ఆసియాలోనే భారీ బడ్జెట్ సినిమా | 2.0 Shocking Budget Revealed by the Makers | Sakshi
Sakshi News home page

ఆసియాలోనే భారీ బడ్జెట్ సినిమా

Published Sat, Dec 3 2016 11:32 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

ఆసియాలోనే భారీ బడ్జెట్ సినిమా

ఆసియాలోనే భారీ బడ్జెట్ సినిమా

గ్రేట్ డైరెక్టర్ శంకర్, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ల కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా 2.0. శంకర్, రజనీల కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ సినిమా రోబోకు సీక్వల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగాన్ని మించి భారీ గ్రాఫిక్స్తో పాటు అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 350 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని ప్రకటించారు.

కానీ.., సినిమా నిర్మాణంలో బడ్జెట్ పెరిగిపోవటంతో ప్రస్తుతం 2.0 సినిమా బడ్జెట్ 400 కోట్లకు చేరిందట. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా ఆసియాలోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాగా మారిపోయింది. భారీ బడ్జెట్ కావటంతో రిలీజ్ విషయంలో కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. తమిళ్తో పాటు, తెలుగు హిందీ భాషల్లో కూడా వేల థియేటర్స్లో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

ఓవర్సీస్ మార్కెట్ మీద కూడా దృష్టి పెట్టిన రోబో టీం ఇతర దేశాల్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రజనీకాంత్కు మంచి ఫాలోయింగ్ ఉన్న మలేషియా, థాయ్లాండ్ లాంటి దేశాలతో పాటు ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి దేశాల్లో కూడా రెండు మూడు వందల థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఆసియాలోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న 2.0 కమర్షియల్గా ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement