ఓటీటీలోకి రానున్న ‘మ‌ట‌న్ సూప్‌’ సినిమా | Mutton Soup Movie OTT Streaming Details | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి రానున్న ‘మ‌ట‌న్ సూప్‌’.. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో మెప్పించిన సినిమా

Nov 3 2025 1:42 PM | Updated on Nov 3 2025 2:07 PM

Mutton Soup Movie OTT Streaming Details

టాలీవుడ్లోమటన్ సూప్’ పేరుతో విడుదలైన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ బ్యానర్లపై రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో ప్రాజెక్ట్తెరకెక్కింది. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల ఈ మూవీని నిర్మించారు. ​ రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ అక్టోబర్ 10న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

ఆ వారంలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విడుద‌లైన నాలుగు చిత్రాల్లో ‘మ‌ట‌న్ సూప్‌’ చిత్రానికి మంచి రెస్పాన్స్ ద‌క్కింది. ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ విమ‌ర్శ‌కులు సైతం సినిమాలో ప్ర‌ధానాంశం వైవిధ్యంగా ఉంద‌ని ప్ర‌శంసించ‌టం విశేషం. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ‘మ‌ట‌న్ సూప్‌’ రూపొందింది. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని, ఉహించని మ‌లుపుల‌తో, ప్రేక్ష‌కులు ఎక్స్‌పెక్ట్ చేయ‌లేని ట్విస్టుల‌తో, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ద‌ర్శ‌కుడు సినిమాను తెర‌కెక్కించారు.

త్వ‌ర‌లోనే ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. చాలా త‌క్కువ బ‌డ్జెట్‌లో ‘మ‌ట‌న్ సూప్‌’ సినిమాను ఎక్క‌డా త‌గ్గ‌కుండా ద‌ర్శ‌కుడు రామ‌చంద్ర వ‌ట్టికూటి తెరకెక్కించారు. హిట్తో తాజాగా ఆయన మ‌రో వైవిధ్య‌మైన కంటెంట్‌తో నెక్ట్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నాల్లో బిజీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement