టోక్యో: రోబో అంటే ఆదేశాలకనుగుణంగా పనిచేసే యంత్ర పరికరమని మనందరికీ తెలిసిందే.. మరి మీకు సైబోర్గ్ అంటే తెలుసా? అంటే.. సగం కీటకం.. సగం యంత్రం అన్నమాట. టెక్నాలజీకి మారుపేరైన జపాన్ శాస్త్రవేత్తలు.. మనుషులు నేరుగా వెళ్లలేని ప్రమాదకర ప్రదేశాలను పరిశీలించేందుకు, భూకంపాల వంటి విపత్తుల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో సహాయపడేందుకు బొద్దింకలపై ప్రయోగాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా మడగాస్కర్‌కు చెందిన 6 సెం.మీ. పొడవైన కొన్ని బొద్దింకల వీపుపై సౌరశక్తితో పనిచేసే అతిపలుచని, రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే బ్యాక్‌ప్యాక్‌లను అమర్చారు. అలాగే ఆ బొద్దింకల ఉదర భాగం వద్ద ఉండే రెండు కొండేలకు కాళ్ల కదలికలను నియంత్రించే వైర్లను అమర్చారు. అవి బొద్దింకలు వెళ్లాల్సిన దిశను సూచిస్తూ విద్యుత్ ప్రేరకాలను పంపుతాయి. తద్వారా వాటిని లక్ష్యంవైపు నడిపించాలన్నది సైంటిస్టులు ఉద్దేశం.
అనుకున్నట్లుగానే ఈ ప్రయోగం విజయవంతమైందని.. పరికరాలు అమర్చినప్పటికీ బొద్దింకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అణుధార్మికతను సైతం తట్టుకొనే సామర్థ్యం మడగాస్కర్ బొద్దింకలకు ఉండటంతో వాటినే ఈ ప్రయోగాలకు ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలు ఎన్‌పీజే ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
చదవండి: మెలికల టవర్.. ఎత్తు 590 అడుగులు..
Comments
Please login to add a commentAdd a comment