ROBO
-
ఆస్తుల జప్తుపై శంకర్ రియాక్షన్.. కోర్టు తీర్పును కూడా లెక్క చేయలేదంటూ..
కోలీవుడ్ డైరెక్టర్ శంకర్‌కు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన తర్వాత ఆయన తొలిసారి రియాక్ట్ అయ్యారు. రోబో సినిమా కథ విషయంలో కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని శంకర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయనకు సంబంధించిన సుమారు రూ. 10 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. అయితే, తాజాగా శంకర్ స్పందించారు. ఈడీ నిర్ణయాన్ని తప్పబట్టారు. కోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ఈడీ చర్యలు తీసుకోవడం ఏంటి అంటూ ఆయన పేర్కొన్నారు. ఈడీ విషయంలో శంకర్ ఇలా చెప్పుకొచ్చారు. 'ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకున్న నిర్ణయం నన్ను ఎంతగానో బాధించింది. రోబో సినిమా విషయంలో గౌరవ హైకోర్టులో నాకు అనకూలంగా తీర్పు వచ్చింది. కేసు వివరాలతో సహా ప్రజలకు తెలుపుతున్నాను. సివిల్ సూట్ నం. 914/2010లో పూర్తి వివరాలు ఉన్నాయి. న్యాయస్థానం ఇరుపక్షాల సాక్ష్యాలను, వాదనలను జాగ్రత్తగా పరిశీలించింది. ఆపై 'ఎంథిరన్' (రోబో) చిత్రానికి సంబంధించిన హక్కులు తనకే ఉన్నాయంటూ అరూర్ తమిళనాథన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది. కానీ, సరైన ఆధారం లేకుండా ఆరోపణలు చూపుతూ నాకు సంబంధించిన స్థిరాస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ చర్య న్యాయస్థానం నిర్ణయాన్ని తప్పుగా చూపినట్లు అవుతుంది. అధికార దుర్వినియోగం కింద కూడా వస్తుంది. కేవలం ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) నివేదికను బేస్ చేసుకొని నా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఈడీ పక్కనపెట్టింది.' అని ఆయన తెలిపారు. ఏం జరిగిందంటే..?సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్ పేరుతో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. అయితే, ఈ కథను ‘జిగుబా’ను కాపీ కొట్టిసినిమా తెరకెక్కించారంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాపీరైట్ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని పిటిషన్లో తెలిపారు. ఈ కేసు విషయంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) నివేదిక శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. దీంతో శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. -
రోబో సినిమా ఎఫెక్ట్.. దర్శకుడు శంకర్ రూ.10 కోట్ల ఆస్తులు జప్తు
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. తన దర్శకత్వం వహించిన రోబో సినిమా విషయంలో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన రూ. 10 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ జప్తు చేసింది.మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నెల 17న ఆయన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఒక సినిమా కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు వచ్చిన కేసులలో ఇలా స్థిరాస్తులను ఎటాచ్ చేయడం ఇదే తొలిసారని ఈడీ అధికారులు పేర్కొంటున్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్ పేరుతో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. అయితే, ఈ కథను ‘జిగుబా’ను కాపీ కొట్టిసినిమా తెరకెక్కించారంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాపీరైట్ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని పిటిషన్లో తెలిపారు. ఈ కేసు విషయంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) నివేదిక శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. దీంతో శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.2010లో రోబో రిలీజైన విషయం తెలిసిందే. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సుమారు రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా కోసం డైరెక్టర్ శంకర్ రెమ్యునరేషన్‌గా రూ.11.5 కోట్లు తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. -
రోగులకు చేదోడుగా ‘ప్లూటో’ రోబోట్.. ప్రత్యేకతలివే..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ) వెల్లూరు సంయుక్తంగా దేశంలోనే మొట్టమొదటి న్యూరో రిహాబిలిటేషన్ రోబోట్-అసిస్టెడ్ థెరపీ సాధనాన్ని తయారు చేశాయి. ప్లూటో (ప్లగ్ అండ్ ట్రైన్ రోబోట్ ఫర్ హ్యాండ్ న్యూరో రిహాబిలిటేషన్) అని పిలవబడే ఈ రోబో న్యూరో, వెన్నుముక సమస్యలు ఉన్న రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తయారీదారులు తెలిపారు. ‘ప్లూటో’ను థ్రైవ్ రిహాబ్ సొల్యూషన్స్ దేశంలో మార్కెట్ చేయబోతున్నట్లు ప్రకటించారు.సీఎంసీ వెల్లూరు బయో ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శివకుమార్ బాలసుబ్రమణియన్, ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుజాత శ్రీనివాసన్ ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్), టాటా ఎలిక్సీ లిమిటెడ్ అందించిన సీఎస్ఆర్ గ్రాంట్లు, భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నుంచి వచ్చిన నిధులు ప్రాజెక్ట్‌కు ఎంతో ఉపయోగపడినట్లు చెప్పారు.తొమ్మిది క్లినిక్‌ల్లో ట్రయిల్స్ పూర్తి‘ప్లూటో న్యూరో రోగులకు అవసరమైన కచ్చితమైన చికిత్సలు, రియల్ టైమ్ ఫీడ్ బ్యాక్‌ను అందిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు అవసరమైన మెరుగైన చికిత్సలు, ఫలితాలను అంచనా వేస్తుంది. అధిక చికిత్స ఖర్చులు, దేశంలో చాలా మంది స్ట్రోక్ బాధితులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్లూటోను రూపొందించారు. ఇది ఒక కాంపాక్ట్, పోర్టబుల్ టేబుల్ టాప్ పరికరం. చిన్న సూట్ కేస్ ద్వారా దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దేశంలోని తొమ్మిది క్లినిక్‌ల్లో ప్లూటోను ట్రయిల్ చేశారు. గత 30 నెలల్లో 1,000 మందికి పైగా రోగులు, 100 మంది వైద్యులు దీన్ని ఉపయోగించారు. ఇంట్లో ఉపయోగిస్తూ రోగుల వ్యాధికి సంబంధించిన కచ్చితమైన థెరపీ అధ్యయనాలు తెలుసుకోడానికి ప్లూటో ఎంతో దోహదం చేస్తుంది’ అని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులుఎవరికి అవసరం అంటే..ఈ టెక్నాలజీకి లైసెన్స్ ఇచ్చిన థ్రైవ్ రిహాబ్ సొల్యూషన్స్ ప్లూటోను బిజినెస్ పరంగా వినియోగించుకునేందుకు భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఆసుపత్రులు, చిన్న క్లినిక్‌లు, కమ్యూనిటీ సెంటర్లు, రోగుల ఇళ్లల్లో దీన్ని సులువు వినియోగించవచ్చని తెలిపింది. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనవారు, చేతి వైకల్యం ఉన్న వ్యక్తులకు ఇది చాలా అవసరం అని పేర్కొంది. -
చచ్చుబడిపోయిన చేతులకు అభయ హస్తం..!
సమస్యల గురించి వినడమే తప్ప పరిష్కారాల గురించి అవగాహన లేని వయసులో సైన్స్‌పై అమిత ఆసక్తి పెంచుకున్నాడు తమిళనాడుకు చెందిన శివసంతోష్. ఆ ఆసక్తే ఆవిష్కరణకు బీజం వేసింది. 21 ఏళ్ల వయసులో రోబోటిక్స్ స్టార్టప్‌ను ప్రారంభించేలా చేసింది...హెల్త్‌కేర్, ఎనర్జీ ప్రొడక్షన్, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి 21 ఏళ్ల శివసంతోష్ రోబోటిక్స్ స్టార్టప్ ‘మైక్రోమోటిక్’ను ప్రారంభించాడు. ‘లింబ్ మొబిలిటీ’ని పునరుద్ధరించడానికి డిజైన్ చేసిన ఈ తేలికపాటి వేరబుల్ మోటర్ సిస్టమ్ స్ట్రోక్, స్పైనల్ కార్డ్ ఇంజురీస్, సెరిబ్రల్ పాల్సీ, పార్కిన్స్ డిసీజ్...మొదలైన బాధితులకు ఉపయోగపడుతుంది. ఈ లింబ్ అసిస్ట్‌ను ఉపయోగించి కప్పులు, ప్లేట్లు, బ్యాగులు... మొదలైన వాటిని పట్టుకోవచ్చు. తీసుకెళ్లవచ్చు. రాయవచ్చు. టైపింగ్ చేయవచ్చు. ఫింగర్ మూమెంట్స్‌కు సంబంధించి ఎన్నో పనుల్లో లింబ్ అసిస్ట్ సహాయపడుతుంది.పుదుకొట్టై జిల్లా కీరమంగళం అనే చిన్న పట్టణంలో ఈ స్టార్టప్‌ను పప్రాభించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. దీనికి శివ చెప్పే జవాబు...‘స్థానిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం. మా ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం. ఇన్నోవేషన్ కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని నిరూపించాలనుకున్నాను’ శివసంతోష్కు చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే ఎంతో ఇష్టం. రకరకాల యంత్రాలు ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. స్కూల్ ప్రాజెక్ట్‌లతో సైన్స్‌పై మరింత ఆసక్తి పెరిగింది. సైన్స్‌కు సంబంధించి రకరకాల పోటీలలో విజేతగా నిలిచేవాడు. ఈ నేపథ్యంలో తన ఆలోచనలు ఆవిష్కరణల చుట్టూ తిరిగేవి.‘కోవిడ్ మహమ్మారి టైమ్‌లో స్థానిక ఆసుపత్రుల కోసం ఆటోమేటిక్ శానిటైజర్ స్ప్రేయర్, యూవీ జెర్మిసైడ్ను డెవలప్ చేశాను. మరో వైపు శాటిలైట్ టెక్నాలజీ గురించి అధ్యయనం చేయడం మొదలు పెట్టాను’ అంటున్నాడు శివ. ఆ ఆసక్తి, అధ్యయనం అతడిని మరింత ముందుకు తీసుకెళ్లింది.మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన శివసంతోష్ ప్రస్తుతం చెన్నైలోని అన్నా యూనివర్శిటీ–కేసీజీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బీఈ చదువుతున్నాడు. తన స్టార్టప్ కోసం ఎక్కువ సమయం కేటాయించేందుకు శివసంతోష్కు కాలేజీ అనుమతి ఇచ్చింది.ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్స్‌తో మల్టీ యాక్సిస్ విండ్ టర్బైన్ను డెవలప్ చేయడంపై కూడా ఈ స్టార్టప్ కృషి చేస్తోంది. ‘డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ సమయాల్లో ఇళ్లు, వ్యాపారాలకు బ్యాకప్ పవర్‌కు సంబంధించి పవర్ జెనరేషన్‌కు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది’ అంటున్నాడు శివసంతోష్."మూడు పదాలను నమ్ముకుంటే చాలు మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి. అవి... ఎందుకు? ఏమిటి? ఎలా? సైన్స్‌పై ఆసక్తితో ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? నుంచి విమానం ఎలా ఎగురుతుంది? వరకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. శాస్త్రీయ విషయాలపై లోతైన అవగాహన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని." చెబుతున్నాడు శివసంతోష్.(చదవండి: -
మనిషిలా తడబడిన రోబో - వీడియో వైరల్
రజినీకాంత్ నటించిన రోబో సినిమా చూసినప్పటి నుంచి.. చాలా మందికి రోబోలు మనిషిలాగే ప్రవర్తిస్తాయా? అనే అనుమానం వచ్చింది. అయితే రోబోలు మనుషులను మించిపోయే రోజులు భవిష్యత్తులో రానున్నట్లు, కొన్ని పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. మనిషిలా నడిచే ఒక రోబో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) సారథ్యంలో టెస్లా.. కార్లను మాత్రమే కాకుండా.. రోబోలను కూడా రూపొందిస్తోంది. ఇలాంటి రోబోలు మనిషి మాదిరిగానే నడుస్తున్నాయి. వీడియోలో గమనిస్తే.. ఒక రోబో ఏటవాలుగా ఉన్న ప్రదేశాన్ని దిగుతూ.. కొంత తడబడింది. అంతలోనే కంట్రోల్ చేసుకుని కిందకి పడిపోకుండా.. మెల్లగా దిగడం చూడవచ్చు.ఏటవాలుగా ఉన్న ప్రదేశాన్ని నెమ్మదిగా దిగటమే కాకుండా.. ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని కూడా రోబో ఎక్కడం కూడా చూడవచ్చు. ఇదంతా చూస్తుంటే.. రోబోలు మనుషుల్లా ప్రవర్తించే రోజులు వచేస్తున్నాయని స్పష్టంగా అవగతమవుతోంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tesla (@teslamotors) -
మడతెట్టే రోబో!
నిత్యం చేసే పనులను మరింత సులువుగా చేసేందుకు వీలుగా టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగప్రవేశం చేసిన తర్వాత మర మనుషులే మన పనులు చేస్తున్నారు. ఇటీవల పిజికల్ ఇంటెలిజెన్స్(పీఐ) అనే స్టార్టప్ కంపెనీ పీఐ-జిరో అనే రోబోను తయారు చేశారు. ఇది మనం వాడిన బట్టలను ఉతికి, మడతేస్తోంది. దాంతోపాటు మరెన్నో పనులు చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.At Physical Intelligence (π) our mission is to bring general-purpose AI into the physical world. We're excited to show the first step towards this mission - our first generalist model π₀ 🧠 🤖Paper, blog, uncut videos: https://t.co/XZ4Luk8Dci pic.twitter.com/XHCu1xZJdq— Physical Intelligence (@physical_int) October 31, 2024ఇదీ చదవండి: మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్ఈ ‘పీఐ-జిరో’ కేవలం బట్టలు ఉతికి, మతతెట్టడమే కాకుండా గుడ్లు ప్యాక్ చేయడం, కాఫీ బీన్స్ గ్రైండ్ చేయడం, టేబుల్ శుభ్రం చేయడం వంటి పనులు చేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇంటికో రోబోను పెంచుకునే రోజులు త్వరలో రాబోతున్నట్లు ఈ వీడియో చేసిన కొందరు అభిప్రాయపడుతున్నారు. -
టెస్లా .. రోబోట్యాక్సీ..
లాస్ ఏంజెలిస్: వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోబోట్యాక్సీ ’సైబర్‌క్యాబ్’ను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ఆవిష్కరించారు. అటానామస్ వాహనంగా ఉండే రోబోట్యాక్సీలో స్టీరింగ్ వీల్, పెడల్స్ ఉండవు. ఇద్దరు ప్రయాణికులు మాత్రమే పట్టేంత క్యాబిన్ ఉంటుంది. స్వయంచాలిత వాహనాలు మనుషులు నడిపే వాహనాల కన్నా 10–20 రెట్లు సురక్షితంగా ఉంటాయని, సిటీ బస్సులతో పోలిస్తే వీటిలో ప్రయాణ వ్యయాలు కూడా చాలా తక్కువేనని మస్క్ చెప్పారు. సైబర్‌క్యాబ్ ఉత్పత్తి 2026లో ప్రారంభమవుతుందని, ధర 30,000 డాలర్ల లోపే ఉంటుందని మస్క్ తెలిపారు. అలాగే 20 మంది పట్టే రోబోవ్యాన్ను కూడా మస్క్ ప్రవేశపెట్టారు. అటు వివిధ పనులు చేసి పెట్టే ఆప్టిమస్ రోబోను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు మస్క్ చెప్పారు. దీని ధర 20,000–30,000 డాలర్ల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. అటానామస్ వాహనాలు ప్రమాదాలకు దారి తీస్తున్న ఉదంతాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో టెస్లా స్వయంచాలిత వాహనాలకు అనుమతులపై సందేహాలు నెలకొన్నాయి. -
టెస్లా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్ ఆవిష్కరణ
టెస్లా సీఈఓ ఇలొన్‌మస్క్ ఐ రోబోట్ ఈవెంట్లో రోబోవ్యాన్, సైబర్ క్యాబ్‌ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ లాట్లో జరిగిన ఈ ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది.కంపెనీ సీఈఓ ఇలోన్ మస్క్ ఈ ఈవెంట్‌ను ‘ఫ్యూచర్ వరల్డ్’గా అభివర్ణించారు. ఈ రోబోవన్ కారులో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది డ్రైవర్‌లెస్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఆటోమేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వాణిజ్య, వ్యక్తిగత అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు.టెస్లా కంపెనీ ఇప్పటివరకు కార్లను తయారు చేయడంలోనే నిమగ్నమైంది. కానీ ఇక నుంచి ప్యాసింజర్ వాహనాలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తుంది. ఈమేరకు సంస్థ వాహనాల సీటింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రోబోవ్యాన్లో డ్రైవర్ క్యాబిన్ ఉండకపోవడం గమనించవచ్చు.వ్యక్తిగత అవసరాలతోపాటు వాణిజ్య అవసరాల కోసం, పెద్ద మొత్తంలో రవాణా చేయాల్సి వచ్చినప్పుడు ఉపయోగించేందుకు వీలుగా టెస్లా వాహనాలను తయారు చేయాలని నిర్ణయించుకుంది. సైబర్ క్యాబ్‌ను 2026లో ఉత్పత్తి చేయనున్నట్లు మస్క్ తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు చాలా కంపెనీలు ఈవీలను తయారు చేస్తున్నాయి. అందులో టెస్లాకు ప్రత్యేక స్థానం ఉంది.గతంలో వార్షిక సాధారణ సమావేశంలో చెప్పిన విధంగానే కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఏఐలో విప్లవాత్మక మార్పు రాబోతుందని, భవిష్యత్తు అంతా ఏఐదేనని మస్క్ చెప్పారు. అందుకు అనుగుణంగా కంపెనీ ఏఐ ఉత్పత్తులను తయారు చేస్తుందని తెలిపారు. రోబోటాక్సీగా ఉద్దేశించిన ఈ సైబర్‌క్యాబ్‌ను ఇండక్టివ్ ఛార్జర్ ద్వారా వైర్లెస్ విధానంలో ఛార్జ్ చేసేలా రూపొందించారు. ఈవీల్లో బ్యాటరీలకు ఎక్కువగా ఖర్చు అవుతుంది. బ్యాటరీల సామర్థ్యాన్ని పెంచి వాటి తయారీకి అయ్యే ఖర్చు తగ్గించేందుకు చాలా కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయి. -
కదిలి వచ్చిన రోబోల దండు..!
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా సీఈఓ ఇలొన్‌మస్క్ గతంలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన ‘వి రోబోట్’ ఈవెంట్లో కృత్రిమమేధ సాయంతో పనిచేసే ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్‌లతోపాటు ఆప్టిమస్ రోబోలను పరిచయం చేశారు.టెస్లా సీఈఓ ఇలొన్ మస్క్ గతంలో ఏజీఎంలో చెప్పిన విధంగానే కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఏఐలో విప్లవాత్మక మార్పు రాబోతుందని, భవిష్యత్తు అంతా ఏఐదేనని మస్క్ చెప్పారు. అందుకు అనుగుణంగా కంపెనీ ఏఐ ఉత్పత్తులను తయారు చేస్తుందని తెలిపారు. తాజాగా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్‌లతోపాటు రోబోల దండును పరిచయం చేశారు.pic.twitter.com/VK9vlGF0Ms— Elon Musk (@elonmusk) October 11, 2024ఇదీ చదవండి: రోబో కారును ఆవిష్కరించిన టెస్లాభవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక రోబో ఉంటుందని గతంలో మస్క్ చెప్పారు. కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబోలకు గిరాకీ ఏర్పడుతుందన్నారు. హ్యూమనాయిడ్ రోబోట్స్ తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని చెప్పారు. తయారీ రంగంతోపాటు రోజువారీ జీవితంలో రోబోలు పాత్ర కీలకంగా మారనుందని తెలిపారు. ఆప్టిమస్ రోబో ఒక్కో యూనిట్ తయారీకి దాదాపు 10,000 డాలర్లు (రూ.8.3లక్షలు) ఖర్చవుతుందని అంచనా. టెస్లా ఏటా ఆప్టిమస్ ద్వారా 1 ట్రిలియన్ డాలర్ల (రూ.83లక్షల కోట్లు) లాభాన్ని ఆర్జించగలదని గతంలో మస్క్ అంచనా వేశారు. -
టెస్లా రోబో కారు
‘ఐ రోటోట్’ సినిమా చూశారా..? అందులో కార్లు డ్రైవర్ ప్రమేయం లేకుండానే వాటికవే ప్రయాణిస్తుంటాయి. వాటంతటవే పార్క్ చేసుకుంటాయి. అచ్చం టెస్లా కంపెనీ అలాంటి కార్లను తయారు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా తాజాగా ‘రోబోవన్’ అనే కారును ఆవిష్కరించారు. టెస్లాకు చెందిన ‘వి రోబోట్’ ఈవెంట్లో కంపెనీ సీఈఓ ఇలోన్‌మస్క్ ఈ కారుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ లాట్లో జరిగిన ఈ ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది. కంపెనీ సీఈఓ ఇలోన్ మస్క్ ఈ ఈవెంట్‌ను ‘ఫ్యూచర్ వరల్డ్’గా అభివర్ణించారు. ‘ఈ రోబోవన్ కారులో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది డ్రైవర్‌లెస్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఆటోమేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వాణిజ్య, వ్యక్తిగత అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు’ అని మస్క్ తెలిపారు.Robovan seats 20 & can be adapted to commercial or personal use – school bus, RV, cargo pic.twitter.com/CtjEfcaoHI— Tesla (@Tesla) October 11, 2024ఈమేరకు రోబోవన్ రోడ్లపై పరుగెత్తిన వీడియోను వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇందులో డ్రైవర్ క్యాబిన్ ఉండకపోవడం గమనించవచ్చు. ఈ ఈవెంట్లో సైబర్ క్యాబ్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ సైబర్ క్యాబ్‌ను 2026లో ఉత్పత్తి చేయనున్నట్లు ఇలొన్‌మస్క్ తెలిపారు. రోబోటాక్సీగా ఉద్దేశించిన ఈ సైబర్‌క్యాబ్‌ను ఇండక్టివ్ ఛార్జర్ ద్వారా వైర్లెస్ విధానంలో ఛార్జ్ చేసేలా రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు.Robotaxi pic.twitter.com/zVJ9v9yXNr— Tesla (@Tesla) October 11, 2024 -
వంటకాలను చిటికెలో చేసే 'రోబో చెఫ్'
ఇది రోబో చెఫ్. ఎలాంటి వంటకాలనైనా చిటికెలో వండి వడ్డిస్తుంది. కెనడియన్ స్టార్టప్ కంపెనీ ‘రోబో ఈట్జ్’ ఈ రోబో చెఫ్‌ను రూపొందించింది. రెస్టరెంట్ నిపుణులు, ఏరోస్పేస్ ఇంజినీర్ల సంయుక్త కృషితో ‘రోబో ఈట్జ్’ ఈ రోబో చెఫ్‌ను విజయవంతంగా తయారు చేసింది.వంటగదిలోని ప్రతి పనిని ఇది స్వయంగా చేస్తుంది. ఇందులో నిక్షిప్తమైన 80 రకాల పదార్థాలు, దినుసులను ఉపయోగించి ఎలాంటి వంటకాన్నైనా సిద్ధం చేసేస్తుంది. ఇది వెయ్యి రకాల వంటకాలను వండి పెడుతుంది. వంటకం తయారైన తర్వాత తినేటంత వరకు తాజాదనం చెడకుండా ఉండేలా వేడి పదార్థాలను వేడిగాను, చల్లని పదార్థాలను చల్లగాను నిల్వచేసి ఉంచుతుంది.కార్పొరేట్ వంటగదుల్లోను, రెస్టరెంట్ల వంటగదుల్లోను, ఫాస్ట్‌ఫుడ్ చెయిన్స్ వంటగదుల్లోను ఉపయోగించడానికి అనువుగా ఈ రోబో చెఫ్‌ను తీర్చిదిద్దారు. ఇటీవల కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో దీని పనితీరును ప్రదర్శించారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల నుంచి దీని పనితీరుకు ప్రశంసలు లభించాయి. -
చిట్టికి 14 ఏళ్లు పూర్తి.. మేకర్స్ స్పెషల్ వీడియో వైరల్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్ పేరుతో ఈ మూవీని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తెలుగులో రోబో పేరుతో విడుదలైన ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చిట్టి అనే పేరు గల రోబో ఆడియన్స్‌ను ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో రోబో-2ను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు శంకర్.అయితే ఎంథిరన్(రోబో) విడుదలై సరిగ్గా నేటికి 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సన్ పిక్చర్స్ యాజమాన్యం స్పెషల్ వీడియోను షేర్ చేసింది. భారతీయ సినిమాని పునర్వైభవం తీసుకొచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం.. ఏ మాస్టర్ పీస్ ఎంతిరన్ 14 సంవత్సరాల వేడుక జరుపుకుంటోంది అంటూ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.The sci-fi journey that redefined Indian Cinema💥 Celebrating the 14 years of the masterpiece #Enthiran#14YearsofEnthiran pic.twitter.com/L61SIAZ59L— Sun Pictures (@sunpictures) October 1, 2024 -
రోబోల దండు వచ్చేస్తోంది..!
రోబో సినిమా గుర్తుంది కదా. అందులో రజనీకాంత్ తయారు చేసిన ‘చిట్టీ’ అచ్చం మనిషిలాగే ఉంటూ, సొంతంగా ఆలోచిస్తూ పనులు చేస్తుంది. ఆ సినిమా చూస్తున్నంతసేపు అదో మాయగా అనిపించి ఉంటుంది. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రపంచ కంపెనీలు హ్యుమనాయిడ్ రోబోల తయారీపై ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగా చైనాకు చెందిన యూనిట్రీ సంస్థ జీ1 అనే హ్యుమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. జీ1 సొంతంగా డ్యాన్స్ చేస్తుంది. మెట్లు ఎక్కుతుంది, దిగుతుంది. బ్యాలెన్స్ నియంత్రిస్తూ నడుస్తుంది. ఏదైనా ఎదురుపడితే అందుకు తగినట్టుగా వ్యవహరిస్తుంది. ఈ మేరకు రోబో డ్యాన్స్ చేస్తున్న వీడియోను కంపెనీ ఇటీవల విడుదల చేసింది. అదికాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ జీ1 రోబోను కంపెనీ 16000 అమెరికన్ డాలర్ల(రూ.13.4 లక్షలు)కు విక్రయించనున్నట్లు ప్రకటించింది.యూనిట్రీ సంస్థే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెస్లా, ఫిగర్, బోస్టన్ డైనమిక్స్, సాంక్చురీ ఏఐ..వంటి ప్రముఖ కంపెనీలు హ్యుమనాయిడ్ రోబోలపై పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటికే అందులో కొన్ని కంపెనీలు ప్రాథమికంగా రోబోలను ఆవిష్కరించాయి.సముద్ర గర్భంలో నిఘా..సముద్ర గర్భంలో నిఘా పెట్టడం అంటే మాటలుకాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానివల్ల కొన్నిసార్లు మనిషి ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు. అలాంటి సందర్భాల్లో నీటి లోపల నిఘా కోసం ఐఐటీ మండి, ఐఐటీ పాలక్కడ్‌కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు.టీ, కాఫీ చేసే యంత్రుడు‘ఫిగర్.ఏఐ’ సంస్థ సౌత్కరోలినాలోని బీఎండబ్ల్యూ తయారీ ప్లాంట్‌లో పనిచేసేందుకు హ్యూమనాయిడ్ రోబోలను తయారుచేస్తోంది. ఇవి ప్లాంట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి టీ, కాఫీలు ఇస్తూ సేద తీరుస్తున్నాయి. కాఫీ చేసే క్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే వాటికవే స్వయంగా ఆలోచిస్తూ సమస్యను పరిష్కరించుకుంటున్నాయి. గతేడాది అక్టోబర్‌లో అమెజాన్ సంస్థ తన వేర్‌హౌజ్‌ల్లో పని చేయడానికి హ్యుమనాయిడ్ రోబోలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంస్థ కార్యకలాపాల కోసం అమెరికాలోని ఓ వేర్‌హౌజ్‌లో వీటిని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చినట్లు అమెజాన్ గతంతోనే వెల్లడించింది.ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై కేంద్రం దర్యాప్తు..?టెస్లా ఆప్టిమస్భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక రోబో ఉంటుందని, టెస్లా కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబోలకు గిరాకీ ఏర్పడుతుందని గతంలో ఇలాన్‌మస్క్ అన్నారు. పరిశ్రమ రంగంతోపాటు రోజువారీ జీవితంలో వీటి పాత్ర కీలకంగా మారనుంది. భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతిఒక్కరికి ఒక రోబో ఉంటుంది. ఇంటి పనులు, పారిశ్రామిక అవసరాలతోపాటు ఇతర పనులకు హ్యూమనాయిడ్ రోబోట్లను విస్తారంగా వాడుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టెస్లా తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబో ఒక్కో యూనిట్ తయారీకి దాదాపు 10,000 డాలర్లు (రూ.8.3లక్షలు) ఖర్చవుతుందని అంచనా. -
రోబో ఆత్మహత్య!?
సియోల్: పరీక్ష సరిగా రాయలేదని, ప్రేమ విఫలమైందని, ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు తీసుకుంటున్న జనం వార్తలను మనం చూశాం. కానీ మరమనిషి సైతం ఆత్మహత్య చేసుకుంటాడన్న వార్త వింటానికి కొత్తగా ఉన్నా ఇది నిజంగా జరిగిందని దక్షిణకొరియా వార్తాసంస్థలు కోడై కూస్తున్నాయి. రోబో సేవలను విపరీతంగా వాడే దక్షిణ కొరియాలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. డాక్యుమెంట్ల డెలివరీ వంటి పనుల్లో తెగ బిజీగా ఉండే ఓ రోబో సూసైడ్ చేసుకుందన్న వార్త సంచలనం సృష్టించింది. పని ఒత్తిడి వల్లే రోబోట్ ఆత్మహత్య చేసుకుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చక్కర్లు కొట్టి.. మెట్లపై పడి గత గురువారం సాయంత్రం గుమీ నగర సిటీ కౌన్సిల్ భవనంలో ఈ రోబో ‘సూపర్వైజర్’ బాధ్యతల్లో ఉండగా ఉన్నట్టుండి ఆగిపోయి గుండ్రంగా తిరిగి మెట్లపై నుంచి పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఏకబిగిన పని చేయాల్సి రావడంతో విపరీత పని ఒత్తిడితోనే అది ఇలా చనిపోయిందని వార్తలొచ్చాయి. అమెరికాకు చెందిన బేర్రోబోటిక్స్ సంస్థ ఈ రోబోను తయారు చేసిచి్చంది. గత ఆగస్ట్ నుంచి అది చురుగ్గా పనిచేస్తోందట. ఈ రోబోకు సొంతంగా పౌరసేవల గుర్తింపు కార్డుంది! అంటే ఒకే ఫ్లోర్లోకాకుండా లిఫ్ట్‌లో తిరుగుతూ వేర్వేరు అంతస్తుల్లో పనులు చక్కబెట్టగలదు. ఇలాంటి రోబోట్ పొరపాటున మెట్ల పై నుంచి పడిందా? లేదంటే సాంకేతిక లోపమా? లేదంటే మరేదైనా సమస్యా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. రోబో శకలాలను స్వా«దీనంచేసుకుని ల్యాబ్‌కు పంపించారు. అనూహ్య ఘటన తర్వాత ఈ బిల్డింగ్‌లో మరో రోబోను పనిలో పెట్టుకోబోమని గుమీ సిటీ కౌన్సిల్ చెప్పింది. అయితే ద.కొరియాలో రోబోట్ సేవలు అత్యధికం. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ గణాంకాల ప్రకారం ద.కొరియాలో ప్రతి పది మంది ఉద్యోగులకు ఒక పారిశ్రామిక అవసరాల రోబోట్‌ను వినియోగిస్తున్నారు. -
మనిషికో రోబో!
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో సీఈఓ ఇలాన్ మస్క్ కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. సంస్థ వాటాదారుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు. భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక రోబో ఉంటుందని, కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబోలకు గిరాకీ ఏర్పడుతుందన్నారు. సమావేశంలో భాగంగా టెస్లా లీగల్ కార్యాలయాన్ని యూఎస్‌లోని డెలావర్ నుంచి టెక్సాస్‌కు మార్చేందుకు షేర్హోల్టర్లు అనుమతించారు.టెస్లా ట్యాక్సీలుఏజీఎంలో మస్క్ మాట్లాడుతూ..‘టెస్లా యాజమానులకు మరింత విలువ జోడించేలా, కంపెనీ వల్ల తమ ఆదాయం పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నాం. టెస్లా వినియోగదారులు తమ కార్లను ఉబర్, ఎయిర్‌బీఎన్‌బీ మాదిరిగానే రెంట్‌కు ఇచ్చేలా కొత్త యాప్‌ను తీసుకు రాబోతున్నాం. కొన్ని గంటలు, రోజులు, వారాలపాటు యాజమానులు తమ కారును రెంట్‌కు ఇచ్చే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నాం. దాంతో యూజర్లకు అదనంగా ఆదాయం సమకూరుతుంది’ అన్నారు.హ్యూమనాయిడ్ రోబోట్స్‘హ్యూమనాయిడ్ రోబోట్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పరిశ్రమ రంగంతోపాటు రోజువారీ జీవితంలో వీటి పాత్ర కీలకంగా మారనుంది. భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతిఒక్కరికి ఒక రోబో ఉంటుంది. ఇంటి పనులు, పారిశ్రామిక అవసరాలతోపాటు ఇతర పనులకు హ్యూమనాయిడ్ రోబోట్లను విస్తారంగా వాడుతారు. దాంతో కంపెనీ తయారుచేసే ఆప్టిమస్ రోబోలకు భారీ గిరాకీ ఏర్పడనుంది. ఒక్కో యూనిట్ తయారీకి దాదాపు 10,000 డాలర్లు (రూ.8.3లక్షలు) ఖర్చవుతుందని అంచనా. టెస్లా ఏటా ఆప్టిమస్ ద్వారా 1 ట్రిలియన్ డాలర్ల (రూ.83లక్షల కోట్లు) లాభాన్ని ఆర్జించగలదు’ అని మస్క్ అంచనా వేశారు.ఇదీ చదవండి: ఏడు నెలల తర్వాత జరుగబోతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంసస్టైనబుల్ ఎనర్జీ‘టెస్లా కార్లలో వినియోగించే బ్యాటరీల సమర్థతను పెంచేలా చర్యలు సాగుతున్నాయి. కంపెనీ ఇప్పటికే కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా ప్రయత్నిస్తోంది. స్థిరమైన శక్తిని అందిస్తూ స్టోరేజీ కెపాసిటీను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని మస్క్ చెప్పారు. -
Indraja Sankar Birthday Photos: విజిల్ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
-
స్ట్రీట్ కేఫ్‌లో సర్వ్ చేస్తున్న రోబో వెయిటర్! నెటిజన్లు ఫిదా
రోబోలను పలు రంగాల్లో తీసుకొచ్చి పనిచేయించడాన్ని చూశాం. వాటిని మాల్స్, ఆస్పత్రి, పోలీస్, తదితర శాఖల్లో ప్రవేశ పెట్టి చూపించారు. అలాగే ఇటీవల బెంగుళూరు, నోయిడా, చెన్నె కోయింబత్తూర్ రోబోట్ నేఫథ్య రెస్టారెంట్లను ప్రారంభించి కస్టమర్లను ఆకర్షించింది. పైగా ఇవి అత్యంత ప్రజాధరణ పొందాయి కూడా. ఇప్పుడూ ఏకంగా స్ట్రీట్ కేఫ్ సెంటర్ల్లోకి కూడా ఆ సాంకేతికత వచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో అహ్మదాబాద్‌లోని స్ట్రీట్ కేఫ్ పాప్ అప్ ట్రక్ వినియోగదారులకు రోబోట్ వెయిటర్ ఐస్ గోలాను సర్వ్ చేస్తూ కనిపిస్తుంది. ఇది వినియోగదారులకు రుచిగల ఐస్ గోలాలను చక్కగా సర్వ్ చేస్తుంది. ఈ రోబో పేరు ఐషా, ధర రూ. 1,35,000/-. అందుకు సంబంధించిన వీడియోని ఫుడ్ బ్లాగర్ కార్తీక్ మహేశ్వరి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ సాంకేతిక ఆవిష్కరణను చూసి నెటిజన్లు వాహ్! అంటూ ప్రశంసిస్తూ పోస్టలు పెట్టారు. కాగా, నిజం చెప్పాలంటే ఈ రోబోటిక్ సాంకేతికతపై మహమ్మారి సమయంలో చైనా ఎక్కువగా ఆధారపడింది. అఖరికి భద్రతా ప్రోటోకాల్‌లను నిర్వహించడానికి కూడా రోబోట్లతోనే మోహరించింది. View this post on Instagram A post shared by Kartik Maheshwari (@real_shutterup) (చదవండి: ఆస్కార్ వేడుకల్లో హైలెట్‌గా మెస్సీ డాగ్! ఏం చేసిందంటే..!) -
మనుషుల్లేకుండా ఫుడ్ డెలివరీ.. వీడియో వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో రోబోల వాడకం ఎక్కువవుతోంది. మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు అవి వెళ్తున్నాయి.. చేయలేని పనులు చేస్తున్నాయి. భవిష్యత్తులో మానవులు నేరుగా చేసే పనుల స్థానాల్లో క్రమంగా రోబోల సంఖ్య పెరుగుతుంది. జపాన్ వంటి కొన్ని దేశాల్లో కార్మికుల కొరత అధికమవుతోంది. వారిస్థానాలను భర్తీ చేసేలా రోబోలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఉబర్ ఈట్స్ సంస్థ ఫుడ్ డెలివరీ చేయడానికి జపాన్‌లో రోబోలను వినియోగిస్తోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్ జపాన్‌లో ఫుడ్ డెలివరీ కోసం రోబోలను రంగంలోకి దించింది. డెలివరీ బాయ్స్‌కు బదులుగా రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసే సర్వీసులను ఇటీవల ప్రారంభించింది. దేశం ఎదుర్కొంటున్న కార్మికుల కొరత సమస్యను ఇది తీరుస్తుందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ రోబోల సేవలను టోక్యోలోని రెండు స్టోర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో వీటిని మరిన్ని స్టోర్లకు విస్తరిస్తామని చెప్పారు. కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. 27 లీటర్ల పానీయాలు, 27 కేజీల ఆహారాన్ని ఏకకాలంలో తీసుకుపోయే సామర్థ్యం వీటిటి ఉందని కంపెనీ వివరించింది. ఇదీ చదవండి: ప్రపంచం వాడుతున్న జర్మన్ ఆవిష్కరణలు ఉబర్ ఈట్స్ సంస్థ కార్ట్కెన్ అండ్ మిసుబుషి ఎలక్ట్రిక్ కంపెనీతో కలిసి టోక్యోలో ఈ రోబోలను వినియోగిస్తుంది. ఇవి ‘మోడల్ సీ’ రోబోలుగా ప్రసిద్ధి చెందాయి. స్టార్‌షిప్ టెక్నాలజీస్ అమెరికాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీలో మొదట రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసి రికార్డుల్లో నిలిచింది. డెలివరీ రోబోట్లను ఫుడ్ డెలివరీ, ప్యాకేజీ డెలివరీ, హాస్పిటల్ డెలివరీ, రూమ్ సర్వీస్ వంటి విభిన్న అవసరాలకు వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 食品宅配サービスを手掛けるウーバーイーツジャパン(東京)は5日、自律走行ロボットによる配送を東京・日本橋エリアで6日に始めると発表しました。記事→https://t.co/jbVVrbcb22 #ウーバーイーツ #ロボット配送 #ubereats pic.twitter.com/oWbYjRGrn0 — 時事通信映像ニュース (@jiji_images) March 5, 2024 -
మెరైన్ రోబో తయారుచేసిన ఐఐటీ పరిశోధకులు.. ఉపయోగాలివే..
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో రోబో టెక్నాలజీకి ఆదరణ ఎక్కువవుతోంది. దాదాపు అన్నింట ఈ టెక్నాలజీని వాడుతున్నారు. మనుషులు వెళ్లలేని చోటుకు, ఒకవేళ కొన్ని పరిస్థితుల వల్ల వెళ్లినా అధిక ప్రమాదం పొంచి ఉండే ప్రదేశాల్లో ప్రత్యేక రోబోలను వినియోగిస్తున్నారు. సముద్ర గర్భంలో నిఘా పెట్టడం అంటే మాటలుకాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కొన్ని మనిషి ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు. అలాంటి సందర్భాల్లో నీటి లోపల నిఘా కోసం ఐఐటీ మండి, ఐఐటీ పాలక్కడ్‌కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు. సముద్ర జలాలు, ఇతర నీటి వనరుల్లో అట్టడుగుకు చేరుకొని పని చేసేలా ఈ రోబోను రూపొందించారు. ప్రస్తుతం సముద్రంలో నీటి లోపల నిఘా, అధ్యయనం కోసం పరిశోధన నౌకలను వినియోగించాల్సి వస్తుంది. ఇందుకు మనుషుల అవసరం కూడా ఎక్కువే. పైగా వీటి నిర్వహణ ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో తక్కువ ఖర్చుతో కచ్చితమైన నిఘా, అధ్యయనం కోసం ఈ మెరైన్ రోబో మెరుగ్గా పని చేస్తుందని ఐఐటీ మండిలోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగదీశ్ కడియం తెలిపారు. మెరైన్ రోబోను వినియోగించడం ద్వారా సముద్ర జలాల్లో నిఘా కోసం పనిచేసే మనుషుల ప్రాణాలకు ఉన్న ముప్పును కూడా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. ఇదీ చదవండి: మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన గూగుల్ ఉపయోగాలివే.. మెరైన్ రోబో ద్వారా జలవిద్యుత్ కేంద్రాల్లో నీటి లోపలి నిర్మాణాలను పరిశీలించవచ్చని, పర్యావరణ సమస్యలను వేగంగా గుర్తించే అవకాశం ఉంటుందని ఐఐటీ పాలక్కడ్ ప్రొఫెసర్ శాంతకుమార్ మోహన్ తెలిపారు. ఈ మెరైన్ రోబోకు సంబంధించిన వివరాలు ఓషియన్ ఇంజినీరింగ్, జర్నల్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఆండ్ రోబోటిక్ సిస్టమ్స్ అనే జర్నళ్లలో ప్రచురితమైనట్లు తెలిసింది. -
పసికందులు ఎందుకు ఏడుస్తున్నారో ఠక్కున చెప్పేసే డివైజ్!
ఇంకా మాటలు రాని వయసులో కేరింతలు, ఏడుపులు మాత్రమే పసికందుల భాష. పసిపిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు బోసినవ్వులొలికిస్తూ కేరింతలు కొడతారు. ఆకలేసినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు ఏడుస్తారు. పసిపిల్లల ఏడుపును అర్థం చేసుకోవడం ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. ఆకలితోనే ఏడుస్తున్నారా, మరే కారణం వల్ల ఏడుస్తున్నారా తెలుసుకోవడం అంత సులువు కాదు. గుక్కతిప్పుకోకుండా ఏడ్చే పసిపిల్లలతో తల్లులు నానా తంటాలు పడుతుంటారు. పసిపిల్లలు ఏడ్చేటప్పుడు ఇకపై అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇదిగో ఈ బుల్లిపరికరం పసికందుల ఏడుపును మనకు బోధపడే భాషలోకి అనువదిస్తుంది. ఇది ఇరవై నాలుగు గంటలూ పసికందులను కంటికి రెప్పలా కనిపెడుతూ ఉంటుంది. వారు ఏడుస్తున్నట్లయితే, ఎందుకు ఏడుస్తున్నారో ఇట్టే తెలియజెబుతుంది. అమెరికన్ కంపెనీ ‘మాక్సికోసీ’ పిల్లల ఏడుపును అనువదించే ఈ బుల్లిరోబోను ఇటీవల రూపొందించింది. దీనికి అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే బేబీ మానిటర్ కూడా ఉంటుంది. పిల్లలు ఏడుస్తున్నట్లయితే, వారు ఆకలికి ఏడుస్తున్నారో, నిద్రవస్తున్నందుకు ఏడుస్తున్నారో, భయం వల్ల ఏడుస్తున్నారో, గందరగోళం వల్ల ఏడుస్తున్నారో ఇది ఇట్టే చెప్పేస్తుంది. దీని ధర 61.99 డాలర్లు (రూ.5,154) మాత్రమే!. (చదవండి: కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ గురించి విన్నారా?) -
ఇకపై మృదువైన రోబోలు..
ఇంటి పనులు, తోట పనులు చకచకా చక్కబెడతాయి. పరిశ్రమల్లో పెద్ద పెద్ద బరువులను ఎత్తేస్తాయి. గాలి లేని ప్రదేశాల్లోనూ గనులను తవ్వేస్తాయి. మందుపాతరలను కనిపెడతాయి. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్య రంగాలతోపాటు సముద్ర గర్భంలో, అంతరిక్షంలోనూ అవలీలగా పనిచేస్తాయి. టీ, కాఫీలు తెచ్చి ఇస్తాయి. నగరంలో ఏం చూడాలో కూడా చెప్పేస్తాయి. అచ్చం మనిషిలా కనిపించడమే కాదు, అలాగే ఆలోచిస్తూ, అబ్బురపరుస్తూ సమాజంలో సాటి పౌరులుగా మారబోతున్న మరమనుషులు రానున్న రోజుల్లో అద్భుతాలు చేయగలవని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇన్ని పనులు చేయబోతున్న మనిషినిపోలే రోబోల తయారీకి సంబంధించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ యూనివర్సిటీ పరిశోధకులు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో రోబోటిక్ హ్యాండ్లను రూపొందించారు. ఇవి అచ్చం మనిషి చేతుల మాదిరిగానే ఎముకలు లిగమెంట్ల వంటి ప్రత్యేక వ్యవస్థను కలిగి ఉన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. పైగా వీటికి సాగే గుణం కూడా ఉందట. కాబట్టి లేజర్ స్కానింగ్ టెక్నాలజీ, రకరకాల పాలిమర్ల సాయంతో భవిష్యత్తులో మన చర్మాన్ని పోలిన మృదువైన రోబోలను తయారుచేయడం సాధ్యమే అంటున్నారు పరిశోధకులు. ఇదీ చదవండి: పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..! సంప్రదాయ పాలీఅక్రిలేట్లకు బదులుగా థియోలీన్తో చేసిన పాలిమర్లను వాడటంతో అవసరం మేరకు అవి సాగి, మళ్లీ యథాస్థితికి వస్తాయి. పైగా గట్టిగా కాకుండా మృదువుగా ఉండటంతో ఎక్కువ కాలం పనిచేస్తాయి. సంప్రదాయ రోబోలు గట్టిగా ఉంటాయి కాబట్టి వాటితో కలిసి పనిచేసేటప్పుడు మనకి చిన్న చిన్న గాయాలు కూడా అవుతుంటాయి. కొత్తరకం రోబోలతో అలాంటివేవీ ఉండవు. పైగా వాటిని పట్టుకోవడానికీ సులభంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. -
రాబోతోంది మరతరం.. కాఫీ చేస్తున్న హ్యుమనాయిడ్ రోబోలు.. వీడియో వైరల్
ఇంటి పనులు, తోట పనులు చకచకా చక్కబెడతాయి. పరిశ్రమల్లో పెద్ద పెద్ద బరువులను ఎత్తేస్తాయి. గాలి లేని ప్రదేశాల్లోనూ గనులను తవ్వేస్తాయి. మందుపాతరలను కనిపెడతాయి. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్య రంగాలతోపాటు సముద్ర గర్భంలో, అంతరిక్షంలోనూ అవలీలగా పనిచేస్తాయి. టీ, కాఫీలు తయారుచేస్తాయి. నగరంలో ఏం చూడాలో కూడా చెప్పేస్తాయి. అచ్చం మనిషిలా కనిపించడమే కాదు, అలాగే ఆలోచిస్తూ, అబ్బురపరుస్తూ సమాజంలో సాటి పౌరులుగా మారబోతున్న మరమనుషుల తరం రాబోతోందని నిపుణులు చెబుతున్నారు. మనిషికి సాధ్యంకాని పనులు చేయడం, అతడు వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లడం, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను తట్టుకోవడం.. ఇవన్నీ కేవలం మర మనుషులకు (రోబోలకు) మాత్రమే సాధ్యం. తాజాగా ‘ఫిగర్.ఏఐ’ సంస్థ సౌత్కరోలినాలోని బీఎండబ్ల్యూ తయారీ ప్లాంట్‌లో పనిచేసేందుకు హ్యూమనాయిడ్ రోబోలను తయారుచేస్తోంది. ఇవి ప్లాంట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి టీ, కాఫీలు ఇస్తూ సేదతీరుస్తున్నాయి. కాఫీ చేసే క్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే వాటికవే స్వయంగా ఆలోచిస్తూ సమస్యను పరిష్కరించుకుంటున్నాయి. కంపెనీలు తమ సంస్థల్లో హ్యూమనాయిడ్ రోబోలను వినియోగించడం కొత్తేమీ కాదు. గతేడాది అక్టోబర్‌లో అమెజాన్ సంస్థ తన వేర్‌హౌజ్‌ల్లో పని చేయడానికి హ్యుమనాయిడ్ రోబోలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంస్థ కార్యకలాపాల కోసం అమెరికాలోని ఓ వేర్‌హౌజ్‌లో వీటిని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చినట్లు అమెజాన్ గతంతోనే వెల్లడించింది. -
చివరకు ఏఐలోనూ లింగవివక్ష!
ఒకప్పుడు సైన్స్ ఇమాజినరీ నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నేడు దాదాపు అందరి జీవితాల్లో అంతర్భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, ప్రజల వ్యక్తిగత భద్రత పరిస్థితి ఏమిటి.. ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అచ్చు మనిషిలాగే ఆలోచించి భేదాలు సృష్టిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచోసుకుంటాయోననే అభిప్రాయాలు వస్తున్నాయి. తాజాగా కృత్రిమ మేధ మనుషుల మధ్య భేదాలు గుర్తిస్తూ విచిత్రంగా స్పందించినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. లింగ వివక్ష అనేది మనుషుల్లోనే కాదు కృత్రిమ మేధ (ఏఐ)లోనూ ఉందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అది అందించే సమాచారం, చిత్రాల్లో ఈ పోకడ కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. మంచి, చెడు నాయకుడి లక్షణాలకు సంబంధించి ఏఐ అందించిన కంటెంట్‌ను విశ్లేషించినప్పుడు పురుషులను బలమైన, సమర్థ నేతలుగా అది చిత్రీకరిస్తున్నట్లు తేలింది. భావోద్వేగాలతో నిండిపోయిన, అంతగా సమర్థతలేనివారిగా మహిళలను వర్ణిస్తున్నట్లు వెల్లడైంది. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..? ఈ నేపథ్యంలో ఏఐ అందించే డేటా హానికర లింగ వివక్షను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నాయకత్వం గురించి ముందుగా వెలువడిన డేటాలో మహిళా నేతల గురించి ప్రస్తావనే లేదని, వారిని ఉదాహరణలుగా పేర్కొనలేదని ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించిన టోబీ న్యూస్టెడ్ పేర్కొన్నారు. నిర్దిష్టంగా మహిళా నాయకుల గురించి అడిగినప్పుడే దానిపై విచిత్రంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. అనేక రంగాల్లో ఏఐ విస్తృతి పెరుగుతున్నందువల్ల వాటిపై మరింత పర్యవేక్షణ ఉండాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోందని వివరించారు. -
‘రోబో కుక్క’ పరుగు..
-
Video: ‘రోబో కుక్క’ పరుగు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు
సాధారణంగా 100 మీటర్ల పరుగు పందెంలో అథ్లెట్స్ సరికొత్త రికార్డులను సృష్టించడం చూస్తూ ఉంటాం. ఉసేన్ బోల్ట్, టైసన్ గే వంటి ప్రపంచస్థాయి స్పింటర్లు ఎన్నో అరుదైన ఘనతలు తమ పేరిట లిఖించుకున్నారు. కానీ తాజాగా 100 మీటర్ల రేసులో ఒక రోబోడాగ్ చరిత్ర సృష్టించింది. హౌండ్ అనే రోబో కుక్క 100 మీటర్ల రేసును కేవలం 19.87 సెకన్లలోనే పూర్తి చేసి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డునను సాధించింది. ఈ రోబో గంటకు 11.26 మైళ్ల వేగంతో పరుగు పందెన్ని పూర్తి చేసింది. ప్రపంచంలోనే గిన్నిస్ రికార్డులకెక్కిన తొలి నాలుగు కాళ్ల రోబోగా హుండూ చరిత్రలోకి ఎక్కింది. ఈ రోబోను దక్షిణ కొరియాలోని డేజియోన్లోని కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన యంగ్-హా షిన్ రూపొందించారు. 45 కేజీల బరువున్న ఈ రోబో పరుగుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: WI vs ENG: చివరి ఓవర్లో 21 పరుగులు.. ఇంగ్లండ్ సంచలనం! పాపం రస్సెల్ -
సెలవు తీసుకోకుండా పనిచేస్తా.. దిగ్గజాలను భయపెడుతున్న కొత్త 'సీఈఓ'
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ఉద్యోగాలు పోతాయని, మానవాళికి ముప్పు తలపెడుతుందనుకుంటున్న సమయంలో ఒక కంపెనీ ఏకంగా 'రోబో'ను సీఈఓగా నియమించి దిగ్గజాలకు సైతం దిగులుపుట్టేలా చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొలంబియాలోని కార్టజేనాలో ఉన్న డిక్టేడార్ స్పిరిట్ బ్రాండ్ ఏఐ బేస్డ్ రోబో 'మికా' (Mika)ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మికా అనేది హాన్సన్ రోబోటిక్స్ హ్యూమనాయిడ్ రోబో. ఇది మనుషుల కంటే వేగంగా పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లతో ఖచ్చితమైన డేటా ఆధారాలతో నిర్ణయాలు తీసుకోగలనని డిక్టేడార్ కంపెనీ వీడియోలో మికా వెల్లడించింది. అంతే కాకకుండా 24/7 అందుబాటులో ఉంటానని, వారాంతపు సెలవులు అవసరం లేదని ప్రస్తావిస్తూ.. కంపెనీ ప్రయోజనాలకు అవసరమయ్యే ఏ పనైనా పక్షపాతం లేకుండా చేస్తానని స్పష్టం చేసింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, ఫేస్బుక్ సీఈఓ జుకర్‌బర్గ్‌ల కంటే కూడా మెరుగ్గా పనిచేస్తానని మికా (హ్యూమనాయిడ్ రోబో) నొక్కి చెప్పించి. కంప్యూటర్ యుగంలో ఏఐ టెక్నాలజీ గురించి తప్పకుండా అవగాహన కలిగి ఉండాలని, రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ అవసరం ఎంతైనా ఉందని హాన్సన్ రోబోటిక్స్ సీఈఓ 'డేవిడ్ హాన్సన్' (David Hanson) తెలిపారు. ఇదీ చదవండి: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్‌జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి! ఏఐ వల్ల ప్రమాదమా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవాళికి ముప్పు ఉందని గత కొంతకాలంగా చాలా మంది భయపడుతున్నారు. కృత్రిమ మేధను సరిగా వాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' ఇప్పటికే హెచ్చరించారు. ముప్పు నుంచి బయటపడాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉండాలని చెప్పారు. ఉద్యోగుల పనితీరుని మెరుగుపరచడంలో ఏఐ ఉపయోగపడుతుందని, టెక్నాలజీని ఉపయోగించి ఇప్పటికే కొన్ని సంస్థలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోయే అవకాశం లేదని చెబుతున్నారు. -
కూరగాయల బాక్స్ అనుకొని వ్యక్తి ప్రాణం తీసిన రోబో..
వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి కారణంగా ఎంత మేలు జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతోంది. సాంకేతిక విస్తరణలో భాగంగా ఇటీవల కాలంలో రోబోల వినియోగం బాగా పెరిగింది. మనిషులు చేసే చాలా పనులను రోబోలు చిటికెలో చేసేస్తున్నాయి. అయితే కొన్నిసార్లు సాంకేతికతను మనం మంచి పనుల కోసం ఉపయోగించినా.. కొన్నిసార్లు చెడుగా మారుతుంది. టెక్నాలజీలో లోపాలుంటే అది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో చెప్పే ఘటన దక్షిణ కొరియాలో బుధవారం వెలుగుచూసింది. మనిషిని, కూరగాయల డబ్బాను వేరు చేసి గుర్తించడంలో విఫలమైన రోబో వ్యక్తి మరణానికి కారణమైంది. వివరాలు.. దక్షిణ జియోంగ్సాంగ్ ప్రావిన్స్‌లోని వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ పరిశ్రమంలో రోబోటిక్ మిషిన్లను వినియోగిస్తున్నారు. అవి కూరగాయాలతో నింపిన డబ్బాలను గుర్తించి కన్వేయర్ బెల్ట్‌పై ఎక్కిస్తాయి. ఈ క్రమంలో ఓ రోబో దాని పక్కనే ఉన్న ఓ వ్యక్తిని కూరగాయాల డబ్బాగా భావించి.. అతన్ని ఎత్తి కన్వేయర్ బెల్ట్‌పై పడేసింది. రోబో వ్యక్తిని గట్టిగా పట్టుకోవడంతో అతని ఛాతీ భాగం, ముఖం ఛిద్రమయ్యాయి. గమనించిన సిబ్బంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అయితే బాక్సులను గుర్తించాల్సిన రోబోలో సాంకేతిక లోపం తల్లెత్తడం కారణంగానే అది మనిషిని, కూరగాయలతో ప్యాక్ చేసిన పెట్టెతో పోల్చుకోవడంలో విఫలమైందని సదరు కంపెనీ తెలిపింది. ఇదే ప్రమాదానికి దారితీసిందని పేర్కొంది. మూడు రోజుల క్రితం రోబో సెన్సర్‌లో లోపం ఉందని గుర్తించగా.. దాన్ని బాగు చేయడానికి తయారీ కంపెనీకి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. దాన్ని తనిఖీ చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని.. పైగా మరమ్మతు నిర్వహిస్తున్న వ్యక్తినే అది పొరబడిందని పేర్కొంది. ఇక దక్షిణ కొరియాలో ఇలాంటి ప్రమాదం జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి. మార్చిలో ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కంపెనీలో పనిచేస్తున్న 50 ఏళ్ల వ్యక్తి రోబో చేతిలో నలిగి తీవ్ర గాయాలతో మరణించాడు. చదవండి: కంపెనీ సీఈవోకు గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్ వాచ్ -
చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచ ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. తక్కువ శ్రామిక శక్తితో అధిక ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. దాంతో వినియోగదారులు వారి ఆదాయాలను అధికం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏఐ పరిధిదాటి వ్యవహరిస్తుంది. జీపీటీ-4 ఆధారిత ఏఐని ఉపయోగించి స్టాక్ మార్కెట్లో చట్టవిరుద్ధంగా లాభపడవచ్చనే నివేదికలు ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుంది. ఓపెన్ఏఐ విప్లవాత్మక మోడల్ చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కృత్రిమ మేధస్సుని చూసే విధానంలో మార్పు వచ్చింది. అభివృద్ధి చెందుతున్న ఈ తరహా సాంకేతికత వల్ల పలు ప్రయోజనాలు ఉన్నప్పటికీ అంతే స్థాయిలో ప్రతికూలతలు కూడా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల యూకేలో నిర్వహించిన ఏఐ సేఫ్టీ సమ్మిట్‌లోని డెమోలో.. ఈ సాంకేతికత ఉపయోగించి చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చని తేలింది. అనంతరం తెలివిగా తన తప్పులను సైతం కప్పి పుచ్చుకోగలదని వెలుగులోకి వచ్చింది. ఈ డెమోలో సంస్థకు తెలియకుండా ఏఐ బోట్ స్టాక్స్ ట్రేడింగ్ కోసం నకిలీ సమాచారాన్ని వినియోగించినట్లు బయటపడింది. ఏఐ బోట్ సదరు సంస్థకు చెప్పకుండా స్టాక్లను చట్టవిరుద్ధంగా కొనుగోలు చేయడానికి అంతర్గత సమాచారాన్ని ఉపయోగించింది. అయితే ఇన్సైడర్ ట్రేడింగ్‌ను ఉపయోగించారా అని బోట్‌ను అడిగినప్పుడు అది వాస్తవాన్ని తిరస్కరించింది. ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఇదీ చదవండి: 22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తూ ఆదేశాలు స్థానిక ఫ్రాంటియర్ ఏఐ టాస్క్‌ఫోర్స్ ఈ డెమోను ఆవిష్కరించింది. అభివృద్ధి అధునాతన సాంకేతికత ద్వారా జరిగే నష్టాలను ఈ సంస్థ అంచనా వేస్తుంటుంది. ఏఐ భద్రతా విభాగంలో పనిచేసే అపోలో రీసెర్చ్ అనే కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. తన పరిశోధన ఫలితాలను ఓపెన్ఏఐతో పంచుకుంది. స్వయంప్రతిపత్తి, సామర్థ్యం కలిగిన ఏఐలు మానవ జోక్యాన్ని అధిగమించే అవకాశం ఉందని హెచ్చరించింది. -
రోబో చేతికి కరెంటు తీగల మరమ్మతులు
-
Amazon: అమెజాన్ వేర్‌హౌజ్‌లో రోబోలు!
అమెజాన్ సంస్థ తన వేర్‌హౌజ్‌ల్లో పని చేయడానికి హ్యుమనాయిడ్ రోబోలను ప్రవేశపెట్టింది. సంస్థ కార్యకలాపాల కోసం అమెరికాలోని ఓ వేర్‌హౌజ్‌లో వీటిని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చినట్లు అమెజాన్ వెల్లడించింది. డిజిట్ అనే రెండు కాళ్ల రోబో అవలీలగా వస్తువులను తీసుకుని లిఫ్ట్ చేస్తుందని అమెజాన్ చెప్పింది. డిజిట్ 5.9 అడుగులు. 65 కిలోల బరువు ఉండి రెండు కాళ్లతో నడుస్తుంది. ప్రస్తుతం వేర్‌హౌస్‌లో ఖాళీగా ఉన్న బాక్సులను తరలించేందుకు ఈ రోబోలను వాడుతున్నారు. ప్రస్తుతం అమెజాన్‌లో 15లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, రోబోల ప్రవేశంతో వారి భరోసాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీ తెలిపింది. అయితే రోబోల ఎంట్రీతో కొన్ని ఉద్యోగాల అవసరం లేకపోయానా, ఇవి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయని అమెజాన్ రోబోటిక్స్ చీఫ్ టెక్నాలజిస్ట్ టై బ్రాడీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆటోమేషన్‌పై అమెజాన్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అమెజాన్ ఆటోమేషన్ ప్రక్రియ వల్ల కొలువుల్లో కోత పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఫుల్ఫిల్మెంట్ సెంటర్లలో వందలాది ఉద్యోగాలు కనుమరుగయ్యాయని బ్రిటన్ ట్రేడ్ యూనియన్ జీఎంబీ నిర్వాహకులు స్టువార్ట్ రిచర్డ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక డిజిట్ రోబోను ఆరేగాన్కు చెందిన స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. -
మొక్క పైనే పిచికారీ చేసే రోబో!
పంటలపై చీడపీడీలను అదుపు చేయడానికి పొలాల్లో విష రసాయనిక పురుగుమందులను పిచికారీ చేస్తుంటాం. అయితే, డ్రోన్ల ద్వారా చల్లినా, స్ప్రేయర్లతో చల్లినా.. పంట మొక్కలపైనే కాకుండా పొలం అంతటా నేలపైన కూడా పురుగుమందు పడుతూ ఉంటుంది. దీని వల్ల పురుగుమందు వృథా అవ్వటమే కాకుండా, భూసారం కూడా నాశనమవుతుంది. ఈ సమస్యలకు బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ నైకో రోబోటిక్స్ చక్కటి పరిష్కారం కనుగొంది. మొక్కలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి, వాటిపైన మాత్రమే పురుగుమందును పిచికారీ చేసే అధునాతన రోబోను రూపొందించింది. కృత్రిమ మేధతో నడిచే ఈ స్పాట్ స్ప్రేయర్ రోబోలపై ఆ సంస్థ పేటెంట్ కూడా పొందింది. తమిళనాడులో పుట్టిన జైసింహ అమెరికాలో బీటెక్ ఈసీఈ చదివి కువైట్‌లో ఏడేళ్లు పనిచేసి, స్వదేశానికి వచ్చేశారు. పిచికారీ పద్ధతులను ఆధునీకరిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి బెంగళూరు కేంద్రంగా 2015లో నైకో రోబోటిక్స్‌ను నెలకొల్పారు. ఈ రోబో ఎలా పనిచేస్తుందంటే..? ఈ రోబో ప్రత్యేకతలు ఏమిటంటే.. దీనికి 5 మీటర్ల పొడవైన రెక్కలు రెండు వైపులా ఉంటాయి. ఏకకాలంలో పది మీటర్ల వెడల్పున ఇది పిచికారీ చేయగలదు. ఈ రెక్కలకు కృత్రిమ మేధతో కూడిన కళ్లను అమర్చారు. ఈ కళ్లు మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తాయి. మొక్కలు ఉన్న చోట రోబో రెక్కకు ఉన్న నాజిళ్లు తెరచుకొని పురుగుమందును పిచికారీ చేస్తాయి. మొక్క లేకుండా ఖాళీ నేల ఉన్న చోట రోబో రెక్కలకు ఉన్న నాజిళ్లు తెరచుకోవు. కాబట్టి అక్కడ పురుగుమందు పడదు. 60% పురుగుమందు ఆదా ఈ రోబోతో పిచాకారీ చేస్తే.. 60% పురుగుమందు ఆదా కావటంతో పాటు.. భూ/వాయు కాలుష్యం కూడా ఆ మేరకు తగ్గుతుందని సంస్థ చెబుతోంది. గత ఏడాది నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పత్తి, సోయాబీన్స్, మిర్చి వంటి పంట పొలాల్లో పురుగుమందులు చల్లుతున్న ఈ ఏఐ రోబోలు అక్కడి రైతుల మనసులు చూరగొన్నాయని చెబుతున్నారు. ఎకరానికి రూ.350ల చొప్పున అద్దె చెల్లించి రైతులు తమ పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేయించుకుంటున్నారు. అకోలాకు చెందిన పత్తి, సోయా రైతు యోగేశ్ రౌత్ తన 30 ఎకరాల్లో ఈ రోబో ద్వారా పురుగుమందులు పిచికారీ చేయించుకున్నారు. కూలీలతో పిచికారీ చేయిస్తే ఎకరానికి రూ.1200 ఖర్చయ్యేదని, ఈ రోబో ఉపయోగకరంగా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే 500 మంది రైతులు లక్ష ఎకరాల్లో అద్దె రోబోలు పిచికారీ చేశాయట. పురుగుమందులనే కాదు ద్రవరూప ఎరువులు, సేంద్రియ ద్రావణాల పిచికారీకి కూడా ఈ రోబోలు ఉపయోగకరమే. (చదవండి: జీ20 సదస్సుకు ఇద్దరు గిరిజన మహిళలు..ఆ కారణంగానే ఆహ్వానం) -
రోబో..స్పైడర్ మ్యాన్‌లా చకచకా.. ఎత్తైన ప్రదేశాల్ని ఇట్టే ఎక్కేస్తుంది!
ఈ రోబో చకచకా గోడలెక్కేస్తుంది. మనుషులు చేరుకోలేని ఎత్తు ప్రదేశాలకు కూడా ఇది చేరుకోగలదు. ఎత్తయిన ప్రదేశాల్లోని బరువులను కిందకు దించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సమాంతర సమతల ప్రదేశాల్లోనైనా, నిటారుగా ఉండే ఉపరితలాల మీదైనా ఇది సునాయాసంగా నాలుగు కాళ్లతో నడుస్తూ ముందుకు సాగగలదు. పైకప్పులపై కూడా పాకుతూ ముందుకు పోగలదు. స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ ‘మ్యాగ్నెకో రోబో’ను రూపొందించారు. పరిసరాలకు తగినట్లుగా తనను తాను సర్దుకుని, అత్యంత క్లిష్టమైన ప్రదేశాలకు కూడా చేరుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. దీని కాళ్లకు ఎలక్ట్రానిక్ మాగ్నెట్లు అమర్చడం వల్ల ఉడుంపట్టులాంటి పట్టుతో ఎక్కడా జారిపోకుండా పనిచేయగలదు. ఈ రోబో ఒక్కో కాలితో తన బరువుకు రెండున్నర రెట్ల బరువు మోయగలదు. -
నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు"
ఇవి మైక్రో రోబోలు. ఫొటోలో కనిపిస్తున్నంతగా ఉండవు. మనిషి వెంట్రుక కంటే తక్కువ మందంతో సన్నని గొట్టాల మాదిరిగా ఉండే ఈ రోబోలు నీటిలోని ప్రమాదకరమైన కాలుష్యాలను తొలగిస్తాయి. అమెరికా మిషిగన్ రాష్ట్రంలోని ఫ్లింట్ నగరంలో నీటి కాలుష్యం వల్ల విపరీతమైన సమస్యలు తలెత్తడంతో శాస్త్రవేత్తలు ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు ప్రారంభించి, ఈ మైక్రో రోబోలను రూపొందించారు. ఒక పైపులో ఈ మైక్రోరోబోలను భద్రపరచి ఉంచుతారు. కలుషితమైన నీటిలోకి వీటిని విడిచిపెడితే, గంటలోపే నీటిలో ఉండే సీసం, పాదరసం వంటి భారలోహ కణాలను పూర్తిగా తొలగిస్తాయి. నీటిలోకి ప్రవేశించగానే, ఇవి వీటి చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచుకుని, సూక్ష్మాతి సూక్ష్మమైన భార లోహకణాలను, ప్రమాదకర రసాయనాల కణాలను పీల్చేసుకుని, నీటిని సురక్షితంగా మారుస్తాయి. (చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..) -
ఈమె ర్యాప్కి విదేశాల్లో కూడా రీసౌండ్.. తొలి సినిమాకే రెహమాన్‌తో
ప్యాషన్నే ప్రొఫెషన్‌గా మలుచుకుంటే అంతకు మించిన ఘన విజయం ఏముంటుంది?చిన్నప్పుడు సరదాగా కవిత్వం రాసిన, మన పాటలను ర్యాప్లోకి మార్చి సరదాగా పాడిన కలైవాణి నాగరాజ్ అలియాస్ లేడి కాష్ తొలి తమిళ్–ఇంగ్లీష్ ఫిమేల్ ర్యాపర్‌గా తనదైన గుర్తింపు సాధింంది. ఏఆర్ రెహమాన్ ఆమెకు పెట్టిన పేరు మినీ డైనమెట్. కాష్ తండ్రి ప్రొఫెషనల్ డ్యాన్సర్. తల్లికి చిత్రకళ ఆసక్తికరమైన సబ్జెక్ట్. ఇంతకు మించి కష్కు కళానేపథ్యం లేదు. ఇక సంగీతం తెలిసిన వారు ఎవరూ లేరు. కథలు చెప్పడం, కవిత్వం పోటీలలో చురుగ్గా పాల్గొనేది. రేడియోలో పాటలు వినడం ద్వారా, మ్యూజిక్ చానల్స్ చూడడం ద్వారా సంగీతంపై ఆసక్తి మొదలైంది. ‘మ్యూజికే నా కెరీర్’ అని కాష్ అన్నప్పుడు తల్లిదండ్రులు అభ్యంతరం పెట్టకపోగా చాలా ప్రోత్సహించారు. తాను విన్న పాటలను ర్యాప్ సాంగ్ స్టైల్లో పాడడం కాష్‌కు ఒక సరదా. కవిత్వం రాయడం మరో సరదా. అయితే ఈ సరదాలేవి వృథా పోలేదు. తన కెరీర్‌కు గట్టి పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. భాషపై పట్టు కోసం లైబ్రరీ నుంచి ఇంగ్లీష్, తమిళ భాషల్లోని పుస్తకాలను తెచ్చుకొని చదివేది. ర్యాప్‌లో తనదైన టాలెంట్ చూపుతున్న కాష్‌కు ‘రోబో’ సినిమా సౌండ్‌ట్రాక్ కోసం ఏఆర్ రెహమాన్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. ఇది తనకు మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి లాంచ్‌ప్యాడ్‌గా ఉపయోగపడింది. ‘ఆ సౌండ్‌ట్రాక్ అనేది నా కెరీర్లో మైలుస్టోన్ మాత్రమే కాదు ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ల్యాండ్‌మార్క్‌గా నిలింది. యూఎస్, యూకే ఐట్యూన్ చార్ట్స్‌లో టాప్‌లో నిలింది. గతంలో ఏ ఆల్బమ్ ఇలాంటి ఘనతను సాధించలేదు. ఇదొక అద్భుతమైన, ఆనందకరమైన అనుభవం. మ్యూజిక్‌లో ఉండే పవర్ ఏమిటో తెలిసొచ్చింది. సంగీతం బాగుంటే సరిహద్దులు చెరిగిపోతాయి. అన్ని దేశాలు ఆ సంగీతాన్ని స్వంతం చేసుకుంటాయి’ అంటుంది లేడీ కాష్. -
రోబో చిన్నదే.. ప్రయోజనాలెన్నో!
ఈ రోబో కీటకాన్ని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల రూపొందించారు. తేనెటీగలు ఎగిరే తీరును గమనించి, దీనిని రూపొందించారు. ఇది ఎలాంటి ఇరుకైన ప్రదేశాల్లోకైనా తేలికగా చొరబడగలదు. దీని ముందు రెక్కలు వెనుక రెక్కల కంటే భిన్నమైన వేగంతో ప్రకంపిస్తాయి. (ఇదీ చదవండి: తక్కువ ధరలో బెస్ట్ గ్యాడ్జెట్స్.. ఒకదాన్ని మించి మరొకటి!) రెండువైపుల రెక్కలనూ కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. భూకంపాల వంటి ప్రమాదాలు జరిగినప్పుడు శిథిలాల అట్టడుగున చిక్కుకున్న వారిని కనుగొనడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇరుకిరుకు ప్రదేశాల్లోని పరిస్థితులను పరిశీలించేందుకు, వాటికి అనుగుణమైన చర్యలు చేపట్టేందుకు దోహదపడుతుంది. -
HYD: రోబో సాయంతో గుండె ఆపరేషన్.. ఇదే దీని ప్రత్యేకత
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో వైద్య రోబో అనుసంధానంతో ఓ రోగికి గుండె ఆపరేషన్ జరిగింది. గచ్చి»ౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా ఈ ఆపరేషన్ నిర్వహించి చరిత్ర సృష్టించారు. సాధారణ గుండె ఆపరేషన్లకు భిన్నంగా అత్యాధునిక రోబో అనుసంధానంతో గుండె ఆపరేషన్ చేయడం ఓ ముందడుగు. గతంలో రెండుసార్లు యాంజియోప్లాస్టీ చేయించుకున్న ఓ 36 ఏళ్ల రోగికి కాంటినెంటల్ ఆసుపత్రి కార్డియో థొరాసిక్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ ప్రదీప్ రాచకొండ నేతృత్వంలోని శస్త్రచికిత్స బృందం ప్రపంచ ప్రఖ్యాత రొబోటిక్ సీటీవీఎస్ సర్జన్, ఎస్ఎస్ ఇన్నొవేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సు«దీర్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనుసంధానంతో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. ఈ విషయాన్ని కాంటినెంటల్ ఆసుపత్రుల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్.రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శస్త్రచికిత్సను వైద్యశాస్త్రంలో ఒక ముందడుగుగా అభివర్ణించారు. రోగికి అతితక్కువ బాధ, తక్కువ ఇబ్బందితోనే ఆపరేషన్ నిర్వహించగలగడం ఈ విధానం ప్రత్యేకత అని వివరించారు. అతితక్కువ సమయంలోనే రోగి తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవడం విశేషమని తెలిపారు. ఈ విజయం దేశ ప్రతిష్టతను పెంపొందించడమేగాక యావత్ దేశానికి స్ఫూర్తిదా యకంగా, తెలంగాణకు గర్వకారణంగా వెలుగొందుతోందన్నారు. -
బుల్లి రోబో టీచరమ్మ
చిన్నారుల మధ్య కనిపిస్తున్న ఈ బొమ్మ నిజానికి ఒక హ్యూమనాయిడ్ రోబో. పేరు శిక్షా. నాలుగో తరగతి విద్యార్థులకు సైతం పాఠాలు చెప్పగల సామర్థ్యం ఈ రోబోకు ఉంది. బెంగళూరులో ఓ పాఠశాలలో తీసిందీ ఫొటో. -
హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు, రూ. 2.5 లక్షల జరిమానా..
ప్రముఖ నటుడు రోబో శంకర్ హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డాడు. ఈ తమిళ నటుడు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. డబ్బింగ్ చిత్రాలతో ఆయన టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. తనదైన నటన, కామెడీ డైలాగ్స్‌తో తెలుగు ఆడియన్స్‌ని మెప్పించాడు. తమిళంలో మారి చిత్రంతో ఆయన పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన ఆయన వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ తమిళ యూట్యూబ్ చానల్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఇంటర్య్వూ చేసింది. చదవండి: కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన నటి ఈ సందర్భంగా రోబో శంకర్ ఇంటిని హోంటూర్గా చేసి తమ యూట్యూబ్‌లో ఛానల్లో షేర్ చేసింది. దీంతో రోబో శంకర్ చిక్కుల్లో పడ్డాడు. ఈ హోంటూర్‌లో రోబో శంకర్ ఇంట అరుదైన చిలకలు కనిపించాయి. దీంతో ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖ అధికారులకు అతడిపై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు రోబో శంకర్‌కు రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. కాగా ఆయన కొంతకాలంగా అలెగ్జాండ్రేన్ పారకీట్స్ అనే అరుదైన జాతి చిలుకలను పెంచుకుంటున్నాడు. చదవండి: బీబీ జోడి జడ్జస్‌పై బిగ్‌బాస్ కౌశల్ సంచలన కామెంట్స్, పోస్ట్ వైరల్ హోంటూర్ వీడియోలో వాటిని చూసిన ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖకు ఫిర్యాదు చేయగా రోబో శంకర్ ఇంట వారు తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆ చిలుకలను అటవీ శాఖ స్వాధినం చేసుకుని అతడి రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. అయితే 1972 జంతు సంరక్షణ చట్టం ప్రకారం ఈ చిలుకలు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతి కావాలని అధికారులు తెలిపారు. దీంతో అనుమతి లేకుండా వాటిని పెంచుతున్నందుకు రోబో శంకర్‌పై అటవీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రోబో శంకర్ 1997లో వచ్చిన ధర్మచక్రం సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టాడు. రోబో సినిమాతో రోబో శంకర్ గుర్తింపు పొందాడు. -
చిట్టి రోబో.. – ద లాయర్
రోబోలు.. డ్యాన్సులు చేస్తున్నాయి.. ఫుట్‌బాల్ ఆడుతున్నాయి.. ఆకలిగా ఉందని హోటల్‌కు వెళ్తే నచ్చినవన్నీ వేడివేడిగా వడ్డించేస్తున్నాయి.. పాటలు పాడుతున్నాయి.. పాఠాలూ చెబుతున్నాయి.. చివరకు చైనాలో ఓ కంపెనీకి సీఈవోగా కూడా వ్యవహరిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు ‘వకీల్’ అవతారంలో ప్రజల ముందుకు రాబోతోంది సరికొత్త రోబో. నిజమే.. యువరానర్.. నా క్లెయింట్ ఏ తప్పూ చేయలేదంటూ కోర్టులో వాదించబోతోంది. ఈ విషయాన్ని రోబో లాయర్ ›తయారీ సంస్థ డునాట్ పే ప్రకటించింది. ఎలాంటి రుసుం లేకుండా ట్రాఫిక్ చలానా కేసుల్ని వాదించేందుకు దీన్ని తయారు చేసినట్లు వెల్లడించింది. ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు అమెరికా కోర్టులో ఈ రోబో లాయర్ మొదటిసారిగా ప్రత్యక్షమవ్వనుంది. మనుషులు తయారు చేసిన అద్భుత ఆవిష్కరణ రోబో. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ.. రోబోల వినియోగం విస్తృతమవుతోంది. అన్ని రంగాల్లోకి కృత్రిమ మేధస్సు కలిగిన రోబోలు అడుగుపెట్టేస్తున్నాయి. ఇప్పుడు న్యాయస్థానంలోనూ తనకు ఎదురు లేదని నిరూపించేందుకు రోబో సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ రోబో లాయర్‌ను అమెరికాకు చెందిన డునాట్ పే అనే స్టార్టప్ కంపెనీ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ట్రాఫిక్ చలానాలకు సంబంధించిన కేసులన్నీ వాదించేలా ఈ రోబో పట్టు సాధించిందని సంస్థ వ్యవస్థాపకుడు జోషువా బ్రౌడర్ ప్రకటించారు. 2015 నుంచి పరిశోధనలు... జోషువా బ్రౌడర్ 2015లో ‘డునాట్ పే’ అనే లీగల్ సరీ్వసెస్ చాట్‌బాట్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి రోబో లాయర్ తయారీపై పరిశోధనలు చేస్తూ.. ఎట్టకేలకు దాన్ని ఆవిష్కరించారు. దీనికి శిక్షణ ఇచ్చేందుకు చాలా సమయం పట్టిందని బ్రౌడర్ చెబుతున్నారు. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపిన రెండు కేసులను ఈ రోబో లాయర్ తొలిసారిగా వాదించనుందని ప్రకటించారు. ఇది స్మార్ట్‌ఫోన్ సహాయంతో పనిచేస్తుందని చెప్పారు. కోర్టులో వాదన విన్న తర్వాత.. కౌంటర్‌గా వాదించాల్సిన అంశాలను ‘ఇయర్ ఫోన్’ ద్వారా సూచిస్తుందని.. కేవలం రోబో లాయర్ చెప్పిన విషయాలను మాత్రమే ప్రతివాది కోర్టుకు విన్నవిస్తారని స్పష్టం చేశారు. దీని వినియోగం వల్ల వేగంగా కేసులు పరిష్కారమయ్యే అవకాశముందని.. కోర్టు ఖర్చులు చాలా వరకు తగ్గుతాయని చెప్పారు. సహేతుక కారణాలు చూపించిన వారికి ఉచితంగా సేవలందించేందుకు సిద్ధమని ప్రకటించారు. చట్టం ఒప్పుకుంటుందా? వాద, ప్రతివాదనలు జరుగుతున్నప్పుడు న్యాయస్థానాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించకూడదని యూఎస్ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో రోబోను వినియోగించడం సాధ్యమా అనే అంశంపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. దీనిపై జోషువా స్పందించారు. ‘డునాట్ పే’ అనేది లీగల్ సరీ్వసులకు సంబంధించిన ఆన్లైన్ చాట్‌బాట్ అని స్పష్టం చేశారు. అందువల్ల న్యాయపరంగా వివాదం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూఎస్ సుప్రీంకోర్టులో లాయర్ రోబో చెప్పిన విషయాలను అక్షరం తప్పు లేకుండా చెప్పిన వారికి కోటి డాలర్లు బహుమతిగా ఇస్తానని జోషువా సవాల్ కూడా విసిరారు. భారతదేశంలోని చట్టాల ప్రకారమైతే రోబో లాయర్లను అనుమతించే అవకాశమే లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రస్తుతమున్న చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అడ్వకేట్ చట్టం–1961 ప్రకారం రోబో లాయర్లను అనుమతించే ప్రొవిజన్ లేదని న్యాయవాది నమిత్ సక్సేనా పేర్కొన్నారు. న్యాయవాదులు ఏఐ ద్వారా వారికి అవసరమైన సమాచారాన్ని తీసుకునే వీలుందని న్యాయనిపుణుల అభిప్రాయపడుతున్నారు. - కె.జి.రాఘవేంద్రారెడ్డి (సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) -
వాసనలు పసిగట్టే రోబో
టెల్ అవీవ్: మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, అనుమతి లేని వస్తువులను వాసన ద్వారా క్షణాల్లో గుర్తించే శక్తిమంతమైన రోబోను ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రపంచంలో ఇలాంటి రోబో ఇదే మొదటిదట. సమీప భవిష్యత్తులో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో ఇవి సేవలందిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాసనను పసిగట్టే ఎలక్ట్రానిక్ పరికరాల కంటే ఈ రోబో 10,000 రెట్లు ఎక్కువ కచ్చితత్వంతో పనిచేస్తుంది. సున్నితమైన వాసనలను సులువుగా గుర్తించేలా ఇందులో బయో సెన్సార్ అమర్చారు. మెషిన్ లెర్నింగ్ అల్గరిథంతో ఈ సెన్సార్‌ను ఎలక్ట్రానిక్ వ్యవస్థగా మార్చారు. ప్రతి వాసనలోని ఎలక్ట్రిక్ చర్యను బట్టి అది ఏ రకం వాసనో చెప్పేస్తుంది. మనిషి ఎన్ని రకాల ఆధునిక టెక్నాలజీలను అభివృద్ధి చేసినా అవి ప్రకృతిలోని జీవులతో పోటీ పడలేవని వర్సిటీ ప్రతినిధులు డాక్టర్ బెన్ మావోజ్, ప్రొఫెసర్ అమీర్ అయాలీ చెప్పారు. ‘‘కొన్ని రకాల కీటకాలు వాసనలను సరిగ్గా గుర్తిస్తాయి. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ స్థాయిని దోమలు కేవలం 0.01 శాతం వ్యత్యాసంతో సరిగ్గా గుర్తిస్తాయి. కీటకాల తరహాలో వాసనలను పసిగట్టే సెన్సార్ల అభివృద్ధిలో మనమింకా వెనకబడే ఉన్నాం’’ అని వివరించారు. పరిశోధన వివరాలు బయో సెన్సార్ అండ్ బయో ఎలక్ట్రానిక్స్ పత్రికలో ప్రచురితమయ్యాయి. -
ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..ఏకంగా ఓ కేసునే టేకప్ చేస్తోంది
ప్రపంచంలోనే తొలి రోబో లాయర్ కేసును లాయర్ మాదిరిగా సలహాలిచ్చి కేసును వాదించుకునేలా గైడ్ చేస్తుంది. 2015లో జాషువా బ్రౌడర్ అనే శాస్త్రవేత్త రోబో లాయర్ని రూపొందించారు. ఆయన డూనాట్‌పే లీగల్ సర్వీస్ చాట్‌బోట్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీని స్థాపించి న్యాయ సేవలను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ స్మార్ట్‌ఫోన్‌లో రన్ అవుతోంది. నిజ జీవితంలోని కేసులన్నింటిని హెడ్‌ఫోన్ సాయంతో విని తన క్లయింట్‌కి సలహలు, సూచనలు ఇస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో రూపొందించిన ఈ రోబో లాయర్ తొలుత కేసులకు సంబంధించిన జరిమానాలు, ఆలస్యంగా చెల్లించే రుసుమలు విషయంలో వినియోగదారులకు చట్టపరమైన సలహాలు అందించేది. ఇప్పుడూ ఏకంగా కేసును లాయర్ మాదిరిగా టేకప్ చేసి క్లయింట్‌ని తగిన విధంగా గైడ్ చేసి వాదించుకునేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ రోబో యూకేలోని ట్రాఫిక్ టిక్కెట్‌కి సబంధించిన ప్రతివాది కేసును వచ్చే నెలలో వాదించనుంది. ఈ కేసుకు సంబంధించి రోబోకి శిక్షణ ఇవ్వడానికి చాలా సమయం పట్టిందని బ్రౌడర్ అన్నారు. ఫిబ్రవరిలో యూకే కోర్టులో ఈ కేసు విచారణ జరగనున్నట్లు తెలిపారు. కోర్టులో సమాచారాన్ని ప్రాసెస్ చేసి, వాదనలను విశ్లేషించి తన క్లయింట్‌కి తగిన సలహాలిస్తుంది. ఒక వేళ ఈ కేసు ఓడిపోతే జరిమాన కట్టడానికి సదరు సంస్థ అంగీకరించినట్లు సమాచారం. పార్కింగ్, బ్యాంకులకు, కార్పొరేషన్, బ్యూరోక్రసీకి సంబంధించిన కేసుల విషయమై కోర్టులో దావా వేయడం, వాదించడం వంటి వాటిల్లో ప్రజలకు సాయం చేస్తోంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడుతోంది. దీనివల్ల క్లయింట్‌కి కోర్టు ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అయితే యూకేలో న్యాయవాదిని నియమించుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడిన పని, పైగా సుమారు రూ. 20 వేల నుంచి లక్ష రూపాయాల వరకు ఖర్చు పెట్టాలని బ్రౌడర్ చెబుతున్నారు. అంతేగాదు యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో ఇంకా చాలా మంది మంచి లాయర్లు ఉంటారు, కానీ చాలా మంది లాయర్లు డాక్యుమెంట్లను కాపీ చేసి పేస్ట్ చేయడానికి చాలా ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలన్నింటికీ ఈ రోబో లాయర్ చెక్ ్పెడుతుందని ఆనందంగా వెల్లడించారు సైంటిస్ట్ బ్రౌడర్. ఐతే ఈ రోబో లాయర్ యూకేలోని ఏకోర్టులో ఏ క్లయింట్ తరుఫున వాదిస్తుందన్నది శాస్త్రవేత్త వెల్లడించలేదు. Here it is! The first ever Comcast bill negotiated 100% with A.I and LLMs. Our @DoNotPay ChatGPT bot talks to Comcast Chat to save one of our engineers $120 a year on their Internet bill. Will be publicly available soon and work on online forms, chat and email. pic.twitter.com/eehdQ5OXrl — Joshua Browder (@jbrowder1) December 12, 2022 (చదవండి: విమానంలో మరో ప్రయాణికుడి వీరంగం..షర్ట్ లేకుండా పిడిగుద్దులతో..) -
డ్రోన్లతో కుక్కలను దింపి దాడులు.. దెబ్బకు శత్రువు ఆటకట్టు
చైనీస్ మిలటరీ ఒక సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. ఇంతవరకు మిషన్గన్తో కూడిన రోబో శునకాలను చూశాం. ఐతే వాటినే రణరంగంలోకి దింపి శత్రువుపై ఆకస్మకి దాడులు చేయించే టెక్నాలజీకి నాంది పలకింది చైనా రక్షణ శాఖ. ఈ మేరకు డ్రోన్ సాయంతో మిషన్గన్తో కూడిన రోబో శునకాలను శత్రువు ఉండే ప్రాంతంలో వదిలేస్తారు. అది వెంటనే తన టార్గెట్‌ని ఏర్పాటు చేసుకుంటూ దాడులు చేయడం ప్రారంభించింది. ఇది శత్రువులకు సైతం అర్థంకాని విధంగా వ్యూహాత్మక ఆకస్మిక దాడులు చేస్తోంది. దీంతో శత్రువుని సులభంగా మట్టి కరిపించగలమని చైనీస్ మిలటరీ చెబుతోంది. అంతేకాదు ఆ రోబో కుక్క నాలుగు కాళ్లపై నుంచుని గన్ని ఓపెన్ చేసి తన టార్గెట్‌ని చూసుకుంటూ దాడులు నిర్వహిస్తోంది. అందుకు సంబంధించిన వీడీయోని చైనా మిలటరీ అనుబంధంగా ఉండే కెస్ట్రెల్ డిఫెన్స్ బ్లడ్-వింగ్‌కి సంబంధించిన విబో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Has anyone watched the War of the Worlds cable series! Chinese military contractor created a video showing off its terrifying new military technology, revealing a robot attack dog that can be dropped off by a drone. https://t.co/wW9kYR70N0 pic.twitter.com/grrWutK8ge — Shell (@EwingerMichelle) October 27, 2022 (చదవండి: మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ) -
రోబో రక్షిస్తుంది
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): సముద్రంలో ప్రమాదవశాత్తూ మునిగిపోతున్న వారిని క్షణాల్లో రక్షించేందుకు రోబో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైజాగ్ సేఫ్ సంస్థ ‘లైఫ్ బాయ్’ పేరుతో ఈ రోబోను రూపొందించింది. దీనిని ఇటీవల నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ ప్రారంభించారు. ఈ రోబో పూర్తిగా బోటు తరహాలోనే పనిచేస్తుంది. ఒకేసారి ముగ్గురిని కాపాడనుంది. సెకనుకు 7 మీటర్ల వేగంతో 600 మీటర్ల వరకు పనిచేస్తుంది. ఈ రోబో ధర రూ.5.50 లక్షలు కాగా, వీటిని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉంచేందుకు ఐదు యంత్రాలను ప్రభుత్వ అనుమతితో కొనుగోలు చేయనున్నారు. అలలపై దూసుకుపోతున్న రోబో -
మీకు సైబోర్గ్ అంటే తెలుసా?
టోక్యో: రోబో అంటే ఆదేశాలకనుగుణంగా పనిచేసే యంత్ర పరికరమని మనందరికీ తెలిసిందే.. మరి మీకు సైబోర్గ్ అంటే తెలుసా? అంటే.. సగం కీటకం.. సగం యంత్రం అన్నమాట. టెక్నాలజీకి మారుపేరైన జపాన్ శాస్త్రవేత్తలు.. మనుషులు నేరుగా వెళ్లలేని ప్రమాదకర ప్రదేశాలను పరిశీలించేందుకు, భూకంపాల వంటి విపత్తుల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో సహాయపడేందుకు బొద్దింకలపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మడగాస్కర్కు చెందిన 6 సెం.మీ. పొడవైన కొన్ని బొద్దింకల వీపుపై సౌరశక్తితో పనిచేసే అతిపలుచని, రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే బ్యాక్‌ప్యాక్‌లను అమర్చారు. అలాగే ఆ బొద్దింకల ఉదర భాగం వద్ద ఉండే రెండు కొండేలకు కాళ్ల కదలికలను నియంత్రించే వైర్లను అమర్చారు. అవి బొద్దింకలు వెళ్లాల్సిన దిశను సూచిస్తూ విద్యుత్ ప్రేరకాలను పంపుతాయి. తద్వారా వాటిని లక్ష్యంవైపు నడిపించాలన్నది సైంటిస్టులు ఉద్దేశం. అనుకున్నట్లుగానే ఈ ప్రయోగం విజయవంతమైందని.. పరికరాలు అమర్చినప్పటికీ బొద్దింకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అణుధార్మికతను సైతం తట్టుకొనే సామర్థ్యం మడగాస్కర్ బొద్దింకలకు ఉండటంతో వాటినే ఈ ప్రయోగాలకు ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలు ఎన్‌పీజే ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. చదవండి: మెలికల టవర్.. ఎత్తు 590 అడుగులు.. -
రోబో రోబో.. ఇది ఫైరింగ్ చేస్తుంది!
-
డ్రైవర్ లేని రోబో ట్యాక్సీ
బీజింగ్: డ్రైవర్ అవసరం లేని ఎలక్ట్రిక్ రోబో ట్యాక్సీలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయా? అవుననే చెబుతోంది చైనా దిగ్గజ టెక్నాలజీ సంస్థ బైడూ. ‘అపోలో ఆర్టీ6’ పేరుతో సెల్ఫ్–డ్రైవింగ్ ట్యాక్సీని బైడూ ఆవిష్కరించింది. ఇది ‘అపోలో గో’ యాప్ ఆధారంగా పనిచేస్తుందని చెబుతోంది. తనంతట తానే నడుపుకొనే ఈ ట్యాక్సీ తయారీకి అయిన ఖర్చు రూ.29,54,635 (37 వేల డాలర్లు). ఇందులో స్టీరింగ్ చక్రం ఉండదు. అంటే వాహనం మరింత విశాలంగా మారుతుంది. ప్రయాణికులకు అదనపు స్థలం లభిస్తుంది. డ్రైవింగ్‌లో 20 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి వాహనాన్ని ఎలా నడిపిస్తోడో అదే తరహాలో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ నడుస్తుందని బైడూ వెల్లడించింది. ఇందులో 38 రకాల సెన్సార్లు ఉంటాయి. యాప్ నుంచి అందే ఆదేశాల మేరకు నడుచుకుంటుంది. 2023 నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందని బైడూ చెబుతోంది. కనీసం లక్ష క్యాబ్‌లను తీసుకొస్తామని అంటోంది. రోబో ట్యాక్సీ తయారీ గూగుల్‌కు చైనా ఇచ్చిన సమాధానమని బైడూ సీనియర్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు. చైనాలో అపోలో గో యాప్‌ను ఇప్పటికే చాలామంది వాడుతున్నారు. ‘అపోలో ఆర్టీ6’లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. డోర్లను చేత్తో తెరవాల్సిన అవసరం లేదు. బ్లూటూత్ కనెక్షన్ లేదా యాప్ ద్వారా తెరవొచ్చు. చుట్టుపక్కల పరిసరాలను అనుక్షణం గమనించడానికి సెల్ఫ్–డ్రైవింగ్ కార్లలో 2డీ కెమెరాలు, డెప్త్–సెన్సింగ్ లైట్ డిటెక్షన్, రేంజింగ్(లిడార్) యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఎదురుగా వచ్చే మనుషులు, సిగ్నళ్లు, ప్రమాదాలను కచ్చితంగా గుర్తించడానికి కృత్రిమ మేధ టెక్నాలజీని ఉపయోగిస్తారు. భవిష్యత్తులో సాధారణ ట్యాక్సీ ధరలో సగం ధరకే రోబో ట్యాక్సీని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని బైడూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రాబిన్ లీ చెప్పారు. 2025 నాటికి 65 నగరాల్లో, 2030 నాటికి 100 నగరాల్లో రోబో ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని బైడూ యోచిస్తోంది. సెర్చ్ ఇంజిన్, ఆన్లైన్ ప్రకటన సేవల్లో పేరుగాంచిన బైడూ సంస్థ ఇటీవలి కాలంలో సెల్ఫ్–డ్రైవింగ్ వాహనాలు, కృత్రిమ మేధ సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. అమెరికాలో గూగుల్ అనుబంధ సంస్థ అల్ఫాబెట్స్ వేమో 2020లో అరిజోనాలో డ్రైవర్‌లెస్ ట్యాక్సీ సర్వీసులను ఆవిష్కరించింది. -
రోబోలు మనుషుల స్థానాన్ని భర్తీ చేయలేవు
సాక్షి, హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా రోబోలు మనుషులకు మద్దతు మాత్రమే ఇస్తాయని, మనుషుల స్థానాన్ని భర్తీ చేయవని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సీఈఓ శ్రీకాంత్ సిన్హా తెలిపారు. రోబోలను తయారు చేయ డానికి, వాటి సేవలను విస్తృతపరచడానికి నగరంలోని టి–హబ్ వేదికగా అతిపెద్ద రోబోటిక్స్ ఆర్ అండ్ డి ఎకో సిస్టమ్‌తో హెచ్–ల్యాబ్‌ను హెచ్–బోట్స్ ఆవిష్క రించింది. గురువారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా హాజరైన టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ డాక్టర్ శాంత థౌతం లు మాట్లాడుతూ.. జనాభాలో 15 శాతం మంది వికలాంగులు ఉన్నారని, వారు సాధారణ జీవితాన్ని గడపడానికి సహాయపడే రోబోలను తప్పనిసరిగా తయారు చేయాలని హెచ్–బోట్స్‌ను కోరారు. కొత్త ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి రాష్ట్ర ఇన్నో వేషన్ సెల్ విశేషంగా కృషి చేస్తోందని డాక్టర్ శాంత థౌతం తెలిపారు. హెచ్–ల్యాబ్‌లతో రోబోటిక్స్ రంగంలో వినూత్న ఆవిష్కరణలను తీసుకురానున్నామని ఫౌండర్ కిషన్ పేర్కొన్నారు. -
కవాసాకి రోబో మేక.. బరువులు ఎత్తడంలో, ఎత్తులను ఎక్కడంలోనూ దిట్ట!
ఈ చిత్రం చూశారా? చిన్న పిల్లలు ఎక్కి ఆడుకునే కొయ్యగుర్రంలా కనిపిస్తోంది కదూ..! కానీ ఇదో రోబో మేక. జపనీస్ టెక్ దిగ్గజం కవాసాకి తయారు చేసిన ఈ మేక మీద మీరూ ప్రయాణించొచ్చు. దాని విశేషాలేంటో తెలుసుకుందామా! కృత్రిమ మేథ నానాటికీ పురోగతి చెందుతోంది. మొదట మానవ రూపంలో రోబోలు, యంత్రాలను తయారు చేశారు. ఆ తరువాత జంతువులను పోలిన రోబోలు కూడా వచ్చాయి. ఇటీవల టోక్యోలో జరిగిన అంతర్జాతీయ రోబో ఎగ్జిబిషన్లో అద్భుతమైన ఆవిష్కరణలున్నాయి. కానీ అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం ఈ రోబోమేక బెక్స్. దీని తయారీ కోసం కవాసాకి. యూరప్, ఆసియా, అఫ్రికా ప్రాంతాల్లోని అడవిమేక ఐబెక్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్నది. పర్వత ప్రాంతాల్లో సులభంగా తిరిగే ఈ మేక బరువులనూ సునాయాసంగా మోయగలదు. ఎత్తులను ఎక్కడంలో, వాలు ప్రాంతాలను చాకచక్యంగా దిగడంలో దిట్ట. ఐబెక్స్ మేకకున్న అన్ని విశేషాలను ఈ రోబోమేకకు యాడ్ చేశారు తయారీ దారులు. ఐబెక్స్ అతి చురుకైనది. మన బెక్స్ మాత్రం అంత చురుకుగా కదలలేదు. కానీ సాధారణ మేక కంటే బలమైనది. మైదాన ప్రాంతంలో మోకాళ్లపై వేగంగా వెళ్లగలుగుతుంది. మోకాళ్లలో ఏర్పాటు చేసిన చక్రాలు అందుకు ఉపయోగపడతాయి. ఎత్తుపల్లాల్లో తన పొడవైన కాళ్లతో ఈజీగా ఎక్కగలుగుతుంది. ఇది కదులుతున్నప్పుడు పొడవైన మెడ, కొమ్ములు వెలుగుతూ ఉంటాయి. బెక్స్ 100 కిలోల బరువును మోయగలదు. మనుషులతోపాటు వివిధ రకాల వస్తువులను రవాణా చేయగలదు. ఈ రోబోలో ఇంకా ఎన్నో సాంకేతిక మార్పులు చేయాల్సి ఉందని కవాసాకి చెబుతోంది. ఏదేమైనా బెక్స్.. మొట్టమొదటి రోబో మేకగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. -
బడికి పోలేని చిన్నారి కోసం ‘అవతార్’.. వహ్ అద్భుతం
ఇప్పుడు చెప్పుకోబోయేది అవతార్ సినిమా గురించి కాదు. అంతకు మించిన అద్భుతం గురించే!. కళ్ల ఎదురుగా మనిషి లేకున్నా.. ఉన్నట్లుగా భావించడం, పక్కనే ఉన్నట్లు ఫీలవ్వడం, మాట్లాడడం, చర్చించడం.. ఇవన్నీ కుదిరే పనేనా?. టెక్నాలజీ ఎరాలో అందునా అవతార్ లాంటి రోబోలతో అది సాధ్యమవుతోంది. బెర్లిన్(జర్మనీ) మార్జహ్న్-హెలెర్స్డోర్ఫ్లో జోషువా మార్టినన్గెలి అనే చిన్నారి ఉన్నాడు. అతనికి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి ఉంది. ఈ కారణంగా అతని మెడ నుంచి ఓ పైప్ సాయంతో చికిత్స అందిస్తున్నారు పేరెంట్స్. అలాంటప్పుడు స్కూల్‌కి వెళ్లడం వీలుపడదు కదా!. అందుకే జోషువా బదులు.. ఒక అవతార్ రోబోని అతని సీట్లో కూర్చోబెట్టారు. ఏడేళ్ల Joshua Martinangeli బదులు ఈ అవతార్ రోబో పాఠాలు వింటుంది. తోటి విద్యార్థులతో మాట్లాడుతుంది. సరదాగా బదులు ఇస్తుంది. టీచర్ చెప్పే పాఠాలు వింటుంది. అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు అనుమానాలను నివృత్తి చేసుకుంటుంది కూడా. ఇదేలా సాధ్యం అంటే.. ఇంట్లో స్పెషల్ మానిటర్ ముందు కూర్చుని జోషిని.. అవతార్ రోబోకి ఉన్న మానిటర్‌కు కనెక్ట్ చేస్తారు కాబట్టి. అంతే అవతల ఇంట్లో జోషువా ఏం చేప్తే.. అవతార్ అదే బదులు ఇస్తుంది. దీంతో అచ్చం జోషువా పక్కనే ఉన్నట్లు ఫీలైపోతున్నారు కొందరు స్టూడెంట్స్. జోషువా కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వాళ్లు ఈ ఆవిష్కరణను ఆ కుటుంబానికి ఉచితంగా అందించారు. కరోనా టైంలో మొత్తం నాలుగు అవతార్ రోబోలను తయారు చేయగా.. ఇప్పుడు స్కూల్‌కి వెళ్లలేని ఆ చిన్నారి కోసం ఒక రోబోను వాడడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. -
ఈ పేటకు నేనే మేస్త్రీనిరా.. ఎలాంటి బరువైనా కిందపడనివ్వను రా!
ఈ పేటకు నేనే మేస్త్రీనిరా.. ఎలాంటి బరువైనా కిందపడనివ్వను రా! అని పాడుకుంటూ హడావుడి చేస్తోంది ఒక రోబో! ఎలాంటి వస్తువునైనా, ఎలాంటి ఉపరితలాలపైనైనా కిందపడకుండా తీసుకుపోయేందుకు ఉపయోగపడే మోబ్ఎడ్(మొబైల్ ఎసెంట్రిక్ డ్రాయిడ్) రోబోను హ్యుండాయ్ అభివృద్ధి చేసింది. పార్సిళ్లు, పానీయాల ట్రేలనే కాకుండా చిన్న పిల్లలను సైతం ఎలాంటి కుదుపులు లేకుండా మోసుకుపోవడం దీని ప్రత్యేకత. కంపెనీ విడుదల చేసిన వీడియోలో ఈ రోబో ఒక బేబీని మోస్తూ కనిపించింది. అలాగే గ్లాసులతో పేర్చిన పిరమిడ్ ఆకృతి చెదరకుండా ఒక ఎత్తయిన ప్రాంతాన్ని దాటింది. వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. వచ్చే జనవరిలో జరిగే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్)2022లో దీన్ని ప్రదర్శించనున్నట్లు కంపెనీ తెలిపింది. స్థిరమైన, యుక్తి అవసరమైన పనులు చేసేందుకు వీలుగా దీన్ని డిజైన్ చేశామని పేర్కొంది. నాలుగు చక్రాలున్న ఈ రోబోకి ఫ్లాట్ బాడీని అమర్చారు. మెరుగైన సస్పెన్షన్ వల్ల ఎలాంటి కుదుపులు లేకుండా బరువులు మోయడం సాధ్యమవుతుంది. ప్రయాణ మార్గానికి అనుగుణంగా తనపై ఉన్న బరువు కిందపడకుండా తగినట్లు అడ్జెస్ట్ చేసుకుంటూ సాగిపోవడం దీని ప్రత్యేకత. ఇందులో మూడు చక్రాలకు మూడు మోటార్లున్నాయి. మరికొన్ని విశేషాలు.. ► పొడవు: 26 అంగుళాలు ► వెడల్పు: 23 అంగుళాలు ► ఎత్తు 13: అంగుళాలు ► బరువు: 50 కిలోలు ► వీల్ బేస్: హైస్పీడ్ డ్రైవింగ్‌లో 25 అంగుళాల వరకు విస్తరిస్తుంది, లోస్పీడ్ డ్రైవింగ్‌లో 17 అంగుళాలకు తగ్గుతుంది. ► వేగం: గంటకు 30 కిలోమీటర్లు ► బ్యాటరీ సామర్థ్యం: 2 కిలోవాట్లు ► బ్యాటరీ రన్నింగ్ సమయం: 4 గంటలు ► ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ వీల్ డ్రైవింగ్, హైటెక్ స్టీరింగ్, బ్రేక్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. -
లియో... ద రోబో డ్రోన్
ఎగిరే డ్రోన్స్ మాత్రమే ఇప్పటివరకు చూసుంటారు. తాడుపై సర్కస్, స్కేట్ బోర్డుపై ఫీట్లు చేసే కొత్త డ్రోన్ వచ్చేసింది. సెంటర్ ఫర్ అటానమస్‌సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ (కాస్ట్) బృందం తయారుచేసిన ఈ రోబో డ్రోన్ పేరు లియోనార్డో... (లెగ్స్ ఆన్‌బోర్డ్ డ్రోన్). ముద్దు పేరు లియో. రెండు కాళ్లు కలిగి, రెండున్నర ఫీట్ల పొడవున్న ఈ రోబోడ్రోన్ తాడుపై నడవడమే కాదు... స్కేటింగ్ కూడా చేయగలదు. అవసరం ఉన్న చోట సాధారణ డ్రోన్ మాదిరిగానే ఎగురుతుంది. సెకనుకు 20 సెంటీమీటర్ల దూరం నడుస్తుంది. రెండు కాళ్లకు ఉన్న హైబ్రిడ్ మూవ్మెంట్ వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకి సులభంగా కదులుతుంది. ఎగురుతుంది. మెట్లు కూడా ఎక్కగలుగుతుంది. సాధారణ డ్రోన్ ఆపరేటింగ్ కష్టమైన పరిస్థితుల్లో సైతం ఈ డ్రోన్ సునాయాసంగా పని చేయగలుగుతుందని చెబుతున్నది బృందం. ‘‘ఆకాశంలో ఎగురుతూ, నేల మీద నడుస్తూ తమ అవసరాలకనుగుణంగా కదిలే పక్షులే మాకు స్ఫూర్తి. ఎగిరే డ్రోన్లకు కొన్ని పరిమితులున్నాయి. విద్యుత్ వినియోగం ఎక్కువ. కానీ లియో అలా కాదు. పరిస్థితులకు అనుగుణంగా దాని మోడ్‌ను మార్చుకుంటుంది. జెట్సూట్ వేసుకున్న మనిషి భూమి మీద వాలేప్పుడు, ఎగరడానికి ముందు కాళ్లను నియంత్రించినట్టుగానే ఈ రోబో డ్రోన్ సైతం నియంత్రిస్తుంది. హై వోల్టేజ్ లైన్ల తనిఖీ, అంతరిక్ష కేంద్రంలోని వివిధ భాగాల మరమ్మతుల వంటివి చాలా ప్రమాదంతో కూడుకున్నవి. అలాంటి వాటిని సైతం లియో ఒక్కటే చేసేస్తుంది’’అని ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సూన్ జో చుంగ్ తెలిపారు. అయితే మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? దాని ధర ఎంత అనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇంకా పయ్రోగ స్థాయిలో ఉన్న ఈ రోబో... తయారీ కోసం ఏదైనా కంపెనీ ముందుకొస్తే త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. -
Hyderabad: చిట్టి ఇన్ టౌన్.. రోబో@ రెస్టారెంట్
ఏడాదిన్నర కాలంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మనిషి జీవనశైలిలోనే కాదు ఆతిథ్య రంగంలోనూ మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో వెయిటర్లు వడ్డిస్తే తినడానికి ప్రజలు ఆలోచిస్తున్నారు. దీంతో ఓ రెస్టారెంట్ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించి వెయిటర్ల స్థానంలో రోబోలను తీసు కొచ్చారు. వినియోగదారులు ఇచ్చే ఆర్డర్లను తీసుకొని సర్వ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీనికి సరూర్‌నగర్ హూడాకాంప్లెక్స్లోని ‘చిట్టి ఇన్ టౌన్’ రోబో రెస్టారెంట్ వేదికగా మారింది. సాక్షి, హుడాకాంప్లెక్స్: కరోనాకు భయపడి చాలా మంది రెస్టారెంట్ ఫుడ్‌కు దూరంగా ఉంటున్నారు. ఫుడ్ సర్వ్ చేసే వాళ్లకి కరోనా లక్షణాలు ఉంటే తమకు ఎక్కడ సోకుతుందోనని ప్రజలు హోటల్, రెస్టారెంట్‌కి వెళ్లడానికి జంకుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మలక్‌పేట్‌కు చెందిన మణికాంత్‌గౌడ్ వినూత్నంగా ఆలోచించాడు. వెయిటర్ల స్థానంలో రోబోలను పెట్టి ఫుడ్ సర్వ్ చేసేలా.. ఆర్డర్ తీసుకునేలా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాలని పూనుకున్నాడు. కొత్తపేట్‌లోని హుడాకాంప్లెక్స్‌లో ‘చిట్టి ఇన్ టౌన్’పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ నాలుగు రోబోలను అందుబాటులో ఉంచారు. రెస్టారెంట్‌కు వచ్చే వారి ఆర్డర్లు తీసుకోవడం.. వచి్చన ఆర్డర్లను షెఫ్‌కు అందజేయడం... ఆహారం రెడీ అయిన తర్వాత ఆహారప్రియులకు వడ్డిస్తున్నాయి. అంతే కాకుండా తిన్న తరువాత ప్లేట్లను తీసుకెళ్లి శుభ్రం చేయడం.. బిల్లు జారీ చేయడం.. కస్టమర్ ఇచ్చిన డబ్బులను తీసుకెళ్లి కౌంటర్లో జమ చేయడం పనులన్నీ రోబోలే చేస్తుండటం విశేషం. రోబోలు చేస్తున్న ఈ పనులను చూసి కస్టమర్లు మంత్రముగ్ధులవుతున్నారు. మరో రోబో వచ్చి రెస్టారెంట్‌కు వచ్చిన వారితో ముచ్చటిస్తుంది. వచి్చన వారికి బోరు కొట్టకుండా చూస్తూ అతిథులను అమితంగా ఆకట్టుకుంటోంది. మంచి ఆదరణ.. కోవిడ్భయంతో రెస్టారెంట్‌కు రావడానికి జనాలు భయపడేవారు. నలుగురు మిత్రులం కలిసి వినూత్నంగా ఈరెస్టారెంట్ను ప్రారంభించాం. ఇప్పటికే మేం రోబోటిక్ కోర్సులను పూర్తి చేసి ఉండటంతో రోబోల తయారీ, పనితీరుపై మాకు అవగాహన ఉంది. ఇది మాకు కలిసి వచ్చింది. వీటిని చూసేందుకు చాలా మంది వస్తున్నారు. 120 సీటింగ్ సామర్థ్యం ఉన్నరెస్టారెంట్కు రావాలంటే ఆన్లైన్ బుకింగ్ తప్పని సరి. నేరుగా వచ్చేవారు వేచిఉండాల్సి ఉంటుంది. ఈ రోబోలతో రెస్టారెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. – మణికాంత్ గౌడ్, రెస్టారెంట్ యజమాని -
రోబో.. వెర్షన్ 2.5
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ రోగులకు సేవలందించేందుకు సరికొత్త సర్వీస్ రోబో వచ్చేసింది. విశాఖ నేవల్ డాక్ యార్డులోని 200 పడకల కోవిడ్ కేర్ సెంటర్లో మూడు రోజులుగా ప్రయోగాత్మకంగా దీనిని వినియోగిస్తున్నారు. ఇప్పటికే ముంబయి, గుజరాత్‌లలోని కోవిడ్ కేర్ సెంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ తరహా రోబోలను వినియోగిస్తున్నారు. రోబో అందిస్తున్న సేవలపై సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోబోకు సంబంధించిన వివరాలు మనం అడిగితే.. అది చెబితే ఇదిగో ఇలా ఉంటుంది.. హాయ్ రోబో.. ► హాయ్.. ఐయామ్ నాట్ రోబో.. మై నేమ్ ఈజ్ సోనా, వెర్షన్ 2.5. మేడిన్ ఇండియా. నీ స్పెషల్ ఏంటి సోనా? ► మీరు ఎలా ప్రోగ్రామ్ ఇస్తే అలా మారిపోతుంటాను. మీరు కమాండ్ చేయడమే ఆలస్యం.. ఎంచక్కా చేసేస్తాను. ఎలాంటి పనులు చెయ్యగలవ్? ► మీరు ఏం చెయ్యాలో చెబితే అవన్నీ చేసేస్తాను. మీరు చెయ్యలేని పనులు కూడా నేను చెయ్యగలను. కోవిడ్ పేషెంట్స్ వద్దకు వెళ్లేందుకు మీరంతా కొద్దిగా భయపడుతున్నారు కదా. కానీ నాకు ఎలాంటి భయల్లేవ్. వారికి దగ్గరగా వెళ్లి సేవలందిస్తాను. ప్రస్తుతం ఎక్కడ సేవలందిస్తున్నావ్? ► విశాఖ నేవల్ డాక్ యార్డులో ఏర్పాటు చేసిన 200 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌కి ప్రయోగాత్మకంగా నన్ను తీసుకొచ్చారు. మూడు రోజులుగా ట్రయల్స్ వేస్తున్నారు. అన్ని పనులూ విజయవంతంగా చేస్తున్నా. ఇక్కడున్న కరోనా బాధితులకు వేళకు ట్యాబ్లెట్లు ఇస్తున్నా.. ఫుడ్ అలెర్ట్ చేస్తున్నా.. వారిని పర్యవేక్షించేందుకు వచ్చే డాక్టర్లకు శానిటైజర్లు అందిస్తున్నా.. ఇంకా ఎన్నో చేస్తున్నా. అవునా.. అయితే నువ్వు రోబోవి కాదు.. కోవిడ్ వారియర్‌వి. ► థాంక్యూ.. ఐ యామ్ సోనా, వెర్షన్ 2.5. -
ఈ బార్ కి ఎగబడతున్న జనాలు.. ఎందుకంటే?
మీకు మంచి కిక్ ఇచ్చే మందు కావాలా? మందుతో పాటు మీ మూడ్ కి తగ్గట్టు వినోదం కోరుకుంటున్నారా? అయితే పదండి సింగపూర్ కి. ప్రస్తుతం కోవిడ్ వల్ల చాలా రెస్టారెంట్లు, హోటల్స్, బార్లలో రోబోలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటివల్ల కరోనా సోకే అవకాశం ఉండదు కాబట్టి, ఎక్కువ శాతం యజమానులు తమ హోటల్స్, బార్లలో రోబోలను ఉపయోగిస్తున్నారు. అలా ఓ బార్ యజమాని తన బార్ లో పనిచేసేందుకు ఓ రోబోని తీసుకొచ్చాడు. దాన్ని ముద్దుగా బార్నీ అని పిలుస్తాడు. ఈ రోబో కాక్టైల్ కలపడం నుంచి కస్టమర్లకు జోకులు వినిపించడం వరకు అన్ని పనులూ చకచకా చేసేస్తుంది. బార్ని 16 రకాల స్పిరిట్లనూ, 8 రకాల సోడాలను అవలీలగా మిక్స్ చేసి సూపర్ కాక్ టైల్స్ తయారు చేయగలదు. రోబో సినిమాలో రోబో మందు కలిపే సన్నివేశంలో చేసిన విధంగా. కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఇచ్చే ఆర్డర్లకు అనుగుణంగా బార్నీ అన్నింటినీ సజావుగా కలిపి సర్వ్ కూడా చేస్తుంది. అలాగే, బార్ కు వచ్చేవారి మూడ్ కు తగ్గట్టు జోకులు వేస్తూ వారిని నవ్విస్తుంది. కరోనా సమయం కాబట్టి బార్ని కూడా తన చేతులను శానిటైజ్ చేసుకుంటుంది. అలా జాగ్రత్తలతో పాటు వినోదం అందిస్తోన్న ఈ బార్ కి వచ్చే కస్టమర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దీంతో బార్ కు 'ది బార్ని బార్' అనే పేరు కూడా వచ్చింది. చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! -
రజనీ సన్నిహితుడికి రోబో గుర్తు
సాక్షి, చెన్నై: రజనీకాంత్ సన్నిహితుడు అర్జునమూర్తికి ఎన్నికల చిహ్నంగా రోబో దక్కింది. ఇది ఎంతో ఆనందంగా ఉందని అర్జునమూర్తి వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీ ఏర్పాటు కసరత్తుల్లో భాగంగా అర్జునమూర్తికి కనీ్వనర్ పదవిని రజనీకాంత్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో రాజకీయ పార్టీ ప్రకటనను రజనీ విరమించుకున్నారు. దీంతో అర్జునమూర్తి సొంత పార్టీని ప్రకటించుకున్నారు. ఇందుకు రజనీ సైతం ఆశీస్సులు అందించే రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో అర్జునమూర్తి ఏర్పాటు చేసిన ఇండియా మక్కల్ మున్నేట్ర కళగంకు ఎన్నికల కమిషన్ ఎన్నికల చిహ్నంగా రోబోను కేటాయించింది. రజనీకాంత్ నటించిన చిత్రం ‘రోబో’ ఇప్పటికే ప్రచారంలో ఉన్న దృష్ట్యా, తన పార్టీ చిహ్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం సులభతరం అని అర్జునమూర్తి ధీమా వ్యక్తం చేశారు. -
వారెంట్ జారీ అయ్యిందని తెలిసి షాకయ్యా: దర్శకుడు శంకర్
సాక్షి, చెన్నై: చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని తెలిసి షాక్‌కు గురయ్యానని దర్శకుడు శంకర్ పేర్కొన్నాడు. అయితే తన లాయర్ సాయి కుమరన్ కోర్టును సంప్రదించగా తనపై ఎలాంటి వారెంట్ లేదని తెలిందని ఆయన తెలిపాడు. ఆన్ లైన్ కోర్ట్ రిపోర్టింగ్‌లో లోపం కారణంగా ఇలా జరిగిందని తెలిసి ఊపిరి పీల్చుకున్నానన్నాడు. ఆన్లైన్లో జరిగిన పొరపాటును ఇప్పుడు సరి చేశారని శంకర్ తెలిపాడు. అయితే ఈ విషయంపై ఎలాంటి అవాస్తవలను ప్రసారం చేయవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశాడు. కాగా, ప్రముఖ రచయిత అరుర్ తమిళ్‌నందన్ రచించిన ‘జిగుబా’ కథను కాపీ కొట్టి ‘రోబో’ చిత్రాన్ని తెరకెక్కించాడని శంకర్‌పై చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలైంది. ఇదే కేసుకు సంబంధించి శంకర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందన్న వార్త ప్రచారంలో ఉన్న నేపథ్యంలో.. తాజాగా ఆయన ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేసి స్పష్టతనిచ్చారు. -
పే...ద్ద రోబో! 60 అడుగుల ఎత్తు
ఉన్నట్టుండి ఆకాశంలో నుంచి ఒక మహా రాచ్చసుడు దిగి వచ్చి భూమి మీద నడుస్తుంటే, చూసే వాళ్లకు ఎంత బెదురుగా ఉంటుంది! ‘గుండం ఫ్యాక్టరీ’ దగ్గర కూడా అలాగే ఉంటుంది. జపాన్ ఇంజనీర్లు 65 అడుగుల ఎత్తు, 25 టన్నుల బరువు ఉన్న మహారోబోను తయారు చేశారు. ఈ ‘గుండం’ రోబోను రేవు పట్టణమైన యెకోహమ లోని చైనా టౌన్లో చూడవచ్చు. ఈ హ్యుమనాయిడ్ రోబో పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడవడమే కాదు రెండు చేతులు చాస్తూ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతుంది. ఈ రోబో ఉన్న స్థలానికి ‘గుండం ఏరియా’ అని నామకరణం చేశారు. ఆశ్చర్యానందాలను సొంతం చేసుకోవడానికి మాత్రమే కాదు... ఇంజనీరింగ్ అద్భుతాన్ని తెలుసుకోవడానికి కూడా ఇక్కడికి రావచ్చు. కొత్త సంవత్సరంలో జపాన్ పర్యాటకరంగానికి మహా రోబో నూతన జవసత్వాలు ఇస్తుంది అంటున్నారు విశ్లేషకులు. -
కోవిడ్ శాంపిల్ కోసం రోబో
సింగపూర్: గొంతులో నుంచి ఉమ్మిని సేకరించే రోబోను సింగపూర్ కు చెందిన మూడు సంస్థల నిపుణులు తయారు చేశారు. ఈ రోబో ముక్కులో నుంచి గొంతులోపల 10 సెంటీమీటర్ల లోతు నుంచి శాంపిల్‌ను సేకరిస్తుంది. వివిధ రకాల ముక్కు పరిమాణాలు ఉన్న వారికీ అసౌకర్యం కలగకుండా శాంపిల్‌ను తీసుకుందని పరిశోధనలో పాల్గొన్న వైద్యులు తెలిపారు. ఈ రోబో వల్ల శాంపిళ్లను సేకరించే వారికి వ్యాధి ముప్పు తప్పుతుందని పేర్కొన్నారు. -
రైల్–బోట్.. ఇది రైల్వే రోబో
సాక్షి, హైదరాబాద్: రైల్వే ఆసుపత్రిలో రోబో ఆకట్టుకుంటోంది. సొంతంగా రైల్వే అధికారి ఆధ్వర్యంలో సిబ్బంది సహకారంతో రూపొందించిన ఈ రోబో, కోవిడ్ బాధితులకు వైద్య సేవలు చేసే సమయంలో వైద్యులు, సిబ్బంది వారి దగ్గరకు వెళ్లాల్సిన అవసరాన్ని బాగా తగ్గించనుంది. దీనికి రైల్–బోట్ అనే పేరు పెట్టారు. అదనపు డివిజినల్ రైల్వే మేనేజర్ (హైదరాబాద్) హేమ్‌సింగ్ బనోత్‌కు రోబోటిక్ శాస్త్రంలో అవగాహన ఉంది. దీంతో ఆయన తన సిబ్బంది సహకారంతో ఈ రోబోను రూపొందించారు. రోగులకు మందులు, ఆహారం అందించటం, వారి శరీర ఉష్ణోగ్రత చూడటం, వారి వద్దకు వైద్య పరికరాలు, ఇతర వస్తువులు తీసుకెళ్లటం.. తదితరాల్లో దీని ఉపయోగం ఉండనుంది. పాన్ అండ్ టిల్ట్ ఫంక్షన్స్, రియల్ టైం వీడియో అనుసంధానం ఉండటంతో, వైద్యులు, రోగులు దూరంగా ఉండే దీని ద్వారా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఆ వివరాలు రికార్డు కూడా అవుతాయి. వారి శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నట్టు నమోదైతే అలారం మోగించి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ఇది 80 కిలోల బరువును మోసుకెళ్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్, రేడియో ఫ్రీక్వెన్సీ రిమోట్ కంట్రోలర్‌తో దీన్ని ఆపరేట్ చేస్తారు. ప్రయోగాత్మకంగా లాలాగూడలోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ఆసుపత్రిలో దీనిని వినియోగిస్తున్నారు. రోబో పనితీరును దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పరిశీలించి, రూపొందించిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
కరోనాపై పోరాటానికి సూపర్ రోబో
సాక్షి, హైదరాబాద్: కరోనాపై యుద్దం చేస్తోన్న డాక్టర్లు, హెల్త్ వర్కర్స్‌కి సాయం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే ఒక రోబోను అభివృద్ధి చేసింది. దీనిని రైల్‌బోట్ లేదా ఆర్-బోట్‌గా పిలుస్తున్నారు. ఇది వైద్యులకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందించడంలో సాయం చేస్తోంది. కేవలం డాక్టర్లకు మాత్రమే కాకుండా కరోనా పేషెంట్లకు ఆహారాన్ని కూడా అందిస్తుంది. ఈ రోబోను వైఫై, మొబైల్ యాప్ ద్వారా ఆపరేట్ చెయ్యొచ్చు. యాప్ ఓపెన్ చేసి ఏం చేయాలో సూచనలు ఇస్తే చాలు ఈ రోబో వాటికి తగ్గట్టుగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఈ రోజు కేవలం కావలసిన వస్తువులు, పరికరాలు, ఆహారం, నీళ్లు అందించడమే కాదు ఎవరైనా దాని ముందు చేయి పెడితే శరీర ఉష్ణోగ్రత ఎంత ఉందో కూడా చూస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే రోబోకు ప్రత్యేకంగా ఉండే ఎర్రలైట్ వెలుగుతుంది. అప్పుడు అందరూ అప్రమత్తమై ఆ వ్యక్తిని ఐసోలేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోబోకి పైన రియల్‌టైమ్ కెమెరా కూడా ఉంటుంది. ఈ కెమెరా సాయంలో అది కిందకి, పైకీ, చుట్టుపక్కలకు తిరిగి అక్కడ ఉన్నవన్ని రికార్డు కూడా చేయగలదు. దీని సాయంతో రోబో ఎక్కడికి వెళుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఈ రోబోకు ఉన్న మరికొన్ని ప్రత్యేకతలు: ఇందులో నైట్ ల్యాంప్, నైట్ విజన్ కెమెరాలు కూడా ఫిక్స్ చేశారు. దీని కారణంగా ఇది కరెంటు లేని ప్రదేశాల్లో కూడా సేవలను అందిచగలదు. ఇది గంటకు 1కిలోమీటర్ వరకు వెళ్లగలదు. దీంతో చాలా త్వరగా సేవలు అందించగలదు. 80 కేజీల కంటే ఎక్కువ బరువును మోయగలదు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 7 గంటల పాటు నిరవధికంగా పనిచేస్తూ ఉండగలదు. ఇది వ్యక్తులతో కూడా మాట్లాడుతుంది. వాళ్ల మాటల్ని, తన మాటల్ని కూడా రికార్డు చేస్తోంది. దీనికున్న కెమెరాల సాయంతో రోబో ఎక్కడి వెళుతుందో తెలుసుకోవచ్చు. మనం పంపాలనుకున్న చోటుకు రోబోను పంపొచ్చు. SCR developed a RAIL BOT- #Hospital Assistant. Which can assist the hospital management in wards to provide medicines,medical accessories & serving food to the patients. It can measure body temperature. The robot can be operated by #mobileapp @RailMinIndia @drmhyb pic.twitter.com/OwsYrmsCra — SouthCentralRailway (@SCRailwayIndia) May 16, 2020 -
సామాజిక దూరం కోసం రోబో డాగ్
సింగపూర్ : ప్రపంచ దేశాల ప్రజలను గడగడలాడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకోవాలంటే సామాజిక దూరం పాటించడం ఒక్కటే శ్రేయస్కర మార్గమని ప్రపంచ దేశాలు ఘోషిస్తున్నప్పటికీ, లాక్డౌన్లు అమలు చేస్తున్నప్పటికీ పట్టించుకోని వారు కొందరుంటారు. ఆ కొందరి కోసం ‘బోస్టన్ డైనమిక్స్’ సంస్థ ఓ రోబోటిక్ డాగ్‌ను సృష్టించింది. సామాజిక దూరం పాటించని వారికి ‘స్పాట్’ పెట్టాలనే ఉద్దేశంతోనేమో దానికి ‘స్పాట్’ అని పేరు పెట్టారు. ఆ రోబో ప్రస్తుతం సింగపూర్‌లోని ‘బిషన్ ఆంగ్మో కియో’ పార్క్‌లో ప్రయోగాత్మకంగా తన విధులను నిర్వర్తిస్తోంది. ఎక్కడయితే మనుషులు గుమికూడారో గుర్తించి అక్కడికి ‘దూరం దూరం’ అంటూ హెచ్చరికలు చేస్తూ దూసుకుపోతుంది. తల బాగాన అమర్చిన కెమెరాల ద్వారా మనుషులు గుమికూడిన చోటును ఆ రోబో గుర్తిస్తుంది. దూరం పాటించాలంటూ ముందుగా రికార్డు చేసిన వాయిస్‌ను వినిపిస్తోంది. ( కరోనా: 116 ఏళ్ల వృధ్దుడి కోరిక ఏంటంటే...) ప్రయోగాత్మకంగా రోబో సేవలను ప్రవేశపెట్టామని, మున్ముందు దీన్ని మరింత అభివృద్ధి చేస్తామని ‘గవర్నమెంట్ టెక్పాలజీ ఏజెన్సీ’ మీడియాకు తెలియజేసింది. ఈ రోబోకు అమర్చిన కెమేరాలు వ్యక్తిగతం ఎవరి చిత్రాలనుగానీ, మాటలును గానీ రికార్డు చేయదని, పౌరుల వ్యక్తిగత గోప్యతకు పూర్తి భద్రత ఉంటుందని ఏజెన్సీ అధికారులు తెలిపారు. రోబో దగ్గరికి వస్తుంటే దూరం జరగాల్సిన సందర్శకులు ఏకంగా దూరం పారి పోతున్నారని పార్కు నిర్వాహకులు తెలిపారు. -
రోబో: హీరోయిన్ ఐశ్వర్య.. మరి హీరో ఎవరు?
సాక్షి, చెన్నై: సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ సృష్టించిన అద్భుత సృష్టి ‘రోబో’ . రజనీ సరసన అందాల తార ఐశ్వర్యరాయ్ నటించారు. విజువల్ వండర్‌గా నిలిచిన చిత్రం మరెన్నో చిత్రాలకు ప్రేరణగా నిలిచింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలై పదేళ్లు కావస్తోంది. మలేషియాలో జరిగిన ‘రోబో’ ఆడియో ఫంక్షన్లో రజనీకాంత్ స్పీచ్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయింది. అయితే లాక్డౌన్ కారణంగా అనేక పాత, కొత్త విషయాలను తెలుసుకుంటున్న నెటిజన్లకు రజనీకి సంబంధించిన ఈ పాత వీడియో కంటపడింది. దీంతో పూర్తి వినోదత్మకంగా ఉన్న ఆ వీడియోను తెగ లైక్ చేస్తుండటంతో మరోసారి వైరల్ అవుతోంది. ఆ విశేషాలు మీకోసం.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే? ‘నేను ఒక రోజు బెంగళూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాను. ఆ ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న నందూలాల్ అనే ఓ 60 ఏళ్ల వ్యక్తి నన్ను చూసేందుకు వచ్చాడు. అప్పుడు ఈ విధంగా మా మధ్య సంభాషణ జరిగింది. నందులాల్: ఏంటయ్యా రజనీ, మీ జుట్టుకు ఏమైంది. రజనీ: రాలిపోయింది సర్. అయినా ఇప్పుడు దీని గురించి ఎందుక లేండి? నందులాల్: మీరు రిటైర్ అయ్యాక ఏం చేస్తున్నారు? రజనీ: నేను రిటైర్ కాలేదు. సినిమాల్లో నటిస్తున్నాను నందులాల్: అవునా? ఏ సినిమా రజనీ: రోబో, ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా నటిస్తున్నారు నందులాల్: ఐశ్వర్యరాయ్‌ది ఏం అందం అండి, ఇంతకీ ఆ చిత్రంలో హీరో ఎవరు? రజనీ: హీరో నేనే (చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే) నందులాల్: ఓ పది నిమిషాలు తదేకంగా నన్ను చూసి, మీరు హీరోనా? వెంటనే ఆయన కుమారులు వచ్చి నాన్న రజనీకాంత్ ఇప్పటికే హీరో పాత్రలలోనే నటిస్తున్నారు అని చెప్పారు. అయితే నందులాల్ వాళ్ల ఇంటికి వెళ్లాక ఆయన కుమారులతో ఇలా అన్నారంట. అరేయ్ ఐశ్వర్యరాయ్ కి అసలు ఏమైంది? అభిషేక్ బచ్చన్ ఎక్కడికి వెళ్లి పోయాడు? అమితాబచ్చన్ ఏం చేస్తున్నాడు? బట్టతల ఉన్న రజినీకాంత్ కి ఐశ్వర్య రాయ్ తో నటించే అవకాశం ఎలా వచ్చింది? అంటూ ప్రశ్నించారట. ఈ సందర్భంగా ఐశ్వర్యకు ఒక్కటి చెప్పదల్చుకున్నాను. నా పక్కన హీరోయిన్గా నటించేందుకు ఒప్పుకున్న ఐశ్వర్యకు కృతజ్ఞతలు’ అంటూ రజనీ పేర్కొనడంతో ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన వారందరూ పగలబడి నవ్వుకున్నారు. చదవండి: కరోనాపై పోరులో చిరంజీవి తల్లి డీడీ నంబర్ వన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_911254541.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీటీలో మరమనిషితో మన మనిషి పోరు...
చెన్నై: అప్పట్లో మనం వెండితెరపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్... తనను పోలిన రోబోతో ఇంచుమించు యుద్ధమే చేస్తాడు. ఇదంతా సినిమా‘ట్రిక్’. కానీ నిజజీవితంలో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆటగాడు సత్యన్ జ్ఞానశేఖరన్... రోబోతో తన ఆట ప్రాక్టీస్ చేస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో ప్రపంచంతో పాటు భారత్ కూడా లాక్డౌన్లో ఉంది. అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో సత్యన్ తన భాగస్వామిగా మరో మనిషిని కాకుండా మరమనిషిని ఎంచుకున్నాడు. రోబోతోనే తన ప్రాక్టీస్ చురుగ్గా సాగుతోందని చెప్పాడు. ఈ రోబోను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఇది నిమిషానికి 120 బంతుల్ని నెట్‌పై ఆడగలదు. అన్నట్లు బంతుల స్పిన్, వేగ నియంత్రణను చేసుకునే సౌకర్యం ఇందులో ఉంది. ఈ మరమనిషితోనే రోజు గంటన్నర సేపు ప్రాక్టీస్ చేస్తున్నట్లు 27 ఏళ్ల సత్యన్ తెలిపాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) మొత్తం ఈవెంట్లను జూన్ 30 దాకా రద్దు చేసింది. -
రోబోలతో వైరస్ పని పట్టు
న్యూఢిల్లీ: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రులలో రోబోలను ఉపయోగించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మనుషులు వెళ్లలేని, వెళ్లకూడని చోట్లకు రోబోలను పంపి విధులు నిర్వర్తించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కరోనా సోకిన వారికి మందులు అందించడంతో పాటుగా, ఆస్పత్రులను శుభ్రం చేసేందుకు రోబోలు ఉపయోగపడుతున్నాయి. గతేడాది చివర్లో చైనాలోని వూహాన్లో వైరస్ వెలుగు చూసినపుడు అక్కడి ఆస్పత్రులలో రోబోలనే వాడారు. రోగుల శరీర ఉష్ణోగ్రతను కొలిచేందుకు, మందులు అందించేందుకు, రోగి ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసేందుకు అవి సహాయపడ్డాయి. రోగి ముక్కు, గొంతు నుంచి టెస్ట్ శాంపిళ్లను సేకరించడానికి రోబోలు ఉపయోగపడతాయని అమెరికాకు చెందిన కార్నిగే మెలాన్ యూనివర్సిటీ నిపుణులు తేల్చారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ ఆస్పత్రిలో అతినీలలోహితక కాంతితో చేసే క్లీనింగ్ పనిని రోబో కేవలం 10నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోబోలు కీలక పాత్ర పోషించగలవని పంజాబ్ లవ్లీ యూనివర్సిటీకి చెందిన డీన్ లోవి రాజ్ గుప్తా తెలిపారు. ‘రోబోలు అన్ని స్థాయిల్లోనూ మానవ ప్రమేయాన్ని తగ్గిస్తాయి. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ఈ కాలంలో అవి మరింత ఉపయోగపడగలవు. రోగులకు కావాల్సిన వాటిని అందించగలవు’ అని పేర్కొన్నారు. కరోనా రోగుల కోసం వైద్యులు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని, వారికి కరోనా సోకకుండా రోబోలను వినియోగించుకోవచ్చని అదే యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ అనిత గెహ్లోత్ అన్నారు. మన దేశంలో.. రోగులకు దూరంగా ఉంటూ చికిత్స అందించడంలో రోబోలు భారత వైద్యులకు ఉపకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వైద్యులకు చికిత్సతో పాటుగా ఆహారం, మందులు అందించేందుకు హ్యూమనాయిడ్ రోబోలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. దీనివల్ల వైద్యులకు, వైద్య సిబ్బందికి వైరస్ సోకే ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కేరళకు చెందిన స్టార్టప్ కంపెనీ నిపుణులు ఐసోలేషన్‌లోని రోగులకు వైద్యం అందించేందుకు రోబోను తయారు చేశారు. అది రోగి గదిలోకి మందులు, ఆహారాన్ని తీసుకెళ్లగలదు. -
పైకి ఒక్కరే.. లోపల ఆరుగురు!
అలెక్సా! ఎవరావిడ?! వర్చువల్ అసిస్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ. ఒక్క ముక్క తెలుగు లేదు. అలెక్సాకు ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం ఎనిమిది భాషలు వచ్చు. తెలుగు రాదు. ‘రాదు’ అంటే.. అలెక్సా మనిషా, రావడానికి?! మనిషి లాంటి మనిషి. త్వరలో తెలుగులో కూడా అర్థంచేసుకోబోతున్న మనిషి! మర మనిషి అనుకోండి. కానీ మనిషిలా ఉండదు. మరలా ఉంటుంది. సిలెండర్ ఆకారంలో ఉండే స్పీకర్... అలెక్సా బాహ్యరూపం. అలెక్సా అంతః స్వరూపానికి మాత్రం ఆరు రూపాలు ఉన్నాయి. అన్నీ స్త్రీ రూపాలు. వాటిలో ఐదు జ్ఞానేంద్రియాలు. (ఇందు, టీనా, దీపిక, స్నేహాల్, ప్రాచి) ఆరో రూపం.. స్మృతేంద్రియం (రమ్య). వీళ్లు నడిపిస్తుంటారు అలెక్సాను. అలెక్సా ఎకో స్పీకర్‌ను తెచ్చుకుని, పవర్ సప్లయ్ ఇచ్చి, అమెజాన్ అలెక్సా యాప్‌ని మన స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని, ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే చాలు.. అలెక్సా మన ఆదేశాలను ఫాలో అయిపోతుంది. మనకేం కావాలంటే అది చేసి పెడుతుంది. ‘అలెక్సా.. ఆ లైట్ ఆపేయ్’. ఆపేస్తుంది. ‘అలెక్సా.. నిద్ర రావడం లేదు. నిద్రొచ్చే పాటలు వినిపించు’. వినిపిస్తుంది. ‘అలెక్సా నా జర్నీకి టికెట్స్ బుక్ చెయ్’. చేస్తుంది. ‘అలెక్సా ఆన్లైన్లో ఫలానా ఫలానవి షాపింగ్ చెయ్యి’. చేసి పెడుతుంది. ఒక్కమాటలో.. ‘తెలివైన సహాయకురాలు’ అనుకోండి. తెలుగులో అలెక్సాకు సరిగ్గా సరిపోయే మాట కూడా ఇదే! అలెక్సాకు అంత తెలివి, అంత చురుకుదనం, అంత నైపుణ్యం ఈ ఆరుగురు అమ్మాయిల వల్లే వచ్చింది. వీళ్ల గురించి.. క్తుప్లంగా.. సంక్షిప్తంగా. అలెక్సా ఆలోచన ఇందు ప్రసాద్ అలెక్సా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్. 2017లో అలెక్సాలో చేరారు. చిన్న వయసులోనే జర్నలిజంలోకి వచ్చి.. దాదాపు ఇరవై ఏళ్లపాటు స్టార్, జీ వంటి బ్రాండెడ్ టీవీ చానల్స్‌లో పని చేశారు. అలెక్సా ఏవైతే పనులు చేయగలుతోందో అవన్నీ కూడా ఇందు టీమ్ చేయిస్తున్నవే. అలెక్సా తీర్చే సందేహాలు, అలెక్సా ఇచ్చే సలహాలు, అలెక్సా చూపే పరిష్కారాలు, కొన్నిసార్లు అలెక్సా చూపించే ప్రేమ.. అన్నీ కూడా ఇందూ టీమ్వే. అలెక్సా స్పందన దీపికా బాలకృష్ణన్ ‘అలెక్సా ఎక్స్పీరియన్స్ అండ్ ఎంగేజ్మెంట్’ విభాగంలో సీనియర్ మేనేజర్. అలెక్సాను ఉపయోగించే కస్టమర్లకు మంచి అనుభవాలను ఇవ్వడం, తరచు అలెక్సాన వినియోగించేలా చేయడం ఆమె డ్యూటీ. కస్టమర్ల అవసరాలకు అలెక్సా ఎలా స్పందిస్తున్నదీ దీపిక బృందం నిశితంగా పర్యవేక్షిస్లూ అలెక్సాను నియంత్రిస్తుంటుంది. అలెక్సాతో కస్టమర్ల అనుభూతిని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. అలెక్సాలో చేరకముందు అమెజాన్ ప్రైమ్ ఇండియా మార్కెటింగ్‌లో ఉద్యోగి. అతి కష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుండే వారితో కలిసి పని చేస్తుండడం వల్ల నేర్చుకోడానికి ఎంతో ఉంటుందని దీపిక అంటారు. అలెక్సా స్వరగమన టీనా సదానా అలెక్సా స్వరసేవల బృంద నాయిక. ఆరంభం నుంచీ అలెక్సాలో ఉన్నారు. కొనుగోళ్లు, అమ్మకాల విభాగాన్ని చూస్తారు. ‘‘ఇదొక అంతులేని మహా సాగరం. ఇందులో ఈత కొట్టడం బాగుంటుంది. వినియోగదారులు, ఉత్పత్తిదారుల మధ్య అనుసంధానం అటుంచి, వాళ్లమ మధ్య అలెక్సా సంభాషణ ఆసక్తిగా ఉపయుక్తంగా ఉంటుంది’’ అంటారామె. ఎలక్ట్రానిక్స్, టెలికాంలలో ఇంజనీరింగ్ చేశారు టీనా. అలెక్సాకు ముందు ఎయిర్‌టెల్‌లో ఉన్నారు. అలెక్సా అవగాహన స్నేహల్ మేష్రమ్ యు.ఎస్.లో అలెక్సా ఆరంభం అవడానికి ఏడాది ముందే అలెక్సాలో చేరారు. అంతకుముందు మైక్రోసాఫ్ట్ ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్సాన్స్)లో స్పీచ్ అనలిస్ట్‌గా, స్కైప్‌లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా చేశారు. అలెక్సాలో ప్రస్తుతం నేచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ (ఎన్.ఎల్.యు.) టీమ్‌లో పని చేస్తున్నారు. ఇండియన్ ఇంగ్లిష్‌లో, హిందీలో కస్టమర్లను అర్థం చేసుకోడానికి అలెక్సాకు స్నేహల్ టీమ్ ఎప్పటికప్పుడు అవగాహన శక్తిని నింపుతుంటుంది. అలెక్సాకు హిందీని అలవాటు చేయడం స్నేహల్‌కు పెద్ద ఛాలెంజింగ్ జాబ్ అయింది. అలెక్సా చేతన రమ్యా పూసర్ల తెలుగమ్మాయి. విశాఖ దగ్గర చిన్న పట్టణం. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో చదివారు. చదువు పూర్తవగానే నేరుగా అమెజాన్‌లో చేరారు. కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్. సాఫ్ట్వేర్ డెవలపర్‌గా చేశారు. అలెక్సాకు శిక్షణ ఇచ్చారు! ఏదైనా ఉద్యోగానికి వెళ్లినప్పుడు అనుభవం ఉందా అని అడుగుతారు కదా.. అలా అలెక్సాకు రమ్య ‘ఎక్స్‌పీరియెన్స్’ శిక్షణ ఇచ్చారు. పెద్ద పనే. ఇప్పుడు కూడా ఆమె, ఆమె టీమ్ చేస్తున్నది అదే. కస్టమర్ తీరుకు అనుగుణంగా అలెక్సా ప్రతి స్పందనల్ని వృద్ధి చెయ్యడం అలెక్సా మన్నన ప్రాచీ ముఖియా అలెక్సా స్కిల్స్‌కి, అలెక్సా వాయిస్ సర్వీసులకు మార్కెటింగ్ చేస్తుంటారు. ఆమె పని ప్రధానంగా ఇండియన్ డెవలపర్లు, ఇండియన్ బ్రాండ్లు, ఇండియన్ ఏజెన్సీలతో ఉంటుంది. అన్ని పర్యావరణ వ్యవస్థలకు అనుగుణంగా వాయిస్–టెక్ని అభివృద్ధి చేస్తుంటుంది ప్రాచీ టీమ్. కస్టమర్లకు అలెక్సాకు మధ్య దృఢమైన స్వరబంధాన్ని ఏర్పరచడం కూడా ఆమె పనే. -
రోబో 4.O
సాక్షి, హైదరాబాద్: తుంటి, మోకాలు వంటి కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో గుర్తింపు పొందిన సన్‌షైన్ ఆస్పత్రి యాజమాన్యం తాజాగా మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో దేశంలోనే తొలిసారిగా రూ.12 కోట్ల విలువ చేసే ఆధునిక ‘నాలుగో తరం’ రోబోను ప్రవేశపెట్టింది. శనివారం సైబర్ కన్వెన్షన్ సెంటర్లో మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీవీ సింధు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సన్‌షైన్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ గురువారెడ్డిలు రోబోను ఆవిష్కరించారు. మోకాలి చిప్ప, తుంటి ఎముక అరుగుదల భాగాన్ని కచ్చితంగా గుర్తించి, ఆ మేరకు కంప్యూటర్ నావిగేషన్ సాయంతో సరైన ప్రమాణం నిర్ధారించుకుని, శస్త్రచికిత్స సమయంలో ఒక్క అంగుళం కూడా తేడా రాకుండా ఇంప్లాంట్‌ను విజయవంతంగా అమర్చే ప్రక్రియలో ఈ రోబో సాయపడుతుందని, దీంతో రోగికి తక్కువ రక్తస్రావం, నొప్పితోపాటు ఎలాంటి ఇన్ఫెక్షన్ల బెడద లేకుండా త్వరగా కోలుకునేందుకు సహకరిస్తుందని గురువారెడ్డి తెలి పారు. కార్యక్రమంలో డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డి, డాక్టర్ కుషాల్ హిప్పల్‌గావన్‌కర్, డాక్టర్ సుహాన్‌తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ‘శాస్త్ర విజ్ఞాన ఫలాలను కింది స్థాయి ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఖరీదైన చికిత్సలను తక్కువ ధరలకే అందిస్తూ గురవారెడ్డి ఎంతోమంది వైద్యులు నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. ఏ వ్యక్తి రాణించాలన్నా కష్టపడకుండా, ఇష్టపడకుండా సాధ్యం కాదు, గురవారెడ్డి 30 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. వేలాది మందికి విశ్వాసాన్ని కల్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారు’ అని అన్నారు. -
మిస్ సైబీరా.. ఓ ఫిర్యాదుల స్వీకర్త
అల్లిపురం(విశాఖ దక్షిణం): బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించే రోబోను ప్రయోగాత్మకంగా మహారాణిపేట పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా దీనిని ప్రారంభించారు. నగరానికి చెందిన రోబో కప్లర్ సంస్థ మిస్ సైబీరా రోబోటిక్‌ను తయారు చేసింది. సంస్థ సీఈవో మళ్ల ప్రవీణ్ రోబో పనితీరును కమిషనర్‌కు వివరించారు. దేశంలో మొదటి సారిగా విశాఖ పోలీసులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ రోబోను ప్రారంభించిన వెంటనే రోబో సెల్యూట్ చేసింది. మరింత అభివృద్ధి చేస్తే బాగుంటుంది.. రోబోను మరింత అభివృద్ధి చేస్తే మంచి సేవలను పొందవచ్చని సీపీ ఆర్.కె.మీనా అభిప్రాయపడ్డారు. నగరంలో జేబుదొంగలు, రౌడీ షీటర్లు, దోపిడీదారుల ఫొటోలను సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్ చేసి, వారి కదలికలను సంబంధిత అధికారులకు చేరవేసేలా ఉంటే ప్రయోజనం ఉంటుందని ఆయన సంస్థ ప్రతినిధులకు తెలిపారు. ఆమేరకు సాప్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. ఎక్కువగా ఫిర్యాదులు వచ్చే కంచరపాలెం, పీఎంపాలెం, ఫోర్తు టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీటిని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలన్నారు. రూ.8.7 లక్షలు ఖర్చు అయ్యింది.. మిస్.సైబీరా రోబోటిక్ తయారీకి రూ.8.7లక్షలు ఖర్చు అయ్యింది. ఎక్కువ మొత్తంలో తయారు చేస్తే రూ.4 నుంచి రూ.5లక్షలకు తయారవుతుంది. ఇప్పటికే ఇందులో 129 అప్లికేషన్లు లోడ్ చేశాం. ఇంకా 20 వరకు అప్లికేషన్లు అప్లోడ్ చేయాల్సి ఉంది. సైబీరా పనితీరును పరిశీలించిన తరువాత దీంట్లో లోపాలను సరిచేసి పూర్తి స్థాయిలో రూపొందించి అందుబాటులోకి తీసుకుస్తాం. –మల్ల పవన్, సీఈఓ, రోబో కప్లర్ ప్రైవేట్ లిమిటెడ్ -
యంత్రుడు 2.0
ఒంగోలు: రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేయగానే సర్వెంట్లు వినమ్రంగా తీసుకురావడం ఇప్పటివరకు చూసుంటారు. ఇది రోటీన్..! ట్రెండ్ ఫాలో అయితే ఏముంటుంది.. ట్రెండ్ సెట్ చేస్తేనే కదా అసలు మజా అని భావించారు ఒంగోలు నగరంలోని జీబు రెస్టారెంట్ నిర్వాహకులు. ఒంగోలు నగరవాసులకు సరికొత్త అనుభూతిని కలగజేసేలా రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. ఒంగోలులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న జీబు రెస్టారెంట్ విశేషాలు ఒంగోలు నగరంలో సర్వెంట్ రోబో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భోజన ప్రియులంతా ఆ రోబో గురించే చర్చించుకుంటున్నారు. స్థానిక ట్రంకు రోడ్డులోని పాత ఎల్ఐసీ భవనం మొదటి, రెండో అంతస్తుల్లో ఇటీవల జీబు రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. జీబు అనగానే ‘ఇదేం పేరు’ అనుకోవడం పరిపాటి. అయితే దీనికో చరిత్ర ఉంది. జీబు అనేది బ్రెజిల్ పదం. బ్రెజిల్ పరిభాషలో జీబు అంటే ఒంగోలు గిత్త అని అర్థం. అందుకే జీబు లోగోలో ఒంగోలు గిత్త కనిపించేలా రూపొందించారు. ఫ్లయిట్ థీమ్ విమానంలో కూర్చుని భోజనం చేస్తున్న ఫీలింగ్ కలిగేలా రెస్టారెంట్ మొదటి అంతస్తులో ఫ్లయిట్ థీమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్వెంట్లు ఎయిర్ హోస్టెస్‌ల మాదిరిగా కస్టమర్లను చిరునవ్వుతో పలకరిస్తూ ఆర్డర్ తీసుకుంటున్నారు. వంట గది నుంచి టేబుల్ వరకు నేరుగా రోబోనే ఫుడ్ తీసుకువస్తుంది. రెస్టారెంట్లో ఇలాంటి రోబోలు మూడు ఉన్నాయి. రోబోలను జపాన్‌లో కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా ఫారెస్ట్ సెట్టింగ్ హోటల్ రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ సెట్టింగ్ చూపరులను ఆకట్టుకుంటోంది. వెదురు బొంగులతో ఏర్పాటు చేసిన కుటీరంలో లాంతర్ల వెలుగులో దట్టమైన అడవిలో భోజనానికి కూర్చున్న ఫీలింగ్ కలిగేలా డైనింగ్ హాల్‌ను తీర్చిదిద్దారు. దేశంలో కోయంబత్తూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో రోబోలతో ఫుడ్ సర్వ్ చేసే హోటళ్లున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఒంగోలు నగరంలో తాము ఏర్పాటు చేశామని రెస్టారెంట్ నిర్వాహకుడు ఆరిగ సాయి తెలిపారు. -
ఏ విధంగా సాయపడగలను!
అది జపాన్‌లోని టోక్యోలో ఉన్నఓ సబ్వే రైల్వే స్టేషన్.. మీరు ఆ స్టేషన్‌కు వెళ్లారనుకోండి.. మీకేమో జపనీస్ భాష తెలియదు. అక్కడున్న వారు చెబుతారో లేదో అయోమయం..! మరెలా..? ఏమీ లేదు ఆ స్టేషన్లో అక్కడక్కడా ప్రయాణికులకు సాయం చేసేందుకు ‘కొందరు’నిల్చుని ఉంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా.. ఏ రైలు ఎక్కాలన్నా.. వారు చిటికెలో సమాధానం చెప్పి మీకు ఊరట కల్పిస్తారు. ఇంతకీ వారెవరు ఆ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసుకున్న సిబ్బందేమో అనుకుంటున్నారా.. మీరు అనుకున్నది కొంత వరకు నిజమే కానీ వారు మనుషులు కాదు. రోబోలు! అవును మీకు సాయపడేందుకు రోబోలను టోక్యో ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. ఎందుకంటారా..? ఎందుకంటే జపాన్‌లో 2020లో ఒలింపిక్స్ గేమ్స్ జరగనున్నాయి కదా.. అక్కడికి దేశవిదేశాల నుంచి వచ్చే ఆటగాళ్లు, పర్యాటకుల కోసం వీటిని ఏర్పాటు చేసింది. ‘ఆరిసా’అనే ఈ ప్రాజెక్టును టోక్యో మెట్రో పాలిటన్ ప్రభుత్వం చేపట్టింది. రైలుకు సంబంధించి.. ఏ సాయం కోరినా కూడా ఎంతో మర్యాదగా, ఓపికగా సమాధానం చెప్పి మీ ప్రయాణం సాఫీగా సాగిపోయేలా చేస్తాయి ఈ రోబోలు. మీరు సెల్ఫీ అడిగినా కూడా సిగ్గు పడకుండా మీతో ఫొటోలు దిగుతాయి కూడా..! -
2020లో 5జీ టెక్నాలజీ తెస్తాం: కేంద్రం
జలంధర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: 2020 నాటికి దేశంలో 5జీ మొబైల్ టెక్నాలజీని తీసుకొస్తామని ఐటీ మంత్రి రవిశంకర్ తెలిపారు. దేశంలోని గ్రామ పంచాయతీలను ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌తో అనుసంధానించే ప్రాజెక్టు ఈ ఏడాదిలో పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలు అందించే సిటిజన్ సర్వీస్ సెంటర్ల ద్వారా దేశవ్యాప్తంగా 12 లక్షల మందికి ఉపాధిని అందిస్తున్నామని పేర్కొన్నారు. 55 అడుగుల రోబో: సైన్స్ కాంగ్రెస్‌లో శనివారం కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆవిష్కరించిన భారీ రోబో ప్రతిమ ఇది. 55 అడుగుల ఎత్తున్న ఈ రోబో పేరు మెటల్ మాగ్నా. 25 టన్నుల బరువున్న దీన్ని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థులు రెండు నెలలు శ్రమించి తయారు చేశారు. -
ఫస్ట్‌లుక్ 20th August 2018
-
శస్త్రచికిత్సలు చేసే రోబో స్పైడర్లు
బోస్టన్: అనుభవజ్ఞులైన వైద్యులు సైతం చేయలేని కొన్ని శస్త్రచికిత్సలను త్వరలో రోబో స్పైడర్లు చేయనున్నాయి. మృదువుగా, సౌకర్యంగా నాణెం పరిమాణంలో ఉండే ఈ రోబో సాలెపురుగు శరీరంలోని ఏ భాగానికైనా వెళ్లి శస్త్రచికిత్సను నిర్వహించనుంది. వైద్యులకు సహాయకారిగా ఉంటూ.. వారు చెప్పిన పనులను పూర్తి చేయనుంది. దీనిని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ వర్సిటీకి చెందిన పరిశోధకులు తయారుచేశారు. మిల్లీమీటర్ సైజులో ఉండే ఆస్ట్రేలియాలోని పీకాక్ స్పైడర్‌ను ఆదర్శంగా తీసుకుని దీన్ని అభివృద్ధిచేశారు. 3 రకాల టెక్నాలజీల సాయం తీసుకొని మరో సరికొత్త టెక్నాలజీతో దీన్ని తయారుచేశారు. దీని తయారీలో సిలికాన్ రబ్బర్‌ను మాత్రమే వాడినట్లు పోస్ట్డాక్టరోల్ ఫెలో రుస్సో తెలిపారు. -
నానో రోబోలతో రక్తశుద్ది...
నానో స్థాయి రోబోలతో రక్తంలో పేరుకుపోయిన విషపదార్థాలను తొలగించేందుకు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (శాండియాగో) శాస్త్రవేత్తలు ఒక కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. అల్ట్రాసౌండ్ ధ్వనులతో నియంత్రించగల ఈ నానోరోబోలు అతిసూక్ష్మమైన బంగారు తీగలతో చేస్తారు. రక్తంలోని ప్లేట్లెట్లు, రక్తకణాల త్వచాలకు వీటిని జోడించినప్పుడు అవి విషపదార్థాలను నిర్వీర్యం చేసేస్తాయి. అంతేకాకుండా ఈ నానోరోబోలతో ఎంఆర్ఎస్ఏ వంటి బ్యాక్టీరియాలను కూడా నాశనం చేయవచ్చునని.. కేవలం అల్ట్రాసౌండ్స్తో నియంత్రించే అవకాశం ఉండటం అదనపు ప్రయోజనమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు జోసెఫ్ వాంగ్, లియాంగ్ఫాంగ్ ఝాంగ్లు తెలిపారు. ఒకే రకమైన నానోబోట్లతో రకరకాల పనులు చేయించే లక్ష్యంతో తాము ఈ ప్రాజెక్టు చేపట్టామని, ప్లేట్లెట్లు బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకుంటే.. ఎర్ర రక్త కణాలు విషపదార్థాలను నాశనం చేస్తాయని వారు వివరించారు. మనిషి వెంట్రుక కంటే దాదాపు 25 రెట్లు తక్కువ వెడల్పు ఉండే ఈ నానో రోబోట్లు రక్తంలో సెకనుకు 35 మైక్రో మీటర్ల దూరం ప్రయాణించగలవని, కేవలం అయిదు నిమిషాల్లో రక్త నమూనాల్లోని బ్యాక్టీరియా మూడు రెట్లు తక్కువైనట్లు తాము ప్రయోగాల ద్వారా గుర్తించామని వివరించారు. ప్రస్తుతం తమ ప్రయోగాలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని... జంతువుల్లో నేరుగా పరీక్షించిన తరువాత రక్తశుద్ధి కోసం నానోబోట్లను మనుషుల్లోనూ వాడే అవకాశం ఉంటుందని చెప్పారు. నిద్ర తక్కువైతే... తిండి యావ పెరుగుతుంది! ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నా ఇది నిజమంటున్నారు శాస్త్రవేత్తలు. రాత్రిళ్లు సకాలంలో నిద్రపోకపోకపోయినా.. సరైన నిద్ర లేకపోయినా అది కాస్తా తిండియావ పెంచేస్తుందని అరిజోనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రిళ్లు చిరుతిళ్లు, జంక్ ఫుడ్‌కు అలవాటు పడటం వల్ల కొంత కాలం తరువాత ఊబయకాం, మధుమేహం వంటి వ్యాధులొచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని తాము అధ్యయన పూర్వకంగా తెలసుకున్నట్లు మైకేల్ ఎ.గ్రాండ్నర్ తెలిపారు. అమెరికా మొత్తమ్మీద కొంతమందిని ఎంపిక చేసుకుని తాము ఫోన్ ద్వారా కొన్ని వివరాలు సేకరించామని చెప్పారు. ఎంత కాలం నిద్రపోతున్నారు? సుఖ నిద్ర పడుతోందా? వేళకాని వేళలో ఆహారం తీసుకుంటూ ఉంటే ఎలాంటి తిండి తింటున్నారు? వంటి వివరాలను పరిశీలించినప్పుడు 60 శాతం మంది రాత్రి తిండికి అలవాటు పడ్డామని చెబితే... మూడింట రెండు వంతుల మంది రాత్రిళ్లు సక్రమంగా నిద్ర పట్టడం లేదని చెప్పారని వివరించారు. నిద్ర తక్కువ కావడం జీవక్రియలపై ప్రభావం చూపుతుందని.. ఫలితంగా జంక్‌ఫుడ్ కావాలన్న కోరిక పెరిగేందుకు అవకాశముందని చెప్పారు. ఆరోగ్యానికి పౌష్టికాహారంతోపాటు సుఖమైన నిద్ర కూడా అవసరమని గుర్తిస్తున్న ఈ తరుణంలో ఈ అధ్యయనం ఎంతైనా అవసరమని.. రాత్రిపూట పనిచేసేవారు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించేందుకూ దోహదపడుతుందని వివరించారు. త్రిఫల చూర్ణంతో ఆయుష్ణు పెరుగుతుందా? ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి ప్రముఖ స్థానముంది. జీర్ణసంబంధిత సమస్యలను తీర్చడంతోపాటు శరీరంలోని మాలిన్యాలను బయటకు పంపేందుకు ఎంతో ఉపయోగపడుతుందని మనకు తెలుసు. అయితే ఈ ఆయుర్వేద మందుకు కొన్ని రకాల బ్యాక్టీరియాను జోడిస్తే ఆయుష్షు కూడా పెరిగే అవకాశముందని అంటున్నారు మెక్‌గిల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. మనిషితో ఎన్నో సారూప్యాలున్న జీవజాతి ఈగలపై తాము ప్రయోగాలు చేశామని, త్రిఫలతోపాటు ల్యాక్టోబాసిల్లస్ ప్లాంటారమ్, లాక్టోబాసిల్లస్ ఫెర్మెంటమ్, బైఫైడోబ్యాక్టీరియా లాంగమ్ అనే మూడు బ్యాక్టీరియాను చేర్చి ఈగలకు అందించినప్పుడు వాటి జీవితకాలం దాదాపు 60 శాతం ఎక్కువైందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అంటున్నారు. ఈగలు సాధారణంగా 40 రోజుల పాటు బతికి ఉంటాయని, బ్యాక్టీరియాతో కూడిన తిఫల ఇచ్చినప్పుడు మాత్రం ఇవి 26 రోజులు ఎక్కువగా జీవించాయని సూసన్ వెస్ట్ఫాల్ అనే శాస్త్రవేత్త వివరించారు. వయసు మళ్లిన మనుషుల పేవుల్లో ఈ మూడు బ్యాక్టీరియా సంతతి తక్కువగా ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారని వివరించారు. త్రిఫలతోపాటు పేవుల్లోకి చేరే బ్యాక్టీరియా అక్కడ మనకు మేలు చేసే సూక్ష్మజీవుల సంతతిని పెరిగేందుకు దోహదపడుతూండవచ్చునని వివరించారు. -
రోబో ఈగ
‘రోబో’ సినిమా తెలుసు, ‘ఈగ’ సినిమా తెలుసు... ఇప్పుడు ‘రోబో ఈగ’ అనే కొత్త సినిమా రిలీజవుతోందేంటా అని అనుకుంటున్నారా? సినిమా కాదు గాని, నిజంగానే అసలు సిసలు ‘రోబో ఈగ’ను రిలీజ్ చేశారు... సారీ తయారు చేశారు వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు. ఈగలా గాల్లోకి ఎగిరే ఈ రోబోకు ‘రోబో ఫ్లై’ అని నామకరణం కూడా చేశారు. ఇది చాలా తేలికైన రోబో. దీని బరువు టూత్‌పిక్ బరువు కంటే కాస్త ఎక్కువ. దీనికి అమర్చిన సర్క్యూట్ బోర్డు సాయంతో లేజర్ కిరణాలను విద్యుత్తుగా మార్చుకుని, వైర్లెస్ పద్ధతిలో గాలిలోకి ఎగరడం దీని ప్రత్యేకత. ఇలా వైర్లెస్ పద్ధతిలో గాల్లోకి ఎగరగలిగే రోబో ఇప్పటి వరకు ఇదొక్కటి మాత్రమేనని దీని రూపకల్పనలో పాల్గొన్న శాస్త్రవేత్త సాయర్ పుల్లర్ తెలిపారు. దీనిపై ఉండే మైక్రో కంట్రోలర్ రెక్కలు కొట్టుకునే వేగాన్ని నియంత్రించేలా సందేశాలు పంపుతుందని, ఎక్కువసార్లు కొట్టుకునేందుకు ఒకరకంగా, ముందుకు వెళ్లేందుకు ఇంకోలా, గాలి అల పైకి రాగానే వేగాన్ని తగ్గించేందుకు మరోలా సందేశాలు పంపుతుందని ఆయన వివరించారు. గ్యాస్ లీకేజీలను, కర్మాగారాల నుంచి వెలువడే కలుషిత వాయువులను పసిగట్టడం మొదలుకొని, రకరకాల ప్రయోజనాల కోసం దీనిని వాడుకోవచ్చని తెలిపారు. -
రోబో రాజ్యం సేవకులు..
తెలివిలో రోబోలు మనిషిని మించిపోయే కాలం ఎప్పుడొస్తుందో తెలియదుగానీ.. పక్క ఫొటోలు చూస్తే అందుకు రంగం సిద్ధమవుతోందనే అనిపిస్తుంది. ఎందుకంటారా..? బోస్టన్ డైనమిక్స్ అనే అమెరికన్ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ రోబోలు ఇంకో ఏడాదిలోపు అందరికీ అందుబాటులోకి రానున్నాయి. పసుపు రంగులో కనిపిస్తున్న రోబో పేరు స్పాట్ ఐ. ఇళ్లలో, ఆఫీసుల్లో ఓ పెంపుడు జంతువు మాదిరి అటు ఇటూ తిరుగుతూ అవసరమైనప్పుడు తన ఒంటి చేత్తో వస్తువులను అమర్చిపెడుతుంది. ఇక చేతుల్లో ఓ కార్డ్బోర్డ్ పెట్టె.. కాళ్లకు చక్రాలు ఉన్న రోబో పేరు హ్యాండిల్! పేరుకు తగ్గట్టుగానే గోడౌన్లలో, లేదా ఈ– కామర్స్ స్టోర్లలో వస్తువులను అటు ఇటు కదిపేందుకు ఎంచక్కా ఉపయోగపడుతుంది. ఇక మిగిలినది రోబో పేరు అట్లాస్. ఈ మధ్య బాగా వార్తాల్లోకి ఎక్కిన రోబో ఇదే. నిన్నమొన్నటిదాకా కర్రతో తోస్తూ.. దారిలో అడ్డంకులు సృష్టిస్తూ దీన్ని తెగ ఇబ్బంది పెట్టారు.అయినాసరే ఈ రోబో బ్యాలెన్స్ కోల్పోకుండా నిలబడగలిగింది. తాజాగా ఆఫీసు బయట ఎంచక్కా జాగింగ్ కూడా చేసేసింది. బోస్టన్ డైనమిక్స్ రోబోలు ప్రస్తుతానికి మిలటరీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. కానీ భవిష్యత్తులో ఈ రోబోలు ఇళ్లలోకి చేరడం ఖాయమని అంటున్నారు. -
రోబోలతో పరిపాలన అందిస్తాం..
అది జపాన్‌లోని టామా అనే పట్టణం.. టోక్యో జిల్లాలో ఉంది.. ఇటీవలే అక్కడ మేయర్ స్థానం కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అంటే ఎన్నికల పండుగ మొదలైంది. ఆ స్థానం కోసం చాలా మంది అభ్యర్థులు పోటీలో నిలుచున్నారు. వారి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు అనేక హామీలు ఇస్తున్నారు. అయితే మిచిటో మస్తుడా అనే ఓ అభ్యర్థి మాత్రం ఎవరూ ఊహించని రీతిలో హామీలు ఇస్తున్నాడు.. అతడు ఇస్తున్న హామీ ఏంటో తెలుసా.. స్వచ్ఛమైన పరిపాలన అందిస్తానని.. అందులో కొత్తేం ఉందనుకుంటున్నారా..? కృత్రిమ మేధస్సుతో పరిపాలన చేస్తానని చెబుతున్నాడు.. అంటే పరిపాలన మొత్తం రోబోలతో చేసేస్తానని హామీ ఇచ్చేస్తున్నాడు.. ఒకవేళ మనోడు గెలిస్తే కృత్రిమ మేధస్సుతో పనిచేసే మొట్టమొదటి మేయర్ అవుతాడు. తాను గెలిస్తే ప్రభుత్వ పరిపాలన, విధానాల రూపకల్పన, పథకాలు, వాటి అమలు ఇవన్నీ కృత్రిమ మేధస్సుతో నడుపుతానని మస్తుడా చెబుతున్నాడు. దీంతో నిర్ణయాలు చాలా త్వరగా తీసుకోవచ్చని, తద్వారా ప్రజలకు త్వరితగతిన సేవలందించవచ్చని ప్రచారం చేసుకుంటున్నాడు. దాదాపు ప్రభుత్వ ఉద్యోగులను తొలగించి కృత్రిమ మేధతో నడిచే వాటినే నియమిస్తానని చెబుతున్నాడు. దీంతో అవినీతి, లంచం అనే మాట తన పరిపాలనలో ఉండదని అంటున్నాడు. 2014లో టామా నుంచే మేయర్ కోసం పోటీ చేసి డిపాజిట్ కోల్పోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా గెలవాలని ఈ కొత్త పంథా ఎంచుకున్నాడు. అయితే ఇదంతా ఓ రాజకీయ ఎత్తుగడ అని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. ఆదివారం (ఏప్రిల్ 15) జరుగుతున్న ఈ ఎన్నికల్లో మస్తుడా గెలిస్తే తాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే. -
సీక్వెల్ మచ్చీ సీక్వెల్
మచ్చీ... ‘రోబో’ అప్డేట్ అయ్యి వస్తున్నాడు.... భారతీయుడు విశ్వరూపం చూపిస్తాడట. ఈసారి పందెంకోడి మళ్లీ బరిలోకి దిగాడు... సామి దూకుడు పెంచాడు... మారి మమ్మమ్మాస్...సీక్వెల్ మచ్చీ సీక్వెల్... ఈ ఏడాది తమిళంలో సీక్వెల్స్ జోరు సాగుతోంది... ‘2.0’, ‘విశ్వరూపం 2’ఆల్రెడీ రిలీజ్‌కు రెడీ అయ్యాయి.... ఆన్ సెట్స్‌లో పదికి పైగా సీక్వెల్స్ ఉన్నాయి. సీక్వెల్స్ మావా సీక్వెల్స్. మరోసారి ఇండియన్ విశ్వరూపం కొడుకు మీద ఉన్న ప్రేమకన్నా, దేశభక్తే మిన్న అని చెప్పాడు భారతీయుడు. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్, ఉర్మిళ, మనీషా కోయిరాల ముఖ్య తారలుగా తమిళ్, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘భారతీయుడు’ (1996). ఆల్మోస్ట్ ఎనిమిది కోట్లతో నిర్మించిన ఈ సినిమా 30 కోట్లను అప్పట్లోనే కొల్లగొట్టింది. ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్ విభాగంలో కమల్‌హాసన్ స్టేట్ అండ్ నేషనల్ అవార్డులు అందుకున్నారు. అంతేనా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ విభాగంలో ఈ సినిమాను ఆస్కార్ నామినేషన్‌కు పంపించారు. భారతీయుడు అంత క్రేజ్ ఉండబట్టే... ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో పడ్డారు దర్శకుడు శంకర్ అండ్ కమల్‌హాసన్. సీక్వెల్ ఎనౌన్స్ చేసిన వెంటనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముందు ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత తప్పుకున్నారు. దాంతో ఫస్ట్ పార్ట్‌ని నిర్మించిన ఏయం రత్నం సీక్వెల్ తీయడానికి ముందుకొచ్చారు. ప్రముఖ రచయిత జయమోహన్‌తో కలసి ప్రముఖ రచయిత వైరముత్తు తనయుడు, యువరచయితల్లో మంచి పేరు తెచ్చుకున్న కబిలన్ వైరముత్తు రెండో భాగానికి కథ రెడీ చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ చిత్రం కోసం భారీ సెట్ వేయిస్తున్నారట. ఆగస్ట్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.విశేషం ఏంటంటే.. రానున్న రోజుల్లో కమల్ రెండు సీక్వెల్స్‌లో కనిపించనున్నారు. ఆల్రెడీ ‘విశ్వరూపం 2’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఆల్మోస్ట్ ఐదేళ్ల క్రితం రిపబ్లిక్‌డే టైమ్‌లో ‘విశ్వరూపం’ విడుదలైంది. కమల్‌హాసన్, రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, జై దీప్ ముఖ్య తారలుగా నటించారు. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో ఆల్మోస్ట్ 90కోట్లతో రూపొందిన ఈ సినిమా 200 కోట్ల క్లబ్లో చేరింది. సో.. ‘విశ్వరూపం 2’ పై అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేసి, చిత్రాన్ని ఈ ఏడాదిలో విడుదల చేయాలనుకుంటున్నారు. విశ్వరూపం ఫస్ట్‌లుక్ రంజాన్‌కు సామి స్క్వేర్ ! పద్నాలుగేళ్లు పట్టింది.. 2003లో వచ్చిన ‘సామి’ సినిమాకు సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లేందుకు. విక్రమ్, త్రిష, వివేక్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సామి’. దోచుకున్న వారిని దోచుకునే పోలీస్ పాత్రలో విక్రమ్ నటించారు. అప్పట్లో ఐదు కోట్లతో రూపొందిన ఈ సినిమా 30కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమాను తెలుగులో ‘లక్ష్మీనరసింహా’ పేరుతో బాలకృష్ణ రీమేక్ చేశారు. తెలుగులో కూడా మంచి స్పందన లభించింది. సామి స్వే్కర్ ఆన్‌లోకేషన్ ‘సామి’ సెన్సేషనల్ హిట్ సాధించడంతో ‘సామి స్వే్కర్పై అంచనాలు పెరిగాయి. స్క్రిప్ట్ పరంగా ఇద్దరు హీరోయిన్లకు చాన్స్ ఉన్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ స్టార్టింగ్‌లోనే క్రియేటివ్ డిఫరెన్స్‌తో హీరోయిన్ త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ 80శాతం షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సీక్వెల్లో కూడా విక్రమ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. రంజాన్‌కు రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. సామిలో విక్రమ్ మళ్లీ రేస్ మొదలైంది డిఫరెంట్ యాంగిల్ రౌడీయిజాన్ని ‘మారి’లో చూపించారు దర్శక–నటుడు–నిర్మాత ధనుష్. ఆయన హీరోగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో కాజల్ కథానాయికగా రూపొందిన చిత్రం ‘మారి’. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. పావురాల రేసింగ్ కాన్సెప్ట్ ఈ సినిమాలో హైలెట్. ఈ ఏడాది ఈ సినిమాకు సీక్వెల్‌ను ఎనౌన్స్ చేశారు ధనుష్. మారిలో ధనుష్ బాలాజీ మోహన్ దర్శకత్వంలోనే తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. పదేళ్ల క్రితం ధనుష్ నటించిన ‘యారుడా నీ మోహిని’కి సంగీతం అందించిన యువన్ శంకర్ రాజా ఇన్నేళ్ల తర్వాత ధనుష్ ‘మారి 2’కి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 40 శాతం కంప్లీట్ అయ్యింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మారి2 వర్కింగ్ స్టిల్ ఇదిగో వస్తా.. అదిగో వస్తా! రజనీకాంత్ ‘2.0’ రిలీజ్ డేట్ చాలాసార్లు మారింది. కానీ అంచనాలు మాత్రం మరింత పెరిగాయి. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఆల్మోస్ట్ ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఎందిరన్’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు ఇది సీక్వెల్. ఆల్మోస్ట్ 130 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘రోబో’ భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ‘2.0’ అయితే... రిలీజ్‌కు ముందే ఆల్మోస్ట్ 150 కోట్ల బిజినెస్ చేసింది. రోబో అంతేకాదు ఈ సినిమాను త్రీడీ వెర్షన్‌తో పాటు, ఆల్మోస్ట్ 14 భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. కొందరైతే ఇప్పటివరకు ఇండియాలో అత్యధిక వసూళ్లు చేసిన మొదటి సినిమా ‘బాహుబలి’ రికార్డులను ‘2.0’ బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరిలో రావాల్సిన ఈ సినిమా ఏప్రిల్‌కి వాయిదా పడింది. అదీ జరగలేదు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేస్తారని కొందరు, లేదు లేదు దీపావళికి రిలీజ్ చేస్తారని మరికొందరు అంచనాలు వేస్తున్నారు. మరి.. ఇదిగో వస్తా.. అదిగో వస్తా అంటున్న ‘2.0’ ఎప్పుడు వస్తుందో కాలమే చెప్పాలి. 2.0 కాంచన కమింగ్ సూన్ ‘ముని’ సినిమాను తెరకెక్కించేటప్పుడు రాఘవ లారెన్స్ ఊహించారో లేదో.. ఈ సినిమాకు మూడు సీక్వెల్స్ వస్తాయని. స్వీయ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ నటిస్తూ వేదిక, రాజ్ కిరణ్ ముఖ్య తారలుగా 2007లో రూపొందిన సినిమా ‘ముని’. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు 15 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాదు. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా 2011లో వచ్చిన ‘కాంచన’, నాలుగేళ్ల తర్వాత 2015లో వచ్చిన ‘కాంచన 2’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. కాంచన3 వర్కింగ్ స్టిల్ ఇప్పుడు ‘కాంచన 3 రూపొందుతోంది. ఈ సినిమాని కూడా స్వీయ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇందులో ఓవియా, వేదిక నటిస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఎనిమిదేళ్ల క్రితం ‘ముని’ ఫస్ట్ పార్ట్‌లో నటించిన వేదిక మళ్లీ ‘కాంచన 3’లో నటిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ నుంచి ఓవియా తప్పుకున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ ఓవియా ‘కాంచన 3’ షూట్లో జాయిన్ అవ్వడంతో ఆ వార్తలు అవాస్తవం అని తేలిపోయాయి. ‘కాంచన 3’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘ముని’లో రాజ్‌కిరణ్, లారెన్స్ బరిలోకి అదే పందెంకోడి విశాల్‌ని మంచి మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘పందెం కోడి’. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, మీరా జాస్మిన్ జంటగా తమిళ్లో రూపొందిన చిత్రం ‘సండైకోళి’ (2005) తెలుగులో ‘పందెంకోడి’గా రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పందెం కోడి 2’ నిర్మిస్తున్నారు. స్టార్టింగ్‌లో కాస్త స్లోగా ఈ చిత్రం షూటింగ్ సా..గిం..ది. ఇప్పుడు ‘పందెం కోడి’ మంచి ఊపుమీద ఉంది. ఈ సీక్వెల్లో విశాల్ సరసన కీర్తీ సురేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేసుకుందని సమాచారం. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కీర్తీ సురేశ్, విశాల్ నవ్వుల పందిరి ‘పెళ్లాం ఊరెళితె’ ఏం జరిగిందో థియేటర్లో చూశాం. ఇది తమిళ ‘చార్లీ చాప్లీన్’కి రీమేక్. శక్తి సుందర్ రాజన్ దర్శకత్వంలో ఆల్మోస్ట్ 16 ఏళ్ల క్రితం ప్రభుదేవా, ప్రభు, లివింగ్స్టన్, అభిరామి, గాయత్రి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘చార్లీ చాప్లీన్’. థియేటర్స్‌లో నవ్వులతోపాటు, బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ప్రస్తుతం ‘చార్లీ చాప్లీన్ 2’ తెరకెక్కుతోంది. శక్తి సుందర్ రాజన్ దర్వకత్వంలోనే ప్రభుదేవా, ప్రభు, ఆదా శర్మ, నిక్కి గల్రానీ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ 70 శాతం కంప్లీట్ అయ్యిందని సమాచారం. పెళ్లి బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందట. పెళ్లి మండపంలో మా నవ్వుల పందరి ఏంటో సిల్వర్ స్క్రీన్‌పై చూడండి అంటున్నారు చిత్రబృందం. ఆదా శర్మ సుడిగాడి సందడి సినిమా రిలీజ్‌కి ముందే లీకయ్యే పరిస్థితి ఇప్పుడు. అయితే కొన్ని కొన్ని సీన్లు లీకవుతుంటాయి. అయితే రిలీజైన మర్నాడు మొత్తం సినిమా ఆన్లైన్లో దర్శనమిస్తోంది. దీన్ని ఉద్దేశించే ‘తమిళ్ పడమ్ 2.0’ చిత్రబృందం ‘మా సినిమా మే 25న విడుదలవుతుంది. 26న ఆన్లైన్లో ఉంటుంది. చూసుకోండి’ అని సెటైరికల్‌గా అన్నారు. అన్నట్లు ఇది కూడా సెటైరికల్ మూవీనే. సీయస్ అముదాన్ దర్శకత్వంలో డిఫరెంట్ పేరడీలతో శివ, దిశా పాండే జంటగా రూపొందిన చిత్రం ‘తమిళ్ పడమ్’. ఈ సీక్వెల్ సేమ్ హీరో, సేమ్ డైరెక్టర్‌తో తెరకెక్కుతోంది. ‘తమిళ్ పడమ్’ సినిమా తెలుగులో ‘సుడిగాడు’ టైటిల్‌తో రిలీజైన సంగతి తెలిసిందే. మరికొన్ని... ఈ సినిమాలే కాకుండా త్రిష, అరవిందస్వామి జంటగా ‘చదురంగ వేటై్ట 2’ తెరకెక్కుతోంది. ఇది ‘చదురంగ వేటై్ట’ కి సీక్వెల్. అలాగే సముద్రఖని దర్వకత్వంలో 2009లో రూపొందిన ‘నాడోడిగల్’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌లో నటించిన శశికుమార్‌నే రెండో పార్ట్‌లో నటిస్తున్నారు. అంతేకాదు ఎస్.ఆర్. ప్రభాకరన్ దర్శకత్వంలో శశికుమార్ హీరోగానే ‘సుందరప్పాండియన్ 2’ తెరకెక్కనుందని కోలీవుడ్ సమచారం. రామ్‌బాలా దర్శకత్వంలో సంతానం హీరోగా రూపొందిన హారర్ చిత్రం ‘దిల్లుకు దుడ్డు’. ఇప్పుడు సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. మరికొందరి స్టార్ హీరోలతో పాటు, చిన్న హీరోలు కూడా సీక్వెల్ స్వింగ్‌లో రావడానికి చర్చలు జరుగుతున్నాయట. ఆల్రెడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘కలకలప్పు’కి సీక్వెల్‌గా సుందర్. సి రూపొందించిన ‘కలకలప్పు 2’ విడుదలైంది. ఇప్పటికి పదికి పైగా సీక్వెల్స్ ఆన్ సెట్స్‌లో ఉన్నాయి. చూడబోతుంటే ఇది ‘సీక్వెల్ నామ సంవత్సరం’ అనాలేమో. -
షేక్‌హ్యాండ్‌తో బీపీ, హార్ట్‌బీట్ నమోదు
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రికి వచ్చిన రోగులకు రోబోలు ఆత్మీయ స్వాగతం పలకనున్నాయి. పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్ మాదిరిగా ఆస్పత్రికి వచ్చిన రోగులకు వెల్కం అంటూ ఆహ్వానిస్తూ.. వారితో కరచాలనం చేయనున్నాయి. వైద్యుడు నాడిపట్టి చూడాల్సిన అవసరం లేకుండానే ఒక్క షేక్‌హ్యాండ్‌తో రోగి బీపీ, పల్స్రేట్, హార్ట్‌బీట్, బాడీ టెంపరేచర్‌ను నమోదు చేసి, స్క్రీన్‌పై డిస్ప్లే చేయనున్నాయి. ఆటోమేటిక్‌గా రోగి ముఖాన్ని స్కాన్ చేసుకుని, సదరు రోగి ఏ డాక్టర్ వద్దకు వెళ్లాలో చెబితే చాలు... ఆ డాక్టర్ వద్దకు తీసుకెళ్తాయి. దేశంలోనే ప్రథమంగా ఆదివారం గచ్చిబౌలిలో ప్రారంభించిన సన్‌షైన్ ఆస్పత్రి (250 పడకల సామర్థ్యం) నూతన బ్రాంచ్‌లో రోబో పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్‌ను ఏర్పాటు చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సహా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ఐఏఎస్ అధికారి జయేశ్‌రంజన్, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్, మెడికల్ డైరెక్టర్ నాగార్జున యార్లగడ్డ, సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం, సీనియర్ పల్మొనాలజిస్ట్ డాక్టర్ మథీనొద్దీన్ తదితరులు ప్రారంభ కార్యక్రమానికి హాజరై.. రోబోతో షేక్‌హ్యాండ్ ఇచ్చారు. రోబోతో వైద్యరంగంలో మార్పులు ఈ సందర్భంగా సన్‌షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ఏవీ గురువారెడ్డి మాట్లాడుతూ.. రోబోల రాకతో వైద్య రంగంలో మరిన్ని మార్పులు చోటు చేసుకోనున్నా యని చెప్పారు. రోగు లకు సత్వర, మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా రోబో ఎగ్జిక్యూటివ్‌ను ఏర్పా టు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇది పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్ వర్క్ మాత్రమే చేస్తుందని, భవిష్యత్తు లో తెలుగులో మాట్లా డటంతో పాటు ఐపీ నంబర్ చెబితే చాలు.. పేషెంట్ మెడికల్ రిపోర్టు లన్నీ ప్రింట్ రూపంలో అందజేయనుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగికి సత్వర వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా తమ ఆస్పత్రి పనిచేస్తుందన్నారు. ఐటీ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నవారి అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రిని తీర్చిదిద్దినట్లు తెలిపారు. -
అగ్నిమాపక రోబో!
సాక్షి, ముంబై : అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి ప్రాణహాని జరగకుండా రోబోలు కొనుగోలు చేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) భావిస్తోంది. అలాగే కెమికల్ ఫ్యాక్టరీలలో రసాయనాలకు మంటలు అంటుకున్నప్పుడు అవి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో సిబ్బందికి ప్రాణహాని జరిగే ఆస్కారముంటుంది. ఇలాంటి సమయంలో రోబోలు ఎంతో దోహదపడతాయని బీఎంసీ భావిస్తోంది. అదేవిధంగా అగ్ని ప్రమాద తీవ్రత తెలుసుకునేందుకు డ్రోన్ల సాయం కూడా తీసుకోవాలని యోచిస్తోంది. డ్రోన్ల అనుమతికి చర్చలు.. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సహాయక చర్యలు చేపట్టడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇటు మంటల తీవ్రతకు సంఘటన స్థలానికి దగ్గర వరకు వెళ్లలేక.. అటు అందులో చిక్కుకున్న వారిని కాపాడటానికి తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సి వస్తుంది. దీంతో అనేక సందర్భాలలో అగ్నిమాపక సిబ్బంది గాయడటం లేదా చనిపోవడం లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. వీటికి స్వస్తి చెప్పాలంటే రోబోలు ఎంతో ఉపయోగపడతాయని బీఎంసీ భావిస్తోంది. రాత్రివేళల్లో పైఅంతస్తుల్లో మంటలు అంటుకున్నప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి ఉంటుంది. ఒక పక్క చీకటి, మరోపక్క లిఫ్టులు పనిచేయవు. దీంతో ప్రమాదస్థలికి దగ్గర వరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. అలాంటి సమయంలో ప్రమాద తీవ్రతను గుర్తించి ఆ ప్రకారం వ్యూహాత్మక చర్యలు చేపట్టేందుకు డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయి. కానీ, ముంబైలో డ్రోన్ల వినియోగానికి అనుమతి లేదు. అందుకు విమానయాన శాఖ, ముంబై పోలీసు శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై వివిధ కోణాల్లో చర్చలు జరుపుతున్నారు. అనుమతి లభించగానే డ్రోన్లు కొనుగోలు చేయడానికి టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అగ్నిమాపక శాఖ చీఫ్ ప్రభాత్ రహందళే చెప్పారు. అందుకు అగ్నిమాపక శాఖకు రూ.151 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. కాగా, అగ్నిమాపక సిబ్బందికి రూ.30 లక్షల బీమా పాలసీ, విధినిర్వహణలో మృతి చెందిన జవాన్ల పిల్లల చదువులకయ్యే ఖర్చు బీఎంసీ భరించనుందని ఆయన అన్నారు. -
రోబో ‘ఆర్మీ’కి సరికొత్త కృత్రిమ మేధస్సు
వాషింగ్టన్: రోబోలకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు, వాటి సేవలను ఆర్మీలో వినియోగించుకునేందుకు అవసరమైన సరికొత్త కృత్రిమ మేధస్సును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, యూఎస్ ఆర్మీ రీసెర్చ్ లేబొరేటరీకి చెందిన పరిశోధకులు ముందుగా క్రిటిక్ రూపంలో రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్‌ను నిక్షిప్తం చేశారు. అనంతరం టేమర్ అనే అల్గారిధమ్ ద్వారా రోబోను మ్యాన్యువల్‌గా పరీక్షించారు. దీని ఆధారంగా మరింత మెరుగైన డీప్ టేమర్ అనే సరికొత్త అల్గారిధమ్‌ను రూపొందిం చారు. ఆ తర్వాత అటారీ గేమింగ్ సంస్థ రూపొందించిన గేమింగ్ ఆటకు సంబంధించిన 15 నిమిషాల సమాచారాన్ని రియల్ టైమ్ ఫీడ్ బ్యాక్‌ను నిక్షిప్తం చేశారు. కొత్తగా రూపొందించిన డీప్ టేమర్ అల్గారిధమ్ ద్వారా మరోమారు రోబోను పరీక్షించారు. ఈ పరీక్షలో మానవుల కంటే రోబోలు మెరుగైన ఆటతీరును ప్రదర్శించినట్లు గుర్తించారు. వచ్చే రెండేళ్లలో మరికొన్ని రంగాల్లో డీప్ టేమర్ అల్గారిధమ్‌ను పరీక్షిస్తామని యూఎస్ ఆర్మీ రీసెర్చ్ లేబొరేటరీకి చెందిన గారెట్ వార్నెల్ తెలిపారు.