
టాలీవుడ్ ప్రియులను అలరించిన ఆసక్తికర వెబ్ సిరీస్ మస్తీస్. లాక్ డౌన్ టైమ్లో వచ్చిన ఈ సిరీస్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2020లో ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ సిరీస్కు క్రిష్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సిరీస్ సూపర్ హిట్ కావడంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఓటీటీలో సూపర్ హిట్గా నిలిచిన ఈ వెబ్ సిరీస్ను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని జూలై 16న ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా.. ఈ వెబ్ సిరీస్లో నవదీప్, హెబ్బా పటేల్, బిందు మాధవి, చాందిని చౌదరి, అక్షర గౌడ, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషించారు.