ప్రముఖ నటుడు రోబో శంకర్ హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డాడు. ఈ తమిళ నటుడు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. డబ్బింగ్ చిత్రాలతో ఆయన టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. తనదైన నటన, కామెడీ డైలాగ్స్‌తో తెలుగు ఆడియన్స్‌ని మెప్పించాడు. తమిళంలో మారి చిత్రంతో ఆయన పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన ఆయన వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ తమిళ యూట్యూబ్ చానల్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఇంటర్య్వూ చేసింది.
చదవండి: కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన నటి
ఈ సందర్భంగా రోబో శంకర్ ఇంటిని హోంటూర్‌గా చేసి తమ యూట్యూబ్‌లో ఛానల్లో షేర్ చేసింది. దీంతో రోబో శంకర్ చిక్కుల్లో పడ్డాడు. ఈ హోంటూర్‌లో రోబో శంకర్ ఇంట అరుదైన చిలకలు కనిపించాయి. దీంతో ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖ అధికారులకు అతడిపై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు రోబో శంకర్‌కు రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. కాగా ఆయన కొంతకాలంగా అలెగ్జాండ్రేన్ పారకీట్స్ అనే అరుదైన జాతి చిలుకలను పెంచుకుంటున్నాడు.
చదవండి: బీబీ జోడి జడ్జస్‌పై బిగ్‌బాస్ కౌశల్ సంచలన కామెంట్స్, పోస్ట్ వైరల్
హోంటూర్ వీడియోలో వాటిని చూసిన ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖకు ఫిర్యాదు చేయగా రోబో శంకర్ ఇంట వారు తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆ చిలుకలను అటవీ శాఖ స్వాధినం చేసుకుని అతడి రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. అయితే 1972 జంతు సంరక్షణ చట్టం ప్రకారం ఈ చిలుకలు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతి కావాలని అధికారులు తెలిపారు. దీంతో అనుమతి లేకుండా వాటిని పెంచుతున్నందుకు రోబో శంకర్‌పై అటవీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రోబో శంకర్ 1997లో వచ్చిన ధర్మచక్రం సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టాడు. రోబో సినిమాతో రోబో శంకర్ గుర్తింపు పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment