mutton
-
ఉదయం 11కే మటన్ మాయం!
సాక్షి, హైదరాబాద్: ఆదివారం ఉదయం... 11.30 గంటల సమయం.. హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన అరవింద్ మటన్ తీసుకురావడం కోసం బయల్దేరాడు.. తాను రెగ్యులర్‌గా వెళ్లే షాపు దగ్గరికి వెళ్లే సరికి మూసేసి ఉంది. దగ్గర్లోని మరో దుకాణానికి వెళితే బారెడంత క్యూ కనిపించింది. లేటవుతుందేమోనని మరో చోటికి వెళ్తే... మటన్ అయిపోయిందని చెప్పారు.దీనితో వెనక్కి వచ్చి క్యూలో నిలబడి అయినా తీసుకెళదామనుకుంటే... తన వంతు కూడా రాకముందే మటన్ అయిపోయిందంటూ దుకాణం కట్టేయడం మొదలుపెట్టారు.. అరవింద్ ఒక్కడికే కాదు, ఉప్పల్ ఒక్క ప్రాంతంలోనే కాదు.. ఆదివారం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపించింది. చెంగిచర్ల, జియాగూడ వంటి మటన్ మండీల్లోనూ మధ్యాహా్ననికే స్టాక్ ఖాళీ అయిపోయింది. మరోవైపు బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్‌లతో కోళ్లు మృతిచెందుతున్నాయన్న వార్తలతో చికెన్ దుకాణాలు వెలవెలబోయాయి. ధర విపరీతంగా పెరిగినా.. ఇటీవలి కాలంలో మటన్ ధరలు కిలో రూ.800 నుంచి రూ.900 వరకు చేరాయి. అలాంటిది డిమాండ్ పెరిగిపోవడంతో.. ఆదివారం చాలా చోట్ల కిలో రూ.1,000 నుంచి రూ.1,100 వరకు ధరతో విక్రయించారు. అయినా సరే మటన్ షాపుల వద్ద జనం కిటకిటలాడారు. కిలో తీసుకునే చోట అరకిలో, అరకిలో తీసుకునే చోట పావుకిలోనో, 400 గ్రాములో కొనుక్కుని వెళ్లారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడంతో.. సాధారణంగా మహారాష్ట్ర, రాజస్తాన్‌తోపాటు పలు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు మేకలు, గొర్రెలు దిగుమతి అవుతాయి. అయితే బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్ల ప్రభావం నేపథ్యంలో ఈ దిగుమతులు తగ్గిపోయాయి. వైరస్లు ఇతర ప్రాంతాలకు విస్తరించవద్దన్న ఉద్దేశంతో మేకలు, గొర్రెల రవాణాను నియంత్రిస్తున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో రాష్ట్రంలోని జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి అరకొరగా గొర్రెలు, మేకలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో.. ధరలు పెరిగాయని మీరాలం మండిలోని మక్బూల్, జియాగూడ మండిలో మేకల వ్యాపారి రమేశ్ తెలిపారు.చికెన్‌కు తగ్గిన డిమాండ్బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్‌లతో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయన్న వార్తలతో చికెన్‌కు డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. సాధారణంగా ప్రతి ఆదివారం కిటకిటలాడే చికెన్ సెంటర్లు... ఈ ఆదివారం వెలవెలబోయాయి. వైరస్ భయం కారణంగా ఎందుకైనా మంచిదంటూ.. చికెన్‌కు బదులు మటన్ తీసుకెళ్తున్నామని వినియోగదారులు చెబుతున్నారు. నిజానికి చికెన్‌ను 70 నుంచి 100 డిగ్రీల ఉష్ణో గ్రత వద్ద బాగా ఉడికించి తింటే ఎటువంటి హానీ ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
చికెన్‌ను వదిలేసి మటన్ వైపు జనం మొగ్గు
సాక్షి, అమరావతి: సహజంగా ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులు అందుబాటు ధరలో ఉండే చికెన్ (Chicken) కోసం షాపుల ముందు క్యూ కడతారు. కాస్త ఆలస్యమైనా వేచి చూస్తుంటారు. కానీ ఈ ఆదివారం ‘ముక్క’ లెక్క మారింది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ వదిలేసిన జనం మటన్ (Mutton), చేపల వైపు మొగ్గు చూపారు. దుకాణాల ఎదుట పెద్ద ఎత్తున బారులు తీరారు. రాత్రి అవుతున్నా అదే కోలాహలం నెలకొంది. ఇదే అదనుగా వ్యాపారులు రేట్లు పెంచేశారు. కొద్ది వారాలుగా బర్డ్‌ఫ్లూ (Bird Flu) విస్తరిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన కూటమి సర్కారు.. మటన్, చేపల ధరల నియంత్రణను సైతం గాలికి వదిలేసింది. రెడ్జోన్లుగా ప్రకటించడంతో..కోళ్లకు సోకిన బర్డ్‌ఫ్లూ వ్యాధి ప్రభావం మాంసం విక్రయాలపై భారీగా పడింది. తూర్పు, పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా, కర్నూలు జిల్లాల్లోనూ బర్డ్ ఫ్లూ బయటపడటంతో అక్కడ కోళ్లను, కోడి గుడ్లను తినవద్దని హెచ్చరించిన అధికారులు ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చికెన్ అంటేనే ఉలిక్కి పడుతున్నారు. దీంతో 15 రోజుల క్రితం రూ.220 పలికిన కిలో చికెన్ రూ.180కి పడిపోయింది. ఆదివారం కిలో చికెన్ రూ.150 నుంచి రూ.100కి అమ్మినా కొనేవారు కరువయ్యారు.ప్రత్యామ్నాయంగా మటన్, చేపల కోసం మాంసం ప్రియులు ఎగబడుతున్నారు. మటన్, చేపల విక్రయాలు రెట్టింపు అయ్యాయి. ఆదివారం తెల్లవారగానే మాంసం ప్రియులు చేపలు, మటన్ మార్కెట్లకు పరుగులు దీశారు. అప్పటికే అక్కడ రద్దీగా ఉండటాన్ని చూసి ఉసూరుమన్నారు. మాంసం అమ్మకాలు ఉదయమే ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈ ఆదివారం రాత్రి 9 గంటలైనా పొట్టేళ్లను కోశామని వ్యాపారులు ‘సాక్షి’కి వెల్లడించారు. కోళ్ల విక్రయాలు మాత్రం భారీగా పడిపోయాయి. ఇష్టానుసారం ధరలు..కోళ్లను తినకూడదనే హెచ్చరికలతో చేపలు, మటన్ ధరలు అమాంతం ఎగబాకాయి. సాధారణంగా కిలో మటన్ రూ.800 – రూ.900 వరకు ఉండగా డిమాండ్ కారణంగా రూ.1,000 నుంచి రూ.1,100 వరకు పెరిగింది. కొందరు వ్యాపారులు మాత్రం రెట్టింపు అమ్మకాలు జరుగుతుండటంతో కేజీ మటన్ రూ.900కి ఇస్తున్నారు. కిలో చేపలు రాగండి రకం రూ.160 నుంచి రూ.180కి పెరిగాయి. బొచ్చెలు రూ.180 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. కొరమీను కేజీ రూ.650 నుంచి రూ.1,000 వరకూ పలుకుతోంది. రొయ్యలు, పీతలకు సైతం డిమాండ్ ఏర్పడింది. రొయ్యలు కిలో రూ.500 నుంచి రూ.700 వరకూ, పీతలు కేజీ రూ.400 నుంచి రూ.600 వరకూ విక్రయిస్తున్నారు. రకాన్ని బట్టి ధరల్లో తేడాలుంటాయి. అనకాపల్లిలో కేజీ మటన్ సాధారణంగా రూ.800–900 ఉండగా ఈ ఆదివారం రూ.1,000 వరకు పలికింది. కూరగాయల రేట్లు సైతం..హోటల్‌కి వెళితే చికెన్ బిర్యానీ, చికెన్ స్టార్టర్స్‌ను ఇష్టపడే వారంతా ఇప్పుడు మటన్‌తో పాటు చేపలు, పీతలు, రొయ్యల వంటకాలను అడుగుతున్నారు. వీధుల్లో బండ్ల మీద చికెన్ పకోడీ, చికెన్ లాలీపాప్స్, కబాబ్స్, ఫ్రైడ్ చికెన్, చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, షవర్మా లాంటి చికెన్ వంటకాల వ్యాపారాలన్నీ పడిపోయాయి. కర్రీ పాయింట్లు, మెస్‌లలో సైతం చికెన్ వంటకాల విక్రయాలు తగ్గిపోయాయి. ప్రభుత్వ సంక్షేమ, ప్రైవేటు విద్యాసంస్థల హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టళ్లల్లో మెనూలో మార్పులు చేశారు. మాంసం పెట్టాల్సిన రోజు కూడా కాయగూరలతో వండినవే పెడుతున్నారు.దీంతో కూరగాయల ధరలు సైతం పెరుగుతున్నాయి. రెండు వారాలుగా బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతుండటంతో చికెన్‌కు దూరమైన వినియోగదారులు మటన్, చేపల వైపు మొగ్గు చూపుతారని తెలిసినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, ధరలను నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. బర్డ్ ఫ్లూను రాష్ట్రవ్యాప్తం చేసి కళ్లు మూసుకుని కూర్చుందని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆదివారం వస్తే కనీసం 60 నుంచి 100 కోళ్ల విక్రయాలు జరిగేవి. ఇప్పుడు ఒక్కటి కూడా అమ్మలేకపోతున్నాం. దీంతో ఈ వారం అసలు కోళ్లు తేవడమే మానేశాం. అయితే మటన్ బాగా కొంటున్నారు. సాధారణంగా ప్రతి వారం 10 నుంచి 15 పొట్టేళ్ల మాంసాన్ని అమ్మేవాళ్లం. ఇప్పుడు అది రెట్టింపు అయ్యింది. రాత్రి అయినా ఇంకా అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. – సురేష్, మాంసం వ్యాపారి, బల్లెంవారి వీధి, విజయవాడచికెన్ తిందామంటే బర్డ్‌ఫ్లూ వచ్చిందని వద్దంటున్నారు. పోనీ చేపలుగానీ మటన్గానీ కొందామంటే వాటి రేట్లు అమాంతం పెంచేశారు. దుకాణాల వద్ద జనం భారీగా ఉంటున్నారు. చాలాసేపు వేచి ఉంటేగానీ మటన్ దొరకలేదు. ఒక్కో దుకాణంలో ఒక్కో విధంగా వసూలు చేస్తున్నారు. – సూర్యారావు, వందడుగుల రోడ్డు, విజయవాడ. -
‘చరిత్రకెక్కిన మటన్ వార్’.. బీజేపీ ఎంపీ విందుపై అఖిలేష్ చురకలు
లక్నో: బీజేపీ ఎంపీ విందుపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ ఇటీవల ఇచ్చిన విందులో జరిగిన ‘మటన్ వార్’ చరిత్రకెక్కిందని విమర్శలు గుప్పించారు. ‘మీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నో సంఘటనలు ప్రాచుర్యం పొందాయి. కానీ మటన్ వార్ కూడా జరిగిందని నాకు తెలియనే లేదు. నేను ఎన్నో యుద్ధాలను చూశాను.. ఈ మటన్ యుద్ధం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది’ అంటూ వ్యంగ్యస్థ్రాలు సంధించారు.అసలేం జరిగిందంటే.. ఉత్తర్‌ప్రదేశ్ మీర్జాపూర్లో బదోహి బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ బింద్ ఈ నెల 14వ ఆయన కార్యాలయంలో విందు ఏర్పాటు చేశారు. దీనికి చాలా మంది హాజరయ్యారు. అయితే వారికి భోజనం వడ్డించే సమయంలో ఓ వ్యక్తికి.. ఎంపీ డ్రైవర్ సోదరుడు మటన్ కర్రీ వేశాడు. కానీ అందులో ముక్కలు లేక కేవలం గ్రేవీ మాత్రమే ఉండటంతో సదరు వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఆ ఎంపీ డ్రైవర్ సోదరుడిని దూషించాడు. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. మిగితా వారు కూడా వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం పలువురు బీజేపీ సీనియర్ నేతలు జోక్యం చేసుకోవడంతో ఆ గొడవ సద్దుమణించింది. ఆ తర్వాత ఈ ఘటనపై బీజేపీ ఎంపీ ఆఫీస్ వ్యవహారాలు చూసుకునే ఉమాశంకర్ బింద్ ఈ ఘటనపై స్పందిస్తూ. విందులో చివర్లో మద్యం చేసించిన వారు రావడం వల్ల గొడవ జరిగినట్లు తెలిపారు.మరోవైపు మీర్జాపూర్ జిల్లాలోని మజ్వాన్ నియోజకవర్గంలో నిషాద్ పార్టీ ఎమ్మెల్యే అయిన వినోద్ కుమార్ బింద్, బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఎంపీగా గెలిచారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని సుచిస్మిత మౌర్యపై, భదోహి ఎంపీ రమేశ్ బింద్ కుమార్తె జ్యోతి బింద్‌ను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) బరిలోకి దింపింది -
మటన్ అంటే పరార్, వీకెండ్ అంటేనే బెంబేలు!
వీకెండ్ వస్తోంది అంటే మస్తీ మజా అన్నట్టు ఉండేది ఒకప్పుడు. కానీ ఇపుడు హెటెల్కి వెళదాం అంటేనే బెంబేలెత్తే పరిస్థితి. గొప్ప గొప్ప పేరున్న హోటల్స్‌లోనూ, ఐస్ క్రీం పార్లర్లలోనూ, బేకరీల్లోనూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఇటీవలి కాలంలో బ్రాండెడ్ అని చెప్పుకునే హోటల్స్, ఐస్ క్రీం షాపుల్లో అపరిశుభ్రవాతావరణం, పురుగులు పట్టిన వస్తువులు, కాలం తీరిన సరుకులు. తాజాగా బెంగళూరులో మటన్‌కు బదులు కుక్క మాంసం అమ్ముతున్నారనే వార్తలు ఆందోళన రేపాయి. తాజాగా మటన్ తిని ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటం కలకలం రేపింది.ఇటీవల రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి బెంగళూరుకు మటన్ పేరుతో కుక్క మాంసం సరఫరా చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లా, కల్లూరు గ్రామంలో ఒక కుటుంబం కూడా మటన్ తెచ్చుకుని తిన్నారు. వాంతులు విరోచనాలతో ఆస్పత్రిలో చేరిన నలుగురూ ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయిందా.. లేక ఆ కుటుంబంపై ఏదైనా విషప్రయోగం జరిగిందా అనే అంశంపై విచారణ జరుపుతున్నారు. దీంతోవీకెండ్ అంటేనే భయమేస్తోందని, మటన్పేరెత్తాలంటేనే వణుకు పుడుతోందంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పుకార్లను నమ్మవద్దని కొందరు సూచిస్తోంటే, ఇంటి ఫుడ్డే బెటర్ అంటున్నారు కొంతమంది నెటిజన్లు. కాగా మరోవైపు కుక్కమాసం విక్రయిస్తున్నారన్న పుకార్లపై స్పందించిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులు అది కుక్క మాంసం కాదు మేక మాంసమే అని తేల్చిన సంగతి తెలిసిందే. ఇది గుజరాత్‌లోని కచ్-భుజ్ ప్రాంతాలలో కనిపించే సిరోహి అనే మేక జాతికి చెందినది వెల్లడించారు. వాటికి కొద్దిగా పొడుగు తోక, మచ్చలు కూడా ఉంటాయని తేల్చి చెప్పారు. మటన్ ఖరీదు ఎక్కువ కావడంతో తక్కువ రేటులో ఈ మాంసాన్ని విక్రయిస్తారని వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో బీజేపీ మాజీఎంపీ ప్రతాప్ సింహ మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. -
ఆ బ్లడ్ గ్రూప్ అయితే..చికెన్, మటన్ వద్దంటున్న వైద్యులు!
వారంలో కనీసం ఒక్కరోజైన ముక్క లేనిది ముద్ద దిగదు నాన్ వెజ్ ప్రియులుకు. పుటుకతో వెజిటేరియన్ అయినవాళ్లు సైతం దీని రుచికి ఫిదా అయ్యి నాన్‌వెజ్‌గా మారినోళ్లు కూడా ఉన్నారు. అందులోనూ ఆదివారం వస్తే మటన్ లేదా చికెన్ ఉండాల్సిందే. లేదంటే నోరు చచ్చిపోయినట్లు ఉంటుంది. నిజానికి శాకాహారమే ఆరోగ్యానికి మంచిది. కానీ నాన్‌వెజ్ మాత్రం రుచికి రుచి.. నాలికకు ఆ మషాల తగులుతుంటే..అబ్బా! చెబుతుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అలాంటిది వైద్యులు మాత్రం మీ బ్లడ్ గ్రూప్‌ని బట్టి చికెన్ లేదా మటన్‌ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తినమని సూచిస్తున్నారు. పైగా ఆ బ్లడ్ గ్రూప్ అయితే అస్సలు తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు తినొచ్చు, ఎవరూ తినకూడదో సవివిరంగా తెలుసుకుందామా..! ఎందుకిలా వైద్యుల హెచ్చరిస్తున్నారంటే..అందరి బ్లడ్ గ్రూప్ ఒకలా ఉండుదు. అలాగే కొందరికి నాన్‌వెజ్ సులభంగా జీర్ణమవుతుంది. మరికొందరూ తినగానే పలు సమస్యలు ఫేస్ చేస్తుంటారు. అందువల్ల ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు ఏదీ తింటే బెటర్ అనేది తెలుసుకుని తినమని సూచిస్తున్నారు వైద్యులు. మనకి బ్లడ్ గ్రూప్‌లో నాలుగు రకాలు ఉన్నాయి. అవి వరుసగా ఓ, ఏ, బీ, ఏబీలు. ఈ నాలుగు బ్లడ్ గ్రూపులకు చెందిన వ్యక్తులు తీసుకునే నాన్‌వెజ్ ఆధారంగా జీర్ణమవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయా గ్రూప్‌లోని వ్యక్తుల్లో జీర్ణశక్తి వేరువేరుగా ఉంటుంది. కొందరికి త్వరగా జీర్ణమైతే మరికొందరికి లేట్‌గా అవుతుంది. అందువల్ల ఎవరు ఎలాంటి నాన్‌వెజ్ తింటే బెటర్ అనేది సవివరంగా చూద్దాం!. 'ఏ' గ్రూప్.. ముందుగా ఏ బ్లడ్ గ్రూప్ వారు రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వీరి ఆరోగ్యం శాకాహారానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. చికెన్ లేదా మటన్ తక్కువగా తినడం మంచిది. వీళ్లు సీఫుడ్ వంటివి తినాలనుకుంటే వివిధ రకాల పప్పులను చేర్చాలి. ఈ ఆహారాలైతేనే వారికి జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటాయి. 'బీ' గ్రూప్.. బీ బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక శక్తి ఎక్కువ. చికెన్, మటన్ వంటి ఏ మాంసాహారం అయినా హాయిగా తినొచ్చు. అయితే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఉండటం కూడా ముఖ్యమనేది గ్రహించాలి. ఇక 'ఏబీ', 'ఓ' గ్రూప్‌ల వ్యక్తులు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకపోయినా మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించడం మంచిది. ఆకుకూరలు, సీఫుడ్ తినొచ్చు. కాగా, కొందరికి మాత్రం జీర్ణసమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఏదైనా తింటే వెంటనే కడుపులో అసౌకర్యం మెుదలవుతుంది. జీర్ణమం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటివారు వైద్యుడిని సంప్రదించాలి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. దీని గురించి మరింతగా తెలుసుకునేలే మీ వ్యక్తిగత వైద్యుడిని లేదా నిపుణుల సలహాలు, సూచనలతో అనుసరించడం ఉత్తమం. (చదవండి: పాపులర్ వీడియో గేమర్‌కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!) -
ఈ స్టయిల్లో మటన్ కీమా మెంతి ట్రై చేశారా? అస్సలు బోర్ కొట్టదు!
వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ వెంట ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు మాంసాహార ప్రియులు. ప్రతీ వారం ఒకే లాగా కూర చేసుకుంటే తినడానికి బోర్ కొడుతుంది.చిన్న పిల్లలు కూడా పెద్దగా ఇష్టపడరు కదా. అందుకే మటన్ కీమా మెంతి కూరతో కలిపి పోషకాలతోపాటు రుచిగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి: కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగిన మటన్ కీమా – పావుకిలో రెండు కట్టలు చింత మెంతి కూర(శుభ్రం చేసి కడిగినవి), ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ మసాలా, బిర్యానీ ఆకులు కొద్దిగా పసుపు, రుచికి తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి దాదాపు గంటలో ఈ వంటకాన్ని రడీ చేసుకోవచ్చు. తయారీ విధానం కుక్కర్లో శుభ్రం చేసిన కీమాకు కొద్దిగా అల్లం వెల్లులి పేస్ట్, ఉప్పు కారం వేసి బాగా కలిపి మూతపెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చే దాకా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నూనెలో జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత మూకుడు పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకులు వేసి బాగా వేయించి పెట్టుకోవాలి. ఇపుడు ఆ మూకుడులోనే కొద్దిగా నూనె వేడి చేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అవి చిటపట లాడుతుండగా వెల్లుల్లి, అల్లం పేస్ట్, ధనియాల పొడి , ఉల్లిపాయలు, బే ఆకులు , గరం మసాలా వేసి, వేయించినూనె తేలెదాకా వేయించాలి. ఇపుడు ఉడికించి పెట్టుకున్న కీమావేసి నీళ్లు ఇగిరే దాకా సన్న సెగమీద ఉడకనివ్వాలి. ఇక చివరగా ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతికూర, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా ఉడక నివ్వాలి. మంచి సువాసనతో కుతకుత లాడుతూ ఉడుకుతుంది. ఇందులో ఇష్టమున్న వాళ్లు రెండు చిన్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంతే ఎంతో రుచి మటన్ కీమా మెంతికూర రడీ. దీన్ని చక్కని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, పుదీన,ఉల్లిపాయ, నిమ్మ స్లైస్‌లతో అందంగా గార్నిష్ చేయండి. రైస్తోగానీ, చపాతీలో గానీ చక్కగా ఆరగించే యొచ్చు. అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మటన్ కీమాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. -
నల్లిబొక్క కోసం లొల్లి.. పెళ్లి క్యాన్సిల్.. ‘బలగం’ సీన్ రిపీట్
పెళ్లంటే జీవితాంతం గుర్తుండిపోయే ఘట్టం. ప్రతి ఒక్కరు తమ వివాహాన్ని ఎంతో ఆర్భాటంగా చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి అందమైన ఈ వేడుకను కొంతమంది చిన్న చిన్న విషయాలతో ముడిపెట్టి.. పెళ్లిని రద్దు చేసుకునే వరకు వెళ్తున్నారు. అమ్మాయి వాళ్లు మర్యాదలు సరిగా చేయలేదని, కట్నం ఎక్కువ ఇవ్వలేదని పెళ్లి క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వింత వింత కారణాలతో ఏకంగా పీటల మీద కూడా పెళ్లిళ్లు ఆపేస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే తెలంగాణలో జరిగింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. నిశ్చితార్థం రోజు మటన్‌లో నల్లి బొక్క వడ్డించలేదని ఆగ్రహం చెందిన వరుడి కుటుంబ సభ్యులు చివరికి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన వధువుకి, జగిత్యాలకు చెందిన వరుడితో వివాహం నిశ్చయమైంది. గత నెల నవంబర్‌లో వధువు ఇంటి వద్ద నిశ్చితార్థం వేడుక నిర్వహించారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి తరపున కుటుంబ సభ్యులు భోజనాలను ఘనంగా ఏర్పాటు చేశారు. వివాహానికి వచ్చిన అతిథులందరికీ నాన్ వెజ్ వంటలు వండించారు. అయితే నిశ్చితార్థం అనంతరం తమకు మటన్‌లో మూలుగ బొక్క వడ్డించలేదని అబ్బాయి బంధువులు చెప్పడంతో గొడవకు దారితీసింది. దీనిపై స్పందించిన వధువు కుటుంబ సభ్యులు మూలుగు బొక్క వంటకాలలో చేయించలేదని చెప్పడంతో గొడవ కాస్తా పెద్దదిగా మారింది. ఈ వివాదం కాస్తా చివరికి పోలీసుల వరకు చేరుకోవడంతో.. అబ్బాయి కుటుంబ సభ్యులను నచ్చజెప్ప ప్రయత్నం చేశారు. కానీ వారు ససేమిరా అంటూ తమను అవమానించారని అన్నారు. అంతేగాక నల్లి బొక్క మెనూలో లేదన్న విషయాన్ని వధువు కుటుంబసభ్యులు ఉద్దేశపూర్వకంగా తమకు తెలియకుండా దాచిపెట్టారని వాదించారు. చివరికి ఈ పెళ్లి వద్దంటూ వరుడి కుటుంబం తెగేసి చెప్పడంతో వివాహం రద్దు చేసుకున్నారు. అయితే ఈ ఘటన అచ్చం ఇటీవల టాలీవుడ్లో వచ్చిన ‘బలగం’ సినిమాలోని కథను గుర్తు చేసింది. మార్చిలో విడుదలైన ఈ సినిమాలో.. మూలుగ బొక్క కోసం బావ బామ్మర్ధుల మధ్య గొడవ జరిగి విడిపోతారు. ఇక్కడ కూడా అలాగే మూలుగ బొక్క కోసం గొడవ పడి చివరకు పెళ్లి సంబంధం రద్దయింది. -
చైనాలో మరో దారుణం వెలుగులోకి: మండిపడుతున్న జనం
Cats being killed and sold as mutton or pork in china డ్రాగన్ కంట్రీ చైనాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మటన్ పేరుతో పిల్లుల మాంసాన్ని విక్రయిస్తున్న వైనం కలకలం రేపింది. దేశంలో జంతురక్షణ చట్టాలు,ఆహార భద్రత మరోసారి చర్చకు దారి తీసింది. దాదాపు 1,000 పిల్లులను కబేళాకు తరలిస్తుండగా చైనా పోలీసులు పట్టుకున్నారు. దీంతో పిల్లి మాంసాన్ని పంది మాంసం లేదా మటన్‌గా విక్రయించే అక్రమ వ్యాపారం గుట్టు రట్టయింది. ఈ నెల ప్రారంభంలో జంతు పరిరక్షణ కార్యకర్తల సూచన మేరకు, తూర్పు చైనీస్ ప్రావిన్స్ జియాంగ్సులోని జాంగ్జియాగాంగ్ అధికారులు దాడులు నిర్వహించారని ది పేపర్ నివేదించింది. పిల్లుల మాంసాన్ని మటన్ గా నమ్మించి దేశంలోని దక్షిణ ప్రాంతానికి సరఫరా చేస్తున్నారని తెలిపింది. దక్షిణ చైనా ప్రావిన్స్‌లోని గ్వాంగ్‌డాంగ్‌లో ఇంతకుముందు ఇలాంటి అక్రమ వ్యాపారాలను నిలిపివేసినట్లు జంతు సంరక్షణ ఉద్యమకర్త హాన్ జియాలీ చెప్పారు. చైనాలో ఒక్కో క్యాటీ (600 గ్రాములు) పిల్లి మాంసం ధర 4.5 యువాన్లు పలుకుతోందట. జాంగ్జియాగాంగ్ నగరంలోని కబేళాలో భారీ ఎత్తున పిల్లులను వేలాడదీసి ఉండటంతో అనుమానం వచ్చిన యానిమల్ రైట్స్ ప్రొటెక్షన్ కార్యకర్తలు నిఘా వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఒక ట్రక్కులో అక్రమంగా రవాణా చేస్తుండగా ఈ పిల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీటిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. తాజా ఘటనతో చైనీయులలో ఆహార భద్రత పై ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. సోషల్ మీడియా సంస్థ వీబోలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇది తిన్న మనుషులకు భయంకరమైన చావు తప్పదని ఒకరు వ్యాఖ్యానించగా, ఈ దేశంలో పిల్లులకు, కుక్కలకు జీవించే హక్కు లేదా అని మరొకరు ప్రశ్నించారు. అంతేకాదు చచ్చినా ఇకపై బార్బెక్యూ మాంసం తినను అని మరొక యూజర్ కమెంట్ చేయడం గమనార్హం. -
నోరూరించే కొబ్బరి ఖీమా బాల్స్ ట్రై చేయండిలా..!
కొబ్బరి ఖీమా బాల్స్‌కి కావలసినవి: కొబ్బరి – ఒకచిప్ప కారం – అర టీస్పూను పసుపు – చిటికెడు గరం మసాలా – అరటీస్పూను ధనియాల పొడి – అర టీ స్పూను కొత్తిమీర తరుగు – మూడు టీస్పూన్లు శనగపిండి – రెండు టీస్పూన్లు పచ్చిమిర్చి – రెండు స్పూన్లు కరివేపాకు – రెండు రెమ్మలు ఉప్పు – రుచికి సరిపడా నూనె – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి∙ కొబ్బరి చిప్పలోని కొబ్బరిని తురుముకోవాలి∙ కొబ్బరి తురుముని గిన్నెలో వేసి.. కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి∙ చివరిగా శనగపిండివేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకోవాలి∙ బాణలిలో నూనె వేసి వేడెక్కిన తరువాత ఉండలను వేసి వేయించాలి ∙ఉండలు వేగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి మూడు నిమిషాలు వేయించితే కొబ్బరి ఖీమా బాల్స్ రెడీ ∙ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసంతో సర్వ్‌చేసుకోవాలి. (చదవండి: నోరూరించే రొయ్యల పచ్చడి ఇలా చేస్తే..చక్కగా లాగించేస్తారు!) -
CWC Meeting: అతిథుల కోసం 78 రకాల వంటకాలు.. నోరూరాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: త్వరలో తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో హైదరాబాద్‌లోనే సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయని.. ఈ క్రమంలో రాష్ట్ర కేడర్‌లో జోష్ నింపడం, బీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలను ఇవ్వడం కోసం ఇక్కడ సమావేశాలు పెట్టారని చర్చ జరుగుతోంది. అతిథుల కోసం 78 రకాల వంటకాలు ఇక సీడబ్ల్యూసీ భేటీలకు వచ్చే నేత లకు తెలంగాణ ప్రత్యేక వంటకాలతోపాటు హైదరాబాదీ దమ్ బిర్యానీని వడ్డించనున్నారు. మొత్తంగా 78 రకాల వంటకాలను వడ్డించేలా పీసీసీ ఏర్పా ట్లు చేసింది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్నిరకాల వంటలు, రుచులు ఉండేలా మెనూ సిద్ధం చేసింది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, వివిధ రాష్ట్రాల ఇతర సీనియర్లు వస్తున్న నేపథ్యంలో.. ప్రత్యేక వంటకాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వంట మనుషులను రప్పించింది. ►అల్పాహారంలో ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు, ఉగ్గాని, కిచిడీ, ఉప్మా, రాగి, జొన్న సంగటి, పాయ సూప్, ఖీమా రోటీ, మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ వడ, ప్రూట్ సలాడ్ వంటివి వడ్డించనున్నారు. ►మధ్యాహ్నం భోజనంలో హైదరాబాదీ దమ్ బిర్యానీ, హలీమ్, బగారా రైస్, కుర్మా, దాల్చా మటన్, స్పెషల్ చికెన్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, తలకాయ కూర, లివర్ ఫ్రై, తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ, చింతచిగురు మటన్, గోంగూర మటన్, చేపలు వడ్డిస్తారు. ►శాకాహారుల కోసం పచ్చిపులుసు, గోంగూర చట్నీ, గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, అంబలి, దాల్చా, రోటి పచ్చళ్లు ఉండనున్నాయి. ►స్నాక్స్ ఐటమ్స్‌గా ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సర్వపిండి, వివిధ రకాల సమోసాలు, కుడుములు, మురుకులు, ఉడికించిన మొక్కజొన్న, సకినాలు, గారెలు రుచి చూపించనున్నారు. -
సరదా సన్నివేశం.. రాహుల్‌కు మటన్ కర్రీ వండటం నేర్పిన లాలూ
పాట్నా: బిహార్‌లో ప్రసిద్ధి చెందిన 'చంపారన్ మటన్' ను ఏవిధంగా వండించాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లాలూ ప్రసాద్ యాదవ్ నేర్పించారు. లాలూ సూచనలు ఇస్తుండగా.. రాహుల్ మటన్ కర్రీని వండారు. ఈ వీడియోను రాహల్ తన ట్విట్టర్(ఎక్స్) లో షేర్ చేశారు. 'నాకు వంట చేయడం వచ్చు. కానీ పూర్తి నైపుణ్యం లేదు. యూరప్‌లో ఉండేప్పుడు ఒంటరిగా ఉండేవాన్ని. ఆ క్రమంలో వండటం నేర్చుకున్నాను. కొన్ని ప్రాథమిక వంటలు చేస్తాను.' అని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో తెలుపుతూ.. నేడు లాలూ యాదవ్ నేతృత్వంలో మంచి వంటకాన్ని వండాను అని రాసుకొచ్చారు. మటన్ వండే క్రమంలో నేతలిద్దరు ముచ్చటించుకున్నారు. వంట వండటం ఎప్పుడు నేర్చుకున్నారని రాహుల్ అడిగిన ప్రశ్నకు లాలూ సమాధానమిచ్చారు. ' 7వ తరగతి చదివే క్రమంలో నేను అన్నయ్యల వద్దకు పాట్నా వెళ్లాను. అక్కడ వారు ఉద్యోగం చేసేవారు. అక్కడే వారికి వండిపెట్టేవాడిని. కట్టెలు ఎలా సమకూర్చుకోవాలి..? వంట పాత్రలు ఎలా శుభ్రపరుచుకోవాలి..? మసాలాలు ఎలా రుబ్బుకోవాలో? నేర్చుకున్నాను.' అని లాలూ చెప్పారు. ఏడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో లాలూ.. రాహల్‌కు మటన్ ఎలా చేయాలో నేర్పించారు. మసాలాలతో సహా అన్ని రకాలను ఎలా కలపాలో చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రాజకీయాలపై ఆసక్తికర ప్రశ్నోత్తరాల చర్చ సాగింది. రాహుల్: రాజకీయాల్లో సీక్రెట్ మసాలాలు ఎంటి? లాలూ: కష్టపడి పనిచేయడమే, అన్నాయానికి వ్యతిరేకంగా పోరాడాలి. రాహుల్: మటన్ కర్రీని తయారు చేయడం.. రాజకీయాలు రెండింటి మధ్య తేడా ఏంటి? నాకు అన్ని కలపడం ఇష్టం.. లాలూ: అవును, కొంచమైనా కలపకుండా రాజకీయాలు చేయలేం. నాకూ రాజకీయం అంటే ఇష్టం. రాహుల్: మాలాంటి వచ్చే తరానికి మీరిచ్చే సలహా ఏంటీ? లాలూ: మీ పూర్వికులు ఈ దేశాన్ని కొత్త మార్గంలో నడిపించారు. ధర్మాన్ని కాపాడారు. మీరు దాన్ని మరిచిపోకూడదు. మటన్ కర్రీ తయారు చేసేప్పుడు బిహార్ డిప్యూటీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఆయన సోదరి మిసా భారతి అక్కడే ఉన్నారు. వంట పూర్తి అయిన తర్వాత డైనింగ్ టేబుల్ వద్దకు అందరూ రావడాన్ని గమనించవచ్చు. ఆ తర్వాత రాహుల్ ఆ మటన్ కర్రీని తన సోదరి ప్రియాంకకు కూడా ప్యాక్ చేసుకుని తీసుకువెళ్లారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
ఘుమఘుమలాడే సూకా మటన్ ఇలా చేసుకోండి
సూకా మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు మటన్ ముక్కలు – అరకేజీ అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర టీస్పూన్లు ఉల్లిపాయ తరుగు – అరకప్పు వెల్లుల్లి రెబ్బలు – పదిహేను టొమాటో తరుగు – అరకప్పు పసుపు – పావు టీస్పూను కారం – రెండు టీస్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా సూకా మసాలాకు కావాల్సినవి ధనియాలు – టీస్పూను సోంపు – టీస్పూను జీలకర్ర – అరటీస్పూను ఎండు మిర్చి – రెండు మిరియాలు – అరటీస్పూను (వీటన్నింటిని వేయించి ΄÷డిచేసుకోవాలి) తాలింపు కోసం: నూనె – రెండు టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క – అరంగుళం ముక్క లవంగాలు – రెండు యాలకులు – రెండు బిర్యానీ ఆకు – ఒకటి; కరివేపాకు – రెండు రెమ్మలు తయారీ విధానం ఇలా.. మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ప్రెజర్ కుకర్ గిన్నెలో వేయాలి. దీనిలో.. పసుపు, పావు టీస్పూను కారం, కొద్దిగా ఉప్పు వేసి కల΄ాలి. కొద్దిగా నీళ్లు΄ోసి, మీడియం మంట మీద ఆరు విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక, కరివేపాకు తప్పించి తాలింపు దినుసులు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. ఇవన్నీ వేగాక ఉల్లితరుగు, తురిమిన వెలుల్లిని వేసుకోవాలి. ఉల్లి మిశ్రమం బ్రౌన్ కలర్లోకి మారాక టొమాటో తరుగు వేయాలి. టొమాటో పచ్చివాసన పోయాక ఉడికించిన మటన్, కారం, మసాలా పొడి వేయాలి. పది నిమిషాలు వేగాక కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి తిప్పాలి. నూనె పైకి తేలేంత వరకు వేయిస్తే సూకా మటన్ రెడీ. -
మటన్ కర్రీ కోసం వరుడి గొడవ.. పెళ్లిని రద్దు చేసిన వధువు..
ఒడిశా:మటన్ కర్రీపై గొడవ కారణంగా పెళ్లిని రద్దు చేసింది ఓ వధువు. వరుడు అతని స్నేహితులు మటన్ కోసం తన కుటుంబంపై దురుసుగా ప్రవర్తించిన కారణంగా వధువు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన ఒడిశా సంబల్పూర్ జిల్లాలోని ధామా ప్రాంతంలో జరిగింది. స్థానిక వివరాల ప్రకారం.. అంగరంగవైభవంగా పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పూలు, పందిళ్లు, బంధువులతో ఇళ్లంతా సందడిగా ఉంది. రుచికరమైన వంటకాలు వడ్డించారు. పెళ్లికి వచ్చినవారికి లేదనకుండా భోజనాలు పెట్టారు. పెళ్లి అయ్యాక రాత్రిలో వరుడి స్నేహితులు ఆరుగులు భోజనాలకు వచ్చారు. అప్పటికే మటన్ కర్రీ అయిపోయింది. దీంతో వారు పెళ్లికూతురు కుటుంబంపై వాగ్వాదానికి దిగారు. మటన్ కూర పెట్టాల్సిందేనని వధువు తండ్రిని అవమానించారు. వరుడు కూడా అతని స్నేహితులకు వంత పాడాడు. దీంతో వధువు పెళ్లిని రద్దు చేసింది. అయితే.. వరుడు జాతీయ స్థాయి బ్యాంకులో పనిచేస్తాడని స్థానికులు తెలిపారు. 'పెళ్లి అంతా బాగానే అయింది. మటన్‌తో పాటు అన్ని వంటకాలు అందరికీ సరిపోయాయి. చివరగా వచ్చిన ఓ ఆరుగురికి మాత్రం సరిపోలేదు. రాత్రి అయినందున వడ్డించలేకపోయాము. పెళ్లికొడుకుతో సహా అతని స్నేహితులు మా కుటుంబాన్ని అవమానించారు. నాన్నపై దురుసుగా ప్రవర్తించారు. కుటుంబంలో పెద్దవారిని గౌరవించలేనివారితో నేను ఎలా భద్రతను పొందగలను?' అని వధువు అంటోంది. ఇదీ చదవండి:యువకుల పిచ్చిచేష్టలు.. స్నేహితుడిని నగ్నంగా చేసి -
మటన్ పెట్టకుండా సాంబారు పోశాడని.. పెళ్లి విందులో కొట్లాట
సాక్షి, మెదక్: పెళ్లి విందులో తలెత్తిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. నర్సాపూర్ మండల పరిధిలోని చండి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్ మండల పరిధిలోని చండి గ్రామానికి చెందిన అమ్మాయిని అదేమండలం నత్నయిపల్లికి చెందిన అబ్బాయితో శనివారం చండి గ్రామంలో పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం భోజనం వడ్డిస్తున్న క్రమంలో అబ్బాయి తరఫు వ్యక్తికి మటన్ ముక్కలు వేయకుండా సాంబార్ పోశాడని గొడవకు దిగారు. మటన్ వడ్డిస్తున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిపై అబ్బాయి తరఫు వారు దాడి చేయగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి నలుగురిపై కేసు నమోదు చేశారు. చదవండి: ఖమ్మం మెడికో విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలు! -
రంజాన్ స్పెషల్ రెసిపీ.. మటన్ రోగన్ జోష్
కావలసినవి: ►మటన్ – కిలో; పాలు– కప్పు; కుంకుమ పువ్వు– చిటికెడు; నెయ్యి– అర కప్పు; ఇంగువ – అర టీ స్పూన్; జీలకర్ర– టీ స్పూన్; ►దాల్చిన చెక్క – 2 అంగుళాల ముక్క; నల్ల యాలకులు – 5; మిరియాలు – టీ స్పూన్; ►ఎండుమిర్చి– 4; పెరుగు– 150 గ్రా; గోధుమపిండి– టేబుల్ స్పూన్; శొంఠిపొడి – 2 టీ స్పూన్లు; ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; ధనియాల పొడి– టేబుల్ స్పూన్; ►కశ్మీరీ మిరపపొడి– టేబుల్ స్పూన్; సోంపు పొడి– టేబుల్ స్పూన్; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్. తయారీ: ►మటన్‌ను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ►పాలను వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి. ►ప్రెషర్ పాన్‌లో నెయ్యి వేడి చేసి దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి వేసి సన్న మంట మీద వేయించాలి. అవి వేగిన తరవాత అందులో మటన్ వేసి కలిపి మూత పెట్టి మీడియం మంట మీద ఐదారు నిమిషాల సేపు ఉంచాలి. ఇప్పుడు మూత తీసి అరకప్పు నీటిని పోసి మూత పెట్టి పది– పదిహేను నిమిషాల సేపు ఉడికించాలి. ►మరొక పాత్రలో పెరుగు, గోధుమ పిండి కలిపి అందులో కుంకుమ పువ్వు కలిపిన పాలు, ఉప్పు, సోంపు పొడి, ధనియాల పొడి, కశ్మీరీ మిరప్పొడి, శొంఠిపొడి కలిపి ఈ మొత్తం మిశ్రమాన్ని మటన్ మిశ్రమంలో కలిపి చిక్కదనం చూసుకుని అవసరమైతే మరికొంత నీటిని కలిపి, ప్రెషర్ పాన్ మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ►వేడి, ప్రెషర్ తగ్గిన మూత తీసిన కొత్తిమీర తరుగు చల్లి వెంటనే మూత పెట్టాలి. ఈ మటన్ రోగన్ జోష్ చపాతీ, పుల్కాలతోపాటు అన్నంలోకి కూడా బాగుంటుంది. -
మటన్ ఖీమా సమోసా తయారీ ఇలా! పుదీనా చట్నీతో తిన్నారంటే..
Mutton Keema Samosa: మటన్ ఖీమా సమోసా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండిలా! కావలసినవి: ►మటన్ కీమా – అర కేజీ ►పచ్చి బఠాణీ– 100 గ్రాములు ►ఉల్లిపాయ – 1 (తరగాలి) ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ►అల్లం వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ►పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి) ►మిరప్పొడి– టీ స్పూన్ ►ధనియాల పొడి– టీ స్పూన్ ►జీలకర్ర పొడి – టేబుల్ స్పూన్ ►బంగాళ దుంపలు – 2 ►కొత్తిమీర తరుగు – కప్పు ►నూనె – పావు కేజీ ►గోధుమ పిండి – పావు కేజీ. తయారీ: ►గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, వేడి నీటిని పోసి చపాతీలకు కలుపుకున్నట్లు ముద్దలా కలుపుకుని తడి వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి. ►బంగాళదుంపలను కడిగి చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరగాలి. ►పచ్చి బఠాణీలను కడిగి చిటికెడు చక్కెర వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టాలి. ►ఖీమాను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మరోసారి కడగాలి. ►మందపాటి పెనంలో టీ స్పూన్ నూనె వేసి ఖీమా వేసి రంగు మారేవరకు సన్నమంట మీద వేయించాలి. ►ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, బఠాణీ, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, మిరప్పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ►పదిహేను నిమిషాల సేపు సన్న మంట మీద ఉడికించాలి. ►ఖీమా, బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి ఒకసారి రుచి చూసి అవసరం అనిపిస్తే మరికొంత ఉప్పు, మిరప్పొడి కలుపుకోవాలి. ►చివరగా కొద్దిసేపు మూత తీసి మంట పెంచి కలుపుతూ ఉడికించాలి. ►తేమ ఆవిరై పోయి ఖీమా కర్రీ సమోసా స్టఫ్ చేయడానికి తగినట్లు రావాలి. ►గోధుమ పిండిని చపాతీల్లా వత్తుకుని ఒక్కో చపాతీని సగానికి కట్ చేసుకోవాలి. ►ఒక ముక్కని ఐస్‌క్రీమ్ కోన్లాగ చేసుకోవాలి. ►టీ స్పూన్ ఖీమా కర్రీ పెట్టి అంచులను అతికిస్తే సమోసా ఆకారం వస్తుంది. ►ఒక చపాతీతో రెండు సమోసాలన్నమాట. ►అన్నింటినీ ఇలాగే చేసుకుని ఆ తర్వాత బాణలిలో నూనె వేడి చేసి సమోసాలను దోరగా కాల్చుకోవాలి. ►ఈ సమోసాల్లోకి పుదీనా చట్నీ మంచి కాంబినేషన్. ట్రై చేయండి: ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా -
వంటిల్లు.. పాలక్ చికెన్
ఇంటికి బంధువులు వస్తున్నారు. డైనింగ్ టేబుల్ కళకళలాడుతోంది. తోటకూర ఉంది... పక్కనే వేటకూరా ఉంది. కూరగాయల ఆధరువులూ కొలువుదీరాయి. బంధువుల వచ్చారు... భోజనాలు పూర్తయ్యాయి. వేటకూర పా త్రలో గరిటె మాత్రమే మిగిలింది. తోటకూర పా త్ర అదే కళతో నిండుగా ఉంది. కూరగాయల వంటలు దిగులుగా చూస్తున్నాయి. అతిథులు రుచిగా భోజనం చేశారు... సంతోషం. మరి... రుచికి ఆరోగ్యం జతగా చేరి ఉంటే మరీ సంతోషం. అందుకే... ఈ వారానికి ఇలా వండి టేస్ట్ చేద్దాం. పాలక్ చికెన్ కావలసినవి: పా లకూర– 100 గ్రాములు (శుభ్రం చేసినది) ; బోన్ లెస్ చికెన్ – పా వు కేజీ. మారినేట్ చేయడానికి: పెరుగు – 2 టేబుల్ స్పూన్లు ; మిరప్పొ డి – అర టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; కసూరి మేథీ (మెంతి ఆకులపొ డి) – టీ స్పూన్ (΄పొ డి లేక΄ోతే గుప్పెడు తాజా ఆకులు వాడవచ్చు) ; గరం మసాలాపొ డి– అర టీ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నిమ్మరసం– టేబుల్ స్పూన్ ; నెయ్యి– టేబుల్ స్పూన్ . గ్రేవీ కోసం: నూనె – 2 టేబుల్ స్పూన్లు ; యాలకులు – 3 ; బిర్యానీ ఆకులు – 2 ; జీలకర్ర – అర టీ స్పూన్ ; ఉల్లిపా యలు – 3 (గ్రైండ్ చేయాలి) ; వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ; అల్లం పేస్ట్ – టేబుల్ స్పూన్ ; పచి్చమిర్చి– 2 (నిలువుగా చీరాలి) ; టొమాటోలు – 3 (తొక్క, గింజలు తీసి గ్రైండ్ చేయాలి) ; మిరప్పొ డి– అర టీ స్పూన్ ; గరం మసాలాపొ డి– టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; కసూరి మేథీ– టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; మీగడ– టేబుల్ స్పూన్. గారి్నష్ చేయడానికి: వెన్న – టేబుల్ స్పూన్ తయారీ: ♦ చికెన్‌ను శుభ్రం చేసి పెద్ద పా త్రలో వేయాలి. మరొక పా త్రలో మారినేట్ చేయడానికి తీసుకున్న దినుసులను వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కల్లో వేసి అన్నింటికీ సమంగా పట్టించి మూతపెట్టి ఆ పా త్రను మూడు గంటల సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ♦ ఈ లోపు ఒక పా త్రలో నీటిని మరిగించి పా లకూర ఆకులను వేసి రెండు నిమిషాలపా టు మరిగిన తర్వాత ఆకులను చిల్లుల గరిటెతో బయటకు తీసి చన్నీటిలో వేయాలి. వేడి తగ్గిన తర్వాత వడ΄ోసి పక్కన ఉంచాలి. చల్లారిన తరవాత మెత్తగా గ్రైండ్ చేయాలి. ♦ మందపా టి పా త్రలో నెయ్యి వేడి చేసి మారినేట్ చేసిన చికెన్ వేసి (మీడియం మంట మీద ) ముక్కలను గరిటెతో కలుపుతూ మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడిన తరవాత దించేసి పక్కన పెట్టాలి. ♦ వెడల్పుగా ఉన్న పా న్లో నూనె వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. యాలకులు, బిర్యానీ ఆకులు, పచి్చమిర్చి, ఉల్లిపా య, వెల్లుల్లి, అల్లం పేస్టు వేసి మూడు నిమిషాల పా టు వేయించాలి. నూనె వేరు పడిన తర్వాత టొమాటో పేస్ట్ వేసి కలిపి అందులో ధనియాలపొ డి, మిరప్పొ డి, కసూరీ మేథీ, గరం మసాలాపొ డి, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తరవాత పా లకూర పేస్ట్, ఉడికించిన చికెన్ వేసి కలిపి నాలుగు నిమిషాల సేపు ఉడికించాలి. చివరగా మీగడ వేసి కలిపి దించేయాలి. వడ్డించేముందు కర్రీ మీద వెన్న వేయాలి. గోంగూర మటన్ కావలసినవి: మటన్ – అర కేజీ ; గోంగూర – పా వు కేజీ (ఆకులు); పసుపు – టీ స్పూన్ ; అల్లంవెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ; ఉల్లిపా య ముక్కలు – కప్పు ; మిరప్పొ డి– టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; జీలకర్రపొ డి– అర టీ స్పూన్ ; పచ్చి మిర్చి – 5 (నిలువుగా చీరాలి) ; కొత్తిమీర – చిన్న కట్ట ; గరం మసాలాపొ డి– టీ స్పూన్ ; షాజీర– టీ స్పూన్ ; యాలకులు – 2 ; దాల్చిన చెక్క – అంగుళం ముక్క ; లవంగాలు – 2 ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నూనె – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ♦ ప్రెషర్ కుక్కర్లో మటన్, జీలకర్రపొ డి, ధనియాల΄పొ డి, మిరప్పొ డి, అరకప్పు నీరు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. ♦ పెనంలో నూనె వేడి చేసి గరం మసాలా దినుసులన్నీ వేసి వేగిన తర్వాత ఉల్లిపా య ముక్కలు, ఉప్పు వేయాలి. ఉల్లిపా య ముక్కలు రంగు మారిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన ΄ోయేవరకు వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు, పచి్చమిర్చి, గోంగూర ఆకులు వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉడికించాలి. గోంగూర మెత్తబడిన తర్వాత మటన్ (ఉడికించిన నీటితోపా టు) వేసి కలిపి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ♦ చివరగా అవసరాన్ని బట్టి మరికొంత నీటిని వేసి కలిపి గరం మసాలాపొ డి, కొత్తిమీర ఆకులు వేసి కలిపి దించేయాలి. చికెన్ వెజిటబుల్ స్ట్యూ కావలసినవి: చికెన్ – అర కేజీ ; నూనె – 2 టేబుల్ స్పూన్లు ; జీలకర్ర – అర టీ స్పూన్ ; మెంతులు – అర టీ స్పూన్ ; అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్ ; కరివేపా కు – 2 రెమ్మలు ; ఉల్లిపా య – 1 (తరగాలి) ; పచి్చమిర్చి– 1 (తరగాలి) ; టొమాటో – 1 (తరగాలి) ; బంగాళదుంప ముక్కలు – కప్పు ; క్యారట్ ముక్కలు – కప్పు ; బీన్స్ ముక్కలు – అర కప్పు ; పసుపు – టీ స్పూన్ ; కశ్మీర్ మిరప్పొ డి – టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; గరం మసాలాపొ డి– అర టీ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నిమ్మరసం – టీ స్పూన్ ; మిరియాలపొ డి – పా వు టీ స్పూన్ నీరు – 3 కప్పులు. తయారీ: ∙ ♦ చికెన్ ముక్కలను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ♦ పెద్ద పెనంలో నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు వేయించాలి. అందులో కరివేపా కు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి వేగిన తరవాత ఉల్లిపా య, పచి్చమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు మసాలాపొ డి, పసుపు, కశీ్మర్ మిరప్పొ డి, ధనియాలపొ డి వేసి అర నిమిషం పా టు సన్న మంట మీద అన్నింటినీ కలుపుతూ వేయించి, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ♦ ఇందులో చికెన్ ముక్కలు వేసి మసాలా మిశ్రమం బాగా పట్టేటట్లు కలిపి మూత పెట్టి సన్న మంట మీద ఐదు నిమిషాల పా టు ఉడికించాలి. ♦ ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, నీరు ΄ోసి కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు ఉడికించాలి. ఆ తర్వాత క్యారట్, బీన్స్ వేసి కలిపి మళ్లీ మూత పెట్టి మరో ఐదారు నిమిషాల పా టు ఉడకనివ్వాలి. ఇప్పుడు నిమ్మరసం, మిరియాలపొ డి వేసి కలిపి దించేయాలి. వేడి వేడి చికెన్ వెజిటబుల్ స్ట్యూ రెడీ. బీరకాయ రొయ్యలు కావలసినవి: రొయ్యలు – అరకేజీ (΄పొ ట్టు వలిచినవి) ; బీరకాయ – అరకేజీ ; పసుపు – అర టీ స్పూన్ ; పచ్చిమిర్చి– 2 ; ఉల్లిపా యలు – 4 ; అల్లంవెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్ ; ఆవాలు – టీ స్పూన్ ; జీలకర్ర – టీ స్పూన్ ; కరివేపా కు – 4 రెమ్మలు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నూనె – 4 టేబుల్ స్పూన్లు. తయారీ: ♦ రొయ్యలను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి మందంగా ఉన్న పా త్రలో వేయాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరప్పొ డి, కొద్దిగా నూనె వేసి కలిపి పదినిమిషాల సేపు పక్కన ఉంచాలి. ♦ బీరకాయ చెక్కు తీసి ముక్కలుగా తరగాలి. ♦ పెనంలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపా య ముక్కలు, పచి్చమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత కరివేపా కు వేయాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నమంట మీద ఉడకనివ్వాలి. ∙రొయ్యలు, మసాలా మిశ్రమం ఉన్న పా త్రను మరొక స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద ఉడికించాలి (ఇందులో నీరు ΄ోయనక్కరలేదు). రొయ్యలు ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని బీరకాయ ఉడుకుతున్న పా త్రలో వేయాలి. ఇందులో ఉప్పు, మిరప్పొ డి కూడా వేసి బాగా కలిపి రుచి కలిసే వరకు రెండు నిమిషాల సేపు ఉడికించాలి. -
ముక్క లేనిదే.. ముద్ద దిగేదేలే!
తెలుగింటి పాకశాలల్లో గతంలో రాజ్యమేలిన గోంగూర, ఆవకాయ ఇప్పుడు సైడ్ అయిపోయాయి. ‘తాజాకూరలలో రాజా ఎవరండీ.. వంకాయేనండీ..’అంటూ పాడుకున్న కూరగాయలేవీ తెలుగువారి పంటికి రుచించడం లేదు. ఇంటా బయటా, విందు వినోదం ఏదైనా సరే.. ముక్క లేనిదే ముద్ద దిగేదేలే.. అన్నట్టుగా మారిపోయింది. మాటామంతీ జరగాలంటే మటన్.. చీటికీమాటికీ చికెన్.. ఫుల్లు జోష్‌లో ఫిష్.. వెరైటీగా కావాలంటే ప్రాన్స్, బర్డ్స్.. ఎన్ని రకాల మాంసం ఉంటే అంత సరదా. సండే లేదు మండే లేదు.. అన్నీ నాన్‌వెజ్‌డేలే అయిపోయాయి. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. –సాక్షి, హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మాంసం వినియోగం ఎక్కువ. ఇందులోనూ తెలంగాణ టాప్‌లో, ఏపీ మూడో స్థానంలో ఉండటం విశేషం. గొర్రెలు, మేక మాంసం వృద్ధిలో తెలంగా ణ.. చేపలు, రొయ్యల ఉత్పత్తితో ఏపీ ముందంజ లో ఉంది. ఇంకోవైపు చికెన్, గుడ్లు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నవి కూడా తెలుగు రాష్ట్రాలే. దమ్ బి ర్యానీ, పాయ, తలకాయ, కీమా, నాటు కోడి ఇగురు, చేపల పులుసు, రొయ్యల ఫ్రై, ఎండు చేపల వంకాయ ఇలా చెప్పుకుంటూ పోతే జిహ్వకో రుచి అన్నట్టుగా మాంసం వంటకాల జాబితా చాంతాడును మించి ఉంటోంది. ఫంక్షన్లలో అయితే ఎన్నో వెరైటీల డిష్‌లను వడ్డిస్తుండటం కనిపిస్తోంది. దేశంలో తెలంగాణనే టాప్ మాంసాహార వినియోగంలో దేశంలో తెలంగాణదే హవా. తినడమే కాదు ఉత్పత్తిలోనూ మన రాష్ట్రానిదే అగ్రస్థానం. ఉత్పత్తి పెరుగుతున్నా వినియోగం అధికంగా ఉండటంతో ధరలూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో మాంసం ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయింది. మరోవైపు గత నలభై ఏళ్లకాలంలో మాంసం ధరలు 30రెట్లు పెరగడం గమనార్హం. జాతీయ వార్షిక తలసరి మాంసం వినియోగం 5.4 కేజీలుకాగా.. అదే తెలంగాణలో అంతకు నాలుగు రెట్లు ఎక్కువగా అంటే 21.17 కిలోల మాంసం వినియోగిస్తున్నారు. గతంలో తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి రోజూ 700–800 లారీల గొర్రెలు, మేకలు దిగుమతి అయ్యేవని.. రాష్ట్రంలో గొర్రెలు/మేకల సంఖ్య పెరగడంతో దిగుమతి చేసుకునే లారీల సంఖ్య 100 వరకు తగ్గిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం ఇలా.. గ్రామీణ భారతీయుల్లో 6.4% మంది మటన్, 21.7 % మంది చికెన్, 26.5 % మంది చేపలు, 29.2% మంది గుడ్లు తింటున్నట్టు నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ డేటా చెబుతోంది. పట్టణాల్లో 21% మంది మటన్, 21% మంది చేపలు, 27% చికెన్, 37.6% మంది గుడ్లను వినియోగిస్తున్నారు. రాజస్తాన్‌లో శాకాహారులే అధికం రాజస్తాన్‌లో శాకాహారులు అత్యధిక సంఖ్యలో ఉండటం విశేషం. ఆ రాష్ట్రంలో 73.2 శాతం పురుషు లు, 76.6 శాతం మహిళలు శాకాహారులే. ఇక హరియాణాలో 68.5శాతం పురుషులు, 70 శాతం మ హిళలు.. పంజాబ్‌లో 65.5శాతం పురుషులు.. 68 శాతం మంది స్త్రీలు శాకాహారాన్నే ఇష్టపడుతుండటం విశేషం. రూ.7,200 కోట్ల సంపద సృష్టించాం ‘‘2017లో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంతో మాంసం ఉత్పత్తిలో విప్లవాత్మక మా ర్పులు వచ్చాయి. దీనికి ముందు రాష్ట్రంలో మటన్ ఉత్పత్తి 5.4 లక్షల టన్నులుగా ఉంటే, ప్ర స్తుతం 10.04 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. 2014– 15లో సాలీనా తల సరి మాంసం లభ్యత 12.95 కేజీలుకాగా అదిప్పుడు 22.70 కేజీలకు చేరింది. గొర్రెల పెంపకానికి ఇ ప్పటివరకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాం. తద్వారా రూ.7,200 కోట్ల సంపద సృష్టించాం. – దూదిమెట్ల బాలరాజు యాదవ్, తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ -
మంట పుట్టిస్తున్న మటన్ ధరలు.. కిలో ధర ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: మాంసాహార ప్రియులకు చేదువార్త. మటన్ ధరలు మంట రేపుతున్నాయి. తెలంగాణలో మేక మాంసం ధర మరోసారి ‘వెయ్యి’ మైలురాయివైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుత స్పీడ్ చూస్తుంటే త్వరలోనే మటన్ థౌజండ్ వాలా పేలడం ఖాయంగానే కనిపిస్తోంది. క్వాలిటీని బట్టి కిలో మటన్ ధర ప్రస్తుతం 800 నుంచి 850 రూపాయలకు విక్రయిస్తున్నారు. కార్తీక మాసం ముగిసిన తర్వాత ధర మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మటన్ ఇప్పటికే కొన్నిచోట్ల నాలుగు అంకెల స్థాయికి చేరిందని టాక్. సామాన్యులకు దూరం గత కొద్ది సంవత్సరాలుగా ధరలు బాగా పెరుగుతూ వస్తుండటంతో సామాన్యులు మటన్ కొనాలంటే జంకుతున్నారు. మేక మాంసం కొనే స్తొమత లేక చికెన్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అరకొరగా మాత్రమే మటన్ కొంటున్నారు. ధరలు భారీగా పెరగడంతో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు మటన్‌కు దూరమవుతున్నారు. గతేడాది జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మటన్ కిలో ధర వెయ్యి రూపాయలు దాటినా తర్వాత దిగివచ్చింది. బర్డ్‌ప్లూను బూచిగా చూపి అప్పట్లో కొంతమంది వ్యాపారులు అడ్డగోలుగా రేట్లు పెంచేశారు. కరోనా సమయంలోనూ మటన్ ధరలు ఆకాశాన్నంటాయి. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో మటన్ వినియోగం ఎక్కువ. ఈమధ్య కాలంలో మటన్ వినియోగం బాగా పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల వినియోగానికి సరిపడనంతగా గొర్రెలు, మేకలు అందుబాటులో లేకపోవడమే ధరలు పెరగడానికి కారణమని అంటున్నారు. జాతీయ పశుగణన లెక్కల ప్రకారం తెలంగాణలో 2019లో 1.91 కోట్ల గొర్రెలు, మేకలు ఉన్నట్టు అంచనా. ఇవి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 600 ట్రక్కుల్లో గొర్రెలు, మేకలు తెలంగాణకు సరఫరా అవుతుంటాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం కూడా డిమాండ్‌ను అందుకోకలేకపోతోంది. గొర్రె, మేకల నుంచి 50 శాతం మాత్రమే మాంసం వస్తుందని.. అదే చికెన్ అయితే 70 శాతం వస్తుందని.. మటన్ ధర ఎక్కువగా ఉండడానికి ఇదీ ఓ కారణం. కరోనా తర్వాత ప్రజలు ఎక్కువగా మంసాహారం వైపు మొగ్గు చూపుతుండడం గమనార్హం. చికెన్ మాదిరిగా మటన్ ధరను నిర్ణయించే ఓ వ్యవస్థ లేకపోవడంతో ధరలపై నియంత్రణ లేకుండా పోతోంది. ధరల మాట ఎలా ఉన్నా ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మాత్రం గత నెల రోజులుగా మటన్ విక్రయాలు భారీగా పెరిగాయని పరిశీలకుల అంచనా. మాంసాహారులే ఎక్కువ దేశంలో మాంసాహారులు పెరుగుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5 వెల్లడించింది. అధిక శాతం ప్రజలు వారానికి కనీసం ఒకసారి చేపలు, చికెన్, మాంసంలో ఏదో ఒక దానిని కచ్చితంగా ఆరగిస్తున్నారని తెలిపింది. అయితే మటన్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే టాప్‌లో ఉంది. 73 శాతం మంది ప్రజలు కనీసం వారంలో ఒకసారైనా మాంసం తింటున్నారు. కేవలం 4.4 శాతం మంది ఎటువంటి మాంసాహారం ముట్టకుండా కోడిగుడ్డు మాత్రమే తీసుకుంటున్నారు. 0.27 శాతం మంది మాత్రమే వెజిటేరియనన్లు ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. (క్లిక్ చేయండి: నిమ్స్‌కు మునుగోడు గ్రహణం) -
Recipe: మటన్ కీమా.. పచ్చిబొప్పాయి తరుగు.. కకోరి కబాబ్ తయారీ ఇలా!
మటన్ కీమాతో కకోరి కబాబ్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. కకోరి కబాబ్ తయారీకి కావలసినవి: ►మటన్ ఖీమా – రెండు కప్పులు ►వెల్లుల్లి పేస్టు – అరటీస్పూను ►అల్లం పేస్టు – అరటీస్పూను ►లవంగాలు – నాలుగు ►నల్లయాలుక్కాయ – ఒకటి ►దాల్చిన చెక్క పొడి – ఒకటిన్నర టీస్పూన్లు ►జాజికాయ పొడి – పావు టీస్పూను ►నెయ్యి – పావు కప్పు ►గుడ్డు – ఒకటి ►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►పచ్చిమిర్చి తరుగు – మూడు టేబుల్ స్పూన్లు ►పచ్చిబొప్పాయి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►జీలకర్ర – టీస్పూను ►జాపత్రి పొడి – టీస్పూను ►ఉల్లిపాయ తరుగు – రెండు కప్పులు ►కాబూలి చనా పొడి – పావు కప్పు ►మిరియాల పొడి – పావు టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానం: ►ముందుగా నెయ్యిలో ఉల్లిపాయ తరుగును గోల్డెన్ బ్రౌన్కలర్లోకి మారేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ►ఒక గిన్నెలో మటన్ ఖీమా, మిగతా పదార్థాలన్నీ వేసి చక్కగా కలుపుకుని గంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ►గంట తరువాత నానబెట్టిన మిశ్రమాన్ని కబాబ్‌లా వత్తుకుని గ్రిల్ మీద బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలి ►చక్కగా కాలాక కొద్దిగా నెయ్యి రాసి మరో రెండు నిమిషాలు కాల్చి తీసేయాలి ►ఈ కబాబ్లపైన వేయించిన ఉల్లిపాయ తరుగు చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Chicken Strips Recipe: మైదా, బ్రెడ్ ముక్కల పొడి.. చికెన్ స్ట్రిప్స్ తయారీ ఇలా! Sweet Potato Cutlet Recipe: చిలగడ దుంపతో తియ్యటి కట్లెట్.. -
Recipe: మటన్ కీమా- చీజ్ సమోసా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోండి!
ఆలూ సమోసా, ఆనియన్ సమోసా, కార్న్ సమోసా.. ఎప్పుడూ ఇలా రోటీన్‌గా కాకుండా కాస్త భిన్నమైన సమోసా రుచి ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే, మటన్ కీమా– చీజ్‌తో సమోసా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి! కీమా– చీజ్ సమోసా తయారీకి కావలసినవి: ►మటన్ కీమా – 1 కప్పు (కొద్దిగా మసాలా జోడించి మెత్తగా ఉడికించుకోవాలి) ►మైదా పిండి – పావు కిలో, వాము – అర టీ స్పూన్ ►చీజ్ తురుము – అర కప్పు, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్ ►రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, సోయాసాస్ – 2 టీ స్పూన్లు ►ఉల్లికాడ ముక్కలు – 2 టీ స్పూన్లు, పెరుగు – 1 టేబుల్ స్పూన్ ►మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్, నీళ్లు – సరిపడా ►ఉప్పు – తగినంత తయారీ: ►ముందుగా కళాయిలో నూనె వేసి.. అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ►అందులో కీమా, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్, వాము వేసుకుని గరిటెతో తిప్పుతూ బాగా వేయించుకోవాలి. ►అనంతరం సరిపడా ఉప్పు, మొక్కజొన్న పిండి, పెరుగు వేసి తిప్పుతూ ఉండాలి. ►స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరో గిన్నె తీసుకుని, అందులో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు పోసి బాగా కలుపుతూ.. చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ►దీనిని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ►ఆ ముద్దను చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి. ►పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల కొద్దిగా కీమా మిశ్రమాన్ని, కొద్దిగా చీజ్ తురుము పెట్టి.. అంచులు మూసేయాలి. ►అన్నీ అలాగే చేసుకుని.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ట్రై చేయండి: Kala Mutton Recipe Telugu: కాలా మటన్ ఇలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి! Panasa Ginjala Vadalu: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి! -
Recipe: కాలా మటన్ ఇలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి!
ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగల్లో రెండోది బక్రీద్. ఇది త్యాగానికి ప్రతీక. దీనిని ‘ఈదుల్ అజ్ హా’ అని కూడా అంటారు. ఈ రోజూ ప్రతి ముస్లిం తమ తాహతుకు తగ్గట్టుగా ఇరుగు పొరుగు వారికి ఖుర్బానీ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఏటా మంచి ఘుమ ఘుమలతో ఈ పండుగను జరుపు కుంటారు. ఈ సందర్భంగా కాలా మటన్ తయారీ విధానం మీకోసం.. కాలా మటన్ కావలసినవి: ►మటన్ – ముప్పావు కేజీ ►గ్రీన్ చట్నీ(పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు) – అరకప్పు ►పసుపు – అరటీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►పెరుగు – కప్పు ►ఉల్లిపాయ తరుగు – రెండు కప్పులు ►నూనె – ఐదు టేబుల్ స్పూన్లు ►ధనియాలు – టేబుల్ స్పూను ►గసగసాలు – టేబుల్ స్పూను ►యాలుక్కాయలు – నాలుగు ►దాల్చిన చెక్క – అంగుళం ముక్క ►లవంగాలు – ఐదు ►మిరియాలు – ఐదు ►సోంపు – టేబుల్ స్పూను ►ఎండు మిర్చి – నాలుగు ►ఎండుకొబ్బరి తురుము – అరకప్పు ►బిర్యానీ ఆకు – ఒకటి ►షాజీరా – టీస్పూను ►వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►అల్లం తరుగు – టేబుల్ స్పూను ►బంగాళ దుంపలు – రెండు ►చింతపండు గుజ్జు – రెండు టేబుల్ స్పూన్లు తయారీ: ►మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. ►దీనిలో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్రీన్ చట్ని, పెరుగు వేసి కలిపి ఇరవైనిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ►ఇరవై నిమిషాల తరువాత మటన్‌ను కుకర్‌లో వేయాలి. ►దీనిలో కొద్దిగా ఉల్లిపాయ తరుగు, కప్పు నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చేంతవరకు పెద్దమంట మీద ఉడికించాలి. ►తరువాత సన్నని మంట మీద పదినిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేయాలి. ►వేడెక్కిన నూనెలో ధనియాలు, గసగసాలు, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. ►దీనిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ముదురు బ్రౌన్ రంగు వచ్చేంతవరకు వేయించాలి. ►ఇప్పుడు ఎండుకొబ్బరి తురుము వేసి రంగు మారేంత వరకు వేయించి, చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. ►నూనె వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, షాజీరా వేసి నిమిషంపాటు వేయించాలి. ►తరువాత అల్లం, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఉల్లిపాయ తరుగు వేసి లేత బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ►ఇప్పుడు బంగాళ దుంపల్ని తొక్కతీసి ముక్కలు తరిగి వేసి, కొద్దిగా నీళ్లుపోసి మగ్గనివ్వాలి. ►దుంప ముక్కలు సగం ఉడికిన తరువాత ఉడికిన మటన్ మిశ్రమం వేయాలి. ►ఐదు నిమిషాల తరువాత మసాలా పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి పదినిమిషాలపాటు మగ్గనిచ్చి దించేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Sugarcane Shrimp With Prawns: పచ్చి రొయ్యలు... చెరకు ముక్కలు! సుగర్ కేన్ ష్రింప్ తయారీ ఇలా! Senagapindi Masala Roti Recipe: హర్యానా స్టైల్.. శనగపిండి మసాలా రోటీ తయారీ ఇలా! -
మాంసాహార ప్రియులు పెరుగుతున్నారట!.. ముక్క లేనిదే ముద్ద దిగదే!
సాక్షి, అమరావతి: దేశంలో ముక్క లేకుండా ముద్ద దిగని వారి సంఖ్య పెరుగుతోంది. అధిక శాతం ప్రజలు వారానికి కనీసం ఒకసారి చేపలు, చికెన్, మాంసంలో ఏదో ఒక దానిని కచ్చితంగా ఆరగిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5 వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ, పురుషుల నుంచి ఈ వివరాలు సేకరించారు. ఆ సర్వే ప్రకారం దేశంలో శాకాహారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. శాకాహార పురుషుల సంఖ్య 21.6 శాతం నుంచి 16.6 శాతానికి పడిపోయింది. అంటే మాంసాహారులు 5 శాతం పెరిగారు. మహిళల్లో మాంసాహారుల సంఖ్య స్వల్పంగా 0.6 శాతమే పెరిగింది. మాంసాహారాన్ని వ్యతిరేకించే గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ మాంసాహార ప్రియులు స్వల్పంగా పెరిగారు. ఇక్కడే అధికం.. పురుషుల్లో మాంసాహారం తినేవారిలో లక్షద్వీప్‌లో అత్యధికంగా 98.4 శాతం ఉన్నారు. రాజస్తాన్‌లో అత్యల్పంగా 14.1 శాతం ఉన్నారు. లక్షద్వీప్ తర్వాత అండమాన్ – నికోబార్ దీవుల్లో 96.1శాతం, గోవా 93.8 శాతం, కేరళ 90.1శాతం, పుదుచ్చేరి 89.9శాతం మాంసాహారులు ఉన్నారు. ఇక్కడ వారానికోసారి మాంసం తినేవారి నిష్పత్తి కూడా బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మహిళా మాంసాహారులు ఆంధ్రప్రదేశ్‌లో 97.4 శాతం మంది పురుషులు, 95 శాతం మంది మహిళలు మంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సంఖ్య çపురుషుల్లో స్వల్పంగా, మహిళల్లో బాగా పెరిగింది. 2015–16లో 78.2 శాతం మంది పురుషులు మాంసాహారం తీసుకుంటే 2019–21 నాటికి 80 శాతానికి చేరుకుంది. అదే మహిళల్లో 71.2 శాతం నుంచి 83.6 శాతానికి పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పురుషుల్లో 74.6 శాతం నుంచి 73.8 శాతానికి తగ్గితే.. మహిళల్లో మాత్రం 57.7 శాతం నుంచి 72.4 శాతానికి అనూహ్యంగా పెరిగినట్లు సర్వే వెల్లడించింది. చదవండి: అగ్నిపథ్ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తం -
Recipe: అరకేజీ మటన్‌తో ఇలా వండితే.. టేస్ట్ అదిరిపోద్ది!
మటన్‌తో ఘుమఘులాడే ఛ ఘోష్ట్ ఇలా తయారు చేసుకోండి! ఛ ఘోష్ట్ తయారీకి కావలసినవి: ►మటన్ ముక్కలు – అరకేజీ ►శనగపిండి – మూడు టేబుల్ స్పూన్లు ►లవంగాలు – నాలుగు ►అల్లం పేస్టు– టీస్పూను ►వెల్లులి పేస్టు – టీస్పూను ►ఆవనూనె – మూడు టేబుల్ స్పూన్లు ►ధనియాల పొడి – టీస్పూను ►పచ్చిమిర్చి – మూడు ►ఉప్పు – రుచికి సరిపడా ►పెరుగు – మూడు కప్పులు ►కారం – టీస్పూను ►నల్లయాలుక్కాయలు – మూడు ►ఇంగువ – అరటీస్పూను ►దాల్చిన చెక్క – అంగుళం ముక్క ►బిర్యానీ ఆకులు – రెండు ►ఉల్లిపాయలు – రెండు ►అల్లం – రెండు అంగుళాల ముక్క ►కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా. తయారీ.. ►మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. ►అల్లం, వెల్లుల్లి పేస్టులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయాలు, బిర్యానీ ఆకులను దంచుకుని వేయాలి. ►దీనిలోనే పెరుగు వేసి చక్కగా కలుపుకుని ఐదుగంటలపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ►స్టవ్ మీద బాణలిపెట్టి ఆవనూనె వేయాలి. నూనె వేడెక్కిన తరువాత, ధనియాల పొడి, ఇంగువ, కారం పచ్చిమిర్చి వేయాలి. ►అల్లాన్ని తురుముకుని వేయాలి. ►ఐదు నిమిషాలు వేగాక ఉల్లిపాయను ముక్కలు తరగి వేయాలి ►ఉల్లిపాయ వేడిక్కిన తరువాత శనగపిండి వేసి తిప్పాలి. ►నిమిషం పాటు వేగాక, నానబెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని వేసి మగ్గనివ్వాలి ►అరగంటతరువాత పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో ఇరవై నిమిషాలపాటు ఉడికించి నూనె పైకి తేలిన తరువాత దించేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Prawns Salad Sandwich In Telugu: ప్రాన్స్ సలాడ్ శాండ్విచ్ ఇలా తయారు చేసుకోండి! Kullu Trout Fish: ఘుమఘుమలాడే కులు ట్రౌట్ ఫిష్ తయారీ ఇలా! -
Recipe: అన్నం, రుమాలీ రోటీలోకి అదిరిపోయే మటన్ రోగన్ జోష్!
పర్యాటకుల్ని ఆకర్షించే ప్రదేశాల్లో కశ్మీర్ అందాలు మొదటి స్థానంలో ఉంటాయి. అక్కడి పర్యావరణానికి తగ్గట్టుగానే కశ్మీరి వంటకాలు అమోఘమైన రుచితో నోరూరిస్తుంటాయి. కశ్మీరీలనేగాక పర్యాటకుల్ని విపరీతంగా ఆకట్టుకునే కొన్ని వంటకాలను మన ఇంట్లోనే ఎలా వండుకోవచ్చో తెలుసుకుందాం... దమ్ ఆలూ కావలసినవి: బేబీ పొటాటోలు – పది, నీళ్లు – కప్పు, ఆయిల్ – డీప్‌ఫ్రైకి సరిపడా. కూర కోసం: ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర – అరటేబుల్ స్పూను, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, నల్ల యాలుక్కాయలు – రెండు, సాధారణ యాలుక్కాయలు – రెండు, లవంగాలు – ఐదు, ఇంగువ – చిటికెడు, కశ్మీరి ఎండు మిర్చి కారం – టీస్పూను, నీళ్లు – కప్పు, పెరుగు – ముప్పావు కప్పు, శొంఠి పొడి – టీస్పూను, సోంపు పొడి – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, గరం మసాలా – పావుటీస్పూను. తయారీ.. ►ముందుగా పొటాటోలను శుభ్రంగా కడిగి కప్పు నీళ్లుపోసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. ►ఉడికిన దుంపలను తొక్కతీసి ఫోర్క్‌తో చిన్న రంధ్రాలు పెట్టుకోవాలి. ►ఇప్పుడు బాగా వేడెక్కిన ఆయిల్లో దుంపలను బంగారు వర్ణం, క్రిస్పీగా మారేంత వరకు డీప్‌ఫ్రై చేయాలి. ►ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి ఆయిల్ వేసి, వేడెక్కిన తరువాత జీలకర్ర, దాల్చిన చెక్క, నల్ల యాలుక్కాయలు, యాలుక్కాయలు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. ►ఇవన్నీ వేగాక స్టవ్ ఆపేసి కశ్మీరి కారం వేసి తిప్పాలి. ►తర్వాత పెరుగు వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ►ఇప్పుడు శొంఠిపొడి, సోంపు పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ►ఈ మసాలా మిశ్రమంలో డీప్‌ఫ్రై చేసిన బేబీపొటాటోలను వేయాలి. ►అరకప్పునుంచి కప్పు నీళ్లుపోసి మూతపెట్టి అరగంటపాటు సన్నని మంటమీద మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుకోవాలి. ∙అరగంట తరువాత ఆయిల్ పైకితేలుతుంది. ఇప్పుడు గరం మసాలా వేసి తిప్పి దించేయాలి. అన్నం, రోటీలలోకి ఇది మంచి సైడ్ డిష్‌గా పనిచేస్తుంది. రోగన్ జోష్ కావలసినవి: మటన్ ముక్కలు – అరకేజీ, పెరుగు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, ఆవనూనె – అరకప్పు, నల్ల యాలుక్కాయలు – రెండు, సాధారణ యాలుక్కాయలు – నాలుగు, లవంగాలు – నాలుగు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, బిర్యానీ ఆకు – ఒకటి, మిరియాలపొడి – అరటీస్పూను, సోంపు పొడి∙– టీస్పూను, ఇంగువ – అరటీస్పూను, కశ్మీరీ ఎండుమిర్చికారం – రెండు టీస్పూన్లు, రత్నజోట్ (ఒక రకమైన వేరు, రంగుకోసం వాడుతారు) – అరంగుళం ముక్క, కొత్తిమీర – గార్నిష్ కు సరిపడా మ్యారినేషన్ కోసం: సోంపు గింజలు – టీస్పూను, దాల్చిన చెక్క పొడి – పావు టీస్పూను, కశ్మీరీ ఎండు మిర్చికారం – టీస్పూను, మిరియాల పొడి – అరటీస్పూను, యాలుక్కాయ పొడి – అరటీస్పూను. తయారీ.. ►మటన్ ముక్కలను నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వడగట్టాలి. ►మటన్ ముక్కలకు మ్యారినేషన్ కోసం తీసుకున్న పదార్థాలు, కొద్దిగా ఉప్పు వేసి చక్కగా కలిపి గంటన్నరపాటు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి ►మందపాటి బాణలిలో ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ►కాగిన తరువాత బిర్యానీ ఆకులు, యాలుక్కాయలు, దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులన్నీ వేయాలి. ►ఇవన్నీ ఒకనిమిషం పాటు వేగిన తరువాత నానబెట్టుకున్న మటన్‌ను వేసి పెద్ద మంట మీద తిప్పుతూ ఉడికించాలి. ►ఐదు నిమిషాల తరువాత ఇంగువ వేసి తిప్పాలి. ►తరువాత కప్పు నీళ్లుపోసి కలిపి, మూతపెట్టి సన్నని మంటమీద అరగంటపాటు ఉడికించాలి ►మరొక గిన్నెను తీసుకుని పెరుగు, కారం, సోంపు పొడి వేసి చక్కగా కలుపుకోవాలి. ►ఉడుకుతున్న మటన్ మిశ్రమంలో పెరుగు మిశ్రమాన్ని వేసి కలపాలి. ►ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ►ఇప్పుడు రతన్ జోట్‌ను ఒక గిన్నెలో వేసి వేడినూనె పోసి ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి. ►నానిన రతన్ జోట్ మిశ్రమాన్ని ఉడుకుతోన్న మటన్ మిశ్రమంలో వేయాలి. ►మటన్ ముక్కలు మెత్తబడిన తరువాత కొత్తి మీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన రోగన్ జోష్ రెడీ. అన్నం, రుమాలీ రోటీలోకి ఇది చాలా బావుంటుంది. ఇది కూడా ట్రై చేయండి: Chepala Iguru In Telugu: ఘుమఘుమలాడే చేపల ఇగురు చేసుకోండిలా! -
Portable Grill: పోర్టబుల్ గ్రిల్.. చికెన్, మటన్ అన్నింటికీ.. ధర 6,131
ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపేవి నోరూరించే పసందైన రుచులే. స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లినప్పుడు.. అలాంటి రుచులను అందిస్తూ ఆ సందర్భాన్ని అమృత జ్ఞాపకంగా మిగిల్చేదే.. ఈ లగేజ్ స్టయిల్ పోర్టబుల్ గ్రిల్. దీన్ని మన లగేజ్‌తో పాటు వెంట తీసుకెళ్తే చాలు, రుచుల పంట పండినట్లే. ఇందులో ఎలాంటి వంటైనా నిమిషాల్లో రెడీ అవుతుంది. చికెన్, మటన్ వంటి వాటినీ రకరకాలుగా గ్రిల్ చేసుకోవచ్చు. నచ్చిన విధంగా టోస్ట్ చేసుకోవచ్చు. చిత్రంలో కనిపిస్తున్న ఈ మెషిన్ని ఓపెన్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం చాలా సులభం. ఇది చూడటానికి సూట్‌కేస్‌లా ఉంటుంది. మేకర్ ముందు భాగంలో రెండు రెగ్యులేటర్స్ ఉంటాయి. ఇది గ్యాస్ సాయంతో పనిచేస్తుంది. చిన్న గ్యాస్ సిలెండర్‌ని కూడా సెట్ చేసుకోవచ్చు. గ్రిల్ ప్లేట్స్ మార్చుకోవచ్చు. ఈ మేకర్ లోపల రెండు స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన గ్యాస్ స్టవ్‌లు అమర్చి ఉంటాయి. దీని మూత ఒకవైపు మేకర్‌కి అటాచ్ అయ్యుంటుంది. దాంతో సూట్‌కేస్‌ను తెరిచినట్లుగా ఓపెన్ చేసుకోవచ్చు. తేలికగా అటూ ఇటూ కదపడానికి ఒకవైపు రెండు చక్రాలు ఉంటాయి. మరోవైపు డివైజ్ మొత్తాన్ని పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది. అదే మెషిన్ నిలబడటానికి స్టాండ్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇరువైపులా కూరగాయలు కట్ చేసుకోవడానికి, ఉప్పు, కారం డబ్బాలు పెట్టుకోవడానికి స్పెషల్ ప్లేట్స్ అమర్చి ఉంటాయి. ధర - 80 డాలర్లు (రూ.6,131) చదవండి👉🏾Recipes: తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. సింపుల్‌గా ఇలా ఆవకాయ పెట్టేయండి! -
Recipes: జ్యూసీ చికెన్.. మటన్ మామిడి మసాలా.. ఇలా ఈజీగా వండేయండి!
