
కస్టమర్లకు సేవలు అందించే విషయంలో లేదా విధులను నిర్వహించడంలో ఏదైనా అవకతవకలు ఏర్పడినా 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) తగిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు క్యాన్సిల్ చేసింది, కాగా ఇప్పుడు మరో నాలుగు బ్యాంకులకు ఫెనాల్టీ విధించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. బీహార్ రాజధాని పాట్నా కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న 'ది తపిండు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు'కి రూ. లక్ష జరిమానా విధించింది. అంతే కాకుండా మహారాష్ట్రకు చెందిన మంగళ్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ది మహాబలేశ్వర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఇస్లాంపూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు వరుసగా రూ. 1 లక్ష, రూ. 2 లక్షలు, రూ. 2 లక్షలు జరిమానా విధించింది.
ఇదీ చదవండి: అదే జరిగితే 70 వేల ఉద్యోగాలు పోతాయ్.. ఎక్కడో తెలుసా?
ప్రస్తుతానికి జరిమానా విధించి ఊరుకున్నా.. ఇదే మళ్ళీ మళ్ళీ జరిగితే లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని ఆర్‌బీఐ హెచ్చరించింది. కావున బ్యాంకులు సరిగ్గా విధులు నిర్వహిస్తూ.. సజావుగా కార్యకలాపాలు సాగుతున్నాయా లేదా అని పరిశీలించుకోవాలి. లేకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment