Women thief
-
కి‘లేడీ’ల హల్చల్: వృద్ధులను కత్తితో బెదిరించి భారీ దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు మహిళలు దోపిడీకి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కత్తితో బెదిరించి రూ.6 లక్షల నగదుతో ఉడాయించారు. ఈ సంఘటన హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువతుల దాడిలో వృద్ధురాలు గాయపడింది. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే వచ్చి పరామర్శించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉస్మాన్‌పురాలో ఇద్దరు మహిళలు బురఖాలో వచ్చి వృద్ధురాలి (85)ని గొంతుపై కత్తి పెట్టి బెదిరించారు. నగదు, నగలు కావాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె ప్రాణభయంతో గజగజ వణికింది. అనంతరం ఆ యువతులు బెదిరించి ఆమె నుంచి రూ.6 లక్షల నగదుతో పాటు ఒంటిపై ఉన్న బంగారు నగలు దోచుకుని పరారయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. అయితే ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లోనే ఉన్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే అహ్మద్ బలాల వృద్ధ దంపతులను పరామర్శించారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లింట విషాదం.. తమ్ముడి పెళ్లికొచ్చి ఎన్నారై కరోనాకు బలి చదవండి: 577 మంది టీచర్లు కరోనాకు బలి ఈ వృద్ధ దంపతులను బెదిరించిన యువతులు -
బంగారు వ్యాపారికి మస్కాకొట్టిన కిలేడీ
నెల్లూరు(క్రైమ్): ఓ మహిళ బంగారు వ్యాపారిని మస్కా కొట్టి నెక్లెస్ తస్కరించి అక్కడ నుంచి జారుకుంది. సీసీ పుటేజ్‌ల ఆధారంగా కిలేడిని బాధిత వ్యాపారి గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తుండడంతో బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో హడావుడిగా కేసు నమోదు చేశారు. వివరాలు.. నెల్లూరు నగరంలోని కాపువీధికి చెందిన లలిత్ బంగారు వ్యాపారి. ఆయన అదే ప్రాంతంలో ఫైనాన్స్ అండ్ పాన్‌బ్రోకర్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ మహిళ బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు దుకాణానికి వచ్చింది. ఓ నెక్లెస్‌ను సెలక్ట్ చేసి తన కుమారుడు వచ్చి నగదు చెల్లిస్తాడని అక్కడే కూర్చొంది. దీంతో వ్యాపారి ఆ నెక్లెస్‌ను ప్యాక్ చేసి సిద్ధంగా ఉంచాడు. ఈ నేపథ్యంలో ఆ దుకాణానికి కొంతమంది వచ్చి బంగారు ఆ భరణాలు పరిశీలిస్తుండగా ఆమె కూడా ఆభరణాలు చూస్తున్నట్లు నటించి సుమారు రూ.1.59 లక్షల విలువ చేసే 53 గ్రాముల బంగారు నెక్లెస్‌ను కాజేసి దుస్తుల్లో దాచేసింది. అనంతరం అక్కడి నుంచి చల్లగా జారుకుంది. దుకాణంలో కొనుగోలుదారులందరూ వెళ్లిపోయిన అనంతరం యజమాని లలిత్ ఆభరణాలు సరిచూసుకోగా 53 గ్రాముల బంగారు నెక్లెస్ కనిపించలేదు. దీంతో లలిత్ తన దుకాణంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా తొలుత వచ్చిన మహిళ బంగారు ఆభరణాన్ని తస్కరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ఆమె గురించి ఆరా తీయగా కుక్కలగుంటకు చెందిన మహిళ అని తేలింది. ఆమె తన స్నేహితుడి ద్వారా దానిని కరిగించి మరో వ్యక్తికి విక్రయించినట్లు తెలిసింది. ఈ విషయంపై బాధితులు బుధవారమే సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సదరు పోలీసు సిబ్బంది కేసు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కించినట్లు తెలిసింది. దీంతో బాధితులు గురువారం ఈ విషయాన్ని స్పెషల్ బ్రాంచ్ అధికారులకు తెలియజేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సంతపేట పోలీసులతో మాట్లాడడంతో గురువారం రాత్రి çబాధితుల నుంచి మరోసారి లిఖితపూర్వక ఫిర్యాదు తీసుకుని హæడావుడిగా కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు కిలేడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్
వరంగల్ క్రైం: ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకోని బ్యాగుల్లోని బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్‌రాజ్ తెలిపారు. వారి నుంచి 30 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీసీఎస్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆం«ధ్రప్రదేశ్ రాష్త్రం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన గండికోటి నూకాలమ్మ అలియాస్ ఉయ్యాల కుమారి, ఉయ్యాల మరియమ్మ అలియాస్ బుజ్జిలు స్నేహితులు. జల్సాగా బతకాలను ఆలోచనతో వారు దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఈ మేరకు వారు ఇద్దరు మరొక మహిళ కడమ్మతో కలిసి దొంగతనాలు చేశారు. 2013 నుంచి 2017 వరకు విజయవాడ, గుంటూరుల్లో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డారు. 2017లో పోలీసులకు దొరకడంతో ఒక సారి జైలుకు కూడా వెళ్లారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 1న ఆటోలో ప్రయాణిస్తున్న ఖమ్మం ప్రాంతానికి చెందిన తంగిళపల్లి కరుణ బ్యాగులో బంగారు ఆభరణాలను వారు చోరీ చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో నిందితులు తిరగుతున్నట్లు వరంగల్ ఏసీపీ నర్సయ్యకు సమాచారం రావడంతో ఇద్దరు మహిళలను అధుపులోకి తీసుకున్నారు. వారు నేరాన్ని అంగీకరించారు. దీంతో మరియమ్మ, నూకలమ్మలను అరెస్ట్ చేశారు. కడమ్మ పరారీలో ఉంది. నిందితులను సకాలంలో గుర్తించిన ఏసీపీ నర్సయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్‌రాజ్, ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్సై అశోక్‌కుమార్, సీసీఎస్ ఏఎస్సై ఫర్వీన్, హెడ్‌కానిస్టేబుళ్లు రవికుమార్, జంపయ్య, కానిస్టేబుళ్లు మహ్మద్‌అలీ, రవీందర్‌రెడ్డి, మీర్ మహ్మద్ అలీ, సంతోష్, నరేష్, రాంరెడ్డి, కుమారస్వామి, మహిళ కానిస్టేబుల్ కవితను వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ అభినందించారు. -
కి‘లేడీ’ అరెస్ట్
విశాఖపట్నం : అమె టిప్‌టాప్‌గా తయారవుతుంది. బ్యూటీపార్లర్‌లో పనిచేస్తున్నానని చెబుతుంది. మగవాళ్లను లిఫ్ట్ అడిగి, పరిచయం పెంచుకుంటుంది. తరువాత దొంగతనాలకు పాల్పడుతుంది. అటువంటి కి‘లేడీ’ని ఎంవీపీ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనకాపల్లికి చెందిన గౌరి నగరంలోని సీతంపేట జీవీఎంసీ పాఠశాల సమీపంలో నివసిస్తుంది. ఆమె గతంలో భర్తతో గొడవపడి విడాకులు తీసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. విలాసాలకు అలవాటు పడిన గౌరి దొంగతనాలకు పాల్పడుతోందని పోలీసుల విచారణలో తేలింది. శివాజీపాలెంలో నివసిస్తున్న పూసపాటి గోపాలకృష్ణ వర్మ (60) గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. అతను కారులో వెళ్తుండగా మార్గమధ్యలో గుత్తుర్తి గౌరి (29) లిఫ్టు అడిగింది. దీంతో లిఫ్టు ఇచ్చిన వర్మ ఆమెతో కలిసి ఎంవీపీ కాలనీలో గల ఒక రెస్టారెంట్‌కి వెళ్లారు. కొంతసేపటికి వర్మ వాష్‌రూమ్‌కి వెళ్లగా అక్కడే ఉన్న కారు తాళాలు తీసుకుని గౌరి కారుతో సహా పరారైంది. దీంతో వర్మ ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంవీపీ క్రైం ఎస్ఐ సూరిబాబు పర్యవేక్షణలో టి.తులసీభాస్కర్, పి.నరేష్కుమార్, పీడీవీ ప్రసాద్ కలిసి గౌరిని అరెస్టు చేసి కారు స్వాధీనం చేసుకున్నారు. ద్వారకాజోన్ క్రైం సీఐ వి.బాబ్జీరావు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారంతో ఉడాయించిన మాయలేడి
రామవరప్పాడు: పూజ పేరుతో మోసగించి బంగా రంతో ఓ మాయలేడి పరారైన ఘటన విజయ వాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో గురువారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. ప్రసాదంపాడులో మాజీ వార్డు సభ్యుడు విజ్జి రామారావు తన భార్య లక్ష్మి, కూతురు గౌతమితో నివాసం ఉంటున్నాడు. గుర్తుతెలియని మహిళ సోది చెబుతానంటూ విజ్జి రామారావు ఇంటికి వచ్చింది. మీ ఇంట్లో కీడు జరుగుతుందని, పూజ చేస్తే పరిహారం అవుతుందని రామారావు భార్య లక్ష్మిని నమ్మించింది. ఇటీవల ఇంటి పెద్ద విజ్జి చిన్నారావు అనారోగ్యంతో మృతి చెందడంతో సులువుగా ఆమె మాట లను నమ్మారు. పూజలో బంగారు వస్తువులు ఉంచాలంటూ నమ్మించి లక్ష్మి, గౌతమి, రామారావు తల్లి శాంతమ్మ ఒం టిపై ఉన్న మొత్తం (సుమారు 5 కాసుల) బంగా రం ఇవ్వాలని కోరింది. ఆమె మాటలు నమ్మిన వారంతా బంగారం తీసి ఇచ్చారు. బంగారాన్ని ఒక బాక్సులో ఉంచి దానికి దారం కట్టి బీరువాలో ఉంచి గంట తర్వాత తీసుకోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె మాటలపై అనుమా నం వచ్చి బాక్సును తీసి చూడగా బంగారం లేదు. ఇంతలో ఆమెను పట్టుకోండంటూ అరుచుకుం టూ రోడ్డుపైకి వెళ్లేసరికి అప్పటికే సిద్ధంగా ఉన్న ఆటో ఎక్కి పరారైంది. అయితే, పూజ జరిగే సమయంలోనే అనుమానం వచ్చిన రామారావు కూతురు గౌతమి మాయలేడిని సెల్ఫోన్లో ఫొటో తీసింది. -
దోపిడీ చేసి వేషం మార్చేస్తుంది..
ప్రొద్దుటూరు క్రైం : మాటల్లో పెట్టి ఒక మాయ లేడీ పట్టపగలే ఇంట్లోని బంగారు నగలను దోచుకొని వెళ్లిన సంఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. రిటైర్డ్ లెక్చరర్ బాలచంద్రారెడ్డి వైఎంఆర్ కాలనీలోని సాయిబాబా ఆలయం సమీపంలో నివాసం ఉంటున్నారు. వారి ఇంటి పైభాగంలో బ్యాంకు ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. గురువారం గుర్తు తెలియని ఓ మహిళ బాలచంద్రారెడ్డి ఇంటి బయట ఉండగా ఆయన భార్య శంకరమ్మ వెళ్లి ఎవరు కావాలమ్మ అని అడగ్గా.. బ్యాంకు వాళ్ల కోసం వచ్చానని చెప్పింది. దీంతో శంకరమ్మ పని చేసుకోవడానికి లోపలి గదిలోకి వెళ్లి పోయింది. ఆమె ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలోనే బయట ఉన్న కిలాడీ మహిళ ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న 11 తులాల బంగారు నగలను దోచుకుంది. లోపలి గదిలో నుంచి శంకరమ్మ బయటికి రాగా అప్పటికే ఆమె ఇంట్లో నుంచి వేగంగా ప్రధాన రహదారిలోకి వెళ్లింది. దారిలో స్కూటీలో వెళుతున్న ఓ వ్యక్తిని ఆపి ఆస్పత్రికి వెళ్లాలని లిఫ్ట్ అడిగి కోర్టు సమీపంలో దిగింది. అప్పటి వరకు ఎర్ర చీరెలో ఉన్న ఆమె కోర్టు కాంపౌండ్‌లోకి వెళ్లి మరో డ్రస్‌తో బయటికి వచ్చింది. వెంటనే మరో వ్యక్తి బైక్‌లో రాగా అతని వెంట వెళ్లి పోయింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని విచారించిన పోలీసులు ముందుగా స్కూటీలో లిఫ్ట్‌లో ఇచ్చిన వ్యక్తిని పోలీసులు గుర్తించి విచారించారు. ఈ విచారణలో అతను ఆమె తనకు తెలియదని, అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలంటే లిఫ్ట్ ఇచ్చానని పేర్కొన్నాడు. ఆమెను చూస్తే గుర్తు పడతానని పోలీసులకు తెలిపాడు. ఆమెతో పాటు బైక్‌లో వెళ్లిన వ్యక్తి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇద్దరు కలిసే చోరీకి ప్రణాళిక రూపొందించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ పుటేజీల్లో రికార్డు అయిన వారి ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. నిందితుల ఆచూకి తెలిపిన వారికి తగిన పారితోషికం అందజేస్తామని త్రీ టౌన్ సీఐ జయానాయక్, ఎస్ఐ కృష్ణంరాజు నాయక్ తెలిపారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా వీధుల్లో తిరుగుతుంటే 91211 00589, 91211 00592 నంబర్లకు ఫోన్ చేయాలని వారు కోరారు. -
కిలేడీ శశికళ వసూళ్ల దందా
గౌరిబిదనూరు: తాలూకా లోని గోటకనాపురానికి చెందిన శశికళ (28) అనే ఘరానా మహిళ వసూళ్లకు పాల్పడుతూ పోలీసులకు దొరికిపోయింది. సుమారు నలుగురితో కలిసి ముఠాగా ఏర్పడి బాగలుకోటెలో డబ్బును వసూలు చేస్తూ ఉండేవారు. గత శనివారం అక్కడి 45వ సెక్టారులోని వృత్తి విద్యా విద్యార్థినుల హాస్టల్‌కు వెళ్లి తామొక టీవీ చానెల్ విలేకరులమని చెప్పి, డబ్బు ఇవ్వాలని బెదిరించారు. ఈ విషయం తెలుసుకొన్న మహిళా పోలీసులు శశికళతో పాటు వీరేశ్ లమాణి, సిద్దు కళ్ళమని, రామనగౌడ, న్యామగౌడర్ అనే అనుచరులను అరెస్టు చేయడం జరిగింది. వీరు హాస్టలు సిబ్బందిని బెదిరించినట్లు సిసి కెమెరాలో నమోదైంది. -
ఒంటరి మహిళలే టార్గెట్
సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న మహిళను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్సులు, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఒంటరిగా కనిపించిన మహిళలకు మత్తు మందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి సిరివెళ్లి రమణమ్మ చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. మల్కాజ్గిరి పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు దగ్గర నుంచి 32 తులాల బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళ ఏపీ, తెలంగాణలలో 25కు పైగా కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మహిళను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. -
దొంగ ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి
-
దొంగ ఆచూకీ తెలపండి.. చోరీ వీడియో వైరల్
బొగోటా : మెక్డోనాల్డ్స్లోకి దూరి చోరీచేసిన ఓ మహిళ ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అంటూ కొలంబియా హోవార్డ్ కౌంటీ పోలీసులు గురువారం ప్రకటించారు. మహిళ చోరీకి పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నవంబర్ 5న అర్థరాత్రి వేళ మెక్‌డోనాల్డ్స్ లోకి ఓ మహిళ ప్రవేశించింది. మొదట ఓ కిటికీలోంచి తనకు కావాల్సిన కూల్ డ్రింక్ తీసుకోవాలని చూడగా వీలు కాలేదు. అతికష్టం మీద కిటికీలోంచి లోనికి ప్రవేశించిన ఆ మహిళ క్యాష్ కౌంటర్లో నగదుతో పాటు కొన్ని వస్తువులను కాటన్లో వేసుకుని అక్కడినుంచి పరారైంది. పదిరోజుల పాటు వెతికినా ఆమె జాడ తెలియకపోవడంతో.. ఆమె ఆచూకీ తెలిపిన వారికి 500 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 32 వేలు) అందజేస్తామని హోవార్డ్ కౌంటీ పోలీసులు చోరి వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది మొదలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Recognize this suspect? #HoCoPolice offering up to a $500 reward for info on suspect who stole cash and food in Nov. 5 burglary at McDonald's in Columbia. Call 410-313-STOP or HCPDcrimetips@howardcountymd.gov. pic.twitter.com/Iq3VWu6ZVF — Howard County Police (@HCPDNews) 14 November 2017 -
మాయ‘లేడీ’ అరెస్టు
సహకరించిన మరో ఇద్దరు కూడా.. విజయవాడ సిటీ : అమాయకులను వలలో వేసుకొని నగదు, నగలు దొంగిలించి ఉడాయించే మాయ‘లేడి’తోపాటు ఆమెకు సహకరిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం సీసీఎస్ పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి 14 గ్రాముల బంగారం, రూ.500 నగదు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వల్లభనేని వెంకట రమణ అలియాస్ రమ్య(28) ఆరేళ్ల కిందట భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమె ఇద్దరు పిల్లలు రామవరప్పాడులోని మిషన్ పాఠశాలలో చదువుతున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు నుంచి విజయవాడ వస్తుండగా తెనాలికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ క్రమంలో అతని వద్ద బంగారం, డబ్బు దోచుకోవాలనే ఉద్దేశంతో తన మేనమామ కుమారుడైన లంకే వెంకట నాగాంజనేయులు(23), దూరపు బంధువైన కొప్పనాతి సుభానీ(20)తో కలిసి పథకం రచించింది. గత నెల 26వ తేదీన తనతో వివాహేతర సంబంధం సాగించే తెనాలికి చెందిన వ్యక్తిని విజయవాడ తీసుకొచ్చింది. రాత్రికి కృష్ణానది ఇసుకతిన్నెల వద్దకు తీసుకెళ్లింది. పథకం ప్రకారం నాగాంజనేయులు, సుభానీ పోలీసులమంటూ వచ్చి అతడ్ని బెదిరించి బంగారు గొలుసు, నగదు, సెల్‌ఫోన్ తీసుకొని ఉడాయించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు నిందితులను అరెస్ట్‌చేశారు. మహిళా దొంగ అరెస్టు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో మహిళల బ్యాగులు, పర్సులు దొంగిలించే గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన బొజ్జగాని మరియమ్మను కూడా సీసీఎస్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆమె నుంచి రూ.19వేల నగదు, కాసు బరువైన బంగారు చెవి దిద్దులను స్వాధీనం చేసుకున్నారు.