ఇంతవరకు మనం రకరకాల నూనెలు వినియోగిస్తున్నాం. అలాగే ఒకే రకం నూనెను వాడకూడదని పోషకాహార నిపుణులు చెప్పడంతో మనం సన్‌ఫ్లవర్, వేరుశెనగా అంటూ నూనెలు మారుస్తున్నాం కూడా. కానీ పోషకాహార శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఈ శుద్ధి చేసిన నూనెల కంటే ఆ నూనె బెటర్ అని తేలింది. ఈ నూనెని వినియోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని అంటున్నారు. ఇంతకీ ఏంటా నూనె అంటే..
శుద్ధి చేసిన నూనెల కంటే ఆవాల నూనె మంచిదని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పోషకాహార శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంపద్రాయ ఆవాల నూనె వాడటమే మంచి నొక్కి చెప్పారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌కి చెందని పోషకాహార శాస్త్రవేత్త మోనికా చౌదరి మాట్లాడుతూ.."మునుపటి అధ్యయనంలో సాంప్రదాయా ఆవాల నూనెతో పోలిస్తే శుద్ధి చేసిన నూనెలే ఆరోగ్యానికి మంచిదని తేలింది. కానీ కాలక్రమేణ ఎలుకలపై జరిపిన అధ్యయనంలో అది తప్పు అని నిరూపితమయ్యింది. ఆవ నూనెలో దాదాపు 35-48% ఎరుసిక్ యాసిడ్ ఉంటుందని గత అధ్యయనాలు పేర్కొన్నాయి.
అలాగే శుద్ధి చేసిన నూనెల్లో చమురు కంపెనీ ఎరుక్ యాసిడ్ అధిక మొత్తంలో వినియోగిస్తున్నాయని ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటూ తెగ ప్రచారం చేయడం జరిగింది. కానీ ఇటీవల ఎలుకలపై జరిపిన అధ్యయనంలో మానవులకు ఎరుసిక్ ఆమ్లాల ప్రభావం ఉండదని తేలింది. మొత్తం శరీరం బరువులో ఎరుసిక్ యాసిడ్ కిలోకు 7.5ఎంజీ అనుమతించదగినది అన్నారు. ఇక ఈ ఆవా నూనెలో కేవలం 2% కంటే తక్కువ ఎరుసిక్ యాసిడ్‌ని కలిగి ఉంటాయని, అందువల్ల ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని". చెబుతున్నారు.
అలాగే ఆరోగ్యకరమైన నూనె అంటే కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్ రహితంగా ఉండాలి. పైగా సంతృప్త కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉండి, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ ఆవాల నూనెలో ఉంటాయని అన్నారు. ఇంతవరకు మంచివని చెప్పుకున్న శుద్ధి చేసిన నూనెల్లో ఒమేగా 6 కొవ్వు ఆమ్మాలు అధికంగా ఉంటాయని, ఇవి దీర్ఘకాల నిల్వకు ఉపయోగపడతాయని అన్నారు. అయితే ఇలాంటి నూనెలు తీసుకోవడం వల్ల శరీరంలో ఒమేగా 6, ఒమేగా 3 నిష్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. ఇలా చాలా స్థానికేతర నూనెల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల చాల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల సాంప్రదాయ నూనెలను తీసుకోవడమే మంచిదని సూచించారు.
అందులోనూ ఆవాల నూనె ఇంకా మంచిదని చెబుతున్నారు. అలాగే ఆ శుద్ధి చేసిన నూనెల్లో ఉన్న మరో సమస్య పొగ పాయింట్ అని చెప్పారు. ఇక్కడ నూనెలను వేడిచేసినప్పుడల్లా.. అవి పొగ , ఆవిరిని ఉత్పత్తి చేసే సమయంలో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు (PUFA) ఫ్రీ ఫ్యాటీ యాసిడ్‌లుగా విడిపోవడం జరుగుతుంది. ఇలాంటి నూనెలో వేయించిన పదార్థాలను తినడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి.
అవి కాలక్రమేణ కేన్సర్ కారకాలుగా మారి వివిధ రకాల కేన్సర్‌లకు దారితీస్తుంది. అయితే సాంప్రదాయ నూనెల్లోనూ, ఆవాల నూనెలను మరిగించినప్పుడూ వాటిలో అధిక పొగ పాయింట్ ఉంటుంది. ఇది కొవ్వు ఆమ్లాలను ఫ్రీ ఫ్యాటీ యాసిడ్‌లుగా విడిపోవడాన్ని నిరోధిస్తుందని, అందువల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని వివరించారు. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆవాల నూనెను వాడమని పదేపదే నొక్కి చెబుతున్నారు పోషకాహార శాస్త్రవేత్తలు.
(చదవండి: స్నేహితుడిలా ఉండే ఏఐ ఆధారిత నెక్లెస్..ధర ఎంతంటే..!)
Comments
Please login to add a commentAdd a comment