penalty
-
డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం, రూ..11.42 కోట్ల జరిమానా
ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ బిడ్డకు జన్మనివ్వడమంటే మహిళకు మరో జన్మ. గర్భంలో పాపాయి రూపు దిద్దుకోవడం మొదలు, ప్రసవం దాకా నిరంతరం పర్యవేక్షణ అవసరం. స్వయంగా గర్భిణీతోపాటు, కుటుంబ సభ్యులు, చికిత్స అందించే వైద్యులు అప్రమత్తంగా ఉండాల్సిందే. కానీ వైద్యుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారులకు కన్నతల్లిని దూరం చేసింది. మలేసియాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈకేసులో ఆ దేశ కోర్టు ఇచ్చిన తీర్పు నెట్టింట చర్చకు దారి తీసింది. 2019లో జరిగిన సంఘటన ఇది. 36 ఏళ్ల పునీత మోహన్(Punita Mohan) రెండో కాన్పుకోసం ఆస్పత్రి లో చేరింది. అయితే ప్రసవం తరువాత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. పోస్ట్‌పార్టమ్ హెమరేజ్ (Postpartum Hemorrhage) కారణంగా విపరీత రక్తస్రావం అయింది. నొప్పితో ఆమె విలవిల్లాడి పోయింది. బ్లీడింగ్ అవుతోందని ఆమె తల్లి ఆమెకు వైద్యం చేసిన వైద్యడు డాక్టర్లు రవి, క్లినిక్ యజమాని షణ్ముగానికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ప్రాణాంతకమని తెలిసినా నిర్ల్యక్ష్యంగా వ్యవహరించారు. పైగా మావిని చేతితో తీయడం వల్ల రక్తస్రావం అవుతోందని, అంతా సర్దుకుంటుందని కుటుంబ సభ్యులకు చెప్పి ఎటో వెళ్లి పోయారు. రెండు గంటలు గడిచిన తరువాత కూడా ఆమె గురించి వాకబు చేయలేదు. పరిస్థితి విషమించడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. తన కళ్ల ముందే తన బిడ్డ ఊపిరి తీసుకోవడానికి కష్టపడి నానాయతన పడిందని, ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేశారంటూ పునీత తల్లి కన్నీటి పర్యంతమైంది.ఈ కేసును విచారించిన హైకోర్టు బాధిత కుటుంబానికి రూ.11.42 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఈ మరణం సంభవించి ఉండేది కాదని కోర్టు పేర్కొంది. వైద్యులు రోగికి భద్రత కల్పించకుండా, గంటల తరబడి వదిలివెళ్లడం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించింది. అంతులేని నిర్లక్ష్యం కారణంగానే పునీత మరణించిందని ఆగ్రహించిన కోర్టు ఇద్దరు వైద్యులకు భారీ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. -
ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. డెడ్‌లైన్ పొడిగింపు
ఆదాయపు పన్ను శాఖ 'వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024' (Vivad Se Vishwas Scheme 2024) గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు తక్కువ ట్యాక్స్ రేట్లతో వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించింది.డిసెంబర్ 31తో ముగియనున్న 'వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024' గడువును ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ 2025 జనవరి 31కి పొడిగించింది. ఈ గడువును పొడిగించకుండా ఉండి ఉంటే.. దరఖాస్తు చేసుకునేవారు 10 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి ఉండేది. కాబట్టి ఇప్పటి వరకు ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకొని వారు కూడా నిర్దిష్ట గడువు లోపల అప్లై చేసుకోవచ్చు.పొడిగించిన గడువు వల్ల ప్రయోజనాలువివాద్ సే విశ్వాస్ స్కీమ్ అనేది.. 2024 బడ్జెట్లో ప్రకటించారు. పన్ను (Tax) చెల్లింపుదారులు తక్కువ మొత్తంలో వివాద్ సే పన్నును చెల్లించడం ద్వారా పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి అనుమతిస్తుంది.2025 జనవరి 31 తరువాత లేదా ఫిబ్రవరి 1నుంచి వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కోసం అప్లై చేసుకునే వారు అదనంగా 10 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ సీబీడీటీ (CBDT) పేర్కొంది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.CBDT extends due date for determining amount payable as per column (3) of Table specified in section 90 of Direct Tax Vivad Se Vishwas Scheme, 2024 from 31st December, 2024 to 31st January, 2025.Circular No. 20/2024 dated 30.12.2024 issuedhttps://t.co/uYGf1Oh3g2 pic.twitter.com/agjuRsMHqg— Income Tax India (@IncomeTaxIndia) December 30, 2024 -
మినిమం బ్యాలెన్స్ లేదంటే జరిమానా.. తప్పించుకోవడం ఎలా?
పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానా(penalty) చెల్లించాలనేలా బ్యాంకు సిబ్బంది చెబుతుంటారు. అకౌంట్ నిర్వహణ, ఏటీఎం కార్డు ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఛార్జీలు.. వంటి వాటికోసం సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. లేదంటే నిబంధనల ప్రకారం తిరిగి అకౌంట్(Bank Account) వినియోగించినప్పుడు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందికి ఒకటికి మించిన బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. దాంతో ప్రధానంగా ఉన్న అకౌంట్లోనే లావాదేవీలు(Transactions) నిర్వహిస్తూ మిగతావాటి జోలికి వెళ్లడంలేదు. దాంతో కొన్ని రోజుల తర్వాత తిరిగి ఆ అకౌంట్లో లావాదేవీలు చేయాలంటే జరిమానా చెల్లించడం తప్పడం లేదు. కొన్ని చిట్కాలు పాటించి జరిమానా భారాన్ని తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే..సేవింగ్స్ ఖాతాలో అవసరమైన మినిమం బ్యాలెన్స్(Minimum Balance) ఎల్లవేళలా ఉండేలా చూసుకోవాలి. సగటు నెలవారీ బ్యాలెన్స్ (MBA)ను ఎలా లెక్కిస్తారో మీ బ్యాంకు సిబ్బందిని అడిగి తెలుసుకోండి. దాని పరిమితికి మించి లావాదేవీలు నిర్వహించడానికి ప్రయత్నించాలి.ఉదాహరణకు, మీ మినిమం బ్యాలెన్స్ రూ.10,000 అయితే అవసరమైన ఎంఏబీని మెయింటెన్ చేయడానికి నెలలోపు ఆరు రోజుల పాటు రూ.50,000 మీ అకౌంట్లో ఉండాలి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నవారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ నిబంధనలు ప్రతి బ్యాంకును అనుసరించి మారుతుంటాయి. మీ బ్యాంకులో ఎంఏబీ నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా అకౌంట్లో నగదు ఉంచుకోవాలి.జీరో బ్యాలెన్స్ ఖాతాలుబేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీఏ) అని కూడా పిలువబడే ఈ జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాకు మారేందుకు ప్రయత్నించాలి. చాలావరకు సాలరీ అకౌంట్లు ఈ తరహా ఖాతాలుగా ఉంటాయి. ఈ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.రెగ్యులర్ మానిటరింగ్అకౌంట్ బ్యాలెన్స్ అవసరమైన కనీస స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసుకోవాలి. బ్యాలెన్స్ ట్రాక్ చేయడంలో మీకు సహాయపడటానికి అలర్ట్‌లు లేదా రిమైండర్లను సెట్ చేసుకోవాలి. ఏదైనా కారణాలతో డబ్బు కట్ అయిన వెంటనే అలెర్ట్ వచ్చేలా ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి, మినిమం బ్యాలెన్స్ పాటించవచ్చు.ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్స్అవసరమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మీరు తరచూ లావాదేవీలు చేసే ప్రధాన అకౌంట్ నుంచి బ్యాలెన్స్ తక్కువగా ఉన్న సేవింగ్స్ అకౌంట్‌కు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్లను సెట్ చేసుకోవాలి.ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో రైల్వేశాఖ కీలక నిర్ణయాలుఖాతాను మూసివేయడంఎంత ప్రయత్నించినా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహించలేకపోతే, ప్రస్తుత ఖాతాను మూసివేసి, జీరో బ్యాలెన్స్ ఖాతాలను అందించే బ్యాంకుతో అనుసందానమై కొత్త ఖాతా తెరవడానికి ప్రయత్నించండి. -
రిలయన్స్ సెక్యూరిటీస్‌కు సెబీ గట్టి దెబ్బ
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిలయన్స్ సెక్యూరిటీస్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చెక్ పెట్టింది. స్టాక్ బ్రోకర్ సంస్థకు రూ. 9 లక్షలు జరిమానా చెల్లించవలసిందిగా ఆదేశించింది. ఖాతాలు, రికార్డులు, అధికారిక వ్యక్తుల ఇతర డాక్యుమెంట్లను సెబీసహా స్టాక్ ఎక్స్చేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ థిమాటిక్ ఆన్సైట్ పరిశీలన చేపట్టాయి.2022 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్‌వరకూ పరిశీలనకు పరిగణించాయి. తదుపరి 2024 ఆగస్ట్ 23న సంస్థకు సెబీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెబీ వద్ద రిజిస్టరైన రిలయన్స్ సెక్యూరిటీస్ స్టాక్ బ్రోకర్ నిబంధనలకు అనుగుణంగా ఖాతాలను నిర్వహించవలసి ఉంటుంది.అంతేకాకుండా ఎన్ఎస్ఈఐఎల్ క్యాపిటల్ మార్కెట్ మార్గదర్శకాలు, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ లావాదేవీ నిబంధనలు అమలు చేయవలసి ఉంటుంది. అయితే క్లయింట్ ఆర్డర్ ప్లేస్‌మెంట్స్, తగినవిధంగా వ్యవస్థలను నిర్వహించకపోవడం తదితర నిబంధనల ఉల్లంఘనను గు ర్తించినట్లు 47 పేజీల ఆదేశాలలో సెబీ పేర్కొంది. -
ఎనిమిది కంపెనీలకు రూ.7300 కోట్ల పెనాల్టీ!.. కారణం ఇదే..
హ్యుందాయ్ మోటార్, మహీంద్రా, కియా, హోండాతో సహా మొత్తం 8 దిగ్గజ కార్ల తయారీదారులు కేంద్రం గట్టి షాకివ్వనుంది. ఈ కంపెనీలు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఉద్గార ప్రమాణాలను పాటించనందుకు అధిక పెనాల్టీని ఎదుర్కోవలసి ఉంటుంది.2022లో అమలులోకి వచ్చిన కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ కెపాసిటీ (CAFE) ప్రమాణాల ప్రకారం.. కంపెనీలు విక్రయించే అన్ని కార్లు 100 కిలోమీటర్లకు 4.78 లీటర్ల కంటే ఎక్కువ ఇంధన వినియోగం జగగకూడదు. అంతే కాకుండా కర్బన ఉద్గారాలు కూడా కిలోమీటరుకు 113 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే కంపెనీలు ఈ నియమాలను పెడచెవిన పెట్టినట్లు సమాచారం. ఈ కారణంగానే కేంద్రం ఈ సంస్థలకు రూ.7,300 కోట్లు పెనాల్టీ విధించనుంది.కేంద్రం విధించనున్న ఫెనాల్టీలో అత్యధికంగా హ్యుందాయ్ మోటార్‌కు (రూ. 2837.8కోట్లు) పడే అవకాశం ఉంది. ఆ తరువాత స్థానంలో మహీంద్రా (రూ.1788.4 కోట్లు), కియా (రూ.1346.2 కోట్లు), హోండా (రూ.457.7 కోట్లు), రెనాల్ట్ (రూ.438.3 కోట్లు), స్కోడా (రూ.248.3 కోట్లు), నిస్సాన్ (రూ. 172.3 కోట్లు), ఫోర్డ్ (రూ.1.8 కోట్లు) ఉన్నాయి.ఈ విషయం మీద ఆటోమొబైల్ కంపెనీనీలు.. కేంద్రంతో చర్చలు జరుపుతున్నాయి. తాము 2023 జనవరి 1నుంచి ఉద్గార ప్రమాణాలకు సంబంధించిన అన్ని నియమాలను కఠినంగా పాటిస్తున్నామని సంస్థలు పేర్కొన్నాయి. కాబట్టి ఆ ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి పెనాల్టీ విధించడం సరికాదని చెబుతున్నాయి. దీనిపైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. -
రూ. 213 కోట్లు జరిమానా.. అప్పీలుకు మెటా
న్యూఢిల్లీ: వాట్సాప్ గోప్యతా పాలసీకి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ. 213 కోట్లు జరిమానా విధించడంపై అప్పీలుకెళ్లనున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం మెటా వెల్లడించింది. 2021లో అమల్లోకి తెచ్చిన అప్డేట్లో యూజర్ల వ్యక్తిగత మెసేజీల గోప్యతకు భంగం కలిగించే మార్పులేమీ చేయలేదని స్పష్టం చేసింది.వాస్తవానికి డేటా సేకరణ, వినియోగంపై మరింత స్పష్టతనివ్వడంతో పాటు పలు బిజినెస్ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టామని పేర్కొంది. వివిధ సేవలతో ప్రజలు, వ్యాపార సంస్థలకు వాట్సాప్ ఎంతో ఉపయోగకరమైనదిగా ఉంటోందని, ఇదంతా మెటా సహకారంతోనే సాధ్యపడుతోందని వివరించింది.మాతృసంస్థ మెటాతో యూజర్లు తమ డేటాను తప్పనిసరిగా షేర్ చేసుకునేలా 2021లో పాలసీని అప్డేట్ చేయడం పోటీ నిబంధనలకు విరుద్ధమంటూ సీసీఐ రూ. 213 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్
వాట్సాప్ గోప్యత పాలసీ 2021 అప్డేట్కి సంబంధించి అనుచిత వ్యాపార విధానాలను అమలు చేసినందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ.213 కోట్ల జరిమానా విధించింది. వీటిని సరిదిద్దుకునేందుకు నిర్దిష్ట వ్యవధిలోగా తగు చర్యలు తీసుకోవాలని మెటా, వాట్సాప్‌లను ఆదేశించింది. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.వాట్సాప్ తన ప్లాట్‌ఫాం ద్వారా సేకరించే డేటాను సర్వీస్ అందించడానికైతే తప్ప అయిదేళ్ల వరకు ప్రకటనలపరమైన అవసరాల కోసం ఇతర మెటా కంపెనీలకు షేర్ చేయకూడదని సీసీఐ పేర్కొంది. ఇతరత్రా అవసరాల కోసం షేర్ చేసుకునేటప్పుడు కచ్చితమైన వివరణ ఇవ్వాలని తెలిపింది. 2021 ఫిబ్రవరి నాటి పాలసీ అప్డేట్ ప్రకారం వాట్సాప్‌ను ఉపయోగించుకోవడాన్ని కొనసాగించాలంటే యూజర్లు తమ డేటాను మెటా కంపెనీలతో షేర్ చేసుకోవడానికి తప్పనిసరిగా అంగీకరించాలనే షరతును చేర్చారు. అంతకు ముందు ఇది ఐచ్ఛికంగానే ఉండేది. గుత్తాధిపత్యం ఉన్న మెటాతో డేటాను షేర్ చేయడాన్ని తప్పనిసరి చేయడం వల్ల ప్రకటనల మార్కెట్లో పోటీ సంస్థలకు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది.ఇదీ చదవండి: బైబ్యాక్, డివిడెండ్ పాలసీలో మార్పులుమెటా స్పందనడేటా షేరింగ్ విషయంలో సీసీఐ వాదనల్లో నిజం లేదని మెటా ప్రతినిధులు తెలిపారు. ఈ అంశంపై అప్పీల్‌కు వెళ్తామన్నారు. 2021 పాలసీ అప్డేట్ను సమర్థిస్తూ, వినియోగదారుల వ్యక్తిగత సందేశాల గోప్యత విధానాలను మార్చలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో యూజర్లకు ఆప్షన్ ఉన్నట్లు తెలిపారు. పాలసీని అంగీకరించనందుకు ఏ ఒక్క వినియోగదారుడి ఖాతా తొలగించలేదన్నారు. డేటా సేకరణ, దాని వినియోగంలో పారదర్శకతకు మెటా పెద్దపీట వేస్తోందని చెప్పారు. భారతదేశంలో వాట్సాప్ ఒక ప్రధాన ప్లాట్‌ఫామ్‌గా నిలిచిందని, వ్యాపారాలు, ప్రభుత్వ సేవలు, చిన్న సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తోందని కంపెనీ పేర్కొంది. -
ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానా
పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కొత్త వార్నింగ్ ఇచ్చింది. విదేశీ ఆస్తులు లేదా విదేశాల నుండి సంపాదించిన ఆదాయాన్ని తమ ఐటీఆర్‌లో బహిర్గతం చేయడంలో విఫలమైతే రూ.10 లక్షల జరిమానా విధించనున్నట్లు ట్యాక్స్ పేయర్స్‌ను హెచ్చరిస్తూ అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించింది.పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో అసెస్మెంట్ ఇయర్ 2024-25కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని నివేదించేలా చూడటమే లక్ష్యంగా ఈ "కంప్లయన్స్-కమ్-అవేర్నెస్ క్యాంపెయిన్"ను ఐటీ శాఖ చేపట్టింది. ఉల్లంఘించినవారికి బ్లాక్ మనీ నిరోధక చట్టం కింద జరిమానా విధించనున్నట్లు పేర్కొంది.విదేశీ ఆస్తి అంటే ఏమిటి?ఐటి శాఖ అడ్వైజరీ ప్రకారం.. భారతీయ నివాసితులకు విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు, నగదు రూప బీమా ఒప్పందాలు, ఏదైనా సంస్థ లేదా వ్యాపారంపై ఆదాయం, స్థిరాస్తి, కస్టోడియల్ ఖాతా, ఈక్విటీ, రుణ వడ్డీలు, ట్రస్టీలుగా ఉండే ట్రస్ట్‌లు, సెటిలర్ ప్రయోజనాలు, మూలధన ఆస్తి వంటి వాటిని విదేశీ ఆస్తిగా పరిగణిస్తారు. -
మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాపై యురోపియన్ కమిషన్ భారీ జరిమానా విధించింది. యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను మెటాకు ఏకంగా 800 మిలియన్ యూరోలు(840 మిలియన్ డాలర్లు-రూ.6,972 కోట్లు) పెనాల్టీ విధించింది. మెటా తన మార్కెట్ గుత్తాధిపత్యాన్ని వినియోగించుకుని ఆన్లైన్ క్లాసిఫైడ్ యాడ్స్ వ్యాపారంలో పోటీ వ్యతిరేక విధానాలను అవలంబించిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది.‘యూరోపియన్ యూనియన్ యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా సంస్థపై దాదాపు రూ.6,972 కోట్లమేర పెనాల్టీ విధించాం. నిబంధనలకు విరుద్ధంగా ఫేస్బుక్ మార్కెట్ స్పేస్‌ను వినియోగించుకుంటుంది. ఫేస్బుక్లో తనకు పోటీగా ఉన్న ఇతర ప్రకటన ఏజెన్సీలకు సంబంధించి ఆన్లైన్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్‌పై అననుకూల వ్యాపార పరిస్థితులను అమలు చేసింది. ఫేస్బుక్ వినియోగదారులకు మార్కెట్‌స్పేస్ యాక్సెస్ ఇస్తూ పోటీ వ్యతిరేక విధానాలను అవలబింస్తుంది. దాని ద్వారా ఫేస్బుక్ తన మార్కెట్ గుత్తాధిపత్యంతో నిబంధనలను దుర్వినియోగం చేస్తోంది. దాంతోపాటు చట్టవిరుద్ధంగా ఫేస్బుక్ వినియోగదారులకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రకటనలను జొప్పిస్తోంది’ అని యురోపియన్ కమిషన్ ఆరోపించింది.ఇదీ చదవండి: తగ్గేదేలే.. మరోసారి పని గంటలపై నారాయణ మూర్తి వ్యాఖ్యలుకంపెనీ స్పందనయురోపియన్ కమిషన్ లేవనెత్తిన ఆరోపణలకు ఎలాంటి రుజువులు లేవని మెటా తెలిపింది. ఈ అంశంపై అప్పీలుకు వెళుతామని స్పష్టం చేసింది. మెటా తన ప్రకటనదారుల నిబంధనలకు కట్టుబడి ఉందని తెలిపింది. వినియోగదారులు ఫేస్బుక్ మార్కెట్‌ప్లేస్‌ను అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా వారి ఇష్టంపై ఆధారపడుతుందని చెప్పింది. అందులో కంపెనీ ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. -
గూగుల్ ఆస్తులమ్మినా తీరనంత జరిమానా!
గూగుల్‌కు రష్యా కోర్టు భారీ షాకిచ్చింది. 20 డెసిలియన్ డాలర్లు (20,000,000,000,000,000,000,000,000,000,000,000 డాలర్లు) జరిమానా చెల్లించాలని మాస్కో కోర్టు టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌ను ఆదేశించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభ సమయంలో సంస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఇందుకు కారణమని కోర్టు తెలిపింది. ఈమేరకు రష్యా మీడియా సంస్థ ఆర్బీసీ(రాస్బైజెన్స్ కన్సల్టింగ్) వివరాలు వెల్లడించింది.ఆర్బీసీ తెలిపిన వివరాల ప్రకారం..‘మాస్కో కోర్టు గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. కంపెనీ 20 డెసిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ రష్యాకు చెందిన 17 టీవీ ఛానెళ్లు, మీడియా ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022లో ఉక్రెయిన్‌పై దాడికి ఆదేశించిన తర్వాత ఈ ఛానెళ్లపై వేటు వేశారు. అందుకు వ్యతిరేకంగా మీడియా ఛానళ్లు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు న్యాయపరమైన అంశాలకు లోబడి గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. కోర్టు తీర్పు ప్రకారం గూగుల్ బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లను తొమ్మిది నెలల్లోపు పునరుద్ధరించవలసి ఉంటుంది’ అని పేర్కొంది.‘గూగుల్ మరింత మెరుగవ్వాలి’క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ అంశంపై మాట్లాడారు. ‘గూగుల్‌పై నిర్దిష్టంగా ఎంతమొత్తం జరిమానా విధించారో కచ్చితంగా చెప్పలేను. గూగుల్ మా దేశ కంపెనీలపై ఆంక్షలు విధించడం సరైన విధానం కాదు. మీడియా సంస్థలు, బ్రాడ్కాస్టర్ల హక్కులను హరించకూడదు. కోర్టు నిర్ణయంతో గూగుల్ తన పరిస్థితిని మరింత మెరుగు పరుచుకునేందుకు వీలుంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.2020లోనే కొన్ని ఛానెళ్లపై వేటుగూగుల్ రష్యాలోని ప్రైవేట్ మిలిటరీ సంస్థ వాగ్నర్ గ్రూప్ మెర్సెనరీ చీఫ్ ప్రిగోజిన్, ఒలిగార్చ్ మలోఫీవ్లకు చెందిన ఛానెళ్లను 2020లో బ్లాక్ చేసినట్లు రష్యాకు చెందిన ఎన్బీసీ న్యూస్ ఛానల్ తెలిపింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో యూట్యూబ్ మరిన్ని ఛానెళ్లను నిషేధించిందని పేర్కొంది.రష్యా గూగుల్ ఎల్ఎల్సీ దివాలా!గూగుల్ మార్కెట్ విలువ మొత్తంగా అక్టోబర్ నాటికి 2.15 ట్రిలియన్ డాలర్లు(రూ.179 లక్షల కోట్లు)గా ఉంది. కానీ కంపెనీకి విధించిన జరిమానా చాలా రెట్లు ఎక్కువ. గూగుల్ రష్యాలోని తన అనుబంధ సంస్థ ‘గూగుల్ ఎల్ఎల్సీ’ దివాలా కోసం జూన్ 2022లో దాఖలు చేసింది. కానీ దాని పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కోర్టు పేర్కొంది.(Apple: భారత్‌లో కొత్తగా నాలుగు అవుట్లెట్లు!)గూగుల్ స్పందన ఇదే..‘రష్యాతో కొన్ని చట్టపరమైన అంశాలపై చర్చించాల్సి ఉంది. బ్లాక్ చేసిన ఛానెళ్లకు సంబంధించి కోర్టు కాంపౌండింగ్ పెనాల్టీలను విధించింది. అదే తుది నిర్ణయంగా జరిమానా కట్టాలని పేర్కొంటుంది. దీనిపై రష్యా జ్యుడిషియరీలో చర్చించాల్సి ఉంది. ఈ అంశాలు కంపెనీ విధానాలపై ఎలాంటి ప్రభావం చూపవు’ అని తెలిపింది. -
యూనియన్ బ్యాంక్‌పై భారీ జరిమానా
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) చర్యలు చేపట్టింది. అనుమానాస్పద లావాదేవీలను నివేదించడంలో విఫలమైనందుకు, ముంబై శాఖలలోని కొన్ని ఖాతాలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోనందుకు రూ.54 లక్షల జరిమానా విధించింది.మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 13 కింద అక్టోబరు 1న యూనియన్ బ్యాంక్‌కు పెనాల్టీ నోటీసును జారీ చేసిన ఎఫ్ఐయూ బ్యాంక్ చేసిన రాతపూర్వక, మౌఖిక సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత యూనియన్ బ్యాంక్‌పై అభియోగాలు నిరూపితమైనవిగా గుర్తించింది.ఎఫ్ఐయూ ఈ మేరకు బ్యాంక్ కార్యకలాపాల సమగ్ర సమీక్ష చేపట్టబడింది. కేవైసీ/ఏఎంఎల్ (యాంటీ మనీ లాండరింగ్)కి సంబంధించిన కొన్ని "వైఫల్యాలను" వెలికితీసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై హిల్ రోడ్ బ్రాంచ్‌లో నిర్దిష్ట కరెంట్ ఖాతాలపై చేసిన స్వతంత్ర పరిశీలనలో ఒక ఎన్బీఎఫ్సీ దాని అనుబంధ సంస్థల ఖాతాల నిర్వహణలో అవకతవకలు ఉన్నట్లు వెల్లడైందని పబ్లిక్ ఆర్డర్ సారాంశంలో ఎఫ్ఐయూ పేర్కొంది. -
ఆకాసా ఎయిర్‌కు రూ.30 లక్షలు జరిమానా.. ఎందుకంటే..
ప్రముఖ విమానయాన సంస్థ ఆకాసా ఎయిర్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఆకాసా ఎయిర్ పలు నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. ఈ జరిమానాను ముప్పై రోజుల్లోపు చెల్లించాలని స్పష్టం చేసింది.ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏఓ) ఆధ్వర్యంలోని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రెగ్యులేషన్ ప్యానల్(ఏటీఆర్పీ) ఆమోదం లేకుండా పైలట్లకు శిక్షణ ఇస్తున్నట్లు డీజీసీఏ పేర్కొంది. దాంతోపాటు పైలట్ల శిక్షణ సమయం అధికంగా ఉందని చెప్పింది. క్యాట్ 2/3 ఆపరేషన్(విమానం దిగేందుకు అనుసరిస్తున్న విధానం) కోసం అర్హత లేని ఎగ్జామినర్లను నియమించడం వంటివి ఉల్లంఘనల్లో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆకాసా ఎయిర్ సరైన విధంగా స్పందించలేదని డీజీసీఏ పేర్కొంది. మే 20, 2024న డీజీసీఏ స్పాట్ ఇన్స్పెక్షన్ చేయడంతో ఈ ఉల్లంఘనలు బయటపడినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..ఇప్పటికే ఆగస్టు 29, 2024న జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంస్థ వివరణ ఇచ్చింది. అయితే దీనిపై డీజీసీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు. దాంతో ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937లోని రూల్ 162 ప్రకారం రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆకాసా ఎయిర్ స్పందిస్తూ..‘డీజీసీఏ నుంచి జరిమానా విధించాలంటూ అక్టోబర్ 17, 2024న నోటీసు అందింది. సంస్థ ప్రపంచ భద్రత ప్రమాణాలకు కట్టుబడి ఉంది. ఈ విషయంలో డీజీసీఏతో కలిసి పని చేస్తాం’ అని పేర్కొంది. ఒకవేళ కంపెనీ దీనిపై అప్పీల్ చేయడానికి లేదా పెనాల్టీ చెల్లించడానికి 30 రోజుల సమయం ఉంటుంది. -
వేల కోట్ల రూపాయల ఫైన్!
లండన్: యూరోపియన్ కమిషన్ విధించిన 2.4 బిలియన్ యూరో(రూ.22 వేలకోట్లు)ల జరిమానాను సవాల్ చేస్తూ గూగుల్ దాఖలు చేసిన కేసు వీగిపోయింది. గూగుల్ సెర్చ్‌లో గూగుల్ సొంతంగా షాపింగ్ సిఫారసులు చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన ప్రయోజనం పొందిందంటూ.. 2.4 బిలియన్ యూరోల జరిమానా చెల్లిచాలంటూ 2017లో యూరోపియన్ కమిషన్ ఆదేశించింది. విజిటర్లను అనుచితంగా తన సొంత షాపింగ్ సేవల వైపు మళ్లించడం పోటీదారులకు నష్టం కలిగించడమేనని పేర్కొంది. ఈ ఆదేశాలను యూరోపియన్ యూనియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తాజాగా సమర్థించింది.గూగుల్ ఈ అప్పీల్‌ను తిరస్కరించింది. కోర్టు నిర్ణయం తమను నిరాశపరిచినట్టు, ఈ తీర్పు కేవలం కొన్ని వాస్తవాల ఆధారంగానే ఉన్నట్టు గూగుల్ ప్రకటన విడుదల చేసింది. పోటీదారులను సమానంగా చూడాలన్న యూరోపియన్ కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా తాము 2017లో ఎన్నో మార్పులను అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. షాపింగ్ సెర్చ్ లిస్టింగ్‌లకు సంబంధించి వేలం నిర్వహించినట్టు వివరించింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, యాడ్సెన్స్ అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి మరో రెండు ఈయూ యాంటీట్రస్ట్ కేసుల్లోనూ గూగుల్‌కు వ్యతిరేకంగా ఆదేశాలు రాగా, వీటిపై అప్పీల్‌కు గూగుల్‌కు ఇప్పటికీ అవకాశం మిగిలే ఉంది.ఇదీ చదవండి: పీపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేయాల్సిందేనా..?ఇదిలాఉండగా, గూగుల్‌లో యాడ్ ఇవ్వాలనుకునే ప్రకటన ఏజెన్సీలు కీవర్డ్‌లకు సంబంధించిన బిడ్‌ను వేలంలో గెలుపొందాల్సి ఉంటుంది. వినియోగదారులు సెర్చింజన్లో ఏదైనా సమాచారాన్ని తెలుసుకుంటున్నప్పుడు సెర్చ్ కీవర్డ్‌లకు అనుగుణంగా యాడ్స్ వచ్చేలా ఏర్పాటు చేస్తారు. అలా సెర్చ్ చేసేవారి అభిరుచులకు తగిన యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, షాపింగ్ యాడ్స్.. వంటి వివిధ రూపాల్లో ప్రకటనలు ఇస్తూంటారు. -
ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!
చమురు రంగ పీఎస్‌యూ దిగ్గజాలకు వరుసగా ఐదో త్రైమాసికంలోనూ జరిమానాలు తప్పలేదు. నిబంధనల ప్రకారం సంస్థల్లో స్వతంత్ర, మహిళా డైరెక్టర్ల నియామకం చేపట్టకపోవడంతో ఈ చర్యకు పూనుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.జరిమానా విధించిన కంపెనీల జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్), ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్), మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ ఉన్నాయి. లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా ఆయా కంపెనీల బోర్డుల్లో అవసరమైనమేర స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను ఎంపిక చేసుకోకపోవడంతో జరిమానాల వడ్డింపు కొనసాగింది.ఇదీ చదవండి: ఫెడ్‌వైపు ఇన్వెస్టర్ల చూపుఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్–జూన్)లోనూ స్వతంత్ర, మహిళా డైరెక్టర్లను తగిన సంఖ్యలో నిమమించుకోవడం వల్ల జరిమానాలు తప్పలేదు. గత కొద్దికాలంగా ఈ తంతు కొనసాగుతోంది. ఆయా కంపెనీలు పెనాల్టీ చెల్లిస్తున్నా తీరుమార్చుకోకపోవడం కొంత ఆందోళన కలిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ గరిష్టంగా రూ.5,36,900, కనిష్టంగా రూ.2,41,900 మధ్య జరిమానాలు విధించాయి. -
నిధులు మళ్లింపు.. అంబానీపై రూ.25 కోట్ల పెనాల్టీ
మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ అధికారులతో సహా అనిల్ అంబానీను, 24 సంస్థలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధించింది. దాంతోపాటు అంబానీ రూ.25 కోట్ల పెనాల్టీ చెల్లించాలని పేర్కొంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై కూడా రూ.6 లక్షల జరిమానా విధించి, ఆరు నెలల పాటు మార్కెట్ నుంచి బహిష్కరించింది.అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఆర్హెచ్ఎఫ్ఎల్) ఇతర సంస్థల్లోకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. దాంతో సెబీ దర్యాప్తు జరిపి తాజాగా బాధ్యులపై చర్యలు తీసుకుంది. ఆర్హెచ్ఎఫ్ఎల్ ఆరోపణల నేపథ్యంలో 222 పేజీలతో తుది ఆర్డర్‌ను విడుదల చేసింది. ఈ సంస్థ కీలక అధికారుల సహాయంతో అనిల్ అంబానీకి అనుసంధానం అయిన సంస్థలకు రుణాల రూపంలో నిధులు మళ్లించినట్లు సెబీ కనుగొంది. చిన్న కంపెనీలు నియమాలకు విరుద్ధంగా భారీగా రుణాలు పొందాయని సెబీ గుర్తించింది.ఫిబ్రవరి 2022లో జరిగిన ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఆర్హెచ్ఎఫ్ఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అప్పటి కీలక అధికారులు అనిల్ అంబానీ, అమిత్ బాప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేష్ ఆర్ షాలపై సెబీ చర్యలు తీసుకుంది. వీరిని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. వీరితో సంబంధం ఉన్న కంపెనీలు, వ్యక్తుల నుంచి కూడా మార్కెట్లో ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదని చెప్పింది.ఇదీ చదవండి: పదవీ విరమణ భారం.. దూరం కావాలంటే..ఈ కేసుతో సంబంధం ఉన్న అంబానీతో పాటు మరో ముగ్గురికి చెందిన 24 సంస్థలను మార్కెట్ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, అనిల్ అంబానీపై రూ.25 కోట్లు, బాప్నాపై రూ.27 కోట్లు, సుధాల్కర్పై రూ.26 కోట్లు, షాపై రూ.21 కోట్లు జరిమానా విధించింది. రిలయన్స్ యునికార్న్ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీంజెన్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సహా ఇతర ఒక్కో సంస్థపై రూ.25 కోట్ల చొప్పున జరిమానా విధించింది. -
కన్ఫర్మ్ కాని టికెట్‌తో రైలెక్కితే దించేస్తారు
సాక్షి, హైదరాబాద్: కన్ఫర్మ్ కాని వెయిటింగ్ జాబితాలో ఉన్న రైలు టికెట్‌తో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణిస్తే టీసీలు ఇక రైలు నుంచి దింపేస్తారు. వారు జనరల్ క్లాస్ టికెట్ ధర చెల్లించి అప్పటికప్పుడు ఆ కోచ్‌లోకి మారాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైలు దిగిపోవాల్సిందే. ఈమేరకు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు.. రిజర్వేషన్ క్లాస్‌కు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో అదే క్లాసులో పెనాల్టీ చెల్లించి ప్రయాణించేందుకు కొనసాగుతున్న ’అనధికార’ వెసులుబాటుకు అవకాశం లేకుండా రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.ఇక ఆ టికెట్‌తో వెళ్లడం కుదరదు..రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణం చేసేందుకు ఆన్లైన్లో టికెట్ కొన్నప్పుడు.. కన్ఫర్మ్ అయితే సంబంధిత కోచ్‌లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చు. కానీ, ప్రయాణ సమయం నాటికి కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రద్దయి, టికెట్ రుసుము మొత్తం సంబంధీకుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. టికెటే రద్దయినందున, ఆ టికెట్ ప్రయాణానికి వీలుండదు.కానీ, రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లో కొనుగోలు చేసిన రిజర్వ్డ్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రుసుము కోసం మళ్లీ స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి రద్దు ఫామ్ పూరించి టికెట్‌తో కలిపి అందజేస్తే గానీ ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కానీ, చాలామంది ఆ కన్ఫర్మ్ కాని టికెట్‌ను రద్దు చేసుకోకుండా, సంబంధిత కోచ్ లో ప్రయాణిస్తారు. టీసీ వచ్చినప్పుడు ఫైన్ చెల్లించటం లేదా, ఎంతో కొంత ము ట్టచెప్పటం ద్వారానో ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, కొన్ని టికెట్లు కన్ఫర్మ్ అయి, కొన్ని వెయిటింగ్ జాబితాలోనే ఉండిపోతే, అలాగే సర్దుకుని వెళ్తుంటారు. కానీ, ఇక నుంచి అలాంటి అవకాశం లేకుండా రైల్వే బోర్డు కఠినతరం చేసింది.అలా పట్టుబడితే పెనాల్టీనేటికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో దాన్ని రద్దు చే సుకోవాల్సిందే. ఒక వేళ ఆ టికెట్‌తో రిజర్వ్ డ్ కోచ్‌లో ప్రయాణిస్తూ పట్టుబడితే, వారి నుంచి రూ.250 నుంచి రూ.440 వరకు పెనాల్టీ వ సూలు చేసి, వారిని తదు పరి స్టేషన్లో దింపి, జనర ల్ క్లాస్ టికెట్ రుసుము తీ సుకుని అందులోకి మార్పి స్తారు. జనరల్ క్లాస్‌లో అవకాశం లేనప్పుడు స్టేషన్లో దించేస్తారు. ఈమేరకు జోన్లకు రైల్వేబోర్డు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.వేలల్లో ఫిర్యాదులు.. అలా చేస్తే టీసీలపైనా చర్యలుకన్ఫర్మ్ కాని టికెట్‌తో ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా వాటితో రిజర్వ్డ్ కోచ్‌లలో.. టీసీల సహకారంతో ప్రయాణించే పద్ధతి అనధికారికంగా అమలులో ఉంది. ఇలా క్రమంగా రిజర్వ్డ్ కోచ్‌లలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూండటంతో.. రిజర్వేషన్ టికెట్‌తో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కొంతమంది వారిని దబాయించి మరీ సీటులో జాగా కల్పించుకుని ప్రయాణిస్తున్నారు. మరికొందరు సీట్లలో ఏదో ఓ వైపు కూర్చుని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఇలాంటి వాటిపై ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రైల్వే బోర్డుకు 8 వేల వరకు ఫిర్యాదులందినట్టు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు, నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని, రిజర్వ్డ్ కన్ఫర్మ్ టికెట్ లేని వారు ఎట్టి పరిస్థితిలో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించకుండా చూడాలని, ఒకవేళ టీసీలు వారికి వీలు కల్పించినట్టు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా, కన్ఫర్మ్ కాని టికెట్ ఉన్న వారిని జనరల్ కోచ్‌లకు తరలిస్తే, వాటిపై మరింత భారం పెరుగుతుందనీ,. ఈ నేపథ్యంలో రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
15 రోజుల్లో రూ.24.57 కోట్లు చెల్లించాలి: సెబీ
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, కంపెనీ సీఎండీ సి.పార్థసారథికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నోటీసు జారీ చేసింది. పవర్ ఆఫ్ అటార్నీను దుర్వినియోగం చేయడం ద్వారా ఖాతాదారుల నిధులను పక్కదారి పట్టించిన కేసులో రూ.24.57 కోట్లను చెల్లించాలని ఆదేశించింది.గతంలో సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో కార్వీ సంస్థ విఫలమైంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి ఈ నోటీసు వచ్చింది. 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించని పక్షంలో బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసి, కంపెనీల స్థిర, చర ఆస్తులను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని రికవరీ చేస్తామని సెబీ హెచ్చరించింది. అంతేకాకుండా మార్కెట్ రెగ్యులేటర్ నిబంధనల ప్రకారం పార్థసారథిని అరెస్ట్ చేసి జైలులో నిర్బంధిస్తామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ప్రముఖ సంస్థపై సీబీఐ కేసు నమోదుబ్రోకింగ్ సంస్థకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీను దుర్వినియోగం చేసినట్లు సెబీ గతంలోనే తెలిపింది. క్లయింట్ల నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారని పేర్కొంది. దాంతో ఏప్రిల్ 2023లో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, సీఎండీ పార్థసారథిలను సెక్యూరిటీ మార్కెట్ నుంచి ఏడేళ్లపాటు సెబీ నిషేధించింది. అలాగే రూ.21 కోట్ల పెనాల్టీని కూడా విధించింది. అయితే ఈ పెనాల్టీను చెల్లించడంలో కార్వీ జాప్యం చేస్తోంది. దాంతో జరిమానాతో కలిపి మొత్తం రూ.24.57 కోట్లు చెల్లించాలని సెబీ ఆదేశించింది. -
ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ పెనాల్టీ! నిజమేనా?
ప్రస్తుతం దేశంలో దాదాపు అందరికీ బ్యాంకు ఖాతా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఈ క్రమంలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటున్నాయి. ఇలా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ జరిమానా విధిస్తారంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వైరల్ న్యూస్‌కు సంబంధించిన అసలు నిజాన్ని చెప్పింది. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ట్వీట్ చేసింది. “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే జరిమానా విధిస్తారంటూ కొన్ని వార్తల ద్వారా అపోహ వ్యాప్తి చెందుతోంది” అని పేర్కొన్న పీఐబీ ఇది పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని తెలిపింది. ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా తప్పుదారి పట్టించే వార్తలు మీ దృష్టికి వస్తే నిజం తెలుసుకోవడానికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సహాయం తీసుకోవచ్చు. అటాంటి వార్తల స్క్రీన్‌షాట్, ట్వీట్, ఫేస్బుక్ పోస్ట్ లేదా URLని వాట్సాప్ నంబర్ 8799711259లో పీఐబీ ఫ్యాక్ట్ చెక్కి పంపవచ్చు లేదా factcheck@pib.gov.inకి మెయిల్ చేయవచ్చు. -
నెట్‌వర్క్‌లో అంతరాయం.. బిల్లులో రాయితీ!
నెట్వర్క్ సేవల్లో అంతరాయం కలగడం సాధారణంగా దాదాపు అందరికీ ఎదురయ్యే సమస్యే. ఒక్కోసారి 24 గంటలైనా ఈ సమస్య పరిష్కారం అవ్వదు. అయినా ప్లాన్ గడువులో ఎలాంటి మార్పులుండవు. సర్వీస్ ప్రొవైడర్లు ప్రతిపాదించిన రీచార్జ్ చెల్లించాల్సిందే. పోస్ట్‌పోయిడ్ కస్లమర్ల పరిస్థితి అంతే. ఇకపై ఏదైనా నెట్వర్క్ సమస్య తలెత్తితే అందుకు అనుగుణంగా బిల్లు చెల్లింపుల్లో రాయితీ పొందేలా టెలికాం ప్రాధికార సంస్థ(ట్రాయ్) నిబంధనలను తీసుకొచ్చింది.ట్రాయ్ విడుదల చేసిన క్వాలిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం..టెలికాం ఆపరేటర్లు జిల్లా స్థాయిలో అందించే నెట్వర్క్ సేవల్లో 24 గంటల కంటే ఎక్కువసేపు అంతరాయం కలిగితే పరిహారం చెల్లించాలి. ఈమేరకు గతంలోని జరిమానాను రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచింది. దాంతోపాటు వివిధ ప్రమాణాల ఉల్లంఘనలకు రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షల గ్రేడెడ్ పెనాల్టీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈమేరకు ‘ది స్టాండర్డ్స్ ఆఫ్ సర్వీస్ యాక్సెస్ (వైర్‌లైన్స్ అండ్ వైర్లెస్), బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ రెగ్యులేషన్స్, 2024’ నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాలు ఆరునెలల తర్వాత అమల్లోకి వస్తాయని ట్రాయ్ తెలిపింది.గతంలోని సెల్యులార్ మొబైల్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్ వైర్లెస్ సేవల నాణ్యత వంటి మూడు నిబంధనలను భర్తీ చేస్తూ కొత్తవాటిని ప్రవేశపెట్టారు. వీటి ప్రకారం..పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు అందించే సేవల్లో అంతరాయం ఏర్పడితే నెలవారీ బిల్లులో రాయితీ ఇవ్వాలి. ప్రీ-పెయిడ్ కస్టమర్లకు ప్లాన్ వ్యాలిడిటీ గడువు పెంచాలి. అయితే ఏదైనా వాతావరణ విపత్తు వల్ల నెట్వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడితే దాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఎలాంటి సమస్యనైనా వారం రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: బీఎన్ఎన్ఎల్ ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’ విడుదలఫిక్స్డ్-లైన్ సర్వీస్ ప్రొవైడర్లు(కేబుల్ నెట్వర్క్) కూడా పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్ల సమస్యలను మూడు రోజులలోపు పరిష్కరించాలి. లేదంటే పరిహారం చెల్లించాలి. మొబైల్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు తమ వెబ్సైట్లో వినియోగదారులకు సహాయపడే సేవల వారీగా (2G, 3G, 4G, 5G) జియోస్పేషియల్ కవరేజ్ మ్యాప్‌లను అందించాలని ట్రాయ్ పేర్కొంది. -
ITR Filing: ఇది చేయకపోతే రూ.5 వేలు పెనాల్టీ!
ఇది జూలై నెల. ట్యాక్స్ పేయర్లు అందరూ ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. జూలై 31 చివరి తేది దగ్గర పడుతోంది. అన్ని పత్రాలను సేకరించుకుని ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత దానిని 30 రోజులలోపు ధ్రువీకరించడం చాలా ముఖ్యం. మీరు దీన్ని సమయానికి చేయకపోతే పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది.వెరిఫికేషన్ ఎలా చేయాలంటే..ఆధార్-ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లేదా ప్రీ వ్యాలిడేటెడ్ బ్యాంక్ ఖాతా/డీమ్యాట్ ఖాతా ద్వారా రిటర్న్‌ను ఈ-వెరిఫై చేయడం ఐటీఆర్ వెరిఫికేషన్‌కు సులభమైన మార్గం. ఆన్లైన్ వెరిఫికేషన్ సౌకర్యంగా లేకుంటే, ఐటీఆర్-వీ భౌతిక కాపీని బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC)కి పంపవచ్చు. అయితే, ఇది ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ పూర్తయ్యాక విజయవంతమైనట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది. దీంతో పాటు ట్రాన్సాక్షన్ ఐడీ వస్తుంది. అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి కూడా ఈమెయిల్ వస్తుంది.తప్పితే జరిమానా కట్టాల్సిందే..ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం, 30 రోజులు దాటినా వెరిఫికేషన్ చేయకపోతే సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుములను చెల్లించవలసి ఉంటుంది. 2024 మార్చి 31 నాటి CBDT (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) నోటిఫికేషన్ నం. 2/2024 ప్రకారం, ఇతర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. 5 లక్షల వరకు ఆదాయానికి ఆలస్య రుసుము రూ. 1,000, రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయానికి రూ. 5,000 పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. -
కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందే
సాక్షి, అమరావతి: కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఎలాంటి భాష్యం చెప్పకుండా వాటిని యథాతథంగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ బాధ్యత ఉన్నతాధికారులదేనని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు అప్పటి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య విభాగం సంచాలకుడు వి.రామిరెడ్డి, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి ఎన్.శాంతిప్రభలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరంతా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని తేల్చింది. ఈ నేపథ్యంలో కృష్ణబాబు, రామిరెడ్డి, కృతికా శుక్లా రూ.2 వేల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. శాంతిప్రభకు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు తీర్పు అమలును ఆరు వారాల పాటు నిలుపుదల చేసింది. ఈలోపు అప్పీల్ దాఖలు చేయకుంటే నలుగురు అధికారులు ఆగస్టు 19 సాయంత్రం 5 గంటల కల్లా హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు. గతంలో∙మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ నియామకాలకు సంబంధించి పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని 2022లో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయలేదంటూ అభ్యర్థులు మళ్లీ హైకోర్టులో వేర్వేరుగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇందులో కృష్ణబాబు, రామిరెడ్డి, కృతికా శుక్లా, శాంతిప్రభలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. ఈ ధిక్కార వ్యాజ్యాలపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల విచారణ జరిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ అధికారుల తీరును తప్పుపట్టారు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన వారికి కాకుండా తమకు నచ్చిన వారిని మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లుగా నియమించారంటూ ఆక్షేపించారు. ముఖ్యంగా శాంతిప్రభ తీరును తప్పుపట్టారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఆమె సొంత నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కోర్టు ఆదేశించిన వారిని కాకుండా తనకు నచ్చిన వారిని నియమించుకోవడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందన్నారు. మిగిలిన ముగ్గురు ఉన్నతాధికారులకు కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. అయితే వారు ఆమెపై నెట్టేశారన్నారు. -
నేరం జరిగింది.. రూ.2 వేలకోట్లు చెల్లిస్తాం: బోయింగ్
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ ‘737 మ్యాక్స్’ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కుప్పకూలిన విషయంలో నేరాన్ని అంగీకరించింది. దాంతోపాటు బాధితులకు జరిమానా కింద రూ.243.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.2 వేలకోట్లు) చెల్లించేందుకు సిద్ధమైంది. ఈమేరకు అమెరికా న్యాయ సంస్థతో కేసు పరిష్కార షరతులపై సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు బోయింగ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ ఒప్పందానికి న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉందని తెలిపారు.ఈ సందర్భంగా బోయింగ్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..‘2018-19 మధ్యకాలంలో ఇండోనేషియా, ఇథియోపియాలో 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు రెండు నేలకూలాయి. ఈ ఘటనల్లో 346 మంది మరణించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లోని కొన్ని లోపాల వల్ల ప్రమాదాలు జరిగాయి. అందుకు పరిహారంగా బాధిత కుటుంబాలకు రూ.2 వేలకోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు అమెరికా న్యాయ సంస్థతో సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాం. దీనిపై న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉంది’ అని చెప్పారు.ప్రమాదాలు జరిగిన వెంటనే బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. బోయింగ్‌ను చట్టపరంగా శిక్షించడంతోపాటు ఆ సంస్థపై ఆర్థికపరంగా కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో 2021లో కేసు పరిష్కార ఒప్పందంలో భాగంగా సుమారు రూ.2,000 కోట్లు జరిమానా చెల్లించేందుకు బోయింగ్ అంగీకరించింది. అయితే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు న్యాయ స్థానం గుర్తించింది. దాంతో సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామాల దృష్ట్యా ఇటీవల బోయింగ్ నేరాన్ని అంగీకరించడంతోపాటు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.2 వేలకోట్లు జరిమానా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది.ఈ ఒప్పందానికి న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉంది. గతంలో జరిగిన ఒప్పందంలో భాగంగా జరిమానాతోపాటు రక్షణ చర్యల నిమిత్తం వచ్చే మూడేళ్లలో కనీసం రూ.3,700 కోట్లు బోయింగ్ వెచ్చించాల్సి ఉంటుంది. ఆయా ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబీకులను బోయింగ్ బోర్డు కలవాలి. ఒప్పంద షరతులను బోయింగ్ పాటిస్తుందా? లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ఒక స్వతంత్ర పర్యవేక్షకుడిని కూడా నియమించాలి.ఇదీ చదవండి: ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజీ పెంపు..?ఇదిలాఉండగా, నేర అంగీకారం వల్ల అమెరికా రక్షణ విభాగం, నాసా లాంటి ప్రభుత్వ విభాగాల నుంచి కాంట్రాక్టులు పొందే విషయంలో బోయింగ్ సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
క్రిప్టో కరెన్సీ ఎక్సే్ఛంజ్ ‘బినాన్స్’కు షాక్
న్యూఢిల్లీ: అక్రమ నగదు చలామణి నిరోధక (పీఎంఎల్ఏ) చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రముఖ అంతర్జాతీయ క్రిప్టో ఎక్సే్ఛంజ్ ‘బినాన్స్’పై జరిమానా పడింది. కేంద్ర ఆరి్థక శాఖ పరిధిలో పనిచేసే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐఈ) రూ.18.82 కోట్ల జరిమానా చెల్లించాలంటూ బినాన్స్‌ను ఆదేశించింది. వర్చువల్ డిజిటల్ అస్సెట్ (ఆన్లైన్లో డిజిటల్ ఆస్తులను అందించే) ప్రొవైడర్‌గా బినాన్స్, పీఎంఎల్ఏ కింద తగిన సమాచారాన్ని నివేదించడంలో వైఫల్యం చెందినట్టు ఎఫ్ఐయూ తన ఆదేశాల్లో పేర్కొంది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ సరీ్వస్ ప్రొవైడర్లు ఎఫ్ఐయూ కింద రిపోరి్టంగ్ ఎంటిటీగా నమోదు చేసుకోవడం తప్పనిసరి. అన్ని లావాదేవీలను రికార్డు చేయడంతోపాటు, ఆయా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్ఐయూకి వెల్లడించాల్సి ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా ఆరి్థక నేరాలను నియంత్రించేందుకు ఎఫ్ఐయూ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. నిజానికి పీఎంఎల్ఏ కింద బినాన్స్ నమోదు చేసుకోకుండానే భారత్‌లో తన సేవలు అందించింది. దీంతో బినాన్స్ యూఆర్ఎల్లపై కేంద్ర సర్కారు నిషేధం విధించడంతోపాటు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది మే నెలలో రిపోరి్టంగ్ ఎంటిటీగా ఎఫ్ఐయూ కింద బినాన్స్ నమోదు చేసుకుంది. బినాన్స్తోపాటు మరో ఎనిమిది క్రిప్టో సంస్థలకూ కేంద్రం నుంచి షోకాజ్ నోటీసులు వెళ్లాయి. -
ఈపీఎఫ్‌వో పెనాల్టీ తగ్గింపు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో కంట్రిబ్యూషన్లను జమ చేయడంలో ఆలస్యం చేసే లేదా డీఫాల్ట్ అయ్యే కంపెనీల యాజమాన్యాలకు విధించే అపరాధ రుసుమును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తగ్గించింది.కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ల ప్రకారం.. ఈ మూడు పథకాలకు సంబంధించిన కంట్రిబ్యూషన్ జమ చేయకపోతే ఒక్కో నెలకు కంట్రిబ్యూషన్ మొత్తంలో 1 శాతం అపరాధ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇది ఏడాదికి 12 శాతానికి పరిమితమవుతుంది. ఈ చర్య వల్ల డిఫాల్ట్ అయిన కంపెనీ యాజమాన్యాలపై తక్కువ భారం పడనుంది.గతంలో డిఫాల్ట్ కాలాన్ని బట్టి పెనాల్టీ అధికంగా ఉండేది. రెండు నెలలలోపు డిఫాల్ట్ కు సంవత్సరానికి 5 శాతం, రెండు నుంచి నాలుగు నెలల కాలానికి డిఫాల్ట్ లకు సంవత్సరానికి 10 శాతం అపరాధ రుసుము విధించేవారు. నాలుగు నుంచి ఆరు నెలల వరకు డిఫాల్ట్ చేస్తే జరిమానా ఏడాదికి 15 శాతం, ఆరు నెలలకు మించి డిఫాల్ట్ కొనసాగితే ఏడాదికి 25 శాతం పెనాల్టీ ఉండేది. -
ఎల్&టీ కంపెనీకి ఐటీ శాఖ భారీ జరిమానా
లార్సెన్ & టూబ్రో లిమిటెడ్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.4.68 కోట్లకు పైగా జరిమానా విధించింది. 2021 ఏప్రిల్ 1న కంపెనీలో విలీనమైన ఎల్ & టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ పన్ను ప్రొసీడింగ్స్‌కు సంబంధించి రూ.4,68,91,352 జరిమానా విధించినట్లు ఎల్ & టీ తాజా ఫైలింగ్‌లో తెలిపింది.2020-21 అసెస్మెంట్ ఇయర్‌కి సంబంధించి కంపెనీ ఆదాయపు పన్ను మదింపు, రిటర్న్ చేసిన ఆదాయంలో సర్దుబాటు వ్యత్యాసాలపై ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించినట్లు కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే, ఈ జరిమానాతో తాము ఏకీభవించనందున ఈ ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేస్తామని, ఉన్నత వేదికపై సానుకూల ఫలితాన్ని ఆశిస్తున్నామని తెలిపింది.ఎల్& టీ అనేది 27 బిలియన్ డాలర్ల భారతీయ మల్టీ నేషనల్ కంపెనీ. 2022 మార్చి 31 నాటికి ఎల్&టీ గ్రూప్‌లో 93 అనుబంధ సంస్థలు, 5 అసోసియేట్ కంపెనీలు, 27 జాయింట్ వెంచర్లు, 35 ఉమ్మడి కార్యకలాపాలు ఉన్నాయి. ఇవి ప్రాథమిక, భారీ ఇంజనీరింగ్, నిర్మాణం, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ తయారీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పనిచేస్తున్నాయి.