జ్యూసీ చికెన్.. మటన్ మామిడి మసాలా
మార్కెట్లన్నింటిని ఆక్రమించి తెగ సందడి చేస్తోన్న మామిడికాయలతో ఆవకాయ, పులిహోరలేగాక, కూరగాయలు, చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్‌తో కలిపి వండుకుంటే రుచికి రుచితోపాటు, మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. కాస్త పుల్లగా, మసాలా ఘాటుతో జ్యూసీగా ఉండే వెరైటీ వంటకాలను మామిడితో ఎలా వండుకోవచ్చో చూద్దాం....
జ్యూసీ చికెన్
కావలసినవి: చికెన్ ముక్కలు – అరకేజీ, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, యాలుక్కాయలు – ఆరు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, ధనియాలపొడి – టీస్పూను, గరం మసాలా – టీస్పూను
ఉల్లిపాయ – ఒకటి ( ముక్కలు తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – రెండు(సన్నగా తరగాలి), టొమాటో ప్యూరీ – పావు కప్పు, కొబ్బరి క్రీమ్ – అరకప్పు, తొక్కతీసిన పచ్చి మామిడికాయ ముక్కలు – ముప్పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – పావు కప్పు.
మసాలా పేస్టు:
ఉల్లిపాయలు – రెండు, వెల్లుల్లి రెబ్బలు – రెండు, కారం – రెండు టీస్పూన్లు, పసుపు – టీస్పూను, ఎండు మిర్చి – పది, సోంపు – రెండు టీస్పూన్లు, పెరుగు – పావు కప్పు.
తయారీ..
- మసాలా పేస్టుకోసం తీసుకున్న వాటిలో పెరుగు తప్ప, మిగతా వాటన్నింటిని బ్లెండర్‌లో వేసి పేస్టులా రుబ్బుకోవాలి.
- తరువాత గ్రైండ్ అయిన మిశ్రమంలో పెరుగు కలపాలి ∙చికెన్‌ను శుభ్రంగా కడిగి ఈ మసాలా పేస్టు పట్టించి రెండు గంటలపాటు రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి
- స్టవ్ మీద కూర వండడానికి బాణలి పెట్టుకుని ఆయిల్ వేయాలి
- ఆయిల్ వేడెక్కిన తరువత యాలకులు, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించాలి.
- ఉల్లిపాయ ముక్కలు, చికెన్ పట్టించగా మిగిలిన మసాలా పేస్టు, టొమాటో ప్యూరీ వేసి పదినిమిషాలపాటు వేయించాలి
- ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, వెల్లుల్లి తురుము వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి
- తర్వాత నానబెట్టుకున్న చికెన్, మామిడికాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి సన్నని మంట మీద అరగంట మగ్గనివ్వాలి
- అరగంట తరువాత కొబ్బరి క్రీమ్, కొత్తిమీర చల్లుకుని ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ మీద నుంచి దించేయాలి.
మటన్ మామిడి మసాలా
కావలసినవి: మటన్ – అరకేజీ, పచ్చిమామిడికాయ – ఒకటి, ఆయిల్ – పావు కప్పు, పచ్చిమిర్చి – రెండు, ఉల్లిపాయ తరుగు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు – రెండు టేబుల్ స్పూన్లు, కారం – రెండు టేబుల్ స్పూన్లు, గరం మసాలా – టీస్పూను, పసుపు – అరటీస్పూను, కొత్తిమీర తరుగు – పావు కప్పు.
తయారీ.. ∙
- ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙మామిడికాయ తొక్కతీసి ముక్కలుగా తరగాలి.
- ∙స్టవ్ మీద కుకర్ గిన్నెపెట్టి, ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి
- ఈ ఆయిల్‌లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి దోరగా వేయించాలి
- ఇవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టువేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ∙
- ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి నాలుగు విజిల్స్‌ను రానివ్వాలి ∙
- మటన్ ముక్క మెత్తగా ఉడికిన తరువాత కారం, గరం మసాలా, పసుపు వేసి తిప్పి మగ్గనివ్వాలి
- ఐదు నిమిషాల తరువాత కూరకు సరిపడా నీళ్లు, మామిడికాయ ముక్కలను వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి
- మామిడికాయ ముక్కలు మెత్తబడిన తరువాత కొత్తిమీర చల్లి దించేయాలి.
అనప గింజల చారు
కావలసినవి: లేత పాలకూర – రెండు కట్టలు, అనపగింజలు – కప్పు, కొత్తి మీర – చిన్న కట్ట, ఉల్లిపాయ – ఒకటి, టొమాటోలు – రెండు, పచ్చిమామిడికాయ ముక్కలు – పావు కప్పు, పచ్చిమిర్చి – ఐదు, వెల్లుల్లి రెబ్బలు – ఐదు, కరివేపాకు – నాలుగు రెమ్మలు, పసుపు – అరటీస్పూను
ధనియాల పొడి – టేబుల్ స్పూను, కారం – ఒకటిన్న టేబుల్ స్పూన్లు, ఆవాలు – టీస్పూను, మినపప్పు – అరటీస్పూను, జీలకర్ర – టీస్పూను, ఎండు మిర్చి – మూడు, ఇంగువ – పావు టీస్పూను, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ..
- పాలకూర, కొత్తమీర, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి
- కుకర్ గిన్నెలో కప్పు నీళ్లుపోసి అనపగింజలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, మామిడి కాయ, వెల్లుల్లి తురుము, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి
- దీనిలో మరో అరకప్పు నీళ్లుపోసి మూతపెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ రానివ్వాలి
- మూడు విజిల్ వచ్చాక మూతతీసి పాలకూర, ఉప్పు వేసి మరో రెండు విజిల్స్ రానివ్వాలి ∙
- ఇప్పుడు కుకర్ మూత తీసి రసానికి సరిపడా నీళ్లుపోయాలి
- ∙స్టవ్ మీద తాలింపు కోసం మరో బాణలి పెట్టి ఆయిల్ వేయాలి.
- ఇది వేడెక్కిన తరువాత తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి, తరువాత రసంలో వేసి కలుపుకుంటే చారు రెడీ.
చదవండి👉🏾Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా
చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా
Comments
Please login to add a commentAdd a comment