సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని సమస్యలపై సభలో చర్చిద్దామని.. దమ్ముంటే రెండువారాలపాటు అసెంబ్లీ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సవాల్ విసిరారు. మంగళవారం కొడంగల్ బీఆర్‌ఎస్ ముఖ్యనేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..
‘‘కేబినెట్‌లో మాట్లాడటం కాదు. సభలో చర్చ చేద్దాం. అన్ని సమస్యలపై సభలో చర్చిద్దాం. ఈ-కార్ రేసు కుంభకోణంపై కూడా చర్చకు నేను రెడీ. దమ్ముంటే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి’’ అని సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు.
పేరు మర్చిపోయినందుకు యాక్టర్‌ను జైలులో పెట్టించారు. సీఎం పేరు మర్చిపోతే జైల్లో పెడతారా?అంటూ రేవంత్‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment