reserv bank
-
పెరూలో యూపీఐ చెల్లింపులు..
న్యూఢిల్లీ: ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ తాజాగా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భా గంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వంటి రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థను పెరూలో అందుబాటులోకి తేనున్నాయి.ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే దక్షిణ అమెరికాలో దీన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా పెరూ స్థానం సంపాదించనుంది. రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్‌ను ఆ దేశంలో స్థాపించడంతోపాటు వ్యక్తు లు, వ్యాపార సంస్థల మధ్య తక్షణ చెల్లింపులను అందించేందుకు సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుంది.ఇవి చదవండి: బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా యూపీఐ చెల్లింపులు..! -
అలాంటి వాటిని నమ్మొద్దు.. వెంటనే ఫిర్యాదు చేయండి - ఆర్బీఐ
రుణమాఫీకి సంబంధించిన వార్తలు, సోషల్ మీడియాలో వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మకూడదని, వీటి వల్ల వినియోగదారులు మోసపోయే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ రోజు ఒక (డిసెంబర్ 11) ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొన్ని సంస్థలు ఎటువంటి చట్టబద్ధమైన అధికారం లేకుండా 'రుణ మాఫీ సర్టిఫికెట్లు' జారీ చేయడానికి సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన సెంట్రల్ బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. లోన్ తీసుకుంటే అవన్నీ మాఫీ అవుతాయనే వార్త వాస్తవం కాదని, వాటిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని ఆర్బీఐ వినియోగదారులను హెచ్చరించింది. ప్రజలను మోసం చేయడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టడానికి కొన్ని చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. లోన్ తీసుకుని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వస్తున్న వార్తలు ఆర్ధిక సంస్థల స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని, ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తాయని ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి సందేశాలు మీకు వచ్చినట్లయితే తప్పకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ వెల్లడించింది. -
ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్
భారతదేశంలోని బ్యాంకులపై గట్టి నిఘా పెట్టిన 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) ఇటీవల బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్ఎ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ వంటి వాటికి జరిమానాలు విధించింది. కాగా ఇప్పుడు మరిన్ని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన మకారిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. కొల్లాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న 'శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్' లైసెన్స్ రద్దు చేస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నియమాలు డిసెంబర్ 04 నుంచి అమలులోకి వచ్చినట్లు సమాచారం. సదరు బ్యాంకు వద్ద మూలధనం ఎక్కువగా లేకపోవడమే కాకుండా.. ఆదయ మార్గాలు కూడా లేకపోవడంతో ఆర్బీఐ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 56, సెక్షన్ 11(1), సెక్షన్ 22(3) నిబంధనలను దృష్టిలో ఉంచుకుని లైసెన్స్ రద్దు చేయడం జరిగింది. నిబంధనలను అమలు చేయడంలో శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్ విఫలం కావడం వల్ల.. కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి ఇస్తే కస్టమర్లు ఇబ్బందిపడే అవకాశం ఉందని RBI భావించింది. ఇప్పటికే డిపాజిట్లు చేసుకున్న వారికి తిరిగి చెల్లించే పరిస్థిలో ఈ బ్యాంక్ లేకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు ఇన్ని రకాలా..! ఇవెలా ఉపయోగపడతాయంటే..? ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న డిపాజిటర్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసిన ఆర్బీఐ లెక్కకు మించిన లైసెన్సులను రద్దు చేసింది. ఇందులో కేవలం ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే కాకుండా.. ప్రభుత్వ బ్యాంకులు ఉండటం గమనించదగ్గ విషయం. -
ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంకుపై చర్యలు
'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) గత కొన్ని రోజులుగా నియమాలను ఉల్లంఘించిన బ్యాంకుల మీద కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొన్ని బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసింది, మరి కొన్ని బ్యాంకులకు భారీ జరిమానా విధించింది. కానీ ఇటీవల ఆర్బీఐ 'అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకు'పై గట్టి చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. బ్యాంకుల పనితీరుపై నిఘాపెట్టిన ఆర్బీఐ.. సరైన పాలన లేని కారణంగా, ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకు బోర్డును తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రభావం కస్టమర్ల మీద ఏ మాత్రం ఉండదని వెల్లడించింది. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ జారీ చేసిన ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమలులో ఉంటాయి. కానీ బ్యాంకింగ్ కార్యకలాపాల మీద అటువంటి ఆంక్షలు విధించలేదు. ఈ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ 'సత్య ప్రకాష్ పాఠక్'ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. బ్యాంకింగ్ కార్యకలాపాల మీద ఎటువంటి ఆంక్షలు లేకపోవడం వల్ల రోజువారీ ట్రాన్సక్షన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. కాబట్టి బ్యాంక్ కస్టమర్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 సెక్షన్ 56, సెక్షన్ 36 AAA కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకుపై ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అడ్మినిస్ట్రేటర్‌కు సలహాలు అందించేందుకు ఆర్బీఐ ఒక కమిటీని నియమించింది. ఇందులో వెంకటేష్ హెగ్డే, ఎస్బీఐ మాజీ జనరల్ మేనేజర్, మహేంద్ర ఛాజెడ్, సుహాస్ గోఖలే వంటి బ్యాంక్ అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నారు. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సందీప్ ఘండాత్ మాట్లాడుతూ.. మా బ్యాంక్‌కు గత రెండు సంవత్సరాల నుంచి ఆర్బీఐ నియమించిన అదనపు డైరెక్టర్ (రాజేంద్ర కుమార్) ఉన్నారని, ఆయన సెంట్రల్ బ్యాంక్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారని వెల్లడించారు. అంతే కాకుండా ఆయనతో 29న బ్యాంక్ అధికారుల సమావేశం ఉంది, అంతలోపే ఆర్బీఐ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ప్రపంచంలో యంగెస్ట్ బిలియనీర్స్ వీరే.. ఒక్కొక్కరి ఆస్తి ఎంతంటే? గత రెండు సంవత్సరాల్లో సహకార బ్యాంకు మొండి బకాయిలను రూ.1,550 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు తగ్గించగలిగిందని, బ్యాంకు మెరుగుపడుతున్న సమయంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ధైర్యాన్ని దెబ్బతీసినట్లు వెల్లడించారు. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకుకు 109 బ్రాంచులు, 113 ఏటీఎంలు ఉన్నాయి. 2022 మార్చి నాటికి బ్యాంక్ డిపాజిట్లు రూ.10,838.07 కోట్లు కాగా.. రుణాల విలువ రూ. 6,654.37 కోట్లుగా ఉన్నాయి. ఈ బ్యాంక్ మహారాష్ట్రలో ,మాత్రమే కాకుండా కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా సేవలను అందిస్తోంది. -
ఇషా అంబానీకి ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. జియో ఫైనాన్షియల్ డైరెక్టర్లుగా మరో ఇద్దరు
జియో ఫైనాన్షియల్ డైరెక్టర్లుగా ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ'తో పాటు అన్షుమాన్ ఠాకూర్, హితేష్ కుమార్ సేథియాలను నియమించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆర్బీఐ ఈ నియామకాలకు నవంబర్ 15న ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం నియామక తేదీ నుంచి ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ గడువులోపల ప్రతిపాదనలను అమలు చేయడంలో కంపెనీ విఫలమైతే.. ముందుగా ప్రతిపాదించిన మార్పులను అమలు చేయకపోవడానికి గల కారణాన్ని పేర్కొంటూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది. 'ఇషా అంబానీ' యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎమ్బీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆ తరువాత రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్‌లో చేరింది. ఆ తరువాత రిలయన్స్ రిటైల్ విభాగాన్ని చేపట్టి కంపెనీకి లాభాలు రావడానికి కృషి చేసింది. ఇటీవల ఈమె నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎంపికైంది. అన్షుమాన్ ఠాకూర్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్, ఐఐఎం అహ్మదాబాద్‌లో MBA పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత కార్పొరేట్ స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి విభిన్న పరిశ్రమలలో పనిచేశారు. ప్రస్తుతం ఇతడు జియో ప్లాట్‌ఫారమ్ లిమిటెడ్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇదీ చదవండి: దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ హితేష్ కుమార్ సేథియా.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పృథివీ విద్యార్ధి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. యితడు ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికా వంటి దేశాల్లో సుమారు 20 సంవత్సరాలు ఫైనాన్సియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆ తరువాత ఐసీఐసీఐ బ్యాంక్ కెనడా, ఐసీఐసీఐ బ్యాంక్ జర్మనీ, యూకే, హాంకాంగ్‌లలో కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వర్తించారు. -
మరో నాలుగు బ్యాంకులకు ఝలక్ - లక్షల్లో పెనాల్టీ!
కస్టమర్లకు సేవలు అందించే విషయంలో లేదా విధులను నిర్వహించడంలో ఏదైనా అవకతవకలు ఏర్పడినా 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) తగిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు క్యాన్సిల్ చేసింది, కాగా ఇప్పుడు మరో నాలుగు బ్యాంకులకు ఫెనాల్టీ విధించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. బీహార్ రాజధాని పాట్నా కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న 'ది తపిండు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు'కి రూ. లక్ష జరిమానా విధించింది. అంతే కాకుండా మహారాష్ట్రకు చెందిన మంగళ్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ది మహాబలేశ్వర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఇస్లాంపూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు వరుసగా రూ. 1 లక్ష, రూ. 2 లక్షలు, రూ. 2 లక్షలు జరిమానా విధించింది. ఇదీ చదవండి: అదే జరిగితే 70 వేల ఉద్యోగాలు పోతాయ్.. ఎక్కడో తెలుసా? ప్రస్తుతానికి జరిమానా విధించి ఊరుకున్నా.. ఇదే మళ్ళీ మళ్ళీ జరిగితే లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. కావున బ్యాంకులు సరిగ్గా విధులు నిర్వహిస్తూ.. సజావుగా కార్యకలాపాలు సాగుతున్నాయా లేదా అని పరిశీలించుకోవాలి. లేకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది. -
కరోనా : మారటోరియం పొడిగించండి
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా క్లిష్ట సమయంలో సాధారణ పౌరులు, మధ్యతరగతి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి ఉపశమనం కలిగించేలా సుప్రీంకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. ఆగస్ట్ 31తో ముగియనున్న మారటోరియం గడువును కోవిడ్ దృష్ట్యా డిసెంబర్ 31 వరకు పొడించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయవాది విశాల్ తివారీ తన పిటిషన్ పలు కీలక అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. కరోనా వైరస్ ధాటికి ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయని వివిధ అవసరాల కోసం తీసుకున్న లోన్లు చెల్లించే పరిస్థితిలో వారు లేరని పేర్కొన్నారు. లాక్‌డౌక్ కారణంగా పరిశ్రమలు మూతపడటంతో కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని వివరించారు. ఈ నేపథ్యంలో మారిటోరియం గడువును డిసెంబర్ 31 వరకు పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్బీఐ, వివిధ బ్యాంకులను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై వచ్చే వారం ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ల్‌ను తిరిగి చెల్లించేందుకు మారటోరియం రూపంలో కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఆ గడువు కాస్తా ఆగస్ట్ 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును మరికొంత కాలం పొడించాలని పలు వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అయితే బ్యాంకింగ్ రంగాలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా ఎస్బీఐ మారటోరియం పొడిగింపుకు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సుప్రీం, కేంద్ర ప్రభుత్వాల స్పందన ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తిరేపుతోంది. -
లంచాల రేట్లు పెరిగాయ్!
ఎద్దువెనక నక్కలాగా మోదీ వెనుక బాబు ఏదో ఆశించి తిరిగారు. ముప్ఫై ఢిల్లీ విజిట్లవల్ల విమానం ఖర్చులు తప్ప ఒక్క హామీ కూడా సాధించలేక పోయారు. ‘‘గత కాలము మేలు...’’ అని జనం అనుకుంటు న్నారు. మోదీ పాలనపై నాలుగేళ్ల తర్వాత సమీక్షించు కుంటే వెలితిగా అనిపిస్తోంది. ఆనాడు వాజ్‌పేయి పాలిం చింది నికరంగా నాలుగేళ్లే అయినా జనహితానికి ఎన్నో కొండ గుర్తులు సృష్టించారు. కేవలం ఈ నెలల వ్యవధిలో మోదీ ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందనే ఆశ లేదు. వచ్చీ రాకుండానే నల్ల ధనవంతుల మీద, అవినీతి మీద రంకెలు వేశారు. ఒక్క రూపాయి నల్లధనం దొరకలేదు. చెలామణిలో ఉన్న కరెన్సీని బూడిద చేసి కొత్త రంగుల్లో కొత్తనోట్లు వదిలారు. పెద్ద నోట్ల రద్దుతో ఖజానాకి వరదొస్తుందని చెప్పారు. ఏమీ రాలేదు. పాపం, గ్రామా లలో వయోవృద్ధులు, అమాయకులు వారు ప్రాణపదంగా దాచుకున్న పెద్ద నోట్లు పనికిరాకుండా పోయాయి. ఆనాటి ప్రభుత్వం మూడు సింహాల ముద్రతో, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారి చేవ్రాలుతో ఇచ్చిన ప్రామిసరీ నోటుకి మర్యాద, విలువ లేకుండా పోయింది. ఆనాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వద్దన్నా వినకుండా ఏక పక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మోదీ మీద అభియోగం. అవినీతి ఆగలేదు. ఎమర్జెన్సీ రోజుల్లో లాగే, రిస్క్ పెరిగిందని అవినీతికి రేట్లు పెంచారు. ఉన్నత స్థాయిలో కుంభకోణాలు లేవని గుండీలమీద చేతులేసుకుని చెబుతున్నారు. మహా స్కాముల్ని రాజకీయ లబ్ధి కోసం నిర్వీర్యం చేయడం స్కాం కాదా అంటున్నారు. గెలుపు కోసం ఈశాన్య రాష్ట్రాలలో కరెన్సీని కురి పించలేదా అని ప్రత్యక్ష సాక్షులు నిగ్గతీస్తున్నారు. వెంకయ్యనాయుడిని జన జీవన స్రవంతి నుంచి వేరు చేసి, ఏనుగు అంబారీ ఎక్కించడం మాత్రం మోదీ గొప్ప ఎత్తుగడగా బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.ఆనాడు మోదీని ఎంత గ్లామరస్‌గా ప్రదర్శించినా, దక్షిణాది రాష్ట్రాలలో ఆ పప్పులు ఉడకలేదు. ఉత్తరాదిలో అప్పటికే కాంగ్రెస్ కొడి గట్టడం, గుజరాత్ ముఖ్యమంత్రిగా మహాద్భుతాలు చేశారన్న ప్రచారం అటు బాగా పనిచేసింది. మోదీని నిలబెట్టింది. వస్తు, సేవల పన్ను విధానానికి కావల్సిన మెజార్టీ సాధించి నెగ్గించగలిగారు. అర్ధరాత్రి జీరో అవర్‌లో జీఎస్టీ పండుగని పార్లమెంట్ భవనంలో జరిపి, నాటి స్వాతంత్య్రోత్సవాన్ని తలపించారు. సంతోషం. పన్నులకు తగిన సేవలు లేవని జనం గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడా టౌన్లకి సరైన రోడ్లు లేవు. వీధి దీపాలు లేవు. డ్రైనేజీ లేదు. రక్షిత మంచినీరు లేదు. ఇప్పుడే గ్రామాలమీద దృష్టి పడింది. గ్రామాలంటే రైతులు. వాళ్ల ఓట్ల కోసం ఒక్కసారిగా ఇవ్వాళ గ్రామాలు గుర్తొచ్చాయి. స్వచ్ఛ భారత్ జరిగిన దానికంటే ప్రచారం అధికంగా జరుగుతోంది. పెద్ద నగరాలలో, అనేకానేక కాలనీలలో చెత్త పేరుకు పోతోంది. బ్యాంకింగ్ రంగం అనేక కారణాలవల్ల ఎన్.పీ.ఏ.గా తయారైంది. బడా బాబులకి వేలాది కోట్లు ధార పోసింది. మోదీ జన్‌ధన్ పథకం సామాన్యులకి ఏమి ఒరగబెట్టిందో తెలియదు. ‘మనసులో మాట’ వినడానికి బావుంది. తాజాగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఓటర్లని మోదీ పైకి ఉసికొల్పుతున్నారు. మోదీ, వైఎస్సార్సీపీ కలిసిపోయి కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని చంద్రబాబు అభియోగం. ఎద్దువెనక నక్కలాగా మోదీ వెనుక చంద్రబాబు ఏదో ఆశించి తిరిగారు. కానీ ఏమీ రాలేదు. ముప్ఫై ఢిల్లీ విజిట్లవల్ల విమానం ఖర్చులు తప్ప ఒక్క హామీ కూడా సాధించలేక పోయారు. అందుకని ఆదికవి నన్నయ అన్నట్టు గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
యథాతథంగా రేటు బదలాయించలేం!
‘రెపో’పై ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య డిపాజిట్ల వ్యవస్థ అందుకు వీలుకల్పించదని విశ్లేషణ కోల్‌కతా: భారత్‌లో రిజర్వుబ్యాంక్ ఉపయోగించే రెపో రేటు సాధనాన్ని పటిష్టవంతంగా అమలుచేయడం సాధ్యం కాదని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య గురువారం ఇక్కడ ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. రెపో రేటుకు అనుగుణంగా తమ రుణ రేట్లను బ్యాంకులు సర్దుబాటు చేయలేవని ఎస్బీఐ చీఫ్ పేర్కొన్నారు. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ఈ ఏడాది ఈ రేటును ఆర్బీఐ 1.25% తగ్గించింది. దీనితో ఈ రేటు 6.75%కి తగ్గింది. తాను రెపో రేటును 1.25% తగ్గించినప్పటికీ, బ్యాంకులు దాదాపు 0.70% వరకూ తమ రుణ రేటును తగ్గించాయని, తన నుంచి అందిన ‘రుణ రేటు’ ప్రయోజనాన్ని పూర్తిగా బ్యాంకింగ్ బదలాయించడం లేదని ఆర్బీఐ పదేపదే చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో అరుంధతీ భట్టాచార్య ఈ వ్యాఖ్య చేశారు. కారణం ఏమిటంటే...! భారత్ బ్యాంకులు ప్రధానంగా ఆధారపడేది డిపాజిట్లపైనేనని ఆమె ఈ సందర్భంగా వివరించారు. తమ నిధులకు మార్కెట్ రుణాలపై బ్యాంకులు ఆధారపడవన్నది గుర్తించాలని, ఇలాంటి పరిస్థితుల్లో రెపో రేటు యథాతథంగా బ్యాంకింగ్ అమలు చేయలేదని వివరించారు. ఎస్బీఐ నిధులకు సంబంధించి 97 శాతం ఆధారపడేది డిపాజిట్లపైనేని ఆమె ఈ సందర్భంగా పేర్కొంటూ... ఈ పరిస్థితుల్లో బ్యాంక్ వ్యయ భారాన్ని తగ్గించుకోడానికి రెపో రేటులో మార్పు ఎంతమాత్రం దోహదపడదని తెలిపారు. విదేశీ బ్యాంకులు తమ నిధులకు దాదాపు 30 నుంచి 40 శాతం మార్కెట్ రుణాలపై ఆధారపడతాయని ఆమె వివరిస్తూ... అలాంటి పరిస్థితుల్లో మాత్రమే రెపో రేటును తక్షణం యథాతథంగా అమలు చేయడం సాధ్యమవుతుందని వివరించారు. 2013లో ఆర్బీఐ రెపో రేటును 3 శాతం పెంచిందని ఆమె పేర్కొంటూ... ఆ మేరకు బ్యాంకులు తమ రుణ రేటు పెంచలేదని వివరించారు. కాగా మార్జినల్ కాస్ట్ ఆధారిత బేస్ రేటుపై ఆర్బీఐ తాజా మార్గదర్శకాలను ఆమె ప్రస్తావిస్తూ, బాగా ఆలోచించే వీటిని రూపొందిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే మార్గదర్శకాలు ఎలా ఉన్నాయన్న అంశంపై అవి వెలువడిన తర్వాతే వ్యాఖ్యానించగలనని పేర్కొన్నారు. కాగా ముసాయిదా మార్గదర్శకాలు ఆచరణయోగ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. -
ఆర్బీఐ అనుమతి అవసరం లేదు
ముంబై : అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రిజర్వ్ బ్యాంక్ అనుమతులు లేకుండానే బ్యాంకులు నిధులు సమీకరించచవచ్చు. దీనికి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ సడలించింది. భారత ప్రభుత్వం ఒక వాటాదారుగా ఉన్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నుంచి బ్యాంకులు రుణాలు తీసుకోవచ్చని, దీనికి తమ నుంచి ఎలాంటి అనుమతులూ అక్కర్లేదని ఆర్బీఐ పేర్కొంది. అయితే ఈ నిధులను బ్యాంకులు మూలధన అవసరాలకు కాకుండా సాధారణ బ్యాంక్ కార్యకలాపాలకు మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టంచే సింది. ఇక డిపాజిట్లు స్వీకరించని బ్యాంకేతర ఆర్థిక సంస్థలు(ఎన్బీఎఫ్సీ) ఆర్బీఐ అనుమతి లేకుండానే మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ స్కీమ్స్(ఎంటీఎస్ఎస్) సబ్-ఏజెంట్లుగా వ్యవహరించవచ్చు. -
ఈ నాలుగు ముఖ్యం
ఈక్విటీలు గత కొన్నేళ్లుగా ఆశించిన లాభాలను ఇవ్వకపోవడంతో ఇన్వెస్టర్లు డెట్ ఫండ్లు, బంగారం వంటి ఇతర ప్రత్యామ్నాయాలపైకి దృష్టి మళ్లించారు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి పసిడిలో పెట్టుబడులు పెట్టారు. 2011 అక్టోబర్ నుంచి 2013 మే మధ్యకాలంలో (ఈ వ్యవధిలో రెపో రేటు 8 శాతం పైనుంచి 7.25 శాతానికి తగ్గింది) రిజర్వు బ్యాంకు అనుసరించిన విధానాల కారణంగా డెట్ ప్రొడక్టుల్లో పెట్టుబడులు పెట్టిన వారికి 10% వరకు ఆదాయం లభించింది. 2013 జూన్ తర్వాత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్లలో అసాధారణ అస్థిరత్వం నెలకొంది. ఈ సమస్యను అధిగమించేందుకు లిక్విడిటీని కట్టడి చేసే చర్యలను రిజర్వు బ్యాంకు చేపట్టింది. స్థూల ఆర్థిక వాతావరణం మెరుగుపడడంతో ఆ చర్యల ఉపసంహరణను రిజర్వు బ్యాంకు క్రమంగా అమలుచేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెపో రేటును ఆర్బీఐ మరోమారు 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందనేది మార్కెట్ అంచనా. కనుక, మీ కష్టార్జితాన్ని డెబిట్ ప్రొడక్టుల్లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవేమిటంటే... {పొడక్టుపై వసూలు చేసే చార్జీలను పరిశీలించాలి. చార్జీల వ్యయం అధికంగా ఉంటే ఆ మేరకు ఆదాయం తగ్గిపోతుంది. {పొడక్టుకు ఉన్న క్రెడిట్ రేటింగ్‌ను చూడాలి. సొమ్మును ఎలాంటి పథకాల్లో పెట్టుబడి పెడతారో గమనించాలి. అధిక ఆదాయం ఉన్నదంటే.. తక్కువ రేటింగ్ కలిగిన ఇన్‌స్ట్రుమెంట్లపై ఈ ప్రొడక్టు దృష్టి కేంద్రీకరిస్తుందన్న మాట. టాక్స్-ఫ్రీ బాండ్లు మినహా, ఇతర బాండ్ల విషయంలో పన్ను భారం ఉంటుంది. తక్కువ పన్ను సౌలభ్యం డెట్ ఫండ్లలో ఉంది. డెబిట్ మ్యూచువల్ ఫండ్లలో ఏడాదికి మించి చేసే పెట్టుబడులపై ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను(ద్రవ్యోల్బణం పెరుగుదల) కోరడం ద్వారా పెట్టుబడిదారులు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. గత కొన్ని నెలలుగా కొంత అస్థిరత్వం ఉన్నప్పటికీ, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, డిబెంచర్లు, డెబిట్ మ్యూచువల్ ఫండ్లు (ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్లు, షార్ట్ టర్మ్ ఫండ్ల వంటివి) అధిక రాబడి ఇస్తూనే ఉన్నాయి. డెబిట్ ఫండ్లలో పెట్టుబడులను నాలుగు అంశాల ఆధారంగా చేయాలి. అవి: 1. ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ 2. ప్రొడక్టులు 3. పోర్ట్‌ఫోలియోలు 4. పనితీరు. -
బ్యాంకులపై తగ్గిన ఫిర్యాదులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో గడిచిన ఏడాది బ్యాంకులపై వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 17 శాతం తగ్గినట్లు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని బ్యాంకులపై 2011-12లో 5,167 ఫిర్యాదులు వస్తే అది 2012-13 నాటికి 4,303కి తగ్గినట్లు ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్ అంబుడ్స్‌మెన్ ఎన్. కృష్ణమోహన్ తెలిపారు. ఇందులో అత్యధికంగా 70 శాతం ప్రభుత్వరంగ బ్యాంకులపైన వచ్చినవేనని, దీనికి ప్రధాన కారణం పీఎస్‌యూ బ్యాంకుల శాఖలు, ఖాతాదారుల సంఖ్య ఎక్కువగా ఉండటమేనని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ కృష్ణమోహన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొత్తం ఫిర్యాదుల్లో ఎస్బీఐ, దాని అనుబంధ శాఖలవే 46 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్యలో తగ్గుదల బాగా కనిపించింది. 2012-13 సమీక్షా కాలంలో గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ పరిధిలో ఫిర్యాదులు 37 శాతం నుంచి 27 శాతానికి తగ్గితే, మిగిలిన పట్టణాల్లో 34 శాతం నుంచి 31 శాతానికి తగ్గాయి. వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికంగా ఏటీఎం, డెబిట్ కార్డు లావాదేవీలకు సంబంధించినవే ఉంటున్నాయని, ఆ తర్వాతి స్థానంలో పెన్షన్‌కు సంబంధించినవి ఉంటున్నట్లు మోహన్ తెలిపారు. వరుసగా రెండో సంవత్సరంలో కూడా ఆన్లైన్ మోసాలు పెరిగాయని కృష్ణ మోహన్ తెలిపారు. మోసం చేయాలనుకునే వారు మొబైల్ ఆపరేటర్ దగ్గరకెళ్ళి ఫోన్ పోయిందని చెప్పి డూప్లికేట్ సిమ్ తీసుకుంటున్నారని, దీనివల్ల వన్‌టైమ్ పాస్వర్డ్ కొత్త సిమ్కార్డుకొస్తున్నాయన్నారు. మొబైల్ ఆపరేటర్లు డూప్లికేట్ సిమ్ జారీ చేసేటప్పుడు కఠినమైన కేవైసీ నిబంధనలు పాటిస్తే వీటి ని అరికట్టవచ్చన్నారు. నవంబర్ 1 నుంచి ఏటీఎం, డెబిట్ కార్డుల్లో మరికొన్ని రక్షణాత్మకమైన అంశాలను జోడిస్తున్నట్లు తెలిపారు. జరిమానా పరిమితి పెంపు గడిచిన ఏడాది వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో 4,112 పరిష్కరించినట్లు తెలిపారు. ఇందులో 63 కేసుల్లో శిక్షలు విధించడమే కాకుండా రూ.84 లక్షలు జరిమానా విధించినట్లు తెలిపారు. ప్రస్తుతం అంబుడ్స్‌మెన్‌కి గరిష్టంగా రూ.10 లక్షలు వరకు మాత్రమే జరిమానా విధించే అధికారం ఉందని, ఇప్పుడు దీన్ని రూ.25 లక్షలకు పెంచాలని ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు.