సొరకాయ తింటే క్యాలరీలు చాలా తక్కువ. తొంభై శాతానికి మించి నీరే ఉంటుంది. కొవ్వుపాళ్లు కేవలం 1 శాతం మాత్రమే. పీచు పాళ్లు ఎక్కువ. ఈ అన్ని అంశాలు కలగలిసి ఉండటం వల్ల సొరకాయ తినగానే కడుపు నిండిపోతుంది. కానీ బరువు పెరగనివ్వదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇంతకంటే మంచి కూర... మంచి వంటకం మరేముంటుంది. కేవలం బరువు తగ్గడానికే కాదు... మరెన్నో విధాల మేలు చేస్తుంది సొరకాయ. దానితో ఒనగూరే ప్రయోజనాల్లో కొన్ని ఇవి...
♦ సొరకాయలో డయటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దాంతో సొరకాయ ఐటమ్స్ తినగానే వెంటనే కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. దాంతో తినేది చాలా తక్కువ. సంతృప్త భావన ఎక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ మంచి ఆహారం.
♦బరువు తగ్గడానికి తోడు... డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారికి... ఉపకరించే మరో గుణం సొరకాయలో ఉంది. అదేమిటంటే... 100 గ్రాముల సొరకాయ తింటే దాని వల్ల సమకూరేది కేవలం 15 క్యాలరీలు మాత్రమే. అందుకే డయాబెటిస్ ఉన్నవారు సొరకాయను ఏ రకంగా తీసుకున్నా మంచిదే. ఇక సొరకాయలో 96 శాతం నీరే. ఇలా చూసినప్పుడు డయటరీ ఫైబర్, తక్కువ క్యాలరీలను ఇచ్చే గుణం, నీరు ఎక్కువగా ఉండటం... ఈ మూడు అంశాలూ ఒబేసిటీ తగ్గించుకోడానికీ, డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోడానికి పనికి వస్తాయి.
♦ఇందులో నీటి పాళ్లు 96 శాతం ఉండటం వల్ల ఒంట్లో ద్రవాలు తగ్గుతున్నవారికి (డీహైడ్రేషన్‌కు గురవుతున్నవారికి) ఇది చాలా మేలు చేసే ఆహారం.
♦100 గ్రాముల సొరకాయలో కొవ్వుల పాళ్లు కేవలం 1 గ్రాము మాత్రమే. కొలెస్ట్రాల్ పాళ్లు చాలా చాలా తక్కువ. అందుకే ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారికి అనువైన ‘సొరకాయ’
Published Mon, Feb 12 2018 12:59 AM | Last Updated on Mon, Feb 12 2018 12:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment