మంగళూరు: కర్ణాటక(Karnataka)లో వరుస దోపిడీలు హడలెత్తిస్తున్నాయి. బీదర్ ఘటన మరవకముందే మరో చోరీ జరిగింది. మంగళూరు(Mangalore)లోని ఉల్లాల్ కేసీ రోడ్డులో కో-ఆపరేటివ్ బ్యాంకు(Co-operative Bank)లో ఉద్యోగులను గన్‌తో బెదిరించి ట్రెజరీలోని నగదు, బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. రూ.15 కోట్ల నగదు, 5 లక్షల విలువైన నగలతో పరారయ్యారు. బ్యాంక్ లంచ్‌టైంలో దోపిడీ జరిగింది. ఐదుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారన్న ఉద్యోగులు.. బీహార్ గ్యాంగ్ పనిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దుండగులు.. ఫియట్ కార్‌లో వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
కాగా, నిన్న(గురువారం) బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై దోపిడీ దొంగలు దాడి చేశారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. దాడి అనంతరం డబ్బు పెట్టెతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. అందులో సుమారు రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
ఇదీ చదవండి: అఫ్జల్‌గంజ్ టూ ట్యాంక్‌బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ?
ఇక దొంగలు తెలంగాణ వైపు తమ బైక్‌ను మళ్లించినట్లు బీదర్ పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో పోలీసులు బీదర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అఫ్జల్‌గంజ్ వద్ద దొంగలకు బీదర్ పోలీసులు కనిపించారు. దొంగల ముఠా.. తప్పించుకునేందుకు అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఓ ట్రావెల్స్ కార్యాలయంలోకి ప్రవేశించారు. పోలీసులపై కాల్పులు జరుపుతుండగా.. అక్కడే ఉన్న ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్‌కు బుల్లెట్లు తగిలాయి. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు కూడా బీదర్ పోలీసులతో పాటు దొంగల ముఠాను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment