శభాష్‌ .. వెంకటసుబ్బయ్య ! | - | Sakshi
Sakshi News home page

శభాష్‌ .. వెంకటసుబ్బయ్య !

Dec 5 2023 5:16 AM | Updated on Dec 5 2023 10:24 AM

- - Sakshi

కడప అర్బన్‌ : ఓ మహిళ ఆటోలో వెళుతూ రూ. 2లక్షలు విలువైన బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్‌ బ్యాగును మరచిపోయింది. ఆటోలో బ్యాగును గుర్తించిన డ్రైవర్‌ వెంకట సుబ్బయ్య పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ సోమవారం కడపలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆటో డ్రైవర్‌ నల్లకట్ల వెంకట సుబ్బయ్యకు ప్రశంసాపత్రాన్ని అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. వివరాలిలా ఉన్నాయి. రాజంపేటకు చెందిన మేరువ వెంగమ్మ జంగాలపల్లెలోని తన తల్లి ఇంటికి శుభకార్య నిమిత్తం వచ్చింది.

ఈనెల 2న కమ్మపల్లెకు వెళ్లి సాయంత్రం ఆటోలో జంగాలపల్లెకు తిరుగు ప్రయాణమైంది. ఈ నేపథ్యంలో ఆటోలో బంగారు నగలున్న బ్యాగును మరిచిపోయింది. బ్యాగును గుర్తించిన ఆటో డ్రైవర్‌ వెంటనే సమీపంలోని సిద్దవటం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజుకు అందజేశారు. బాధిత మహిళకు పోలీసులు సమాచారం ఇచ్చి నగలతో కూడిన బ్యాగు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ఆటో డ్రైవర్‌కు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement