
సాక్షి,శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ ముందు క్యాబ్ డ్రైవర్‌లు ఆందోళనకు దిగారు. ఇతర రాష్ట్రాల క్యాబ్‌లను ఎయిర్‌పోర్టులోకి అనుమతించకూడదని డ్రైవర్‌లు నినాదాలు చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న క్యాబ్‌ల వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల క్యాబ్ లు నడవడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని తెలిపారు.
తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని క్యాబ్ డ్రైవర్లు పోలీసులకు తెగేసి చెబుతున్నారు. కాగా, నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు నడిచే ట్రిప్పులపైనే క్యాబ్ డ్రైవర్లు ఎక్కువగా ఆధారపడుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment