cockroaches
-
‘బొద్దింకల దోసె’?! షాక్ అయిన అమ్మడు
సామాన్యంగా బొద్దింకలను చూస్తేనే శరీరం ఝల్లుమంటుంది...అలాంటి బొద్దింక ఆహారంలో కనిపిస్తే..? ఆ భోజనం తినగలమా? ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున వార్త "ఆహారంలో బొద్దింక". ట్రైన్, రెస్టారెంట్, విమానాల్లో ఇలా ఎక్కడ చూసినా ఇవే వార్తలు. తాజాగా ఢిల్లీలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని కనౌట్ ప్లేస్‌లోని ఓ రెస్టారెంట్లో మధ్యాహ్న భోజనం కోసం ఓక మహిళ, ఆమె స్నేహితురాలు దోసను ఆర్డర్ చేసారు. సరిగ్గా అలా తినడం మొదలు పెట్టిందో లేదో.. అక్కడ అనుమానాస్పదంగా ఏదో కనిపించింది. ఏంటా అని పరిశీలనగా చూసింది. అంతే.. ఒకటి కాదు రెండు కాదు ఎకంగా ఎనిమిది బొద్దింల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఇవి చదవండి: నిత్యం వీటిని తినడంతో.. కలిగే మార్పులు తెలుసా! దీంతో ఈ సంఘటనను రికార్డుచేయాలని నిర్ణయించుకుంది. స్నేహితురాలి సాయంతో వీడియో రికార్డ్ చేస్తోంది. ఇంతలోనే హోటల్ సిబ్బందిలో ఒకరు ఎంట్రీ ఇచ్చాడు. అకస్మాత్తుగా ప్లేట్‌ను లాగేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇషాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ‘బొద్దింకల’పై ఆరా తీస్తున్నారు. తనకెదురైన భయంకరమైన అనుభవాన్ని ఇషాని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ కేఫ్ లైసెన్స్, శుభ్రతపై అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. రెస్టారెంట్ల పరిశుభ్రత స్థాయి, లైసెన్స్‌లను తనిఖీ చేయడానికి అధికారులు క్రమం తప్పకుండా రెస్టారెంట్లను సందర్శించి తగిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు నమోదు కావంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ది క్వింట్’ షేర్ చేసిన ఈ వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
మీకు సైబోర్గ్ అంటే తెలుసా?
టోక్యో: రోబో అంటే ఆదేశాలకనుగుణంగా పనిచేసే యంత్ర పరికరమని మనందరికీ తెలిసిందే.. మరి మీకు సైబోర్గ్ అంటే తెలుసా? అంటే.. సగం కీటకం.. సగం యంత్రం అన్నమాట. టెక్నాలజీకి మారుపేరైన జపాన్ శాస్త్రవేత్తలు.. మనుషులు నేరుగా వెళ్లలేని ప్రమాదకర ప్రదేశాలను పరిశీలించేందుకు, భూకంపాల వంటి విపత్తుల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో సహాయపడేందుకు బొద్దింకలపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మడగాస్కర్కు చెందిన 6 సెం.మీ. పొడవైన కొన్ని బొద్దింకల వీపుపై సౌరశక్తితో పనిచేసే అతిపలుచని, రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే బ్యాక్‌ప్యాక్‌లను అమర్చారు. అలాగే ఆ బొద్దింకల ఉదర భాగం వద్ద ఉండే రెండు కొండేలకు కాళ్ల కదలికలను నియంత్రించే వైర్లను అమర్చారు. అవి బొద్దింకలు వెళ్లాల్సిన దిశను సూచిస్తూ విద్యుత్ ప్రేరకాలను పంపుతాయి. తద్వారా వాటిని లక్ష్యంవైపు నడిపించాలన్నది సైంటిస్టులు ఉద్దేశం. అనుకున్నట్లుగానే ఈ ప్రయోగం విజయవంతమైందని.. పరికరాలు అమర్చినప్పటికీ బొద్దింకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అణుధార్మికతను సైతం తట్టుకొనే సామర్థ్యం మడగాస్కర్ బొద్దింకలకు ఉండటంతో వాటినే ఈ ప్రయోగాలకు ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలు ఎన్‌పీజే ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. చదవండి: మెలికల టవర్.. ఎత్తు 590 అడుగులు.. -
బొద్దింకను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.. అట్లాంటిది వాటిని పెంచితే రూ.లక్షన్నర!
కాక్రోచ్ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇంట్లో ఒక్క బొద్దింక కనబడితేనే దాన్ని చంపేదాకా మనసూరుకోదు. అలాంటిది ఇంటినిండా బొద్దింకలను ఒక నెలపాటు ఉంచడానికి... రెండు వేల డాలర్లు (సుమారు రూ.1,58,283) ఆఫర్ చేసిందో కంపెనీ. అందుకు 2,500మంది అంగీకరించారు కూడా. బొద్దింకలను పెంచమని ప్రోత్సహించ డం ఏంటనుకుంటున్నారా? వాటిని నిర్మూలించడానికి. అయితే పెంచడమెందుకు అంటే శాశ్వత నిర్మూలన ప్రయోగం కోసం. గతవారం నార్త్ కరోలినాకు చెందిన హైబ్రిడ్ పెస్ట్ కంట్రోల్/మీడియా కంపెనీ ‘ద పెస్ట్ ఇన్ఫార్మర్’ఒక ప్రకటన విడుదల చేసింది. 30 రోజులపాటు 100 అమెరికన్ బొద్దింకలను ఉంచి పరిశోధించడానికి ఏడు ఇళ్లు కావాలని తెలిపింది. ఆమోదం తెలిపేవాళ్ల వయసు 21ఏళ్లు నిండి ఉండాలి. సొంత ఇల్లు కలిగి ఉండాలి లేదా ఇంటి ఓనర్ ఆమోదం ఉన్నా సరిపోతుందని చెప్పింది. అలాగే వాటి నిర్మూలనకు ఎలాంటి పురుగుల మందులు వాడకూడదని, తాము ఇచ్చిన మందులను మాత్రమే ప్రయోగించాలని వివరించింది. వాళ్లు తయారు చేసిన పురుగుల మందు 30 రోజుల్లో ఆ బొద్దింకలను పూర్తిగా చంపలేకపోతే... 30 రోజుల తరువాత సాధారణ పద్ధతిలో వాటిని నిర్మూలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు వారికి రెండు వేల డాలర్లు అంటే దాదాపు రూ.లక్షా60వేలు ఇస్తామని పేర్కొన్నది. ఎవ్వరూ ఆసక్తి చూపరేమోనని జూలై 31వరకు గడువు విధించింది. వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ.. 2,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. అది చూసి ఆశ్చర్యపోవడం కంపెనీ వంతయ్యింది. ఎవరూ ఆసక్తిచూపరని తామనుకుంటే... ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలోంచి తమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారిని ఎంపిక చేసుకుంటామని ప్రకటించింది. -
కోర్టులో విచారణ.. ఒక్కసారిగా దూసుకొచ్చిన బొద్దింకలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!
సాధారణంగా కొందరు తమకు నచ్చినవి జరగకపోయినా లేదా ఇష్టం లేనివి జరుగుతున్న కొందరు నిరసనలు తెలపడం సహజమే. అయితే కొందరు మాత్రం వారి నిరసనను కాస్త ఢిఫరెంట్‌గా తెలుపుతుంటారు. ఒక్కోసారి అవి హాస్యాస్పదంగా, వివాదాస్పదంగా మారి వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఓ మహిళ తన నిరసనను వింతగా తెలియజేస్తూ కోర్టులో ఉన్న వారికి చుక్కలు చూపించింది. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళను స్థానికంగా గొడవలు చేసిందనే కారణంతో పోలీసులు అరెస్టు చేసి అల్బానీ నగరంలోని కోర్టులో హజరుపర్చారు. కోర్టులో.. ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఇందులో ఆ మహిళ తనపై వ్యతిరేక వాదనలే ఎక్కువగా వస్తున్న విషయాన్ని గమనించి కోపంతో ఊగిపోయింది. ఇంకేముంది తెలిసిన వారితో డబ్బాల నిండా బొద్దింకలను కోర్టుకు తెప్పించుకుంది. అదును చూసి కోర్టులో వాటిని వదిలేసింది. నిమిషంలో కోర్టు హాల్ మొత్తం బొద్దింకలతో నిండిపోయింది. ఒకటి, రెండు కాదండీ బాబు.. ఏకంగా వందల సంఖ్యలో బొద్దింకలు రావడంతో కేసును వాయిదా వేశారు. దాంతో పాటు బొద్దింకలను తరిమేందుకు పొగపెట్టాలంటూ కోర్టును కూడా మూసివేశారు. మహిళ చర్య కారణంగా కోర్టు కార్యకలాపాల్లో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఇదంతా మహిళ కావాలని చేసిన పనిగా బయటపడింది. దీంతో కోర్టు ఆమె చేసిన పనిని తీవ్రంగా పరిగణించింది. దీంతో ప్రస్తుతం ఆమెను పోలీసులు కస్టడీలోనికి తీసుకొని ఈ ఘటపై విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: చరిత్ర సృష్టించిన మాలావత్ పూర్ణ.. మౌంట్ డెనాలి ఎక్కి ప్రపంచ రికార్డు -
చనిపోయిన బొద్దింకలపై అందమైన చిత్రాలు!!
Brenda Delgado uses dead bodies of cockroaches as her canvas: బొద్దింకలను చూస్తే ‘ఛీ యాక్’ అని చీదరించుకుని పారిపోయే వాళ్లే ఎక్కువ. అలాంటి బొద్దింకలపై అందమైన చిత్రాలను చిత్రించడం.. అదీ చచ్చిన తర్వాత అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమేనండి చనిపోయిన బొద్దింకలపై ఫిలిప్పీన్స్‌కి చెందిన కళాకారిణి అందమైన దృశ్యాలను చిత్రించింది. అసలు విషయంలోకెళ్తే... మనీలాలోని కలూకాన్ సిటీకి చెందిన 30 ఏళ్ల డెల్గాడో తన పని ప్రదేశంలో చనిపోయిన బొద్దింకలను ఊడుస్తూ ఉంది. ఆ టైంలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. డెల్గాడో స్వతహాగా ఆర్టిస్ట్. బొద్దింకలు రెక్కలు నునపుగా మెరుస్తూ ఉంటాయి కదా వాటిని కాన్వాసుగా ఉపయోగించి ఎందుకు చిత్రించకూడదు అని అనుకుంది. అనుక్కన్నదే తడువుగా ఆయిల్ పెయింట్‌ను ఉపయోగించి రకరకాల చిత్రాలను చిత్రించింది. పైగా ఆ చిత్రాలు రచనల్లోని మార్వెల్స్ వెనమ్, గ్రీన్ గోబ్లిన్, విన్సెంట్ వాన్ గోహ్ స్టార్రీ నైట్ వంటి చిత్రాలకు సంబంధించిన అనుకరణ ప్రస్ఫుటంగా కనిపించింది. అంతేకాదు ‘భయపడకండి, అసాధ్యమైన పనులు చేయడానికి సదా సిద్దంగా ఉండండి’ అని అందరికీ పిలుపు ఇస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌గా అయ్యింది. దీంతో నెటిజన్లు ఆమె కళను చూసి ఫిదా అవుతున్నారు. (చదవండి: యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడి కన్నుమూత) (చదవండి: కెమెరామెన్ అమ్మతో చిట్టితల్లి.. ఏం చెప్పిందో వింటే ఫిదా అవుతారు) -
Cockroach beer: పేరే కాదు, ఆ టేస్టే వేరంటున్న బీర్ ప్రియులు
బీర్‌ను సాధారణంగా బార్లీ గింజలు, హోప్ మొక్కనుంచి వచ్చే పువ్వులు, ఒక్కోసారి గోధుమలతోను తయారు చేస్తారని మనలోచాలామందికి తెలుసు కదా. ఈ మధ్య గ్లూటెన్ ఫ్రీ అంటూ జొన్నలతో కూడా బీర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. తాజాగా వెరైటీ బీరు ఒకటి హల్ చల్ చేస్తోంది. అదే కాక్రోచ్ బీర్.. మీరు విన్నది నిజమే. బొద్దింకల బీర్. కానీ ఇది ఎక్కడ పడితే దొరకదు సుమా! మరి ఈ స్పెషల్ బీర్ ఎక్కడ తయారవుతుంది. దీని రేటెంత? ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి. బార్లీ గంజిని పులియబెట్టి, ప్రాసెస్ చేసి బీరు తయారు చేస్తారు. ఆయా బ్రాండ్లు వీటికి కొన్ని ప్లేవర్లను యాడ్ చేస్తాయి. కానీ జపాన్‌లో మాత్రం బీరును ఎలా తయారు చేస్తారో తెలిస్తే..ముందు యాక్ అంటారు. కానీ టేస్ట్‌కు టేస్ట్.. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ జపాన్ వాసులు ఈ స్పెషల్ బీర్ కోసం ఎగబడతారట. 20వ శతాబ్దం ప్రారంభం నుండి ఈ బీర్‌ను ఎంజాయ్ చేస్తున్నారట అక్కడి మందుబాబులు. -
బొద్దింకల నుంచి రక్షించుకుందాం!
ఈ లోకంలో దొరికే సమస్త పదార్థాలన్నింటినీ తిని హారాయించుకునే ఏకైక జీవులు బొద్దింకలు. అవి ఎంతకూ అంతరించిపోవట. అందుకే... అణుయుద్ధం సంభవించి జీవజాతులన్నీ అంతరించిపోయినా బొద్దింకలు బతికే ఉంటాయని ఒక అంచనా. అంతేకాదు... బొద్దింక తలను తొలగించినా... అది తొమ్మిది రోజులు బతుకుతుంది. చివరికి మెదడు లేనందకవి మరణించవు గానీ... తల లేకపోవడంతో ఆహారం అందని కారణంగానే అవి చనిపోతాయట. అంతటి పవర్ఫుల్ బొద్దింకలు పెరిగే ప్రధాన ప్రదేశాలు మన వంటిళ్లు. ఈ ప్రపంచంలోని ఏ కిచెన్ కూడా బొద్దింకలకు మినహాయింపు కాదంటే అది అతిశయోక్తి కాదు. ఈ బొద్దింకలనుంచి ఆరోగ్యాలకు వచ్చే ప్రమాదలేవీ వెనువెంటనే రావు. కానీ మన వంటింట్లోని ఆహార పదార్థాలన్నింటినీ అవి కలుషితం చేస్తాయి. ప్రధానంగా రాత్రిపూట మనం వంటింట్లోకి వెళ్లినప్పుడు మనం దాచిన ఆహారపదార్థాలపై అవి స్వైరవిహారం చేస్తూ కనిపిస్తాయి. మళ్లీ పగటిపూట అవి ఎక్కడిదొంగలు అక్కడేలా గప్‌చిప్‌గా ఉండిపోతాయి. క్రితం రాత్రి సైలెంట్‌గా సంచరించిన ఆ బొద్దింకల ప్రభావం కారణంగా మనకు నీళ్ల విరేచనాలు వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. వటితో మనకు వచ్చే మరో అనర్థం ఏమిటంటే... బొద్దింకలు అలర్జీని, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అందువల్ల ఆస్తమా రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వెరసి ఆస్తమా, అలర్జీ రోగులు తమ ఇళ్లలో బొద్దింకల నుంచి వచ్చే ప్రమాదాలను రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మరి బొద్దింకల నుంచి రక్షించుకోవడం ఎలా? బొద్దింకలను తుదముట్టించడానికి మార్కెట్లో దొరికే విషపదార్థాలున్న ద్రావణాలను పిచికారి చేయడం మరింత ప్రమాదం. దాని వల్ల మన కిచెన్‌ను మనమే విషపూరితం చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఈ విషాల్లో సంచరించిన బొద్దికలు మళ్లీ మన ఆహారాలపై తిరిగితే అది మరల మనకే హాని చేసే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మనం తినగా మిగలిగిన ఆహార పదార్థాలను మెష్ ఉండే కప్‌బోర్డుల వంటి సురక్షితమైన చోట ఉంచుకోవాలి. ఇక బొద్దింకలు బాగా తేమగా, తడిగా, వెలుగు అంతగా ప్రసరించని చోట పెరుగుతాయి. కాబట్టి ఇంట్లోని ప్రతి ప్రదేశమూ పొడిగా, వెలుతురూ, గాలీ ధారాళంగా వచ్చేలా చూసుకుంటే బొద్దింకలు పెద్దగా పెరగవు. బొద్దింకల సంఖ్య తక్కువగా ఉండేలా చూసుకుంటే వాటితో కలిగే అనర్థాలను సాధ్యమైనంతగా తగ్గించవచ్చు. -
శృంగారం కోసం.. భార్యపైకి బొద్దింకలు
బెంగళూరులో ఐటీ ఇంజనీర్ వికృత చేష్టలు సాక్షి, బెంగళూరు: శృంగారానికి తనను దగ్గరికి రానివ్వడం లేదని భార్యపై పైశాచికంగా ప్రవర్తించాడో ప్రబుద్ధ ఐటీ ఇంజనీర్. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని బన్నేరుఘట్టలో ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజనీరైన అవినాశ్ శర్మ పదేళ్ల క్రితం తన క్లాస్‌మేట్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజనీర్. అవినాశ్ కొద్దికాలంగా మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అవినాశ్ ప్రవర్తన నచ్చక ఆమె దగ్గరకు రానివ్వడం లేదు. దీంతో ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలనుకున్న అవినాశ్ తన భార్యపై బొద్దింకలను వదులుతూ భయపెట్టేవాడు. తనతో శృంగారంలో పాల్గొనకుంటే ఇంతేనని వేధించడం ప్రారంభించాడు. మొదట్లో తమ ఇద్దరు పిల్లల బాగు కోసం భర్త వేధింపులను ఓర్చుకున్న ఆమె రోజురోజుకూ వేధింపులు తీవ్రం కావడం తో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును మహిళా సహాయ వాణికి బదిలీ చేశారు. నిందతుణ్ని పిలిపించి విచారించగా శృంగారం లో తనకు సహకరించకపోవడం తోనే బొద్దింకలు వదులుతూ వేధించినట్లు చెప్పాడు. -
మీసేవకో దణ్ణం..!
♦ నాణ్యతలేని ఆహారం..బోగీల్లో బొద్దింకలు ♦ బెర్తుల కేటాయింపుల్లో చేతివాటం సిబ్బంది దురుసు ప్రవర్తన.. ♦ రైల్వే సదుపాయాలపై ఫిర్యాదుల వెల్లువ ♦ ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడి సాక్షి,సిటీబ్యూరో : రోజుకు 10 లక్షల మంది ప్రయాణం.. నిత్యం 800 రైళ్లు వేల కిలోమీటర్ల రాకపోకలు.. అందుబాటులో వేల మంది సిబ్బంది.. వెరసి దక్షిణమధ్య రైల్వే. సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ వ్యవస్థ లాభాల బాటలో పయనిస్తున్నా.. ఆదరిస్తున్న ప్రయాణికులకు మాత్రం సమస్యలను బోనస్‌గా ఇస్తోంది. బోగీల్లో ఎలుకలు, బొద్దింకల పరుగులు.. నాణ్యత లేని ఆహారం, చెల్లిస్తున్న ధరకు అనుగుణంగా తూకం ఉండని ప్యాకెట్లు.. సిబ్బంది దురుసు ప్రవర్తన.. వీటిపై వస్తున్న ఫిర్యాదుల లిస్టు చాంతాడులా పెరుగుతోంది. గత ఏడాది 18,662 ఫిర్యాదులు అందితే, ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 3 వేల ఫిర్యాదులు అందాయి. రైల్వే సదుపాయాలు, మెరుగైన రవాణా సదుపాయంపై పదే పదే ఊదరగొట్టే అధికారుల ప్రకటల్లోని డొల్లతనానికి ఈ ఫిర్యాదులే నిదర్శనం. అధికారులు చెబుతున్నదానికి.. వాస్తవ పరిస్థితులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. బాబోయ్ ఇదేం ఫుడ్డు..! సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణమధ్య రైల్వేలో వివిధ ప్రాంతాల మధ్య ప్రతి రోజు 10 లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. సుమారు 800 రైళ్లు సేవలు అందిస్తున్నాయి. అన్ని ప్రధాన రైళ్లలో ఆహార పదార్థాలు అందజేసేందుకు ప్యాంట్రి కార్ల ఉన్నాయి. స్టేషన్లలోనూ రెస్టారెంట్లు, క్యాంటిన్లు ఏర్పాటు చేశారు. ఐఆర్సీటీసీ, ప్రైవేట్ కేటరింగ్ సంస్థలు, హోటళ్లు ఆహార సేవలు అందిస్తున్నాయి. అయితే, ప్యాంట్రి కార్లలో పూర్తి అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. పదార్థాలు సప్లైచేసే సిబ్బంది సైతం శుభ్రత పాటించడం లేదు. చేతులకు గ్లౌజ్‌లు కూడా వేసుకోరు. మరోవైపు ఆహార పదార్థాల ధరలు ఎక్కువ, పరిమాణం తక్కువ. 100 గ్రాముల ఇడ్లీ ధర రూ.28. కానీ 80 గ్రాములే ఉంటుంది. 250 గ్రాముల పెసరట్టు ధర రూ.55. ప్రయాణికుడి చేతికి ఇచ్చేది 200 గ్రాములే. వాటర్ బాటిళ్లపై కూలింగ్ చార్జీల పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. సమస్యలపై ఫిర్యాదు చేస్తే చర్యలు మాత్రం ఉండవు. బెర్తుకు ‘చిల్లర’ బేరం బోగీల్లో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు, ఇతరులకు బెర్తులు, సీట్ల కేటాయింపుల్లో టీసీల చేతివాటం పైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అడిగినంత సమర్పించుకుంటే తప్ప బెర్తు లభించదు. పైగా లోయర్ బెర్తు, అప్పర్ బెర్తు పేరిట మరో బేరం. రైళ్లలోనూ, స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్లలోనూ కమర్షియల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తారు. అడిగిందానికి సమాధానం ఇవ్వకుండా బెదిరిస్తారు. టిక్కెట్ ఇచ్చిన తరువాత చిల్లర డబ్బులు ఇవ్వడం లేదు. ట్రైన్ వెళ్లిపోతోందేమోననే ఆందోళనలో ఉన్న ప్రయాణికులు రెలైక్కాక చూసుకుంటే రూ.వందో, రూ.యాభయ్యో తక్కువ ఉంటాయి. ‘తత్కాల్’ దందా.. రిజర్వేషన్ కేంద్రాల్లో దళారుల నియంత్రణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. ముఖ్యంగా తత్కాల్ కోటాను దళారులే ఎగురేసుకుపోతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రయాణికులు లైన్లో నిలుచుని ఉండగానే క్షణాల్లో టిక్కెట్లు అయిపోయి కౌంటర్లు మూసేస్తారు. మరోవైపు పార్శిల్ సెక్షన్‌లోనూ సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ ప్రయాణికులను వేధిస్తున్నారు. ఇలాంటి సేవల్లోనూ ప్రయాణికులు తమ ఇబ్బందులను తెలియజేస్తూనే ఉన్నారు. ఏసీ బోగీల్లో సేవలు శూన్యం.. వేలకు వేలు చెల్లించి ఏసీ బోగీల్లో వెళ్లే ప్రయాణికులకు కూడా తగిన సేవలు లభించడం లేదు. ఫస్ట్ ఏసీ బోగీల్లోనే నీళ్లు రావడం లేదని, ఆన్‌బోర్డు సిబ్బందిని విచారిస్తే సమాధానం చెప్పకుండా వెళ్తారని ప్రయాణికులు చెబుతున్నారు. చాలా సార్లు ఏసీలు పనిచేయవు. ఫ్యాన్లు తిరగవు. ఎలక్ట్రికల్ సిబ్బంది అందుబాటులో ఉండరు. ఉన్నా ఫిర్యాదును పెడచెవిన పెడతారు. టాయిలెట్లు కంపు.. రాత్రి వేళ ల్లో నీళ్లు రావు. ఆ సమయంలో ఫిర్యాదు చేసినా స్పందించే నాధుడు ఉండడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఫిర్యాదు చేసే మార్గాలు ఇవీ.. ⇔ సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టం (సీపీజీఆర్ఏఎంఎస్) ⇔ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఓఎంఎస్) వెబ్ పోర్టల్ ⇔ టోల్‌ఫ్రీ నెంబర్: 8121281212 కు ఎస్సెమ్మెస్ ⇔ ఆల్ ఇండియా హెల్ప్‌లైన్ నెంబర్: 138 ⇔ దక్షిణమధ్య రైల్వేలోని ప్రధాన కార్యాలయం, ⇔ డీఆర్ఎం, ఇతర ఉన్నతాధికారులకు నేరుగా అందజేసే ఫిర్యాదులు. ⇔ ప్రయాణికులకు అందజేసే సేవలు, సదుపాయాలు, భద్రత వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని 10 విభాగాలుగా ఫిర్యాదులను విభజించారు. ఆయా విభాగాల్లో ఫిర్యాదుల శాతం ఇలా ఉంది... 1. ఆహార పదార్థాల్లో నాణ్యత, కొరవడిన రుచి, చిరుతిళ్ల అమ్మకాల్లో అధిక ధరలు: 29.49 2. కమర్షియల్ సిబ్బంది దురుసు ప్రవర్తన: 17.98 3. రిజర్వేషన్లలో ఎదురయ్యే ఇబ్బందులు, ఏజెంట్ల జోక్యం: 10.86 4. వస్తువుల పార్శిల్ బుకింగ్‌లో ఎదురయ్యే సమస్యలపై: 8.45 5. సిబ్బంది లంచాలు, అవినీతిపై: 8.34 6. సీట్లు,బెర్తుల కేటాయింపుల్లో అక్రమాలు: 7.41 7. బుకింగ్ కౌంటర్ల ఎదురయ్యే సమస్యలు: 6.52 8. ఆన్‌బోర్డింగ్ హౌస్‌కీపింగ్ సిబ్బంది అమర్యాద ప్రవర్తన: 3.73 9. రైల్వేయేతర అవుట్సోర్సింగ్ సిబ్బంది పనితీరుపై: 3.73 10.విచారణ కేంద్రాల్లో ప్రయాణికులకు కావలసిన సమాచారం ఇవ్వకపోవడంపై: 3.49 -
ఇంటిప్స్
వంటింట్లో సింకుల వద్ద బొద్దింకలు ఎక్కువగా చేరుతుంటాయి. అలా చేరకుండా ఉండాలంటే వెల్లుల్లి ముక్కలను దంచి ఆ పేస్ట్‌ను అవి వచ్చే చోట ఉంచాలి. గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా ఉప్పు వేయాలి. అలా చేస్తే వాటి పెంకు సులువుగా వచ్చేస్తుంది. క్యాబేజీ ఉడికించేటప్పుడు బాగా వాసన వస్తుంది. అలా రాకుండా ఉండేందుకు అందులో చిన్న అల్లం ముక్క వేస్తేచాలు. వంటింటిని శుభ్రం చేసే నీళ్లలో కాసింత పసుపు కలపాలి. దాని వల్ల ఈగలు రాకుండా ఉంటాయి. -
నిమ్స్ క్యాంటీన్ దోశలో బొద్దింక
హైదరాబాద్ : ఫోటోలో కనిపిస్తున్న దోశ పేరు ప్రతిష్టలున్న నిమ్స్ ఆస్పత్రిలోని బెల్సన్ తాజ్ క్యాంటీన్లో తయారైంది. బుధవారం రాత్రి నిమ్స్ సెమీస్కిల్డ్ ఎంప్లాయిస్ ఉద్యోగి ఈశ్వర్ సింగ్ కోసం తయారు చేసిన ఈ దోశలో బొద్దింక దర్శనమిచ్చింది. తాజ్ హోటల్‌ను తలదన్నేలా రేట్లున్నా శుబ్రత లేకపోవడం వల్లే ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని బాధితుడు ఆవేదన వ్య్తక్తం చేశాడు. ఈ ఘటనపై నిమ్స్‌లో యూనియన్లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం నిమ్స్ ఔట్ పోలీసులు ఈ క్యాంటీన్లో భోజనం తెచ్చుకొని తింటుండగా అందులో రెండు పురుగులు కనిపించాయి. దాంతో నిమ్స్ ఆస్పత్రి క్యాంటీన్లో భోజనం చేయాలంటేనే రోగులు, వారి బంధువులు, వైద్యులు, సిబ్బంది హడలిపోతున్నారు.