ఈసారి బంగ్లాదేశ్‌ బ్యాగ్‌.. | Priyanka Gandhi Bag On Shoulder Gave Strong Message | Sakshi
Sakshi News home page

ఈసారి బంగ్లాదేశ్‌ బ్యాగ్‌..

Published Tue, Dec 17 2024 5:06 PM | Last Updated on Wed, Dec 18 2024 5:17 AM

Priyanka Gandhi Bag On Shoulder Gave Strong Message

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తనదైన శైలిలో బ్యాగులతో సందేశానిచ్చే ప్రయ త్నం కొనసాగిస్తున్నారు. పాలస్తీనా అని ముద్రించి ఉన్న బ్యాగుతో సోమవారం ఆమె పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన విషయం తెలిసిందే. అలాగే, మంగళవారం బంగ్లాదేశ్‌లోని హిందువులు, క్రైస్తవులకు అండగా ఉంటాం(వియ్‌ స్టాండ్‌ విత్‌ ది హిందూస్‌ అండ్‌ క్రిస్టియన్స్‌ ఆఫ్‌ బంగ్లాదేశ్‌) అని రాసి ఉన్న బ్యాగుతో వచ్చారు.

 బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులపై అత్యా చారా లను నిరసిస్తూ మంగళవారం పార్లమెంట్‌ ఆవరణ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీలతోపాటు ప్రియాంక కూడా ఈ బ్యాగ్‌ను ధరించి పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు జరగాలంటూ వారు నినాదాలు చేశారు. 

కాగా, బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న అఘాయి త్యాలపై సోమవారం లోక్‌సభలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వ మద్దతుతోనే ఇవి సాగుతున్నాయని ఆరోపించారు. అంతకు ముందు, వారం క్రితం ఆమె మరో బ్యాగుతో పార్లమెంట్‌ వద్ద కనిపించారు. ఆ బ్యాగుపై ప్రధాని మోదీ, పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీలు కలిసున్న చిత్రంతోపాటు ‘మోదీ అదానీ భాయీభాయీ’అని ముద్రించి ఉంది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement