Artist
-
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
దుబ్బాకటౌన్: సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకొని సిద్దిపేట జిల్లాకు చెందిన యువ కళాకారులు తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గజ్జె కట్టి, మైక్ పట్టి ధూంధాం వంటి కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన ఎంతో మంది కళాకారులు యూట్యూబ్‌ను వేదికగా చేసుకొని తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. యూట్యూబ్‌ల్లో లక్ష్యల్లో వ్యూస్ పొందుతున్నారు. రేలారే రేలా.. వివిధ టీవీ కార్యక్రమాలతో మనం నేర్చుకున్న విద్య, చేస్తున్న వృత్తి, జీవితంలో ఎంచుకున్న మార్గం పెద్దల బాటల్ని బట్టే ఉంటాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామానికి సాహిత్యంలో మంచి గౌరవం ఉన్నట్లే భార్గవి తల్లి భూదవ్వకు మంచి గుర్తింపు ఉంది. రేలారే రేలా.. వివిధ టీవీ కార్యక్రమాల్లో జానపద పాటలతో అలరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం కార్యక్రమాల్లో తన ఆట, పాటలతో జనాన్ని కట్టి పడేసింది. ప్రస్తుతం జాన పదాలను పాడుతూ.. తానే స్వయంగా నటిస్తూ యూట్యూబ్‌లో ఫోక్ స్టార్‌గా పేరు గాంచింది. ప్రముఖ జానపద గాయకుడు కళాకారుడు శ్రీనివాస్ భార్గవిని చాలా ప్రోత్సహించేవాడు. ఆయన అప్పటికే జానపదాలు పాడుతుండేవాడు. డప్పు కొట్టుకుంటూ పాడడం, డ్యాన్స్ చేస్తూ పాడడం నేర్పంచి కొత్త భార్గవిగా తయారు చేశాడు. ఆయన వల్లె రేలారే రేలాలో భార్గవికి అవకాశం వచి్చంది. కళను నేర్ప న కళాకారుడితోనే వివాహం పాటతో ప్రారంభమైన భార్గవి జీవితంలో మరో పాటగాడు ఆమె జీవిత భాగస్వామి అయ్యాడు.. ఆట, పాట నేర్పిన కళాకారుడు ముక్కపల్లి శ్రీనివాస్‌ను భార్గవి వివాహం చేసుకుంది. భార్గవి, శ్రీనివాస్ కలిసి పాడి నటించిన.. కుటుంబ నేపథ్యానికి చెందిన జానపదాలైన బంతి పూల వాసన నీ బానిన్ల, చిన్ననాడు పెట్టిన చిక్కుడు చెట్టు, పోంగ పోంగా పొట్లా చెరువు, కొత్త కుండాల రెండిత్తునాలత్తో .. వంటి పాటలు అధ్యశ్రీ మ్యూజిక్ ద్వారా యూట్యూబ్‌లో విడుదలై ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. మరికొందరు కళాకారులు దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన కమ్మరి నర్సింలు, పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన బిట్ల ఎల్లం, దుబ్బాకకు చెందిన తుమ్మల ఎల్లంఆస రామారావు, తదితర కళాకారులు, కవి గాయకులు తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించి నేడు సోషల్ మీడియా ద్వారా తమ కళను నిరూపించుకుంటున్నారు. హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి మూడు తరాల నుంచి మా ఇంట్లో జానపదాలు జాలువారుతూ వస్తున్నాయి. జాన పదాలంటే నాకు ప్రాణం. ధూంధాంలో వివిధ సభల్లో జాన పదాలు పాడుతుంటే ఆడ పిల్లవైన నీకు ఈ సభలలో పాడడం అవసరమా అని చాలా మంది హేళన చేసేవారు. కానీ వారే ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు. అమ్మ నేర్పన పాటను జీవన పాఠంగా నేర్చుకొని గురువు నేర్పన బాటలో ముందుకు సాగుతున్నాను. ఇప్పటి వరకు 10 పాట్లల్లో నటించగా, ఆధ్యశ్రీ మ్యూజిక్ ఛానల్‌కు 2.90 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. భవిష్యత్‌లో మరింతగా రాణిస్తాను. –ముక్కపల్లి భార్గవి సోపతి మ్యూజిక్ సత్తా చాటుతూ.. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన పిల్లి కార్తీక్ ముదిరాజ్ 2019 సంవత్సరంలో వస్తావ పిల్ల ఓ మధుబాల పాట ద్వారా పరిచమమై సోపతి యూట్యూబ్ ఛానల్ ద్వారా సత్తా చాటుతున్నాడు. 30కి పైగా పాటల్లో నటించి జిల్లాలో ప్రజల మన్ననలు పొందుతున్నాడు. ఇటీవల ప్రారంభించిన సోపతి యూట్యూబ్ ఛానల్‌కు 7 వేల మందికి పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అత్తని చూడది అన్నమెయ్యది పాట 1.5 మిలియన్ వ్యూస్‌తో మంచి ఆదరణ పొందింది. 200 పైగా పాటల్లో మౌనిక డింపుల్ మౌనిక డింపుల్ డ్యాన్స్‌లో తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని దాదాపు 200కు పైగా పల్లె పదాల పాటల్లో నటించింది. చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన మౌనిక మొదట సైడ్ డ్యాన్సర్‌గా వచ్చి డ్యాన్స్‌లో మెళుకువలు నేర్చుకొని జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎంతో మంది ఆదరాభిమానాలు పొందింది. పల్లెదనం ఉట్టిపడేలా పల్లెటూరి యువతీల పాటల్లో నటిస్తూ హోరెత్తిస్తుంది. ఇన్స్ట్ర్రాగమ్లో రీల్స్ చేస్తూ..ముందుకు సాగుతుంది. డ్యాన్స్‌లో, యాక్టింగ్‌లో నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి నేను 200 పల్లె పదాల్లో నటించడానికి నా గురువులే కారణం. నన్ను ప్రోత్సహించిన కార్తీక్ ముదిరాజ్, హరీశ్ పటేల్‌కు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది. పీఎం క్రియేషన్స్: 8 లక్షల సబ్స్క్రైబర్స్సిద్దిపేట రూరల్ మండలం రావురూకుల గ్రామానికి చెందిన పార్వతీ మహేశ్ తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి విభాగంలో కళాకారుడిగా పాల్గొన్నాడు. ఉద్యమ సమయంలో పలు వేదికల్లో ఆట, పాటతో అలరించాడు. పీఎం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పల్లె పదాలను అందిస్తున్నాడు. మంచి పాటల రచయితగా గుర్తింపు పొందిన మహేశ్ 50 పాటలు పైగా రచించి, 30 పాటలకు ప్రొడ్యూస్ చేశాడు. 40 పాటల్లో నటనతో అలరించాడు. 8 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. భార్య సంజన సైతం సింగర్ కావడం విశేషం. నాయి దొరో.. నా రాజమని పాట 100 మిలియన్ వ్యూస్‌తో జనాధారణ పొందింది.దివ్యాంగుడైనా కళాకారులను ప్రోత్సహిస్తూ.. సిద్దిపేట రూరల్ మండలం రావురూకుల గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డి దివ్యాంగుడైనా కొత్త కళాకారులను ప్రోత్సహిస్తూ.. పల్లె సవ్వడి ఛానెల్ ద్వారా ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. 6 పాటలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి కొత్త కళాకారులకు అవకాశం కలి్పస్తున్నాడు. -
సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ.. చెపాక్‌లో సందడి చేసిన సుప్రీత (ఫోటోలు)
-
హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య
సాక్షి,రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణం చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఏడాది క్రితం అమిష్ లోయా అనే వ్యక్తితో కోర్టు మ్యారేజ్ చేసుకున్న పింకీ.. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పింకీ ఆత్మహత్యకు తన భర్త వేధింపులే కారణమా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. అమిష్ లోయా అనే వ్యక్తితో ఏడాది క్రితం పింకీ శర్మ వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజుల పాటు వీరి కాపురం సజావుగా సాగినప్పటికీ.. తర్వాత ఇద్దరి మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి.అప్పటి నుంచి బయటకెళ్లటప్పుడు పింకీ శర్మను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడని.. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా పింకీ శర్మ, అమిష్ మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం. దీంతో పింకీ శర్మను ఇంట్లో పెట్టి బయటకు వెళ్లిపోయాడు. కాసేపటికి ఇంటికి తిరిగొచ్చేసరికి పింకీ శర్మ చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
స్నేహ శిల్పం
వరల్డ్ ఆర్ట్ మార్కెట్లో మన ఆర్ట్ వాటా 0.5 శాతమే! అసలు విలువ రెండువేల కోట్లకు పైమాటే అని చెబుతున్నారు నిపుణులు! మరెందుకు అంత తక్కువంటే.. ‘మనకు ఆర్ట్‌ను మార్కెట్ చేసుకోవడం తెలీక’ అంటారు ఆర్ట్‌లో పీహెచ్డీ, ఆర్ట్ ట్రేడ్‌లో అపార అనుభవం గడించిన హైదరాబాద్ కళాకారిణి, శిల్పి డాక్టర్ స్నేహలతా ప్రసాద్. ఆమె పరిచయం.. .డాక్టర్ స్నేహలతా ప్రసాద్ సొంతూరు జోద్పూర్. తండ్రి దివాన్సింగ్ నరూకా డిఫెన్స్‌లో పనిచేసేవారు. అమ్మ.. లీలా దివాన్ హోమ్ మేకర్. ఆడపిల్లల మీద ఆంక్షలుండే రాజపుత్ర కుటుంబమైనా తల్లిదండ్రులిద్దరూ చదువుకున్నవారవడంతో స్నేహలతకు స్వేచ్ఛనిచ్చారు. ఆమె డాక్టర్ అవ్వాలని తండ్రి ఆశపడ్డాడు. కానీ స్నేహకు చిన్నప్పటి నుంచీ డ్రాయింగ్ అంటే ఆసక్తి. చక్కగా బొమ్మలు వేసేది. ఆర్మేచర్, క్లే ఆర్ట్ మీద వ్యాక్స్‌తో అలంకరించేది. అది గమనించే లీలా దివాన్ కూతురు ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంది. ఆమె అనుకున్నట్టే స్నేహ ఆర్టిస్ట్ అయింది. పీహెచ్డీ చేసింది. తన ఆర్ట్‌ని మార్కెట్ చేసుకునే ఆర్టూ తెలిసుండాలని ఫారిన్ ట్రేడ్ కోర్స్ కూడా చేసింది. సొంతంగా గ్యాలరీ పెట్టుకుంది. ఆర్ట్ + 2ఎగ్జిబిషన్స్ లో ఆమె పెయింటింగ్స్ ఎమ్మెఫ్ హుస్సేన్ పెయింటింగ్స్‌తో సమంగా సేల్ అయ్యేవి! అలా రాజస్థాన్‌లో టాప్ టెన్ యంగ్ ఆర్టిస్ట్స్లో ఒకరుగా నిలిచింది.పెళ్లితో...సంప్రదాయ రాజపుత్ర కుటుంబాల నుంచి వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ పెళ్లయ్యాక స్నేహ గృహిణిగా ఉండాలనే షరతుతో వచ్చినవే! దాంతో వాటిని తిరస్కరించారు స్నేహ తల్లిదండ్రులు. అప్పుడే స్నేహా వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి డాక్టర్. నాన్‌మెడికల్ ప్రొఫెషన్ అమ్మాయి కోసం వెదుకుతున్నాడతను. అందరికీ నచ్చడంతో 2004లో పెళ్లి అయింది. అతని పేరు డాక్టర్ ప్రసాద్ పత్రి. తెలుగు వ్యక్తి. అయితే అది రాజ్‌పుత్ సంబంధం కాదని ఆ పెళ్లికి స్నేహా వాళ్ల దగ్గరి బంధువులెవరూ రాలేదు. కొత్తదంపతులు హైదరాబాద్ వచ్చేశారు. పెళ్లయిన వెంటనే పిల్లలు పుట్టడంతో మాతృత్వాన్ని ఆస్వాదించాలనుకుంది స్నేహ. దాంతో పెయింటింగ్‌కి బ్రేక్ పడింది.సెకండ్ ఇన్నింగ్స్...పదేళ్ల తర్వాత మళ్లీ కాన్వాస్ ఫ్రేమ్ చేసుకుంది స్నేహ. అయితే అదంత ఈజీ కాలేదు. పెళ్లికిముందు ఆర్టిస్ట్‌గానే కాదు మంచి ఆంట్రప్రెన్యూర్‌గానూ స్పేస్ సంపాదించుకున్న ఆమెకు ఈ పదేళ్లలో చాలా మారిపోయినట్టనిపించింది. దాంతో జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ షో కోసం ఢిల్లీ లలిత కళా అకాడమీని బుక్ చేసుకుంది. నెల రోజుల్లో ప్రదర్శన. బ్రేక్ తీసుకున్న పదేళ్ల కాలాన్నే పద్నాలుగు పెయింటింగ్స్ తో వ్యక్తపరచింది. మరోటి ‘గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ పెయింటింగ్’. తనను ఇన్స్పైర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆర్ట్ఫామ్స్ని ట్రాన్స్పరెంట్ ఫామ్‌లో వేసిన 32 అడుగుల తన తొలి పెద్ద పెయింటింగ్. దాని కోసం చాలా కష్టపడింది. ఆ శ్రమ వృథా కాలేదు. కాంప్లిమెంట్స్తోబాటు కాసులూ వచ్చాయి. లలిత కళా అకాడమీలో ఆమెకు లభించిన ఆదరణ చూసి భర్త ప్రసాద్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆమె కెరీర్‌కి సపోర్ట్‌గా నిలిచారు.శిల్పం...2013లో లలిత కళా అకాడమీ వాళ్లదే సిమ్లాలో ఆర్ట్ క్యాంప్ ఉంటే వెళ్లింది స్నేహ. అందులో పెయింటింగ్, స్కల్ప్చర్ రెండూ ఉన్నాయి. అక్కడ వుడ్ స్కల్ప్టింగ్ చూసేసరికి ఒక్కసారిగా తన చిన్నప్పటి స్కల్ప్టింగ్ ఆశ రెక్కలు తొడుక్కుంది. స్కల్ప్టింగ్కి ప్రయత్నించింది. తొలుత క్లే మోడలింగ్‌తో స్కల్ప్టింగ్ జర్నీ స్టార్ట్ చేసింది. తర్వాత స్టోన్ వర్క్ మొదలుపెట్టింది. ఆర్ట్ అండ్ కల్చర్ మినిస్ట్రీ జూనియర్ ఫెలోషిప్ కూడా పొందింది. ఎన్నో ఆర్ట్ క్యాంప్స్, నేషనల్, ఇంటర్నేషనల్ సింపోజియమ్స్ను నిర్వహించింది. ఈ మధ్యనే 25వ సోలో షో చేసింది. ఇంటర్నేషనల్ ఆర్ట్ షోస్‌నూ క్యురేట్ చేస్తోంది. ఆర్ట్ లెక్చర్స్ ఇస్తుంది. లాంగెస్ట్ పెయింటింగ్ ఆఫ్ ఇండియాలో పేరు సంపాదించింది. హైదరాబాద్‌లో ‘స్నేహా డి ఆర్ట్స్’ పేరుతో గ్యాలరీప్రారంభించింది. పెయింటింగ్, స్కల్ప్చర్లో శిక్షణ ఇస్తోంది. సంప్రదాయానికి విరుద్ధంగా తనను చదివించినందుకు, కళారంగంలో ప్రోత్సహించినందుకు ఎవరైతే స్నేహ కుటుంబాన్ని విమర్శించారో వాళ్లంతా స్నేహను చూసి మొత్తం ఖాన్దాన్కే ఖ్యాతినార్జించి పెట్టిందని గర్వపడే స్థాయికి ఎదిగింది. – సరస్వతి రమస్నేహలతా ఆర్ట్ క్రెడిట్స్రాజస్థాన్, ఢిల్లీ, హరియాణా హైవై, పుణె, హైదరాబాద్, కొత్తగూడెంలలో స్కల్ప్టింగ్ చేసింది. దేశంలోని పలుప్రాంతాల్లో పదిహేను ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీ పార్క్స్‌ను డిజైన్ చేసింది. సికంద్రాబాద్ కంటోన్మెంట్‌లోనూ స్కల్ప్టింగ్ చేసింది. వందల ఏళ్ల నాటి శిల్పాలను రెస్టొరేట్ చేసింది. ఏఐ ఇంటిరీయర్ డిజైన్ చేస్తోంది. బికనీర్ ఆర్మీ కోసమూ పనిచేస్తోంది.‘కళతోపాటు మార్కెట్‌ను క్రియేట్ చేసుకునే స్కిల్ కూడా ఉండాలి. ఎమ్మెఫ్ హుస్సేన్ సాబ్ గనుక తన మార్కెట్‌ను డెవలప్ చేసుకోకపోయి ఉంటే ఈరోజు ఆయన ఎవరికీ తెలిసుండేవారు కాదు. ఆర్ట్‌కి మార్కెట్ అంత ఇంపార్టెంట్. ఆర్ట్ అకడమిక్స్‌లోనూ మార్కెటింగ్‌ని చేర్చాలి. విమెన్ ఆర్టిస్ట్‌లు తమ పరిధిని విస్తృతం చేసుకోవాలి. బడ్డింగ్ ఆర్టిస్ట్‌లకు చెప్పేదొకటే.. ఓన్ స్టయిల్‌ను తద్వారా ఓన్ మార్కెట్‌ను క్రియేట్ చేసుకోవాలి.’– డాక్టర్ స్నేహలతా ప్రసాద్ -
బిగ్‌బాస్ తర్వాత ఫస్ట్ మూవీ.. ఆర్టిస్ట్‌తో పలకరించిన సోనియా (ఫోటోలు)
-
స్వదేశ్లో చేతివృత్తుల సంగమం: హస్తకళ, మహిళా కళాకారులకు ఘన సత్కారం
దేశవ్యాప్తంగా విభిన్న సంస్కృతులకు చెందిన హస్తకళలతో తయారు చేసిన విలాసవంతమైన కళాకృతులకు గమ్యస్థానమైన జూబ్లీహిల్స్‌లోని స్వదేశ్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సృజనాత్మక కళాకారులైన మహిళా ఛాంపియన్స్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. ఆర్ట్ క్రాఫ్ట్స్‌తో చక్కటి హస్తకళ, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే మహిళలను అభినందించారు. స్టోరీ టెల్లింగ్, స్ఫూర్తి ప్రదాతలను పరిచయం చేసే ఈ కార్యక్రమంలో హెర్ సర్కిల్ సీఈఓ థాన్య చైతన్య మోడరేటర్‌గా ఫైర్ చాట్ నిర్వహించారు. ఈ వేదికగా ఆరుగురు ప్రముఖ క్రాఫ్ట్ మాస్టర్లు హస్తకళలతో తయారు చేసిన సంప్రదాయాలను సజీవంగా ఉంచడంలో వారి ప్రయాణాలు, సవాళ్లు, ఆవిష్కరణలను పంచుకున్నారు. ఈ సెషన్లో వారి కథలతో స్ఫూర్తిని నింపారు. సమకాలీన భారతదేశంలో చేతిపనుల ప్రాముఖ్యతను బలోపేతం చేశారు. ఈ ప్రత్యేక వేదికగా.. డిజైన్ ఇన్నోవేషన్ జాతీయ అవార్డు గ్రహీత సునేత్రలహరి (పశ్చిమ బెంగాల్), తోలుబొమ్మలాటతో జాతీయ అవార్డు పొందిన డి.శివమ్మ (ఆంధ్రప్రదేశ్), సిల్వర్ ఫిలిగ్రీ జాతీయ అవార్డు గ్రహీత అర్రోజు ధనలక్ష్మి (తెలంగాణ), కాలిఘాట్ పెయింటింగ్ అవార్డీ స్వర్ణ చిత్రకార్ (పశ్చిమ బెంగాల్), ఇక్కత్ చేనేత జాతీయ అవార్డు గ్రహీత సుకాంతి మెహెర్ (ఒడిశా), మధుబని పెయింటింగ్ జాతీయ అవార్డు గ్రహీత ఆశా ఝా (బీహార్)ను స్వదేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సన్మానించారు. అత్యుత్తమ వర్క్ ప్లేస్‌గా సింక్రోనీ..సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న సంస్థల్లో అత్యత్తుమ టాప్ 50 పని ప్రదేశాల్లో నగరానికి చెందిన సింక్రోనీ ఇండియా ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతిష్టాత్మక ‘ఆల్ 2025’ నిర్వహించిన అధ్యయనంలో బిల్డింగ్ ఏ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2025 లార్జ్ కేటగిరీలో సింక్రోనీ ఇండియా ఎంపికైంది. ఈ సందర్భంగా సంస్థ హెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రచనా బహదూర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాదాపు 1,800కు పైగా సంస్థల్లోని 57 లక్షలకు పైగా ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించిన ఈ అధ్యయనంలో సింక్రోనీ శ్రేష్ఠతకు ఒక ప్రమాణాన్ని నిర్దేశించడం తమకు గర్వకారణమన్నారు -
గిన్నిస్ వరల్డ్ రికార్డు నుంచి గోల్డ్ మెడల్ వరకు..
సాధించాలనే తపన, పట్టుదల ముందు ఏ వైకల్యమూ అడ్డుకారాదని.. ప్రతిభ ఉండాలే కానీ అవార్డులు.. రివార్డులు.. వాటంతట అవే వస్తాయని నిరూపించింది.. ఆ యువతి. దివ్యాంగురాలన్న భావన లేకుండా పట్టుదలతో కాన్వాస్‌పై చిత్రలేఖనం (Painting) నేర్చుకుని విమర్శకుల ప్రశంసలు పొందుతూ.. శభాష్ అనిపించుకుంటోంది.. ఆమే మేడ్చల్ జిల్లా శామీర్‌పేట (Shamirpet) మండలం తుర్కపల్లికి చెందిన విజయలక్ష్మి. చిత్రకళతో పాటు సంగీతంలోనూ రాణిస్తూ.. ప్రముఖుల ప్రశంసలు పొందుతూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.తుర్కపల్లికి చెందిన విజయలక్ష్మి మూడేళ్ల వయసులో పోలియో వచ్చి రెండు కాళ్లు, కుడి చెయ్యి పనిచేయకుండా పోయాయి. తల్లిదండ్రులు నర్సింహులు, ప్రమీళ, అన్నా వదిన అనంద్, శ్రవంతి విజయలక్ష్మికి అండగా నిలిచారు. ఆమెలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. దివ్యాంగురాలనే భావన కలుగకుండా చిత్రలేఖనంపై పట్టుసాధించేలా ప్రోత్సహించారు. మొదట్లో దినపత్రికలు, ఆదివారం ప్రచురణలలోని బొమ్మలను చూసి చిత్రలేఖనం నేర్చుకుంది. కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. పాఠశాల దశలోనే వివిధ చిత్రలేఖన పోటీల్లో బహుమతులు అందుకుంది. అవార్డులు.. ప్రశంసలు.. విజయలక్ష్మి ప్రతిభను గుర్తించిన రాష్ట్ర వికలాంగుల సంఘం సహకారంతో రవీంద్ర భారతిలో పలుమార్లు చిత్రలేఖన ప్రదర్శనలు నిర్వహించి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకుంది. త్యాగరాయ గానసభలో ప్రతిభా పురస్కారాలను అందుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ చేపట్టిన ఆన్లైన్ కాంపిటేషన్‌లో వరుసగా మూడేళ్లు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్తో పాటు అవార్డులను గెలుచుకుంది. తెలంగాణ ఐకాన్ 2024, బుల్లితెర అవార్డు, తెలంగాణ సేవారత్న– 2025 వంటి అవార్డులనూ అందుకుంది. ఇప్పటివరకూ సుమారు వందకు పైగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. చిన్ననాటి నుండే.. చిత్రలేఖనం అంటే చిన్ననాటి నుండే ఇష్టం. మా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నా ఎన్నడూ నిరాశపడకుండా కుటుంబ సభ్యుల పోత్సాహంతో ప్రాక్టీస్ చేశా. గిన్నిస్ వరల్డ్ రికార్డు నుంచి గోల్డ్ మెడల్ (Gold Medal) సాధించడం ఆనందాన్నిచ్చింది. అనేక మంది ప్రముఖల ప్రశంసలు పొందాను. – విజయలక్ష్మి, తుర్కపల్లిమూడేళ్ల మోక్ష్ ప్రపంచ రికార్డు జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్స్ ఆత్మకూరి రామారావు స్కూల్లో నర్సరీ చదువుతున్న మోక్ష్ అయాన్ సేవల (Moksh Ayaan Sevala) ప్రపంచ రికార్డు సృష్టించాడు. మూడేళ్ల ఐదు నెలల వయసున్న ఈ చిన్నారి ఇటీవల జరిగిన వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టైటిట్లో భాగంగా అత్యంత వేగంగా పజిల్ సాల్వింగ్‌తో పాటు కలర్ మ్యాచింగ్‌లో అందరి కంటే ముందు నిలిచాడు. 3–5 ఏళ్ల కేటగిరీలో పాల్గొన్న మోక్ష్ కేవలం 11 సెకన్లలోనే ఈ పజిల్‌ను సాల్వ్ చేసి రికార్డ్ బ్రేక్ చేశాడు.పాఠశాలకు చెందిన ప్రీ ప్రైమరీ కో–ఆరినేటర్ విశాల్ అమిన్ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించడం అద్భుతమన్నారు. విద్యార్థి ఘనతను స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలతానాయర్ ప్రశంసించారు. ఈ ఘనత తమ స్కూలుకే గర్వకారణమని, భవిష్యత్తులో ఇలాంటి రికార్డులు మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు. బాలుడికి పాఠశాల నుంచి సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఇలాంటి విద్యార్థులు మిగతా వారికి స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. చదవండి: పక్షులపై ప్రేమతో వేల మైళ్ల ప్రయాణం -
చారిత్రక వేదికపై.. సాంస్కృతిక పరంపర
భారతీయ నాట్యం, సంగీతరీతులను పరిరక్షించడానికి కళారూపాల ప్రదర్శన బాధ్యతను చేపట్టింది పరంపర ఫౌండేషన్. సాంస్కృతిక ప్రదర్శనలను ఆలయాలు, చారిత్రక ప్రదేశాల్లో ‘పరంపర గుడి సంబరాలు’ పేరుతో ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు శశిరెడ్డి, డాక్టర్ శ్రీనగి. చరిత్ర, సంస్కృతి, కళలను మేళవించి ఒక వేదికపై ప్రదర్శిస్తున్నారు. గడచిన పదేళ్ల కార్యక్రమాల్లో భాగంగా నేడు గోల్కొండ కోటలో ప్రదర్శన జరుగుతోంది. భరతనాట్య కళాకారిణి, ఢిల్లీలోని గణేశ నాట్యాలయ డైరెక్టర్ రమా వైద్యనాథన్ ‘నిమగ్న’ రూపకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి‘భరతనాట్యం ఒక సముద్రం. నాట్య గురువులు ఇచి్చన స్ఫూర్తి ఆ లోతులను చూడడానికి ఉపయోగపడింది. సముద్రం వంటి నాట్య సుగంధాన్ని విశ్వవ్యాప్తం చేయాలనుకున్నాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నాట్యముద్రల గొప్పదనాన్ని పరిచయం చేయాలనేదే నా లక్ష్యం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తున్నాను. దేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి భరతనాట్యం మంచి మాధ్యమం. ఆ మాధ్యమమే నన్ను నడిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలివ్వాలని ఉంది. ఫిబ్రవరి 27న వైజాగ్‌లో ప్రదర్శన ఇచ్చాను. ఇప్పుడు హైదరాబాద్ గోల్కొండ కోటలో ప్రదర్శనకు సిద్ధం అవుతున్నాను. మన సంస్కృతి, చరిత్రను రానున్న తరాలకు చేరవేయడానికి మా కళాకారులు ఎంత అవసరమో.. ఈ కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు కూడా అంతే ముఖ్యం. సమాజంలో కళాభిమానులు ఎప్పుడూ ఉంటారు. కళను కళాకారుల నుంచి కళాభిమానులకు ప్రసరింపజేసే బాధ్యతను చేపట్టే వాళ్లు తక్కువ. కళాసాధన, కళాస్వాదన రెండూ మనిíÙని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకెళ్లే ప్రభావవంతమైన మార్గాలు’ అన్నారు రమావైద్యనాథన్.ఇరవై మంది నాట్యకారులతో.. గోల్కొండ కోటలో ప్రదర్శించే ‘నిమగ్న’ రూపకంలో గురు స్తోత్రమ్, కామాక్షి, కాశీ, రఘువీర, రసలీల అనే ఐదు అంశాలుంటాయి. నేను స్వయంగా రూపొందించిన ఈ 90 రూపకంలో నాతోపాటు మరో ఇరవై మంది నాట్యకారులు పాల్గొంటారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నాట్యప్రదర్శనలిచి్చన రమావైద్యనాథన్.. సంగీత నాటక అకాడమీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, జోనల్ సెంటర్స్, స్టేట్ అకాడమీలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రదర్శనలిస్తారు. పాటా్నలో జరిగే రాజ్‌గిర్ మహోత్సవ్, త్రివేండ్రంలో సూర్య ఫెస్టివల్, కోణార్క్ ఫెస్టివల్, ఖజురహో ఫెస్టివల్ భరతనాట్యపు అడుగులతో పరిపూర్ణతనందించారు.అవార్డులు⇒ 2017, కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ అవార్డు ⇒ 2015, మధ్య ప్రదేశ్ ప్రభుత్వ కుమార్ గంధవ్ పురస్కారం ⇒ 2013, కేరళ ప్రభుత్వ కళాశ్రీ పురస్కారం ⇒ 2011, తమిళనాడు ప్రభుత్వ కలైమామణి అవార్డు ⇒ 1999, శ్రీలంక డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ అఫైర్స్ ‘భారత రత్న’హైదరాబాద్కురెండోసారి! గతంలో ఒకసారి హైదరాబాద్‌లో ప్రదర్శన ఇచ్చాను. చారిత్రక ప్రదేశం గోల్కొండలో ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ అందమైన నగరం. నాకు చాలా నచి్చంది. అందమైన సరస్సులు, పార్కులున్నాయి. ఆధునికతకు సంస్కృతి, కళలను అద్దితే అదే హైదరాబాద్ నగరం. – రమా వైద్యనాథన్ -
Damerla Ramarao అద్వితీయ చిత్రకళా తపస్వి
తెలుగు జాతి సాంస్కృతిక పునరుజ్జీవనానికి అతి పిన్న వయసులో విశిష్టమైన కృషి చేసిన తొలి కళా తపస్వి దామెర్ల రామారావు. బాల్యం నుంచే చిత్రకళ పట్ల నెలకొన్న గాఢమైన అభినివేశం ఆయన్ని అవిశ్రాంత కళా పిపాసిగా చేసింది. 1897, మార్చి 8న జన్మించిన రామారావు రెండు పదుల వయసు నిండకుండానే ముంబైలోని ‘జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’లో చేరి చిత్రకళలో నైపుణ్యం సంపాదించారు. రాజమండ్రి కళాశాలకు ప్రిన్సిపాల్‌గా చేసిన ఆంగ్ల రచయిత ఆస్వాల్డ్ కూల్డ్రేకు రామారావు అంటే ఎంతో అభిమానం. అందుకే తాను రాసిన ‘సౌత్ ఇండియన్ అవర్’ అనే గ్రంథాన్ని తెలుగులో గొప్ప రచయితలైన కవికొండల వెంకటరావు, అడివి బాపిరాజులతో బాటుగా దామెర్ల రామారావు గారికి కూడా అంకిత మిచ్చారు. ప్రఖ్యాత కవి పండితులు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి దామెర్లవారి గురించి ఇలా అన్నారు: ‘జీవముల వోసి, బొమ్మల జేసెనొకడు/బొమ్మలు గీసి జీవమును వోసేనొకడు/ రాముడాతడు, దామెర్ల రాము డితడు/ లేవు కాలావధులు చిత్ర లీలలందు.’ రవీంద్రనాథ్ టాగోర్‌ను కలిసిన పది నిమిషాల్లో విశ్వకవి చిత్రపటాన్ని గీసిచ్చారు. రామారావు ప్రతిభకు ఆశ్చర్యపోయిన టాగోర్ ‘ప్రపంచంలోకెల్లా గొప్ప చిత్రకరుడివి కాగలవు’ అని దీవించారట.అప్పటి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ రామారావు ‘తూర్పు కనుమల్లో గోదావరి’ చిత్రాన్ని చూసి ముగ్ధుడై అప్పటికప్పుడు ఆ చిత్రం కొనేయడమే కాక, ‘స్వదేశీ ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను స్వదేశీ చిత్రాన్ని కొంటు న్నాను చూడండి’ అని చమత్కరించారట. అశ్లీలతకు తావులేకుండా భారతీయ మహిళని తొలిసారిగా నగ్నంగా చిత్రించిన రామారావు నవ్యాంధ్ర చిత్రకళా స్థాపకులు. 1922లో రాజమండ్రిలో ‘ఆంధ్ర సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్’ పేరిట చిత్రకళాశాలను స్థాపించారు. అప్పుడే ‘సత్యవాణి’ అనే చిత్రకారిణిని వివాహం చేసుకున్నారు. రామారావు చిత్రాలకు ఆయన భార్య సత్యవాణిగారే ‘మోడల్’గా ఉండేవారు. స్వదేశంలోనే కాక పారిస్, లండన్, టోరంటో వంటి అంతర్జాతీయ ప్రదర్శనల్లో కూడా రామారావు చిత్రాలు ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు పొందాయ్. ఇంతటి ప్రతిభావంతుడు 28 ఏళ్ళ అతి చిన్న వయసులోనే గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ మశూచి వ్యాధికి గురై 1925, ఫిబ్రవరి 6న అకాల మరణం చెందారు. రామారావు చిత్రించిన ‘సిద్ధార్థ రాగోదయం’, ‘పుష్పాలంకరణ’, ‘నంది పూజ’, ‘గోపికాకృష్ణ’, ‘బావి వద్ద’, ‘అజంత’, ‘ఎల్లోరా’, ‘పట్టిసీమ’, ‘మెయిడ్స్ ఆఫ్ కథియావాడ్’... వంటి అత్యద్భుత కళాఖండాల్ని ఎన్నింటి గురించి చెప్పుకున్నా తక్కువే. రామారావు స్మృతిలో రాజమండ్రిలో చిత్రకళా మందిరాన్ని, శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1925 లోనే ఆ రెంటినీ సందర్శించిన మహాత్మా గాంధీజీ ఆ చిత్రాలని చూసి ముగ్ధులయ్యారు. ప్రస్తుతం రాజమండ్రిలోని గోదావరి స్టేషన్ వద్ద ఉన్న ‘దామెర్ల రామారావు మెమోరియల్ ఆర్ట్ గ్యాలరీలో ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. అవన్నీ తెలుగువారు సంరక్షించు కోవలసిన విశేషమైన కళా సంపదలే. – గౌరవ్ ‘ సాంస్కృతిక కార్యకర్త (నేడు దామెర్ల రామారావు శతవర్ధంతి) -
నన్ను అనాథగా చంపేస్తారా? పావలా శ్యామల ఆవేదన
-
ఆగర్భ శత్రువులం కాదు.. భూగర్భవాసులం : అబ్బురపర్చే వెంకటేష్ చిత్రాలు
శాలు, జాతులు, మతాలు, కులాల పేరిట విద్వేషాల కుంపట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో మానవులందరూ సహోదరులేనని, అందరి అమ్మఒడి భూగర్భమేననే విషయాన్ని గుర్తు చేస్తూ ఓ అద్భుత చిత్రాన్ని రూపొందించారు నగరవాసి. త్వరలోనే ఆ చిత్రాన్ని అంతర్జాతీయంగా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ చిత్రకారుడు వెంకటేష్ కందునూరి(35) తన చిత్రం వివరాలను సాక్షితో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో మాది మహబూబ్‌నగర్ జిల్లా.. ప్రస్తుతం నగరంలోని చైతన్యపురిలో ఉంటున్నా.. చిన్నప్పటి నుంచీ కళల పట్ల ఉన్న ఆసక్తితో నగరంలోని జేఎన్టీయూలో బీఎఫ్ఏ చేసి ప్రస్తుతం ఫ్రీలాన్స్ ఆరి్టస్ట్‌గా పనిచేస్తున్నాను. తరచూ సామాజిక అంశాలపై చిత్రాలను గీయడం నాకు అలవాటు. అదేవిధంగా ఈ ఆర్ట్ వర్క్ రూపొందించాను. భూమి.. బలిమి.. ఈ చిత్రంలో ప్రధానంగా భూమి, మనుషులు, జెండాలు, తుపాకులు అనే నాలుగు అంశాలు కనిపిస్తాయి. ఒక మహిళ తన గర్భంలో భూమిని మోస్తూ ఉంటే, ఆ భూమి లోపల తుపాకీతో కాలుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తుపాకీ భూమి లోపల దించి ఉండటం వల్ల ఆ మట్టిని తాకిన తుపాకీకి ఉన్న చెక్క జీవం పోసుకుని, చిగురు ఆకులతో కనిపిస్తుంది. మరోవైపు వివిధ రకాల జెండాలు, తుపాకులను చేతబట్టిన ప్రజలు యుద్ధ వాతావరణాన్ని ప్రతిబింబిస్తారు. ‘ఓ మనిషి నువ్వు నన్ను ఎన్ని రకాలుగా చిత్రవధ చేసినా నేను మాత్రం చివరి వరకూ నిన్ను కాపాడుతూనే నీకు జీవాన్ని పోస్తూనే ఉంటా’ అని చెబుతున్న భూమి విలువ గుర్తించమనేదే ఈ చిత్రంలోని అంతరార్థం. ఆరు అడుగుల పొడవు, ఆరున్నర అడుగుల వెడల్పు కలిగిన ఈ భారీ చిత్రాన్ని దేశ రాష్ట్రపతితో ప్రారంభించి, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించాలని, అలాగే ఐక్యరాజ్యసమితి వరకు చేర్చాలని ప్రయత్నిస్తున్నాను అన్నారాయన.ఆగర్భ శత్రువులం కాదు.. భూగర్భవాసులం జాతి కుల మత విద్వేషాలు వదిలితేనే బలం ఆలోచింపజేసే సందేశం అందిస్తున్న అద్భుత చిత్రం అంతర్జాతీయంగా ప్రదర్శించేందుకు సన్నాహాలు -
వెయిటర్గానే ఉండిపోతానేమో అనుకున్నాడు...కట్ చేస్తే..!
అవార్డ్ విజేత, చిత్రకారుడు దీనా సో ఓతేహ్ నీడ– కాంతిలో విలక్షణతను చూపడంలో మాస్టర్. యునైటెడ్ స్టేట్స్లో ఉండే ఈ కళాకారుడి చిత్రాలు మిగతా వాటితో పోల్చితే చాలా భిన్నంగా ఉంటాయి. చీకటి నుండి వెలువడే ప్రకాశవంతమైన చిత్రాలను మన కళ్లకు కడతాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటాన్ని ‘చిత్రం’గా చూపుతాడు. గురువెవ్వరూ లేకుండానే తన ఊహల్లో నుండి పుట్టుకువచ్చిన కళ గురించి వివరిస్తుంటే వినేవారు చాలా అబ్బురంగా చూస్తారు. ‘‘మా అమ్మ చిన్నప్పటి నుండి నాలో కళాత్మక అభిరుచిని గుర్తించింది. దానిని పెంపొందించడానికి ప్రాధాన్యతను ఇచ్చింది. నేను మంచి కళాకారుడిగా మారుతానని ముందే అనుకున్నాను. కళను వృత్తిగా కొనసాగించాలనే ఆలోచన చాలా ఆలస్యంగా వచ్చింది. నాకు 12 ఏళ్ల వయసులో నా కుటుంబం యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చింది. నాటి పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. మా అమ్మనాన్నలు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో మాకు సంబంధించిన న్యాయపరమైన పత్రాలన్నీ నాన్న తనతో తీసుకెళ్లిపోయారు. సరైన పత్రాలు లేకపోవడంతో 18 ఏళ్ల వయసులో చదవుకు స్కాలర్షిప్కు అర్హత కోల్పోయాను. దీంతో ఎనిమిదేళ్లు వెయిటర్‌గా పనిచేశాను. అప్పుడు నా కెరీర్ వెయిటర్ అనే అనుకున్నాను. అనిశ్చితి నుంచి నైపుణ్యాలుమొదట నేను ఫైన్ ఆర్ట్ ఆర్టిస్ట్‌ను కాదు. సరైన పత్రాలు లేక΄ోవడం వల్ల వలసదారునిగా ఎనిమిదేళ్లు అనిశ్చితిని ఎదుర్కొన్నాను. ఇష్టపడే పని చేస్తున్నప్పుడే స్థిరత్వం లభించడం ప్రారంభమైంది. నాకు నేను స్వయంగా ఇలస్ట్రేషన్స్ వేసేవాణ్ణి. ఈ సాధన ద్వారా ఇలస్ట్రేషన్ నా నైపుణ్యాలు పెరిగాయి. అది ఎంతగా అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్‌లో డిగ్రీ సాధించాను. మాస్టర్స్ ప్రోగ్రామ్ద్వారా స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్‌లో మరింత అధ్యయనం సాధ్యమైంది. అప్పుడే ఇలస్ట్రేషన్ నాకు సరిగ్గా సరి΄ోతుందనిపించింది. కథలు చెప్పడం, నేర్చుకోవడం, సమస్యను పరిష్కరించడం, సృష్టించడం... ఇలా ప్రతీది నా మనో వికాసానికి, వృద్ధికి ఇలస్ట్రేషన్ ఆర్ట్ కొత్త తలుపులు తెరిచింది. చివరకు నాది అయిన మార్గంలో ఉన్నట్టు అనిపించింది. ఇదంతా సాధ్యమైంది మా అమ్మ ద్వారా. ఆమే నన్ను నేను గర్వపడేలా చేసింది.నిశ్శబ్దం నుంచి...పరధ్యానాన్ని నివారించడానికి సాధారణంగా స్కెచ్ వేయడం ప్రారంభిస్తాను. కొన్నిసార్లు తెల్లవారుజామున 4–5 గంటల సమయాన్ని ఎంచుకుంటాను. ఆ నిశ్శబ్ద సమయం, ప్రపంచం మేల్కొనే ముందు నేను చాలా సృజనాత్మకంగా ఉంటాను. పరధ్యానాల నుండి విముక్తి పొందుతాను. ఏదైనా ‘రంగు’లోనే ఆలోచిస్తాను. ఎందుకంటే అది ఏదో ఒక చిన్న సృష్టికి కారణం అవుతుంది. అక్కడ నుంచి నా స్కెచ్లకు విస్తృతంగా పని దొరుకుతుంది. ఆరిస్ట్ మార్షల్ అరిస్కాన్ ఎప్పుడూ ఒక మాట చెబుతాడు ‘మీకు తెలిసిన వాటిని గీయండి’ అని. ఆ పదాన్ని అర్ధం చేసుకోవడానికి నాకు సమయం పట్టింది. కానీ, కాలక్రమేణా అది స్పష్టమైంది. కాంతి–చీకటి మధ్య అంతర్గత పోరాటం నాకు తెలిసింది. నేను నా జీవితంలో చాలా చీకటి కాలాలను ఎదుర్కొన్నాను. పోరాటాలకు మించిన అందం వాటిలోనే ఉందని నా ప్రగాఢ నమ్మకం. ఒక అంశంపై తగినంత అవగాహన లేకుండా పని మొదలుపెడితే ఆందోళన కలుగుతుంది. అయితే, ఆ క్షణంలో నేను నా అహం, ఊహాత్మక తీర్పులను, ఫెయిల్ అవుతానేమో అనే భయాలను వదిలేస్తూ ఆర్ట్‌లోకి ప్రయాణిస్తాను’’ అని వివరిస్తాడు ఈ చిత్రకారుడు View this post on Instagram A post shared by Nautilus Magazine (@nautilusmag) -
వాహ్.. వ్యాక్స్ మినియేచర్
ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు.. తనలోని ప్రతిభకు పదునుపెట్టి చిన్నప్పుడు హాబీగా వేస్తున్న ఆర్ట్‌ని కొంగొత్త రీతిలో చూపెడుతూ తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఆర్ట్‌లో రాణించడానికి శిక్షణ లేకపోయినా తన సృజనాత్మకతను జోడించి ప్రత్యేక డిజైన్స్ చేస్తూ సెలిబ్రిటీస్ని సైతం ఆకట్టుకుంటున్నాడు. ఆయనే నగరానికి చెందిన డిజిటల్ వ్యాక్స్ ఆర్టిస్ట్ నరేష్ రావులపల్లి.. తన ఆర్ట్ విషయాలను సాక్షితో పంచుకున్నారు.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. నాకు అసలు ఆర్టిస్ట్ అవ్వాలనే ఆలోచనే లేదు.. ఏదైనా నచి్చన బొమ్మ కనబడితే వాటిని అలాగే వచ్చేలా గీసేవాడిని. ఆటోలు, బస్సులు, చెట్లు, జంతువులు, పక్షులు ఇలా ఏది కనబడితే వాటిని పేపర్ మీద పెట్టేవాడిని. నేను కేపీహెచ్బీలో ఉంటాను. స్కూలింగ్ సమయంలో పెయింటింగ్‌లో బహుమతులు వచ్చేవి. నా బొమ్మలు చూసి అందరూ మెచ్చుకునేవారు. కానీ తనలోని ప్రవృత్తి అయిన ఆర్ట్‌ని అలాగే అప్పుడప్పుడూ పదును పెడుతూ సివిల్ ఇంజినీరింగ్ చేసి జాబ్ చేయడం మొదలుపెట్టాను. సోషల్‌మీడియాతోనే గుర్తింపు.. నేను చేసిన డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ బొమ్మలను ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేసేవాడిని. అంతేకాకుండా తెలిసిన వారు కూడా నా ఆర్ట్ గురించి చెప్పేవారు. అలా ఆర్డర్స్ వచ్చేవి.. నా ఆర్ట్స్‌కి డబ్బుతోపాటు వినియోగదారుల ఆదరణ మరింత సంతోషాన్నిచ్చేది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్ గెటప్స్‌ని చిన్నపిల్లలుగా నడిపించే రాజమౌళిగా ఆర్ట్ గీశాను. అప్పటికీ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కాకపోవడంతో నా ఆర్ట్‌కి సోషల్‌మీడియా చాలా హైప్ వచి్చంది. చిత్ర అఫీషియల్ టీం ఆ పెయింటింగ్‌ని తమ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చాలా గర్వంగా అనిపించింది. ఆ ఇన్స్పిరేషన్లో కొత్త కాన్సెప్ట్స్‌ని చేయడం మొదలుపెట్టాను.డిజిటల్ ఆర్ట్స్.. సోషల్ మీడియా, డిజిటలైజేషన్ సరికొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో డిజిటల్ ఆర్ట్స్‌నే చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది. అందరిలా కాకుండా కొత్తగా ట్రై చేద్దామని ఏడాది కష్టపడి డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్‌ను నేర్చుకున్నాను. నా స్పేహితుడు మినియేచర్ (చిన్నచిన్న బొమ్మలు) కొనడానికి షాప్‌కి తీసుకెళ్ళాడు. చిన్నచిన్న బొమ్మలే ఐదువేల, పదివేలు, ఇంకా ఎక్కువ ధర ఉండటం చూసి షాక్ అయ్యాను. అప్పుడే నాలో కొత్త ఆలోచన మొదలైంది. మినియేచర్ బొమ్మల్లా కార్టూన్ ఫార్మాట్లో ఫినిషింగ్‌తో డిజిటల్ వ్యాక్స్ పెయింటింగ్స్ వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచి్చంది. వెంటనే ఆచరణలో పెట్టాను. -
క్రేజీ.. డీజే..
అర్ధరాత్రి సమయం..చిమ్మ చీకట్లని. పట్ట పగలుగా మార్చే రంగురంగుల విద్యుత్ కాంతుల్లో.. ఓ వైపు ఛీర్స్‌తో హుషారు.. మరోవైపు చిందుల జోరు.. ఆ సమయంలో తోడు లేకుండా అమ్మాయిలు బయటకు వెళ్లడమే సరికాదని నొక్కి వక్కాణించే సంప్రదాయ వాదుల చెవులకు చిల్లులు పడే సంగీతంతో కదం తొక్కుతున్నారు ఆధునిక యువతులు. డీజేలుగా.. మేల్ డామినేషన్‌కు గండికొడుతూ శరవేగంగా ముందుకు దూసుకొస్తున్నారు. ‘మనసుకు నచ్చిన సంగీతం.. వయసుకు తగ్గ వినోదం.. మంచి ఫ్రెండ్స్. ఇన్ని అందించే రంగాన్ని వదిలేసి సాదా సీదా ఉద్యోగం ఎందుకు చేయాలి?’ అని ప్రశ్నింస్తున్నారు అఖిల. ఉద్యోగం అంటే మంచి ఆదాయం వస్తుంది కదా..అంటే..! ‘నేను ఎంచుకున్న కెరీర్లో అంతకన్నా ఎక్కువ సంపాదనే ఇప్పుడు వస్తుంది’ అంటూ స్పష్టం చేశారు. సాయంత్రం ఆరు దాకా అఖిల.. ఆరు దాటాక డీజే బ్లాక్.ఎవరూ డేర్ చేయని రోజుల్లోనే.. దాదాపు పదేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చారు లీనా. నగరంలోని సికింద్రాబాద్‌లో నివసించే ఈ సింథీ యువతి.. డిగ్రీ పూర్తి చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా చేశారు. అనంతరం కొన్ని షోస్ చేశారు.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆ తర్వాత ఫుల్‌టైమ్ డీజేయింగ్ను ఎంచుకున్నారు. ‘ఏవీ మనసుకు నచ్చలేదు. అదే నా కెరీర్‌ను ఇటు మార్చింది’ అంటూ చెప్పారు డీజే లీనా. ఫ్రీలాన్స్ డీజేగా సిటీలోని సగం పైగా క్లబ్స్‌లో ఇప్పటికే తన మ్యూజిక్ వినిపించానంటున్న లీనా.. బాలీవుడ్ అంటే తనకు ప్రేమ అనీ, అందుకే ఆ సంగీతాన్ని ప్లే చేయడానికి తాను ఇష్టపడతానని అంటున్నారు. అమ్మాయిలు ఈ రంగంలోకి ఎక్కువగా రాకపోవడానికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరకకపోవడమే కారణమంటున్నారు లీనా.. తాను కూడా అతి కష్టం మీద కుటుంబ సభ్యులను ఒప్పించగలిగానని చెబుతున్నారు.ట్రెడిషనల్ ఫ్యామిలీలో.. ట్రెండీగా.. ‘నేను ఇక్ఫాయ్లో బీబీఏ పూర్తి చేశాను. సొంతంగా బిజినెస్ చేయాలనేది నా ఆలోచన. అయితే చిన్నప్పటి నుంచీ డీజేయింగ్ అంటే ఇష్టం. ఫ్రెండ్స్‌తో క్లబ్స్‌కి వెళ్లినప్పుడు కేవలం డీజే మ్యూజిక్ కోసమే వెళ్లేదాన్ని’ అంటూ గుర్తు చేసుకున్నారు అఖిల. మహబూబ్ నగర్‌కు చెందిన ఓ పూర్తి సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అఖిల.. 2018లో డీజే స్కూల్లో చేరాలని నిర్ణయించున్నారు. అప్పుడు ఇంట్లో వాళ్ల నుంచి చెప్పుకోదగ్గ ప్రతిఘటననే ఎదుర్కొన్నారు. ‘ఫ్యామిలీ వద్దు అన్నప్పటికీ మనసు మాటే విన్నాను. ఒక ప్రోగ్రామ్‌కి కేవలం రూ.1000తో ప్రారంభించి.. ఇప్పుడు అంతకు పదింతలు తీసుకునే స్థాయికి చేరాను’ అంటూ సగర్వంగా చెప్పారామె. అమ్మాయిల భద్రత విషయం గురించి మాట్లాడినప్పుడు.. ‘మా చుట్టూ బౌన్సర్స్ ఉంటారు. ఇప్పటిదాకా చిన్న చేదు అనుభవం కూడా నాకు ఎదురుకాలేదు’ అంటూ చెప్పారామె. భవిష్యత్తులోనూ డీజేగా కొనసాగుతానని, మరిన్ని టాప్ క్లబ్స్‌లో తన మ్యూజిక్‌ని వినిపిస్తానని బాలీవుడ్ ట్య్రాక్స్కి పేరొందిన ఈ డీజే బ్లాక్ చెబుతున్నారు.‘ఫ్లో లో.. ‘జో’రుగా.. ‘మా నాన్న వాళ్లది వరంగల్. అయితే నేను నార్త్‌లోనే పెరిగాను. ప్రస్తుతం సిటీలో సెటిలయ్యా’ అంటూ చెప్పారు ఫ్లోజో. డిగ్రీ పూర్తి చేశాక.. కొన్ని కార్పొరేట్ ఉద్యోగాలు చేశా. అయితే చిన్నప్పటి నుంచీ సంగీతం పై ఉన్న ఇష్టంతో డీజేసూ్కల్లో చేరి కోర్సు పూర్తి చేసి డీజేగా మారాను అంటూ చెప్పారు ఫ్లోజో. ప్రస్తుతం నగరంలో టాప్ డీజేల్లో ఒకరుగా ఉన్న ఈ అమ్మాయి తొలుత లిక్విడ్స్‌లో రెసిడెంట్ డీజేగా ప్లే చేశానని, కొంత కాలం తర్వాత ఫ్రీలాన్స్ డీజేగా మారి, పలు అవార్డ్స్ కూడా అందుకున్నానని వివరించారు. థాయ్‌ల్యాండ్ వంటి అంతర్జాతీయ వేదికలపైనా, గోవా వంటి పార్టీ సిటీల్లోనూ ప్లే చేశానంటున్న ఫ్లోజోకి తన పేరు స్టైలి‹Ùగా ఉండడంతో మార్చుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. ఈ కెరీర్లో అటు ఆనందం, ఇటు ఆదాయం రెండూ బాగుంటాయంటున్న ఫ్లోజో.. ఆరేడేళ్లలోనే కారు, ఫ్లాట్ కొనగలిగానని సంతోషంగా చెప్పారు. ఇదీ చదవండి: గేలి చేసినచోటే గెలిచి చూపించిన మగువలు! -
రూ.1,000 కోట్ల పెయింటింగ్!
బెల్జియం సర్రియలిస్ట్ ఆర్టిస్టు రెన్ మార్గిట్ చేతినుంచి జాలువారిన ఈ ప్రఖ్యాత పెయింటింగ్ వేలం రికార్డులను బద్దలు కొట్టింది. న్యూయార్క్‌లో క్రిస్టీస్ నిర్వహించిన తాజా వేలంలో ఏకంగా రూ.1,021 కోట్లు (12.1 కోట్ల డాలర్లు) పలికి సంచలనం సృష్టించింది. అధివాస్తవికతను చిత్రించే పెయింటింగుల్లో అత్యధిక ధర పలికిన రికార్డును సొంతం చేసుకుంది. దీనికి 9.5 కోట్ల డాలర్ల దాకా పలకవచ్చని నిర్వహకులు అంచనా వేస్తే వాటిని కూడా అధిగమించేసింది! 1954కు చెందిన ఈ పెయింటింగ్ అధివాస్తవికతకు సంబంధించి అత్యుత్తమ వ్యక్తీకరణగా విమర్శకుల ప్రశంసలు పొందింది. మార్గిట్ వేసిన 27 ప్రఖ్యాత పెయింటింగ్‌ల కలెక్షన్ ‘ద ఎంపైర్ ఆఫ్ లైట్’లో దీన్ని మణిపూసగా చెబుతారు.వీధి దీపపు వెలుగుల్లో ఇల్లు, దీపంతో సహా నీటిలో దాని ప్రతిబింబం, ముందూ వెనకా చెట్లు, పైన నీలాకాశం, తెల్లని మబ్బులతో చూసేందుకు సాదాసీదాగా కన్పించే ఈ పెయింటింగ్ వాస్తవానికి అత్యున్నత స్థాయి మారి్మకతకు అద్దం పడుతుందని కళాప్రియులు చెబుతారు. మార్గిట్ వేసిన మరో రెండు పెయింటింగులు కూడా కోటి, 37 లక్షల డాలర్ల చొప్పున అమ్ముడయ్యాయి. -
కలర్ ఫుల్
సరస్సులో నుంచి తీసుకొచ్చిన తెల్లటి కలువను చూసుకుంటున్న యువతులు, ప్రకృతిలో పూసిన పూలన్నింటినీ తనలో ఇముడ్చుకున్న ఫ్లవర్‌పాట్, కొండల బారుల మధ్య వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న నది, విశాలమైన సరస్సుకు ఈ ఒడ్డున రంగురంగుల పూలరెమ్మతోపాటు ఆవలి ఒడ్డున సుదూరంగా కనిపించీ కనిపించకుండా ఉన్న కొబ్బరిచెట్లు, పార్కులో చక్కగా వరుసగా విరగబూసిన చెట్లు, కొండలమీద నుంచి నేలకు దూకుతూ కింద ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తున్న తెల్లటి జలధారలు, కలర్ పాలెట్‌లోని రంగులన్నింటినీ వంతుల వారీగా అద్దుకున్న చెట్లు... ఏ బొమ్మ చూసినా ప్రకృతికి ప్రతిబింబంగానే కనిపిస్తుంది. హేమనళిని చిత్రాలను చూస్తే ప్రకృతిని ఆవిష్కరించడానికే ఆమె కుంచె పట్టుకుందా అనిపిస్తుంది.హైదరాబాద్‌కు చెందిన హేమనళినీ రెడ్డి ఇలస్ట్రేటర్, ఫొటోగ్రాఫర్, రైటర్ కూడా. ఆర్టిస్టుగా బిజీగా ఉన్న హేమనళిని సైన్స్ స్టూడెంట్. ఐఐటీ బాంబేలో కోర్సు పూర్తయిన తరవాత మైక్రో బయాలజీ లెక్చరర్‌గా కెరీర్ మొదలు పెట్టారామె. భర్త ఉద్యోగరీత్యా యూఎస్‌లో అడుగుపెట్టిన హేమ కెరీర్లో ఓ విరామం. ఆ విరామం ఆమెను ప్రకృతి ప్రేమికురాలిని చేసింది. అత్యంత చల్లని వాతావరణంలో చెట్ల ఆకులు కూడా పూలలాగ గులాబీరంగును సంతరించుకోవడం వంటి ఆశ్చర్యకరమైన మార్పులు ఆమెను మళ్లీ కుంచె పట్టుకునేలా చేశాయి.కుంచె కవనంఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా, చింతలపూడి సమీపంలోని పోతునూరు మాది. గోదావరి జిల్లాల్లో నేను చూసిన ప్రకృతి సౌందర్యం ఒక పార్శ్వం అయితే యూఎస్‌లో చూసిన వైవిధ్యత మరో పార్శ్వం. నాకు ఫొటోలు తీయడం కూడా హాబీ. నా మనసుకు నచ్చిన ఒక్కో ప్రకృతి దృశ్యాన్ని ఫొటో తీసుకోవడం, ఆ చిత్రాన్ని రంగుల్లో ఆవిష్కరించడమే నా లైఫ్‌గా మారింది. సైన్స్ స్టూడెంట్‌గా జీవం–జీవితం నాకిష్టమైన అంశాలు. దాంతో నా చిత్రాలు ప్రకృతి–జీవితం ఇతివృత్తాలుగానే సాగుతున్నాయి. నా చిన్నప్పుడు ఎస్సే రైటింగ్‌తోపాటు రంగోలీలో బహుమతులందుకున్నాను. బొమ్మలు వేయడంలో పెద్ద ప్రావీణ్యం లేదు కానీ వేసేదాన్ని. పై చదువుల బిజీలో పడి వదిలేసిన కుంచెను అమెరికాలో పట్టుకున్నాను. పచ్చదనానికి చిరునామా అయిన మనదేశంలో చెట్లు అన్ని షేడ్లలో ఉండవు. అక్కడి ప్రకృతి వైవిధ్యం నన్ను ముగ్ధురాలిని చేసింది. వాతావరణ మార్పులకు అనుగుణంగా చెట్లు కొత్త రంగులను సంతరించుకోవడం, మనదేశంలో చూడని అనేక షేడ్లను అక్కడి చెట్లలో చూశాను. విదేశాల్లో ఉన్న ఐదేళ్లలో అనేక ఎగ్జిబిషన్లలో పాల్గొన్నాను. యూఎస్‌లో షికాగో, మాసాచుసెట్స్, మిషిగన్తోపాటు సింగపూర్, అబుదాబి, దుబాయ్‌లలో చిత్రాలను ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా కుంచెను వదల్లేదు.చిత్రం... అందమైన మాధ్యమంసామాజికాంశాలను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో కళ్లకు కట్టడానికి చిత్రం గొప్ప మాధ్యమం. సమాజాన్ని చైతన్యవంతం చేయగల శక్తి ఆర్టిస్ట్‌కి ఉంటుంది. చిత్రాలతో చారిటీ షోలు నిర్వహించి పేదపిల్లలకు సహాయం చేయవచ్చు. ఆర్టిస్టులు టెక్నాలజీతోపాటు ఎదుగుతూ కళకు సొబగులద్దాలి. తమ కళను విశ్వవ్యాప్తం చేసుకోవాలి. ఈ తరంలో సోషల్‌మీడియా అందుకు సరైన వేదిక. ఆన్లైన్ వేదికగా నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పోటీలో వారిచ్చిన సమయంలోనే బొమ్మ పూర్తి చేసి అవార్డు అందుకోగలిగాను. బాంబే ఆర్ట్ సొసైటీ నిర్వహించిన ‘కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, 75 ఇయర్స్ ఆఫ్ ఆర్ట్’ ఆన్లైన్ ఎగ్జిబిషన్ ద్వారా నా చిత్రాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇక సాహిత్యం పట్ల ఆసక్తి కొద్దీ బాలాంత్రపు వెంకటరమణ గారి రచనలకు వేసిన చిత్రాలు ఆర్టిస్ట్‌గా నాకు పరిపూర్ణతను తెచ్చాయనిపించింది. ఇంటర్నేషనల్ ‘కళారత్నం’ మహిళా ప్రతిభా పురస్కారం, విశిష్ట కళారత్న వంటి గుర్తింపులనెన్నింటినో అందుకున్నాను. అన్నింటినీ మించిన ఆనందం... వడ్డాది పాపయ్య, బాపు వంటి మహోన్నత చిత్రకారుల గురించి వెలువరించిన ‘ఆర్ట్ ఆఫ్ ఏపీ’ పుస్తకంలో నాకు చోటు దక్కడం’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆర్టిస్ట్ హేమ నళిని.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కళ ద్వారా ఆరోగ్య అక్ష్యరాస్యత..!
వైద్య సంరక్షణలో కళను నింపడం ద్వారా ప్రజలలో ఆరోగ్య అక్షరాస్యతను పెంచడానికి ఓ కొత్త ఒరవడిని సృష్టించారు కళాకారులు. తమ సృజనాత్మక ఆలోచనల ద్వారా ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించారు. పుణెలో జరిగిన ఈ హెల్త్ ఆర్ట్ కార్యక్రమం ఎంతో మందిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తుంది.పాయిజన్ అండ్ యాంటి డోట్’ పెయింటింగ్ ద్వారా కళాకారుడు సాగర్ కాంబ్లే కొంకణ్ ప్రాంతంలోని కఠినమైన వాస్తవాలను చిత్రించాడు. ఈ ప్రాంతంలో వైద్య సంరక్షణ చాలా తక్కువగా ఉండటం, తేలు కుట్టిన చికిత్సపై పరిశోధనలో ప్రసిద్ధి చెందిన వైద్యుడు, పద్మశ్రీ డాక్టర్ హిమ్మత్రావు బావస్కర్ ఎలా ప్రసిద్ది చెందాడు, ప్రాణాలను ఎలా కాపాడారు? అనేది పెయింటింగ్స్ ద్వారా చూపారు.పోషకాహార లోపం... ఓ చిత్రణ‘ఎ టేల్ ఆఫ్ డ్యూయల్ బర్డెన్’ అనే తన కళాకృతిలో జరా షేక్ ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సి.ఎస్ యాజ్నిక్ పరిశోధనను దృశ్యంగా చూపారు. ఇది పోషకాహార లోపం– రెట్టింపు భారం‘ గురించి నొక్కి చెబుతుంది. పోషకాహార లోపం చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఊబకాయం, మధుమేహం పెరగకుండా నిరోధించడానికి, పునరుత్పత్తి సమయాలలో మహిళలకు సాధికారత, మద్దతు అవసరం గురించి తెలియజేస్తుంది. ‘రంగ్ దే నీలా’ అనే ఈ వినూత్న ప్రాజెక్ట్ ‘హీలింగ్ జర్నీస్’లో ఒక ప్రత్యేక భాగం. ఆర్ట్ మీట్స్ హెల్త్ అనే క్యాప్షన్‌తో ఆరోగ్య విద్యలో చొరవ చూపుతుంది. రంగ్ దే నీలా వ్యవస్థాపకుడు అమీ షా వైద్య నిపుణుల సహకారంతో 100 కళాకృతుల సేకరణ ద్వారా ఈ కథలకు జీవం పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వర్క్షాప్స్కళ ద్వారా ఆరోగ్య అక్షరాస్యత, శ్రేయస్సు భావాన్ని పెంపొందించడానికి అమి షా ‘రంగ్ దే నీలా‘ కార్యక్రమాన్ని 2022లో ప్రారంభించారు. మొదట ‘రంగ్ దే నీలా’ గ్రామీణ వర్క్‌షాప్‌లతో ప్రారంభమైంది. ఇక్కడ కళాకారులు, వైద్యులు కళను రూపొందించడానికి సహకరించారు. వర్క్‌షాప్‌లలో పాల్గొన్న కళాకారులు తమ ఆరోగ్య సమస్యలను వైద్యులతో చర్చించారు. వైద్య నిపుణులు మాత్రం భావోద్వేగాలు నింపుకున్న కళాకారులుగా కొత్త ప్రశంసలను ΄పొందారు.ర్యాంప్‌పై నడకఈ సందర్భంగా నిర్వహించిన ‘వాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్‘లో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకున్న రోగులు వైద్యులతోపాటు ర్యాంప్‌పై నడిచారు. చీర సంప్రదాయాన్ని హైలైట్ చేయడమే కాకుండా ఒక ముఖ్యమైన ఆరోగ్య సందేశాన్ని కూడా అందించారు. మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, సమస్యలను నివారించడం, వైకల్యాలు ఉన్నప్పటికీ బాగా జీవించడం, ఆరోగ్య సమాచారాన్ని తెలియజేయడానికి తోలుబొమ్మలాటనూ ప్రదర్శించారు.వైద్యులను ప్రోత్సహించడానికి...హీలింగ్ జర్నీ ద్వారా వివిధ రోగాల నుంచి కోలుకున్న 100 స్ఫూర్తిదాయకమైన కథనాల సమాహారాన్ని అందించారు. ‘గుండె జబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్, ఇతర అనారోగ్యాలతో పోరాడిన వ్యక్తులు నొప్పి నుండి ఎలా నయం అయ్యారనే దాని గురించి వారి కథనాలను పంచుకున్నారు. ఈ కథలను తీసుకొని వాటిని అద్భుతమైన కళాఖండాలుగా మార్చడమే మా లక్ష్యం’ అని షా అన్నారు.ప్రస్తుతం పూణేలో ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు ఇవ్వడానికి, వైద్యులను ప్రోత్సహించడానికి, షా మాట్లాడుతూ ‘ఇప్పటివరకు 40 కథలు రికార్డ్ చేశాం, 28 కాన్వాస్‌లు పూర్తయ్యాయి. ‘ప్రజలు, కమ్యూనిటీలు మరింత ఆరోగ్య–అక్షరాస్యులుగా మారడానికి ఆరోగ్యం పట్ల వారి వైఖరిని మార్చడానికి కళలను కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉపయోగించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం‘ అని షా చె΄్పారు. -
మా బిల్డింగ్ గురించి రెండు నెలల్లో ప్రకటిస్తాం: మంచు విష్ణు
‘‘మేం ఏం అనుకుని వచ్చామో ఆ పనులన్నీ పూర్తి చేశాం. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) బిల్డింగ్ ఒక్కటే బాకీ ఉంది. ఈ అంశంపై కూడా రాబోయే రెండు నెలల్లో ఓ అద్భుతమైన ప్రకటన చేయబోతున్నాం’’ అని ‘మా’అధ్యక్షుడు విష్ణు మంచు అన్నారు. జీవీకే హెల్త్ హబ్ అసోసియేషన్‌తో ‘మా’ ఆధ్వర్యంలో సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అధ్యక్షుడు మంచు విష్ణు, ఉపాధ్యక్షుడు మాదాల రవి ఈ హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.ఈ హెల్త్ క్యాంప్‌లో ‘మా’ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘జీవీకే హెల్త్ హబ్ యాజమాన్యానికి, డాక్టర్ శాస్త్రిగారితో పాటు టీమ్ అందరికీ ధన్యవాదాలు. ‘మా’ సభ్యులందరికీ ఉచితంగా హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు’’ అని అన్నారు. ‘‘ఆదివారం వరల్డ్ హార్ట్ డే. ఆర్టిస్టులు ఎంతో ఒత్తిడితో ఉంటారు. అందుకే వీరి కోసం మాస్టర్ చెకప్ చేశాం’’ అన్నారు డా. శాస్త్రి. ‘మా’లోని సభ్యుల్లో దాదాపు నాలుగు వందల మంది ఈ హెల్త్ క్యాంప్‌లో పాల్గొని, చెకప్ చేయించుకున్నారని సమాచారం. -
కళ‘నైనా’ కనని, కాలం చెల్లని : సహనం నుంచి సంకల్పబలం వరకు!
కొన్ని దశాబ్దాల క్రితం...నైనా దలాల్ వేసిన చిత్రాలు ఆనాటి కళాభిమానులకు షాకింగ్‌గా అనిపించాయి. ఆమె చిత్రాలు కాలం కంటే చా...లా ముందు ఉండడమే దీనికి కారణం.లండన్‌లో వెస్ట్రన్ ఆర్ట్‌ను అధ్యయనం చేసిన తొలి భారతీయ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన తొంభై సంవత్సరాల నైనా దలాల్ సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ న్యూ దిల్లీలోని ట్రావెన్ కోర్ హౌస్‌లో జరుగుతోంది. సాధారణ ప్రజల కథలను చెప్పడమే లక్ష్యంగా నైనా దలాల్ కుంచె సామాన్యుల జీవితాల్లోకి వెళ్లింది. ఆమె చిత్రాలలో నాస్టాల్జీయా తొంగి చూస్తుంది. View this post on Instagram A post shared by Galleriesplash (@galleriesplash) ‘నైనా దలాల్ ఆర్ట్ వర్క్‌ను చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు’ అంటారు కొద్దిమంది విశ్లేషకులు. కామన్వెల్త్ స్కాలర్షిప్ అందుకొని లండన్‌కు వెళ్లింది దలాల్. లండన్‌లో వెస్ట్రన్ ఆర్ట్‌ను అధ్యయనం చేసిన మొదటి భారతీయ ఆర్టిస్ట్‌గా తన ప్రత్యేకత చాటుకుంది. నైనా దలాల్ ప్రింట్ మేకింగ్ కోర్సులో చేరినప్పుడు చాలామంది ఆశ్చర్య΄ోయారు. ఎందుకంటే ప్రింట్ మేకింగ్ అనేది పురుషాధిక్య మాధ్యమంగా గుర్తింపు పొందింది. భారీ యంత్రాలతో పనిచేయాల్సి వచ్చేది. అయితే నైనా దలాల్ అసాధారణ ప్రతిభ ముందు అపోహలు నిలబడలేక పోయాయి. ఫెమినిజంకు సంబం«ధించి ఫస్ట్ వేవ్ బలాన్ని సంతరించుకుంటున్న కాలంలో, మన దేశంలోని మహిళా కళాకారులు ఫెమినిస్ట్ భావాలతో స్ఫూర్తి ΄÷ందుతున్న కాలంలో ఆమె తన కుంచెను బలమైన మాధ్యమంగా ఉపయోగించింది. మాతృత్వం నుంచి ఒంటరితనం వరకు తన చిత్రరచనకు నైనా ఎన్నో ఇతివృత్తాలు ఎంచుకుంది.బెంచీలు, బూట్లు, రాళ్లు, గోడలు, కొండలలాంటి నిర్జీవమైన వాటి నుంచి జంతువులు, పక్షుల వరకు ఆ చిత్రాలలో కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ వాటితో తమ జ్ఞాపకాలను పంచుకునేలా చేస్తాయి. ఆ జ్ఞాపకాలు ఒక వ్యక్తికి మరో వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. నైనా దలాల్‌ను ఇతర ప్రముఖ భారతీయ మహిళా కళాకారుల నుండి వేరు చేసిన అంశం ప్రింట్ మేకింగ్‌తో చేసిన లిథోగ్రాఫ్, కొలాగ్రాఫ్లు. 1960లో నైనా దలాల్ లండన్‌కు మకాం మార్చింది. ఇండియాలో ఉన్నప్పుడు స్పాన్సర్ షోల కంటే సొంత ఆర్ట్ షోలే ఎక్కువ చేసింది. ‘నైనా దలాల్ వివిధ మాధ్యమాల్లో వందలాది చిత్రాలను సృష్టించింది. ఈ ప్రదర్శన ఒక మినీ–రెట్రోస్పెక్టివ్ లాంటిది’ అంటున్నారునైనా దలాల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు.మహిళల గురించిన నా ఆలోచనలు కాలంతోపాటు మారుతూ వచ్చాయి. అవి నా చిత్రాల్లో ప్రతిఫలిస్తాయి. మహిళల్లో ఉండే సహనం నుంచి సంకల్పబలం వరకు ఎన్నో వెలుగులు నా చిత్రాల్లో కనిపిస్తాయి. నా కళలో కాల్పనిక విషయాలు కనిపించవు. నా చుట్టూ కనిపించే సాధారణ ప్రజల జీవితాలే కనిపిస్తాయి. శ్రామిక జీవుల గురించి చదివినప్పుడు, విన్నప్పుడు వారికి సంబంధించిన ఆలోచనలు నా మనసులో సుడులు తిరుగుతుంటాయి. ఆ అలజడిని నా చిత్రాల్లోకి తీసుకువస్తుంటాను. నా కళ వారికి గొంతు ఇస్తుందని అనుకుంటున్నాను.– నైనా దలాల్ -
మనసులో కుంచె ముంచి..
కళ సామాజిక ప్రయోజనం గురించి చెప్పుకోవడానికి బోలెడు మ్యాటర్ ఉంది. ‘వ్యక్తిగతం’ మాట ఏమిటి? అనే విషయానికి వస్తే...‘కళ అద్భుత ఔషధం’ అంటున్నారు అమెరికాలోని బాల్టిమోర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్వేతారావు గార్గ్.‘ఒత్తిడిని చిత్తు చేయడానికి, ఉత్సాహాన్ని శక్తిగా చేసుకోవడానికి కళ బలమైన ఔషధంలా ఉపయోగ పడుతుంది’ అంటున్న శ్వేతారావు గార్గ్ బోధకురాలు, రచయిత్రి, ఆర్టిస్ట్. శ్వేతారావు గార్గ్ కాలేజీ రోజుల్లోకి వెళితే...‘ఒత్తిడి నుంచి బయటపడాలి’‘మనసుకు కాస్త ఉత్సాహం కావాలి’ అనుకున్నప్పుడల్లా ఆమె చేసే పని... కలాన్ని చేతిలోకి తీసుకొని తన మనసులోని భావాలను కాగితంపై పెట్టడం. లేదా కుంచె తీసుకొని రంగు రంగుల చిత్రాలు వేయడం. ఈ ఉపశమనం, ఉత్సాహాన్ని ఇచ్చే పని కళాప్రపంచంలో తనకు చోటు కల్పిస్తుందని శ్వేత ఊహించి ఉండదు.మొదట్లో తాను వేసిన చిత్రాలను ఇతరులకు చూపించేది కాదు. వాటిని రహస్యంగా దాచేది. వివిధ కారణాల వల్ల రచనలు చేయడానికి, బొమ్మలు వేయడానికి దూరమైన శ్వేత మళ్లీ కళాప్రపంచంలోకి వచ్చింది. అప్పుడు తనకు ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. బొమ్మలు వేయడమే కాదు నవలలు రాసే ప్రయత్నం కూడా మొదలుపెట్టింది.రచనలు చేస్తున్న కొద్దీ, బొమ్మలు వేస్తున్న కొద్దీ తనమీద తనకు ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘వీటిని రహస్యంగా దాచుకోవడం ఎందుకు! ప్రపంచానికి చూపించాలి’ అనుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ రచనలు, చిత్రాలను అధ్యయనం చేసిన శ్వేత అనుకరణ నీడల్లోకి వెళ్లకుండా తనదైన సొంత శైలిని సృష్టించుకుంది.వంటగది నుంచి పిల్లల పెంపకం వరకు మహిళల దైనందిన జీవితంలో రకరకాల ఘట్టాలను కథలుగా మలిచింది. శ్వేత కళాత్మక సాధనలో ‘స్త్రీవాదం’ అనేది ప్రధాన అంశంగా మారింది. ఆమె రచనల్లో స్త్రీ ΄ాత్రలు పరాధీనంగా, బేలగా, నిస్సహాయంగా కనిపించవు. పురుషాధిపత్య ధోరణులను సవాలు చేసేలా, స్వతంత్య్రవ్యక్తిత్వంతో కనిపిస్తాయి. నిత్య ఉత్సాహంతో శక్తిమంతంగా కనిపిస్తాయి.ఇక చిత్రకళ విషయానికి వస్తే శ్వేత ఏ ఆర్ట్ స్కూల్లోనూ పట్టా పుచ్చుకోలేదు. అయితే విన్సెంట్ వాన్ గోహ్ నుంచి అమృతా షేర్గిల్ వరకు ఎంతోమంది చిత్రకారులతో మౌనసంభాషణ చేస్తూనే ఉంటుంది. తనదైన విలక్షణ దృశ్యభాషను సృష్టించుకోవడానికి సాధన చేస్తూనే ఉంటుంది.‘కాలేజీ రోజుల నుంచి నా భావాల వ్యక్తీకరణకు కళ అనేది బలమైన మాధ్యమంగా ఉపయోగపడింది. కథ అయినా కవిత్వం అయినా చిత్రం అయినా కొత్త కోణంలో కనిపించాలనుకుంటాను’ అంటుంది శ్వేత.బోధన, పరిశోధన, కళలలో తనకు ఇష్టమైనది ఏమిటి?ఆమె మాటల్లోనే చె΄్పాలంటే... ‘అవేమీ దేనికవి ప్రత్యేకమైన ప్రపంచాలు కావు. ఉదాహరణకు నా బోధన నేను చేసే పరిశోధనపై, నా పరిశోధన నా కళపై ప్రభావితం చూపిస్తాయి. ఒకదానికొకటి ఉపకరిస్తాయి’శ్వేతారావు గార్గ్ గ్రాఫిక్ నవల ‘ది టేల్స్ ఫ్రమ్ క్యాంపస్: ఏ మిస్ గైడ్ టు కాలేజి’ క్యాంపస్ వాతావరణం కాస్తో కూస్తో పరిచయం లేని వారిని కూడా క్యాంపస్‌లోకి తీసుకువెళ్లి ప్రత్యక్ష అనుభవాన్ని సొంతం చేస్తుంది. లింగభేదం, వేధింపులు, వర్గ హక్కులు, కులవివక్ష... ఇలా ఎన్నో అంశాలపై స్టూడెంట్స్ ఆలోచనలు, అవగాహనను ఈ నవల ప్రతిబింబిస్తుంది. పదమూడు చాప్టర్లలో ప్రతి చాప్టర్ తరువాత వచ్చే ‘స్టాప్ అండ్ థింక్’ సెక్షన్ ఎన్నో విషయాలలో పునరాలోచనకు అవకాశం కల్పిస్తుంది. -
కలాపోసన
‘ఆ.. మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలయ్యా! ఉత్తికే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది?’– ‘ముత్యాలముగ్గు’ సినిమాలో కాంట్రాక్టరు పాత్రధారి రావు గోపాలరావు పలికిన అమృతవాక్కులివి. ముళ్లపూడి వెంకటరమణ కలం నుంచి తూటాల్లా వెలువడిన మాటలివి. తెలుగునాట అమిత జనాదరణ పొందిన పది సినిమా డైలాగుల జాబితాను ఎవరైనా రూపొందిస్తే, ఈ డైలాగుకు అందులో తప్పకుండా చోటు దక్కి తీరుతుంది. నిజమే! ఊరకే తిని తొంగున్నట్లయితే, మనిషికీ గొడ్డుకూ ఏమాత్రం తేడా ఉండదు. గొడ్డుకు లేని బుద్ధి మనిషికి ఉంది. మనిషిని ఇతర జంతుతతి నుంచి వేరు చేసేది ఆలోచనా శక్తి మాత్రమే! ఆలోచనకు పదునుపెట్టే సాధనం సృజనాత్మకత. మనిషిలోని సృజనాత్మకతకు ఫలితాలే కళలు.కొందరికి జన్మతః కళాభినివేశం ఉంటుంది. అలాంటివారు సునాయాసంగా కళలను కైవసం చేసుకోగలుగుతారు. ఇంకొందరు అభిరుచితో సాధన చేసి కళల్లో రాణిస్తారు. అభినివేశం, సాధన లేకున్నా, చాలామంది కళలను ఆస్వాదిస్తారు. కలిగిన ఆసాములు కళలను ఆదరిస్తారు. కళలు అరవై నాలుగు అని వాత్సా్యయనుడు చెప్పాడు. వీటిలో చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నృత్యం, కవిత్వం అనే అయిదు కళలూ లలితకళలుగా గుర్తింపు పొందాయి.లలితకళలు మనుషుల భావోద్వేగాల అభివ్యక్తికి అందమైన సాధనాలు. మనుషులు తమ ఆలోచనలను, ఆనంద విషాదాది భావోద్వేగాలను; తమ కాల్పనిక ఊహాజగత్తులోని విశేషాలను, తమ సృజనాత్మకతను ఇతరులతో పంచుకోవడానికి కళలను ప్రదర్శిస్తారు. పురాతన నాగరికతలు ఊపిరి పోసుకోక మునుపటి నుంచే మనుషులు కళల ద్వారా తమ ఉద్వేగాలను చాటుకోవడం మొదలుపెట్టారు. మాటలాడటం ఇంకా నేర్చుకోని ఆనాటి మానవులు బొమ్మల ద్వారా తమ ఆలోచనలను వెల్లడించేవారు. పాతరాతి యుగం మానవులు రాతిగుహల గోడల మీద చిత్రించిన చిత్రాలే ఇందుకు ఆనవాళ్లు. నాగరికతలు మొదలైన నాటి నుంచి నేటి వరకు కళలకు– ముఖ్యంగా లలితకళలకు జనాదరణ ఉంది. కళలు ఏవైనా సరే, వాటి ప్రయోజనం ఒక్కటే – ఆత్మప్రక్షాళన. ‘దైనందిన జీవితంలో మన ఆత్మలపై పేరుకున్న ధూళిని శుభ్రం చేయడమే కళ ప్రయోజనం’ అంటాడు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో. కళలు భావోద్వేగాల ప్రసారమాధ్యమాలు మాత్రమే కాదు, ఆత్మప్రక్షాళనకు ఉపకరించే సాధనాలు కూడా! కళలు మనుషుల జీవితాలను సౌందర్యభరితం చేస్తాయి. కళలు విలువలు నేర్పుతాయి. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లతో అలజడికి గురైన మనసుకు సాంత్వన నిస్తాయి. కళలు జీవితాన్ని చైతన్యవంతం చేస్తాయి. ఇంతేకాదు, కళలు సామాజిక అన్యాయాలను ఎత్తి చూపుతాయి. ఆలోచన రేకెత్తిస్తాయి. ఆత్మవిమర్శ దిశగా మనుషులను ప్రేరేపి స్తాయి. కళలు సమాజాన్ని మరింత నాగరికంగా, ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. సమాజంలోని రకరకాల సంస్కృతులకు చెందిన సమూహాల గుండెచప్పుడును వినిపిస్తాయి. కళలు సామాజిక మార్పులకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.‘కళ చాలా విశాలమైనది. మనుషుల తెలివి చాలా ఇరుకైనది’ అంటాడు ఇంగ్లిష్ కవి అలెగ్జాండర్ పోప్. ప్రపంచం తీరుతెన్నులను చూస్తుంటే, ఆయన మాట నిజమేననిపిస్తుంది. సామాజిక మార్పులకు ఉత్ప్రేరకాలుగా పనికొచ్చే లక్షణం కళలకు ఎంతో కొంత ఉన్నమాట వాస్తవమే అయినా, ప్రపంచవ్యాప్తంగా కళాకారులు అసంఖ్యాకంగా కళాసృజన కొనసాగిస్తూ వస్తున్నా, ఈ ప్రపంచం మారాల్సిన పద్ధతిలో ఇంకా మారలేదు. మనుషుల కురచ బుద్ధులు కూడా మారలేదు. బహుశా, జనాభాలోని అత్యధికులు కళలను ఒంటబట్టించుకోకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. కళలకు ఆదరణలేని దేశాలు నిరంతరం అలజడులు, అశాంతితో అలమటించే పరిస్థితులను చూస్తూనే ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ నాయకులు సంగీత ప్రదర్శనలపై నిషేధాజ్ఞలు విధించారు. అక్కడి పరిస్థితులు మనకు తెలియనివి కావు. చిత్రకళా ప్రదర్శనలపై నానా రకాల ఆంక్షలు ఉన్న ఉత్తర కొరియా పరిస్థితులు కూడా మనకు తెలిసినవే! స్వేచ్ఛ లేనిచోట కళలకు ఊపిరాడదు. ఇక స్వేచ్ఛే ఊపిరిగా బతికే కళాకారుల పరిస్థితి ఆంక్షలున్న చోట ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. నియంతృత్వ దేశాల్లో మాత్రమే కాదు, ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకుంటున్న చాలా దేశాల్లోనూ కళాకారులు పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్న పరిస్థితులు లేవు.కళలన్నీ కళాకారుల ఆత్మావిష్కరణలే! అందుకే, ‘అన్ని కళలూ కళాకారుల ఆత్మకథలే! ముత్యం ఆల్చిప్ప ఆత్మకథ’ అంటాడు ఇటాలియన్ దర్శకుడు ఫెడెరికో ఫెలినీ. ఆంక్షలు లేనిచోట మాత్రమే కళాకారుల ఆత్మావిష్కరణకు అవకాశాలు అపరిమితంగా ఉంటాయి. కాల ప్రవాహంలో ప్రపంచంలోని మిగిలిన మార్పులతో పాటే కళలు కూడా మారుతూ వస్తున్నాయి. కళల్లో ప్రాచీన కళ, ఆధునిక కళ అనేవి కాలానికి సంబంధించిన కొండగుర్తులు మాత్రమే! కళల అస్తిత్వం నిరంతరం.స్వేచ్ఛలేని పరిస్థితుల వల్ల కొన్నిచోట్ల, ఆధునిక జీవనశైలిలోని తీరిక దొరకని పరిస్థితుల వల్ల కొన్నిచోట్ల మనుషులు కళలకు దూరమవుతున్నారు. దొరికే కొద్దిపాటి తీరిక సమయాన్ని టీవీ, స్మార్ట్‌ఫోన్ వంటివి అందించే యాంత్రిక వినోదంతో సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, కళాస్వాదన, కళా సాధనల వల్ల మనుషుల్లో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇటీవల బ్రిటిష్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మరందుకే మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాల! లేకపోతే బతుకులు గొడ్డుదేరిపోవూ! -
ఇషా అంబానీకి ఆరేళ్లున్నప్పటినుంచీ..తొలి ఫీజు రూ. 25లే : వీణా
సెలబ్రిటీ మెహందీ కళాకారిణి, వీణా నగ్దా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తనదైన ప్రత్యేక మెహందీ కళతో సెలబ్రిటీ వధువుల ఫస్ట్ ఆప్షన్ ఆమె. బాలీవుడ్ క్వీన్స్ అందాల హీరోయిన్ శ్రీదేవి మొదలు ఈతరం దీపికా పదుకొనే, అలియా భట్, ట్వింకిల్ ఖన్నా, కృతి ఖర్బందా దాకా ఆమే హాట్ ఫ్యావరేట్. పలు బాలీవుడ్ సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. వీణా. అంతేకాదు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబంతో ఆమెకు సుదీర్ఘం అనుబంధం ఉంది. అంబానీలతో తన 38 ఏళ్ల అనుబంధం గురించి ప్రస్తావించిన వీణా రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీపై ప్రశంసలు కురిపించడం విశేషం.వీణా నగ్దా మెహందీ ఆర్ట్‌పై తన తనకున్న ప్రేమను వివరించడంతోపాటు, 38 ఏళ్ల అంబానీ కుటుంబంలో కోకిలాబెన్ అంబానీ నుండి నీతా అంబానీ వరకు తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అంబానీ కుటుంబంలో రెండు చేతుల నిండా నిండుగా గోరింటాకు పెట్టినందుకు తీసుకున్నతొలి రెమ్యునరేషన్ రూ, 25 రూపాయలట. ఆ సమయంలో ముఖేష్ అంబానీ కోకిలాబెన్ ఫోన్ నెంబరు, కార్డు ఉండాలని సలహా ఇచ్చాడు. దీంతో ఆమె సలహా పాటించినట్టు వీణా తెలిపారు. తనను ఎంతో మెచ్చుకునేవారని ఆమె చెప్పారు. అంతేకాదు అంబానీ ఇంటికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు, ఎక్కువ ఫీజు వసూలు చేయాలని సూచించారట పొరుగింటివారు. కానీ తాను ఎన్నడూ అలాగ చేయ లేదని వెల్లడించింది. అంబానీలతో కలిసి పని చేయడమే గొప్ప అవకాశంగా భావించి సాధారణ కస్టమర్ల నుంచి పొందే ఛార్జీనే తీసుకోవాలని తన తల్లి కోరిందట. ఆ సలహా తనకు ఎప్పుడూ గుర్తుండేదంటూ చెప్పుకొచ్చారు.ఇషాకు ఆరేళ్లప్పటినుంచి గోరింటాకు పెడుతున్నాఇషా అంబానీ , శ్లోకా మెహతాకు 6 సంవత్సరాల వయస్సులో గోరింటాకు వారి చేతులను అలంకరించిన విషయాన్ని వీణా నగ్దా గుర్తు చేసుకుంది ఇషాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి వీణా నగ్దాను మెహందీ ఆర్టిస్ట్‌గా ఉన్నారు. ధీరూభాయ్ అంబానీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి తాను హాజరయ్యానని, ఆయన కుమార్తెల చేతులకు కూడా మెహందీ పెట్టానని తెలిపింది. అప్పుడు శ్లోకాకి కూడా ఆరేళ్లు అని కూడా వీణా గుర్తు చేశారు. వారంతా చదువుల కోసం సింగపూర్‌లో ఉండేవారికి ఇంటికి వచ్చినప్పుడల్లా మెహందీ పార్టీలు చేసుకునే వారని వివరించారు.పారిస్ ఒలింపిక్స్ 2024, మెహిందీ ఆర్ట్పారిస్ ఒలింపిక్స్ 2024కి ఆహ్వానించినపుడు తానెంతో పొంగిపోయానని, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటేందుకు నీతా అంబానీ చేసిన పనికి థ్రిల్ అయ్యానని వీణా వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియన్ హౌస్‌లోని మెహందీ స్టాల్ గురించి మాట్లాడటం, ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది ఒలింపిక్ రింగ్‌ను మెహందీ డిజైన్ వేయించుకోవడం గురించి కూడా ప్రస్తావించారు. 'మెహెందీ క్వీన్ ఆఫ్ బాలీవుడ్' అని ట్యాగ్ ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన కళకు విస్తరణకు అందించిన సహాయాన్ని కూడా వీణా గుర్తు చేసుకున్నారు. -
కె పాప్ పోటీలో.. సిటీ విజేతలు వీరే..!
సాక్షి, సిటీబ్యూరో: కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా (కేసీసీ) సహకారంతో ప్రముఖ గృహోపకరణ ఉత్పత్తుల బ్రాండ్ ఎల్జి ఎల్రక్టానిక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా కె పాప్ పోటీల్లో స్థానిక విజేతలను ప్రకటించారు. ఈ ప్రాంతీయ పోటీల్లో ఆన్లైన్ ఆడిషన్స్ ద్వారా గానంలో నగరానికి చెందిన షైలీ ప్రీతమ్, నృత్యంలో సెజల్ దుబేలు గెలుపొందారని నిర్వాహక సంస్థ ప్రతినిధులు తెలిపారు.కొరియన్ పాప్ సంస్క్రతికి పట్టం గట్టే అభిమానుల కోసం నిర్వహిస్తున్న జాతీయ పోటీలో భాగంగా ఈ ప్రాంతీయ పోటీలు జులై 27న ప్రారంభమయ్యాయి. బెంగళూరు, కొహీమా, కొల్కతా, ముంబై, ఇటానగర్, చెన్నై, ఢిల్లీల తర్వాత నగరంలో ప్రాంతీయ రౌండ్ జరిగింది. ఇవి సెపె్టంబర్ 1 వరకు 11 ప్రాంతాల్లో జరుగుతాయని, వీటి ద్వారా ఎంపికైన విజేతలు ఢిల్లీలో జరిగే సెమీ ఫైనల్స్‌లో పాల్గొంటారని నిర్వాహకులు వివరించారు.స్టార్టప్స్ కోసం మీట్.. 24న..సాక్షి, సిటీబ్యూరో: ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం ది ఫౌండర్స్ కాంక్లేవ్ స్టార్టప్ మీటప్ నగరంలో జరుగుతోంది. కొండాపూర్‌లోని గోకర్ణ కో వర్కింగ్ స్పేస్‌లో ఈ నెల 24న జరగనున్న ఈ కార్యక్రమంలో భిన్న రంగాల ప్రముఖులు వైశాలి నియోటియా, నీతా సచన్, రత్నాకర్ సామవేదం హాజరై ప్రసంగిస్తారు. కార్యక్రమం సాయంత్రం 4గంటలకు ప్రారంభమై రాత్రి 7గంటల వరకూ కొనసాగుతుంది.ఆర్టిస్టిక్ లైసెన్స్.. 25న..సాక్షి, సిటీబ్యూరో: కవితలు, కథలు, సంగీతం, హాస్యం.. ఇలా ఏదైనా సరే మనకు నచి్చన/ వచ్చిన అంశంపై కొన్ని నిమిషాల పాటు మన ఇష్టాన్ని, ప్రతిభను ప్రదర్శించేందుకు వీలుగా ఆర్టిస్టిక్ లైసెన్స్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. మనకు పట్టున్న ఏ భాషలోనైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ నెల 25న జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న అలైన్ హబ్‌లో నిర్వహిస్తున్న ఈ ఓపెన్ మైక్ కార్యక్రమం సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమవుతుంది.మె‘న్యూ’ ఇటాలియన్ రుచుల టొస్కానో..సాక్షి, సిటీబ్యూరో: సిటీకి ఎన్ని రుచులు పరిచయం అవుతున్నా.. ఎప్పటికీ వన్నెతరగని విదేశీ టేస్ట్‌గా ఇటాలియన్ రుచుల్ని చెప్పొచ్చు. సిటిజనుల్లో ఇటాలియన్ రుచుల ప్రియత్వానికి అనుగుణంగా టొస్కానో పేరిట మరో రెస్టారెంట్ ఏర్పాటైంది. సైబరాబాద్‌లోని నాలెడ్జ్ సిటీ రోడ్లో నెలకొల్పిన ఈ రెస్టారెంట్‌ను ఇటలీ రుచులకు ప్రసిద్ధి చెందిన చెఫ్ గౌతమ్ మంగళవారం ప్రారంభించారు.నగరవాసులు గతంలో రుచి చూడని, ఇటలీలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వంటకాల్ని తాము అందిస్తున్నామని, నేరుగా ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యుత్తమ ముడి పదార్థాలు, చీజ్‌లను ఉపయోగించి ప్రత్యేక మెనూ తయారు చేశామన్నారు. క్లాసిక్ మార్గెరిటా పిజ్జా, చికెన్ డి టోస్కానో తదితర ఇటలీ వంటకాలు నగరవాసుల్ని ఆకట్టుకుంటాయన్నారు. -
'తొలిప్రేమ' వాసుకి పుట్టినరోజు.. భర్తతో సింపుల్‌గా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మహిళలకు సెకండ్ ఇన్నింగ్స్ వరం : ప్రతీ ‘క(ల)ళ’ కో లెక్క ఉంది!
ఆమె అందరిలా కాదు. సవాళ్లను ఎదుర్కోవడం అంటే ఇష్టం. విభిన్నంగా ఉండటం తన నైజం. అందుకే చిన్నప్పటినుంచీ అందరిలా రంగుల లోకంలో విహరించలేదు. రంగులనే తన లోకంగా ఎంచుకున్నారు. అక్కడితో ఆగిపోలేదు..అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దే గొప్ప శిల్పిగా అవతరించారు. మహిళా శిల్పిగా గత రెండు దశాబ్దాలుగా అనేక అపురూప శిల్పాలతో దేశ, విదేశాల్లో పేరు తెచ్చుకున్న డా. స్నేహలత ప్రసాద్‌ను సాక్షి.కాం పలకరించింది.ప్రతి మహిళకూ ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉంటుంది. కానీ కుటుంబం, పెళ్లి, పిల్లల బాధ్యతలు వారికి కల సాకారానికి బ్రేక్ పడుతుంది. కానీ ఆ తరువాత వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తామేంటో నిరూపించుకుంటారు. ఆ కోవకు చెందిన వారే డా. స్నేహలత. ఆ అవకాశమే ‘సెకండ్ ఇన్నింగ్స్’ అంటారు స్నేహలత. ఈ సమయంలో భర్త, కుటుంబ సభ్యులు ఎలాంటి ఆటంకాలు అవరోధాలు సృష్టించకుండా, చేయూతనందిస్తే అద్భుతాలు సృష్టిస్తారంటారు ఆమె. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో జన్మించారు స్నేహలత. తల్లి లీలాదేవి అండతో కళారంగంలోకి అడుగుపెట్టారు. ఫైన్ ఆర్ట్స్సబ్జెక్ట్లో పోస్ట్-గ్రాడ్యుయేషన్, ఆ తరువాత పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నారు. పెళ్ళి తరువాత హైదరాబాద్‌కు రావడం, ఇద్దరు సంతానం కుటుంబం, పిల్లల బాధ్యతల నేపథ్యంలో ఆమె ఆలోచనలకు తాత్కాలిక బ్రేక్ పడింది. కానీ తనలోని సృజనాత్మక సామర్థ్యాలను వెలికి తీయాలనే కోరిక రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది.బాధ్యతల్లో కాస్తంత వెసులుబాటు, భర్త డా.ప్రసాద్ తోడ్పాటుతో తన కరియర్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని అంటారు డా. స్నేహలత. అరుదైన తన కళకు ఆత్మవిశ్వాసాన్ని జోడించి ఆకాశమే హద్దుగా ఎదిగారు. అతిపెద్ద పెయింటింగ్ వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆమె కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదు. ప్రకృతి, పర్యావరణ ప్రేమికురాలు కూడా. ప్రకృతి మీద ఆమెకున్న ప్రేమ అంతా ఆమె ప్రతీ పెయింటింగ్‌లోనూ గోచరిస్తుంది. ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్‌లో అనేక ఆర్ట్ ఎగ్జిబిషన్స్ నిర్వహించారు. దాదాపు అన్ని గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈ విజయమే తనకు మరింత ప్రోత్సాహాన్నించింది అన్నారు ఆమె.చిత్రకళ కరియర్ ఉత్సాహంగా కొనసాగుతున్న సమయంలోనే అనూహ్యంగా శిల్ప కళతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ కళమీద అంతులేని మక్కువ ఏర్పడింది. పట్టుదలగా అందులోనూ రాణించారు. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. భారతదేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన మహిళా శిల్పులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆమె తొలి శిల్పం తెలంగాణా తల్లిది కావడం విశేషం. అలాగే పారిశ్రామిక వ్యర్థాలను అందమైన కళాకృతులుగా, రాయి, ఫైబర్ ఇలా మీడియం ఏదైనా దాన్ని అద్భుతంగా మలచడంలోనూ ఆమెది అందె వేసిన చేయి.స్నేహఆర్ట్స్ పేరుతో ఆర్ట్ క్యాంపులు, ఆర్ట్ ఫెయిర్, కోర్సులు, ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్లు, ఆర్ట్ టాక్‌లు, లైవ్ డెమోలు, డాక్యుమెంటరీలతో ఎపుడూ బిజీగా ఉండే స్నేహలత ‘రంగభూమి’ అనే వేదిక ద్వారా ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. పుణేలో పర్యావరణ శిల్పంపుణేలోని వాకాడ్‌లో, కస్తూరి చౌక్ వద్ద ఇటీవల ఒక పర్యావరణ శిల్పాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఇందులో కార్మికుల భద్రతకు చిహ్నమైన టోపీ,సమాజానికి, స్థిరత్వానికి మధ్య కీలకమైన బంధాన్ని తెలిపేలా డీఎన్ఏ గొలుసు, ఇంకా పరిశ్రమలు,శక్తి, ఆవిష్కరణల మేళవింపుతో దీన్ని ఏర్పాటు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణ ,వాతావరణ మార్పులపై పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. 21 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో రెండునెలలపాటు శ్రమించి తయారు చేయడం విశేషం. తెలంగాణా కోసం చార్మినార్పుట్టింది రాజస్టాన్లోనే అయినా తనకిష్టమైన కళలో రాణించింది మాత్రం హైదరాబాద్ వచ్చిన తరువాతే. అందుకే హైదరాబాద్ కోసం ఏదైనా చేయాలనే తపన నాలో చాలా ఉంది. తనకు అవకాశం లభిస్తే పరిశ్రమలనుంచి వచ్చిన ఇనప వస్తువులు, బోల్ట్‌లు, నట్లు తదితర స్క్రాప్‌తో తెలంగాణాకు తలమానికమైన చార్రితక కట్టడం ‘చార్మినార్’ను యథాతథంగా నిర్మించాలనుకుంటు న్నాననీ, అది కూడా సందర్శకులు చార్మినార్ పైకి ఎక్కి నగర అందాలను దర్శించే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలనుంచి సహకారం లభిస్తే దీన్ని సాధించి తీరుతానని చెప్పారు.చెత్తనుంచే చిత్రమైన కళాకృతులుపనికిరాకుండా పారవేసే చెత్త, ఇతర వ్యర్థాలనుంచి కళాఖండాలను తీర్చిదిద్దడం ద్వారా ప్రకృతికి, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, ముప్పును తగ్గించడం ఒక మహిళగా తన బాధ్యత అని పేర్కొన్నారు. కాలుష్య నివారణలో అందరమూ తలా ఇంత చేయాల్సిందే అని సూచించారు.చిన్నప్పటినుంచీ గొప్పగా, పెద్దగా సాధించాలనేదే నా తాపత్రయం. అందుకే మహిళలకు ప్రవేశం అరుదుగా లభించే శిల్ప కళను ఎంచుకున్నాను. శిల్పాన్ని చెక్కేటపుడు వచ్చే దుమ్ము, ధూళి నాకు కనిపించదు. 200 ఏళ్లకు పైగా చరిత్రను చూసిన ఒక పవిత్రమైన వస్తువును స్పృశిస్తున్న పారవశ్యం. అదొక గొప్ప అనుభూతి. తొమ్మిది నెలలు గర్భంలో బిడ్డకు ప్రాణం పోసినంత సహజంగా శిల్పం ఆవిష్కృతమవుతుంది అంటారామె. అందుకే అనేక అవార్డులు, రివార్డులు ఆమెను వరించాయి. చిత్ర కళ అయినా, శిల్ప కళ అయినా ఇందులోనే గణితం కూడా ఇమిడి ఉంటుంది. ప్రతీ దానికి ఒక లెక్క ఉంటుంది. దాని ప్రకారమే పోవాలి. నా జీవితమూ అంతే. ఒక లెక్క ప్రకారం కలలు, కళల మేళవింపుతో ఒక అందమైన చిత్రంగా మల్చుకున్నాను అని చెప్పారు స్నేహలత.విద్యార్థుల కోసం గురుకులం‘‘గురుకుల లాంటి విద్యా సంస్థను ఏర్పాటు చేసి, పట్టుదలగా, పూర్తి నిబద్దతతో చిత్రకళను, శిల్ప కళను నేర్చుకోవాలనే వారికి శిక్షణ ఇవ్వాలనేది నా లక్ష్యం. విద్యార్థులకు సరియైన రీతిలో శిక్షణ ఇవ్వాలి. దేశ సంస్కృతీ,సంప్రదాయాల మీద వారికి అవగాహన కల్పించాలి. ఆసక్తిని కలిగించాలి. అపుడే వారు ఎవరూ ఉహించలేని అద్భుతాలు సృష్టిస్తారు.’’- స్నేహలతమహిళలకో మాట‘ఆడపిల్లలకు కూడా ఆశలు, కోరికలు, లక్ష్యాలు ఉంటాయి. పట్టుదలా ఉంటుంది. కానీ తొలుత నచ్చింది నేర్చుకోవడంలో అడ్డంకు లొస్తాయి. తీరా చదువుకున్నాక, కుటుంబం ముందు, కరియర్ తరువాత అనే కట్టుబాట్లు మరింత అవరోధంగా మారతాయి. ఇలాంటి కారణాల రీత్యా చాలామంది తమలోని ఆశలను చంపేసు కుంటున్నారు. కానీ, అలా కాదు. దొరికిన వెసులుబాటును ఉపయోగించుకుని మహిళలు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలి. సానుకూల ధోరణి, దృక్పథంతో ముందుకు పోవాలి...’ ఇదీ స్నేహలత మాట! -
సామాజిక కళకు సై అంటున్నారు...
‘నా కాళ్లకు ప్రయాణ దాహం పట్టుకుంది’ అంటున్నారు యువ ఆర్టిస్ట్‌లు. ఆ ప్రయాణ అనుభవాలు వారి కళకు బలాన్ని ఇస్తున్నాయి. సమాజంతో కలిసి పనిచేయడానికి అవసరమైన స్ఫూర్తిని ఇస్తున్నాయి. పబ్లిక్ ఆర్ట్‌గా ప్రాచుర్యం ΄పొందిన ‘మ్యూరల్ ఆర్ట్’ ద్వారా మానసిక ఆరోగ్యం నుంచి మహిళాశక్తి వరకు ఎన్నో విషయాలను ప్రచారం చేస్తున్నారు. కార్టూన్లతో నవ్వించడమే కాదు ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించేలా చేస్తున్నారు. కళకు సామాజిక ప్రయోజనాన్ని జోడించిన వారి క్రియేటివ్ జర్నీ గురించి....ముంబైకి చెందిన మేఘకు మ్యూరల్ ఆర్ట్ అంటే ఎంత ఇష్టమో ప్రయాణాలు అంటే కూడా అంతే ఇష్టం. ఆ ప్రయాణాలలో ప్రకృతి అందాలను ఆస్వాదించడం అంటే ఇష్టం.ఆమె దృష్టిలో ప్రకృతి అనేది విశాలమైన కాన్వాస్. అస్సాంలోని పచ్చటి కొండల నుంచి జమ్మూ కశ్మీర్‌లోని తెల్లటి మంచుల కొండల వరకు నదుల జలకళ నుంచి ఎడారుల ఇసుక మెరుపుల వరకు ఎన్నో ప్రాంతాల అందాలను ఆస్వాదించింది.తన కళకు ఇన్స్పిరేషన్ తాను వెళ్లిన ప్రాంతాలే. ‘ప్రయాణం అంటే ప్రతి రోజు ఒక కొత్త ఎనర్జీతో నిద్ర లేచే ఉత్సాహం. ఆ ఉత్సాహ శక్తి మన కళలో ప్రతి ఫలిస్తుంది’ అంటుంది మేఘ.మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి తన మ్యూరల్ ఆర్ట్‌ను సాధనంగా వాడుకుంటుంది స్నేహ చక్రవర్తి. ‘మైండ్ అండ్ మ్యాటర్’ చారిటబుల్ ట్రస్టుతో కలిసి ‘ది ట్రావెల్ అండ్ పెయింట్: ఇండియా టూర్’ చేసింది. ఆల్ ఇండియా ఆర్ట్ టూర్లో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంది. అట్టడుగు వర్గాల పిల్లలతో సంభాషించి వారితో స్నేహం చేసే అవకాశం వచ్చింది.‘కళ’ అనేది మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో విస్తృతంగా ప్రచారం చేస్తోంది స్నేహ చక్రవర్తి.తిరువనంతపురానికి చెందిన అమితకు చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే ఇష్టం. ప్రయాణాలు అంటే మరీ ఇష్టం. ‘మొదట్లో ప్రముఖ చిత్రకారుల ఆర్ట్‌వర్క్స్‌ను అనుసరిస్తూ ఆనందించేదాన్ని. అయితే అసలైన ఆనందం నాకు వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు దొరికింది. ఒక ప్రాంతానికి తనదైన అందాలు ఉన్నట్లే సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యలను నా కళ ద్వారా ప్రతిబింబించాలనుకుంటు న్నాను’ అంటుంది అమిత.చిత్రకళకు సంబంధించి నిర్దిష్టమైన శైలికి పరిమితం కావడం అంటే అమితకు ఇష్టం లేదు. ఐడియాల విషయంలో ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచించడం ఆమెకు ఇష్టం. ‘యూనిక్ ఎక్స్ప్రెషన్’ను అమితంగా ఇష్టపడుతుంది.మేఘ, స్నేహ, అమితలుæమాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది యువ కళాకారులు తమవైన కళారూపాలతో సమాజంతో కలిసి నడుస్తున్నారు. సామాజిక కళకు సై అంటున్నారు.జస్ట్ లోకల్...చెన్నైకి చెందిన పదహారుమంది యువ ఆర్టిస్ట్‌లు ఐశ్వర్య మణివణ్ణన్ మార్గదర్శకత్వంలో ‘లోకల్’ థీమ్‌తో వందకుపైగా కళారూపాలు ఆవిష్కరించారు. టెక్నాలజీపై అతిగా ఆధారపడడం వల్ల కోల్పోతున్నది ఏమిటో తెలియజేస్తాయి ఈ చిత్రాలు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడో జరిగే సంఘటనల గురించి తెలుసుకునే మనం, సమీపంలోని వాటి గురించి మాత్రం తెలుసుకోలేము. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో విషయాల గురించి అన ర్గళంగా చెప్పగలిగే వాళ్లలో చాలామందికి లోకల్ విషయాలలో అంతంత మాత్రమే అవగాహన ఉంటుంది. ‘తమ స్థానికతతో కళాకారులు మమేకం కావడానికి లోకల్ అనే థీమ్ ఉపయోగపడుతుంది’ అంటుంది ఐశ్వర్య. చెన్నైలోని వైబ్రెంట్ స్ట్రీట్ లైఫ్... అందులోని సాంస్కృతిక వైవిధ్యం అంటే ఐశ్వర్యకు ఇష్టం. తన స్టూడెంట్స్‌తో కలిసి నార్త్ చెన్నైలోని కాశిమేడుకు వెళ్లింది. గంభీరమైన సముద్రాన్ని చూసిన తరువాత స్టూడెంట్స్‌కు కొత్తప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ఎంతోమంది జాలరులతో మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వారి ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. అక్కడి దృశ్యాలు స్టూడెంట్స్ ముందున్న కాన్వాస్‌లోకి నడిచొచ్చాయి. సహజత్వాన్ని ప్రతిబింబించాయి.ఈజ్ దట్ యూ? ‘టాలెంటెడ్ ఇలస్ట్రేటర్’గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకుంది ముంబైకి చెందిన ప్రణిత కొచ్రేకర్. దైనందిన జీవిత దృశ్యాల నుంచి మానసిక ఒత్తిడి, ఆందోళన వరకు ఎన్నో అంశాలు ఆమె చిత్రాలకు థీమ్‌గా ఉంటాయి. ఊహల్లో నుంచి కాకుండా సొంత అనుభవాల్లో నుంచి చిత్రాలు వేయడం అంటే ప్రణితకు ఇష్టం.‘కళకు సామాజిక ప్రయోజం ఉంది. అది శక్తిమంతమైన మాధ్యమం’ అంటున్న ప్రణిత తన కళ ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. వివిధ సామాజిక మాధ్యమాలను తన కళకు వేదికగా ఉపయోగించుకుంటోంది.యాంగ్జయిటీ డిజార్డర్లపై ‘ఇజ్ దట్ యూ?’ టైటిల్‌తో వేసిన డ్రాయింగ్ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. తన బొమ్మల ద్వారా నవ్వించడంతోపాటు ఆలోచించేలా చేయడం ప్రణిత ప్రత్యేకత.‘డా.ఇంటర్నెట్’ పేరుతో యాంగ్జయిటీని తగ్గించుకోవడానికి ఏంచేస్తే బాగుంటుందో చిత్రం చివర సలహా కూడా ఇస్తుంది ప్రణిత. -
నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ!
"వాడు గొంతెత్తితే అమరగానమట వెళ్ళి విందామా అనడుగుతే.. ఎహే! సర్విలో చాయ్ తాగి సిగరెట్ వెలిగించుకుని ఆటో ఎక్కితే పది నిముషాల్లో ప్రెస్ క్లబ్. రాజాగారి పుస్తకావిష్కరణ అనంతరం తాగినంత చుక్క, మెక్కినంత ముక్క పద గురూ.." అలా పద పద మని పరిగెత్తే సాహితీ పద సవ్వడులు హడావుడిలో గోపి గారు గీసిన కుంచె మెత్తని సిరాగానం ఎవరికీ పట్టలేదు. అసలు అవసరమే లేదు, అవసరమనే ఎరికే లేదు. ఒక మూడేళ్ల క్రితం ఆయన బొమ్మని వదిలి వెళ్ళిపోయారు. ఆయన్ని మనం, మనల్ని ఆయన ఎప్పుడూ పట్టుకుని లేము కాబట్టి గోపి నిష్క్రమణ వల్ల ఎవరికీ నష్టం లేదు, ఏదో ఒక పుంజీడు మంది బొమ్మ తడమగలిగిన వ్రేళ్ళున్న గుడ్డి వాళ్లకు తప్ప. అట్లా తడమగలిగిన మెత్తని అరచేతుల కోసం.. ఒక నాలుగు మాటల గోపి అనే ఒక గొప్ప చిత్రకారుడి కథ, బొమ్మ, కబుర్లు!⇒ అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదివ సంవత్సరం. బషీర్‌బాగ్ ప్రాంతం. ఇటు సుప్రభాతం పత్రికకి, అటు మాభూమి మాగజైన్ కి మధ్యలో ఒకటే కట్టడం అడ్డు. ఇక్కడ సుప్రభాతంలో పనిచేసే వాళ్లంతా అటేపు మాభూమిలో జాయినయిపోయారు. మా సుప్రభాతం వాళ్ళు కాక అక్కడ మాభూమికి కొత్తగా వచ్చింది ఆర్టిస్ట్ పాండు ఒకడే. వాడు తప్పా మిగతా మాభూమి పత్రిక అంతా సుప్రభాతంలానే ఉండేది. అదే వాసు గారు, ఏబికేగారు, నాగ సుందరీ, కొండేపూడి నిర్మల... అయినా పాండు తప్పా వాళ్లంతా నాకు పరాయి వాళ్ళు గానే ఉండే వాళ్ళు. ఆ మద్యాహ్నం నేను ఈ పత్రికలో భోజనం ముగించుకుని ఆ పత్రికలో పాండుతో కలిసి టీ తాగుదామని చేరా. అక్కడ పాండు తను వేసిన బొమ్మలని ఆర్టిస్ట్ గోపి గారికి చూపిస్తున్నాడు. ఆయన బహుశా ఆ పత్రికలో ఏదయినా ప్రీలాన్సింగ్ పని నిమిత్తం వచ్చి ఉంటారు. అదే నేను గోపిగారిని మొదట చూడ్డం. అయినా ఆయన గోపీగారని నాకు తెలిసిపోయింది! ఎలానో నాకే తెలీదు. పాండు బొమ్మలని చూసి గోపి గారు ఇలా అంటున్నారు.. "ఒకే ఆర్టిస్ట్ బొమ్మలు చూసి ఇన్స్పైర్ అవ్వకూడదు పాండు, చాలా మంది బొమ్మలని చూసి అందరి నుండి నేర్చుకొవాలి, అందరి స్టయిల్స్ నుండి నీకంటూ ఒక కొత్త శైలి ఏర్పడుతుంది" పాండు బుద్దిగా తల ఊపుతుంటే నాకు నవ్వు వచ్చింది.⇒ అయినా నేను నవ్వలా, గోపి గారు తలెత్తి నావంక చూసి నవ్వారు, ఆయన నవ్వు దయగా ఉంటుంది. ఆయనెప్పుడు చిన్నగా, సన్నగా దయగా, కరుణగా చూస్తారు, నవ్వుతారు. నేను అన్వర్ నని అప్పుడు ఆయనకు తెలీదు. నేనప్పుడు ఆర్టిస్ట్ నని నాకు ఒక అనుమానం. చాలా ఏళ్ళు గడిచి "ఇప్పట్లో మీ అభిమాన చిత్రకారుడు ఎవరు ఆర్టిస్ట్ జీ" అని గోపీ గారిని ఒక ఇంటర్యూ లో అడిగితే ఆయన అన్వర్ పేరు చెప్పారు. నాకు ఇప్పుడు ఆర్టిస్ట్ నని ఏమంత నమ్మకం లేదు. ఏళ్ళు ఇన్ని వచ్చాక ఇంకా విషయం తెలీకుండా ఉంటుందా! ఆర్టిస్ట్ అంటే కేవలం బాపు, బాలి, చంద్ర, గోపీ, మోహన్, పి ఎస్ బాబు, కరుణాకర్, సురేష్, చారీ, హంపి మరియూ గింపి ఆని.⇒ మణికొండలో ఆర్టిస్ట్ కడలి సురేష్ గారు ఉండేవారు. పిబ్రవరి ఎనిమిది రెండువేల పదహైదు మధ్యాహ్నం నేనూ, అనంత్ అనే జర్నలిస్టు ఒకాయన కలిసి సురేష్ గారి ఇంటికి వెళ్ళాం ఆయన ఇంటి నిండా నిలువెత్తు కేన్వాసులు, దొంతరలుగా పెయింటింగులు, బొత్తులుగా ఇంకు డ్రాయింగులు, ప్రేములుగా రామాయణం బొమ్మల సిరిస్. అన్నీ అద్భుతాలే. నేను ఒక కంట ఆయన బొమ్మలు మరో దొంగ కంట ఆయనది కాని మరో బొమ్మ చూస్తున్నా, టీవి వెనుక గూట్లో తొంభైల నాటి టేబుల్ క్యాలెండర్ బొమ్మ ఒకటి.ఎక్కడుంది. ప్రతి షీట్ మీద అర చేయంత కొలతలో ముద్రితమైన బొమ్మలు. ముచ్చట గొలిపే బొమ్మలు, అందమైన బొమ్మలు. గంగా, జమున, నర్మద, తమస, గోదావరి, కావేరీ నదీమతల్లుల చరిత్రని ఐదు గళ్ళల్లో బొమ్మలుగా చెప్పిన నీటివర్ణపు చిత్రలేఖనాలు అవి.⇒ గోపీ అనే సంతకమంత సింపుల్ లైన్ బొమ్మలు అవి. పెన్సిల్ పట్టి వంద ఎవరెస్ట్ శిఖరాలు కొలిచినంత సాధన చేస్తే మాత్రమే అబ్బగల బొమ్మలు అవి. గొప్ప బొమ్మల్ని చూస్తే నాకు కంట దుఖం ఆగదు. కన్నీరు అంటే మలినం నిండిన హృదయాన్ని ప్రక్షాళన చేస్తూ కడిగెయ్యడమే, బొమ్మ ముందు నిలబడి ఆ కాసింత సేపు శాపవిమోచనం జరిగిన మనిషిగా మనగలడమే. ఒక సారి రాబర్ట్ ఫాసెట్ అనే గొప్ప చిత్రకారులు గారు చిత్రించిన బొమ్మ చూసి ఇలా కంట తడిపెట్టిన అనుభవం ఉంది నాకు, వాంగాగ్ బొమ్మల గిరికీలలో ఇలానే చాలాసార్లు అయిన సంఘటనలు ఉన్నాయి నాకు. కుంచె అంచున అమృతం చిందించిన వాడికి కూడా మరణం తప్పదా అని మరలి మరలి దుఖం అవుతుంది జీవితం.⇒ సురేష్ గారు వేసిన వేలాది బొమ్మలని వదిలి ఆదిగో ఆ మూల నిలబడి ఉన్న ఆ క్యాలెండర్ నాకు ఇవ్వమని అడగడానికి నాకు ఇబ్బంది అడ్డు వచ్చింది. అడిగినా "అన్వర్ గారు కావలిస్తే నా బొమ్మలు అన్ని పట్టుకెళ్ళండి, గోపి గారిని మాత్రం వదిలి" అనేవారే సురేష్ గారు. ఎందుకంటే గోపీ గారు చిత్రకారులకే చిత్రకారుడు. గోపీ గారి గురించి మహాను’బాపు’ తమదైన పొదుపైన మాటలతో ఇలా అన్నారు. "నాకున్న గురువుగార్ల ల్లో ఒక గురువు శ్రీ గోపి- ఆయన బొమ్మలెప్పుడు చైతన్యంతో తొణికిసలాడుతూ వుంటాయి. ఆయన ఇమాజినేషన్ కూడా అంత డైనమిక్ గా ఉంటుంది-గిజిగాడు అనే పక్షి ఉంది. దాని గూడు మిగతా వాటిలా ఉండదు. అదొక ఇంజనీరింగ్ ఫీట్! పగడ్బందీగా- కొమ్మకు వేలాడుతూ- అంతస్తులు- కిందా పైనా గదులు కలిగి వుండేట్లు అల్లుతుంది. ఒకసారి ఇంజనీర్ల కన్వెన్షన్ సావనీరు పుస్తకానికి ముఖచిత్రం కావలిస్తే , శ్రీ గోపి గారు దానికి ముఖచిత్రంగా గిజిగాడు బొమ్మ వేసి వూరుకున్నారు. భగవంతుని సృష్టికి ఇంజనీర్లు ప్రతి సృష్టి చేస్తారు అన్నది ఆయన భావన. అదీ ఇమానిజషన్ అంటే, అదీ గోపీ అంటే!⇒ ఆర్టిస్ట్ మోహన్ గారు చెప్పేవారు కదా" గోపి అబ్బా! వాడబ్బా! ఉస్మానియా యూనివర్శిటి బిల్డింగ్ అంతటిని వేసి గుంపులు గుంపులుగా ఆ మెట్ల మీద నడిచి వచ్చే వందల కొద్ది స్టూడెంట్స్ బొమ్మ వేశాడబ్బా. చచ్చి పోతామబ్బా ఆ కాంపోజిషన్ చూస్తుంటే, వాడి బొమ్మలు మీరేం చూళ్ళేదబ్బా!, మీరంతా వేస్టబ్బా! మిమ్మల్ని తన్నాలబ్బా" మోహన్ గారికి బాపు, బాలి, చంద్ర, గోపి అంటే వల్లమాలిన ప్రేమ, వ్యామోహం, ఆయన ముందు వాళ్ళని ఏమయినా పొల్లు మాట అని చూడండి, తంతాడు మిమ్మల్ని పట్టుకుని. తరువాత రోజుల్లో ఆదివారపు అబిడ్స్ వీదుల్లో, పాత పుస్తకాల రాశుల్లో మోహన్ గారు చెప్పిన ఆ ఉస్మానియా కాంపోజిషన్ నా కంట పడింది.⇒ అదే కాదు అపరాధ పరిశోధన అనే డిటెక్టీవ్ పత్రికల్లో ఆయన గీసిన కార్టూన్ బొమ్మల క్యారెక్టర్లు, అత్యంత అధునాతనమైన ఆ శైలి ఈరోజు వరకు తెలుగులో ఏ చిత్రకారుడు సాధించలేక పొయారు. అడపా దడపా ఏపిఎస్ ఆర్టిసి వారి కోసం వేసిన పోస్టర్ బొమ్మలు ఆ డ్రయివరు, అ బస్సు, డ్రయివర్ భార్యా పిల్లల బొమ్మల ఫ్రేములనుండి నవ్వుతున్న మొహాలు, టాటా బైబైలు ఏం బొమ్మలవి! ఏం రంగులవి! ఏం రోజులవి! ఏం పత్రికలవి!!! అనగనగా అనే ఆ రోజుల్లో సాహిత్యం- చిత్రకళ పచ్చగా ఉన్న కాలంలో ప్రతి పత్రిక బాపు బొమ్మలతో సింగారించుకునేది.⇒ ఆయన ఒక కన్ను చేతనున్న కుంచెవేపు మరో కన్ను కెమెరా వంక చూస్తూ ఉన్న కాలమది. ఆయన బొమ్మలకై పడిగాపులు కాచే వరుసలో ఉన్న పబ్లిషర్లు, సంపాదకులు, రచయితలు " మీరు కాకపోతే మరో చిత్రకారుడి పేరు చెప్పండి అంటే బాపు గారి పలికిన ఏకవచనం గోపి అనే బొమ్మల సంతకమే"! గోపి గారు అమిత పెర్ఫెక్షనిస్ట్. బొమ్మ ఆయనకు నచ్చేలా వచ్చేదాక జనం ఆగలేరుగా, మళ్ళీ బాపు గారి దగ్గరికి వెళ్ళి "ఏవండి మీరేమో గోపి దగ్గరికి వెళ్లమన్నారు, ఆయనేమో సమయానికి బొమ్మలు ఇవ్వట్లేదు" అని పిర్యాదు చేస్తే "నేను రేడియో మంచిది అన్నాను, అందులో ప్రోగ్రాములు మీకు నచ్చకపోతే నేనేం చెయ్యను" అని ఒక నవ్వు.⇒ గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్ కాలపు మనిషి గోపి. తెలుగు రచనల గోడలన్నీ బాపు బొమ్మల అలంకరణతో, అనుకరణతో నిండి పోయిన పత్రికల రోజులని గోపి అనే దీపం వంటి సంతకం వచ్చి కథల బొమ్మలకి, కవర్ పేజీల డ్రాయింగులకి కొత్త కాంతులు చూపించింది, రేఖ చేసే విన్యాసంలో కానీ, రంగులు అద్దిన మార్గంలో కానీ, మనుషులు నిలబడిన భంగిమలు, పాఠకుడు బొమ్మను చూసిన కోణాలను అన్నిటిని ఆయన డైనమిక్ టచ్ తో మార్చేశారు. రాత్రికి రాత్రి కలలా వచ్చి కూచున్నది కాదు ఆయన చేతిలోని డైనమిక్ టచ్! రాక్షస సాధన అంటారే అలా లైప్ డ్రాయింగ్ ని సాధన చేశాడు ఆయన. మెలకువలో ఉన్న ప్రతి క్షణం ఆయన చేతిలో స్కెచ్ బుక్ ఉండేదిట. కనపడిన ప్రతీది బొమ్మగా మలిచేవారు, చూసిన సినిమా ల్లో సన్నివేశాలు గుర్తు పెట్టుకుని వచ్చి ఆ యుద్ద పోరాటాలు, పోరాటాల వంటి తెలుగు డ్యూయెట్ డాన్సులు, మనిషి వెనుక మనిషి, మనిషి పక్కన మనిషి అనే ప్రేములు అన్నీ బొమ్మలుగా నింపేవారు. ఆయన బొమ్మల పిచ్చికి, ఆ అభ్యాసానికి కాగితాలు, నోటు పుస్తకాలు, చివరికి ఇంటి తెల్ల గోడలు కూడా నల్ల పడిపోయి ఇక గీయటానికి మరేం దొరక్క పలక మీద గీయటం, చెరపటం, మళ్ళీ గీయటం....⇒ హైదరాబాదు మహా నగరంలోని ఆర్టిస్టుల్లో మోహన్ గారు మహా చులకన ఇరవై నాలుగు ఇంటూ ఏడు రోజులు అనే ఎక్కం మాదిరి ఆయన ఎప్పుడయినా దొరికేవాడు, కలవాలి అనుకుంటే బాలి గారు చంద్ర గారు కూడా ఈజీగా దొరికేసి గంటలు గంటలు కూడా దొర్లిపోయేంత కబుర్లుగా దొరికేవారు. చివరకి మద్రాసి బాపుగారిని కూడా నేను ఎప్పుడంటే అప్పుడు దొరికించుకునే వాణ్ణి. గోపి గారే ఎక్కడ ఉంటారో, ఎప్పుడు కనపడతారో, ఒకసారి వదిలిపోతే మళ్ళీ ఎప్పుడు చిక్కుతారో అసలు అర్థం అయ్యేది కాదు. అప్పుడప్పుడు ఫోన్ చేసేవారు "అన్వర్ గురువు గారు ఎలా ఉన్నారు" అని అడిగే వారు. గురువు గారు అంటే బాపు గారు. " మా అబ్బాయికి మ్యూజిక్ మీద మంచి ఆసక్తి ఉంది, ఈ సారి గురువు గారు వస్తే చెప్పు అన్వర్, మా వాణ్ణీ ఎక్కడయినా సినిమాల్లో పెట్టిస్తారేమో కనుక్కుందాం" అనేవారు. అనడం వరకే మాట ఈ జంతరమంతర జీవితంలో ఎవరికీ దేనికే సమయం దొరికే సందే లేదు. చివరకి చూస్తే డైరీల పేజీలన్ని ఖాలీ గానే ఉంటాయి.⇒ పెంటెల్ పాకెట్ బ్రష్ పెన్ అని జపాన్ ది. దాని మీద గోపీ గారికి మనసు పడింది. అది ఒకటి నాకు కావాలి అన్వర్ అని అడిగాడు, దానితో పాటే కొన్ని డిప్ నిబ్స్ కూడా ఇవ్వగలవా అన్నారు? "సార్ కొన్ని రోజులు ఓపిక పట్టండి మనకు మామూలుగా దొరికే, హంట్, విలియం మిషెల్ నిబ్స్ కాకుండా, తచికావా అని కామిక్ నిబ్స్ కొన్ని ఇండియాకు ఇంపోర్ట్ కాబోతున్నాయి, అవి మీకోసం తెప్పిస్తా" అని ఆయన బొమ్మల గుర్రాన్నిపట్టి ఆపి ఉంచా. ఒక రెండు వారాలు గడిచాకా ఫోన్ చేసారు "అంత తొందర ఏమీ లేదులే, ఊరికే ఆ నిబ్బులు అవీ ఎప్పుడు వస్తాయో కనుక్కుందామని" అన్నారు, నాకు ఎంత అయ్యో అనిపించిందో.⇒ మా ఇంపొర్టర్ కి ఫోన్ చేశా. వస్తువులు వచ్చి ఉన్నాయి, కరోనా తలనొప్పి వల్ల కస్టమ్స్ నుండి కంటైనర్ రిలీజ్ కాలేదని వార్త. మరో రెండు వారాలు భారంగా గడిచిపోయాకా అప్పుడు చేతికి వచ్చాయి సరంజామా మొత్తం. రాగానే గోపీ గారికి ఫోన్ చేసా, "ఇంటికి రానా? ఆఫీసుకు రానా?" అన్నారు. అంత పెద్దాయనను రప్పించడం ఎందుకనిలే అని నేనే వస్తా సార్ అన్నా ఆయన వినిపించుకోలా, అసలే నాకు పని పెట్టి అవి తెప్పించానని ఆయనకు గిల్టి గా ఉంది. ఆయనే ఈ మధ్య ఓ మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు. ఎదురు వెళ్ళి ఇంటికి పిలుచుకొచ్చుకున్నా. మా లావణ్య ఇంట లేదు, ఉండి ఉంటే ఇంత ఉడుకుడుకుగా ఏదయినా వండి పెట్టేది. ఆయన్ని కూచోబెట్టి టీ తయారు చేసి తెచ్చా.⇒ అన్నట్టు ఆర్టిస్ట్ చంద్ర గారు టీ ఎంత బాగా పెడతారో, ఆయన చేతి పచ్చిపులుసు,కోడిగుడ్డు పొరటు తిన్నామా! బస్. బొమ్మలు గిమ్మలు మరిచి పోతాము. ఎందుకు లేండి వెధవ బొమ్మలు, ఇంకో గంట ఆశమ్మపోశమ్మ కబుర్లు చెప్పుకుని తిన్నతిండి అరిగాకా ఇంకో ట్రిప్ అన్నంలోకి పచ్చిపులుసు, కోడిగుడ్డు పొరటు కలుపుకుని తిందామా? అని ఆశగా అడిగేంత బాగా వండుతారు. బాపు గారు మంచి కాఫీ కలిపి ఇస్తారు. నా గురించి నేను చెప్పుకోకూడదనుకుంటా కానీ నేను టీ బాగా చేస్తా. గోపి గారు రెండు కప్పులు తాగారు. చీ! ఏం చెబుతున్నా తపేలా కబుర్లు కాకపోతే!! గోపి గారు ఆయన కోసం తెప్పించిన బ్రష్ పెన్నుని చిన్న పిల్లవాడు చాక్లెట్ అందుకున్నంత ఆత్రంగా తీసుకున్నారు, అందులోకి ఇంక్ కాట్రిడ్జ్ బిగించి ఇచ్చి, కుంచెలోకి ఇంకు ప్రవహించడానికి కాస్త సమయం ఇచ్చి, ఇంకా నాదగ్గర ఉన్న రకరకాల పెన్నులు ఆయన కోసమని తీసిపెట్టినవన్ని అందించా.⇒ మురిపంగా ఒక్కో పెన్ను మూత విప్పడం ఆ పక్కన పెట్టి ఉంచిన నోట్ బుక్‌లో గీతలు రాసి చూసుకోడం! ప్రతీది ఒక్కో రకం వయ్యారం పోగానే" అబ్బా! అన్వర్ దీనితో మ్యాజిక్ చేయొచ్చు! అని ముచ్చట పడిపోవడం. బుధా బాడా - మేము యాగే! హూకం కాకి- కాకి కూకే బొమ్మలు కావాలే! అని తోట రాముడు అంటే బ్రష్ పెన్ మాత్రం బొమ్మలు పెడుతుందా? నాకు ఆయన అమాయకత్వం చూస్తుంటే దిగులుగా ఉంది. మ్యాజిక్ అంతా ఆయన చేతిలో ఉంది కదా. ఇటువంటి విదేశీ పనిముట్లు ఏమీ అందుబాటులో లేని రోజుల్లో వట్టి ఈ చేతులతో కదా, ముంజేతుల మీదికి పుల్ హాండ్స్ స్లీవ్స్ మడిచి రూపయిన్నర స్కెచ్ పెన్ తో, మూడు రూపయల జేకే బోర్డ్ పేపర్ మీద కలబడింది.బొమ్మలకు బొమ్మలు ఉత్పత్తి చేసింది. ఆయనలో అన్ని వేల బొమ్మలు వేసినా ఇంకా ఏదో సాధించాలనే ఒక అమాయకత్వం మిగిలి ఉంది, ఉందిలే మంచీ కాలం ముందూ ముందూన అనే పాట ఒకటి ఆయన చెవుల్లో ఎప్పుడూ వినపడుతూనే ఉంటోంది అనుకుంటా.⇒ ప్చ్! మీకు ఏం తెలుసబ్బా? ఏమీ తెలీదు. నా దగ్గర బాపు గారి వేసిన స్టోరీ బోర్డులు ఉన్నాయి, ఎలాంటి వర్క్ అనుకున్నారు అది. ఇండియా మొత్తం మీద అలా ఇండియన్ ఇంకు పెట్టి గీత గీసి ఫోటో కలర్ పూసి అటువంటి బొమ్మ చేయగలిగిన వాడు మునుపు లేడు ఎప్పటికీ రాడు. నెల్లూరు లో రాం ప్రసాద్ గారని ఒక పాత కార్టూనిస్ట్ ఉంటారు, ఆయన దగ్గర బాలిగారు గీసిన పిల్లల బొమ్మల కథలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. అమాంతం రంగుల అడవిలోకి దిగబడి పోయినట్లే- జంగల్ జంగల్ బాత్ చలి హై, అరే చడ్డి పెహన్ కే ఫూల్ ఖిలీ హై అనే పాటను ఆయన తన బొమ్మలతో వినిపించారు. మోహన్ గారు ఒక రాత్రి ఊరికే అలా కూచుని వాత్స్యాయనుడు ఎన్ని జన్మలెత్తినా కనిపెట్టలేని "కామసూత్ర" ని చిత్ర కళా సూత్రాలుగా వందలుగా బొమ్మలు వేశారు అవీనూ ఒక వేపు వాడిపారేసినా ఫోటో స్టాట్ కాగితాలపై, అందునా ముష్టి అఠాణా అప్సరా పెన్సిల్ టూబి చేతపట్టి.⇒ గోపి గారు కనుక కాస్త అసక్తి చూపి గ్రాఫిక్ నావెల్ అనే దారివంక ఒక చూపు చూసి ఉంటే ఇక్కడ కథ వేరే ఉండేది. ఆయన పేరు దేశం అంతా మారుమ్రోగి ఉండేది. ఈయన వంటి కాంపోజిషన్ ని, రేఖని ఈ దేశం తెలిసి వచ్చేది. ఈ రోజు ఫేస్ బుక్ ఉంది, ఇన్స్టాగ్రాం ఉంది, నాకు తెలుసుగా, నేను చూస్తానుగా అందరి బొమ్మలని. ఈ రోజు మన దేశంలో పెద్ద పేర్లు తెచ్చుకున్న కామిక్ బుక్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. బొమ్మలకు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రపంచానికి బొత్తిగా ఇక్కడ బాపు, బాలి, చంద్ర, గోపి, మోహన్, కరుణాకర్, బాబు అనే పేర్లే తెలీవు, వాళ్ళ పనే తెలీదు. వాళ్ల సంగతి ఎందుకు అసలు మీకు తెలుసా వీళ్ళ లైన్ క్వాలిటే అంటే ఏమిటి అని. ఈ రోజు బొమ్మలు వేసే వాళ్లంతా కంట్రోల్ జెడ్,, కంట్రోల్ హెచ్ బాపతు జాతీస్. నల్లని ఇంకు ఒకటి ఒకటి ఉంటుందని అందులో కుంచెని కానీ, నిబ్బుని కాని ముంచి వాటిని ఎకాఎకి పద్నాలుగో గేరు లో పరిగెత్తించి ఎక్కడ కావాలి అంటే అక్కడ ఆపగలిగే కంట్రోల్ చేయగలిగిన చేతి వేళ్ళు మా గురువులకు, పెద్దలకు ఉండేవి. మేము చూశాము ఆ విన్యాసాలని.⇒ అక్కడెక్కడో ఊరి బయట ఆర్టిస్ట్ రాజు గారు ఉంటారు రికామీగా కూచుని వాటర్ కలర్ నీళ్ళల్లో కుంచె ముంచి చలగ్గా డిస్నీ వాడు కూడా ఇమాజిన్ చేయని క్యారెక్టర్ డిజైన్ అలా గీసి పడేసే వారు, మేము పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని టేబుల్ అంచుకు గడ్డాలు ఆనించుకుని అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం మా ఇరవైల ప్రాయాల్లో. ఇప్పటికయినా గట్టిగా రాజుగారి చేతి వేళ్లకు ఒక కెమెరా కన్ను గురిపెట్టి అది జెల్ పెన్ కానివ్వండి, ఇండియనింక్ బ్రష్ అవనివ్వండి, అందివ్వండి. సరసర గీత కట్లపాములా సాగుతుంది, ఆగుతుంది బుసకొడుతుంది. ఇవన్నీ చూడ్డానికి, గ్రహించడానికి మానవజన్మలో ఒక పుణ్యపు నరం చేసుకుని పుట్టుండాలి. అచ్చం రజనీకాంతే అని విరగబడి చూసి నవ్వి కిలకిలలు పోతుంటారు పి ఎస్ బాబు అనే మహా చిత్రకారుడ్ని చూసి, మీ బొంద! ఆయన గారు చందమామ శంకర్, చిత్రాలని ఒక మెట్టు కింద ఆగమని చెప్పి అదే చందమామలో విక్రముడి సాహసాలు అనే బొమ్మల కథ వేశారు. అంత గొప్పగా ఉంటాయి ఆయన బొమ్మలు, ఆ స్పీడ్.ఆ బర్డ్ వ్యూ యాంగిల్.⇒ అదంతా మనకు తెలీని మన చరిత్ర. బాబు గారు, ఇండియా టుడే లో కథలకు బొమ్మలు వేస్తే, కథ కథకు బొమ్మల శైలీ మారిపోయేది, ఆ అమ్మాయి కన్నులతో నవ్వింది అని చెప్పడానికి అందమైన బొమ్మాయికి రెండు కళ్ళకి బద్దులు ముద్దులొలికే నాలుగు పెదాలు వేసి ఊరుకున్నాడు, ఫౌంటైన్ పెన్ తో నలుపు తెలుపు బొమ్మలు వేసేవాడు. సైకిల్ హేండిల్ గట్టిగా బిగించి పట్టిన రెండు పిడికిళ్ళ బొమ్మ ఉంటుంది. ఊరికే ఆ హేండిల్ మీద సర్రున ఒక పెన్ను గీత లాగాడు అంతే! ఎండకు తళ తళ మని మెరిసే సూర్యుని కాంతిలా భగ్గుమంది ఆ గీత. అలాటి ఆర్టిస్ట్ లు ఉన్నారు మనకు, ఉండేవాళ్ళు మనకు అనుకోవాల్సిన ఖర్మ పట్టింది ఇప్పుడు.⇒ సరే, ఏదెట్టా పోతే ఏముందిలే. గోపి గారు ఆ వేళ నా వద్దకు వచ్చి బ్రష్ లు తీసుకున్నారు, పెన్నులు తీసుకున్నారు, ఇంకు పుచ్చుకున్నారు, అన్వర్ ఇది ఉంచుకోవచ్చా, అది ఉంచుకోవచ్చా అని బెంగగా అడిగారు, అవన్ని ఆయన అరచేతుల్లో పెట్టి గట్టిగా దండం పెట్టుకోడం తప్ప బ్రతుకుకు ఇంకేం గొప్ప మిగులుతుంది? "అన్వర్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు" కాస్త సర్దుబాటు అయ్యాక నీకు ఇస్తా అన్నారు. నేనప్పుడు ఆయన ముందు మోకాళ్ల మీద కూచున్నా. " సార్ ఈ రోజు నేనూ, నా కుటుంబం మూడు పూట్ల అన్నం తినగలుగుతున్నాము అంటే మీవంటి వారు మీ బొమ్మల ద్వార మాకు బ్రతుకులకు చూపించిన దారి సార్ ఇది! ఎంత చేస్తే మాత్రం మీకు గురు దక్షిణ ఇచ్చిన రుణం తీరుతుంది.⇒ ఆయన సన్నగా, దయగా నవ్వారు. కాసేపు ఆగి ఆయన్ని తోడ్కొని పిల్లర్ నెంబర్ ఎనభై అయిదు దగ్గరికి వచ్చా, ఆయన అక్కడ వెల్తున్న షేరింగ్ ఆటో ఆపి ఎక్కి, ఒక నల్లని మాస్క్ తీసి మొహానికి తొడుక్కుని నాకేసి చేతులు ఊపారు, మాస్క్ వెనుక ఆయన సన్నగా నవ్వే ఉంటారు. అది నాకు తగిలిన ఆయన చివరి నవ్వని అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలిసింది. బొమ్మలు ఇష్టపడ్డం వేరు, దానిని జీవితాంతం ఆరాధించడం వేరు- బొమ్మలని జీవనోపాధిగా చేసుకోడం వేరు. గోపి గారే కాదు, చాలా మంది చిత్రకారులు చిత్రకళని బ్రతుకుతెరువుగా నమ్ముకుని ఎంత మోసపోవాలో అంత మోసపోయారు.⇒ ఇది మోసమని తెలిసిపోయేసరికి మంచి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని బొమ్మలు కబళించేశాయి. బొమ్మలు తెచ్చి పెట్టని, సంపాదించి పెట్టని డబ్బు లేకపోవడం వలన ఆయన ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడ్డారు. యవ్వనం- ఆరోగ్యం సహకరించినంత కాలం జీవితాన్ని లాగుకుంటూ వచ్చారు. అవి కరువయిన రోజున నేనున్నాని కరోనా వచ్చి ఆయనని కమ్మేసింది. చివరికి మిగిలింది ఏమిటి? ఆయన చేత కదను తొక్కిన కుంచె రాల్చిన బొమ్మలు, ఆ కాగితాలు నశించి పోయాయి, ఆయన బొమ్మల జ్నాపకాల మనుషుల తరం మాసిపోయింది. ఇంకు వాసన, క్రొక్విల్ చప్పుడులు తెలిసిన జ్నానేంద్రియాలు పనిచేయడం మానేసి చాలా కాలమే అయింది. కరోనా వలన కుదరదు కానీ, గోపి గారి భౌతిక దేహం వద్ద కూచుని చెవి దగ్గర "మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఆర్టిస్ట్ గానే పుడతారా గోపీ గారు?" అని అడిగితే ప్రాణం లేని ఆ తల "ఊహు" అని తల అడ్డంగా ఊపడానికి కాస్త ప్రాణం ఖచ్చితంగా తెచ్చుకునేదే. -
Pavithra Chari నా కల నెరవేరింది, ఆయనతో పనిచేయడం నా అదృష్టం
దిల్లీకి చెందిన పవిత్రాచారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... మల్టీ–టాలెంటెడ్ ఆర్టిస్ట్. ప్లేబ్యాక్ సింగర్, సాంగ్ రైటర్, వోకలిస్ట్, కంపోజర్‌గా రాణిస్తోంది. ‘కళ కళ కోసం కాదు. సమాజం కోసం’ అని నమ్మిన పవిత్ర తన ‘కళ’తో వివిధ స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. తాజాగా ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో ‘ఎంటర్టైన్మెంట్’ విభాగంలో చోటు సాధించింది... దశాబ్దకాలం పాటు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఏఆర్ రెహమాన్‌లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేసింది. ప్రతి దిగ్గజం నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందుంటుంది పవిత్ర. ‘శూన్యం నుంచి కూడా రెహమాన్ సంగీతం సృష్టించగలరు’ అంటుంది. 65వ గ్రామీ అవార్డ్‌లలో పవిత్ర పాట ‘దువా’ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీకి నామినేట్ అయింది. హెచ్‌సీఎల్, ఇండిగో ఎయిర్లైన్స్లాంటి ప్రముఖ కంపెనీల యాడ్స్‌లో నటించింది. ‘అనిరుథ్ వర్మ కలెక్టివ్’లో భాగంగా యూఎస్‌లో ఎన్నో ప్రాంతాలలో తన సంగీతాన్ని వినిపించింది. ‘చిత్రహార్ లైవ్’ టైటిల్‌తో చేసిన ఇన్స్టాగ్రామ్ సిరీస్‌కు మంచి పేరు వచ్చింది, ‘ఈ ప్రాజెక్ట్ ద్వారా సంగీతానికి సంబంధించిన నాస్టాల్జియాను హైలైట్ చేశాను. వ్యక్తిగతంగా, ఆన్లైన్లో ఈ ప్రాజెక్ట్‌కు ఎంతో స్పందన వచ్చింది’ అంటుంది పవిత్ర.గత సంవత్సరం కొన్ని అద్భుతమైన వోటీటీ ప్రాజెక్ట్‌లలో భాగమైన పవిత్ర ఆ ప్రాజెక్ట్‌ల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడమే కాదు, తన ప్రతిభతో వాటికి కొత్తదనాన్ని తెచ్చింది. ‘దిల్లీ అమ్మాయి’గా పాపులర్ అయినప్పటికీ పవిత్ర మూలాలు చెన్నైలో ఉన్నాయి. తన సంగీతయాత్రలో భాగంగా దిల్లీ, చెన్నై, ముంబై నగరాల మధ్య తిరుగుతుంటుంది. ఇప్పుడు చెన్నైలో ఎక్కువ రోజులు ఉండడానికి ప్రాధాన్యత ఇస్తోంది. హిందీ పాటలే కాదు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలాంటి భాషల్లోనూ పాడుతోంది. మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో భాగం కావడమే కాదు వాటిపై తనదైన ముద్ర వేయడంలో ప్రత్యేకత సాధించింది పవిత్ర.‘ఒకేదగ్గర ఉండిపోవడం కంటే నిరంతర అన్వేషణతో కొత్త దారులు వెదుక్కోవడం నాకు ఇష్టం. ప్రతి దారిలో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లడం అంటే ఇష్టం. కొత్త ఆసక్తి అన్వేషణకు కారణం అవుతుంది. ఆ అన్వేషణలో భాగంగా కంఫర్ట్‌జోన్ నుంచి బయటికి వచ్చి కొత్త ప్రపంచంలోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది. మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో గుర్తింపు తెచ్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది పవిత్ర. సంగీతం, సామాజికం అనేవి రెండు వేరు వేరు ప్రపంచాలని ఎప్పుడూ అనుకోలేదు పవిత్ర. ఆర్ట్స్–బేస్డ్ థెరపిస్ట్‌గా ఎంతోమందికి సాంత్వన చేకూర్చింది. వారి నడకకు కొత్త బలాన్ని ఇచ్చింది.‘లైఫ్‌స్కిల్స్ ఎడ్యుకేషన్ విత్ మ్యూజిక్’ కాన్సెప్ట్‌తో వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల కోసం సంగీత కచేరీల ద్వారా నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పాటే కాదు పరిశోధన కూడా.. పవిత్రకు సంగీతప్రపంచం అంటే ఎంత ఇష్టమో, సంగీత ధోరణులకు సంబంధించిన పరిశోధన అంటే కూడా అంతే ఇష్టం. ప్రఖ్యాత గాయని శుభాముద్గల్ దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్న పవిత్ర ‘ఖాయాల్’పై ఆసక్తి పెంచుకోంది. ఈ సంగీత ప్రపంచంలోని స్త్రీవాద ధోరణుల గురించి లోతైన పరిశోధన చేసింది. భారత ఉపఖండంలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రధాన రూపం... ఖాయాల్. అరబిక్ నుంచి వచ్చిన ఈ మాటకు అర్థం... ఊహ. ‘హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్యార్థిగా ఖాయాల్ సంగీతంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. పరిశోధన ఫలితంగా కొత్త విషయాల పట్ల అవగాహన ఒక కోణం అయితే నా గానాన్ని స్వీయ విశ్లేషణ చేసుకోవడం మరో కోణం’ అంటున్న పవిత్ర ఖాయాల్ సంగీతానికి సంబంధించి రిసోర్స్ బ్యాంక్‌ను తయారు చేసింది. దీనికి ముందు ఖాయాల్ రచనలు, వాటి మూలం, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అధ్యయనం చేసింది. ఎంతోమంది నిపుణులతో మాట్లాడింది. -
ప్రాణమున్నగోడలు
బయటి గోడలు ఎలా ఉంటే ఏంటి అనుకుంటారు చాలామంది.అరె.. ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనేలా చేస్తుంది స్నేహ చక్రవర్తి. ఎత్తుగా ఉండే గోడలపై భారీ మ్యూరల్స్ గీయడం సవాలు.మహిళా ఆర్టిస్ట్‌గా ఆ సవాలును ఎదుర్కొంది స్నేహ.దేశంలో గొప్ప కుడ్య చిత్రకారిణిగా ఉన్నఆమె జీవన విశేషాలు.కూర్గ్ కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులు, కొచ్చిలో చేపలు పట్టే బెస్తవారు, బెంగళూరులో ఇడ్లీ హోటల్ నడిపే ముసలామె, తమిళనాడులో తిరిగే జడలు గట్టిన సాధువులు, కష్టజీవులు, శ్రామిక మహిళలు... వీరిని భారీ బొమ్మలుగా ఎప్పుడైనా గోడల మీద చూశామా? స్నేహ చక్రవర్తి ‘మ్యూరల్స్’ (కుడ్య చిత్రాలు– గోడ బొమ్మలు) చూస్తే వీరే కనపడతారు. ‘దేశంలో ఎవరూ గమనించని జీవన ΄ోరాట యోధులు వీరంతా. వీళ్లను బొమ్మల్లో చూపడమే నా లక్ష్యం’ అంటుంది స్నేహ చక్రవర్తి. గత సంవత్సరం ఆమె ‘ట్రావెల్ అండ్ పెయింట్ ఇండియా’ పేరుతో భారత దేశ యాత్ర చేసింది. కూర్గ్‌తో మొదలెట్టి హిమాచల్ ప్రదేశ్ వరకూ అనేక రాష్ట్రాల్లో తిరుగుతూ గోడల మీద భారీ చిత్రాలు గీసింది. వాటిలో ప్రధాన అంశం సామాన్యులు, సామాన్య జీవనం... దానిలోని సౌందర్యం. ‘దేశమంటే వీళ్లే’ అంటుంది స్నేహ.సొంత ఊరు ఢిల్లీఢిల్లీలో పుట్టి పెరిగిన స్నేహ అక్కడ చదువు పూర్తి చేసింది. ఆమె తండ్రి ఇంజినీర్, తల్లి గృహిణి. ‘నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు చేతుల మీద మెహందీ వేసే ఒక మహిళ వచ్చింది. ఆమె వేసిన డిజైన్లు నన్ను ఆకర్షించాయి. ఆమె మా పక్కింటికి వెళితే అక్కడకు కూడా వెళ్లి ఆమె మెహందీ వేయడం చూశాను. మరుసటి రోజే అమ్మను అడిగి మెహందీ తెచ్చి ట్రై చేశాను. నాకు మెహందీ వేయడం వచ్చేసింది. ఎనిమిదేళ్లకు మా ఏరియాలో గిరాకీ ఉన్న మెహందీ ఆర్టిస్ట్‌ను అయ్యాను. అయితే కళ అన్నం పెట్టదు అనే భావనతో ఏదైనా పని చేయమని నన్ను మా తల్లిదండ్రులు కోరారు. వారి కోసమని ఒక ఎయిర్‌లైన్స్ సంస్థలో ఇంటీరియర్ డిజైనర్‌గా చేశారు. కాని ఇలా ఒకరి కింద పని చేయడం నాకు నచ్చలేదు. నా మనసు అక్కడ లేదు. నేను రంగుల కోసం పుట్టాను. రంగుల్లో మునుగుతాను. నా బొమ్మలు అందరూ చూడాలి. అంటే నేను మ్యూరలిస్ట్‌గా, స్ట్రీట్ ఆర్టిస్ట్‌గా పేరు గడించాలి. ఆ విషయం ఇంట్లో చెప్పి 2018 నుంచి మ్యూరలిస్ట్‌గా మారాను’ అని తెలిపింది స్నేహ చక్రవర్తి.జటిలమైన చిత్రకళకాన్వాస్ మీద బొమ్మ గీయడం వేరు... ఒక పెద్ద గోడను కాన్వాస్‌గా చేసుకోవడం వేరు. కాగితం మీద వేసుకున్న బొమ్మను పదింతలు ఇరవై యింతలు పెంచి గోడ మీద గీస్తారు. దొంతీలు కట్టుకుని గోడ మీద బొమ్మ వేస్తే మళ్లీ కిందకు దిగి దూరం నుంచి చూసుకుంటూ బొమ్మను అంచనా కడుతూ గీయాలి. సాధారణంగా మగవారు ఈ ఆర్ట్‌లో ప్రావీణ్యం సం΄ాదిస్తారు. మ్యూరలిస్ట్‌లుగా ఉన్న మహిళలు తక్కువ. వారిలో స్నేహ చక్రవర్తి పేరు పొందింది. పూణె, ముంబై స్లమ్స్‌లో ఆమె గీసిన బొమ్మలు ఆ మురికివాడలకు జీవం, ప్రాణం ΄ోశాయి. ‘అందమైన బొమ్మ ఉన్న గోడ దగ్గర ఎవరూ చెత్త వేయడానికి ఇష్టపడరు. ఉమ్మివేయరు’ అని చెప్పింది స్నేహ. స్త్రీలు– సందేశాలు‘నా మ్యూరల్స్‌తో స్త్రీల సాధికారతను చూపిస్తుంటాను. స్వేచ్ఛాభావనను చూపుతుంటాను. సరైన సందేశాలు కూడా ఇస్తుంటాను. ఒకసారి ఒక పెద్ద స్త్రీ బొమ్మ గీచి ఫర్ సేల్ ఫర్ సేల్ అని చాలాసార్లు ఆ స్త్రీ బొమ్మ చుట్టూ రాశాను. ΄ోర్నోగ్రఫీ వల్ల స్త్రీ దేహం అమ్మకానికి సులువుగా దొరుకుతుందన్న భావన పురుషులలో ఉంటుంది. అలాంటి భావజాలం ఎంత దుర్మార్గమైనదో తెలిసొచ్చేలా ఆ బొమ్మ గీశాను. దానికి మంచి స్పందన వచ్చింది. గోడలు లేని ప్రపంచం లేదు. అందుకే నేను ప్రపంచమంతా తిరిగి బొమ్మలు వేస్తాను. నా బొమ్మ ప్రతి దేశం గోడ మీద మన ప్రజలను, సంస్కృతిని చూ΄ాలన్నదే నా కోరిక’ అని తెలిపింది స్నేహ. View this post on Instagram A post shared by Sneha Chakraborty (@lbc_sneha) -
ఆకాశంలోకి నిప్పుల నిచ్చెన వైరల్ వీడియో
‘అరోరా బొరియాలిస్’ ఆకాశంలో అద్భుతం సృష్టించగా తాజాగా మరో అద్భుతం విశేషంగా నిలుస్తోంది. ఎర్రని నిప్పుల సెగ కక్కుతున్న నిచ్చెన మెట్ల వెలుగులు ఆకాశం వైపు దూసుకెళ్లడం నెట్టింట చక్కర్లు కొడుతోంది.విషయం ఏమిటంటే..ఈ వీడిలో పదేళ నాటిదట. చైనీస్ బాణసంచా కళాకారుడు కాయ్ గువో-కియాంగ్ దీన్ని రూపొందించారు. ఆకాశంలోకి సుమారు అర కిలోమీటర్ ఎత్తు వరకు నిప్పుల నిచ్చెన ఆకారంలో టపాసులు పేలుతూ అద్భుతంగా మారింది.As a tribute to his grandmother, a Chinese artist and pyrotechnic expert created this stairway to Heaven. Stunning. pic.twitter.com/aNmc7YGcKf— Juanita Broaddrick (@atensnut) May 13, 2024ఈ కళాకారుడి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్టెయిర్ వే టు హెవెన్ పేరిట పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఓ చైనీస్ ఆర్టిస్ట్ క్రియేటివిటీకి మచ్చుతునక అంటూ నెటిజన్లు ప్రశంసించారు. కాయ్ తన అమ్మమ్మకు నివాళిగా దీన్ని తయారు చేశాడు. 1,650 అడుగుల ఎత్తు (లేదా 502 మీటర్లు) "స్కై ల్యాడర్" రాగి తీగలు, గన్‌పౌడర్‌తో తయారు చేశాడని వైస్ ఒక నివేదికలో తెలిపింది. అలా కళాకారుడిగా మారాలని కల నెరవేర్చుకోవడంతోపాటు, నివాళిగా కాయ్ గో క్వింగ్ అనే కళాకారుడు ఇలా నింగిలోకి టపాసులను కాల్చినట్లు వివరించింది. ఇలా కాయ్ ఎక్స్‌ప్లోజివ్ ఆర్టిస్ట్‌గా పేరొందాడు.1994లోనే తొలిసారిగా అతను ఈ తరహా ట్రిక్ కోసం ప్రయత్నించినప్పటికీ భారీ గాలుల వల్ల అది విజయవంతం కాలేదట. అలాగే 2001లో మరోసారి ప్రయత్నం చేయాలనుకున్నా అమెరికాలో జరిగిన 9/11 ఉగ్ర దాడుల నేపథ్యంలో చైనా ప్రభుత్వం అందుకు అనుమతి లభించలేదట. కాగా 1957లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని క్వాన్‌జౌ నగరంలో జన్మించారు కాయ్ గువో-కియాంగ్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. -
కళసాకారం..
ప్రభుత్వ బడులకు పండుగొచ్చింది. స్కూళ్లు పిల్లలతో కళకళలాడుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఎవరూ కలలో కూడా ఊహించనిదీ విప్లవాత్మక మార్పు.మార్పులో మేము సైతం అంటూ పాలుపంచుకుంది హైదరాబాద్ కు చెందిన యువ ఆర్టిస్ట్ విజయ్,స్వాతి జంట. పిల్లల నవ్వులతో మమేకమైంది.. బడి ప్రాంగణాలే కాన్వాసుగా వారి ఆటపాటలే కుంచెలుగా మలచి వర్ణచిత్రాలను ‘రంగ’రించింది. పాఠశాలకు జీవం ఉట్టిపడే చిత్రాలతో కొత్త కళ తెచ్చింది. ఆ యువ ఆర్టిస్టు జంటతో ‘సాక్షి’ ముచ్చటించింది. వారి మాటల్లోనే.. అలా మొదలైంది: మేం ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం వాటితో అనుబంధం ఉంది. గత 2017లో ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని మాకు చేతనైన విధంగా రంగులద్దాం. ఆ సమయంలో ఎవరైనా చొరవ తీసుకుని అన్ని స్కూళ్లకు ఇలాగే రంగులద్దితే ఎంత బావుండో అనుకున్నాం. పూజారి కోరిందీ దేవుడు ఇచ్చిందీ ఒకటే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ స్కూల్లో లార్జ్‌స్కేల్ ఆర్ట్ వర్క్స్ కోసం మమ్మల్ని చింతూరు ఐటీడీఎ పీవో అప్రోచ్ అయ్యారు. అలా 2020లో జులై నెలలో నాడు–నేడు కోసం మా వర్క్ స్టార్ట్ అయింది. అది కేవలం మా బొమ్మల వరకే కాదనీ, మొత్తం పాఠశాలల రూపు రేఖలే మార్చే కార్యక్రమం అనీ తెలిశాక మా ఆనందం రెట్టింపయింది. మా కల నిజం అవుతోందని సంబరపడ్డాం. ఆర్ట్ వర్క్ కోసం రోజుల తరబడి ఆయా స్కూళ్లలో గడిపాం. పిల్లలు చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు.. హ్యాపీగా ఫీలైన జాయ్ మూమెంట్స్‌ని క్యాప్చర్ చేసి వాటినే ఆర్ట్ వర్క్స్‌గా మలిచాం. తద్వారా పిల్లలు మరింతగా వాటితో కనెక్ట్ అయ్యారు. వాళ్లని వాళ్లు 30–30 స్కేల్ ఆర్ట్ వర్క్‌లో చూసుకుని థ్రిల్ అయ్యేవారు. పదే పదే చూసుకోవడం, పేరెంట్స్‌కి, ఫ్రెండ్స్‌కీ చూపించే సమయంలో వాళ్ల ముఖంలో సంతోషం అమూల్యం. మాటల్లో వర్ణించలేం. అలా హెడ్ మాస్టర్, టీచర్లు, స్టాఫ్.. మా స్కూల్‌కు బెస్ట్ ఆర్ట్ వర్క్ చేయండి అంటూ అడిగి మరీ చేయించుకున్నారు. చాలా వరకూ ట్రైబల్ ఏరియా స్కూల్స్‌లో చేశాం. ప్రతీ స్కూల్లో వర్క్ ముగించుకుని వచ్చేటప్పుడు చుట్టాలను వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవ విజయంలో మాకు కూడా చిన్న పాత్ర ఉండడం జీవితంలో మేం మర్చిపోలేని మధుర జ్ఞాపకం. – సత్యార్థ్ నాడు అలా.. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే. సర్కారు బడులంటే టాయిలెట్స్ కనిపించవు, పైనా కిందా గచ్చు పెచ్చులూడుతూ ఉంటుంది. వానపడితే పుస్తకాలు బల్లల కింద దాచుకోవాలి. ఫ్యాన్లు శబ్ధాలు చేస్తాయి తప్ప తిరగవు. బాగా పాఠాలు చెప్పే టీచర్లు కరువు. ప్రాంగణం పందులు, పశువులకు ఆలవాలం. అందువల్లే పిల్లలను చేర్చలేని దుస్థితి. నేడు ఇలా.. బెస్ట్ బెంచీలు, గ్రీన్ బోర్డ్స్, ఫ్లోరింగ్, ఫ్యాన్స్, టాయిలెట్స్, క్రీడా పరికరాలతో సహా ప్లే గ్రౌండ్, పుస్తకాలు, బ్యాగ్స్, ట్యాబ్స్.. పూటకో మెనూతో మధ్యాహ్న భోజనం.. ఇలా కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా చక్కటి వసతులు సమకూరాయి. పిల్లలు, టీచర్లలో నవోత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే జాయిన్ చేయాలి అనే పరిస్థితి వచ్చింది. -
అలరించిన జాతీయ సంస్కృతి మహోత్సవాలు (ఫొటోలు)
-
రణ్వీర్ దశావతార్
తమ అభిమాన హీరో బొమ్మ గీసి ముచ్చటపడే అభిమానులు మనకు కొత్తేమీ కాదు. అయితే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అభిమాని పౌమిల్ కత్రి వినూత్న శైలితో తన అభిమానాన్ని చాటుకున్నాడు. రకరకాల స్కెచ్‌లు ఉన్న పరికరంతో కాన్వాస్‌పై ఒకే సమయంలో వివిధ సినిమాలలోని రణ్వీర్ క్యారెక్టర్లను గీసి నెటిజనులను ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ‘మేడ్ 10 స్కెచెస్ ఆఫ్ రణ్‌వీర్‌సింగ్ ఎట్ ఏ సేమ్ టైమ్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసి ముచ్చటపడిన రణ్‌వీర్‌సింగ్ పౌమిల్ను ప్రశంసిస్తూ కామెంట్ పెట్టడం మరో విశేషం. ఇక టాలెంటెడ్ ఆర్టిస్ట్ పౌమిల్ కత్రి విషయానికి వస్తే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన కత్రికి ఇన్‌స్టాగ్రామ్‌లో వందలాదిమంది ఫాల్వర్స్ ఉన్నారు. -
మంచు పడవ..కేవలం శిల్పం కాదు! అలా నీటిలో చక్కర్లు కొట్టేయొచ్చు!
మంచుతో రకరకాల కట్టడాల నమూనాలను, శిల్పాలను రూపొందించడం తెలిసిందే! ఇవాన్ కార్పిత్స్కీ అనే బెలారష్యన్ కళాకారుడు ఏకంగా మంచుపడవనే రూపొందించాడు. ఇది పడవ ఆకారంలో రూపొందించిన కళాఖండం కాదు, నీళ్లల్లో ప్రయాణించగలదు. హిమశిల్పాలంటే విపరీతమైన ఇష్టం ఉన్న ఇవాన్, ఏళ్ల తరబడి కఠోర సాధన చేసి రకరకాల హిమశిల్పాలను రూపొందిస్తుంటాడు. అవి కేవలం శిల్పాల్లాగానే కాదు, అచ్చంగా అసలు వాటిలా పనిచేసేలా రూపొందించడమే ఇవాన్ ప్రత్యేకత! తొలిసారిగా 2020లో అతడు మంచుతో వయోలిన్ తయారు చేసి, వార్తలకెక్కాడు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా శీతకాలంలో మంచుగడ్డ కట్టే ప్రదేశాలకు వెళ్లి, అక్కడ మంచు శిల్పాలను తయారు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఈసారి శీతకాలంలో ఈ మంచుపడవను తయారు చేశాడు. బెలారష్యా రాజధాని మిన్స్క్ నగరానికి చేరువలో ఉండే స్న్యాన్స్కో రిజర్వాయర్ ఒడ్డున కూర్చుని ఇవాన్ ఈ పడవను తయారు చేశాడు. తయారీ పూర్తయ్యాక మంచుపడవలో కూర్చుని రిజర్వాయర్ నీటిలో చక్కర్లు కొట్టాడు. (చదవండి: ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!) -
Grammy Awards 2024: భారత్‌కు ‘గ్రామీ’ సంబరం
ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. 2024 సంవత్సరానికి గాను ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్ నగరంలో ఆదివారం రాత్రి ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్‌కు మొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. న్యూఢిల్లీ: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్లో ఆదివారం పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహాదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీలు వరించాయి. జాకీర్ హుస్సేన్కుమొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్‌లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్‌కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్రామ్, జాకీర్ హుస్సేన్‌కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుస్సేన్‌కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్(పాష్తో), బెస్ట్ కాంటెపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్(యాజ్ వీ స్పీక్) కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్‌లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. గ్రామీ విజేతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. టేలర్ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఈ ఏడాది 80కి పైగా కేటగిరీల్లో గ్రామీ పురస్కారాలు ప్రదానం చేశారు. ‘మిడ్నైట్స్’ ఆల్బమ్కుఅమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకిది నాలుగోసారి! మిలీ సైరస్కు రికార్డు ఆఫ్ ద ఇయర్ (ఫ్లవర్స్), బిల్లీ ఐలి‹Ùకు సాంగ్ ఆఫ్ ద ఇయర్ (వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?) గ్రామీలు దక్కాయి. ‘బెస్ట్ న్యూ ఆర్టిస్టు’ విభాగంలో విక్టోరియా మాంట్ గ్రామీని సొంతం చేసుకున్నారు. -
దశకుంచెల చిత్రకారుడు! ఏకాకాలంలో ఎడాపెడా..
ఎంతటి చేయితిరిగిన చిత్రకారుడైనా ఒకసారి ఒకే కుంచెను చేత్తో పట్టుకుని బొమ్మలు చిత్రించగలడు. అతి అరుదుగా కొందరు రెండు చేతులతోనూ చెరో కుంచె పట్టుకుని బొమ్మలు గీయడానికి ప్రయత్నించవచ్చు. అయితే, ఈ బెలారష్యన్ కళాకారుడు మాత్రం రెండు చేతులతోనూ పదికుంచెలు పట్టుకుని, వాటితో ఏకకాలంలో ఎడాపెడా కళ్లుచెదిరే బొమ్మలు చిత్రిస్తూ, చూసేవాళ్లను నోరెళ్లబెట్టేలా చేస్తున్నాడు. ఈ కళాకారుడి పేరు సర్జీ ఫీలింగర్. మొదట్లో అందరిలాగానే పద్ధతిగా ఒకసారి ఒక కుంచె పట్టుకునే బొమ్మలు వేసేవాడు. ఇలా బొమ్మలు వేసేటప్పుడు ఒక్కోసారి ఒక్కో కుంచెను మార్చాల్సి వచ్చేది. బొమ్మ గీసే ప్రక్రియ ఆలస్యమయ్యేది. ఇదంతా చిరాకనిపించడంతో కాస్త వెరైటీగా ప్రయత్నిద్దామనుకున్నాడు. రెండు చేతుల వేళ్లకూ పది కుంచెలను తగిలించుకుని, వాటిని రంగుల్లో ముంచి ఏకకాలంలో పది కుంచెలతోనూ బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నట్లుగా సర్జీ బొమ్మలు అద్భుతంగా రావడం మొదలైంది. అతడు బొమ్మలు గీసే ప్రక్రియ మాత్రమే కాదు, అతడి బొమ్మలు కూడా సందర్శకులను ఆకట్టుకోవడంతో అనతి కాలంలోనే సెలబ్రిటీ పెయింటర్‌గా మారాడు. గడచిన రెండేళ్లలో సర్జీ తన బొమ్మలతో జర్మనీ, పోలండ్, ఇటలీల్లో ప్రదర్శనలు ఇచ్చాడు. ఆ ప్రదర్శనల్లో అతడి పెయింటింగ్స్ కళ్లుచెదిరే ధరలకు అమ్ముడయ్యాయి. (చదవండి: ముక్కుతో 'ఈల' పాట విన్నారా? ఈ విలక్షణమే ఆమెను..) -
ఏపీలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
కళాకారుల జీవితాల్లో కాంతులు నింపిన జగనన్న ప్రభుత్వం
సాక్షి, విజయవాడ: సాంస్కృతిక సంబరాల్లో గుర్తించిన కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని.. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖామాత్యులు ఆర్.కె. రోజా అన్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి (భాషా సాంస్కృతిక శాఖ) ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించగా మంత్రి రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ యల్. జోగి నాయుడు, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష, దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ కె. సత్య శైలజ, సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి, సంగీత నృత్య అకాడమీ చైర్ పర్సన్ పి.శిరీష, సైన్స్&టెక్నాలజీ అకాడమీ చైర్ పర్సన్ టి.ప్రభావతి, అధికార భాషా సంఘం సభ్యులు మస్తానమ్మ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సీఈవో .మల్లిఖార్జునరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. తోటి కళాకారులందరికీ గుర్తింపుకార్డుల పంపిణీ కార్యక్రమంలో ఓ మంత్రిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. నవరత్నాలు పథకాల ద్వారా కళాకారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేకూర్చిందన్నారు. రాష్ట్రం విడిపోయాక కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని.. గుర్తింపు కార్డులు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. కళాకారుల డేటా తీసుకోకపోవడం వల్ల కళాకారులకు తగిన న్యాయం జరగలేదన్నారు. కానీ అధికారం చేపట్టిన నాటి నుండి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళాకారులకు అండగా నిలబడ్డారన్నారు. అందుకే తనకు మంత్రిగా అవకాశం కల్పించారని తెలిపారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కళాకారుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానన్నారు. కళాకారుల వినతిపత్రాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోందని స్పష్టం చేశారు. సాంస్కృతిక సంబరాల్లో కళాకారుల డేటా సేకరణ ద్వారా నిజమైన కళాకారులను గుర్తించామన్నారు. ఇప్పుడు ఆ కళాకారులకు గుర్తింపు కార్డులు కూడా అందజేస్తున్నామన్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని గ్రామ/వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా కళాకారులు దరఖాస్తు చేసుకుని గుర్తింపు కార్డులు పొందవచ్చన్నారు. ప్రతిష్ఠాత్మక జీఐఎస్, జీ20 కార్యక్రమాల్లో మన కళాకారుల ప్రదర్శనలకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర చరిత్రలో 99 శాతం హామీలను నాలుగున్నరేళ్లలో అమలు చేయడమే గాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రాధాన్యం ఇచ్చింది సీఎం జగన్ ఒక్కరే అన్నారు. ఇలా సంక్షేమమే లక్ష్యంగా ముందుకువెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కళాకారులే బాధ్యతగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ యల్. జోగి నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించడం చారిత్రాత్మకమన్నారు. ఈ విషయంలో కళాకరులందరూ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారన్నారు. గ్రామ/వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఎమ్మార్వో, ఆర్డీవోల ద్వారా పారదర్శకంగా కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. స్వతహాగా కళాకారుడైన తనకు క్రియేటివ్ హెడ్ గా పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్క్షతలు తెలిపారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఆర్.కె.రోజా ఈ శాఖకు మంత్రి అయిన తర్వాత మరింత వన్నె తెచ్చారన్నారు. కరోనా తర్వాత కళలు, క్రీడలు పునర్ వైభవాన్ని కోల్పోగా.. వాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పునరుత్తేజం వచ్చిందన్నారు. సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మనదేశాన్ని సాంప్రదాయ కళలు, సంస్కృతులే అత్యున్నత స్థాయిలో ఉంచాయన్నారు. కళలు, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవిస్తోందని.. అందుకే అన్ని అకాడమీలకు చైర్మన్లు, చైర్ పర్సన్ లను నియమించిందన్నారు. రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష మాట్లాడుతూ.. మనిషి పుట్టుక నుంచి చావు వరకు జరిగే ప్రతి కార్యక్రమంలో కళాకారులకే ప్రాధాన్యం లభిస్తుందన్నారు. కళ కల కోసం కాదని ప్రజల కోసమని తెలిపారు. గుర్తింపు కార్డులు అందించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాల్లో కళాకారులకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. అధికార భాషా సంఘం సభ్యులు మస్తానమ్మ మాట్లాడుతూ.. నేడు రాష్ట్రవ్యాప్తంగా కళాకారుల కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, రాయితీలు అందించేందుకు మంత్రి రోజా అహర్నిశలు కృషి చేశారన్నారు. సైన్స్&టెక్నాలజీ అకాడమీ చైర్ పర్సన్ టి.ప్రభావతి మాట్లాడుతూ.. స్వతహాగా వైద్యురాలు అయిన తనకు ఈ పదవి ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నీతి, ప్రేమ, తగ్గింపు స్వభావం వంటి సుగుణాలు కలిగిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ కె. సత్య శైలజ మాట్లాడుతూ.. చిత్ర కళాకారులకు కూడా గుర్తింపు కార్డులు అందజేయాలని ఆకాంక్షించారు. కళాకారుల సంక్షేమం కోసం పరిపాలన సాగిస్తూ ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కళాకారులంతా అండగా నిలబడాలన్నారు. కార్యక్రమ అనంతరం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వివిధ రంగాలకు చెందిన 4వేల మంది కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
నేటి నుంచి రామోత్సవాలు.. 35 వేలకుపైగా కళాకారుల ప్రదర్శనలు!
జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. నేటి (సోమవారం)నుంచి అయోధ్యలో రామోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మనదేశానికి చెందిన కళాకారులతో పాటు ప్రపంచం నలుమూల నుంచి వచ్చే 35 వేలకుపైగా కళాకారులు పాల్గొననున్నారు. రామకథా పార్కులో నేటి నుంచి రామకథ ప్రారంభం కానుంది. నేటి నుంచి అయోధ్యలోని సరయూ నది ఒడ్డున హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమయంలో కళాకారులు తమ కళాప్రతిభను ప్రదర్శించనున్నారు. రామోత్సవ్లో 35 వేల మంది కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అయోధ్యలో త్వరలో బాలరాముని విగ్రహప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రజలు రామభక్తిలో మునిగిపోయారు. త్వరలో అహ్మదాబాద్‌లో జరిగే కైట్ ఫెస్టివల్లో కూడా రామనామం వినిపించనుంది. రాముని చిత్రాలతో కూడిన గాలిపటాలు తయారు చేసి, ఆకాశంలో ఎగురవేస్తున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర రజనీకాంత్ పటేల్ స్వయంగా రాముని చిత్రపఠంతో కూడిన గాలిపటాన్ని ఎగురవేయనున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో శ్రీరాముణ్ణి కీర్తించనున్న దివ్యాంగ కవి -
వెలుగులు చిమ్మిన నందులు
‘కళలు ఉన్నంతకాలం నా గుండెను వేదిక చేస్తా కళాకారుణ్ణి బతికిస్తా...’ ఇది ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కళాకారులకు ఇచ్చిన భరోసా. డిసెంబర్ 23 నుంచి 29 వరకు గుంటూరు నగరంలో రాష్ట్ర ప్రభుత్వ 2022 వ సంవత్సర ‘నంది’ నాటకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండీ వందల సంఖ్యలో కళాకారులు ఏడురోజులూ ఉత్సాహంగా వీటిలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ‘చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ’ ఆధ్వర్యంలో స్వర్గీయ బలిజేపల్లి లక్ష్మీకాంతం కళాప్రాంగణం (శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం – ఎ.సి.) ఇందుకు వేదికైంది. ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి పర్యవేక్షణలో విజయ కుమార్ రెడ్డి, శేషశాయి ఇత్యాది ఉన్నతాధికారులు, సిబ్బంది చేసిన ఏర్పాట్ల పట్ల కళాకారులు సంతుష్టి వ్యక్తం చేశారు. కళాకారులకు, అతిథులకు, ప్రదర్శన లకు చేసిన ఏర్పాట్లు తదితర అంశాల్లో ఈ ఉత్సవాలకూ గతంలో జరిగిన ఉత్సవాలకూ హస్తిమశకాంతరం ఉందనీ, ఇంత ఘనంగా, ఎంతో పారదర్శకంగా... మరీ ముఖ్యంగా టైమ్ ప్రకారం – గతంలో ఎన్నడూ జరగ లేదని పలువురు కళాకారులు అన్నారు. ఆర్టిస్టులకు, అతిథులకు స్టార్ హోటళ్లలో బస ఏర్పాటుచేశారు. అల్పాహార, భోజన సదుపాయం పట్ల కూడా అందరూ ఆనందం వ్యక్తం చేయడం విశేషం. రెండు మూడు తరగతులు చదువుతున్న బుడతల నుండి... జీవితాన్ని కాచి వడపోసిన... డెబ్భైలు దాటిన సీనియర్ మోస్ట్ కళాకారుల వరకూ పాల్గొనడం ఈ ఉత్సవాల ప్రత్యేకత. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ‘2022 నంది నాటక ఉత్సవా’లను ఇప్పుడు నిర్వహించారు. వివిధ విభాగాలకు సంబంధించి 115 ఎంట్రీలు రాగా ప్రాథమిక పరిశీలన అనంతరం– పద్య నాటకాలు 10 (ప్రదర్శన పారితోషికం రూ. 50 వేలు), సాంఘిక నాటకాలు 6 (రూ. 40 వేలు); సాంఘిక నాటికలు 12 (రూ. 25 వేలు); బాలల విభాగంలో 5 (రూ. 25 వేలు); కాలేజీ, యూనివర్శిటీ విద్యార్థుల విభాగంలో 5 (రూ. 25 వేలు) మొత్తం 38 నాటక, నాటికలను ప్రద ర్శించారు. మొత్తం 72 బహుమతుల కోసం దాదాపు పన్నెండొందల మంది కళాకారులు హోరాహోరీ తల పడ్డారు. పద్య నాటక విభాగంలో మాధవవర్మ – విజయవాడ (ప్రథమ రూ. 80 వేలు, బంగారు నంది), శ్రీకాంత కృష్ణమాచార్య – విశాఖ (ద్వితీయ రూ. 60 వేలు, రజిత నంది); వసంతరాజీయం – హైదరాబాద్ (తృతీయ రూ. 40 వేలు, కాంస్య నంది) విజేతలుగా నిలిచాయి. అలాగే.. సాంఘిక నాటకాల విభాగంలో ఇంద్ర ప్రస్థం – గుంటూరు (రూ 70 వేల నగదు, బంగారు నంది), ఇంపోస్టర్స్ – హైదరాబాద్ (రూ. 50 వేల నగదు, రజత నంది); కలనేత – హైదరాబాద్ (రూ. 30 వేల నగదు, కాంస్య నంది); సాంఘిక నాటికల విభా గంలో అస్తికలు – పెదకాకాని (రూ. 40 వేల నగదు, బంగారు నంది), కమనీయం – గుంటూరు (రూ. 30 వేల నగదు, రజత నంది), చీకటిపువ్వు – కరీంనగర్ (రూ. 20 వేల నగదు, కాంస్య నంది); బాలల విభాగంలో ప్రపంచతంత్రం – విజయవాడ (రూ. 40 వేల నగదు, బంగారు నంది), బాధ్యత – రాప్తాడు (రూ. 30 వేల నగదు, రజత నంది), మూడు ప్రశ్నలు – విజయవాడ (రూ. 20 వేల నగదు, రజత నంది); యువజన విభాగంలో ఇంకానా..? – విజయవాడ (రూ. 40 వేల నగదు, బంగారు నంది), కపిరాజు – గుంటూరు (రూ. 30 వేల నగదు, రజత నంది), ఉద్ధంసింగ్ – తిరుపతి (రూ. 20 వేల నగదు, కాంస్య నంది) బహుమతులను గెలుచుకున్నాయి. నాటకరంగంపై రచనల్లో ‘రాయలసీమ నాటక రంగ వికాసం’ (రచయిత డా. మూల మల్లికార్జునరెడ్డి) ఉత్తమ రచనగా ఎంపికైంది. ‘ఎన్టీఆర్ స్మారక రంగస్థల పురస్కారా’న్ని డా. మీగడ రామలింగస్వామి – విశాఖకు (రూ. 1.5 లక్షల నగదు, ప్రత్యేక జ్ఞాపిక), ‘వైఎస్సార్ స్మారక రంగస్థల అవార్డ్’ను యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్–కాకినాడ (రూ. 5 లక్షల నగదు, ప్రత్యేక జ్ఞాపిక)ను అందించారు. దర్శకత్వం, రచన సహా పలు అంశాల్లో వ్యక్తిగత అవార్డులు, నగదు బహుమతులు అందజేశారు. వ్యక్తిగత బహుమతుల నగదు మొత్తాన్ని ఐదురెట్లు పెంచుతున్నట్లు చైర్మన్ పోసాని ప్రకటించడంతో కళా కారుల ఆనందానికి అవధుల్లేవు. మైక్, లైటింగ్ సిస్టం అద్భుతంగా పనిచేయడం ఉత్సవాల విజయానికి దోహదపడింది. పక్కా ప్రణాళికతో... ఎప్పటికప్పుడు ప్రాక్టికల్ సమీక్షలతో మొత్తం కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేశారంటూ పోసాని టీమును ఆర్టిస్టులు, అతిథులు మనఃపూర్వకంగా అభినందించడం ఈసారి ’నంది’ పండగ హైలైట్. – జి.వి. రంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ -
ప్రఖ్యాత కవి ఇమ్రోజ్ కన్నుమూత
ముంబై: ఇమ్రోజ్‌గా అందరికీ సుపరిచితుడైన ప్రముఖ కవి, కళాకారుడు ఇందర్ జీత్(97) శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. వయో సంబంధ రుగ్మతలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఇమ్రోజ్, రచయిత్రి అమృతా ప్రీతమ్ మధ్య నాలుగు దశాబ్దాల బంధం ఉంది. ముంబైలోని కాండివిలిలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేసినట్లు అమృతా ప్రీతమ్ కోడలు అల్కా క్వాట్రా చెప్పారు. ఇమ్రోజ్ చితికి ప్రీతమ్ మనవరాలు నిప్పంటించారు. 1926లో పంజాబ్‌లోని ల్యాల్‌పూర్‌లో ఇమ్రోజ్ జన్మించారు. పంజాబీలో రచయిత్రిగా మంచి పేరున్న అమృతా ప్రీతమ్‌తో 1950ల నుంచి ఆయన అనుబంధం కొనసాగింది. దాదాపు 40 ఏళ్లపాటు కలిసే ఉన్నారు. 2005లో అమృతా ప్రీతమ్ చనిపోయారు. ప్రీతమ్ అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి ఇమ్రోజ్ కవితలు రాయడం ప్రారంభించారు. అమృతా ప్రీతమ్ చనిపోయాక కూడా కవితా వ్యాసంగం కొనసాగించి, ఆమెకు అంకితం చేశారు. -
నూతన రామాలయ ప్రారంభోత్సవంలో పాక్ కళాకారుల ప్రదర్శనలు
యూపీలోని అయోధ్యలో నిర్మితమవుతున్న నూతన రామాలయం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రామలీల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిలో సినిమా ఆర్టిస్టులు ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు. అలాగే పాకిస్తాన్‌తో సహా 14 దేశాలకు చెందిన కళాకారులు కూడా దీనిలో భాగస్వాములు కానున్నారు. రాముని కథను సజీవంగా ప్రదర్శించేందుకు వీరంతా ఇప్పటి నుంచే సాధన చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈసారి జనవరిలో అత్యంత వైభవంగా రామలీలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా రామలీల కార్యక్రమం ప్రతి సంవత్సరం దసరా రోజున జరుగుతుంది. అయితే ఇప్పుడు 2024 జనవరి 17 నుంచి 22 వరకు సరయూ తీరంలో ఉన్న రామకథా పార్క్‌లో రామలీలను ప్రదర్శించనున్నారు. రాబోయే జనవరిలో జరిగే రామలీలలో తొలిసారిగా సినీ కళాకారులతో పాటు విదేశీ కళాకారులు కూడా కనిపించనున్నారని రామలీల కమిటీ చైర్మన్ సుభాష్ మాలిక్ తెలిపారు. రష్యా, మలేషియా, అమెరికా, లండన్, దుబాయ్, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్, జపాన్, చైనా, జర్మనీ, అమెరికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు చెందిన కళాకారులు అయోధ్యలో జరిగే రామలీలలో కనిపించనున్నారని పేర్కొన్నారు. అనేక దేశాల కళాకారులు, సినీ కళాకారులతో సంయుక్తంగా రామలీలను ప్రదర్శించడం ఇదే తొలిసారి. అది కూడా శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో నిర్వహించడం ఇదే మొదటిసారి అవుతుంది. రామ్‌లీల కార్యక్రమాన్ని పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ ప్రారంభిస్తారని కమిటీ ప్రధాన కార్యదర్శి శుభమ్ మాలిక్ తెలిపారు. కాగా ఈ ఏడాది దసరా సందర్భంగా జరిగిన రామలీల కార్యక్రమాన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో 32 కోట్ల మంది వీక్షించారు. ఇది కూడా చదవండి: అమెరికా మాజీ మంత్రి హెన్రీ కిస్సింజర్ కన్నుమూత! -
విశ్వకవి జీవితంతో స్ఫూర్తి పొందిన జపాన్ కళాకారిణి..!
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఎంత చెప్పిన తక్కువ. ఆయన ఎందరికో స్ఫూర్తి. ఆయన సాహిత్య రచనలు, సిద్ధాంతాలు ఎందరినో కదిలించాయి. కానీ ఓ జపాన్ కళాకారిణి మన రవీంద్ర నాథ్ ఠాగూర్ ఆలోచనలకు ఫిదా అయ్యానని చెబుతోంది. పైగా ఆ కవి తన స్ఫూర్తి అని చెబుతోంది. ఓ విదేశీయురాలు మన విశ్వకవిని ఆరాధిస్తున్నాడంటే..ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా ఫీలై సంఘటన. ఇంతకీ అతను ఎవరంటే.. కోల్‌కతాలోని జపాన్ కాన్సులేట్ ఒక సిటీ క్లబ్లో సంగీత వేడుకను నిర్వహించింది. ఆ కార్యక్రమంలో ఓ జపాన్ కళాకారిణి విశ్వకవి గురించి ఎంతగొప్పగానే చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బెంగాల్ కవి రవీంద్ర నాథ్ ఠాగూర్ ఆలోచన, సిద్ధాంతాలు తనను కదిలించాయని చెబుతోంది జపనీస్ కళాకారుడు పియానిస్ట్ యుకికో కుసునోకి. ఆయన ప్రేరణతోనే ఈ కార్యక్రమంలో ఎన్నో మధుర గీతాలను, ఇతర జపనీస్ ట్యూన్లను ప్లే చేశానని చెప్పింది. తన ఆదర్శాలు, ఆలోచనలు ఠాగూర్ తో మమేకమయ్యాయనని ఆనందంగా చెబుతోంది. ఇటీవలే ఠాగూర్ నివాసమైన శాంతినికేతన్ని సందర్శించినట్లు వివరించింది. అక్కడ ప్రజలను కలుసుకుని సంగీత ప్రదర్శన ఇవ్వడం తనకెంతో సంతోషం అనిపించిందని చెబుతుంది. తనకెప్పటీ నుంచో శాంతినికేతన్ని చూడాలన్నేదే చిరాల కోరిక అని అది ఇప్పటికీ నెరవేరిందని సంతోషంగా చెప్పింది. నిజానికి సంగీతం అనేది హద్దులు లేనిది. దీంతో మానవజాతి మధ్య శాంతి సామరస్యలను, ప్రేమ వంటి వాటిని పెంపొందించొచ్చు. అంతేగాదు తాను 2022లో భారత్ సందర్శనానికి వచ్చినప్పుడే ఠాగూర్‌కి సంబంధించిన మెలోడి సంగీతాన్ని కనుగొన్నానని దానిని తాను ఎంతో కష్టబడి యూట్యూబ్ సాయంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. (చదవండి: 56 ఏళ్ల వయసులో ఎమ్మెస్సీ పాసైన సెక్యూరిటీ గార్డు!ఏకంగా 23 సార్లు..) -
వెక్కిరింతలతో ఆత్మహత్య.. అనుపమ, చిన్మయి భావోద్వేగం!
పొగడ్త పన్నీరు వంటిది.. వాసన చూసి వదిలేయాలి అంటుంటారు. విమర్శ కూడా అంతే.. వినీవినపడనట్లు వదిలేయాలే కానీ వాటి గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవకూడదు. కానీ ఇక్కడ చెప్పుకునే మేకప్ ఆర్టిస్ట్ ప్రన్షు విమర్శలను తట్టుకోలేకపోయాడు. ట్రోలింగ్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 16 ఏళ్లకే ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. 'నా కొడుకు మేకప్ వేయడం సొంతంగా నేర్చుకున్నాడు. అతడిని చూసి నేను గర్వపడ్డాను. 12వ తరగతి పూర్తయ్యాక వాడిని ముంబైకి పంపిద్దామని ఇప్పటినుంచే డబ్బులు కూడా దాచిపెడుతున్నాను. 2019లో నేను విడాకులు తీసుకున్నాను. అప్పటినుంచి ప్రన్షుతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నాను. గతేడాది నుంచి వింతగా గతేడాది నా కొడుకు వింతగా ప్రవర్తించాడు. అమ్మా.. నేను అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇద్దరి ఆకర్షణకు లోనవుతున్నానన్నాడు. నేను అతడిని తప్పుపట్టలేదు. తను మేకప్ వేసుకుంటే కూడా వద్దని వారించలేదు. సింగిల్ పేరెంట్‌గా ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. ప్రన్షు ప్రతిరోజు ఎంతో కష్టపడేవాడు. యూట్యూబ్ నుంచి మేకప్ ఎలా వేయాలని నేర్చుకున్నాడు. జేమ్స్ చార్లెస్‌ను చూసి స్ఫూర్తి పొందాడు. అతడిలానే ఉంటాననుకునేవాడు. ఎప్పటికైనా అతడిని కలవాలనుకునేవాడు. అదే చివరి ఫోన్ కాల్.. ప్రన్షు చిన్న వయసులోనే ఎంతో మెచ్యూర్‌గా ఆలోచించేవాడు. ద్వేషపూరిత కామెంట్లను ఎలా హ్యాండిల్ చేయాలో వాడికి బాగా తెలుసు. అంతెందుకు, ట్రోలింగ్ చూసి మేమిద్దరం నవ్వుకునేవాళ్లం. తన తండ్రిని కూడా చాలా ఏళ్ల క్రితమే బ్లాక్ చేశాడు. మళ్లీ ఎప్పుడూ ఆయన గురించి ఆలోచించలేదు. ప్రన్షు చాలా కష్టపడేతత్వం ఉన్న పిల్లాడు. తనకు ఎగ్జామ్స్ ఉండటంతో ట్యూషన్ మధ్యలో నుంచి ఇంటికి వచ్చేశాడు. ఉదయం 10 గంటలకు ఫోన్ చేసి మాట్లాడాను. అదే తనతో చివరి సంభాషణ అవుతుందని ఊహించలేదు. ఆ తర్వాత నా కొడుకు నాతో మాట్లాడలేదు. ఇంత పగ, ద్వేషమా? తను ఎక్కడున్నా రత్నమే. నా పిల్లాడిని నేను కోల్పోయాను. మీ పిల్లలు ఏం కావాలనుకుంటే అది కానివ్వండి. వారిని ఎలా ఉంటే అలా అంగీకరించండి అని ప్రన్షు తల్లి ఎమోషనలైంది. ఈ నోట్‌ను సింగర్ చిన్మయి శ్రీపాద షేర్ చేస్తూ.. భారతీయుల్లో పగ, ద్వేషం వంటివి ఎప్పటినుంచో ఉన్నాయా? లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ దొరకడం వల్ల దాన్ని ఇప్పుడు చూపిస్తున్నారా తెలియడం లేదు అని మండిపడింది. ఈ పోస్ట్‌పై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్పందిస్తూ గుండె బద్ధలైందని రాసుకొచ్చింది. చీర కట్టుకుని వీడియో కాగా ప్రన్షు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని తన నివాసంలో నవంబర్ 21న ఆత్మహత్య చేసుకున్నాడు. దీపావళి పండగ సమయంలో ప్రన్షు చీర కట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేశాడు. దీనికి విపరీతమైన నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. ఆ ట్రోలింగ్‌ను తట్టుకోలేకే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎల్‌జీబీటీక్యూలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు స్వేచ్ఛగా బతికే హక్కు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) View this post on Instagram A post shared by 𝙋𝙧𝙖𝙣𝙨𝙝𝙪. (@glamitupwithpranshu) నోట్: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: తెలుగులో స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్.. కానీ.. -
ఇన్‌స్టా రీల్‌కు చెత్త కామెంట్లు.. ఆర్టిస్టు ఆత్మహత్య
భోపాల్: ఇన్‌స్టా రీల్‌కు ద్వేషపూరిత కామెంట్లు రావడంతో ఓ ట్రాన్స్‌జెండర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో జరిగింది. దీపావళి సందర్భంగా చీరకు సంబంధించిన ఓ వీడియోకు అసభ్యకరమైన కామెంట్లు వచ్చాయని, ఆ కారణంగానే ఆర్టిస్టు మరణించాడని మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ యాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు అన్నారు. ప్రన్షు(16) ఉజ్జెయినికి చెందిన ట్రాన్స్ జెండర్ సొంతంగా మేకప్ కళను నేర్చుకున్నాడు. మేకప్ ఆర్టిస్టుగా ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా నడుపుతున్నాడు. మేకప్ కళ, బ్యూటీ కంటెంట్‌కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తుండేవాడు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా చీరకు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేశాడు. అయితే.. ఈ వీడియోకు 4,000 ద్వేషపూరితమైన కామెంట్లు వచ్చాయని మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ యాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు తెలిపారు. ఈ కారణంగానే ప్రన్షు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించాడు. ట్రాన్స్‌జెండర్ వర్గానికి రక్షణ కల్పించడంలో ఇన్‌స్టా యాజమాన్యం విఫలమౌతోందని అన్నాడు. View this post on Instagram A post shared by Trinetra Haldar Gummaraju (@trintrin) ప్రన్షు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని స్థానిక పోలీసులు తెలిపారు. వీడియోకు వచ్చిన కామెంట్ల కారణంగానే ప్రన్షు మరణించాడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇదీ చదవండి: సీఎం అశోక్ గహ్లోత్ గొప్ప మనసు -
Surekha Vani: 46 ఏళ్ల వయసులో సురేఖా వాణి స్టన్నింగ్ పిక్స్ (ఫోటోలు)
-
Russia-Ukraine war: యుద్ధ వ్యతిరేక లేబుళ్లు అంటించినందుకు.. రష్యా కళాకారిణికి ఏడేళ్ల జైలు
మాస్కో: సూపర్మార్కెట్లోని వస్తువులపై ఉండే ధరల లేబుళ్లను తొలగించి, వాటి స్థానంలో యుద్ధ వ్యతిరేక నినాదాలున్న లేబుళ్లు అంటించిన నేరంపై ఓ కళాకారిణికి రష్యా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలయ్యాక.. సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన సాషా స్కోచిలెంకో(33) అనే కళాకారిణి స్థానిక ఫెమినిస్టు బృందం పిలుపు మేరకు స్థానిక సూపర్మార్కెట్లోని వస్తువుల ధర లేబుళ్లను తీసేసి..‘రష్యా ఆర్మీ మరియుపోల్‌లోని స్కూల్‌పై బాంబు వేసింది’... ‘రష్యా ఫాసిస్ట్ రాజ్యంగా మారి ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు మా ముత్తాత రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడలేదు’ అంటూ రాసి ఉన్న కొన్ని లేబుళ్లను అంటించింది. ఈ నేరానికి అధికారులు గత ఏడాది ఏప్రిల్ అదుపులోకి తీసుకున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఎలాంటి వైఖరి తీసుకున్నా కఠిన శిక్షలకు అవకాశం కల్పిస్తూ పుతిన్ ప్రభుత్వం చట్టాలు తీసుకువచి్చంది. ఈ చట్టాలు అమల్లోకి వచ్చాక జరిగిన మొట్టమొదటి అరెస్ట్ ఇది. దీంతో, విచారణ సుదీర్ఘంగా సాగింది. తనపై వచి్చన ఆరోపణలను సాషా అంగీకరించింది కూడా. తీవ్ర అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాషా జైలులోనే చనిపోయే ప్రమాదముందని ఆమె తరఫు లాయర్లు తెలిపారు. అయినప్పటికీ జడ్జి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచి్చనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రభుత్వ టీవీలో లైవ్‌లో వ్యతిరేకించారన్న ఆరోపణలపై కోర్టు ఒకటి మరినా అనే జర్నలిస్టుకు ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. యుద్ధాన్ని నిరసించిన వ్లాదిమిర్ కారా ముర్జా అనే ప్రతిపక్ష నేతకు ఏప్రిల్‌లో 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. -
సినీ రచయిత కన్నుమూత.. విజయ్ సేతుపతి సినిమాతో..
తమిళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మాటల రచయిత రాశితంగదురై (53) సోమవారం ఉదయం కన్ను మూశారు. వివరాలు.. ఆండిపట్టి సమీపంలోని కధిర్ నరసింగపురానికి చెందిన రాశితంగదురై చదువు పాఠశాల దశలోనే ఆగి పోయింది. అయితే కథలు, కవితలు రాయడంపై మక్కువ చూపిస్తూ రెండు వందలకు పైగా కథలు రాశారు. అలా సినీ రంగానికి మాటల రచయితగా పరిచయమయ్యారు. నటుడు విజయ్ సేతుపతి నిర్మించిన మేర్కు తొడర్చిమలై చిత్రానికి మాటలు రాయడంతో పాటు చిన్న పాత్రను సైతం పోషించారు. ఈ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకుంది. తరువాత తేన్ అనే చిత్రానికి సంభాషణలు అందించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వీటితో పాటు కేవీ, తాక్కల్, ఆధారం తదితర చిత్రాలకు రాశి తంగదురై మాటలను రాశారు. మరో నాలుగైదు చిత్రాలకు కమిట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆయన సోమవారం ఉదయం స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు. ఈయనకు భార్య మురుగేశ్వరి, కుమారులు రాశి ప్రియన్, సుఖదేవ్ దిలీపన్ ఉన్నారు. రాశి తంగదురై మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయానికి సోమవారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: ఆ సినిమాలో ఛాన్స్ కోసం బికినీ ఫోటోలు పంపితే డైరెక్టర్ ఏం చేశాడంటే: కస్తూరి -
ఎన్నికలకు కళ
రాజకీయ నేతలను ప్రజలకు చేరువ చేయడంలో ఏడెనిమిదేళ్లుగా సోషల్ మీడియా కీలకంగా మారింది. ఫేస్బుక్, యూ ట్యూబ్ మొదలు ఇన్స్టాగ్రామ్ వరకు నాయకుల కార్యక్రమాలు క్షణాల్లో ప్రజలకు చేరిపోతున్నాయి. అయితే టెక్నాలజీ ఎంత గా అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ ప్రజలకు చేరువయ్యేందుకు కళారూపాలనే కొందరు నేతలు ఎంచుకుంటున్నా రు. ప్రజల్లో వీటికి ఆదరణ తగ్గకపోవడంతో ఇప్పుడు ఎన్నికల సీజన్లో ఆయా కళాకారులకు డిమాండ్ ఎక్కువగానే ఉంటోంది. సోషల్ జమానా ఎన్నికల్లో గెలిచింది మొదలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే వరకు తాము చేపడుతున్న కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ఖద్దరు నేతలు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై వ్యక్తిగత పేజీలతో పాటు ఫాలోవర్స్, ఫ్యాన్స్ పేజీలతో ప్రత్యేకంగా ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. తాము రోజువారీగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రధాన మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లు, లింకులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ మేరకు బూత్ లెవల్ వరకు సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌లను కూడా నియమిస్తున్నారు. మండల, యూత్, మహిళా తదితర విభాగాల బాధ్యుల తరహాలోనే సోషల్ మీడియా ఇన్చార్జ్ పోస్టులూ రాజకీయ పార్టీల్లో పుట్టుకొచ్చాయి. ర్యాలీలు, సభల్లో... బహిరంగంగా చేసే ర్యాలీలు, సభల్లో ఇప్పటికీ ఆదివాసీ నృత్యాలైన కొమ్ము కోయ, థింస్సా, గుస్సాడీ, బంజారా నృత్యాలు, డప్పు కళాకారులకు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రధాన నాయకుడు వెనుక వస్తుంటే అతనికి ముందు వరుసలో ఆదివాసీ/బంజారా కళాకారులు చేసే నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లలో ఉన్న వారు, వాణిజ్య సముదాయాల్లో ఉన్నవారిని బయటకు రప్పిస్తున్నాయి. తద్వారా నేతలు చేపట్టే కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో టెక్నాలజీ యుగంలోనూ ఆదివాసీ, బంజారా కళలు.. తగ్గేదేలే అన్నట్టుగా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. కొమ్ము కోయ.. రాష్ట్ర విభజనకు ముందు కొమ్ము, కోయ నృత్య కళాకారులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉండేవారు. విభజన తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్లారు. ప్రస్తుతం చింతూరు కేంద్రంగా కొమ్ము కోయ నృత్య బృందాలు ఉన్నాయి. ఈ బృందాల్లో పొడవైన వాడి కలిగిన కొమ్ములు, నెమలి ఈకలతో చేసిన తలపాగా మగవాళ్లు ధరిస్తారు. మెడలో పెద్దడోలు వాయిద్యం కలిగి ఉంటారు. మహిళలు ఆకుపచ్చచీరలు ధరించి, తలకు ఎర్రని రుమాలు, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. మగవారు వేసే డప్పు వాయిద్యాలకు అనుగుణంగా మహిళలు నృత్యం చేస్తారు. అలరిస్తున్న గుస్సాడీ.. ఆదిలాబాద్‌కు చెందిన ఆదివాసీ నృత్యం గుస్సాడీ. ఆదివాసీ పండగల సందర్భంగా ఈ నృత్యం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో జాతీయ పండగలు, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాజకీయ నాయకులు తమ కార్యక్రమాల్లో గుస్సాడీకి స్థానం కల్పిస్తున్నారు. గుస్సాడీ కళాకారులు ధరించే భారీ నెమలి ఈకలు, పూసలతో చేసిన తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బంజారా నృత్యం తెలంగాణ గిరిజనుల్లో అత్యధిక జనాభా లంబాడీలదే. ఇప్పటికీ తండాల్లో లంబాడీ మహిళలు పూ ర్వకాలం నుంచి వస్తున్న వేషధా రణ కొనసాగిస్తున్నారు. ఎరుపురంగులో అద్దాలు, చెమ్కీలతో చేసిన దుస్తులను ధరిస్తుంటారు. చేతులకు తెల్లని పెద్ద గాజులు, చెవులు, ముక్కుకు పెద్ద ఆభరణాలు పెట్టుకుని ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరు బంజరా భాష గోర్బోలీలో పాట లు పాడుతూ చేసే నృత్యాలు రాజకీయ ర్యాలీలలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. డప్పు బృందాలు ఒకప్పుడు వామపక్ష పార్టీ పట్ల ప్రజ లు ఆకర్షితులయ్యేలా చేసిన అంశాల్లో డప్పు బృందాలది ప్రత్యేక స్థానం. కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి డప్పు వాయిస్తూ చేసే నృత్యాలు నేటికీ ఎవర్‌గ్రీన్‌గా కొనసాగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కామ్రేడ్లకే పరిమితమైన డప్పు డ్యాన్సులను ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు అక్కున చేర్చుకున్నాయి. - తాండ్ర కృష్ణ గోవింద్ -
ఇష్టమైన కళ తీరిన వేళ
పోలియో బాధితురాలైన సునిత త్రిప్పనిక్కర అయిదు సంవత్సరాల వయసు నుంచి బొమ్మలు వేయడం ప్రారంభించింది. సునిత మొదట్లో చేతులతోనే బొమ్మలు వేసేది. అయితే డిగ్రీ చదివే రోజుల్లో చేతుల్లో పటుత్వం కోల్పోయింది. బ్రష్ పట్టుకోవడం కష్టంగా మారింది. ఆ సమయంలో తన సోదరుడిని స్ఫూర్తిగా తీసుకుని మౌత్ ఆర్టిస్ట్‌గా మారింది. దివ్యాంగుడైన ఆమె సోదరుడు నోటితో కుంచె పట్టుకుని బొమ్మలు వేస్తాడు. సునిత ఇప్పటివరకు అయిదు వేలకు పైగా పెయింటింగ్స్ వేసింది. ఆమె ఆర్ట్‌వర్క్స్ సొంత రాష్ట్రం కేరళతోపాటు సింగపూర్‌లోనూ ప్రదర్శితమయ్యాయి. ప్రకృతి సంబంధిత చిత్రాలు వేయడం అంటే సునితకు ఇష్టం. విన్సెంట్ వాన్ గో ఆమెకు ఇష్టమైన చిత్రకారుడు. ‘ప్రయాణాలు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. ఇక రంగులు అనేవి నన్ను ఎప్పుడూ అబ్బురపరిచే అద్భుతాలు. సంప్రదాయంతో పాటు ఆధునిక చిత్రధోరణులు అంటే కూడా ఇష్టం. మొదట్లో పళ్ల మధ్య కుంచె పట్టుకుని చిత్రాలు వేయడం చాలా కష్టంగా అనిపించింది. సాధన చేస్తూ చేస్తూ కష్టం అనిపించకుండా చేసుకున్నాను’ అంటుంది సునిత. సునిత చేసే ప్రయాణాలలో కనిపించే సుందర దృశ్యాలు కాన్వాస్‌పైకి రావడానికి ఎంతోకాలం పట్టదు. ‘బాధితులకు ఓదార్పును ఇచ్చే శక్తి చిత్రకళకు ఉంది’ అంటాడు వ్యాన్ గో. ఆ మాట సునిత విషయంలో అక్షరాలా నిజం అయింది. క్యాన్వాస్ దగ్గర ఉన్న ప్రతిసారీ తనకు వందమంది స్నేహితుల మధ్య సందడిగా ఉన్నట్లుగా ఉంటుంది. ధైర్యం చెప్పే గురువు దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది. ఆత్మీయతను పంచే అమ్మ దగ్గర ఉన్నట్లుగా ఉంటుంది. ‘నా జీవితంలోకి చిత్రకళ రాకుండా ఉండి ఉంటే పరిస్థితి ఊహకు అందనంత విషాదంగా ఉండేది’ అంటుంది సునిత. బెంగళూరు నుంచి సింగపూర్ వరకు సునిత ఆర్ట్ ఎగ్జిబిషన్స్ జరిగాయి. అక్కడికి వచ్చే వారు ఆర్టిస్ట్‌గా ఆమె ప్రతిభ గురించి మాత్రమే మాట్లాడడానికి పరిమితం కాలేదు. స్ఫూర్తిదాయకమైన ఆమె సంకల్పబలాన్ని వేనోళ్లా పొగిడారు. ‘మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్టిస్ట్స్’ సంస్థలో సభ్యురాలైన సునిత దివ్యాంగులైన ఆర్టిస్ట్‌లకు సహకారం అందించే ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వీల్‌చైర్‌కే పరిమితమైన వారిలో విల్‌పవర్ పెంపొందించేలా సోదరుడు గణేష్‌తో కలిసి ‘ఫ్లై’ అనే సంస్థను ప్రారంభించింది. ‘చిరకు’ పేరుతో ఒక పత్రికను నిర్వహిస్తోంది. కాలి వేళ్లే కుంచెలై... రెండు చేతులు లేకపోతేనేం సరస్వతీ శర్మకు సునితలాగే అంతులేని ఆత్మబలం ఉంది. సునిత నోటితో చిత్రాలు వేస్తే రాజస్థాన్‌కు చెందిన సరస్వతీ శర్మ కాలివేళ్లను ఉపయోగించి చిత్రాలు వేస్తుంది. ఇంగ్లీష్ సాహిత్యంలో మాస్టర్స్ చేసింది. ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసింది. ఎడమ కాలితో నోట్స్ రాసుకునేది. ‘మొదట్లో ఆర్ట్ అనేది ఒక హాబీగానే నాకు పరిచయం అయింది. అయితే అది హాబీ కాదని, అంతులేని శక్తి అని ఆ తరువాత అర్థమైంది’ అంటుంది సరస్వతీ శర్మ. కోచిలోని ‘మౌత్ అండ్ ఫుట్ ఆర్టిస్ట్స్’ ఆర్ట్ గ్యాలరీలో సునిత చిత్రాలతో పాటు సరస్వతి చిత్రాలను ప్రదర్శించారు. ఒకవైపు నోటితో చిత్రాలు వేస్తున్న సునిత మరో వైపు కాలివేళ్లతో చిత్రాలు వేస్తున్న సరస్వతిలను చూస్తుంటే ప్రేక్షకులకు ఆత్మబలానికి నిలువెత్తు రూపాలను చూసినట్లుగా అనిపించింది. ‘అయ్యో’ అనుకుంటే ఎదురుగుండా కనిపించే దారిలో అన్నీ అవరోధాలే కనిపిస్తాయి. ‘అయినా సరే’ అనుకుంటే మనసు ఎన్నో మార్గాలు చూపుతుంది. కేరళలోని కన్నూర్‌కు చెందిన సునితకు బొమ్మలు వేయడం అంటే ప్రాణం. అయితే చేతులు పటుత్వం కోల్పోవడంతో కుంచెకు దూరం అయింది. ‘ఇష్టమైన కళ ఇక కలగానే మిగలనుందా?’ అనుకునే నిరాశామయ సమయంలో మనసు మార్గం చూపించింది. మౌత్ ఆర్టిస్ట్‌గా గొప్ప పేరు తెచ్చుకుంది... -
వాస్తవికతకే రూపం ఇస్తే..పాజిటివ్ ఎమోషన్..
‘సృజనకారులకు పరిశీలనకు మించిన బలం లేదు’ అంటుంది కోల్‌కత్తాకు చెందిన యంగ్ ఆర్టిస్ట్ శ్రేయా రాయ్. తాము పరిశీలించిన వాటిని కొందరు కవిత్వంలోకి తీసుకెళతారు. శ్రేయ మాత్రం చిత్రాల్లోకి తీసుకువచ్చింది. తనదైన శైలితో వాటికి కొత్త రూపం ఇస్తుంది. ఆమె జ్ఞాపకాలకు, పరిశీలనలకు డిజిటల్ కాన్వాస్‌ను వేదికగా చేసుకుంది. శ్రేయ చిత్రాలు గ్రాఫిక్ నవలలోని క్యారెక్టర్లను గుర్తు తెస్తాయి. పాజిటివ్ ఎమోషన్స్ ఆమె చిత్రాలకు బలాన్ని ఇస్తాయి, నిత్యజీవిత దృశ్యాలను గుర్తు తెస్తాయి. ‘స్త్రీలకు సంబంధించి నిత్యజీవిత దృశ్యాలు నా చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఆరు బయట కూర్చొని స్త్రీలు మాట్లాడుకునే దృశ్యాలలో కూడా ఎంతో అందం ఉంది. కాల్పనికతకు కాకుండా వాస్తవికతకే ప్రాముఖ్యత ఇస్తాను’ అంటున్న రాయ్ ఆర్కిటెక్ట్ కూడా. అయితే ఆమెకు చిత్రలేఖనం అంటేనే బాగా ఇష్టం. ‘ఆర్కిటెక్చర్లో రకరకాల కొలతలతో పని. చిత్రప్రపంచంలో ఆలోచనలతోనే పని’ అంటోంది రాయ్. (చదవండి: సింగిల్ షోల్డర్..డబుల్ బ్యూటీ!) -
ఆ గొంతులన్నీ మూగబోయాయి
SAS (అందోల్): రాష్ట్ర సాధన ఉద్య మంలో పాటల రూపంలో ఉత్తేజపరిచిన గొంతులన్నీ మూగబో యాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ‘బీఎస్పీ శక్తి ప్రదర్శన’ నియోజకవర్గ ఇన్చార్జ్ ముప్పారం ప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కవులు, కళాకారులందరూ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల గొంతుకల కోసం బీఎస్పీలోకి రావాలని పిలుపునిచ్చారు. విప్లవా త్మకమైన పాటలను రాసిన వారిని, పాడిన వారిని గుర్తు చేసుకుంటూ పాటలు పాడుతూ అక్కడున్న వారిని ఆయన ఉత్తేజపరిచారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ కోసమే రూ.2 వేల కోట్లతో కొండపోచమ్మ రిజర్వాయర్‌ను రెండేళ్లలో పూర్తిచేశారని, సంగమేశ్వర, బస్వవేశ్వర ఎత్తిపోథల పథకానికి రూ.4 వేల కోట్లు మంజూరు చేయకపోతే క్రాంతి కిరణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు నటరాజన్ పాల్గొన్నారు. జర్నలిస్టుపై దాడిచేస్తే స్పందించని ఎమ్మెల్యే అందోల్‌లో అధికార పార్టీ నాయకుల అహంకారానికి అల్లాదుర్గం సాక్షి దినపత్రిక జర్నలిస్టుపై దాడిచేయడమే నిదర్శనమన్నారు. జర్నలిస్టు ఎమ్మె ల్యేగా ఉన్నా క్రాంతికిరణ్ జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. ఆయ న్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. -
సంగీత మమకారం
క్షణం తీరిక లేని పనుల్లో అభిరుచులు చిన్నబోతుంటాయి. ఎందుకంటే సమయాభావం వల్ల వాటి జోలికి వెళ్లం. అయితే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అభిరుచుల విషయంలో రాజీ పడదు. సమయం చేసుకొని, చూసుకొని వాటికి న్యాయం చేస్తుంది. దీదీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రసంగించే వక్త మాత్రమే కాదు బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. చక్కగా ఆడుతుంది. కవిత్వం రాస్తుంది. పాటలు పాడుతుంది. బొమ్మలు గీస్తుంది. ఆమె మానసిక బలానికి ఈ సృజనాత్మక శక్తులే కారణం కావచ్చు. అధికార పర్యటనలో భాగంగా ఇటీవల స్పెయిన్‌కు వెళ్లిన మమతా బెనర్జీ, ఒకవైపు సమావేశాలలో పాల్గొంటూనే మరోవైపు తనలోని ఆర్టిస్ట్‌ను అధికారులకు పరిచయం చేసింది. పియానోపై రవీంద్రుడి సంగీతాన్ని వినిపించింది. అంతకుముందు మాడ్రీడ్ వీధుల్లో అకార్డియన్పై ‘హమ్ హోంగే’ గీతాన్ని ప్లే చేసింది. ఈ వీడియోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. -
పౌరాణిక నటదిగ్గజం సోమిరెడ్డి
ఆచార్య దేవ, హహ్హ ఏమంటివి? ఏమంటివి? జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా! ఎంత మాట, ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ?............... మా వంశమునకు మూలపురుషుడైన వశిష్టుడు దేవ వేస్యయగు ఊర్వశీపుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని, ఆశక్తి చండాలాంగానయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని మీచే కీర్తింపబడుచున్న హ.. ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రభీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదములెందుకు? ... అంటూ ద్రోణుడి జాత్యాహంకారాన్ని వ్యతిరేకిస్తూ సుయోధనుడి పాత్రధారి కుమ్మెత సోమిరెడ్డి గంభీరంగా డైలాగులు పలికినప్పుడు రంగస్థల ప్రాంగణం చప్పట్లతో ఓ ఐదు నిమిషాల పాటు మార్మోగింది. ఆ తర్వాత వన్స్‌మోర్ నినాదాలతో ప్రేక్షకులు రెచ్చిపోయారు. పౌరాణిక నాటకాలంటే ముందుగా అనంత పేరు గుర్తొచ్చేలా నవరసాలను పలికిస్తూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న వారిలో c ముందు వరుసలో ఉంటారు. అనంతపురం కల్చరల్: అచ్చు సీనియర్ ఎన్టీఆర్‌ను తలపించేలా ఉండే కుమ్మెత సోమిరెడ్డి.... రారాజు పాత్ర వేశాడంటే అభిమానులు మంత్ర ముగ్దులవ్వాల్సిందే. డైలాగులు చెప్పే తీరు, మధురంగా ఆలపించే పద్యాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రతిచోటా కరతాళధ్వనులు, వన్స్మోర్లతో ఆడిటోరియాలను మార్మోగించే కళాకారుల్లో సోమిరెడ్డిది అగ్రస్థానం. ఆయనలోని కళాకారుడిని గుర్తించిన అనేక సంస్థలు అవార్డులు, రివార్డులతో సత్కరించాయి. కర్ణాటకకు రాఘవ కళాసంస్థ వారు ప్రతిష్టాత్మక నటులకిచ్చే ‘బళ్లారి రాఘవ పురస్కారం’తో పాటు మరెన్నో పురస్కారాలను ఆయన అందుకున్నారు. పాత్రేదైనా ఒదిగిపోవడమే కూడేరు మండలం పి.నారాయణపురానికి చెందిన సీనియర్ రంగస్థల కళాకారుడు కుమ్మెత చిన్నారెడ్డి కుమారుడు సోమిరెడ్డి... చిరుప్రాయం నుంచే రంగస్థలం వైపు ఆకర్షితులయ్యారు. తనకు దక్కిన ప్రతి పాత్రకూ న్యాయం చేస్తూ వస్తున్నారు. వారణాసిలో సత్యహరిశ్చంద్రునిగా, మహాభారతంలో భీముడిగా, రామాయణ ఘట్టాల్లో రాముడిగా, భాగవతంలో కృష్ణుడిగా, బాలనాగమ్మలో బాలవర్ధిగా అసమాన నటనను ప్రదర్శించే సోమిరెడ్డి ముఖ్యంగా రారాజు పాత్రలో ఒలికించే రాజసానికి ప్రేక్షకులు నీరాజనాలు పడుతుంటారు. గత 40 ఏళ్లలో ఆయన ఎన్ని పాత్రలు పోషించినా.. సుయోధనుడి పాత్ర మాత్రం ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. అనంతలోనే కాకుండా తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదు తదితర చోట్ల ఆయన నటించిన మయసభ సీను చూసిన ప్రేక్షకులకు ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఏమిచ్చినా తీర్చుకోలేం పౌరాణిక నాటకానికి తగినట్లుగా మంచి వర్చస్సు, అభినయం, ఆంగికం అన్నీ కుదరాలంటే సద్గురువుల ఆశీస్సులుండాలి. ఆంధ్రదేశంలో విఖ్యాతి పొందిన గుమ్మడి గోపాలకృష్ణ, కోటేశ్వరరావు లాంటి వారి సరసన నటించే అవకాశం నాకు దక్కడం అదృష్టమే. దుర్యోధనుడు, భీముడి పాత్రలు నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అనంత రంగస్థలానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అందుకే గత నాలుగేళ్లగా నా సొంత ఖర్చుతో పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తున్నా. -
జీ20 సమ్మిట్: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులకు అరుదైన గౌరవం
ఢిల్లీ: ఢిల్లీ జీ-20 సదస్సులో మన తెలంగాణ కళాకారులకు అరుదైన గౌరవం దక్కింది. సమ్మిట్‌లో 20 దేశాల డెలిగేట్స్ చొక్కాలకు బ్యాడ్డీలను మన కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులే తయారుచేశారు. కోణార్క్ సూర్యదేవాలయంలోని రథచక్ర నమూనాలో సిల్వర్‌తో బ్యాడ్జీలను తయారు చేశారు. జీ20 సందర్భంగా రెండు వందల బ్యాడ్జీలను భారత ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. జీ-20 సమ్మిట్‌లో స్టాల్ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు మన తెలంగాణ కళాకారులకు అనుమతి లభించింది. సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ అశోక్ ఆధ్వర్యంలో జీ-20లో స్టాల్ నిర్వహణ కొనసాగుతోంది. గతంలో ఇవాంకా ట్రంప్‌తో పాటు పలు దేశాల డెలిగేట్స్ పర్యటన నేపథ్యంలోనూ కరీంనగర్ ఫిలిగ్రీకి ఈ తరహా గౌరవం దక్కింది. దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులు నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఇదీ చదవండి: జీ-20 సదస్సు... ఢిల్లీ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ -
అందాల సుందరి ముఖాన్ని కట్‌చేసి, 90 డిగ్రీల్లో తిప్పితే..
మేకప్ అనేది ఎంతటి మహత్తరమైన కళ అంటే అది చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. మేకప్ కళను ఇష్టపడేవారు అనేకులు ఉన్నారు. మేకప్ అంటే ఇష్టం లేదని చెప్పేవారు చాలా తక్కువమంది ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక మేకప్ వీడియోను చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అలాగే భయంతో కాసేపు కదలకుండా ఉండిపోతున్నారు. చాలా మంది కళాకారులు తమ కళా ప్రతిభను వీడియోల రూపంలో ప్రదర్శించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ కళాకారులలో కొందరు వారి అద్భుతమైన కళ కారణంగా ప్రజలలో ఎంతో ఆదరణ దక్కించుకుంటారు. తాజాగా మేకప్ ఆర్టిస్ట్ మిమీ చోయ్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో మిమి కళా ప్రతిభను చూసినవారంతా నోరెళ్లబెడుతున్నారు. వీడియోలో మిమీ చోయ్ ఆ మహిళ ముఖం ఏ వైపు ఉందో అర్థం కాని విధంగా ముఖానికి మేకప్ చేసింది. మిమీ మేకప్ తర్వాత ఆ మహిళ ముఖాన్ని మధ్య నుండి ఎవరో కత్తిరించినట్లు, ఆ తర్వాత దానిని 90 డిగ్రీలు తిప్పినట్లు అనిపిస్తుంది. ఇలాంటి కళను మనం చాలా అరుదుగా చూస్తుంటాం. ఈ వీడియో @HOW_THINGS-WORK పేరుతో ఉన్న పేజీ నుండి మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X లో షేర్ చేశారు. వీడియోకు ఇప్పటివరకూ 272.3కే వీక్షణలు దక్కాయి. ఈ అద్భుతమైన మేకప్ కళను చూసిన నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ విభాగంలో తెలియజేస్తున్నారు. ఒక యూజర్ ఇలా రాశాడు ‘నిజంగా నా తల తిరుగుతోంది’ మరొక యూజర్ ‘ఆమె మేకప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లారు’ అని రాశారు. ఇది కూడా చదవండి: పిజ్జా యాప్ సాయంతో ప్రియుడి అరెస్ట్.. ఇలా కూడా చేయచ్చా? అంటున్న యూజర్లు! The makeup skills from artist Mimi Choi is just incredible 😮 pic.twitter.com/6RiWXLOe3l — H0W_THlNGS_W0RK (@HowThingsWork_) August 25, 2023 -
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను– సంతోష్ శోభన్
‘‘వందేళ్ల ఇండియన్ సినిమాల్లో ఎన్నో పాత్రలు, ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ చెప్పని కథ, ఎవరూ చేయని పాత్రను ఎలివేట్ చేయటం అనేది ఓ ఆర్టిస్ట్‌కి కొత్తగా ఉంటుంది. అలా పెళ్లి మండపంపై మిగిలిపోయేవాడి కథే ‘ప్రేమ్ కుమార్’’ అని హీరో సంతోష్ శోభన్ అన్నారు. సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచితా సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’.అభిషేక్ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘అభిషేక్ కొన్ని సినిమాల్లో నటుడిగా చేశాడు. దర్శకుడు కావాలనుకున్నప్పుడు ‘ప్రేమ్ కుమార్’ కథ రాసుకుని, చక్కగా తీశాడు. వరుసగా వరుడు, పెళ్లి వంటి సినిమాలు చేస్తున్నాను. అయితే నిజ జీవితంలో నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను (నవ్వుతూ). నేనిప్పటి వరకు మంచి డైరెక్టర్స్‌తో సినిమాలు చేశాను. అయితే నేను చేసిన సినిమాలన్నీ కరెక్ట్‌గానే ఎంచుకున్నానా? అంటే లేదనే అంటాను. ‘ప్రేమ్ కుమార్’ నాకు సరైన హిట్ ఇస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. -
పూల బామ్మ పులకించిన వేళ
సంచలనాలు, అద్భుతాలు మాత్రమే ‘వైరల్’కి అర్హం కాదని నిరూపించిన వీడియో ఇది... పుణెలో ఒక బామ్మ తన పూలదుకాణంలో కూర్చొని పూలు అల్లుతుంది. నిజానికి ఇదొక సాధారణ దృశ్యం. అయితే ఈ దృశ్యంలో ఆర్టిస్ట్ చైతన్యకు శ్రమజీవన సౌందర్యం కనిపించింది. తన స్కెచ్‌బుక్ తీసి బామ్మను స్కెచ్ వేయడం ప్రారంభించాడు. స్కెచ్ పూర్తయిన తరువాత బామ్మకు చూపిస్తే... ఆమె కళ్లలో ఎంత సంతోషమో! బామ్మకు ఆ స్కెచ్ ఎంతగానో నచ్చేసింది. ‘ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందంటే... చుట్టుపక్కల ఎన్ని శబ్దాలు వినిపిస్తున్నా బామ్మ దృష్టి పూలమీద మాత్రమే ఉంది. పూల అల్లికలో అపారమైన ఆనందాన్ని పొందుతుంది’ అని రాశాడు చైతన్య. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో 2.4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఇష్టమైన పనిలోనే అంతులేని సంతోషం దొరుకుతుంది అని చెప్పే వీడియో ఇది’ అని కామెంట్ సెక్షన్లో స్పందించిన వారు ఎందరో. -
అత్యంత ప్రజాదరణ ఉన్న టాప్ 10 కళాకారులు
-
బతుకు పోరు
‘ఈ కర్మభూమిలో ప్రతి అడుగులో ఒక కథ వినిపిస్తుంది’ అంటుంది ఇంజా రోజియ. అమెరికన్ టూరిస్ట్ రోజియ ఇటీవల తన స్నేహితురాలితో కలిసి రాజస్థాన్‌లోని పుష్కర్ నగరానికి వచ్చింది. బిడ్డను ఒళ్లో పడుకోబెట్టుకొని ఎర్రటి ఎండలో కూర్చున్న గుడియ అనే మెహందీ ఆర్టిస్ట్ కనిపించింది. మెహందీ వేయించుకుంటూ గుడియతో కబుర్లలో పడింది రోజియ. తెలిసీ తెలియని ఇంగ్లీష్‌లోనే తన జీవితకథను రోజియతో పంచుకుంది గుడియ. రోజియ వయసే ఉన్న గుడియకు నలుగురు పిల్లలు. విద్యుత్ సౌకర్యం కూడా లేని చిన్న పల్లెలో ఉండేది. తల్లిదండ్రులు చనిపోయారు. భర్త తాగుబోతు. ఎప్పుడూ ఏదో రకంగా హింసించేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేక పిల్లల్ని తీసుకొని పట్టణానికి వచ్చింది. తనకు తెలిసిన ‘మెహందీ ఆర్ట్’తో బతుకుబండి లాగిస్తోంది అంటూ గుడియ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రోజియ. ‘నా జీవితం ఇలా అయిపోయింది... అంటూ ఆమె కన్నీళ్లతో బాధ పడలేదు. ఎవరి మీదో ఫిర్యాదు చేస్తున్నట్లుగా లేదు. జరిగిందేదో జరిగింది. బతుకుపోరు చేస్తాను...అనే స్ఫూర్తి ఆమెలో బలంగా కనిపించింది. గుడియ నలుగురు పిల్లలకు తల్లి. తల్లి ప్రేమకు ఉన్న శక్తి ఏమిటంటే జీవితంలో ఎన్నో యుద్ధాలను గెలిచేలా చేస్తుంది’ అంటూ రాసింది రోజియ. -
ఎలానూ... ఇలా అయినవేంది!!
ఏఐ ఆర్టిస్ట్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు... అన్నట్లుగా తయారైంది పరిస్థితి. సదరు నౌఫాల్ ఆనే ఏఐ ఆర్టిస్ట్ తన ఆర్ట్‌తో బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను అమెరికా నుంచి ముంబైకి తీసుకువచ్చి ఛాయ్‌వాలాగా మార్చాడు. ఈ ‘చాయివాలా–ఎలాన్ మస్క్’ ఇమేజ్ అంతర్జాల లోకంలో తెగ వైరల్ అయింది. ట్విట్టర్లో వేగంగా రెండు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంతర్జాల లోకవాసులు ఒకరిని మించి ఒకరు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ‘ఎలాన్... ఏమైనా చేయగలడు!’, ‘ఏఐ టెక్నాలజీతో గరం ఛాయ్ తయారుచేస్తున్నాడు!’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. మరో ఏఐ ఆర్టిస్ట్ ఎలాన్‌ను ఏకంగా బేబీగా మార్చేశాడు. ‘బ్రేకింగ్న్యూస్: ఎలాన్ మస్క్ యాంటీ ఏజీంగ్ ఫార్ములాపై పనిచేస్తున్నాడు. దాని ఫలితమే ఈ ఫొటో’ అనే కాప్షన్ ఆకట్టుకుంటోంది. ‘మార్స్ పైకి వెళ్లడానికి మస్క్‌కు ఇప్పుడు బోలెడు సమయం దొరికింది’... అని ఒకరు కామెంట్ పెట్టారు. -
చిత్రాలు గీసేందుకు చేతులెందుకు?
12 ఏళ్ల వయసు వరకూ స్వప్న ఆగస్టయిన్కు తన చేతులు తనకు ఉపకరించవన్న సంగతే తెలియదు. వయసు పెరుగుతున్నకొద్దీ వాస్తవం ఆమెకు అవగతమవుతూ వచ్చింది. తాను జీవితాంతం చేతులు లేకుండానే ఉండాలన్న విషయం ఆమెకు స్పష్టమయ్యింది. దీనిని గ్రహించిన ఆమె ఏమాత్రం కుంగిపోలేదు. చేతులు లేకపోతేనేం తనకు చక్కనైన కాళ్లు ఉన్నాయి కదా అని అనుకుంది. తన పాదాలనే వినియోగిస్తూ స్వప్న తనలోని కళా ప్రతిభను ప్రపంచానికి చాటుతోంది. పాదాలతో అద్భుతమైన పెయింటింగ్స్ రూపొందించే ప్రపంచ కళాకారిణిగా స్వప్న పేరు తెచ్చుకుంది. వరల్డ్ మలయాళీ ఫౌండేషన్ ఆమెకు ‘ఐకాన్ ఆఫ్ ది ఇయర్- 2018’ అవార్డుతో సన్మానించింది. స్వప్న తన కుటుంబానికే కాకుండా యావత్‌దేశానికే గర్వకారణంగా మారింది. ఆమె తన పెయింటింగ్స్‌ను ఎంఎఫ్‌పీఏ ఫోరమ్‌కు విక్రయిస్తుంటుంది. ఈ ఫోరమ్‌లోని సభ్యులు ప్రతీనెలా రెమ్యునరేషన్ పొందుతుంటారు. 1999 నుంచి స్వప్న ఈ ఫోరమ్‌లో మెంబర్‌గా ఉంది. స్వప్న ఆగస్టయిన్ 1975, జనవరి 21న కేరళలోని ఎర్నాకులంలో జన్మించింది. ఆమెకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. ఆమె తండ్రి ఆగస్టయిన్ రైతు. తల్లి సోఫీ గృహిణి. స్వప్నకు ఆరేళ్లు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమెను ఒక దివ్యాంగుల పాఠశాలలో చేర్పించారు. అదిమొదలు ఆమె తన పాదాలతో బ్రెష్ పట్టుకుని పెయింటింగ్ వేయడం మొదలుపెట్టింది. స్వప్న పెయింటింగ్, డ్రాయింగ్ మాత్రమే కాకుండా అన్ని పనులను తన పాదాల సాయంతోనే చేస్తుంటుంది. ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆమెలోని ప్రతిభను గుర్తించి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. ఐదుగురు తోబుట్టువులలో స్వప్న మొదటి సంతానం. డెలివరీ అనంతరం ఆమె తల్లికి.. స్వప్న చేతులు లేకుండా జన్మించిందని చెప్పారు. నాలుగేళ్ల వయసులోనే స్వప్న తన పాదాలతో పెన్సిల్ పట్టుకుని రాయడం మొదలుపెట్టింది. తరువాతి కాలంలో స్కెచ్చింగ్ వేయగలిగే స్థాయికి చేరింది. అలప్పుజాలోని సెంట్ జోసెఫ్ కాలేజీలో స్వప్న హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరువాత పూర్తి స్థాయిలో పెయింటింగ్‌పై దృష్టి సారించింది. ప్రొఫెషనల్ పెయింటర్ స్థాయికి చేరింది. కేన్వాస్ మీద అద్భుతమైన పెయింటింగ్స్ రూపొందించసాగింది. అదే సమయంలో ఆమెకు మౌత్ అండ్ ఫుట్ ఆర్టిస్ట్స్(ఎంఎఫ్‌పీఏ) గురించి తెలిసింది. దానిలో స్వప్న సభ్యత్వం తీసుకుంది. ఎంఎప్పీఏ అనేది దివ్యాంగ కళాకారుల కోసం ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ. 27 మంది భారతీయ కళాకారులకు దీనిలో సభ్యత్వం దక్కింది. -
Pushpa 2 The Rule: పుష్ప 2 మూవీ ఆర్టిస్ట్‌లకు రోడ్డు ప్రమాదం (ఫొటోలు)
-
ఘోర రోడ్డు ప్రమాదం.. ‘పుష్ప 2’ ఆర్టిస్టులకు తీవ్ర గాయాలు!
-
ధూమ్ ధామ్ రసూల్ మాటలు వింటే మస్తు నవ్వుకుంటారు
-
వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్
సాక్షి,ముంబై: ఏఐ ఆర్టిస్ట్ సాహిద్ మరోసారి బాలీవుడ్ సూపర్ స్టార్లను వెరైటీగా చూపించారు. బాలీవుడ్ నటులు మహిళలుగా చాలా అందమైన ఏఐ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. పెదవులపై లిప్‌స్టిక్, కొన్ని అందమైన ఆభరణాలతో ఈ సూపర్స్టార్లంతా మహిళలుగా గుర్తించలేని విధంగా మారిపోయారు. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) అంతేకాదు వారి పేర్లను కూడా మార్చేశాడు. అమితాబ్ బచ్చన్ కాస్తా అమితా బచ్చన్ అయ్యారు. షారూఖ్ ఖాన్ షాజాదీ ఖాన్‌గా, వరుణ్ ధావన్ వర్షా ధావన్‌గా, రాజ్‌పాల్ యాదవ్ రాజ్‌రాణి యాదవ్‌గా, అమీర్ ఖాన్ అమీరా ఖాన్, టైగర్ ష్రాఫ్ ఫిమేల్ వెర్షన్ టైగ్రెస్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ సల్మా ఖాన్, అక్షయ్ కుమార్ అక్షయ కుమారి, పంకజ్ త్రిపాఠి, షాహిద్ కపూర్ షాహిదా కపూర్ అయిపోవడం విశేషంగా నిలిచింది. (ఫేస్బుక్ మెటాకు భారీ షాక్: ఏకంగా 10వేల కోట్ల జరిమానా) దీంతో ఫ్యాన్స్ పలు కమెంట్లతో సందడి చేశారు. అమితాబ్ బచ్చన్ అచ్చం రేఖలా ఉన్నారని ఒకరు, సల్మాన్ ఖాన్ అయితే చిత్రాంగద సింగ్ లా కనిపిస్తున్నాడని మరొకరు కమెంట్ చేశారు. ఇక షారూక్ ఖాన్ అయితే అచ్చం ఆయన భార్యలా కనిపిస్తున్నారని మరో యూజర్ వ్యాఖ్యానించారు. ఏఐ కళాకారుడు సాహిద్ మిడ్‌జర్నీ అనే ఏఐ టూల్ ద్వారా విభిన్న కళారూపాలను రూపొందించి సోషల్‌మీడియా యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
కృత్రిమ మేధ కళలకు వధ?
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు క్లౌడిమోనెట్ ‘వాటర్ లిల్లీస్’ పేరిట రూపొందించిన 250 చిత్రాలు పూర్తి చేయడానికి దాదాపు 30 ఏళ్లు పట్టింది. తన ఇంటి దగ్గర ఉన్న సరస్సులో లిల్లీపూల స్ఫూర్తిగా ఆయన వీటిని చిత్రించారు. వాటర్ లిల్లీస్లోని ఒక చిత్రం 2007లో సోత్బే వేలంలో 1.85 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. తరువాతి సంవత్సరం లండన్ క్రిస్టీ వేలంలో మరో చిత్రం 4.1 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. మోనెట్ చిత్రించిన వాటర్ లిల్లీస్ను ఓ మంచి ఫొటోగ్రాఫర్ అంతే అందంగా కొన్ని క్షణాల్లో కెమెరాలో బంధించగలడు కానీ వాటికి ఉండే విలువెంత? దొడ్డ శ్రీనివాసరెడ్డి : 19వ శతాబ్దంలో లాండ్ స్కేప్ ఆర్టిస్టులకు, ఫొటోగ్రాఫర్లకు మధ్య వివాదం చెలరేగింది. ఫొటోలను సృజనాత్మక కళగా గుర్తించగలమా అన్నది నాటి కళాకారుల ప్రశ్న. కానీ తదుపరి కాలంలో ఫొటోగ్రఫీ కూడా కళగా అవతరించింది. ఫొటోలు కూడా వందల కోట్ల డాలర్లు ఆర్జించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు కళాకారుల మనుగడనే ప్రశ్నించే మరో ముప్పు కృత్రిమ మేధ (ఏఐ) రూపంలో వచ్చి పడింది. ఏళ్లకు ఏళ్లు చేసిన సాధన ద్వారా కళాకారులు సాధించిన నైపుణ్యాన్ని కృత్రిమమేధ క్షణాల్లో అనుకరిస్తోంది. నమూనాలను సృష్టిస్తోంది. కృత్రిమమేధ ఇకముందు కళలకు సమాధి కడుతుందా? మనిషి సృజనాత్మకతతో పోటీపడుతుందా? కారుచౌకగా ఏఐ కళారూపాలను సృష్టిస్తుంటే అసలు కళలకు ఆదరణ ఉంటుందా? ఏఐ రూపొందించే కళలకు విలువ ఉంటుందా? అన్నవి ఇప్పుడు కళా ప్రపంచంలో తలెత్తుతున్న ప్రశ్నలు. ఇప్పటికే అనేక రంగాలను ఆక్రమించుకుంటున్న కృత్రిమమేధ ఇక సృజనాత్మక కళారంగాలనూ కబ్జా చేస్తుందని కళాకారులు ఆందోళన చెందుతున్నారు. కృత్రిమమేధ ఆధారంగా చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’ సృష్టించిన సంస్థ ఓపెన్ ఏఐ రూపొందించిన మరో ప్లాట్‌ఫామ్ డాల్–ఇ. ప్రఖ్యాత ఫ్రెంచ్ సర్రియలిస్ట్ పెయింటర్ సాల్వడార్ డాలీ పేరును పోలినట్లుగా ఉండే ఈ డాల్–ఇ ప్లాట్‌ఫామ్ కృత్రిమమేధను ఉపయోగించి అద్భుతమైన డిజిటల్ పెయింటింగ్స్‌ను సృష్టిస్తోంది. డాల్–ఇ మాదిరిగానే మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూజన్ లాంటి మరికొన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌లు కూడా చిత్ర కళారంగంలో చొరబడి సంచలనం సృష్టిస్తున్నాయి. హేగ్ మ్యూజియంలో ఉన్న జొనెస్ వెర్మర్ అద్భుత కళాఖండం ‘గర్ల్ విత్ ఎ పెరల్ ఇయరింగ్’ స్ఫూర్తిగా జులియన్ వాన్ డైకెన్ అనే ఆర్టిస్టు మిడ్ జర్మీ ప్లాట్‌ఫామ్‌పై కృత్రిమమేధను వినియోగించి రూపొందించిన ‘ఎ గర్ల్ విత్ గ్లోయింగ్ ఇయరింగ్స్’ చిత్రాన్ని ఆమ్స్టర్డామ్లోని ఓ ప్రముఖ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టినప్పుడు చిత్ర కళారంగంలో అలజడి రేగింది. కంప్యూటర్ సృష్టించిన చిత్రాన్ని కళాఖండంగా ఎలా పరిగణిస్తారని ఆర్టిస్టులు ముక్తకంఠంతో ప్రశ్నించారు. ప్రింటింగ్, పబ్లిషింగ్ పరిశ్రమ కూడా ఇప్పుడు కృత్రిమమేధను ఆశ్రయించి కవర్ డిజైన్స్ రూపొందిస్తోంది. ప్రముఖ పత్రిక ‘ది ఎకనామిస్ట్’ ఇప్పుడు తన కవర్ డిజైన్ల సృష్టికి కృత్రిమమేధపై ఆధారపడుతోంది. అనేకమంది రచయితలు తమ నవలలు, పుస్తకాల కవర్ డిజైన్ల కోసం కృత్రిమమేధను ఉపయోగిస్తున్నారు. ఆర్కిటెక్ట్‌లు కూడా అద్భుతమైన కట్టడాలు, డామ్లు, స్టేడియాలు, గార్డెన్ల డిజైన్ల రూపకల్పనకు కృత్రిమమేధను ఆశ్రయిస్తున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలోకీ కృత్రిమమేధ అడుగుపెట్టింది. ది ఫ్యాబ్రికెంట్ లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అనూహ్యమైన వ్రస్తాలు, ఆభరణాల డిజైన్లను ఏఐతో సృష్టిస్తున్నాయి. ఇవి ధరించడానికి పనికి రావు కానీ డిజిటల్ రూపంలో వర్చువల్‌గా వీటిని ధరించి ఆనందించవచ్చు. అయితే వీటిని పొందడానికి మాత్రం ‘నిజమైన’ ధర చెల్లించాల్సిందే. కొన్ని వ్రస్తాల డిజైన్లు పదివేల డాలర్ల వరకు ఉన్నాయి. ఇటీవల బీచ్‌లో సర్ఫింగ్ చేస్తున్న వారి ఫొటో ఒకటి ఆ్రస్టేలియాలో ప్రతిష్టాత్మకమైన ఫొటోగ్రఫీ పోటీల్లో విజయం సాధించింది. అయితే ఈ ఫొటో కృత్రిమమేధ ఆధారంగా తయారుచేసిందని తెలిసి ప్యానెల్ జడ్జిలు ఈ చిత్రాన్ని తొలగించి వేరే ఫొటోను ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో చెలరేగిన వివాదం ఫలితంగా పోటీలను రెండు విభాగాలుగా విభజించారు. ఒకటి కంప్యూటర్ సృష్టించే ఫొటోలకు, మరొకటి కెమెరా ద్వారా తీసిన ఫొటోలకి. కదం తొక్కుతున్న కళాకారులు వివిధ రంగాలకు చెందిన కళాకారులు, నిపుణులు ఏళ్ల తరబడి కృషితో సాధించిన నైపుణ్యాన్ని అచ్చుగుద్దినట్లు అనుకరిస్తున్న కృత్రిమమేధపై కదం తొక్కుతున్నారు. కళా నైపుణ్యాన్ని కూడా ఆటోమేషన్ చేస్తే తమ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆర్టిస్టులు, డిజైనర్లు, ఫొటోగ్రాఫర్లు, రచయితలు, మ్యుజీషియన్లు తమ మనుగడను అంధకారంలోకి నెడుతోందని కృత్రిమమేధపై విరుచుకుపడుతున్నారు. కృత్రిమమేధ చొరబాటును అడ్డుకునేందుకు రకరకాల ఆయుధాలు సన్నద్ధం చేస్తున్నారు. శాన్ఫ్రాన్సికోకి చెందిన కార్టూనిస్టు సరా అండర్సన్, ఇల్ల్రస్టేటర్ కార్లో వోర్టిజ్ కాపీరైట్ చట్టం కింద న్యాయ పోరాటం చేస్తున్నారు. తమ బొమ్మలను అనుకరిస్తూ నకలు సృష్టిస్తున్న ఏఐ వేదికలు డ్రీమ్ అప్, మిడ్ జర్నీ, స్టేబుల్ ప్యూజన్పై వీరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా, పరిహారం చెల్లించకుండా తమ బొమ్మలను వాడుకుంటున్నందుకు కాపీరైట్ చట్టం కింద శిక్షించాలని కోరారు. గుర్తింపు కావాలి ఏఐ ఆధారిత కంప్యూటర్ ప్రోగ్రాంలు సొంతంగా ఏమీ సృష్టించలేవు. అవి సృష్టించే నకలుకి ఏదో ఒక అసలైన చిత్రమో, కళాకారులు లేదా రచయితల శైలి ఆధారం కావాలి. ఎలాంటి చిత్రం, ఫొటో, రచన కావాలన్నా ఎవరిశైలిలో కావాలన్నా కమాండ్ ఇస్తే వాటిని అనుసరించి కృత్రిమమేధ నకలును సృష్టించగలుగుతుంది. అలాంటప్పుడు వాటికి ఆధారమైన కళాకారులు, రచయితలు, ఫొటోగ్రాఫర్లకు తగిన రీతిలో పరిహారం చెల్లించడం, గుర్తింపు ఇవ్వాలనేది వారి వాదన. క్రిస్ కస్టనోవా అనే రచయిత్రి ‘జోర్యా ఆఫ్ ద డాన్’ పేరిట ప్రచురించిన కామిక్ నవలకు అమెరికా కాపీరైట్ ఆఫీసు తొలుత ఆమోదం తెలిపింది. అయితే ఈ కామిక్‌లో ఉపయోగించిన బొమ్మలు మిడ్‌జర్నీ ప్లాట్‌ఫామ్ ద్వారా సృష్టించినట్లు తరువాత వెల్లడైంది. దీనిపై వివాదం చెలరేగడంతో నవలలో కథకు మాత్రమే కాపీరైట్ ఇస్తున్నామని, కంప్యూటర్ సృష్టించిన బొమ్మలకు ఇవ్వలేదని కాపీరైట్ ఆఫీసు తన నిర్ణయాన్ని సవరించుకుంది. బొమ్మలు, కార్టూన్లు, చిత్రాలను కృత్రిమమేధ కాపీ కొట్టకుండా షికాగో యూనివర్సిటీకి చెందిన ఓ బృందం ‘గ్లేజ్’ అనే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని ఉపయోగిస్తే, అది చిత్రాలపై కంటికి కనిపించని ఒక తెరను కప్పేస్తుంది. దాంతో కృత్రిమమేధ ఈ చిత్రాన్ని కాపీ కొట్టడం కుదరదు. ‘కృత్రిమమేధ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ తరుణంలో కొన్ని మార్గదర్శకాలు, ఆంక్షలు అవసరం’ అని గ్లేజ్ సృష్టికర్త స్వాన్షాన్ అభిప్రాయపడ్డారు. సహజీవనం తప్పదు కృత్రిమమేధ విస్తృతిని ఆపడం ఎవరివల్లాకాదు. అన్ని రంగాల్లోకి అది చొచ్చుకుపోతోంది. ఇక కృత్రిమమేధను మన జీవితాల్లోకి ఆహ్వా నించక తప్పదు. దాంతో సహజీవనానికీ మార్గం సుగమం చేసుకోవాల్సిందే అని విజ్ఞులు చెబుతున్నారు. సాల్వడార్ డాలీ సర్రియలిస్టు పెయింటింగ్స్‌ను, పికాసో అబ్ స్ట్రాక్ట్ పెయింటింగ్స్‌ను, బ్రాక్ క్యూబిజమ్ను మొదట్లో కళగా గుర్తించలేదు. కానీ ఇప్పుడవి అద్భుత కళాఖండాలుగా ఆవిష్కృతమయ్యాయి. కొత్తదనాన్ని స్వీకరించడానికి మనిషికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు కృత్రిమమేధ సృష్టించే కళారూపాల్ని ముందు ముందు మనం ఆమోదించి ఆహ్వా నిస్తామేమో?. -
నేను పెద్దయ్యాక సమంత అవుతా...
-
Artist Vijaya Lakshmi: సంకల్పానికి చిత్రరూపం
ఆమె చిత్రలేఖనంలో మనకు కనిపించేది ఒక రూపం కాదు... అనేకం. బుద్ధుడి బొమ్మలో కేవలం బుద్ధుడు మాత్రమే కాదు... బ్రష్ పట్టుకుని... తదేక దీక్షతో బుద్ధుడి బొమ్మ వేస్తున్న ఓ టీనేజ్ అమ్మాయి కూడా ఉంటుంది. రవివర్మ కుంచెకు అందిన అందం... విజయలక్ష్మి చిత్రాల్లో ద్యోతకమవుతుంది. తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్– మల్కాజ్గిరి జిల్లా, శామిర్ పేట మండలంలో ఉంది తుర్కపల్లి. ఆ ఊరిలో అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి చిత్రలేఖనంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది. కళారత్న, అబ్దుల్ కలామ్ అవార్డులతోపాటు లెక్కలేనన్ని పురస్కారాలు, ప్రశంసలు ఆమె సొంతమయ్యాయి. తన రంగుల ప్రస్థానాన్ని, ఒక చిత్రంలో లెక్కకు మించిన వివరాలను పొందుపరచడంలో తన అభిరుచిని, బొమ్మల పట్ల తన ఇష్టాన్ని సాక్షితో పంచుకున్నారు విజయలక్ష్మి. అసాధారణమైన ప్రతిభ ‘‘నా జీవితంలో బొమ్మలు ఎప్పుడు ప్రవేశించాయో స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే నా దృష్టిని ఆకర్షించిన దృశ్యాలకు చిత్రరూపం ఇవ్వడం నా బాల్యంలోనే మొదలైంది. నన్ను స్కూల్‌కి మా అన్న తీసుకు వెళ్లి, తీసుకువచ్చేవాడు. నాకు చదువంటే చాలా ఇష్టం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పుస్తకాలే నా లోకం. అందులోని బొమ్మలే నా స్నేహితులు. అందరి పిల్లల్లా ఆడుకోవడం నాకు కుదరదు కదా. అందుకే చదువుకుంటూ, బొమ్మలేసుకుంటూ పెరిగాను. టెన్త్‌క్లాస్ తర్వాత కాలేజ్కెళ్లడం కష్టమైంది. కొన్నేళ్ల విరామంలో సైకాలజీ, ప్రముఖుల బయోగ్రఫీలు, భగవద్గీత... అదీ ఇదీ అనే తేడా లేకుండా నాకు దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివాను. ఆ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేశాను. చదివేకొద్దీ నా ఆలోచన పరిధి విస్తృతం కాసాగింది. నా గురించి నేను ఆలోచించడమూ ఎక్కువైంది. ఒక వ్యక్తి అసాధారణమైన నైపుణ్యాలను సాధించినప్పుడు ఆ వ్యక్తిని ఆ ప్రత్యేకతలతోనే గుర్తిస్తారు. ఇతర లోపాలున్నా సరే అవి తొలుత గుర్తుకురావు. నాకు ఎడమ చెయ్యి మాత్రమే మామూలుగా పని చేస్తుంది. రెండు కాళ్లు, కుడి చెయ్యి చిన్నప్పుడే పోలియో భూతం బారిన పడ్డాయి. నా పేరు విన్న వెంటనే కాన్వాస్ మీద అద్భుతాలు సృష్టించగలిగిన ఒక చిత్రకారిణి గుర్తుకురావాలి. సమాజం ఒక సాధారణ వ్యక్తిని సాధారణంగానే గుర్తిస్తుంది. ఒక నైపుణ్యమో, వైకల్యమో ఉన్నప్పుడు వ్యక్తిగా గుర్తించడానికంటే ముందు నైపుణ్యం, వైకల్యాలతోనే పరిగణనలోకి తీసుకుంటుంది. పోలియో బాధితురాలిగా ఐడెంటిఫై కావడం కంటే విజయలక్ష్మి అంటే చిత్రలేఖనం గుర్తుకు వచ్చేటంతగా రాణించాలనుకున్నాను. అందుకోసమే అహర్నిశలూ శ్రమించాను. నేను చూసిన దృశ్యాల నుంచి నా బొమ్మల పరిధిని విస్తరించాను. నేను చదివిన పుస్తకాల నుంచి ఇతివృత్తాలను రూపుదిద్దుకున్నాను. అన్నింటికీ మించి రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందాను. రవీంద్రభారతిలో పురస్కారాలు చిత్రకారిణిగా గుర్తింపు రావడమే కాదు, పురస్కారాలను రవీంద్రభారతిలో అందుకోగలిగాను. రవీంద్రభారతిలో అందుకోవడం కూడా ఒక పురస్కారంగానే భావిస్తాను. 2019లో నా చిత్రాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే అవకాశం వచ్చింది. అలాగే హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, సాలార్జంగ్ మ్యూజియంతోపాటు ఢిల్లీలోనూ ప్రదర్శితమయ్యాయి. మనలో ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష, సంకల్పబలం ఉంటే భగవంతుడు అవకాశం ఇచ్చి తీరుతాడని నమ్ముతాను. ఓ సంస్థ నా అవసరాన్ని గుర్తించి డెబ్బై వేల విలువ చేసే ఎలక్ట్రానిక్ వీల్‌చైర్ విరాళంగా ఇచ్చింది. అది కూడా భగవంతుడు పంపినట్లే. స్ఫూర్తిప్రదాతగా... నేను రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందితే, నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్న కొత్తతరం ఉండడం నాకు సంతోషంగా ఉంది. నేను చదువుకున్న స్కూల్లో నా బొమ్మలను ప్రదర్శించినప్పుడు నాకా సంగతి తెలిసింది. జీవితాన్ని నిస్సారంగా గడిపేయకూడదు, స్ఫూర్తిమంతంగా ఉండాలని కోరుకుంటాను. సోషల్ మీడియాను నూటికి నూరుశాతం వినియోగించుకున్నాననే చెప్పాలి. సోషల్ మీడియా వేదికగానే ఇన్‌ఫ్లూయెన్సర్‌ని కాగలిగాను. తలసేమియా వ్యాధిగ్రస్థులకు రక్తం కోసం ఏడాదికి మూడుసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నాను. మా ఊరి కుర్రాళ్లు ‘ఏం చేయాలో చెప్పక్కా, మేము చేసి పెడతాం’ అని ఉత్సాహంగా సహాయం చేస్తున్నారు. ‘వీల్‌చైర్ నుంచి నేను ఇన్ని చేస్తుంటే హాయిగా నడవగలిగిన వాళ్లు ఎందుకు చేయలేరు. స్థిరచిత్తం ఉంటే ఏదైనా సాధ్యమే’నని వీడియోల్లో చెబుతుంటాను’’ అని సంతోషంగా తన బొమ్మలలోకాన్ని వివరించింది విజయలక్ష్మి. బుద్ధుడి వెనుక యువతి విజయలక్ష్మి చిత్రలేఖనంలో ఉన్న అమ్మాయి అచ్చమైన తెలుగుదనంతో ఒత్తైన జడ వేసుకుని ఉంటుంది. ఆ జడను అలంకరించి పూలు కూడా అచ్చం పూలను పోలినట్లే తెల్లటి పువ్వులో పసుపువర్ణంలో పువ్వు మధ్యభాగం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి చెవి జుంకీలకున్న నగిషీలు కూడా. అలాగే మరో చిత్రలేఖనం ఇంకా అద్భుతం... మన దృష్టి అభయ ముద్రలో ఉన్న బుద్ధుడి మీద కేంద్రీకృతమవుతుంది. బుద్ధుని పాదాల వద్దనున్న కమలం మీద, బుద్ధుడి శిఖ, శిఖ వెనుకనున్న కాంతివలయాన్ని కూడా చూస్తాం. ఆ తర్వాత మన దృష్టికి వస్తుందో అద్భుతం. ఆ బుద్ధుడి బొమ్మ ఉన్నది కేవలం కాన్వాస్ మీద కాదు. ఒక యువతి వీపు మీద. అటువైపు తిరిగి కూర్చుని ఉన్న యువతిని చిత్రీకరించిన తర్వాత ఆమె వీపు మీద చూపరులకు అభిముఖంగా ఉన్న బుద్ధుడిని చిత్రించింది విజయలక్ష్మి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Mogilaiah: బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత..
-
బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత
ఇటీవల విడుదలైన బలగం చిత్రంలో ఫేమస్ అయిన మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన గాత్రంతో, బుర్రకథలతో ప్రజలను మెప్పించిన మొగిలయ్య వరంగల్ జ్లిలా వాసి. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో వారానికి మూడుసార్లు ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు. కాగా.. తన భర్తకు వైద్య సాయం అందించి.. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల విడుదలైన బలగం మూవీ క్లైమాక్స్‌లో మానవ సంబంధాను వివరిస్తూ ఆయన చేసిన గానం ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆ సన్నివేశమే సినిమాకు హైలెట్‌గా నిలిచింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బుర్ర కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారు. మొగిలయ్య గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. -
ఆదిపురుష్‌ను వదలని వివాదాలు.. కాపీ కొట్టారంటూ!
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తోన్న మైథలాజికల్ ఫిల్మ్ 'ఆది పురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను వివాదాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఆది నుంచే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది ఆదిపురుష్. మొదట టీజర్‌పై విమర్శలు రాగా.. శ్రీరామనవమి రోజు రిలీజైన పోస్టర్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరొకరు ఆదిపురుష్ పోస్టర్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభాస్ లుక్‌ను ఆదిపురుష్ మేకర్స్ తన ఆర్ట్ నుంచి కాపీ కొట్టారని ఆరోపించాడు ఆర్టిస్ట్ ప్రతీక్ సంఘర్. 'ఆదిపురుష్' చిత్రబృందం రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్ కోసం తన ఆర్ట్ వర్క్‌ను కాపీ చేశారని ఆరోపిస్తున్నారు. తాజాగా తాను రూపొందించిన రాముని రూపాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫేస్బుక్లో తాను రూపొందించిన స్క్రీన్‌షాట్స్ షేర్ చేశారు. 'ఆదిపురుష్' మూవీ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన అనుమతి లేకుండా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు ప్రతీక్ సంఘర్. ఆది నుంచి వివాదాలే కాగా.. గతేడాది టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రంపై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, పాత్రల చిత్రీకరణపై నెటిజన్లు మేకర్స్‌ను తప్పుబట్టారు. ఇటీవల రిలీజైన పోస్టర్లో సైతం రామునికి పవిత్రమైన హిందూ సంప్రదాయం ప్రకారం 'జానీవు'(జంజం) లేకుండా చూపించినందుకు మేకర్స్‌పై ఫిర్యాదు కూడా నమోదైంది.కాగా.. 'ఆదిపురుష్' జూన్ 16, 2023న థియేటర్లలో విడుదల కానుంది. -
కాశ్మీర్-కన్య కన్యాకుమారి ఈ యాత్రలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న..
-
‘మోదీజీ.. ఇది అస్సలు ఊహించలేదు’
రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఆసక్తికర సంభాషణ ఒకటి జరిగింది. కర్ణాటకకు చెందిన హస్త కళాకారుడు ఒకరు.. బీజేపీ ప్రభుత్వం నుంచి ఇది అస్సలు ఊహించలేదంటూ ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు. దానికి ప్రధాని మోదీ కూడా నవ్వులు చిందించడం విశేషం. కర్ణాటకకు చెందిన బిద్రీ కళాకారుడు రషీద్ అహ్మద్ ఖ్వాద్రీకి పద్మశ్రీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిన్న(బుధవారం) జరిగిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నారు. అయితే.. అవార్డుల విజేతలను ప్రధాని మోదీ అభినందించే క్రమంలో.. ఖ్వాద్రీ ముచ్చటించారు. ‘‘మోదీజీ.. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే పద్మ అవార్డు నాకు వస్తుందని అనుకున్నా. కానీ, రాలేదు. మీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో.. ఈ ప్రభుత్వం నాకు ఎలాంటి అవార్డు ఇవ్వదని అనుకున్నా. కానీ, అది తప్పని మీరు నిరూపించారు. మీకు నా కృతజ్ఞతలు అని ఖ్వాద్రీ, ప్రధాని మోదీతో అన్నారు. ఆ దిగ్గజ కళాకారుడి మాటలు వినగానే ప్రధాని మోదీ రెండు చేతులు జోడించి నమస్తే పెట్టి.. చిరునవ్వు నవ్వారు. కాస్త దూరంగా నిల్చున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం చిరునవ్వులు చిందించారు. Indian Muslim artist from #Karnataka #RasheedAhmedQuadri after winning #PadmaShri. 'I used to think #BJP never gives anything to #Muslims,but #Modi proved me wrong.' A moment of dialogue between the awardee & PM Modi, with mutual respect and appreciation from both sides. TQ🇮🇳🫡 pic.twitter.com/EO5h2FyEGw — سعود حافظ | Saud Hafiz (@saudrehman27) April 6, 2023 -
కాంతార 'భూత కోల' చేస్తూ.. కుప్పకూలిన కళాకారుడు.. వీడియో వైరల్..
బెంగళూరు: కర్ణాటక ప్రాచీన నృత కళారూపం భూత కోల. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన కాంతారా సినిమాతో ఈ నృత్య వేడుక మరింత పాపులరైంది. అయితే భూత కోల చేస్తూ ఓ కళాకారుడు ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గ్రామస్థుల ముందు ప్రదర్శన చేస్తున్న అతడు సడన్‌గా కిందపడిపోయాడు. అక్కడున్నవారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దక్షిణ కన్నడ జిల్లా కదాబా తాలూకా ఎడమంగల గ్రామానికి చెందిన ఈ భూత కోల కళాకారుడి పేరు కాంతు అజిల. వయసు 59 ఏళ్లు. చాలా సంవత్సరాలుగా నృత్య కళతో జనాల్ని అలరిస్తున్న ఇతనికి దైవ నర్తకుడిగా మంచి గుర్తింపు ఉంది. అయితే కాంతు ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. గ్రామస్థులు మాత్రం గుండెపోటు వల్లే అతను మరణించి ఉంటాడని భావిస్తున్నారు. కాంతు నృత్య ప్రదర్శన చేసే సమయంలో గ్రామస్థుడు ఒకరు మొబైల్లో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
నాపై దారుణమైన ట్రోల్స్ చేశారు: స్టార్ హీరోయిన్
నటీనటులకు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం సర్వ సాధారణమైపోయింది. ఇటీవల పలువురు స్టార్ హీరోయిన్లపై దారుణమైన ట్రోల్స్ చేయడం మీరు చూసే ఉంటారు. అలాగే తాజాగా తనకు అలాంటి అనుభవాలు ఎదురైనట్లు నటి వెల్లడించింది. ఆమె పేరే రితిక సింగ్. తెలుగు పెద్దగా పరిచయం లేని పేరు. 2017 సంవత్సరంలో వెంకటేశ్ సరసన గురు సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది భామ. ఆ తర్వాత నీవెవరో, శివలింగ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన ట్రోల్స్ తనను ఎంతో బాధించాయని తెలిపింది. వాటితో చాలా ఇబ్బందులు ఎదురైనట్లు వాపోయింది నటి. ముంబయిలో జన్మించిన రితిక సింగ్ క్రీడాకారిణి కూడా. ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించారు. 2009లో భారత్ తరపున ఆసియా గేమ్స్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత 2012 లో ఇరుదు చుట్రు అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ 2016లో మాధవన్‌తో సాల కడూస్ సినిమాకు మంచి పేరు సంపాదించింది. తాజాగా ఆమె నటించిన కార్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. నా ఫోటోలు దారుణంగా ఎడిట్ చేశారు రితిక సింగ్ మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ఎంతగానో బాధించాయి. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు నన్ను ఇబ్బంది పెట్టాయి. వాటితో నా గుండె పగిలినంత పనైంది. నాకు కుటుంబం ఉంది. ఇవి చూస్తే వాళ్లు చాలా బాధపడతారు. నేను కోరుకునేది ఒక్కటే ఆడవారిని అందరూ గౌరవించాలి. మిడిల్ క్లాస్ అయినా.. సెలబ్రిటీ అయినా సమానంగా చూడాలి. అమ్మాయిలకు కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి. స్కూల్స్‌లో వారానికి కనీసం ఒక్కసారైనా సెల్ఫ్ డిఫెన్సివ్ క్లాసులు నిర్వహించాలి. నేను చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. తర్వాత జనరేషన్ పిల్లలకు చాలా త్వరగా సమాజం పట్ల అవగాహన కల్పించాలి.' అంటూ తన బాధను వెల్లడించింది. -
Pakhal Tirumal Reddy: వేయి రేఖల వినూత్న సౌందర్యం
పీటీ రెడ్డిగా విఖ్యాతులైన పాకాల తిరుమల రెడ్డి (1915– 1996) ప్రపంచ స్థాయికి చెందిన తెలంగాణ కళాకారుల్లో అగ్రగణ్యుడు. కరీంనగర్ జిల్లా, అన్నవరం గ్రామంలో 1915 జనవరి 4వ తేదీన జన్మించారు. ప్రాథమిక విద్య చదివే రోజుల్లో ఆయన్ని ప్రోత్సహించింది ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సత్తార్ సుభాని. తన బంధువును కలిసేందుకు ఒక రోజు రెడ్డి హాస్టల్‌కు వెళ్లాడు పీటీ. ఆ రోజు స్కౌట్స్ డే. ముఖ్య అతిథి బాడెన్ పావెల్. బాడెన్ రూపానికి 17 ఏండ్ల పీటీ కాంతి వేగంతో ప్రాణం పోస్తున్నారు. అది గమనించిన కొత్వాల్ పీటీని పిలిపించుకొని తన పెయింటింగ్ వేస్తావా అని అడిగారు! మిడాస్ టచ్!! రెడ్డి హాస్టల్ నిబంధలను సవరించి ప్రతిభావంతులైన కళాకారులకూ స్కాలర్షిప్ ఇవ్వవచ్చని పీటీని ‘సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్’లో చేర్పించారు కొత్వాల్. ముంబైలోని ఆ వినూత్న ప్రపంచంలో సూజా, కేకే హెబ్బార్, ఎమ్ఎఫ్ హుస్సేన్ తదితరులు సహ విద్యార్థులు. తన 22వ ఏట చిత్రించిన సెల్ఫ్ పోర్ట్రెయిట్ అంతర్ వ్యక్తినీ చూపిందని అధ్యాపకులు మెచ్చుకున్నారు. జేజేలో 1935 నుంచి 42 వరకు చిత్రకళను అభ్యసించి డిప్లొమా పొందారు, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ ర్యాంక్‌తో! దేశ విభజన సందర్భంలో హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ మాండలికాన్ని తన రచనలలో శాశ్వతం చేసిన యశోదా రెడ్డిని వివాహం చేసుకున్నారు. కార్పెంటరీ ఇండస్ట్రీ నెలకొల్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ హుందాతనాన్ని తెలిపే ఫర్నిచర్ పీటీ రెడ్డి సమకూర్చిందే. శిల్పీ, దారుశిల్పీ; ఆయిల్, వాటర్ కలరిస్ట్ అయిన పీటీ కళా ప్రపంచానికి కానుకగా ఏమి ఇచ్చారు? ఒక్క మాటలో భారతీయ సాంస్కృతిక తాత్విక సౌందర్య భరిత వేయి దళాల పరిమళ భరిత పుష్పం! మన జ్ఞాపకాల పొరల్లో మసకబారిన ఆ కళారూపాలు చూడవచ్చా? ‘స్వధర్మ’లో మూడు అంతస్తులలోని ప్రత్యేక గ్యాలరీలలో పీటీ రెడ్డి కళా రూపాలు కొలువై ఉన్నాయి. వారి కుమార్తె లక్ష్మీ రెడ్డి దంపతులు ఎంతో శ్రద్ధగా కాపాడుతున్నారు. చిరునామా సులభం. నారాయణగూడ మెట్రో పిల్లర్ 1155. కళాకారులు, చరిత్రకారులు అపా యింట్మెంట్ తీసుకుని సందర్శించవచ్చు. (క్లిక్ చేయండి: అతడి మరణం ఓ విషాదం!) - పున్నా కృష్ణమూర్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ (జనవరి 4న పీటీ రెడ్డి జయంతి) -
ఊరంతా కళాకారులే.. పౌరాణిక పాత్రలకు కేరాఫ్ శ్రీరంగపట్నం
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: రామాంజనేయ యుద్ధం, కురుక్షేత్రం, బాలనాగమ్మ, చింతామణి.. నాటకం ఏదైనా వారి నటనాచాతుర్యం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కాళికా మాత, దుర్గమ్మ, శ్రీరాముడు, కృష్ణుడు, శివుడు, ఆంజనేయుడు, వెంకన్నబాబు, రాక్షసుడు, అఘోరాలు.. ఇలా వేషమేదైనా పరకాయ ప్రవేశం చేయడమే వారి ప్రత్యేకత. తాతల కాలం నుంచి సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకుని మరీ వారు రంగస్థలంపై, జాతర్లలో సత్తా చాటుతున్నారు. నటనపై మక్కువతోనే జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పోషణకు వ్యవసాయం చేసినా ప్రదర్శనలను మాత్రం విస్మరించరు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం పౌరాణిక నాటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా విరాజిల్లుతోంది. ఊరంతా కళాకారులే తూర్పు గోదావరి జిల్లా కళాకారులకు పెట్టింది పేరు. తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరం ఖ్యాతి గడించింది. కేవలం నగరం ఒక్కటే కాకుండా జిల్లా వ్యాప్తంగా కళాకారులు వేల సంఖ్యలో ఉన్నారు. శ్రీరంగపట్నంలో అయితే ఊరంతా కళాకారులే దర్శనమిస్తారు. మేజర్ పంచాయతీ అయిన ఈ గ్రామ జనాభా 12,500. కుటుంబాలు 3,165 ఉన్నాయి. వీరిలో 400 మంది పౌరాణిక నాటకాలు వేసే కళాకారుల కుటుంబాలకు చెందిన వారే ఉన్నారంటే నాటకాలపై వారికున్న మక్కువ ఏమిటో అర్థమవుతోంది. వ్యవసాయ పనులతో జీవనం సాగించే కళామతల్లి ముద్దుబిడ్డలు వివిధ పండగలు, జాతర సమయాల్లో కళాకారులుగా రూపుదాలుస్తారు. ప్రజలను అలరించే ప్రదర్శనలు ఇస్తారు. వీరి నట విశ్వరూపానికి దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉంది. శ్రీరంగపట్నం కళాకారులంటే ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల ప్రజలు అమితంగా ఇష్టపడుతూంటారు. రాష్ట్రవ్యాప్తంగా బెంగళూరు, చిత్తూరు, విజయవాడ తదితర ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా నాటి నుంచి నేటి వరకూ వేలాది ప్రదర్శనలు వారి సొంతం. ఫలితంగా ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి, గ్రామ దేవతల జాతరల సమయంలో కళా ప్రదర్శనలతో సందడి వాతావరణం తీసుకువస్తారు. వివిధ వేషధారణలతో అలరిస్తారు. రూ.500తో మొదలై.. 1988లో ఒక్కో బృందంలో సభ్యుడికి కళాప్రదర్శనకు రూ.500 అందేది. ఇవి ఖర్చులకు కూడా సరిపోకపోయినా కళామతల్లినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం 20 మంది ఉన్న బృందంలో ఒక్కో కళా ప్రదర్శనకు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకూ అందుతోంది. ఏ పాత్ర కావాలన్నా.. గ్రామంలో 20 నాటక బృందాలున్నాయి. ఒక్కో బృందంలో 20 మంది చొప్పున 400 మంది కళాకారులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో పౌరాణిక కళాబృందాలున్నా.. పాత్రకు అనువైన కళాశారులు దొరకడం కష్టం. కానీ శ్రీరంగపట్నం మాత్రం అందుకు భిన్నం. ఏ పాత్రయినా.. ఏ నాటకమైనా అందుకు తగిన కళాకారులను సమకూర్చడం ఈ ఊరి ప్రత్యేకత. పౌరాణిక పాత్రల్లో అత్యంత ప్రాధాన్యమైన అన్నమయ్య, రాముడు, లక్ష్మణుడు వంటి విభిన్న పాత్రల్లో నటించే వారు కేవలం ఇక్కడే ఉండటం విశేషం. వీటితో పాటు కాళికాదేవి, నెమలి కోబ్రా డ్యాన్స్, నక్షత్రకుడు, హరిశ్చంద్రుడు, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, తాండ్ర పాపారాయుడు వంటి వేషధారణలకు కేరాఫ్‌గా ఈ గ్రామం ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ లేని కళాకారులు లేరంటే అతిశయోక్తి కాదు. నాటక ఘట్టం సందర్భంగా వీరు వేసే పాత్రలు, నృత్య ప్రదర్శనలు వీక్షకులను కట్టి పడేస్తుంటాయి. తమ తాతలను, తండ్రులను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం వారి సంతానం నాటక రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రదర్శనలపై ఉన్న మక్కువతో ఈ రంగంలోనే స్థిరపడిపోతూ కళకు జీవం పోస్తున్నారు. 34 ఏళ్లుగా.. 1988 నుంచి ప్రదర్శనలు ఇస్తున్నా. నాటక రంగంపై ఉన్న ప్రేమతో నేటికీ కళామతల్లి బిడ్డగా కొనసాగుతున్నా. రామాంజనేయ యుద్ధంలో నా నటనకు ప్రశంసా పత్రాలు, అవార్డులు దక్కాయి. నాడు ఒక్కో ప్రదర్శనకు రూ.500 గౌరవ వేతనం ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.2 వేలు పైగా అందుతోంది. డ బ్బులు ఎంత వచ్చాయన్నది కాకుండా.. కళను బతికించాలన్న తాపత్రయంతోనే కొనసాగుతున్నాం. – బాసెట్టి జగ్గారావు, కళాకారుడు రాక్షసుడే వచ్చినట్టు.. బాలగౌరి కళాకారుల సంఘ సభ్యుడైన తనకాల నాని మిమిక్రీ ఆర్టిస్ట్. నాటక రంగంలోనూ సత్తా చాటుతున్నాడు. నల్లకాళికాదేవి, వేపాలమ్మ పాత్రలకు జీవం పోస్తున్నాడు. తన నటనకు గుర్తింపుగా ఇటీవల పుష్ప–2 సినిమాలో అవకాశం దక్కింది. ఆవేశం.. ఈ వేషం.. నాన్న కీబోర్డ్ ప్లేయర్. బాబాయ్ సింగర్. వారిని స్ఫూర్తిగా తీసుకున్న కళాకారులు సతీష్ లేడీ ఓరియంటెడ్ గెటప్‌లో అలాగే ఒదిగిపోతాడు. బుల్లితెరపై స్టాండప్ కామెడీ రోల్ చేస్తున్నా.. నాటక ప్రదర్శన ఉందంటే చాలు వాలిపోతాడు. వేషమేదైనా.. కళాత్మకమే.. అఘోరా నృత్యం చేయడం అంత సులభం కాదు. కానీ ఆ పాత్రకు జీవం పోస్తాడు ఎం.సంపత్. అతను నాట్యం చేస్తూంటే అఘోరాలే ఔరా! అంటూ ఆశ్చర్య పోవాల్సిందే. పార్వతీ దేవి పాత్రకు సైతం న్యాయం చేస్తాడు. అబ్బాయే.. అమ్మాయిలా.. మరో కళాకారుడు రాంబాబు అమ్మవారు, లేడీ గెటప్, రుక్మిణీదేవి వేషధారణల్లో అలరిస్తుంటారు. ఇలా ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఒక్కో పాత్రకు న్యాయం చేయడంతో కీలక భూమిక పోషిస్తారు. (క్లిక్ చేయండి: ఒకప్పుడు తిరుగులేని ఆదరణ.. ఇప్పుడు కనుమరుగు) -
ఊలుతో అల్లిన చిత్రాలు.. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు
ఊలు ఉన్నది వెచ్చని స్వెట్టర్లు అల్లడానికే కాదు. చక్కగా చిత్రంగా బొమ్మలు వేయడానికి కూడా. ఊలు బొమ్మలంటే ఊలుతో అద్దిన బొమ్మలు కాదు. ఊలుతో అల్లిన చిత్రాలు... ఉలెన్ ఆర్ట్ కళారూపాలు. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు. అది నవంబర్ 17. బెంగళూరు, కర్నాటక చిత్రకళా పరిషత్తోని దేవరాజ్ అర్స్లో ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్. అది సోలో ఎగ్జిబిషన్. అందులో వినూత్నమైన చిత్రాల ప్రదర్శన. రంగు అద్దుకున్న కుంచె నుంచి కాన్వాస్ మీద రూపుదిద్దుకున్న రూపమేనా? సందేహం కలుగుతుంది. కళ్లు భ్రమకు గురి చేస్తున్నాయా అనే అనుమానం కూడా. భ్రుకుటి ముడిచి నిశితంగా చూస్తే తెలుస్తుంది అది దారాలు చేసిన మాయ అని. పోరింగ్ ఆర్ట్‌ను తలపిస్తూ రంగుల దారాలు పెయింటింగ్ ఫ్రేమ్ నుంచి కిందకు జాలువారి ఉన్నాయి. మొత్తం 14 చిత్రాలవి. అన్నింటిలోకి పెద్ద చిత్రం పదకొండు అడుగుల ఎత్తు, ఏడున్నర అడుగుల వెడల్పు ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్‌తో ఉన్నాయి. కానీ ప్రధానంగా ‘అమ్మ’ మనసును ప్రతిబింబిస్తున్నాయి. అమ్మ బొమ్మ కనిపించదు, నిద్రపోతున్న బిడ్డను సంతృప్తిగా చూసుకునే భావం బొమ్మల్లో ద్యోతకమవుతుంది. ఆ చిత్రాల రూపకర్త ఓ తెలుగు మహిళ. పేరు మానసప్రియ. ఆమె ఈ కళారూపాల కోసం ఐదేళ్లు నిరంతరంగా శ్రమించారు. పిన్నికి ఇచ్చిన మాట కోసం ఆమె జీవించి ఉండగానే ప్రదర్శించడం కోసం రెండేళ్ల పాటు నిద్రను త్యాగం చేస్తూ పని చేశారు. ఆమె పని చేస్తున్న వేగం కంటే పిన్నిని ఆవరించిన క్యాన్సర్ ఇంకా వేగంగా విస్తరించింది. పిన్నిని తీసుకువెళ్లి పోయింది. పిన్ని సీత ప్రథమ వర్థంతికి మానస ప్రియ ఇచ్చిన కన్నీటి కళాసుమాంజలి ఈ ప్రదర్శన. తాను ఆర్టిస్ట్ అయిన నేపథ్యాన్ని, చిత్రకళలో చేస్తున్న ప్రయోగాలను సాక్షితో పంచుకున్నారామె. ప్రకాశం నుంచి బళ్లారి ‘‘మా తాతలు ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా నుంచి కర్నాటకలోని బళ్లారికి వచ్చి స్థిరపడ్డారు. అలా నేను బళ్లారిలో పుట్టాను. నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఇష్టం. పెన్సిల్‌తో చక్కటి రూపాన్ని తీసుకురాగలిగేదాన్ని. స్కూల్లో ప్రైజ్‌లు కూడా వచ్చాయి. అయితే నాకు పెద్ద అడ్డంకి చదువే. ఎంత ప్రయత్నించినా మార్కులు పెద్దగా వచ్చేవి కాదు. అందులో నా అదృష్టం ఏమిటంటే... మార్కులు రావడం లేదని చదువు మానిపించకుండా ఫైన్ ఆర్ట్స్‌లో (బి.ఎఫ్.ఏ) చేర్పించడం. హైదరాబాద్‌లో లాలాపేట నుంచి ఉదయం ఐదింటికి ఉప్పల్‌కి వెళ్లి అక్కడి ప్రకృతి దృశ్యాలను బొమ్మలు వేశాను. పదిరోజులు వైజాగ్‌లో కాలేజ్ బల్లల మీద పడుకుంటూ ప్రాజెక్ట్ చేశాను. బీఎఫ్ఏ పూర్తయిన తర్వాత బెంగళూరులో విజువల్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందే లోపే పెళ్లి. పిల్లల కోసం కొంత గ్యాప్ తీసుకున్నాను. తొమ్మిదేళ్ల విరామం తర్వాత రేఖ అనే ఫ్రెండ్ ఆహ్వానంతో కేరళ, ఫోర్ట్ కొచ్చిలో నా చిత్రాలను ప్రదర్శించాను. అప్పటికి ఉలెన్ పెయింటింగ్స్ మొదలు పెట్టలేదు. అయితే ఆర్టిస్ట్‌గా ఊరికే ఉండకుండా ఏదో ఒక ప్రయోగం చేసేదాన్ని. అలా టెర్రారియమ్ అని గాజు సీసాల్లో మొక్కలను పెంచడం వంటి హాబీలు ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత పెయింటింగ్‌లో ఇప్పుడు మీరు చూస్తున్న ఉలెన్ ప్రయోగం మొదలు పెట్టాను. మా వారి ఉద్యోగరీత్యా ఇప్పుడు పూనాలో ఉంటున్నప్పటికీ నా ఆర్ట్ ప్రయోగాలు మానలేదు. నా పేరు మీద మొక్క బెంగళూరులో ఎగ్జిబిషన్ నాలుగు రోజులు సాగింది. ఓ రోజు అరవై దాటిన మహిళలు ఐదుగురు వచ్చారు. ‘మేము అక్కాచెల్లెళ్లం. ఓ సిస్టర్ ఈ రోజే కెనడా నుంచి వచ్చింది. ఈ ఎగ్జిబిషన్ చూసి తీరాలని తనను నేరుగా తీసుకువచ్చాం’ అని చెప్పారు. అలాగే ఎగ్జిబిషన్ చివరి రోజు ఆర్ట్ గ్యాలరీ ప్రెసిడెంట్‌గారు వచ్చి ‘వాళ్ల కాలేజ్‌లో రెండు రోజులు ఎగ్జిబిషన్ కావాల’ని అడిగారు. ఆరు వందల మంది విద్యార్థుల మధ్య నాతోనే ప్రారంభోత్సవం చేయించి, కాలేజ్ ప్రాంగణంలో నా పేరు మీద మొక్క నాటారు. ఐదేళ్లు నేను ఇంటి నాలుగ్గోడల మధ్య పడిన శ్రమ నాకో ప్రత్యేకతను తెచ్చింది. నేను అభ్యసించిన కోర్సుకి మరో కొత్త ఆర్ట్ ఫార్మ్‌ను జత చేయగలుగుతున్నాననే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు మానస ప్రియ. నా బొమ్మల్లో అమ్మ ఉంది నేను ఆర్టిస్ట్‌ని, తల్లిని. ఉలెన్ ఆర్ట్ మాధ్యమంగా అమ్మ మనసును ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. పిల్లలు మెలకువగా ఉన్నప్పటికంటే నిద్రపోతున్నప్పుడు చాలా బాగుంటారు. ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఉలెన్ ఆర్ట్‌లో పిల్లల ముఖంలో ప్రసన్నత కోసం నేను శ్రద్ధగా పని చేయడాన్ని మా సీత పిన్ని చాలా ఇష్టంగా చూసేది. ‘ఈ కళాఖండాలతో ఎగ్జిబిషన్ పెడితే చూడాలని ఉంది’ అని చెప్పిందోసారి. ‘అలాగే చూస్తావు పిన్నీ’ అన్నాను. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే తెలిసింది పిన్నికి క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉందని. అప్పటి వరకు మామూలుగా ప్రాక్టీస్ చేసిన నేను త్వరగా పూర్తి చేయాలని చాలా దీక్షగా పనిచేశాను. రెండేళ్లపాటు రోజుకు నాలుగు గంటలే నిద్రపోయాను. నేనెంత ఆత్రుత పడినప్పటికీ పిన్ని ఉండగా ఆ పని చేయలేకపోయాను. గత ఏడాది పిన్ని ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. పిన్ని తొలి వర్ధంతి నాటికి ఎగ్జిబిషన్ పెట్టి తీరాలని ఈ ఏడాది నవంబర్‌లో ఆ పని చేయగలిగాను. ఈ ప్రక్రియలో నాకు చాలా మంది సహాయం చేశారు. అంజలి పట్వర్ధన్ నా ప్రతి బొమ్మకు ఒక పోయెమ్ రాశారు. ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటులో ఫ్రెండ్ తేజస్విని సహాయం చేసింది. – ధూళిపాళ్ళ మానస ప్రియ, ఉలెన్ ఆర్టిస్ట్ – వాకా మంజులారెడ్డి -
ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..
కాళ్ల సత్యనారాయణ ప్రపంచాన్ని ఎన్నడూ లెక్క చెయ్యలేదు, ప్రపంచమూ అతణ్ణి అలాగే పట్టించుకోలేదు. అతని కవిత నిరూపం, ఆయన గానం ఏకాంతం, కుంచె ధరించిన ఆ చేయి నైరూప్యం, తను తొక్కిన రిక్షా పెడల్ పై జారిన చెమట చుక్క నిశ్శబ్దం. ఆయన మరణం కూడా పెద్దగా ఎటువంటీ చప్పుడు చెయ్యకుండా ప్రపంచాన్ని దాని మానన దాని రణగొణ ధ్వనుల్ని దానికే వదిలేసి మనకు సెలవన్నారు. చిత్రకారుడు, కవి, రిక్షా పుల్లర్, స్క్రీన్ ప్రింటర్. తన లోకపు నవ్వుల వేదాంతి కాళ్ళ సత్యనారాయణ నవంబరు 24 తెల్లవారు ఝామున ప్రపంచపు పోకడ నుండి నిష్క్రమించారు. దాన్ని మనం మరణం అనుకోవచ్చు. గత ఇరవై రోజుల నుంచి మృత్యుశయ్యపై మేను వాల్చి ఉన్న ఈ మనిషి అంతకు రెండు రోజుల ముందే తన బాల్య మిత్రులు కడుపు గంగాధర్ కోరిక మేరకు తన జీవితానికి అక్షర రూపం ఇవ్వడం మొదలు పెట్టారు. రెండు పేరాల రచన తరువాత ఈ పనిని మాత్రం ప్రపంచం ముందుకు ఎందుకు పరవాలి అనిపించిందో ఏమో! వ్యక్తిగతంగా ఒకరిద్దరు మిత్రులతో పంచుకున్న ఆయన, వారి గుడిసెలోని కిరసనాయలు దీపం ముందు పలికి మాటలు ఇవి. ఈ కాసిన్ని మాటల తరువాత నేను ఆయనతో ఆనాటి వాన చినుకులు అనే కథ ఒకటి వ్రాయించ ప్రయత్నించాను. నా మరో మిత్రులు వేమూరి సత్యనారాయణ గారి గత ముప్ఫయ్ ఏళ్లక్రితం నుంచి కంటున్న కల ఈ కథల పుస్తకం. బహుశా అంతా సవ్యంగా ఉండి ఉండుంటే ఆ పుస్తకంలో కాళ్ల గారి రిక్షావాడి కథ అందులో ఉండి ఉండేది. ‘ఓ జ్ఞాపకం. నేను రెండుమూడు తరగతుల్లో వున్నప్పుడే బొమ్మలెయ్యడం ఇష్టం. నాలుగైదు తరగతులకొచ్చేసరికి ఇష్టం పిచ్చిగా మారింది. ఆ వయసులో మా కుటుంబం బీదరికం కంటే దీనంగా వుండేది. రాత్రిపూట కోడిగుడ్డు చిమ్నీ కిరసనాయిల్ దీపం ముందు చదువుకుంటున్నట్టు నటించేవాణ్ని.అంతకుముందే మా అమ్మ హెచ్చరించేది ‘నాయనా కిరసనాయిల్ రేపటిక్కూడా అదే‘నని. ఆ దెబ్బకి ప్రాణం గిలగిల్లాడిపోయేది. రిక్షా తొక్కితొక్కీ మా నాన్నా, పాచి పనులు చేసి మా అమ్మా అలిసిపోయి, ఎప్పుడెప్పుడు నిద్రపోతారా అని చూసేవాణ్ని. అంతకు ముందే దీపాన్ని గోరంత చేశేవాణ్ని. వాళ్లు నిద్రపోయారన్న సంకేతాలు రాగానే...ఇక నా అస్త్రాలు (అంగుళన్నర పెన్సిల్ ముక్క, అరిగిపోయిన లబ్బరు, పొద్దున బడిలో పక్కోడి నోటు పుస్తకం లోంచి కొట్టేసిన తెల్లకాయితం)తీసేవాణ్ని ధైర్యంగా. కానీ నా ముందున్న ఆ గోరంత దీపాన్ని పెంచే ధైర్యం లేపోడంతో అది అలా మిణుకుతూనే వుండేది. ఐనా, ఎక్కళ్లేని ఉత్సాహంతో బొమ్మ మొదలెట్టేవాణ్ని. ఆ క్షణాల్లో, ఈ ప్రపంచంలో నేనొక్కణ్నే. ఎవరన్నా వుంటే... నాతరవాతే. అలాగ ఎంతసేపుండేవాడినో! నా పిచ్చి అమ్మా నాన్నలు ఒళ్లెరక్క నిద్రపోతుంటే అలివికానంత ఆనందంగా వుండేది. వాళ్లు హాయిగా నిద్రపోతున్నారని కాదు, ఇక ఆ సమయంలో నాకు యే అడ్డూ లేదని. ఎలాటి కాలసూచికలూ లేని ఆ యింట్లో, నా లోకంలో వున్నప్పుడు, ఏదో కవుఁరుకంపు యీలోకంలోకి లాగింది. ఏదో కాలుతుంటే వచ్చే దుర్వాసన అది. ఆవేళప్పుడు ఏదో తగలబడుతున్నట్టనిపించి భయవేఁసింది. తీరా చూస్తే కాలింది నాజుత్తే, దానివల్లే కవుఁరుకంపు. ఏమయిందంటే,నాముందున్నది గుడ్డి దీపంబుడ్డి, దాని వెలుగెంత! నేను వేసేబొమ్మ కోసం బాగా కిందకి వంగితే చిమ్నీలోంచి వచ్చే సెగకి నా జుత్తు కాలిందన్నమాట. కొత్తాపాతల మధ్య తేడాలెప్పుడూ వుండేవనకుంటా. నాకైతే నాలుగు తరాల మనుషులు తెలుసు. వీళ్ల మధ్య అప్పుడప్పుడూ వెటకారాలూ వెక్కిరింతలూ నడిచేవి. ‘ఏ పింగూ లేపోతే క్రాపింగు' , ‘పుటోవులు దిగితే ఆయుర్దాయం తగ్గిపో‘ద్దని, అప్పుడప్పుడే మొదలౌతున్న ఫొటోగ్రఫీ మీద అపనమ్మకమూ, అల్యూమినియం పాత్రల్లో వండుకునీ తింటే అనారోగ్యం పాలవుతామనీ.... ఇలా ఎన్నో తేడాలు. ఐనా వాళ్ల cultural space కాపాడుకునేవారు. అందుకే నిన్నామొన్నటి వరకూ తోలుబొమ్మలు, కీలుబొమ్మలు, హరికథలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, గొల్లసుద్దుల్లాటి కళా రూపాలు బతికొచ్చాయి. ఇప్పుడు, ఏ మాత్రం పసలేని అభిరుచుల్ని తృప్తిపరచడానికి టీవీతల్లే దిక్కు. ఇప్పుడు పెరిగిన సాంకేతిక జ్ఞానంతో ఇప్పడున్నవాటితో పాటు, పాతరూపాల్ని ఆధునికం చేసే ఓపికా సమయమూ ఈ తరానికి లేపోడం విషాదం. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి చదవండి: Sarah Baartman Life Story: విధివంచితురాలి యథార్థ గాధ: ఆమె శరీర భాగాలను ఆడా మగ, ముసలీ ముతక గొడుగు మొనలతో పొడిచి.. -
Sanket Jadia: సంకేత చిత్రం
‘నరజాతి చరిత్ర సమస్తం – రణరక్త ప్రవాహసిక్తం’ అంటూ నిట్టూర్పుకే పరిమితం కాలేదు ఈ యంగ్ ఆర్టిస్ట్. చరిత్రలోని రణరంగాలను కాగడా పెట్టి వెదికాడు. సంక్లిష్టమైన చారిత్రక సందర్భాలను తన చిత్రాల్లోకి తర్జుమా చేశాడు సంకేత్ జాడియ.... సంకేత్ జాడియ తల్లి బొమ్మలు గీసేది. ఆమెకు ఆ విద్య ఎవరు నేర్పించారో తెలియదుగానీ ‘అద్భుతం’ అనిపించేలా గీసేది. అలా బొమ్మలపై చిన్నప్పటి నుంచే సంకేత్‌కు అభిమానం ఏర్పడింది. అమ్మ చనిపోయింది. అయితే సంకేత్ బొమ్మలు వేస్తున్నప్పుడు ఆమె లేని లోటు కనిపించదు. పక్కన కూర్చొని సలహాలు చెబుతున్నట్లుగానే ఉంటుంది. అందుకే తనకు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. అమ్మ తనతో పాటు ఉంటుంది కదా! ‘పెద్దయ్యాక ఆర్టిస్ట్ కావాలి’ అని చిన్నప్పుడే బలంగా అనుకున్నాడు సంకేత్. పెద్దయ్యాక...కుమారుడి ఛాయిస్ ఆఫ్ కెరీర్ తండ్రికి నచ్చలేదు. అలా అని అడ్డుకోలేదు. ఒక ఆర్టిస్ట్ సక్సెస్‌ను ఏ ప్రమాణాలతో చూడాలనే విషయంలో గందరగోళ పడే ఎంతోమందిలో అతను కూడా ఒకరు. సూరత్‌లోని ‘సౌత్ గుజరాత్ యూనివర్శిటీ’లో ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నాడు సంకేత్. దిల్లీ అంబేడ్కర్ యూనివర్శిటీలో విజువల్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన రోజుల్లో ఒక సంచలన ఘటన జరిగింది. ఫ్రెంచ్ సెటైరికల్ న్యూస్‌పేపర్ ‘చార్లీ హెబ్డో’పై దాడి జరిగింది. పన్నెండు మందిని చంపేశారు. ఇది తనను బాగా కదిలించింది. ‘ఎందుకు ఇలా?’ అని తీవ్రంగా ఆలోచించేలా చేసింది. ఆర్టిస్ట్‌లకు ఉన్న అదృష్టం ఏమిటంటే గుండె బరువును తమ సృజనాత్మక రూపాల ద్వారా దించుకోవచ్చు. సంకేత్ అదే చేశాడు. ‘చరిత్ర అనేది కథల్లో కాదు చిత్రాల్లో కనిపించాలి’ అనే ప్రసిద్ధ మాట తనకు ఇష్టం. అందుకే చిత్రం కోసం చరిత్రను ఇష్టపడ్డాడు. హింస మూలాల్లోకి వెళ్లాడు. స్వాతంత్య్రానంతర భారత్‌లోని హింసాత్మకమైన చారిత్రక ఘటనలకు తన కుంచెతో రూపు ఇవ్వాలనుకున్నాడు. నెరటీవ్స్, కౌంటర్ నెరటీవ్స్పై ఆసక్తి పెంచుకొని, చరిత్రకు సంబంధించిన సంక్లిష్టమైన సందర్భాలను చిత్రాల్లోకి ఎలా అనువాదం చేయాలనే విషయంలో రకరకాల కసరత్తులు చేసి సక్సెస్ అయ్యాడు. తనదైన నిర్మాణాన్ని సృష్టించుకున్నాడు. ఖాళీ బుర్రతో చూస్తే సంకేత్ చిత్రాలు అర్థం కాకపోవచ్చు. సమాజ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను నిశితంగా గమనించేవారికి మాత్రం అవి సులభంగా అర్థం అవుతాయి. లోతైన ఆలోచన చేసేలా చేస్తాయి. ‘లోతైన భావాల సమ్మేళనం సంకేత్ చిత్రాలు. కనిపించని రాజకీయాలు కూడా అందులో కనిపిస్తాయి’ అంటాడు ముంబైలోని ఛటర్జీ అండ్ లాల్ ఆర్ట్స్ గ్యాలరీ కో–ఫౌండర్ ఛటర్జీ. ఏ ఫ్యూచర్ అండర్ కన్స్ట్రక్షన్, ది ఆర్ట్ డికేడ్, ఇండియన్ సమ్మర్ ఫెస్టివల్... మొదలైన గ్రూప్ షోలలో సంకేత్ చిత్రాలకు మంచి పేరు వచ్చింది. శిల్పాల రూపకల్పనలోనూ తనదైన ప్రతిభ చూపుతున్న సంకేత్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. ఒకప్పుడు జీవిక కోసం గ్రాఫిక్ డిజైనర్, ఆర్ట్ టీచర్‌గా పనిచేసిన సంకేత్‌కు ఇప్పుడు ఆర్టే జీవితం. ఆనందం. సమస్తం. -
సెకనున్నర మాత్రమే శిష్యరికం చేశా.. చల్తాహై!
నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోకి కొత్తగా అద్దెకు దిగారు ఒక కుటుంబం. ఆ ఇంట్లోని అబ్బాయే రాము. నా వయసు వాడే. మాటా మాటా కలిశాకా తెలిసింది తనూ ఆర్టిస్ట్ అని, బొమ్మలు వేస్తాడని. చూపించాడు కూడా. బోలెడంత పద్దతైన ప్రాక్టీసు, పోస్టర్ కలర్స్ తో వేసిన చక్కని పెయింటింగ్స్. నేను థ్రిల్లై పోయా ఆ బొమ్మలు చూసి. నన్ను నేనూ ఆర్టిస్ట్ అని చెప్పుకునే వాణ్ణే కానీ, రామూలా నా దగ్గర వేసిన బొమ్మల ఆధారాలు ఏమీ ఉండేవి. ఊరికే హృదయం ఆర్టిస్ట్ అని ఉన్నదంటే ఉన్నది అంతే. అప్పుడే కాదూ. ఇప్పుడూ అంతే. మరప్పుడయితే రామూని అడిగా ఇంత బాగా బొమ్మలు ఎట్లా వేస్తావు రామూ అని. నంద్యాలలో గుడిపాటి గడ్డ వీధిలో గణేష్ బాబు అనే ఆర్ట్ టీచర్ ఉన్నారు ఆయన దగ్గర నేర్చుకున్నా అన్నాడు. సరేని నేను మా ఇంకో ప్రెండ్ వీర శేఖర్ ఇద్దరం కలిసి గురువు గణేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళామో, లేదా రామూనే తీసుకెళ్ళాడో కూడా నాకిప్పుడు గుర్తు లేదు. ఆ ఇంట్లో బొమ్మలు నేర్చుకునే నిమిత్తం ఇంకా మావంటి వాళ్ళు బొలెడు మంది ఉన్నారు. ఆయన మా ఇద్దర్ని ఒక మూలలో కూర్చోపెట్టి మా నోట్ పుస్తకంలో ఒక ఏనుగు బొమ్మ గీసి ఇచ్చి దాన్ని దిద్దమన్నాడు. నేను దాన్ని దిద్దనవసరం లేకుండా ఆ పక్క పేజీలో మరో ఏనుగు బొమ్మని సెకనున్నరలో వేసి ఆయనకు చూపించా. ఆయన అరే! భలే! అని నన్ను మెచ్చుకోకుండా, అలా స్వంతంగా బొమ్మలు వేయకూడదు. ఒక వారం పాటు నేను గీసి ఇచ్చిన బొమ్మ మీదే దిద్దుతూ ఉండాలి అని చెప్పాడు. నేను ఊరికే సరేనని ఆయన వేపు తల ఊపి ఆ ఇంటి గుమ్మం వేపుగా బయటికి వచ్చేసా. అప్పుడు లోపల శేఖర్ ఏమయ్యాడో తెలియదు. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా మేమిద్దరం ఆ క్రాష్ కోర్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆ సెకనున్నర శిష్యరికం తరువాత నేనెవరిని ఇక నా గురువుగా అపాయింట్ చేసుకోలేదు. అనగననగ -తినగ తినగ పథకం కింద నా బొమ్మలు నేనే వేసుకుంటూ, వాటిని దిద్దుకుంటూ చల్తాహై. ఆ విధంగా రుద్దుడూ దిద్దుడూ అనేది బొమ్మల్లోనే కాదు. కుట్టు పని అనే టైలరింగ్ లో కూడా ఉంటుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకనో, బడి మీద, చదువు మీద ఆసక్తి లేకనోఉండే పిల్లలు ఖాళీగా ఉండి నాశనం పట్టకూడదని కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలని ఏ టైలర్ దగ్గరో పని నేర్చుకోవడానికో పెడతారు. కొంతమంది పిల్లలయితే రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసి జీవిత వృద్దిలోకి వద్దామనే పూనికతో కూడా వాళ్లకై వాళ్ళే ఏ టైలర్ మాస్టర్ దగ్గరో కుదురుకుంటారు. ముఫై రోజుల్లో మిషిన్ కుట్టుడు నేర్చెసుకుని, తమ కాలి క్రింద తిరిగే మిషిను చక్రం అలా తిరుగుతూ తిరుగుతూ అంబాసిడర్ కారు చక్రంలా మారి తమ గుడిసే ముందు బ్రేకు వేసి ఆగుతుందనే తెలుగు సినిమా భ్రమలో ఉంటారు. తెలుగు సినిమా కాదు కదా కనీస తెలుగు కథల్లో మాదిరిగానైనా దర్జి జోగారావు దగ్గర శిష్యరికం చేసిన బాబిగాడు తన గాళ్ ప్రెండు పోలికి చాలని జాకెట్టు మాదిరి తుంట రవిక కుట్టడం కూడా వారికి కుదరదు. ఎందుకంటే టైలరింగ్ నేర్చుకోడానికి నువ్వు అందరికంటే ముందుగా పొద్దున్నే షాపు దగ్గరికి చేరాలా, మూలనున్న చీపురు పట్టి అంగడి లోపలా ఆపై బయట చీలికలు పీలికలైన గుడ్డ ముక్కలన్నీ శుభ్రంగా ఊడ్చేసి ఆపై వంగిన నడుముని అమ్మాయ్యా అని పట్టు దొరికించుకునేలోగా కటింగ్ మాష్టరు వస్తాడు. ఓనామహా శివాయహా అనే ఒక పాత బట్ట ముక్కకి కత్తిరతో ఒక గాటు పెట్టి దానిని నీ చేతిలో పెట్టి కాజాలు ప్రాక్టీస్ చెయ్యమంటాడు. కాజాలు కుట్టి కుట్టి వేలికి కన్నాలు వేసుకోవడం ఎలాగూ ప్రాక్టీస్ అయ్యేలోగా మళ్ళీ గుడ్డ ముక్కల చీలికలు పీలికలు షాపు నిండా చేరుతాయి. వాటిని చీపురు పట్టి శుభ్రం చేసి మళ్ళీ నువ్వు కాజాలకు కూచోవాలా! అనగనగా ఆ కాలానికి గడియారంలో రెండే ముల్లులు. ఒకటి పీలికలు- రెండు కాజాలు. గడియారం అలా గడిచి గడిచి నీకు ఎప్పుడో ఒకప్పుడు, ఒక మంచి కాలం వచ్చే వరకు నువ్వు గురువుగారి దగ్గరే ఓపిగ్గా పడి ఉంటే అప్పుడు గడియారంలో సెకన్ల ముల్లు కూడా చేరి అంగీలకు, ప్యాంట్లకు, నిక్కర్లకు గుండీలు కుట్టే పని దగ్గరకు నెట్టబడతావు . అయితే నే చెప్పబోయేది ఇదంతా బొమ్మలు వేయడం, కాజాలు కుట్టడం గురించి కథలూ, గాథలు కబుర్లు కావు. ఇంటి గోడమీద వేలాడే క్యాలెండర్ కు గుచ్చబడి ఉండే ఒక సూది పుల్ల కథ. ఈ రోజుల సంగతి నాకు తెలీదు. నా చిన్ననాటి రోజులలో కుట్టు మిషన్ షాపు దాక నడక పడకుండానే చిరుగులు పడ్డ బట్టలపై చిన్నా చితక కుట్టు సంగతులు వేసేంత జ్ఞానం ఇంట్లో ఆడవాళ్లందరికీ వచ్చి ఉండేది. మగవాళ్ళకు కూడా తెలిసి ఉండేది. అయితే ఈ పనులన్నీ ఎక్కువగా ఇళ్ళల్లో ఉండే అమ్మమ్మలో, నాయనమ్మలో చక్కగా ముచ్చటలు చెప్పుకుంటూ సాగించేవారు. పని నడిపించడం సులువే! అయితే వారి కష్టమంతా సూదిలోకి దారం ఎక్కించడమే కష్టంగా ఉండేది. పెరిగిన వయసులో కంటి చూపుకు, సూది బెజ్జానికి, దారపుమొనకు ఎక్కడా సామరస్యం కుదిరేది కాదు. ఎప్పుడెప్పుడు సూదిలో దారం ఎక్కించమని జేజి అడిగేనా, దారం ఎక్కించేందుకు పిల్లలు పోటా పోటీగా సిద్దం. దారం ఎక్కిద్దామని సూది దారం తీసుకున్న అన్నకో చెల్లాయికో ఒక నిముషమన్నా సమయమివ్వాలా? వాడి గురి కాస్త తప్పితే చాలు ఇలా తేని మరొకడు ఆ సూద్దారం లాక్కుని ఎంగిలితో దారం తడి చేసుకుని, నోట్లో నాలుక మొన బయటపెట్టి, ఒక కన్ను మూసి మరో కన్నుతో చెట్టుమీద పిట్టకన్ను దీక్షతో చూసే అర్జునుడయ్యేవాడు. నాలుక మొన అంటే గుర్తుకు వస్తుంది పిల్లలని చక్కగా తమ ముందు కూర్చో పెట్టుకుని నోట్లో నాలుకని చాపి తమ సూది ముక్కుల అంచులకు తాకించి నీకు చాతనవునా ఇలా తగిలించడం అని గేలి చేసే మేనత్తల సంతతి ఇంకా ఎక్కడైనా మిగిలే ఉందా? మొబైల్ ఫోన్ ల కేలండర్ ఆప్ లకు గుచ్చ జాలని సూదులని ఏ గడ్డి వాములోనో వెతికి పట్టుకుని ఆ సూది తొర్ర గూండా చూపు పోనిస్తే బెజ్జానికి ఆవల సెలవంటూ వెళ్ళి పోయిన వేలాది అమ్మమ్మా నానమ్మల తమ మనవ సంతానంతో పకపకల వికవికల వివశమవుతు కనపడుతున్నారు. పిల్లల చేతుల్లో మొబైలు గేముల పలకలు కాదు. తెల్లని సూదులు చురుక్కుమని మెరుస్తున్నాయి. వేలాది దారపు ఉండలు రంగు రంగుల గాలి పటాల వలే గాలిలోకి ఎగురుతున్నాయి. జ్ఞాపకం ఎంత విలువైనది. జీవితం ఎంత అందమైనది. -
నటి ప్రగతి ఇల్లు చూశారా? సింపుల్‌గా ఉన్నా అదిరిపోయింది
నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తొలుత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందింది. పలు చిత్రాల్లో అక్క, అమ్మ పాత్రల్లో నటించి తెలుగులో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉండే ప్రగతి జిమ్, వర్కవుట్ వీడియోలతో మరింత ఫేమ్ దక్కించుకుంది. రీసెంట్‌గానే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన ప్రగతి ఫుడ్, బ్యూటీ, వర్కవుట్ వంటి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను నెటిజన్లతో పంచుకుంది. తాజాగా తన ఇంటికి సంబంధించి హోంటూర్ వీడియోను షేర్ చేసింది. ప్రతి రూపాయి కూడబెట్టుకొని ఎంతో ఇష్టపడి ప్రతి వస్తువును కొనుగోలు చేసినట్లు ప్రగతి పేర్కొంది. అంతేకాకుండా తన ఇంట్లో ప్రతి వస్తువుకు ఓ కథ ఉందని, ప్రపంచంలోనే తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం ఇల్లేనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
యంగ్ ఆర్టిస్టు వీడియో వైరల్: ఆనంద్ మహీంద్ర ఆఫర్...కానీ
సాక్షి,ముంబై: టాలెంటెడ్ యంగ్ ఆర్టిస్టు అంటూ ఒక వీడియో ఇంటర్నెట్లో ఆకర్షణీయంగా నిలుస్తోంది. నూర్జహాన్ అనే యువతి స్పెషల్‌గా రూపొందించిన వీడియోపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. అద్బుత కళాకారిణి, అద్భుతమైన వీడియో అంటూ మంత్ర ముగ్ధులై పోయారు. ఒకేసారి 15 పోర్ట్రెయిట్లను చిత్రించడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఆమె గ్రేట్ ఆర్టిస్ట్.. అసలు ఇది ఎలా సాధ్యం అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశార. అంతేకాదు ఈ ఫీట్ నిజంగా వాస్తవమైతే ఆమెను కచ్చితంగా ప్రోత్సహించాలి. వివరాలను అందిస్తే సంతోషిస్తాను అంటూ నెటిజనులను కోరారు. తద్వారా ఆమెకు స్కాలర్షిప్ , ఇతర రకాలుగా తన సపోర్ట్ అందిస్తానంటూ ట్వీట్ చేశారు. చదవండి: చీఫ్ ట్విట్ అట! సింక్‌తో హింట్! మస్క్ వీడియో వైరల్, పేలుతున్న సెటైర్లు కాగా పలువురు దేశభక్తి నాయకులు, వీరుల చిత్రాలను ఒకేసారి, వివిధ స్ట్రోక్‌లతో అత్యద్బుతంగా చిత్రించిన వైనం పలువురి ప్రశంసలందు కుంటోంది. ఒక చేత్తో ఒకేసారి 15 ఆర్ట్స్.. వరల్డ్ రికార్డ్ అంటూ నూర్జహాన్ యూ ట్యూబ్‌లో ఈ విడియోను షేర్ చేశారు. అయితే చాలామంది ఆర్టిస్టులు దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి కళను తామెప్పుడూ చూలేదు. పెన్నుల స్థానాలను మార్చకుండా అలా ఎలా గీస్తున్నారు అనే సందేహాలు మరికొంతమంది వ్యక్తం చేశారు. అమేజింగ్. రియల్లీ గుడ్ జాబ్.. అని కొందరు..ఫేక్ వీడియోలా ఉంది అంటూ మరికొందరు కమెంట్ చేయడం గమనార్హం. సాధ్యమే అంటే మరికొన్ని యూట్యూబ్ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి! మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి! How is this even possible?? Clearly she’s a talented artist. But to paint 15 portraits at once is more than art—it’s a miracle! Anyone located near her who can confirm this feat? If valid, she must be encouraged & I’d be pleased to provide a scholarship & other forms of support. pic.twitter.com/5fha3TneJi — anand mahindra (@anandmahindra) October 27, 2022 https://t.co/SBZ5U4GN8w Possible. — Piyush Gupta (@Piyush941919) October 27, 2022 -
జగనన్న సాంస్కృతిక సంబరాలు.. రాష్ట్రస్థాయి పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా ‘జగనన్న సాంస్కృతిక సంబరాలు’ పేరుతో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు సాంస్కృతిక శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యా ప్తంగా 40 వేలమందికి పైగా కళాకారుల ప్రదర్శనలకు వేదికలు సిద్ధం చేస్తోంది. వెయ్యిమందికి పైగా కళాకారులతో రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాచీన కళావైభవం చాటేలా ప్రణాళికను రూపొందించింది. ప్రధానంగా కూచిపూడి, కొమ్ముకోయ, థింసా, తప్పెటగుళ్లు, గరగలు, పగటివేషాలు, బుర్రకథలు, ఆర్కెస్ట్రా (జానపద, సంప్రదాయ, గిరిజన) వంటి కళారూపాలను ఆవిష్కరించనుంది. సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని డిసెంబర్ 19, 20 తేదీల్లో అట్టహాసంగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనుంది. చదవండి: 28, 29 తేదీల్లో జగనన్న విదేశీ విద్యాదీవెన కౌన్సెలింగ్ అందుబాటులో దరఖాస్తులు.. కళాకారులు, కళాబృందాలు నవంబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. సాంస్కృతిక శాఖ https://culture.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తులను పూర్తిచేసి పంపవచ్చు. విజయవాడలోని రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి కార్యాలయంతో పాటు విజయనగరం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలుల్లోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లో నేరుగా దరఖాస్తులు అందజేయవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులను apculturalcompetitions@gmail.comకు మెయిల్చేసే వెసులుబాటు కూడా కల్పించారు. ఆడిషన్స్, రీజనల్ పోటీలు ఇలా... ♦నవంబర్ 19, 20, 21 తేదీల్లో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల వారికి. ♦నవంబర్ 24, 25, 26 తేదీల్లో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల వారికి. ♦నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో రాజమహేంద్రవరంలోని వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల వారికి. ♦డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో విశాఖపట్నంలోని ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారికి. కళలకు ప్రోత్సాహం.. రాష్ట్రంలో ఎంతో ఘనమైన ప్రాచీన సంస్కృతి ఉంది. దాన్ని కాపాడుకోవడంతోపాటు భావితరాలకు చాటిచెప్పేలా ప్రభు త్వం కృషిచేస్తోంది. కళాకారులను ప్రోత్సహించేలా రాష్ట్రస్థాయిలో సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో కళాకారులందరినీ భాగస్వాములను చేసేలా ప్రత్యేక పోస్టర్లతో విస్తృత ప్రచారం కల్పించనున్నాం. గెలుపొందిన కళాకారులు, కళాబృందాలకు భారీ బహుమతులు ఇవ్వనున్నాం. – ఆర్కే రోజా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి -
రామ్‌లీలా ప్రదర్శనతో అలరించిన రష్యన్లు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి ముందు రోజు నిర్వహించనున్న దీపోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు 12 మంది రష్యన్ కళాకారుల బృందం రామలీలాను ప్రదర్శించింది. ఈ మేరకు శనివారం రష్యన్ కళాకారుల బృందం సాంప్రదాయ దుస్తులతో వేషాలు వేసుకుని రామలీలా ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. మాస్కోలోని ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ సొసైటీ అధ్యక్షుడు పద్మశ్రీ గెన్నాడి మిఖైలోవిచ్ పెచ్చికోవ్ మెమోరియల్ ఆధ్వర్యంలో రష్యా కళాకారుల బృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ క్రమంలో ప్రదర్శన దర్శకుడు, నిర్మాత రామేశ్వర సింగ్ మాట్లాడుతూ...యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తమకు రష్యన్ బృందం చేత రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించేలా భారత్‌లో ఒక వేదికను అందించారని అన్నారు. 1960 నుంచి రష్యాలో రామ్‌లీలా చాలా ప్రముఖంగా ప్రదర్శించబడుతున్నట్లు సింగ్ తెలిపారు. వారందరికి భాష కష్టం కాలేదు గానీ పాత్రలను పోషించడంలో ఇబ్బంది పడినట్లు తెలిపారు. ఈ మేరకు ఒక రష్యన్ నటి మాట్లాడుతూ తాను సీతగా నటించడాని సుమారు మూడు నెలలు ప్రాక్టీస్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అంతేగాదు దీపావళి రోజున జరిగే దీపోత్సవ్ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా 15 లక్షలకు పైగా దీపాలను వెలిగించనున్నారు. దీన్నీ వీక్షించేందుకు ప్రధాని మోదీ కూడా ఆదివారం అయోధ్య సందర్శించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: మహిళపై మంత్రి చేతివాటం ... తర్వాత పాదాలను తాకి...) -
Aadi Swaroopa: లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది!
-
లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది!
ఈ అమ్మాయి గురించి తెలిసిన వారందరూ ఆమెను ‘లేడీ రజనీకాంత్’ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ యువతి పేరు ఆది స్వరూప. రెండు చేతులను సరి సమానంగా ఉపయోగించడం ఈమె ప్రత్యేకత. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 17 ఏళ్ల ఈ యువతి తన స్పెషల్ టాలెంట్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒకే సమయంలో రెండు చేతులతో ఇంగ్లీషు, కన్నడ, తుళు, హిందీ, మళయాలం భాషల్లోనూ రాయగలదు. ఒక నిమిషంలో తన రెండు చేతులతో ఒకే దిశలో 45 పదాలను లిఖించి ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. లతా ఫౌండేషన్ ఈ రికార్డును గుర్తించింది. అంతేకాదు కళ్లగు గంతలు కట్టుకుని కూడా రెండు చేతులతో రాసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. స్వరూప సాధించిన రికార్డుకు సంబంధించిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ వీడియో ట్విటర్లో రీ షేర్ చేయడంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. నెటిజన్ల ప్రశంసలు ఆమెను ‘లేడీ రజనీకాంత్’ అని ఒకరు ప్రశంసించగా.. ‘త్రి ఇడియట్స్’ హిందీ సినిమాలో ‘వైరస్’పాత్ర చేసిన బొమన్ ఇరానీ గుర్తుకొచ్చారని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఆమె ప్రతిభ చాలా ప్రత్యేకమైందని మరికొంత మంది మెచ్చుకున్నారు. స్వరూప గురించి తెలిసిన వారంతా ఆమె గిన్నీస్ రికార్డు సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు. బహుముఖ ప్రతిభ ఆది స్వరూప.. బహుముఖ ప్రతిభతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. నటన, చిత్రలేఖనం, అనుకరణ(మిమిక్రీ)లోనూ రాణిస్తోంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2021లోనూ తన పేరును లిఖించుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి తరచుగా పర్యాటక ప్రాంతాల విహారానికి వెళ్లే స్వరూపకు జంతువులన్నా, పక్షులన్నా ఎంతో ప్రేమ. అన్నట్టు తన వీడియోలు, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. పాకిస్తాన్ బౌలర్ రికార్డు రెండు చేతులతో సమానంగా ఉపయోగించి పాకిస్తాన్ బౌలర్ యాసిర్ జాన్ 2017లో గిన్నీస్ రికార్డుకు ఎక్కాడు. తన కుడి చేతితో 145, ఎడమ చేతితో 135 కిలోమీటర్ల స్పీడ్‌తో బౌలింగ్ చేసి అతడు ఈ ఘనత సాధించాడు. -
Viraj Mithani: ఒక్కమాటలో వెయ్యి ఏనుగుల బలం.. కట్‌చేస్తే అంతర్జాతీయ స్థాయిలో
‘మా అబ్బాయి బొమ్మలు భలే వేస్తాడు’ అని ఫ్రెండ్స్‌తో చెప్పుకొని మురిసిపోయేవాడు ఆ తండ్రి. ఆ పిల్లాడు పెరిగి పెద్దయ్యాక ‘నేను ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నాను’ అన్నాడు. ఇది తండ్రికి నచ్చలేదు. ఎందుకంటే ఆర్ట్ అనేది ఆయన దృష్టిలో అనేకానేక అభిరుచుల్లో ఒకటి మాత్రమే. ‘నువ్వు నాలా బిజినెస్ చేయాల్సిందే’ అన్నాడు నాన్న. అలా అని శాసించలేదు. ఆ తరువాత కుమారుడి మనసును అర్థం చేసుకొని ‘నీ ఇష్టం నాన్నా’ అన్నాడు. ఆ ఒక్కమాటలో వెయ్యి ఏనుగుల బలాన్ని గ్రహించి ఆర్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నాడు 28 సంవత్సరాల విరాజ్ మిథాని... మూడో క్లాస్‌లో ఏ4 పేపర్లపై బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు విరాజ్ మిథాని. పదవతరగతికి వచ్చేసరికి ‘భవిష్యత్‌లో ఇదే నా వృత్తి’ అనే స్థాయికి వెళ్లాడు. కాలేజీ రోజుల్లో ఎక్కడ చిత్రకళ పోటీలు జరిగినా వెళ్లి పాల్గొనేవాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తనకు అక్షరాలు కనిపించేవి కాదు. బొమ్మలు మాత్రమే కనిపించేవి! కట్ చేస్తే... ‘నేను ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నాను’ అని విరాజ్ తన మనసులో మాట బయటపెట్టినప్పుడు అది తండ్రికి నచ్చలేదు. అయితే ‘బొమ్మరిల్లు’ సినిమాలో కొడుకులా ‘మొత్తం మీరే చేశారు. నేను కోల్పోయింది చాలు. ప్లీజ్’ అని విరాజ్ అనక ముందే, కొడుకు మనసును గ్రహించి ‘సరే నీ ఇష్టం’ అన్నాడు. దీంతో విరాజ్ యూఎస్‌లోని ‘రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్’లో మాస్టర్స్ కోర్స్ చేశాడు. అంతకుముందు యూనివర్శిటీ ఆర్ట్స్, లండన్, స్కూల్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్స్టిట్యూట్, చికాగోలో చదువుకున్నాడు. సంప్రదాయ చిత్రకళారూపాలను చూస్తూ పెరిగిన విరాజ్‌కు విదేశాల్లో చదువు వల్ల కొత్త ప్రపంచం పరిచయం అయింది. మిక్స్ ఆఫ్ పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, శిల్పకళ, త్రీడీ ప్రింటింగ్‌లో పట్టు సాధించాడు. ఆధునిక సాంకేతికత, సంప్రదాయ కళారూపాలను మేళవించే ఆర్ట్‌లో తనదైన శైలిని సృష్టించుకున్నాడు. ఆర్టిస్ట్‌గా తన ఆర్ట్‌తో సరిహద్దురేఖలను చెరిపేశాడు. ‘ఫోర్బ్స్30 అండర్ 30’ (2022) జాబితాలో చోటు సంపాదించాడు. PC: Viraj Mithani Instagram విరాజ్ తాత మాత్రం విరాజ్ వ్యాపార కుటుంబంలో కళ గురించి అవగాహన ఉన్నవారులేరు. అయితే విరాజ్ తాత మాత్రం చక్కగా ఫొటోలు తీసేవాడు. బొమ్మలు కూడా వేసేవాడు. అయితే అతడికి అవి కాలక్షేపం అభిరుచులు మాత్రమే! ఆర్ట్ లవర్‌గా విరాజ్ ఎన్నో గ్యాలరీలలో ఎందరో ఆర్టిస్ట్‌ల బొమ్మలను చూశాడు. వాటితో మౌనంగా మాట్లాడాడు. విరాజ్ దృష్టిలో ఒక చిత్రాన్ని అర్థం చేసుకోవడం అంటే ఆ చిత్రకారుడి వ్యక్తిత్వం, భావజాలాన్ని కూడా అర్థం చేసుకోవడం. ‘ఒకప్పుడు ఎవరి ప్రపంచం వారిది అన్నట్లుగా ఉండేది. అంతర్జాలంతో ప్రపంచమంతా ఒకే వేదిక పైకి వచ్చింది. మాటలు, చర్చలు, భావాలతో భిన్న సంస్కృతుల మధ్య ఐక్యత వర్థిల్లుతోంది. అది చిత్రకళలో ప్రతిఫలిస్తుంది’ అంటున్నాడు విరాజ్. తన ప్రొఫెషన్లో భాగంగా విరాజ్ కొన్ని రోజులు యూఎస్, కొన్ని రోజులు యూకేలో ఉంటాడు. ‘గ్లోబల్ ఆర్టిస్ట్’గా పేరు తెచ్చుకున్న విరాజ్ ఏ దేశంలో ఉన్నా సరే మన దేశంతోనే ఉంటాడు. అదే తన బలం! చదవండి: Dhanteras- Gold: గోల్డ్ గురించి బోలెడు విషయాలు తెలుసుకొని మరీ కొంటున్న యువత! ఈ ఆసక్తి ఎందుకంటే?! -
Cartoonist Mohan: బొమ్మలు చెక్కిన శిల్పం
బొమ్మలు కూడా మాట్లాడతాయి. మాట్లాడ్డమే కాదు జనం తరఫున పోట్లాడతాయి. కత్తులు దూస్తూ ముందుకు ఉరుకుతాయి. కదం తొక్కుతూ పరుగులు తీస్తాయి. రాజుగారి దురహంకారాన్ని ఎడంకాలితో తన్ని పారేస్తాయి. అయితే అన్ని బొమ్మలూ అలా చేయవు. బొమ్మకు ప్రాణం పోసే చేయిని బట్టి, ఆ చేతిని కదిపే కళాకారుడి మనసును బట్టి, ఆ మనసులో రెపరెపలాడే ఎర్ర జెండా పొగరును బట్టి బొమ్మలు కాలర్లు ఎగరేస్తాయి. అలాంటి బొమ్మల తాలూకు ఓనర్లలో ముఖ్యులు ఆర్టిస్ట్ మోహన్. తాడి మోహన్ రావు అంటే ఎవ్వరికీ తెలీకపోవచ్చు. కానీ కార్టూనిస్ట్ మోహన్ అంటే మాత్రం తెలీని వాళ్లు ఉండరు. మోహన్ అంటే సకల కళా వల్లభుడు. కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు, కేరికేచర్లు, కవర్ పేజీ బొమ్మలు, ఉద్యమాలకు కదం తొక్కండర్రా అని కుర్రకారు గుండెల్లో పౌరుషాగ్ని రగిలించే పోస్టర్లు, రాజ్యాధి కారపు దురహంకారాన్ని కాలరు పట్టు కుని నిలదీసి తిరుగుబాటు చేసే జెండా లపై బొమ్మలు, బిగించిన పిడికిళ్లు, కస్సుమని దూసుకుపోయే కొడవళ్లు, యుద్ధభూమికి కదం తొక్కించే లాంగ్ మార్చ్ కాన్వాస్‌లు! మోహన్ అంటే యుద్ధం. అధర్మంపై అన్యాయంపై చిరు నవ్వుతోనే కత్తులు దూసే యుద్ధమే మోహన్! ఎక్కడో ఏలూరులో పుట్టి, అక్కడెక్కడో పశ్చిమబెంగాల్లో జ్ఞానానికి సానపట్టి, విజయవాడ ‘విశాలాంధ్ర’ మీదుగా హైదరాబాద్‌కు తరలి అదే రాజధానిగా కళాకారుల సామ్రా జ్యాన్ని స్థాపించాడు మోహన్. తెలుగునాట పొలిటికల్ కార్టూన్ అంటే ఇలా ఉండాలిరా నాయనా అన్నట్లు వందల వేల కార్టూన్లతో రాజకీయ నేతల గుండెల్లో అణుబాంబులు పేల్చిన ఉగ్రవాది మోహన్. ఎంత పెద్ద నాయకుడైనా సరే భయం లేదు. ఎంత దుర్మార్గపు నాయకుడైనా సరే ఖాతరే లేదు. తిట్టాలనుకుంటే తిట్టేయడమే. కోపం పెద్దదైతే లాగి లెంప కాయలు కొట్టేయడమే. ఎన్టీఆర్ నుండి నేటి కేసీయార్ వరకు మోహన్ కార్టూన్ బారిన పడని నేత లేరు. మోహన్ తండ్రి తాడి అప్పలస్వామి కమ్యూనిస్టు నాయ కులు. నాన్న నీడలో మండుటెండపు ఉద్యమాలు మోహన్ లోని కళాకారుడికి చిన్నప్పుడే ఓ కర్తవ్య బోధ చేసేశాయి. అదే 5 దశాబ్దాల పాటు తెలుగు నాట ఉద్యమ పోస్టర్లపైనా, తిరుగుబాటు జెండాలపైనా పిడికిళ్లు బిగించిన యోధుల విప్లవ నినాదాలు, కసి ఎక్కిన కొడవళ్ల బెదిరింపులు వగైరాల ఎర్రెర్రటి బొమ్మల రూపంలో మోహన్ సంతకం మెరుస్తూనే ఉంది. (క్లిక్: ఆ రాచరికంలో ఎందుకింత ఆకర్షణ?) ప్రభువెక్కిన పల్లకీలు మోసి, వారి అంతఃపుర రాణుల అందాలు పొగిడి వారిచ్చే చిల్లర బహుమతులు మూట కట్టుకుని మురిసిపోయే కళాకారులు కాలగర్భంలో కలిసి పోతారు. ఎవరికీ గుర్తుకు కూడా రారు. పల్లకి నెక్కిన ప్రభువును కాలర్ పట్టుకుని నీ రాజ్యం చాలా అన్యాయంగా ఉంది గురూ అని అనగలిగిన వాడే నిఖార్సయిన వీరుడు. అసలు సిసలు యోధుడు. అలాంటి వారినే తరతరాలుగా జనం గుర్తు పెట్టుకుంటారు. గుర్తుపెట్టు కోవడమేం ఖర్మ గుండెల్లో గుడి కట్టేసి ఆ గుడిలో ఏనిమేషన్ సినిమాలతో పూజలు చేసేస్తారు. అటువంటి అరుదైన యోధుడూ, కళాకారుడూ మన మోహన్! – సీఎన్ఎస్ యాజులు (సెప్టెంబర్ 21న చిత్రకారుడు మోహన్ వర్ధంతి) -
గణేష్ ఉత్సవాల్లో విషాదం.. స్టేజ్‌పైనే కుప్పకూలాడు
వైరల్: మనిషి జీవితం.. ఈరోజుల్లో నీటి బుడగలా మారిపోయింది. సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ రికార్డింగ్‌ల వల్ల.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు చాలామట్టుకు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు నాటక సమయంలోనే స్టేజ్‌పై కుప్పకూలి కన్నుమూశాడు. గణేష్ ఉత్సవాల సందర్భంగా.. యోగేష్ గుప్తా అనే ఆర్టిస్ట్ పార్వతి దేవి గెటప్ వేసి నాటకంలో పాల్గొన్నాడు. నాటకంలో భాగంగా నృత్యం చేసిన యోగేష్.. ఉన్నట్లుండి కింద పడిపోయాడు. అదీ నాటకంలో భాగమే అనుకుని పొరపడిన శివుడి పాత్రధారి యువకుడు.. దగ్గరగా వచ్చి లేపబోయాడు. కానీ, యోగేష్‌లో చలనం లేదు. దీంతో నిర్వాహకులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే యోగేష్ గుండెపోటు మృతి చెందినట్లు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా గత కొన్నిరోజలుగా ఇలాంటి ఆకస్మిక మరణాలకు సంబంధించిన ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మలయాళం దిగ్గజ గాయకుడు ఎడవ బషీర్ సైతం ఇలాగే మే 28వ తేదీన అలపుజ్జాలో ప్రదర్శన ఇస్తూ కుప్పకూలి మృతి చెందారు. అలాగే.. ఈ ఏడాది జూన్‌లో ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే.. ప్రదర్శనలో ఇబ్బందిగా ఫీలై.. ఆ తర్వాత గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. వీళ్లే కాదు.. చాలా చోట్ల ఇలా మరణించిన ఘటనల తాలుకా వీడియోలు వైరల్ కావడం చూశాం. #WATCH | One more youth died with cardiac arrest..! Youth named #YogeshGupta who was performing the role of Maa Parvati during a Jagran in Bishnah Tehsil of #Jammu collapsed while dancing and died. He suffered a cardiac arrest. pic.twitter.com/dMRsy8M7up — Subodh Kumar (@kumarsubodh_) September 8, 2022 -
చదివింది ఏడో తరగతి.. నాదస్వర సాధనలో దిట్ట
మదనపల్లె : పిట్ట కొంచెం కూత ఘనం.. అన్నట్లుగా ‘ఉష’ చదివింది ఏడో తరగతి అయినప్పటికీ నాదస్వర సాధనలో దిట్ట. ఊపిరి బిగబట్టుకుని సప్తస్వరాలను సన్నాయిలో వినిపించేందుకు మగవారు సైతం జంకే పరిస్థితుల్లో 22ఏళ్ల ఉష నిష్ణాతురాలిలా ప్రదర్శనలు ఇస్తూ పలువురి ప్రశంసలు పొందుతోంది. ఆమె నాదస్వరగానం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. శ్రోతలను సంగీత, ఆధ్మాతికలోకంలోకి తీసుకెళుతుంది. తండ్రి నుంచి నేర్చుకున్న విద్యను.. సాధన చేసి మెరుగుపరచుకుని.. కళను కాపాడుకావాలనే లక్ష్యంతో.. భర్త ప్రోత్సాహంతో ముందుకెళుతున్న నాదస్వర కళాకారిణి ఉషపై సాక్షి ప్రత్యేక కథనం... కర్నాటక సంగీతంలోని గమకాలను యథాతథంగా పలికించగల వాయిద్యాల్లో అగ్రతాంబూలం నాదస్వరానిదే. పురాతనమైన ఆ వాయిద్యం ఎంతో మంగళప్రదమైనది కూడా. అందుకే శుభ కార్యాలలో ఆ వాద్య శ్రవణం చేయడం అనాదిగా ఆచారంగా వస్తోంది. నాదస్వరాన్ని తెలుగులో సన్నాయిగా పిలుస్తారు. తెలుగునాట నాదస్వరంలో నిష్ణాతులైన విద్వాంసులు అరుదనే చెప్పుకోవాలి. పురుషుల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ కళలో మహిళలు రాణించడం అరుదైన విషయం. అందులోనూ ఓ 22 ఏళ్ల యువతి రాణించడం విశేషం. కర్నాటకలోని గౌనిపల్లెకు చెందిన నాదస్వర విద్వాంసులు సుబ్రహ్మణికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి శ్వేత, చిన్నమ్మాయి ఉష. తన వారసత్వ కళను తన పిల్లల్లో ఒకరికి నేర్పిస్తే చాలనుకున్న సుబ్రహ్మణి ఇద్దరు పిల్లలు ఇష్టంగా నేర్చుకునేందుకు ముందుకు రావడంతో ఇంటిపట్టునే సాధన చేయించి నాదస్వరంలో దిట్టలుగా మలిచారు. పురుషుల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ కళలో వారికి ఏమాత్రం తీసిపోకుండా తన ఇద్దరు పిల్లలకు నాదస్వర విద్యను నేర్పించి ప్రావీణ్యతను సాధింపజేశారు. ఉష అక్క శ్వేత నాదస్వరాన్ని నేర్చుకునే క్రమంలో ఇంటిపట్టున సాధన చేస్తుండేది. దీన్ని చూసిన ఉష అక్కతో పాటుగా నాదస్వరం నేర్చుకుంటానని పట్టుబట్టింది. 11వ ఏట సన్నాయిని చేతపట్టిన ఉష సుమారు ఏడేళ్లపాటు కఠోర సాధనతో రాగం, తాళం, స్వరాలపై మంచి పట్టును సాధించింది. తండ్రి సుబ్రహ్మణి తనతోపాటుగా దేవాలయాలు, శుభకార్యాలు, కచేరీలకు పిల్లలు ఇద్దరినీ తీసుకెళ్లి ప్రదర్శనలు ఇప్పించేవారు. ఈ క్రమంలో పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు కావడంతో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిపోయారు. వివాహరీత్యా అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ–2, వైఎస్సార్ కాలనీలో స్థిరపడిన ‘ఉష’.. భర్త పురుషోత్తం, అత్తామామల ప్రోత్సాహంతో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో జరిగే సంగీతకార్యక్రమాలు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ‘ఉష’ నాదస్వరాలాపన ప్రత్యేక ఆకర్షణగా మారింది. తండ్రి వారసత్వం ఉష నాన్న సుబ్రహ్మణి నాదస్వర విద్వాంసులు. ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. కోలారు, బెంగళూరు, శ్రీనివాసపురం తదితర ప్రాంతాల్లో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో ప్రదర్శనలు ఇచ్చి పలువురి ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో తొలిసారిగా ఉష తండ్రితో కలిసి తన 17 ఏళ్ల వయస్సులో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో తొలి ప్రదర్శన ఇచ్చింది. మొదటి ప్రయత్నంలోనే తన నాదస్వరంతో శ్రోతలను ఆకట్టుకోవడంతో ప్రతిభను మరింత మెరుగుపరచుకునే దిశగా అడుగులు వేసింది. సరళి స్వరాలు, జంటలు, అలంకారాలు, పిల్లారి గీతాలు, కృతులు, వర్ణాలు, అన్నమాచార్య కీర్తనలు, లయ, తాళం, రాగం, శృతులను నేర్చుకుంది. మాఘ, చైత్ర, వైశాఖ, శ్రావణమాసాల్లో జరిగే సంగీత కార్యక్రమాల్లో నాదస్వరంలో రాణిస్తూ.. పలు ప్రశంసాపత్రాలు, షీల్డులు అందుకుంది. సన్మానాలు పొందింది. డోలు.. సన్నాయి.. ఉష సన్నాయి కళాకారిణి అయితే ఆమె భర్త పురుషోత్తం డోలు విద్వాంసుడు. డోలు, సన్నాయి వేర్వేరు వాయిద్యాలు అయినప్పటికీ ఆ రెండూ కలిస్తే అద్భుతమైన కలయిక. వాటి నుంచి వెలువడే మంగళ వాయిద్యం వినేందుకు ఎంత అద్భుతంగా ఉంటుందో... ఉష, పురుషోత్తంలు కలిసి ఇస్తున్న ప్రదర్శనలు అంతే గొప్పగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పురుషోత్తం తిరుపతి ఎస్వీ మ్యూజికల్ కళాశాలలో ఆరేళ్లపాటు డోలు విద్యలో కోర్సు పూర్తిచేశారు. తిరుమల నాద నీరాజనం, తిరుపతి త్యాగరాజ కళామండపం, టీటీడీ అనుబంధ దేవాలయాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు. భగవంతుడి అనుగ్రహంతో ఒక్కటైన ఈ జంట.. డోలు, సన్నాయిలా కలిసిపోయి ఒకవైపు వివాహబంధాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు వాయిద్య ప్రదర్శనలతో పలువురిని ఆకట్టుకుంటున్నారు. -
నా సబ్బు ముక్క ఎక్కడో పోగొట్టుకున్నానండయ్యా!
ఊరికే ఆ ద్వారం నుండి ఈ ద్వారం వరకు, ఈ ద్వారం నుండి ఆ ద్వారం వరకు ఇంటిలోనుండి బయటికి బయటి నుండి ఇంట్లోకి అలా పరిగెడుతూ ఉంటానా, తలుపు పక్కనున్ను బియ్యం గచ్చులో చేయి పెట్టి ఇంత బియ్యం జేబులోకి, మరింత బియ్యం నోట్లో వేసుకుని నములుతూ ఉంటే బియ్యం ఎంత తియ్యగా ఉండేదో. పచ్చి బియ్యమే అంత తియ్యగా ఉంటే ఇంటి బయట కట్టెల పొయ్యి మీద, మట్టి కుండలో వెలుతురూ, గాలి తగులుతూ గంజి వార్చి వండిన అన్నం ఇంకెంత రుచిగా ఉండాలి? గంజి అంటే గుర్తుకు వచ్చింది. నాకు ఊహ తెలిసి కార్టూన్ అనేది ఒకటి ఉంటుంది అని తెలుసుకున్న వ్యాఖ్యా-బొమ్మల తొలి కార్టూను గంజి మీదే. పొలీసాయన చాకలాయన్ని గద్దిస్తూ ఉంటాడు. ఏమిరా అప్పిగా ! నా నిక్కరుకి గంజి పెట్టి ఇస్త్రీ చేయమన్నానా, గంజి పెట్టలేదే?" "మా ఇంట్లో తాగనీకే గంజి లేదు దొరా, ఇక నీ నిక్కరకు ఏమని పెట్టేది?" అప్పుడు అది చూసి భలే నవ్వుకున్నాం కానీ కాస్త ఆకలి, కాస్త గంజి మెతుకులు అనే పెద్ద మాటలు బుర్రకు పట్టాకా’అయ్యో! అనిపించింది. అలా గంజి వార్చి వండిన వేడి వేడి అన్నంలో చాలా నెయ్యి పోసి, ఎర్రపప్పు , ఎర్రెర్ర ఆవకాయ ఊర్పు కొంచెం కలిపి చిన్న చిన్న ఆవకాయ ముక్కలని గిల్లి ముద్దలుగా కట్టి కథలు చెబుతూ తినిపించేది మా జేజి. పప్పన్నం అయ్యాక పాలు చక్కర అన్నమో లేదా పెరుగన్నంలో బెల్లం ముక్కలు కలిపి తినిపిస్తే దానితో స్వస్తి. కథల్లోకి అన్నం నంజుకుంటున్నామా. అన్నం లోకి కథలు నంజుకుంటున్నామా అనేది విషయం కానే కాదు అది నాంది. అన్నం బావుండేది. కథలూ బావుండేవి. అయితే ఆ చిన్నప్పుడు బావోనివి కూడా ఉంటాయని తెలీదు కాబట్టి, బావున్నవి అప్పుడు బావున్నాయనే విషయం కూడా తెలీదు. పెరిగి పెద్దయ్యాకా ఈ ఇంటి వంట ఈ ఇంటి వంట ఆ హోటలు వంట ఈ రెస్టారెంట్ వంట తినవలసి వచ్చినపుడు అక్కడ కూర బావుంటుంది, ఇక్కడ చారు బావుంటుంది, ఆ ఇంటి వాళ్ళు పచ్చడి బాగా చేస్తారు, మా ఇంట్లో మటన్ మహత్తరం అనే సింగులర్ అప్రిషియేషన్సే అమృతం అనే భావనకు దిగ పడిపోయా. ఒకసారి మధ్యాహ్నం ఆకలి సమయాన మదరాసులో ఒక హోటలు వైపు దారి తీశారు మహా గొప్ప చిత్రకారులు సురేష్ గారు. బయట వేడిగా ఉన్నా, లోపల గాలి చల్లగా వీస్తుంది. అరవ సర్వర్ గారు వచ్చి అరిటాకు పరిచారు. వరుసగా పదార్థాలు వడ్డిస్తూ ఉన్నారు. తినడం మొదలు పెట్టా, తఠాలున వెలిగింది రుచి అనేది. ఆ రుచికి నెమలీకమీది తడి పచ్చదనంలా ఉంది అరటి ఆకు తళ్ళెం. అరటి పొలం మీదికి పొగ మంచు వచ్చి కొబ్బరి కోరులా కురిసినట్లుగా ఉంది తెల్లని అన్నం. గంగమ్మ శివుడి నెత్తి మీది నుండి జాలువారుతుండగా ఒక పక్క పాయ కుంకుమ తడిసిన రంగులో అన్నాన్ని తడుపుతుంది చారు. మరో పాయ తెల్ల విభూదితో కలిసిన మజ్జిగ ధార. నక్షత్రాలు చాలా తెలుసు కానీ తెల్లని నెలవంక ఒకటేగా, నూనెలో వేగి వంకర తిరిగిన చల్ల మిరపకాయలన్నీ చంద్ర వంకలే! ఆ కూరా, ఈ పచ్చడి, అక్కడ అప్పడం, ఇక్కడ నెయ్యి, వేలు ముంచి నోటి దాకా ఎత్తిన తీపి... ఏది తిన్నా బావుందే! ఎంత తిన్నా బావుందే! ఇది కదా భోజనం అంటే, సంపూర్ణం అంటే. ఇంతకాలం భోజనం అని, అన్నం అని పేరు పెట్టుకుని ఏం తింటున్నాం? దశాబ్దాలుగా తిండిముందు సర్దుకు పోతున్నాం అంతే. ప్రపంచంలో చాలా మందికి ఈ మాత్రం అన్నం కూడా గతిలేదు అని సర్దుకుపోయి బావుంది, బాలేదు అనే మాటలే మర్చిపోయాం. మంచి భోజనం మాదిరిదే మంచి కథ కూడా, గొప్ప కథ కూడా, అద్భుతమైన కథ కూడా. భోజనం మొత్తంలో అన్నమొక్కటి బావున్నట్టో, కూర బావున్నట్టో, చారు మజ్జిగ లేదా మజ్జిగ పులుసు బావున్నట్టో, ఏదో ఒకటి బావుంటే అది చాలులే అనుకునేట్టు అయిపోయింది కథా కాలం. వొస్తువు కొత్తగా ఉంది కదా? ఇతివృత్తం మంచిది ఎన్నుకున్నాడు, శిల్పం చూశావా? ఆ శైలి ఉందే! అబ్బో!! వచనంలో నడక కొత్త దారి దొక్కింది. ఈ కాలం మరీ అన్యాయం, కథ ఏవుందిలే! కథ రాసి వడ్డిస్తున్న పిల్లను చూడు, కత్తి కదూ! దేనికదేగా బావున్నాయి. మొత్తంగా బావుందో లేదో తెలీదు, తెలుసుకోవాలసిన అక్కరలేదు. ఈ రోజు బావుందని అనుకుంటున్న కథను అసలు కళ్లకద్దుకుని మళ్లా మళ్లా చదువుతున్నామా అసలు? నాకై నేను కథని వెదుక్కుని చదువుకుని ఎంత కాలం అయ్యింది? బలివాడ కాంతారావు గారి బయ్యన్న మాదిరి కథ ఒకటి వచ్చి గుండెలో మెత్తగా పడుకుని ఎంత కాలం అయ్యింది? అయితే ఒక అదృష్టమున్నది భోజనమైతే రోజూ తినాలి, మంచిది ప్రతి రోజూ దొరక్క పోవచ్చు, బ్రతకడానికి ఏదో ఒకటి తిని బ్రతకాలి తప్పదు. అయితే కథలు మాత్రం కొత్త వాటి కొరకు ఎదురు చూడనక్కరలేదు, ప్రపంచంలో కథావాంగ్మయం అనేది ఒకటి పాతది చాలా తయారయ్యి ఉంది. మళ్ళా మళ్ళా చదువుకునెందుకు చాలా దయతో గొప్ప కథని దానం చేసి పోయిన కథకులు చాలా మందే ఉన్నారు. తరగని కథ చాలా ఉంది. కొత్త కథల కొరకు ఎదురు చూడాల్సినంత కథ ఏమీ తరిగిపోలేదు తరిగేదల్లా చదవడానికి సమయం లేని మన వయసు. ఉండండి, పాత కాలంలోకి పరిగెత్తి పోవాల్సిన శ్రమ తెలియకుండా మీకు ఒక కథ చెబుతాను రండి. నార్మన్ గార్డ్స్ బై అనే మనిషి వచ్చి పార్క్ లో వచ్చి కూచుని మనుషులకేసి చూస్తున్నాడు. అది సంధ్యా సమయం. ఆయన దృష్టిలో సంధ్యా సమయం అంటే మనుషులు పగలంతా పోరాడి ఓడిపోయిన తమ అదృష్టాలను, చనిపోయిన తమ నమ్మకాలను చేతనయినంతవరకు లెక్కలు చూసుకునే సమయం, ఈ రోజుకు ఇక మనం మరణించి రేపటి పోరాటానికి మరలి పుడదామనుకుంటూ వంగిపోయిన భుజాలతో ఆశలు అడుగంటిన కళ్లతో బరువుగా ఇంటి వైపుకో, సారా కొట్టుకొ సాగే సమయం. వారిని చూస్తూ ఉంటే నార్మన్ గార్డ్స్ బై కళ్లకు ఈ లోకమనే ఆనందక్షేత్రంలో హక్కుగా ఉండవలసిన వాళ్ళెవరూ కనపట్టం లేదు. నిజానికి ఈ ఓడిపోయిన వాళ్లల్లో తనని తాను కూడా ఒకడిగా లెక్కించుకునే ప్రయత్నంలో ఉన్నాడు గార్డ్స్ బై. అతనికి పోయిన గంటు అంటూ ఏమీ లేదు, డబ్బుకు కొదువా లేదు. అయినా మనిషి అనేవాడికి సంతోషపడ్డానికి ఒక కారణం కావాలి కానీ దిగాలు పడ్డానికి కారణం అవసరం లేదు, కారణం లేకపోయినా దుఖ కారణం కోరి తెచ్చుకునేంత సమర్దత ఒక మనిషిలో మాత్రమే ఉంటుంది. సరే, గార్ద్స్ బై పక్క బెంచి మీదికి ఒక ముసలాయన వచ్చి చేరాడు. ఆయనని చూస్తే మరీ ఘోరంగా ఉన్నాడు. మనిషి కుందించుకు పోయినట్లు, ఆత్మగౌరవం అడుగంటి పోయినట్లు ఉన్నాడు. దిగాలు దరిద్రం దురదృష్టం అనే ముగ్గురమ్మలు వచ్చి మూర్తీభవించిన మూర్తిలా ఉన్నాడు. పాపమని ఒక గులాబి పువ్వును తెచ్చి అతని కోటుకు అలంకరించే ప్రయత్నం చేయండి అలా చేస్తే ఆ పువ్వు బలవంతాన అతని గుండి బొత్తానికి ఉరివేసుకుని చచ్చి పోతానని బెదిరిస్తుంది. అంత దుర్భాగ్యంగా ఉన్నాడు అతను. అతను ఈ ప్రపంచంలోని పరమ ఏడుపుగొట్టు వాళ్లలో ఒకడు. కానీ ఈ ప్రపంచంలో ఒకడయినా అతడి గురించి ఏడుస్తారని మనం ఆశించలేనంత దిక్కుమాలిగా ఉన్నాడు. త్వరగా ఇంటికి వెడితే, ఇంట్లో వాళ్లతో నిద్రపోయే సమయం వరకు ఎక్కువ చీవాట్లు తినాల్సి వస్తుంది కాబటి తక్కువ చీవాట్లు తినడం కోసం వీలయినంత ఆలస్యంగా ఇంటికి వెళ్లడానికే నిశ్చయించుకున్నట్టుగా ఉన్నాడితను అనుకుంటాడు గార్డ్స్ బై. మొత్తానికి ఒక సమయం తరువాత ఆ ముసిలాయన లేచి చీకట్లో కలిసిపోయాడు. అతని వెళ్ళిన కాసేపటికి ఒక యువకుడు వచ్చి ఆ ముసిలాయన ఖాలీ చేసిన బెంచిలో కూచున్నాడు. ఇతని దుస్తులు బావున్నాయి, పైగా మంచి వయసు తాలూకు ఆరొగ్యం. అయితే ముఖంలో మాత్రం అంతకు ముందు మనిషికన్నా ఆనందం ఎక్కువగా ఏ మాత్రం లేదు. గార్డ్స్ బై ఇక ఉండబట్టలేక ఇతనితో మాట కలుపుతాడు. ఏమిటి విషయం, ఎందుకంత నిరాశ అని. ఇతగాడి కథ భలే విచిత్రంగా ఉంది. ఈ రోజే కొత్తగా ఈ ఊరికి పనిమీద వచ్చాడు. టాక్సీ డ్రైవర్ తనని ఇది మంచి హోటల్ అని ఒక హోటలులో దింపి వెళ్లాడు. బస బానే ఉంది. ఆ తరువాత స్నానానికి హోటల్ వారి సబ్బు వాడ్డం ఇష్టం లేక కొత్త సబ్బు కొనుక్కుందామని బయటికి వచ్చాడు. వస్తూ వస్తూ నాలుగు డబ్బులు మాత్రమే జేబులో వేసుకుని మిగతా అంతా తన పెట్టెలో భద్రపెట్టి దిగాడు. సబ్బు ఒకటి కొనుక్కుని ఆ వీధి ఈ వీధి సరదాగా చూసుకుంటూ ఒక బార్ లో దూరి చిన్న డ్రింక్ కూడా తాగాడు, అప్పటికే చీకటి పడింది. బార్ నుండి బయటికి వచ్చాకా అసలు సంగతి అర్థమయ్యింది. అసలే ఊరికి కొత్త . బసకు దిగిన హొటల్ అడ్రస్ గుర్తు పెట్టుకోలేదు, వీధి పేరు అవసరం అనుకొలేదు. సబ్బుకోసం దిగిన వాడు సబ్బు కొని వెనుదిరిగి పోక వీధులు కొలిచే పనిలో పడి, ఉన్న డబ్బుతో తాగి ఇప్పుడు ఈ చీకట్లో దిక్కు తోచక వచ్చి కూచున్నాడు. "ఇది నా కథ, కాబట్టి నా కథని నమ్మి నా పరిస్థితిని దిగమింగగలిగిన మీ వంటి ఏ మంచి మనిషయినా ఎదురయ్యి నాలుగు రాళ్ళు అరువిస్తే ఈ రాత్రి ఈ దగ్గరలోని ఏ హోటల్లోనో తల దాచుకుని, రేపు ఉదయమే నా బస వెదుక్కోగలను" అన్నాడు. "అదేలే! దాందేముందిలే! ఇటువంటి కథలకేం గొడ్డు పోయిందిలే? నువ్వు ఏ సబ్బు ముక్క కొసం ఇన్ని తంటాలు పడ్డావో ఆ సబ్బు ముక్క నాకు చూపిస్తే, నీ చిక్కు తీరిపోదూ" అన్నాడు గార్డ్స్ బై. యువకుడు గబ గబా జేబులు తడుముకున్నాడు, తనమీద తనే కొపడ్డాడు, చిరాకు పడ్డాడు, ఈ గందరగోళంలో సబ్బు ముక్క ఎక్కడో పడిపోయినట్లుంది అని తన దురదృష్టానికి తనే చింతించాడు. (క్లిక్: మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!) "చూసావా? నువ్వు కథ బాగా చెప్పగలిగావు. నీ మాటల్లో సత్యం, కళ్లల్లో దీనత్వం కొట్టొచ్చినట్లు చూపించగలిగావు. అయితే నువ్వు మరిచి పొయిందల్లా కనబడినవాడికల్లా నీ దీన కథ వినిపించాలనుకోవడానికి ముందుగా ఒక సబ్బు ముక్కను సాక్ష్యంగా తోడు తెచ్చుకోడమే" అన్నాడు గార్డ్స్ బై వెటకారంగా. ఆ యువకుడు ఇదంతా వినదలుచుకోలేదు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హాస్యాస్పదంగా నవ్వుకుంటూ గార్డ్స్ బై కూడా అక్కడి నుండి ఇక వెళ్ళిపోదామని లేచాడు. అయితే ఉన్నట్టుండి నేల మీద పడి ఉన్న ఒక పొట్లం ఆకర్షించింది. ఏమిటా అని దానిని అందుకుని చూస్తే, పొట్లం కట్టి ఉన్న సబ్బు బిళ్ళ, అరెరే! ఎంత పని జరిగి పోయింది, అనుకుని ఆ కుర్రాడు వెళ్ళిన దారి వైపు కదిలాడు గార్డ్స్ బై. అదిగో అతను అక్కడున్నాడు. అబ్బాయి నీ నిజాయితికి ఇదిగో సాక్షం దొరికింది. నీ అవసరంపై నా అపనమ్మకాన్ని నువ్వు మన్నిస్తావనే అనుకుంటాను. ఈ డబ్బు పట్టు నా అడ్రస్ కాగితం కూడా. నువ్వు డబ్బు నాకు ఎప్పుడు పంపించినా తొందరలేదు. అదృష్టం నీకు తోడుగా ఉండుగాక. యువకుడు ధన్యవాదాలు చెబుతూ అక్కడి నుండి నిష్క్రమించాడు. ఈ కథ వ్రాసిన వారు హెచ్ హెచ్ మన్రో అనే బ్రిటీష్ రచయిత. కలం పేరు సాకీ. నేను స్కూలు పిల్లవాడిగా ఉన్నప్పుడు సరిగా గుర్తు లేదు కానీ శారదా విద్యామందిరం లోనే నేతాజీ పబ్లిక్ స్కూల్ వారో దీనిని పిల్లలతో ఇంగ్లీష్ లోనే నాటకం వేపించారు. ఒక బ్రిటిష్ కథ మా చిన్న ఊరిలో ఒక చిన్న బడిదాకా ఎట్లా చేరిందా అని నా ఆశ్చర్యం. ఆ మధ్య కె.బి. గోపాలం గారు దీనిని తెలుగులోకి అనువదించారు. కథ ఎలా మొదలవాలి? ఎక్కడ ఆపెయ్యాలి ఈ రెంటి మధ్య ఏం జరగాలి అది ఎంత ఉండాలి అని కదా కథ. ఇక వినండి. "పాపం కుర్రవాడు అన్యాయమైన పరిస్తితులకు దొరికిపోయాడు, అదృష్టవశాత్తు అతని సబ్బు దొరికింది లేకపోతే నేను అతి తెలివితో ఆలోచించినట్లే అతని గోడు విన్న ప్రతి ఒక్కరు నాలా సాక్ష్యం అడిగితే అతనికి మానవ జాతిమీద ఏం నమ్మకం మిగిలేట్లు. "గార్డ్స్ బై కి వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు వెను తిరిగి తను కూచున్న బెంచి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఎవరో ఉన్నారు, మోకాళ్ళ మీద వంగి ఏమో చేస్తున్నాడు. (క్లిక్: అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఏం చెబుతున్నాడంటే..) 'ఎవరది?" అతను తల తిప్పి చూశాడు, ఇందాకటి దురదృష్ట మొహం పెద్దాయన. ఏమిటండి సంగతి?" "నా సబ్బు ముక్క ఎక్కడో పోగొట్టుకున్నానండయ్యా" - అన్వర్ -
Photo Feature: కలపపై రాష్ట్రపతి పోట్రెయిట్
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మీద తమ గౌరవాన్ని భిన్నంగా చాటుకున్నది ‘షికుంజ్.కామ్’ అనే సంస్థ. 4 వేల చదరపు అడుగుల ముర్ము కలప పోట్రెయిట్‌ను గీయించింది. అది కూడా వెస్టీజ్ వుడ్ (వివిధ రకాల కర్ర ముక్కలనుంచి తయారు చేసిన కలప)తో తయారు చేసిన కాన్వాస్ మీద. ఇండోర్‌కు చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ సాహిల్ లహరి, మరో 50 మంది కళాకారులు కలిసి ఈ పోట్రెయిట్‌ను రూపొందించారు. ఈ కళాఖండాన్ని తయారు చేయడానికి వారికి ఐదు రోజులు పట్టింది. ‘‘రాజ్యాంగపరంగా ఈ దేశపు అత్యున్నత పదవి రాష్ట్రపతి. ఆ స్థానానికి ఎన్నిౖకైన మొట్టమొదటి గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము. మహిళా సాధికారతకోసం పనిచేసే మా సంస్థ మహిళ అయిన రాష్ట్రపతికి ఇచ్చే గౌరవం ఇది’’ అని నిర్వాహకుల్లో ఒకరైన రాహుల్ భార్గవ్ తెలిపారు. చదవండి: మెట్రో స్టేషన్‌పై వ్యక్తి హల్చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా! -
Photo Feature: స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలతో భరతమాత
నంద్యాల (అర్బన్): స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్న సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ 375 మంది స్వాతంత్య్ర సమరయోధుల సూక్ష్మ చిత్రాలతో భరతమాత బొమ్మ గీశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కోటేష్ కాఫీ పొడిని నీటిలో కలిపి 8 గంటల వ్యవధిలో చిత్రాన్ని గీశారు. చదవండి: వైద్య ప్రతిభామూర్తి : యల్లాప్రగడ సుబ్బారావు / 1895–1948 -
ప్రేమించే జీవితం..: వాయిదా వేసిన కలలు... నిజం చేసుకుంటున్న వేళ..
పురుషులతో పోల్చితే స్త్రీల కలలు ఎప్పుడూ వెనకబాటులోనే ఉంటాయి. కుటుంబ బాధ్యతల కారణంగా తమ కలలను చంపుకునో లేక వాయిదా వేసుకునో రోజులను వెళ్లదీసే మహిళల సంఖ్యే ఎక్కువ. అలాంటి ప్రపంచం నుంచి వచ్చినవారిలో ముక్తాసింగ్ ఒకరు. కలలను వాయిదా వేసుకుంటూ, మధ్య మధ్య వాటిని వదలకుండా బతికించుకునే ప్రయత్నం జీవితమంతా చేస్తూనే ఉన్న ముక్తాసింగ్ ఒక కళాకారిణి, రచయిత్రి. ఆరుపదుల వయసులో మోడలింగ్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ‘రిటైర్ అయ్యే వయసులో పని చేయడం గర్వంగా ఉంది’ అంటూ తన గురించి చెప్పే ముక్తాసింగ్ గురించి తెలుసుకుంటే తమ జీవితంలోనూ ఇవి ప్రేరణ నింపే విషయాలు అనుకోకుండా ఉండరు. గురుగ్రామ్‌లో ఉంటున్న ముక్తా ఈ 60 ఏళ్ల వయసులో మోడలింగ్ చేస్తూ, పెయింటింగ్స్ వేస్తూ తన కలలు ఇప్పుడెలా నిజం చేసుకుంటున్నారో గమనిస్తే... ‘మనలో చాలామంది వయసు పెరిగేకొద్దీ హుందాగా కనిపించాలని లేని భారమేదో మోస్తున్నట్టుగా ఉండాలనుకుంటాం. కానీ, ఉత్తమంగా ఉండాలని కోరుకుంటే మెరుగైన ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తాం. ఫలితంగా జీవన ప్రమాణాలను పెంచుకుంటాం’ అంటారు ముక్తా. బాధ్యతల బరువు నుంచి.. ఫైటర్ పైలట్‌ని వివాహం చేసుకుంది ముక్తాసింగ్. అతని కెరియర్, ఆశయాలు, తరచూ బదిలీలు జరగడంతో ఆమె తన కలలను అణిచివేసుకుంది. పిల్లలు పుట్టడం, వారిని చూసుకోవడం, అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకోవడంలో ఏళ్లకేళ్లు గడిపేసింది. అన్ని దశల్లోనూ ఊపిరి సలపని బాధ్యతలు. నలుగురిని ఆలోచింపజేసే వ్యాసాలు రాయడం అంటే ఇష్టం. కానీ, చేయలేకపోయేది. అయినప్పటికీ ఎంతో కొంత తీరిక చేసుకుని వార్తాపత్రికలకు, మ్యాగజైన్ల కు వ్యాసాలు పంపేది. కానీ, పూర్తి సమయం తన కెరీర్‌కు కేటాయించలేకపోతున్నాను అని మధనపడేది. సంగీతం ఆంటే ఎనలేని ప్రేమ. పెయింటింగ్ చేయాలనే ఆలోచనతో సంగీత చిహ్నాలను కాన్వాస్‌పై చిత్రించేది. అప్పుడు చేయలేని పనులు ఈ వయసులో చేస్తోంది. అత్యంత ప్రజాదరణ పొందిన గాయనీగాయకుల ముఖచిత్రాలను చిత్రిస్తోంది. ఫ్రీలాన్సర్‌గా వార్తాపత్రిక లకు కథనాలు రాస్తుంది. ఆలోచింప జేసిన జీవనం వీటిన్నింటి ద్వారా ఏదైనా సొంతంగా చేయాలనే ఆలోచన ఎప్పుడూ ఉండేది. కానీ, నాడు బాధ్యతల నడుమ సరైన వేదికేదీ దొరకలేదు. దీంతోపాటు తన కలలను కనుల వెనుకే దాచేసుకొని కుటుంబాన్ని ముందుకు నడిపించింది. తనలో దాగున్న కళను నలుగురితో పంచుకోవడానికి ఓదార్పుగా ఇన్స్టాగ్రామ్ పేజీ దొరికింది. ఉన్న కొద్దిసమయంలో చేసే కళను పోస్ట్ చేయడం, నలుగురికి పరిచయం చేయాలని తపిస్తోంది. చాలాసార్లు తన తల్లి అనారోగ్యం ఆమెను ఆలోచింపజేసింది. దినచర్యపై శ్రద్ధ పెట్టడం చేసేది. ఫిట్నెస్ గురించి పట్టించుకునేది. పిల్లలు స్థిరపడ్డారు. అదేపనిగా కురుస్తున్న వాన కాస్త తెరిపి ఇచ్చినట్టు అనిపించింది. మార్చిన అవకాశం తెలిసినవారి పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ ఒక ఫ్యాషన్ డిజైనర్ పరిచయం అవడంతో ముక్తాసింగ్ జీవిత గమనమే మారిపోయింది. ఆ డిజైనర్ ముక్తాని తన డ్రెస్‌లకు మోడలింగ్ చేయమని కోరింది. ‘ఈ వయసులో మోడలింగ్ ఏంటి?’ అని చాలా మంది నిరుత్సాపూరితమైన మాటలు అన్నప్పటికీ పట్టుదలతో మోడలింగ్ అవకాశాన్ని ఎంచుకుంది. ఈ కొత్త ఇన్నింగ్స్‌తో ఆమె కుటుంబం కూడా సంతోషించింది. ఇదే రంగంలో ఇంకా మంచి అవకాశాలు ఆమెకోసం వస్తున్నాయి. ‘పదవీ విరమణ అంచున ఉన్నప్పుడు పని చేయడం గర్వంగా ఉంది’ అంటారు ముక్తా. వృద్ధాప్యాన్ని చాలా ఆకర్షణీయంగా అవకాశంగా మార్చుకున్న వ్యక్తుల చిత్రాలు కూడా తన సోషల్‌మీడియా పేజీ ద్వారా పోస్ట్ చేస్తుంది. వారిలో స్టీవ్ టైలర్, అగాథాక్రిస్టి, మహారాణి గాయత్రీదేవి, రవీంద్రనాథ్ ఠాగూర్..ల చిత్రాలు ఉన్నాయి. ‘ఎన్ని పనులున్నా ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టడం వల్ల నాకు మరో అవకాశం వచ్చింది. పెరిగే వయసును స్వీకరించాలి. అలాగే, మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి మనదైన శైలిని చూపడమూ నేర్చుకోవాలి. మనమంటే ఏంటో కూడా నలుగురికి తెలియజేయాలి’ అని చెప్పే ముక్తా సింగ్ మాటలు రిటైర్మెంట్ దశలో ఉన్న అందరిలోనూ తప్పక ఆలోచనను కలిగిస్తాయి. -
రెండో రోజూ ఉత్సాహంగా కాకతీయ వేడుకలు
సాక్షిప్రతినిధి, వరంగల్: కాకతీయ వైభవ సప్తాహం వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో రోజు శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. పలు వేదికల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఖిలావరంగల్ ఖుషిమహల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలను వరంగల్ కలెక్టర్ గోపి ప్రారంభించారు. హనుమకొండ అంబేడ్కర్ భవన్లో కాకతీయుల పాలనపై కవి సమ్మేళనం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ హాజరై పలువురు కవులను సన్మానించారు. చారిత్రక వెయ్యిస్తంభాల గుడి ఆవరణలో కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు అలరించాయి. పబ్లిక్‌గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో తృష్ణ నాటకం, చిందుయక్షగానం ప్రదర్శించారు. జనగామలో కాకతీయ ఉత్సవాలను కలెక్టర్ శివలింగయ్య ప్రారంభించారు. పేరిణి నృత్యం, బోనాలు, కోలాటాలు, బతుకమ్మలను ప్రదర్శించారు. ఉత్సవాల్లో తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున ఆదివారం బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ కమిటీ వారు ప్రతి ఏటా ఆషాడ మాసంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు విస్తారంగా కురిసి, పాడి పంటలతో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గత 13 ఏళ్లుగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని మహంకాళీ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ రాకేష్ తివారీ పేర్కొన్నారు. ఈ ఏడాది అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమానికి కమిటీ సభ్యులతో పాటు 500 మందికి పైగా కళాకారులు విజయవాడకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మి చెట్టు వద్ద అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం బంగారు బోనంతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. మేళతాళాలు, తీన్మార్ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, కోలాట, బేతాళ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడిబియ్యంతో పాటు కృష్ణమ్మ తల్లికి పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, గంగతెప్పను సమర్పించనున్నారు. -
పిల్లల కథ: ఆనందమాత
శంకర్ మంచి బొమ్మలు చేసే కళాకారుడు. ఎన్ని బొమ్మలు చేసినా అతని ఆదాయం అంతంత మాత్రమే! అతను చెక్కతో, మట్టితో, లోహంతో బొమ్మలు చేయగలడు. ఒకరోజు ఇంటి ఖర్చుల కోసం డబ్బు అప్పు అడగటానికి తన స్నేహితుడు మహీపతి దగ్గరకు వెళ్లాడు. ‘ఎందుకు అలా డబ్బుకోసం ఇబ్బంది పడుతున్నావు? నీ చేతిలో కళ ఉంది. తెలివిగా ఉపయోగిస్తే నీకు బాగా డబ్బు వస్తుంది కదా’ అన్నాడు మహీపతి. ‘కళ అయితే ఉంది అయినా దానిని ఆదరించే వారెవరు? నా బొమ్మలు ఎవరూ కొనడంలేదు’ దిగులుగా చెప్పాడు శంకర్. ‘ప్రస్తుతానికి నీ అవసరానికి డబ్బు ఇస్తానులే. అయితే ఓ రోజు మాపిల్య చెట్టు కొమ్మతో నువ్వు ఓ బొమ్మను తయారు చేయడం చూశాను. మాపిల్య చెట్టు కొంత అరుదైన చెట్టే. శ్రద్ధ తీసుకుని పెంచితే మన భూముల్లోనూ చక్కగా పెరుగుతుంది. నీ బాగు కోరే వాడిగా నేను నా ఎకరం పొలంలో మాపిల్య చెట్లు పెడతాను. అవి రెండేళ్ళలోనే పూర్తిగా పెరుగుతాయి. ఈలోపల అడవిలో దొరికే మాపిల్య చెట్టు కొమ్మలతో బొమ్మలు తయారు చెయ్యి. ఎలాంటి బొమ్మలు చేయాలో, ఆ బొమ్మల్ని ఎలా అమ్ముకోవాలో నేను చెబుతాను’ అని సలహా ఇచ్చాడు మహీపతి. ‘ఏమిటో మహీపతి నువ్వు చెప్పేదంతా నాకు విచిత్రంగా కనబడుతోంది. సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను’ చిరునవ్వుతో చెప్పాడు శంకర్. రెండురోజుల తరువాత మహీపతి.. మాపిల్య చెట్టు కొమ్మతో తన సృజనాత్మకతను ఉపయోగించి ఓ కొత్త దేవత బొమ్మను తయారు చేయమని శంకర్‌కు చెప్పాడు. మహీపతి చెప్పినట్టుగానే తన సృజనను ఉపయోగించి చక్కని కొత్త దేవత ప్రతిమను చెక్కాడు. చూసి అబ్బురపడ్డాడు మహీపతి. ఆ బొమ్మకు ‘ఆనంద మాత’ అని పేరు పెట్టాడు. శంకర్ ఆశ్చర్య పోయి ‘ఈ బొమ్మను ఏంచేస్తావు?’ అని అడిగాడు. ‘అచ్చం ఇటువంటివే పది బొమ్మలు మాపిల్య చెట్టు కొమ్మతో తయారు చేయి. ఏం చేయాలో చెబుతా’ అన్నాడు. మహీపతి చెప్పినట్టే అటువంటి పది బొమ్మలను తయారు చేశాడు శంకర్. ఆ బొమ్మలను మహీపతి తీసుకెళ్ళి తన అంగట్లో, తనకు తెలిసిన వాళ్ళ అంగళ్ళలో పెట్టి ‘ఈ దేవత ఆనంద దేవత.. ఈ బొమ్మ ఎవరు పెట్టుకుంటే వారికి అన్నీ కలసి వస్తాయి’ అని చెప్పసాగాడు. అంతే ఆ విషయం ఊరంతా పాకింది. ప్రతి వ్యాపారస్తుడు, కొందరు గృహస్తులు ఆ బొమ్మలను కొనాలని ఎక్కడ దొరుకుతాయో అడగసాగారు. ఆవిధంగా శంకర్‌కు చేతినిండా పని, తద్వారా డబ్బూ లభించసాగాయి. కేవలం శంకర్ బాగుపడటమే కాక, చాలామంది రైతులూ లాభపడ్డం మొదలెట్టారు.. పొలం గట్ల మీద మాపిల్య చెట్లు పెంచి వాటి కొమ్మలను అమ్ముతూ. మహీపతి తెలివైన ఆలోచన స్నేహితుడు శంకర్‌ను బాగుపరచడమే కాకుండా రైతులకూ మేలు చేసింది! మరి కొంతమంది మాపిల్య చెట్టు కొమ్మలతో బొమ్మలు చేయడం నేర్చుకోడానికి శంకర్ వద్ద శిష్యులుగా చేరారు. నిజానికి ఆ బొమ్మతో ఏ మేలు జరగక పోయినా ఆ బొమ్మ పెట్టుకోవడం వలన వారి ఆత్మస్థైర్యం పెరిగి సమర్థవంతంగా వారి వ్యాపారాలు, పనులు నిర్వహించుకోసాగారు. (క్లిక్: మాష్టారి పాఠం.. పదును పెట్టకపోతే వృథా పోవలసిందే) -
ఆమె అరిస్తే డబ్బులొస్తాయ్...
చెవులు చిల్లులు పడేలా కీచుమని అరిస్తే చిరాకనిపిస్తుంది. కానీ యాష్లే పెల్డన్ అస్సలు చిరాకు పడదు. సరికదా గంటల తరబడి అరుస్తుంది. ఎందుకంటే ఆమెకు ఎంత అరిస్తే అంత డబ్బులొస్తాయ్. అరిస్తే డబ్బులెందుకొస్తాయనే కదా మీ సందేహం. హాలీవుడ్ సినిమా, టీవీ ప్రొడక్షన్ సంస్థలిస్తాయి. స్క్రీమ్ ఆర్టిస్ట్ అయిన పెల్డన్ అలా మొత్తుకునేది సినిమాలు, టీవీ షోల కోసం. హీరోహీరోయిన్లకు డబ్బింగ్ చెప్పినట్టుగా, వాళ్లకు బదులు స్టంట్స్ చేసినట్టుగా... హీరోయిన్లకు బదులుగా ఆమె అరుస్తుంది. మీరు చూసిన చాలా హాలీవుడ్ సినిమాల్లో ఆ అరుపులను అత్యంత సూక్ష్మగ్రాహకాలైన మైక్రోఫోన్స్‌తో రికార్డు చేస్తారు. అరుపులకు నటీనటులు డబ్బింగ్ చెప్పడం వల్ల వాళ్ల గొంతు పాడయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఆ స్థాయిలో వాళ్ల గొంతు ఉండకపోవచ్చు. అలాంటప్పుడే పెల్డన్లాంటివాళ్ల గొంతును వాడుకుంటారు సినిమా వాళ్లు. అరుపుల్లో పెల్డన్ నైపుణ్యాన్ని చిన్నవయసులోనే కనిపెట్టారు తల్లిదండ్రులు. ఏడేళ్ల వయసులోనే కోపగొండి బాలికగా అవకాశం దక్కించుకుంది. బాల్యంలోనే వేధింపులకు గురైన బాలిక నిజజీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో... ఆ బాలిక పాత్ర గట్టిగా కీచుమని అరుస్తూ ఉంటుంది. అదే ఆమెకు కెరీర్‌ను నిలబెట్టింది. అదేమంత గొప్పపని... గట్టిగా అరిచేస్తే సరిపోతుందనుకుంటారు చాలామంది. కానీ భయంవేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఆవేశంతో, సంతోషం ఎక్కువైనప్పుడు, ఏదైనా సాధించినప్పుడు.. ఇలా రకరకాల అరుపులుంటాయి. ప్రత్యేకించి నొప్పితో, బాధ కలిగినప్పుడు... వచ్చే అరుపులు చాలా కష్టమైనవి. ఒక్కోసారి వరుసగా కొన్నిగంటలపాటు అరవాల్సి వస్తుం ది. అవన్నీ అవలీలగా చేసేస్తుంది పెల్డన్. అదెలా అంటే... ‘చిన్న కీటకాన్ని చూసినా నేను గట్టిగా మొత్తుకుంటా. నాకది సహజంగా వచ్చింది’ అని చెబుతుంది. 20 ఏళ్లొచ్చేసరికి చాలా సినిమాలు, టీవీ సిరీసులకు తన అరుపులను ఇచ్చేసిన పెల్డన్ ఇప్పుడు డబ్బింగ్ కూడా చెప్పేస్తోంది. -
కళ: అమెరికాలో పుష్పవిలాసం
కొన్ని చిత్రాలు ‘ఆహా’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు ‘అద్భుతం’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు మాత్రం ‘ఆహా అద్భుతం’ అనిపిస్తూనే ఆలోచించేలా చేస్తాయి. పుష్ప చిత్రాలు ఈ కోవకు చెందినవే... కొన్ని చిత్రాలు ‘ఆహా’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు ‘అద్భుతం’ అనిపిస్తాయి. కొన్ని చిత్రాలు మాత్రం ‘ఆహా అద్భుతం’ అనిపిస్తూనే ఆలోచించేలా చేస్తాయి. పుష్ప చిత్రాలు ఈ కోవకు చెందినవే... మాన్హాటన్ (యూఎస్) 86 స్ట్రీట్‌లోని బస్‌షెల్టర్‌లో కనిపించిన ఒక చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. సంప్రదాయ కళాప్రేమికులు, ఆధునిక కళాప్రేమికులు... ఇద్దరూ ఇష్టపడే చిత్రం అది. ‘జాయ్ ఆఫ్ లివింగ్’ అనే ఆ చిత్రాన్ని గీసింది మన ఇండియన్ ఆర్టిస్ట్ పుష్పకుమారి. గత రెండు సంవత్సరాల కరోనా కల్లోల చీకటిని వస్తువుగా తీసుకొని, ఆశావాద దృక్పథాన్ని ప్రతిఫలించేలా గీసిన చిత్రం అది. అమెరికాకు చెందిన ‘పబ్లిక్ ఆర్ట్ ఫండ్’ అనే నాన్–ప్రాఫిట్ ఆర్గనైజేషన్ న్యూయార్క్, బోస్టన్, షికాగోలలో పుష్పకుమారి చిత్రప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ చిత్రాలను సాధారణ కళాప్రేమికుల నుంచి చేయి తిరిగిన చిత్రకారుల వరకు ప్రశంసిస్తున్నారు. పేరులోనే ‘కళ’ ధ్వనించే మధుబని (బిహార్) జిల్లాలోని రంతి అనే గ్రామంలో పుట్టింది పుష్ప కుమారి. రంతి అనేది ఊరు అనడం కంటే ‘ఊరంత బడి’ అనడం సమంజసం. ఎటు చూసినా ఆబాలగోపాలం చేతిలో మధుబని మధుర కళావిన్యాసాలే! పుష్ప అమ్మమ్మ మహాసుందరిదేవి మధుబని ఆర్ట్‌ను అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లిన తొలితరం కళాకారుల్లో ఒకరు. అమ్మమ్మ ఒడిలో ఆర్ట్పాఠాలు నేర్చుకుంది పుష్ప. పదమూడేళ్ల వయసులోనే కుంచె పట్టిన పుష్ప కాలంతో పాటు తన కళను మెరుగు పరుచుకుంటూ వస్తోంది. మొదట్లో అందరూ గీసినట్లే తాను గీసేది. తరువాత కాలంలో మాత్రం తనదైన ప్రత్యేకత గురించి ఆలోచించింది. ‘సింబాలిజం’ను సంప్రదాయ కళలోకి తీసుకురావడం ఒకింత కష్టమైన పని. అయితే ఆ కష్టం పుష్ప చిత్రాలలో కనిపించదు. దీనికి కారణం సింబాలిజంను సృజనాత్మకంగా మధుబనిలోకి తీసుకురావడమే. అమ్మమ్మ కుంచె నుంచి అందమైన చిత్రాలను నేర్చుకోవడమే కాదు, ఆమె నోటి నుంచి పురాణాలు, జానపద కథలు ఎన్నో విన్నది పుష్ప. అవేమీ వృథా పోలేదు. తన కళకు ఇంధనంగా పనికి వచ్చాయి. పుష్ప కళాప్రపంచంలో కేవలం కళ మాత్రమే కనిపించదు. సమాజం కూడా కనిపిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే సంప్రదాయ కళ అనే పునాది మీద తనదైన దృశ్యభాషను సృష్టించుకుంది పుష్ప. సామాజిక,రాజకీయ సమస్యలు, జెండర్ సమస్యలు, పర్యావరణ సంబంధిత అంశాలను కేంద్రంగా చేసుకొని చిత్రాలు గీస్తుంది పుష్ప. నాగరికత అనే పేరుతో భూమాతను ఎంత హింస పెడుతున్నామో ‘ఎర్త్–2’ చిత్రంలో కనిపిస్తుంది. ఇటీవల కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని గీసిన చిత్రాలకు మంచి స్పందన లభించింది. ‘నేను గీసే ప్రతి చిత్రానికి తనదైన భావవ్యక్తీకరణ ఉండేలా చూసుకుంటాను’ అంటుంది పుష్ప. బోల్డ్ స్ట్రైకింగ్ ఫిగర్స్ గీయడంలో దిట్ట అనిపించుకున్న పుష్ప చిత్రాలలో రంగుల ఆర్భాటం కనిపించదు. సాదాసీదా ఇంక్బాటిల్నే ఆమె ఎక్కువగా ఇష్టపడుతుంది. ‘చిత్రాలు మౌనంగా కనిపిస్తాయి. కాని ఆ మౌనంతోనే అవి మనతో మాట్లాడేలా చేయడం ఆర్టిస్ట్ విశిష్ఠత’ అని చెబుతారు విశ్లేషకులు. పుష్పకుమారి గీసిన చిత్రాలను చూస్తే... అవి మౌనంగా మాట్లాడే చిత్రాలు అనే విషయం కొద్దిసేపట్లోనే తెలిసిపోతుంది. -
రూ.1,506 కోట్ల పెయింటింగ్
1964లో అమెరికన్ చిత్రకారుడు ఆండీ వర్హోల్ పట్టు వస్త్రంపై వేసిన హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో పెయింటింగ్ ఇది. సోమవారం క్రిస్టీస్ వేలంలో రికార్డు స్థాయిలో రూ.1,506 కోట్లకు అమ్ముడుపోయింది. 20వ శతాబ్దంలో అత్యధిక ధర పలికిన పెయింటింగ్‌గా చరిత్రకెక్కింది. -
ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయండి: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ వసతి గృహాలను ఖాళీ చేయాల్సిందిగా కళాకారులను కేంద్రం కోరింది. అందులో భాగంగా బుధవారం పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒడిస్సీ డ్యాన్సర్ గురు మాయాధర్ రౌత్(90)ను అధికారులు వసతి గృహం నుంచి బయటకు పంపించేశారు. దీంతో ఆయన నిరాశ్రయులయ్యారు. వివరాల ప్రకారం.. దశాబ్దాల క్రితం ప్రముఖ కళాకారుల కోసం కేంద్రం ఢిల్లీలో వసతి గృహాలను అందించింది. కాగా, వసతి గృహాల్లో వారు ఉండటాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2014లో నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వారు ఇళ్లను ఖాళీ చేయాలని 2020లో నోటీసు జారీ చేసింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీ హైకోర్టు కూడా ఎనిమిది కళాకారులు బంగ్లాలను ఏప్రిల్ 25వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించుకుంటే చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో వారు ఖాళీ చేయకపోవడంతో గురు మాయాధర్ రౌత్‌ను వసతి గృహం నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా గురు మాయాధర్ రౌత్ కూతురు మధుమితా రౌత్ మాట్లాడుతూ.. ఆ ఇంటిని తన తండ్రికి 25 ఏళ్ల క్రితం కేటాయించారని చెప్పింది. బలవంతంగా తమను బంగ్లా నుంచి బయటకు పంపిచేశారని ఆరోపించింది. పోలీసులు తమ వస్తువులను బయటకు విసిరేశారని విమర్శించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘28 మంది కళాకారులలో దాదాపు ఎనిమిది మందికి అనేకసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ తమ ప్రభుత్వ వసతి గృహాల నుండి బయటకు వెళ్లలేదు. దీంతో వారికి నోటీసులు ఇచ్చాము.’’ అని అన్నారు. -
పుష్ప, RRR, ఆచార్య : ఆర్టిస్ట్ సమంతా అద్భుతమైన పాట వింటే..
సాక్షి, హైదరాబాద్: భారతీయ సినిమాలో గొప్ప గొప్ప సినిమాలన్నీ ఆర్ట్ రూపంలో దర్శనమిస్తే ఎలా ఉంటుంది. వెండి తెరపై ఒక మూవీని అవిష్కరించే అన్ని క్రమాలను ఒక థీమ్‌గా ఎంచుకుని కళాకారులు పనిచేస్తే. ఈ ఆలోచనే అద్భుత కళాఖండాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రముఖ కార్టూనిస్టు, దర్శకులు బాపు, రమణలు సినిమా మొత్తాన్ని పర్ఫెక్ట్గా బొమ్మలు గీసుకొని ఆ తరువాత సినిమా తీసేవారట. అలాగే తెలుగు, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ సినిమాలు, సినిమా తయారయ్యేందుకు సంబంధించి వివిధ దశలు, రంగాలు, స్టార్ హీరోలు, లెజెంట్రీ నటీ నటుల పట్ల గౌరవ సూచకంగా ఆర్ట్ క్యూరేటర్ అన్నపూర్ణ మడిపడగ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్లో కొలువు దీరిన వినూత్నమైన , అద్భుతమైన చిత్రాలను ‘చిత్రం’ షోలో చూద్దాం. ఆర్టిస్టులు రకరకాల థీమ్‌లతో బొమ్మలు వేయడం, వాటిని ప్రదర్శనకు పెట్టడం అందరికీ తెలుసు. ఇందులో ప్రతీ ఆర్టిస్టుకు వారికంటూ ఒక ప్రత్యేక శైలి( సిగ్నేచర్) ఉంటుంది. దాని ఆధారంగా తమ ప్రతిభకు అద్దంపడుతూ అద్భుతమైన ఆర్ట్స్‌ను ప్రదర్శించారు. వీటిని పరిశీలిస్తే.. ఇలా కూడా ఆర్ట్ వర్క్‌ను రూపొందించవచ్చా అని ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. అనేక ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌ను సక్సెస్ చేస్తూ, ఔరా అనిపించే ఎగ్జిబిషన్స్‌తో ఆకట్టుకుంటూ, గొప్ప మహిళా ఆర్ట్ క్యూరేటర్‌గా పాపులర్ అయిన అన్నపూర్ణ మడిపడగ ఎగ్జిబిషన్ విశేషాలను సాక్షి.కామ్‌తో పంచుకున్నారు. భారతీయ సినిమాకు సంబంధించిన థీమ్‌తో దీన్ని రూపొందించడం విశేషం. సినిమాలోని 24 క్రాప్ట్స్ ఇన్స్పిరేషన్తో ఆ ఆర్ట్స్‌ను రూపొందించామని అన్నపూర్ణ వివరించారు. యాక్రిలిక్, ఆయిల్, వుడ్, సీడీలు, ఫ్లోర్ టైల్స్, 24 కారెట్స్ గోల్డ్, పెన్సిల్ స్కెచ్, ఇలా విభిన్న మీడియమ్స్పై దేశవ్యాప్తంగా 30 మంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఇందులో పాల్గొన్నారని ఆమె తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌కోసం ఆర్టిస్ట్‌ల తపన గురించి వివరించారు. అలాగే కళకు జెండర్ లేదని, చాలామంది మహిళా ఆర్టిస్టులు కూడా అద్బుతమైన ఆర్ట్స్ రూపొందించారని అన్నారామె. అలాగే తమ ఎగ్జిబిషన్‌కు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, రెండేళ్ల తమ శ్రమ ఫలించిందంటూ అన్నపూర్ణ సంతోషం వ్యక్తం చేశారు. కోలకతా బైస్డ్ ఆర్టిస్ట్ దెబాషిస్ సమంత బాలీవుడ్ లెజెండ్రీ మూవీ ‘పాకీజా’ కి ట్రిబ్యూట్‌గా ఒక కళాఖండాన్ని రూపొందించారు. అంతేకాదు తన అభిమాన హీరోయిన్ మీనాకుమారీపై ప్రేమతో సమంతా పాట పాడి మరీ మ్యూజికల్ ట్రిబ్యూట్ అందించారు. సంవత్సరన్నర నుంచి 40 రోజుల పాటు శ్రమించి తమ బుర్రకు, కుంచెకు పదును పెట్టి అద్బుతమైన కళా ఖండాలను ప్రదర్శించారు. ముఖ్యంగా టాలీవుడ్ సెన్సేషన్ మూవీలు, పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య థీమ్‌లను తీసుకుని డిఫరెంట్ ఆర్ట్ వర్క్ తీర్చిదిద్దారు. హ్యాండ్ మేడ్ పోస్టర్స్ థీమ్‌తో వీటిని ప్రదర్శించడం హైలైట్. ఫస్ట్ విమెన్ ఆఫ్ ఇండియన్ విమెన్ అనే కాన్సెప్ట్‌తో సినిమా రంగంలో మహిళ సేవలకు గౌరవ సూచకంగా నిలిచిన ఆర్ట్‌పీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాక్షి కార్టూనిస్ట్ శంకర్ రూపొందించిన కార్టూన్స్ మరో ఆకర్షణ. ముఖ్యంగా సినిమాలోని స్టోరీ బోర్డును ఎంచుకుని నగేష్ గౌడ్ అలనాటి రెండు బ్టాక్ బస్టర్ మూవీలు అడవి రాముడు, భక్తకన్నప్ప పెయింటింగ్స్ రూపొందించారు. ఒక స్టోరీ బోర్డులాగా తీర్చి దిద్దినట్టు నగేష్ గౌడ్ వెల్లడించారు. ఎంతో కమిట్మెంట్, డెడికేషన్, తపన ఉంటే ఇలాంటి అద్భుతాలు వెలుగులోకి రావు నిజంగా ఆర్టిస్టులకు ధన్యవాదాలు అంటూ విజిటర్స్ ఎంజాయ్ చేశారు. -
తెరమరుగవుతున్న తెలుగు నాటకం
కడప కల్చరల్ : తెలుగు నాటకం క్రమంగా తెరమరుగవుతోంది. జిల్లాలో గతంలో పలు నాటక సంస్థలు ఉండేవి.. కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నాటక సంస్థలు కనుమరుగయ్యాయి. ♦అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచమంతటా విశిష్ట గుర్తింపు, గౌరవం పొందిన సురభి నాటక సంస్థ వైఎస్ఆర్ జిల్లాలోనే ఉంది. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ రంగం ప్రస్తుతం క్రమంగా తెరమరుగవుతోంది. జిల్లాలో వందకుపైగా ఉండిన నాటక సంస్థలు ప్రస్తుతం అరడజనుకు మించి లేకపోవడం గమనార్హం. అవికూడా పరిషత్తు (నాటక పోటీ)లకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇటీవలి పరిణామాల కారణంగా రెండేళ్లుగా అంతంత మాత్రం ప్రదర్శనలు కూడా లేవు. దీంతో జిల్లాలో నాటకరంగం పరిస్థితి దయనీయంగా తయారైంది. వీరేశలింగానికి డాక్టర్ వైఎస్సార్ నీరాజనం నవయుగ వైతాళికుడు, తెలుగు నాటక ప్రయోక్త, కవి, రచయిత కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని .. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం తెలుగు నాటక రంగ దినోత్సవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ♦ఈ నిర్ణయం రాష్ట్రంలోని నాటకరంగ కళాకారుల్లో ఎంతో ఉత్సాహం నింపింది. ప్రతి జిల్లాలో ఐదుగురు సీనియర్ రంగస్థల కళాకారులను ఎంపిక చేసి ఆయా జిల్లాల ప్రధాన కేంద్రాలలో వీరేశలింగం జయంతి సందర్భంగా ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున నగదు ఇస్తూ ఘనంగా సత్కారం నిర్వహించేవారు. ♦ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని క్రమంగా తెరమరుగు చేశాయి. 2014లో అన్ని జిల్లాల కళాకారులను విజయవాడకు పిలిపించి ఒకేరోజున మొక్కుబడిగా అందరికీ వరుసపెట్టి పురస్కారాలు ఇచ్చే కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఇది కళాకారుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. ఆ తర్వాత ఈ పురస్కారాలను వీరేశలింగం జయంతి ఏప్రిల్ 16నగాక ఆ తర్వాత నంది నాటక పోటీల బహుమతి ప్రదానంలో ఇవ్వడం ప్రారంభించారు. దీంతో వీరేశలింగం తెలుగు నాటకరంగ పురస్కారాలు ఉనికి కోల్పోయినట్లయింది. జిల్లాలో స్థితి ♦జిల్లాలో ప్రొఫెషనల్ నాటక సంస్థలు లేకపోవడం, ఔత్సాహికుల ప్రదర్శనలలో నాణ్యత లోపం, ప్రజల ఆదరణ లేకపోవడంతో జిల్లాలో నాటకం కొన ఊపిరితో ఉంది. పరిషత్తుల కోసం అక్కడక్కడ నాటకాలు తయారవుతున్నా ఇటీవలి కాలంలో ఆ పోటీలు కూడా లేకపోవడంతో నాటకం వైభవం కోల్పోయింది. వైవీయూతో కొత్త ఊపిరి ♦వైఎస్సార్ జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో రంగస్థల విభాగాన్ని నిర్వహిస్తుండడంతో నాటకరంగానికి కొత్త ఊపిరి వచ్చినట్లయింది. రాష్టంలోని సీనియర్ రంగస్థల కళాకారులను యూనివర్శిటీకి పిలిపించి విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటికి దాదాపు 50 మందికి పైగా నటులు యూనివర్శిటీ ద్వారా ప్రతిభను నిరూపించుకున్నారు. ఇందులో సగం మందికి పైగా నాటకంలో కృషి చేస్తున్నారు. తెలుగు నాటకం.. తెర తీసే యత్నం దాదాపు 500 తెలుగు నాటికలు, నాటకాల సారాంశాన్ని పుస్తకంగా రంగస్థల కళాకారులతోపాటు ప్రజలకు అందించే ప్రయత్నం సాగుతోంది. యోగి వేమన విశ్వవిద్యాలయం లలిత కళల విభాగం అధ్యక్షులు, లలిత కళానికేతన్ సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులు డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి తాను చేసిన ఈ కృషిని రాయలసీమ నాటక వికాసం పేరిట పుస్తకంగా తీసుకు వచ్చారు. దాంతోపాటు ఆయన రాసిన నాటికల సంపుటిని అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 16వ తేదీన బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో సుమబాలారెడ్డి ట్రస్టుతో కలిసి నిర్వహిస్తున్నారు. -
కిన్నెర లింగు కన్నుమూత
ఆదిలాబాద్: ప్రముఖ పన్నేండు మేట్ల కిన్నెర కళాకారుడు కుమ్రం లింగు అనారోగ్యంతో ఆదిలాబాద్ జిల్లా చించూట్‌లో కన్నుమూశారు. తెలంగాణలో ఎకైక పన్నెండు మేట్ల కిక్రీ కళకారుడు లింగు. గిరిజన కళాకారుడైన లింగు పన్నేండు మేట్ల కిక్రీ వాయిస్తూ ఎన్నో కళా ప్రదర్శనలు ఇచ్చారు. కిక్రీ కళతో వివిధ అవార్డులు పోందారు. కుమ్రం లింగు మృతిపై అదివాసీ గిరిజన సంఘాలు తీవ్ర సంతాపం ప్రకటించాయి. చదవండి: తెలంగాణ కేబినెట్ సమావేశం.. ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం -
గీత రాత మారేనా?
చిత్రకళ అనాది కళ. చరిత్రకు పూర్వయుగంలోనే మానవాళికి పట్టుబడిన ఆదిమ కళ. మాటలెరుగని తొలి మానవులు ఎరిగిన ఏకైక భావప్రకటన సాధనం చిత్రకళ. గీతల నుంచి పరిణామం చెందిన తర్వాతే రాతలు రాయడం మొదలైంది. గీతలతో చుట్టూ కనిపించే జంతుజాలాన్ని, పరిసరాలను చిత్రించే దశ నుంచి చిత్రలిపి ‘క్యూనిఫామ్’ దశకు చేరుకోవడానికి దశాబ్దాలో శతాబ్దాలో కాదు, ఏకంగా సహస్రాబ్దాల కాలం పట్టింది. ఆదిమ చిత్రకళ క్రీస్తుపూర్వం 30 వేల ఏళ్ల నాడే మొదలైతే, క్రీస్తుపూర్వం 3,400 ఏళ్ల నాటికి గాని తొలినాటి లిపి రూపుదిద్దుకోలేదు. దాదాపు అప్పటి నుంచే భాషల పుట్టుక మొదలైంది. నానా భాషలూ, వాటికి రకరకాల లిపులూ వచ్చాయి. మనిషి మాటలూ రాతలూ నేర్చిన నాటి నుంచి నాగరికత పరిణామ క్రమంలో వేగం పెరిగింది. ముందొచ్చిన గీతల కంటే వెనకొచ్చిన రాతలే వాడి అనేంతగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. నాగరికతల వికాసం మొదలైన నాటి నుంచి పారిశ్రామిక విప్లవ కాలం వరకు, ఆ తర్వాత నేటి అత్యాధునిక కాలం వరకు ప్రపంచవ్యాప్తంగా చిత్రకళలో అనేకానేక మార్పులు వచ్చాయి. మన దేశంలో ఆదిమ చిత్రకళ క్రీస్తుపూర్వం 5,500 ఏళ్ల నాడే మొదలైంది. మధ్యప్రదేశ్‌లోని భీమ్‌బేట్కా గుహల్లోని చిత్రాలే ఇందుకు నిదర్శనం. సింధులోయ నాగరికత నాటి శిథిలాల్లో నైరూప్య చిత్రకళ ఆనవాళ్లూ ఉన్నాయి. క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఒకటో శతాబ్ది కాలానికి చెందిన అజంతా గుహల్లోని చిత్రకళ ఆనాటి బౌద్ధ ప్రాభవానికి అద్దంపడుతుంది. మొఘల్ పరిపాలన కాలం వరకు దేశం నలు చెరగులా మధ్యయుగాల చిత్రకళ వివిధ రీతుల్లో అభివృద్ధి చెందింది. మొఘల్ పాలన అంతమయ్యాక డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ కంపెనీలు దేశంలోకి అడుగుపెట్టాక మన దేశంలో ఆధునిక చిత్రకళ మొదలైంది. బ్రిటిష్ హయాంలోనే మన దేశంలో చిత్రకళా అధ్యయన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో శాస్త్ర సాంకేతిక అధ్యయన కేంద్రాల అభివృద్ధితో పోల్చుకుంటే, కళా అధ్యయన కేంద్రాల అభివృద్ధి నామమాత్రమే! ఇక చిత్రకళపై తెలుగులో వచ్చిన పుస్తకాల సంఖ్యను వేళ్ల మీద లెక్కించవచ్చు. తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు ‘చిత్రలేఖనము’ పేరిట 1918లో రాసిన పుస్తకమే బహుశ తెలుగులో వచ్చిన తొలి ఆధునిక చిత్రకళా గ్రంథం. స్వాతంత్య్రా నికి ముందు కళాభిరుచి గల కొందరు బ్రిటిష్ దొరలు ఎందరో భారతీయ చిత్రకారులను ప్రోత్సహించారు. ఆనాటి సంస్థానాలు సైతం చిత్రకళకు ఊతమిచ్చాయి. ఆధునిక భారతీయ చిత్రకారుల్లో అగ్రగణ్యుడైన రాజా రవివర్మ ట్రావెన్కోర్ సంస్థానాధీశుని ప్రోత్సాహంతో రాణించాడు. ఇద్దరు తెలుగు గురువుల వద్ద, బ్రిటిష్ చిత్రకారుడు థియోడార్ జెన్సన్ వద్ద రవివర్మ తైలవర్ణ చిత్రకళను నేర్చుకున్నాడు. ఆధునిక భారతీయ చిత్రకారుల్లో రవివర్మ అగ్రగణ్యుడే గానీ, ఆద్యుడు కాదు. ఇప్పటి వరకు దొరుకుతున్న ఆధారాల ప్రకారం తెలుగువాడైన బ్రహ్మస్వామిని తొలి ఆధునిక భారతీయ చిత్రకారుడిగా చెప్పుకోవచ్చు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన బ్రహ్మయ్య గీసిన చిత్రాలు ఫ్రాన్స్ జాతీయ గ్రంథాలయం వెబ్సైట్లో కనిపిస్తాయి. ఆధునిక కాలానికి చెందిన మన తెలుగు చిత్రకారుల గురించి చెప్పుకుంటే కూల్డ్రే దొర ప్రోత్సాహంతోనే తొలితరం ఆధునిక చిత్రకారుల్లో ఒకరైన దామెర్ల రామారావు రాణించారు. దామెర్ల మిత్రుడు వరదా వెంకటరత్నం కూడా కూల్డ్రే ప్రోత్సాహంతోనే చిత్రకళలో రాణించారు. మశూచి బారినపడి దామెర్ల పిన్నవయసులోనే మరణించ డంతో రాజమండ్రిలో ‘రామారావు ఆర్ట్ గ్యాలరీ’ని ఏర్పాటు చేసినది వరదా వెంకటరత్నమే! గడచిన శతాబ్దిలో పలువురు తెలుగు చిత్రకారులు భారతీయ చిత్రకళను సుసంపన్నం చేశారు. అప్పట్లో ‘భారతి’ వంటి పత్రికలు చిత్రకళకు కూడా సముచిత ప్రాధాన్యమిచ్చేవి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న చిత్రకళాకారులు తెలుగునాట చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నా, వారి నైపుణ్యాన్ని, ప్రత్యేకతను బేరీజువేసి పాఠకులకు విశదీకరించగల కళావిమర్శకులే మనకు అరుదైపోయారు. తెలుగునాట వివిధ విశ్వవిద్యాలయాల్లో బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ కోర్సులు నిర్వహి స్తున్నా, ఏటా ఈ డిగ్రీలు తీసుకుని బయటకు వచ్చేవారిలో కనీసం ఒకరిద్దరయినా చిత్రకళా విమర్శ కులుగా తయారు కాలేకపోవడం విచారకరం. ప్రపంచంలోని ఉత్తమ చిత్రకళా విద్యాల యాల్లో తొలి ముప్పయి స్థానాల్లోనైనా మన దేశానికి చెందిన ఏ చిత్రకళా విద్యాలయానికీ చోటులేక పోవడం మరో విషాదం. చిత్రకళపై మనదేశంలో ఇంగ్లిష్ మ్యాగజైన్లు కొద్ది సంఖ్యలో వస్తున్నాయి. తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో పూర్తిగా చిత్రకళకు పత్రికలేవీ లేవు. ఒకవేళ వచ్చినా, అవి మనుగడ సాగించగల పరిస్థితులూ లేవు. మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏటా ‘చిత్రసంతె’ జరుగుతుంది. ‘కరోనా’ వల్ల దీనికి రెండేళ్లు అంతరాయం కలిగినా, ఈసారి యథావిధిగా జరిగింది. వారం కిందట జరిగిన ‘చిత్రసంతె’లో దేశం నలుమూలల నుంచి వచ్చిన చిత్రకారులు పాల్గొన్నారు. కర్ణాటక చిత్రకళా పరిషత్ నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాన్ని మిగిలిన రాష్ట్రాలూ నిర్వహిస్తే బాగుంటుంది. ఏటా దేశంలోని వివిధ నగరాల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లే, ‘చిత్రసంతె’ వంటి కార్యక్రమాన్ని కనీసం దేశంలోని ముఖ్య నగరాల్లో నిర్వహించేటట్లయితే వర్ధమాన చిత్రకారులకు కొంతైనా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గీత రాత మారుతుంది. -
అక్కడేం లేదు.. అయినా నాలుగు కోట్లు, అట్లుంటది మరి!
కొన్ని చిత్రవిచిత్రమైన ఘటనలు మన కళ్ల ముందే జరుగుతుంటయ్. వాటి గురించి తెలిసినప్పుడల్లా నోళ్లు వెళ్లబెట్టడం, దిమ్మ తిరిగిపోవడం మాత్రమే మన వంతు అయితది. అట్లాంటి ఎగ్జాగరేట్ అయ్యే ముచ్చటే మీకు ఇప్పుడు చెప్తున్నం. ఏం లేని దానికి నాలుగు కోట్ల రూపాయలు ఎట్లొస్తయ్ అనే డౌట్ మీకూ రావచ్చు?.. అందుకే సీదా విషయంలోకే వెళ్దాం.. ఫ్రెంచ్ దిగ్గజ ఆర్టిస్ట్ యువెస్ క్లెయిన్ 50వ దశకంలో ఓ చిలిపి పని చేసిన్రు. 1958లో ‘ది వాయిడ్’ అంటూ ఓ ఎగ్జిబిషన్ పెట్టిండాయన. అసలే ఆయన బోలెడంత ఫేమస్సు. అందుకే ఆ ఎగ్జిబిషన్ కోసం మస్తు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుని వచ్చిన్రు జనాలు. తీరా ఆర్ట్ గ్యాలరీలోకి పోతే.. అంతా బ్లాంక్ అయిపోయిన్రు. ఎందుకంటే.. అక్కడ ఏం లేదు కావట్టి. ఏందిది అని అడిగితే.. ఇన్విజిబుల్(ఇమాజినరీ) ఆర్ట్ వర్క్ అంటూ మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చిండాయన. పైగా ప్యూర్ గోల్డ్ ఇచ్చి .. కంటికి కనవడని ఆ ఆర్ట్ పీసులను తీసుకెళ్లండంటూ బంపరాఫర్ కూడా ఇచ్చిండట. అట్లుంటది.. మరి ఆయనతోని!. ఏం లేని ఆర్ట్‌వర్క్ ఆయన ఆఫర్ చేయడంతో జనాలు తిట్టుకుంటున్నారని అనుకుంటం కదా!. సారీ.. ఇక్కడే సీన్ ఉల్టా అయ్యింది. బంగారం ఇచ్చి.. ఆ ఆర్ట్ పీసులను(ఏం ఉండదు) కొనుక్కుపోయిన్రు వాళ్లంతా. అయితే జనాల్ని డిస్పాపాయింట్ చేసుడు ఇష్టం లేని ఆయన.. ఆ ఆర్ట్ పీసుల వంతుకు అమ్మినట్లు రిసిప్ట్లు మాత్రం ఇచ్చిండట. అట్లా.. 1959, డిసెంబర్ 7న అమ్ముడువోయిన ఓ ఇన్విజిబుల్ ఆర్ట్ పీస్‌ను యాంటీక్విటీ డీలర్ జాక్వెస్ కుగెల్ కొనుక్కున్నడు. అగో.. ఆ రిసిప్ట్ తోనే గిప్పుడు గా కళ్లకు కనవడని ఆ ఆర్ట్ వర్క్‌ను వేలం వేస్తున్నారంట. యువెస్ క్లెయిన్ చనిపోయి మస్తు ఏండ్లు అయితున్నా.. ఆయన దస్కత్ ఉన్న ఆ రిసిప్ట్, అదేవోయ్ ఇన్విజిబుల్ ఆర్ట్ పీస్.. సుమారు5,50,000 డాలర్లు కనీస ధర పలకొచ్చని అంచనా ఎసిన్ను. అంటే మన పైసళ్లలా నాలుగు కోట్ల రూపాయలకు పైమాటే. సోథ్బైస్ ఆక్షన్ హౌజ్ మాత్రం.. అంతకుమించే పైసలు రాబట్టొచ్చని అంటోంది మరి. ఇంకో ముచ్చట జెప్పాలె.. ఈ రిసిప్ట్కు ఇంకో స్పెషాలిటీ ఉంది. యువెస్ క్లెయిన్ yves kleinకు ఒక చిత్రమైన హ్యాబిట్ ఉండేదట. అమ్మేసిన బొమ్మలకు రిసిప్ట్‌లను కాల్చేసి.. వాళ్లు ఇచ్చిన బంగారంలో సగం ‘సీన్ నది’లోకి ఇసిరిపడేయమని కొనుక్కున్నోళ్లకు చెప్పేటోడట. సో, అట్ల చూసినా ఆయన దస్కత్తో మిగిలిపోయిన లాస్ట్ రిసిప్ట్ ఇదే. అందుకే అంత రేట్ వస్తదని అనుకుంటున్నరు మరి!. చమక్కులు ► కమెడియన్ comedian.. 2019లో సోషల్ మీడియాను ఊపేసిన ఓ టాపిక్. ఫ్రెష్ బనానాను , సిల్వర్ టేప్‌తో గోడకు అంటించి.. అదే ఒక ఆర్ట్ వర్క్ అంటూ ప్రచారం చేసిన్రు కొందరు. అట్ల బసెల్ మియామీ బీచ్ ఆర్ట్ గ్యాలరీతో 1,20,000 డాలర్లు వచ్చినయట. పోనీలేండి.. కనీసం ఇది కళ్లకైనా కనవడ్డది. ► కానీ, కిందటి ఏడాదిల ఇటాలియన్ ఆర్టిస్ట్ సాల్వటోర్ గరావు(67) అసలు ఉందో లేదో ఆర్ట్‌వర్క్‌ను వేలం ఎసి.. సుమారు 18 వేల డార్లు సంపాదించుడు. ఏం తెలివో ఏమో!. -
వినుడువినుడు 'విజయ'గాథ
విద్యలనగరం కళలకు కాణాచి. కళాకారులకు పుట్టినిల్లు. సమాజంలోని రుగ్మతలను ప్రపంచానికి చాటిచెప్పేది.. సమకాలీన అంశాలను తమ ప్రదర్శనలతో ప్రజల మదిలో ముద్రించేది కళాకారులే. హాస్యభరితమైన ప్రదర్శనలతో ఓ వైపు ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు సమాజాన్ని చైతన్యవంతం చేసే కళ వారి సొంతం. వేలాది ప్రదర్శనలతో జిల్లాకు పేరుతెచ్చిన కళాకారులు కరోనా మహమ్మారి వ్యాప్తితో మూడేళ్లుగా ప్రదర్శనలకు దూరమయ్యారు. విజయనగరం జిల్లాకు వన్నెతెచ్చిన బుర్రకథ కళా ప్రదర్శనలపై ప్రత్యేక కథనం విజయనగరం టౌన్: బుర్రకథ కళకు కేరాఫ్ విజయనగరం. ఇప్పటికీ ఆ గుర్తింపు ఉంది. వినుడువినుడు మా విజయగాథ అంటూ బాలనాగమ్మ, బొబ్బిలి యుద్ధం, సారంగధర, సీతారామ కల్యాణం వంటి ఎన్నో అద్భుతమైన పురాణ కథలు, ఇతిహాసాలు, యుద్ధవీరుల గొప్పతనాన్ని హాస్యభరితంగా వివరించిన బుర్రకథ కళాకారులకు పుట్టినిల్లు మన విద్యలనగరం. సామాజిక రుగ్మతలపై ప్రజలను జాగృతం చేస్తూనే.. కథల్లోని నీతిని బోధించి ప్రజల మన్ననలు అందుకునేవారు. కుటుంబం మొత్తం కళల్లో ఆరితేరేందుకే ఇష్టపడేవారు. ఫలానా వంశం నుంచి వచ్చిన కళాకారుడని గొప్పలు చెప్పేవారు. ఆ కోవలోనే కుమ్మరి మాస్టారు బుర్రకథ అంటే తెలియని వారుండరు. రాఘవకుమార్, రొంగలి సత్యం వంటి వారెందరో జిల్లాలో కళలను ప్రోత్సహించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచిన కళల్లో బుర్రకథదీ ప్రత్యేక స్థానం. నాజర్ బుర్రకథకు ఆద్యుడిగా పేరుగాంచారు. గ్రామాల్లో ఏ పండగ అయినా ఆ రోజు బుర్రకథ, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు తప్పనిసరిగా ఉండేవి. కళాకారులు వేషం కట్టి స్టేజ్ ఎక్కి కథ చెబితే.. ప్రేక్షకుల చప్పట్లు, హర్షధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగేది. కళపై మక్కువతో... విజయనగరం మట్టిపై జన్మించిన వారందరికీ కళపైన మక్కువ ఎక్కువ. జిల్లా వ్యాప్తంగా ఐదువేల మందికి పైగా కళాకారులు ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చి జిల్లాకు పేరుతెస్తున్నారు. పైడితల్లి అమ్మవారి పండగలో తొలేళ్ల ఉత్సవం రోజు కుమ్మరిమాస్టారి బుర్రకథ ఉండాల్సిందే. ఆయన చెప్పే హాస్య రసభరితమైన ప్రదర్శనను ప్రజలు ఆద్యంతం ఆస్వాదించాల్సిందే. ఆయన కథకోసమే ప్రజలు తొలేళ్లరోజు నాటికే జిల్లాకు తరలివచ్చేవారంటే ఆయన చెప్పే కథకు ఉన్న విశిష్టత అంతటి గొప్పది. అలాగే, బొబ్బిలి యుద్ధంలో కథకుడిగా రాఘవకుమార్, బాలనాగమ్మ బుర్రకథలో కథకుడు రొంగలి సత్యంలు చెప్పే కథలు ప్రజల్లో చైతన్యం నింపేవి. జిల్లాకు చెందిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి అందరికీ సుపరిచితురాలే. ఆమె అసలుపేరు రెడ్డి విజయలక్ష్మి. బుర్రకథ ప్రదర్శనలో ఆమెకు ఆమేసాటి. జానపద గీతాలను ఆలపిస్తూ తన నృత్యంతో వాటికి ఆమె వన్నెతెచ్చారు. జయమ్మ, జిన్నాం లక్ష్మణరావు వంటి ఎంతోమంది కళాకారులు బుర్రకథ కళకు తమ ప్రదర్శనలతో జీవంపోశారు. నాడు బిజీ.. నేడు ఖాళీ.. కళను నమ్ముకుని ఎంతోమంది కళాకారులు జీవనం సాగిస్తున్నారు. మూడేళ్ల కిందటి వరకు నెలకు 20 ప్రదర్శనలు ఇచ్చేవారు. కోవిడ్ ప్రభావంతో ఇప్పుడు నెలకు కనీసం రెండు, మూడు ప్రదర్శనలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కళను బతికిద్దామన్న ఆకాంక్షకు కోవిడ్ అడ్డుతగులుతోందంటూ ఆవేదన చెందుతున్నారు. ఆ రోజులు మళ్లీ రావాలని... మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. నేను గత 20 ఏళ్లుగా విజయనగరంలోనే ఉంటున్నాను. బుర్రకథ దళంలో సభ్యురాలిగా ప్రదర్శనలిచ్చేదానిని. కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండేదికాదు. కరోనా మా కళాకారుల జీవితాలను ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది. నాటి మంచి రోజులు మళ్లీ రావాలని ఆశిస్తున్నాం. – ఎం.రాజేశ్వరి, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు కోవిడ్‌తో ఉపాధి కోల్పోయాం గతంలో నెలరోజులకు 25కి పైగా ప్రొగ్రామ్‌లు చేసిన రోజులున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తితో ఒక్కప్రొగ్రాం కూడా ఇవ్వలేని పరిస్థితి. మూడేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నాం. ఇళ్లకే పరిమితమయ్యాం. జనంలో కళలకు ఆదరణ తగ్గిపోతోంది. – గరివిడి లక్ష్మి, బుర్రకథ కళాకారిణి, గరివిడి నాట్యమండలితో ఆదరణ గతంలో జిల్లాతో పాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు వివిధ ప్రొగ్రామ్‌లు కావాలని నాట్యమండలిని ఆశ్రయించేవారు. మూడేళ్లుగా కోవిడ్ మహమ్మారి కళాకారుల జీవితాలతో ఆడుకుంటోంది. ఉన్నతాధికారులు స్పందించి కళాకారులను ఆదుకోవాలి. కళా ప్రదర్శనలకు అవకాశం ఇవ్వాలి. – నెల్లూరు సంగీత్ కుమార్, ఆర్టిస్టు, నాట్యకళామండలి ప్రతినిధి, విజయనగరం -
Shyam Karri: అందుకే నా పెయింటింగ్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు
తాను కెరీర్ ఎంపిక చేసుకునే సమయంలో ఎన్నో మార్గాలు కనిపిస్తున్నాయి. కానీ ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలియడం లేదు. ఆ సమయంలో జిడ్డు కృష్ణమూర్తి ‘థింక్ ఆన్ దిస్ థింగ్స్’ పుస్తకం దారి చూపింది. తనను ప్రతిభావంతుడైన వాటర్ కలర్ ఆర్టిస్ట్‌గా మార్చింది... పుడుతూనే పోలియో బారిన పడ్డాడు శ్యాం. విశాఖలో జన్మించిన శ్యాం దాదాపు ఐదేళ్ల వరకు నడవగలడో లేదో అనే ఆందోళన అందరిలో. అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహం అతడిని నేలపై తొలి అడుగులు వేయించింది. కొద్దికాలానికి అతని అడుగులు స్కూల్ వైపు సాగాయి. స్కూల్లో డ్రాయింగ్ నేర్పించే ఉమా టీచర్ ప్రభావంతో శ్యాంకు పెయింటింగ్ అంటే ఇష్టం ఏర్పడింది. ఇంజినీరింగ్ చదివేందుకు శ్యాంకు ఎన్ఐటీ తిరుచ్చిలో సీటు రావడం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఇంజినీరింగ్, ఫిలిం మేకింగ్, పెయింటింగ్... ఇలా ఏ రంగంలో రాణించాలా? అనే ఆలోచనలు మొదలయ్యాయి. అయితే చివరిగా ప్రకృతికి హాని కలిగించని అంశాన్నే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో జిడ్డు కృష్ణమూర్తి రాసిన ‘థింక్ ఆన్ దిస్ థింగ్స్’ పుస్తకం శ్యామ్‌కు మార్గం చూపింది. అంతర్జాతీయ వాటర్ కలర్ చిత్రకారులు మిలింద్ ముల్లిక్, రాజ్‌కుమార్ స్తబథేలు తాను అభిమానించే గురువులుగా చెప్పుకునే శ్యాం సహజత్వం, భావోద్వేగమైన ఆవిష్కరణతో పలు వేదికలపై వారి నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. ‘‘నా పెయింటింగ్స్‌లో నిత్యం ప్రయోగాలకే ప్రాధాన్యమిస్తాను. ప్రతి పెయింటింగ్‌ను నా తొలి పెయింటింగ్‌గా ఫీలవుతాను. పెయింటింగ్ వేసే ముందు ప్రకృతితో మమేకమయ్యేందుకు తాపత్రయపడతాను. అందుకే పెయింటింగ్స్ వేసేందుకు మా ప్రాంతంలో ఆకర్షణీయ స్థలాలతోపాటు హంపి, కొడైకెనాల్, హిమాచల్‌ప్రదేశ్‌లకు ఎక్కువగా వెళతాను. కొన్ని ప్రాంతాల్లో వాటర్‌లోని సాల్ట్, ఫ్లోరిన్ శాతాలను బట్టి పెయింటింగ్స్‌లో అద్భుత ఆవిష్కరణ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. నా పెయింటింగ్స్‌లో ఎక్కువగా యానిమల్స్ ఎమోషన్స్ కనిపిస్తాయని అభిమానులు చెబుతారు. అందుకే వాటికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా నా పెయింటింగ్స్ కోసం ఆర్డర్లు వస్తున్నాయి’’ అంటున్నాడు శ్యాం. – పలివెల రవీంద్ర, ఎంవీపీ కాలనీ, సాక్షి, విశాఖపట్టణం చదవండి: Nishitha Rajput: అనుమానాలు.. అవమానాలు.. అయినా 3 కోట్ల రూపాయలు సేకరించి.. చదువులమ్మా.. నువ్వు చల్లంగుండాల! ఇది కూడా చదవండి: Jeedipappu Health Benefits: జీడిపప్పును పచ్చిగా తింటున్నారా..! పిస్తాతో పాటు వీటిని తింటే.. -
ఢిల్లీ గడ్డపై కలంకారీ మెరుపు
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న ఢిల్లీలోని రాజపథ్‌లో ప్రదర్శించే కళారూపాల్లో శ్రీకాళహస్తి కలంకారీకి చోటుదక్కింది. శ్రీకాళహస్తి యువ కళాకారుడు సుధీర్ ఏపీ, తెలంగాణ తరఫున ఈ ప్రదర్శనకు ఎంపికయ్యాడు. గత నెలలో చండీగఢ్‌లో జరిగిన అమృతోత్సవాల్లో 9 మంది బృందంతో పాల్గొన్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరఫున మరుగునపడ్డ స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను కలంకారీని మిళితం చేసి 30 మీటర్ల వస్త్రంపై చిత్రీకరించారు. శ్రీకాళహస్తి ఖ్యాతిని రెపరెపలాడించిన కళాకారుడిని ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అభినందించారు. చదవండి: నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి.. కలంకారీ చిత్రాలు గీస్తున్న కళాకారులు చాలా ఆనందంగా ఉంది చండీగఢ్‌లో జరిగిన అమృతోత్సవాల్లో ఏపీ, తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించాను. మరుగునపడ్డ జాతీయ నాయకుల చిత్రాలకు జీవం పోశాం. మా కలంకారీ కళను గుర్తించడం చాలా ఆనందంగా ఉంది. 2006 మహాత్మాగాంధీ మెమోరియల్ అవార్డు, 2007లో హ్యాండీక్రాఫ్ట్ విభాగంలో రాష్ట్ర అవార్డు వచ్చింది. హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయంలో పెయింటింగ్‌లో బ్యాచిలర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ పూర్తి చేశాను. జాతీయ అవార్డు తీసుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నాను. – సుదీర్, కలంకారీ కళాకారుడు -
చనిపోయిన బొద్దింకలపై అందమైన చిత్రాలు!!
Brenda Delgado uses dead bodies of cockroaches as her canvas: బొద్దింకలను చూస్తే ‘ఛీ యాక్’ అని చీదరించుకుని పారిపోయే వాళ్లే ఎక్కువ. అలాంటి బొద్దింకలపై అందమైన చిత్రాలను చిత్రించడం.. అదీ చచ్చిన తర్వాత అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమేనండి చనిపోయిన బొద్దింకలపై ఫిలిప్పీన్స్‌కి చెందిన కళాకారిణి అందమైన దృశ్యాలను చిత్రించింది. అసలు విషయంలోకెళ్తే... మనీలాలోని కలూకాన్ సిటీకి చెందిన 30 ఏళ్ల డెల్గాడో తన పని ప్రదేశంలో చనిపోయిన బొద్దింకలను ఊడుస్తూ ఉంది. ఆ టైంలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. డెల్గాడో స్వతహాగా ఆర్టిస్ట్. బొద్దింకలు రెక్కలు నునపుగా మెరుస్తూ ఉంటాయి కదా వాటిని కాన్వాసుగా ఉపయోగించి ఎందుకు చిత్రించకూడదు అని అనుకుంది. అనుక్కన్నదే తడువుగా ఆయిల్ పెయింట్‌ను ఉపయోగించి రకరకాల చిత్రాలను చిత్రించింది. పైగా ఆ చిత్రాలు రచనల్లోని మార్వెల్స్ వెనమ్, గ్రీన్ గోబ్లిన్, విన్సెంట్ వాన్ గోహ్ స్టార్రీ నైట్ వంటి చిత్రాలకు సంబంధించిన అనుకరణ ప్రస్ఫుటంగా కనిపించింది. అంతేకాదు ‘భయపడకండి, అసాధ్యమైన పనులు చేయడానికి సదా సిద్దంగా ఉండండి’ అని అందరికీ పిలుపు ఇస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌గా అయ్యింది. దీంతో నెటిజన్లు ఆమె కళను చూసి ఫిదా అవుతున్నారు. (చదవండి: యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడి కన్నుమూత) (చదవండి: కెమెరామెన్ అమ్మతో చిట్టితల్లి.. ఏం చెప్పిందో వింటే ఫిదా అవుతారు) -
డైరెక్టర్ బతిమాలినా.. ఆ నటుడు వినలేదు!
సూపర్హీరోయిజం అనేది జస్ట్ ఒక ఎక్స్‌ఫ్యాక్టర్ మాత్రమే. బేసిక్ ఎమోషన్స్‌తో డీల్ చేయగలిగినప్పుడు మాత్రమే అది జనాలకు ఎక్కుతుంది. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ కనెక్టివిటీనే అందుకు ఒక ఎగ్జాంపుల్. మిన్నల్ మురళితో సక్సెస్ అందుకున్న దర్శకుడు బసిల్ జోసెఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు. టోవినో థామస్ లీడ్ రోల్లో తెరకెక్కిన సూపర్ హీరో మూవీ నెట్‌ఫ్లిక్స్ ‘మిన్నల్ మురళి’.. మాతృక మలయాళంతో పాటు డబ్బింగ్ వెర్షన్ ద్వారా తెలుగులోనూ ఆకట్టుకుంటోంది. మెరుపు దెబ్బకి సూపర్ పవర్స్ దక్కించుకున్న ఇద్దరి కథే ఈ చిత్రం. ఇందులో ప్రతీ క్యారెక్టర్ ఏదో ఒక రకంగా అలరించేదే. అయితే హీరో తర్వాత షిబు క్యారెక్టర్ జనాలకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ని, అదే టైంలో ఎమోషన్స్‌ని సైతం పంచుతుంది. మిన్నల్ మురళి చిత్రంలో షిబు క్యారెక్టర్ని పోషించింది నటుడు గురు సోమసుందరం. కోలీవుడ్ థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఈయన. ఒకవైపు ఎమోషన్స్‌తో పాటు నెగెటివ్ షేడ్స్‌ను అద్భుతంగా పండించాడు. అయితే ఈ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసే ముందు దర్శకుడు చేసిన ఓ రిక్వెస్ట్‌ను సున్నితంగా తిరస్కరించాడట ఆయన. వాకిన్ ఫినిక్స్ లీడ్రోల్లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘జోకర్’ చూసి.. ఆ తరహా మాడ్యులేషన్‌ను షిబు క్యారెక్టర్ కోసం డెవలప్ చేయమని గురు సోమసుందరానికి సూచించాడట డైరెక్టర్ బసిల్ జోసెఫ్. కానీ, గురు సోమసుందరం మాత్రం అందుకు కుదరదని తేల్చి చెప్పాడట. దీంతో బసిల్ బతిమాలడడం మొదలుపెట్టాడట. అయినా ఆయన నో అనే అనేశారట. వాకిన్ ఫినిక్స్ లాంటి నటుడంటే తనకు ఇష్టమేనని, కానీ, షిబూ క్యారెక్టర్ కోసం వెస్ట్రన్ యాక్టింగ్ టెక్నిక్‌ల ప్రభావం తనపై పడడం తనకు ఇష్టలేక ఆ పని చేయనని చెప్పానని షిబూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘థియేటర్ ఆర్టిస్టులకు శిక్షణలో ఒక విషయాన్ని నేర్పిస్తారు. సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది రీజియన్, ఇండియన్, వెస్ట్రన్ సినిమాగా విభజిస్తారు. దాని ప్రకారం ఇతర పాత్రల ప్రభావం.. తమ మీద ఉండకూడదని నటులు బలంగా ఫిక్స్ అవ్వాలి. కానీ, చాలామంది హీరోలు దీనికి భిన్నంగా.. హాలీవుడ్, ఇతర భాషల హీరోలను అనుకరిస్తారు. థియేటర్ ఆర్ట్ మీద నాకు అభిమానం ఎక్కువ. అందుకే నేను ఆ కండిషన్‌కు ఒప్పుకోలేదు. అయినా మా డైరెక్టర్ కన్విన్స్ అయ్యాడు’’ అని చెప్పుకొచ్చారు 46 ఏళ్ల గురు సోమసుందరం. మలయాళం రాకపోయినా బసిల్ తనకు షిబు క్యారెక్టర్ని ఆఫర్ చేసినప్పుడు ఆశ్చర్యపోయానని, కానీ, ఇప్పుడు షిబు క్యారెక్టర్ ద్వారా బాలీవుడ్ ఆఫర్లు సైతం వస్తున్నాయని సంతోషంగా చెప్తున్నారు గురు సోమసుందరం . కోలీవుడ్ మూవీ ‘ఆరణ్య కాండం’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన గురు సోమసుందరం.. పాండియ నాడు, జిగరతాండ, తూంగ వనం, పెట్టా, మారా, జై భీమ్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక మిన్నల్ మురళిలో తన చిన్ననాటి స్నేహితురాలు ఉష(నటి షెల్లీ కిషోర్) ప్రేమ కోసం పరితపించే భగ్న ప్రేమికుడిగా షిబు పాత్రలో అలరించాడాయన. -
సిద్దిపేటలో అందమైన కళాకృతులు
-
పాటతో అలరిస్తూ.. నటనతో మైమరిపిస్తూ..
సాక్షి, మఠంపల్లి (నల్లగొండ): మండల పరిధిలోని చౌటపల్లి గ్రామానికి చెందిన కొమ్ము బొందయ్య, ఎమీలియా దంపతులకు కుమారుడే సర్వయ్య. వీరిది నిరుపేద కు టుంబం. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచే సర్వయ్య పాటలు పాడుతూ గాన గంధర్వుడిగా పేరుగండించాడు. పాటలపై మక్కువ పెంచుకుని.. సర్వయ్య గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి వరకు విద్యనభ్యసించాడు. మూడో తరగతి చదువుతున్న రోజుల్లోనే సినిమా పాటలంటే మక్కు వ. ప్రముఖనేపథ్య గాయకుడు మహ్మద్ రఫీ ఆలపించిన ‘నా మది నిన్ను పిలిచింది గానమై’ అనే పాటను అచ్చుగుద్దినట్లు పాడి ఔరా అనిపించాడు. అప్పటినుంచి పాఠశాల స్థాయి పాటల పోటీల్లో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాడు. సంగీతంపై ఆసక్తితో.. సర్వయ్య ప్రాథమికోన్నత విద్యను గ్రామంలోనే పూర్తి చేసుకున్నాడు. తదనంతరం పదో తరగతి వరకు మండల కేంద్రంలోని వీవీహెచ్ఎస్లో అభ్యసించాడు. అయితే, సంగీతంపై ఉన్న ఆసక్తితో తల్లిదండ్రులను ఒప్పించి తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజనగరం జిల్లా కేంద్రంలోని మ్యూజిక్ కాలేజీలో చేరాడు. కాగా, కుటంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో మూడేళ్ల కోర్సును ఏడాది వరకే తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదువుతూనే గిటార్ నేర్చుకున్నాడు. చదువు ఖర్చుల నిమిత్తం బ్యాండ్ మేళంలో చేరి చుట్టుపక్కల నిర్వహించే శుభకార్యాలలో ప్రదర్శనలు ఇచ్చేవాడు. గానానికే పరిమితం కాకుండా.. సర్వయ్య కేవలం గానానికే పరిమితం కాకుండా నాటకాలపై దృష్టిసారించాడు. పౌరాణిక, సాంఘిక, జానపద నాటకాల్లో రాముడు, కృష్ణుడు, హరిచంద్రుడు, అర్జునుడు, బాలవర్తిరాజు తదితర పాత్రలను సత్యహరిశ్చంద్ర, శ్రీకష్ణరాయబారం, బాలనాగమ్మ, రామాంజనేయయుద్ధం, రక్తపిపాసి లాంటి నాటకాల్లో సైతం విజయవాడ, గన్నవరం, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా తెనాలిలో 2017లో సామ్రాట్ అశోక నాటకంలో అశోక చక్రవర్తిగా నటించి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. అంతేగా క తాను వివిధ పాత్రల్లో నటించి హైదరాబాద్‌లో డాక్టర్ అబ్దుల్‌కలాం అవార్డు, డా.బాలసుబ్రహ్మణ్యం అవార్డు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి కళాసమితి అవార్డులు దక్కించుకున్నాడు. ప్రభుత్వం పోత్సహించాలి ప్రభుత్వం గ్రామీణ కళాకారులను ఆదుకోవాలి. నైపుణ్యం ఉన్న కళాకారులను గుర్తించి ప్రోత్సహించాలి. వారికి తగిన సంగీత పరికరాలు అందజేస్తే ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి పొందుతారు. ముఖ్యంగా కాళాకారులకు పింఛన్ సౌకర్యం, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. పాటలు పాడటం,నాటకాలు వేయడమంటే ఎంతో ఇష్టం. జీవిత కాలం కళామతల్లి సేవలోనే పరితపిస్తా. – కొమ్ము సర్వయ్య, కళాకారుడు చౌటపల్లి చదవండి: గాడిద పాలకు మంచి డిమాండ్.. కప్పు పాల ధర ఎంతంటే.. -
బిగ్‌బాస్ నుంచి ఢీ 13 వరకు: తాండూరు మెరికలు.. బుల్లి తెరపై మెరుపులు
తాండూరుకు చెందిన యువ కళాకారులు బుల్లితెరపై తళుక్కున మెరుస్తున్నారు. ప్రఖ్యాత టెలివిజన్ షోలల్లో సత్తాచాటుతూ జిల్లాకు మంచి పేరు తెచ్చిపెడుతున్నారు. వీరిలో ఒకరు ఢీ– 13లో టైటిల్ సాధించగా, మరొకరు గతేడాది నిర్వహించిన బిగ్‌బాస్– 4లో టాప్– 5 ఫైనలిస్ట్ల్లో నిలిచారు. టాలెంట్ ఎవరి సొత్తూ కాదని ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు. తాండూరు టౌన్: పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన దువచర్ల మహేశ్– పద్మావతి దంపతుల కూతురు కావ్యశ్రీ ఇటీవల ముగిసిన ఢీ– 13 విన్నర్‌గా నిలిచింది. కావ్యశ్రీ తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి నలుగురు ఆడపిల్లలు. అమ్మాయిలు ఇంటికే పరిమితం కావాలనే ధోరణి నుంచి వారికి నచ్చిన రంగాల్లో రాణించేలా పిల్లలను ప్రోత్సహించారు. దీంతో కావ్యశ్రీ తనకిష్టమైన డ్యాన్స్‌ను ఎంచుకుంది. ప్రస్తుతం తాండూరులోని భాష్యం జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కావ్యశ్రీ ఓ శుభకార్యంలో చేసిన డ్యాన్స్‌ను చూసిన మాస్టర్ ఆమెకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఢీ షో కోసం సైడ్ డ్యాన్సర్‌గా చేరింది. మాస్టర్ పల్టీ రవి ఆధ్వర్యంలో అక్కడే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. 2015లో ఢీ– జూనియర్స్ సీజన్– 2లో గ్రూప్ డ్యాన్సర్‌గా చేసింది. తల్లిదండ్రులతో కావ్యశ్రీ అనంతరం ఢీ– 13లో కంటెస్టెంట్‌గా వైల్డ్‌కార్డు ఎంట్రీతో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి వెనుకడుగు వేయకుండా తన డ్యాన్స్‌లతో అదరగొట్టి, ఫినాలేలోకి అడుగు పెట్టింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమె ఈనెల 8వ తేదీన నిర్వహించిన ఢీ–13 ఫైనల్లో విన్నర్‌గా నిలిచింది. సినీ హీరో అల్లు అర్జున్ చేతుల మీదుగా టైటిల్‌తో పాటు ప్రైజ్ మనీ అందుకుంది. } ఢీ–13లో స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తున్న కావ్యశ్రీ మంచి కొరియోగ్రాఫర్ కావడమే లక్ష్యం చిన్ననాటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. అదృష్టవశాత్తు ఢీ– 13లో అవకాశం దక్కింది. నన్ను ప్రోత్సహించిన డైరెక్టర్ శ్రీకాంత్, మాస్టర్లు శ్రీను, రాముకు రుణపడి ఉంటా. ఫైనల్లోకి ప్రవేశించి.. టైటిల్ సాధించడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మంచి కొరియోగ్రాఫర్‌గా రాణించాలనేదే నా లక్ష్యం. – కావ్యశ్రీ, ఢీ– 13 టైటిల్ విన్నర్ బిగ్‌బాస్ షోలో అదరగొట్టిన అరియానా గతేడాది జరిగిన బిగ్‌బాస్– 4 రియాల్టీ షోలో తాండూరు అమ్మాయి అరియానా గ్లోరీ మెరిసింది. 105 రోజుల పాటు కొనసాగిన ఈ పోటీలో టాప్– 5 పోటీదారుల్లో నిలిచింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్ వరకు గట్టి పోటీ ఇచి్చంది. తాండూరు మండలం అంతారానికి చెందిన సత్యనారాయణ, శశికళ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. సత్యనారాయణ ఫొటోగ్రాఫర్ కాగా శశికళ నర్స్‌గా పనిచేసి రిటైరయ్యారు. వీరి చిన్న కూతురు అరియానా ఇంటర్ వరకు తాండూరులో అభ్యసించింది. కూకట్‌పల్లిలోని ప్రగతి కళాశాలలో డిగ్రీ చదివింది. తాండూరులో అభిమానులకు అభివాదం చేస్తున్న అరియానా (ఫైల్) అల్లు అర్జున్ చేతుల మీదుగా క్యాష్ ప్రైజ్ తీసుకుంటున్న కావ్యశ్రీ చిన్ననాటి నుంచి చురుకైన అమ్మాయిగా పేరున్న అరియానా తనలోని ప్రతిభను చాటిచెప్పాలనే లక్ష్యంతో హైదరాబాద్ చేరుకుంది. స్టూడియో వన్, జెమినీ కామెడీ, కెవ్వు కేక, జింగ్ జింగ్ అమేజింగ్ తదితర టీవీ షోలకు వ్యాఖ్యాతగా పనిచేసింది. తన కళాత్మక దృష్టిని యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయం చేసింది. ఈ క్రమంలో బిగ్‌బాస్– 4 నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. తొలిరోజు నుంచి తన చురుకైన∙ప్రదర్శనలతో టాప్ ఫైవ్ అభ్యర్థుల్లో నిలిచింది. బిగ్‌బాస్‌లో వచ్చిన ప్రైజ్‌మనీతో ఇల్లు కట్టుకోవడంతో పాటు గ్రామంలోని రైతులకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పడం విశేషం. ప్రస్తుతం టీవీ కార్యక్రమాలకు యాంకర్‌గా చేస్తున్న అరియానా మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిద్దాం. -
అదృష్టమంటే ఇది.. రూ.2250 కి కొంటే.. ఏకంగా 374 కోట్లపైనే!!
German Renaissance Artist Albrecht Dürer Painting: ఐదేళ్ల క్రితం అమెరికాలో హౌస్ క్లియరెన్స్ సేల్‌లో కేవలం 30 డాలర్ల (రూ. 2,250)కు కొన్న ఓ పెయింటింగ్ ఇప్పుడు వేల కోట్ల ధర పలుకుతోంది. ఈ పెయింటింగ్ 500 ఏళ్ల నాటి అద్భుత కళాఖండం మరి! దీనిని గీసిన చిత్రకారుడెవరో.. ఎందుకంత ధర పలుకుతోందో ఆ విశేషాలు మీ కోసం.. ఆల్బ్రెచ్ట్ డ్యూరర్ ఒక జర్మన్ చిత్రకారుడు. జర్మనీ పునరుజ్జీవనోద్యమ సమయంలో అతను ఐరోపా అంతటా బాగా పేరు పొందాడు. ముఖ్యంగా వుడ్‌కట్ ప్రింట్లకు ప్రసిద్ధి చెందిన ఆల్బ్రెచ్ట్ డ్యూరర్.. రాఫెల్, గియోవన్నీ బెల్లిని, లియోనార్డో డావిన్సీ వంటి కళాకారులతో సన్నిహితంగా ఉండేవాడు. అతని ‘ఫోర్ హార్స్‌మెన్ ఆఫ్ ది అపోకలిప్స్’ అనే పెయింటింగ్ ఆర్ట్ హిస్టరీలోనే గొప్పదిగా పేరుగాంచింది. ముఖ్యంగా ఇతను ఒక తల్లి, బిడ్డలను పసుపు నారపై వేసిన ఆర్ట్‌వర్క్.. ఆర్ట్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మోనోగ్రామ్‌లలో ఒకటిగా ఎంచబడుతోంది. మొత్తం మోనోగ్రామ్ డ్రాయింగ్‌ను ఒకేరకమైన సిరాతో వేయబడింది. కనీసం 200 షీట్లపై వాటర్‌మార్క్ కనిపించే కాగితంపై ఈ పెయింటింగ్ వేశాడా జర్మన్ చిత్రకారుడు. ఈ అరుదైన కళాఖండాన్ని ఇప్పుడు లండన్‌లోని ఆగ్‌న్యూస్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. స్మిత్సోనియన్ మ్యాగజైన్ కథనాల ప్రకారం.. ఈ చిత్రాన్ని అగ్‌న్యూస్ గ్యాలరీ విక్రయించాలని యోచిస్తోంది. అయితే స్థిరమైన ధర ఇంకా నిర్ణయించబడలేదు. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర 374 కోట్ల 33 లక్షలు పలకవచ్చని నిపుణుల అంచనా. చదవండి: డిసెంబర్ 12న మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహిస్తాం..! రద్దు చేయలేం..: పర్యాటక మంత్రి -
‘చెత్త’ అపార్ట్మెంట్ రికార్డు.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి నేనే!!
A room in New York City that contains 250 cubic yards of dirt worth a million dollars: ఆ అపార్ట్మెంట్ నిండా చెత్తే.. ఎక్కడ చూసిన దుమ్ము, ధూళే.. పైగా ఆ చెత్తను నాలుగు దశాబ్దాలుగా పరిరక్షిస్తున్నారు. పుట్టగొడుగులు, పురుగులు రాకుండా ప్రతిరోజూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదంతా వింటుంటే.. వెంటనే ఆ అపార్ట్మెంట్ ‘చెత్త’ కథ ఏంటో తెలుసుకోవాలని ఉంది కదూ! అసలు విషయం ఏంటంటే.. న్యూయార్క్‌కు చెందిన వాల్టర్ డి మారియా అనే వ్యక్తి 1977లో దుమ్ము, ధూళి ఉపయోగించి, ఓ అందమైన ఆర్ట్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే 250 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఓ అపార్ట్మెంట్ నిండా 140 టన్నుల దుమ్ము, ధూళి నింపాడు. తర్వాత వివిధ మార్పులు, చేర్పులు చేస్తూ.. చెత్తతో నింపిన అందమైన కళాకృతిని తయారు చేశాడు. దీనికి ‘న్యూయార్క్ ఎర్త్ రూమ్’గా పేరు పెట్టి, సందర్శకులను ఆహ్వానించాడు. మొదట్లో అందరూ అతన్ని పిచ్చివాడిగా భావించినా.. ఆ గదిని చూసి ఆశ్చర్యపోయారు. మానవ మనుగడ మొదలు కాకమునుపు ఉన్నటువంటి భూ ఉపరితలంగా ఆ గది కనిపిస్తుంది. చెట్టు చేమ.. పుట్ట పురుగు ఉండవు. ఒకరకంగా చెప్పాలంటే అక్కడ అడుగుపెడితే.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి మనమే అన్న అనుభూతి కలిగిస్తుంది. అయితే, ఆ అదృష్టం మనకు లేదు. సందర్శకులు కేవలం ఆ గదిని చూడవచ్చు, ఆ మట్టి వాసనను ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం పెరిగిపోతున్న సందర్శకుల ర ద్దీని నియంత్రించడానికి రోజులో ముందుగా బుక్‌చేసుకున్న వందమందికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. చదవండి: ఒకే కంపెనీలో 75 ఏళ్ల సర్వీస్... 90 ఏళ్ల వయసులో రిటైర్మెంట్..!! -
ఇత్తడి కళాకృతులకు కేంద్రంగా మారిన అజ్జరం
-
ఊహలకు అందని రూపాలు
టీ కప్పులు, మగ్‌లను అందమైన కళారూపాలుగా మార్చుతూ, ఫంక్షనల్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూ, మార్కెటింగ్ చేస్తూ, ఆర్ట్‌ప్రెన్యూర్‌గా మారింది శ్రీనియా చౌదరి. ఈ కళారూపం అంతగా సక్సెస్ కాదన్న వారి నోళ్లను మూయిస్తూ, ఛాలెంజ్‌గా తీసుకొని మరీ ఈ కళలో రాణిస్తోంది. ఢిల్లీలో సొంతంగా స్టూడియో ఏర్పాటు చేసుకోవడంతో పాటు తన కళారూపాలను వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఎవరి ఊహకూ అందని కళారూపాలు శ్రీనియా చేతుల్లో రూపుదిద్దుకుంటాయి. పదేళ్లుగా సిరామిక్ మెటీరియల్‌తో మగ్‌లను తయారుచేస్తూ, వాటినే అందమైన కళాఖండాలుగా తీర్చిదిద్దుతోంది. యూరప్‌లోని లాట్వియాలో సిరామిక్స్ బియన్నాలే, మార్క్ రోత్కో మ్యూజియంలలోనూ తన కళారూపాలు స్థానాన్ని పొందాయంటే శ్రీనియా కృషి, పట్టుదల ఎంత బలమైనవో ఇట్టే తెలిసిపోతాయి. సాధనమున సమకూరిన కళ స్వతహాగా చిత్రకారిణి అయిన శ్రీనియా ఈ కళలో రాణించడానికి మట్టిపైనే చిత్రాలు వేసేది. ఆ తర్వాత మట్టితో కళారూపాలు తయారుచేసి వాటిపైనే చిత్రీకరించేది. తన ప్రతి చిత్రంలోనూ సమాజం గురించిన ఆలోచనలు ప్రతిబింబిస్తాయి. ‘సెరామిక్స్‌తో రకరకాల కళాత్మక రూపాలను తయారుచేయడం అనేది శతాబ్దాలుగా ఉంది. కానీ, నేను ప్రత్యేకంగా ఎంచుకున్న మగ్గులతో డిజైన్లు, మగ్గులపై పెయింటింగ్.. ప్రజల్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని అనుసరించే నేను నా దైన సృజనను జోడించాను. అభ్యాసనకు మట్టితోనే కళారూపాలను తీర్చడంలో కొన్నాళ్లు నిమగ్నమయ్యాను. ఎంతోమందిని అవి ఆకట్టుకున్నాయి. వీటికున్న డిమాండ్‌ను బట్టి ఆర్ట్‌ప్రెన్యూర్‌గా మారాలనుకున్నాను. నెలల సమయం.. కోవిడ్ టైమ్‌లోనూ నా ఆలోచనా విధానాన్ని నలుగురితో పంచుకోవడానికి, శిక్షణ ఇవ్వడానికి వెబ్‌షాప్‌ను ప్రారంభించాను. కొన్ని వారాల పాటు వెబ్‌షాప్‌ను నిర్వహించాను. వ్యూవర్స్‌లో మంచి ఆసక్తి కనపడింది. కానీ, నిత్యసాధనతోనే ఈ కళలో రాణించగలరు. ఏ కాలమైనా సరే యంత్రంతో తయారుచేసిన వస్తువుకన్నా, పూర్తిగా చేతితో తయారుచేసిన వస్తువు ఖరీదు ఎక్కువ. అందుకే, సిరామిక్‌తో మగ్ తయారీ నుంచి వాటి రూపాల్లో మార్పులతో పాటు.. ఒక కళాఖండంగా తయారుచేయడానికి చాలా సమయం పడుతుంది. ముందుగా నేను అనుకున్న కళారూపం స్కెచ్ వేసుకుంటాను. అది సంతృప్తిగా అనిపించాక దానిని వాస్తవ రూపానికి తీసుకు రావడానికి నెలల సమయం పడుతుంది. ఒక్కో సమయంలో అయితే ఒక చిన్న పీస్‌ను మాత్రమే తయారు చేస్తుంటాను. ఒకదానితో మరోటి అస్సలు పోలికే ఉండదు. దేనికది ప్రత్యేకం. కానీ, అన్ని కళారూపాలకు మంచి డిమాండ్ ఉంది. ఆన్లైన్ వేదిక ద్వారా నా కళారూపాలను నేనే మార్కెటింగ్ చేస్తుంటాను. విదేశీయులు కూడా ఈ ఫంక్షనల్ ఆర్ట్‌ను బాగా ఇష్టపడుతున్నారు. వ్యాపారిగా మారినప్పటికీ ప్రతీ కళారూపాన్ని నేనే స్వయంగా సృష్టిస్తాను. ఎవరి సాయమూ తీసుకోను. అచ్చులు పోయడం అనేది నా ఆలోచనకు పూర్తి విరుద్ధం. అందుకే ప్రతీ కళాఖండం విభిన్నంగా ఉంటుంది’ అని వివరిస్తారు శ్రీనియా. -
ఆగిన ‘డప్పు’ చప్పుడు
డప్పు కళను ఎల్లలు దాటించిన కళాకారుడు.. చేతిలో ఢం ఢం మని మోగే శబ్దాన్నే తన గుండె చప్పుడుగా మార్చుకున్న ఘనుడు.. అట్టడుగున మగ్గిపోతున్న డప్పు విద్యకు కొత్త హంగులు అద్ది ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన విద్వాంసుడు.. స్వతహాగా ప్రదర్శనలివ్వడమే కాక, దేశ విదేశాల్లో అనేక మందికి తరీ్ఫదునిచ్చి ప్రోత్సహించిన కళాత్ముడు.. ఆ డప్పునకు ప్రాణ హితుడు.. డప్పునే తన ఇంటి పేరుగా మార్చుకున్న సూర్య భగవంతరావు ఇక లేరు. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో ఘంటసాల మండలం చిట్టూర్పు పంచాయతీ పరిధిలోని ఈపూరివానిగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘంటసాల(అవనిగడ్డ): డప్పు చప్పుడునే తన గుండె చప్పుడుగా మార్చుకున్న హంస అవార్డు గ్రహీత కుంపటి సూర్య భగవంతరావు(72) గుండె పోటుతో గురువారం తెల్లవారుజామున మరణించారు. ఘంటసాల మండలం చిట్టూర్పు పంచాయతీ పరిధిలోని ఈపూరివానిగూడెంకు చెందిన కుంపటి సూర్య భగవంతరావు (డప్పు భగవంతరావు) మరణ వార్త తెలుసుకున్న ప్రజా నాట్యమండలి బృందం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పార్టీ కండువా కప్పి ఘన నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే ఘంటసాల మండల, నియోజకవర్గ పరిధిలోని పలువురు కళాకారులు భగవంతరావు భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. డప్పు కళాకారుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని చిట్టూర్పు ఈపూరివానిగూడెంలోని ఆయన స్వగృహంలో ఉంచగా.. శుక్రవారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలియజేశారు. భగవంతరావుకు భార్య సువార్తమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇదీ ‘సూర్య’ ప్రస్థానం.. చిన్న నాటి నుంచే డప్పుపై ఆసక్తి పెంచుకొని ఆ వాయిద్యాన్ని నేర్చుకున్నారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా డప్పుపై ఉన్న మమకారంతో వివిధ శబ్దాలను పలికిస్తూ.. ఆ విద్యలో ఆరితేరారు. మూస పద్ధతిలో డప్పు వాయించడానికి స్వస్తి పలికి.. కొత్త రీతుల్లో ఆడుతూ, పాడుతూ డప్పు కొడుతూ భగవంతరావు క్రమక్రమంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ డప్పు శబ్దాన్ని వినాలని, ఆయన చేసే విన్యాసాలను చూడాలని ఆశించే ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోవడంతో భాషా, భావాలకు అతీతంగా భగవంతరావు ప్రదర్శనలకు వీక్షకులు హాజరయ్యేవారు. 15 ఏళ్ల పాటు ప్రజా నాట్యమండలిలో పని చేసిన భగవంతరావు ఉదయ్‌పూర్‌లో జరిగిన ఉత్సవాల్లో చేసిన ప్రదర్శన చూసిన ఫ్రాన్స్ దేశస్తులు.. వారి దేశానికి తీసుకెళ్లి ప్రదర్శన చేయించుకున్నారు. సినిమాలలో అవకాశం.. డప్పు కళలో ప్రావీణ్యం సాధించడంతో సినిమాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపు సన్నివేశాల్లో కూడా భగవంతరావు నటించారు. బ్రహ్మంగారి జీవిత చరిత్ర, నవయుగం, మరో క్విట్ ఇండియా, కూలన్న, వర్షం తదితర సినిమాల్లో తన ప్రతిభను కనబరిచారు. డప్పు కళ అధ్యాపకునిగా.. డప్పుకళను ప్రోత్సహించేందుకు జానపద కళల కింద ఒక కోర్సుగా ఉన్న డప్పు కళను అందరికీ తెలిసేలా చేశాడు. డప్పు కళ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టి సుమారు 32 ఏళ్లపాటు విద్యార్థులకు తరీ్ఫదునిచ్చారు. అంతేకాక గ్రామాల్లో వేలమందికి నేరి్పంచి సుమారు 20 వేల మంది డప్పు కళాకారులను తయారు చేశారు. సేవలకు గుర్తింపు.. డప్పు భగవంతరావు సేవలను గుర్తించిన నాటి ప్రభుత్వాలు 1992లో హంస అవార్డు, ధర్మనిధి పురస్కారం, 1998లో డప్పు జానపద రత్న, 1994లో డప్పు విద్వాన్, 1992లో డప్పు ప్రవీణ, 1991లో డప్పు విద్య ప్రవీణ అవార్డులతో సత్కరించాయి. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు, యూనివర్సిటీల వారు వందలాది అవార్డులను బహూకరించారు. -
అమేజింగ్ ఆర్ట్ .....ఒక చిత్రం ఎన్ని చిత్రాలుగా మారుతుందో!
ఇంటర్నెట్లో మనం ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు చూస్తుంటాం. అవి చాలా ఆసక్తి కరంగా పన్నీగానూ, నవ్వు వచ్చే విధంగానూ ఉంటాయి. కానీ ఈ వీడియో మాత్రం విస్మయానికి గురిచేసే విధంగానే కాకుండా ఒక ఆర్టిస్ట్ కళాత్మక దృష్టి కోణం అగుపడుతున్నట్లుగా ఎంతో చక్కగా, ఆసక్తికరంగా ఉంటుంది. అయితే మొదట మనకి ఒక అందమైన అమ్మాయి నెలపై కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నట్లు అనిపిస్తుంది. అంతలోనే ఆ అమ్మాయి మీద వేరే అమ్మాయి వచ్చి ఒక కర్చీఫ్ వేసేటప్పటికీ ఇంతలో కూర్చొని చదువుతున్న ఆ అమ్మాయి కాస్త చిత్రంగా మారిపోతుంది. (చదవండి: తింగరోడు.. లైవ్ టెలికాస్టింగ్‌లో ఫోన్ చోరీ! కట్ చేస్తే..) ఈ క్రమంలో ఈ అమ్మాయి ఆ చిత్రాన్ని చెరిపి దానిపైన అందంగా నవ్వుతూ కూర్చొంటుంది. మళ్లీ కాసేపటికి అదంతా చిత్రంగా మారిపోయి దాన్ని చిత్రిస్తున అదే అమ్మాయి ఆర్టిస్టుగా వీడియో చివర్లో కనిపిస్తుంది. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ఆర్టిస్టే తనను తానే అన్నిరకాలుగా చిత్రికరించి అద్భుతంగా రూపొందించడం విశేషం. ఇంతకీ ఆమె ఎవరంటే? అంతర్జాతీయ త్రీడీ పెయింటింగ్ కళాకారిణీ, వరల్డ్ రికార్డు గ్రహీత అయిన శిఖా శర్మ. తన 'ట్రిప్పింగ్' ప్రతిభతో చూపుర దృష్టిని మరల్చినివ్వని విధంగా అత్యంత అద్భుతంగా ప్రదర్శిస్తుంది. ఇది చదవడం కంటే చూడటానికి చాలా సరదాగా ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి వేలల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: అందుకే ఇంగ్లండ్ నుంచి వస్తున్నారు) View this post on Instagram A post shared by YouTube (@youtube) -
"కదిలే టాటుల అద్భుతమైన వీడియో
న్యూఢిల్లీ: ప్రస్తుతం యువతకు టాటులంటే ఎంత క్రేజ్ అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి చేతిపైన ఎక్కడొ ఒక చోట టాటు లేకుండా మాత్రం ఉండదు. ప్రతి ఒక్కరూ మంచి టాటు వేయించుకోవాలనే అనుకుంటారు. అదేవిధంగా ఆర్టిస్టు కూడా తన కస్టమర్‌కి మంచి టాటును ఇచ్చి తన నైపుణ్యన్ని ప్రదర్శించడం కోసం ఆరాటపడటం సహజం. కానీ ఇక్కడ ఒక టాటో ఆర్టిస్ట్ తన సృజనాత్మకతను మరోస్థాయికి తీసుకువెళ్లాడు. (చదవండి: ‘ఇలా అయితే ఢిల్లీ అంధకారంలోకే’) అతను చిత్రించిన 76 టాటులతో కదిలే టాటులకు సంబంధించిన అద్భుతమైన వీడియోను రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియోను టాటూ ఆర్టిస్ట్ ఫిల్ బెర్జ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 76 టాటూల గురించి వివరిస్తూ..ఒక క్యాప్షన్‌ని జోడించి పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నెటిజన్లు కళాకారుల సృజనాత్మకతను అందుకోలేం, అమేజింగ్ వీడియో అంటూ రకరకాలుగా టాటు ఆర్టిస్ట్‌ని ప్రశంసిస్తూ ట్విట్ చేస్తున్నారు. (చదవండి: షారుక్ ప్రకటనలు నిలిపేసిన ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్) -
AP: హరికథ కళాకారిణి రాధాబృందావని హఠాన్మరణం
తెనాలి: పట్టణానికి చెందిన ప్రముఖ హరికథా భాగవతారిణి, టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు హరికథకురాలు టి.రాధాబృందావని (58) మంగళవారం ఇక్కడి ఆర్ఆర్ నగర్‌లోని స్వగృహంలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రముఖ భాగవతార్ తిరువాయిపాటి రామారావు కుమార్తె రాధాబృందావని. ప్రముఖ మృదంగ విద్వాంసుడు తిరుపతి రామానుజ సూరి కుమారుడు తిరు వెంగళయ్య సూరి భార్య. తొలుత ప్రఖ్యాత హరికథా భాగవతార్ తెల్లాకుల వెంకటేశ్వర గుప్త వద్ద శిష్యరికం చేసినా, తర్వాత తండ్రి గురువుగా హరికథ సాధన చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో హరికథాగానం చేశారు. కుసుమ హరనాథ్ హరికథను గానం చేస్తున్న ఏకైక కళాకారిణిగానూ గుర్తింపు పొందారు. -
ఆమె చేయని మంచి పని లేదు, సేవా రంగం లేదు.. ఓ అలుపెరుగని సంచారి!!
ఆమెకు నిరంతరం ఏదో ఒకటి చేయాలనే ఉత్సాహం. ఉత్సాహంగా ఉంటేనే అలసట తెలియదంటారు. యువత కోసం కొత్తకొత్తగా ఆలోచిస్తుంటారు అన్నీ నలుగురికీ చెప్పాలనేదే ఆమె ఆకాంక్ష. చూసిన ప్రతిదీ రాస్తారు, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. ఒంటరిగానే ప్రయాణిస్తారు. సైకిల్ తొక్కాలి, కొండలు ఎక్కాలి అనే ఆలోచనతోనే ఉంటారు.. పాండమిక్ సమయంలోనూ ఎంతో ధైర్యంగా చురుగ్గా పనిచేశారు. యువతను ప్రోత్సహించడానికి గ్యాలరీ తెరిచారు. యువత జీవనానికి కావలసిన విషయాలు ప్రముఖులతో చెప్పిస్తున్నారు. హైదరాబాద్ లో నివసిస్తున్న భార్గవి నిరంతర సంచారి. ఆమె గురించి ఆమె మాటల్లోనే... మాస్టర్స్‌లో గోల్డ్ మెడల్ నేను పుట్టి పెరిగింది హైదరాబాదులోనే. బి.కామ్ వరకు చదువుకున్నాను. ఆ తరవాత వివాహం జరగడం, బాబు పుట్టడం, వాడు స్కూల్ కి వెళ్లటం... అన్నీ సామాన్యంగానే జరిగిపోయాయి. అప్పుడు నాకు ఆర్ట్ నేర్చుకోవాలని కోరిక కలిగింది. చిన్నప్పటి నుంచే నేను బొమ్మలు వేసేదాన్ని. ఏదో కారణంగా అప్పుడు నాకు ఆర్ట్ మీద దృష్టి పెట్టడానికి అవ్వలేదు. అబ్బాయి స్కూల్ కి వెళ్లాక నాకు చాలా సమయం దొరికేది. అప్పుడే నేను నా కలను నిజం చేసుకోవాలనుకున్నాను. నాన్నగారి స్నేహితుడి ప్రోద్బలంతో ఆర్ట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీకి అప్లయి చేశాను. నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తి చేశాను. డిగ్రీ చదివేటప్పుడు నాతో ఉన్నవారంతా చిన్నపిల్లలు. వాళ్లందరూ మధ్యతరగతివాళ్లు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు. అప్పటికే వాళ్లు వేసిన పెయింటింగ్స్ తీసుకుని డబ్బులు ఇచ్చేదాన్ని. ఊరికే డబ్బులు ఇస్తే వాళ్లకి డబ్బు విలువ తెలియదని ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కొంటూ వాళ్లని ప్రోత్సహించాను. మాస్టర్స్ కోసం సెంట్రల్ యూనివర్సిటీ కి అప్లయి చేసి, జాయిన్ అయ్యాను. గోల్డ్ మెడల్ సాధించాను. మాస్టర్స్ కోర్సు పూర్తయ్యాక కలకత్తా, బరోడా ప్రాంతాలకు వెళ్లాను. ప్రింట్ మేకింగ్ నేను కాలేజీ నుంచి బయటకు వచ్చాక ప్రింట్‌మేకింగ్ స్టూడియో పెట్టాలనుకుంటున్నారు. అప్పటికి హైదరాబాద్‌లో ఆ తరహా స్టూడియో లేదు. నా స్పెషాలిటీ కూడా ప్రింట్మేకింగ్లోనే. ఈ స్టూడియోకి పెద్ద మెషినరీ కావాలి. పెయింటింగ్‌కి కావలసిన రంగులు, జింక్ ప్లేట్లు ఉపయోగించి, పేపర్ మీద ప్రింట్ తీస్తాం. ఈ స్టూడియో నడపడానికి చదువుకున్నవారు చాలామంది కావాలి. నాతో చదువుకున్న వారినే కొందరిని ఇందులోకి తీసుకోవాలనుకున్నాను. ఫైనల్ డిస్ప్లే (ఫైనల్ ఇయర్) కి బరోడా, శాంతినికేతన్లాంటి ప్లేసెస్‌కి వెళ్లేదాన్ని. అక్కడ టీచర్ స్టూడెంట్ పద్ధతి లేదు. గురుకులంలాగ ఉంటుంది. సాయంత్రం దాకా క్లాసెస్ జరుగుతాయి. ఆ తరవాత బడ్డీకొట్టు దగ్గర కూర్చుని ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల గురించి, అన్ని విషయాలు ఒకరితో ఒకరు పంచుకుంటారు. హైదరాబాద్‌లో ఇటువంటి వాతావరణం లేదు. పిల్లలకు టీచర్ అంటే భయం. టీచరే అన్ని విషయాలు చెప్తారు. బరోడా ఒక ఆర్ట్ హబ్ భారతదేశంలో బ్యాచిలర్స్ డిగ్రీ అవ్వగానే బరోడాలో మాస్టర్స్ చేస్తారు. బరోడాలో చాలా స్టూడియోలు, గ్యాలరీలు ఉన్నాయి. ఒక్కో గది ఒక్కో ఆర్టిస్టుకి ఇస్తారు. 20 మంది ఒకచోట కూర్చుని పనిచేసుకునే అవకాశాలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ అలాంటిది లేదు. అటువంటి స్టూడియో ఇక్కడి విద్యార్థుల కోసం ప్రారంభించాలనుకున్నాను. 2014లో ది ఆర్ట్ స్పేస్ అని ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించాను. బాలమురళి, సినారె ప్రారంభోత్సవం చేశారు. థి అనేది సంస్కృత పదం. ఈ పదానికి చాలా అర్థాలున్నాయి. ఈ స్టూడియోలో లైబ్రరీ, పెయింటింగ్ గ్యాలరీ కూడా ప్రారంభించాను. యువతకు ఎవ్వరూ అవకాశాలకు ఇవ్వట్లేదు. ఆ అవకాశం నేను ఇచ్చి వాళ్లని ప్రోత్సహించాలనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకు క్రియేటివ్‌గా ఉన్న యువతను ప్రమోట్ చేస్తూనే ఉన్నాను. అంతర్జాతీయంగా కూడా ఫొటోగ్రఫీ, పెయింటింగ్, స్కల్ప్చర్ అన్నీ చేస్తున్నాను. మంచి విషయాలు ప్రతి సంవత్సరం యువతకు మంచి విషయాలు తెలిసేలా నాలుగు ప్రదర్శనలు చేస్తున్నాం. మోడరన్ ఆర్ట్, కాంటెంపరరీ ఆర్ట్.. అన్నీ చేస్తున్నాం. యువత చాలా బాగా వేసిన పెయింటింగ్స్ కొన్నాను. ఇప్పుడు వాళ్లు అంతర్జాతీయ స్థాయికి చేరారు. వాళ్ల పెయింటింగ్స్‌కి ఇప్పుడు లక్షల రూపాయలు వస్తాయి. పెయింటింగ్స్‌కి క్యూరేటర్ కోర్సు పెట్టి వారిని ప్రోత్సహిస్తున్నాను. బార్గవి చేయని మంచి పని లేదు, చేయని సేవా రంగం లేదు. ఎంతోమందికి భార్గవి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిరంతర ప్రయాణాలు ►వైయస్సార్ యూనిర్సిటీ అడ్వయిజరీ బోర్డు మెంబర్ ►ఎన్జీవో సేవలు ►ఆదిలాబాద్ గిరిజనులు, అంధులు, వృద్ధులకు కావలసిన సేవలు ►గ్రామాన్నిదత్తతు చేసుకుని, బాగుచేయటం ►వ్యవసాయానికి భూమి క్లియర్ చేయటం కరోనా సమయంలో.. ►బోనాలు వంటి మన సంప్రదాయం గురించి మనకు తెలీదు. నిపుణులతో వాటి గురించి ఆన్ లైన్ లో చెప్పించటం. ►ఫౌండేషన్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ (ఫేస్) తరఫున గ్రాంట్స్ ఇవ్వడం ►ఆన్లైన్లో ఎటికేట్ నేర్పటం ►కాలేజీలో నేర్పని విషయాలు బియాండ్ క్లాస్‌రూమ్‌లో నేర్పించటం ►కళాకారులకు ఉండవలసిన క్రమశిక్షణ గురించి నేర్పించటం ►పర్మనెంట్ రెసిడెన్సీకి ఎలా అప్లయి చేయాలి, అక్కడికి వెళితే ఎలా ఉండాలి, ఆర్టిస్టు క్యూరేట్ చేసి ఎలా గుర్తింపు తెచ్చుకోవాలి, ఫౌండేషన్ గ్రాంట్స్ ఎలా తెచ్చుకోవాలి వంటి విషయాల గురించి అవగాహన కల్పించటం ►చరిత్రకారులను పిలిపించి మాట్లాడించటం జ్ఞానాన్ని పంచటం... ఆర్టిస్టులు దేనిని ఎలా నేర్చుకుంటారోననే అంశం మీద ఆధారపడి, కొందరిని సెలక్ట్ చేసుకుని, వారికి ఉచిత తరగతులు (అమౌంట్ ఇస్తాం) నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ గురించి చాలామందికి తెలియని ఎన్నోఉన్నతమైన విషయాలు... అంటే హైదరాబాద్‌లోని దిగుడు బావులు, వైల్డ్ లైఫ్, రాయల్ లైఫ్, చార్మినార్, బేకరీలు, ఆర్జిజాన్లు, గ్లిట్టరింగ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, అత్తరు, ప్రీ మిడీవల్ ... ఇలా ఎన్నో విషయాలను వారికి తెలియచేసే తరగతులు నిర్వహిస్తున్నాం. పఠాన్‌చెరు అతి పురాతన ప్రదేశమని, అది ఒకప్పుడు వ్యాపార కేంద్రమని, కొలోనియల్ టైమ్ పీరియడ్ నాటి ప్రదేశమని, ఉర్దూ భాష మాట్లాడేవారని, అప్పటి జనజీవనం, సింగాడా కాయల గురించి (వాటర్ చెస్ట్నట్) ... ఇలా హైదరాబాద్ గురించినవన్నీ చెప్పాం. సంభాషణ: వైజయంతి పురాణపండ చదవండి: జలియన్‌వాలాబాగ్ దురంతం: ఒక జాతి ఆత్మను తాకిన తూటా.. -
మా స్నేహానికి రేంజ్ అడ్డు కాదు!
ఒకరితో స్నేహం చేయడం అంటే ఓకే. ఇద్దరు ముగ్గురు స్నేహితులున్నా ఓకే. అభిప్రాయభేదాలు ఉన్నా సర్దుకుపోవచ్చు. కానీ పదమూడు మంది స్నేహితులంటే సర్దుబాట్లు చాలా ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘చిత్రం’ శ్రీను, ‘సత్యం’ రాజేశ్, తాగుబోతు రమేశ్, ధన్‌రాజ్, సప్తగిరి, సత్య, ప్రవీణ్, వేణు, నవీన్ నేని, నందు, రఘు... వీరంతా మంచి స్నేహితులు. స్నేహానికి విలువ ఇచ్చే ఈ 13 మంది ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇచ్చుకుంటూ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆ స్నేహబంధం గురించి అడిగిన ‘సాక్షి’తో నటుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పిన విశేషాలు. ►మా పదమూడు మందికి ఒక వాట్సప్ గ్రూప్ ఉంది. పేరు ‘ఫ్లయింగ్ కలర్స్’. మేమంతా ఆర్టిస్టులుగా రంగుల ప్రపంచంలో ఉంటాం కాబట్టి, ఒక మంచి క్యారెక్టర్ చేసినప్పుడు ఫ్లై అవుతుంటాం కాబట్టి మా గ్రూప్‌కి ‘ఫ్లయింగ్ కలర్స్’ అని పెట్టుకున్నాం. ►మా గ్రూపులో ఉన్నవారందరం ఒకరికొకరం పరుగెత్తి పోటీపడే ఆర్టిస్టులమే. అయినా కానీ అదంతా ప్రొఫెషనల్ లైఫ్. ఫ్రెండ్షిప్ విషయంలో రేంజ్‌ని పట్టించుకోం. పోటీని దూరంగా ఉంచుతాం. ‘వెన్నెల’ కిశోర్ అయినా ఒకటే.. నవీన్, శ్రీనివాస్ రెడ్డి అయినా ఒకటే. అందరం సరదాగా ఒకరికొకరం అన్నట్లుగా ఉంటాం. ►అవకాశాల పరంగా ఎవరికి వారిమే అన్నట్లు ఉంటాం. ఒకరికొకరు చాన్సులు చెప్పుకునే అవసరం ఉండదు. గ్రూప్‌లో ఇలాంటి విషయాలను కలపం. మా గ్రూప్‌లోని సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా మీట్ అవుతుంటాం. ముఖ్యంగా ఏవైనా పండగలు, శుభకార్యాలప్పుడు కలుస్తుంటాం. ►మేం తీసిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత మరో సినిమా అనుకున్నాం. కానీ ఆర్టిస్టులుగా మేమందరం బిజీగా ఉన్నాం. అయితే మళ్లీ ఓ సినిమా ప్లాన్ చేసే అవకాశం ఉంది. ►ఏదైనా ఒకటి రెండు సందర్భాల్లో మాటా మాటా అనుకున్నా, ఆ తర్వాత ఎవరికి వారు కంట్రోల్ కాగలిగినవాళ్లమే. సో... మా మధ్య పెద్దగా సమస్యలు రాలేదు. అందరూ సరదాగా ఉంటాం. రిలాక్సేషన్ కోసం ఫన్నీ కౌంటర్స్ వేస్తుంటాం. ∙మాలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటాం. అలాగే మేం అందరం కలిసి కోవిడ్ టైమ్‌లో కొందరికి హెల్ప్ చేశాం. ►మామూలుగా నెలకోసారి కలవడం మా అలవాటు. అప్పుడు డ్రెస్ కోడ్ అనుకుంటాం. ఉదాహరణకు చిల్డ్రన్స్ డే అంటే స్కూల్ డ్రెస్సులు, పండగలప్పుడు అందుకు తగ్గ డ్రెస్సులు. కరోనా వల్ల మా మీటింగ్స్ కట్ అయ్యాయి. ఈ ఫ్రెండ్షిప్ డేకి కలుద్దామనుకున్నాం కానీ కరోనా టైమ్ కాబట్టి వద్దనుకున్నాం. -
యూఏఈ గోల్డెన్ వీసా.. మన ఆర్టిస్ట్‌కు!
న్యూఢిల్లీ: ఒడిషాకు చెందిన ఆర్టిస్ట్ మోనా విశ్వరూప మోహంతీకి అరుదైన అవకాశం దక్కింది. యూఏఈ ప్రభుత్వం అందిస్తున్న గోల్డెన్ వీసా ఆమెకి దక్కింది. గోల్డెన్ వీసా ప్రకారం.. ఎవరైనా సరే పదేళ్లపాటు అక్కడ నిరభ్యరంతంగా ఉండొచ్చు. అంతేకాదు వీసా దానికదే రెన్యువల్ అవుతూ ఉంటుంది. కళలు, క్రియేటివిటీ పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ ప్రభుత్వం ఈ వీసా అందిస్తుంది. ఈ వీసా వల్ల అక్కడ ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా ఉండొచ్చు, పని చేసుకోవచ్చు, చదువుకునే అవకాశం కూడా ఉంటుంది. పైగా స్వదేశం నుంచి ఎలాంటి స్పాన్సర్షిప్ అక్కర్లేదు. అంతేకాదు అక్కడ చేసుకునే వ్యాపారాలకు వంద శాతం హక్కులు ఉంటాయి. కాగా, యూఏఈ 2019 నుంచి కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఐదు నుంచి పదేళ్ల మధ్య గోల్డెన్ వీసా ఇస్తారు. ఇది ఆటోమేటిక్‌గా రెన్యువల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ ఘనత దక్కించుకున్న తొలి ఒడిషా పర్సన్‌గా మోనా విశ్వరూప నిలిచింది. మయూర్భంజ్ జిల్లా పుట్టిన ఆమె 2007 నుంచి దుబాయ్‌లో ఉంటోంది. ఫ్యాషన్ కెరీర్‌ను వదిలేసుకుని.. డిజైన్ ఇండస్రీ్టలో ఎనిమిదేళ్లుగా పని చేస్తోంది. దుబాయ్ ఎకనామిక్ డిపార్ట్మెంట్లో ఆమె సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రర్ చేసుకుంది. కాగా, తనకు దక్కిన గౌరవంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ.. భారత సంప్రదాయాలకు మరింత గుర్తింపు కోసం ప్రయత్నిస్తానని చెబుతోంది. -
ఆర్టిస్ట్ అరెస్ట్: పోలీసులు చెప్పిన కారణం వింటే షాక్..
ఇస్లామాబాద్: అప్పుడప్పుడు పోలీసులు చేసే పనులు చూస్తే.. ఆశ్చర్యం, అసహనం వంటి ఫీలింగ్స్ అన్ని ఒకేసారి వ్యక్తం అవుతాయి. ఎందుకంటే వింత వింత కారణాలు చెప్పి సామాన్యులను అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుంటారు పోలీసులు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి పాకిస్తాన్లో వెలుగు చూసింది. తెల్లవారుజామున రోడ్డు మీద రిక్షా కోసం వెయిట్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వారు చెప్పిన కారణం వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే. సదరు వ్యక్తి జుట్టు పొడవుగా పెంచుకున్నందుకు అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఈ సంఘటనపై నెటిజనులు ఆగ్రహం వ్యక్త చేస్తునారు. ఆ వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన ఆర్టిస్ట్, టీచర్, ప్రదర్శనకారుడైన అబుజర్ మధు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కల్మా చాక్ ప్రాంతంలో రిక్షా ఎదురు చూస్తున్నాడు. పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అబుజర్ని గమనించి అతడి వద్దకు వచ్చి వివరాలు ఆరా తీశారు. ఈ సమయంలో ఇక్కడ ఎందుకున్నావని ప్రశ్నించారు. ఆ తర్వాత అతడి ఐడీ కార్డ్ చూపించమని కోరారు. అబుజర్ తన ఐడెంటిటీ కార్డ్ పోలీసులుకు చూపించాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని వ్యాన్‌లో ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా అబుజర్ జైలులోనే గడిపాడు. తనను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించగా.. అతడు జుట్టు పెద్దగా పెంచుకున్నాడని.. అందుకే అరెస్ట్ చేశామని తెలిపారు పోలీసులు. వారు చెప్పిన సమాధానం విన్న అబుజర్కు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. ఈ సంఘటన గురించి అబుజర్ స్నేహితురాలు, పిల్లల హక్కుల న్యాయవాది నటాషా జావేద్ ట్వీట్ చేయడంతో దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ పోలీసులు ఇలా ప్రవర్తించడం కొత్తేం కాదని.. గతంలో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలో అబుజర్ మాట్లాడుతూ.. ‘నేను ఐడీ కార్డ్ చూపించినప్పటికి పోలీసులు నమ్మలేదు. నన్ను పూర్తిగా చెక్ చేశారు. ఇక రాత్రంతా జైలులోనే ఉంచారు. నాలాగే జుట్టు పెంచుకుని కార్లలో తిరిగే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారా’ అని ప్రశ్నించాడు. Last weekend, my friend Abuzar was picked up by Punjab Police in Lahore. He had to spend a night in Model town police station, in a lock up. Reason: his long hair. A thread — Natasha Javed (@natashajaved1) June 7, 2021 ఈ సంఘటనపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు దీనిపై స్పందించారు. ‘‘అబుజర్ వేషధారణ కాస్త అనుమానాస్పాదంగా ఉంది. అతడు తన పొడవాటి జుట్టును ముడి పెట్టుకుని.. చేతికి ఓ కంకణం ధరించి ఉన్నాడు. పైగా తెల్లవారుజామున ఇలా రోడ్డు మీద ఉండటంతో అనుమానం వచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లాం’’ అని తెలిపారు. చదవండి: భారత్‌పై మరోసారి విషం కక్కిన పాక్.. కారణం తెలిస్తే షాక్ కోసి కుట్లేయడమే కదా అనుకున్నాడు.. మహిళ మృతి -
కళాకారుడు, ఈ అదృశ్య శిల్పం కాస్ట్ ఎంతో తెలుసా?!
ఇక్కడ కనిపిస్తున్న శిల్పం ఖరీదు రూ. 13 లక్షలు. ఏంటీ వేళాకోళమా? లేనిది ఉన్నట్టు ఊహించుకోవాలా? అని కన్నెర్ర చేయకండి. నిజమే ఇక్కడ శిల్పం లేదు. అలాగని వేళాకోళమూ కాదు. ఎందుకంటే అది అదృశ్య శిల్పం! ఇటలీకి చెందిన సాల్వటోర్ గారౌ 150 సెం.మీ వెడల్పు, 150 సెం.మీ పొడవు ఉండే ఓ రాతిని ‘నేను’ అనే శిల్పంగా అభివర్ణించాడు. దేవుడికి రూపం లేన ట్లుగానే మనిషికి, అతని నిజమైన స్వభావానికీ రూపం ఉండదనే భావనతో దానిని రూపొందించాడు. అందుకే ఇదొక అదృశ్య శిల్పం. దీనిని ఓ ప్రత్యేక గదిలో నిర్దిష్ట వాతవరణంలో భద్రపరుస్తారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ శిల్పాన్ని ఓ వ్యక్తి పదమూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు కూడా. ఇదంతా వింటుంటే గతంలో 86 లక్షల రూపాయల విలువ చేసిన ‘గోడ మీద టేపుతో అతికించిన అరటిపండు’ కళాకృతి కంటే క్రేజీగా ఉంది కదూ! -
సోనూసూద్: ఓ ఇంట్రస్టింగ్ వీడియో
సాక్షి,హైదారాబాద్: వలస కార్మికులు,పిల్లలు పెద్దలు ఇలా కరోనా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నవ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే..ఎవరికైనా మదిలో మెదిలో ఒకే ఒక్క పేరు నిస్సందేహంగా సోనూ సూద్. తన విశేష సేవలతో రిలయ్ హీరోగా ప్రశంసంలందుకుంటున్న సోనూసూద్‌కు అనేకమంది అనేక రకాలుగా తమ కృతజ్ఞతలు తెలిపారు. ముంబైలోని ఆయన నివాసానికి వెళ్లి తమ సంతోషాన్ని పంచు కుంటున్నారు. తాజాగా ఒక ఆర్టిస్టు వీడియో ఒకటి ఆసక్తికరంగా నిలిచింది. కోవిడ్ వారియర్‌గా సోనూసూద్ అందిస్తున్న సేవలకు ట్రిబ్యూట్‌గా పుచ్చకాయతో సోనూసూద్ చిత్రాన్ని అందంగా తీర్చి దిద్దారు ఆర్టిస్ట్ పర్వేష్. ఇటీవల ఒక డ్యాన్స్ రియాలిటీ షోకు అతిథిగా హాజరైన సోను ఒక కంటెస్టెంట్ ఉదయ్ సింగ్ షేర్ చేసిన అంశాలపై కదిలిపోయారు. లాక్డౌన్ కాలంలో మధ్యప్రదేశ్లోనిఇ నీముచ్ గ్రామస్తులు పడుతున్న కష్టాలపై ఉదయ్ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో వెంటనే స్పందించిన సోనూ ఒక నెల, రెండు నెలలు లేదా ఆరు నెలలు ఎన్నాళ్లు లాక్డౌన్ కొనసాగినా, తిరిగి మామూలు పరిస్థితులు వచ్చేంతవరకూ గ్రామం మొత్తానికి రేషన్ అందించేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సోనూ వాయిస్ బ్యాక్ గ్రౌండ్‌తో సాగే ఈ విడియో ప్రస్తుతం నెటిజనులను ఆకట్టుకుంటోంది. కాగా కరోనా మహమ్మారి, జాతీయ లాక్డౌన్లో సొంతూళ్లకు పయనమైన వలస కార్మికుల వెతలతో చలించిపోయిన సోనూ సూద్ నేనున్నానటూ రంగంలోకి దిగారు. అది మొదలు ఎడతెరిపి లేకుండా బాధితులకు అండగా నిలుస్తునే ఉన్నారు. ముఖ్యంగా సెకండ్‌వేవ్‌లో మందులు కొరత, ఆక్సిజన్ కొరతతో ఊపిరి ఆడక అల్లాడిపోతున్నవారిని ఆదుకునేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు. సోనూ సూద్ ఫౌండేషన్ ద్వారా నిర్మాణాత్మక కార్యక్రమాలతో వేలాదిమందికి అండగా నిలుస్తూ నిరంతాయంగా సేవలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్ Tell us you are @SonuSood fan without telling us you are a Sonu Sood fan? we’re all thankful to all the Covid Warriors and here’s a small tribute to him. ❤️🙏 .@SoodFoundation .#sonusood #sonusood_a_real_hero #sonusoodfoundation #sonusoodfans pic.twitter.com/VmXi1mEUbW — Artistparvesh (@parveshkumarart) June 5, 2021 -
కనిపించని కళాఖండం తయారు చేసి జాక్‌పాట్ కొట్టేశాడు
బ్రసిలియా: ఇటలీకి చెందిన 67 ఏళ్ల సాల్వటోర్ గారౌ కంటికి కనిపించని కళాఖండం తయారు చేశాడు. ఆ కళాఖండం వేలానికి వేయగా అది 15వేల యూరోలకు( ఇండియన్ కరెన్సీలో రూ.13 లక్షలు) అమ్ముడుపోయింది. అలా సాల్వటోర్ కనిపించని కళాఖండంతో జాక్‌పాట్ కొట్టేశాడు. కానీ సాల్వటోర్‌కు ఆ జాక్‌పాట్ దాని వల్ల రాలేదు.. అతని మాటల వల్ల వచ్చింది. విషయంలోకి వెళితే.. సాల్వటోర్ స్వతహాగా మంచి శిల్పి. అతను తయారు చేసే వాటిలో పైకి ఏం కనిపించకపోయినా దానిలో ఒక పరమార్థం ఉంటుంది. తాజాగా అతను ''ఐయామ్'' అనే పేరిట కనిపించని ఒక కళాఖండాన్ని తయారు చేశాడు. కానీ అతను దానిని ప్రదర్శనకు ఉంచినప్పుడు అతను ఏం చూపెట్టాడో అక్కడ ఉన్నవాళ్లకు అర్థం కాలేదు. కాగా సాల్వటోర్ అతను తయారు చేసిన శిల్పం గురించి వివరించాడు. ''నిజానికి నేను అమ్మింది ఒక శూన్యం మాత్రమే.. అంటే ఖాళీదని అర్థం. ప్రపంచంలోని ఏ వస్తువుకు బరువు ఉండదు. నేను చూపించే ఈ వాక్యూమ్‌లోనూ గాలి తప్ప ఇంక ఏం ఉండదు. హైసెన్బర్గ్ సూత్రం ప్రకారం వాక్యూమ్ శక్తితో నిండిన వేగం తప్ప మరొకటి కాదని తెలుసుకున్నా. నా దృష్టి నుంచి చూస్తే విషయం మీకే అర్థమవుతుంది. ఉదాహరణకు మనం నమ్మే దేవుడికి రూపం ఉండడం మీరు గమనించారా.. ఇది అంతే నేను చెక్కిన ఈ శిల్పంలోనూ ఒక రూపం ఉంది. మనసు పెట్టి చూడండి.'' అని చెప్పుకొచ్చాడు. అతను చెప్పిన మాటలకు ఇంప్రెస్ అయిన నిర్వాహకులు అతని శిల్పాన్ని 15వేల యూరోలకు కొన్నారు.కానీ దీనిని టెస్టిఫై చేయాల్సి ఉంటుందని సదరు నిర్వాహకులు సాల్వటోర్‌కు తెలిపారు. చదవండి: 12 అడుగుల భారీ తిమింగళం.. బీచ్ వద్దకు ఎవరు రావొద్దు -
డబుల్ హ్యాపీ: కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వృద్ధ కళాకారులకు ఇచ్చే పెన్షన్‌ను ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఈ మేరకు, గతంలో ఇస్తున్న రూ. 1,500 పెన్షన్‌ను రూ. 3,016కు పెంచుతూ సాంస్కృతిక వ్యవహారాల శాఖ కార్యదర్శి కె.శ్రీనివాసరాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపు ఉత్తర్వులు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వృద్ధ కళాకారుల అర్హత, సమగ్ర సమాచారాన్ని వెరిఫై చేసి పంపాలని సూచించారు. సీఎంకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు కళాకారుల వృద్ధాప్య పెన్షన్లను పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెంచిన వృద్ధాప్య పెన్షన్ల వల్ల రాష్ట్రంలోని 2,661 మంది వృద్ధ కళాకారులకు ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సాహితీవేత్తలు, కళాకారులంటే ఎంతో గౌరవం ఉన్న నాయకుడు కావడం వల్లే పెన్షన్‌ను పెంచి కళాకారుల వికాసం కోసం కృషి చేశారని కొనియాడారు. -
Artist Gopi: గూడు వీడిన గిజిగాడు
మణికొండలో ఆర్టిస్ట్ కడలి సురేష్ ఉండేవారు. ఒక మధ్యాహ్నం నేను అక్కడికి వెళ్ళాను. ఆయన ఇంటి నిండా నిలువెత్తు కేన్వాసులు, దొంతరలుగా పెయిం టింగులు, బొత్తులుగా ఇంకు డ్రాయింగులు, ఫ్రేము లుగా రామాయణం బొమ్మల సిరీస్‌లు. అన్నీ అద్భు తాలే. నేను దొంగ కంట మరో బొమ్మ చూస్తున్నా, టీవీ వెనుక గూట్లో తొంభైల నాటి టేబుల్ క్యాలెండర్ ఒకటి. ప్రతి షీట్ మీద అర చేయంత కొలతలో ముద్రితమైన బొమ్మలు. గోపీ అనే పేరంత సింపుల్ లైన్ బొమ్మలు. పెన్సిల్ పట్టి వంద ఎవరెస్ట్ శిఖరాలు కొలిచినంత సాధన చేస్తే మాత్రమే అబ్బగల బొమ్మలు. సురేష్ గారి వేలాది బొమ్మలని వదిలి ఆ మూల నిలబడి ఉన్న ఆ క్యాలెండర్ నాకు ఇవ్వమని అడగడానికి నాకు ఇబ్బంది అడ్డువచ్చింది. అడిగినా కావలిస్తే నా బొమ్మలు అన్నీ పట్టుకెళ్ళండి, గోపి గారిని మాత్రం వదిలి’ అనేవారు సురేష్ గారు. గోపీ చిత్రకారులకే చిత్రకారుడు. ఆయన గురించి మహాను‘బాపు’ తమదైన పొదుపైన మాట లతో ఇలా అన్నారు. ‘నాకున్న ఇంకో గురువు గారు గోపి–ఆయన బొమ్మలెప్పుడు చైతన్యంతో తొణికిస లాడుతూ వుంటాయి’. ఆయన ఇమాజినేషన్ కూడా అంత డైనమిక్‌గా ఉంటుంది–గిజిగాడు అనే పక్షి ఉంది. దాని గూడు మిగతావాటిలా ఉండదు. అదొక ఇంజనీరింగ్ ఫీట్! పకడ్బందీగా–కొమ్మకు వేలాడుతూ–అంతస్తులు–కిందా పైనా గదులు కలిగి వుండేట్లు అల్లుతుంది. ఇంజనీర్ల కన్వెన్షన్ సావనీరు పుస్తకానికి ముఖచిత్రం కావలిస్తే, గోపి దానికి ముఖ చిత్రంగా గిజిగాడు బొమ్మవేసి వూరుకున్నారు. భగవంతుని సృష్టి ఇంజనీర్లు ప్రతిసృష్టి చేస్తారు అన్నది ఆయన భావన. అదీ ఇమాజినేషన్ అంటే, అదీ గోపీ అంటే! అనగనగా రోజుల్లో సాహిత్యం–చిత్రకళ పచ్చగా ఉన్న కాలంలో ప్రతి పత్రిక బాపు బొమ్మలతో సింగా రించుకునేది. ఒక కన్ను చేతనున్న కుంచె వైపు, మరో కన్ను కెమెరా వంక ఆయన చూస్తున్న కాలంలో ఆయన బొమ్మలకై పడిగాపులు కాచే వరుసలో ఉన్న పబ్లిషర్లు, సంపాదకులు, రచయితలు ‘మీరు కాక పోతే మరో చిత్రకారుడి పేరు చెప్పండి’ అంటే బాపు పలికిన ఏకవచనం గోపి అనే బొమ్మల సంతకమే! గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్ కాలపు మనిషి గోపి. తెలుగు రచనల గోడలన్నీ బాపుబొమ్మల అలంకరణతో, అనుకరణతో నిండిపోయిన పత్రికల రోజులని గోపి అనే కొత్త సంతకం వచ్చి కథల బొమ్మలకి, కవర్ పేజీల డ్రాయింగులకి కొత్త వరుసలు చూపించింది. రేఖ చేసే విన్యాసంలో కానీ, రంగులు అద్దిన మార్గంలో కానీ, మనుషులు నిలబడిన భంగి మలు, పాఠకుడు బొమ్మను చూసిన కోణాలను అన్ని టిని ఆయన డైనమిక్ టచ్‌తో మార్చేశారు. మెల కువలో ఉన్న ప్రతి క్షణం ఆయన చేతిలో స్కెచ్‌బుక్ ఉండేది. కనపడిన ప్రతీది బొమ్మగా మలి చేవారు. చూసిన సినిమాల్లో సన్నివేశాలు గుర్తు పెట్టు కుని వచ్చి ఆ యుద్ధ పోరాటాలు, పోరాటాల వంటి తెలుగు డ్యూయెట్ డ్యాన్సులు, మనిషి వెనుక మనిషి, మనిషి పక్కన మనిషి అనే ఫ్రేములు అన్నీ బొమ్మలుగా నింపేవారు. ఆయన బొమ్మల పిచ్చికి, ఆ అభ్యాసానికి కాగితాలు, నోటు పుస్తకాలు, చివరికి ఇంటి తెల్ల గోడలు కూడా నల్ల పడిపోయి ఇక గీయటానికి మరేం దొరక్క పలక మీద గీయటం, చెర పటం, మళ్ళీ గీయటం... బొమ్మలు ఇష్టపడ్డం వేరు, దానిని జీవితాంతం ఆరాధించడం వేరు–బొమ్మలని జీవనోపాధిగా చేసు కోడం వేరు. గోపిగారే కాదు, చాలామంది చిత్ర కారులు చిత్రకళని బ్రతుకుతెరువుగా నమ్ముకుని ఎంత మోసపోవాలో అంత మోసపోయారు. ఇది మోసమని తెలిసిపోయేసరికి మంచి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని బొమ్మలు కబళించేశాయి. బొమ్మలు తెచ్చిపెట్టిన డబ్బు లేకపోవడం వలన ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. యవ్వనం–ఆరోగ్యం సహక రించినంత కాలం జీవితాన్ని లాగుకుంటూ వచ్చారు. అవి కరువయిన రోజున నేనున్నా అని కరోనా వచ్చి ఆయనని కమ్మేసింది. చివరికి మిగిలింది ఏమిటి? ఆయన చేత కదం తొక్కిన కుంచె రాల్చిన బొమ్మలు, ఆ కాగితాలు నశించి పోయాయి. ఆయన బొమ్మల జ్ఞాపకాల మనుషుల తరం మాసిపోయింది. ఇంకు వాసన, క్రొక్విల్ చప్పుడులు తెలిసిన జ్ఞానేంద్రియాలు పనిచేయడం మానేసి చాలా కాలమే అయింది. కరోనా వలన కుదరదు గానీ, ఆయన భౌతిక దేహం వద్ద కూచుని చెవి దగ్గర ‘మళ్ళీ జన్మంటూ ఉంటే ఆర్టిస్ట్ గానే పుడతారా గోపీ గారు?’ అని అడిగితే ప్రాణం లేని ఆ తల ‘ఊహు’ అని అడ్డంగా ఊపడానికైనా కాస్త ప్రాణం కచ్చితంగా తెచ్చుకునేదే. – అన్వర్ -
‘రాజావారు రాణిగారు’ ఫేం స్నేహ మాధురి శర్మ క్యూట్ ఫోటోలు
-
ఆ రూ.450 కోట్లు వాళ్ల కోసమే!
ప్రార్థించే పెదవులకన్నా..సాయం చేసే చేతులు మిన్న అనే వాక్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు 44 ఏళ్ల బ్రిటీష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ. కరోనా వైరస్ ప్రభావానికి తీవ్రంగా దెబ్బతిన్న చిన్నారులకు ఏదోరకంగా సాయం చేయాలనుకున్న జాఫ్రీ తనకు తెలిసిన విద్యతో కోట్లు సంపాదించి సామాజిక సేవచేస్తున్నాడు. గత ఏడాది కరోనా కాలంలో జాఫ్రీ వేసిన ‘జర్నీ ఆఫ్ హ్యుమానిటీ’ అనే పెయింటింగ్ తాజాగా దుబాయ్‌లో జరిగిన వేలంలో ఏకంగా 62 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. మన రూపాయలలో దీని విలువ రూ.450 కోట్లకుపై మాటే. జాఫ్రీ ఈ మొత్తాన్నీ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాడు.జాఫ్రీ ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్‌ను 70 భాగాలుగా వేసాడు. ఈ భాగాలను విడివిడిగా విక్రయించి 30 మిలియన్ డాలర్లను కూడబెట్టి చిన్నారులకు సాయం చేయాలనుకున్నాడు. కానీ ఫ్రెంచ్ క్రిఫ్టో కరెన్సీ వ్యాపారవేత్త ఆండ్రీ అబ్దున్ మొత్తం పెయింటింగ్‌కు రెట్టింపు డబ్బులు ఇస్తాననడంతో పెయింటింగ్ రూ.450 కోట్లకు విక్రయించాడు. జాఫ్రీ ఈ మొత్తాన్నీ దుబాయ్ కేర్స్, యూనిసెఫ్, యునెస్కో, గ్లోబల్ గిఫ్ట్ట్ ఫౌండేషన్ వంటి సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నాడు. కరోనా కాలంలో ఎంతోమంది రోడ్డున పడ్డారు. తినడానకి తిండిలేక, ఉండడానికి ఇల్లు లేక ఎంతో మంది చిన్నారులు నానా అవస్థలు పడడం చూసి చలించిన జాఫ్రీ వారికి ఎలాగైనా సాయం చేయాలనుకున్నాడు. ఈక్రమంలోనే పెద్ద పెయింటింగ్ వేసి కనీసం 30 మిలియన్ డాలర్లు సంపాదించి చిన్నారులకు విరాళంగా ఇవ్వాలనుకున్నాడు. అతిపెద్ద పెయింటింగ్ వేసేందుకు చిన్నారుల నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకుని..‘‘కరోనా కాలంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో తెలిపే విధంగా ఆర్ట్ వర్క్స్‌ను నాకు పంపండి’’ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులను జాఫ్రీ కోరాడు. జాఫ్రీ సందేశానికి స్పందించిన 140 దేశాల్లోని చిన్నారులు ఆన్లైన్ ద్వారా తమ ఆర్ట్‌వర్క్‌ను పంపించారు. అప్పుడు దుబాయ్‌లోని అట్లాంటిస్ హోమ్ హోటల్లో జాఫ్రీ సుమారు ఏడు నెలలపాటు రోజుకు 20గంటలపాటు కష్టపడి చిన్నారులు పంపిన చిత్రాలను జతచేస్తూ గతేడాది సెప్టెంబరులో పెయింటింగ్‌ను పూర్తిచేశాడు. 17 వేల చదరపు అడుగుల ‘జర్నీ ఆఫ్ హ్యూమానిటీ’ పెయింటింగ్ ప్రపంచంలోనే అతి పెద్ద కాన్వాస్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తించడం తో ఈపెయింటింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్‌గా నిలిచింది. ఇది నాలుగు ఎన్బీఏ బాస్కెట్ బాల్ కోర్టుల పరిమాణానికి సమానం. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్‌ను దక్కించుకున్న అబ్దున్ మాట్లాడుతూ..‘‘నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. తినడానికి తిండిలేనప్పుడు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఎన్నోసార్లు ఆ పరిస్థితులను నేను ప్రత్యక్షంగా అనుభవించాను. పెయింటింగ్ విక్రయించడం ద్వారా వచ్చే డబ్బులు ఎంతో మంది చిన్నారుల ఆకలి తీరుస్తాయి. అందుకే రెట్టింపు ధరతో పెయింటింగ్‌ను సొంతం చేసుకున్నాను’’ అని ఆయన చెప్పారు. -
అద్భుతం: గుండుసూదిపై ఫ్లెమింగో
సాక్షి, యలమంచిలి రూరల్ (విశాఖపట్నం): ఏటికొప్పాక హస్తకళాకారుడు మరో అద్భుత కళాఖండం ఆవిష్కరించారు. ఏటికొప్పాక గ్రామానికి చెందిన ఎస్.చిన్నయాచారి గుండుసూదిపై ఫ్లెమింగో పక్షి బొమ్మను రూపొందించారు. దీన్ని తయారు చేసేందుకు రాగి తీగలు, చెక్క ఉపయోగించి మూడు రోజులపాటు శ్రమించినట్లు ఆయన వివరించారు. పొడవు 4.80, వెడల్పు 1.75 ఎంఎం సైజులో తయారు చేసిన పక్షి రూపాన్ని పుటాకార దర్పణంతో వీక్షించేలా తయారు చేశారు. వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా దీన్ని రూపొందించినట్లు ఆయన వివరించారు. ఏటికొప్పాక కళాకారులు చిన్నయాచారిని అభినందించారు. చదవండి: బట్టతల బెంగా.. పరిష్కారాలు ఇవిగో..! -
ఆ కుంచె.. సౌందర్యం చిలికించే..
తెల్లని ఖద్దరు పంచె, అదే రంగు లాల్చీ, చేతికో గడియారం కూడా లేని అతి సామాన్యుడు తెలుగు చిత్రకళా రంగంలో అసమాన్యుడు ! ఆయనవి పిల్లి కళ్ళు, నిశీధి కూడా నిశీతంగా చూసే డేగ కళ్ళు అవి ఆయన చూపు ఓ రంగుల చిత్రం ఆయన దృష్టి ఓ అద్భుత సృష్టి ఆయన పొట్టిగా ఉన్నా గీసిన గట్టి చిత్రాలు ఎన్నో ఆయన నిరాడంబరుడే కానీ ఆయన చిత్రాల్లో నాయకి, నాయకులంతా ఆడంబరులే. ఆయన చిత్రకళా యోగే కాదు, భోగి కూడా ఆయన వాస్తవం కంటే – ఊహల్లో ఎక్కువ జీవిస్తారు. ఆయనకు పగలే రాత్రి, రాత్రే పగలు. ఆయనకు పగలు విశ్రాంతి –నిశీధి నిశ్శబ్దంలో కళాసాధన. ఆయన జీవికకు సరిపడా ‘సిరి ’లేని, కళా శ్రీమంతుడు. ఆయన ఎవరికీ అభిమాని కాదు కానీ, ఆయనకు లక్షల్లో కళాభిమానులున్నారు. ఆయన చిత్రాలు తెలుగు సంస్కృతిక ప్రతీకలు. అవి అభిమానులకు రసగుల్లాలు ! అభిమానుల గుండెల్లో అమరుడు..ఆయనే కళాభిమానుల వడ్డాది పాపయ్య.. శ్రీకాకుళంలో పుట్టి, మద్రాసులో మెరిసి, కశింకోటలో కన్నుమూశారు. బుధవారం 28వ వర్ధంతితోపాటు శత జయంతి ఉత్సవాలను చిత్ర కళాభిమానులు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిభా పాఠవాలను అవలోకిస్తే... సాక్షి, కశింకోట (అనకాపల్లి): తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన కళను స్వయం కృషితో సాధన చేసి మహా చిత్రకారుడు కావచ్చునని వడ్డాది పాపయ్య నిరూపించారు. చిత్ర కళా జగత్తును మకుటం లేని మహారాజులా నాలుగు దశాబ్దాల పాటు ఏలారు. ఆయన 1992 డిసెంబర్ 30న కశింకోటలోని పావని నిలయంలో తనువు చాలించారు. వ.పా.గా వినుతికెక్కిన వడ్డాది పాపయ్య 1921 సెపెంబర్ 10న శ్రీకాకుళంలో మధ్య తరగతికి చెందిన వడ్డెర కుటుంబంలో జన్మించారు. అత్త వారి గ్రామమైన కశింకోటలో స్థిరపడ్డారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ఐదో ఏట నుంచే చిత్ర కళకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి రామ్మూర్తికి చిత్రకళలో ప్రవేశం ఉంది. ఆయన చిత్రాలు గీస్తున్నప్పుడు దగ్గర ఉండి చిత్రకళలో మెళకువలను తెలుసుకొని అభ్యసించి స్వయం కృషితో సాధన చేశారు. ఐదవ ఏటనే ఆంజనేయస్వామి చిత్రాన్ని మొదటిసారిగా గాశారంటే అతిశయోక్తి కాదు. పాపయ్య కుంచె పట్టిన తొలి నాళ్లలో ప్రముఖ చిత్రకారులు రాజా రవివర్మ, దురంధర్ల ప్రభావం ఉండేది. తర్వాత కాలంలో తనదైన శైలిలో ‘వ.పా. శైలి అనితర సాధ్యం’ అనే రీతిలో ఇతరులెవరూ అనుకరించడానికి అవకాశం లేని విధంగా చిత్రాలే గీసేవారు. చిత్ర కళా ప్రియుల హృదయాలను దోచుకున్నారు. వ.పా.కుంచె నుంచి జాలువారేది చిత్ర కళ కాదు సాక్షాత్తూ మహిళా సౌందర్య స్వరూపమే. పత్రికా ప్రపంచానికి వ.పా.గా సుపరిచితుడైన పాపయ్య అనేక మాస, వార పత్రికలకు ముఖ చిత్రాలను గీశారు. చందమామ, ఆంధ్రజ్యోతి, భారతి, రేరాణి, అభిసారిక, యువ, స్వాతి వంటి పలు మాస, వార పత్రికలకు ముఖ చిత్రాలను గీశారు. ఆయన గీసిన చిత్రాలు పత్రికల్లో ప్రచురితం అయి తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆయన గీసిన చిత్రాల కోసమే కొన్ని పత్రికలు అమ్ముడయ్యేవంటే అతిశయోక్తి కాదు. పాపయ్యకు సంగీతం అంటే ప్రత్యేక అభిమానం. ఎన్నో రాగాలకు సంబంధించిన చిత్రాలను గీయడం ఇందుకు నిదర్శనం. నవ రసాల్లో శృంగారానికి ఇచ్చిన ప్రాధాన్యం మరే రసానికి ఇవ్వలేదు. శృంగార పరమైన గ్రామీణ మహిళల చిత్రాలు గీసి యువతను రస డోలలో గిలిగింతలు పెట్టారు. కళా దేవులపల్లి, పోతన, శ్రీశ్రీల సాహిత్యమంటే ఆయన అభిమానించేవారు. పాపయ్య చిత్రకారుడే కాదు మంచి రచయిత, ఫొటోగ్రాఫర్ కూడా. పొగడ్తలంటే గిట్టేవి కాదు. ఇంటర్వ్యూలన్నా, కళా ప్రదర్శనలన్నా ఆమడ దూరంలో ఉండేవారు. ఎవరైనా కళను గౌరవించాలిగాని వ్యక్తులను కాదని అభిప్రాయపడేవారు. పాపయ్య ఎక్కువగా నీలి రంగు చిత్రాల పట్లే మక్కువ చూపేవారు. తైల వర్ణాల కంటే నీలి రంగు చిత్రాలు అయితే అనుకున్న ఫలితాలు సాధించడమే కాకుండా సత్వరమే చిత్రాలను పూర్తి చేయవచ్చునని అభిప్రాయపడేవారు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు వర్ణ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుగా వెలుగొందిన వ.పా. నిరాడంబర జీవితాన్ని సాగించి ఇక్కడ తనువు చాలించారు. ఆయన చిత్రాలతో వ.పా. ఆర్ట్సు గ్యాలరీని ప్రదర్శనకు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళాభిమానులు కోరుతున్నారు. అలాగే వ.పా. జన్మించి వందేళ్లు అవుతున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలను నిర్వహించి ఆయన ప్రతిభా పాటవాలను నేటి తరానికి తెలిసే విధంగా చాటాలని, ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళాభిమానులు కోరుతున్నారు. -
ఆధునిక చిత్రకళలో ఒకే ఒక్కడు
పుట్టినప్పుడు కదలకుండా ఉంటే, మృతశిశువు పుట్టాడనుకుని వదిలేసింది నర్సు. బతికే ఉన్నట్లు మేనమామ గుర్తించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. బాల్యంలో అతణ్ణి చూసిన వారెవరూ ఊహించని విధంగా తొంభై ఏళ్లకు పైబడిన నిండు జీవితం గడిపాడు. ఆధునిక చిత్రకళా చరిత్రనే మలుపు తిప్పాడు. అతడే పికాసో! ఆధునిక చిత్రకళలో ఒకే ఒక్కడు. పికాసో ప్రస్థానంలో కొన్ని సంగతులు మీ కోసం... మాటలు నేర్చుకునే వయసులో పిల్లలెవరైనా ‘అమ్మా’ అనో, ‘నాన్న’ అనో పలకడానికి ప్రయత్నిస్తారు. పికాసో అందరిలాంటి వాడు కాదు. అతడి నోటి నుంచి వెలువడిన తొలి పదం ‘లాపిస్’. స్పానిష్ భాషలో ‘లాపిస్’ అంటే ‘పెన్సిల్’ అని అర్థం. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు, నోట మాట పుట్టగానే పరిమళించిన చిత్రకారుడు పికాసో. స్పెయిన్‌లోని మలగా పట్టణంలో 1881 అక్టోబర్ 25న పుట్టాడు పికాసో. అందరికీ అతని పేరు పాబ్లో పికాసో అనే తెలుసు. నిజానికి అతని పూర్తి పేరు చాలా పొడవాటిది. ఇరవైమూడు పదాలతో కూడిన అతడి పేరులో సుప్రసిద్ధ మతపెద్దలు, బంధువుల పేర్లన్నీ ఉన్నాయి. పికాసో తండ్రి డాన్ జోస్ రూయిజ్ బ్లాస్కో కూడా చిత్రకారుడే. ఏడేళ్ల వయసులోనే కొడుకుకు కుంచెప్రాశన చేశాడు. ఇక అప్పటి నుంచి జీవితాంతం రంగులను, కుంచెలను వదల్లేదు పికాసో. తొమ్మిదేళ్ల పసితనంలోనే తొలి కళాఖండం ‘లె పికాడర్’ను చిత్రించాడు. పికాసోకు పదమూడేళ్లు రాగానే అతడి తండ్రి కుంచె విరమణ చేసేశాడు. తనకంటే తన కొడుకే బాగా బొమ్మలు గీస్తున్నాడనే నమ్మకం కలగడమే అందుకు కారణం. అదే వయసులో పికాసో ‘స్కూల్ ఆఫ్ ఫైనార్ట్స్’ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో వారం రోజుల్లోనే ఉత్తీర్ణత సాధించాడు. ఆ పరీక్షలో నెగ్గాలంటే అప్పట్లో చాలామంది విద్యార్థులకు నెల్లాళ్లకు పైనే పట్టేది. అప్పట్లో అదొక రికార్డు. పికాసో గీసిన తొలి రూపచిత్రం ‘ఫస్ట్ కమ్యూనియన్’. దీనిని అతడు తన పదిహేనేళ్ల వయసులో చిత్రించాడు. పికాసో గీసిన వాటిలో ‘గయెర్నికా’ ప్రపంచవ్యాప్తంగాపేరుపొందింది. స్పానిష్ సివిల్ వార్ సమయంలో గయెర్నికా పట్టణంపై నాజీ సేనలు బాంబు దాడి జరిపినప్పుడు, ఆ దాడిలో జరిగిన విధ్వంసానికి చలించిపోయి చిత్రించిన భారీ చిత్రం అది.. పికాసో చిత్రకారుడు, శిల్పిగానే ప్రసిద్ధి పొందినా, అతడు బహుముఖ ప్రజ్ఞశాలి. పికాసో మంచి కవి, రంగస్థల అలంకరణ నిపుణుడు, నాటక రచయిత, సైద్ధాంతికంగా సామ్యవాది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు హిట్లర్ నేతృత్వంలోని నాజీ సర్కారు తన చిత్రాలపై నిషేధం విధించినా, ఏమాత్రం తొణకని ధీశాలి. నిండు జీవితం గడిపిన పికాసో, 1973 ఏప్రిల్ 8న ఫ్రాన్స్‌లోని మోగిన్స్ పట్టణంలో తన తొంభై ఒకటో ఏట కన్నుమూశాడు. -
ముగిసిన చందమామ శకం
పిల్లలుగా ఉన్నప్పుడు ఇంట్లో తాతయ్యో, బామ్మో/అమ్మమ్మో ఇతర పెద్దలో పిల్లలకు పురాణాలలోని కథలు వాళ్ళకు తెలిసినంతవరకూ చెబుతూ ఉంటే ఆయా పురాణ పాత్రలు ఎలా ఉంటాయో ఎలా తెలుస్తుంది? ఎవరి ఊహల్లో వాళ్ళు అనుకోవటం తప్ప వేరే అవకాశం లేదు. కానీ, చందమామలో శంకర్ గారి బొమ్మలు చూస్తూ పెరిగిన బాలలకు పురాణ పాత్రలను ఊహించుకోవలసిన కష్టం లేదు. చదివిన పది వాక్యాల కంటే, ఒక బొమ్మ విషయాన్ని పిల్లలకు అద్భుతంగా చెబుతుంది. తాను బొమ్మలు వేస్తున్నది, పిల్లలకోసం అని ఎంతో శ్రద్ధాసక్తులతో ఆ బొమ్మలు వేసేవారు. కథ చదివిన తక్షణం ఆయా పాత్రల వివరాలు చక్కగా తెలిసిపోయేవి. పురాణాల పాత్రలను పిల్లలకే కాదు పెద్దలకు కూడా కళ్ళకు కట్టిన ఘనత ఒకే వ్యక్తిది. ఆ వ్యక్తే మనందరకూ సుపరిచితమైన శంకర్‌గారు. చందమామలో వచ్చిన రామాయణం, మహా భారతం సీరియల్స్‌కి వేసిన బొమ్మలతో పౌరాణిక పాత్రలకు దివ్యత్వం కలిగించిన గొప్ప ఆర్టిస్టు శంకర్గారని అప్పట్లోనే కొడవటిగంటి కుటుంబ రావుగారు చెప్పారు. రాజకుమార్తెల నిసర్గ సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రించిన శంకర్‌గారు రాక్షస పాత్రలను కూడా అంతే సుందరంగా చిత్రించారు. ఉదాహరణకు రామాయణంలో కుంభకర్ణుడు, ఇంద్రజిత్, రావణుడు పాత్రలు మచ్చుకు మాత్రమే. చందమామలో చేరింది మొదలుకుని 2012 చివరి వరకు దాదాపు 60ఏళ్లు పాటు చిత్రాలు గీస్తూనే వచ్చిన మాన్య చిత్రకారుడు శంకర్‌గారు. ఆయన వేసిన బొమ్మలు అన్నీ ఒక ఎత్తు ఐతే, బేతాళ కథలకు శీర్షిక బొమ్మగా వేసిన బొమ్మ ఒక ఎత్తు. ఆయన వేసిన ఒక బొమ్మ ప్రపంచ ప్రసిధ్ధి పొందింది. అదే బేతాళ కథలకు ప్రత్యేక శీర్షిక బొమ్మగా విక్రమార్కుడు చేతిలో కరవాలం భుజాన శవాన్ని మోసుకుంటూ వెడుతూ ఉంటే, శవంలోని బేతాళుడు కథ చెప్పటం మొదలుపెడతాడు. నాకు తెలిసి తెలుగు పత్రికా చరిత్రలో అతి ఎక్కువకాలం ధారావాహికగా కొనసాగిన శీర్షిక చందమామలో బేతాళ కథలే. చందమామలో చివరివరకూ ఆయన వేసిన బేతాళ బొమ్మనే కొనసాగించారు.కథలోని వివరాలే కాక, పిల్లలకు ఆ పాత్ర లక్షణాలు తెలియటానికి అనేక ఇతర వివరాలు కూడా చొప్పించేవారు. దాంతో ఆయన బొమ్మలతో కథలకు పరిపూర్ణత్వం వచ్చేది. అంతేకాక, బొమ్మలు చక్కగా చెక్కినట్టు, రూప లావణ్య విశేషాలతో ఉండటం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆయన జానపద కథలకు వేసిన బొమ్మల్లో అలనాటి కట్టడాలు, అప్పటివారి దుస్తులు, వాడుకలో ఉన్న అనేక పరికరాలు పాత్రలు వగైరా ఎంతో శ్రద్ధగా చిత్రీకరించేవారు. నిజానికి శంకర్‌గారు వేసిన పురాణ సంబంధిత బొమ్మల్లో ఆయన చిత్రీకరించిన భవనాలు, ఆభరణాలు వంటివి నాటి తెలుగు పౌరాణిక సినిమాలలో వేసిన సెట్టింగ్‌లకు ప్రేరణ అంటే అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, పిల్లలకు పురాణాలు, పురాణ గాథలు దగ్గిర చేయటంలో, శంకర్ గారి చిత్రాలు ఎంతగానో తోడ్పడ్డాయి. శంకర్ గారి మరణంతో అలనాటి పిల్లలు తమ నేస్తాన్ని కోల్పోయారు. వారికి మోక్ష ప్రాప్తి కలుగుగాక. మంగళవారం కన్నుమూసిన శంకర్‌గారి వయస్సు 97 సంవత్సరాలు, తన అసలు పేరు కరథొలువు చంద్రశేఖరన్ శివశంకరన్. చందమామ చిత్రకారుడిగా శంకర్‌గా పరిచయం. ఆయన 1924, జూలై 24న ఈరోడ్‌లోని ఓ గ్రామంలో జన్మించారు. 12వ తరగతి పూర్తయ్యాక, మదరాసులోని ఆర్ట్స్ కాలేజీలో చేరి తనకు స్వతహాగా అబ్బిన బొమ్మలు వేసే శక్తిని ఇనుమడింపచేసుకున్నారు. మొదటి ఉద్యోగం 1946లో కళైమాగళ్ అనే పత్రికలో. తరువాత 1952లో చందమామలో చిత్రకారునిగా చేరి, చివరివరకూ చందమామలోనే బొమ్మలు వేశారు. చివరిక్షణాల్లోనూ, చందమామలో తాను వేసిన బొమ్మలనే తలచుకుంటూ ఆ బెంగతోనే ఆయన మరణించారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కె. శివరామప్రసాద్ వ్యాసకర్త రిటైర్డ్ మేనేజర్, కెనరా బ్యాంక్ మొబైల్ : 91676 03720 -
సాక్షి ఆర్టిస్ట్ రమేష్ కన్నుమూత
సాక్షి, తిరుపతి: సాక్షి దినపత్రిక తిరుపతి ఎడిషన్‌లో డిప్యూటీ చీఫ్ ఆర్టిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కాట్పాడి రమేష్ (53) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటంతో గత నెల18న ఆయన తిరుపతిలోని పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి కరోనా సోకినట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి అక్కడే ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం తీవ్రమైన అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, రమేష్ కుటుంబ సభ్యులకు రూ.లక్ష సాయం చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు. -
తెలుగువారి శకుని
‘మాయాబజార్’ షూటింగ్ జరుగుతోంది. ‘సత్యపీఠం’ మీద నిలబడి శకునిగా సి.ఎస్.ఆర్ డైలాగులు చెప్పాలి. ‘టేక్’ అన్నారు దర్శకుడు కె.వి.రెడ్డి. సి.ఎస్.ఆర్. సత్యపీఠం ఎక్కారు. అంతవరకూ పాండవుల మీద ఎన్ని కుత్సితాలు పన్నారో సత్యపీఠం మహిమ వల్ల బయటకు కక్కారు. షాట్ అద్భుతంగా వచ్చింది. కె.వి.రెడ్డి గారు ‘పాస్’ అన్నారు. సమాంతరంగా తమిళ వెర్షన్ షాట్ తీయాలి. తమిళంలో ఆ పాత్ర వేస్తున్నది ప్రఖ్యాత నటుడు నంబియార్. టేక్ అన్నారు కె.వి.రెడ్డి. నంబియార్ టేక్ తిన్నారు. టేక్ అన్నారు కె.వి.రెడ్డి. నంబియార్ మళ్లీ టేక్ తిన్నారు. ఐదారు టేకులు అయ్యాయి. ఫిల్మ్ వేస్టవుతోంది. కె.వి.రెడ్డి గారు నంబియార్ దగ్గరకు వెళ్లి మెత్తగా ‘మీరేదో పెద్ద నటులంటే తీసుకున్నాం. మా సి.ఎస్.ఆర్‌ను చూడండి. ఎలా డైలాగ్ చెప్పాడో’ అన్నారు. నంబియార్ తల వొంచుకున్నారు. నంబియార్నే ఏముంది... తాను సీన్లో ఉంటే మరొకరు తనను మించి తల ఎత్తలేనంత ప్రతిభ చూపిన తెలుగువారి అచ్చనటుడు సి.ఎస్.ఆర్ అను ‘చిలకలపూడి సీతా రామాంజనేయులు’. ఒక రకంగా ఆయన ఎన్.టి.ఆర్కు అగ్రజుడి వంటివారు. రంగస్థలం మీద స్థానం నరసింహారావు సత్యభామ వేస్తే సి.ఎస్.ఆర్ శ్రీకృష్ణుడు వేసేవారు. పి.పుల్లయ్య ‘శ్రీవేంకటేశ్వరుని మహాత్యS్మం’ తీస్తే వేంకటేశ్వరస్వామిగా మొదటిసారి ఆయనే ఆ ఇలవేల్పు వేషం కట్టారు. ఎన్.టి.ఆర్ రానంత వరకూ తెలుగువారి శ్రీకృష్ణుడు, తుకారాం, రామదాసు అన్నీ సి.ఎస్.ఆరే. కాని చిద్విలాసం చూడండి. ఏ కృష్ణుడిగా అయితే తాను ఫేమస్ అయ్యారో అదే కృష్ణుడి వేషంతో ఫేమస్ కాబోతున్న ఎన్.టి.ఆర్ పక్కన శకునిగా ‘మాయాబజార్’లో నటించారు. 1940లలో తెలుగు టాకీలు పుంజుకునే వరకూ గుంటూరు, కృష్ణ, ఒంగోలు ప్రాంతాలలో సి.ఎస్.ఆర్ పేరు చెప్తే నాటకాలు హౌస్‌ఫుల్‌గా కిటకిటలాడేవి. నాటకాల్లో ఖర్చులు పోగా ఆ రోజుల్లోనే నెలకు రెండు మూడు వందలు సంపాదించేవారు. కాని సినిమాలకు ఆయన వెళ్లక తప్పలేదు. నాగయ్య వంటి స్టార్‌ని, ఎన్.టి.ఆర్, అక్కినేని వంటి నవ యువకులని గమనించుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడకా తప్పలేదు. అయినా ఏమిటి లోటు? అక్షరం అక్షరాన్ని విరిచి ఆయన డైలాగ్ చెప్పే పద్ధతికి ఒక తెలుగుదనం ఉండేది. దానికి నేల నుంచి బాల్కనీ వరకు అభిమానగణం ఉండేది. ‘కన్యాశుల్కం’లో ఆయన రామప్పంతులు. ఎన్.టి.ఆర్ గిరీశం. ఇద్దరూ కలిసి మధురవాణి మంచం కింద దాక్కునే సీను బహు ముచ్చటైనది. ‘మాయాబజార్’లో రేలంగి, సి.ఎస్.ఆర్. ‘ఈ మాత్రం దానికి మంచం కింద దాక్కోవాలటయ్యా’ అంటాడు గిరీశం. ‘అప్పుచేసి పప్పుకూడు’ లో సిఎస్ఆర్ చేసిన జిత్తులమారి జమీందారు పాత్ర ఆ తర్వాతి కాలంలో సాఫ్ట్ విలనీ చేయాలనుకున్న వారికి మోడల్. వడ్డీ చెల్లిస్తూ అసలు ఎగ్గొట్టడం ఆ జమీందారు నేర విధానం. ‘వారికి కావలసింది వడ్డీ. మనకు కావలిసింది అసలు’ అంటాడు నిశ్చింతగా. ఈ సి.ఎస్.ఆరే ‘దేవదాసు’లో సావిత్రి భర్తగా నటించాడు. ‘జగదేకవీరుని కథ’లో కొత్తమంత్రిగా రాజనాల పక్కన చేరి ‘హే రాజన్... శృంగార వీరన్’ అని కొత్త తరహా పిలుపుతో బుట్టలో వేసుకొని చివరకు ఆ రాజు మంటల పాలబడి హరీమనే వరకు నిద్రపోడు. అంతకు ముందు ఎన్ని పాత్రలు చేసినా ‘మాయాబజార్’లో శకుని పాత్రతో ఆయన చిరంజీవి అయ్యాడు. అటు దుర్యోధనుణ్ణి దువ్వుతూ, ఇటు లక్ష్మణ కుమారుణ్ణి బుజ్జగిస్తూ, మరోవైపు శ్రీకృష్ణుణ్ణి కనిపెట్టుకుంటూ ఆయన ఆ సినిమా అంతా హైరానా పడతాడు. ఆడపెళ్లివారి ఏర్పాట్లు చూసి నోరెళ్లబెట్టిన శర్మ, శాస్త్రి ఏకంగా మగపెళ్లి వాళ్ల ముందు వారిని పొగుడుతుంటే ‘ఇదిగో శర్మ, శాస్త్రుల్లు... మీకు పాండిత్యం ఉందిగానీ బుద్ధి లేదోయ్’ అని సి.ఎస్.ఆర్ చెప్పే డైలాగు ఒక పాఠం లాంటిది. బతకడానికి కామన్సెన్స్ అవసరాన్ని తెలియచేసే శకుని మాట అట. ఆయన ఆ వేషం కోసం చేతుల్లో పట్టుకుంది పాచికలను కాదు. ప్రేక్షకుల పల్స్‌ని. సి.ఎస్.ఆర్ 56 ఏళ్లకే 1962లో మరణించారు. తక్కువ కాలంలో తక్కువ పాత్రలు వేశాడాయన. దానికి కారణం లౌక్యం పాటించకపోవడం, ఎంత పెద్దవారినైనా వేళాకోళం చేయగలగడం కొంత కారణం. ఆయనకు ముక్కుపొడుం అలవాటు ఉండేది. పాండిబజార్లో ఆయన రోజూ చెట్టు కింద పొడుం పీలుస్తూ నిలబడి దర్బార్ నడిపేవారు. ఆయన గురించి మాట్లాడటం, రాయడం తక్కువ. కేవలం తన పనితో ఆయన ఇంకా నిలబడి ఉన్నాడు. ‘మాయాబజార్’ తెలుగు ఇళ్లల్లో ప్లే అయినంత కాలం మన మీద పాచిక విసురుతూనే ఉంటాడు. ఆయన దుష్టశకుని కాదు. మన ఇష్ట శకుని. – సాక్షి ఫ్యామిలీ -
అతడొక నవ్వుల అడితి
‘షోలే’ సినిమా కొంతమంది నటుల అసలు పేర్లను చెరిపేసి కొత్త పేర్లను ఇచ్చింది. అంజాద్ ఖాన్ పేరు చెరిపేసి గబ్బర్ సింగ్. మెక్ మోహన్ పేరు చెరిపేసి సాంబా, జగ్దీప్ పేరు చెరిపేసి ‘సూర్మా భోపాలి’. ఆ సినిమాలో జగ్దీప్ వేసింది కేవలం రెండే సీన్లు. కాని జీవితాంతం ఆ సీన్లు అతడిని నిలబెట్టాయి. సూర్మా భోపాలి అనే పేరును కూడా. ‘షోలే’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతున్నా సూర్మా భోపాలి సీన్లు తీయలేదు. ‘రెండు సీన్లకు నేనెందుకు పోండి’ అన్నాడు జగ్దీప్ ఆ వేషానికి. కాని షోలే రాసిన జావేద్ అఖ్తర్ పట్టు వీడలేదు. భోపాల్ జావేద్ సొంత ఊరు. అక్కడి ముస్లిం స్త్రీలు మాట్లాడే పద్ధతిని కొన్నాళ్ల క్రితం జగ్దీప్కు చూపినప్పుడు జగదీప్ అదే అనుకరణలో డైలాగులు చెప్పి జావేద్‌ను మెప్పించాడు. అదే యాసతో ‘సూర్మా భోపాలి’ వేషం రాశాడతడు. దానికి జగ్దీపే న్యాయం చేయగలడు. అందుకని ఎలాగో ఒప్పించి చేయించారు. వీరు, జయ్ అనబడు ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ సూర్మా భోపాలి కట్టెల అడితికి వచ్చి అతనికి లొంగిపోతారు. ‘మమ్మల్ని పట్టించి మా మీద పెట్టిన ఇనామ్‌ను నువ్వు తీసుకో. జైలు నుంచి వచ్చాక మాకు సగం ఇవ్వు’ అంటారు. గొప్పలు చెప్పుకునే సూర్మా భోపాలి వారిని పట్టిచ్చి కట్టెల అడితికి వచ్చేపోయే వారికి అది తానే చేసిన ఘనకార్యంగా చిలువలు పలువలుగా చెప్పుకుంటూ ఉంటాడు. నోటినిండా పాన్, తల మీద టోపీ, దీర్ఘాలుగా వచ్చే మాట, పిట్టల దొర వంటి బుద్ధి... ఇవన్నీ ఆ రెండు సీన్లలోనే జగ్దీప్ ప్రేక్షకులకు పట్టిచ్చాడు. డబ్బును ‘పైసే’ అంటారు. కానీ సూర్మా భోపాలి ‘పీషే పీషే పీషే’ అని అందరినీ నవ్విస్తాడు. ఆ ‘పీషే’ను ప్రయివేట్ టాక్‌లో ఉపయోగించడం షోలే అభిమానులు చేసే పని. జగ్దీప్ అదృష్టజాతకుడు. తల్లితోటి ముంబైకి ఆరేడేళ్ల వయసులో వొట్టి కాళ్లతో వచ్చి ఇనుప కొలిమిలో పని చేశాడు. సబ్బుల ఫ్యాక్టరీలో పని చేశాడు. తల్లితో కలిసి గాలిపటాలు తయారు చేసి పేవ్మెంట్ల మీద అమ్మాడు. కాని అదే జగ్దీప్ ఆ తర్వాత హీరో అంతటి వాడయ్యి ‘చలి చలిరే పతంగ్ మేరి చలిరే’ అంటూ గాలిపటాలు ఎగరేస్తూ తెర మీద పాటలు పాడాడు. జగ్దీప్ చైల్డ్ ఆర్టిస్ట్. పేవ్మెంట్ మీద అతణ్ణి చూసిన ఒక సినిమా సప్లయర్ ‘అఫ్సానా’ (1951)లో రోజుకు మూడు రూపాయల కూలీకి స్టూడియోకు తీసుకెళ్లాడు. జగ్దీప్ బెరుకు లేకుంటా చటాపటా డైలాగులు చెప్పాడు. ఆ తర్వాత జగ్దీప్ గురుదత్తో సూపర్‌హిట్ సినిమా ‘ఆర్ పార్’ చేశాడు. బిమల్ రాయ్ దగ్గర చరిత్రాత్మకంగా నిలిచిన ‘దో భీగా జమీన్’లో పని చేశాడు. ‘నువ్వు ఏడుపు బాగా చేస్తున్నావు. కనుక బాగా నవ్వించగలవు’ అని బిమల్‌రాయ్ ఆ సినిమా తీసేటప్పుడు జగ్దీప్తో అన్నాడు. జగ్దీప్ నటించిన ‘హమ్ పంఛీ ఏక్ డాల్ కే’ జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది. జగ్దీప్ ముంబై సినిమాలలో కన్నా మన మద్రాసు వారు తీసే హిందీ రీమేకుల్లో ఎక్కువగా నటించాడు. ఏ.వి.ఎం వారి ‘భాభీ’ (కులదైవం) జగ్దీప్కు చాలా పేరు తెచ్చింది. ‘తీన్ బహురానియా’ (భలే కోడళ్లు), ‘ఖిలోనా’ (పునర్జన్మ), ‘సాస్ భీ కభీ బహూ థీ’ (అత్తా ఒకింటి కోడలే), ‘బిదాయి’ (తల్లా పెళ్లామా) ఈ సినిమాలన్నింటిలోనూ జగ్దీప్ పని చేశాడు. ఖిలోనాలో అతడు చేసిన పాత్రకు బెస్ట్ కామిక్ రోల్ పురస్కారం దక్కింది. ముంబైలో చిన్న గదిలో ఉండే జగదీప్ ఈ సినిమాలతో వచ్చిన డబ్బుతో ముంబైతో పాటు చెన్నైలో కూడా ఆస్తులు కొన్నాడని అంటారు. జగదీప్‌ను తెలుగులో రాజబాబుతో పోల్చవచ్చు. ఇద్దరూ చాలా వేగంగా శరీరాన్ని కదిలిస్తూ నటిస్తారు. నగేష్ కూడా ఈ కోవలోకే వస్తారు. కదలకుండా నవ్వించినవారు రేలంగి, మెహమూద్. జగ్దీప్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఉన్నా సినిమా మనిషిగా లేడు. అతని ఇంటర్వ్యూలు చూడటం తక్కువ. సినిమా వేడుకల్లో దాదాపుగా కనపడడు. కాని ‘సూర్మా భోపాలి’ పాత్ర హిట్ అయ్యాక అదే పేరుతో ఒక సినిమా తీసి తాను హీరోగా నటిస్తే అతని మీద అభిమానంతో అమితాబ్, ధర్మేంద్ర ఇంకా చాలామంది సినిమా వాళ్లు ఫ్రీగా కాసేపు కనిపించారు. జగదీప్ చివరగా మెరిసిన సినిమా ‘అందాజ్ అప్నా అప్నా’. అందులో సల్మాన్‌ఖాన్ తండ్రిగా, టైలర్‌గా తన మార్క్ చూపిస్తాడు. జగదీప్ సంతానంలో జావేద్ జాఫ్రీ, నవీద్ జాఫ్రీ ‘బూగీ వూగీ’ షోను కనిపెట్టి దాదాపు 17 ఏళ్లు హిట్ చేశారు. జావేద్ జాఫ్రీ బాలీవుడ్లో ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నాడు. జగ్దీప్ అసలు పేరు ‘సయ్యద్ ఇష్టియాక్ అహ్మద్ జాఫ్రీ’ అని తెలుసుకోవడంలో పెద్దగా ప్రయోజనం లేదు. అతడు ఎల్లవేళలా ప్రేక్షకులకు సూర్మా భోపాలియే. నిండయిన కట్టెల అడితి వచ్చిన వారికంతా వంట చెరుకు ఎలా అందిస్తోందో అలా అతడు చేసిన ప్రతి సినిమాలోనూ నవ్వులు పంచాడు. 81 ఏళ్లకు అతడు తీసుకున్న విశ్రాంతి అర్థవంతమైనది. అతన్ని మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. (హాస్యనటుడు జగదీప్ బుధవారం ముంబైలో మరణించాడు. అతడి అంత్యక్రియలు గురువారం ముగిశాయి) – సాక్షి ఫ్యామిలీ -
కళ వెలవెల
-
ఫ్లాయిడ్ ఆత్మ.. గగన నినాదం
అమెరికన్ పోలీసు జాత్యహంకారానికి ప్రాణాలు కోల్పోయిన జార్జి ఫ్లాయిడ్ చివరి మాటలు అమెరికన్ గగనతలంలో బ్యానర్లపై రెపరెపలాడుతున్నాయి. తన గొంతుపై ఆ పోలీసు మోకాలిని తొక్కిపెట్టి ఉంచినప్పుడు ఫ్లాయిడ్ ఊపిరాడక.. ప్లీజ్ ఐ కాంట్ బ్రీత్.. మై స్టొమక్ హర్ట్స్.. దె ఆర్ గోయింగ్ టు కిల్ మీ.. మై నెక్ హర్ట్స్.. అని మూలుగుతూ ప్రాణాలు పోయేముందు కొన్ని నిముషాల పాటు విలవిలాడాడు. ఆ మాటలను జామీ హోమ్స్ అనే ఆర్టిస్టు బ్యానర్ల పై రాసి యూఎస్‌లోని ఐదు నగరాలలో (డెట్రాయిట్, మయామి, డాలస్, లాస్ ఏంజలెస్, న్యూయార్క్) ఎగరేశారు. వాటి రూపంలో నింగిలోనూ ఊపిరి కోసం కొట్టుకుంటున్నట్లుగా కనిపిస్తున్న ఫ్లాయిడ్ ఆత్మ ఇప్పట్లో అమెరికాను నిద్రపోనివ్వక పోవచ్చు. -
ఒక్క పోస్ట్... వంద రూపాలు
తిరువనంతపురం: కేరళలో ఒక ఆర్టిస్ట్ పోస్ట్ చేసిన యానిమేటెడ్ పోస్ట్ రాజకీయంగా వివిధ మలుపులు తిరుగుతుంది. రాజకీయ నాయకులు ఎవరికి తోచినట్లుగా వారు దాన్ని మార్చుకొంటున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కేరళకు చెందిన ఆశిన్‌మున్ను అనే ఆర్టిస్ట్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ వర్షం కురుస్తున్నప్పుడు ఒక గొడుగును గట్టిగా పట్టుకొని దాని కింద ఉన్న వారందరిని కాపాడుతున్నట్లు ఒక యానిమేటెడ్ పోస్టర్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దానిలో చిన్నపిల్లలు, కరోనా పేషెంట్స్, ముసలివాళ్లు, డాక్టర్లు, పోలీసులు అందరూ ఉన్నారు. వారందరిని కేరళ ప్రభుత్వం కాపాడుతుంది అనే ఉద్దేశంతో ఆ మీమ్‌ని తయారు చేశాడు. అయితే దీనిని ఏప్రిల్ 17న మున్ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. (జీతాల్లో కోత విధించేందుకు ఆర్డినెన్స్ జారీ) దీనిని చూసిన కేరళకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒ.రాజగోపాల్ ఇదే పోస్టర్ని కొన్ని మార్పులతో ఆయన అఫిషియల్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. పినరయి విజయన్ పైన ప్రధాని మోదీ ఇంకో పెద్దగొడుగుతో అందరిని కాపాడుతున్నట్లుగా ఉన్న మీమ్‌ని ఆయన షేర్ చేశారు. ఇలా చేసినందుకు చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేని ట్రోల్ చేశారు. తరువాత ఎవరికి తగ్గట్టుగా వారు దాన్ని మార్చుకుంటూ పోస్ట్ చేస్తున్నారు. మరొకరు ప్రతిపక్షనేత రమేష్ చెన్నితల.. ప్రధాని మోదీ గొడుగుపైన ఒక టెంట్ పట్టుకున్నట్లు మీమ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇవి కేరళ రాజకీయాలలో ఆసక్తి రేపుతున్నాయి. (మోదీ వీడియో కాన్ఫరెన్స్‌కు విజయన్ గైర్హాజరు) -
ప్రముఖ కళాకారుడు కన్నుమూత..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ కళాకారుడు, ఆర్కిటెక్ట్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత సతీష్ గుజ్రాల్ మరణించారు. సతీష్ గుజ్రాల్ మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు సోదరుడు. దేశ విభజనకు ముందు 1925, డిసెంబర్ 25న జన్మించిన సతీష్ గుజ్రాల్ లాహోర్, ముంబైల్లో విద్యాభ్యాసం సాగించారు. నటనతో పాటు ఆర్కిటెక్చర్‌లోనూ విశేష ప్రాచుర్యం పొందిన గుజ్రాల్ ఢిల్లీలో బెల్జియం రాయబార కార్యాలయ భవనం డిజైన్‌ను రూపొందించారు. గుజ్రాల్ విశేష ప్రతిభా పాటవాలు కలిగిన వారని, ఆయనలోని సృజనాత్మకత తనను ఆకట్టుకునేదని, గుజ్రాల్ మరణం విచారకరమని ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. నటుడు, ఆర్కిటెక్ట్ గుజ్రాల్ మరణం దేశానికి తీరని లోటని, ఆయన సేవలను దేశం ఎన్నడూ గుర్తుంచుకుంటుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి : ‘పద్మ’కు తాకిన కరోనా భయాలు! -
కల్లమాటలే పలకొద్దు
కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘నిండు హృదయాలు’ చిత్రంలో నేను బాల నటుడిగా నటించాను. చలం గారి చిన్నప్పటి పాత్ర వేశాను. అప్పటికి నా వయసు పది సంవత్సరాలు. నేను, రాజ్‌కుమార్, రాము, నేను ముగ్గురం నటించాం. మా ముగ్గురి మీద ‘ఒకటి రెండు మూడు విడివిడిగా ఉంటే ఒకటి రెండు మూడే/ఒకటి రెండు మూడు ఒకటై ఉంటే అది నూటా ఇరవై మూడు’ అనే పాట చిత్రీకరించారు. ఆ పాట వీనస్ స్టూడియోలో జరిగింది. గుమ్మిడిపూడి, తడ ప్రాంతాల్లో ఔట్‌డోర్ షూటింగ్ జరిగింది. ఈ పాటలో ఎంతో నీతి ఉంటుంది. ‘కల్లమాటలే పలకొద్దు వద్దు అసలొద్దు/కుళ్లు పెంచుకుని బతకొద్దు/ వద్దు అసలొద్దు/పరువు చంపుకుని మనసు అమ్ముకొని బతికే బతుకు మనొకద్దు’ అంటూ మనిషి ఎంత మంచిగా జీవించాలో ఈ పాట నేర్పుతుంది. అప్పట్లో ఈ పాటలోని ఆంతర్యం మాకు తెలియదు. ఈ పాటంతా ఒక ఎత్తయితే, నా భుజం మీద కోతిని ఉంచుకుని నటించటం నాకు కత్తి మీద సామే. కోతి వలల్లొక ప్లస్ ఒక మైనస్ రెండూ ఉన్నాయి. భుజం మీద కోతి ఉండటం వలన కదలక్కర్లేదు. అయితే ముఖంలో భావాలు ప్రదర్శించటం, చేతుల కదలికలు, టైమింగ్ అన్నీ ఒకేసారి వచ్చేలా జాగ్రత్తపడాలి. కోతి నన్ను ఏమీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఎటువంటి ఇబ్బంది పడుకుండా నటించానంటే అది దర్శకులు కె. విశ్వనాథ్ గారి గొప్పదనం. ఆయన రాయి చేత కూడా నటింపచేయగలరు. మేం పిల్లలుగా ఉన్నప్పుడు రెండు చరణాలలో నటిస్తాం. ఆ పాటకు కోరియోగ్రఫీ విశ్వనాథ్ గారే చేశారు. చిన్న చిన్న మూమెంట్స్, క్లోజప్‌లు ఉంటాయి. మేం ముగ్గురం కలిసి ఆనందంగా గడుపుతూ, కష్టపడి డబ్బు సంపాదించటం మొదటి రెండు చరణాలలోను వస్తుంది. ఇంట్లో దీపం వెలిగిస్తూ ‘నల్లని చీకటి నెరగకపోతే/ తెల్లని వెలుగుకు విలువేది ఆపదలన్నవి కలగకపోతే ఆనందానికి రుచి ఏది’ అంటూ రెండో చరణం సాగుతుంది. ఇందులోనూ విలువలు బోధించారు నారాయణరెడ్డిగారు. మూడో చరణం ‘మాకు తెలుసును ఈ సంఘం/మంచిచెడ్డల రణరంగం/మనిషిమనిషిగా పురోగమిస్తే మంచికే అంతిమ విజయం’ వచ్చేసరికి మా పాత్రల్లో పెద్దవాళ్లు కనిపిస్తారు. నిండు హృదయాలు సినిమా టైమ్‌కే నేను 30 సినిమాలు చేసి ఉన్నాను. కాబట్టి నాకు ఇందులో నటించటంలో ఇబ్బంది ఏమీ ఎదురవ్వలేదు. ఈ పాటను సినిమా షూటింగ్ అంతా అయ్యాక షూట్ చేశారు. అప్పటికి నాకు కోతి అలవాటు పడింది. అందువల్ల పాటలో కోతితో నటించడానికి ఇబ్బంది కలగలేదు. కోతి ఏమీ చేసేది కాదు. కాని కుదురుగా ఉండేది కాదు. దానికి ఏవేవో గింజలు పెట్టేవాడిని. షూటింగ్‌కి రాగానే ముందు ఆ కోతిని అరగంట సేపు మచ్చిక చేసుకునేవాడిని. ఎంతైనా కోతిని నమ్మటానికి కుదరదు కదా. దానిని నమ్మటానికి ఉండదు కదా. అందువల్ల బాగానే వచ్చింది. సంభాషణ: డా. వైజయంతి పురాణపండ -
టీచర్.. యాక్టర్.. సింగర్.. పెయింటర్
గౌతంనగర్: పదవీ విరమణ పొందిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు అకుంఠిత దీక్షతో తనకు ఇష్టమైన చిత్రలేఖనం, సంగీత, నాటక రంగాల్లో రాణిస్తూ ప్రశంసలు పొందుతున్నారు. మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ డివిజన్లోని మల్లికార్జున నగర్‌కు చెందిన బేతపూడి చంద్రశేఖర్‌రావు లాలాగుడలోని రైల్వే బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసి 2008లో పదవీ విరమణ పొందారు.ఆ తరువాత తనకిష్టమైన రంగాల్లో రాణిస్తూ మన్నన పొందుతున్నారు. చిత్రకళపై ఆసక్తి...... కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పక్కలగడ్డ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌రావుకు చిన్నతనం నుంచే చిత్ర కళలపై ఆసక్తి ఎక్కువ. పదవ తరగతి పాసయ్యాక అన్న రాజశేఖర్‌రావు ప్రోత్సాహంతో ప్రముఖ చిత్రకారుడు వేణుగోపాల్ వద్ద మెళుకువలు నేర్చుకున్నారు. 1973–74వ సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందులవల్ల విజయవాడలోని కమర్షియల్ ఆర్టిస్టిగా చేరి సినిమాల్లో బ్యానర్లు, గోడలపై పేర్లతోపాటు సైన్ బోర్డులపై పేర్లు రాశారు. తరువాత 1986లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో మహారాష్ట్ర, నిజామాబాద్‌లలో కొన్ని సంవత్సరాలు పనిచేసి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఒకవైపు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే మరోవైపు తనకు వచ్చిన చిత్రకళను అశ్రద్ధ చేయలేదు. కథకు అనుగుణంగా, సన్నివేశాన్ని బట్టి పుస్తకాల్లో మేగజైన్లలో, మాసపత్రికలల్లో కవర్‌పేజీలపై ముఖచిత్రాలు వేయడం ప్రత్యేకతగా మలుచుకున్నారు. మనిషి ఎదురుగా నిల్చుంటే చూడ చక్కగా బొమ్మలు గీస్తారు. పెన్సిల్‌తో బొమ్మలు గీయడంలో చాలా ఫాస్ట్. తైలవర్ణ చిత్రాలు, వాటర్ కలర్స్, స్కెచెస్‌తో పలు చిత్రాలు గీశారు. కాన్వాస్‌పై అయిల్ పెయింటింగ్ వేయడం ఈయన స్పెషాలిటి. 1977లో ఎన్టీఅర్, జమునల ఫోటోలు అద్భుతంగా గీసి వారికి కానుకగా అందజేసి ప్రశంసలందుకున్నారు. వాటర్ కలర్లతో గీసిన మహాత్ముడి బొమ్మ, ఇండియన్ ఇంక్‌తో వేసిన అంబేడ్కర్ బొమ్మలు, పెన్సిల్‌తో వేసిన పలు బొమ్మలు ఆకట్టుకుంటాయి. గాయకుడిగా..... మాస్టర్ చంద్రశేఖర్‌రావు మంచి గాయకుడు కూడా. చిన్ననాటినుంచి పాటలంటే ఇష్టం. ఘంటసాల పాటలంటే మరీ ఇష్టం. పలు పాటలను వినసొంపుగా పాడుతూ ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు. రవీంద్రభారతి, త్యాగరాయగానసభ, వేదికలపై పలు ప్రదర్శనలిచ్చారు. నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఘంటసాల సంగీత విభావరుల్లో ఆయన గాత్రం పలువురి ప్రశంసలందుకుంది. నటుడిగా.. నటనా రంగంలో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. ఏ వేషం వేసినా అందులో ఒదిగిపోయేవారు.1996లో మూడు ప్రశ్నలు, నాటకంలో బైరాగి వేషంలో మంచి నటన కనబర్చారు. సంతృప్తి కంటే మించింది లేదు పలు కళల్లో ప్రవేశమున్న నాకు జీవితకాలం గుర్తుంచుకోదగ్గ తీపి జ్ఞాపకాలు మిగిలాయి. అంతకుమించి సంతృప్తి ఏముంది. ప్రస్తుతం మల్కాజిగిరిలోని ఒక గదిని అద్దెకు తీసుకొని చిన్నా, పెద్ద తేడా లేకుండా ఉచితంగా డ్రాయింగ్ శిక్షణ ఇస్తున్నా. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే మరింతమందికి శిక్షణఇస్తా.– బేతపూడి చంద్రశేఖర్‌రావు -
నాలుగు నిమిషాలు.. యాబై మంది వాయిస్‌లు
మిమిక్రీలో చాలావరకు పురుషుల గొంతులే వినిపిస్తాయి. మహిళలూ ఆ అనుకరణను అవలీలగా చేస్తారు... అని అఖిల ఏఎస్ అనే అమ్మాయి నిరూపిస్తోంది. నాలుగు నిమిషాల్లో యాభై ఒక్కమంది సెలబ్రీటీలను అనుకరించి చూపించింది! ఆ వీడియో వైరలయింది. ‘‘ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు దుమ్ము.. ఓ వైపు పొగ...’’ అంటూ యాంటీ స్మోక్ యాడ్‌లో వినిపించే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ను అనుకరిస్తోంది ఓ ఇరవై ఏళ్ల అమ్మాయి తన తరగతి గదిలో. అచ్చంగా యాడ్‌లోని పురుషుడి గొంతుతోనే మాట్లాడుతున్న ఆ మాటలకు క్లాస్ అంతా ఈలలు, చప్పట్లతో మారుమోగిపోతోంది. వన్స్ మోర్ అంటున్నారు క్లాస్మేట్స్. అలా గోపన్ నాయర్ (మలయాళం వాయిస్ ఆర్టిస్ట్, ఈ నగరానికి ఏమైంది అనే యాడ్‌కు మలయాళంలో వాయిస్ ఇచ్చింది అతనే) నుంచి మలయాళ నటీమణులు పార్వతి, నజిరియా నాజిమ్, కేరళ రాజకీయ నాయకులు ఇలా ఒకరి తర్వాత ఒకరిని అనుకరిస్తూనే ఉంది. ఆ అమ్మాయి పేరు ఏఎస్ అఖిల. ఆయుర్వేద వైద్యవిద్యను అభ్యసిస్తోంది. ఈ యేడాదితో చదువు పూర్తయిపోయి డాక్టర్ పట్టా పుచ్చుకోనుంది. పైన చెప్పుకున్న ఆమె మిమిక్రీ సీన్ ఆ కాలేజ్‌లో చేసిందే. మిమిక్రీఖిల అఖిల మలయాళ అమ్మాయి అని ఈపాటికే అర్థమయ్యుంటుంది. పుట్టింది, పెరిగింది తిరువనంతపురం జిల్లాలోని నేడుమంగడ్లో. చిన్నప్పటి నుంచీ చుట్టూ ఉన్న పరిసరాలను, మనుషులను పరిశీలించడం అలవాటు ఆమెకు. ఆ పరిశీలనలోంచే ఈ మిమిక్రీ కళ అబ్బింది, అలవడింది. స్కూల్లో ఉన్నప్పుడే క్లాస్‌లో తన కళను ప్రదర్శించేది. క్లాస్ టీచర్స్‌ను, క్లాస్‌మేట్స్‌ను అనుకరిస్తూండేది. ఒకసారి ఇలాగే క్లాస్‌లో డెమో ఇస్తూండగా టీచర్స్‌కు పట్టుబడింది. ఫలితం.. స్కూల్లో ఆమె కళాప్రదర్శన. దాంతో అఖిలకు స్టేజ్ ఫియర్ పోయి ధైర్యం వచ్చింది. ఎక్కడైనా ప్రదర్శనలు ఇవ్వగలననే ఆత్మవిశ్వాసమూ పెరిగింది. అప్పటినుంచి తిరువనంతపురంలో జిల్లాల్లోని ప్రతి ఇంటర్‌స్కూల్ కాంపిటీషన్లో పాల్గొనడం మొదలుపెట్టింది. ఎక్కడ గొంతు సవరిస్తే అక్కడ ప్రైజులు వచ్చిపడేవి. ఆ కళను తనతోపాటే పెంచి పెద్దచేసుకుంది. అయితే ఎక్కడా దానికి సంబంధించి శిక్షణ తీసుకోకుండానే. టీవీ, పరిశీలన ఇవే ఆమె ధ్వన్యనుకరణ నైపుణ్యాన్ని పెంచిన గురువులు. ఎవరెవరిని అనుకరిస్తుంది? ఎవరిని కాదు అని అడగొచ్చు. రజినీకాంత్, కమల్‌హసన్, అద్నన్ సమీ, ఎస్. జానకి, ఓమెన్ చాందీ, వీఎస్ అచ్యుతానందన్, షాలినీ, షామిలీ (చిన్నప్పటి వాయిస్‌లను).. ఇలా చెప్పుకుంటూ పోతే వందకు పైనే తేలొచ్చేమో జాబితా. ఈ వీడియో వైరల్.. ఒక మలయాళం చానెల్లోని ఓ ప్రోగ్రామ్‌లో అఖిల చేసిన మిమిక్రీ వీడియోలో కేవలం నాలుగంటే నాలుగు నిమిషాల్లో యాభై ఒక్కమంది సెలబ్రిటీల స్వరాన్ని అనుకరించింది. ప్రతి నాలుగు సెకన్లకు ఆడ, మగ గొంతును మారుస్తూ. ఆ ‘షో’ను చూసిన ప్రేక్షకులు ఆమె ప్రతిభకు అబ్బురపడ్డారు. మిమిక్రీ కళలో మహిళా సూపర్‌స్టార్ అనే పేరు తెచ్చేసుకుంది అఖిల ఈ షోతో. ఇప్పటివరకు మలయాళంలో ఎందరో మిమిక్రీ కళాకారులు వచ్చినా.. తర్వాత తర్వాత వాళ్లంతా సినిమా ఆర్టిస్టులుగా స్థిరపడ్డారు. కాని అఖిల అలా కాకుండా మిమిక్రీ కళాకారిణిగానే కొనసాగాలనుకుంటోందట. ఈ నగరానికి ఏమైంది.. ‘‘ఈ నగరానికి ఏమైంది’’ మలయాళం యాడ్‌కు గళమిచ్చిన గోపన్ నాయర్‌ను అనుకరిస్తూ ఓ వీడియో కూడా చేసింది అఖిల. ఆ వీడియోకు మైఖేల్ జాక్సన్ ‘డేంజరస్’ పాట మ్యూజిక్‌ను జతకూర్చి ఒక కొత్త ప్రయోగానికి రూపమిచ్చింది. అన్నట్టు అఖిల .. కేరళకు చెందిన తొలి ‘లేడీస్ ఓన్లీ మిమిక్స్ పరేడ్ గ్రూప్’లో సభ్యురాలు కూడా. మీ లక్ష్యం ఏంటి అని అడిగితే ‘‘ఇలాగే ముగ్గురిని అనుకరిస్తూ ముప్పైమందిని నవ్వించడమే’’ అంటుంది నవ్వుతూ అఖిల ఏఎస్. ‘చిన్నప్పటినుంచీ పక్షుల కిలకిలారావాలు, జంతువుల అరుపులను బాగా అబ్జర్వ్ చేసేదాన్ని. నేను ఫస్ట్ మిమిక్రీ చేసింది కూడా పక్షుల కూతలనే. తర్వాత ఇంట్లోవాళ్లను, ఫ్రెండ్స్‌ని, టీచర్స్ని అనుకరించే దాన్ని. నిజానికి మా ఇంట్లో ఎవరికీ ఈ కళ లేదు. కేవలం పరిశీలనతో నా అంతట నేను నేర్చుకున్నదే. సెలబ్రిటీల విషయానికి వస్తే నేను ఎస్. జానకమ్మను ముందు ఇమిటేట్ చేశా. టీవీ బాగా చూస్తాను. నా స్కిల్‌ను పెంచి నాకు కచ్చితత్వాన్ని ఇస్తున్న సాధనం అదే’ – అఖిల -
రాధమ్మ అల్లుడు
‘నటుడిగా నిరూపించుకోవాలనే ఆకాంక్ష ఉండాలే గాని అవకాశాలు ఏదో రూపంలో పలకరిస్తూనే ఉంటాయి. అది హీరోనా, విలనా.. అనే సందేహాలు పెట్టుకొని ఆగిపోవద్దు’ అంటారు బుల్లితెర నటుడు గోకుల్. తమిళ ఇంటి కుర్రాడు తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘జీ’ టీవీలో వచ్చే ‘రాధమ్మ కూతురు’లో లీడ్ రోల్ పోషిస్తున్న గోకుల్ మోడలింగ్ వైపు వెళ్లి, నటుడిగా ఎదుగుతున్న విధం గురించి ఇలా వివరించాడు... తమిళంలో విలన్ ‘పుట్టి పెరిగింది చెన్నైలో. నాన్నగారు ఉమామహేశ్వరన్. ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్క్ చేస్తున్నారు. అమ్మ జయప్రభ గృహిణి. మా బ్రదర్ సింగర్, కంపోజర్. నేను బి.టెక్ పూర్తి చేశాను. కాలేజీ తర్వాత మోడలింగ్‌లో చేరాను. ఆక్కణ్ణుంచే సీరియల్లో అవకాశం వస్తే ఈ ఇండస్ట్రీకి వచ్చాను. నా గడ్డం మీసాలు చూసి విలన్‌గా అయితే బాగుంటుందని ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అలా విలన్‌గా బుల్లితెరకు పరిచయం అయ్యాను. ఆ సమయంలోనే తెలుగు బుల్లితెర నుంచి ‘జ్యోతి’ సీరియల్లో లీడ్ రోల్‌కి ఆఫర్ వచ్చింది. వెంటపడితే చదివాను.. బి.టెక్ అంటే అస్సలు ఇష్టం లేదు. నా చిన్నప్పటి నుంచి ఒకటే కల నటుడిని అవ్వాలని. ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పినప్పుడు అందరూ కనీసం డిగ్రీ అయినా ఉండాలన్నారు. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం. ఆ విధంగా బిటెక్‌లో ఐటీ చేశాను. కానీ, జాబ్వైపుకు వెళ్లాలనిపించలేదు. ముందు అమ్మనాన్న కాస్త మౌనం వహించారు. కానీ, ఇప్పుడు నాకు వస్తున్న గుర్తింపు, హంగామా చూసి వాళ్లూ సంతోషిస్తుంటారు. నా గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడినప్పుడు గర్వంగా ఫీలవుతారు. రాధమ్మ కూతురు ఇప్పుడు ‘జీ టీవీ’లో వచ్చే రాధమ్మ కూతురులో హీరో క్యారెక్టర్ చేస్తున్నాను. దీనికి ముందు జ్యోతి సీరియల్లో రీప్లేస్ క్యారెక్టర్ చేశాను. ఈ సీరియల్ పూర్తవుతుండగా రాధమ్మ కూతురు టీమ్ నుంచి ఆడిషన్స్‌కు పిలిచారు. ఊళ్లో అప్పులు ఇచ్చి, వడ్డీ వసూలు చేసే బుజ్జమ్మ కొడుకు అరవింద్ క్యారెక్టర్ నాది. వడ్డీ వసూలుకు అరవింద్‌ను పింపిస్తుంటుంది బుజ్జమ్మ. తోడుగా ఓ ఐదారుగురు రౌడీలు ఉంటారు. అలాంటి సమయంలో ఓ రోజు హీరోయిన్ అక్షరను చూస్తాడు అరవింద్. అక్షరకు బుజ్జమ్మ అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకని, నేను బుజ్జమ్మ కొడుకుగా కాకుండా చిన్నాగా అక్షర ను పరిచయం చేసుకుంటాను. అబద్దం చెప్పి ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. ఒకరోజు నేనే బుజ్జమ్మ కొడుకును అనే విషయం తెలుస్తుంది. దీంతో నా మీద పగ పెంచుకుంటుంది. ఇలా ప్రేమ – పగలతో సీరియల్ నడుస్తుంటుంది. తెలుగు నేర్చుకున్నాను తెలుగు బుల్లితెరకు వచ్చి ఆరునెలలు అయ్యింది. ఈ ఆరునెలల్లో చాలా నేర్చుకున్నాను. అందరి మాటలు వింటూ, నేను మాట్లాడుతూ తెలుగు నేర్చుకున్నాను. ముందు నెల రోజులయితే చాలా ఇబ్బంది పడ్డాను. ఏ భాషలో నటుడిగా కొనసాగాలనుకుంటున్నామో ఆ భాష నేర్చుకుంటే ముందు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఆ ప్రయత్నంలో విజయం సాధించాను. సినిమా నటుడిని కావాలని ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను. రెండు సంక్రాంతులు టీవీ షో కోసం మొన్ననే ఓ సంక్రాంతి వేడుకలో పాల్గొన్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. పండక్కి చెన్నై వెళుతున్నాను. ఇక్కడ సంక్రాంతి అంటే తమిళ్లో పొంగల్ అంటారు. భోగి, పొంగల్, మట్టు(కౌ)పొంగల్ అని మూడు రోజులూ పండగ చేస్తాం. ఇంట్లో అమ్మ చేసే చక్రపొంగల్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ ఏడాది ఒకే పండగను వారం రోజుల్లో రెండు సార్లు జరుపుకోవడం హ్యాపీగా ఉంది. క్యారెక్టర్ని బట్టి.. క్యాస్టూమ్స్! ముందే టీమ్ సజేషన్స్ ఉంటాయి. ఎలాంటి క్యారెక్టర్‌కు ఎలాంటి క్యాస్టూమ్స్ బాగుండాలో డిస్కషన్స్ జరుగుతాయి. నా పాత్రకు తగ్గట్టు రెంగ్యులర్ పాయింట్ షర్ట్ లేదా కుర్తా పైజామా కాకుండా జీన్స్ ప్యాంట్ మీద షార్ట్ కుర్తా వేసుకుని ఉంటాను. ఈ గెటప్ నాకు బాగా నచ్చింది. చాలా మంది ఇండోవెస్ట్రన్ స్టైల్ బాగుందంటూ మెచ్చుకుంటూ ఉంటారు. సంగీతం అంటే ప్రాణం ఏ కాస్త సమయం దొరికినా మ్యూజిక్ వింటుంటాను. చిన్నప్పటి నుంచి ఇండోవెస్ట్రన్ మ్యూజిక్‌ని బాగా ఇష్టపడతాను. సినిమాలు కూడా బాగా చూస్తాను. ఒంటరిగానైనా సరే సినిమాలు చూస్తూనే ఉంటాను. రోజూ కంపల్సరీ ఫిట్నెస్ మీద శ్రద్ధ పెడతాను. అలాగే బైక్ మీద లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్లడం చాలా ఇష్టం. అవకాశాలు వస్తున్నంత కాలం సీరియల్ నటుడిగా కొనసాగుతుంటాను. నటనలో మెళకువలు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతీసారీ కొత్తగానే భావించి, క్యారెక్టర్లో లీనమైనప్పుడే మంచి పేరు వస్తుంది. అలా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. – నిర్మలారెడ్డి