samshabad airport
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరుదైన విమానం
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం(ఆగస్టు29) అర్ధరాత్రి అరుదైన విమానం ల్యాండ్ అయింది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన విమానం సైజు భారీగా ఉండటంతో దీనిని వేల్ ఆఫ్ ది స్కైగా పిలుస్తారు. ఇది ఎయిర్‌బస్‌కు చెందిన A300-608ST బెలుగా రకం విమానం.ఇంధనం నింపుకోవడంతో పాటు సిబ్బంది విశ్రాంతి కోసం బెలుగా విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. మస్కట్ నుంచి థాయిలాండ్ వెళ్తుండగా మార్గమధ్యలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ లోహవిహంగం వాలింది. ఇది శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వెళుతుందని అధికారులు చెప్పారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టు: ఆందోళనకు దిగిన క్యాబ్ డ్రైవర్లు
సాక్షి,శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ ముందు క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఇతర రాష్ట్రాల క్యాబ్‌లను ఎయిర్‌పోర్టులోకి అనుమతించకూడదని డ్రైవర్లు నినాదాలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న క్యాబ్‌ల వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల క్యాబ్ లు నడవడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని క్యాబ్ డ్రైవర్లు పోలీసులకు తెగేసి చెబుతున్నారు. కాగా, నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు నడిచే ట్రిప్పులపైనే క్యాబ్ డ్రైవర్లు ఎక్కువగా ఆధారపడుతున్న విషయం తెలిసిందే. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో యథావిధిగా విమాన సర్వీసులు
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం(జులై 19) తలెత్తిన సాంకేతిక సమస్య ముగిసిపోయింది. విమానాలు యథావిధిగా వెళుతున్నాయి. అన్నివిమాన సర్వీసులను విమానయాన సంస్థలు పునరుద్ధరించాయి. ప్రయాణికుల ఆన్లైన్ చెక్ఇన్ సాఫీగా సాగుతున్నాయి.మైక్రోసాఫ్ట్ విండోస్, క్లౌడ్‌లో సాఫ్ట్వేర్ అప్డేట్ సమస్య రావడంతో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో ఆన్లైన్ చెక్ఇన్ ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
వార్నీ.. ఈ ఐడియాలు ఎలా వస్తాయో, చీరను ఇలా కూడా వాడచ్చా!
హైదరాబాద్: బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే కొందరు బంగారం దుకాణాలు పెడుతుంటే, ఇంకొందరు బంగారంలో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే మరికొందరు మాత్రం ఇవేవి వద్దంటూ.. బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ మార్గాన్ని ఎంచుకుని అక్రమంగా గోల్డ్ తరలిస్తూ ఇప్పటివరకు చాలా మంది ఎయిర్‌పోర్ట్‌లోనే పట్టుబడుతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఈ దారిలోప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఉన్న గిరాకీ అలాంటిది మరీ. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన లగేజీలో బంగారాన్ని దాచి దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి గోల్డ్‌ని అత్యంత తెలివిగా లిక్విడ్‌గా మార్చి చీరపై స్ప్రే చేసుకొని తీసుకొచ్చాడు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారు చీర ధర 28.01లక్షల రూపాయలు చేస్తుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దీనిపై విచారణ జరపుతున్నారు. 28 lakhs worth of gold was seized by customs at @RGIAHyd from a Dubai passenger. He concealed the gold by spraying it over clothes and packed it amidst the luggage. #gold #goldsmuggling #RGIA@hydcus @cbic_india @XpressHyderabad@NewIndianXpress pic.twitter.com/d9llirhQb3 — Priya Rathnam (@Rathnam_jurno) August 4, 2023 -
శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీఎత్తున బంగారం పట్టుబడింది. సుడాన్ జాతీయులైన 23 మంది మహిళలు సుడాన్ నుంచి వయా షార్జా మీదుగా జి9–458 విమానంలో గురువారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. లగేజీల స్కానింగ్‌లో బంగారం బయటపడడంతో అధికారులు అప్రమత్తమై మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బూట్ల అడుగున ప్రత్యేకంగా తయారు చేసిన భాగంలో పెద్దఎత్తున ఆభరణాలు సైతం బయటపడ్డాయి. మొత్తం 14 కేజీల 906 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.7.89 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నలుగురు మహిళలను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. స్మగ్లర్లకు అందించేందుకే.. సుడాన్‌కు చెందిన మహిళలందరూ క్యారియర్లుగానే బంగారం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. స్మగ్లర్లకు అక్రమంగా బంగారం చేరవేసేందుకే వీరు షార్జా మీదుగా హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. గతంలో కూడా సుడాన్‌కు చెందిన పలువురు మహిళలు అక్రమంగా బంగారం, విదేశీ నగదుతో పట్టుబడిన కేసులున్నాయి. వీరి సెల్ఫోన్ల ఆధారంగా బంగారం స్మగ్లర్ల వివరాలను తెలుసుకునేందుకు కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి మెట్రో రైల్.. త్వరలో శంకుస్థాపన..
-
బంగారం పట్టివేత
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణంగా తనిఖీ చేశారు. అతడి ప్యాంట్ లోపలి భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జేబులో 475 గ్రాముల బంగారాన్ని గుర్తిచి బయటికి తీశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 24.8 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: డ్రగ్స్ సరఫరాదారుల అరెస్ట్) -
పట్టుకున్న బంగారం ఏం చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం, వజ్రాలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడడం తెలిసిందే. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇలా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న పసిడి, వెండి, వజ్రాలు తదితర విలువైన వస్తువులను తర్వాత ఏం చేస్తారు? అనేది తెలుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీనితోపాటు మరికొన్ని ప్రశ్నలను నగరానికి చెందిన ఓ సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐ దరఖాస్తు ద్వారా అడిగితే ఏం సమాధానం వచ్చిందో తెలుసా? ‘‘మా వద్ద సమాచారం లేదు’’అని!! అది చదివి అవాక్కవడం అతని వంతైంది. పన్ను ఎగ్గొట్టే యత్నంలో.. యూఏఈ, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాల నుంచి బంగారం, ఇతర దేశాల నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ కరెన్సీని కొందరు విమానాల ద్వారా అక్రమంగా హైదరాబాద్‌కు తెస్తుంటారు. పన్ను ఎగ్గొట్టే ఉద్దేశంతో నిబంధనలకు విరుద్ధంగా వీటిని తీసుకొస్తుంటారు. అత్యంత ఆధునిక విధానాల్లో వీటిని తెస్తూ కస్టమ్స్ అధికారుల కంట పడకుండా బురిడీ కొట్టిస్తుంటారు. అయితే, బాడీ స్కానింగ్ తదితర అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చాక.. స్మగ్లర్ల పప్పులు ఉడకడం లేదు. ఇలా పట్టుబడిన బంగారం, వెండి, వజ్రాలు, కరెన్సీ, విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కస్టమ్స్ అధికారులు ఏం చేస్తారు? వీటిని వేలం వేస్తారా? లేక ఇతర శాఖలకు పంపుతారా? కోర్టుకు స్వాధీనం చేస్తారా? అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఇవే ప్రశ్నలను సంధిస్తూ నగరానికి చెందిన రాబిన్ అనే సామాజిక ఉద్యమకారుడు శంషాబాద్‌లోని హైదరాబాద్ కస్టమ్స్ ఆఫీసుకు, సనత్‌నగర్‌లోని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్‌కు సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేశాడు. చెన్నై సీబీఐ లాకర్లా అయితే ఎలా?: రాబిన్ తన ప్రశ్నలకు కస్టమ్స్ అధికారులు ఎలాంటి సమాచారం లేదని చెప్పడంపై ఆర్టీఐ దరఖాస్తుదారుడు రాబిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిత్యం కస్టమ్స్ వాళ్లు పట్టుకుంటున్న బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వివరాల గురించి ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తుంటాయని, స్వాధీనం చేసుకున్న వాటిన ఏంచేస్తారో ప్రజలకు చెప్పకపోవడం ఏంటని వాపోయాడు. అసలు ఈ వస్తువుల రికార్డు నిర్వహణ సరిగా ఉందా? అని నిలదీశాడు. నిర్వహణ సరిగా లేకపోతే ఇటీవల చెన్నైలోని సీబీఐ కస్టడీ నుంచి దాదాపు 100 కిలోల బంగారం మాయమైన తరహాలో జరిగితే ఏమేం మాయమయ్యాయనే సంగతి ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నాడు. ఈ తొమ్మిది ప్రశ్నలు సంధించాడు! (1) 2015 నుంచి 2020 వరకు కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన వస్తువుల వివరాలు (2) స్వాధీనం చేసుకున్న వస్తువులు ఏయే దేశాలవి? (3) 2015–2020 వరకు నమోదు చేసిన కేసులు (4) స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏం చేస్తారు? (5) ప్రస్తుతం హైదరాబాద్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న వస్తువుల విలువ ఎంత? (6) సీజ్ చేసిన వçస్తువులను హైదరాబాద్ కస్టమ్స్ వేలం వేస్తుందా? (7) మీరు నిర్వహించిన వేలంలో విక్రయించిన పది వస్తువులు, వాటిని కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలు (8) వేలం సమాచారం ప్రజలకు ఎలా తెలియజేస్తారు? గత పది వేలంల గురించిన వివరాలు (9) హైదరాబాద్ కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన వస్తువుల్లో ఎన్ని కస్టడీలో ఉన్నాయి? ఇతర విభాగాలు, కోర్టుకు ఎన్నింటిని అప్పగించారు? -
దుబాయ్ నుంచి ‘గర్భవతిగా’ వచ్చి..
సాక్షి, సిటీబ్యూరో: అతివలు స్మగ్లర్లకూ టార్గెట్ అవుతున్నారు. ఎన్నో విధాలుగా ఆశలు చూపి వీరిని క్యారియర్లుగా వినియోగిస్తున్నారు. కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల కన్ను మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతోనే ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లలో ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ ఏడుగురు మహిళలు పట్టుబడ్డారు. ఒక్క ఆదివారమే జిద్దా నుంచి 2.5 కేజీల బంగారాన్ని లోదుస్తుల్లో దాచి తీసుకువస్తూ నగరానికి చెందిన నలుగురు మహిళలు చిక్కారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కస్టమ్స్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పడానికే.. సాధారణంగా స్మగ్లర్లు వీరి కోసం బంగారాన్ని తీసుకుని వచ్చే క్యారియర్లు అనగానే అందరూ పురుషులు అనే భావిస్తుంటారు. దీనికి తోడు మహిళలూ.. అందునా నిండు గర్భంతో, చంకలో పసి పిల్లలతో వచ్చే వారిని అధికారులు అనుమానించం చాలా తక్కువ. ఈ కారణంగానే దుబాయ్ తదితర దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్ ఆశ చూపుతున్న బడా స్మగ్లర్లు వారికి బంగారం, మాదకద్రవ్యాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్ మాట అటుంచితే.. పసిడి తీసుకువచ్చే ఉమెన్ క్యారియర్లను ఎక్కువగా ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే గుర్తిస్తున్న స్మగ్లర్లు వారికి ఇచ్చి పంపిస్తున్నారు. మాదకద్రవ్యాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటి బిడ్డలతో వస్తున్న వారికి బంగారం తదితరాలను అప్పగించి పంపిస్తున్నారు. డీఎఫ్‌ఎమ్‌డీల వద్దా బురిడీ.. వివిధ రూపాల్లో, వివిధ పంథాల్లో ఒంటిపై ఏర్పాటు చేసుకుని బంగారం అక్రమంగా తీసుకువస్తున్న మహిళలను విమానాశ్రయాల్లోని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్‌లు (డీఎఫ్ఎండీ) కూడా కొంత వరకు పసిగట్టలేకపోతున్నాయి. ఏదైనా అక్రమరవాణా విషయం కస్టమ్స్ అధికారులు గుర్తించాలంటే పక్కా సమాచారం, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) నిఘాల కంటే డీఎఫ్‌ఎండీఏ ఎక్కువగా ఉపకరిస్తున్నాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన మెటల్ కారణంగా డీఎఫ్ఎండీలు శబ్దం చేస్తాయి. మహిళలు సాధారణంగానే కొంత వరకు నగలు ధరించి ఉంటారు. వీటి వల్లే శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం సైతం ఉంటుందనే బడా స్మగ్లర్లు మహిళల్ని వినియోగించుకుంటున్నారు. తప్పించుకుంటున్న కీలక వ్యక్తులు.. ఈ తరహాలో అక్రమ రవాణా చేస్తూ చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా.. ముఠా వెనుక ఉన్న సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళలకు చెప్పట్లేదు. కేవలం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్లి బంగారం తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని వివరిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల ముమ్మర కసరత్తు.. బడా స్మగ్లర్లు మహిళల్ని అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రతి మహిళలను ఆపడం, క్షుణ్ణంగా తనిఖీ చేయడం సాధ్యం కాదు. అలా చేస్తే అమాయకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల అధికారులు మహిళా ప్రయాణికుల జాబితాను ముందే సేకరిస్తున్నారు. వారు విదేశాలకు ఎప్పుడు వెళ్లారు.. ఆఖరిసారిగా ఎప్పుడు వచ్చారు.. ఏ వీసాపై వెళ్లారు.. వారి నేపథ్యం ఏమిటి? తదితరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం అనుమానాస్పదమైన వారిని మాత్రమే అదుపులోకి తీసుకుంటూ ఫలితాలు సాధిస్తున్నారు. ఇవిగో ఉదాహరణలు.. ♦ దుబాయ్ నుంచి ‘గర్భవతిగా’ వచ్చిన సౌతాఫ్రికా మహిళ మూసా తన కడుపులో 793 గ్రాముల కొకైన్‌తో చిక్కింది. ♦ సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలిసి వచ్చిన మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది. ♦ బ్యాంకాక్, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ♦ సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ♦ యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్ వరకు మెట్రో
శంషాబాద్: విమానాశ్రయంతో అంతర్జాతీయంగా పేరుగాంచిన శంషాబాద్‌ను అభివృద్ధిలోనూ అదే స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన శంషాబాద్ మాజీ సర్పంచ్ ఆర్.గణేష్ గుప్తా తన అనుచరగణంతో పాటు శంషాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 8 మంది కౌన్సిలర్లతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మెట్రో రైలును శంషాబాద్ వరకు పొడిగిస్తామన్నారు. శంషాబాద్ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితి అధ్వానంగా తయారైందని, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా వారి తీరు మారడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతోనే తెలంగాణ అభివృద్ధి కోసం గణేష్‌గుప్తా లాంటి నాయకులు పార్టీలో చేరుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి బాటలు పడ్డాయని టీఆర్ఎస్లో చేరిన గణేష్‌గుప్తా అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సీఎం కేసీఆర్ నాయకత్వానికి ఎదురులేదన్నారు. పార్టీలో చేరిన వారిలో కౌన్సిలర్లు జహంగీర్‌ఖాన్, అజయ్, కుమార్, భద్రు, రేఖ, విజయలక్ష్మి, నజియా, సునీత, వ్యాపారవేత్త వేణుమాధవ్‌రెడ్డి తదితరులున్నారు. -
ఎయిర్‌పోర్టు మెట్రో ఎప్పుడో?
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో ప్రాజెక్ట్‌ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించేందుకు ఏడాది క్రితం సిద్ధం చేసిన సమగ్రప్రాజెక్ట్ నివేదిక కార్యరూపం దాల్చడం లేదు. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు సుమారు 30.7 కిలోమీటర్ల మార్గంలో దాదాపు రూ.4500 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని సంకల్పించారు. కానీ నిధుల లేమి శాపంగా పరిణమిస్తోంది. మెట్రో తొలిదశ తరహాలో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం లేదా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణ సేకరణ జరిపి ఈ ప్రాజెక్ట్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినా అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం. ఎయిర్పోర్ట్ మెట్రో ఉద్దేశం ఇదే.. ♦ రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతుంది. కానీ మెట్రో రైళ్లలో కేవలం25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. ♦ ఏడాది క్రితం ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలోకి రంగంలోకి దిగి శంషాబాద్ రాయదుర్గం మార్గంలో పర్యటించి ఈ డీపీఆర్నుసిద్ధంచేశారు. ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న మెట్రో కారిడార్లు విమానాశ్రయానికి కనెక్టివిటీలేకపోవడంతో..తక్షణం విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైన విషయం విదితమే. విమానాశ్రయమార్గంలో ప్రతీఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటుచేయాలని నివేదికలో పేర్కొన్నారు. స్టేషన్లను ఔటర్‌రింగ్ రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి, అప్పా జంక్షన్, కిస్మత్పూర్, గండిగూడా చౌరస్తా, శంషాబాద్ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పీపీపీ విధానంలో ముందుకొచ్చేదెవరో...? ♦ ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో మొదటిదశ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టారు. మూడు మార్గాల్లో 72 కి.మీ ప్రాజెక్టు పూర్తికి సుమారు రూ.14 వేల కోట్ల అంచనా వ్యయం అవుతుందని తొలుత అంచనావేశారు. కానీ ఆస్తుల సేకరణ ఆలస్యం కావడం, అలైన్మెంట్ చిక్కులు, రైట్‌ఆఫ్‌వే సమస్యల కారణంగా మెట్రో అంచనా వ్యయం సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా పెరిగినట్లు సమాచారం. ♦ ఈ నేపథ్యంలో రెండోదశ మెట్రో ప్రాజెక్టునుపీపీపీ విధానంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందా అన్నది సస్పెన్స్‌గా మారింది. కాగారాయదుర్గం శంషాబాద్ ఎక్స్‌ప్రెస్‌మెట్రో కారిడార్ ఏర్పాటుకు స్పెషల్ పర్పస్ వెహికిల్(ప్రత్యేకయంత్రాంగం)ను ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం విదితమే. ♦ జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లోఈ వారంలో మెట్రో పరుగులు ♦ సికింద్రాబాద్–హైదరాబాద్ నగరాలను అనుసంధానం చేసే జేబీఎస్–ఎంజీబీఎస్ మెట్రో మార్గాన్ని ఈ వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ప్రారంభ కార్యక్రమాన్ని జేబీఎస్ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. పది కిలోమీటర్ల నిడివి గల ఈ మార్గంలో తొమ్మిది మెట్రో స్టేషన్లున్నాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే తొలిదశ మెట్రో ప్రాజెక్టు సంపూర్ణం కానుండటం విశేషం. -
రూ 6 కోట్ల విలువైన బంగారం పట్టివేత
-
రూ 6 కోట్ల విలువైన బంగారం పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని అక్రమంగా దేశాలు దాటిస్తున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ 6 కోట్ల విలువైన బంగారాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. దుబాయ్-హైదరాబాద్ విమానంలో ఈ బంగారాన్ని తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
ఏజెంట్ చేతిలో మోసపోయిన జగిత్యాల వాసి
శంషాబాద్: ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయిన ఓ బాధితుడు ఎట్టకేలకు హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. అయితే, ఇంటికి వెళ్లేందుకు కనీస చార్జీలు లేకపోవడంతో రెండురోజులు ఎయిర్‌పోర్టులోనే తిండితిప్పలు లేకుండా పడిఉన్నాడు. జగిత్యాలకు చెందిన కిష్టయ్య నెలల కిందట ఏజెంట్‌కు రూ.50వేలు చెల్లించి దుబాయికు వెళ్లాడు. అక్కడ రెండు నెలలపాటు కూలిపని చేశాడు. ఈ సమయంలో ఏజెంట్‌కు సంబంధించిన వ్యక్తులు అతడి పాస్‌పోర్టు, వీసాలతో పాటు పనిచేసిన డబ్బులు కూడా తీసుకున్నారు. పాస్‌పోర్టు, వీసా లేకుండా తిరగడంతో అక్కడి ప్రభుత్వం అతడిని మూడునెలల పాటు జైలులో ఉంచింది. అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులు అతను పనిచేసిన కంపెనీ నుంచి టికెట్ ఇప్పించి హైదరాబాద్‌కు పంపారు. రెండురోజుల కిందట శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కిష్టయ్య వద్ద ఇంటికి వెళ్లేందుకు కనీస చార్జీలు కూడా లేకపోవడంతో ఎయిర్‌పోర్టు లాన్‌లోనే కాలం వెళ్లదీసాడు. సమాచారం తెలుసుకున్న ఊట్పల్లికి చెందిన టీఆర్ఎస్ నేత రాచమల్ల సురేష్ అతడికి భోజనం పెట్టించి ప్రయాణ చార్జీలు అందజేయడంతో అతడు జగిత్యాల బయలుదేరాడు. -
ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఆర్జీఐఏ)లో డొమెస్టిక్ ప్రయాణికుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫేషియల్ రికగ్నిషన్ (ఎఫ్ఆర్) ట్రయల్ రన్ విజయవంతమైంది. ఒకసారి ముఖకవళికలు నమోదు చేసుకున్న ప్రయాణికులు.. ఆ తర్వాత ఎలాంటి తనిఖీలు లేకుండా తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించేందుకు వీలుగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. జూలైలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ట్రయల్ రన్లో భాగంగా 3,000 మంది ముఖకవళికలను నమోదు చేయాలని అధికారులు భావించారు. కానీ ఈ సంఖ్య 4,198కి చేరుకుంది. అనుకున్న దానికన్నా 40శాతం మంది ప్రయాణికులు అధికంగా తమ ముఖకవళికలను నమోదు చేసుకున్నట్లు జీఎమ్మార్ అధికారులు తెలిపారు. సినీ నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రాంచరణ్, అఖిల్, సమంత తదితరులు ఎఫ్ఆర్లో తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సైతం తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఇలా నమోదు చేకున్న వారంతా ఈ నెల 17 నాటికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు 6వేల సార్లు ప్రయాణం చేశారు. వీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్ల ద్వారా ఎలాంటి తనిఖీలు లేకుండా వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ‘డిజియాత్ర’కు మార్గం సుగమం... సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందజేసేందుకు కేంద్రం ‘డిజియాత్ర’ చేపట్టిన విషయం విదితమే. ఒకసారి తమ పూర్తి వివరాలను, ముఖకవళికలను విమానాశ్రయ భద్రతా సిబ్బంది వద్ద నమోదు చేసుకున్నవారు పదే పదే ఆ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా ఫేషియల్ రికగ్నిషన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ఆర్జీఐఏలో జూలైలో ప్రారంభించి, ప్రయాణికులు వివరాలు నమోదు చేయిచుకునేందుకు ఎయిర్‌పోర్టులోని 1, 3 డొమెస్టిక్ డిపార్చర్ గేట్ల వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎఫ్ఆర్లో భాగంగా ప్రయాణికుల గుర్తింపుకార్డు, కాంటాక్ట్ వివరాలను నమోదు చేశారు. ఆ తర్వాత ప్రయాణికుల ముఖాలను ఫొటో తీశారు. సీఐఎస్ఎఫ్ భద్రతా అధికారులు ప్రయాణికుల నుంచి సేకరించిన వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఒక యూనిక్ డిజియాత్ర ఐడీని కేటాయించారు. ఈ ఐడీలపై ఇప్పటి వరకు ప్రయాణికులు 6వేల సార్లు ప్రయాణం చేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్రం అనుమతిస్తే అందరికీ... ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు వివరాలను కేంద్ర విమానయాన శాఖ పరిశీలనకు పంపించారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో కేంద్రం అనుమతిస్తే ప్రయాణికులందరికీ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధంగా ఉంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతిరోజు సుమారు 55వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాలకు ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల మధ్య రెగ్యులర్‌గా రాకపోకలు సాగించేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరంతా ఒక్కసారి ఫేషియల్ రికగ్నీషన్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుంటే... ఆ తర్వాత ప్రయాణంలో ఎలాంటి తనిఖీలు లేకుండా హాయిగా సాగిపోవచ్చు. కేవలం హ్యాండ్‌బ్యాగ్ ద్వారా వెళ్లేవాళ్లకు ఇదిఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈసదుపాయం ప్రయాణికులందరికీఅందుబాటులోకి రావాలంటే కేంద్రంగ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. -
మస్కట్ నుంచి వచ్చి ఎయిర్‌పోర్టులో అదృశ్యం
శంషాబాద్: మస్కట్ నుంచి వచ్చిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా పెరవాలి మండలం కాపవరం గ్రామానికి చెందిన లక్ష్మీభవాని (23) ఉపాధి కోసం మస్కట్ వెళ్లింది. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఈ నెల 10న అర్ధరాత్రి మస్కట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి ఇంటికి చేరుకోలేదు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండటంతోపాటు బంధువుల ఇంటి వద్ద కూడా లేకపోవడంతో ఆమె సోదరుడు సతీశ్ సోమవారం ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
మలద్వారంలో బంగారం స్మగ్లింగ్
శంషాబాద్: అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు పెద్దమొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి ఎయిర్ ఇండియా విమానంలో ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా అతను 832 గ్రాముల బంగారాన్ని పేస్ట్‌గా మార్చి మలద్వారంలో ఉంచుకొని తీసుకొచ్చినట్లు గుర్తించారు. విదేశాల నుంచి ముంబై వచ్చిన అతను అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నట్లు తెలిపారు. ఆపరేషన్ ద్వారా అతడి నుంచి బంగారాన్ని వెలికి తీశారు. దీని విలువ రూ. 27,87,400 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు స్పైస్ జెట్ విమానంలో శనివారం రాత్రి జెడ్డా నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి 915 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.35,50,858 ఉంటుందని నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రపంచంలోనే మూడో స్థానం
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఆర్జీఐఏ) ప్రయాణికుల వృద్ధి రేటులో దూసుకెళ్తోంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలోఈ మేరకు వెల్లడైంది. గతేడాది నాటికి సుమారు 1.5 కోట్ల మందికి పైగా ప్రయాణికులతో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల జాబితాలో బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయం తొలి స్థానంలో నిలవగా.. టర్కీలోని అంటాలె అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానంలో ఉంది. ఇక శంషాబాద్ విమానాశ్రయం మూడో స్థానం దక్కించుకుంది. అదే విధంగా మన దేశంలో రెండో స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 21.9 శాతం వృద్ధి రేటు సాధించడం విశేషం. హైదరాబాద్ విమానాశ్రయం తర్వాత రష్యా ఫెడరేషన్‌లోని నుకోవ్ ఎయిర్‌పోర్టు, చైనాలోని జినాన్ ఉన్నాయి. ప్రపంచంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య డెస్టినేషన్–టూరిస్టు ప్రదేశంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రముఖ కేంద్రంగా మారుతోందని ఈ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి 29 ఎయిర్‌లైన్స్ దేశీయంగా, అంతర్జాతీయంగా 69 ప్రదేశాలకు విమానాలను నడుపుతున్నాయి. 2015–2019 మధ్య కాలంలో ఏటా సుమారు 20 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇక్కడి నుంచి ప్రతిరోజు 60వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. 500కు పైగా విమానాలు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు అందుబాటులో ఉన్నాయి. గతేడాదిలో ఇక్కడి నుంచి అత్యధిక మంది అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, థాయ్‌లాండ్‌లకు వెళ్లగా... దేశీయంగా ఇక్కడి ప్రయాణికులు ప్రధానంగా ఢిల్లీ, ముంబై, బెంగళూర్, కోల్‌కతా, చెన్నైలకు ఎక్కువగా పయనిస్తున్నారు. విజయవంతంగా ఫేస్ రికగ్నేషన్.. డిజియాత్ర పథకంలో భాగంగా జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల ప్రారంభించిన ఫేస్ రికగ్నేషన్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. దీంతో ముఖకవళికల నమోదు ఆధారంగా ప్రయాణికుల తనిఖీని సులభతరం చేసిన మొట్టమొదటి ఎయిర్‌పోర్టుగా నిలిచింది. అలాగే దేశీయ ప్రయాణికులకు ఈ–బోర్డింగ్ సదుపాయాన్ని కల్పించింది. బ్యాగ్ ట్యాగ్‌లను తొలగించిన మొట్టమొదటి విమానాశ్రయం కూడా హైదరాబాద్ కావడం గమనార్హం. కేవలం హ్యాండ్ బ్యాగేజ్‌తో వచ్చే వారి కోసం ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెకిన్ ప్రవేశపెట్టారు. -
ప్రియురాలితో తాజ్‌మహల్ చూడాలనుకుని..
శంషాబాద్:భార్య టికెట్‌పై ప్రియురాలిని తీసుకుని జాలీగా వెళ్లి తాజ్‌మహల్ చూసొద్దామనుకున్న ఆ వ్యక్తికి ఎయిర్‌పోర్టులో చుక్కెదురైంది. లింగసూర్కు చెందిన దౌల్సాబ్ అతడి పేరుతో పాటు భార్య ఫాతిమా పేరిట శంషాబాద్ ఎయి ర్పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లడానికి రెండు టికెట్లు బుక్ చేశాడు. భార్య స్థానంలో ప్రియురాలుతో కలిసి ఈ నెల 16 శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది సదరు మహిళను పేరు చెప్పమని అడగడంతో ఫాతిమా చోట మరో పేరు చెప్పడంతో సిబ్బంది అవాక్కయ్యారు. పూర్తిగా ఆరాతీయడంతో టికెట్‌కు సంబంధం లేని మహిళ ప్రయాణించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. వెంటనే సీఐఎస్ఎఫ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఎయిర్‌లైన్స్‌తో పాటు ఎయిర్‌పోర్టు అధికారులను మోసం చేయడానికి యత్నించినందుకు గాను వారిపైకేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
విమానంలో ప్రసవం..
హైదరాబాద్: రియాద్ నుంచి మనీలా వెళ్తున్న ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఫిలిప్పీన్స్ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. నొప్పులు తీవ్రమవడంతో.. మహిళ పరిస్థితిని గమనించిన పైలట్ ఆ సమయంలో సమీపంలో ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఏటీసీని సంప్రదించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు అపోలో ఆస్పత్రి వైద్య బృందానికి తెలిపారు. అప్రమత్తమైన వైద్యులు విమానం ల్యాండ్ అవ్వకముందే విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం ల్యాండ్ అయిన మరుక్షణ మే ఆమె కూర్చున్న సీటు వద్దనే మహిళకు సాధారణ కాన్పు చేశారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భద్రతా కారణాలతో విమానంలోకి సర్జికల్ బ్లేడ్లకు అనుమతి లేకపోవడంతో బొడ్డు తాడును వేరుచేయలేకపోయారు. దీంతో మెరుగైన వైద్యం కోసం తల్లి, బిడ్డలను జూబ్లీహిల్స్‌లోని అపోలో క్రెడిల్ ఆస్పత్రికి తరలించారు. చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ పి.సురేష్‌కుమార్ నేతృత్వంలోని వైద్యుల బృందం తల్లి, బిడ్డలకు చికిత్స అందించింది. ఈ ఘటన ఈ నెల 8న చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు అపోలో వైద్యులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారు. -
పురపాలనలోకి శంషాబాద్
శంషాబాద్: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుతో ప్రపంచపటంలో చోటు సంపాదించుకున్న శంషాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఆదివారం నుంచి పురపాలనలోకి అడుగులు పెట్టింది. అరవై ఏళ్ల గ్రామీణ పాలన శనివారంతో ముగిసింది. 1959 అక్టోబరు 29 శంషాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ పాలన ప్రారంభమై 2019 ఏప్రిల్ 20 నాటికి ముగిసింది. అరవై ఏళ్ల వ్యవధిలో మొత్తం 8 మంది సర్పంచ్‌లుగా పనిచేశారు. ఇందులో మామిడి దయానంద్‌రెడ్డి 1970 నుంచి 1988 వరకు రికార్డు స్థాయిలో సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత కూడా మరో దఫా 1995 నుంచి 2001 వరకు ఐదేళ్ల పాటు శంషాబాద్ సర్పంచ్‌గా పనిచేశారు. అందరోని అబాదీగా.. శంషాబాద్ గ్రామాన్ని నిజాం పాలనలో అందరోని అబాదీగా పిలిచేవారని పూర్వీకులు చెబుతుంటారు. గ్రామానికి నాలుగు వైపులా గౌనీలు (పెద్ద ఎత్తున దర్వాజాలు) ఉండి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉండేది. ఆ తర్వాత నిజాం బంధువులైన శంషాద్‌బేగం పేరిట దీనిని శంషాబాద్‌గా మార్చినట్లు చరిత్ర చెబుతోంది. చారిత్రక కట్టాడాలకు నెలవు శంషాబాద్ చారిత్ర కట్టడాలకు నెలవైన ప్రాంతం. శంషాబాద్ పాత గ్రామంలో పాత పోలీస్‌స్టేషకు సుమారు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ కట్టడానికి ఇప్పటికే ‘హెరిటేజ్’ గుర్తింపు కూడా దక్కింది. నేటికీ ఠాణాగా ఈ భవనం సేవలందిస్తోంది. పాలరాతి కొండపై వెలిసిన చోళరాజుల కాలం నాటి సిద్దులగుట్ట దేవాయలం ఎంతో ప్రసిద్ధి చెందింది. సంతానం కోసం ఇక్కడ మొక్కుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. ఇక్కడ మొక్కుకున్న వారికి సంతానం కలిగితే పిల్లలకు సిద్దప్ప, సిద్దులు, సిద్దేశ్వర్ నామకరణ చేస్తూ ఉంటారు. శంషాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలో ఈ పేర్లతో వందల సంఖ్యల్లో ఉంటారు. శంషాబాద్ మొదటి సర్పంచ్ సిద్దప్ప అయితే.. చివరి సర్పంచ్ సిద్దేశ్వర్ కావడం కూడా ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఆలయానికి సమీపంలో ఉన్న వేట బంగళా కూడా నేటికీ రాజదర్పాని ఒలకబోస్తోంది. దీంతో పాటు శంషాబాద్ (ఉందానగర్) రైల్వేస్టేషన్ పాతభవనం కూడా ఎంతో చారిత్రాత్మకమైనది. దీంతో దశాబ్దాలకాలంగా శంషాబాద్ ప్రజలకు వైద్యసేవలందించిన పాత బంగళా కూడా నాడు ‘ముసాఫిర్ ఖానా’ ప్రయాణికుల విడిది కేంద్రంగా కొనసాగిందని చరిత్రలో ఉంది. ఇలా ఎన్నో చరిత్రలకు శంషాబాద్ వేదికగా మారింది. మినీభారత్‌గా... శంషాబాద్‌కు పారిశ్రామిక వాడతో పాటు 2008 మార్చి 23 నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రారంభం కావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్క జీవనం సాగిస్తున్నారు. సమీపంలో పారిశ్రామిక వాడ సైతం ఉడడంతో శంషాబాద్ జనాభా గత పదేళ్లలో భారీగా పెరిగింది. శంషాబాద్ పట్టణంతో పాటు ప్రస్తుత మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలు కలుపుకుని సుమారు యాభైవేలకు పైగా జనాభా ఉంది. దీనికి తోడు వాణిజ్య, వ్యాపారా కేంద్రాలతో నిత్యం రాకపోకలు సాగించే వారు వేలల్లో ఉంటారు. నిబంధనలు తూచ్.. చారిత్రాత్మకమైనన శంషాబాద్‌లో అక్రమ కట్టడాలు ఎక్కువగానే వెలస్తున్నాయి. 111 జీవో నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమార్కులు వందల సంఖ్యలో భారీ నిర్మాణాలను చేపట్టారు. పట్టణంలోని ఫిరంగి నాలాను మురుగుకాల్వలా మార్చారు. ఫిరంగినాలాను ఆక్రమంచి నిర్మాణాలు చేపట్టినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో ఇక్కడ ఫిరంగి నాలా ఉనికి ప్రశ్నార్థంకగా మారుతోంది. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం వాటికి కావాల్సిన నీటి వసతి కోసం విచ్చలవిడిగా బోర్లు వేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. రహదారులపై కూడా బోర్లు వేసే దారుణ పరిస్థితులు శంషాబాద్‌లో నిత్యకత్యంగా మారుతున్నాయి. కొత్త పాలనలోకి అడుగులు పెట్టిన సందర్భంగానైనా అడ్డుకట్టపడుతుందా.. అందుకు అనుగుణంగా అధికార వ్యవస్థ పనిచేస్తుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలి కమిషనర్‌గా.. శంషాబాద్ మేజర్ గ్రామ పంచాయతీతో పాటు గొల్లపల్లి, తొండుపల్లి, ఊట్పల్లి, సాతంరాయి కొత్వాల్గూడతో కలిపిన శంషాబాద్ మున్సిపాలిటీకి తొలి కమిషనర్‌గా చాముండేశ్వరీ నియమితులయ్యారు. ఇప్పటికే ఆమె మున్సిపాలిటీలో భాగమైన గొల్లపల్లి, తొండుపల్లి, ఊట్పల్లిలో పురపాలనను ప్రారభించారు. పౌరుల భాగస్వామ్యంతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తొలి కమిషనర్ అన్నారు. -
‘గోల్డ్’ ప్యాక్
సాక్షి, సిటీబ్యూరో: స్మగ్లర్లు పసిడి అక్రమ రవాణాకు వినూత్న పద్ధతులు పాటిస్తున్నారు. బంగారాన్ని వివిధ రూపాలుగా మార్చి అధికారులను ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శంషాబాద్‌అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు వరుసగా పట్టుకుంటున్న కేసులతో ఈ విషయం అర్థమవుతోంది. ఇటీవల కాలంలో ఎక్కువగా ‘గోల్డ్ పేస్ట్’ స్మగ్లింగ్ పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం దోహా నుంచి వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి రూ.36.99 లక్షల విలువైన 1164.9 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతుండగా... ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం రూ.33 వేల వరకు ఉంది. అదే ఖతర్, దుబాయ్ తదితర దేశాల్లో రూ.26వేలకే లభిస్తోంది. దీంతో బంగారం అక్రమ రవాణా చేస్తే ఒక్కో ట్రిప్‌లో కనీసం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల లాభం ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అనేక మంది కీలక సూత్రధారులు క్యారియర్లను ఏర్పాటు చేసుకొని వ్యవస్థీకృతంగా ఈ దందా చేస్తున్నారు. తెచ్చాడిలా... కేరళకు చెందిన ఓ వ్యక్తిని అక్కడి కీలక సూత్రధారులు క్యారియర్‌గా మార్చుకున్నారు. కమీషన్ లేదా విమానం టికెట్లు ఇస్తూ తాము అందించే బంగారాన్ని భారత్‌కు చేర్చే బాధ్యతలు నిర్వర్తించే వారిని క్యారియర్లుగా పిలుస్తారు. వీరికి సూత్రధారులతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. కేవలం దళారుల సూచనల మేరకు ఈ అక్రమ రవాణా చేస్తుంటారు. వీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బంగారం ఎవరికి ఇవ్వాలనేది చెప్పరు. కేవలం క్యారియర్లను విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి ఫలానా చోట ఉండమంటారు. వీరి ఫొటోలను దళారులు వాట్సాప్ ద్వారా ఇక్కడి రిసీవర్లకు పంపుతారు. దీంతో వీరిని గుర్తించే రిసీవర్లు బంగారం తీసుకొని టిప్స్ ఇస్తుంటారు. కేజీకి పైగా బంగారం ఖరీదు చేసిన స్మగ్లర్లు దోహాలో ఉన్న కొన్ని ప్రత్యేక దుకాణాలకు అందించారు. దాన్న పౌడర్‌గా ఆపై పేస్ట్‌గా మార్చిన ఆ దుకాణదారులు ప్రత్యేకంగా ప్యాక్ చేసి అందించారు. దీన్ని ఓ ప్రత్యేకమైన వస్త్ర సంచిలో ఉంచిన కేరళవాసి లోదుస్తుల్లో దాచుకొని తీసుకొచ్చాడు. ఆదివారం ఉదయం ఇండిగో విమానంలో శంషాబాద్‌కు వచ్చిన ఇతగాడు ‘గ్రీన్ చానెల్’ ద్వారా బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరి వద్ద అయితే ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఉండవో వారు ఈ చానెల్లో బయటకు వెళ్లిపోతారు. అలాంటి వస్తువులు, బంగారం తీసుకొచ్చిన వాళ్లు రెడ్ చానెల్లోకి వెళ్లి ఆయా వస్తువుల్ని డిక్లేర్ చేయడంతో పాటు పన్ను చెల్లించి వస్తారు. గ్రీన్ చానెల్లో బయటకు వస్తున్న కేరళ వాసి వ్యవహారాన్ని శంషాబాద్ కస్టమ్స్ అధికారులు అనుమానించారు. ఆపి తనిఖీ చేయగా లోదుస్తుల్లో దాచిన సంచిలో ఉన్న 1900 గ్రాముల పేస్ట్ దొరికింది. దీన్ని ప్రాసెసింగ్ చేసిన అధికారులు 1164.9 గ్రాముల బంగారంగా మార్చారు. ఇతడు ఎవరి కోసం ఈ బంగారం తీసుకొచ్చాడు? దీని వెనుక ఎవరు ఉన్నారు? తదితర అంశాలను కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. -
35 కిలోమీటర్లు...30 నిమిషాలు!
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి–శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య మార్గం... అనునిత్యం రద్దీగా ఉండే ఈ రూట్లో వాహనాల సరాసరి వేగం 25కి.మీ. మించదు... మధ్యాహ్నం వేళల్లో ఆ వేగం 20 దాటదు. మరోపక్క నగరంలో వాహనాల సరాసరి వేగం గంటకు 27.1 కిమీ మాత్రమే. అయితే సోమవారం ఆ మార్గంలో ‘ప్రయాణించాల్సిన’ గుండె (లైవ్ ఆర్గాన్) కోసం నగర ట్రాఫిక్ పోలీసులు ‘గ్రీన్ ఛానల్’ ఇచ్చారు. ఫలితంగా 35 కిమీ మార్గాన్ని అంబులెన్స్ కేవలం 30 నిమిషాల్లో అధిగమించింది. అంటే... గంటకు 60 కిమీ వేగంతో ప్రయాణించింది. అంబులెన్స్‌కు పైలెట్‌గా వాహనంలో వెళ్లిన బృందం మొదలు ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పని చేయడంతోనే ఇది సాధ్యమైంది. మధ్యాహ్నం మొదలైన ‘ఆపరేషన్’... నగర ట్రాఫిక్ విభాగంలోని అన్ని మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్లు సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మోగాయి. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్‌కు గురైన నిజామాబాద్ వాసి వంశీకృష్ణ (19) నుంచి సేకరించిన గుండెను శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి చేర్చాల్సి ఉందని సందేశం వినిపించింది. చెన్నైలోని సదరు ఆస్పత్రిలో ఈ గుండెను రిసీవ్ చేసుకోవాల్సిన రోగికి ఆపరేషన్ సైతం ప్రారంభమైనట్లు వర్తమానం అందింది. ఈ లైవ్ ఆర్గాన్‌తో కూడిన అంబులెన్స్ మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరనున్నట్లు ట్రాఫిక్ పోలీసుల చేతుల్లో ఉన్న వాకీటాకీల్లో సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అన్నిస్థాయిల అధికారులు రంగంలోకి దిగారు. 12 గంటల నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్లలో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు చేపట్టారు. ‘సెంటర్’ నుంచి నిరంతర పర్యవేక్షణ... డోనర్ ఇచ్చిన గుండెతో కూడిన బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్ విమానాశ్రయం వరకు ఉన్న 35 కిమీ దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ రూట్ సైబరాబాద్ పరిధిలోనూ కొంత ఉండటంతో అక్కడి అధికారులతోనూ సమన్వయం చేసుకున్నారు. మహంకాళి ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లడానికి సిద్ధం కాగా, మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో ఉండే అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రయాణించిన మార్గం ఇలా... సరిగ్గా మధ్యాహ్నం 12.33 గంటలకు ‘లైవ్ ఆర్గాన్ బాక్స్’తో కూడిన అంబులెన్స్ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి చౌరస్తా, లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నం, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే మీదుగా కేవలం 30 నిమిషాల్లో సరిగ్గా మధ్యాహ్న 1.03 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంతో రికార్డు సమయంలో గమ్యం చేరుకోవడం సాధ్యమైంది. ఈ కాస్సేపు అంబులెన్స్ సైరన్‌కు పోటీగా ట్రాఫిక్ పోలీసులు వైర్లెస్ సెట్స్ నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న విమానంలో ఈ లైవ్ ఆర్గాన్ చెన్నై వెళ్లిపోయింది. ట్రాఫిక్ పోలీసుల సహకారంతోనే ఈ తరలింపు సాధ్యమైందంటూ యశోద ఆస్పత్రి యాజమాన్యం ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపింది. -
వార్ విత్ వింగ్స్
సాక్షి, సిటీబ్యూరో /శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పక్షుల బెడద పట్టుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఉపద్రవాలు చోటుచేసుకోలేదు.. కానీ చుట్టుపక్కల ఉన్న జనావాసాలు, చెరువులు, అపరిశుభ్రమైన పరిసరాల కారణంగా విమానాశ్రయానికి పక్షుల తాకిడి పెరిగింది. ఇటీవల రియాద్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎస్వీ 744 విమానం లాండ్ అవుతున్న సమయంలో పక్షి ఢీకొని ఏకంగా ముందు భాగానికి సొట్ట ఏర్పడడం పక్షుల బెడద తీవ్రతకు నిదర్శనంగా మారింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం జరుగకపోయినా పక్షుల సమస్యను ఎత్తి చూపుతోంది. ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించే జాతీయ, అంతర్జాతీయ విమానాలతో నిత్యం రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టులో పక్షులు సంచరించకుండా, క్రిమికీటకాలు,దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతూనే ఉన్నారు. విమానాశ్రయం చుట్టూ నెలకొన్న వాతావరణం వల్ల పక్షులు యధేచ్చగా సంచరిస్తున్నాయి. మరోవైపు కొద్ది రోజులుగా చుటుపక్కల పల్లెల్లో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా పెరిగిన చెత్త, వ్యర్ధ పదార్ధాల వల్ల పక్షుల సంచారం కూడా పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ఆశ్రయిస్తున్నాయి.... సుమారు 5 వేల ఎకరాలలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరించింది. రెండు రన్‌వేలతో ఉన్న సువిశాలమైన ఎయిర్‌పోర్టులో ప్రతి రోజూ 400 విమానాలు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 75 వేలమంది వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు. ఎయిర్‌పోర్టు చుట్టూ 7, 8 కిలోమీటర్ల దూరంలో నివాసప్రాంతాలు ఉన్నాయి. శంషాబాద్ టౌన్‌తో పాటు, మామిడిపల్లి, రషీద్‌గూడ, గొల్లపల్లి, తొండపల్లి, తదితర గ్రామాల్లోని అడవులు,నివాస సముదాయాలు, చెరువులు, చిన్న చిన్న నీటి కుంటలు కొంగలు, కాకులు, డేగలు, తదితర పక్షులకు ఆలవాలంగా ఉన్నాయి. క్రిమి కీటకాలను ఏరుకొనేందుకు, పల్లెల్లో అన్నం, ఇతర వ్యర్థపదార్ధాలను ఆరగించేందుకు కాకులు వచ్చి వాలుతున్నాయి. మరోవైపు గొల్లపల్లి, మామిడిపల్లి,తొండుపల్లిలోని చెరువులతో పాటు, విమానాశ్రయంలోను జలవనరుల సంరక్షణ కోసం కొత్తగా ఒక చెరువును ఏర్పాటు చేశారు. కొంగలే కాకుండా ఇతర పక్షులు కూడా తరచుగా ఈ చెరువుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో పక్షుల సంచారం సర్వసాధారణమైపోయింది.ఇటీవల కాలంలో పావురాలు కూడా బాగా సంచరిస్తున్నట్లు విమానాశ్రయ సిబ్బంది ఒకరు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఇలా విమానాశ్రయంలోకి వచ్చిన పావురాళ్లను పట్టుకొని దూరంగా వదిలి వచ్చారు. పేరుకుపోతున్న చెత్త చుట్టుపక్కల పల్లెల్లో చెత్త వేసేందుకు ఎలాంటి డంపింగ్ యార్డులు లేవు. దీంతో ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేస్తున్నారు. దీన్ని తొలగించి కాల్చి వేయాల్సిన పారిశుధ్య సిబ్బంది 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో అన్ని గ్రామాల్లో, చెత్త, వ్యర్థపదార్ధాల నిల్వలు గుట్టలుగా పేరుకుపోయాయి. విమానాశ్రయం రక్షణ కోసం కేవలం విమానాశ్రయంలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లోనూ రక్షణ చర్యలు చేపడతారు.అయితే ఈ సమ్మె కారణంగా పరిశుభ్రతకు ఆటంకం ఏర్పడింది. దీంతో పక్షులు, ఇతర క్రిమికీటకాల సంచారం బాగా పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.‘‘ ‘‘ఒక్క పక్షులపైన మాత్రమే కాదు. దోమలు, బొద్దింకలు, ఇతర క్రిమి కీటకాలు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించకుండా ఉండేందుకు నిరంతరం అమ్రపత్తత పాటిస్తాం. ఎయిర్‌పోర్టుతో పాటు చుట్టుక్కల గ్రామాల్లోను పరిశుభ్రమైన పరిసరాల పరిరక్షణ ఎంతో ముఖ్యం.ఎందుకంటే జాతీయ,అంతర్జాతీయ ప్రయాణికుల భద్రత, ఆరోగ్యం ఈ పరిసరాలపైనే ఆధారపడి ఉంది...’’ అని విమానాశ్రయంలో పెస్ట్ కంట్రోల్ విధులను నిర్వహిస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పారు. వైద్య ఆరోగ్య విభాగం అధికారులు వారానికి ఒకసారి దోమల నివారణపైన సర్వేలెన్స్ నిర్వహించి డిఫినోథిన్ స్ప్రే చేస్తారు. పక్షి తాకితే... ఒక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే కాదు. అన్ని చోట్ల ఇలాంటి పక్షుల సంచారం సహజమే. వీటిని అరికట్టడం ఒక్కటే పరిష్కారం. అందుకోసం విమానాశ్రయంలో తరచుగా బాణాసంచా పేల్చడం ద్వారా పెద్ద పెద్ద శబ్దాలు చేయడం ద్వారా పక్షులను పారదోలుతారు. శంషాబాద్‌లోనూ ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా కొనసాగుతూనే ఉంది.పక్షుల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరుగలేదు. కానీ గంటకు 525 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకొచ్చే విమానానికి ఏ చిన్న పక్షి తాకినా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. అదీ ఒకవేళ విమానం రెక్కల కింద ఉన్న ఇంజిన్లోకి పక్షి వెళ్లినపుడు ఒక్కోసారి ఇంజన్ ఆగిపోతుంది. అటువంటి సమయంలో విమానాన్ని వెంటనే దగ్గరలోఉన్న విమానాశ్రయంలో దింపి మరమ్మతు చేస్తారు. ఒక్కోసారి దానికి రెండు వైపులా ఉండే ఇంజన్లలో మంటలు తలెత్తవచ్చు.అప్పుడు ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. -
మూడో స్థానంలో ‘శంషాబాద్’!
సాక్షి, సిటీబ్యూరో: బ్యాగేజ్ లిఫ్టింగ్... ఒకప్పుడు విమాన ప్రయాణికులను తీవ్రస్థాయిలో కలవరపెట్టిన సమస్య. విమానం ఎక్కేప్పుడు తమ బ్యాగేజ్‌ను ఎయిర్‌లైన్స్ సిబ్బందికి అప్పగించే ప్రయాణికులు తిరిగి దిగిన తర్వాత తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో బ్యాగేజ్లు.. లేదా వాటిలో ఉండే వస్తువులు మాయమయ్యేవి. ఇటీవల కాలంలో విమానాశ్రయాల్లో పెరిగిన సీసీ కెమెరాల పర్యవేక్షణతో ఈ సమస్య చాలావరకు తీరింది. అయినప్పటికీ ఇప్పుడూ బ్యాగేజ్ లిఫ్టింగ్ కేసులు నమోదవుతున్నాయని ఎయిర్‌పోర్ట్స్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సంస్థ వెల్లడించింది. ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో వాటికి సంబంధించిన గణాంకాలు, కారణాలను సైతం నివేదించింది. 2012 నుంచి 2015 వరకు ఈ నివేదిక ప్రకారం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం బ్యాగేజ్ లిఫ్టింగ్ కేసుల్లో దేశంలో మూడో స్థానంలో ఉంది. ఈ నాలుగేళ్లలో 34 కేసులు నమోదయ్యాయి. దేశంలోని ఇతర మెట్రోల విషయానికి వస్తే 144 కేసులతో ఢిల్లీ ప్రథమ, 40 కేసులతో ముంబై రెండు, మూడు కేసులతో బెంగళూరు నాలుగు, మూడు కేసులతో చెన్నై ఐదో స్థానాల్లో నిలిచాయి. ఒకప్పుడు ఈ కేసుల సంఖ్య వందల్లో ఉండేదని, ఏఏఐతో పాటు విమానాశ్రయాలకు భద్రత కల్పించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తీసుకుంటున్న చర్యల కారణంగా గణనీయంగా తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. విమానాశ్రయాల్లో ఎక్కడిక్కడ సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, బ్యాగేజ్ల వ్యవహారాలు చూసే వారిపై నిఘా పెంచడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించడం ఫలితాలు ఇచ్చిందని ఏఏఐ పేర్కొంది. అయితే ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో రాకపోకలు సాగించే విమానాలతో పాటు బ్యాగేజ్ సంఖ్య భారీగా ఉండటం, వీటి నిర్వహణకు ఒకటి కంటే ఎక్కువ సంస్థలను వినియోగిస్తుండటం ప్రధాన కారణాలుగా గుర్తించినట్లు ఏఏఐ స్పష్టం చేసింది. బ్యాగేజ్ లిఫ్టింగ్ కేసులను పూర్తిగా రూపుమాపడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా విమానాశ్రయాల్లో బ్యాగేజ్ల నిర్వహణ ఒకే సంస్థ చేపట్టేలా చర్యలు తీసుకోనుంది. ఈ సంస్థలో పని చేసే వారిపై నిత్యం కన్నేసి ఉంచేలా ఆదేశాలు జారీ చేయనుంది. సాధారణంగా బ్యాగేజ్ నిర్వహణ పని చేసే వారు తమతో తీసుకువెళ్ల సొంత వస్తువుల్లోనే బ్యాగేజ్ నుంచి తస్కరించిన వాటిని పెట్టుకుని పట్టుకుపోతున్నట్లు గుర్తించామన్న ఏఏఐ... ఆయా ఉద్యోగులు విమానాశ్రయం లోపలకు సొంత బ్యాగులు వంటివి తీసుకువెళ్లకుండా కట్టడిచేసే అంశాన్నీ పరిశీలిస్తున్నామని ఏఏఐ పేర్కొంది.