
ఇప్పుడంటే రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్. కానీ అప్పట్లో ఓ సాధారణ దర్శకుడిగా ఉన్నప్పుడు ఓ ఈగని హీరోగా పెట్టి సినిమా తీసేశాడు. దక్షిణాదితో పాటు హిందీలో రిలీజైన ఈ చిత్రం హిట్ అయింది. ఇప్పుడు అలా ఈగతో మలయాళంలో మరో సినిమా తీశారు. చూస్తుంటే జక్కన్న మూవీకి సీక్వెల్ లా అనిపించింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
'ప్రేమలు', 'లియో' తదితర డబ్బింగ్ చిత్రాలతో ఓటీటీ వల్ల తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమైన మలయాళ నటుడు మథ్యూ థామస్. ఇతడితో పాటు ఈగని ప్రధాన పాత్రధారులుగా పెట్టి 'లవ్లీ' మూవీ తీశారు. ఏప్రిల్ 4న తెలుగులోనూ విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
ఓ కుర్రాడితో ఈగ స్నేహం చేయడం, అతడికి కష్టమొస్తే ఆదుకోవడం లాంటి సీన్స్ చూపించారు. ఈగ విజువల్స్ చూస్తుంటే రాజమౌళి 'ఈగ' గుర్తొచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందనేది చూడాలి?
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)
Comments
Please login to add a commentAdd a comment