మార్కెట్లన్నింటిని ఆక్రమించి తెగ సందడి చేస్తోన్న మామిడికాయలతో ఆవకాయ, పులిహోరలేగాక, కూరగాయలు, చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్‌తో కలిపి వండుకుంటే రుచికి రుచితోపాటు, మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. కాస్త పుల్లగా, మసాలా ఘాటుతో జ్యూసీగా ఉండే వెరైటీ వంటకాలను మామిడితో ఎలా వండుకోవచ్చో చూద్దాం.... జ్యూసీ చికెన్ కావలసినవి: చికెన్ ముక్కలు – అరకేజీ, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, యాలుక్కాయలు – ఆరు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, ధనియాలపొడి – టీస్పూను, గరం మసాలా – టీస్పూను ఉల్లిపాయ – ఒకటి ( ముక్కలు తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – రెండు(సన్నగా తరగాలి), టొమాటో ప్యూరీ – పావు కప్పు, కొబ్బరి క్రీమ్ – అరకప్పు, తొక్కతీసిన పచ్చి మామిడికాయ ముక్కలు – ముప్పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – పావు కప్పు. మసాలా పేస్టు: ఉల్లిపాయలు – రెండు, వెల్లుల్లి రెబ్బలు – రెండు, కారం – రెండు టీస్పూన్లు, పసుపు – టీస్పూను, ఎండు మిర్చి – పది, సోంపు – రెండు టీస్పూన్లు, పెరుగు – పావు కప్పు. తయారీ.. మసాలా పేస్టుకోసం తీసుకున్న వాటిలో పెరుగు తప్ప, మిగతా వాటన్నింటిని బ్లెండర్లో వేసి పేస్టులా రుబ్బుకోవాలి. తరువాత గ్రైండ్ అయిన మిశ్రమంలో పెరుగు కలపాలి ∙చికెన్‌ను శుభ్రంగా కడిగి ఈ మసాలా పేస్టు పట్టించి రెండు గంటలపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి స్టవ్ మీద కూర వండడానికి బాణలి పెట్టుకుని ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తరువత యాలకులు, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, చికెన్ పట్టించగా మిగిలిన మసాలా పేస్టు, టొమాటో ప్యూరీ వేసి పదినిమిషాలపాటు వేయించాలి ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, వెల్లుల్లి తురుము వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత నానబెట్టుకున్న చికెన్, మామిడికాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి సన్నని మంట మీద అరగంట మగ్గనివ్వాలి అరగంట తరువాత కొబ్బరి క్రీమ్, కొత్తిమీర చల్లుకుని ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ మీద నుంచి దించేయాలి. మటన్ మామిడి మసాలా కావలసినవి: మటన్ – అరకేజీ, పచ్చిమామిడికాయ – ఒకటి, ఆయిల్ – పావు కప్పు, పచ్చిమిర్చి – రెండు, ఉల్లిపాయ తరుగు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు – రెండు టేబుల్ స్పూన్లు, కారం – రెండు టేబుల్ స్పూన్లు, గరం మసాలా – టీస్పూను, పసుపు – అరటీస్పూను, కొత్తిమీర తరుగు – పావు కప్పు. తయారీ.. ∙ ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙మామిడికాయ తొక్కతీసి ముక్కలుగా తరగాలి. ∙స్టవ్ మీద కుకర్ గిన్నెపెట్టి, ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఈ ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి దోరగా వేయించాలి ఇవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టువేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ∙ ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి నాలుగు విజిల్స్‌ను రానివ్వాలి ∙ మటన్ ముక్క మెత్తగా ఉడికిన తరువాత కారం, గరం మసాలా, పసుపు వేసి తిప్పి మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తరువాత కూరకు సరిపడా నీళ్లు, మామిడికాయ ముక్కలను వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి మామిడికాయ ముక్కలు మెత్తబడిన తరువాత కొత్తిమీర చల్లి దించేయాలి. అనప గింజల చారు కావలసినవి: లేత పాలకూర – రెండు కట్టలు, అనపగింజలు – కప్పు, కొత్తి మీర – చిన్న కట్ట, ఉల్లిపాయ – ఒకటి, టొమాటోలు – రెండు, పచ్చిమామిడికాయ ముక్కలు – పావు కప్పు, పచ్చిమిర్చి – ఐదు, వెల్లుల్లి రెబ్బలు – ఐదు, కరివేపాకు – నాలుగు రెమ్మలు, పసుపు – అరటీస్పూను ధనియాల పొడి – టేబుల్ స్పూను, కారం – ఒకటిన్న టేబుల్ స్పూన్లు, ఆవాలు – టీస్పూను, మినపప్పు – అరటీస్పూను, జీలకర్ర – టీస్పూను, ఎండు మిర్చి – మూడు, ఇంగువ – పావు టీస్పూను, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ.. పాలకూర, కొత్తమీర, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి కుకర్ గిన్నెలో కప్పు నీళ్లుపోసి అనపగింజలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, మామిడి కాయ, వెల్లుల్లి తురుము, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి దీనిలో మరో అరకప్పు నీళ్లుపోసి మూతపెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్ వచ్చాక మూతతీసి పాలకూర, ఉప్పు వేసి మరో రెండు విజిల్స్ రానివ్వాలి ∙ ఇప్పుడు కుకర్ మూత తీసి రసానికి సరిపడా నీళ్లుపోయాలి ∙స్టవ్ మీద తాలింపు కోసం మరో బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఇది వేడెక్కిన తరువాత తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి, తరువాత రసంలో వేసి కలుపుకుంటే చారు రెడీ. చదవండి👉🏾Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా -
హైదరాబాదీ మటన్ హలీమ్‌ని ఇలా చేసుకొని తింటే..
రంజాన్ మాసంలో రోజా ఉన్నవారంతా ఉపవాస దీక్ష ముగించాక, బలవర్థక ఆహారం తీసుకుంటారు. ఇలా తీసుకునే ఆహారంలో హలీమ్ ఒకటి. అనేక పోషకాలతో నిండిన హలీమ్‌ను రోజా ఉన్నవారే గాక, ఇతరులు కూడా ఇష్టంగా తింటారు. మసాలా ఘాటు, ఢ్రై ఫ్రూట్స్‌తో ఘుమఘులాడే హలీమ్‌ను ఇంట్లో ఎలా వండుకోవచ్చో చూద్దాం. కావలసినవి: మటన్ ఖీమా – ముప్పావు కేజీ, పచ్చిమిర్చి – ఎనిమిది, అల్లంవెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను, పసుపు – అర టేబుల్ స్పూను, దాల్చిన చెక్క – రెండు అంగుళాల ముక్క, లవంగాలు – నాలుగు, యాలకులు – మూడు, సోంపు – టేబుల్ స్పూను, ► మిరియాలు – టేబుల్ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, గోధుమ రవ్వ – అరకప్పు, మినప్పప్పు – టేబుల్ స్పూను, కందిపప్పు – టేబుల్ స్పూను, పచ్చిశనగ పప్పు – టేబుల్ స్పూను, పెసరపప్పు – టేబుల్ స్పూను, బియ్యం – టేబుల్‌స్పూను. ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు, ►ఉల్లిపాయలు – నాలుగు( సన్నగా తరుక్కోవాలి), అల్లంవెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు – పావుకప్పు, పుదీనా తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి చీలికలు – రెండు, మిరియాలపొడి – అర టేబుల్ స్పూను, పసుపు – పావు టీస్పూను, పెరుగు – ఒకటిన్నర కప్పులు, నెయ్యి – ఆరు టేబుల్ స్పూన్లు, డ్రైఫ్రూట్స్ గార్నిష్‌కు సరిపడా. తయారీ: ∙కుకర్ గిన్నెలో మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి వేయాలి. ►దీనిలో పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు, మిరియాలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్లాసు నీళ్లు పోసి కలిపి, సన్నని మంటమీద ఐదారు విజిల్స్ రానివ్వాలి. ►మరో కుకర్ గిన్నెతీసుకుని గోధుమ రవ్వ, పప్పులు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు నీళ్లుపోసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ►ఉడికిన మటన్ ఖీమాను మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఉడికిన పప్పులను కూడా మెత్తగా రుబ్బుకోవాలి ►సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగును గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి, తరువాత కొత్తిమీర, పుదీనా తరుగు, పచ్చిమిర్చి వేయాలి. ►ఇవన్నీ వేగాక మిరియాలపొడి, పసుపు, పెరుగు ఖీమా పేస్టు, పప్పుల పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. మూతపెట్టి పదిహేను నిమిషాలు ఉడికించి, నెయ్యి, డ్రైఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. -
సింహం సిక్స్టీ ఫైవ్.. పులి కబాబ్ ట్రై చేస్తే..!
చికెన్, మటన్ ఎప్పుడూ తినేవే.. అదే ఏనుగు లెగ్ కర్రీనో, చిరుతపులి ఫ్రైనో ట్రై చేస్తే.. వామ్మో ఏమిటివి అనిపిస్తోందా? ఇవేవో జస్ట్ పేర్లు కాదు. ఆ జంతువుల మాంసంతో చేసే వంటకాలే. కాకపోతే ఇక్కడ సింహాలు, పులులు, ఏనుగులను ఏమీ చంపడం లేదు. మరి ఆ మాంసం ఎలా వస్తుంది అంటారా.. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం.. – సాక్షి సెంట్రల్ డెస్క్ మాంసం కాని మాంసం.. జంతువులు, పక్షులను వధించి మాంసం వినియోగించడంపై కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మొక్కలు, నాచు సంబంధిత పదార్థాలతో మాంసం వంటి ఉత్పత్తులను తయారు చేసి, అమ్ముతున్నారు. కానీ అవేవీ మాంసం వంటి అనుభూతిని కలిగించలేవు. ఈ క్రమంలోనే జంతువులు, పక్షుల జీవకణాలను కృత్రిమంగా పెంచి మాంసం తయారు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చికెన్ వంటివాటిని తయారు చేశారు కూడా. ఎవరూ ఊహించని రీతిలో.. కృత్రిమ మాంసం రూపకల్పనకు సంబంధించి లండన్‌కు చెందిన ప్రిమెవల్ ఫుడ్స్ అనే స్టార్టప్ కంపెనీ చిత్రమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. చికెన్, మటన్, బీఫ్ వంటి సాధారణమైనవి కాకుండా.. ఎవరూ ఊహించని రీతిలో సింహం, పులి, ఏనుగు వంటి మాంసాలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియలో జంతువులను చంపడంగానీ, హింసించడంగానీ ఉండదు. ఆయా జంతువుల నుంచి సేకరించిన కొద్దిపాటి రక్తం, ఇతర కణాల నుంచి.. ల్యాబ్‌లో మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. రుచి.. బలం.. ఎక్కువట! ఇప్పుడు మనం తింటున్న చికెన్, మటన్, బీఫ్ వంటివి పెద్ద రుచిగా ఉండవని, వాటి నుంచి అందే పోషకాలు కూడా తక్కువేనని ప్రిమెవల్ ఫుడ్స్ కంపెనీ స్థాపనకు పెట్టుబడులు పెట్టిన ఏస్ వెంచర్స్ ప్రతినిధి యిల్మాజ్ బొరా అంటున్నారు. ‘‘కోళ్లు, మేకలు, పశువుల పెంపకం సులువు కాబట్టే.. వాటి మాంసాన్ని మనం వినియోగిస్తున్నాం. వాటిలో కొలెస్టరాల్, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. అదే కృత్రిమంగా మాంసం ఉత్పత్తి చేయగలిగినప్పుడు కూడా వాటితో పనేముంది? బాగా రుచిగా ఉండే, ఎక్కువ పోషకాలు ఉండే భిన్నమైన జంతువుల వైపు మేం దృష్టిపెట్టాం. ఉదాహరణకు మంచి నిద్ర, మూడ్ ఉండేందుకు చిరుతపులి మాంసాన్ని.. మెదడు పనితీరు మెరుగుపర్చే ఏనుగు మాంసాన్ని మనం భవిష్యత్తులో తినబోతున్నాం’’ అని చెప్తున్నారు. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమేనని, ఇంకా అద్భుతమైన ఆహార అనుభూతినీ పొందడం ఖాయమని పేర్కొంటున్నారు. -
నోరూరించే నర్గీస్ కోఫ్తా.. తయారీ ఇలా!
కావలసినవి: గుడ్లు – ఎనిమిది; మటన్ ఖీమా – అరకేజీ; ఉల్లిపాయ – ఒకటి(ముక్కలు తరగాలి; వెల్లుల్లి తరుగు – టేబుల్ స్పూను; పసుపు – టీస్పూను; కారం – అరటీస్పూను; గరంమసాలా – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; బియ్యప్పిండి – అరకప్పు; ఆయిల్ – డీప్‌ఫ్రైకి సరిపడా. గ్రేవీ కోసం: ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు ; ఉల్లిపాయలు – రెండు (ముక్కలు తరగాలి); వెల్లుల్లి పేస్టు – రెండు టీస్పూన్లు; అల్లంపేస్టు – రెండు టీస్పూన్లు; టొమాటోలు – మూడు(పేస్టు చేసుకోవాలి); ధనియాలపొడి – రెండు టీస్పూన్లు; జీలకర్ర – టీస్పూను; పసుపు – అరటీస్పూను; కారం – అర టీస్పూను; గరం మసాలా – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; పెరుగు – ఎనిమిది టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా. తయారీ: ► ముందుగా ఆరు గుడ్లను ఉడికించి, పెంకు ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ► పెద్ద గిన్నెలో మటన్ ఖీమా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు, పసుపు, కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఒక గుడ్డుసొన వేసి పేస్టులా కలపుకోవాలి ► ఈ మిశ్రమాన్ని ఆరు సమభాగాలుగాచేసి పక్కనపెట్టుకోవాలి ► ఉడికించిన ఒక్కో గుడ్డుకు పూర్తిగా కవర్ అయ్యేలా ఖీమా మిశ్రమాన్ని పట్టించాలి ► అన్ని గుడ్లకు పట్టించాక బియ్యంపిండిలో ముంచాలి మిగిలిన గుడ్డుసొనను బాగా కలపాలి. బియ్యప్పిండిలో ముంచిన గుడ్లను ఈ గుడ్డుసొనలో ముంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్ఫ్రైచేసి పక్కనపెట్టుకోవాలి ► వేడెక్కిన బాణలిలో గ్రేవీకోసం తీసుకున్న ఆయిల్ వేయాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలువేసి రంగు మారేంత వరకు వేయించాలి ► ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టులను వేసి మూడు నిమిషాలు వేయించి టొమాటో పేస్టు, కారం, ధనియాలపొడి, గరం మసాలా వేయాలి ► రుచికిసరిపడా ఉప్పు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. ► ఇప్పుడు పెరుగు, అరకప్పు నీళ్లు వేసి కలిపి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి, డీప్‌ఫ్రై చేసి పెట్టుకున్న కోప్తాలను వేసి జాగ్రత్తగా తిప్పుకోవాలి ∙ఐదునిమిషాలు మగ్గాక కొత్తిమీరతో గార్నిష్ చేస్తే నర్గీస్ కోఫ్తా రెడీ. ఇది రైస్,చపాతీల్లోకి మంచి సైడ్ డిష్. (క్లిక్: హనీ చికెన్ కర్రీ..టేస్ట్ అదుర్స్.. ఇలా చేసుకోండి) చికెన్ కాగ్జీకట్ కావలసినవి: చికెన్ – అరకేజీ; చిన్న ఉల్లిపాయలు – ఎనిమిది; బంగాళ దుంపలు – ఎనిమిది; వెల్లుల్లి రెబ్బలు – ఆరు; అల్లం – అంగుళం ముక్క ; పెద్ద ఉల్లిపాయ – ఒకటి; పచ్చికొబ్బరి తురుము – కప్పు; ఎండుమిర్చి – ఏడు; లవంగాలు – ఎనిమిది; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; మిరియాలు – పది; ధనియాలు – టేబుల్ స్పూను; మెంతులు – టీస్పూను; గసగసాలు – టేబుల్ స్పూను; సోంపు – టీస్పూను; జీలకర్ర – టీస్పూను; జాజికాయ పొడి – టీస్పూను; ఆయిల్ – నాలుగు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత; కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా. తయారీ: ► ధనియాలు, గసగసాలు, మెంతులను పొడిచేకోవాలి ► అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలను సన్నగా తరగాలి ► బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు వేసి వేగనివ్వాలి. తరువాత కొబ్బరి తురుము వేసి మూడు నిమిషాలు వేయించాలి ► ఇప్పుడు ధనియాల పొడి, ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గాక, చికెన్ వేసి సన్నని మంట 10 నిమిషాలు ఉడికాక చిన్న ఉల్లిపాయలు, బంగాళ దంపలు వేసి ఉడికించాలి ► ఆయిల్ పైకి తేలాక జాజికాయ పొడి, కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. (క్లిక్: కీమా ఇడ్లీ, బనానా షీరా చాక్లెట్ బాల్స్, బ్రెడ్–ఎగ్ బజ్జీ తయారు చేసేద్దామిలా..) -
మటన్ కావాలా.. భర్త కావాలా.. తేల్చుకో..!
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు మనం సినిమాల్లో, రియల్ లైఫ్‌లో ఎన్నో ట్రయాంగిల్ లవ్ స్టోరీలు చూశాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయేది.. వాటన్నింటికి మించింది. సవాల్ చేస్తున్నాం.. మీరు ఇంతవరకు ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రపంచలో ఎక్కడా చూసుండరు. ఆ లవ్‌స్టోరీని మీరు చదవండి.. 100 శాతం శాఖాహారి అయిన ఓ వ్యక్తికి.. అద్భుతమైన సౌందర్యరాశితో వివాహం అవుతుంది. ఆమెది కూడా ప్యూర్ వెజిటేరియన్ కుటుంబం. శాఖాహార కుటుంబంలో జన్మించిన ఆమె అనుకోకుండా ఒకసారి మటన్ తిన్నది. ఆ తర్వాత దానికి ఎడిక్ట్ అయిపోయింది. ఇంట్లో తెలియకుండా బయట అడపాదడపా మటన్ తింటుండేది. (చదవండి: మాట తప్పావంటూ ట్రోలింగ్.. కోహ్లి కౌంటర్) అయితే దీని గురించి ఆమె వివాహానికి ముందే అనగా పెళ్లి చూపుల సమయంలోనే భర్తతో చెప్పింది. మటన్ అంటే చాలా ఇష్టం అని.. ఇంట్లో వారికి తెలియకుండా బయట తింటుంటానని భర్తకు తెలిపింది. అపూరూప సౌందర్యరాశిని ఇలాంటి కారణం వల్ల వదులుకోవడం ఇష్టం లేని వ్యక్తి.. ఓ కండిషన్ పెట్టి.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అందేంటంటే.. వివాహం తర్వాత ఇక జీవితంలో ఎప్పుడు మటన్ తినకూడదని షరతు పెట్టాడు. అందుకు ఆమె అంగీకరించడంతో వారి వివాహం జరిగింది. కొన్నాళ్లపాటు వారి కాపురం సజావుగా సాగింది. అయితే సదరు మహిళ భర్తకు ఇచ్చిన మాటను నిలపుకోలేకపోయింది. వివాహం అయిన తర్వాత కూడా ఆమె భర్తకు తెలియకుండా బయట మటన్ తినసాగింది. దీని గురించి కొన్ని రోజుల తర్వాత భర్తకు తెలిసింది. మాట తప్పిన భార్య మీద అతడికి చాలా కోపం వచ్చింది. అలా అని చెప్పి ఆమెను వదులుకోలేడు. అందుకని భార్యకు చివరి వార్నింగ్ ఇచ్చాడు. ‘నీకు మటన్ కావాలో.. భర్త కావాలో తేల్చుకో’ అని అల్టిమేటం జారీ చేశాడు. (చదవండి: అడిగే దిక్కెవరు.. ఎక్కడ పడితే అక్కడే కోతలు.. మటన్ మంచిదేనా?) అప్పటి వరకు బాగానే ఉంది కానీ.. ఆ తర్వాతే సదరు వ్యక్తికి ఓ అనుమానం వచ్చింది. కొంపదీసి భార్య.. తన బదులు మటన్ కావాలని కోరుకుంటే.. తన పరువు ఏం కావాలి అని ఆలోచించాడు.. ఇంతకు తన భార్య ఎవరిని ఎంచుకుంటందో అని ఆలోచించసాగాడు. ఈ క్రమంలో తన సమస్యను వివరిస్తూ.. ఓ ఫ్యామిలీ కౌన్సిలర్‌కి లెటర్ రాశాడు. కౌన్సిలర్ అతడికి ఇచ్చిన సమాధానం ఇలా ఉంది.. ‘‘శుభాకాంక్షలు. ట్రయాంగిల్ లవ్ స్టోరీల్లో మీరు మొదటిసారి ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారు. ఇక్కడ ఓ అమ్మాయి మనిషి, మేకల మధ్య తనకు ఎవరు కావాలో ఎన్నుకోనుంది. నా అభిప్రాయం ఎంటంటే.. ప్రేమించిన వ్యక్తి లేకుండా జీవించవచ్చు... కానీ ఆహారం లేకుండా బతకలేం కదా. మరి నీ భార్య ఎవరిని ఎంచుకుంటుందో ఊహించు’’ అని సమాధానం ఇచ్చాడు. (చదవండి: టేస్ట్ అదరహో.. మటన్ లందు కర్నూలు మటన్ వేరయా !) ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కౌన్సిలర్ ఇచ్చిన సమాధానం అన్ని ఓ పేపర్లో వచ్చాయి. ఈ క్లిప్పింగ్‌ని పరణ్జాయ్ అనే జర్నలిస్ట్ తన ట్విటర్లో షేర్ చేయడంతో ప్రసుత్తం ఇది తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజనులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మనిషి తాత్కాలికం.. మాంసం శాశ్వతం.. అనుమానమే లేదు.. మటన్‌నే ఎంచుకుంటుంది.. ఫన్నీగా అనిపిస్తున్నా ఇది చాలా సీరియస్ విషయం అని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. प्यार चाहिए या मटन चाहिए pic.twitter.com/JFJhRB1pbz — ParanjoyGuhaThakurta (@paranjoygt) December 1, 2021 చదవండి: వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా? -
Delicious Winter Soups: గుమ్మడి సూప్, మటన్ సూప్ తయారీ ఇలా..
చలికాలం మొదలైపోయింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటేనే హాయిగా అనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే సూప్‌లు అయితే శరీరానికి వెచ్చదనంతోపాటు పోషకాలనూ అందిస్తాయి. వేడివేడి సూప్‌లను రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... గుమ్మడి సూప్ కావల్సిన పదార్ధాలు ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ – ఒకటి (ముక్కలు తరగాలి) వెల్లుల్లి రెబ్బలు – రెండు గుమ్మడి తరుగు – రెండు కప్పులు ఉప్పు – రుచికి సరిపడా మిరియాల పొడి – అరటీస్పూను నీళ్లు – రెండు కప్పులు క్రీమ్ – గార్నిష్‌కు సరిపడా తయారీ విధానం ►బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►తరువాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ►ఇవి కూడా వేగిన తరువాత గుమ్మడి తరుగు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి రెండు కప్పులు నీళ్లు పోసి కలపి మూతపెట్టి 15 నిమిషాల పాటు మీడియం మంటమీద ఉడికించాలి. ►ఉడికిన తరువాత మిశ్రమాన్ని చల్లారనిచ్చి, మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పాన్‌లో వేసి ఐదు నిమిషాలు మరిగించి, క్రీమ్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. మటన్ సూప్ కావల్సిన పదార్ధాలు మటన్ – పావుకేజీ నీళ్లు – రెండు కప్పులు అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను పసుపు – అర టీస్పూను మిరియాల పొడి – అర టీస్పూను జీలకర్ర పొడి – పావు టీస్పూను గరం మసాలా – అర టీస్పూను కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను తయారీ విధానం ►మటన్‌ను చిన్నచిన్న ముక్కలుగా చేసి శుభ్రంగా కడగాలి. ►ప్రెజర్ కుకర్ గిన్నెలో మటన్ ముక్కలు, అల్లం వెల్లుల్లిపేస్టు, మిరియాలపొడి, జీలకర్రపొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, రెండు కప్పులు నీళ్లుపోయాలి. ►వీటన్నింటిని కలిపి మూత పెట్టి ఆరు విజిల్స్ రానివ్వాలి. ►కుకర్ ప్రెజర్ పోయాక మూతతీసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే వేడి వేడి మటన్ సూప్ రెడీ. చదవండి: Beauty Tips: ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ తొలగించేందుకు.. ఆనప ఫేస్ ప్యాక్! -
అడిగే దిక్కెవరు.. ఎక్కడ పడితే అక్కడే కోతలు.. మటన్ మంచిదేనా?
నల్లగొండ టూటౌన్, మిర్యాలగూడ టౌన్, దేవరకొండ : ఎక్కడ పడితే అక్కడే కోతలు.. ఎవరి ఇష్టం ఉన్నవి వారు ఎక్కడైనా కోసేసుకోవచ్చు.. అవి రోగాలు ఉన్నవా.. లేనివా చూసి పరీక్షించే వారులేరు. అవి ఆడవా.. మగవా అనేది కూడా ఎవరికీ తెలియదు. శుభ్రం ఉండదు. నీరు సక్రమంగా ఉండవు. ఇదీ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో జంతు వధలు సాగుతున్న పద్ధతి. వీటన్నింటికీ ప్రధాన కారణం వధశాలలు లేకపోవడమే. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూ డ, దేవరకొండలో రోడ్లపైనే మటన్ విక్రయాలు సా గుతున్నాయి. గొర్రెలు, మేకల ద్వారా అంత్రాక్స్ వ్యాధులు వస్తున్నాయనే ప్రచారం సాగిన సమయంలో అధికారులు మటన్‌షాపుల వద్దకు వచ్చి హాల్చల్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కనీసం మటన్‌షాపు నిర్వాహకులు కోస్తున్న గొర్రెలు, మేకలను ఆరోగ్యంగా ఉంటున్నాయా లేదా అనేది పరీక్షించే అధికారి జాడ కూడా లేకుండా పోయింది. మున్సిపల్ శానిటరీ విభాగం అధికారులు మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు మాంసం కొనాలంటే హడలిపోతున్నారు. (చదవండి: Vikarabad: ఇక్కడ డీజిల్ లీటర్ రూ.95, కర్ణాటకలో రూ. 85) నల్లగొండలో రోడ్డు వెంట సాగుతున్న వధ ధ్రువీకరించాకే వధించాలి.. వధించే గొర్రెలు, గొర్రె పొట్టేళ్లు, మేకలు, మేక పోతులు తదితర వాటిని అక్కడ పశువైద్యులు పరిశీలించి ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించిన తరువాత మాత్రమే వాటిని కోయాలి. వధశాలలు ఉంటే అక్కడ ప్రభుత్వ నిబంధనలు పక్కాగా అమలయ్యే అవకాశం ఉండేది. వధశాలలు లేకపోవడంతో నిబంధనలు ఏవీ పాటించకుండా ఇష్టానుసారంగా బహిరంగ ప్రదేశాల్లోనే జీవాలను వధిస్తూ మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించకుండానే వినియోగదారుల చెంతకు మాంసం చేరిపోతోంది. అంతే కాకుండా వాటి వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తుండడంతో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండలో శిథిలావస్థలో వధశాల నీలగిరి పట్టణంలో జంతు వధశాల 40 ఏళ్ల కిందటి వరకు లైన్వాడిలో ఉన్నట్లు మాంసం వ్యాపారులు చెబుతున్నారు. దాని స్థానంలో కొత్త భవనం నిర్మించాలని పనులు మొదలు పెట్టగానే అక్కడ మార్కెట్ వద్దంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో నాలుగేళ్ల కిందటనే పనులు నిలిచిపోయాయి. దీని గురించి అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ సరిగా పట్టించుకోకపోవడంతో కోర్టు కేసు పరిష్కారం కాక మార్కెట్ పనులకు మోక్షం కలగడంలేదు. పానగల్ బైపాస్ రోడ్డులో జంతు వధశాల నిర్మాణం చేపట్టాలని భావించినా సాధ్యపడలేదు. దీంతో రోడ్ల వెంటే మాంసం విక్రయాలు సాగుతున్నాయి. పట్టణంలో మాంసం విక్రయించే వారు 40 మంది వరకు ఉండగా, ఇక ఆదివారం మాత్రం దాదాపు 200 మంది జంతు వధ చేసి వ్యాపారం చేస్తున్నారు. (చదవండి: Vikarabad: కారుతో ఢీకొట్టి పరార్.. ప్రమాదమా? హత్యాయత్నమా?) నిరుపయోగంగా ఉన్న స్లాటర్ హౌస్ దేవరకొండలో.. రోడ్లపైనే విక్రయాలు ప్రతి ఆదివారం దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 500 కేజీల వరకు మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడ వధశాల లేకపోవడంతో రోడ్ల వెంటే మాంసం విక్రయాలు సాగుతున్నాయి. అధికారుల తనిఖీలు లేకపోవడంతో బక్కచిక్కిన, అనారోగ్యం పాలైన జీవాలను కూడా కొంతమంది వ్యాపారులు వధించి విక్రయిస్తున్నారు. దీంతో డబ్బులు పోసి జబ్బులు తెచ్చుకోక తప్పడం లేదని ప్రజలు మాంసాహార ప్రియులు వాపోతున్నారు. పట్టణంలో వధశాలనిర్మించి సంబంధిత అధికారులు ధ్రువీకరించిన తర్వాతనే మాంసం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వధశాల ఉన్నా.. నిరుపయోగమే పారిశ్రామికంగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడపడితే అక్కడే మటన్ షాపులు వెలుస్తున్నాయి. పట్టణంలో సుమారు 100–200 వరకు మటన్ షాపులుండగా ఏ ఒక్క దుకాణం వద్ద కూడా మున్సిపల్ అధికారులు పరిశీలించి ముద్ర వేసిన దాఖలాలు లేవు. పట్టణంలోని తడకమళ్ల రోడ్డులోని తాళ్లగడ్డ సమీపంలో నిర్మించిన స్లాటర్ హౌజ్ (కబేళా కేంద్రం) నాలుగేళ్లుగా కోర్టు వివాదంలో ఉండడంతో అది నిరుపయోగంగా మారింది. దీంతో వినియోగదారులు నాణ్యమైన మాసం పొందలేకపోతున్నారు. జంతు వధశాల నిర్మించాలి జంతు వధశాల లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ కోస్తున్నారు. వధశాల నిర్మాణం చేపడితే వ్యాపారులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. మటన్ మార్కెట్ నిర్మాణం నిలిచిపోయినా పట్టించుకోవడంలేదు. జంతు వధశాల పెడితే నాణ్యమైన మాంసం వినియోగదారులకు అందుతుంది. వ్యాపారులకు కూడా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. – మహ్మద్ ఆజం, మాంసం వ్యాపారి, నల్లగొండ ఆరోగ్యమా.. అనారోగ్యమా తెలియదు ప్రతి వారం మటన్ తీసుకెళ్తాను. వారు కోసేది ఆరోగ్యంగా ఉన్నదా.. అనారోగ్యంగా ఉన్నదా ఎవరికీ తెలియదు. మటన్‌షాపులు పెరుగుతున్నాయి కానీ క్వాలిటీ లేకుండా పోతోంది. వెటర్నరీ, మున్సిపల్ అధికారులు ధ్రువీకరించిన తరువాతనే గోర్రెలు, మేకలు, పొటేళ్లు కోయాలి. కానీ, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. రెగ్యులర్‌గా వచ్చిన వారికి మాత్రమే మంచి మటన్ ఇస్తున్నారు తప్ప కొత్తవారికి ఇబ్బందులు తప్పవు. – నల్లగుంట్ల నరేష్కుమార్, ఇస్లాంపుర, మిర్యాలగూడ బహిరంగ ప్రదేశాల్లో వధించకూడదు బహిరంగ ప్రదేశాల్లో జీవాలు (గొర్రె, మేక)లను వధించకూడదు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటాం. దేవరకొండ పట్టణంలో స్లాటర్ హౌస్ నిర్మాణానికి సంబం ధించి స్థలాన్ని పరిశీలిస్తున్నాం. వ్యాపారులు నాణ్యమైన మాంసాన్ని మాత్రమే విక్రయించాలి. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పడేయకూడదు. ఎప్పటికప్పుడు సంబంధిత పశు సంవర్థక శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేపడుతాం. – వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్, దేవరకొండ -
టేస్ట్ అదరహో.. మటన్ లందు కర్నూలు మటన్ వేరయా !
సాక్షి,కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాష్ట్రంలో కర్నూలు పొట్టేలు మాంసానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడి మాంసం రుచికరంగా ఉండటమే కాకుండా ధర కూడా ఎక్కువగా ఉంటుంది. నగరంలో సుమారు 70 మంది మాంస విక్రయదారులు ఉన్నారు. పొట్టేళ్లను సమీప ప్రాంతాల్లో జరిగే సంతల్లో కొంటుంటారు. నగరానికి 70 కిలోమీటర్ల దూరంలోని పెబ్బేరు గ్రామం పొట్టేళ్ల సంతకు ప్రసిద్ధి. అక్కడ సంత శనివారం జరుగుతుంటుంది. అలాగే జిల్లాలోని పత్తికొండ, నందికొట్కూరు కూడా సంత జరిగే ప్రాంతాలు. అక్కడ సోమవారం జరుగుతుంటుంది. ఇక్కడి మాంస విక్రయదారులు ఈ మూడు ప్రాంతాల నుంచి వారం రోజులకు సరిపడే పొట్టేళ్లు తెచ్చుకుని కోస్తుంటారు. ఈ ప్రాంతంలో నెల్లూరు జుడిపి, నెల్లూర్ బ్రౌన్ అనే రెండు రకాల జాతి పొట్టేళ్లు లభిస్తాయి. పైగా పొట్టేలు మాంసంలో కరోనా నిరోధించే శక్తి ఎక్కువ. ఇందులో ఒక ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. కోడి మాంసంలో అది లభించదు. ఇక్కడి పొట్టేళ్లు సారవంతమైన నేలల్లో మేస్తాయి. ఈ నేలల్లో వాటికి మంచి పోషకాహారాలు లభిస్తాయి. పొరుగు జిల్లాతో పోలిస్తే.. అనంతపురం జిల్లాతో పోలిస్తే ఇక్కడి మాంసమే నాణ్యమైనది. రుచిలోనూ మేలైన రకంగా ఉంటుంది. ఈ విషయం శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. ఆ జిల్లాలోని పొట్టేళ్లలో కర్ణాటక ప్రాంతంలోని మాండియా బ్రీడ్ కలుస్తుంటుంది. పొట్టేళ్ల సంతాన ఉత్పత్తి సమయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆడ పొట్టేలు కానీ లేక మగ పొట్టేలు కానీ మాండియా బీడ్‌కు చెందినదైతే సంతానోత్పత్తి ద్వారా వచ్చిన పొట్టేలు మాంసంలో రుచి ఉండదు. అందువల్ల ధరల్లోనూ తేడా ఉంటుంది. అనంతపురంలో మాంసం ధర రూ. 400కు కిలో ఉంటే కర్నూలులో మాత్రం రూ. 700 పల్కుతోంది. అయితే అనంతపురం మాంసంలో ఎముకలు, పేగులు వంటి వ్యర్థ పదార్థాలు 30 శాతమే ఉంటాయి. కర్నూలు మాంసంలో ఆ శాతం 40 దాకా ఉంటుంది. వ్యర్థాలు ఎక్కువ ఉండటం కూడా మాంసం ధరపై ప్రభావం చూపిస్తుందని కొందరు విశ్లేషకులు చెబుతారు. జాతీయ పరిశోధన కేంద్రానికి రవాణా.. జాతీయ పరిశోధనా కేంద్రం హైదరాబాదులోని చెంగిచెర్లలో ఉంది. కర్నూలు మాంసం నిత్యం ఈ కేంద్రానికి ఎగుమతి అవుతుంటోంది. వధశాలలు ఎలా ఉండాలి, ఏ ప్రాంతంలో మాంసం కోయాలి, ఎలాంటి జంతువులను కోయాలి, ఏఏ జాగ్రత్తలు పాటించాలి వంటి అనేక అంశాలను అక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా నిర్ధారిస్తుంటారు. వారు పరిశోధనలకు కర్నూలు మాంసాన్నే ఉపయోగిస్తారు. అదే సంస్థలోని విక్రయ కేంద్రంలోనూ కర్నూలు మాంసాన్ని అందుబాటులో ఉంచుతారు. మాంసానికి కూడా ఇంత స్టోరీ ఉంటుందా అనేది ఇప్పుడే తెలుస్తోంది కదూ! ఇది ముమ్మాటికి నిజం. నేల స్వభావం, అక్కడి గడ్డిమేత ఆధారంగా తేడా: డాక్టర్ రమణయ్య, పశుసంవర్ధక శాఖ జేడీ నేల స్వభావం, అక్కడి గడ్డిమేత ఆధారంగా జీవాల మాంసాల్లో తేడా ఉంటుంది. కర్నూలు నగరంతో పాటు చుట్టూ ఉండే నేల సారవంతమైనది. ఇక్కడ మొలిచే గడ్డిలోనూ తేడా ఉంటుంది. ఈ గడ్డిని మేతగా తీసుకునే జీవాల మాంసంలోనూ తేడా కనిపిస్తుంది. కర్నూలుతో పోలిస్తే హైదరాబాదు మాంసానికి కూడా రుచి తక్కువే. అందువల్లే అక్కడి పరిశోధనా కేంద్రం వారు చెంగిచెర్లకు తెప్పించుకుంటారు. చదవండి: Raghuveera Reddy: ‘కట్టిపడేసే’ దృశ్యం, వైరల్ ఫోటో -
అదేంటో.. ఆదివారం వస్తే ముక్కలేనిదే ముద్ద దిగట్లా!
సాక్షి, కోవెలకుంట్ల (కర్నూలు): మాంసంలో ఎముక రుచి..పుంటికూర(గోంగూర)లో పుడక రుచి అన్నారు పెద్దలు.. సామెత సంగతేమోగాని ఆదివారం వచ్చిందంటే కొందరికి ముక్కలేనిదే ముద్ద దిగదు. బంధువులు వచ్చినారనో..చిన్నోడు కలవరిస్తున్నాడనో..ఇంట్లో బాలింత ఉందనో..బలం రావాలనో.. ఏదో సాకు చూపి కూరాకు (మాంసం) తెచ్చుకునే వారు ఎక్కువే. జిల్లా జనాభా 44 లక్షలకు పైగా ఉంటే అందులో 70 శాతం మంది మాంస ప్రియులే. వీరిలో చికెన్ తినేవారు కొద్ది మంది అయితే.. మటన్ లాగించేవారు మరికొంత మంది. ధర ప్రియం అయినా చాలా మంది మటన్ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రతి ఆదివారం జిల్లాలో 40 టన్నుల వినియోగం ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కిలో రూ.600 నుంచి రూ. 800 లెక్కన రూ.3 కోట్ల మటన్‌ను జిల్లా వాసులు ఆరగించేస్తున్నారు అన్నమాట. జిహ్వకో రుచి.. తలకూర, రాగి సంకటిని ఇష్టపడే వారు కొందరైతే..జొన్న రొట్టె, బోటీ రుచి అమోఘం అనే వారు మరికొందరు. కైమాతో వేపుడు చేసుకొని కమ్మగా లాగించేవారు ఇంకొందరు. ఎవరి రుచులు ఎలా ఉన్నా..దేవనకొండ మండలం ఈదులదేవరబండలో చీకులకు సాటిరావు అనే వారు కూడా ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే కోసిగి, గాజులదిన్నె, సుంకేసుల ప్రాంతాల్లోనూ కడ్డీ మాంసం నిప్పులపై వేగుతూ మాంసప్రియులను ఊరిస్తూ ఉంటుంది. ఆదోనిలో అల్పాహారంగా ‘పాయ’ ప్రత్యేకంగా నిలుస్తోంది. కోవెలకుంట్లలో మటన్ విక్రయిస్తున్న దృశ్యం ధర అధికమైనా.. సంపూర్ణ పోషక విలువలు, సంతృప్తికరమైన రుచి రెండూ ఒకేదాంట్లో దొరికే తక్కువ పదార్ధాల్లో ఒకటైన మటన్‌ను మాంసం ప్రియులు ఎంతోగానో ఇష్టపడుతున్నారు. ధర అధికమైనా కొనుగోలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.800 అమ్ముతుండగా పల్లె ప్రాంతాల్లో రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు. ఎన్ఆర్సీఎం ధ్రువీకరణ జిల్లాలోని పొట్టేళ్ల మాంసం రుచికరంగా ఉంటుంది. ఈ విషయం శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. జిల్లాలో నెల్లూరు జుడిపి, నెల్లూరు బ్రౌన్ అనే రెండు రకాల పొట్టేళ్లు పెంచుతుంటారు. సారవంతమైన నేలల్లో మొలిచే గడ్డిని మేయడంతో వీటి మాంసం రుచికరంగా ఉంటుంది. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని జాతీయ మాంసం పరిశోధన కేంద్రం(ఎన్ఆర్సీఎం) ధ్రువీకరించింది. ప్రత్యేక సంతలు.. జిల్లాలో 25.90 లక్షల మేకలు, గొర్రెలు ఉన్నాయి. ఆదోని, డోన్, ఆలూరు, మంత్రాలయం, సంజామల, శిరివెళ్ల, కొలిమిగుండ్ల, రుద్రవరం, చాగలమర్రి, దొర్నిపాడు ప్రాంతాల్లో గొర్రెల పెంపకం దారులు అధికంగా ఉన్నారు. పత్తికొండ, నందికొట్కూరులో సోమవారం, ఆలూరులో బుధవారం, ఆదోని, గూడూరులో శుక్రవారం, కోడుమూరు, కల్లూరులో శనివారం, ఎమ్మిగనూరులో ఆదివారం ప్రత్యేక సంతలు జరుగుతాయి. ఈ సంతల్లో జీవాల క్రయవిక్రయాలు సాగుతున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు నంద్యాల, ఆదోని, బనగానపల్లె, డోన్, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల తదితర పట్టణాల్లో 2,500 మటన్ షాపులు ఉన్నాయి. జిల్లాలో 25.90 లక్షల మేకలు, గొర్రెలు ఉన్నాయి. ఆదోని, డోన్, ఆలూరు, మంత్రాలయం, సంజామల, శిరివెళ్ల, కొలిమిగుండ్ల, రుద్రవరం, చాగలమర్రి, దొర్నిపాడు ప్రాంతాల్లో గొర్రెల పెంపకం దారులు అధికంగా ఉన్నారు. పత్తికొండ, నందికొట్కూరులో సోమవారం, ఆలూరులో బుధవారం, ఆదోని, గూడూరులో శుక్రవారం, కోడుమూరు, కల్లూరులో శనివారం, ఎమ్మిగనూరులో ఆదివారం ప్రత్యేక సంతలు జరుగుతాయి. ఈ సంతల్లో జీవాల క్రయవిక్రయాలు సాగుతున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు నంద్యాల, ఆదోని, బనగానపల్లె, డోన్, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల తదితర పట్టణాల్లో 2,500 మటన్ షాపులు ఉన్నాయి. మటన్ అంటే ఇష్టం చికెన్ కంటే మటన్ అంటేనే ఇష్టం. కార్తీకమాసం, శ్రావణ మాసం తప్ప మిగిలిన అన్ని ఆదివారాల్లో క్రమం తప్పకుండా మటన్ తెచ్చుకుంటాం. ఇందులో ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. తినడానికి రుచికరంగా ఉంటుంది. – నాగభూషణంరెడ్డి, కోవెలకుంట్ల 40 కిలోలు అమ్ముతున్నాం బనగానపల్లె మార్కెట్ నుంచి పొట్టేళ్లు తెచ్చుకుంటాం. ప్రతి ఆదివారం 40 కిలోల మటన్ అమ్ముతున్నాం. రెండు నెలల క్రితం వరకు కిలో 660 రూపాయలకు అమ్మేవాళ్లం. ఇప్పుడు రూ. 600లకు విక్రయిస్తున్నాం. – మద్దిలేటి, మటన్ వ్యాపారి, కోవెలకుంట్ల -
ఆంత్రాక్స్ వ్యాధి కలకలం: మటన్ కొంటున్నారా..? జర జాగ్రత్త!
సాక్షి, దుగ్గొండి(వరంగల్): గ్రామాలలో గొర్రెలు చనిపోతే వాటిని మాంసం కోసం విక్రయించడం చేయవద్దని వాటిని గొయ్యి తీసి పాతిపెట్టాలని అధికారులు తెలిపారు. చనిపోయిన గొర్రెల శరీరాన్ని ఓపెన్ చేసి మాంసాన్ని విక్రయించడం వల్ల బ్యాక్టీరియా మనుషులకు చేరి అనారోగ్యం పాలవుతారని తెలిపారు. వరంగల్ జిల్లా చాపలబండా గ్రామంలోని గొర్రెల మందలో ఆంత్రాక్స్ వ్యాధితో నాలుగు గొర్రెలు మృత్యువాతపడిన విషయం విధితమే. వరంగల్ చాపలబండలో ఆంత్రాక్స్ వ్యాధితో నాలుగు గొర్రెలు చనిపోయిన నేపథ్యంలో మాసం కొనేముందు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంత్రాక్స్ వ్యాధి సోకిన మేకలు, గొర్రెల మాంసాన్ని తాకడం, తినడం, కొనడం చేయవద్దన్నారు. చదవండి: లీటర్ పెట్రోల్ రూ.112... భారీగా చార్జీలు పెంచేసిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్! మేక/గొర్రెను కోసినప్పుడు వచ్చే రక్తం గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉంటే ఆంత్రాక్స్ సోకినట్లు గుర్తించాలన్నారు. అలాగే కనీసం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో బాగా ఉడికించిన మాంసాన్నే తినాలని సూచించారు. చనిపోయి ఉన్న మూడు గొర్రెలను వెంటనే పాతిపెట్టాలన్నారు. అవి చనిపోయిన ప్రదేశంలో పడిన రక్తంపై ఎండు గడ్డివేసి మంట పెట్టాలని సూచించారు. అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు. అధైర్య పడవద్దని ఆంత్రాక్స్‌కు వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపారు. అయితే ఆంత్రాక్స్‌తో చనిపోయిన గొర్రెలు ఉన్న మందను ఊరికి దూరంగా ఉంచాలన్నారు. కాపరులు గొర్రెలకు కొంత దూరంగా ఉండి మేపాలన్నారు. చదవండి: డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై ఊడిపడిన ఫ్యాన్.. హెల్మెట్ డాక్టర్స్! అజాగ్రత్తగా ఉంటే మనుషులకు సోకే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. గ్రామంలో మిగిలిన 1200 గొర్రెలకు వెంటనే వ్యాక్సినేషన్ ప్రారంభించాలని స్థానిక వైద్యాధికారి శారదకు సూచించారు. చాపలబండలో ఐదేళ్ల పాటు ప్రతి 9 నెలలకోసారి గొర్రెలు, మేకలకు ఆంత్రాక్స్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. గొర్రెలన్నింటిని కొన్ని రోజుల పాటు ఊరికి దూరంగా ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
మటన్ మార్ట్ల ప్రతిపాదన లేదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మటన్ మార్ట్ల ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాలు, ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఒక ప్రకటనలో విమర్శించారు. సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఇప్పటికే ఆక్వాహబ్‌లు, స్పోక్స్, మినీ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేరీతిలో అపరిశుభ్ర వాతావరణంలో అమ్మకాలు జరుగుతున్న మాంసపు ఉత్పత్తులను సర్టిఫై చేసి పరిశుభ్ర వాతావరణంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని శాఖాపరంగా ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి ద్వారానే హైజినిక్ కండిషన్లో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన మినీ రిటైల్ అవుట్లెట్ల ద్వారా నాణ్యమైన మాంసపు ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావించినట్లు తెలిపారు. వీటిద్వారా ఈ రంగంలోనే స్థిరపడిన యువతకు సబ్సిడీపై ఆర్థిక చేయూత ఇవ్వడం ద్వారా వారిని సమర్థులైన వ్యాపారులుగా తీర్చిదిద్దాలని ఆలోచించినట్లు తెలిపారు. ఇది శాఖాపరంగా పరిశీలనలో ఉందే తప్ప ప్రతిపాదనస్థాయిలోగానీ, ప్రభుత్వ పరిశీలనలోగానీ లేదని పేర్కొన్నారు. వీటిపై ఇప్పటివరకు ప్రభుత్వంగానీ, సీఎం వైఎస్ జగన్‌గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ఆక్వాహబ్‌ల తరహాలోనే నాణ్యమైన మాంసపు ఉత్పత్తుల విక్రయాల ద్వారా వాటికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని ఆలోచించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. విపక్షాలతో పాటు సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని రాద్ధాంతం చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. ధైర్యంగా ఉండండి బహ్రెయిన్ కార్మికులతో మాట్లాడిన మంత్రి అప్పలరాజు కాశీబుగ్గ: బహ్రెయిన్‌లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులతో మంత్రి డాక్టర్ అప్పలరాజు కాశీబుగ్గలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ‘ఉపాధికోసం వెళితే.. చిత్రహింసలు’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఏపీ నాన్ రెసిడెన్షియల్ తెలుగు అసోసియేషన్‌తో మాట్లాడి అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. పనిచేసే చోట ఇబ్బందుల దృష్ట్యా స్వదేశానికి, అందులో మన ప్రాంతానికి వచ్చేయాలని అనుకుంటే మాట్లాడతామని, మన ప్రభుత్వం తరఫున పూర్తి సాయం అందిస్తామని చెప్పారు. కార్మికులు, కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని, అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని సూచించారు. -
కొరమీను, నాటు కోడి, రొయ్య, మటన్ ఖీమా.. ఈ పచ్చళ్లు టేస్ట్ చేశారా
మర్యాదలకు, మంచి ఆతిథ్యానికి పెట్టింది పేరు ఉభయగోదావరి జిల్లాలు.. ఇక మన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పసందైన విందు భోజనాలు, సంక్రాంతి కోడిపందేలు, నాన్ వెజ్ వంటల రుచుల గొప్పతనం అందరికీ తెలిసిందే. అలాంటి భీమవరంలో తయారైన నాన్‌వెజ్ పచ్చళ్లు ఇప్పుడు దేశ విదేశాల్లోని తెలుగువారి నోరూరిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర దేశాల్లోని కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు నాన్‌వెజ్ పచ్చళ్లు పంపించాలంటే వెంటనే గుర్తుకొచ్చేవి భీమవరం పచ్చళ్లే. సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం పట్టణం, చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 50 మంది వరకు ఈ నాన్‌వెజ్ పచ్చళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. కొందరు నిత్యం ఈ పచ్చళ్ల వ్యాపారంలో ఉంటే.. మరికొందరు తమకు వచ్చిన ఆర్డర్ మేరకు పచ్చళ్లు తయారు చేస్తారు. నాజ్‌వెజ్ పచ్చళ్ల వ్యాపారం ఈ ప్రాంతంలో వందల మందికి ఉపాధి కల్పిస్తోంది. నాణ్యత, రుచిలో రాజీ పడకుండా పచ్చళ్లు తయారు చేయడంతో వీటికి మంచి పేరు దక్కింది. చూస్తేనే నోరూరించేలా నాణ్యతతో వీటిని తయారుచేస్తుంటారు. భీమవరం వచ్చే రాజకీయ నాయకులు, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఈ నాన్‌వెజ్ పచ్చళ్లు రుచి చూడాల్సిందే. వాటి రుచి చూసిన వారు తప్పకుండా తమతో తీసుకెళ్తుంటారు. ఎందరో ప్రముఖులు ఇక్కడి పచ్చళ్లకు ఫ్యాన్స్‌గా మారిపోయారు. దాదాపు 40 దేశాలకు ఎగుమతి భీమవరం ప్రాంతంలోని నాన్‌వెజ్ పచ్చళ్లు దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లాండ్, దుబాయ్, కువైట్, సింగపూర్, రష్యా తదితర 40 దేశాలకు వెళ్తుంటాయి. అక్కడ ఉన్న బంధువులు, స్నేహితులకు ఇక్కడి నుంచి పంపిస్తుంటారు. అలాగే విదేశాల్లోని తెలుగువారు ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటారు. నాన్‌వెజ్ పచ్చళ్ల వ్యాపారం భీమవరం ప్రాంతంలో ఏడాదికి సుమారు రూ.కోటి వరకూ జరుగుతుందని అంచనా. నాన్‌వెజ్ పచ్చళ్లు ఆయా రకం బట్టి కిలో రూ.600 నుంచి రూ.1500 వరకు ఉంటాయి. పావుకిలో ప్యాకెట్ల దగ్గర నుంచి విక్రయిస్తుంటారు. మన ఆర్డర్ల మేరకు పెద్ద ఎత్తున కూడా తయారుచేస్తుంటారు. ► చేపలో రకాలు : శీలావతి, కొరమీను, పండుగొప్ప, మెత్తళ్లు, బెత్తుల పచ్చళ్లు లభిస్తాయి. ► చికెన్ వెరైటీలు : బోన్, బోన్‌లెస్, నాటు కోడి, పందెం పుంజు పచ్చళ్లు ప్రత్యేకం ► రొయ్యలో రకాలు : రొయ్య(చిన్నవి), రొయ్య (పెద్దవి), శాక రొయ్య పచ్చళ్లు ఫేమస్ ► అలాగే పీత, మటన్ బోన్‌లెస్, మటన్ ఖీమా పచ్చళ్లు కూడా ఆర్డర్ల మేరకు సరఫరా చేస్తారు. ► పీత సమోసా ప్రత్యేకం.. ఇక్కడ తయారు చేసే పీత సమోసా ప్రత్యేకమైంది. మామూలుగా సమోసా అంటేనే వెంటనే తినాలనిపిస్తుంది. ఇక ఇక్కడ తయారైన పీత సమోసా రుచి చూస్తే వదిలిపెట్టరు. ► చికెన్ పచ్చడి ► రొయ్యల పచ్చడి ► నాటుకోడి పచ్చడి ► పీతల సమోసా -
సిటీలో మటన్ ముక్కకు ఏదీ లెక్క?
సాక్షి, హైదరాబాద్: నగరంలో ముక్క లేనిదే ముద్ద దిగని మాంసం ప్రియుల సంఖ్య భారీగానే ఉంటుంది. ఇక ఆదివారం వస్తే దీని వినియోగం గణనీయంగానే పెరుగుతుంది. ప్రత్యేకించి మేక, గొర్రె మాంసం ఖరీదైనా ఎంతో కొంత కొనుగోలు చేయకుండా ఉండలేని వారెందరో. అయితే.. తాము కొనుగోలు చేస్తున్న మాంసం నాణ్యమైనదేనా? నిబంధనల ప్రకారమే వ్యాపారులు మాంసాన్ని అమ్ముతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోయాయి. ఆయా సందేహాలపై ‘మెహర్’ సర్వే నిర్వహించిందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఆఫ్పాన్ ఖాద్రీ తెలిపారు. కొన్ని రోజులుగా చికెన్ విక్రయాలు తగ్గి మటన్ విక్రయాలు పెరిగాయి. దీంతో మటన్ విక్రేతలు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగాల బారినపడిన జీవాల మాంసాన్ని అమ్ముతున్నట్లు సర్వేలో వెల్లడైనట్లు ఆయన పేర్కొన్నారు. వెయ్యి మంది అభిప్రాయాల సేకరణ.. జంట నగరాల్లోని షాపుల్లో, రోడ్ల పక్కన విక్రయిస్తున్న మాంసంపై ముద్రలు ఉండట్లేదు. నిబంధనలకు అనుగుణంగానే మేకలు, గొర్రెలను కోస్తున్నారా? నాణ్యమైన మాంసాన్నే అమ్ముతున్నారా? ఇలాంటి నిబంధనలు నగర వాసులకు తెలుసా? షాపుల వారు ఇస్తున్న రసీదులను పరిశీలిస్తున్నారా? షాపుల్లో అమ్మే మాంసంపై నాణ్యత ముద్ర ఉండాలన్న విషయం కొనుగోలుదారులకు తెలుసా? అనే అంశాలపై వెయ్యి మంది అభిప్రాయాలను ‘మెహర్’ సంస్థ సేకరించింది. అవగాహన లేదు.. మటన్ నాణ్యతపై పెద్దగా అవగాహన లేదని అత్యధిక మంది స్పష్టం చేశారు. షాపుల్లో, రోడ్లపై ఎక్కడ కొన్నా నాణ్యత ఉందని భావిస్తున్నామని వెల్లడించారు. నిజానికి నగరంలోని కబేళాల్లో రోజూ వేల సంఖ్యలో మేకలు, గొర్రెలను కోసి మాంసాన్ని నగరంలోని షాపులకు, ఇతర హోటళ్లకు, విందులకు సరఫరా చేస్తున్నారు. కబేళాలో మేక, గొర్రెలను వెటర్నరీ డాక్డర్ల పర్యవేక్షణలోనే కోయాలన్న నిబంధనలను పెద్దగా పాటించడం లేదు. తెల్లవారుజామునే కబేళాల్లో మేక, గొర్రెలు ఆరోగ్యంగా ఉంటేనే వాటిని కోసేందుకు డాక్టర్లు అనుమతి ఇవ్వాలి. మాంసంపై నాణ్యత ముద్ర వేయాలి. ఇవేవీ పాటించడం లేదని స్పష్టమైంది. ప్రాంతాలను బట్టి.. జంట నగరాల్లోని ఆయా ప్రాంతాలను బట్టి కూడా మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. నగరం నడి»ొడ్డున మాంసం దుకాణాలు ఎక్కువగా ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో దుకాణాల కంటే కూడా రోడ్లకు ఇరువెపుల మేకలు, గొర్రెలను కోసి అమ్ముతున్నారు. నగరంలోనూ కొన్నిషాపుల వారు సొంతంగా మేకలు, గొర్రెలను కొనుగోలు చేసి ఇంటి వద్దనే వాటిని కోసి మాంసాన్ని షాపుల్లో అమ్ముతున్నారు. ఇలాంటి వాటికి అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదని చాలా మంది వెల్లడించారు. -
స్కూటర్ డిక్కీలో మటన్.. జరిమానా
నల్లగొండ, మిర్యాలగూడ : నాలుగు రోజుల క్రితం కోసిన మటన్‌ను పాత వ్యవసాయ మార్కెట్లో విక్రయించేందుకు స్కూటర్ డిక్కీలో తీసుకొస్తున్న వ్యాపారిని ఆదివారం పట్టుకున్నారు. ఈ విషయాన్ని మార్కెట్ కార్యదర్శి శ్రీధర్, చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆ వ్యాపారికి మూడు వేల రూపాయల జరిమానా విధించారు. మటన్ మార్కెట్లో మరో 16 పొట్టేళ్లను పశువైద్యాధికారులు రిజెక్ట్ చేశారు. మరోవైపు భౌతిక దూరం పాటించకుండానే వినియోగదారులు మాంసం కొనుగోలు చేశారు. మాంసం మార్కెట్‌ను మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. నాణ్యమైన మాంసం విక్రయించాలని వ్యాపారులకు సూచించారు. ఆయన వెంట మార్కెట్ కార్యదర్శి శ్రీధర్, సూపర్వైజర్ సైదులు, సిబ్బంది పురం రవి, రమేశ్, సైదులు, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. -
150 కిలోల టమాటాలకు కిలో మటన్
సాక్షి, ఇందల్వాయి: 150 కిలోల టమాటాలకు కిలో మటన్ ఏమిటీ అనుకుంటున్నారా? అవును మీరు చదివింది నిజమే. ఇందల్వాయి మండలం నల్లవెల్లికి చెందిన టమాట రైతు నోముల శ్రీనివాస్ రెడ్డి తన పొలంలో పండిన 150 కిలోల టమాటాలను ఇందల్వాయి మార్కెట్లో ఆదివారం హోల్‌సేల్‌గా విక్రయిస్తే అతనికి వచ్చింది కేవలం రూ.500 మాత్రమే వచ్చాయి. ఆదివారం కావడంతో ఇంటికి మటన్ తీసుకెళ్దామని అక్కడే ఉన్న మటన్ దుకాణానికి వెళ్తే కిలో మటన్ రూ.550 ఉండటంతో మరో రూ.50 వేసి కొనాల్సి వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా టమాటాలు కొనేవారు కరువయ్యారని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. (టమాట రైతులకు కన్నీళ్లే గిట్టుబాటు!) -
మటన్ కొంటే హెల్మెట్ ఉచితం!
సాక్షి, నందిగామ: కోవిడ్–19 (కరోనా వైరస్) దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ కొనుగోళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో కొందరు వ్యాపారులు వారి ఆలోచనలకు పదునుపెట్టి ఆఫర్లు గుప్పిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇదే తరహాలో కృష్ణాజిల్లా నందిగామ పట్టణంలోని పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన ఓ మాంసం వ్యాపారి ‘5 కేజీల మటన్ కొన్న వారికి హెల్మెట్ ఉచితం’ అంటూ ఆదివారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించాడు. దీంతో అతని వద్ద విక్రయాలు జోరుగా సాగాయి. (చదవండి: ఉచితంగా 2 వేల ఐఫోన్ల పంపిణీ!) కాగా, కోవిడ్–19కు చికెన్‌కు సంబంధం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చికెన్, గుడ్లతో ఈ వైరస్ సోకుతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పౌల్ట్రీ ఫెడరేషన్ ఖండించింది. చికన్, గుడ్లు కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందదని తెలిపింది. (చదవండి: ‘కోవిడ్’.. చికెన్‌తో నో డేంజర్!) -
నాన్‌వెజ్ నడిచొస్తుంది..
సాక్షి, సిద్దిపేట: ఇకమీదట మటన్, చికెన్, మాంసాహార ఉత్పత్తులు (పచ్చళ్లు) కొనుగోలు దారుల ఇంటి వద్దకే వస్తాయని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ఇర్కొడు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తయారు చేసిన చికెన్ పచ్చళ్లు, శుభ్రమైన, ఆరోగ్యకరమైన చికెన్, మటన్ సరఫరా వాహనాన్ని (మీట్ ఆన్ వీల్స్) మంగళవారం సిద్దిపేట కూరగాయల మార్కెట్లో జాతీయ మాంసం ఉత్పత్తుల పరిశోధనా కేంద్రం డైరెక్టర్ వైద్యనాథ్‌తో కలసి ప్రారంభించారు. పల్లెపల్లెకూ ఈ వాహనం తిరిగి విక్రయాలు జరపనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇర్కొడులో తయారవుతున్న నాన్‌వెజ్ పచ్చళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. ఇది రాష్ట్రంలోనే తొలి వాహన మని చెప్పారు. -
అదే నోటితో.. మటన్, బీఫ్ కూడా..
న్యూఢిల్లీ : చికెన్, గుడ్లను కూడా శాకాహార జాబితాలో చేర్చాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ రాజ్యసభలో లేవనెత్తిన వింతవాదనపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. ఆయుర్వేదంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా సంజయ్ రౌత్ ఈ వింత వాదనను వినిపిస్తూ... చికెన్ శాఖాహారమో, మాంసాహారమో ఆయుష్ మంత్రిత్వ శాఖ తేల్చాలన్నారు. తాను నందుర్బర్ ప్రాంతంలోని ఓ కుగ్రామానికి వెళ్లినప్పుడు, అక్కడి ఆదివాసీ ప్రజలు తనకు భోజనాన్ని వడ్డించారని, అదేంటని వారిని అడగ్గా ‘ఆయుర్వేదిక్ చికెన్’ అని చెప్పినట్లు ఆయన సభలో గుర్తుచేసుకున్నారు. దాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలన్ని నయమవుతాయని ఆదివాసీలు తనతో చెప్పారన్నారు. మీరట్‌కు చెందిన చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ ఆయుర్వేదిక్ ఎగ్స్‌పై పరిశోధన చేస్తున్నట్లు సంజయ్ ప్రస్తావించారు. సభలో ఆయన చేసిన ఈ తరహా వ్యాఖ్యలపై సభ్యులంతా విస్మయానికి గురయ్యారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్ చేస్తుండగా.. నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘అయ్యా..అదే చేత్తో మటన్, బీఫ్ కూడా శాకాహార జాబితాలో చేర్చి పుణ్యం కట్టుకోరాదు’ అని ఒకరు.. ‘కేవలం చికెన్,గుడ్డేనా, మటన్, బీఫ్ ఏ పాపం చేశాయి’ అని మరొకరు.. మటన్ బీఫ్‌పై ఇంత వివక్షా? అని ఇంకొకరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. Shiv Sena leader Sanjay Raut demands Chicken And Eggs to be called Vegetarian. Beef and Mutton: Why this discrimination?? — Khushboo (@Khush_boozing) July 17, 2019 -
మటన్ కోసం పెళ్లి విందులో ఘర్షణ
మటన్ ‘ముక్క’ పెళ్లి విందులో ఉద్రిక్తతకు దారితీసింది. మటన్‌తో భోజనం వడ్డించలేదనే కారణంతో వరుడి తరఫు బంధువులు వధువు బంధువులతో గొడవకు దిగారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి పరస్పర దాడులకు దారితీసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఉప్పుసాకలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉప్పుసాకకు చెందిన ఆజ్మీరా కుమారి వివాహం కొత్తగూడేనికి చెందిన లావుడ్యా ప్రవీణ్‌తో శుక్రవారం ఉదయం వధువు ఇంటి వద్ద జరిగింది. వివాహం అనంతరం భోజనాల వద్ద వధువు తరఫువారు మటన్‌తో భోజనం వడ్డించాలని వధువు బంధులతో ఘర్షణకు దిగారు. మటన్ పెట్టే ఆర్థిక స్థోమత లేదని చికెన్‌తో భోజనాలు చేయాలని వధువు తరఫు బంధువులు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణ తలెత్తింది. భోజనాలు చేసేందుకు వేసిన కుర్చీలు తీసుకుని ఒకరిపై ఒకరు భౌతికదాడులకు దిగారు. సుమారు వందకుపైగా కుర్చీలు విరిగిపోగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేసుకున్నారు. -
మటన్ ‘ముక్క’ కోసం పెళ్లి విందులో ఘర్షణ
-
జర భద్రం..కోడిమాంసానికి రంగుల పూత
నల్లగొండ టూటౌన్ : మాంసం వ్యాపారులు స్వలాభం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మేకపోతు అంటూ.. మేకల మాంసం, కోడి మాంసానికి రంగులు వేసి అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా రంగులు వేయని కోడి మాంసం దొరికే పరిస్థితి లేదంటే అతిశయోక్తికాదు. దాదాపు వ్యాపారులందరు కోడి మాంసానికి రంగులు వేసి మసి పూసి మారేడుకాయ చేసి నాలుగు పైసలు వెనకేసుకోవడానికే ఆశపడుతున్నారు. ఈ రంగుల వలన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారనే ధ్యాస కూడా లేకుండా ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాలు మిర్యాలగూడ, నకిరేకల్, హాలియా, దేవరకొండతో అన్ని మండలాల్లో కోడి మాంసానికి రంగులు పూసి విక్రయిస్తున్నారు. ఒక్క కోడి మాంసమే కాదు మనం నిత్యం బయటి హోటలల్లో తినే (మటన్ ఇతరత్ర) ఆహార పదార్థాలు అన్నీ కల్తీ మయం చేస్తున్నట్లు అనేక ఫిర్యాదులు ఉన్నాయి. మటన్లోనూ మాయ... మార్కెట్లో మటన్ అంటే యమ క్రేజ్ ఉంటుంది. ప్రతి ఆదివారం మటన్ షాపుల వద్ద వినియోదారులు బారులుదీరుతుంటారు. మటన్ మీద వినియోదారులు చూపిçస్తున్న క్రేజ్‌ను వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. మేకలను కోసి మేకపోతు మాంసం అని విక్రయిస్తున్నారు. అదే విధంగా కొంతమంది వ్యాపారులు అనారోగ్యం బారిన పడిన మేకలను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ వినియోగదారులకు అంటగడుతున్న ట్లు తెలిసింది. రెస్టారెంట్లలో మటన్‌కు సైతం రం గులు వేసి బిర్యానీలు తయారీ చేస్తుండడం గమనార్హం. అనేక చోట్ల మటన్లోనూ వినియోగదారులను మాయ చేçస్తుండడం విస్మయం కలిగిస్తోంది. సర్వం కల్తీమయం బజ్జీబండి నుంచి రెస్టారెంట్ల వరకు ఎక్కడ చూసినా కల్తీ చేసిన ఆహార పదార్థాలనే తయారు చేసి వడ్డించేస్తున్నారు. విశేషమంటే బయటి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఏ హోటల్‌కు వెళ్లినా జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఈ కల్తీ ఆహార పదార్థాలే వడ్డిస్తుండడం వారిని విస్మయానికి గురిచేస్తోంది. ప్రతి వ్యాపారి కల్తీ మయం చేస్తున్నట్లు గతంలో ఓ సారి నల్లగొండ మున్సిపల్ అధికారులు తనిఖీలు చేసినప్పుడు బయటపడిన విషయం తెలిసిందే. ఇక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అయితే అంతులేని రంగులు వాడుతున్నట్లు అధికారులే చెబుతున్నారు. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ దర్శనమిచ్చే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బండీలపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టడంలేదనే ప్రశ్నలకు సమాధానాల్లేవు. హోటల్ నిర్వాహకులు ఇష్టానుసారంగా మాంసంతో తయారు చేసిన ఆహార పదార్థాలు వడ్డించేస్తున్నారు. మిగిలిన ఆహార పదార్థాలను సైతం మరుసటి రోజు వినియోగదారులకు వడ్డించటం పరిపాటిగా మారిందనే విమర్శలు లేకపోలేదు. అరకొర తనిఖీలు ... జిల్లా యంత్రాంగం నిర్లిప్తత, తనిఖీ అధికారుల జాడలేకపోవడంతో కల్తీ రాజ్యం నడుస్తుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వాటిపై తనిఖీలు చేయాల్సిన అధికారులు ఎక్కడ ఆ పని సీరియస్‌గా తీసుకుంటున్న దాఖలాలు లేవనే విమర్శలు లేకపోలేదు. జిల్లా ఉన్నతాధికారులు తనిఖీలకు ఆదేశించినప్పుడు మాత్రమే అరకొరగా దాడులు చేసి హడావుడి చేస్తారనే అపవాదు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల్లో ప్రతి రోజు కొన్ని వందల షాపుల్లో కల్తీలు జరుగుతున్న సంబంధిత శాఖల అధికారులు మత్తు నిద్ర వదలడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికారుల కళ్లేదుట రంగులు వాడిన పదార్థాలు కనిపించినా సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించింది ఒక్క శాతం కూడా లేదనే చెప్పాలి. ఇప్పటికైనా సంబంధిత అధికారుల నామమాత్రంగా కాకుండా చిన్న వ్యాపారులతో పాటు రెస్టారెంట్లు, పెద్ద, పెద్ద హోటళ్లపై ఆకస్మిఖ దాడులు చేస్తేనే కల్తీమయానికి కొంతైనా అడ్డకట్ట వేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మటన్, చికెన్ షాపుల్లో తనిఖీలు జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ల బృందం ఆదివారం నల్లగొండ పట్టణంలోని పలు మటన్ షాపులు, చికెన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించింది. ఉదయం 8 గంటల ప్రాంతంలోని పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు, రామగిరి ప్రాంతంలో మటన్ షాపులు, చికెన్ షాపుల్లో తనిఖీలు చేసి పలు చోట్ల అక్రమాలను గుర్తించారు. ఎక్కువ షాపుల్లో తప్పుడు తూకాలు వేసి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు జిల్లా మెట్రాలజీ ఇన్‌స్పెపెక్టర్ శ్రీనివాస్ గుర్తించారు. అదే విధంగా కొంత వ్యాపారులు తమ కాంటాలకు ముద్ర వేయించుకోకుండా ప్రభుత్వ నిబంధనలకు ఉల్లగించారు. హైదరాబాద్ రోడ్డులో మేకపోతు అని చెబుతూ మేక మాంసం విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కోడి మాంసానికి రంగులు పూసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తప్పుడు తూకాలు, ముద్ర వేయించకపోవడంతో వ్యాపారులపై జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఐదు కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కలీల్, శానిటరీ ఇన్స్పెక్టర్ సురిగి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కల్తీ చేస్తే కఠిన చర్యలు ఆహార పదార్థాలు, మట న్, చికెన్లను కల్తీ చేసి విక్రయిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాము. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తాం. వినియోదారులు కూడా కల్తీ పట్ల అప్రమత్తంగా ఉండాలి. – ఖలీల్, జిల్లా గెజిటెడ్ ఇన్స్పెక్టర్ -
పాయా.. ఖాయా!
ప్రపంచంలోనే హైదరాబాద్ ఎన్నో రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి. ఇక్కడ తయారయ్యే రకరకాల వంటకాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకులు తమ వంటశాలల్లోని మొగలాయి, దక్కన్, ఇరానీ, అరేబియన్, పర్షియన్, యూరోపియన్ రుచులకు ఫిదా అయ్యేవారు. చలికాలం వంటకాల్లో ప్రత్యేకమైనవి నహారీ, మరగ్, శేర్వాలు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా వీటిలో ఎన్నో ఔషధ గుణాలు సైతం ఉన్నాయి.శీతాకాలం వచ్చిందంటే చాలు పాతబస్తీలోని పలు హోటళ్లలో పాయా, జబాన్, జబడా (తలకాయ కూర)నోరూరిస్తుంటాయి. పాయా, నహారీ, మరగ్, శేర్వాల తయారీ విధానం, వాటి ప్రత్యేకతలపై కథనం. సాక్షి, సిటీబ్యూరో :పాయా శేర్వా, జబాన్, జబడా శరీరానికి వేచ్చదనాన్నిఇస్తాయి. ప్రత్యేకంగా పాయా, మరగ్‌లను అనేక సుగంధ ద్రవ్యాలు, మసాలాలతో తయారు చేస్తారు. దీంతో పాటు ప్రధానంగా మేక పొట్టేలు కాళ్లు , నాలుక, తలకాయ నహారీ, మరగ్ శేర్వాలో వినియోగిస్తారు. ప్రస్తుతం నగరంలోని దాదాపు అన్ని ప్రధాన హోటళ్లలో ఏడాది పొడవునా ఉదయం, సాయంత్రం వేళల్లో నహారీ శేర్వా అందుబాటులో ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కేవలం చలికాలంలోనే శేర్వా తయారు చేస్తున్నారు. నాడు పేదల వంటకం నగరం ఏర్పాటు తొలినాళ్లలో నహారీ శేర్వా ఎక్కువ శాతంపేదల వంటకం. ఉదయం వేళల్లో కార్మికులు, కిందిస్థాయి ఉద్యోగులు దీనిని తినేవారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వంటలపై అనుభవం ఉన్న వ్యక్తులు ఉదయం, సాయంత్రం వేళల్లో నహారీ శేర్వా తయారు చేసి విక్రయించే వారు. ప్రజలు పాత్రలు తీసుకొని వచ్చి నహారీ శేర్వా తీసుకెళ్లి ఇళ్లలో తినేవారు. నహారీ శేర్వా ఒకచోట, కుల్చా (నహారీతో తినే రొట్టె) మరోచోట లభించేవి. నిజాం కాలంలో పాతబస్తీలోని మదీనా చౌరస్తాలో ఉన్న హోటళ్లతో పాటు ఖిల్వత్, షేయరాన్ తదితర ప్రాంతాల్లో నçహారీ శేర్వా హోటళ్లు వెలిశాయి. నహారీ శేర్వా తయారీ ఇలా.. మొదట మేక లేదా పొట్టేలు కాళ్లు, తలకాయ, నాలుకను కొన్ని నీళ్లలో నహారీ, మరగ్ మసాలా (పొటిలికా మసాలా, నహారీ మసాలా)తో వేడి చేసి ఉడకబెడతారు. అవి మెత్తబడే వరకు ఉడికిస్తారు. అలాగే జైఫల్, జోత్రి, గరం మసాలాతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు, మసాలాలు వేసి పాయా, జబడా, జబాన్ శేర్వా (సూప్) తయారు చేస్తారు. దీని తయారీకి సుమారు 6 గంటల సమయం పడుతుంది. నహారీ, మరగ్ తయారీలో లవంగాలు, సాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, సుగంధ ఆకులతో పాటు పాలు నెయ్యి ఉపయోగిస్తారు. వీటితో పాటు మరిన్ని సుగంధ ద్రవ్యాలను కలిపి పాయా, మరగ్ శేర్వా తయారు చేస్తారు. ధరలు ఇలా.. పాయా, మరగ్, శేర్వాతో పాటు కుల్చా, తందూరీ, నాన్ రొట్టెలు జత కలిస్తే పాయా, మరగ్ ప్రియులకు భలే మజా ఉంటుంది. పాయా శేర్వా నహారీ రూ 40., మరగ్ సూప్ రూ. 45. పాయా బొక్కలు రూ.80, చికెన్ ముక్కలతో నహారీ రూ. 80, జబాన్ రూ.80, జబడా రూ.100, నాన్ రొట్టె రూ 12, తందూరీ రొట్టె రూ.12. ప్రతీ శనివారం చికెన్ నహారీ ప్రత్యేకం.. నిజాంల కాలం నుంచి మదీనా సర్కిల్లో నహారీ, పాయా, శేర్వా అందుబాటులో ఉన్నాయి. గతంలో కేవలం నహారీ, పాయా మాత్రమే విక్రయించేవారు. ప్రస్తుతం జబాన్, జబడాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మా హోటల్లో ఐదేళ్లుగా మరగ్‌ను అందిస్తున్నాం. ప్రతి శనివారం చికెన్‌తో తయారు చేసిన నహారీ కూడా తయారు చేస్తున్నాం. నేటి తరానికి అంతగా ఘాటు లేని మరగ్‌ను కూడా మా హోటల్లో అందుబాటులో ఉంచాం – ఉమర్ ఆదిల్,షాదాబ్ హోటల్ యజమాని -
పెరిగిన మాంసం ధరలు
సాక్షి, సిటిబ్యూరో : సిటీలో చికెన్, మటన్ ధరలు మండిపోతున్నాయి. హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో ధరలు అమాంతం పెంచేశారు. హోల్‌సేల్ కోడి ధర రూ.10 నుంచి 20 వరకు పెరిగాయి. కిలో మటన్ ధర రూ.50 పెరిగింది. దీంతో రిటైల్ వ్యాపారులకు కూడా ధరలు విపరీతంగా పెంచారు. ఈ లెక్కన కిలో చికెన్ 210 రూపాయలు కాగా..మటన్ రూ.550 కిలో విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. అదివారం 70 లక్షల కిలోలు అమ్ముతారు. దసరా పండుగ రోజు దాదాపు 3 కోట్ల కిలోల వరకు విక్రయాలు జరగవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. అయితే ఈ ఏడాది డిమాండ్‌కు సరిపడా కోళ్ల ఉత్పత్తి లేదని తెలుస్తోంది. అందువల్లే రేట్లు పెంచుతున్నారని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది దసరా పండుగకు డిమాండ్ కంటే ఎక్కువగా కోళ్ల సరఫరా ఉండడంతో, కిలో కోడి ధర రూ.100 దాటలేదని వారు పేర్కొన్నారు. మటన్ కిలో రూ.550 ప్రస్తుతం మార్కెట్లో కిలో మటన్ ధర రూ.550 ఉండగా ఇక దసరా రోజు మటన్ ధరలు ఏ స్థాయిలో పెరుగుతుందోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ పొట్టేలుతో పాటు ఇతర పొట్టేళ్ల ధరలు హోల్‌సెల్ మార్కెట్లో బాగా పెరిగాయని, దీంతో రిటైల్ ధరలు పెంచాల్సి వస్తుందని మటన్ వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి మేకపొతులు, గొర్రెపొతులు ఎక్కువగా వచ్చేవి. వీటి ధరలు తెలంగాణ పొట్టెలు కంటే తక్కువగా ఉండడంతో కిలో మటన్ ధర రూ 500 లోపు ఉండేవి. ప్రస్తుతం తెలంగాణ పొట్టేలు మార్కెట్‌కు డిమండ్‌కు అనుగుణంగా దిగుమతి లేకపోవడంతో మటన్ ధరలు విపరింగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రేట్ల పెరుగుదల ఇలా... గత వారం కిలో కోడి ధర రూ.85... మంగళవారం ధర రూ.110 చికెన్ ధర గత వారం కిలో రూ. 160... మంగళవారం చికెన్ విత్ స్కిన్ రూ.210 స్కిన్లెస్ కిలో కోడి ధర రూ. 240... బోన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.300 మటన్ కిలో గత వారం రూ.500 మంగళవారం ధర...కిలో రూ. 550 -
ప్లేట్ ఖుష్
పండగ అంటే షేర్వానీ తొడగడం... షేర్ చేసుకొని తినడం. పొరుగువారిని పిలవడం... నలుగురికి పంచడంఇలా చేస్తే... హృదయం ఆనందంతో నిండిపోతుంది... పంచిన మనకు ప్లేట్ఖుష్ తిన్నవారి పేట్ఖుష్ అందరికీ దిల్ఖుష్. పత్తర్ కా ఘోష్ కావల్సినవి :బోన్‌లెస్ మటన్ – కేజీ; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్ స్పూన్; దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూన్; జాజికాయ పొడి – పావు టీ స్పూన్; లవంగాల పొడి – చిటికెడు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; నెయ్యి – 100 గ్రాములు; ఆవనూనె – అర కప్పు; మిరియాల పొడి – చిటికెడు ; బొప్పాయి కాయ గుజ్జు – టేబుల్ స్పూన్; కారం – టీ స్పూన్; అనాసపువ్వు పొడి – చిటికెడు ; నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు; చిలికిన పెరుగు – కప్పు ; ఉప్పు – తగినంత ; వెల్లుల్లి రసం – 2 టేబుల్ స్పూన్లు తయారి:మటన్‌ని శుభ్రం చేసి, నీళ్లన్నీ పోయేలా వార్చాలి ∙అందులో పై మసాలా, కారం... అన్నీ కలిపి 2 గంటలు నానబెట్టాలి ∙వెడల్పాటి రాయిని బొగ్గుల కుంపటి మీద పెట్టి వేడి చేయాలి ∙నెయ్యి వేసి, ఒక్కో ముక్కను అన్ని వైపులా బాగా కాల్చి తీయాలి ∙వేడి వేడిగా వడ్డించాలి. నోట్: ఇలాగే చికెన్‌తోనూ తయారుచేసుకోవచ్చు. మటన్ బిర్యానీ కావల్సినవి:బాస్మతి బియ్యం – పావు కేజీ (250 గ్రా.ములు); మటన్ – కేజీ (ముక్కలు 2 అంగుళాల పరిమాణం); అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; ఉల్లిపాయలు – 5 (నిలువుగా సన్నగా తరిగి, విడిగి వేయించి పక్కనుంచాలి); కారం – టేబుల్ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; పచ్చి బొప్పాయి ముక్క – పేస్ట్ చేయాలి; చిలికిన పెరుగు – కప్పు; కుంకుమపువ్వు – కొన్ని రేకలు (గరిటెడు వేడి పాలలో కలిపి పక్కనుంచాలి); మసాలా (దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 పచ్చ యాలకులు, 3 లవంగాలు, బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ సాజీర) ; రైస్ మసాలా: (యాలకులు 2, దాల్చిన చెక్క, పచ్చ యాలక్కాయ, 2 లవంగాలు, నెయ్యి లేదా నూనె 3 టేబుల్‌స్పూన్లు, పుదీనా, కొత్తిమీర గుప్పెడు, ఉప్పు తగినంత) తయారి: బేసిన్లో మటన్ వేసి అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, బొప్పాయి ముద్ద, కారం, పసుపు, మసాలా, ఉప్పు, వేయించిన ఉల్లిపాయల తరుగు సగం వేసి కలిపి, 3 గంటల సేపు నానబెట్టాలి ∙కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల చొప్పున నీళ్లు, మసాలా, తగినంత ఉప్పు వేసి బియ్యం ముప్పావు వంతు వరకు ఉడికించి, నీళ్లను వడకట్టాలి ∙తర్వాత అందులో నెయ్యి వేసి కలపాలి ∙మరో మందపాటి డేకిసా(గిన్నె) తీసుకొని నెయ్యి వేసి వేడయ్యాక నానిన మటన్ వేసి కలపాలి ∙పైన పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేయాలి ∙సగం ఉండికిన బియ్యం పైన లేయర్‌గా వేయాలి ∙ మిగిలిన నెయ్యి, కుంకుమపువ్వు కలిపిన పాలు, నిమ్మరసం వేయాలి ∙డేకిసా మీద మూత పెట్టి, గోధుమపిండి ముద్దతో చుట్టూ మూసేయాలి. పెద్ద మంట మీద 20–25 నిమిషాలసేపు ఉడకనివ్వాలి ∙సన్నని మంట మీద మరో 40 నిమిషాలు ఉంచాలి ∙తర్వాత వేడి వేడిగా వడ్డించాలి. గోంగూర మటన్ కావాల్సినవి:గోంగూర ఆకులు (శుభపరిచినవి) – 250 గ్రాములు; బోటి (మేక మాంసం) – 500 గ్రాములు; కొత్తిమీర – తగినంత ; పుదీన – గుప్పెడు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లిపేస్ట్ – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; కారం – తగినంత; మసాలా – టీ స్పూన్; గసగసాలు – టీ స్పూన్ తయారి:మేక మాంసం తీసుకొని వేడినీటిలో 15 నిమిషాలపాటు ఉడికించాలి. నీళ్లు వంపేసి, చల్లారిన తరువాత ముక్కలు చేయాలి. పొయ్యిమీద గిన్నెపెట్టి నూనె వేసి వేడిచేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ఫేస్ట్, పుసుపు వేసి వేయించాలి. ఆ తరువాత బోటిని వేసి 5 నిమిషాలు ఉడికించాలి. తగినంత కారం, ఉప్పు కలిపి ఉడికించాలి. 15 నిమిషాల తరువాత తరిగిన పుంటికూర ఆకులు వేసి ఉడికించి, గరం మసాలా, కొత్తి మీర వేసి దించాలి. భేజా ఫ్రై కావల్సినవి:మేక బ్రెయిన్ (భేజా)– 200 గ్రాములు; టొమాటో తరుగు – కప్పు; ఉల్లిపాయ తరుగు – కప్పు ; పచ్చిమిర్చి చీలికలు – 3 ; కొత్తిమీర తరుగు – టీ స్పూన్; మిరియాలు (కచ్చాపచ్చాగ దంచాలి) – 10 ; కారం – అర టీ స్పూన్; ధనియాల పొడి – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత; నిమ్మరసం – తగినంత తయారీ:మరుగుతున్న నీళ్లలో పసుపు, ఉప్పు వేసి భేజాను 2–3 నిమిషాలు ఉంచాలి ∙తరువాత నీళ్లను వడకట్టాలి ∙గట్టిపడిన భేజాను ముక్కలుగా కట్ చేయాలి ∙పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి కాగాక జీలకర్రను చిటపటలాడించాలి ∙దీంట్లో ఉల్లిపాయ తరుగు వేసి ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి ∙దీంట్లో టొమాటో తరుగు వేసి మరో 3–4 నిమిషాలు ఉడికించి, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు వేసి మరో అర నిమిషం కలపాలి ∙దీంట్లో ఇతర మసాలా పొడులు వేసి, గరిటెడు నీళ్లు కలిపి ఉడికించాలి ∙మిశ్రమం చిక్కగా అయ్యాక కట్ చేసిన భేజాను వేయాలి ∙ఎక్కువ కలపకుండా నూనె కూరనుంచి వేరయ్యేదాక ఉడికించాలి ∙చివరగా మంటతీసేసి కొత్తిమీర, నిమ్మరసం వేసి దించాలి. పాయా షోర్బా కావల్సినవి: మటన్ ముక్కలు(పాయా/కండ ఉన్న ఎముకలు) – 10–15; వెల్లుల్లి – 8 రెబ్బలు; ఉల్లిపాయలు – 4 ; పసుపు – అర టీ స్పూన్; లవంగాలు – 5; పచ్చ యాలక్కాయలు – 4 ; లవంగాలు – 6 ; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఉప్పు – తగినంత ; నెయ్యి – అర కప్పు ; కారం – అర టీ స్పూన్; మిరియాల పొడి – అర టీ స్పూన్; కొత్తిమీర – చిన్న కట్ట; గరం మసాలా – టీ స్పూన్; నిమ్మరసం – టేబుల్ స్పూన్ తయారి:మటన్‌ని శుభ్రపరుచుకొని పక్కనుంచాలి ∙2 ఉల్లిపాయలను సన్నగా తరగాలి ∙మరో రెండింటిని వెల్లుల్లితో కలిపి ముద్దచేసి పక్క నుంచాలి ∙పెద్ద మందపాటి గిన్నె15–16 కప్పుల నీళ్లు, మటన్ ముక్కలు వేసి ఉడికించాలి ∙దీంట్లో ఉల్లిపాయ ముద్ద, పసుపు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఉప్పు వేసి సన్నని మంట మీద ఉడికించాలి ∙పాయా మిశ్రమం చిక్కపడుతుండగా మరో 3 కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి ∙విడిగా ఒక పాన్‌ను స్టై మీద పెట్టి నెయ్యి వేసి, దాంట్లో ఉల్లిపాయలను గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి ∙తర్వాత కారం, మిరియాల పొడి వేసి కలపాలి ∙ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పాయాలో వేసి కలపాలి ∙ చాలా సన్నని మంట మీద దాదాపు 4 గంటల సేపు మరిగించాలి ∙పాయ నుంచి ముక్క కొద్దిగా విడేదాకా ఉడికించాలి ∙తర్వాత కొత్తిమీర, గరం మసాలా వేసి, పైన కొద్దిగా నెయ్యి వేసి మంట తీసేయాలి ∙నిమ్మరసం కలిపి వేడి వేడిగా రోటీ, పుల్కాలలోకి వడ్డించాలి. మటన్ ఫ్రై కావల్సినవి:మటన్ ముక్కలు – 200 గ్రాములు; పసుపు – అర టీ స్పూన్; అల్లం – వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు; నిమ్మకాయ – సగం ముక్క; గరం మసాలా – అర టీ స్పూన్; మొక్కజొన్న పిండి – టీ స్పూన్; కారం – టీ స్పూన్; మైదా – టీ స్పూన్; ఉప్పు – తగినంత; కొత్తిమీర – టీ స్పూన్; నూనె – తగినంత తయారి: ∙మటన్‌ను కడిగి నీళ్లన్నీ పోయేలా వడకట్టి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఉడికించాలి ∙నీళ్లన్నీ ఇంకిపోయాక నిమ్మ రసం కలిపి 5 నిమిషాలు పక్కనుంచాలి ∙తర్వాత మటన్‌లో కారం, పసుపు, గరం మసాలా, మొక్కజొన్నపిండి, మైదా వేసి కలపాలి ∙కడాయిలో తగినంత నూనె వేసి మటన్‌ని బాగా వేయించాలి ∙చివరగా కొత్తిమీర చల్లి దించాలి. నిమ్మముక్కతో వడ్డించాలి. మటన్ కర్రీ కావల్సినవి: బోన్‌లెస్ మటన్ – అర కేజీ; జీలకర్ర – అర టేబుల్ స్పూన్; ఉల్లిపాయల తరుగు – కప్పుడు; గసగసాల పేస్ట్ – అర కప్పు; అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి – టేబుల్ స్పూన్; పసుపు – అర టీ స్పూన్ ; కారం – అర టీ స్పూన్; బిర్యానీ ఆకులు – 2 ; లవంగాలు – 8 ; ఆకుపచ్చ ఇలాచీలు – 8 ; దాల్చిన చెక్క – చిన్న ముక్క; జాజికాయ పొడి – పావు టీ స్పూన్; నూనె – 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత తయారి: ∙కడాయిలో లవంగాలు, ఇలాచీలు, జాజికాయ పొడి, జీలకర్ర, దాల్చిన చెక్క వేసి వేయించి, పొడి చేయాలి ∙గిన్నెలో నూనె వేసి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీంట్లో మటన్ ముక్కలు, చేసి పెట్టిన గరం మసాలా, పసుపు, కారం వేసి, కప్పు నీళ్లు ఉప్పు వేసి ఉడికించాలి. చిక్కదనం బట్టి మరికొన్ని నీళ్లు కూడా కలుపుకోవచ్చు ∙చివరగా గసగసాల పేస్ట్, కొబ్బరి పేస్ట్, ధనియాల పొడి వేసి మరో పది నిమిషాలు ఉడికించాలి. వేడి వేడిగా అన్నం లేదా రోటీలోకి వడ్డించాలి. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail: familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. -
కనుమసాలా
అల్లం వెల్లుల్లి గ్రైండర్లో ఘుమఘుమ.. జీడిపప్పు కొత్తిమీర బాణలిలో ధుమధుమ చికెన్ ముక్క మటన్ పీసు ఇన్ని రొయ్యలు అన్ని చేపలు కనుమరోజు మసాలా మోతెక్కిపోవాలి. ఈ నాన్‌వెజ్ మీ విస్తళ్లలో రుచుల్ని నింపాలి నాటుకోడి పులావ్ కావలసినవి: నాటుకోడి ముక్కలు – 200 గ్రాములు; బియ్యం – 150 గ్రాములు; ఉల్లిపాయలు – 2 ; దాల్చిన చెక్క – 2 ముక్కలు; నెయ్యి–డాల్డా – 3 టేబుల్ స్పూన్లు; గరం మసాలా (లవంగాలు, యాలకులు) – టీ స్పూన్; పుదీనా ఆకులు – గప్పెడు; అల్లం –వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; ఉప్పు – తగినంత ; పచ్చిమిర్చి – 3 ; బిర్యానీ ఆకు – 2; కరివేపాకు – రెమ్మ; కొత్తిమీర – టీ స్పూన్ తయారి: మందపాటి గిన్నెలో నెయ్యి–డాల్డా వేసి కాగాక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, గరం మసాలా వేసి వేయించాలి. దీంట్లో నిలువున సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించాలి. తర్వాత పుదీనా వేసి, వేగాక ఉప్పు కలిపి, నీళ్లు పోసి మరిగించాలి. దీంట్లో నాటుకోడి ముక్కలు వేసి ఉడికించాలి. ముక్కలు 50 శాతం ఉడికాక అందులో బియ్యం వేసి కలపాలి. అన్నం ఉడికాక మంట తగ్గించి కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి పూర్తిగా అయ్యాక దించాలి. నాటుకోడి పులుసు కావలసినవి: నాటుకోడి ముక్కలు – 200 గ్రాములు; గసగసాలు – 150 గ్రాములు; ఎండుకొబ్బరి – 100 గ్రాములు; పచ్చిమిర్చి – 4; నూనె – 4 టేబుల్ స్పూన్లు; అల్లం –వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు; చింతపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి) ; టొమాటో – 1 (సన్నగా తరగాలి); జీలకర్ర – టీ స్పూన్; పచ్చిమిర్చి – 3; కారం – టీ స్పూన్; ఉప్పు – తగినంత; గరం మసాలా – అర టీ స్పూన్; ధనియాల పొడి – అర టీ స్పూన్; ఎండుకొబ్బరి – 100 గ్రాములు; కొత్తిమీర – టేబుల్ స్పూన్ తయారి: గసగసాలు వేయించి ఎండుకొబ్బరి కలిపి ముద్ద చేసి ఉంచాలి. నాటుకోడి ముక్కలలో అల్లం వెల్లుల్లిపేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలిపి అర గంట పక్కనుంచాలి. గిన్నెలో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, నిలువుగా కోసిన పచ్చిమిర్చి వేసి కలపాలి. దీంట్లో కలిపి ఉంచిన నాటుకోడి ముక్కలను వేసి కలపాలి. కొద్దిగా ఉడికాక కారం, ఉప్పు, గసగసాల మిశ్రమం, చింతపండు గుజ్జు వేసి కలపాలి. ముక్క ఉడికాక మంట తగ్గించి గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర చల్లి 3 నిమిషాలు ఉంచి దించాలి. గోంగూర మటన్ కావలసినవి: మటన్ ముక్కలు – 250 గ్రాములు; గోంగూర – గుప్పెడు ఆకులు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); ఎండుమిర్చి – 4; వెల్లుల్లి – 2 ; జీలకర్ర, ఆవాలు – టీ స్పూన్; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; కారం – టీ స్పూన్ (తగినంత); ధనియాల పొడి – టీ స్పూన్; గరం మసాలా (లవంగ, యాలకులు, దాల్చినచెక్క వేయించి పొడి చేసిదిన) – టీ స్పూన్; ఎండు కొబ్బరి – అర కప్పు; కొత్తిమీర – టీ స్పూన్ తయారి: మటన్ ముక్కలలో పసుపు వేసి 75 శాతం వరకు ఉడికించాలి. మందపాటి గిన్నెలో నూనె వేసి కాగాక అందులో జీలకర్ర, ఆవాలు, గరం మసాలా వేయించాక ఉల్లిపాయలు వేగనివ్వాలి. దీంట్లో అల్లం–వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, మటన్ ముక్కలు వేసి కలపాలి. ఉప్పు, కారం, గోంగూర వేసి ఉడికించాలి. ధనియాల పొడి వేసి మరికాసేపు ఉంచి చివరగా కొత్తిమీర చల్లి దించాలి. చేపల పులుసు కావలసినవి: కొరమీనులు – కేజీ (మీడియమ్ సైజులో ముక్కలు చేయాలి); చింతపండు – పావుకేజీ (నానబెట్టి రసం తీయాలి); టొమాటోలు – పావుకేజీ (నాలుగు ముక్కలుగా కట్ చేయాలి); ఉల్లిపాయలు – పావుకేజీ (పెద్ద ముక్కలుగా కట్ చేయాలి); పచ్చిమిర్చి – 50 గ్రాములు (నీలువుగా చీరాలి); మెంతులు – 2 టీ స్పూన్లు; ఆవాలు – టీ స్పూన్; కారం – తగినంత; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; ఎండుకొబ్బరి – 2 టీ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా; నూనె – తగినంత తయారి: వెడల్పాటి పాన్‌లో నూనె వేసి కాగాక మెంతులు, ఆవాలు వేయించి ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి కలపాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేగాక సరిపడా కారం, చింతపులుసు, ఉప్పు కలిపి ఉడికించాలి. రసం చిక్కబడ్డాక చేప ముక్కలు వేసి మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి దించాలి. గరిటెతో కలిపితే ముక్కలు విరిగిపోతాయి. వెల్లుల్లి ఖీమా కావలసినవి: మటన్ ఖీమీ – పావు కేజీ ; వెల్లుల్లి ముద్ద – 100 గ్రాములు; అల్లం – టీ స్పూన్; పచ్చిమిర్చి – 10; కరివేపాకు – 2 రెమ్మలు; ఉల్లిపాయలు – 1 (సన్నగా తరగాలి); టొమాటో – 1 (సన్నగా తరగాలి); ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు; కారం – అర టీ స్పూన్; జీడిపప్పు ముద్ద – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – టీ స్పూన్ తయారి: ముందు ఖీమాను శుభ్రపరిచి, ఉడికించుకోవాలి. కడాయిలో నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేయించుకోవాలి. తర్వాత టొమాటో వేసి వేయించి అల్లం –వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. బాగా వేగిన తర్వాత ఉడికించిన ఖీమా వేసి కలపాలి. దీంట్లో కారం, ఉప్పు, జీడిపప్పు ముద్ద, ధనియాల పొడి, గరం మసాలా వేసి 5 నిమిషాల ఉంచాలి. తర్వాత నెయ్యి వేసి దించాలి. పైన నేతిలో వేయించిన వెల్లుల్లిని అలంకరించాలి. -
చికెన్, మటన్, నెయ్యి!
కస్తూర్బా గాంధీ పాఠశాలల్లోని విద్యార్థినులకు ఇక మంచి పోషకాహారం అందనుంది. చికెన్, మటన్, గుడ్డు, నెయ్యి అందించేలా సర్కార్ చర్యలకు ఉపక్రమించనుంది. వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో చికెన్, గుడ్డు అందిస్తున్నారు. ఇకపై నెలలో రెండు వారాలు మటన్, నిత్యం నెయ్యి అందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈనేపథ్యంలో ఎదిగే విద్యార్థినులకు మంచి పౌష్టికాహారం అందనుంది. వికారాబాద్, యాలాల(తాండూరు): బడిబయటి పిల్లలతో పాటు చదువును మధ్యలో ఆపేసిన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన కేజీబీవీ(కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం)ల్లో నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కస్తూర్బా పాఠశాలల్లోని విద్యార్థినులు ఆరోగ్యపరంగా రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన అధికారులు వారికి నాణ్యమైన మాంసకృత్తులు అందించడం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్తూర్బాల్లో చికెన్‌తో పాటు మేక మాంసం, ప్రతిరోజు గుడ్డు, నెయ్యితో మెనూను అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే వారానికొకసారి అందించే చికెన్‌తో పాటు మేకకూర ప్రతిరోజు నెయ్యి, గుడ్డు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయ ప్రత్యేక అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్వహించిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇందుకు కోసం కొత్త సంవత్సరం నుంచి కేజీబీవీల్లో కొత్త మెనూ అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగేందుకు అస్కారం ఉంటుంది. జిల్లాలోని కసూర్బా పాఠశాలలు.. జిల్లాలోని 18 మండలాల్లో కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 3,374 మంది విద్యార్థినులు విద్యభ్యాసం చేస్తున్నారు. వీరికి ప్రతిరోజూ నాణ్యమైన భోజనంతో పాటు వారంలో ఒకరోజు(ఆదివారం)చికెన్ అందిస్తున్నారు. భోజనంతో పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో స్నాక్స్ ఇతరత్రా ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. ఇలా ఒక్కో విద్యార్థికి రూ.33 పర్ కేపిటాగా నెలకు రూ.990లు ఖర్చు చేస్తున్నారు. అయితే, కొత్త సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్న నూతన మెనూలో భాగంగా మటన్, నెయ్యి, గుడ్డు విషయంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బహిరంగంగా మార్కెట్లో మటన్ కిలోకు దాదాపు రూ.400, నెయ్యి కిలోకు రూ.400, గుడ్డు ఒక్కోటి రూ.5గా ఉంది. కొత్త సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్న మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.45 పర్ కేపిటాగా ఖర్చు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎదిగే బాలికలు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుకుండా, రక్తహీనత బారినపడకుండా ఉండేందుకు ఈ కొత్త మెనూ దోహదపడుతుందని కేజీబీవీ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అమలు అవుతున్న మెనూలో భాగంగా నెలకు నాలుగుసార్లు చికెన్‌తో పాటు రెండుసార్లు మేక మాంసాన్ని మెనూ లో ప్రవేశపెట్టనున్నారు. ప్రతినెలా రెండు, నాలుగో ఆదివారం మేక మాంసం అందించేలా ప్రణాళికలు చేపడుతున్నారు. ఇదే అమలు అయితే విద్యార్థినులు ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. ఆరోగ్యంగా ఎదిగేందుకు అవకాశం కేజీబీవీల్లో కొత్తగా ప్రవేశపెట్టనున్న మెనూతో విద్యార్థులకు మేలు జరుగుతుంది. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన బాలికలు ఇక్కడ చదువుకుంటారు. ఇక్క డ కేజీబీవీల్లో విద్యార్థినులు రక్తహీనత, ఆరోగ్యపరమైన సమస్యలతో సతమతమవుతుంటారు. కొత్త మెనూ ప్రకారం మేక మాంసం, నెయ్యి, గుడ్డుతో ఎంతో మేలు కలుగుతుంది. తద్వారా విద్యార్థినులు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటికే మెనూపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలి. –సుధాకర్‌రెడ్డి, ఎంఈఓ, యాలాల -
బీఫ్ బదులు మటన్, చికెన్
లఖ్‌నవూ(ఉత్తరప్రదేశ్): ముఖ్య మంత్రి ఆదిత్యా నాథ్ యోగి తీసుకున్న గోమాంస నిషేధంతో సింహాలకు బీఫ్ బదులు మటన్, చికెన్ పెట్టనున్నారు. అక్కడి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వాటికి గొడ్డు మాంసం కరువైంది. దీంతో అధికారులు మటన్, చికెన్ అందజేస్తున్నారు. అయితే, దీని కారణంగా అక్కడి ప్రభుత్వ ఖజానాపై ఎక్కువ భారం పడుతోందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లఖ్‌నవూ జూ, ఇటావాలోని సఫారీలో సింహాలున్నాయి. ఒక్కో సింహానికి రోజుకు సగటున 10కిలోల గొడ్డుమాంసం పెడుతుంటారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రెండు రోజులుగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని పశుమాంసం దుకాణాలు మూతబడ్డాయి. ఈ కారణంగా జూలోని సింహాలతోపాటు పులులు, నక్కలు, తోడేళ్లు, చిరుతలు, సివంగులకు కూడా మాంసం లభించటం గగనంగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు కోడి, మేక లేక గొర్రెల మాంసాన్ని అందిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలతో గొడ్డుమాంసం కాంట్రాక్టర్‌ను మార్చి, మటన్, చికెన్ కాంట్రాక్టర్ ను వెతకాల్సి ఉందని చెప్పారు. ఈలోగా ప్రభుత్వ నిర్ణయంలో ఏమాత్రం మినహాయింపు లభించినా తిరిగి పశుమాంసాన్నే తెప్పిస్తామని అన్నారు. స్థానిక మాంసం దుకాణాలు మూతబడిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణదారుల నుంచి పశుమాంసం తెప్పించేందుకు గల అవకాశాలను అన్వేషిస్తున్నామని ఇటావా సింహాల సఫారీ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ పటేల్ తెలిపారు. -
కమాన్ కొలకేషియా!
చామదుంప ఇంగ్లిష్ స్కూల్‌కెళితే ఏమౌతుంది?... టీచర్ పేరు మార్చి ‘కొలకేషియా’ అని పిలుస్తుంది. ఏషియా ఒక్కటేంటి వరల్డ్ మొత్తంలో కొలకేషియా చాలా ఫేమస్. ఇవ్వాళ మీ పిల్లలకి, మీ ఆయనకి కొలకేషియాని వడ్డించండి... దుంపని మర్చిపోయి చమ చమ లాగించేస్తారు... మమ్మీ ఇంగ్లిషు వంట చేసిందని... కాలనీ అంతా చెప్పుకుంటారు.... వాట్ ఆర్ యూ వెయిటింగ్... కమాన్ కొలకేషేయండి. మలేషియా చామదుంపల రోస్ట్ కావల్సినవి: కొలకేషియా (చామదుంప) – 250 గ్రాములు, శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు, కారం – టీ స్పూన్, ధనియాల పొడి – టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావుట ఈ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 3 టేబుల్ స్పూన్ల పోపు: నూనె – టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, నిమ్మరసం – 2 టీ స్పూన్లు తయారీ: ∙చామదుంపల పై ఉన్న నలుపురంగును గీకి, కడిగాలి. వాటిని ప్రెషర్ కుకర్‌లో వేసి, చిటికెడు ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టి వేసి ఒక విజిల్ వచ్చేవరకు ఉంచి దించాలి. చల్లారాక దుంపలపై పొట్టు తీసి, ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ∙వెడల్పాటి బేసిన్లో కారం, ధనియాలపొడి, ఉప్పు, పసుపు, అమ్చూర్, జీలకర్రపొడులు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కట్‌చేసిన చామదుంపలపై వేసి కలపాలి. ∙కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కలిపి ఉంచిన చామ దుంపలను కొద్ది కొద్దిగా వేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. నూనె అయిపోతే మరికొంత కలుపుకోవాలి. వేయించిన చామదుంపలపై శనగపిండి చల్లాలి. ∙కడాయిలో మరో టీ స్పూన్ నూనె వేసి జీలకర్ర, వాము వేయించాలి. దీంట్లో శనగపండి కలిపిన చామదుంపలను వేసి వేయించాలి. నిమ్మరసం పిండి దించాలి. పెరుగన్నం, సాంబార్, రసం అన్నంలోకి వేడి వేడిగా వడ్డించాలి. చామదుంప మటన్ కావల్సినవి: చామదుంపలు – పావు కేజీ, మటన్ – 350 గ్రాములు, చింతపండు గుజ్జు – 1 1/2 టేబుల్ స్పూన్, నీళ్లు – కప్పు, ఉల్లిపాయలు – 2 తయారీ: ∙మటన్‌ని శుభ్రపరిచి, అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి పక్కనుంచాలి. చామదుంపలపై ఉన్న నలుపును తీసేసి, కడగాలి. (రెండు రెండు దుంపల చొప్పున కడిగితే పై జిగట అంటుకోదు) ∙ప్రెజర్ కుకర్ పొయ్యి మీద పెట్టి నూనె వేసి, కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించుకోవాలి. దీంట్లో సిద్ధంగా ఉంచిన మటన్ వేసి ఉడికించాలి. మటన్‌లోని నీళ్లన్నీ ఇగిరిపోయాక 4 కప్పుల నీళ్లు పోసి పైన మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత దీసి, దీంట్లో చామదుంపలు వేసి సన్నని మంట మీద ఉడకనివ్వాలి. చింతపండు గుజ్జు పోసి, గరం మసాల, ధనియాలపొడి, కొత్తిమీర వేసి కలపాలి. సన్నని మంట మీద ఉడకనిచ్చి దించాలి. గరం మసాలాకు: 4 లవంగాలు, 4 యాలకులు, దాల్చిన చెక్క, 8 మిరియాలు, 8 తొకమిరియాలు కలిపి పొడి చేయాలి. చామ ఆకు పప్పు కావల్సినవి: చామ ఆకులు – 30, పప్పు – పావు కేజీ, ఉల్లిపాయలు – 1 , పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 6, టొమాటో – 1 (తరగాలి), నూనె – టేబుల్‌స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, ఆవాలు – అర టీ స్పూన్, చింతపండు గుజ్జు – టీ స్పూన్, కారం – టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, కొత్తిమీర తరుగు – టీ స్పూన్, ఉప్పు – తగినంత తయారీ: ∙చామ ఆకులను కడిగి, సన్నగా తరిగి పక్కనుంచాలి. కుకర్‌లో పప్పు కడిగి అరలీటర్ నీళ్లు పోసి, చిటికెడు పసుపు, స్పూన్ నూనె వేసి, మూత పెట్టి 3–4 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. తర్వాత పప్పుగుత్తితో మెత్తగా రుబ్బాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కారం కలపాలి. 2 నిమిషాల తర్వాత టొమాటో వేసి మెత్తగా ఉడికించాలి. దీంట్లో చామ ఆకులు, ఉప్పు వేసి కలిపి, 3 నిమిషాల సేపు మూత పెట్టాలి. తర్వాత దీంట్లో ఉడికించిన పప్పు, చింతపండు గుజ్జు, కొత్తిమీర చల్లి మరో నిమిషం ఉంచి దించాలి. బెంగాలీల చామదుంపల రొయ్యల కూర కావల్సినవి: చామదుంపలు – 5 (ముక్కలుగా కట్ చేయాలి) బంగాళదుంప – 1 (ముక్కలుగా కట్ చేయాలి), రొయ్యలు – 12, అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్ టొమాటో – 1 (సన్నగా తరగాలి), «ధనియాలపొడి – టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్ పసుపు – అర టీ స్పూన్, కారం – టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, కారం – టీ స్పూన్ బిర్యానీ ఆకు – 1, ఆవనూనె – పావు కప్పు, నెయ్యి – టీ స్పూన్, పంచదార – టీ స్పూన్, ఉప్పు – తగినంత తయారీ: ∙చామదుంపల పై పొట్టు తీసి, కడిగి, పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి, ఉడికించి పక్కనుంచాలి. ∙రొయ్యలకు పసుపు, ఉప్పు కలిపి కొద్దిగా నూనె వేసి, వేయించి పక్కనుంచాలి. ∙విడిగా కడాయిలో నూనె వేసి వేడయ్యాక చామదుంప, బంగాళదుంప ముక్కలు వేసి వేయించాలి. ∙విడిగా కడాయిలో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసి వేయించాలి. పొడి చేసి ఈ మసాలాను ఉడుకుతున్న ముక్కలలో వేసి కలపాలి. అలాగే ఉప్పు, పంచదార వేసి 4–5 నిమిషాలు ఉడకనివ్వాలి. గ్రేవీ కోసం 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి చిక్కగా అయ్యేలా ఉడికించాలి. 7–8 నిమిషాల తర్వాత వేయించిన రొయ్యలను వేసి కలపాలి. దీంట్లో గరం మసాలా, టీ స్పూన్ నెయ్యి కలిపి, మూత పెట్టి, మంట తీసేయాలి. అన్నం, చపాతీలోకి ఈ కూరను వడ్డించాలి. తమిళనాడుచామదుంప పులుసు కావల్సినవి: కొలేకేషియా(చామదుంప) – అర కేజీ (ఉడికించి, పై తొక్క తీసి, ముక్కలుగా కట్ చేయాలి), ఉల్లిపాయలు – 1, దాల్చిన చెక్క– 2, టొమాటోలు – 3, కారం – టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి టీ స్పూన్, జీలకర్ర పొడి – టీ స్పూన్, గరం మసాలా – టీ స్పూన్, చింతపండు గుజ్జు – 3 టేబుల్ స్పూన్లు, నూనె – 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙కడాయిలో నూనె కాగాక ఉల్లిపాయలు, దాల్చిన చెక్క వేయించాలి. దీంట్లో టొమాటో ముక్కలు వేసి, కొద్దిగా మగ్గాక చింతపండు రసం కలపాలి. ఉప్పు వేసి, మిశ్రమం బాగా చిక్కబడ్డాక ఉడికించిన చామదుంపలు వేసి కలపాలి. మిగతా అన్ని పదార్థాలు వేసి, కొద్దిగా నీళ్లు కూడా కలిపి ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి, మంట తీసేయాలి. కేరళ మసాలా చామదుంప కర్రీ కావల్సినవి: చామదుంపలు/చెంబు – 10, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత గ్రైండ్ చేయడానికి: కొబ్బరినూనె/వంటనూనె – 2 టేబుల్ స్పూన్లు, చిన్న ఉల్లిపాయలు – 6 (ఒక్కొక్కటి రెండు ముక్కలుగా కట్ చేయాలి), కొబ్బరి తురుము – ముప్పావు కప్పు, కారం – 2 టీ స్పూన్లు, కరివేపాకు – 2 రెమ్మలు, కొత్తిమీర తరుగు – 4 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత పోపుకి: కొబ్బరినూనె – 2 టేబుల్ స్పూన్లు, చిన్న ఉల్లిపాయలు – 10, కరివేపాకు – రెమ్మ తయారీ: ∙చామదుంపల పైన నల్లటి పొడి లేకుండా చాకుతో శుభ్రం చేయాలి. తర్వాత నీళ్లతో కడగాలి. స్టౌమీద ప్రెజర్ కుకర్ పెట్టి దాంట్లో చామ దుంపలు, కొద్దిగా పసుపు, ఉప్పు, కప్పు నీళ్లు పోసి ఉడికిస్తూ ఉండాలి. ∙విడిగా మరో పొయ్యి మీద కడాయి పెట్టి, దాంట్లో నూనె వేసి వేడియ్యాక ఉల్లిపాయలు వేయించాలి. అలాగే కొబ్బరి తురుము, కరివేపాకు వేయాలి. ఇవి బాగా వేగాక కారం, ధనియాల పొడి మసాలా కలపాలి. మంట తీసేసి, చల్లారాక దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మెత్తగా అయ్యేందుకు వీలుగా 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలుపుకోవాలి. ∙మెత్తగా ఉడికిన చామదుంపలలో గ్రైండ్ చేసిన మిశ్రమం, ఉప్పు వేసి కలపాలి. కావాలనుకుంటే మరికొద్దిగా నీళ్లు పోసి 2–3 నిమిషాలు ఉంచి, ఉడకనివ్వాలి. తర్వాత మంట తీసేయాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఈ పోపును మసాలా కర్రీలో కలపాలి. ఇది రైస్, ఇడ్లీ, దోసెలలోకి వడ్డించాలి. -
బొంగు చికెన్
