co operative bank
-
మంగళూరు బ్యాంకులో దోపిడీ.. ఉద్యోగులను గన్‌తో బెదిరించి..
మంగళూరు: కర్ణాటక(Karnataka)లో వరుస దోపిడీలు హడలెత్తిస్తున్నాయి. బీదర్ ఘటన మరవకముందే మరో చోరీ జరిగింది. మంగళూరు(Mangalore)లోని ఉల్లాల్ కేసీ రోడ్డులో కో-ఆపరేటివ్ బ్యాంకు(Co-operative Bank)లో ఉద్యోగులను గన్‌తో బెదిరించి ట్రెజరీలోని నగదు, బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. రూ.15 కోట్ల నగదు, 5 లక్షల విలువైన నగలతో పరారయ్యారు. బ్యాంక్ లంచ్టైంలో దోపిడీ జరిగింది. ఐదుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారన్న ఉద్యోగులు.. బీహార్ గ్యాంగ్ పనిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దుండగులు.. ఫియట్ కార్లో వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.కాగా, నిన్న(గురువారం) బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై దోపిడీ దొంగలు దాడి చేశారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. దాడి అనంతరం డబ్బు పెట్టెతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. అందులో సుమారు రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.ఇదీ చదవండి: అఫ్జల్‌గంజ్ టూ ట్యాంక్‌బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ?ఇక దొంగలు తెలంగాణ వైపు తమ బైక్‌ను మళ్లించినట్లు బీదర్ పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో పోలీసులు బీదర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అఫ్జల్‌గంజ్ వద్ద దొంగలకు బీదర్ పోలీసులు కనిపించారు. దొంగల ముఠా.. తప్పించుకునేందుకు అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఓ ట్రావెల్స్ కార్యాలయంలోకి ప్రవేశించారు. పోలీసులపై కాల్పులు జరుపుతుండగా.. అక్కడే ఉన్న ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్‌కు బుల్లెట్లు తగిలాయి. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు కూడా బీదర్ పోలీసులతో పాటు దొంగల ముఠాను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
ఈడీ రైడ్స్.. మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో భారీ అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. రెండు రోజుల పాటు మహేష్ బ్యాంక్‌లో ఈడీ సోదాలు చేపట్టింది. రూ. కోటి నగదుతో పాటు రూ.5 కోట్ల విలువైన ఆభరణాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనర్హులకు రూ.300 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. 1800 మందికి డమ్మీ గోల్డ్‌లోన్స్ ఇచ్చినట్లు ఈడీ తేల్చింది.పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లు గుర్తించని ఈడీ.. రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబసభ్యులే తీసుకున్నట్లు నిర్థారణ అయ్యింది. బ్యాంక్‌లోని డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టిందని ఈడీ వెల్లడించింది. తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేయడంతో పాటు.. వక్ఫ్‌బోర్డ్‌కు చెందిన పలు ఆస్తులకు లోన్స్ ఇచ్చారని.. బ్యాంక్ అక్రమాలపై విచారణ కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు. -
ఆర్బీఐ కీలక ప్రకటన.. ప్రముఖ బ్యాంక్ లైసెన్స్ రద్దు
మహారాష్ట్రలోని సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ తగిన మూలధనం మరియు సంపాదన అవకాశాలు లేని కారణంగా రిజర్వ్ బ్యాంక్ బుధవారం లైసెన్స్‌ను రద్దు చేసింది. మహారాష్ట్ర సహకార సంఘాల కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ను కూడా బ్యాంకును మూసివేయడానికి & లిక్విడేటర్‌ను నియమించడానికి ఆర్డర్ జారీ చేయాలని కోరినట్లు ఆర్బీఐ తెలిపింది.ఆర్బీఐ ప్రకారం.. సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇకపైన ఎలాంటి బ్యాంకింగ్ సేవలను అందించిందని తెలుస్తోంది. ఆర్బీఐ ఆదేశాలు 2024 జూన్ 19 నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో ఆ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసిన వారు కొంత ఆందోళన చెందుతున్నారు.బ్యాంకులో డబ్బు దాచుకున్న ఖాతాదారులు నష్టపోకుండా ఉండటానికి డిపాజిటరీ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. ఇది బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.బ్యాంకు దివాళా తీసినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు డిపాజిటర్లు నష్టపోకుండా రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. కాబట్టి ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకు సమర్పించిన డేటా ప్రకారం, డిపాజిటర్లలో 87 శాతం మంది డీఐసీజీసీ నుంచి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులని ఆర్బీఐ తెలిపింది. -
ఆర్బీఐ కీలక నిర్ణయం: మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత కొన్ని రోజులుగా నియమాలను అతిక్రమించిన బ్యాంకులపై విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగానే కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా.. లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేస్తోంది.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని పూర్వాంచల్ సహకార బ్యాంకు లైసెన్సును ఆర్బీఐ రద్దు చేసింది. ఈ బ్యాంకు వద్ద తగినంత మూలధనం లేకవడంతో రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌ను మూసివేసి లిక్విడేటర్‌ను నియమించాలని ఉత్తర్‌ప్రదేశ్‌లోని కోఆపరేటివ్ కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ను ఆర్బీఐ ఆదేశించినట్లు సమాచారం.ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని పూర్వాంచల్ సహకార బ్యాంకు లైసెన్సును ఆర్బీఐ రద్దు చేయడంతో.. లిక్విడేషన్ కింద్ ప్రతి డిపాజిటర్ తన డిపాజిట్ మొత్తాన్ని.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి మాత్రమే రూ. 5 లక్షల వరకు పొందేందుకు అర్హులు.పూర్వాంచల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం.. దాదాపు 99.51 శాతం మంది డిపాజిటర్లు డిఐసిజిసి నుంచి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు అని ఆర్బీఐ తెలిపింది. సహకార బ్యాంకు ప్రస్తుత ఆర్థిక స్థితితో ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించలేదని ఆర్బీఐ తెలిపింది. -
ఐదు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా! భారీగా జరిమానాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI).. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ఐదు సహకార బ్యాంకులపై కొరడా ఝులిపించింది. పలు అంశాలలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ జరిమాలను విధించింది. ఉమా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పిజ్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మిజోరం కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్, బీర్భూమ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, షిహోరి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ ఈ జాబితాలో ఉన్నాయి. (Bank of Baroda: లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్! డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా...) ప్రాథమిక (అర్బన్) కో-ఆపరేటివ్ బ్యాంక్‌లు, ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లను ఉంచడంపై ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు గుజరాత్‌లోని వడోదరలోని ఉమా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై రిజర్వ్ బ్యాంక్ రూ.7 లక్షల జరిమానా విధించింది. కేవైసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గానూ గుజరాత్‌లోని పిజ్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.2 లక్షల పెనాల్టీని విధించిన ఆర్బీఐ ఖాతాల ప్రమాద వర్గీకరణను ఎప్పటికప్పుడు సమీక్షించడంలో పిజ్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ విఫలమైందని పేర్కొంది. (Bank holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్! నవంబర్‌లో సెలవులు ఇవే..) రాష్ట్ర సహకార బ్యాంకులకు వర్తించే 'హౌసింగ్ ఫైనాన్స్'పై తమ ఆదేశాలను పాటించనందుకు ఐజ్వాల్‌లోని మిజోరాం కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ రూ. 2 లక్షల జరిమానా విధించింది. అలాగే కేవైసీకి సంబంధించి జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించిన పశ్చిమ బెంగాల్‌లోని బీర్భమ్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు ఆర్బీఐ రూ.1.10 లక్షల పెనాల్టీ వేసింది. డైరెక్టర్లు, బంధువులు, సంస్థలకు రుణాలిచ్చే విషయంలో ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు గానూ గుజరాత్‌లోని షిహోరి నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్‌కు రూ. 1 లక్ష జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత కొన్ని రోజులుగా నియమాలను అతిక్రమిస్తున్న బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం, భారీ జరిమానా విధించడం వంటివి చేస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా తాజాగా మరో నాలుగు బ్యాంకులకు జరిమానా విధించింది. ఆర్బీఐ ఫైన్ వేసిన బ్యాంకుల జాబితాలో గుజరాత్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, మకరపురా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ & ది సెవలియా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. 👉 గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 'గుజరాత్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్' డిపాజిట్ ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించి మాత్రమే కాకుండా.. క్యాష్ రిజర్వ్ రేషియో మెయింటెనెన్స్‌కు సంబంధించి రూల్స్ పాటించనందుకు ఆర్బీఐ రూ. 4.50 లక్షలు ఫైన్ వేసింది. 👉 గుజరాత్‌లోని బాబ్రా కేంద్రంగా పని చేస్తున్న నాగరిక్ సహకారి బ్యాంకుకు కూడా రూ. 2 లక్షలు జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేటరీ యాక్ట్ - 1949లోని కొన్ని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లగించిన కారణంగా ఈ ఫైన్ వేసినట్లు తెలుస్తోంది. 👉 ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించడం, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్‌కు పంపాల్సిన నగదును పంపకపోవడం వల్ల మకరపురా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు రూ. 2 లక్షలు జరిమానా విధించింది. 👉 ది సెవాలియా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు ఆర్బీఐ రూ.50,000 జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పాటించకపోవడమే ఫైన్ వేయడానికి ప్రధాన కారణమని RBI స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్‌డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే! ఇప్పటికే చాలా కో-ఆపరేటివ్ బ్యాంకులు ఆర్బీఐ మార్గదర్శలకు పెడచెవిన పెట్టాయి. ఈ కారణంగానే లైసెన్స్ రద్దు చేయడం లేదా భారీ జరిమానాలు విధిస్తోంది. కాబట్టి ఒక వ్యక్తి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసే ముందు లేదా డబ్బు డిపాజిట్ చేసేముందు ఆ బ్యాంకు ఆర్ధిక స్థితిగతులను తప్పకుండా పరిశీలించాలి. -
మరో బ్యాంకు లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ.. కారణం ఇదే!
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది, మరి కొన్ని బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసే దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఈ వరుసలో తాజాగా 'లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్' చేరింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆర్బీఐ ఉత్తరప్రదేశ్‌లోని కోఆపరేటివ్ కమిషనర్ & రిజిస్ట్రార్‌ను కూడా ఈ బ్యాంకును మూసివేయడానికి కావాల్సిన ఉత్తర్వు జారీ చేయాలని, సహకార బ్యాంకుకు లిక్విడేటర్‌ను నియమించాలని వెల్లడించినట్లు సమాచారం. బ్యాంకు దివాళా తీసిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ వద్ద తగిన మూలధనం లేకపోవడమే కాకుండా.. ఆదాయ అవకాశాలు కూడా లేకపోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాల అనుమతిని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే లిక్విడేషన్ మీద ప్రతి డిపాజిటర్, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని రూ. 5 లక్షల వరకు పొందేందుకు అర్హులు. ఇదీ చదవండి: 19 ఏళ్లనాటి కల.. ఇప్పుడు నిజమైంది.. ఈజ్‌మైట్రిప్ కో-ఫౌండర్ బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం, 99.53 శాతం డిపాజిటర్లు డిఐసిజిసి నుంచి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు అని ఆర్బీఐ తెలిపింది. మొత్తం మీద ఇకపై లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎలాంటి వ్యాపార లావాదేవీలు, బ్యాంకింగ్ కార్యకాలపు నిరవహించడం పూర్తిగా నిషేధం. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయి. -
ఆ రెండు బ్యాంకులకు కొత్త ఆంక్షలు - కస్టమర్లు తప్పక తెలుసుకోవాల్సిందే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత కొంత కాలంలో విధులను సరిగ్గా నిర్వర్తించని బ్యాంకుల లైసెన్సులు రద్దు చేయడం లేదా జరిమానాలు విధించడం వంటివి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో భాగంగానే మరో రెండు బ్యాంకులకు గట్టి షాక్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 2023 ఆగష్టు 29న 'అజంతా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ & పూర్వాంచల్ కో-ఆపరేటివ్ బ్యాంక్'లపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ ఆదేశాలు ఆరు నెలల పాటు అమల్లో ఉండనున్నట్లు సమాచారం. బ్యాంకుల పనితీరు ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు బ్యాంకులు వాటి పనులను అవి స్వేచ్ఛగా చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలని తలపెట్టినప్పుడు తప్పకుండా ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంది. అంతే కాకుండా ఈ బ్యాంకులు తమ వెబ్సైట్లు లేదా ప్రాంగణాల్లో ప్రజల పరిశీలన కోసం RBI ఆదేశాల కాపీని ప్రదర్శించాల్సి ఉంది. ఇదీ చదవండి: వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు.. ఎవరీ 'నిషా జగ్తియాని'? ఈ బ్యాంకులలో అకౌంట్ ఉన్నవారు ఎలాంటి రెన్యూవల్ చేసుకోకూడదు, కొత్త లోన్స్ కూడా మంజూరు చేసే అవకాశం లేదు. అంతే కాకుండా కస్టమర్ల నుంచి ఎలాంటి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆర్బీఐ ఆదేశించింది. అయితే ప్రాపర్టీలను విక్రయించడం లేదా ట్రాన్స్ఫర్ వంటివి చేయాలంటే ఆర్బీఐ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి. బ్యాంకుల డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కింద రూ. 5 లక్షల వరకు బీమా క్లెయిమ్ స్వీకరించే వెసులుబాటు ఉంటుంది. బ్యాంకులు పరిస్థితి మెరుగుపడే వరకు ఈ ఆంక్షలు ఇలాగే ఉంటాయి, ఆ తరువాత పరిస్థిని బట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. -
మరో నాలుగు బ్యాంకులకు ఝలక్ - లక్షల్లో పెనాల్టీ!
కస్టమర్లకు సేవలు అందించే విషయంలో లేదా విధులను నిర్వహించడంలో ఏదైనా అవకతవకలు ఏర్పడినా 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) తగిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు క్యాన్సిల్ చేసింది, కాగా ఇప్పుడు మరో నాలుగు బ్యాంకులకు ఫెనాల్టీ విధించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. బీహార్ రాజధాని పాట్నా కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న 'ది తపిండు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు'కి రూ. లక్ష జరిమానా విధించింది. అంతే కాకుండా మహారాష్ట్రకు చెందిన మంగళ్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ది మహాబలేశ్వర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఇస్లాంపూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు వరుసగా రూ. 1 లక్ష, రూ. 2 లక్షలు, రూ. 2 లక్షలు జరిమానా విధించింది. ఇదీ చదవండి: అదే జరిగితే 70 వేల ఉద్యోగాలు పోతాయ్.. ఎక్కడో తెలుసా? ప్రస్తుతానికి జరిమానా విధించి ఊరుకున్నా.. ఇదే మళ్ళీ మళ్ళీ జరిగితే లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. కావున బ్యాంకులు సరిగ్గా విధులు నిర్వహిస్తూ.. సజావుగా కార్యకలాపాలు సాగుతున్నాయా లేదా అని పరిశీలించుకోవాలి. లేకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది. -
ఖాతాదారులకు షాక్.. రెండు బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక బ్యాంకుల బ్యాంకింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి గల కారణం ఏంటి? దీనికి సంబంధించిన ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. మహారాష్ట్ర బుల్ధానా కేంద్రంగా ఉన్న మల్కాపుర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (Malkapur Urban Co-operative Bank Ltd), బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న 'శుష్రుతి సౌహార్ద సహకార బ్యాంక్' (Shushruti Souharda Sahakara Bank) లైసెన్సులను ఆర్బీఐ రద్దు చేసింది. గత బుధవారం రోజు బ్యాంకింగ్ లావాదేవీలు జరగకుండా సీజ్ చేసింది. రెండు బ్యాంకుల వద్ద ప్రస్తుతం సరైన మూలధనం లేదని.. భవిష్యత్తులో లాభాలు కూడా వచ్చే సూచనలు లేవని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతే కాకుండా డిపాజిటర్లకు కూడా పూర్తిగా డబ్బు చెల్లించే స్థితిలో లేనట్లు ఆర్బీఐ నిర్దారించింది. లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పటికీ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) కింద రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అమౌంట్ క్లైమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. (ఇదీ చదవండి: అగ్ర రాజ్యంలో వైన్ బిజినెస్ - కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ) డిఐసీజీసీ ప్రకారం మల్కాపుర్ సహకార బ్యాంక్ 97.60 శాతం మంది డిపాజిటర్లు తిరిగి వారి అమౌంట్ పొందటానికి అర్హులని తెలుస్తోంది. అదే సమయంలో కర్ణాటక శుష్రుతి సౌహార్ద సహకార బ్యాంక్‌లో 91.92 శాతం మంది డిపాజిటర్లు అర్హులుగా తెలుస్తోంది. డిపాజిటర్లు దీనిని తప్పకుండా గమనించాలి. -
సహకారం.. స్వాహాపర్వం
సాక్షి ప్రతినిధి,ఏలూరు: సహకార చట్టంలోని బ్యాంకుల నిబంధనలను పాటించలేదు.. రుణపరిమితిని అడ్డగోలుగా ఇష్టానుసారంగా పెంచేశారు.. సరైన షూరిటీలు లేకుండా కోట్లాది రూపాయల రుణాలు మంజూరు చేశారు. అర్హులైన రైతులకు ఇవ్వాల్సిన రుణాలను పక్కదారి పట్టించి మద్యం వ్యాపారులతో సహా పలువురికి కట్టబెట్టారు. ఇదంతా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలోని బ్రాంచీల్లో జరిగిన అవినీతి పర్వం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని డీసీసీబీ పరిధిలోని ఆరు శాఖల్లో జరిగిన భారీ అవకతవకలపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. సమగ్ర విచారణ నివేదిక ఆధారంగా గతంలో పనిచేసిన ఉన్నతాధికారులందరిపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గతంలో పనిచేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తో పాటు మేనేజర్ కేడర్‌లోని 17 మందిపై చర్యలు తీసుకోనున్నారు. రుణాల మంజూరు విషయంలో.. జిల్లాలోని DCCB పరిధిలోని పలు బ్రాంచీల్లో ఏళ్ల తరబడి రుణాల మంజూరు విషయంలో భారీగా అవకతవకలు జరిగాయి. వివాదాల్లో ఉన్న భూము లను బ్యాంకుల్లో షూరిటీగా చూపించి కోట్ల రూపాయల రుణాలు పొంది తిరిగి రూపాయి కూడా చెల్లించని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలోని యలమంచిలి, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, ఏలూరుతో పాటు మరికొన్ని బ్రాంచీల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం గుంటూరు కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్‌ను ప్రత్యేకాధికారిగా నియమించింది. సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిపై కో–ఆపరేటివ్ శాఖ క మిషనర్ ఎ.బాబు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అక్రమాల్లో కొన్ని.. ● యలమంచిలి బ్రాంచీలో వివాదాలతో ఉన్న ఆ స్తులను షూరిటీలుగా చూపించి రూ.33.22 కోట్ల రుణం మంజూరు చేశారు. దీనిలో రూ.13.86 కోట్లు ఇప్పటికీ రికవరీ కాలేదు. అలాగే 2015–16, 2017–18 నాబార్డు వార్షిక తనిఖీల్లో నిర్దేశించిన నిబంధనలను అతిక్రమించి రుణాలు మంజూరు చేసినట్లుగా నిర్ధారించారు. ఎలాంటి షూరిటీలు లేకుండా రుణాలు మంజూరు చేసి బ్యాంకుకు ఆర్థిక నష్టం చేకూర్చారు. ● తాడేపల్లిగూడెం బ్రాంచీలో 104 మంది సభ్యుల పేరుతో రూ.2.80 కోట్లను ఓ రియల్టర్‌కు రుణంగా ఇచ్చారు. తాడేపల్లిగూడెంలోని డీసీసీబీ బ్రాంచీలో మొత్తం బకాయిల విలువ రూ.11.69 కోట్లు కాగా 559 రుణాలు విలువ రూ.4.30 కోట్లు. వీటి గడువు దాటినా కొన్నింటి వసూళ్లకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ● 2012–13 నుంచి 2018–19 వరకు డీసీసీబీ పలు శాఖల ద్వారా రూ.867.19 కోట్ల విలువైన 2,445 బ్యాంకు గ్యారంటీలు జారీ చేసింది. దీనిలో రూ.295.35 కోట్ల విలువైన 23 బ్యాంకు గ్యారంటీలను మద్యం వ్యాపారులు, రైస్‌మిల్లులు, ఇతరులకు ఇచ్చినట్టు గుర్తించారు. ● వ్యవసాయ భూమి విలువ భారీగా పెంచి షూరిటీగా చూపి రుణాలు కూడా మంజూరు చేశారు. క్రిమినల్ కేసులు అక్రమాలు జరిగిన క్రమంలో ఆయా కాలంలో పనిచేసిన బ్యాంకు అధికారులపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేశారు. మేనేజర్లు మన్నె మోహనరావు, ఐవీ నాగేశ్వరరావు, డి.ఆంజనేయులు, టీవీ సుబ్బారావు, కేఏ అజయ్‌కుమార్, జి.పిచ్చయ్యచౌదరి, కె.సురేంద్రప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్.రాధాకృష్ణ, జేఎస్వీ సత్యనారాయణరావు, సీహెచ్ రత్నకుమారి, కె.కిరణ్మయి, వి.శ్రీదేవి, డి.రమణ, జనరల్ మేనేజర్లు ఎ.మాధవీమూర్తి, వైవీ రాఘవేంద్రరెడ్డి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీవీఎం ఫణి తదితరులపై క్రిమినల్ చర్యలతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సిఫార్సు చేశారు. -
భారత్‌లో కలకలం..మరో బ్యాంక్‌ను మూసివేస్తున్నారంటూ రూమర్స్!
ప్రపంచ దేశాల్లో ఎన్నో టెక్నాలజీ స్టార్టప్ (భారత్‌లో 21 స్టార్టప్)ల్లో పెట్టుబడులు పెట్టి, వాటికి బాసటగా నిలిచిన అక్కడి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) నిండా మునిగింది. 2008 లేమాన్ బ్రదర్స్ ఆర్థిక సంక్షోభం తర్వాత మరో పెద్ద బ్యాంక్ దివాళాకు కారణమైంది. ఇప్పుడీ పరిణామాలతో అమెరికా నుంచి 13 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబైకి చెందిన శ్యామ్‌రావు విఠల్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ (ఎస్వీసీ) బ్యాంకు దివాళా తీస్తుందనే పుకార్లు కలకలం రేపుతున్నాయి. ఎక్కడో అమెరికాలో ఉన్న ఎస్వీబీ బ్యాంక్ మూతపడితే.. భారత్‌లో ఉన్న బ్యాంక్‌కు ఆర్ధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే పుకార్లతో సదరు బ్యాంక్ స్పందించింది. పుకార్లను కొట్టిపారేసింది. ఈ రూమర్స్‌ను స్ప్రెడ్ చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు ట్వీట్ చేసింది. భారత్‌కు చెందిన బ్యాంక్ మూత పడిందంటూ మనదేశానికి చెందిన ఎస్వీసీ బ్యాంక్ 1906 నుంచి ముంబై కేంద్రంగా వినియోగదారులకు బ్యాంకింగ్ సేవల్ని అందిస్తోంది. 11 రాష్ట్రాల్లో 198 బ్రాంచీలు, 214 ఏంటీఎంలు, 2300 మంది ఉద్యోగులతో 100 ఏళ్లు పూర్తి చేసుకొని ఎన్ఏఎఫ్సీయూబీ అవార్డ్ దక్కించుకుంది. 116 ఏళ్ల చరిత్ర ఉన్న ఎస్వీసీ బ్యాంక్ ప్రస్తుతం రూ.31,500 కోట్ల బిజినెస్ చేస్తుండగా ఆర్ధిక సంవత్సరం 2021-22లో రూ.146 కోట్ల నెట్ప్రాఫిట్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే బ్యాంక్ మూతపడిందంటూ రూమర్స్ వచ్చాయి. దీంతో ఆబ్యాంక్ కస్టమర్లు ఆందోళన గురయ్యారు. ఆ బ్యాంకులో దాచిన డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంక్ బ్రాంచీలను సంప్రదించారు. అది ఎస్వీబీ బ్యాంక్.. మనది ఎస్వీసీ బ్యాంక్ అయితే కస్టమర్ల ఆందోళనతో ఎస్వీసీ బ్యాంక్ అధికారికంగా ఓ నోటీసును విడుదల చేసింది. ఆ నోటీసుల్లో ఉన్న వివరాల మేరకు..అమెరికాలో ఉన్న దిగ్గజ బ్యాంక్ మూత పడింది. అది సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (svb) కాగా.. మనది శ్యామ్‌రావు విఠల్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ ( svc) అని స్పష్టత ఇచ్చింది. ఇక ఎస్‌వీసీపై వస్తున్న తప్పుడు ప్రచారంతో .. కస్టమర్లు ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదని తెలిపింది. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్చరించింది. Important announcement#HumSeHaiPossible #SVCBank #Banking #SVC #Importantannouncement pic.twitter.com/p05lHBJm9w — SVC Bank (@SVC_Bank) March 11, 2023 ఇది వాట్సాప్ యూనివర్సిటీ దుస్థితి ఆ వివరణతో ఎస్వీసీ కస్టమర్లు ఊపిరి పీల్చుకున్నారు. సదరు బ్యాంకుపై వస్తున్న రూమర్లకు నెటిజన్లు తమదైన శైలిలో ట్వీట్లు చేస్తున్నారు. ZyppElectric సీఈవో ఆకాష్ గుప్తా మాట్లాడుతూ.. తర్వాత ఎస్ఎల్బీ(సంజయ్ లీలా భన్సాలీ) ప్రకటన విడుదల చేయొచ్చని ట్వీట్లో పేర్కొనగా.. భారత్ అద్భుతమైందని మరో యూజర్ వెటకారంగా కొనియాడగా ..భారతీయుల్లారా..వాట్సాప్ యూనివర్సిటీ దుస్థితి ఇలా ఉందని కామెంట్ చేశాడు. ఎస్వీసీ ముఖ్యమైన వివరణ ఇచ్చిందంటూ మరో యూజర్ కృజ్ఞతలు తెలిపారు. -
ఆ బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీగా ఫైన్!
నియమాలను ఉల్లంఘించే బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఘుళిపించింది. రూల్స్ పాటించని బ్యాంకులపై చర్యలకు పూనుకుంది. ఈ నేపథ్యంలోనే 13 బ్యాంకులపై జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వీటిలో చంద్రాపూర్‌లోని శ్రీ కన్యకా నగరి సహకారి బ్యాంక్‌పై గరిష్టంగా రూ. 4 లక్షలు, బీడ్‌లోని వైద్యనాథ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ. 2.50 లక్షల జరిమానా విధించింది. వాయ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, సతారా, ఇండోర్‌లోని ఇండోర్ ప్రీమియర్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, పటాన్ నగరిక్ సహకారి బ్యాంక్, పటాన్, మేఘాలయలోని ది తురా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌లపై ఒక్కొక్కరికి రూ.1.50 లక్షలు ఫైన్ వేసింది. జరిమానాలు విధించిన ఇతర బ్యాంకులు: నాగ్రిక్ సహకరి బ్యాంక్ మర్యాడిట్, జగదల్పూర్; జిజౌ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్, అమరావతి; తూర్పు & నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే కో-ఆప్ బ్యాంక్, కోల్‌కతా; జిలా సహకరి కేంద్రీయ బ్యాంక్ మర్యాదిత్, ఛతర్పూర్; నాగ్రిక్ సహకారి బ్యాంక్ మర్యాడిట్, రాయ్‌ఘర్; జిలా సహకరి కేంద్రీయ బ్యాంక్ మర్యాదిట్, బిలాస్పూర్; జిలా సహకారి కేంద్రీయ బ్యాంక్ మర్యాడిట్, షాడోల్‌లకు కూడా భారీగా జరిమానా విధించింది. అయితే ఈ జరిమానాలు కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపించదని ఆర్బీఐ తెలిపింది. చదవండి టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
ఆ బ్యాంకులపై కొరడా ఝులిపించిన ఆర్బీఐ!
వివిధ బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పలు బ్యాంకులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) దాదాపు ₹12 లక్షల జరిమానా విధించింది. అందులో ఆరు సహకార బ్యాంకులు, మూడు సహకారి బ్యాంకులతో కలిపి తొమ్మిది సంస్థలపై విధించినట్లు ఆర్బిఐ ప్రకటించింది. ఆ బ్యాంకులపై కొరడా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎల్లప్పుడూ వాటి పనితీరు, కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝులిపిస్తోంది. తాజాగా తొమ్మిది బ్యాంకులపై ఫైన్ విధించినట్లు ప్రకటనలో తెలిపింది. వివరాల ప్రకారం.. బెర్హంపూర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (ఒడిశా) ₹3.10 లక్షలు, ఉస్మానాబాద్ జనతా సహకరి బ్యాంక్, ఉస్మానాబాద్ (మహారాష్ట్ర) ₹2.5 లక్షలు, మహిసాగర్ జిల్లాలోని సంత్రంపూర్ (గుజరాత్)లోని శాంత్రంపూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ₹2 లక్షల జరిమానా విధించింది. జిల్లా సహకరి కేంద్రీయ బ్యాంక్ మర్యాదిట్, బాలాఘాట్ (మధ్యప్రదేశ్); జంషెడ్పూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జంషెడ్పూర్, జార్ఖండ్; రేణుకా నాగరిక్ సహకారి బ్యాంక్ మర్యాదిట్, అంబికాపూర్ (ఛత్తీస్‌గఢ్) ఒక్కొక్కరికి ₹1 లక్ష జరిమానా విధించగా, కృష్ణ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, భోపాల్ (మధ్యప్రదేశ్), కేంద్రపారా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కేంద్రపారా, ఒడిశాకు ఒక్కొక్కరికి ₹50,000 జరిమానా, నవానగర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జామ్‌నగర్ (గుజరాత్) ₹25,000 జరిమానా విధించినట్లు పేర్కొంది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
మరో బ్యాంక్ కథ ముగిసింది.. లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ!
దేశంలోని సహకార బ్యాంకుల్లో మరో బ్యాంక్ కథ క్లైమాక్స్‌కు చేరింది. సరైన ఆర్థిక ప్రణాళికలు లేకుండా డిపాజిటర్లకు నగదు కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది పుణె కేంద్రంగా పని చేస్తున్న `ది సేవ వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్`. ప్రస్తుతం ఈ బ్యాంక్ వద్ద సరిపడా పెట్టుబడి, ఆదాయ మార్గాలతో పాటు ఆర్థికపరంగా సజావుగా పనిచేసేందుకు మూలధనం కూడా లేదు. ఈ నేపథ్యంలో దీని లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించింది. లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ సోమవారం నుంచి `ది సేవ వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్`కు సంబంధించిన బ్యాంకింగ్ వ్యాపార లావాదేవీలు మూసేస్తున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. మహారాష్ట్రలోని సహకార కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఈ బ్యాంక్‌ను మూసివేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరడంతో పాటు బ్యాంకు కోసం లిక్విడేటర్‌ను నియమించాలని కోరినట్లు తెలిపింది. ది వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం 99 శాతం డిపాజిటర్లు.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ద్వారా పూర్తి డిపాజిట్లు పొందనున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. గత నెల 14న డీఐసీజీసీ ఆధ్వర్యంలో ఇన్సూర్డ్ డిపాజిట్ల ఆధారంగా రూ.152.36 కోట్లు చెల్లించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం, రూ. 5 లక్షల వరకు ఖాతాదారులకు చెల్లించనున్నారు. అనగా రూ.5 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నవారు తమ డబ్బును తిరిగి పొందుతారు. అయితే, ఐదు లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు అదనపు మొత్తాన్ని వదులుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. చదవండి: బ్యాంకులకే షాకిచ్చిన పేటీఎం, ఒక్క నెలలోనే 7వేల కోట్లు.. బాబోయ్ ఏంటీ స్పీడ్! -
దొంగ ఓట్లతో టీడీపీ నేతలు డ్రామాలడుతున్నారు: భూమన ఫైర్
సాక్షి, తిరుపతి: తిరుపతి కోఆపరేటివ్ టౌన్ ఎన్నికలకు బుధవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా, 12 డైరెక్టర్ పదవులకు గాను 45 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ నేతలు కావాలనే రాద్దాంతం చేస్తున్నారు. దొంగ ఓట్లు వేసే వ్యక్తుల్ని వారే తీసుకు వచ్చి.. ఇక్కడ ఏదో జరుగుతోంది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు వస్తుంటే..కావాలనే డ్రామాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాలు వద్ద దొంగ ఓట్లు అంటూ డ్రామాలకు తెర లేపారు. వారంతట వేరే పోలీసులు అదుపులోకి తీసుకునే విధంగా డ్రామాలు చేస్తున్నారు. -
ఆ బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేసిన ఆర్బీఐ..! అగమ్యగోచరంలో ఖాతాదారులు..!
రిజర్వ్ బ్యాంక్ ఇఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను పాటించని బ్యాంకులపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఇప్పటికే నిబంధనలను పాటించని ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా వదిలిపెట్టకుండా భారీగా జరిమానాను విధించింది ఆర్బీఐ . ఇక తాజాగా ఆర్బీఐ మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెన్స్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ లైసెన్స్‌ను ఆర్బీఐ రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా..! ఇండిపెండెన్స్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ నిబంధనలను పాటించనందున బ్యాంకింగ్ కార్యకలాపాలను సీజ్ చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాదే బ్యాంకు ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆర్బీఐ ఆంక్షలను విధించింది. దీంతో ఆరు నెలల వరకు ఖాతాదారులు తమ డబ్బును విత్‌డ్రా చేసుకోనే అవకాశాన్ని కోల్పోయారు. బ్యాంకుపై ఆంక్షలు విధించినా పరిస్థితులు మారకపోవడంతో బ్యాంకు లైసెన్స్ రద్దు చేయాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకు ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. అగమ్యగోచరంగా ఖాతాదారుల పరిస్థితి..! ఆర్బీఐ నిర్ణయంతో ఇండిపెండెన్స్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ ఖాతాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అయితే ఖాతాదారులను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ ప్రతి డిపాజిటర్ DICGC చట్టం- 1961లోని నిబంధనలకు లోబడి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుంచి ఐదు లక్షల రూపాయల ద్రవ్య పరిమితి వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించేందుకు అర్హులని ఆర్బీఐ తెలిపింది. ఇక బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం...99 శాతం కంటే ఎక్కువ మంది డిపాజిటర్లు డిఐసిజిసి చట్టం ప్రకారం తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు అని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. చదవండి: జుకర్‌బర్గ్ కొంపముంచిన ఫేస్బుక్ యూజర్లు..! తను మునిగిపోయి.. అదానీ, అంబానీల నెత్తిన పాలు పోశాడు -
ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!
Two Bank Staff Arrested For Stealing Jewels: బ్యాంకులు సురక్షితం అని ప్రజలు అనుకుంటారు. పైగా రుణాలు అవసరమైన ఏ విధమైన రిస్క్ ఉండదని బ్యాంకులనే విశ్వసించి ఆభరణాలు లేదా పొలాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. అటువంటిది ప్రజలు బాగా విశ్వసించే బ్యాంకు ఉద్యోగులే ప్రజలు తాకట్టు పెట్టిన ఆ భరణాలను దొంగలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అచ్చం అలాంటి సంఘటనే పాండిచ్చేరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో చోటు చేసుకుంది. (చదవండి: ఈ చిత్రంలో ఎన్ని గుర్రాలున్నాయో కనిపెట్టగలరా!) అసలు విషయంలోకెళ్లితే.... పోలీసుల కథనం ప్రకారం..ఒక ఖాతాదారుడు రుణం కోసం తాకట్టు పెట్టిన బంగారు నగలను విడిపించుకునేందుకు లాస్పేట్లోని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వద్దకు వచ్చారు. అయితే అతను తాకట్టు పెట్టిన ఆభరణాల స్థానంలో గోల్డ్ కవరింగ్‌తో ఉన్న నగలు ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కి గురుయ్యాడు. దీంతో ఆ ఖాతాదారుడు సదరు బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బ్యాంకు అధికారులు ఖాతాదారులు బ్యాంకు వద్ద తాకట్టు పెట్టిన ఆభరణాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడం ప్రారంభించారు. అయితే దాదాపు నాలుగు వందల సవార్ల బంగారు ఆభరణాల స్థానంలో గోల్డ్ కవరిగింగ్ బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో బ్యాంకు మేనేజర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడంతో రూ. 1.19 కోట్ల విలువైన అసలు ఆభరణాలు తిరిగి లభించాయి. అంతేకాదు ఆ బ్యాంకులో పనిచేస్తున్న గణేశన్ (క్యాషియర్), విజయకుమార్ (అసిస్టెంట్ క్యాషియర్)లు ఇద్దరు ఖాతాదారుల ఒరిజినల్ ఆభరణాలను ప్రైవేట్ పాన్ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆ ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: సైకిలింగ్ చేయండి!... రుచికరమైన జ్యూస్‌ని ఆస్వాదించండి!!) -
ఆర్థిక సంక్షోభంలో బ్యాంకు.. రంగంలోకి దిగిన ఆర్బీఐ
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్‌ను యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (యూఎస్‌ఎఫ్‌బీ) టేకోవర్ చేసేందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ముసాయిదా స్కీమును రూపొందించింది. దీని ప్రకారం పీఎంసీ బ్యాంక్‌కు చెందిన డిపాజిట్లతో పాటు ఆస్తులు, అప్పులను యూఎస్‌ఎఫ్‌బీ తీసుకోనుంది. ఒకవేళ కొత్త బ్యాంకులో కొనసాగరాదని భావిస్తే రిటైల్ డిపాజిటర్లు దశలవారీగా నగదును వెనక్కి తీసుకోవచ్చు. ఇక పీఎంసీ బ్యాంక్ ఉద్యోగులు అవే వేతనాలు, అవే సర్వీసు నిబంధనల కింద నిర్దిష్ట తేదీ నుంచి మూడేళ్ల పాటు సర్వీసులో కొనసాగుతారు. ఈ స్కీముతో డిపాజిటర్ల సొమ్ముకు మరింత భద్రత చేకూరగలదని ఆర్బీఐ తెలిపింది. దీనిపై డిసెంబర్ 10 దాకా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను ఆర్బీఐకు పంపవచ్చు. ఆ తర్వాత ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో 2019 సెప్టెంబర్‌లో పీఎంసీ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ రద్దు చేసి, విత్డ్రాయల్స్పై పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రెజిలియెంట్ ఇన్నొవేషన్ కలిసి ఏర్పాటు చేసిన యూఎస్‌ఎఫ్‌బీ ఈ ఏడాది అక్టోబర్‌లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ పొందింది. నవంబర్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. చదవండి:మీ పేర్లలో ‘బ్యాంక్’ను తగిలించొద్దు -
మహేశ్ బ్యాంకుకు ఆర్బీఐ జరిమానా
ముంబై: నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు సహకార బ్యాంకులకు జరిమానా విధించినట్టు ఆర్బీఐ మంగళవారం ప్రకటించింది. వీటిలో హైదరాబాద్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఉంది. డిపాజిట్లపై వడ్డీ రేటు, కేవైసీ విషయంలో నిబంధనలు పాటించని కారణంగా ఈ బ్యాంకునకు రూ.1.12 కోట్ల జరిమానా పడింది. అహ్మదాబాద్ మర్కంటైల్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌తోపాటు ముంబైకి చెందిన ఎస్వీసీ కో–ఆపరేటివ్ బ్యాంక్, సారస్వత్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌నకు సైతం రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. చదవండి: Airtel: స్పేస్ స్టార్టప్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్టెల్ -
చైర్మన్ పీఠంపై గురి
సాక్షి, నిజామాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ స్థానంపై అధికార టీఆర్ఎస్ జిల్లా ముఖ్య నేతలు గురిపెట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉండే ఈ కీలకమైన స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. ఇందులో భాగంగా తమ పరిధిలోని సొసైటీ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు డైరెక్టర్లుగా నామినేషన్లు వేశారు. డీసీసీబీ చైర్మన్ పదవి దక్కాలంటే ఏదైనా సహకార సంఘం డైరెక్టర్‌గా ఎన్నికై, సొసైటీ చైర్మన్ పదవి పొందాల్సి ఉంటుంది. దీంతో డీసీసీబీ రేసులో ఉన్న నాయకులు తమ సహకార సంఘాన్ని ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చైర్మన్ రేసులో ఉన్న కొందరు నేతలు తమ సొసైటీలను ఏకగ్రీవం చేసుకున్నారు. అయితే ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో డీసీసీబీతో పాటు, డీసీఎంఎస్ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. దీంతో ఆ పార్టీ నేతలు ఈ పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. రేసులో పలువురు.. డీసీసీబీ చైర్మన్ రేసులో ప్రధానంగా పోచారం భాస్కర్‌రెడ్డి, కుంట రమేశ్‌రెడ్డి, బిగాల కృష్ణమూర్తి గుప్తా, మార గంగారెడ్డి తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు భాస్కర్‌రెడ్డి ఆశిస్తున్న దేశాయిపేట్ సొసైటీ డైరెక్టర్ల స్థానాలు దాదాపు ఏకగ్రీవం అయ్యాయి. ఈ సొసైటీ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్న భాస్కర్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్‌తో పాటు, టీఎస్ కాబ్ పదవి రేసులో కూడా ఉండే అవకాశాలున్నాయి. అలాగే ఇప్పటికే ఏకగ్రీవమైన వేల్పూర్ సొసైటీ చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాలున్న కుంట రమేశ్‌రెడ్డి డీసీసీబీ పీఠాన్ని ఆశిస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బంధువైన రమేశ్‌రెడ్డికి మంత్రి ఆశీస్సులున్నాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి గుప్తా కూడా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పదవిని ఆశిస్తున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్లూర్ సొసైటీ డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఎమ్మెల్యే గణేశ్ గుప్తా మంత్రి కేటీఆర్‌ను కలిసే ప్రయత్నంలో ఉన్నారు. అంకాపూర్ సహకార సంఘం చైర్మన్‌గా పనిచేసిన మార గంగారెడ్డి, బోధన్‌కు చెందిన గిర్దావార్ గంగారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో మార గంగారెడ్డి కేటీఆర్‌ను కలిసినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ పేర్లు వినిపిస్తున్నప్పటికీ, చివరి వరకు ఇవేవీ కాకుండా కొత్త ముఖాలు తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పదవి విషయంలో అధినేత కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయనేది త్వరలోనే తేలనుంది. డీసీసీబీ దక్కకపోతే డీసీఎంఎస్ డీసీసీబీ ప్రయత్నాల్లో ఉన్న నేతలు ఆ పదవి దక్కని పక్షంలో డీసీఎంఎస్ చైర్మన్ పదవితోనైనా సరిపెట్టుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డీసీసీబీ ప్రస్తుతం ఉన్నట్లుగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగనుండగా, డీసీఎంఎస్ మాత్రం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు వేర్వేరుగా ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. -
రైతులకు ఇన్సూరెన్సు తగ్గించిన సహకార బ్యాంకు!
సాక్షి, కామారెడ్డి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలనుంచి రుణం పొందిన రైతుల పేరిట యునైటెడ్ ఇండియా కంపెనీ ద్వారా యాక్సిడెంటల్ (ప్రమాద) బీమా చేయిస్తారు. రైతులు పొలం పనులకు వెళ్లినప్పుడు పాము కాటుకు గురయ్యో.. కరెంటు షాక్‌తోనో.. ఇతర ప్రమాదాలతోనో ప్రాణాలు కోల్పోతే బాధిత కుటుంబానికి ఎంతోకొంత ధీమా కల్పించేందుకు దీనిని అమలుచేస్తున్నారు. అయితే ఈ బీమా మొత్తాన్ని ఇటీవల రూ. 2.50 లక్షలనుంచి లక్ష రూపాయలకు తగ్గించారు. దీంతో బాధిత కుటుంబాలకు అన్యాయం జరుగుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి 144 సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 2 లక్షల మంది రైతులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) ద్వారా రుణాలు పొందారు. వారిలో చాలా మంది రుణాలను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటుంటారు. రైతులకు ఎక్కువగా పంట రుణాలతో పాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను కూడా డీసీసీబీయే అందిస్తుంది. రుణం తీసుకున్న రైతు ఏదేని పరిస్థితుల్లో ప్రమాదవశాత్తూ చనిపోయినపుడు ఆ కుటుంబానికి ఆసరా కల్పించేందుకు గాను బ్యాంకు నుంచి ఇన్సూరెన్సు చేసేవారు. ప్రీమియం మొత్తాన్ని బ్యాంకే చెల్లించేది. ఒక్కో రైతుకు రూ. 2.50 లక్షల ఇన్సూరెన్సు నిమిత్తం డీసీసీబీ ద్వారా ఇన్సూరెన్సు కంపెనీకి ప్రీమియం మొత్తం ఒకేసారి చెల్లించేవారు. ప్రమాదవశాత్తూ ఎక్కడ రైతు చనిపోయినా ఇన్సూరెన్సు సొమ్ము ఆ రైతు నామినీకి అందజేసేవారు. బీమా సొమ్ము ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆసరా అయ్యేది. అయితే ఈ ఆర్థి క సంవత్సరం నుంచి ఇన్సూరెన్సు మొత్తాన్ని రూ. లక్షకు కుదించారు. దీని మూలంగా చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టం జరగనుంది. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, వర్షాభావ పరిస్థితులు, బోర్ల తవ్వకం, పంటలు ఎండిపోవడం వంటి అనేక కష్టాల నడుమ రైతులకు పంటల సాగులో పెద్దగా మేలు కలుగడం లేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రమాదవశాత్తూ చనిపోయిన రైతు కుటుంబాలకు అందించే ఇన్సూరెన్సు కూడా తగ్గించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమాను అమలు చేస్తున్న నేపథ్యంలో సహకార బ్యాంకుల ద్వారా ఇన్సూరెన్సు మొత్తాన్ని తగ్గించి ఉంటారని భావిస్తున్నారు. ఇన్సూరెన్సును గతంలోలాగే రూ.2.50 లక్షలకు పెంచాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ‘సాక్షి’ డీసీసీబీ సీఈవో అనుపమను వివరణ కోరగా ఇన్సూరెన్సు తగ్గిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. పై నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామన్నారు. -
నెల్లూరులో ‘ రాజకీయ కుట్ర’
సాక్షి , నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీ వేధింపుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేవలం పార్టీ మారారనే ఏకైక కారణంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డిపై తెలుగుదేశం పార్టీ కక్ష కట్టింది. అన్ని అనుమతులు, తీర్మానాలతో ఖర్చులను నిధులు దుర్వినియోగం అయినట్లు హడావుడిగా చిత్రీకరించారు. వాటిపై హడావుడిగా విచారణ నిర్వహించినట్లు చేసి కలెక్టర్ వద్దకు విచారణకు హాజరుకావాలని చైర్మన్‌కు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా దుమారం రేగింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ సాగుతూ సర్వత్రా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో జిల్లాలో రాజకీయ కక్షలతో విచారణకు తెరతీశారు. కేవలం వ్యక్తిగత టార్గెట్ చేసి రాజకీయంగా ప్రతిష్టను మసకబార్చటం కోసం హడావుడిగా కుట్ర రాజకీయలు తెర తీసి ఈ నెల 25న కలెక్టర్ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై న్యాయపరంగానే తేల్చుకోవటానికి చైర్మన్ వర్గం సన్నద్ధమైంది. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు కొన్ని ఏళ్ల క్రితం అనుమతులతో చేసిన ఖర్చులకు ఇప్పుడు విచారణకు తెరతీశారు. అది కూడా తేల్చాల్సిన అంశాలు వదిలేసి టార్గెట్ చేసే దిశగా కొత్త అంశాలను తెరపైకి తెచ్చారు. జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్‌గా మెట్టుకూరు ధనంజయరెడ్డి 2013లో ఎన్నిక అయి నేటికీ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గత నెల ముందు వరకు టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. గత నెల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నుంచి ఉదయగిరి, ఆత్మకూరు అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంట్ స్థానాల్లో ఒక చోట అవకాశం కల్పిస్తామని స్వయంగా చంద్రబాబు నాయుడే అనేక మార్లు చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలు, దివంగత వైఎస్సార్ కుటుంబంతో 20 ఏళ్లకుపైగా ధనంజయరెడ్డికి వ్యక్తిగతంగా అనుబంధం ఉండడంతో ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జిల్లాలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. పార్టీ మారడంతో వేధింపుల పర్వానికి అధికార పార్టీ తెరతీసింది. వాస్తవానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో కుదువ పెట్టిన బంగారం విషయంలో గతంలో దుర్వినియోగం జరిగితే దీనిపై అప్పట్లో చైర్మన్ హోదాలో ధనంజయరెడ్డి విచారణ కోరగా విచారణకు కమిటీ వేశారు. దానికి సంబంధించి విచారణ ప్రకియ ముగియడం, పాలకవర్గం కూడా వివరణ ఇచ్చింది. అంతవరకు విచారణ సజావుగానే సాగింది. కొత్తగా విచారణ ఇప్పుడు పాత విచారణను పక్కన పెట్టి దాని కొనసాగింపుగా కొత్త విచారణ మొదలుపెట్టి ధనంజయరెడ్డికి నోటీసులు జారీ చేశారు. 2013, 2014లో చేసిన ఖర్చులపై ఇప్పుడు విచారణ నిర్వహిస్తున్నామని దీనికి చైర్మన్ ధనంజయరెడ్డి, పాలకవర్గం వ్యక్తిగతంగా ఈ నెల 25న కలెక్టర్ ముత్యాలరాజు ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. నోటీసుల్లో ఏముందంటే.. రాజధాని నిర్మాణం కోసం అందరి నుంచి ముఖ్యమంత్రి భారీగా విరాళాలు సేకరించారు. రాజధానికి బాగా విరాళాలు వస్తున్నాయని చెప్పుకునేందుకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విరాళాలు పంపమని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో బ్యాంక్ పాలకవర్గం సమావేశంలో నిర్ణయం తీసుకుని 2014 డిసెంబర్ 9వ తేదీన రూ.6 లక్షల విరాళాన్ని ప్రభుత్వానికి పంపారు. దీనిపై విచారణ వేశారు. అలాగే బ్యాంక్ కాంప్లెక్స్‌లోని షాపుల ఆద్దెలు బాగా తక్కువగా ఉండటం, కొందరు మొండి బకాయిలుగా మారిన క్రమంలో పాలక మండలి తీర్మానంతో బిడ్లు ఆహ్వానించి షాపులను కేటాయించారు. ఈ క్రమంలో అద్దెలు తగ్గించడం వల్ల, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని వల్ల రూ.42.30 లక్షలు నష్టం వాటిల్లిందని, దీనిని దుర్వినియోగంగా చూపారు. అలాగే బ్యాంక్ ఏర్పడి 100 ఏళ్లు అయిన సందర్భంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించి, దానికి సీఎం చంద్రబాబు నాయుడును కూడా ఆçహ్వానించి, శత జయంతి వేడుకల్ని నిర్వహించారు. దానికి బ్యాంక్ ద్వారా రూ.35 లక్షలు ఖర్చును పాలకవర్గం అనుమతితో సబ్ కమిటీ వేసి దాని మేరకు సహకార శాఖ నిబంధనలకు లోబడి ఖర్చు చేశారు. సీఎం హాజరుకానప్పటికీ జిల్లా మంత్రులు నారయణ, సోమిరెడ్డి మొదలుకుని ఎమ్మెల్యేలు అందరూ హాజరై బ్యాంక్ బాగా పనిచేస్తుందని కితాబు ఇచ్చారు. ఇప్పుడు దీనిని కూడా దుర్వినియోగంగా చూపించి విచారణకు ఆదేశించారు. ఈమూడు అంశాలపై విచారణకు హాజరై వివరణ ఇవ్వాలనేది నోటీసుల సారాంశం బీద రవిచంద్ర ఒత్తిడితోనే.. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఒత్తిడితో అధికారులు తలొగ్గారనే ప్రచారం బలంగా సాగుతోంది. అధికార పార్టీలో ఉన్నంత వరకు అంతా మంచిగా కనిపించి ఒక్కసారి పార్టీ మారగానే వేధింపులకు గురి చేసి వ్యక్తిగతంగా రాజకీయ ప్రతిష్ట దిగజార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ఇవ్వన్నీ కూడా కొన్నేళ్ల క్రితం టీడీపీలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు. వీటికి బీద రవిచంద్ర కూడా హాజరయ్యారు. సహకార బ్యాంక్‌లో అవినీతి ఆరోపణలు ఉన్న ఒక అధికారి సలహాతో ఈ తతంగం నడిపారు. ఆగమేఘాల మీద కలెక్టర్ విచారణ చేయాలని ఒత్తిడి తెచ్చి బ్యాంక్ డీజీఎం, సీఈఓలను మూడు రోజుల విచారణకు పిలిచి హడావుడిగా లెక్కలు వేయించి విచారణ చేసినట్లు చూపించి, నోటీసులు జారీ చేశారు. దీనిపై చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి న్యాయపోరాటం ద్వారా తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. -
సబ్బం హరికి నోటీసులు
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి మాజీ ఎంపీ, విశాఖ మాజీ మేయర్ సబ్బం హరి ఆస్తుల స్వాధీనానికి విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం వడ్డీ, ఇతర ఖర్చులతో కలిపి రూ.9.54 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాయిదాలు చెల్లించకపోవడంతో ఎన్పీఏ జాబితాలో చేర్చిన బ్యాంకు ఆర్బీఐ నిబంధనల మేరకు మంగళవారం ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. బకాయిలను 60 రోజుల్లోగా చెల్లించకపోతే సీతమ్మధారలోని 1622 చదరపు గజాల స్థలంలోని నివాసంతో పాటు మాధవధారలోని వుడా లేఅవుట్లో 444.44 చదరపు అడుగుల విస్తీర్ణంలోని విష్ణు వైభవం అపార్టుమెంట్, విశాఖ బీచ్‌రోడ్‌లోని రుషికొండ దగ్గరలో ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. ఇదీ నేపథ్యం.. నగరం నడిబొడ్డున మద్దిలపాలెంలో ఉన్న డక్కన్ క్రానికల్ భవనాన్ని 2014లో కోటక్ మహేంద్ర వేలం వేసింది. ఆ వేలంలో రూ.17.80 కోట్లకు సబ్బం హరి పాడుకున్నారు. ఆ సమయంలో తన ఆస్తులను తనఖా పెట్టి విశాఖ కో–ఆపరేటివ్ బ్యాంకు నుంచి రూ.8.50 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే వేలం నిబంధనల మేరకు నిర్వహించలేదంటూ డక్కన్ క్రానికల్ (డీసీ) యాజమాన్యం డెబిట్ రికవరీ అపిలేట్ అథారిటీ (డీఆర్ఏపీ)లో కేసు ఫైల్ చేసింది. అథారిటీ డీసీ వాదనను సమర్ధిస్తూ వేలం రద్దు చేయాలని, సబ్బం హరి డిపాజిట్ చేసిన రూ.17.80 కోట్లను వడ్డీ సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై కోటక్ మహేంద్ర అప్పీల్‌కు వెళ్లింది. మరో వైపు ఈ కేసును జాతీయ స్థాయిలో ఏర్పాటైన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఏసీఎల్‌టీ)కి రిఫర్ చేశారు. దీనిపై తుది తీర్పు రావాల్సి ఉంది. విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకులో తనఖా పెట్టిన సీతమ్మధారలోని సబ్బం హరి నివాసం ఉంటున్న ఇల్లు చెల్లింపులో ఎలాంటి సందేహం లేదు రూ.60 కోట్ల ఆస్తులను కొలాట్రల్ సెక్యురిటీ పెట్టి కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.8.50 కోట్ల రుణం తీసుకున్నా. రూ.1.50 కోట్ల వరకు తిరిగి చెల్లించా. వడ్డీ సహా రూ.9.54 కోట్లు చెల్లించాలని బ్యాంకు నోటీసు ఇచ్చింది. డక్కన్ క్రానికల్ కేసులో తుది తీర్పు వెలువడగానే బ్యాంకు వాళ్లకు చెల్లించాల్సిన బకాయిలను వడ్డీ సహా కోటక్ మహేంద్రాయే నేరుగా చెల్లిస్తుంది. ఈ రుణ బకాయిల చెల్లింపు విషయంలో సందేహ పడాల్సిన పనిలేదు. – సబ్బం హరి, మాజీ ఎంపీ నిబంధనల ప్రకారమే నోటీసులు బకాయిలు వసూలు కాకపోవడం వల్లే సబ్బం హరి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఉపక్రమించాం. తుది తీర్పు వెలువడగానే సబ్బం హరి రుణాన్ని వడ్డీ సహా సెటిల్ చేస్తామని కోటక్ మహేంద్ర లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో ఇన్నాళ్లు ఎదురు చూశాం. తుది తీర్పు ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. అందువల్లే నోటీసులు జారీ చేశాం. – మానం ఆంజనేయులు,చైర్మన్, విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు -
జీతం రూ.32 వేలు... ‘గీతం’ రూ.1.77 లక్షలు!
సాక్షి, సిటీబ్యూరో: అతని పేరు సుబ్రమణియన్ మురళి... వృత్తి ప్రైవేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్... ఈయనకు నెలకు వచ్చే జీతం రూ.32 వేలు... అయితే సంస్థ నుంచి కాజేసిన మొత్తం మాత్రం సరాసరి నెలకు రూ.1.77 లక్షలు... 2016 నుంచి 33 నెలల్లో రూ.58.49 లక్షలు స్వాహా చేశాడు... ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. మంగళవారం జాయింట్ సీపీ తరుణ్ జోషి, డీసీపీ పి.రాధాకిషన్‌రావులతో కలిసి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. క్లర్క్ నుంచి సీనియర్ మేనేజర్ వరకు.... బెంగళూరులోని శివాజీనగర్‌కు చెందిన పరోల్ సుబ్రమణియన్ మురళి ప్రాథమిక విద్య పూర్తి చేసిన అనంతరం నగరానికి వలసవచ్చాడు. సికింద్రాబాద్‌లోని ఓ కాలేజీలో బీకాం చదివాడు. ఆపై కోఆపరేటివ్ బ్యాంక్స్‌లో అడుగుపెట్టిన ఇతను బేగంపేటలోని ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, రామ్‌కోఠిలోని వర్థమాన్ మహిళా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, చందానగర్‌లోని ఈనాడు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌ల్లో పని చేసి ప్రస్తుతం సికింద్రాబాద్, ఘాసీమండీలోని ఏపీ మహాజన్స్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌లో పని చేస్తున్నాడు. బ్యాంకింగ్ రంగంలో క్లర్క్‌గా అడుగుపెట్టిన ఇతగాడు అకౌంటెంట్, మేనేజర్ స్థాయిలు దాటి ప్రస్తుతం సీనియర్ మేనేజర్ హోదాలో ఉన్నాడు. 2014 నవంబర్ నుంచి ఈ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్ హోదాలో ఉన్న మురళికి సదరు సంస్థ నెలకు రూ.32 వేల చొప్పునజీతం ఇస్తోంది. అంత డబ్బు చూసి కన్నుకుట్టడంతో... ఈ బ్యాంక్‌లో జరుగుతున్న భారీ నగదు లావాదేవీలు చూసిన ఇతగాడి కన్నుకుట్టింది. ఆ నగదు కాజేయాలనే దుర్బుద్ధితో 2016 జనవరి 8 నుంచి గత నెల 15 వరకు 35 లావాదేవీల్లో బ్యాంకు ఖాతాదారులకు చెందిన రూ.58,49,566 కాజేశాడు. సరాసరిన నెలకు రూ.1.77 లక్షల చొప్పున స్వాహా చేసినట్లయ్యింది. వీటిని వివిధ మార్గాల్లో తనతో పాటు తన కుటుంబీకుల పేర్లతో ఉన్న ఖాతాల్లోకి మళ్లించి అనేక చోట్ల పెట్టుబడులు పెట్టాడు. ఈ విషయం గుర్తించిన సంస్థ సీఈఓ సూర్యనారాయణమూర్తి మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, కేఎస్ రవి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్ వలపన్ని పట్టుకున్నారు. ఇతడినుంచి రూ.56.3 లక్షలు రికవరీ చేసి తదుపరి చర్యల నిమిత్తం మార్కెట్ పోలీసులకుఅప్పగించారు.