సూపర్‌హీరోయిజం అనేది జస్ట్ ఒక ఎక్స్‌ఫ్యాక్టర్ మాత్రమే. బేసిక్ ఎమోషన్స్‌తో డీల్ చేయగలిగినప్పుడు మాత్రమే అది జనాలకు ఎక్కుతుంది. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ కనెక్టివిటీనే అందుకు ఒక ఎగ్జాంపుల్. మిన్నల్ మురళితో సక్సెస్ అందుకున్న దర్శకుడు బసిల్ జోసెఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు.
టోవినో థామస్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన సూపర్ హీరో మూవీ నెట్‌ఫ్లిక్స్ ‘మిన్నల్ మురళి’.. మాతృక మలయాళంతో పాటు డబ్బింగ్ వెర్షన్ ద్వారా తెలుగులోనూ ఆకట్టుకుంటోంది. మెరుపు దెబ్బకి సూపర్ పవర్స్ దక్కించుకున్న ఇద్దరి కథే ఈ చిత్రం. ఇందులో ప్రతీ క్యారెక్టర్ ఏదో ఒక రకంగా అలరించేదే. అయితే హీరో తర్వాత షిబు క్యారెక్టర్ జనాలకు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ని, అదే టైంలో ఎమోషన్స్‌ని సైతం పంచుతుంది.
మిన్నల్ మురళి చిత్రంలో షిబు క్యారెక్టర్‌ని పోషించింది నటుడు గురు సోమసుందరం. కోలీవుడ్ థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఈయన. ఒకవైపు ఎమోషన్స్‌తో పాటు నెగెటివ్ షేడ్స్‌ను అద్భుతంగా పండించాడు. అయితే ఈ క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసే ముందు దర్శకుడు చేసిన ఓ రిక్వెస్ట్‌ను సున్నితంగా తిరస్కరించాడట ఆయన.
వాకిన్ ఫినిక్స్ లీడ్‌రోల్‌లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘జోకర్’ చూసి.. ఆ తరహా మాడ్యులేషన్‌ను షిబు క్యారెక్టర్ కోసం డెవలప్ చేయమని గురు సోమసుందరానికి సూచించాడట డైరెక్టర్ బసిల్ జోసెఫ్. కానీ, గురు సోమసుందరం మాత్రం అందుకు కుదరదని తేల్చి చెప్పాడట. దీంతో బసిల్ బతిమాలడడం మొదలుపెట్టాడట. అయినా ఆయన నో అనే అనేశారట.
వాకిన్ ఫినిక్స్ లాంటి నటుడంటే తనకు ఇష్టమేనని, కానీ, షిబూ క్యారెక్టర్ కోసం వెస్ట్రన్ యాక్టింగ్ టెక్నిక్‌ల ప్రభావం తనపై పడడం తనకు ఇష్టలేక ఆ పని చేయనని చెప్పానని షిబూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘థియేటర్ ఆర్టిస్టులకు శిక్షణలో ఒక విషయాన్ని నేర్పిస్తారు. సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది రీజియన్, ఇండియన్, వెస్ట్రన్ సినిమాగా విభజిస్తారు. దాని ప్రకారం ఇతర పాత్రల ప్రభావం.. తమ మీద ఉండకూడదని నటులు బలంగా ఫిక్స్ అవ్వాలి. కానీ, చాలామంది హీరోలు దీనికి భిన్నంగా.. హాలీవుడ్, ఇతర భాషల హీరోలను అనుకరిస్తారు. థియేటర్ ఆర్ట్ మీద నాకు అభిమానం ఎక్కువ. అందుకే నేను ఆ కండిషన్‌కు ఒప్పుకోలేదు. అయినా మా డైరెక్టర్ కన్విన్స్ అయ్యాడు’’ అని చెప్పుకొచ్చారు 46 ఏళ్ల గురు సోమసుందరం. మలయాళం రాకపోయినా బసిల్ తనకు షిబు క్యారెక్టర్‌ని ఆఫర్ చేసినప్పుడు ఆశ్చర్యపోయానని, కానీ, ఇప్పుడు షిబు క్యారెక్టర్ ద్వారా బాలీవుడ్ ఆఫర్లు సైతం వస్తున్నాయని సంతోషంగా చెప్తున్నారు గురు సోమసుందరం .
కోలీవుడ్ మూవీ ‘ఆరణ్య కాండం’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన గురు సోమసుందరం.. పాండియ నాడు, జిగరతాండ, తూంగ వనం, పెట్టా, మారా, జై భీమ్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక మిన్నల్ మురళిలో తన చిన్ననాటి స్నేహితురాలు ఉష(నటి షెల్లీ కిషోర్) ప్రేమ కోసం పరితపించే భగ్న ప్రేమికుడిగా షిబు పాత్రలో అలరించాడాయన.
Comments
Please login to add a commentAdd a comment