Police Station
-
అమెరికాలో ‘చైనా’ కలకలం.. ఎంత పని చేసింది!
మన్హటన్: చైనా ప్రభుత్వం తరఫున అమెరికాలో నడిపే రహస్య పోలీస్‌స్టేషన్ ఒకటి మొట్టమొదటిసారిగా బయటపడింది. మన్‌హటన్‌లోని చైనాటౌన్‌లో 2022 నుంచి చెన్ జిన్‌పింగ్, లు జియన్వాంగ్ అనే వారు చైనా ప్రభుత్వం పబ్లిక్ సెక్యూరిటీ శాఖ తరఫున దీనిని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అదే ఏడాది ఫెడరల్ బ్యూరో అధికారులు దీనిని మూసివేయించారు. చెన్ జిన్‌పింగ్, లు జియాన్ వాంగ్లు తమ సెల్ఫోన్లలోని చైనా మంత్రిత్వ శాఖ మెసేజీలను పూర్తిగా డిలీట్ చేశారు.అమెరికా పౌరసత్వమున్న వీరిద్దరినీ గతేడాది ఏప్రిల్‌లో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18వ తేదీన కోర్టులో వీరిపై విచారణ పూర్తయింది. ఆరోపణలు రుజువని తేలితే వచ్చే ఏడాది వెలువడే తీర్పులో కోర్టు చెన్కు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. లుపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కాలిఫోర్నియాలోని ప్రజాస్వామ్య అనుకూల వాదిని గుర్తించేందుకు చైనా ప్రభుత్వానికి సాయం చేయడంతోపాటు, పరారీలో ఉన్న నేరస్తుడిని అమెరికా నుంచి తిరిగి చైనా వెళ్లిపోవాలంటూ ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ దేశస్తులపై నిఘా పెంచి, వారిని తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు చైనాలోని నియంతృత్వ కమ్యూనిస్ట్ ప్రభుత్వం దాదాపు 53 దేశాల్లో 100కు పైగా ఇటువంటి పోలీస్స్టేషన్లను నిర్వహిస్తోందని హక్కుల సంస్థలు ఆరోపిస్తున్న వేళ ఈ వ్యవహారం బయటపడటం గమనార్హం. అయితే, ఈ ఆరోపణలను చైనా ఖండిస్తోంది. విదేశాల్లోని తమ దేశస్తులకు పరిపాలనా సేవలను అందించే సర్వీస్ స్టేషన్లే తప్ప, ఇవి పోలీస్స్టేషన్లు కావని చెబుతోంది. మన్‌హటన్‌లోని చైనాటౌన్‌లో తాజాగా బయటపడిన పోలీస్ స్టేషన్ రామెన్ మాల్లోని ఓ ఫోర్ మొత్తం ఆక్రమించింది. ఇందులో చైనీయులకు పౌరసత్వ పొడిగింపు సేవలను అందిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల చైనీయులను గుర్తించేందుకే వాడుతున్నట్లు అమెరికా న్యా య శాఖ ఆరోపిస్తోంది.చదవండి: పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా..ఏమాత్రం సహించం‘ఈ అప్రకటిత విదేశీ పోలీసు స్టేషన్ అమెరికా సార్వభౌమాధికారానికి అవమానం, ప్రమాదకరం. దీనిని ఏమాత్రం సహించం’అని ఆ శాఖ అసిస్టెంట్ అటార్నీ జనరల్ మాథ్యూ ఓల్సెన్ స్పష్టం చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో న్యూ యార్క్ గవర్నర్ కార్యాలయంలో పనిచేసే మాజీ ఉద్యోగిని లిండా సన్ చైనా ప్రభుత్వానికి ప్రయోజనం కలిగించేలా అధికారం దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు. అందుకామె ప్రతిఫలాలు అందుకున్నారని తేలింది. గతేడాది చైనా పబ్లిక్ సెక్యూరిటీ శాఖకు సాయం అందిస్తున్నట్లుగా 34 మంది అధికారులను గుర్తించి, కేసులు పెట్టారు. -
పోలీస్‌స్టేషన్‌లో పరీక్ష పత్రాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి సమ్మెటివ్ అసెస్మెంట్–1 లెక్కల ప్రశ్నాపత్రం యూట్యూబ్‌లో ప్రత్యక్షమైన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అన్ని తరగతుల ప్రశ్నాపత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్లో భద్రపరిచి, పరీక్ష జరిగే రోజు అక్కడి నుంచే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష పత్రాలకు ఎంఈవో–1, 2 ఇద్దరు కస్టోడియన్లుగా ఉండాలని ఆదేశించారు. పరీక్ష నిర్వహించే రోజు గంటముందు మాత్రమే ప్రశ్నాపత్రాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అందించాలని సూచించారు. సోమవారం జరగాల్సిన పదో తరగతి మేథ్స్ ప్రశ్నాపత్రం మూడు రోజుల ముందే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ విషయం గుర్తించకుండా అదే ప్రశ్నాపత్రం విద్యార్థులకు అందించారు. అనంతరం తేరుకున్న అధికారులు సోమవారం నిర్వహించాల్సిన అన్ని తరగతుల పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అర్ధ వార్షిక పరీక్షల నిర్వహణే ఇంత అధ్వానంగా ఉన్న నేపథ్యంలో మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఇంకెంత గొప్పగా నిర్వహిస్తారోనని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఒక్క దుస్సంఘటన కూడా లేకుండా అన్ని పరీక్షలను ప్రభుత్వం పక్కాగా నిర్వహించింది. పరీక్షకు గంట ముందు ఆన్లైన్లో పేపర్ పంపించి, అక్కడే ప్రింట్ తీసుకుని విద్యార్థులకు అందించేవారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న విద్యాశాఖ.. ఇప్పుడెందుకు తేలిగ్గా తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఉండగా, ఎస్ఏ–1 పరీక్షలు ఈనెల 19వ తేదీతో ముగుస్తాయి. అనంతరం లెక్కల పరీక్షను 20వ తేదీన నిర్వహించనున్నారు. కాగా, ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మరోపక్క విద్యాశాఖ డైరెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు.ఉపాధ్యాయులకు విషమ పరీక్షప్రశ్నాపత్రాల భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు ఉపాధ్యాయులకు సంకటంగా మారాయి. పరీక్షకు గంట ముందు స్థానిక పోలీస్ స్టేషన్లో భద్రపరిచిన ప్రశ్నాపత్రాలను ఎంఈవో సమక్షంలో ఉపాధ్యాయులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ సమయం సరిపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రశ్నాపత్రాలు చేరడం కష్టసాధ్యమవుతుంది. చాలా గ్రామాల్లో పాఠశాలలు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు 20 నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో అన్ని ప్రక్రియలు పూర్తిచేసి సమయానికి చేరడం ఎంతో ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. -
Ambati Rambabu: మాపై కక్ష తీర్చుకోవడానికే లోకేష్ ..
-
‘లోకేష్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారా?’
గుంటూరు, సాక్షి: ఏపీలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్న పోలీసుల తీరును వైఎస్సార్సీపీ ఎండగడుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ అరెస్టులు చేస్తున్న ఖాకీలు.. వైఎస్సార్సీపీ ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబటి నిరసన చేపట్టారు. ‘‘మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోరా?..’’ అంటూ ఫ్లెక్సీలు చేతిలో పట్టుకుని నేతలతో కలిసి పీఎస్ మెట్ల మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారాయన. తమ ఫిర్యాదులపై ఎప్పుటిలోగా కేసులు నమోదు చేస్తారో? చెప్పాలంటూ పోలీసులను కోరుతూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. వైఎస్సార్సీపీ నేతల డిమాండ్లతో దిగొచ్చిన పోలీసులు.. ఈ నెల 21లోగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో.. వైఎస్సార్సీపీ నేతలు తమ నిరసన విరమించుకున్నారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు.. ‘‘పట్టాభిపురం పీఎస్ ఎదుట నిరసన తెలియజేశాను. జగన్ తో పాటు నా కుటుంబంపై కూడా సోషల్ మీడియాలో ద్రుష్ప్రాచారం చేయడంపై ఫిర్యాదు చేశాం. మా ఫిర్యాదులపై కూడా ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదు. పోలీసులే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. లోకేష్ నుండి ఆదేశాలు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. మా కార్యకర్త ప్రేమ్ కుమార్ ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. మాపై కక్ష తీర్చుకోవడానికే లోకేష్ చట్టాలను ఉపయోగించుకుంటున్నారు. కానీ, చట్టం ప్రకారం పోలీసులు నడుచుకోవాలి. మా ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకపోతే మరోసారి మా నిరసన తెలియజేస్తాం. మేము చట్టబద్దంగానే వ్యవహరిస్తున్నాం. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మాపై సోషల్ మీడియా లో పోస్టింగ్స్ పెట్టిన వారిపై చర్యలు తీసుకునేంత వరకూ మా పోరాటం ఆగదు. తిరిగి ఎప్పుడైనా నిరసన తెలియజేస్తాం అని హెచ్చరించారాయన. -
పంజాబ్‌లో పేలుడు కలకలం
అమృత్సర్: పంజాబ్‌లో పేలుడు కలకలం రేపింది. అమృత్‌సర్‌లోని ఇస్తామాబాద్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ పేలుడు తమ పనేనంటూ జర్మనీకి చెందిన గ్యాంగ్‌స్టర్ జీవన్ ఫౌజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 10 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.ఈ నెల 4న అమృత్‌సర్‌లోని మజితా పోలీస్స్టేషన్లోనూ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ అద్దాలు పగిలిపోయాయి. పోలీస్ స్టేషన్ గేటు సమీపంలోని బహిరంగ ప్రదేశంలో పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేసిన పోలీసులు.. భద్రతను పెంచారు.Reportedly, a blast was heard in the early hours of Tuesday near the Islamabad police station in Amritsar. However, the police have yet to provide an official statement on the incident. pic.twitter.com/1tzYeyjidG— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ رویندرسنگھ روبن (@rsrobin1) December 17, 2024 -
Mohan babu: గన్ సరెండర్ చేసిన మోహన్‌బాబు
-
బళ్లారిలో కీచక ఖాకీలు
సాక్షి,బళ్లారి: భర్త వేధింపుల నుంచి రక్షణ కోరుతూ పోలీసు స్టేషన్ గడప తొక్కిందామె. కానీ, అక్కడ రక్షక భటులే కీచకులయ్యారు. ఆమెను భర్త నుంచి విడగొట్టి.. ఒంటరిని చేసి మరీ లైంగిక దాడుకు దిగారు. బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ఇద్దరు కీచక కానిస్టేబుళ్ల గుట్టు రట్టయింది. నగరంలోని బండిహట్టిలోని పద్మశ్రీ కాలనీకి చెందిన ఓ మహిళ 2023 ఏప్రిల్‌లో తన భర్త ప్రతి రోజు చిత్రహింసకు గురి చేస్తున్నారని, అతని బారి నుంచి రక్షణ కల్పించాలని కౌల్‌బజార్ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ అనే కానిస్టేబుల్ సానుభూతిగా మాట్లాడుతూ ఫోన్ నంబరు తీసుకున్నాడు. మరుసటి రోజు భర్త సతాయించడంతో ఆమె ఇమ్రాన్‌ఖాన్‌కి కాల్ చేసి చెప్పింది. అతడు ఫోన్ చేసి ఆమె భర్తను గదమాయించాడు. అప్పటినుంచి ఆమెతో తరచూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆమెకు డబ్బులు ఆశ చూపి, ప్రత్యేకంగా ఓ ఇల్లు బాడుగకు ఇప్పించి సహ జీవనం ప్రారంభించాడు. కొన్నాళ్లపాటు వ్యవహారం సాగించిన ఇమ్రాన్‌ఖాన్ తప్పుకున్నాడు. కేసు నమోదు, ఒకరి అరెస్టు హిళ విషయం తెలిసి ఆజాద్ అనే మరో కానిస్టేబుల్.. ఆమెకు దగ్గరయ్యాడు. ఇంతలో ఇమ్రాన్‌ఖాన్ కూడా వారి మధ్యకు వచ్చాడు. తాము చెప్పినట్లు వినకపోతే యాసిడ్‌తో దాడి చేస్తామని కూడా బెదిరించారట. చివరకు వారి నరకయాతనను తట్టుకోలేని బాధితురాలు ఇద్దరు కానిస్టేబుళ్లు తనను నమ్మించి మోసం చేశారని మహిళా పోలీసు స్టేషన్లో లైంగికదాడి కేసు పెట్టింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి ఒకరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ బాగోతం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది. -
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నేతల ఆందోళన
-
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. బేగంపేటలోని ఓ హోటల్లో జాతీయ సదస్సులో రంగనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలపై దృష్టి పెట్టామన్నారు.హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయన్న రంగనాథ్.. ఎక్కువగా ధనవంతులే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారని పేర్కొన్నారు.ఆక్రమణలకు గురైన స్థలాల్లో పేదలకంటే వారే ఎక్కవగా ఉన్నారంటూ రంగనాథ్ వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు ఆక్రమణల్లో ఉన్నారని తెలిపారు. ‘‘ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరినీ వదలం.. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం’’ అని రంగనాథ్ హెచ్చరించారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ జాగ్రత్తలు -
లైంగికంగా వేధించారా.. సాక్ష్యం ఉందా!?
ఒంగోలు టౌన్: ‘ఏంటి.. లైంగికంగా వేధించారా.. సాక్ష్యం ఏమైనా ఉందా’.. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ గడప తొక్కిన బాధిత మహిళకు బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న సీఐ నుంచి ఎదురైన ప్రశ్న ఇది. సాక్ష్యం ఉంటేనే కేసు పెడతామని పోలీసు అధికారి చెప్పడంతో ఆమె బిత్తరపోయింది. పోలీసులు, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన బాధితురాలు చివరికి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఓ మహిళ పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సురేంద్రబాబు, డీఈఓ మహమ్మద్ అన్సారీలు లైంగికంగా వేధిస్తున్నారంటూ సదరు మహిళ అక్టోబరు 18న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన తాలుకా పోలీసుస్టేషన్‌కు రిఫర్ చేశారు. విచారణ కోసం రమ్మంటూ మరుసటి రోజు తాలుకా పోలీసుస్టేషన్ నుంచి పిలుపు రాగా.. ఆమె వెళ్లి సీఐ అజయ్‌కుమార్‌కు తన సమస్య చెప్పుకుంది. వారిరువురూ ద్వంద్వార్ధాలతో కామెంట్ చేస్తున్నారని వాపోయింది. సీఐ స్పందిస్తూ.. ‘నీ మాటలు నమ్మశక్యంగా లేవు, నీ వద్ద వీడియోలు ఉంటే తీసుకురా’.. అని చెప్పారు.తన దగ్గర ఎలాంటి వీడియోల్లేవని, ఒక మహిళ సిగ్గు విడిచి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఊరికే ఎలా చెబుతుందని ప్రశ్నించింది. ఇది జరిగి నెలరోజులైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆమెపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఆస్పత్రిలో పనిచేసే మహిళలతో డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేయించారు. అలాగే, స్థానిక టీడీపీ నేతలు చంద్రశేఖర్, భాస్కర్ బెదిరిస్తున్నారు. దీంతో బాధిత మహిళ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు కలిసి తన గోడు చెప్పుకుంది. అయినా ప్రయోజనం లేకపోయేసరికి ఎస్పీని కలిసేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి వెళితే అక్కడ సిబ్బంది ఆమెను ఎస్పీ వద్దకు వెళ్లనీయలేదు.ఇక దిక్కుతోచని స్థితిలో మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, డీజీపీలకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. పైనుంచి వచ్చిన కేసులు విచారించి నివేదిక పైకి పంపిస్తామని, బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు తప్పని తేలిందని సీఐ అజయ్‌కుమార్ చెబుతున్నారు. -
పోలీసులకు మహిళ బెదిరింపులు
లింగోజిగూడ: తన భర్త వద్ద ఉన్న కారు బంగారు, నగదును ఇప్పించాలని పోలీసులను కోరిన మహిళ అందుకు వారు నిరాకరించడంతో పోలీసులపైనే బెదిరింపుకు పాల్పడిన సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే హయత్‌నగర్, మునగనూర్‌లో నివాసం ఉంటున్న కాటమోని పావని తన మొదటి భర్త గోపీతో విడాకులు తీసుకుని ఐదేళ్ల క్రితం కర్నూలుకు చెందిన గోరుకంటి శ్రీకాంత్‌ను రెండో వివాహం చేసుకుంది. శ్రీకాంత్ స్థానికంగా పురోహితం చేస్తుండగా, పావని జూనియర్ లాయర్‌గా పని చేసేది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత నెలలో శ్రీకాంత్ ఇంటి నుంచి వెళ్లి పోయాడు. దీంతో పావనీ మీర్‌పేట పోలీస్టేషన్లో తన భర్త తన నుంచి దూరంగా వెళ్లిపోయాడని అతడి తల్లి పద్మ పేరున ఉన్న కారుతో పాటు బంగారం, నగదు తనకు ఇప్పించాలని ఫిర్యాదు చేసింది. సివిల్ కేసు కావడంతో తమ పరిధిలోకి రాదని పోలీసులు తేల్చి చెప్పారు.దీంతో ఆమె గత నెల 16న తన భర్త కనిపించడం లేదంటూ హయత్‌నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీకాంత్ కర్నూలులో ఉన్నట్లు గుర్తించి అతడిని పోలీస్టేషన్‌కు తీసుకొచ్చారు. అతను పావనీతో ఉండడం ఇష్టం లేదని చెప్పడంతో వదిలేశారు. దీంతో ఆమె అతడి వద్ద ఉన్న కారు, బంగారం, నగదు ఇప్పించాలని కోరడంతో వారు కారు, కొంత నగదును ఇప్పించారు. అయినా సంతృప్తి చెందని పావని బంగారం మరింత నగదు కోసం డిమాండ్ చేయడంతో అది తమ పని కాదని సివిల్ తగదాలు కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు. దీంతో ఆమె ఈ నెల 23న హయత్‌నగర్ పోలీస్టేషన్లో తన భర్త శ్రీకాంత్, అతని సోదరుడు దుర్గప్రసాద్‌తో కలిసి వేధింపులకు గురి చేస్తున్నారని, దుర్గప్రసాద్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఎస్ఐపై ఆరోపణలు పావనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఎస్ సైదులు కేసు వివరాలు తెలుసుకునేందుకు తన ఫోన్ నెంబర్ తీసుకుని వేధింపులకు పాల్పడుతున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆరోపణలు చేయడంతో పాటు సీపీకి ఫిర్యాదు చేసినట్లు సామాజిక మధ్యమాల్లో వార్త సంచలనమైంది. మా పరిధి కాదన్నందుకే.. సివిల్ తగదాలు తాము పరిష్కరించమని, కోర్టులో తేల్చుకోవాలని చెప్పడంతోనే పావనీ ఎస్ఐ సైదులుతో పాటు తమపై అసత్య ఆరోపణలు చేస్తుందని హయత్‌నగర్ సీఐ నాగరాజ్‌గౌడ్ అన్నారు. పావని ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. -
కుక్క మీద ప్రేమ.. పీఎస్‌కు పంచాయతీ
బంజారాహిల్స్: పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమ రెండు కుటుంబాలను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే చాంద్ షేక్ ఒక విదేశీ కుక్కను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పక్క ప్లాట్‌లో నివసించే రుచిక అగర్వాల్ అనే యువతికి సైతం ఈ కుక్క అంటే ఎనలేని ప్రేమ. ఈ కుక్కతో ఆమె అనుబంధాన్ని మరింతగా పెంచుకుంది. అంతేకాకుండా కుక్కను తన ఇంటికి తీసుకెళ్తూ ఆహారం కూడా అందించేది. తరచూ ప్రయాణాలు చేసే ఈ పెంపుడు కుక్క యజమాని చాంద్ షేక్ ఎక్కడికైనా వెళ్లినప్పుడు కుక్క బాగోగులు చూసుకోవడానికి రుచిక అగర్వాల్ కు అప్పగించేవాడు. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చాంద్ షేక్ విదేశాలకు వెళ్లారు. ఈ క్రమంలోనే తన పెంపుడు కుక్కను చూసుకోవాల్సిందిగా రుచిక అగర్వాల్ కు అప్పగించి వెళ్లాడు. అయితే ఈ కుక్క అంటే చాంద్ షేక్ తండ్రి షేక్ సుభానికి కూడా మహా ప్రాణం. తాను అల్లారు ముద్దుగా చూసుకునే కుక్క పక్కింట్లో ఉండటాన్ని జీరి్ణంచుకోలేక షేక్ సుభాని రుచిక ఇంటికి వెళ్లి కుక్కను తనతో పాటు తీసుకొని వచ్చాడు. దీంతో రుచిక కోపం పట్టలేక కుక్క మీద ఉన్న ప్రేమతో సుభానితో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కుక్క కోసం రుచిక తో పాటు ఆమె సోదరుడు ఆమె వద్ద పనిచేసే వికాస్, జేమ్స్, ఆమె వదిన గొడవ పడ్డారు. కుక్కను తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా సుభాని అడ్డుకున్నాడు. ఈ గొడవలో సుభానికి స్వల్ప గాయాలయ్యాయి. ఆగ్రహం పట్టలేక రుచికాపై విరుచుకుపడ్డాడు. దీంతో తనను తిట్టాడంటూ రుచిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సుభాని కొడుకు చాంద్ షేక్ కూడా తన తండ్రిని కొట్టారంటూ పోలీసులకు ప్రతి ఫిర్యాదు చేశాడు. ఇరు వర్గాల ఫిర్యాదులపై పోలీసులు సెక్షన్ 329(4), 115(2), 351(2), రెడ్ విత్ 3(5) బీఎన్ ఎస్ కింద ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
YSR జిల్లా సీకే దిన్నె పీఎస్ లో వర్రా రవీంద్రారెడ్డి
-
అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆరా.. ఖాకీలపై ఆగ్రహం
సాక్షి అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా యథేచ్ఛగా జరుగుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు, అక్రమ నిర్బంధాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్రమ నిర్బంధాల విషయంలో పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఇద్దరు సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధానికి సంబంధించి రెండు పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ ఫుటేజీలను సంబంధిత మేజిస్ట్రేట్ల ఎదుట సీల్డ్ కవర్లలో అందచేయాలని పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తుల అరెస్ట్ విషయంలో చట్ట నిబంధనలు పాటించి తీరాల్సిందేనని పోలీసులకు తేల్చి చెప్పింది. లేని పక్షంలో తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ పరిస్థితి తేవద్దని హెచ్చరించింది. ఇది వ్యక్తుల స్వేచ్ఛతో ముడిపడి ఉందని, కాబట్టి ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని తేల్చి చెప్పింది. చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులను చైతన్య పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విశాఖకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త తిరుపతి లోకేష్‌ను సోమవారం తమ ముందు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్భందించారంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం ఎక్కువ అయిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టును ఆశ్రయించిన బాధిత కుటుంబాలు..టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారంటూ పలువురిని పోలీసులు అక్రమంగా నిర్భంధంలోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే. గత వారం రోజుల్లో 101 మందిని అక్రమంగా అరెస్టులు చేశారు. తమవారిని పోలీసులు కోర్టు ముందు హాజరు పర్చకుండా అక్రమ నిర్బంధంలో ఉంచడంపై బాధిత కుటుంబాలకు చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా నిర్భందించిన తమ కుటుంబ సభ్యులను న్యాయస్థానం ఎదుట హాజరు పరిచేలా ఆదేశించాలంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది.పౌరుల స్వేచ్ఛను కాపాడతాం..విచారణ సందర్భంగా తిరుపతి లోకేష్ తరఫు న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్ కుటుంబం పేరుతో వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న 411 మందికి నోటీసులు ఇచ్చారని నివేదించారు. వారిలో 120 మంది విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారని తెలిపారు. తిరుపతి లోకేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 5వతేదీన విశాఖ నుంచి విజయవాడ తరలించారన్నారు. లోకేష్ సోదరుడిని పిలిపించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ధర్మాసనానికి నివేదించారు. ప్రస్తుతం లోకేష్ జాడ తెలియడం లేదన్నారు. ఈ సమయంలో కోర్టులో ఉన్న విజయవాడ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ జానకి రామయ్యతో ధర్మాసనం నేరుగా మాట్లాడింది. తిరుపతి లోకేష్ సోషల్ మీడియా ద్వారా ఓ గ్రూప్ నిర్వహిస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆయన కోర్టుకు చెప్పారు. దీనిపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశామన్నారు. ఫోన్ చేయడంతో తన బావతో కలిసి లోకేష్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారన్నారు. లోకేష్‌ని విచారించిన అనంతరం నోటీసులు ఇచ్చి పంపామన్నారు. నేరానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలతో ఈ నెల 10న హాజరు కావాలని ఆయనకు సూచించినట్లు చెప్పారు. జానకి రామయ్య చెప్పిన వివరాలను రికార్డు చేసిన ధర్మాసనం.. సోమవారం ఉదయం 10:30 గంటలకు లోకేష్‌ను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది . ఈ నెల 4వతేదీ నుంచి 8వ తేదీ వరకు సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచి సీల్డ్ కవర్లో విజయవాడ మెజిస్ట్రేట్‌కు సమర్పించాలని ఆదేశించింది. అరెస్ట్ చేసిన 24 గంటలలోపు నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని స్పష్టం చేసింది. చట్ట నిబంధనలను పాటించి తీరాలని లేదంటే తమ జోక్యం తప్పదని తేల్చి చెప్పింది. పౌరుల స్వేచ్ఛను కాపాడటం ఈ కోర్టు బాధ్యత అని స్పష్టం చేసింది. అంతకు ముందు పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ్త సోషల్ మీడియా ద్వారా కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం, అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని నివేదించారు. ఇలాంటి వారికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొనగా, దీనిపై ధర్మాసనం స్పందిస్తూ చట్ట నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.టేకులపల్లి స్టేషన్ ఫుటేజీ కూడా..అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం ఆత్మకూరుకు చెందిన జింకల నాగరాజు అక్రమ నిర్భందంపై దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించించింది. టేకులపల్లి స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచి సంబంధిత మేజిస్ట్రేట్ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. -
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మహబూబ్ నగర్ కేసు నమోదు
-
అసలు ఈ కియా కారు కథేంటి..
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో ఓ ఖరీదైన కారు ఏడాదిగా మూలన పడి వాడకానికి పనికి రాకుండా పోతోంది. కారును సీజ్ చేసిన అధికారితో పాటు మరో ముగ్గురు కూడా బదిలీ అయి వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్ కూడా అప్‌గ్రేడ్ అయ్యింది. అయినా కారు కథ కంచికి చేరడం లేదు.దిక్కుమొక్కు లేక..ఏడాది కిందట ఆత్మకూరు మండలం నల్లకాల్వ – బాపనంతాపురం మధ్య జంబులమ్మ ఆలయం వద్ద తెలుపు రంగు కియా కారు మూడు రోజులుగా ఉండడంతో అనుమానం కలిగిన స్థానికులు అప్పటి ఎస్ఐకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా కారుకు నంబర్ ప్లేట్ లేదు, విండో షీల్డ్స్ పగులగొట్టి ఉన్నాయి. ఛాసిస్ నంబరు ఆధారంగా కారు యజమానిని గుర్తించారు. కారు మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ కాగా యజమాని కర్ణాటక వ్యక్తిగా తేలింది. పోలీసులు అతనికి ఫోన్ చేసి కారును తీసుకెళ్లమని చెప్పగా ఇంతవరకు రాలేదు.అసలు ఈ కియా కారు కథేంటి..ఏడాది కిందట జాతీయ రహదారి – 44లో కారులో వెళుతున్న వ్యక్తులను కొందరు దుండగులు అటకాయించి బలవంతంగా అదే కారులో తీసుకెళ్లిపోయారు. ఓ చోట వారిని దింపేసి వెళ్లిపోయారు. దీనిపై బాధితులు డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుండగులు తీసుకెళ్లిన కారు ఆత్మకూరు ప్రాతంలో దొరికింది. అప్పటినుంచి స్థానిక పోలీస్ స్టేషన్లోనే మగ్గుతోంది.కారు హైజాక్ వెనుక హవాలా ముఠా?పెద్ద మొత్తంలో హవాలా సొమ్ము చేతులు మారే సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ కేసుపై ఎవరైనా అడిగితే.. డోన్‌లో కిడ్నాప్ కేసు నమోదై ఉన్నందున వారికి హ్యాండోవర్ చేయాల్సి ఉందని, అయితే వారు పట్టించుకోవడం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. -
Hyderabad: పెట్రోల్ పోస్తుండగా నిప్పుపెట్టిన ఆకతాయి
మల్లాపూర్: మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోలు పోస్తుండగా ఓ ఆకతాయి నిప్పు అంటించిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆరి్పవేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, ఎస్ఐ మైబెలి తెలిపిన వివరాల ప్రకారం..మల్లాపూర్ ఓల్డ్ మీర్‌పేట్‌కు చందన్‌కుమార్ (19) తన స్నేహితులతో కలిసి యాక్టివా ద్విచక్రవాహనంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చారు.అదే సమయంలో సిబ్బంది వేరే కస్టమర్‌కు బాటిల్లో పెట్రోల్ పోస్తుండగా చందన్‌కుమార్ సడన్‌గా జేబులోంచి లైటర్ తీసి వెలిగించాడు. ‘అంటించమంటారా..’ అంటూ పెట్రోలు నింపుతున్న సిబ్బంది దగ్గరకు వచ్చి అంటించాడు. దీంతో గన్‌కు మంటలు అంటుకున్నాయి. తీవ్ర భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్ ఫోమ్‌తో మంటలు ఆరి్పవేశారు. దీంతో పెట్రోల్ బంక్‌లో ఉన్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించగా..చందన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు.. గంజాయి మత్తులో ఉన్న యువకులు..హైదరాబాద్ - నాచారం పీఎస్ పరిధిలో మల్లాపూర్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలువెంటనే మంటలను ఆర్పిన పెట్రోల్ బంక్… pic.twitter.com/IVmrhJPfdy— Telugu Scribe (@TeluguScribe) October 26, 2024 -
పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మాజీ మంత్రి సోదరుడు శ్రీకాంత్ గౌడ్
-
మహిళా కానిస్టేబుల్‌పై ఎస్ఐ లైంగిక వేధింపులు
ఆమదాలవలస/శ్రీకాకుళం క్రైమ్: మహిళలకు రక్షణ దొరికే చోటు అంటూ ఏదీ లేకుండాపోతోంది. ఆఖరికి పోలీస్స్టేషన్లోనూ అక్కడి మహిళా సిబ్బందికే లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. తన డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్న కిందస్థాయి మహిళా ఉద్యోగిపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కోవడం జిల్లాలో కలకలం రేపింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వైపు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి దూకుడుగా వెళ్తూ పోలీసు శాఖపై ఉన్న మచ్చలను తుడిచే ప్రయత్నం చేస్తుంటే.. కొందరు అధికారుల వైఖరి ఆ శాఖ ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నాయంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..జిల్లాకేంద్రానికి సమీపంలో ఉన్న ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఆ స్టేషన్ ఎస్హెచ్ఓ తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఓ మహిళా కానిస్టేబుల్ జిల్లా ఉన్నతాధికారికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఓ సివిల్ కేసు విషయమై బయటకు వెళ్లేటప్పుడు ఇలా ప్రవర్తించడంతో పాటు అంతకుముందు సైతం లైంగికంగా వేధించినట్లు చెప్పింది. ఇది జరిగి నాలుగు రోజులవుతోంది. ఈ విషయం బయటకు పొక్కకుండా గుట్టుగా విచారణ చేయించారు. అయితే గురువారం ఈ విషయం అందరికీ తెలిసిపోయింది.అభియోగాలు ఎన్నో..లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఆమదాలవలస ఎస్ఐపై ఇదివరకు కూడా అనేక అభియోగాలు ఉన్నాయి. న్యాయం చేయాలని స్టేషన్‌ను ఆశ్రయించిన వారిని టార్గెట్ చేస్తూ పలు సెటిల్మెంట్లు చేసినట్లు సమాచారం. ఆమదాలవలసకు బదిలీపై వచ్చిన నుంచి తన ప్రైవేటు వాహనానికి ఒక యువకుడిని డ్రైవర్‌గా మందస ప్రాంతం నుంచి తీసుకువచ్చారు. ఆయన్ని ఇక్కడ మైత్రి కానిస్టేబుల్‌గా విధుల్లో చేరినట్లు స్థానికులకు పరిచయం చేసి స్థానికంగా ఉన్న పలువురు వ్యాపారుల వద్ద కలెక్షన్లు చేసేందుకు ఉపయోగించినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ స్థానికంగా ఒక ఆర్ఎంపీ వైద్యుని దగ్గర వైద్యం పొంది మందులు రియాక్షన్ ఇవ్వడంతో మృతిచెందాడు. ఆ ఆర్ఎంపీ వైద్యుని వద్ద కూడా రూ.లక్షల్లో మొత్తా న్ని వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.కలెక్షన్ కింగ్..ఎస్ఐ ఈ స్టేషన్‌కు వచ్చి కొన్ని నెలలే అయినప్పటికీ.. ఇదే పోలీస్‌స్టేషన్‌లో గత ఎనిమిదేళ్లుగా మైత్రి మల్లేశ్వరరావు వెన్నుదన్నుగా ఉండి కలెక్షన్లు అందిస్తున్నారన్న ఆరోపణలు ప్రజల నుంచి వెలువడుతున్నాయి. ఖైనీ, గుట్కాలు, గంజాయి రవాణా చేసేవారు, పట్టణంలో కృష్ణాపురం, అక్కులపేట, గాజులకొల్లివలస కొండపైన, సుగర్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో పేకాటరాయుళ్లు మైత్రి మల్లేశ్వరరావుకు కలెక్షన్లు తీసుకువచ్చి ఇస్తుంటారని, అవి ఎస్ఐకు చేరవేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం టూటౌన్లో సైతం ఇలాంటి ఆరోపణలే ప్రజల నుంచి రావడం విశేషం.ఎస్ఐ ఏమన్నారంటే..పై విషయాలపై నిందారోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఐదు రోజుల ముందు కేసు విషయమై బయటకు వెళ్లిన మాట వాస్తవమేనని, తాను ఇదివరకు పనిచేసిన ఏ పోలీస్‌స్టేసన్‌లో ఏ మహిళ పట్లా ఇలా ప్రవర్తించలేదని, ఈమైపె కూడా అసభ్యంగా ప్రవర్తించలేదని అన్నా రు. దీనిపై ఇప్పటికే ఎంకై ్వరీలో తన తప్పేం లేదని తెలిసిందని, ఎవరో కొంతమంది గిట్టని వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఏ స్టేషన్లో ఎలాంటి కలెక్షన్లకు పాల్పడలేదని అన్నారు.ఎస్పీ ఏమన్నారంటే..ఇదే విషయమై ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వద్ద ప్రస్తావించగా తన నోటీస్‌కు మహిళా కానిస్టేబుల్ అంశం వచ్చిందని, విచారణ చేస్తున్నామన్నారు. ఎస్ఐ వివిధ స్టేషన్లలో చేస్తున్న కలెక్షన్ల విషయమై తమకు ఎలాంటి సమాచారం రాలేదని, తమ నోటీస్‌లోకి వస్తే విచారణ జరిపి రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు. -
Madhya Pradesh High Court: భారత్ మాతాకీ జై అనాల్సిందే
జబల్పూర్: మాతృదేశాన్ని మరచి శత్రుదేశాన్ని పొగిడిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు తగిన శిక్ష విధించింది. తుది తీర్పు వచ్చేదాకా నెలకు రెండు సార్లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అక్కడి జాతీయ జెండాకు 21 సార్లు సెల్యూట్ చేయాలని, రెండు సార్లు భారత్ మాతా కీ జై అని నినదించాలని ఆదేశించింది. భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫైజల్ అలియాస్ ఫైజాన్ మే నెలలో ‘పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్’ అని నినదించాడు. దీంతో ఇతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 153బీ సెక్షన్ కింద కేసునమోదుచేశారు. సమాజంలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరించాడని పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో బెయిల్ కోసం మధ్యప్రదేశ్ హైకోర్టును ఫైజల్ ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ డీకే పలివాల్ మంగళవారం విచారించారు. రూ.50వేల వ్యక్తిగత బాండు, మరో రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరిస్తూ రెండు షరతులు విధించింది. ‘‘ ప్రతి నెలా తొలి, చివరి మంగళవారాల్లో భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లు. అక్కడి భవంతిపై రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్చేసి రెండు సార్లు భారత్ మాతాకీ జై అని నినదించు. ఈ కేసులో తుదితీర్పు వచ్చేదాకా ఇలా చేయాల్సిందే. ఇలా చేస్తే అయినా నీలో దేశభక్తి కాస్తయినా పెరుగుతుంది’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ‘‘ ఇతనికి బెయిల్ ఇవ్వకండి. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడు. ఇతనిపై 14 నేరకేసులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని ప్రభుత్వ లాయర్ వాదించారు. -
ప్రభుత్వ ఆస్పత్రులపై పోలీస్ నిఘా
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రభుత్వ ఆస్పత్రు ల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి దామోదర రాజనర్సింహ నిర్ణ యం తీసుకోగా, వైద్య,ఆరోగ్యశాఖ గురు వారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సీసీ కెమెరాలను స్థానిక పోలీస్స్టేషన్లకు అనుసంధానించాలని మంత్రి ఆదేశించారు. ఆయా సీసీ కెమెరాల ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అనుమానాస్పదంగా వ్యవహరించే వారిపై నిఘా పెడతారు. 24 గంటల కంట్రోల్ రూమ్‌తోపాటు బారికేడ్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. ఆస్పత్రి ప్రధాన గేట్ల వద్ద స్క్రీనింగ్, సీసీ కెమెరాలతో చెకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో సెక్యూరిటీ, వయలెన్స్ నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ప్రజారోగ్య విభాగం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యవిద్య విభాగం పరిధిలోని బోధనాస్పత్రుల్లో అన్నింటిలో ఈ కమిటీలు ఏర్పడనున్నాయి. ఈ కమిటీలు ఆస్పత్రుల భద్రత పెంపుతోపాటు వైద్య సిబ్బంది భద్రతకు కీలకంగా ఉంటాయి. ఆస్పత్రుల్లో కొన్ని సందర్భాల్లో రోగుల బంధువులు, డాక్టర్లు, ఇతరుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకొని దాడులకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కమిటీ ఏర్పాటు ఇలా...ఆస్పత్రి సూపరింటెండెంట్ చైర్మన్ / చైర్పర్స న్గా, సేఫ్టీ ఆఫీసర్ (ఆర్ఎంవో) కన్వీనర్‌గా, స్టేషన్ హౌస్ ఆఫీసర్, నర్సింగ్ సూపరింటెండెంట్, బయో మెడికల్ ఇంజినీర్, సెక్యూరిటీ స్టాఫ్ ఇన్చార్జ్, ఐఎంఏ మెంబరు, సీనియర్ డాక్టర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, సీనియర్ అలైడ్ హెల్త్స్టాఫ్ నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. సెక్యూరిటీ, వయలెన్స్ నియంత్రణ కమిటీలు రెండు వేర్వేరుగా పనిచేస్తాయి. ఈ రెండు కమిటీలకు చైర్మన్‌గా ఒకరే వ్యవహరిస్తారు. కమిటీలు ఏం చేస్తాయంటే?ప్రతిరోజూ ఆస్పత్రులను ఆడిట్ చేస్తాయి. మూడు షిప్టులలోని భద్రతపై ఆరా తీస్తాయి. ఆస్పత్రి బయట, వార్డులలోనూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల తరహాలోనే రోగుల సహాయకులు, బంధువులకు విజిటర్ పాస్ వ్యవస్థను అందుబాటులో తీసుకొస్తారు. డాక్టర్ల డ్యూటీ రూమ్స్, రెస్ట్ రూమ్స్, టాయిలెట్స్ వద్ద అదనంగా లైటింగ్, డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బంది అందరికీ రక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాల పనితీరును చెక్ చేస్తూనే, వాటి సంఖ్య మరింత పెంచుతారు. సీసీ కెమెరాల ఫుటేజ్ స్టోరేజ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తారు. ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్, ఫైర్‌సేఫ్టీ, మెడికల్ ఎక్విప్మెంట్, సెక్యూరిటీ మేనేజ్మెంట్పై సమీక్షిస్తారు. చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుతూ, ఆస్పత్రుల సిబ్బంది భద్రతకు సెక్యూరిటీ సిబ్బందికి డ్రిల్, ట్రైనింగ్ ఇస్తారు. -
Hyderabad: ఇల్లాలిని చంపిన భర్త
మణికొండ: కుటుంబ కలహాలతో భార్యను చంపాడు ఓ భర్త. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ మాధవీనగర్ కాలనీలో మంగళవారం జరిగింది. స్థానికులు, నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన శ్రీనివాస్ సాగర్, కృష్ణవేణి (32)కి పన్నెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. బతుకుదెరువు కోసం నగరానికి వచి్చన శ్రీనివాస్ సాగర్ హైదర్షాకోట్లోని ఓ టెంట్‌హౌస్‌లో పని చేస్తున్నాడు. కుటుంబ కలహాలతో దంపతులిద్దరూ తరచూ గొడవపడేవారు. ఈ విషయంలో కృష్ణవేణి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కక్షగట్టిన శ్రీనివాస్ సాగర్.. సోమవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తలపై సుత్తితో బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కృష్ణవేణి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం పిల్లలను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్యను చంపానంటూ శ్రీనివాస్‌సాగర్ లొంగిపోయాడు. కాగా.. కృష్ణవేణి హత్య విషయం తెలుసుకుని హైదర్షాకోట్కు చేరుకున్న ఆమె బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఉన్న శ్రీనివాస్ సాగర్‌ను తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు. మూడు గంటల పాటు వారిని పోలీసులు సముదాయించి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
పోలీస్ స్టేషన్ కు ఎడ్ల బండ్లు..
-
ఛాతీపై కొట్టి, లైంగికంగా వేధించి.. ఆర్మీ ఆఫీసర్‌కు కాబోయే భార్యపై పోలీసుల దాష్టీకం
భువనేశ్వర్: న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం చేసిన దారుణ ఘటనలో విస్తుగొలిపే వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారులను ఒడిశా సర్కార్ సస్పెండ్‌చేసి కేసును సీఐడీకి అప్పగించింది. అసలేం జరిగింది? పశ్చిమ బెంగాల్లో ఆర్మీ మేజర్‌గా పనిచేసే ఒక యువ ఆర్మీ అధికారి తన కాబోయే భార్యను భువనేశ్వర్‌లో సెప్టెంబర్ 14వ తేదీన ఆమెకు చెందిన రెస్టారెంట్ వద్ద కలిశారు. తర్వాత రెస్టారెంట్ మూసేసి ఇద్దరూ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కారులో ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో కొందరు ఆకతాయిలు వీరిని కారు ఆపి వేధించారు. ఆకతాయిలపై ఫిర్యాదుచేసేందుకు వీరిద్దరూ దగ్గర్లోని భరత్పూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే అక్కడ తమకు ఘోర అవమానం జరిగిందని బాధిత మహిళ చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో గురువారం బెయిల్‌పై విడుదలయ్యాక గాయాలతో ఆమె ప్రస్తుతం భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ‘‘ఆకతాయిలపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. ఎఫ్ఐఆర్ నమోదుచేయడానికి నిరాకరించారు. పైగా బూతులు తిట్టారు. వాగ్వాదానికి దిగిన ఆర్మీ ఆఫీసర్‌ను లాకప్‌లో పడేశారు. అదేంటని ప్రశ్నించినందుకు నన్ను అక్కడి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కట్టేసి లాకప్‌లో పడేశారు. చాలా సేపటి తర్వాత ఒక పోలీసు అధికారి ఒకతను గదిలోకి వచ్చి నా ఛాతీ మీద చాలా సార్లు కొట్టాడు. తర్వాత నా ప్యాంట్ విప్పి అతని ప్యాంట్ కూడా విప్పాడు. జననాంగం చూపిస్తూ ‘‘అరవకుండా నువ్వు నోరు మూసుకుని ఉండటానికి నీకు ఎంత సమయం కావాలి?’ అని బెదిరించాడని వివరించింది. ఘటనను జాతీయ మహిళా కమిషన్ సూమోటోగా స్వీకరించింది. మూడ్రోజుల్లోగా ఘటనపై నివేదించాలని ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) వైబీ ఖురానియాను ఆదేశించింది. జ్యుడీషియల్ విచారణ జరపాలి: పటా్నయక్ ఘటనపై మాజీ సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘హేయమైన ఘటనలో జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలి. కోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు జరిపించాలి’’ అని శాసనసభలో పట్నాయక్ డిమాండ్‌చేశారు. శనివారం రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తామని బీజేడీ ప్రకటించింది. ‘‘కాషాయపార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ పోలీసులు రక్షకులుగా కంటే భక్షకులుగా తయారయ్యాయి. మహిళకు పోలీస్‌స్టేషన్‌లో ఇంతటి అవమానం జరిగితే, ఆర్మీ కెప్టెన్‌ను అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రధాని ఒక్కమాటైనా మాట్లాడరా?. బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోంది?’’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీస్భవన్ వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు ధర్నాకు దిగారు.పోలీసుల సస్పెన్షన్ ఘటనపై భారత సైన్యం సైతం స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని ఒడిశా సర్కార్‌ను కోరింది. దీంతో ఈ ఉదంతంలో సంబంధం ఉన్న భరత్పూర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జ్ దినకృష్ణ మిశ్రా, సబ్ ఇన్స్పెక్టర్లు వైశాలిని పాండా, సలిలామయీ సాహో, సాగరికా రథ్, కానిస్టేబుల్ బలరాం హన్స్డాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేసును సీఐడీకి బదిలీచేయగా సస్పెండ్ అయిన పోలీసులపై శుక్రవారం కేసు నమోదుచేశారు. ‘‘నా కూతురును దవడ కదిలిపోయేలా దారుణంగా కొట్టారు. న్యాయం కోసం వస్తే అన్యాయంగా అరెస్ట్ చేశారు’’ బాధిత మహిళ తండ్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన సైన్యంలో బ్రిగేడియర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ జంటను వేధించిన ఏడుగురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ప్రియుడి కోసం నిరసన
పెనగలూరు : తన ప్రియుడి కోసం ఓ ప్రేమికురాలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. స్థానికుల వివరాల మేరకు.. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురం గ్రామానికి చెందిన బైరిరాజు వెంకటసాయి, లావణ్య నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల లావణ్యను కాదని.. మరో అమ్మాయిని వెంకటసాయి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్థులతో కలిసి ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డిని లావణ్య కోరారు. అనంతరం వారిని పిలిపించి మాట్లాడగా.. లావణ్యతో వివాహానికి వెంకట సాయి వెనుకంజ వేశారు. స్టేషన్ గేటు బయట మండుటెండలో గ్రామస్థులతో కలిసి లావణ్య బైఠాయించి నిరసనకు దిగారు. చావైనా, బ్రతుకై నా వెంకటసాయితోనేనని భీష్మించారు. అనంతరం ఎస్సై ఇరువురు ప్రేమికుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినా ప్రయోజనం కనిపించక పోవడంతో రాజంపేట రూరల్ సీఐ వద్దకు వెళ్లాలని సూచించారు. శ్రీవెంకటసాయిపై కేసు నమోదు చేయవద్దు.. తనతో వివాహం చేయించాలని లావణ్య విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణంగా ప్రేమించిన వెంకటసాయి దక్కకుంటే విషంతాగి చనిపోతానని స్టేషన్ ఎదుట హల్చల్ చేశారు. ఎస్ఐ వివరణ ఇస్తూ నాలుగేళ్లుగా వెంకటసాయిని ప్రేమిస్తున్నానని లావణ్య తెలపడంతో ఇద్దరినీ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చానని తెలిపారు. లావణ్య రాత పూర్వకంగా అర్జీ ఇస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.