కట్టుబొట్టు తీరులో ప్రతీ సెలబ్రిటీ తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనుకుంటుంది.. అనుకుంటాడు. అద్దినట్టుండే దుస్తుల నుంచి ఠీవీనిచ్చే ఆహార్యం.. అరచేతుల్లో ఇమిడే గాడ్జెస్ వరకు బ్రాండ్ ప్రొడక్ట్స్‌ను అన్వేషిస్తుంటారు. అలా సెలబ్రెటీల ప్యాషన్‌ను పెంచి ఫ్యాషన్ క్రియేట్ చేస్తున్న బ్రాండ్స్ గురించి ప్రతీ వారం ఈ ‘స్టార్ స్టైల్’ పేజీలో చూడొచ్చు.. చదవొచ్చు!!
సమంతా.. తెర మీద అందాలనటే కాదు.. స్టయిల్ ఐకాన్ కూడా. దేశీ చేనేతకు ఎంత దర్జానివ్వగలదో ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కూ అంతే గ్లామర్‌నిస్తుంది. ఏ డిజైన్ అయినా సమంతా కోసం పోటీపడాల్సిందే. పై ఫొటోలో ఆ పోటీలో గెలిచిన బ్రాండ్స్ ఇవి.
► లూయి విట్టోన్ బై మెటీరియల్ డ్రస్ (Louis Vuitton Bi Material Dress)
ధర: రూ. 2,01,773
► సన్ లోరాన్ ట్రిబ్యుట్ ఫ్లాట్‌ఫాం శాండిల్స్ (Sanit Laurent Tribute Platform Sandals)
ధర: రూ. 85,000
► లూయి చైన్ బ్యాగ్ (Lauise Chain Bag)
ధర: రూ. 15,600
బ్రాండ్స్ వాల్యూ
లూయి విట్టోన్ (LV) ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ హౌస్‌లలో ఒకటి. 1854లో ఫ్రాన్స్‌కు చెందిన విట్టోన్ అనే వ్యక్తి దీన్ని స్థాపించాడు. లెదర్ క్వాలిటీ, డిజైన్స్ ప్రత్యేకతతో వరల్డ్‌లోనే అతి పెద్ద ఫ్యాషన్ బ్రాండ్‌గా రూపొందింది. చేతి రుమాలు నుంచి ఆభరణాలు వరకు ప్రతీ వస్తువునూ ఉత్పత్తి చేస్తుందీ బ్రాండ్. కాకపోతే దేన్ని కొనాలంటే వేల నుంచి కోట్లు వెచ్చించాల్సిందే. మొత్తం 50 దేశాల్లో 460కి పైగా బ్రాంచీలు ఉన్నాయి. దీనికి ఆన్‌లైన్ మార్కెట్ కూడా విస్తృతమే. ప్రస్తుతం ఈ కంపెనీ బ్రాండ్ విలువ 350 కోట్ల రూపాయలు. ప్రపంచంలోని ప్రతి సెలబ్రెటీ ఈ బ్రాండ్‌కి కొనుగోలుదారుడే.
ఈవ్ సన్ లోరాన్ (Yves Sain Laurent)
అరవై ఏళ్ల కిందటి ఈ కంపెనీ కూడా ఫ్రాన్స్ బేస్డ్. ప్రసిద్ధ లగ్జూరియస్ బ్రాండ్స్‌లో ఇదీ ఒకటి. క్రియేటీవిటికీ కేరాఫ్. అదే దీని బ్రాండ్ వాల్యూ. ఇది ఉత్పత్తి చేసే పెర్‌ఫ్యూమ్స్ తప్ప ఇంకేది కొనాలన్నా వేల్లలో, లక్షల రూపాయల్లోనే ఉంటుంది ధర. అత్తర్లు మాత్రమే వందల రూపాయల్లో దొరుకుతాయి.
'నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు లూయి విట్టోన్ బ్యాగ్ కొనుక్కోవాలని మనసుపడ్డాను. ఆ బుజ్జి బ్యాగ్ ధర ఎంతో తెలుసా? 30 థౌజెండ్ రూపీస్ ఓన్లీ. ఆ కాలాన్ని ఫాస్ట్‌ఫార్వడ్ చేస్తే అది ఇప్పటికీ నా ఫేవరేట్'.
– సమంతా అక్కినేని
చదవండి: టీవీ నటితో ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ హీరో పెళ్లి.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment