Brenda Delgado uses dead bodies of cockroaches as her canvas: బొద్దింకలను చూస్తే ‘ఛీ యాక్’ అని చీదరించుకుని పారిపోయే వాళ్లే ఎక్కువ. అలాంటి బొద్దింకలపై అందమైన చిత్రాలను చిత్రించడం.. అదీ చచ్చిన తర్వాత అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమేనండి చనిపోయిన బొద్దింకలపై ఫిలిప్పీన్స్‌కి చెందిన కళాకారిణి అందమైన దృశ్యాలను చిత్రించింది.
అసలు విషయంలోకెళ్తే... మనీలాలోని కలూకాన్ సిటీకి చెందిన 30 ఏళ్ల డెల్గాడో తన పని ప్రదేశంలో చనిపోయిన బొద్దింకలను ఊడుస్తూ ఉంది. ఆ టైంలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. డెల్గాడో స్వతహాగా ఆర్టిస్ట్. బొద్దింకలు రెక్కలు నునపుగా మెరుస్తూ ఉంటాయి కదా వాటిని కాన్వాసుగా ఉపయోగించి ఎందుకు చిత్రించకూడదు అని అనుకుంది. అనుక్కన్నదే తడువుగా ఆయిల్ పెయింట్‌ను ఉపయోగించి రకరకాల చిత్రాలను చిత్రించింది.
పైగా ఆ చిత్రాలు రచనల్లోని మార్వెల్స్ వెనమ్, గ్రీన్ గోబ్లిన్, విన్సెంట్ వాన్ గోహ్ స్టార్రీ నైట్ వంటి చిత్రాలకు సంబంధించిన అనుకరణ ప్రస్ఫుటంగా కనిపించింది. అంతేకాదు ‘భయపడకండి, అసాధ్యమైన పనులు చేయడానికి సదా సిద్దంగా ఉండండి’ అని అందరికీ పిలుపు ఇస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌గా అయ్యింది. దీంతో నెటిజన్లు ఆమె కళను చూసి ఫిదా అవుతున్నారు.
(చదవండి: యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడి కన్నుమూత)
(చదవండి: కెమెరామెన్ అమ్మతో చిట్టితల్లి.. ఏం చెప్పిందో వింటే ఫిదా అవుతారు)
Comments
Please login to add a commentAdd a comment