అడివంట చెట్టూ పుట్టా కొండాకోనా ఆకూ అలమూ చేపాచెలమ ఇదండీ.. అడివంట అడవి వంట! వెదురు కొమ్ముల కూర ఏజన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో నివసించే గిరిజనులు వెదురు కొమ్ములు, వెదురు బియ్యం వండుకొని తింటారు. అదేవిధంగా అడవులలో ఉండే భారీ వృక్షాలకు పట్టిన గండు చీమలు గూళ్ళను దులిపి వాటిలోని గుడ్లను సేకరిస్తారు. వాటి చూర్ణంతో చారు కాసుకుంటారు. వెదురు కొమ్ములు, చీమల గూళ్ళు వర్షాకాలంలోనే దొరుకుతాయి.. ఈ కాలంలో ప్రతి ఇంటా కొమ్ముల కూర, ఎర్ర చీమల చారు తప్పకుండా ఉంటాయి. వెదురులో రెండు రకాలు ఉన్నాయి. కొండ వెదురు, ములస వెదురు ఉంటాయి. వీటిలో కొండ వెదురు కొమ్ములను గిరిజనులు తింటారు. వెదురు కొమ్మే కదా అడవుల్లో అధికంగా దొరుకుతుందనుకుంటే పొరపాటే. ఆ కొమ్ముల కోసం గిరిజన మహిళలు అనేక ఇబ్బందులు పడతారు. వెదురు కూపులో(కొండ తుడుము) ఉండే కొమ్ములను కోయడం కోసం చేతులు పెడుతున్నప్పుడు పొదల్లో విష సర్పాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వెదురు ముళ్లు కళ్లకు, చేతులకు విపరీతంగా గుచ్చుకుంటాయి. యారీ: అడవి నుండి సేకరించిన వెదురు కొమ్ముల తొక్కలు తీసి, ఆ కొమ్ములను ఒక ప్లేట్లో సన్నగా తరగాలి. అనంతరం పొయ్యిమీద దాక (గిన్నె) పెట్టి దాంట్లో నీళ్ళు పోసి, కొమ్ముల తరుగును వేసి ఉడకపెట్టాలి. కొద్దిసేపటి తర్వాత పొంగు వస్తుంది. ఆ సమయంలో పచ్చిమిరపకాయ కోసి అందులో వెయ్యాలి. అలాగే ఉప్పు కూడా వేసి కొంతసేపు ఉడికిన తర్వాత ఆ కూరను ఎండు మిరపకాయలతో తాలింపు పెట్టాలి. ఈ వెదురు కొమ్ముల కూరలో గుప్పెడు చింతచిగురు లేదా గోంగూర వేసుకుంటే అమోఘమైన రుచి. ఈ వెదురు కొమ్ముల కూరలో కారం వెయ్యకూడదు. వేస్తే కూర చేదుగా ఉంటుంది. - కోడూరి ఆనంద్, సాక్షి, బుట్టాయగూడెం, పశ్చిమగోదావరి బొంగు చికెన్ కావలసినవి: చికెన్ - అరకిలో, నిమ్మకాయలు - 2 పచ్చి వెదురు బొంగు - 1, ఉల్లిపాయలు - పావుకిలో పచ్చిమిర్చి - 5-6; పసుపు, ఉప్పు, కారం, ధనియాలపొడి - సరిపడినంత, అల్లం, వెల్లుల్లి పేస్టు - కొంచెం, పచ్చి అడ్డాకులు - 2 తయారీ కోడి మాంసాన్ని ముందుగా శుభ్రపరిచి, నిమ్మకాయ రసం పిండాలి. దాంట్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి ముద్ద, ధనియాలపొడి కలిపి నానబెట్టాలి.ఆ తర్వాత వెదురుబొంగును శుభ్రం చేసి అందులోకి ఈ చికెన్‌ను దట్టించాలి. బొంగుకు ఒక వైపు పచ్చి అడ్డాకులతో మూసివేయాలి. అడ్డాకులతో మూసిన భాగాన్ని కింద వైపు ఉండేలా ఈ బొంగును నిప్పుల పొయ్యిలో ఉంచాలి. ఇలా దాదాపు అరగంట పాటు నిప్పుల మధ్య ఉంచితే సరిపోతుంది.దీనిని నిప్పుల నుంచి బయటకు తీసి చల్లారేదాకా ఉంచితే రుచికరమైన బేంబూ చికెన్ రడీ! - బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం సంజీవరావు, డుంబ్రిగుడ విశాఖ ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల్లో బేంబూ చికెన్‌కు ప్రసిద్ధి. మన్యంలో మాత్రమే లభించే ఈ చికెన్‌కు చాలా డిమాండ్ ఉంది. రుచికరమైన ఈ బేంబూ (వెదురు బొంగు) చికెన్‌ను పర్యాటకులు లొట్టలేసుకుని తింటారు. గిరిజన పండగలు, పబ్బాల్లోనూ, ప్రభుత్వం నిర్వహించే గిరిజన ఉత్సవ్ల్లోనూ, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, విదేశీయులకు స్పెషల్ ఐటం ఈ బేంబూ చికెన్! ఒకసారి రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ ఈ చికెన్నే తినాలనుకుంటారు. విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకు, అనంతగిరి, చాపరాయి పర్యాటక ప్రదేశాల్లో బేంబూ చికెన్ అందుబాటులో ఉంటుంది. కొంతమంది గిరిజనలకే ఈ చికెన్ తయారీ సాధ్యం.. పనస కాయ ముక్కలు ఎండు చేపల కూర కావాల్సినవి: పనసకాయ - కేజీ ముక్కలు; ఉప్పు - తగినంత ఎండు చేపలు - పావు కేజీ, ఉల్లిపాయలు - 2; ఇప్పనూనె - గరిటెడు ఎండుమిర్చి - 5, పసుపు - కొద్దిగా (ఒక టీస్పూన్) తయారీ: ముందుగా పనసకాయపై పొట్టును తొలగించాలి. పనస ముక్కలను చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ముక్కలను నీటితో శుభ్రం చేయాలి. కట్టెల పోరుు్యపై గంజు(గిన్నె)ను పెట్టుకోవాలి. గిన్నెబాగా వేడి అయిన తర్వాత ఇప్పనూనె పోయాలి. నూనె వేడి అయ్యాక అందులో రోట్లో మెత్తగా దంచిన ఎండుమిర్చి, తరిగిన ఉల్లిపాయలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత పనస ముక్కలను వేయాలి. అవి దోరగా వేగిన తర్వాత పసుపు వేసి మరికొంత సేపు వేగనివ్వాలి. చేపలను నీటితో శుభ్రం చేసి పనస ముక్కల్లో వేసి బాగా కలియబెట్టాలి. కూరంతా ఉడికేంతసేపు గిన్నెపై నీళ్ల ఆవిరి పెట్టాలి. పనస ముక్కలు బాగా ఉడికే వరకు సన్నని మంట ఉండాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత దించి.. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. నోట్: గొత్తికోయలు వంటకాలలో కారం వాడరు. కొన్ని వంటకాలలో మాత్రమే అప్పటికప్పుడు ఎండుమిర్చిని నానబెట్టి రోట్లో మెత్తగా నూరి వాడుకుంటారు. - అలువాల శ్రీనివాస్, సాక్షి, ఏటూరు నాగారం, వరంగల్ ఘార్కంగ్ (మినప గారెలు) పండగైనా, ఇంటికి అతిధులు వచ్చినా మినప గారెలు (ఘార్కంగ్) లేనిదే ఇక్కడి గిరిజనులు భోజనాలు పెట్టరు. పెళ్లికి ముందు- తర్వాత చే సే పూజలలో మినపగారెలను అడవితల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. కావల్సినవి మినపగుళ్లు - అర కేజీ, వెల్లుల్లి - 10-20 పచ్చిమిర్చి - 6-7 (లేకపోతే ఎండుకారం) ఉప్పు - తగినంత, పసుపు - కొద్దిగా జీలకర్ర - కొద్దిగా (టీ స్పూన్ కరివేపాకు - 3 రెమ్మలు, ఉల్లిపాయ - 2 తయారీ: ముందుగా మినప పప్పును గంట-రెండు గంటల ముందు తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి.తర్వాత నీళ్లు వడకట్టి అందులో పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లుల్లి.. వేయాలి. రోబేకల్ (రుబ్బు రోలు)లో పిండిని కచ్చాపచ్చాగా రుబ్బాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలు తీసుకొని, చేతితో అదిమి వడలుగా చేయాలి. తర్వాత వీటిని రొట్టెలు కాల్చే పెనంపై వేసి, కొద్ది కొద్దిగా నూనె చుక్కలు వేస్తూ గరిటెతో అటూ ఇటూ తిప్పుతూ కాల్చాలి. - ఆత్రం జగదీష్, సాక్షి, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ కుండ చికెన్ కావల్సినవి చికెన్ - అర కేజీ పచ్చిమిరపకాయలు - 10-14 కొత్తిమీర - గుప్పెడు పుదీనా - గుప్పెడు పసుపు - అర టీ స్పూన్ టొమాటోలు - 2 ఉప్పు - తగినంత తయారీ చికెన్‌ను శుభ్రం చేసి ఉంచాలి. పచ్చిమిరపకాయలను సన్నగా, నిలువుగా కట్ చేయాలి. ఇందులో కొత్తిమీర, పసుపు, ఉప్పు, చికెన్, తరిగిన టొమాటో ముక్కలు వేసి కలపాలి. ఇలా కలిపిన చికెన్ మిశ్రమాన్ని కుండలో పెట్టి, పైన మట్టి మూకుడుపెట్టాలి. ఈ కుండను నిప్పుల పొయ్యి మీద పెట్టి, చికెన్‌ను ఉడికించాలి. 5 నిమిషాలకు ఒకసారి లోపలి మిశ్రమం కదిలేలా కుండను కదపాలి. పావు గంట ఉడికాక దించి, టేస్ట్ చేయడమే! నోట్: కుండకు-మూతకు మధ్య గోధుమపిండి ముద్ద అదిమితే ఆవిరి బయటకు వెళ్లకుండా చికెన్ ఇంకా బాగా ఉడుకుతుంది. బంజారా మటన్ కావల్సినవి మటన్ - అర కేజీ గరం మసాలా (బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క) - పొడి చేయాలి. కారం - 2 టీ స్పూన్లు ఉల్లిపాయలు - 2 టొమాటోలు - 2 (సన్నగా తరిగి మెత్తగా గుజ్జు చేయాలి) ఉప్పు - తగినంత కొత్తిమీర - చిన్న కట్ట నూనె - 3 టేబుల్ స్పూన్లు పసుపు - అర టీ స్పూన్ అల్లం ముద్ద - టీ స్పూన్ వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్ తయారీ మటన్‌ని శుభ్రం చేసి పక్కనుంచాలి. మందపాటి గిన్నె పొయ్యి మీద పెట్టి, నూనె పోయాలి. అందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. దీంట్లో పసుపు, టొమాటో గుజ్జు, కొత్తిమీర, కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమం ఉడికాక ఇందులో సిద్ధంగా ఉంచుకున్న మటన్ ముక్కలు వేసి కలపాలి. 3 నిమిషాల తర్వాత గ్లాసు నీళ్లు పోసి కలపాలి. ముక్క ఉడికేదాక మంట ఉంచాలి. నీళ్లు తగ్గితే మరికాస్త కలుపుకోవాలి. ముక్క పూర్తిగా ఉడికాక దించుకోవాలి. -
'మటన్ తింటే మంచిది'
బెంగళూరు: మటన్ తినండి.. రోగ నిరోధక శక్తి పెంచుకోండి' అంటున్నారు కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి ఎ. మంజు. మేక మాంసం తింటే ఇమ్యునిటీ పెరుగుతుందని ఆయన భరోసాయిస్తున్నారు. అయితే ఇది శాస్త్రీయంగా నిర్ధారించి చెబుతున్న విషయం కాదని, తన వ్యక్తిగత అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో కేంద్రం నిర్వహిస్తున్న మేకల పెంపకం కేంద్రాన్ని పరిశీలించిన తర్వాత ఆయనీ అభిప్రాయం వ్యక్తం చేశారు. మేక మాంసంలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయన్నారు. 'మేకలు అన్నిరకాల పచ్చగడ్డిని తింటాయి. మటన్ లో యాంటిబాడీలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తినేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంద'ని మంజు పేర్కొన్నారు. యూపీఏ ఏర్పాటు చేసినట్టుగానే తమ రాష్ట్రంలోనూ మేకల పెంపకం కేంద్రాలు నెలకొల్పనున్నట్టు చెప్పారు. -
అది ఆవు మాంసం కాదు మేకమాంసమే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాద్రి ఘటనపై విచారణలో సరికొత్త విషయాలు వెలుగుచూశాయి. మహమ్మద్ అఖ్లాక్ ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో ఉన్నది మేకమాంసమే కానీ ఆవు మాంసం కాదని పశువైద్యాధికారుల నివేదికలో తేలింది. ఆవుమాంసం కలిగి ఉన్నాడని ఆరోపణలపై మహమ్మద్ అఖ్లాక్ నివాసంపై ఓ వర్గానికి చెందిన మూక దాడి చేసి.. ఆయనను కొట్టిచంపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి సెప్టెంబర్ 29న జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. కుటుంబసభ్యులు తమ ఇంట్లో ఆవుమాంసం లేదని, తాము గోమాంసాన్ని భుజించలేనది చెప్తున్నా వినకుండా కోపోద్రిక్త మూకలు అఖ్లాక్ను, ఆయన కొడుకును ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి దాడి చేశారు. అఖ్లాక్ కుటుంబం ఓ ఆవుదూడను కోసేసి.. దాని ఆహారాన్ని తిన్నారంటూ స్థానికంగా ఉన్న ఓ ఆలయంలోని మైకుల్లో వెలువడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు 12మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. కేసులు నమోదైన వారిలో స్థానిక బీజేపీ నేత కొడుకు కూడా ఉన్నాడు. అఖ్లాక్ నివాసంలో దొరికింది మేకమాంసమే కానీ ఆవుమాంసం కాదని యూపీ పశువైద్యశాఖ తన నివేదికలో స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించిన ఫొరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది. -
పెళ్లి విందులో మటన్ వడ్డించలేదని..
హైదరాబాద్: పెళ్లి విందులో మటన్ వడ్డింపు వ్యవహారం వధూవరుల బంధువుల మధ్య ఘర్షణకు దారితీసింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి సురభీ కాలనీకి చెందిన మణికంఠ వివాహం బాచుపల్లి మల్లంపేటకు చెందిన రజనితో ఈ నెల 18న మల్లంపేటలో ఘనంగా జరిగింది. గురువారం సురభీ కాలనీలోని పెళ్లికొడుకు నివాసం వద్ద విందు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్థానిక సురభీ కాలనీకి చెందిన ఒక యువకుడు తనకు మటన్ సరిగ్గా వడ్డించలేదని ప్లేటు విసిరేశాడు. అతను విసిరిన ప్లేటు వెళ్లి పెళ్లి కూతరు తరఫు బంధువలపైన పడింది. ఆగ్రహానికి గురైన మల్లంపేట వాసులు అతన్ని తీసుకెళ్లి చితకబాదారు. దీన్ని గ్రహించిన స్థానికులు మల్లంపేట వాసులపై దాడికి దిగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. తమవారిని కొడుతున్నారని సురభీ కాలనీ వాసులు, తమ ఊరి వాళ్లను కొడుతున్నారని మల్లంపేట వాసులు ఆగ్రహాలకు గురై తీవ్ర స్థాయిలో కొట్టుకున్నారు. ఇరువర్గాలకు చెందిన పెద్దలు సర్దిచెప్పి పంపించివేయడంతో అర్ధరాత్రి దాటాక మల్లంపేటకు వెళ్లిపోయారు. కానీ.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం మల్లంపేట గ్రామం నుంచి సుమారు 30 మంది వివిధ వాహనాలలో వచ్చి సురభీ కాలనీ వాసులపై ఆకస్మాత్తుగా దాడికి దిగారు. కాలనీ పక్కనే రైల్వే ట్రాక్ ఉండటంతో కంకర్ రాళ్లతో దాడి చేయడంతో సురభీ కాలనీకి చెందిన సాయి, చిన్న, చంటి, నాగరాజ్, వెంకటేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. తలకు తీవ్రగాయమవడంతో చరణ్ అనే వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆలస్యంగా విషయంగా తెలుసుకున్న చందానగర్ ఎస్సై రామారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఘర్షణ తీవ్రంగా ఉండడంతో అదనపు సిబ్బందిని తీసుకొచ్చి ఇరువర్గాలకు చెందిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ఇరువర్గాలు ఒకరిపై కొకరు ఫిర్యాదులు చేసుకోవడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చికెన్, మటన్‌కు తగ్గిన డిమాండ్!
వ్రతాలు, పూజల వల్ల తగ్గిన వినియోగం 30-35శాతం పడిపోయిన విక్రయాలు అమ్మకాల్లేక వ్యాపారులు విలవిల సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ లో మాంసం, చేపల విక్రయాలకు డిమాండ్ తగ్గిపోయింది. శ్రావణ మాసంలో పడిపోయిన విక్రయాలు ఇంకా పుంజుకోలేదు. ప్రస్తుతం దుర్గామాత నవరాత్రి పూజలు, వ్రతాల వల్ల చికెన్, మటన్, చేపలకు అంతగా గిరాకీ లేకుండా పోయిందని వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు... చాలామంది అది మాంసాహార దినంగా పరిగణిస్తుంటారు. అయితే... ఈ ఆదివారం మాత్రం మాంసం, చేపల వ్యాపారులకు షాక్ ఇచ్చింది. అమ్మకాలు 30-35శాతం మేరకు పడిపోయాయి. సాధారణంగా ప్రతి ఆదివారం నగరంలో సుమారు 600-650 టన్నులకు పైగా చికెన్, 250-300 టన్నుల మటన్, 80-120 టన్నుల మేర చేపల విక్రయాలు సాగుతుంటాయి. అయితే... ఈ ఆదివారం చికెన్ 400టన్నుల లోపు అమ్ముడుపోగా, మటన్ సుమారు 180 టన్నులు, చేపలు 20 టన్నుల వరకు అమ్మకాలు సాగినట్టు వ్యాపార వర్గాల అంచనా. ఇప్పుడు దుర్గానవరాత్రి వేడుకలు జరుగుతుండటంతో చాలామంది పూజలు, వ్రతాలతో నియమ నిష్టలు పాటిస్తూ మంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ కారణంగానే చికెన్, మటన్, చేపలకు డిమాండ్ పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నాయి. ముషీరాబాద్‌లోని ఒక్క దయారా ఫిష్ మార్కెట్‌కు ఆదివారం 50-60 టన్నుల చేపలు దిగుమతి అవుతుంటాయి. అయితే... ఇప్పుడు పెద్దగా వ్యాపారం లేకపోవడంతో ఆదివారం కేవలం 20 టన్నుల లోపే సరుకు దిగుమతి అయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దిగివచ్చిన చికెన్.. చికెన్ ధరలు ఆదివారం బాగా దిగివచ్చాయి. పౌల్ట్రీ ఫారం దగ్గర లైవ్ కోడి కేజీ రూ.50లు ధర పలకగా... హోల్‌సేల్‌గా రూ.56లకు చేరింది. అదే రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి కేజీ రూ.65ల ప్రకారం విక్రయించారు. ఇదే చికెన్ (స్కిన్‌తో) కేజీ రూ.90లకు విక్రయించగా, స్కిన్‌లెన్ రూ.110ల ప్రకారం విక్రయించారు. అలాగే మటన్ కేజీ రూ.450-500, బోన్ లెస్ రూ.650-700లకు విక్రయించగా, చేపలు రవ్వ కేజీ రూ.130, బొచ్చె రూ.120, కొరమీన్ రూ.150-800, గోల్డ్ ఫిష్ రూ.100, రొయ్య, రూ.200-250ల ప్రకారం విక్రయించారు. అయితే... నగరంలో అన్నిచోట్ల ఈ ధరలు ఒకేలా లేవు. గిరాకీని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధర నిర్ణయించి సొమ్ము చేసుకున్నారు. ఒకచోట కిలో మటన్ రూ.450 ఉండగా, మరో చోట రూ.500లకు విక్రయించారు. -
చికెన్, మటన్‌కు తగ్గిన డిమాండ్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మాంసం, చేపల విక్రయాలకు డిమాండ్ తగ్గిపోయింది. శ్రావణ మాసంలో పడిపోయిన విక్రయాలు ఇంకా పుంజుకోలేదు. ప్రస్తుతం దుర్గామాత నవరాత్రి పూజలు, వ్రతాల వల్ల చికెన్, మటన్, చేపలకు అంతగా గిరాకీ లేకుండా పోయిందని వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు... చాలామంది అది మాంసాహార దినంగా పరిగణిస్తుంటారు. అయితే... ఈ ఆదివారం మాత్రం మాంసం, చేపల వ్యాపారులకు షాక్ ఇచ్చింది. అమ్మకాలు 30-35శాతం మేరకు పడిపోయాయి. సాధారణంగా ప్రతి ఆదివారం నగరంలో సుమారు 600-650 టన్నులకు పైగా చికెన్, 250-300 టన్నుల మటన్, 80-120 టన్నుల మేర చేపల విక్రయాలు సాగుతుంటాయి. అయితే... ఈ ఆదివారం చికెన్ 400టన్నుల లోపు అమ్ముడుపోగా, మటన్ సుమారు 180 టన్నులు, చేపలు 20 టన్నుల వరకు అమ్మకాలు సాగినట్టు వ్యాపార వర్గాల అంచనా. ఇప్పుడు దుర్గానవరాత్రి వేడుకలు జరుగుతుండటంతో చాలామంది పూజలు, వ్రతాలతో నియమ నిష్టలు పాటిస్తూ మంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ కారణంగానే చికెన్, మటన్, చేపలకు డిమాండ్ పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నాయి. ముషీరాబాద్‌లోని ఒక్క దయారా ఫిష్ మార్కెట్‌కు ఆదివారం 50-60 టన్నుల చేపలు దిగుమతి అవుతుంటాయి. అయితే... ఇప్పుడు పెద్దగా వ్యాపారం లేకపోవడంతో ఆదివారం కేవలం 20 టన్నుల లోపే సరుకు దిగుమతి అయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దిగివచ్చిన చికెన్.. చికెన్ ధరలు ఆదివారం బాగా దిగివచ్చాయి. పౌల్ట్రీ ఫారం దగ్గర లైవ్ కోడి కేజీ రూ.50లు ధర పలకగా... హోల్‌సేల్‌గా రూ.56లకు చేరింది. అదే రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి కేజీ రూ.65ల ప్రకారం విక్రయించారు. ఇదే చికెన్ (స్కిన్‌తో) కేజీ రూ.90లకు విక్రయించగా, స్కిన్‌లెన్ రూ.110ల ప్రకారం విక్రయించారు. అలాగే మటన్ కేజీ రూ.450-500, బోన్ లెస్ రూ.650-700లకు విక్రయించగా, చేపలు రవ్వ కేజీ రూ.130, బొచ్చె రూ.120, కొరమీన్ రూ.150-800, గోల్డ్ ఫిష్ రూ.100, రొయ్య, రూ.200-250ల ప్రకారం విక్రయించారు. అయితే... నగరంలో అన్నిచోట్ల ఈ ధరలు ఒకేలా లేవు. గిరాకీని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధర నిర్ణయించి సొమ్ము చేసుకున్నారు. ఒకచోట కిలో మటన్ రూ.450 ఉండగా, మరో చోట రూ.500లకు విక్రయించారు. -
మాంసం అమ్మకాల్లో 'మహా సేన'
-
నోటికాడి మాంసం తన్నేస్తారా ?
-
చికెన్ ఇవ్వడానికి వెళ్లి...
‘అవకాశాలు ఎవరినీ వెతుక్కుంటూ రావు... వాటిని మనమే గుర్తించి అందిపుచ్చుకోవాలి. అప్పుడే ఎవరైనా తాము ఎంచుకున్న రంగంలో విశేషంగా రాణించగలుగుతారు’ హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల మొహమ్మద్ అహ్మద్ సరిగ్గా ఇదే పనిచేశాడు. తన తండ్రి ఇస్మాయిల్‌తో కలిసి అహ్మద్ భారత రోయర్లకు మటన్, చికెన్ సరఫరా చేసేందుకు జాతీయ శిక్షణ శిబిరానికి తరచుగా వచ్చేవాడు. గంటల తరబడి పట్టుదలతో సాధన చేసే రోయర్లను జాగ్రత్తగా గమనించేవాడు. అదే అహ్మద్‌ను రోయింగ్‌వైపు ఆసక్తి కలిగేలా చేసింది. కంపు కొట్టే మురికి నీళ్లలోనే తన బంగారు భవిష్యత్తును వెతుక్కున్నాడు. అదే ఇప్పుడు ఆసియా క్రీడల్లో భారత్ తరఫున పాల్గొనే అద్భుతమైన అవకాశం దక్కేలా చేసింది. -సాక్షి క్రీడావిభాగం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నీళ్లపై రోయర్లు చేసే సాధన అంతర్జాతీయంగా భారత్‌కు పతకాల పంట పండిస్తోంది. అరుుతే ఈ జల క్రీడలో సర్వీసెస్ ఆటగాళ్లదే హవా. ముందు నుంచీ వాళ్లదే ఆధిపత్యం. అరకొర వసతులు, ప్రతికూల వాతావరణంలో సాగే శిక్షణకు వాళ్లు మినహా స్థానికుల ప్రాతినిధ్యం కరువే. కానీ ఈ పరిస్థితుల్లో అహ్మద్‌కు సహజసిద్ధంగానే రోయింగ్పై ఆసక్తి ఏర్పడింది. టీనేజ్‌లో ‘ద్రోణాచార్య’ ఇస్మాయిల్ బేగ్ ఆధ్వర్యంలో రోయింగ్‌లో శిక్షణ మొదలు పెట్టాడు. అనతి కాలంలో రోయింగ్‌లో మంచి ప్రతిభను కనబర్చాడు. తొలుత సబ్ జూనియర్, ఆ తర్వాత జూనియర్, సీనియర్ స్థాయిలో తానేంటో నిరూపించుకున్నాడు. 2007 సబ్ జూనియర్ నేషనల్స్‌లో ఏపీ తరఫున పాల్గొని రజత పతకం సాధించాడు. కోల్‌కతా చాలెంజ్ టోర్నమెంట్లో స్వర్ణం సాధించడంలో అతనిదే కీలక పాత్ర. తన ప్రతిభతో జాతీయ క్యాంప్‌లో చోటు దక్కించుకున్న అహ్మద్ ఆపై భారత జట్టులో సభ్యుడయ్యాడు. కవాడిగూడ నుంచి ఏషియాడ్: హైదరాబాద్‌లోని కవాడిగూడలో నివసించే మొహవ్ముద్ అహ్మద్‌లోని నైపుణ్యాన్ని కోచ్ ఇస్మాయిల్ మరింతగా వెలికితీశారు. భారత రోయింగ్ సమాఖ్య సహకారం కూడా తోడవడంతో రోయింగ్‌లో కీలకమైన కాక్స్‌లెస్ ఎయిట్‌లో కాక్స్‌వెయిన్‌గా ఎంపికయ్యాడు. కాక్స్‌వెయిన్‌గా తనకున్న అతి తక్కువ సమయంలో పరిస్థితులకు అనుగుణంగా రోయర్లకు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. 2011, 2013లలో ఆసియా చాంపియన్‌షిప్‌లో ఈ విభాగంలోనే రజతం సాధించడంలో వుుఖ్య భూమిక పోషించాడు. అతని ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని రోయింగ్ సమాఖ్య ఏషియాడ్‌కు ఎంపిక చేసింది. లక్ష్యం ఒలింపిక్స్: ప్రతీ క్రీడాకారుడి లక్ష్యం ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడం. అహ్మద్ లక్ష్యం కూడా అదే. 2016లో రియోలో జరిగే ఒలింపిక్స్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంతకంటే ముందు ఏషియాడ్‌లో మెడల్ సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. భారత్‌లో అందరిలాగే అహ్మద్‌కు క్రికెట్ అంటే ఇష్టం. భారత క్రికెటర్లలో కోహ్లికి వీరాభివూని. అతని హెయిర్ స్టయిల్‌ను తను ఫాలో అవుతాడు. -
ఇక మాంసం మంట!
న్యూఢిల్లీ: ఆహార పదార్థాల ధరలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఇది వరకే భారీగా ఉన్న ఉల్లి ధరలతో తిప్పలు పడుతున్న దిల్లీవాలాలు మాంసానికి కూడా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మటన్ ధర రూ.30 వరకు పెరగడంతో కిలో ధర రూ.400 దాకా పలుకుతోంది. అయితే వీటి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. చికెన్ ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు తెలిపారు. నవరాత్రి తరువాత ఇతర రాష్ట్రాల కోళ్లు, గొర్రెల సరఫరాలు పెరగడం వల్ల గత వారం నుంచి వీటి టోకు ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదని ఘాజీపూర్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. చాలా మంది అమ్మకందారులు మటన్ సరఫరాలు తగ్గడం వల్లే వాటి ధరలు పెంచాల్సి వచ్చిందని అంటున్నారు. అలకనంద ప్రాంత వ్యాపారి ఒకరు మాత్రం అసలు విషయం చెప్పాడు. తన పక్క దుకాణదారుడు ధరలు పెంచడాన్ని గమనించి తానూ అదే బాట పట్టానని అంగీకరించాడు. పత్పర్గంజ్లో గత వారం కిలో మటన్‌ను రూ.360కి అమ్మిన ఓ దుకాణదారుడు ఈవారం దానిని రూ.380కి పెంచాడు. ‘ఈద్, దసరా వల్ల మాంసానికి కొరత ఏర్పడింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ నుంచి కూడా సరఫరాలు తగ్గిపోయాయి. వచ్చే వారం నుంచి ధరలు తగ్గిపోవచ్చు’ అని అతడు వివరించాడు. వసంత్‌కుంజ్, సీఆర్ పార్క్ ప్రాంతాల్లో అయితే కిలో మటన్‌కు రూ.400 పెట్టాల్సిందేనని స్థానికులు చెబుతున్నారు. అధిక ధరలకు సరఫరాలు తగ్గడమే కారణమని వ్యాపారులు అంటుండగా, లజ్‌పత్‌నగర్‌లోని ఓ దుకాణదారుడు మాత్రం సరఫరాలు పెరిగాయని, అందుకే తాము ధరలు తగ్గించామని తెలిపాడు. రూ.400 కిలో పలికిన మటన్‌ను తాము రూ.380కే అమ్ముతున్నామని చెప్పాడు. చికెన్ టోకు ధరలు తక్కువగానే ఉన్నందున వాటి ధరలు పెరిగే అవకాశమే లేదని ఘాజీపూర్ మండీ చైర్మన్ రియాసత్ అలీ అన్నారు. ఈ మండీలో శనివారం కోడిధర రూ.48-62 వరకు పలికింది. సరఫరాలో కొరత ఏమీ లేదని శనివారం కూడా 160 ట్రక్కుల్లో కోళ్లు వచ్చాయని అధికారులు తెలిపారు. -
మాంసం ధరలకు రెక్కలు
సాక్షి, సిటీబ్యూరో : దసరా పండగ ఆదివారమా..? సోమవారమా..? అన్న మీమాంస వల్ల నగర మార్కెట్లో మటన్, చికెన్ వ్యాపారాల్లో జోరు తగ్గింది. అయితే... పండగ గిరాకీని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు కూడబలుక్కొని ధరలు పెంచేశారు. దీంతో మటన్, చికెన్ ధరల్లో రూ.10-50ల వరకు పెరుగుదల కన్పించింది. కొందరు ఆదివారమే దసరా పండుగ చేసుకోవడంతో మటన్, చికెన్ షాపుల వద్ద కాస్త రద్దీ కన్పించింది. పండగ ఏరోజన్నది ముఖ్యం కాదని, ఈ అవకాశం పోతే మళ్లీ ఏడాదివరకు రాదన్న ఉద్దేశంతో వ్యాపారులు ధరలు పెంచడంతో వినియోగదారులపై భారంపడింది. నిజానికి గత వారం రోజులుగా కేజీ రూ.90లకు లభించిన చికెన్ ఆదివారం ఒక్కసారిగా రూ.100కి చేరింది. అలాగే కేజీ రూ.380 నుంచి రూ.400 ఉన్న మటన్ ధర కూడా పండగ గిరాకీతో రూ.450 నుంచి రూ.500 కి పెంచేశారు. ప్రస్తుతం లైవ్ కోడి ఫారం ధర కేజీ రూ.56 ఉండగా రిటైల్ మార్కెట్లో మాత్రం రూ.71 ప్రకారం విక్రయించారు. అదే డ్రెస్డ్ చికెన్ (స్కిన్‌తో) కేజీ రూ.100, స్కిన్ లెన్ రూ.118, బోన్ లెస్ రూ. 230ల ప్రకారం అమ్మారు. పండగ దినాలను క్యాష్ చేసుకునేందుకే మూకుమ్మడిగా ధరలు పెంచేశారని తెలుస్తోంది. పంజగుట్ట, కూకట్పల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో గిరాకీని బట్టి కొందరు వ్యాపారులు క్వాలిటీ పేరుతో మటన్ కేజీకి రూ.500లు వసూలు చేశారు. ఇక బోన్‌లెస్ అయితే కేజీ రూ.600ల పైమాటే. అయితే... ఈ ధరలు నగరమంతటా ఒకేలా లేవు. డిమాండ్‌ను బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వ్యాపారులు ధర నిర్ణయించి సొమ్ము చేసుకున్నారు. అయితే.. సాధారణంగా ఆదివారం జరిగే వ్యాపారం తప్ప పండగ గిరాకీ ఊపు పెద్దగా కన్పించలేదని మాంసం వ్యాపారులు పెదవి విరుస్తున్నారు.