nutritional
-
ఔషధాల సిరి ఉసిరి : జుట్టు, చర్మ సంరక్షణలో భళా!
ఔషధాల సిరి ఉసిరి. దీని ద్వారా లభించేఆరోగ్య ప్రయోజనాల ఉగరించి ఎంత చెప్పుకునే తక్కువే.చర్మం, జుట్టు ఇలా శరీరంలోని ప్రతి అవయవానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. విటమిన్ సీ పుష్కలంగా లభించే ఉసిరిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, కెరోటిన్, ఐరన్, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, జీవక్రియను, దీర్ఘాయువును పెంచడానికి ప్రతిరోజూ ఉసిరి తినాలని చెబుతారు. మనస్సు , శరీరం రెండింటి పనితీరుకు సహాయపడే తీపి, పులుపు, చేదు, ఘాటైన ఐదు రుచులతో నిండిన 'దివ్యౌషధం ఇది. వసాధారణంగా అక్టోబర్ ,నవంబర్ మధ్య వచ్చే కార్తీక మాసంలోదీనికి ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యతుంది. శివుడికి ప్రీతిపాత్రమైందిగా భావిస్తారు.ఉసిరితో వాత, కఫ , అసమతుల్యత కారణంగా సంభవించే వివిధ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు, ఫ్లూ, ఇతర ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్ కేన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఉసిరికాయతో పచ్చళ్లు, స్వీట్ తయారు చేస్తారు. ఉసిరికాయ గింజలు కూడా మనకు ఎంతో మేలుస్తాయి. అయితే దీనిని పచ్చిగా, రసం, చూర్ణం, మిఠాయి, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. జుట్టుకుఆమ్లా ఆయిల్‌తో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగా ఫోలికల్స్ బలపడతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. నల్లగా నిగనిగ లాడే మెరుపు వస్తుంది. జుట్టును బలోపేతం చేయడమే కాదు తొందరగా తెల్లబడకుండా కూడా చేస్తుంది. స్కాల్ప్‌ను కూడా బలపరుస్తుంది. చుండ్రు రాకుండా కాపాడుతుంది. చర్మం కోసంసహజ రక్త శుద్ధిలా పనిచేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలను నివారణలో సహాయపడుతుంది. జీవనశైలి,కాలుష్యం, సూర్యరశ్మితో వచ్చే స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. అంతేకాదు ఉసిరి కుష్టు వ్యాధి, సోరియాసిస్, చర్మ అలెర్జీలు , తామర వంటి వివిధ చర్మ పరిస్థితుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు.యాంటీ ఏజింగ్ పవర్హౌస్లా పనిచేస్తుంది. ఆమ్లా పేస్ట్ లేదా పౌడర్‌తో ఫేస్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల చర్మానికి తేలికపాటి ఎక్స్‌ఫోలియేషన్‌ను అందిస్తుంది, మృత చర్మ కణాలను,మలినాలను సమర్థవంతంగా తొలగిస్తుంది.మచ్చలపై ఉసిరి పేస్ట్‌ను అప్లయ్ చేయవచ్చు. ఉసిరి రసాన్ని వాడవచ్చు. లేదా ఫేస్ ప్యాక్‌గా కూడా అప్లై చేయవచ్చు. -
మెనూ మారుద్దాం
మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచివని తెలుసు. కానీ... రోజూ తినాలంటే కష్టంగా ఉంది. దోసె రుచి కోసం నాలుక మారాం చేస్తోంది. మరేం చేద్దాం... జొన్నతో దోసె చేద్దాం. జొన్నతోనే లంచ్ బాక్స్‌కి కిచిడీ చేద్దాం. ఎంచక్కా తింటూనే బరువు తగ్గుదాం.కావలసినవి: జొన్న పిండి – కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; రవ్వ – పావు కప్పు; జీలకర్ర– అర టీ స్పూన్; పచ్చిమిర్చి– 2 (తరగాలి); అల్లం – అంగుళం ముక్క (తురమాలి); ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె – టేబుల్ స్పూన్.తయారీ: ∙ఒక వెడల్పు పాత్రలో జొన్నపిండి, బియ్యప్పిండి, రవ్వ, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి కలపాలి. ఇందులో దాదాపుగా మూడు కప్పుల నీటిని ΄ోసి గరిటె జారుడుగా కలుపుకోవాలి. మిశ్రమం గట్టిగా అనిపిస్తే మరికొంత నీటిని చేర్చి కలిపి ఓ అరగంట సేపు నాననివ్వాలి ∙ఇప్పుడు పెనం వేడి చేసి ఒక గరిటె పిండితో దోసె వేసి, చుట్టూ పావు టీ స్పూన్ నూనె చిలకరించాలి. ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కూడా కాల్చితే జొన్న దోసె రెడీ. ఈ దోసెలోకి వేరుశనగపప్పు చట్నీ, సాంబారు, టొమాటో పచ్చడి మంచి కాంబినేషన్.జొన్న కిచిడీకావలసినవి: జొన్నలు›– అరకప్పు; పెసరపప్పు – పావు కప్పు; కూరగాయల ముక్కలు – కప్పు (క్యారట్, బీన్స్, బఠాణీలు కలిపి); జీలకర్ర – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నీరు – 3 కప్పులు; నెయ్యి లేదా నూనె – టేబుల్ స్పూన్.తయారీ: ∙జొన్నలను కడిగి మంచి నీటిలో నాలుగు గంటల సేపు నానబెట్టాలి ∙ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేసి మంట తగ్గించాలి. అవి వేగిన తర్వాత అందులో కూరగాయ ముక్కలు వేసి రెండు నిమిషాల సేపు మగ్గనివ్వాలి. నానిన జొన్నలను కడిగి నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పును కడిగి పెట్టుకోవాలి ∙కూరగాయ ముక్కల పచ్చిదనం ΄ోయిన తర్వాత అందులో జొన్నలు, పెసర పప్పు, పసుపు, ఉప్పు వేసి నీటిని ΄ోసి కలిపి మూత పెట్టాలి ∙మీడియం మంట మీద ఉడికించాలి. నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి ∙ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి గరిటెతో కలిపి వేడిగా వడ్డించాలి. ఇందులోకి ఆవకాయ, పెరుగు పచ్చడి బాగుంటాయి. -
శుద్ధి చేసిన నూనెల కంటే ఆ నూనె బెస్ట్!
ఇంతవరకు మనం రకరకాల నూనెలు వినియోగిస్తున్నాం. అలాగే ఒకే రకం నూనెను వాడకూడదని పోషకాహార నిపుణులు చెప్పడంతో మనం సన్‌ఫ్లవర్, వేరుశెనగా అంటూ నూనెలు మారుస్తున్నాం కూడా. కానీ పోషకాహార శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఈ శుద్ధి చేసిన నూనెల కంటే ఆ నూనె బెటర్ అని తేలింది. ఈ నూనెని వినియోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని అంటున్నారు. ఇంతకీ ఏంటా నూనె అంటే..శుద్ధి చేసిన నూనెల కంటే ఆవాల నూనె మంచిదని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పోషకాహార శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంపద్రాయ ఆవాల నూనె వాడటమే మంచి నొక్కి చెప్పారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి చెందని పోషకాహార శాస్త్రవేత్త మోనికా చౌదరి మాట్లాడుతూ.."మునుపటి అధ్యయనంలో సాంప్రదాయా ఆవాల నూనెతో పోలిస్తే శుద్ధి చేసిన నూనెలే ఆరోగ్యానికి మంచిదని తేలింది. కానీ కాలక్రమేణ ఎలుకలపై జరిపిన అధ్యయనంలో అది తప్పు అని నిరూపితమయ్యింది. ఆవ నూనెలో దాదాపు 35-48% ఎరుసిక్ యాసిడ్ ఉంటుందని గత అధ్యయనాలు పేర్కొన్నాయి. అలాగే శుద్ధి చేసిన నూనెల్లో చమురు కంపెనీ ఎరుక్ యాసిడ్ అధిక మొత్తంలో వినియోగిస్తున్నాయని ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటూ తెగ ప్రచారం చేయడం జరిగింది. కానీ ఇటీవల ఎలుకలపై జరిపిన అధ్యయనంలో మానవులకు