ఆ గుహ సమీపానికి వచ్చారో అంతే..! | Scientists Unravel The Mystery Of The Ancient Roman Gate To Hell | Sakshi
Sakshi News home page

ఆ గుహ సమీపానికి వచ్చారో అంతే..! శాస్త్రవేత్తలకే అంతుపట్టని మిస్టరీ అది..

Published Sun, Mar 16 2025 9:29 AM | Last Updated on Sun, Mar 16 2025 10:36 AM

Scientists Unravel The Mystery Of The Ancient Roman Gate To Hell

గోపాలుడి నగరం ద్వారక సముద్రగర్భంలో ఉన్నట్లే, నరకానికి ప్రవేశమార్గం భూమి మీదనే ఉన్నట్లు పురాతత్త్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టర్కీలోని హిరాపోలిస్‌ నగరంలో ఈ మధ్యనే ‘గేట్‌ టు హెల్‌’ అనే నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు రెండువేల సంవత్సరాల క్రితం, గ్రీకు మరణ దేవుడు ‘ఫ్లూటో’కు ఈ ప్రదేశంలోనే జంతుబలులు సమర్పించేవారని ఇక్కడ దొరికిన ఆధారాల ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు. 

క్షుద్ర పూజలకు, ఇతర భయానక క్రతువులకు కూడా ఈ ప్రదేశాన్నే ఉపయోగించేవారని వారు చెప్పారు. పైగా, ఈ ప్రాంత ముఖద్వారం సమీపానికి జంతువులు, పక్షులు వెళ్లినట్లయితే, అవి వెంటనే ప్రాణాలు కోల్పోవటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఆ ప్రదేశాన్ని స్థానికులు అందరూ నిజమైన నరకద్వారంగా నమ్ముతున్నారు. 

మరికొందరు పరిశోధకులు మాత్రం, ఒకప్పటి అగ్నిపర్వతానికి చెందిన ప్రాణాంతక వాయువులు గుహ లోపల నిండి ఉన్నాయని, ఈ వాయువుల కారణంగానే మూగజీవులన్నీ దీని సమీపానికి రాగానే మరణిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. అసలు నిజం ఇంకా తేలాల్సింది ఉంది.   

(చదవండి:           

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement