శశికళ
గౌరిబిదనూరు: తాలూకా లోని గోటకనాపురానికి చెందిన శశికళ (28) అనే ఘరానా మహిళ వసూళ్లకు పాల్పడుతూ పోలీసులకు దొరికిపోయింది. సుమారు నలుగురితో కలిసి ముఠాగా ఏర్పడి బాగలుకోటెలో డబ్బును వసూలు చేస్తూ ఉండేవారు.
గత శనివారం అక్కడి 45వ సెక్టారులోని వృత్తి విద్యా విద్యార్థినుల హాస్టల్‌కు వెళ్లి తామొక టీవీ చానెల్ విలేకరులమని చెప్పి, డబ్బు ఇవ్వాలని బెదిరించారు. ఈ విషయం తెలుసుకొన్న మహిళా పోలీసులు శశికళతో పాటు వీరేశ్ లమాణి, సిద్దు కళ్ళమని, రామనగౌడ, న్యామగౌడర్ అనే అనుచరులను అరెస్టు చేయడం జరిగింది. వీరు హాస్టలు సిబ్బందిని బెదిరించినట్లు సిసి కెమెరాలో నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment