Bottle gourd
-
సొరకాయతో లాభాలెన్నో, బరువు కూడా తగ్గొచ్చు
మనం తినే ఆహారంలో తీగజాతి, దుంప ఇలా అన్ని రకాల కూరలు, ఆకుకూరలను చేర్చుకోవాలి. ముఖ్యంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో కూరగాయల తోటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. బీర, సొరకాయలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. ఈరోజు సొరకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సొరకాయతో శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.సొరకాయలో విటమిన్ బీ, విటమిన్ సీ, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో నీరు ,కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో అయితే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి సొరకాయ ఎంతగానో సహాయపడుతు సొరకాయతో పప్పు చట్నీ, సాంబార్, కర్రీ, ఇలా ఎన్నో వంటలను చేసి తినొచ్చు. ఇంకా సూప్‌లు లేదా స్మూతీ వంటి ఎన్నో రూపాల్లో తీసుకోవచ్చు. సొరకాయ జ్యూస్ న్యాచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది.సొరకాయతో ప్రయోజనాలురక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సొరకాయలో మెండుగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు చాలా మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది.సొరకాయతో గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. సొరకాయలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. మెగ్నీషియంతో కండరాలు బలపడతాయి. కాల్షియం కూడా మెండుగా ఉంటుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సొరకాయ సహాయపడుతుంది. సొరకాయలో కూడా విటమిన్ సీి మెండుగా ఉంటుంది. ఎన్నో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, ఇతర రోగాలను అడ్డుకుంటుంది. -
సొరకాయా.. మజాకా! బోలెడన్ని ప్రయోజనాలు
సొరకాయ, ఆనపకాయ ఈ పేరు చెబితేనే చాలా మంది పెద్దగా ఇష్టపడరు. సాంబారుకో, పులుసుకో తప్ప ఇంక దేనికీ పనికి రాదనుకుంటారు. నిజానికి సొరకాయ సౌందర్య పోషణలోనూ, బరువుతగ్గే ప్రక్రియలోనూ చాలా చక్కగా పనిచేస్తుంది. సొరకాయ , దాని ప్రయోజనాలపై ఒక లుక్కేద్దాం రండి..!కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన తీగ జాతి కూరగాయసొరకాయ. ఇందులో లో విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్ ఆప్షన్. సొరకాయతో పలు రకాలు వంటకాలు చేసుకోవచ్చు. జ్యూస్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సొరకాయ జ్యూస్ - లాభాలు హైపర్‌టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది.సొరకాయలో ఉండే, పొటాషియం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు, పరగడుపున సొరకాయ జ్యూస్ తాగితే మంచిది. రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. శరీరం నుంచి విష పదార్థాలు తొలగిపోతాయి. ఈ జ్యూస్‌తో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.సొరకాయ జ్యూస్ న్యాచురల్ క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం సొరకాయ వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. యూరిన్‌లో ఉండే యాసిడ్ కంటెంట్‌ని బాలెన్స్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.సొరకాయ జ్యూస్ రెగ్యులర్ తాగితే మెటబాలిజం మెరుగుపడుతుంది. శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారి పని మరింత ఈజీ అవుతుంది.సొరకాయతో సౌందర్య ప్రయోజనాలు..!సొరకాయ జ్యూస్ ఆరోగ్యానికే కాదు అందానికీ మేలు చేస్తుందిరోజూ ఉదయాన్నే సొరకాయ జ్యూస్ సేవిస్తే తాగుతుంటే ముఖంలో సహజమైన మెరుపు వస్తుంది.ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. వృద్ధాప్య ఛాయలు తొలగి, యవ్వనంగా కనిపిస్తారు.చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లను, దురదలు, దద్దుర్లను తగ్గించడంలోనూ సాయపడుతుంది. రోజూ ఈ జ్యూస్ తాగితే శిరోజాలు ఒత్తుగా, దృఢంగా, పొడవుగా పెరుగుతాయి, జుట్టు మెరిసిపోతుంది.ఎలా చేసుకోవాలి?సొరకాయ ముక్కలు, పుదీనా ఆకులు, అల్లంవేసి బ్లెండర్లో వేసి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి.దీనికి ఉప్పు, మిరియాలపొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని వడపోసుకుని ఇష్టంగా తాగేయడమే. -
సొరకాయ చపాతీలు: ఇలా చేస్తే...ఆ టేస్ట్ వేరు!
పాలక్ చపాతీ, ఆలూ చపాతీ, మేతీ చపాతీ ఇలా చాలా రకాలుగా రుచికరమై చపాతీలను చేసుకోవచ్చు. కానీ చపాతీలు చేయాలంటే.. మెత్తగా వస్తాయో రావోనని చాలామందికి భయం. పిండి సరిగ్గా కలపకపోయినా, ఇంగ్రీడియంట్స్ సమ పాళ్లలో పడకపోయినా, చపాతీలు మన మాట వినవు. మరి సొరకాయ (లౌకీ, బాటిల్ గార్డ్, ఆనపకాయ) చపాతీ ఎపుడైనా ట్రై చేశారా? మెత్తగా దూదుల్లాంటి సొరకాయ చపాతీ ఎలా చేయాలో చూద్దాం. కావలసినవి: సొరకాయ తురుము – రెండు కప్పులు; పచ్చిమిర్చి తరుగు–టీ స్పూన్, గోధుమపిండి – రెండున్నర కప్పులు, గరం మసాలా – అర టీ స్పూన్ ; ఉప్పు – చిటికెడు; ఇంగువ– చిటికెడు, నూనె – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: ∙వెడల్పుగా ఉన్న పాత్రలో గోధుమపిండి, సొరకాయ తురుము, తరిగిన పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, ఉప్పు, ఇంగువ వేసి కలపాలి. మొదట తేమ సరిపోదనిపించినప్పటికీ సొరకాయలో నీరు వదిలేకొద్దీ సరిపోతుంది. పది నిమిషాల సేపు పక్కన ఉంచితే నీరు బయటకు వస్తుంది. నీరు వదిలిన తర్వాత పిండిని కలిపి చూసుకుని అప్పటికీ పొడిగా అనిపిస్తే కొద్దిగా నీటిని చిలకరించుకుని మిశ్రమం మొత్తాన్ని చపాతీ పిండిలా చేసుకుని వస్త్రాన్ని కప్పి పావు గంట సేపు పక్కన ఉంచాలి. పిండిని పెద్ద నిమ్మకాయంత గోళీలు చేసుకుని చ΄ాతీల్లా వత్తుకుని పెనం వేడి చేసి నూనె వేస్తూ చపాతీని రెండు వైపులా కాల్చాలి. గమనిక: చపాతీ వత్తేటప్పుడు పిండి జారుడుగా ఉన్నట్లనిపిస్తే పొడి పిండి చల్లుకుని బాగా కలిసే వరకు మర్దనా చేసి అప్పుడు చపాతీ చేసుకోవాలి. సొరకాయ చపాతీ సాధారణ గోధుమ పిండి చపాతీలా సమంగా ఒకే మందంలో రావడం కష్టం. మరీ పలుచగా కూడా వత్తకూడదు. కొంచెం మందంగానే ఉండాలి. వేడిగా తింటే మృదువుగా, రుచిగా ఉంటాయి. వేసవిలో చపాతీలు తింటే వేడి చేస్తుందని భయపడేవాళ్లు సొరకాయ చపాతీ ప్రయత్నించవచ్చు. ఈ చపాతీలను మనకు నచ్చిన కూర, చట్నీతోగానీ, లేదంటే వేసవి కాలం చల్లని పెరుగుతో తిన్న బావుంటుంది. -
ఆనపకూయతో సాంబార్ ఒకటే కాదు, పూరీలు కూడా చేసుకోవచ్చు
ఆనపకాయ పూరీ తయారీకి కావల్సినవి: ఆనపకాయ – 1 (తొక్క తీసేసి.. గింజలు తొలగించి.. ముక్కలను మెత్తగా ఉడికించి, కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలి) గోధుమ పిండి –3 కప్పులు, గోరువెచ్చని నీళ్లు – సరిపడా మైదాపిండి – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర, వాము – అర టీ స్పూన్ చొప్పున (కచ్చాబిచ్చా మిక్సీ చేసుకోవాలి) కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి పొడి– 1 టీ స్పూన్ (ఎండు మిరపకాయలను కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టాలి) పసుపు – చిటికెడు,ఉప్పు – తగినంత,నూనె – సరిపడా \ తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో ఆనపకాయ గుజ్జు, గోధుమ పిండి, మైదాపిండి, కొత్తిమీర తురుము, ఎండుమిర్చి పొడి, జీలకర్ర, వాము మిశ్రమం, ఉప్పు, పసుపు, అర టీ స్పూన్ నూనె వేసుకుని, సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. 20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా సిద్ధం చేసుకోవాలి. తర్వాత కళాయిలో నూనె కాగనిచ్చి.. పూరీలను వేయించాలి. -
కూరగాయల సాగు లాభదాయకం
-
Bio Fence: అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! అదనపు ఆదాయం..
కోతుల నుంచి, అడవి పందుల నుంచి లేదా సాధారణ పశువుల నుంచి పంటలను రక్షించుకోవటం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో రైతులకు కత్తి మీద సాములా మారింది. ఈ సమస్యకు ఇనుప కంచెలు, సోలార్ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకొని రైతులు పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, వాటి కన్నా బంజరు భూముల్లో పెరిగే బ్రహ్మజెముడు జాతికి చెందిన ముళ్ల మొక్కలను పొలం చుట్టూతా కంచెగా నాటుకుంటే మేలని మహారాష్ట్రకు చెందిన జగన్ ప్రహ్లాద్ భగడే అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఆయనది అకోలా జిల్లాలోని ఖపర్వాది బద్రుక్ గ్రామం. ఆయనకు 30 ఎకరాల సాగు భూమి ఉంది. ‘ఏ పంట వేసినా నీల్గాయ్, దుప్పులు, అడవి పందులు, కోతులు, పశువులు పాడు చేస్తూ ఉండేవి. ఎకరం పొలం చుట్టూ ఇనుప కంచె వేశాను. ఏడేళ్ల క్రితమే రూ. 40 వేలు ఖర్చయ్యింది. ఇక మొత్తం పొలం చుట్టూ కంచె వెయ్యాలంటే ఉన్న భూమిలో కొంత భాగాన్ని అమ్ముకోవటం తప్ప వేరే మార్గం లేదు. బంజరు భూముల్లో కనిపించే కాక్టస్/బ్రహ్మజెముడు జాతి (యుఫోర్బియా లాక్టియా)కి చెందిన మొక్కల్ని పొలం చుట్టూ నాటాను. ఎకరానికి మహా అయితే రూ. 1,500 ఖర్చయ్యింది. అది కూడా కూలీలకు మాత్రమే. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు మా పొలం చుట్టూ దట్టంగా అల్లుకున్న ఆకుపచ్చని ముళ్ల కంచె దుర్భేద్యమైన కోటలాగా నిలబడి ఉంది. కోతులు, అడవి జంతువుల బెడద అన్న మాటే లేదిప్పుడు. ఏ పంటైనా చేతికొస్తుందో లేదన్న బెంగ లేదు. అందరూ ఆశ్చర్యపడేంత స్థాయిలో పంటల దిగుబడి వస్తోంది. అంతేకాదు, బలమైన గాలుల నుంచి, చీడపీడల నుంచి పంటలను, మట్టిని రక్షించుకోగలుగుతున్నాను’అంటున్నారు బగడే సగర్వంగా. చుట్టుపక్కల బంజరు భూముల్లో నుంచి కాక్టస్ జాతి ముళ్ల మొక్కల కాండాలను కోసి ట్రాక్టర్ ట్రక్కులో వేసుకొని తెచ్చి.. 2 అడుగుల పొడవు ముక్కలను కత్తిరించి.. అడుగుకు ఒకటి చొప్పున పొలం చుట్టూతా నాటారు. మొదట్లో అందరూ అతన్ని పిచ్చోడు అని ఎగతాళి చేశారు. ఇప్పుడు నిశ్చింతగా పంట చేతికివస్తుంటే ఎంత తెలివైన పని చేశాడని పొగుడుతున్నారు. కట్టెలతో, బార్బ్‌డ్ వైర్‌తో లేదా రాళ్లతో కంచెను ఏర్పాటు చేసుకోవటం కన్నా దట్టంగా అల్లుకుపోయి 12 అడుగుల ఎత్తు వరకు ఎదిగిన ఈ జీవ కంచే (బయో ఫెన్స్) ఎంతో బాగుందని అందరూ అంటున్నారు. కాక్టస్ జాతి ముళ్ల మొక్కల కాండాల 2 అడుగుల ముక్కలను నాటి.. తొలి దశలో శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడప్పుడూ ఎరువు వేస్తూ ఉంటే చాలు. ఒకటి రెండు ఏళ్లలో దాదాపుగా 5 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఆ తర్వాత ఇక వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం గాని, నీరు పెట్టాల్సిన అవసరం గానీ ఉండదు. ‘పొలంలో, పరిసర ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణ పనులు గ్రామస్తులం కలసి చేసుకున్నాం. భూగర్భ జలమట్టం బాగా పెరిగింది. ఇప్పుడు నీటికి కరువు లేదు. దానితో పాటు జీవ కంచె కూడా విజయవంతం కావటంతో రైతులకు మా పొలం దర్శనా స్థలంగా మారిపోయింది..’ అంటున్నారు బగడే ఆనందంగా. తలవని తలంపుగా మరో ఉపయోగం కూడా చేకూరింది. జీవ కంచె పైకి కాకర, చిక్కుడు, సొర, బీర వంటి తీగజాతి కూరగాయ మొక్కల్ని పాకించి అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా అందివచ్చింది! నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
Recipes: సొరకాయ రుచులు.. ఇన్స్టంట్ బర్ఫీ.. బీట్రూట్ లౌకి ముఠియా
Bottle Gourd Recipes In Telugu: అధిక బరువుని తగ్గించుకోవడానికి ఎంచుకునే ఆహారాల్లో సొరకాయ ఒకటి. రుచిలో కాస్త చప్పగా ఉండే సొరకాయను తినడానికి అందరూ అంతగా ఇష్టపడకపోవచ్చు. అయితే, తయారీలో చిన్న మార్పులు చేసుకుంటే, సొరకాయను టేస్టీగా ఎలా వండవచ్చో చూద్దాం... ఇన్స్టంట్ బర్ఫీ కావలసినవి: ►పంచదార – ఒకటింబావు కప్పులు ►సొరకాయ తురుము – ఐదు కప్పులు ►నెయ్యి – అరకప్పు ►పాలపొడి – కప్పు ►యాలుకుల పొడి – అర టీస్పూను ►పిస్తాపలుకులు – అరకప్పు. తయారీ: – ►కుకర్ గిన్నెలో పంచదారను పొరలా వేయాలి. ►దీనిపైన సొరకాయ తురుముని పరచాలి. ఈ రెండింటిని కలపకూడదు ►కుకర్ గిన్నె మూతపెట్టి ఐదు నిమిషాలు పెద్దమంటమీద ఉడికించాలి ►ఐదు నిమిషాల తరువాత మంటను ఆపేసి కుకర్ ప్రెజర్‌ను విడుదల చేసి మూత తీయాలి. ►ఇప్పుడు నెయ్యి, పాలపొడి, యాలకుల పొడి వేసి కలపాలి ►కుకర్ గిన్నెను సన్నని మంటమీద పెట్టి మరో పదినిమిషాలపాటు కలుపుతూ ఉడికించాలి ►నెయ్యి పైకి తేలేంతవరకు సిమ్‌లో ఉంచి అడుగంటకుండా కలుపుతూ ఉడికిన తర్వాత దించేయాలి ►ఒక ప్లేటుకి కొద్దిగా నెయ్యిరాసి ఉడికిన మిశ్రమాన్ని పోయాలి. ►దీనిమీద పిస్తాపలుకులు వేసి చల్లారనివ్వాలి. ►చల్లారాక ముక్కలు కోసి సర్వ్ చేసుకోవాలి. బీట్రూట్ లౌకి ముఠియా కావలసినవి: ►సొరకాయ తురుము – ఒకటిన్నర కప్పులు ►బీట్రూట్ తురుము – అరకప్పు ►ఉల్లిపాయ తరుగు – పావు కప్పు ►గోధుమ పిండి – అరకప్పు ►శనగపిండి – అరకప్పు ►సూజీ రవ్వ – కప్పు ►పసుపు – అరటీస్పూను ►ఇంగువ – పావు టీస్పూను, ►వంటసోడా – పావు టీస్పూను ►జీలకర్ర – అరటీస్పూను ►సోంపు – అరటీస్పూను ►పంచదార – టీస్పూను ►అల్లంపేస్టు – టీస్పూను ►పచ్చిమిర్చి – నాలుగు(సన్నగా తరగాలి) ►కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు ►నిమ్మ రసం – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►నూనె టీస్పూను తాలింపు కోసం: నూనె – మూడు టీస్పూన్లు, ఆవాలు – అరటీస్పూను, నువ్వులు – రెండు టీస్పూన్లు. తయారీ: ►ఉల్లిపాయ, బీట్రూట్, సొరకాయ తురుములను గిన్నెలో వేయాలి. ►ఇందులో శనగపిండి, పసుపు, ఇంగువ, ఉప్మారవ్వ, జీలకర్ర, సోంపు, పంచదార, అల్లంపేస్టు, పచ్చిమిర్చి తరుగు, వంటసోడా, కొత్తిమీర, నిమ్మరసం, టీస్పూను నూనె, ►రుచికి సరిపడా ఉప్పు వేసి ముద్దలా కలపాలి ►ఈ పిండిని ట్రేలో దిబ్బరొట్టిలా పరుచుకుని ఆవిరి మీద ఇరవై నిమిషాలు ఉడికించాలి ►ఉడికిన తరువాత ఐదు అంగుళాల ముక్కలుగా కట్ చేయాలి ►తాలింపు కోసం తీసుకున్న దినుసులతో తాలింపు వేసి ముక్కల మీద చల్లుకుని వేడివేడిగా సర్వ్‌చేసుకోవాలి ►ముఠియాలు మరింత క్రిస్పీగా కావాలనుకుంటే ఆవిరి మీద ఉడికిన తరువాత డీప్ ఫ్రై చేసుకుని కూడా తినవచ్చు. -
Recipe: పాలకూర.. పచ్చిమామిడి ముక్కలతో రుచికరమైన అనపగింజల చారు!
అనపకాయ చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో విటమిన్లు, పొటాషియం, ఐరన్లు, పీచుపదార్థం పుష్కలం. కూర లేదంటే జ్యూస్.. దీనిని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. ఇక వేసవిలో లభించే పచ్చిమామిడికాయ ముక్కలతో అనప గింజల చారు పెడితే టేస్ట్ అదిరిపోద్ది. ఇంకెందుకు ఆలస్యం ఇలా ఇంట్లోనే ఈ వంటకాన్ని తయారు చేసుకోండి. కావలసినవి: ►లేత పాలకూర – రెండు కట్టలు ►అనపగింజలు – కప్పు ►కొత్తి మీర – చిన్న కట్ట ►ఉల్లిపాయ – ఒకటి ►టొమాటోలు – రెండు ►పచ్చిమామిడికాయ ముక్కలు – పావు కప్పు ►పచ్చిమిర్చి – ఐదు, వెల్లుల్లి రెబ్బలు – ఐదు, కరివేపాకు – నాలుగు రెమ్మలు ►పసుపు – అరటీస్పూను, ధనియాల పొడి – టేబుల్ స్పూను, కారం – ఒకటిన్న టేబుల్ స్పూన్లు ►ఆవాలు – టీస్పూను, మినపప్పు – అరటీస్పూను, జీలకర్ర – టీస్పూను ►ఎండు మిర్చి – మూడు, ఇంగువ – పావు టీస్పూను, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ.. ►పాలకూర, కొత్తమీర, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి. ►కుకర్ గిన్నెలో కప్పు నీళ్లుపోసి అనపగింజలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, మామిడి కాయ, వెల్లుల్లి తురుము, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. ►దీనిలో మరో అరకప్పు నీళ్లుపోసి మూతపెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ రానివ్వాలి ►మూడు విజిల్ వచ్చాక మూతతీసి పాలకూర, ఉప్పు వేసి మరో రెండు విజిల్స్ రానివ్వాలి ►ఇప్పుడు కుకర్ మూత తీసి రసానికి సరిపడా నీళ్లుపోయాలి ►స్టవ్ మీద తాలింపు కోసం మరో బాణలి పెట్టి ఆయిల్ వేయాలి ►ఇది వేడెక్కిన తరువాత తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి, తరువాత రసంలో వేసి కలుపుకుంటే చారు రెడీ. చదవండి👉🏾Sorakaya Juice: సొరకాయ జ్యూస్ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే! చదవండి👉🏾Juicy Chicken: జ్యూసీ చికెన్.. మటన్ మామిడి మసాలా.. ఇలా ఈజీగా వండేయండి! -
Recipes: జ్యూసీ చికెన్.. మటన్ మామిడి మసాలా.. ఇలా ఈజీగా వండేయండి!
మార్కెట్లన్నింటిని ఆక్రమించి తెగ సందడి చేస్తోన్న మామిడికాయలతో ఆవకాయ, పులిహోరలేగాక, కూరగాయలు, చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్‌తో కలిపి వండుకుంటే రుచికి రుచితోపాటు, మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. కాస్త పుల్లగా, మసాలా ఘాటుతో జ్యూసీగా ఉండే వెరైటీ వంటకాలను మామిడితో ఎలా వండుకోవచ్చో చూద్దాం.... జ్యూసీ చికెన్ కావలసినవి: చికెన్ ముక్కలు – అరకేజీ, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, యాలుక్కాయలు – ఆరు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, ధనియాలపొడి – టీస్పూను, గరం మసాలా – టీస్పూను ఉల్లిపాయ – ఒకటి ( ముక్కలు తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – రెండు(సన్నగా తరగాలి), టొమాటో ప్యూరీ – పావు కప్పు, కొబ్బరి క్రీమ్ – అరకప్పు, తొక్కతీసిన పచ్చి మామిడికాయ ముక్కలు – ముప్పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – పావు కప్పు. మసాలా పేస్టు: ఉల్లిపాయలు – రెండు, వెల్లుల్లి రెబ్బలు – రెండు, కారం – రెండు టీస్పూన్లు, పసుపు – టీస్పూను, ఎండు మిర్చి – పది, సోంపు – రెండు టీస్పూన్లు, పెరుగు – పావు కప్పు. తయారీ.. మసాలా పేస్టుకోసం తీసుకున్న వాటిలో పెరుగు తప్ప, మిగతా వాటన్నింటిని బ్లెండర్లో వేసి పేస్టులా రుబ్బుకోవాలి. తరువాత గ్రైండ్ అయిన మిశ్రమంలో పెరుగు కలపాలి ∙చికెన్‌ను శుభ్రంగా కడిగి ఈ మసాలా పేస్టు పట్టించి రెండు గంటలపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి స్టవ్ మీద కూర వండడానికి బాణలి పెట్టుకుని ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తరువత యాలకులు, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, చికెన్ పట్టించగా మిగిలిన మసాలా పేస్టు, టొమాటో ప్యూరీ వేసి పదినిమిషాలపాటు వేయించాలి ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, వెల్లుల్లి తురుము వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత నానబెట్టుకున్న చికెన్, మామిడికాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి సన్నని మంట మీద అరగంట మగ్గనివ్వాలి అరగంట తరువాత కొబ్బరి క్రీమ్, కొత్తిమీర చల్లుకుని ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ మీద నుంచి దించేయాలి. మటన్ మామిడి మసాలా కావలసినవి: మటన్ – అరకేజీ, పచ్చిమామిడికాయ – ఒకటి, ఆయిల్ – పావు కప్పు, పచ్చిమిర్చి – రెండు, ఉల్లిపాయ తరుగు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు – రెండు టేబుల్ స్పూన్లు, కారం – రెండు టేబుల్ స్పూన్లు, గరం మసాలా – టీస్పూను, పసుపు – అరటీస్పూను, కొత్తిమీర తరుగు – పావు కప్పు. తయారీ.. ∙ ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙మామిడికాయ తొక్కతీసి ముక్కలుగా తరగాలి. ∙స్టవ్ మీద కుకర్ గిన్నెపెట్టి, ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఈ ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి దోరగా వేయించాలి ఇవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టువేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ∙ ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి నాలుగు విజిల్స్‌ను రానివ్వాలి ∙ మటన్ ముక్క మెత్తగా ఉడికిన తరువాత కారం, గరం మసాలా, పసుపు వేసి తిప్పి మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తరువాత కూరకు సరిపడా నీళ్లు, మామిడికాయ ముక్కలను వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి మామిడికాయ ముక్కలు మెత్తబడిన తరువాత కొత్తిమీర చల్లి దించేయాలి. అనప గింజల చారు కావలసినవి: లేత పాలకూర – రెండు కట్టలు, అనపగింజలు – కప్పు, కొత్తి మీర – చిన్న కట్ట, ఉల్లిపాయ – ఒకటి, టొమాటోలు – రెండు, పచ్చిమామిడికాయ ముక్కలు – పావు కప్పు, పచ్చిమిర్చి – ఐదు, వెల్లుల్లి రెబ్బలు – ఐదు, కరివేపాకు – నాలుగు రెమ్మలు, పసుపు – అరటీస్పూను ధనియాల పొడి – టేబుల్ స్పూను, కారం – ఒకటిన్న టేబుల్ స్పూన్లు, ఆవాలు – టీస్పూను, మినపప్పు – అరటీస్పూను, జీలకర్ర – టీస్పూను, ఎండు మిర్చి – మూడు, ఇంగువ – పావు టీస్పూను, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ.. పాలకూర, కొత్తమీర, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి కుకర్ గిన్నెలో కప్పు నీళ్లుపోసి అనపగింజలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, మామిడి కాయ, వెల్లుల్లి తురుము, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి దీనిలో మరో అరకప్పు నీళ్లుపోసి మూతపెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్ వచ్చాక మూతతీసి పాలకూర, ఉప్పు వేసి మరో రెండు విజిల్స్ రానివ్వాలి ∙ ఇప్పుడు కుకర్ మూత తీసి రసానికి సరిపడా నీళ్లుపోయాలి ∙స్టవ్ మీద తాలింపు కోసం మరో బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఇది వేడెక్కిన తరువాత తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి, తరువాత రసంలో వేసి కలుపుకుంటే చారు రెడీ. చదవండి👉🏾Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా -
Summer Drinks: సొరకాయ జ్యూస్ తాగితే అద్భుత ప్రయోజనాలు!
Summer Drink- Sorakaya Juice: సొరకాయలో విటమిన్లు, పొటాషియం, ఐరన్లు, పీచుపదార్థం పుష్కలంగా ఉంటాయి. అందువల్ల సొరకాయ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారు. దీనిలోని పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదే విధంగా.. పొటాషియం అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రోజూ ఈ డ్రింక్ తాగడం వల్ల కాలేయ సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఐస్‌క్యూబ్స్ వేయకుండా చేసిన సొరకాయ జ్యూస్‌ను పరగడుపున తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. సొరకాయ జ్యూస్ తయారీకి కావలసినవి: ►సొరకాయ – మీడియం సైజుది ఒకటి ►పుదీనా ఆకులు – పది ►అల్లం – అరంగుళం ముక్క ►నిమ్మకాయ – ఒకటి ►బ్లాక్ సాల్ట్ – రుచికి సరిపడా ►ఐస్ క్యూబ్స్ – అరకప్పు. తయారీ విధానం: ►సొరకాయ తొక్కతీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి బ్లెండర్లో వేయాలి. ►దీనిలోనే తొక్కతీసిన అల్లం, పుదీనా, రుచికి సరిపడా బ్లాక్‌సాల్ట్, ఐస్ క్యూబ్స్వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►గ్రైండ్ అయిన మిశ్రమాన్ని పలుచని వస్త్రంలో వడగట్టి జ్యూస్‌ను తీసుకోవాలి. ►ఈ జ్యూస్‌లో నిమ్మరసం పిండి సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. చదవండి👉🏾ప్రెగ్నెన్సీ సమయంలో చేపలు, లివర్‌ను తినొచ్చా? -
ఇడ్లీ, దోశ బ్రేక్‌ఫాస్ట్‌లను ఇలా సరికొత్త రుచితో వండుకొని తింటే..
అప్పుడే ఎండలు మండి పోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల్లో రోజూ తినే ఇడ్లీ, దోశ, వడలు అంతగా సహించవు. రుచి లేదని బ్రేక్‌ఫాస్ట్ తినకుండా ఉండలేం కాబట్టి ఇడ్లీ, దోశల తయారీలో కొన్ని కొత్త పదార్థాలను జోడించి వండితే.. రెండు తినేవారు నాలుగు తింటారు. బ్రేక్‌ఫాస్ట్‌లను సరికొత్త రుచితో ఎలా వండుకోవచ్చో చూద్దాం.. సొరకాయ దోశ కావలసినవి.. మీడియం సైజు సొరకాయ – ఒకటి, బియ్యప్పిండి – ఒకటిన్నర కప్పు, బొంబాయి రవ్వ – అరకప్పు, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – నాలుగు కప్పులు, ఉల్లిపాయ – ఒకటి(సన్నగా తరగాలి), పచ్చిమిర్చి – రెండు(సన్నగా తరగాలి), జీలకర్ర – టీస్పూను, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఆయిల్ – దోశ వేయించడానికి సరిపడా. తయారీ: ►ముందుగా సొరకాయ తొక్క తీసి శుభ్రంగా కడగాలి. తరువాత గింజలు తీసేసి ముక్కలుగా తరగాలి. ►ముక్కలను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ►ఈ పేస్టుని ఒక పెద్దగిన్నెలో వేసి బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు కప్పుల నీళ్లుపోసి బాగా కలపాలి. ►ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, జీలకర్ర వేసి కలిపి ఇరవై నిమిషాల పాటు పక్కనపెట్టాలి. ►తరువాత వేడెక్కిన పెనం మీద కొద్దిగా ఆయిల్ చల్లుకుని దోశలా పోసుకోవాలి. ►దోశను రెండువైపుల క్రిస్పీగా కాల్చితే సొరకాయ దోశ రెడీ. చదవండి: Lassi: లేతకొబ్బరి కోరు, జీడిపప్పు, కిస్మిస్, చెర్రీలు వేసుకున్నారంటే! సగ్గుబియ్యం ఇడ్లీ కావలసినవి: సగ్గుబియ్యం – కప్పు, ఇడ్లీ రవ్వ – కప్పు, పుల్లటి పెరుగు – రెండు కప్పులు, బేకింగ్ సోడా – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, జీడిపప్పు – 8 తయారీ: ►ముందుగా సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వలను కడగాలి. ►ఒక పెద్దగిన్నెలో సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వ, పెరుగు పేసి కలపాలి. ►ఈ మిశ్రమంలో రెండు కప్పులు నీళ్లుపోసి కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. సమయం లేనప్పుడు కనీసం ఎనిమిది గంటలైనా నానబెట్టాలి. ►నానిన పిండికి రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలపాలి. ►ఇడ్లీ ప్లేటుకు కాస్త ఆయిల్ రాసి జీడిపప్పులు వేసి, వీటిపైన పిండిని వేయాలి. సిమ్‌లో పదిహేను నిమిషాలు ఉడికిస్తే సగ్గుబియ్యం ఇడ్లీ రెడీ. ఏ చట్నీతోనైనా ఈ ఇడ్లీ చాలా బావుంటుంది. -
Health Tips: సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్ చేసుకుంటే అద్భుత ఫలితాలు!
Bottle Gourd Juice: Top 10 Amazing Health Benefits In Telugu: ఈ డిజిటల్ యుగంలో ‘నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను’ అని చెప్పగలిగినది ఎంత మంది? నూటికి అరవై మంది సరైన నిద్రకు దూరమయ్యారు. కలత నిద్ర కారణంగా మరుసటి రోజు పనిలో నాణ్యత తగ్గుతుంటుంది. కౌమారదశలోనే తెల్లజుట్టు పరిహసిస్తోంది. తింటే అజీర్తి, తినకపోతే ఎసిడిటీ. ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పని జంక్‌ఫుడ్. ఆ జంక్‌ఫుడ్ కారణంగా వృద్ధి చెందిన విషపూరిత వ్యర్థాలను నింపుకుని దేహం బద్ధకంగా రోజులు వెళ్లదీస్తుంటుంది. దీనికితోడు వృత్తి, వ్యాపారాల కారణంగా తప్పనిసరి అవుతున్న మానసిక ఒత్తిడి. ఈ స్థితి నుంచి కళ్లు తెరిచేలోపే రక్తప్రసరణ వేగం పెరిగిపోయి ఉంటుంది. మొత్తానికి ఈ దుష్ప్రభావాలన్నింటినీ గుండె లయ మారుతుంటుంది. ఇన్నింటినీ దూరం చేయగలిగిన ఆహారం మన పెరట్లోనే పండుతుంది. పెరడు లేకపోతే కూరగాయల మార్కెట్లో దొరుకుతుంది. అదే సొరకాయ. ►సొరకాయ పీచు, నీటితో నిండిన కూరగాయ. ఇందులో ఐరన్, పొటాషియంతోపాటు విటమిన్లు కూడా ఉంటాయి. ►సొరకాయ రసం తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సలాడ్, కూర, హల్వా చేసుకుని కూడా తినవచ్చు. ►సొరకాయ తింటే... మంచి నిద్రపడుతుంది. ►జుట్టు తెల్లబడిన టీనేజ్ పిల్లలు రోజూ ఒక గ్లాసు రసం తాగితే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. తిరిగి పూర్వపు స్థితికి వస్తుంది. ►ఎసిడిటీ తగ్గుతుంది. జీర్ణక్రియ సక్రమమవుతుంది. చదవండి: Betel Leaves: తమలపాకులు నములుతున్నారా.. అయితే మీరు... ►దేహంలో వృద్ధి చెందిన విషపూరిత వ్యర్థాలను తొలగించడంలో సమర్థంగా పని చేస్తుంది. ►ఇందులో సహజసిద్ధంగా ఉన్న మత్తు కలిగించే గుణం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతోపాటు అలసిన దేహం సాంత్వన పొందుతుంది కూడా. ►హైబీపీ ఉన్న వాళ్లు వారానికి మూడుదఫాలు ఈ రసం తాగితే రక్తప్రసరణ అదుపులోకి వస్తుంది. ►గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది. ►ఇది సొరకాయలు పండే కాలం. హైబీపీ ఉన్న వాళ్లు ఒకరోజు సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్ చేసుకుంటే ఫలితం కళ్ల ముందు కనిపించి తీరుతుంది. ►బాటిల్ గార్డ్ బీపీ గార్డ్ అని కూడా నిర్ధరణ అవుతుంది. చదవండి: Health Tips: రోజూ నిమ్మకాయ పులిహోర, ఎండు ద్రాక్ష, ఖర్జూర తింటున్నారా! -
Beauty Tips: ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ తొలగించేందుకు.. ఆనప ఫేస్ ప్యాక్!
Winter Skin Care Tips In Telugu: వాతావరణం మారినప్పుడల్లా ఆ ప్రభావం సున్నితమైన చర్మంపై పడుతుంది. ఫలితంగా ముఖం మీద ట్యాన్ పేరుకు పోవడం, కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడటం.. వెరసి ముఖం పొడిబారి గ్లో తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, పోషణ అందించే ప్యాక్‌లు వాడటం ద్వారా పోయిన గ్లోను తిరిగి తెస్తాయి. ►సొరకాయ (ఆనప కాయ) గుజ్జులో పావు టీస్పూను తేనె, టీస్పూను అలోవెరా జెల్, టీస్పూను రోజ్ వాటర్, విటమిన్ ఈ క్యాప్సూల్ వేసి పేస్టులా కలుపుకోవాలి. ►ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. తరువాత పదినిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. ►ముఖాన్ని శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు వేసుకోవడం వల్ల నల్లని మచ్చలు, ట్యాన్ తొలిగి ముఖం నిగారింపును సంతరించుకుంటుంది. చదవండి: Weight Loss Diet: ఆ హార్మోన్ వల్లనే బరువు పెరుగుతారు..! యాలకులు, వెల్లుల్లి, కరివేపాకు, తేనె, మజ్జిగ.. -
ఆనపకాయ @ 30 కేజీలు
వజ్రపుకొత్తూరు రూరల్: ఆనపకాయ సాధారణంగా పది నుంచి 15 కిలోల బరువు ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే ఆశ్చర్యపోతాం. ఏకంగా 30 కిలోలు ఉంటే ఔరా అనకతప్పదు. వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు బతకల మల్లేష్ సాగు చేస్తున్న పొలంలో ఇదే జరిగింది. ఆనపపాడుకు 30 కిలోల బరువున్న కాయలు కాయడంతో వాటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. -
బరువు తగ్గాలనుకునేవారికి అనువైన ‘సొరకాయ’
సొరకాయ తింటే క్యాలరీలు చాలా తక్కువ. తొంభై శాతానికి మించి నీరే ఉంటుంది. కొవ్వుపాళ్లు కేవలం 1 శాతం మాత్రమే. పీచు పాళ్లు ఎక్కువ. ఈ అన్ని అంశాలు కలగలిసి ఉండటం వల్ల సొరకాయ తినగానే కడుపు నిండిపోతుంది. కానీ బరువు పెరగనివ్వదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇంతకంటే మంచి కూర... మంచి వంటకం మరేముంటుంది. కేవలం బరువు తగ్గడానికే కాదు... మరెన్నో విధాల మేలు చేస్తుంది సొరకాయ. దానితో ఒనగూరే ప్రయోజనాల్లో కొన్ని ఇవి... ♦ సొరకాయలో డయటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దాంతో సొరకాయ ఐటమ్స్ తినగానే వెంటనే కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. దాంతో తినేది చాలా తక్కువ. సంతృప్త భావన ఎక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ మంచి ఆహారం. ♦బరువు తగ్గడానికి తోడు... డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారికి... ఉపకరించే మరో గుణం సొరకాయలో ఉంది. అదేమిటంటే... 100 గ్రాముల సొరకాయ తింటే దాని వల్ల సమకూరేది కేవలం 15 క్యాలరీలు మాత్రమే. అందుకే డయాబెటిస్ ఉన్నవారు సొరకాయను ఏ రకంగా తీసుకున్నా మంచిదే. ఇక సొరకాయలో 96 శాతం నీరే. ఇలా చూసినప్పుడు డయటరీ ఫైబర్, తక్కువ క్యాలరీలను ఇచ్చే గుణం, నీరు ఎక్కువగా ఉండటం... ఈ మూడు అంశాలూ ఒబేసిటీ తగ్గించుకోడానికీ, డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోడానికి పనికి వస్తాయి. ♦ఇందులో నీటి పాళ్లు 96 శాతం ఉండటం వల్ల ఒంట్లో ద్రవాలు తగ్గుతున్నవారికి (డీహైడ్రేషన్‌కు గురవుతున్నవారికి) ఇది చాలా మేలు చేసే ఆహారం. ♦100 గ్రాముల సొరకాయలో కొవ్వుల పాళ్లు కేవలం 1 గ్రాము మాత్రమే. కొలెస్ట్రాల్ పాళ్లు చాలా చాలా తక్కువ. అందుకే ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. -
అనేక అనారోగ్యాలను పారదోలే సొరకాయ
గుడ్‌ఫుడ్ ఆరోగ్యానికి సొరకాయతో ఒనగూరే మేలు అంతా ఇంతా కాదు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలనుంచి ఇది కాపాడుతుంది. సొరకాయ ఉపయోగాల్లో కొన్ని... ►100 గ్రాముల సొరకాయ తింటే దాని ద్వారా సమకూరేది కేవలం 15 క్యాలరీలు మాత్రమే. అందుకే డయాబెటిస్ ఉన్నవారు సొరకాయను ఏ రకంగా తీసుకున్నా మంచిదే. ► సొరకాయలో 96 శాతం నీరే. ఇక అందులో విటమిన్–సి, రైబోఫ్లేవిన్, జింక్, థయామిన్, ఐరన్, మెగ్నీషియమ్, మాంగనీస్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలం. కాబట్టి చెమట రూపంలో నీరు, ఖనిజ లవణాలను కోల్పోయే వృత్తుల్లో ఉండేవారు సొరకాయ తినడం చాలా మంచిది. తరచూ అలసటగా ఉండేవారు సొరకాయ తింటే త్వరగా శక్తి సమకూరుతుంది. ►100 గ్రాముల సొరకాయలో కొవ్వుల పాళ్లు కేవలం 1 గ్రాము మాత్రమే. కొలెస్ట్రాల్ పాళ్లు చాలా చాలా తక్కువ. అందుకే ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ►సొరకాయలో పీచు పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఇది మలబద్దకాన్ని నివారించడంతో పాటు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. కిందినుంచి గ్యాస్ ఎక్కువగా పోయే వారు, పైల్స్‌తో బాధపడేవారు సొరకాయ తినడం మంచిది. ►బరువు తగ్గాలనుకునేవారికి సొరకాయ మంచి కూర. ఇందులో డయటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. ► సొరకాయలో సోడియం, పొటాషియంతో పాటు అన్ని రకాల సూక్ష్మపోషకాలు ఎక్కువ. పొటాషియమ్ బీపీని నియంత్రిస్తుంది. కాబట్టి హైబీపీతో బాధపడేవారు సొరకాయ తింటే మేలు. ►సొరకాయ కాలేయానికి మేలు చేస్తుంది. దాని పనితీరును మెరుగుపరుస్తుంది. -
తీగ లాగితే జ్యూస్ వచ్చింది
రుచిగా పాకుతుంది... ఆరోగ్యంగా అల్లుకుంటుంది... అందరి హృదయాలలో విస్తరిస్తుంది. నాలుకపై నాట్యమాడుతుంది... తీగలాగితే చాలు జ్యూస్ వస్తుంది... తీగకూరగాయలతో చేసిన జ్యూస్ స్పెషల్స్ ఇవి. సొరకాయ జ్యూస్ కావల్సినవి: సొరకాయ – 1 (250 గ్రాములు); పుదీనా ఆకులు– 4–6; నీళ్లు – కప్పు; జీలకర్ర పొడి – టీ స్పూన్; మిరియాల పొడి – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత, అల్లం– చిన్నముక్క తయారీ: సొరకాయను శుభ్రం చేసి, పైన తొక్క తీయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అల్లం ముక్క వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో పుదీన, కొత్తిమీర ఆకులు వేయాలి. నిమ్మరసం వేయాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. దీంట్లో అర కప్పుడు నీళ్లు పోసి మరోసారి గుజ్జు మెత్తగా అయ్యేదాకా బ్లెండ్ చేయాలి. దీంట్లో మరికొన్ని నీళ్లు కలిపి, వడకట్టాలి. గ్లాసులో పోసి సేవించాలి. గుమ్మడికాయ జ్యూస్ కావల్సినవి: ఆప్రికాట్స్ – 10; నీళ్లు – ఒకటిన్నర కప్పు; యాపిల్ జ్యూస్ – 2 కప్పులు; దాల్చిన చెక్క – చిన్నముక్క; అల్లం – చిన్న ముక్క, నిమ్మరసం – టీ స్పూన్ తయారీ: గుమ్మడికాయ పై తొక్క నుంచి మెత్తటి ముక్కను వేరు చేయాలి. గింజలను తీసేయాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేయాలి. దీనికి పంచదార/బెల్లం/తేనె/ యాపిల్ జ్యూస్ వాడచ్చు. దీంట్లో జాజికాయ పొడి, దాల్చిన చెక్క పొడి, అల్లం తరుగు, నిమ్మరసం కలపాలి. కూలింగ్ కావాలనుకునేవారు ఐస్ క్రష్ చేసి వేయాలి. బీరకాయ జ్యూస్ కావల్సినవి: బీరకాయ – 1; పుదీనా ఆకులు – 4–6; నీళ్లు – కప్పు; జీలకర్ర పొడి – టీ స్పూన్; మిరియాల పొడి – అర టీ స్పూన్; నల్లుప్పు – తగినంత ఉప్పుకు బదులుగా తియ్యగా కావాలనుకునేవారు తేనె కలుపుకోవచ్చు. తయారీ: బీరకాయను శుభ్రం చేసి, పైన తొక్క తీయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అల్లం ముక్క వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో పుదీన , కొత్తిమీర, నిమ్మరసం, నల్లుప్పు, మిరియాల పొడి వేసి మళ్లీ మెత్తగా బ్లెండ్ చేయాలి. దీంట్లో కప్పుడు నీళ్లు పోసి మరోసారి గుజ్జు మెత్తగా అయ్యేదాకా బ్లెండ్ చేయాలి. గ్లాసులో పోయాలి. చల్లగా కావాలనుకునేవారు ఐస్ క్రష్ చేసి కలుపుకోవచ్చు. దొండకాయ జ్యూస్ కావల్సినవి: దొండకాయలు – 4; ఉసిరి ముక్కలు – 3; అల్లం – చిన్నముక్క; పుదీనా ఆకులు – 15; కొత్తిమీర తరుగు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత; నల్లుప్పు – తగినంత జీలకర్రపొడి – టేబుల్ స్పూన్; నిమ్మరసం – టీ స్పూన్ స్పూన్లు; ఐస్‌క్యూబ్స్ – తగినన్ని తయారీ: దొండకాయలను శుభ్రం చేసి చిన్నముక్కలుగా కట్ చేయాలి. మిక్సర్జార్లో దొండకాయ ముక్కలు, అల్లం తరుగు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర పొడి వేసి బ్లెండ్ చేయాలి. దీనికి కప్పు నీళ్లు కలిపి వడకట్టాలి. దీంట్లో ఐస్‌క్యూబ్స్ వేసి అందించాలి. దోసకాయ/కీరా జ్యూస్ కావల్సినవి: దోసకాయ/ కీరా – ఒకటి; జీలకర్ర పొడి – అర టీ స్పూన్; పుదీనా – 10; ఉప్పు – తగినంత; నిమ్మరసం – పావు టీ స్పూన్ తయారీ: దోసకాయ కడిగి, పై తొక్క తీసి ముక్కలు చేయాలి. ఈ ముక్కలను మిక్సర్జార్లో వేసి పుదీనా, జీలకర్రపొడి, ఉప్పు, నీళ్లు కలిపి బ్లెండ్ చేయాలి. దీంట్లో మరికొన్ని నీళ్లు కలిపి వడకట్టాలి. దీంట్లో పావు టీ స్పూన్ నిమ్మరసం కలిపి సర్వ్ చేయాలి. కూల్‌గా కావాలనుకునేవారు ఐస్‌క్యూబ్స్ వాడచ్చు. కాకరకాయ జ్యూస్ కావల్సినవి:కాకరకాయలు – 5, నీళ్లు – గ్లాసుపసుపు – చిటికెడుఉప్పు – తగినంతనిమ్మరసం – టీ స్పూన్ తయారీ:కాకరకాయ పైన తొక్కను చెక్కేయాలి. మరీ ఎక్కువ కాకుండా పైన బొడిపెల్లా ఉన్నంత వరకు తీసేస్తే చాలు. సన్నని ముక్కలుగా కట్ చేయాలి. గ్లాసు నీళ్లలో కట్ చేసిన కాకర కాయముక్కలు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి కనీసం 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత వీటిని మిక్సర్జార్లో వేసి బ్లెండ్ చేసి, రసం పిండాలి. ఈ రసానికి నీళ్లు కలిపి, దీంట్లో నిమ్మరసం కలిపి సేవించాలి. అధికబరువు, మధుమేహం, ఆస్త్మా వంటి సమస్యలకు కాకరలోని ఔషధాలు అమోఘంగా పనిచేస్తాయి. -
ఐదడుగుల సొరకాయ
సొరకాయ మూమూలుగా ఒకటిన్నర అడుగు నుంచి రెండడుగుల పొడవు ఉంటుంది. మహా అంటే మూడడుగులు. కానీ వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం వెంకటగారిపల్లెకు చెందిన యువరైతు సామసాని వెంకటసుబ్బారెడ్డి తోటలో ఐదడుగుల సొరకాయలు కాశాయి. పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన అభ్యుదయ రైతు నరసింహారెడ్డి ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పంట ఉత్పత్తుల సందర్శనకు వెళ్లాడు. అక్కడ హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ రైతు ఇచ్చిన సొర విత్తనాలను తీసుకువచ్చి వెంకటసుబ్బారెడ్డికి ఇచ్చాడు. తన పొలంలోని మునగ చెట్టు వద్ద వెంకట సుబ్బారెడ్డి ఆ విత్తనం నాటి తీగలను చెట్టుకు అల్లించాడు. ప్రస్తుతం ఐదు అడుగుల పొడవున్న నాలుగు కాయలు ఆ తీగలకు వేలాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. - కడప అగ్రికల్చర్