబు పేరు తొలగించాల్సిందేనని దర్యాప్తు అధికారులను ఒత్తిడి చేస్తూ బెదిరిస్తోంది. దర్యాప్తు నివేదికలను తారుమారు చేయాల్సిందేనని అధికారులను వేధిస్తున్నారు. తద్వారా ప్రధాన నిందితుడైన చంద్రబాబును ఈ కేసుల నుంచి సులువుగా బయటపడేయవచ్చన్నది అసలు ఉద్దేశం. సాక్షులుగా న్యాయస్థానం ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అధికారులపై ఈ కేసులను నెట్టేయాలని కుట్ర పన్నింది.చార్జిషీట్లను తొక్కిపెట్టారుచంద్రబాబుపై ఉన్న కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం మరో కుట్రకు పాల్పడింది. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించిన చార్జిషీట్లను సీఐడీ గతంలోనే న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై కొంత వివరణ కోరుతూ న్యాయస్థానం వాటిని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య సీఐడీకి పంపింది. అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆ అంశాలకు సంబంధించి కేస్ స్టడీలతో వివరాలను సీఐడీ అధికారులకు నివేదించారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఆ కేసులను నీరుగార్చేలా సీఐడీపై ఒత్తిడి చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆ చార్జ్షీట్లను ఈ రోజు వరకూ న్యాయస్థానానికి సమర్పించలేదు. ఆ కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ఎలాంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. టీడీపీ ప్రధాన కార్యాలయానికి నిధులుఏడు కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులు అక్రమ మార్గంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి చెందిన బ్యాంకు ఖాతాలకు చేరాయని సీఐడీ అధికారులు ఇప్పటికే ఆధారాలతో సహా గుర్తించారు. కానీ ఆ కేసుల దర్యాప్తునకు టీడీపీ ప్రధాన కార్యాలయం సహకరించడం లేదని సీఐడీ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. అంటే ఈ కేసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నది సుస్పష్టం. ప్రస్తుతం చంద్రబాబు సీఎంగా ఉండటంతో ఆ కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారుఆ ఏడు కేసుల దర్యాప్తు వేర్వేరు దశల్లో ఉంది. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయాన్ని 2024 జూన్ నుంచి ఆగస్టు 14 వరకు మూసివేశారు. డీజీపీ ఆదేశాలతో సిట్ అధికారులు ఆ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు అదనపు డీజీ (సీఐడీ) ఎన్.సంజయ్, సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఐజీ కె.రఘురామ్‌రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేశారు. వారికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది. నిందితులుగా చంద్రబాబు, మంత్రులు.. అందుకే కేసులు నీరుగార్చే కుట్రఈ ఏడు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సాధారణ పరిపాలన శాఖ, శాంతి–భద్రతల శాఖలను స్వయంగా నిర్వహిస్తున్న ఆయన ఈ కేసుల దర్యాప్తును నియంత్రిస్తున్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పనితీరుపై వార్షిక నివేదికలను ఆమోదించే స్థానంలో ఆయనే ఉన్నారు. దాంతో నాలుగు చార్జ్షీట్లపై న్యాయస్థానం కోరిన వివరణలను ఐపీఎస్ అధికారులు సమర్పించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబే కాకుండా ఇతర నిందితులు కూడా ఈ కేసుల సాక్షులను ప్రభావితం చేసే కీలక స్థానాల్లో ఉన్నారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు, సాక్షులపై వేధింపులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు, మరో నలుగురు మంత్రులు ఈ ఏడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అందుకే అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు గవర్నర్ అనుమతి కోరడం లేదు. కక్ష సాధింపు చర్యలకు తార్కాణం.. ఫిర్యాదు చేశారనే మధుసూదన్‌రెడ్డిపై వేధింపులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత కక్షపూరితంగా అధికారులను వేధిస్తున్నారో చెప్పేందుకు ఐఆర్ఏఎస్ అధికారి ఎం. మధుసూదన్‌రెడ్డి ఉదంతమే తార్కాణం. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్‌నెట్ కుంభకోణంపై సంస్థ ఎండీ హోదాలో ఆయన సీఐడీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రధాన నిందితుడిగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దీన్ని దృష్టిలో పెట్టుకుని కక్షపూరితంగా ఎం.మధుసూదన్‌రెడ్డిని సస్పెండ్ చేయించారు. డిప్యుటేషన్ పూర్తయి ఆయన తన మాతృశాఖకు వెళ్లడానికి మూడు రోజుల ముందు సస్పెండ్ చేయడం గమనార్హం. దీనిపై ఆయన పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌పై స్టే విధించింది. ఈ కేసుల దర్యాప్తు అధికారులకు ప్రస్తుత ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా వేధిస్తోంది. గవర్నర్ అనుమతి ప్రక్రియకు మోకాలడ్డుఈ కేసులో నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను గతంలో డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి చేపట్టారు. కానీ ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండగా మరో నలుగురు మంత్రులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను ప్రస్తుత సీఐడీ అదనపు డీజీ, డీజీపీ కొనసాగిస్తారనే నమ్మకం లేదు. గవర్నర్ అనుమతి కోరే ప్రతిపాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గం ముందు ఉంచాలి. కానీ ముఖ్యమంత్రి నియంత్రణలో విధులు నిర్వర్తించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలనకు తెస్తారనే నమ్మకం లేదు. మళ్లీ అదే పదవుల్లో నిందితులు.. కీలక రికార్డుల తారుమారుకు అవకాశంగతంలో టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబు, వైస్ చైర్మన్ పి.