ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా?.. నవ్వులు పూయిస్తోన్న టీజర్ | Raj Tarun Latest Movie Paanch Minar Teaser Out Now | Sakshi

Paanch Minar Teaser: 'ఆన్సర్లు తెలియకపోయినా పర్లేదు.. కానీ క్వశ్చన్లు తెలిసుండాలిగా'

Apr 13 2025 6:51 PM | Updated on Apr 13 2025 6:53 PM

Raj Tarun Latest Movie Paanch Minar Teaser Out Now

రాజ్‌తరుణ్‌, రాశీసింగ్‌.. హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న కామెడీ ఎంటర్‌టైనర్ 'పాంచ్‌ మినార్‌'. ఈ సినిమాకు రామ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని  కనెక్ట్ మూవీస్ బ్యానర్‌పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ నటన, ఫన్నీ డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నాటకాలు ఆడుతున్నావా? బ్యాగ్ ఎక్కడ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత 'ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా? డబ్బులు సంపాదించడం' అనే కోటేషన్‌ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఇంటర్వ్యూలో ఆన్సర్లు తెలియకపోయినా పర్లేదు కానీ.. కనీసం క్వశ్చన్స్ అయినా తెలిసుండాలిగా అని బ్రహ్మాజీ చెప్పే డైలాగ్ నవ్వులు తెప్పిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, శ్రీనివాస్‌రెడ్డి  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం పాంచ్ మినార్ టీజర్ చూసేయండి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement