
సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న మహిళను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్సులు, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఒంటరిగా కనిపించిన మహిళలకు మత్తు మందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి సిరివెళ్లి రమణమ్మ చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు.
మల్కాజ్‌గిరి పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు దగ్గర నుంచి 32 తులాల బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళ ఏపీ, తెలంగాణలలో 25కు పైగా కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మహిళను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment