సొరకాయ, ఆనపకాయ ఈ పేరు చెబితేనే చాలా మంది పెద్దగా ఇష్టపడరు. సాంబారుకో, పులుసుకో తప్ప ఇంక దేనికీ పనికి రాదనుకుంటారు. నిజానికి సొరకాయ సౌందర్య పోషణలోనూ, బరువుతగ్గే ప్రక్రియలోనూ చాలా చక్కగా పనిచేస్తుంది. సొరకాయ , దాని ప్రయోజనాలపై ఒక లుక్కేద్దాం రండి..!
కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన తీగ జాతి కూరగాయసొరకాయ. ఇందులో లో విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్ ఆప్షన్. సొరకాయతో పలు రకాలు వంటకాలు చేసుకోవచ్చు. జ్యూస్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సొరకాయ జ్యూస్ - లాభాలు
హైపర్‌టెన్షన్ కంట్రోల్‌లో ఉంటుంది.
సొరకాయలో ఉండే, పొటాషియం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు, పరగడుపున సొరకాయ జ్యూస్ తాగితే మంచిది. రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది.
శరీరం నుంచి విష పదార్థాలు తొలగిపోతాయి. ఈ జ్యూస్‌తో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.
సొరకాయ జ్యూస్ న్యాచురల్ క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం సొరకాయ వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. యూరిన్‌లో ఉండే యాసిడ్ కంటెంట్‌ని బాలెన్స్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
సొరకాయ జ్యూస్ రెగ్యులర్ తాగితే మెటబాలిజం మెరుగుపడుతుంది. శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారి పని మరింత ఈజీ అవుతుంది.
సొరకాయతో సౌందర్య ప్రయోజనాలు..!
సొరకాయ జ్యూస్ ఆరోగ్యానికే కాదు అందానికీ మేలు చేస్తుంది
రోజూ ఉదయాన్నే సొరకాయ జ్యూస్ సేవిస్తే తాగుతుంటే ముఖంలో సహజమైన మెరుపు వస్తుంది.
ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. వృద్ధాప్య ఛాయలు తొలగి, యవ్వనంగా కనిపిస్తారు.
చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లను, దురదలు, దద్దుర్లను తగ్గించడంలోనూ సాయపడుతుంది.
రోజూ ఈ జ్యూస్ తాగితే శిరోజాలు ఒత్తుగా, దృఢంగా, పొడవుగా పెరుగుతాయి, జుట్టు మెరిసిపోతుంది.
ఎలా చేసుకోవాలి?
సొరకాయ ముక్కలు, పుదీనా ఆకులు, అల్లంవేసి బ్లెండర్‌లో వేసి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి.
దీనికి ఉప్పు, మిరియాలపొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని వడపోసుకుని ఇష్టంగా తాగేయడమే.
Comments
Please login to add a commentAdd a comment