నారాయణ అసైన్డ్ భూములు, ఇన్నర్‌రింగ్ రోడ్డు కుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ మళ్లీ అదే పదవుల్లో ఉన్నారు. ఆ కేసుల్లో న్యాయస్థానం ఎదుట సీఆర్పీసీ 164 కింద సాక్ష్యం ఇచ్చిన అధికారులు ప్రస్తుతం చంద్రబాబు, నారాయణ నియంత్రణలో ఉన్నారు. ఈ కేసుల్లో మరికొందరు సాక్షులను విచారించాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లు, రిమాండ్ రిపోర్టులు, కొల్లగొట్టిన భూములకు సంబంధించిన కీలక రికార్డులన్నీ చంద్రబాబు, నారాయణకు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ కేసుల్లో సాక్షులను బెదిరించేందుకు, రికార్డులను తారుమారు చేసేందుకు వారిద్దరికీ పూర్తి అవకాశం ఉంది. ఈడీ దర్యాప్తు భయంతో..మనీ లాండరింగ్‌కు కూడా పాల్పడిన ఈ కేసుల వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి గతంలోనే సీఐడీ నివేదించింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఇప్పటివరకు పరిమిత స్థాయిలో దర్యాప్తు నిర్వహించింది. స్కిల్ స్కామ్ కేసులో షెల్ కంపెనీ డిజైన్‌టెక్‌కు చెందిన ఆస్తులను జప్తు చేయడంతోపాటు నలుగురు నిందితులను అరెస్ట్ కూడా చేసింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఈడీకి సమర్పించింది. ఆ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబు బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులు డిపాజిట్ అయినట్లు సీఐడీ గుర్తించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కొందరు బ్యాంకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కేవైసీ వివరాలు తీసుకోకుండానే నోట్ల మార్పిడి చేసినట్లు కూడా ఆధారాలు సేకరించింది. ఆ వివరాలతో పాటు స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించి న్యాయస్థానంలో సమర్పించిన చార్జ్షీట్లను ఈడీకి ఇప్పటికే సీఐడీ సమర్పించింది. వాటి ఆధారంగా చంద్రబాబుతోపాటు ఇతర ప్రధాన నిందితులపై ఈడీ ఇంకా దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. దీంతో ఈ కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం సీఐడీపై ఒత్తిడి తెస్తోంది. దర్యాప్తు అధికారులకు రక్షణగా ఉండండి.. నిష్పక్షపాత విచారణకు సహకరించండిఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతోపాటు మరో నలుగురు మంత్రులు నిందితులుగా ఉన్న ఆ ఏడు కేసుల దర్యాప్తు సమగ్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. ఆ కేసుల్లో దర్యాప్తు అధికారులపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా, బలవంతపు చర్యలు తీసుకోకుండా వారికి డీజీపీ రక్షణ కవచంలా నిలవాలి. తమ అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ నిందితులకు కొమ్ముకాయడం అంటే నేరానికి పాల్పడినట్టేనని వేరే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ కేసులకు సంబంధించి వాస్తవాలను న్యాయస్థానానికి సమర్పించాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. కేసుల విచారణలో న్యాయస్థానానికి డీజీపీ పూర్తిగా సహకరించాలి.బాబు బరితెగింపు బెయిల్ నిబంధనల ఉల్లంఘన స్కిల్ స్కామ్‌తోసహా తనపై ఉన్న అవినీతి కేసుల దర్యాప్తును ప్రభావితం చేస్తున్న సీఎం చంద్రబాబు న్యాయస్థానం ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. స్కిల్‌స్కామ్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టమైన షరతులు విధించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలను మీడియా ఎదుటగానీ మరెక్కడాగానీ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. అనంతరం పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు కూడా షరతులు విధించింది. అయితే చంద్రబాబు తాను న్యాయస్థానాలకు అతీతమన్నట్టు వ్యవహరిస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే రీతిలో వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. తాజాగా ‘ఆహా’లో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. అందులో స్కిల్ స్కామ్ కేసు గురించి చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించడం గమనార్హం. తనను అకారణంగా అరెస్ట్ చేశారని.. తాను ఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యలు చేశారు. కేసు ఇంకా విచారణలో ఉండగానే తనకు తానే తీర్పు ఇచ్చేశారు! తద్వారా స్కిల్ స్కామ్ కేసు గురించి మాట్లాడవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారు. అంతేకాదు.. తాను ఎవరినీ విడిచిపెట్టబోనంటూ దర్యాప్తు అధికారులను బెదిరించే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కేసుల్లో నిందితుల వివరాలు⇒ నారా చంద్రబాబు (ముఖ్యమంత్రి): ఏడు కేసుల్లో నిందితుడు⇒ పొంగూరు నారాయణ (మున్సిపల్ శాఖ మంత్రి): ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసుల్లో నిందితుడు⇒ నారా లోకేశ్ (విద్యా శాఖ మంత్రి): ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో నిందితుడు⇒ కె.అచ్చెన్నాయుడు (వ్యవసాయ శాఖ మంత్రి): స్కిల్ స్కామ్ కేసులో నిందితుడు⇒ కొల్లు రవీంద్ర (ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడు -
పక్కా పన్నాగంతోనే స్కిల్ స్కామ్.. బాబు కనుసన్నల్లోనే కుంభకోణం
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు పక్కా కుట్రతోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్ట్ ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. 2014–15లో ముఖ్యమంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేస్తూ కుట్రపూరితంగా షేల్ కంపెనీలు సృష్టించి ఫేక్ ఇన్వాయిస్లు అవినీతికి పాల్పడ్డారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట రూ.3,300కోట్ల ప్రాజెక్టును కేవలం కాగితాలపై సృష్టించడం... ప్రాజెక్టు చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371కోట్లు విడుదల చేయడం... షెల్ కంపెనీల ద్వారా తరలించడం...ఇలా కుట్ర అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది.ప్రజాధనం కొల్లగొట్టాలనే పక్కా పన్నాగంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ సృష్టికర్త... ఆ కుంభకోణంతో అక్రమంగా నిధులు పొందిన లబ్ధిదారూ రెండూ చంద్రబాబే’అని సీఐడీ సిట్ దర్యాప్తులో ఆధారాలతోసహా వెల్లడైంది. కుంభకోణం కుట్రదారు...అంతిమలబ్ధిదారుడు చంద్రబాబేనని నిగ్గు తేలి్చంది. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు రూపొందించారు. టీడీపీ నేత ఇల్లెందుల రమేశ్ ద్వారా డిజైన్‌టెక్, ఎస్‌ఐఎస్‌డబ్ల్యూ సంస్థలు ఆయన్ని సంప్రదించాయి. దాంతో రాష్ట్ర కేబినేట్ ఆమోదం లేకుండానే ఏపీఎస్ఎస్డీసీని ఏర్పాటు చేశారు.ఆ సంస్థకు డైరెక్టర్‌గా తన సన్నిహితుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా గంటా సుబ్బారావును నియమించారు. ఏపీఎస్ఎస్డీసీని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎంటర్ ప్రైజస్, ఇన్నోవేషన్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి సర్వే లేకుండానే కేవలం డిజైన్‌టెక్ కంపెనీ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఆధారంగా ఆ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో డిజైన్‌టెక్ భాగస్వామిగా ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. రూ.3,300కోట్లతో ప్రాజెక్ట్‌ను ఆమోదించి... అందులో సీమెన్స్–డిజైన్‌టెక్ కంపెనీలు 90శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10శాతం నిధులు సమకూరుస్తాయని ఒప్పందంలో పేర్కొన్నారు.చంద్రబాబు అవినీతి నెట్వర్క్ ఇదీ...⇒ టీడీపీ ప్రభుత్వం పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించింది.. రూ 371 కోట్లు⇒ డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ. 238.29 కోట్లు, ⇒ ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు.అంతా బాబు ముఠానే..ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులే అంతా తామై వ్యవహరించారు. ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే. లక్ష్మీనారాయణ, ఎండీ గంటా సుబ్బారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావుకు ఏకంగా ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా నాలుగు పోస్టులను కట్టబెట్టారు.తద్వారా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికు ఎలాంటి పాత్ర లేకుండా గంటా సుబ్బారావుతో నేరుగా నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగించేలా పథకం రచించారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. ఇది పరస్పర ప్రయోజనాల విరుద్ధ చట్టానికి విరుద్ధమైనా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. మావాళ్లే.. అడ్డగోలుగా నిధులు ఇచ్చేయండి ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ వాటా 10శాతం కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేశారు. అందుకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆరి్థక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత నోట్‌ఫైళ్లపై లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సీమెన్స్ కంపెనీకి రూ.371కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆరి్థక శాఖ అధికారులు ఆ నోట్‌ఫైళ్లలో స్పష్టం చేస్తూ ఆ నిధులు విడుదల చేశారు. నిధులు కొల్లగొట్టేందుకు గ్రీన్ చానల్ ఇక ఆ ప్రాజెక్ట్ నిధులను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. విద్యా శాఖతో నిమిత్తం లేకుండా ఏపీఎస్ఎస్డీసీ నుంచి నేరుగా ఇంటర్ప్రైజస్– ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైళ్లు పంపాలని ఆదేశించారు. ఆ మేరకు డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లను వివిధ షెల్ కంపెనీల ద్వారా తరలించారు. పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది...ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లుఇన్వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లుమొత్తం రూ. 140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. -
పైసలిస్తే.. పీహెచ్డీ!
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ప్రతిష్ట మసకబారుతోంది. ఇన్నాళ్లూ ఉన్నతంగా వెలుగొందిన వర్సిటీలకు కళంకం ఏర్పడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిరాగానే రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరిస్తూ 17 వర్సిటీల వైస్ చాన్సలర్ల మెడపై కత్తిపెట్టి రాజీనామాలు చేయించడంతో తిరోగమనం మొదలైంది. అది కాస్తా.. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడియన్ యూనివర్సిటీ అడ్డగోలుగా పీహెచ్‌డీలు మంజూరు చేసే స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ పెద్దలు అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తమ అనుయాయులు కొందరికి ఇన్చార్జి వీసీ పోస్టులు కట్టబెట్టారు. ఇందులో భాగంగానే ద్రవిడియన్ వర్సిటీలో తమకు ‘స్వామి భక్తి’ ప్రదర్శించే వ్యక్తికి వర్సిటీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు సదరు వ్యక్తి కనుసన్నల్లో ‘పీహెచ్‌డీలో పైసా వసూల్’ దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోనే ఏకంగా 100కిపైగా ఆఫ్ క్యాంపస్ పీహెచ్‌డీలకు ప్రొసీడింగ్ (అవార్డు) చేసినట్టు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి యూజీసీ 2009లో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం డిస్టెన్స్ పీహెచ్‌డీలను నిలిపివేసింది. కానీ, కాసులే పరమావధిగా ద్రవిడియన్ వర్సిటీ ఇన్చార్జి బాస్ అమాయక విద్యార్థుల ఆశలను అడ్డుపెట్టుకుని పనికిరాని పీహెచ్‌డీలు ఇస్తూ రూ.కోట్లలో అవినీతి దందాకు తెరతీసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, అమరావతి ప్రొసీడింగ్స్ ఇవ్వాలంటే రూ.లక్ష పీహెచ్డీ అవార్డు కంటే ముందు వర్సిటీ విద్యార్థికి ప్రొసీడింగ్స్ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ద్రవిడియన్ వర్సిటీలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్ష వసూలు చేస్తున్నట్లు సమాచారం. విద్యార్థికి గైడ్ ఎవరనేది చూడకుండా.. థీసిస్‌ను పరిశీలించకుండా.. జాతీయస్థాయి వర్సిటీలకు కూడా సాధ్యపడని విధంగా ప్రతిరోజూ రెండు/మూడు పీహెచ్‌డీలను ద్రవిడియన్ వర్సిటీ ఇచ్చేస్తోంది. అది కూడా యూజీసీ గుర్తించని డిస్టెన్స్ విధానంలో ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో వర్సిటీలో అక్రమ సరి్టఫికెట్లతో లైబ్రరీ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలి ద్రవిడియన్ వర్సిటీలో పీహెచ్డీ మంజూరులో అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఇటీవల బహిరంగ లేఖను విడుదల చేసింది. గత ప్రభుత్వంలో పీహెచ్డీ అక్రమాలపై జస్టిస్ బి.శేషశయనరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. ఆఫ్ క్యాంపస్‌లో పీహెచ్‌డీలు ఇస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009 ముందు రిజి్రస్టేషన్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఆఫ్ క్యాంపస్ పీహెచ్డీ ఇవ్వాలన్న యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ద్రవిడియన్ వర్సిటీ పీహెచ్డీ ప్రదానం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.తాత్కాలిక ఉద్యోగి.. ఇన్చార్జి వీసీ ద్రవిడియన్ వర్సిటీలో 2010లో తాత్కాలిక ప్రాతిపదికన డెప్యూటీ లైబ్రేరియన్‌గా అడుగు పెట్టిన సదరు స్వామిభక్తి పరుడు ఎక్కడిక్కడ నిబంధనలకు విరుద్ధంగానే ప్రమోషన్లు పొందడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టు లేకుండానే నేరుగా డెప్యూటీ లైబ్రేరియన్ పోస్టులోకి రావడానికి అప్పట్లోనే తెరవెనుక చక్రం తిప్పారు. ఆ తరువాత తాత్కాలిక ప్రాతిపదికపై వచ్చిన వారిని రెగ్యులర్ చేస్తున్నట్లు వర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వడంతో కొందరు కోర్టుకు వెళ్లారు. వర్సిటీ తీరును తప్పుపట్టిన కోర్టు.. త్వరలోనే రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి ఆయా పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. అయితే.. తాత్కాలిక పద్ధతిపై వచ్చిన వారిని తొలగించకుండా వర్సిటీ అధికారులు కొందరు కోర్టును తప్పుదోవ పట్టిస్తూ రెగ్యులర్ నోటిఫికేషన్‌ను తాత్సారం చేశారు. ఇదే అదనుగా స్వామిభక్తి పరుడు వర్సిటీ పెద్దలను ప్రసన్నం చేసుకుని రెగ్యులర్ ఉద్యోగిగా మారిపోయారు. అంతటితో ఆగలేదు.. నాన్‌టీచింగ్ డెప్యూటీ లైబ్రేరియన్ పోస్టు (అసోసియేట్ ప్రొఫెసర్) నుంచి ఏకంగా టీచింగ్ విభాగంలోని ప్రొఫెసర్ పోస్టులోకి వచ్చేశారు. సుమారు ఆరేళ్లు అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో పనిచేస్తేనే ప్రొఫెసర్ హోదాకు అర్హత లభిస్తుంది. కానీ.. అప్పుడెప్పుడో ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసిన అనుభవాన్ని లెక్కగట్టి కేవలం వర్సిటీలోకి నాన్–టీచింగ్ ఉద్యోగిగా వచ్చిన మూడేళ్లలోనే ప్రొఫెసర్‌గా మారిపోయారు. సదరు స్వామిభక్తి పరుడిపై 2014లో హైకోర్టులో మరో కేసు నమోదైంది.అది ఇప్పటికీ విచారణలో ఉండడం గమనార్హం. వీటన్నింటినీ పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు ద్రవిడియన్ వర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్లను పక్కనపెట్టి సొంత సామాజిక వర్గానికి చెందిన, అర్హత లేని వ్యక్తిని అందలం ఎక్కించడంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. పైగా సదరు వ్యక్తి తనపై కేసులేమీ లేవని వర్సిటీ విజిలెన్స్ రిపోర్టు తీసుకుని వైస్ చాన్సలర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు వర్సిటీ భోగట్టా. రాజకీయాలకు వేదికగా.. ద్రవిడియన్ వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి క్యాంపస్‌లో ఎటువంటి రాజకీయ సమావేశాలు జరగలేదు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వర్సిటీ క్యాంపస్ రాజకీయాలకు అడ్డగా మారిపోయింది. స్వామి భక్తిపరుడు సీటులో కూర్చోవడంతో ఇది మరింత పెరిగింది. ఈ నెల 1వ తేదీన ఏకంగా నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తల సమావేశం క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వహించి స్వామిభక్తిని చాటుకున్నారు. -
అగ్గిపెట్టె మచ్చా.. అటు ముంపు.. ఇటు అవినీతి కంపు.. రూ.534 కోట్లు మేసేశారు..
-
బాబు జమానా.. అవినీతి ఖజానా ముంపులోనూ మేసేశారు
బుడమేరు గేట్లెత్తి బెజవాడను నిండా ముంచిన చంద్రబాబు సర్కారు.. ఆదుకోండి మహాప్రభో అని వేడుకునేందుకు వచ్చిన వరద బాధితులను కలెక్టరేట్ గేట్లు మూసి నిర్దయగా గాలికొదిలేసింది. కానీ.. అదే వరద పేరు చెప్పి పాలకులు రూ.వందల కోట్లు కొల్లగొట్టేశారు. సహాయక చర్యలు చేపట్టి బాధితుల్ని ఆదుకున్నట్టు ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఆ ముసుగులో ఏ పనీ చేయకుండానే ఖర్చుల పేరిట ఖజానా నుంచి భారీఎత్తున నిధులను పక్కదారి పట్టించారు.సాక్షి, అమరావతి: వరద సహాయక చర్యల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చుల లెక్కలు ప్రజల్ని నివ్వెరపరుస్తున్నాయి. బుడమేరు, కృష్ణా వరదలో పేరుకుపోయిన అవినీతి బురదను చూసి జనం అసహ్యించుకుంటున్నారు. సహాయ, పునరావాస చర్యల్లో ఘోరంగా విఫలమైన టీడీపీ సర్కారు.. ఖర్చులు మాత్రం దిమ్మతిరిగేలా చూపడంతో ఇంత ఖర్చు ఎక్కడ పెట్టారోనని ముక్కున వేలేసుకుంటున్నారు.అసలు సహాయక చర్యలే చేపట్టక జనం అల్లాడిపోతే ప్రభుత్వం ఏకంగా రూ.534 కోట్లను రిలీఫ్ క్యాంప్‌ల కోసం ఖర్చు చేసినట్టు చెబుతుండటం విస్తుగొలుపుతోంది. గత నెలలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలను వరదలు అతలాకుతలం చేసినా ప్రభుత్వం ఎక్కడా పునరావాస కేంద్రాలు తెరవలేదు. విజయవాడలోని సగం ప్రాంతం మునిగిపోయినా పునరావాస కేంద్రాలు లేకపోవడంతో జనం డాబాలపైన, అపార్ట్మెంట్స్లోని పై అంతస్తుల్లోనే వారం రోజులపాటు గడిపారు. కాగితాల్లో పునరావాస కేంద్రాలు తెరిచినట్టు చూపించినా రెండు, మూడు మినహా అవి ఎక్కడా లేవు. భోజనం ఖర్చు రూ.376 అన్ని ఖర్చుల్లోనూ భోజనాల ఖర్చే రూ.368.18 కోట్లు చూపించడంతో వరద బాధితులు నోరెళ్లబెడుతున్నారు. బాధితులకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు పెద్దఎత్తున ఆహారం సమకూర్చారు. వరద ఎక్కువగా ఉండటంతో ముంపు ప్రాంతాల్లో శివారు ప్రాంతాలకు వాటిని తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. కానీ.. చంద్రబాబు మాత్రం ప్రభుత్వం తరఫున 97 లక్షల మందికి ఆహారం అందించినట్టు లెక్క రాసేశారు. 3.97 లక్షల మందికి టిఫిన్, 4.33 లక్షల మందికి మధ్యాహ్న భోజనం, 4.26 లక్షల మందికి రాత్రి భోజనం ఇచ్చినట్టు ఆయనే స్వయంగా పలుమార్లు వెల్లడించారు.97.70 లక్షల మందికి టిఫిన్, లంచ్, డిన్నర్‌కి రూ.368.18 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపారు. అంటే ఒక్కో బాధితుడికి రోజుకు రూ.376 చొప్పున ఆహారం కోసం ఖర్చు చేసినట్టు రాసుకుని ఆ మొత్తాన్ని కొల్లగొట్టారు. ఆహారం అందక జనం అష్టకష్టాలు పడితే.. వారికి స్టార్ హోటల్ భోజనం పెట్టినట్టు చెప్పడాన్ని బట్టి అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మంచినీళ్లలోనూ అదే తీరు వరద బాధితులకు 94 లక్షల మంచినీళ్ల బాటిళ్లు ఇచ్చినట్టు లెక్క రాసుకుని రూ.26.80 కోట్లను పాలకులు బొక్కేశారు. 94 లక్షల బాటిళ్లలో పావు వంతు కూడా జనానికి అందలేదు. నిత్యావసర సరుకులు కూడా అందరికీ అందకపోయినా లక్షలాది మందికి ఇచ్చేసినట్లు.. అందుకోసం రూ.61 కోట్లకు పైగా ఖర్చయినట్టు లెక్కల్లో చూపించారు. విజయవాడ సింగ్‌నగర్ పరిసరాల్లో ఇప్పటికీ కొన్నిచోట్ల వరద కంపు కొడుతున్నా, చెత్త కనిపిస్తున్నా పారిశుధ్యం మాత్రం సూపర్‌గా ఉందని.. ఇలా చేయడానికి రూ.51 కోట్లు ఖర్చయ్యిందని లెక్కల్లో రాసేసుకున్నారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల కోటా రూ.23 కోట్లు అన్నిటికంటే విచిత్రమైన విషయం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23.07 కోట్లు ఖర్చవడం. అసలు జనానికి ఇవి ఎక్కడ ఇచ్చారో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఏ ప్రాంతంలో వరద బాధితుల్ని అడిగినా కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో మొబైల్ జనరేటర్ల ఖర్చు కూడా అందులో ఉందని కవర్ చేసుకుంటున్నారు. కానీ.. అవి ఎక్కడ, ఎన్ని పెట్టారో కూడా అధికారులకు తెలియదు. అవినీతి వరదలో వీటి ఖర్చే వింతల్లోకెల్లా వింతగా కనిపిస్తోంది. డ్రోన్ల ఖర్చు రూ.2 కోట్లువరద ఖర్చుల వింతల్లో డ్రోన్ల ఖర్చు సరికొత్తగా ఉంది. కేవలం డ్రోన్ల కోసం రూ.2 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారు. డ్రోన్లతో ఆహారం సరఫరా చేసినట్టు ఏఐ సాయంతో ఫొటోలు తయారు చేసి.. ఇప్పుడు వాటి కోసం కోట్లు ఖర్చయినట్టు లెక్కలు రాశారు. చెత్త తరలింపు, వరద నీరు తోడటం వంటి ఖర్చులే రూ.7 కోట్లు దాటిపోయాయి. వరద బాధితుల తరలింపు, చెత్త ఎత్తడం, పారిశుధ్యం ఈ లెక్క వేరేగా ఉంది. అవన్నీ కలుపుకుంటే ఖర్చులే రూ.557 కోట్లు దాటిపోయింది.అంత ఖర్చు ఎక్కడ పెట్టారు?ఇంత భారీ ఎత్తున సహాయ, పునరావాస చర్యల కోసం ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వం చెబుతుండటంతో అంత ఖర్చు ఎక్కడ పెట్టారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చేయని ఖర్చుకు భారీగా లెక్కలు చూసి సర్కారు పెద్దలు దండుకున్నట్టు ఏ లెక్క చూసినా స్పష్టమవుతోంది. ఈ సొమ్ములో చాలా వరకూ విడతల వారీగా ఇప్పటికే విడుదలైంది. కలెక్టర్లు, వివిధ శాఖల ద్వారా ఆ సొమ్మును డ్రా చేసి బిల్లులు కూడా చాలా వరకూ చెల్లించేశారు. వరద ఖర్చుల్లో ఒక్కో అంశంపైనా అవినీతి కేసులు పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరద బాధితులను ఆదుకోకపోగా వారి పేరుతో రూ.వందల కోట్లు దోచేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రూ.500 కోట్ల విరాళాలు హుష్ కాకే! వరద బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు భారీగా విరాళాలు సేకరించారు. ఇప్పటివరకు రూ.500 కోట్లకుపైగా నిధులు దాతల నుంచి అందినట్టు ప్రకటించారు. విరాళాలు బాగా వచ్చాయనుకుంటే.. వాటికి మించి రూ.557 కోట్ల ఖర్చుల లెక్కలు చూపించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాన్ని కుంగదీసిన వరద చంద్రబాబు సర్కారుకు కాసులు కురిపించినట్టు స్పష్టమవుతోంది. బాధితులకు రూ.602 కోట్ల నష్టపరిహారం ఇచ్చినట్టు ప్రకటించినా.. ఇంకా చాలా మందికి అందలేదు. నిత్యం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బాధితులు చేస్తున్న ఆందోళనలే ఇందుకు నిదర్శనం. -
జైలుకు ఈశ్వరన్
సింగపూర్: అవినీతి కేసులో దోషిగా రుజువైన సింగపూర్ మాజీ మంత్రి, ఏపీ సీఎం చంద్రబాబు ‘అమరావతి పార్ట్నర్’ ఎస్.ఈశ్వరన్ (62) సోమవారం జైలుకు వెళ్లారు. మంత్రిగా ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి ఏడేళ్ల కాలంలో ఆయన 3.12 లక్షల డాలర్ల విలువైన అక్రమ కానుకలు స్వీకరించడం నిజమేనని కోర్టు తేల్చడం, ఏడాది జైలు శిక్ష విధిస్తూ గత గురువారం తీర్పు వెలువరించడం తెలిసిందే. ఇప్పటికే నేరాన్ని అంగీకరించిన ఈశ్వరన్ కోర్టు తీర్పుపై అపీలుకు వెళ్లకుండా శిక్ష అనుభవించేందుకే మొగ్గు చూపారు. ‘‘నా చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నా. సింగపూర్వాసులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా’’ అంటూ సోమవారం ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అనంతరం శిక్ష అనుభవించేందుకు జైలుకు వెళ్లారు. ఏపీలో రాజధాని అమరావతి పేరిట 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో జరిగిన భూ దోపిడీలో ఈశ్వరన్ కూడా కీలక పాత్రధారి అన్నది తెలిసిందే. -
అమరావతి పార్టనర్.. ఈశ్వరన్‌కు జైలు శిక్ష
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట జరిగిన భూ దోపిడీలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన సింగపూర్ మాజీ మంత్రి ఎస్.ఈశ్వరన్ స్వదేశంలో అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు తెగబడినట్లు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం ‘కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ (సీపీఐబీ) విచారణలో నిగ్గు తేలింది. ఈశ్వరన్ అవినీతికి పాల్పడినట్టు న్యాయ విచారణలో కూడా నిర్ధారణ కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది. జూనియర్ అధికారి నుంచి మంత్రిగా.. 2008లో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలో జూనియర్ ఆఫీసర్‌గా ఉన్న ఈశ్వరన్ అనతి కాలంలో ఉన్నత స్థానానికి ఎగబాకారు. మొదట పరిశ్రమల శాఖ మంత్రిగా, అనంతరం రవాణా శాఖ మంత్రిగా కీలక పదవులు పొందారు. ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్ నుంచి ఈశ్వరన్ భారీగా ముడుపులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేల్చింది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ – సింగపూర్ పర్యాటక విభాగాల మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్‌లో హ్యారీ పోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్‌తోపాటు ఈశ్వరన్‌ను గత ఏడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో పదవికి రాజీనామా చేసిన ఈశ్వరన్ అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్ïÙట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నట్లు రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించినట్లు ఒక అభియోగం నమోదైంది. బాబు భూ దోపిడీలో పార్టనర్ 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు బృందం రాజధాని పేరిట యథేచ్ఛగా సాగించిన భూ దోపిడీలో ఈశ్వరన్ ప్రధాన భూమిక పోషించారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని భ్రమింపజేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అత్యంత కీలకమైన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్‌ను చంద్రబాబు, ఈశ్వరన్ ద్వయం కుట్రపూరితంగా తెరపైకి తెచ్చింది. ఒప్పందం సమయంలో సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియంను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానం ముసుగులో ఇతర సంస్థలేవీ పోటీ పడకుండా ఏకపక్షంగా 2017 మే 2న కట్టబెట్టేశారు. దీనికి నాటి చంద్రబాబు కేబినెట్ రాజముద్ర వేసింది. ఆ ఒప్పంద పత్రాలపై ఈశ్వరన్ సంతకాలు చేశారు. అప్పుడు ఆయన సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నట్టు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా హడావిడి చేసింది. స్టార్టప్ ఏరియా వాటాల కేటాయింపులోనూ చంద్రబాబు గోల్మాల్ చేశారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 42 శాతం వాటా కల్పించారు. రూ.306.4 కోట్లు మాత్రమే వెచ్చించే అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి ఏకంగా 58 శాతం వాటా కట్టబెట్టేశారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసే స్టార్టప్ ఏరియా స్థూల టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి మొదట విడతలో 5 శాతం, రెండో విడతలో 7.5 శాతం, మూడో విడతలో 12 శాతం వాటా మాత్రమే కేటాయించారు. స్టార్టప్ ఏరియా టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి సగటున కేవలం 8.7 శాతం వాటా దక్కనుండగా అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి మాత్రం 91.3 శాతం వాటా దక్కుతుందన్నది స్పష్టమైంది. ఆ కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు. అందుకు ఈశ్వరన్ సహకరించారు. తద్వారా స్టార్టప్ ఏరియాలో రూ.లక్షల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు పథకం వేశారు. స్టార్టప్ ఏరియాను ఆనుకుని ఉన్న 1,400 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు బృందం బినామీ పేర్లతో కొల్లగొట్టింది. ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డును ఆనుకుని భారీగా భూములు కొనుగోలు చేసింది. సింగపూర్‌లో చంద్రబాబు బినామీల పేరిట ఉన్న స్టార్ హోటళ్లు, ఇతర రియల్ ఎస్టేట్ పెట్టుబడులలోనూ ఈశ్వరన్ కీలక పాత్ర పోషించినట్లు అధికారిక, పారిశ్రామిక వర్గాలు చెబుతుండటం గమనార్హం. -
ప్రధాని మోదీ నాపై కుట్ర పన్నారు: కేజ్రీవాల్
ఢిల్లీ: తనను అవినీతిపరుడిగా నిరూపించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ చీప్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో జరిగిన ‘జంతాకీ అదాలత్’ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొని మాట్లాడారు.‘‘ప్రధాని నరేంద్ర మోదీ మాపై కుట్ర పన్నారు. నన్ను, ఆప్ నేత మనీష్ సిసోడియా అవినీతిపరుడని నిరూపించేందుకు కుట్ర పన్నారు. ఆప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి కుర్చీపై దాహం లేకపోవడం వల్లే రాజీనామా చేశా. డబ్బు సంపాదించడానికి కాదు రాజకీయాల్లో వచ్చింది. దేశ రాజకీయాలను మార్చేందుకు వచ్చాను....మేము జాతీయవాదులుము, దేశభక్తులమని ఆర్ఎస్ఎస్ వాళ్లు అంటున్నారు. మోహన్ భగవత్ గారికి నేను గౌరవంగా ఐదు ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మోదీ పార్టీలను విచ్ఛిన్నం చేయడం, నేతలను ప్రలోభపెట్టడం, ఈడీ, సీబీఐలతో బెదిరించడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను పడగొట్టడం సరైనదేనా?. మోదీ బీజేపీలో అత్యంత అవినీతి నాయకులను చేర్చుకున్నారు. వారిని అవినీతిపరులని ఆయనే స్వయంగా పిలిచారు. అలాంటి రాజకీయాలను మీరు అంగీకరిస్తారా?. ...ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ పుట్టింది. బీజేపీ దారితప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్ఎస్ఎస్పై ఉంది. మోదీ తప్పుడు పనులు చేయకుండా మీరు ఎప్పుడైనా ఆపారా?. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు ఆర్ఎస్ఎస్ అవసరం లేదని అన్నారు. బీజేపీ అంతగా ఎదిగిపోయిందా? మాతృసంస్థపై తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు బాధ కలగలేదా?. 75 ఏళ్ల తర్వాత నేతలు రిటైర్ అవుతారని మీరే చట్టం చేశారు. ఈ రూల్ ప్రధాని మోదీకి వర్తించదని కేంద్రమంత్రి అమిత్ షా చెబుతున్నారు. పార్టీ నేత అద్వానీకి వర్తించిన రూల్.. మోదీకి ఎందుకు వర్తించదు?’’అని అన్నారు. #WATCH | AAP national convenor Arvind Kejriwal says, "RSS people say that we are nationalists and patriots. With all due respect, I want to ask Mohan Bhagwat ji five questions- the way Modi ji is breaking parties and bringing down governments across the country by luring them or… pic.twitter.com/nWTxgbZCgl— ANI (@ANI) September 22, 2024చదవండి: సీఎం పీఠంపై మహిళా శక్తి -
హేమంత్ అవినీతి సీఎం: రాజ్‌నాథ్
ఇట్ఖోరి (జార్ఖండ్): జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అత్యంత అవినీతిపరుడైన సీఎంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ఉన్నతమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలతో ఆడుకున్నారని విమర్శించారు. సోరెన్‌ను గద్దెదింపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జార్ఖండ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ చేపట్టిన పరివర్తన్ యాత్రను ఇట్ఖోరిలో శనివారం రాజ్‌నాథ్ ప్రారంభించారు. హేమంత్ సోరెన్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. అవినీతి మరకలున్న వారిని భారత్ ఎప్పటికీ ఆమోదించబోదన్నారు. బీజేపీ సీఎంలు బాబూలాల్ మరాండి, అర్జున్ ముండా, రఘుబర్ దాస్‌లు ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనలేదన్నారు. అధికారిక కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలను జార్ఖండ్ ప్రగతిని అడ్డుకుంటున్న స్పీడ్‌బ్రేకర్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశ్, రొహింగ్యా చొరబాటుదారులకు కొమ్ముకాస్తోందని రాజ్‌నాథ్ ఆరోపించారు. -
అమృత్ టెండర్లలో అవినీతి నిగ్గు తేల్చండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడుతున్న అంశంలో జోక్యం చేసుకొని నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహర్‌లాల్ కట్టర్, టోచన్ సాహూలకు కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.1,500 కోట్లు విలువ చేసే పనులు ముఖ్యమంత్రి సొంత బావమరిది కంపెనీకి అర్హతలు లేకున్నా కట్టబెట్టారన్న ఆరోపణల్లో నిజాలు బయట పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఈ అంశంలో సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు.ముఖ్యమంత్రి బావమరిది ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వామిగా ఉన్నారన్నారు. అమృత్ పథకంలో గత తొమ్మిది నెలలుగా జరిగిన ప్రతి టెండర్లను సమీక్షించి, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ టెండర్లను రద్దు చేయాలని కేటీఆర్ కోరారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేసిన ఓ కంపెనీకి దాదాపు 40 శాతానికి పైగా అంచనాలు పెంచి మరీ పనులను అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అమృత్ టెండర్ల సమాచారాన్ని బహిర్గతం చేయాలని, టెండర్లు దక్కించుకున్న కంపెనీల వివరాలను ప్రజల ముందు పెట్టాలన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది సుజన్‌రెడ్డికి చెందిన కంపెనీ ఇతర కంపెనీలతో కలిసి రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఎలాంటి అర్హతలు లేకున్నా దక్కించుకుంటున్న విషయాన్ని తన లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కొడంగల్ ఎత్తిపోతల కాంట్రాక్టు పనులను సృజన్‌రెడ్డి కంపెనీతోపాటు గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక ఆరోపణలు చేసిన సదరు కంపెనీతో పాటు మరో కంపెనీకి అప్పజెప్పినట్టు కేటీఆర్ తన లేఖలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కేఎన్ఆర్ కంపెనీలో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డికి వాటాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. తగిన చర్యలు తీసుకోకుంటే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్న అవినీతి కార్యక్రమాల్లో కేంద్రానికి కూడా భాగస్వామ్యం ఉందని ప్రజలు నమ్ముతారని కేటీఆర్ హెచ్చరించారు. -
మమతా బెనర్జీ ప్రభుత్వంలో కోట్లలో అవినీతి: బీజేపీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీకి సిర్కార్ రాసిన లేఖ ద్వారా.. అంతర్గతంగా టీఎంసీలో సీఎం మమత అవినీతి, నియంతృత్వ విధానాన్ని తెలియాజేస్తోందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.సిర్కార్ లేఖ ద్వారా పశ్చిమ బెంగాల్లో అన్ని సంస్థల్లో కోట్లాది అవినీతి జరిగినట్లు తెలుస్తోందని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా సీఎం దీదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అదేవిధంగా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై సీఎం మమత ప్రాధాన్యత ఏంటో తెలియజేస్తోందని అన్నారు. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగదని స్పష్టమవుతోందని తెలిపారు.‘‘జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు విషయంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం సీఎం మమత ప్రభుత్వంలో లేదు. అయినా ఇంకా టీఎంసీ నేతలు నిరసనకారులను వేధిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంకా మమతా బెనర్జీ సీఎంగా ఎందుకు కొనసాగుతున్నారు? ఆమె ఇంకా ఎందుకు సీఎం పదవికి రాజీనామా చేయటం లేదు? ఆమె రాజీనామా చేయకుండా కోల్‌కతా సీపీని, ఆర్జీకర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్‌ను ఎందుకు రక్షిస్తున్నారు?’ అని అన్నారు.#WATCH | On TMC Rajya Sabha MP Jawhar Sircar resigning as party MP, BJP leader Shehzad Poonawalla says, "If someone should give the resignation it should be West Bengal CM Mamata Banerjee...TMC government and Mamata Banerjee institutionalised corruption and in his letter, he… pic.twitter.com/tY1d4E59Nu— ANI (@ANI) September 8, 2024మరోవైపు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్ ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు.