శంషాబాద్ లో రెండున్నర కిలోల బంగారం స్వాధీనం | two and half kilo grams gold seized at samshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ లో రెండున్నర కిలోల బంగారం స్వాధీనం

Published Tue, Mar 11 2014 11:35 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

two and half kilo grams gold seized at samshabad airport

హైదరాబాద్:ఈ మధ్య కాలంలో అక్రమ బంగారం రవాణాతో పట్టుబడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కిలోల మోతాదులో బంగారాన్ని గల్ఫ్ దేశాలను తీసుకువస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతున్నఘటనలు అధికసంఖ్యలోనే ఉన్నాయి. దుబాయ్ నుంచి వస్తున్న కొంతమంది ప్రయాణికులు భారీ స్థాయిలో బంగారాన్నితీసుకువస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులకు పట్టుబడిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన కొంతమంది ప్రయాణికుల నుంచి రెండున్నర కిలోల  బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

దీనికి సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ఆరంభించారు. వీరంతా విశాఖకు చెందిన వారిగా అధికారులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement