hand bag
-
ఈసారి బంగ్లాదేశ్ బ్యాగ్..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తనదైన శైలిలో బ్యాగులతో సందేశానిచ్చే ప్రయ త్నం కొనసాగిస్తున్నారు. పాలస్తీనా అని ముద్రించి ఉన్న బ్యాగుతో సోమవారం ఆమె పార్లమెంట్ సమావేశాలకు హాజరైన విషయం తెలిసిందే. అలాగే, మంగళవారం బంగ్లాదేశ్‌లోని హిందువులు, క్రైస్తవులకు అండగా ఉంటాం(వియ్ స్టాండ్ విత్ ది హిందూస్ అండ్ క్రిస్టియన్స్ ఆఫ్ బంగ్లాదేశ్) అని రాసి ఉన్న బ్యాగుతో వచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులపై అత్యా చారా లను నిరసిస్తూ మంగళవారం పార్లమెంట్ ఆవరణ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలతోపాటు ప్రియాంక కూడా ఈ బ్యాగ్‌ను ధరించి పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు జరగాలంటూ వారు నినాదాలు చేశారు. కాగా, బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న అఘాయి త్యాలపై సోమవారం లోక్‌సభలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వ మద్దతుతోనే ఇవి సాగుతున్నాయని ఆరోపించారు. అంతకు ముందు, వారం క్రితం ఆమె మరో బ్యాగుతో పార్లమెంట్ వద్ద కనిపించారు. ఆ బ్యాగుపై ప్రధాని మోదీ, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీలు కలిసున్న చిత్రంతోపాటు ‘మోదీ అదానీ భాయీభాయీ’అని ముద్రించి ఉంది. प्रियंका के आने से विपक्ष में, कांग्रेस में एक जोश तो आया है, अंततः कोई तो बांग्लादेश के अल्पसंख्यकों के हितों की बात कर रहा है #PriyankaGandhi pic.twitter.com/awMqbrEVbe— Pooja Tiwari (@Irony_Pooja) December 17, 2024 -
ఏం ఉందబ్బా హ్యాండ్‌బ్యాగ్ డిజైన్..! అచ్చం ఆకుకూరలా..
ఎన్నో రకాల బ్రాండెడ్ హ్యాండ్‌బ్యాగ్‌లు చూసుంటారు. అందాల భామలు, సెలబ్రిటీలు, ప్రముఖులు ధరించే అత్యంత లగ్జరియస్ బ్యాగ్‌లను ఎన్నో రకాలు చూశాం. అయితే వాటన్నింటిని తలదన్నేలా అత్యంత వెరైటీ బ్యాగ్‌ని రూపొందించింది ప్రముఖ లగ్జరీ బ్రాండ్ మోస్చినో. ఇటీవల కొన్ని ప్రముఖ బ్రాండ్లు అత్యంత హాస్యస్పదమైన రీతిలో బ్యాగ్‌లు డిజైన్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి ఈ లగ్జరీ బ్రాండ్ మోస్చినో కూడా చేరిపోయిందా అనిపిస్తుంది ఈ బ్యాగ్ డిజైన్ చూస్తే..ఎలా ఉందంటే..మోస్చినో మార్కెట్లోకి విడుదల చేసిన ఈ హ్యండ్ బ్యాగ్ అచ్చం కొత్తిమీర కట్టలా కనిపిస్తుంది. అలా రూపొందించాలనే క్రియేటివిటీని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అచ్చం ఆకుకూర మాదిరిగా చక్కగా డిజైన్ చేశారు. ఇది డిజిటల్ ప్రింట్‌తో కూడిన కొత్తిమీర ఆకృతిలో ఉన్న పర్సు. ఇది త్రీ డైమెన్షనల్ ఎఫెక్ట్‌తో కనిపిస్తుంది. ఆ పర్సుపై కనిపించే ఆకులు కూడా సహజత్వం ఉట్టిపడేలా చాలా అద్భతంగా డిజైన్ చేశారు. దీని ధర వింటే మాత్రం అంత ఖరీదు అవసరమా అనే ఫీల్ తప్పక వస్తుంది. కొత్తిమీర ఆకృతిలో ఉన్న ఈ హ్యండ్‌బ్యాగ్ ధర అక్షరాల రూ. 3 లక్షలు పైనే ఉంటుందట. హైరేంజ్ ఫ్యాషన్ అంటే ఇదేనేమో. ఏం బ్రాండ్‌లో ఏమో..! క్రియేటివిటీలో మేటర్ నిల్ ధరలు మాత్రం వామ్మో.. అనేలా ఉన్నాయి కదూ..!.(చదవండి: సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్ మట్టితో..!) -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్! అన్ని కోట్లా..!
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ మెరిసింది. ఈ ఫ్యాషన్ షోలో టైటిల్ కోసం పోటీదారులు వినూత్న లగర్జీ ఫ్యాషన్లతో మోడల్స్ గట్టి పోటీస్తున్నారు. ఇక ఈ హ్యాండ్ బ్యాగ్ణి ఫ్రెంచ్ బ్రాండ్ రాబన్నే రూపొందించింది. దాదాపు 18 క్యారెట్ల బంగారంతో రూపొందించడం. అందువల్ల ఇదే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనా హ్యాండ్ బ్యాండ్‌గా నిలిచింది. ఫ్రాన్స్‌కి సంబంధించిన 1969 నాటి దివంగత గాయని ఫ్రాంకోయిస్ హార్టీ మినీడ్రెస్ గౌరవార్థం ఆమెకు నివాళిగా ఈ బ్యాగ్‌ని రూపొందించినట్లు బ్రాండ్ వ్యవస్థాపకులు చెబుతున్నారు. లెజెండ్ హార్డీ కోసం ప్రత్యేకంగా ఓ మినీడ్రెస్ని రూపొందించారు. అది వెయ్యి బంగారు ఫలకాలతో దాదాపు 300 క్యారెట్ల వజ్రాలతో డిజైన్‌తో రూపొందించారు. ఆ రోజుల్లో ఇది అత్యంత ఖరీదైన డ్రెస్‌గా వార్తల్లో నిలిచింది. దాని లగ్జరీకి తగ్గ రేంజ్లో ఈ హ్యాండ్ బ్యాగ్‌ని డిజైన్ చేశారు. అంతేగాదు జ్యువెలరీతో కూడిన ఈ లగ్జరీ డ్రెస్‌ని ధరించినప్పుడూ హార్డీని సెక్యూరిటీ గార్డుతో కూడిన సాయుధ వాహనంలో తీసుకు రావాల్సి వచ్చేదట. అయితే తాజాగా రూపొందించిన బంగారపు హ్యాండ్ బ్యాగ్‌ని మైసన్ రాబన్నే, ఆభరణాల వ్యాపారి ఆర్థస్ బెర్ట్రాండ్ల సహకారంతో రూపొందించారు. ఇది ఏకంగా రూ. 2.32 కోట్లు విలువ చేస్తుందట. ఈ హ్యాండ్ బ్యాగ్‌కి చైన్లను అనుసంధానించడానికి కూడా బంగారపు డిస్క్‌లనే అనుసంధానించడనే వాడటం విశేషం. దీన్ని రూపొందించడానికి హ్యాండ్క్రాప్ కళాకారులకు వంద గంటలపైనే సమయం తీసుకుందట. ఈ రాబన్నే బ్రాండ్ 1966లో ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి ప్లాస్టిక్ వంటి సంప్రదాయేతర పదార్థాలను ఉపయోగించి ఫ్యాషన్ ప్రపంచమే ఆశ్చర్యపోయే డిజైన్ వేర్లను తీసుకొచ్చింది. అలా ఇది వినూత్న దుస్తుల ఆవిష్కరణకు ప్రసిద్ధి చెందిందిగా పేరుగాంచింది. అంతేగాదు కాంటెంపరరీ మెటీరియల్స్(గ్లాస్, సిరామిక్, వుడ్, వజ్రాలు, బంగారం, ప్లాస్టిక్)తో ధరించడానికి వీలుకాని 12 దుస్తులను డిజైన్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేగాదు ఈ 1969 ప్యారిస్ ఫ్యాషన్ షోలో చాలా విభిన్న ఉపకరణాలతో రూపొందించిన ఫ్యాషన్ వస్తువులను పరిచయం చేసింది. అవి వరుసగా.. గ్లాస్ బ్యాగ్-దీన్ని ఇటాలియన్ గ్లాస్ మేకర్ వెనిని గ్లాస్ పాస్టిల్స్తో రూపొందించారు, సిరామిక్ బ్యాగ్, పర్షియన్ వర్క్‌షాప్ ఆస్టియర్ డి విల్లట్టే చిన్న క్లే డిస్క్‌లతో తయారు చేశారు. View this post on Instagram A post shared by Arthus Bertrand (@arthusbertrand) (చదవండి: పాలనురుగు చీరలో పాలరాతి శిల్పం!..మూత్యాల బ్లౌజ్ ధర ఏకంగా..!) -
కేన్స్‌లో హైలెట్‌గా నటి పుచ్చకాయ హ్యాండ్‌బ్యాగ్.. వెనుక ఇంత కథా..!
ఇటీవల ప్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో అగ్ర సినీ తారలంతా తమదైన ఫ్యాషన్ స్టైల్లో మెరిశారు. ఒక్కోకరూ ఒక్కో పంథాలో తమ డిజైనర్ వేర్ డ్రస్సింగ్ స్టయిల్‌తో మెరిశారు. మరికొందరూ మాత్రం తమ ఫ్యాషన్‌కి అద్భుతమైన జోడించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సరిగ్గా అలాంటి పనే చేశారు మలయాళ నటి కని కుస్రుతి. ఆమె ధరించిన పర్సు వెనుక ఉన్న స్టోరీ వింటే..వావ్..! అని మెచ్చుకోకుండా ఉండలేరు.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నటి కని కుస్రుతి కీలక పాత్ర పోషించిన "ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్" చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై అద్భుతమైన డిజైన్ వేర్ దుస్తులతో మెరిశారు. అయితే ఈ వేడుకలో ఆమె చేతికి ఉన్న పుచ్చకాయను పోలిన హ్యాండ్‌బ్యాగ్ కాస్త హైలెట్‌గా నిలిచింది. ఈ వేడుకలో ఆమె స్టయిలిష్‌గా ఈ పుచ్చకాయను ధరించడానికి గల రీజన్ వింటే కంగుతింటారు. తన ఫ్యాషన్‌తో ఈ కేన్స్ రెడ్‌కార్పెట్‌పై భారత్ తరుఫునా పాలస్తీనాకు సంఘీభావం తెలిపారు కని. అందుకోసమే ఆమె ఈ పుచ్చకాయ హ్యండ్ బ్యాగ్‌ను ఎంచుకున్నారట. అందేంటి దీంతో సంఘీభావమా? అనుకోకండి. ఎందుకంటే ఈ పుచ్చకాయ పాలస్తీనా జెండా రంగులను పోలీ ఉంటుంది. ఎర్ర పుచ్చకాయలోని గజ్జు, నల్లగింజలు, లోపలి తెల్లని తొక్క భాగం పైన ఉండే ఆకుపచ్చని భాగం ఇవన్నీ పాలస్తీనా జెండాకు చిహ్నంగా ఉంటాయి. అందుకే దీన్ని ఎంచుకున్నారు కని. నిజానికి ఇలా పాలస్తీనా చిహ్నంగా పుచ్చకాయ చిహ్నంగా ఉద్భవించింది 1967లో. ఇజ్రాయెల్ గాజా వెస్ట్ బ్యాంక్‌ను నియంత్రణలోకి తెచ్చుకుని తూర్పు జెరూసలెంని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత గాజాలో పాలస్తీనా జెండాను ప్రదర్శించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ.. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక ఉత్తర్వుని జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనియన్లు పుచ్చకాయను తమ జెండాకు చిహ్నంగా ఉపయోగించారు.ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ దాడులతో భయంకరంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 35 వేల మందికి పైగా చనిపోయారు. వారిలో సుమారు 15 వేలకు పైగా చిన్నారులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా, ఇలా కని తోపాటు కేన్స్‌లో పాలస్తీనాకు సంఘీ భావం తెలిపిన ఇతర అంతర్జాతీయ నటులు, కేట్ బ్లాంచెట్, లీలా బెఖ్తీ వంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ నటి కేట్ బ్లాంచెట్ పాలస్తీనా జెండాను అనుకరించేలా గౌను ధరించగా, బెఖ్తీ పుచ్చకాయ విత్తనాన్ని పోలిన హృదయం ఆకారపు పిన్ను ధరించారు. (చదవండి: ఆ వ్యాధి ధనవంతులకే వస్తుందా?) -
అనుష్క శర్మ బుడ్డి హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం!
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ నటి, అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ఇప్పటికే అమెరికాకు చేరుకుంది. అందులో విరాట్ కోహ్లీ మినహా.. మిగతా ప్లేయర్లంతా ఉన్నారు. విరాట్ మాత్రం వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంకా భారత్‌లోనే ఉండిపోయారు. ఆయన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే రెండోసారి తండ్రైన విరాట్ కోహ్లీ ప్రస్తుతం ముంబైలో తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న కోహ్లీ.. మంగళవారం రాత్రి కుటుంబంతో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లాడు. ఇందులో తన భార్య అనుష్క శర్మతో పాటు.. టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, అతడి భార్య సాగరిక ఘట్గే, క్రికెట్ ప్రెజెంటర్ గౌరవ్ కపూర్, తదితరులు ఉన్నారు. వారందరితో విరుష్క దంపతులు సరదాగా గడిపారు. అందుకు సంబంధించిన వీడియోలు, పోటోలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఇక్కడ ఆ అనుష్క పట్టుకున్న హ్యాడ్బ్యాగ్ హాట్‌టాపిక్‌గా మారింది. చెప్పాలంటే డిన్నర్ డేట్లో ఆ హ్యాండ్‌బ్యాగ్ హైలెట్‌గా నిలిచింది. ఇది గాబ్రియేలా హర్స్ట్ నినా బ్రాండ్‌కి చెందిన లగ్జీరియస్ బ్యాగ్. దీన్ని ఎక్కువగా బ్రిటీష్ రాజవంశస్తులు, కొందరూ హాలీవుడ్ ప్రముఖులు ఉపయోగిస్తారు. అచ్చం ఇదే మాదిరి బ్యాగ్‌ని ప్రిన్స్ హ్యరీ భార్య మేఘనా మార్కిల్ ధరించింది. ప్రఖాత్య హాలీవుడ్ ప్రముఖులు, ధనవంతులు ఉపయోగించే ఫేమస్ బ్రాండ్ లెదర్ బ్యాగ్ ఇది. అలాంటి లగ్జరీయస్ బ్యాగ్ అనుష్కా ధరించడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఈ బుడ్డి బ్యాగ్ ధర ఏకంగా రూ. 2.3 లక్షలు పైనే పలుకుతుందట. దీన్ని ఎక్కువగా రాజవంవస్తులు, ధనవంతుల దర్పాన్ని ప్రదర్శించే రేంజ్లో ఉండే లగ్జరీయస్ హ్యాండ్ బ్యాగ్ అని చెబుతున్నారు ఫ్యాషన్ ప్రముఖులు. సినీ సెలబ్రెటీలు ధరించే దుస్తుల నుంచి హ్యాండ్ బ్యాగ్‌లు వరకు అన్ని కళ్లు చెదిరిపోయేంత ఆకర్షణీయంగా ఉండటమేగాక అత్యంత విలావంతమైన వస్తువులుగా ఉంటాయి. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) (చదవండి: భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?) -
శభాష్ .. వెంకటసుబ్బయ్య !
కడప అర్బన్ : ఓ మహిళ ఆటోలో వెళుతూ రూ. 2లక్షలు విలువైన బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్ బ్యాగును మరచిపోయింది. ఆటోలో బ్యాగును గుర్తించిన డ్రైవర్ వెంకట సుబ్బయ్య పోలీస్ స్టేషన్లో అప్పగించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సోమవారం కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆటో డ్రైవర్ నల్లకట్ల వెంకట సుబ్బయ్యకు ప్రశంసాపత్రాన్ని అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. వివరాలిలా ఉన్నాయి. రాజంపేటకు చెందిన మేరువ వెంగమ్మ జంగాలపల్లెలోని తన తల్లి ఇంటికి శుభకార్య నిమిత్తం వచ్చింది. ఈనెల 2న కమ్మపల్లెకు వెళ్లి సాయంత్రం ఆటోలో జంగాలపల్లెకు తిరుగు ప్రయాణమైంది. ఈ నేపథ్యంలో ఆటోలో బంగారు నగలున్న బ్యాగును మరిచిపోయింది. బ్యాగును గుర్తించిన ఆటో డ్రైవర్ వెంటనే సమీపంలోని సిద్దవటం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజుకు అందజేశారు. బాధిత మహిళకు పోలీసులు సమాచారం ఇచ్చి నగలతో కూడిన బ్యాగు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ఆటో డ్రైవర్‌కు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. -
ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్
అమ్మాయిలు కావొచ్చు ఆంటీలు కావొచ్చు హ్యాండ్ బ్యాగ్స్ ఉపయోగిస్తుంటారు. రూ.100 దగ్గర నుంచి మొదలుపెడితే వేలు విలువ చేసేవి కొంటుంటారు. యూజ్ చేసిన దానిబట్టి వాటి మన్నిక ఆధారపడి ఉంటుంది. అయితే ఓ నటి దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ఉంది. దాని ఖరీదు ఎంతో చెబితే మీరు ఆశ్చర్యపోవడం సంగతి అటుంచితే ఒక్క చిన్న బ్యాగ్ కోసం అన్ని కోట్లు ఎందుకురా బాబు అనుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయమే హాట్ టాపిక్. (ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్, సిస్టర్‌గా!) అమెరికన్ నటి కమ్ మోడల్ కిమ్ కర్దాషియన్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఫ్యాషన్ విషయంలో అప్డేట్గా ఉండటమే కాదు అత్యంత ఖరీదైన వస్తువుల్ని ఉపయోగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే డ్రస్సుల దగ్గర మిగతా యాక్సెసరీస్ వరకు వాటి స్పెషాలిటీ, కాస్ట్ ఎంతో తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. ఇప్పుడు అలా ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి వచ్చింది. కాకపోతే తనతో పాటు అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌ని కూడా తీసుకొచ్చింది. సిల్వర్ కలర్లో మెరిసిపోతున్న ఈ హ్యాండ్ బ్యాగ్ ధర అక్షరాలా రూ.3,12,61,000 అని తెలుస్తోంది. ఇది చూసిన నోరెళ్లబెడుతున్న నెటిజన్స్.. అంతలా అందులో ఏముందా అని కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ బ్యాగ్‌ని హిర్మేస్ కంపెనీ తయారు చేసింది. బంగారం, డైమండ్‌తో దీన్ని డిజైన్ చేశారు. ప్రపంచంలో చాలా కొద్దిమంది దగ్గర మాత్రమే ఈ బ్యాగ్ ఉంది. దీన్ని స్పెషల్‌గా కొందరు కస్టమర్ల కోసం తయారు చేస్తుంటారు. ప్రస్తుతానికైతే ఈ బ్యాగ్ లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో లేవని తెలుస్తోంది. pic.twitter.com/oS2f1hqOTq — Media Buzz (@mediabuzz0007) July 28, 2023 (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) -
వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు
సాక్షి,ముంబై: అంబానీ ఫ్యామిలీ మహిళలంటే ఈ కథే వేరుంటుంది కదా. ఈ విషయాన్నే రిలయన్స్ అధినేత, ఆసియా బిలియనీర్ ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, కాబోయే కోడలు రాధిక మర్చంట్ మరోసారి నిరూపించారు.లగ్జరీ బ్రాండ్ హ్యాండ్బాగ్తో కనిపించి ఇటీవల అందరి దృష్టినీ ఆకర్షించారు. ప్రస్తుతం ఈ బ్యాగ్ ధర హాట్ టాపిక్‌గా మారింది. (3 వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!) నీతా,ముఖేశ్ అంబానీ తనయ, రిలయన్స్ రీటైల్ హెడ్ ఇషా అంబానీ, అనంత్ అంబానీ (ఇషా సోదరుడు అనంత్ రాధిక నిశ్చితార్థం జరిగింది) కాబోయే భార్య రాధిక మర్చంట్ ఇద్దరూ లేడీ డియోర్ మినీ హ్యాండ్‌బ్యాగ్‌లతో సందడి చేశారు. మంచి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరూ తరచూ అనేక ఈవెంట్లకు హాజరువుతూ ఉంటారు. ప్రముఖ లగ్జరీ బ్రాండ్ బ్యాగ్స్ ధరించి ది డియోర్ ఫాల్ 2023 షోలో పోజులిచ్చారు. డియోర్ అధికారిక వెబ్సైట్లో ప్రస్తుతానికి ఈ బ్యాగు అందుబాటులో లేనప్పటికీ వీరిద్దరూ ధరించిన ఈ బ్యాగు ధర భారత కరెన్సీలో సుమారుగా రూ. 21 లక్షల 6 వేలు. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు! ) లగ్జరీ దిగ్గజం క్రిస్టియన్ డియోర్ లేటెస్ట్ ఈవెంట్ ఇటీవల ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫ్యాషన్ షోకు అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ, సోనమ్ కపూర్, శోభితా ధూళిపాలా, మీరా రాజ్‌పుత్, అనన్య పాండే, ఖుషీ కపూర్, కరిష్మా కపూర్, డయానా పెంటీ, ఆథియా శెట్టి లాంటి సెలబ్రిటీలు హాజరైనారు. ఇంకా హర్ష్ వర్ధన్ కపూర్, అనితా ష్రాఫ్ అడజానియా, శ్వేతా బచ్చన్, అర్జున్ కపూర్, మసాబా గుప్తా, నటాషా పూనావల్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు బ్రిడ్జర్టన్ స్టార్ సిమోన్ ఆష్లే, నటుడు పూర్ణ జగన్నాథన్, సంగీత విద్వాంసురాలు అనౌష్క శంకర్ ఇతరజాతీయ అంతర్జాతీయ ప్రముఖులు ఫ్యాషన్ ఈవెంట్లో సందడి చేశారు. View this post on Instagram A post shared by Dior Official (@dior) -
క్వీన్ ఎలిజబెత్ హ్యాండ్‌బ్యాగ్ వెనక ఇంత రహస్యముందా?
హ్యాండ్‌బ్యాగ్... మహిళల జీవితంలో ఓ భాగం. ఇటీవల మరణించిన బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్–2 సైతం నిత్యం హ్యాండ్‌బ్యాగ్‌ను క్యారీ చేసేవారు. 1950 నుంచి 2022వరకు ఆమె ఫొటోలను గమనిస్తే.. అన్నింట్లో ఆమె బ్లాక్ లానర్ హ్యాండ్‌బ్యాగ్‌ను ధరించే కనిపిస్తారు. బ్లాక్ బ్యాగ్ మాత్రమే ఎందుకు వాడేవారు? ఫ్యాషన్ స్టేట్మెంట్గానా? అంటే కానేకాదు. అంతకుమించి. బ్యాగ్ ద్వారా తన సిబ్బందికి రహస్య సమాచారాన్ని చేరవేసేవారామె. బ్యాగ్ ప్రతి కదలిక, పొజిషన్‌ను బట్టి డిఫరెంట్ మెసేజ్‌ను పంపించేవారు. ఎలా అంటే... ►ఆమె ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎడమ చేతిపై బ్యాగ్‌ను కుడిచేతికి మార్చారంటే.. ఆ సంభాషణను ముగించాలి అనుకుంటున్నారని అర్థం. ► చేతిలోని బ్యాగ్‌ను కింద పెట్టారంటే... తాను అసౌకర్యంగా ఫీలవుతున్నానని, వెంటనే ఆ వ్యక్తిని బయటికి పంపించేయాలని సూచన. ► భోజనం చేసేటప్పుడు ఆ బ్యాగ్‌ను టేబుల్ మీద పెట్టారంటే.. ఐదు నిమిషాల్లో భోజనం ముగించేయాలి అనుకున్నారన్నట్టు. ►అలాంటి కీలకమైన పాత్రపోషించే బ్యాగ్ ఉంటేనే ఆమె కంఫర్టబుల్‌గా ఫీలయ్యేవారు. ►ఆ చివరకు సెప్టెంబర్ 6న ప్రధానిగా లిజ్‌ట్రస్ బాధ్యతలు తీసుకునేరోజు సైతం బాల్మోరల్ క్యాజిల్‌లో జరిగిన కార్యక్రమంలో సైతం క్వీన్ బ్లాక్ హ్యాండ్‌బ్యాగ్ ధరించి ఉన్నారు. ►ఆఇంతకూ ఆ బ్యాగ్‌లో ఏముండేవో తెలుసా? సాధారణ మహిళల బ్యాగుల్లో ఉన్నట్టే... చిన్న అద్దం, లిప్‌స్టిక్, కొన్ని మింట్ బిల్లలు, ఒక జత రీడింగ్ గ్లాసెస్. -
ఈ భామ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Nora Fatehi Hand Bag Cost: సెలెబ్రిటీలు ధరించే డ్రెస్ నుంచి వారు వేసుకునే చెప్పులు.. గాగుల్స్, వాచీలు ఇలా ప్రతీదీ పెద్ద విషయమే. వాళు కదిలినా.. మెదిలినా అంతా విశేషాల పరంపరలే. వాళ్లు ఏ లుక్‌లో కనిపించినా… కెమెరా కళ్లు క్లిక్కుమంటాయి. వారిని టాప్ టూ బాటమ్ వరకూ స్కాన్ చేస్తేకానీ కెమెరాల కళ్లు శాంతించవు. ఆ ఫోటోలో చిన్న విశేషం కనిపించినా అదో పెద్ద వార్త అయి కూర్చుంటుంది. తాజాగా బాలీవుడ్ భామ నోరా ఫతేహి విషయంలో అదే జరిగింది. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ కనిపించి కుర్రకారు మదిని దోచింది. తాజాగా ఈ భామ రూ. 200కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరైంది. ఆ సమయంలో లక్షల రూపాయాల విలువైన హ్యాండ్ బ్యాగ్‌ను ధరించి అభిమానులకు దర్శనమిచ్చింది. బ్లూ కలర్ టీ షర్ట్, షార్ట్స్ ధరించి వచ్చిన నోరా చేతిలో హ్యాండ్ బ్యాగ్ తో కనిపించింది. ప్రస్తుతం నోరా హ్యాండ్ బ్యాగ్ పిక్స్ నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే దాని ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. దాదాపుగా రూ.1.95లక్షల విలువైన మినీ లూయిస్ విట్టన్ పామ్ స్ప్రింగ్స్ బ్రాండ్‌కు చెందిన బ్యాగ్‌ను ధరించి ఆమె కనిపించింది. ఆ బ్యాగ్ ధరను తెలుసుకొని అభిమానులు షాకవుతున్నారు. ఇక నోరా సినిమాల విషయానికొస్తే.. తాజాగా ఈ భామ అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ‘‘ భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ’’ సినిమాలో స్పై పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, శరద్ కేల్కర్ కీలక పాత్రలు పోషించారు. ఆ సినిమాకు అభిషేక్ దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆ చిత్రం విడుదలయింది. -
నేను మనసుపడ్డ బ్యాగ్ ధర జస్ట్ రూ.30 వేలే: సమంత
కట్టుబొట్టు తీరులో ప్రతీ సెలబ్రిటీ తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనుకుంటుంది.. అనుకుంటాడు. అద్దినట్టుండే దుస్తుల నుంచి ఠీవీనిచ్చే ఆహార్యం.. అరచేతుల్లో ఇమిడే గాడ్జెస్ వరకు బ్రాండ్ ప్రొడక్ట్స్‌ను అన్వేషిస్తుంటారు. అలా సెలబ్రెటీల ప్యాషన్‌ను పెంచి ఫ్యాషన్ క్రియేట్ చేస్తున్న బ్రాండ్స్ గురించి ప్రతీ వారం ఈ ‘స్టార్ స్టైల్’ పేజీలో చూడొచ్చు.. చదవొచ్చు!! సమంతా.. తెర మీద అందాలనటే కాదు.. స్టయిల్ ఐకాన్ కూడా. దేశీ చేనేతకు ఎంత దర్జానివ్వగలదో ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కూ అంతే గ్లామర్నిస్తుంది. ఏ డిజైన్ అయినా సమంతా కోసం పోటీపడాల్సిందే. పై ఫొటోలో ఆ పోటీలో గెలిచిన బ్రాండ్స్ ఇవి. ► లూయి విట్టోన్ బై మెటీరియల్ డ్రస్ (Louis Vuitton Bi Material Dress) ధర: రూ. 2,01,773 ► సన్ లోరాన్ ట్రిబ్యుట్ ఫ్లాట్‌ఫాం శాండిల్స్ (Sanit Laurent Tribute Platform Sandals) ధర: రూ. 85,000 ► లూయి చైన్ బ్యాగ్ (Lauise Chain Bag) ధర: రూ. 15,600 బ్రాండ్స్ వాల్యూ లూయి విట్టోన్ (LV) ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ హౌస్‌లలో ఒకటి. 1854లో ఫ్రాన్స్‌కు చెందిన విట్టోన్ అనే వ్యక్తి దీన్ని స్థాపించాడు. లెదర్ క్వాలిటీ, డిజైన్స్ ప్రత్యేకతతో వరల్డ్‌లోనే అతి పెద్ద ఫ్యాషన్ బ్రాండ్‌గా రూపొందింది. చేతి రుమాలు నుంచి ఆభరణాలు వరకు ప్రతీ వస్తువునూ ఉత్పత్తి చేస్తుందీ బ్రాండ్. కాకపోతే దేన్ని కొనాలంటే వేల నుంచి కోట్లు వెచ్చించాల్సిందే. మొత్తం 50 దేశాల్లో 460కి పైగా బ్రాంచీలు ఉన్నాయి. దీనికి ఆన్లైన్ మార్కెట్ కూడా విస్తృతమే. ప్రస్తుతం ఈ కంపెనీ బ్రాండ్ విలువ 350 కోట్ల రూపాయలు. ప్రపంచంలోని ప్రతి సెలబ్రెటీ ఈ బ్రాండ్‌కి కొనుగోలుదారుడే. ఈవ్ సన్ లోరాన్ (Yves Sain Laurent) అరవై ఏళ్ల కిందటి ఈ కంపెనీ కూడా ఫ్రాన్స్ బేస్డ్. ప్రసిద్ధ లగ్జూరియస్ బ్రాండ్స్‌లో ఇదీ ఒకటి. క్రియేటీవిటికీ కేరాఫ్. అదే దీని బ్రాండ్ వాల్యూ. ఇది ఉత్పత్తి చేసే పెర్ఫ్యూమ్స్ తప్ప ఇంకేది కొనాలన్నా వేల్లలో, లక్షల రూపాయల్లోనే ఉంటుంది ధర. అత్తర్లు మాత్రమే వందల రూపాయల్లో దొరుకుతాయి. 'నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు లూయి విట్టోన్ బ్యాగ్ కొనుక్కోవాలని మనసుపడ్డాను. ఆ బుజ్జి బ్యాగ్ ధర ఎంతో తెలుసా? 30 థౌజెండ్ రూపీస్ ఓన్లీ. ఆ కాలాన్ని ఫాస్ట్ఫార్వడ్ చేస్తే అది ఇప్పటికీ నా ఫేవరేట్'. – సమంతా అక్కినేని చదవండి: టీవీ నటితో ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ హీరో పెళ్లి.. ఫోటోలు వైరల్ -
దీపికా పదుకునే బ్యాగ్ కలెక్షన్
దుస్తులే కాదు హ్యాండ్‌బ్యాగ్ కూడా మనదైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింపజేస్తుంది. బాలీవుడ్ తార దీపికా పదుకునే వాడే హ్యాండ్ బ్యాగ్ సందర్భానికి తగినట్టుగా ఉంటుందని ఆమె కలెక్షన్‌ను చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. అవేంటో ఓ లుక్కేయండి. ఎయిర్‌పోర్ట్‌కు మినీ బ్యాగ్... ప్రయాణాలు చేసేటప్పుడు సౌకర్యమే కాదు, స్టయిల్ కూడా తగ్గకుండా ఉండాలి. ఎత్తుమడమల జోలికి పోకుండా స్నీకర్స్, ప్లిప్ ప్లాప్స్ వంటివి ఎంచుకోవచ్చు. నార్మ్కోర్ ఔట్ఫిట్స్ (జీన్స్, టీ షర్ట్ పైన స్వెట్ షర్ట్) సన్‌గ్లాసెస్, తక్కువ మేకప్, వదిలేసిన కురులు.. వీటన్నింటినీ మించి నియాన్ కలర్ మినీబ్యాగ్పై మన దృష్టి పడకుండా ఉండదు. ఎయిర్‌పోర్టులో అవసరమైన పేపర్ల కోసం మాత్రమే దీని ఎంపిక. (చదవండి: జోడీ కుదిరిందా?) తెలుపు డ్రెస్ మీదకు బ్రౌన్ బ్యాగ్... సందర్భం ఏదైనా దీపికా అడుగుపెట్టిన చోట తనదైన స్టయిల్‌ను చూపించగలదు. టాప్ టు బాటమ్ వైట్ డ్రెస్ ధరించినప్పుడు పూర్తి కాంట్రాస్ట్ కలర్ కాకుండా ముదురు గోధుమరంగు షార్ట్ హ్యాండిల్ బ్యాగ్ ఒక ప్రత్యేకతను చాటుతుంది. చల్లని వేళ... అధిక శీతోష్టపరిస్థితులకు అనుగుణంగా టాప్ టు బాటమ్ స్వెటర్ టైప్ డ్రెస్ ధరించినప్పుడు బ్లాక్ లూయీస్విట్టన్ ఓపెన్డ్ బ్యాగ్ ఎంపిక చేసుకుంది. -
వజ్రాల సీతాకోక చిలుకల బ్యాగు.. విలువెంతో తెలుసా!
రోమ్: సాధారణంగా ఓ హ్యాండ్ బ్యాగు ఖరీదు 500 రూపాయల నుంచి ప్రారంభమై వేలల్లో ఉంటుంది. ఇక కొన్ని ప్రత్యేకమైన బ్రాండ్స్‌కు చెందిన ఫ్యాషన్ హ్యాండ్ బ్యాగుల విలువ లక్షల్లో ఉంటుంది. కానీ ఇటలీకి చెందిన ఓ బ్యాగుల కంపెని ఇటివల తయారు చేసిన బ్యాగు విలువ తెలిస్తే అందరూ నోళ్లు వెల్లబెట్టాల్సిందే. అలిగేటర్(మొసలి జాతికి చెందిన) చర్మంతో తయారు చేసిన ఈ చిన్న బ్యాగు విలువ రూ. 53 కోట్లు అంట. దీంతో ప్రస్తుతం ఇది ప్రపంచంలోని అంత్యంత ఖరీదైన బ్యాగు అయ్యింది. అయితే దానికి ఎందుకు అంతా ఖరీదు అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ బ్యాగును వజ్రాలు, మరకత మాణిక్యాలతో పాటు విలువైన రాళ్లతో అలంకరించారు. దీనిని బోరిని మిలానేసి అనే లగ్జరీ లెదర్ హ్యండ్ బ్యాగుల కంపెనీ తయారు చేసింది. చూడగానే కళ్లు చెదరిలా తయారు చేసిన ఈ బ్యాగును అలిగేటర్ చర్మంతో తయారు చేసిన ఈ బ్యాగుపై తెల్లరంగు బంగారంతో తయారు చేసిన 11 సీతాకోక చిలుకలను అమర్చారు. (చదవండి: నీళ్లలో మంటలా.. ఇదెలా సాధ్యం!) ఈ సీతాకోక చిలుకలపై మొత్తం 30 క్యారట్ల వజ్రవైఢూర్యాలు, అరుదైన మరకత మాణిక్యాలను పొదిగారు. అయితే ఈ బ్యాగు తయారు చేసేందుకు దాదాపు 1000 గంటలకు పైగా సమయంలో పట్టిందని ఈ సంస్థ వెల్లడించింది. దీనితోపాటు ఇలాంటివే మరో రెండు బ్యాగులను కూడా ఈ సంస్థ తయారు చేసింది. కాగా ఖరీదైన ఈ హ్యాండ్ బ్యాగులను మహాసముద్రాల కాలుష్యంపై అవగాహన కలిగించేందు కోసమే తయారు చేసినట్లు బోరిని మిలానేసి సంస్థ తెలిపింది. వీటి అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును సముద్ర కాలుష్య నివారణకు వినియోగిస్తామని ఈ సంస్థ వెల్లడించింది. అయితే దీనిని ఇంతవరకు ఎవరూ ఖరీదు చేయలేదని ఆ సంస్థ పేర్కొంది. ప్రపంచలోనే అంత్యంత ఖరీదైన ఈ బ్యాగును ఏ సంపన్నులు సొంతం చేసుకుంటారో వేచి చూడాలి. (చదవండి: అతన్ని పట్టిస్తే రూ.37 కోట్లు ఇస్తాం : అమెరికా) -
ఎయిర్‌పోర్ట్‌లో మెరిసిన కంగనా
ముంబై : స్టన్నింగ్ ఎయిర్పోర్ట్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న బాలీవుడ్ భామల సరసన క్వీన్ బ్యూటీ కంగనా రనౌత్ చేరారు. కంగనా ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బ్లాక్ పవర్ సూట్ ధరించి స్టైలిష్ యాక్సెసరీస్‌తో మెరిసిపోయారు. బ్లాక్ సూట్‌పై వైట్ టీ షర్ట్, లెనాన్ గ్లాసెస్‌తో అల్ట్రా మోడ్రన్ లుక్‌తో దర్శనమిచ్చారు. కంగనా ఎయిర్పోర్ట్ లుక్‌లో హ్యాండ్ బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంగనా చేపట్టిన బ్లాక్ వింటేజ్ టోటె బ్యాగ్ 6022 అమెరికన్ డాలర్లు కాగా మన కరెన్సీలో రూ 4,23,136. కంగనా రనౌత్ త్వరలో మణికర్ణికగా స్క్రీన్‌పై సందడి చేయనున్నారు. -
మలైకా బ్యాగ్ ఖరీదు ఎంతంటే..
ముంబై : బాలీవుడ్ భామల ఎయిర్పోర్ట్ లుక్ అందరినీ ఆకర్షిస్తున్న క్రమలో తాజాగా నటి మలైకా అరోరా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అందరి దృష్టినీ ఆకర్షించారు.స్టన్నింగ్ లుక్‌తో పాటు స్టైలిష్ యాక్సెసరీస్‌తో ఆకట్టుకున్నారు. గ్రే కలర్ డ్రెస్‌పై అదే కలర్ జాకెట్, బ్లాక్ గాగుల్స్‌తో కట్టిపడేశారు. ఇక ఆమె ధరించిన డ్రెస్, యాక్సెసరీస్‌లో హ్యాండ్‌బ్యాగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ బ్యాగ్ ఖరీదు జస్ట్ 2900 అమెరికన్ డాలర్లు. అయితే భారత కరెన్సీలో దీని విలువ అక్షరాలా రూ 2.3 లక్షలపైచిలుకే. -
ఈ బ్యాగ్ ధరెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బయటికి వెళ్తున్నామంటే భుజాన బ్యాగ్ తప్పక ఉండాల్సిందే. ఇక పార్టీలకు వెళ్లేపుడు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలంటే డ్రెస్‌తో పాటు ఆభరణాలు, వెంట తీసుకెళ్లే ఆక్ససరీస్ ట్రెండీగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అలాగే ఆసియాకు చెందిన ఓ మహిళ కూడా తన వెంట తీసుకెళ్లే బ్యాగు ప్రత్యేకంగా ఉండాలనుకున్నారు. అయితే అందుకోసం ఆమె వెచ్చించిన సొమ్ము ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. హాంగ్‌కాంగ్‌లో క్రిస్టీస్ అనే సంస్థ నిర్వహించిన వేలంలో 2కోట్ల 57లక్షల రూపాయలు చెల్లించి మరీ బ్యాగును ఆమె సొంతం చేసుకున్నారు. హ్యాండ్ బ్యాగుకే అంత ధరా అని ఆశ్చర్యపోకండి ఎందుకంటే అది ప్రఖ్యాత ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌజ్ ‘హెర్మ్స్’కు చెందిన బిర్కిన్ బ్రాండ్ బ్యాగు. హ్యాండు బ్యాగుల తయారీ కోసం ప్రత్యేకంగా మొసళ్లను పెంచి మరీ వాటి చర్మంతో బ్యాగులు, పర్సులు తయారు చేసే హెర్మ్స్ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. విక్టోరియా బెక్‌హామ్ నుంచి అమెరికన్ టీవీ నటి కిమ్ కర్దాషియన్ వరకు ఎంతో మంది సెలబ్రిటీలు తమ చేతిలో ప్రఖ్యాత హెర్మ్స్ బ్రాండ్ బ్యాగు ఉండాలని పోటీ పడి వాటిని సొంతం చేసుకుంటారు. బిర్కిన్ బ్యాగు ప్రారంభ ధర 7 వేల డాలర్లకు తక్కువగా ఉండదు. ప్రస్తుతం ఆసియన్ మహిళ సొంతం చేసుకున్న బ్యాగును హిమాలయన్ నీలో మొసలి చర్మంతో తయారుచేశారు. అరుదైన 245.. 18 క్యారట్ వైట్ గోల్డ్ డైమండ్స్‌తో పొదగబడిన లాక్‌తో రూపొందిన గ్రేడియన్ కలర్ బ్యాగును సొంతం చేసుకోవడానికి ఎంతో మంది ష్యాషన్ ప్రియులు పోటీ పడటంతో చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన బ్యాగుగా రికార్డుకెక్కిందని క్రిస్టీస్ నిర్వాహకులు తెలిపారు. -
విమాన ప్రయాణీకులకు శుభవార్త!
న్యూఢిల్లీ: విమానం ప్రయాణం అంటే లగేజీ స్కానింగ్..హ్యాండ్ బ్యాగుల సెక్యూరిటీ తనిఖీలు ఓ పెద్ద తతంగం. అయితే ఇక విమాన ప్రయాణీకుల హ్యాండ్ బ్యాగుల స్టాంపింగ్, ట్యాగింగ్ సమస్యలకు ఇక శుభం కార్డు పడినట్టే. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ బ్యూరో ఒక కొత్త పైలట్ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల పూర్తి భద్రతను నిర్వహించే సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (బీసీఏఎస్) అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చెకింగ్ వ్యవస్థను గురువారం ప్రారంభించింది. హై రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు, సంబంధిత ఇతర టెక్నాలజీతో సహాయంతో హ్యాండ్ బ్యాగుల తనిఖీని మరింత కట్టుదిట్టంగా చేపట్టనున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోలకతా, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) ఈ ప్రక్రియను మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఈ పద్ధతిని అన్ని విమానాశ్రయాల్లో ప్రారంభించనున్నట్టు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సామాను భద్రత, స్క్రీనింగ్ సౌకర్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రయాణీకులకు హ్యాండ్ బ్యాగు టాగ్స్ , స్టాంపింగ్ కష్టాలను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ పద్థతిని అవలంబిస్తున్నట్టు చెప్పింది. బాధ్యత బీసీఏఎస్ ది. -
తోలు తీయక్కర్లేదు...
షూస్, పర్స్, హ్యాండ్ బ్యాగులను లెదర్ లేదా క్లాత్‌లతో తయారు చేస్తారనే మనకు తెలుసు. అసలు లెదర్‌తో తయారు చేసిన ఏ ఐటమ్నైనా ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఎందుకంటే... క్లాత్ వస్తువులతో పోలిస్తే లెదర్ వస్తువుల నాణ్యత, మన్నిక భేషుగ్గా ఉంటాయి. ఇక్కడ ఫొటోల్లో కనిపిస్తున్న షూస్, బ్యాగ్స్ అచ్చం లెదర్‌తో తయారు చేసినవే అనిపిస్తున్నాయి కదూ! కానే కాదు. వీటి తయారీకి.. జంతువుల తోలు తీయక్కర్లేదు. వినడానికి వింతగా.. కొత్తగా ఉన్నా... ఈ వస్తువులన్నింటికీ ముడి పదార్థం పైనాపిల్ (అనాస పండు) ఆకులు. ఈ పైనాపిల్ ఆకులతో లెదర్ వంటి పదార్థం తయారీకి పెద్ద కృషే జరిగింది. ఐర్లాండ్‌లో కార్మెన్ హిజోసా అనే మహిళ ఓ లెదర్ కంపెనీలో పనిచేసేది. ఎప్పుడూ ఇన్నొవేటివ్‌గా ఆలోచించే తనకు, ఓ రోజు కొత్త ఐడియా వచ్చింది. దానిని ఆచరణలో పెట్టేందుకు ఐదేళ్లు అవిశ్రాంతంగా శ్రమించి, జంతుచర్మం అవసరంలేని కొత్తరకం లెదర్ తయారీకి శ్రీకారం చుట్టింది. పైనాపిల్ ఆకులను గుజ్జుగా చేసి, దానికి మరికొన్ని పదార్థాలు జతకలిపి, జంతుచర్మంతో తయారయ్యే లెదర్‌కు దీటైన పదార్థాన్ని తయారు చేసింది. పైనాపిల్ ఆకులతో తయారు చేసినందున దీనికి ‘పైనాటెక్స్’ అని కూడా నామకరణం చేసింది. జంతుచర్మంతో తయారైన లెదర్ వస్తువుల కంటే పైనాటెక్స్తో తయారు చేసిన వస్తువులు ధృడంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఒక చిన్నసైజు హ్యాండ్‌బ్యాగ్ తయారీకి 16 పైనాపిల్స్ ఆకులు సరిపోతాయట. జంతువధను ఇష్టపడని జంతుప్రేమికులకు ‘పైనాటెక్స్’ వస్తువులు కచ్చితంగా నచ్చుతాయి. స్వచ్ఛంద లెదర్ నిషేధం పాటించే వారు సైతం, ‘పైనాటెక్స్’ వస్తువులతో ఫ్యాషన్ రంగంలో దూసుకుపోయేందుకూ ఇవి ఇంచక్కా పనికొస్తాయి. -
ఆ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు.. రూ. 2 కోట్లు!
ఎవరైనా హ్యాండ్‌బ్యాగ్ ఎంత పెట్టి కొంటారు.. మహా అయితే వెయ్యి, రెండువేలు అంతేకదా. కానీ, క్రిస్టీస్ వేలంశాలలో వేలానికి వచ్చిన ఓ హ్యాండ్‌బ్యాగ్ చరిత్ర సృష్టించింది. మొసలి చర్మంతో చేసి, వజ్రాలు, బంగారం పొదిగిన ఈ హ్యాండ్‌బ్యాగ్‌ను అక్షరాలా 2 కోట్ల రూపాయలకు కొన్నారు. ఆసియాకు చెందిన ఓ ప్రైవేటు వ్యక్తి ఈ బ్యాగ్‌ను అమ్మినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రపంచంలో అమ్ముడైన హ్యాండ్‌బ్యాగ్‌లలో ఇదే అత్యంత ఖరీదైనదని అంటున్నారు. ఈ బ్యాగ్ కోసం హెర్మెస్ వాళ్లు తయారుచేసిన వజ్రాలు చాలా అరుదైనవని క్రిస్టీస్ వేలం శాల ఓ ప్రకటనలో తెలిపింది. ఏడాదికి ఇలాంటివి కేవలం ఒకటి లేదా రెండు వజ్రాలను మాత్రమే తయారుచేస్తారని, అది కూడా కేవలం హ్యాండ్‌బ్యాగ్‌ల కోసమే చేస్తారని చెప్పింది. ఈ వజ్రాలతో పాటు.. దాని అందచందాలు అన్నీ కలిపి ఆ బ్యాగ్‌కు అంత ధర తెచ్చిపెట్టాయన్న మాట. -
ప్యాంట్... బేబీ గౌన్
న్యూలుక్ కార్గో ప్యాంట్స్, జీన్స్ మగ - ఆడ - పిల్లలు తేడా లేకుండా అందరూ వాడేస్తున్నారు. వాటిలో ఏళ్లకేళ్లుగా వాడినా పాడవని ప్యాంట్స్ ఉంటుంటాయి. విసుగొచ్చి పక్కన పడేసినవీ, పిల్లలకు పొట్టిగా మారిన ఈ ప్యాంట్స్‌ను ఉపయోగపడేలా మార్చుకోవచ్చు. అందమైన హ్యాండ్ బ్యాగ్ ప్యాంట్ నడుము భాగాన్ని తీసుకొని, హ్యాండ్ బ్యాగ్స్గానూ, ఫోన్ పౌచ్లుగానూ రూపొందించవచ్చు. తీసుకున్న క్లాత్‌ని బ్యాగ్ నమూనా వచ్చేలా కట్ చేసి, ఫొటోలో చూపిన మాదిరిగా కుట్టాలి. పాకెట్స్‌తో గౌన్: ప్యాంట్స్‌కు పెద్ద పెద్ద పాకెట్స్ (జేబులు) ఉంటాయి. పాకెట్స్తోనే ఓ డిజైన్ సృష్టిస్తే.. అది పిల్లలకు మంచి డ్రెస్ అవుతుంది. ప్యాంట్ పెద్ద జేబులు ఉన్న భాగాలను తీసుకోవాలి. పాకెట్ క్లాత్‌కు పూర్తి కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి మెత్తని క్లాత్ తీసుకుంటే మంచిది. కుట్టడానికి వీలైన వస్తువులను తీసుకోవాలి. పిల్లల కొలతలకు తగ్గట్టు స్కర్ట్ లేదా గౌన్ డిజైన్ చేసుకొని కుట్టేసి ప్యాంట్ పాకెట్‌ను జత చేస్తే కొత్త డ్రెస్ రెడీ. -
పిల్లి కానీ పిల్లి.. భలే గిరాకీ!
జపాన్: చూడ్డానికి అచ్చు పిల్లిలా కనిపిస్తున్నా.. వాస్తవానికిది ఓ హ్యాండ్ బ్యాగ్. ప్రస్తుతం జపాన్‌లో ఈ హ్యాండ్‌బ్యాగ్‌ల ఫ్యాషన్ తెగ నడుస్తోంది. వీటి కోసం జనం డబ్బును మంచి నీళ్లలా ఖర్చుపెట్టేస్తున్నారు. ఇంతకీ ఈ బ్యాగ్ ధరెంతో తెలుసా? రూ. 45 వేలు! మార్జాలాలను అమితంగా ప్రేమించే పికో అనే జపనీస్ డిజైనర్ వీటిని రూపొందించారు. ఒకొక్క బ్యాగును ఆమే స్వయంగా తయారుచేస్తారట. సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్న ఈ బ్యాగ్‌లను జపాన్‌లో మాత్రమే అమ్ముతా నని పికో చెబుతున్నారు. -
లేటెస్ట్ టెక్నాలజీతో హ్యాండ్‌బ్యాగులు
మగువల భుజాన్ని అంటిపెట్టుకుని ఉంటూ.. వారి అవసరాలన్నీ తీర్చే నేస్తం హ్యాండ్‌బ్యాగ్. మనీ, మొబైల్‌ఫోన్, కాస్మెటిక్స్, జ్యువెలరీ, హెయిర్ బ్రష్.. ఇలా ముదితలకు చెందిన ముఖ్యమైన వస్తువులను అపురూపంగా మోస్తుంది. తమకు కావాల్సినవన్నీ మోసే హ్యాండ్‌బ్యాగ్స్‌ను యువతులు కూడా అంతే అపురూపంగా చూసుకుంటుంటారు. మార్కెట్లోకి కొత్త మోడల్ రాగానే సొంతం చేసుకుంటారు. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా నయా మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నారు డిజైనర్లు. ..:: శిరీష చల్లపల్లి ఒకప్పుడు కాలేజ్ గాళ్స్.. సబ్జెక్ట్‌కో నోట్‌బుక్, జామెట్రీ బాక్స్, టిఫిన్ బాక్స్.. వాటర్ బాటిల్.. ఇలా స్టేషనరీని వెంటేసుకుని కాలేజీకి వెళ్లేవారు. వీటన్నింటినీ మోసే బ్యాగ్‌ను భుజాలకుతగిలించుకుని భారంగా నడిచేవాళ్లు. ప్రజెంట్ ట్రెండ్ మారింది. ఇంటర్ స్టూడెంట్ నుంచి రిటైర్డ్ ఎంప్లాయీ వరకూ అందరూ హ్యాండ్‌బ్యాగ్ లేనిదే గడప దాటడం లేదు. వారి వారి అవసరాలకు తగ్గట్టుగా రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. రకరకాలు.. కొత్త హంగులతో ముస్తాబై వస్తున్న బ్యాగులను మగువలు విపరీతంగా ఆదరిస్తున్నారు. యువతులే కాదు..అమ్మలు.. అమ్మమ్మలు కూడా ఏజ్‌కు తగ్గట్టుగా హ్యాండ్‌బ్యాగ్‌లు మెయింటేన్ చేస్తున్నారు. డాక్టర్ బ్యాగ్, బో బ్యాగ్, క్రాస్ బాడీ బ్యాగ్, రిస్లెట్ బ్యాగ్, మెసెంజర్ బ్యాగ్, క్లచ్ బ్యాగ్, బ్యారెల్ బ్యాగ్, డ్రాస్ట్రింగ్ బ్యాగ్, సాడిల్ బ్యాగ్, స్ట్రక్చర్డ్ బ్యాగ్, టోటె బ్యాగ్ ఇలా రకరకాల బ్యాగ్‌లు టీనేజ్ అమ్మాయిల నుంచి అమ్మమ్మల వరకూ ఎవరికి వారే ఫంక్షన్లలో స్టయిల్ ఐకాన్‌గా నిలవడానికి ప్రయత్నిస్తున్నారు. మ్యాచింగ్ మస్ట్.. టీనేజ్ అమ్మాయిలైతే ఎక్కువగా స్లింగ్ బ్యాగులు, టోటే బ్యాగులను ఎంచుకుంటున్నారు. కాలేజీ అమ్మాయిలైతే సింగిల్ హ్యాండ్‌తో వాళ్ల డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే హ్యాండ్‌బ్యాగ్స్‌ను ప్రిఫర్ చేస్తున్నారు. రెండు నోట్బుక్లు, మొబైల్ ఫోన్, పెప్పర్ స్ప్రే ఇమిడిపోయేవి తీసుకుంటున్నారు. లైట్‌వెయిట్ హ్యాండ్ బ్యాగ్‌లతో ఫెమినిన్‌గా, క్యూట్‌గా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా.. నయా పోకడలతో అప్డేట్ అవుతున్న డిజైనర్లు సైతం రకరకాల మెటీరియల్స్‌తో హ్యాండ్‌బ్యాగులు తయారు చేస్తున్నారు. డ్రెస్‌లు డిజైన్ చేసినట్టే హ్యాండ్‌బ్యాగ్‌లను కూడా కస్టమైజ్డ్గా తీసుకొస్తున్నారు. లెదర్, క్లాత్, జ్యూట్, ఫ్యాబ్రిక్ ఇలా ఎన్నో రకాల మెటీరియల్స్ వాడుతున్నారు. డబుల్ జిప్, మల్టీ జిప్, క్లచ్ మోడల్ ఇలా వెరైటీ హ్యాండ్ బ్యాగ్స్ వేటికవే స్పెషల్ లుక్‌తో అదరగొడుతున్నాయి. సేఫ్టీ లాకింగ్.. సేఫ్టీ కోసం హ్యాండ్బ్యాగ్స్కు సైతం లాకింగ్ సిస్టమ్ అరేంజ్ చేస్తున్నారు డిజైనర్లు. నంబర్ లాకింగ్, మినీ కీ లాక్, అలారం బేస్డ్ ఇలా రకరకాల లాకింగ్ సిస్టమ్స్ అటాచ్ చేస్తున్నారు. అంతెందుకు జీపీఎస్ టెక్నాలజీని కూడా హ్యాండ్‌బ్యాగ్‌లకు అడాప్ట్ చేస్తున్నారు. హ్యాండ్‌బ్యాగ్‌లో ఎలక్ట్రానిక్ చిప్ అరేంజ్ చేస్తున్నారు. దీంతో పొరపాటున హ్యాండ్‌బ్యాగ్ అన్ అథెంటిక్ పర్సన్గానీ ఓపెన్ చేశాడంటే.. సదరు హ్యాండ్‌బ్యాగ్ ఓనర్ మొబైల్‌కు, ముందుగా అందులో ఫీడ్ చేసిన మొబైళ్లకు సమాచారం అందుతుంది. తస్కరణకు గురైన మీ హ్యాండ్‌బ్యాగ్ ఏ ఏరియాలో ఉందో కూడా చూపిస్తుంది. ఇలా లేటెస్ట్ టెక్నాలజీతో ముస్తాబైన హ్యాండ్‌బ్యాగులు మార్కెట్లో అదరగొడుతున్నాయి. -
చిన్నపర్స్...ఖరీదు ఘనం!
విలాసం అమ్మాయిలకు ప్రియనేస్తం హ్యాండ్ బ్యాగ్. చిన్న హ్యాండ్‌బ్యాగ్ నుంచి క్లచ్‌గా మారిన ఈ రూపానికి ఎన్నో మెరుగుల అద్దారు డిజైనర్లు. అతివల ముంజేతిలో అందంగా మెరిసిపోయే క్లచ్‌లెన్నో చూస్తుంటాం. ఇప్పటి వరకు ఖరీదైన క్లచ్‌లెన్నో కొనుగోలు చేసి ఉంటారు. కానీ, బ్రిటన్ ఆభరణాల నిపుణులు క్రిస్టోఫర్ షెలిస్ తయారు చేసిన క్లచ్‌ను కొనుక్కోవాలంటే మాత్రం అక్షరాలా కోటీ పది లక్షల రూపాయలు చెల్లించాలి. బార్గేజీ బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఈ రాయల్ క్లచ్ తయారీకి 100 పనిగంటల సమయం పట్టిందట. వెయ్యేళ్ల గ్యారెంటీ గల ఈ క్లచ్ లండన్‌లోని బకింగ్ హామ్ ప్యాలెస్ గేట్‌ను పోలిన డిజైన్ ఉంటుంది. ఈ ఏడాది అత్యంత ఖరీదైనదిగా పేరొందిన ఈ క్లచ్ తయారీలో 18 క్యారెట్ల బంగారం, 345 వజ్రాలతో రూపుదిద్దారు. అయితే 2010లో మొవాద్ కంపెనీ 1001 వజ్రాలతో రూపొందించిన చిన్న పర్స్ నేటికీ అత్యంత ఖరీదైన పర్స్‌ల జాబితాలో ముందుంది. -
మీ హ్యాండ్ బ్యాగ్‌లో ఇవి ఉన్నాయా?!
వాయనం హ్యాండ్ బ్యాగ్ లేకుండా బయటకు వెళ్లే మహిళ ఇప్పుడెక్కడా కనిపించదు మనకి. ఫ్యాషన్‌లో హ్యాండ్‌బ్యాగ్ కూడా భాగమే. ఏ డ్రెస్ మీదకి ఎలాంటి హ్యాండ్ బ్యాగ్ బాగుంటుంది, ఏ మోడల్ బాగుంటుంది, ఎంత మోడ్రన్‌గా ఉండాలి అంటూ రకరకాల అంశాలను పరిశీలించి మరీ కొంటారు. కానీ బయటికెళ్లేటప్పుడు ఆ బ్యాగ్‌లో ఏముండాలి అన్న విషయాన్ని మాత్రం మర్చిపోతుంటారు. అది సరికాదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదు నేటి రోజుల్లో. కాబట్టి ప్రతి మహిళా తనను తాను కాపాడుకోవడానికి తమ బ్యాగ్‌లో కొన్ని వస్తువుల్ని ఉంచుకుని తీరాలి. హ్యాండ్‌బ్యాగ్‌లో కచ్చితంగా ఉండాల్సింది... డైరీ. అందులో పోలీస్ స్టేషన్, ఉమెన్స్ సెల్, హాస్పిటల్, ఇంట్లో వాళ్ల నంబర్లు, ఆఫీసు-కొలీగ్స్ నంబర్లు... అన్నీ ఉండాలి. కొన్నిసార్లు వాళ్లకు సిగ్నల్ అందకపోవచ్చు. వాళ్ల ఫోన్ ఆఫ్ చేసి ఉండొచ్చు. కాబట్టి... ల్యాండ్‌ఫోన్స్ ఉంటే కనుక ఆ నంబర్లు కూడా ఉంచుకోవడం మంచిది. ఓ పెన్ను, పుస్తకం కూడా ఉంచుకోండి. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఫోన్ చేయలేని, కేకలు పెట్టలేని పరిస్థితి ఉంటే ఈ రెండూ ఉపయోగపడతాయి. కొన్ని నెలల క్రితం ముంబైలో ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి, ఓ గదిలో బంధించారు. సెల్‌ఫోన్ లాగేసుకున్నారు. ఆమె దగ్గర ఉన్నది పెన్ను, పుస్తకం మాత్రమే. కాగితాలు చింపి, వాటి మీద తనను కాపాడమంటూ రాసి ఓ చిన్న గుంత గుండా బయటకు విసిరింది. వాటిని చూసిన ఓ వ్యక్తి పోలీసుల సాయంతో ఆమెను కాపాడాడు. ఏదెలా ఉపయోగపడుతుందో చెప్పలేం కదా! మీరు వాడే ఫోన్ కాకుండా ఇంకో ఫోన్‌ని కూడా ఉంచుకోవడం మంచిది. సెలైన్స్‌లో ఉంచి బ్యాగులో వేసుకోండి. చేతిలో ఫోన్ ఎవరైనా లాగేసుకున్నా, ఆ ఫోన్ మిమ్మల్ని కాపాడవచ్చు. ఫుల్‌గా చార్జింగ్ పెట్టి తీసుకెళ్లడం మర్చిపోకండి! స్విస్ నైఫ్, పెప్పర్ స్ప్రే లాంటి దేదైనా ఉంచుకోవడం కూడా అత్యవసరం. అవి కొనుక్కోలేకపోతే కనీసం కాసింత కారప్పొడి అయినా మూటగట్టి పెట్టుకోండి! కేవలం రక్షణకు అవసరమైనవే కాదు, మామూలు సమస్యలు కూడా వస్తుంటాయి. ఉదాహరణకు... నడు స్తుంటే చెప్పు తెగిపోవచ్చు. హ్యాండ్‌బ్యాగ్ స్ట్రాప్ ఊడిపోవచ్చు. కుట్టించుకోవడానికి షాపుకెళ్లేవరకైనా మేనేజ్ చేయాలి కదా! అందుకే చిన్న క్విక్ ఫిక్స్ వేసుకుంటే మంచిది కదా! అలర్జీలు, సడెన్‌గా అటాక్ చేసే ఆరోగ్య సమస్యల వంటివి ఉంటే.. ఆ మందులెప్పుడూ బ్యాగ్‌లోనే ఉండాలి. ఇవన్నీ వేస్తే బ్యాగ్ ఓ చిన్న సైజు దుకాణంలా తయారవుతుంది అనుకోవచ్చు. వీటిని మోయాలంటే కచ్చితంగా పెద్ద బ్యాగే వాడాలి అని కూడా అనుకోవచ్చు. కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆ మాత్రం జాగ్ర త్తలు తీసుకోక తప్పదు మరి! -
చెప్పులకు బ్యాగ్ మ్యాచ్ అయ్యిందా?
చాలామంది దుస్తులమీదే దృష్టి పెడతారు. కొంతమంది దుస్తులతో పాటు మేకప్‌పై కూడా ఆసక్తి చూపిస్తారు. కాని చాలా మంది పట్టించుకోని యాక్ససరీ ఒకటుంది. అదే బ్యాగ్! అలంకరణలో హ్యాండ్‌బ్యాగ్ ప్రధాన భూమిక పోషిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. భుజానికి వేలాడే అతి చిన్న బ్యాగ్ కూడా మీ అలంకరణలో భాగమే. హ్యాండ్‌బ్యాగ్ ఎంపికలో ఫ్యాషన్ డిజైనర్స్ ఏమంటున్నారంటే.. ‘ధరించే దుస్తులకు మ్యాచ్ అయ్యే బ్యాగ్ కాదు, ధరించే చెప్పులకు, చేతపట్టుకునే బ్యాగ్‌కి సమన్వయం ఉండేలా చూసుకోవాలి’ అని చెబుతున్నారు. సాయంకాలం పార్టీకి పువ్వుల ప్రింట్లు ఉన్న డ్రెస్ ధరించాలని అన్ని వయసుల వారూ అనుకుంటారు. దాంట్లో మీరు వైవిధ్యం చూపించేదేమీ ఉండదు. అదే ముదురుపసుపు రంగు సాదా డ్రెస్ ధరించి, పువ్వుల ప్రింట్లు ఉన్న బ్యాగ్ దానికి మ్యాచ్ అయ్యే చెప్పులు వేసుకున్నారనుకోండి. పార్టీలో మీరే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. యానిమల్ ప్రింట్లు (జంతుచర్మాలపై చారలను పోలినవి) మీకు అత్యంత ఇష్టమైతే సాధారణంగా కనిపించే డెనిమ్ డ్రెస్ ధరించి, ప్రింట్లు ఉన్న ఎత్తుమడమల చెప్పులు వేసుకొని, అదే రంగు క్లచ్బ్యాగ్ చేత పట్టుకోండి. ఎత్తుమడమల చెప్పులు ఇష్టపడని వారు ఫ్లాట్స్ వేసుకోవచ్చు. ఏవైనా ఈ తరహా మ్యాచింగ్ చూసుకున్నప్పుడు అతి ఎక్కువగా అలంకరణలు చేసుకోకుండా ఉండటం మేలు. సంప్రదాయ తరహాలో కనిపించాలనుకునేవారు క్లాసిక్ కలర్స్ అయిన నలుపు, ఎరుపు, ముదురు రంగు దుస్తులను ధరిస్తుంటారు. ఇలాంటప్పుడు బ్యాగ్ ఎంపికలో ఏమాత్రం అలసత్వం చూపవద్దు. చేతికి తగిలించుకునే బ్యాగ్, అందుకు మ్యాచ్ అయ్యే చెప్పులు బాగుండేలా జాగ్రత్తపడాలి. అన్నివేళలా చెప్పులు-బ్యాగ్ మ్యాచ్ అవ్వాలనుకోకూడదు. తెల్లటి బ్యాగ్ వెంట తీసుకెళ్లాలనుకుంటే నీలం, నారింజ, పసుపు రంగు చెప్పులు లేదా షూస్ ప్రయత్నించవచ్చు. అలాగే సాధారణ దుస్తులకు దృఢంగా ఉండే బ్యాగులు నప్పవు. కొద్దిగా వేలాడుతుండే లెదర్ లేదా క్లాత్ బ్యాగ్‌లు వేసుకొని అదే రంగు, మెటీరియల్ గల చెప్పులు ధరించాలి. ప్యాంట్, షర్ట్, చెప్పులతో పాటు బ్యాగ్ కూడా ఒకే రంగులో ఒకే ప్రింట్లలో ఉంటే అలంకరణ మరీ అతిగా కనిపిస్తుంది. ప్యాంట్ లేదా టాప్ ఏదైనా ఒక రంగును పోలి ఉండే బ్యాగ్‌ను ఎంచుకోవచ్చు. మీరు ధరించే దుస్తులు ప్లెయిన్‌గా ఎలాంటి ప్రింట్ లేకుండా ఉన్నాయనుకోండి. అప్పుడు ఎక్కువ ప్యాటర్స్ ఉన్న బ్యాగ్ లేదా షూ ధరించవచ్చు. కాని గుర్తుంచుకోవాల్సిందేంటంటే... షూ, బ్యాగ్ మిమ్మల్ని మరింత అందంగా చూపించాలి.