ఎరుసిక్ ఆమ్లాల ప్రభావం ఉండదని తేలింది. మొత్తం శరీరం బరువులో ఎరుసిక్ యాసిడ్ కిలోకు 7.5ఎంజీ అనుమతించదగినది అన్నారు. ఇక ఈ ఆవా నూనెలో కేవలం 2% కంటే తక్కువ ఎరుసిక్ యాసిడ్‌ని కలిగి ఉంటాయని, అందువల్ల ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని". చెబుతున్నారు. అలాగే ఆరోగ్యకరమైన నూనె అంటే కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్ రహితంగా ఉండాలి. పైగా సంతృప్త కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉండి, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ ఆవాల నూనెలో ఉంటాయని అన్నారు. ఇంతవరకు మంచివని చెప్పుకున్న శుద్ధి చేసిన నూనెల్లో ఒమేగా 6 కొవ్వు ఆమ్మాలు అధికంగా ఉంటాయని, ఇవి దీర్ఘకాల నిల్వకు ఉపయోగపడతాయని అన్నారు. అయితే ఇలాంటి నూనెలు తీసుకోవడం వల్ల శరీరంలో ఒమేగా 6, ఒమేగా 3 నిష్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. ఇలా చాలా స్థానికేతర నూనెల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల చాల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల సాంప్రదాయ నూనెలను తీసుకోవడమే మంచిదని సూచించారు. అందులోనూ ఆవాల నూనె ఇంకా మంచిదని చెబుతున్నారు. అలాగే ఆ శుద్ధి చేసిన నూనెల్లో ఉన్న మరో సమస్య పొగ పాయింట్ అని చెప్పారు. ఇక్కడ నూనెలను వేడిచేసినప్పుడల్లా.. అవి పొగ , ఆవిరిని ఉత్పత్తి చేసే సమయంలో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు (PUFA) ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లుగా విడిపోవడం జరుగుతుంది. ఇలాంటి నూనెలో వేయించిన పదార్థాలను తినడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. అవి కాలక్రమేణ కేన్సర్ కారకాలుగా మారి వివిధ రకాల కేన్సర్లకు దారితీస్తుంది. అయితే సాంప్రదాయ నూనెల్లోనూ, ఆవాల నూనెలను మరిగించినప్పుడూ వాటిలో అధిక పొగ పాయింట్ ఉంటుంది. ఇది కొవ్వు ఆమ్లాలను ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లుగా విడిపోవడాన్ని నిరోధిస్తుందని, అందువల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని వివరించారు. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆవాల నూనెను వాడమని పదేపదే నొక్కి చెబుతున్నారు పోషకాహార శాస్త్రవేత్తలు. (చదవండి: స్నేహితుడిలా ఉండే ఏఐ ఆధారిత నెక్లెస్..ధర ఎంతంటే..!) -
సొరకాయా.. మజాకా! బోలెడన్ని ప్రయోజనాలు
సొరకాయ, ఆనపకాయ ఈ పేరు చెబితేనే చాలా మంది పెద్దగా ఇష్టపడరు. సాంబారుకో, పులుసుకో తప్ప ఇంక దేనికీ పనికి రాదనుకుంటారు. నిజానికి సొరకాయ సౌందర్య పోషణలోనూ, బరువుతగ్గే ప్రక్రియలోనూ చాలా చక్కగా పనిచేస్తుంది. సొరకాయ , దాని ప్రయోజనాలపై ఒక లుక్కేద్దాం రండి..!కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన తీగ జాతి కూరగాయసొరకాయ. ఇందులో లో విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్ ఆప్షన్. సొరకాయతో పలు రకాలు వంటకాలు చేసుకోవచ్చు. జ్యూస్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సొరకాయ జ్యూస్ - లాభాలు హైపర్‌టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది.సొరకాయలో ఉండే, పొటాషియం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు, పరగడుపున సొరకాయ జ్యూస్ తాగితే మంచిది. రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. శరీరం నుంచి విష పదార్థాలు తొలగిపోతాయి. ఈ జ్యూస్‌తో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.సొరకాయ జ్యూస్ న్యాచురల్ క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం సొరకాయ వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. యూరిన్‌లో ఉండే యాసిడ్ కంటెంట్‌ని బాలెన్స్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.సొరకాయ జ్యూస్ రెగ్యులర్ తాగితే మెటబాలిజం మెరుగుపడుతుంది. శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారి పని మరింత ఈజీ అవుతుంది.సొరకాయతో సౌందర్య ప్రయోజనాలు..!సొరకాయ జ్యూస్ ఆరోగ్యానికే కాదు అందానికీ మేలు చేస్తుందిరోజూ ఉదయాన్నే సొరకాయ జ్యూస్ సేవిస్తే తాగుతుంటే ముఖంలో సహజమైన మెరుపు వస్తుంది.ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. వృద్ధాప్య ఛాయలు తొలగి, యవ్వనంగా కనిపిస్తారు.చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లను, దురదలు, దద్దుర్లను తగ్గించడంలోనూ సాయపడుతుంది. రోజూ ఈ జ్యూస్ తాగితే శిరోజాలు ఒత్తుగా, దృఢంగా, పొడవుగా పెరుగుతాయి, జుట్టు మెరిసిపోతుంది.ఎలా చేసుకోవాలి?సొరకాయ ముక్కలు, పుదీనా ఆకులు, అల్లంవేసి బ్లెండర్లో వేసి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి.దీనికి ఉప్పు, మిరియాలపొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని వడపోసుకుని ఇష్టంగా తాగేయడమే. -
నల్లేరా..మజాకా...! ఈ అద్భుత ప్రయోజనాలు తెలుసా?
ప్రకృతిని ఆధునీకులు సరిగ్గా పట్టించుకోరు కానీ.. ప్రతి మొక్కలోనూ ఎన్నో విలువైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాటి వాటిల్లో నల్లేరు కూడా ఒకటి. తీగ జాతికి చెందిన దీన్నే వజ్రవల్లి, అస్థి సంహారక, అస్థి సంధని, అస్థి సంధాన అని కూడా పిలుస్తారు. నల్లేరు లాభాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.! పట్టణ వాసులతో పోలిస్తే గ్రామీణ వాసులకు చాలా వరకు వీటిపై అవగాహన ఉంటుంది. గుబురు పొదల్లో, డొంకల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ కాడల్ని పాదుల మధ్య అక్కడడక్కడ వేస్తారు. తొండలు, ఉడతలు కూరగాయల పిందెల్ని కొరికేయకుండా ఇలాంటి జాగ్రత్త తీసుకుంటారు. ఎందుకంటే దీని కోసినా, కొరికినా దురద వస్తుంది. నల్లేరుతో వంటలు అలా కూరగాయల పాదులపై వేసిన కాడలే.. వాటంతట అవే క్రమేపీ విస్తరించి అల్లుకుపోతాయి. ఇది వంట ఇంటిలోకి కూడా చేరింది. అయితే నల్లేరును కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే దురద రాదు. నల్లేరు తీగలోని లేత కణుపులు కోసి వాటి నారను తీసి పచ్చడి, పప్పు, కూర చేసుకుంటారు. దీనిని కాడలతో పులుసు పచ్చడి చేసుకొని చాలా ప్రాంతంలో తింటారు. వీటి కాడల్ని శుభ్రం చేసి నీడలో ఎండబెట్టి దంచి పొడిగా చేసుకుని భద్రపరచుకొని, వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. ఒకవంతు నల్లేరు గుజ్జుకు మూడు రెట్లు బియ్యం కలిపి తగినన్ని నీరు పోసి మెత్తగా నూరుకోవాలి. దీనిని రొట్టెలా తయారు చేసుకుని తింటే కొండ నాలుక రావడం, కోరింత దగ్గు తగ్గుతుంది. ఔషధ గుణాలు ఆస్థియో పోరోసిస్ ,ఎముకలు గుల్ల బారడం , ఎముకలు విరగడం లాంటి సమస్యలకు చక్కని ఔషధం నల్లేరు. నల్లేరులో కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సీ, కాల్షియమ్, సెలీనియమ్, క్రోమియం, విటమిన్ బి, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నల్లేరు ఎముకల దృఢత్వాన్ని పెంచటమే కాకుండా ప్రక్కన వుండే కండరాల కూడా శక్తినిస్తుంది. ఎముకలు సులభంగా అతుక్కుంటాయి. దీనిలో నొప్పి నివారణ గుణాలు అధికంగా ఉన్నాయి. ఆస్ప్రిన్ మాత్రకి సమానంగా ఉండే ఇందులోని ఔషధగుణం నొప్పి నివారణకు బాగా ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడతారు. నల్లేరులో యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. నల్లేరు రసంతో రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు. మహిళల్లో మెనోపాజ్ లక్షణాల్లోముఖ్యమైన ఎముకల బలహీనత చాలా ముఖ్యంది చెబుతారు. నల్లేరులో పీచు అధికంగా ఉండటం వలన పైల్స్ సమస్యను తగ్గిస్తుంది. నల్లేరు రసంలో నెయ్యి, పంచదార కలిపి తాగితే పీరియడ్స్‌కు సంబంధించిన దోషాలు తొలగిపోతాయట. అంతేకాదు ప్లాస్టిక్ నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. -
ఆహారంపై తగ్గుతున్న వ్యయం
సాక్షి అమరావతి: దేశంలో ప్రజల సంపాదన పెరిగినప్పటికీ.. అందులో ఆహారంపై కాకుండా ఇతర రంగాలపై ఎక్కువ వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొందని కేంద్ర గణాంక శాఖ తేల్చింది. దీంతో కడుపు నిండా పౌష్టికాహారం తినలేకపోతున్నారని వెల్లడించింది. కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్లే ఆహారంపై పెట్టే ఖర్చు తగ్గిపోతోందని తెలిపింది. గత రెండు దశాబ్దాలుగా దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల ఆహార అలవాట్లలో భారీ మార్పులు వచ్చాయని వివరించింది. ఫాస్ట్ఫుడ్స్తోపాటు అనారోగ్యానికి దారితీసే ఆహారాన్ని తీసుకోవడం పెరిగిపోతోందని, దీంతో దేశంలో ఊబకాయం సమస్య పెద్ద ఎత్తున తలెత్తుతోందని స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలో ఆహార, పౌష్టికాహార భద్రతపై అధ్యయనం చేసిన కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఇటీవల కేంద్రానికి నివేదిక సమర్పించింది. అధ్యయనంలో వెల్లడైన అంశాలు.. - దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ నెలవారీ ఆదాయంలో 49 శాతం ఆహార పదార్థాలపై, మిగతా 51 శాతం ఇతర రంగాలపై వ్యయం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయంలో ఆహారంపై 39 శాతమే ఖర్చు పెడుతుండగా మిగతా మొత్తాన్ని ఇతర రంగాలకు కేటాయిస్తున్నారు. - గ్రామాల్లో పేదలకు రోజుకు 2,155 కిలో కేలరీల ఆహారానికి గాను 1,811 కిలో కేలరీలే లభ్యమవుతోంది. పట్టణాల్లో పేదలకు రోజుకు 2,090 కిలో కేలరీల ఆహారానికి గాను 1,745 కిలో కేలరీల ఆహారమే లభిస్తోంది. - 1972–73 నుంచి 2011–12 మధ్య కాలంలో ఆహారంపై పెట్టే వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 40 శాతానికి తగ్గిపోయింది. ఇదే సమయంలో ఆహారేతర వ్యయం బాగా పెరిగిపోయింది. - 2004–05 నుంచి 2011–12 మధ్య కాలంలో ఆహారంపై వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం మేర.. పట్టణ ప్రాంతాల్లో 8 శాతం మేర తగ్గిపోయింది. - గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయంలో ఆహారంపై తలసరి వ్యయం రూ.902 ఉండగా ఇతర రంగాలపై రూ.852 ఉంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఆహారంపై నెలవారీ ఆదాయంలో తలసరి వ్యయం రూ.1,336 ఉండగా, ఇతర రంగాలపై రూ.1,549 ఉంది. - ఆహార అలవాట్లలో మార్పు కారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు ప్రొటీన్లతో కూడిన శక్తిమంతమైన ఆహారం అందడం లేదు. - ఇక పేద కుటుంబాలు నెలవారీ ఆదాయంలో ఆహారంపై గ్రామీణ ప్రాంతాల్లో రూ.588 వ్యయం చేస్తుండగా ఇతర రంగాలపై రూ.395 వ్యయం చేస్తున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో పేదలు నెలవారీ ఆదాయంలో ఆహారంపై రూ.655, ఇతర రంగాలపై రూ.589 ఖర్చు పెడుతున్నారు. పోషకాలతో కూడిన పంటలను ప్రోత్సహించాలి రైతులు మరింత పోషకాలతో కూడిన పంటలను పండించేలా ప్రోత్సహించాలని కేంద్ర గణాంక శాఖ తన నివేదికలో ప్రభుత్వానికి సూచించింది. చిరుధాన్యాలు, సోయాబీన్స్ పంటలను ప్రోత్సహించేందుకు వాటికి మద్దతు ధరలను ప్రకటించడమే కాకుండా సబ్సిడీలను అందించాలని సిఫార్సు చేసింది. ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించడంతోపాటు తక్కువ వ్యయంతో అధిక ఉత్పాదకతను సాధించే సాంకేతిక పరిజ్ఞానాలను రైతులకు అందించాలని ప్రతిపాదించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పోషకాలతో కూడిన ఆహార ధాన్యాలను ప్రజలకు అందించాలంది. -
ప్రజారోగ్యం సవాళ్లను అధిగమించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం విషయంలో దేశం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లను అధిగమించాలంటే వ్యవసాయ, పోషకాహార శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. దేశం ఆర్థికంగా ఎదుగుతోన్న ఈ తరుణంలోనూ కొంతమంది పోషకాహార లోపాలు, సూక్ష్మ పోషకాల లేమి, ఊబకాయం వంటి అధిక పోషణ సమస్యలు కలిగి ఉండటం బాధాకరమన్నారు. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఎన్ఐఎన్ విశేష సేవలు అందించిందన్నారు. జనాభా పెరుగుదల, మారుతు న్న జీవనశైలుల నేపథ్యంలో అందరికీ పౌష్టికాహారం అందుబాటులో ఉండేలా ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్నారు. ఇందుకోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు వరి సాగు స్థానంలో ఇతర పోషకాలు అందించే పంటలపై పరిశోధనలు ఎక్కువ చేయాలన్నారు. జీవనశైలి మార్పుల వల్ల వస్తున్న ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఉచిత రుణమాఫీపై అభ్యతరం.. రైతులను ఆదుకునే పేరుతో కొన్ని ప్రభుత్వాలు ఉచిత రుణమాఫీలు ప్రకటిస్తుండటంపై ఉపరాష్ట్రపతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉచిత పథకాలు రైతులకు తాత్కాలిక ఉపశమనం కలిగించినా శాశ్వత పరిష్కారం మాత్రం కాదని తెలిపారు. సుస్థిర అభివృద్ధి కోసం దీర్ఘకాల పరిష్కారాలు అవసరమని, మరీ ముఖ్యంగా ఆహార రంగంలో ఈ అవసరం ఎక్కువగా ఉందన్నారు. ఆరోగ్యకరమైన భోజనంలో ఎలాంటి ఆహారం ఉండాలన్న అంశంపై ఎన్ఐఎన్ సిద్ధం చేసిన సమాచారాన్ని ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. కార్యక్రమంలో భారత వైద్య పరిశోధన సమాఖ్య డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ, ఎన్ఐఎన్ డైరెక్టర్ హేమలత పాల్గొన్నారు. -
పౌష్టికాహారానికి కొత్త రూపు..
పౌష్టికాహార లోపం తీవ్రమైన సమస్య. చాలామంది పసిపిల్లలు వయసుకు తగ్గట్టుగా ఎదగలేకపోతున్నారు కూడా. ఈ నేపథ్యంలో సముద్రంలోనే అత్యంత పుష్టికరమైన ఆహారాన్ని పండించి అందించేందుకు సిద్ధమవుతోంది అమెరికాలోని ఓ స్టార్టప్ కంపెనీ. సముద్రంలో పెరిగే అనేకానేక మొక్కల్లో ‘కెల్ప్’ ఒకటి. అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు, ఒమేగా –3 కొవ్వులు కలిగి ఉండే ఈ మొక్కలతో రుచికరమైన వంటకాలు తయారుచేసి అమ్మేందుకు అకువా అనే సంస్థ కిక్‌స్టార్టర్‌లో నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తోంది. కెల్ప్ ఎంత పుష్టికరమైందంటే... పాలలో ఉండే కాల్షియం కంటే పది రెట్లు ఇందులో ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు విటమిన్ ఏ, బి1, బి2, సి, డి, ఈ లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అకువా జెర్కీ పేరుతో రానున్న కెల్ప్ వంటకాలలో కొంతవరకూ చక్కెర కూడా ఉంటుంది. ఈ కెల్ప్ మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి. రోజుకు అడుగు కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి. ప్రస్తుతం అకువా జెర్కీ మూడు రకాల రుచుల్లో లభిస్తోంది. ఒకటి సముద్రపు ఉప్పు రుచిలో ఉంటే.. రెండోది నువ్వుల రుచి.. మూడోది నిప్పులపై కాల్చిన రుచిలోను ఉన్నాయి. -
‘గోవాడ’ను బాబు అమ్మజూశారు
వైఎస్ జీవం పోశారు వడ్డాదిలో వైఎస్ విజయమ్మ చోడవరం, న్యూస్‌లైన్: గోవాడ సుగర్ ప్యాక్టరీని చంద్రబాబు అమ్మేయాలని ప్రయత్నించారని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది శనివారం జరిగిన ప్రచార సభలో ఆమె మాట్లాడారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు రైతులను పూర్తిగా విస్మరించారని, ఇప్పుడు వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. సహకార సుగర్ ఫ్యాక్టరీలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. రాజశేఖరరెడ్డి వచ్చి ఫ్యాక్టరీలకు జీవం పోశారని చెప్పారు. జగన్‌బాబు కూడా తండ్రి ఆశయ సాధనలో రైతులకు అండగా ఉంటారన్నారు. ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్ మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉండే జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో కీలకపాత్ర పోషించిన టీడీపీ నాయకులు ఇప్పుడు జిల్లాను ముక్కలు చేస్తానని ప్రకటనలు చేస్తున్నారని పరోక్షంగా అవంతి శ్రీనివాస్‌పై ధ్వజమెత్తారు. చోడవరం అభ్యర్థి ధర్మశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా సొంత ప్రయోజనాల కోసమే పాకులాడిన టీడీపీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ మహానేత తనయుడ్ని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీనాయుడు మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడమే బాబు ధ్యేయమన్నారు. అనంతరం విజయమ్మ సమక్షంలో చోడవరం మండలం శ్రీరాంపట్నం సర్పంచ్ పండూరి సత్యవతి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించండి దేవరాపల్లి సభలో విజయమ్మ మాట్లాడుతూ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ను, మాడుగుల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బూడి ముత్యాలునాయుడును గెలిపించి రాజ న్న రాజ్యాన్ని తిరిగి తీసుకురావాలని కోరారు.