మూడు నెలల్లో ముగించేద్దాం | Senior Supreme Court lawyer Luthra in Vijayawada | Sakshi
Sakshi News home page

మూడు నెలల్లో ముగించేద్దాం

Published Wed, Dec 18 2024 3:58 AM | Last Updated on Wed, Dec 18 2024 7:27 AM

Senior Supreme Court lawyer Luthra in Vijayawada

చంద్రబాబు అవినీతి కేసులకు ఇదే డెడ్‌లైన్‌ 

విజయవాడలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది లూథ్రా 

పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులతో రెండు రోజులు భేటీ 

సాక్షులను బెదిరించండి.. పత్రాలు తారుమారు చేయండి 

ఎంతైనా వేధించండి... వాంగ్మూలాలు మార్చండి 

కేసులు క్లోజ్‌ చేసే పని నేను చూసుకుంటా.. లూథ్రా పకడ్బందీ పథకం సిద్ధం చేశారంటున్న పోలీసు వర్గాలు 

సాక్షి,టాస్క్ ఫోర్స్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన కేసులను యుద్ధప్రాతిపదికన మూసివేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న 
అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా ఇప్పుడు ఈ వ్యవహారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. పోలీసు, సీఐడీ విభాగాలను వీలైనంత మేర ఉపయోగించుకోవడం, కేసులను నీరుగార్చడం.. ఇదీ పథకం. 

ఈ పథకాన్ని సిద్ధార్థ్‌ లూథ్రా స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌ కేంద్రంగా ఆది, సోమవారాల్లో నిర్వహించిన రహస్య సమావేశాల్లో ఈ మేరకు ఓ కుట్రను ఖరారు చేశారని వినిపిస్తోంది. లూథ్రాతో పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా భేటీ అయ్యారని విశ్వసనీయ సమాచారం.  

సాక్షులను బెదిరించండి... వాంగ్మూలాలు మార్చండి.. 
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్ర­బాబు బరితెగించి పాల్పడిన దోపిడీని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఆధారాలతోసహా నిగ్గు తేల్చింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం, అసైన్డ్‌ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణం, ఫైబర్‌ నెట్‌ కుంభకోణాల కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబేనన్నది ఆధారాలతో బట్టబయలైంది. 

నిబంధనలకు విరుద్ధమని చెప్పినా సరే సీఎం హోదాలో చంద్ర­­బాబు ఆదేశించడంతోనే అక్రమాలకు పాల్పడా­ల్సి వచ్చిందని ఆనాటి ఉన్నతాధికారులతోపాటు ఇతరులు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అక్రమ నిధులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసా­నికి, టీడీపీ బ్యాంకు ఖాతాలకు చేరినట్టు ఆధారాల­ను సిట్‌ సేకరించింది. దాంతోనే ఆ కేసుల్లో చంద్రబాబు అడ్డంగా దొరికినట్టైంది. 

ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసుల నుంచి చంద్రబాబు పేరు తప్పించేందుకు కుట్ర పన్నుతోంది. అందుకు గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారులను, ఇతరులను తీవ్రస్థాయిలో బెదిరించి బెంబేలెత్తించాలని పోలీసు, సీఐడీ ఉన్న­తాధికారులకు ఆదేశాలందాయని తెలుస్తోంది. అవసరమైతే వారిపై ఇతరత్రా అక్రమ కేసులు నమో­దు చేసి వేధింపులకు గురి చేయాలని కూడా లూథ్రా సలహా ఇచి్చనట్లు సమాచారం. 

సాక్షులను బెదిరించి దారికి తెచ్చుకోకపోతే చంద్రబాబును ఈ అవినీతి కేసుల నుంచి బయటపడేయడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎంతమందిని బెదిరించారు... ఎంతమంది ఇంకా బెదిరించాల్సిన జాబితాలో ఉన్నారనే వివరాలు కూడా లూథ్రా అడిగి తెలుసుకున్నారట.

అన్నీ మూసేద్దాం..
చంద్రబాబు అవినీతి కేసుల్లో గతంలో సిట్‌ సేకరించిన డాక్యు­మెంటరీ ఆధారాలను తారుమారు చేయాలనేది కూడా ఈ రెండు రోజుల సమావేశాల్లో ఖరారు చేసిన కుట్రలో భాగంగా ఉంది. గతంలో సిట్‌లో పనిచేసిన కిందిస్థాయి అధికారులను పిలిపించి బెదిరించాలని కూడా లూథ్రా సలహా ఇచ్చారట. ఇప్పటికే తాము నాలుగైదు సార్లు ఆ కిందిస్థాయి అధికారులను తీవ్రస్థాయిలో బెదిరించామని పోలీసు, సీఐడీ అధికారులు ఆయనకు చెప్పారు. అది సరిపోదని....ఆ వేధింపులను ఇంకా తీవ్రతరం చేయాలని లూథ్రా చెప్పినట్లు తెలుస్తోంది. 

ఈ వ్యవహారాలన్నీ గరిష్టంగా మూడు నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉందని, ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ రోజువారీగా తనకు నివేదిక ఇవ్వాలని ఓ ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారికి లూథ్రా సూచించినట్లు పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులు ఈ పనులు పూర్తి చేస్తే అనంతరం చంద్రబాబుపై కేసులను మూసివేసే సంగతి తాను చూసుకుంటానని సీనియర్‌ న్యాయవాది లూథ్రా ఈ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. 

చంద్రబాబుపై కేసులను నీరుగార్చే పన్నాగాన్ని కచ్చితంగా అమలు చేస్తామని... త్వరలోనే టాస్క్‌ పూర్తి చేస్తామని పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులతో లూథ్రా వ్యాఖ్యానించినట్లు పోలీసు వర్గాలంటున్నాయి. రెండు రోజుల సమావేశాల అనంతరం లూథ్రా ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారని సమాచారం.

అంతా లూథ్రా చెప్పినట్లే..
సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా ప్రస్తుతం ఆంధ్ర­ప్రదేశ్‌లో యావత్‌ రాష్ట్ర ప్రభుత్వ వ్య­వç­Ü్థ­కు సూపర్‌ బాస్‌గా అవతరించారు. గతంలో చంద్ర­బాబు స్కిల్‌ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలి­పోయిన ఆ సీనియర్‌ న్యాయ­వాది వ్యవహారం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. రోజుకు రూ.కోటి ఫీజుతోపాటు అదనపు ఖర్చులు వసూలు చేసే లూథ్రా ప్రస్తుతం చంద్రబాబు అవినీతి కేసులను అడ్డగోలుగా క్లోజ్‌ చేసే పన్నాగానికి సర్వం తానై వ్యవహరిస్తున్నారు. 

చంద్ర­బాబు అవినీతి కేసులను మూసివేయడంతోపాటు...వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమ కేసులతో వేధింపులకు గురిచేసే కుట్రను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. లూథ్రాయే సుప్రీం అని, ప్రభుత్వ కీలక విభాగాల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి తేల్చి చెప్పారని కూడా వినిపిస్తోంది. అందువల్లే పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్, న్యాయ విభాగాలు పూర్తిగా లూథ్రా నియంత్రణలోకి వచ్చేశాయి. 

ఆయన ఆదేశాలకు రాష్ట్ర పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులు జీ హుజూర్‌ అంటు­న్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులే కాదు... జిల్లా ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, అవసరమని భావిస్తే చివరికి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు కూడా ఆయన ఫోన్లు చేసి ఆదేశిస్తున్నారు. వారు చిత్తం మహా ప్రభో.. అని ఆయన ఆదేశాలను శిరసావహిస్తున్నారు. 

డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదు మేరకు నమోదుచేసిన అక్రమ కేసులో రిటైర్డ్‌ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌పై అక్రమ కేసు నమోదు చేయడంతో పాటు విచారణ పేరుతో ఎలా వేధించాలో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారికి లూథ్రాయే స్వయంగా నిర్దేశించారని పోలీసులు చర్చించుకుంటున్నారు. 

సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, ఇతర అక్రమ కేసులతో వేధింపులను కూడా లూథ్రా నిశితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారట. సిద్ధార్థ్‌ లూథ్రా రాజ్యాంగేతర శక్తిగా ఆవిర్భవించారని ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement