hell
-
ట్రంప్‌కు గిఫ్ట్‌గా.. భూమ్మీద నరకం..?
ఎల్ సాల్వడార్ మహా కారాగారం... ప్రపంచంలోనే అత్యంత అధ్వాన జైలుగా ‘అప్రసిద్ధి’. ఖైదీలు ఈ జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడం అసంభవం. 60 ఏళ్లు మొదలుకొని వెయ్యేళ్లకు పైగా కారాగారవాస శిక్షలు పడిన ఖైదీలు ఇక్కడ ఉంటారు. వెయ్యి మంది అధికారులు, 600 మంది సైనికులు, 250 మంది పోలీసులు ఈ జైలును పర్యవేక్షిస్తుంటారు. స్టీలుతో పెట్టెల్లా తయారుచేసిన బోనుల్లాంటి నాలుగు అరల పడకల్లో (మెటల్ బంక్ బెడ్స్) ఖైదీలు దాదాపు రోజంతా మోకాళ్లపై వంగి కూర్చోవాలి లేదా చతికిలబడి కూర్చోవాలి. పరుపులు ఉండవు. వారు గుసగుసలాడుకోవాల్సిందే తప్ప పెద్దగా మాట్లాడుకునేందుకు అనుమతించరు. భోజనంగా మూడు పూటలా వరి అన్నం, బీన్స్, పాస్టా, ఉడికించిన గుడ్డు పెడతారు. మాంసం వడ్డించరు.ఎల్ సాల్వడార్లో 1990వ దశకం చివర్లో ఎంఎస్-13, బారియో 18 అనే రెండు గ్యాంగులు మాదకద్రవ్యాల వ్యాప్తి, బలవంతపు వసూళ్లతో చెలరేగాయి. పరస్పరం ప్రత్యర్థులైన ఈ రెండు ముఠాలు దేశాన్ని వణికించాయి. అయినా ప్రస్తుతం జైల్లో మాత్రం ఈ రెండు గ్రూపుల సభ్యుల్ని కలిపే ఉంచుతున్నారు. గ్వాంటనామో బే కారాగారం కంటే ఇక్కడి పరిస్థితులు దారుణంగా ఉంటాయి. శిక్షాకాలం ముగిసినా ఖైదీలను సమాజంలోకి విడిచిపెట్టరు. వారు బయటి ప్రపంచాన్ని చూసే అవకాశమే లేదు. ఒకరకంగా చెప్పాలంటే వారు జీవచ్ఛవాలు! తమ దేశంలో హింసకు పాల్పడే ఖైదీలను ఎల్ సాల్వడార్ జైలుకు తరలించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదన అనైతికమని, న్యాయసమ్మతం కాదని ఆయన రాజకీయ విరోధులు విమర్శిస్తున్నారు. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రశాంత నియంత’ (వరల్డ్స్ కూలెస్ట్ డిక్టేటర్) గా తనను తాను అభివర్ణించుకునే ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నాయిబ్ బుకేలే మాత్రం తమ జైలు సేవలకు ప్రతిగా అమెరికా అందించే ‘ఆఫర్’ కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. ఇంతకీ అమెరికా ఆఫర్ ఏమిటి? ఏ రూపంలో? ఎంత? వివరాలు బయటికి రాలేదు! -
'నరకం' చూపించిన ఏఐ.. భయపడని వారే వీడియో చూడండి!
స్వర్గం, నరకం ఉన్నాయో.. లేదో తెలియదు!.. కానీ దశాబ్దాల క్రితం గరుడు పురాణం చదివి ఇలా ఉంటుందని కొందరు ఊహించుకుని ఉండొచ్చు. ఆ తరువాత తరం వాళ్ళు సినిమాలు చూసి ఇలాగే ఉంటాయని భావన పొంది ఉండవచ్చు. అయితే నేడు టెక్నాలజీ బాగా పెరిగింది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అభివృద్ధి చెందిన తరుణంలో ఏ ప్రశ్నకైనా.. ఇదిగో సమాధానం అన్నట్టు తయారైపోయింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి నరకం ఎలా ఉంటుందని 'ఏఐ'ను అడిగారు. దీనికి కూడా ఏఐ ఓ వీడియో క్రియేట్ చేసింది.ఏఐ చూపించిన నరకం వీడియోను హిస్టారిక్ వీడియోస్ వారు తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియో షేర్ చేస్తూ.. నరకం చూపించమని ఏఐను అడిగాను' దానికి సమాధానంగా ఈ వీడియో వచ్చిందని పేర్కొన్నారు.18 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఇందులో లెక్కకు మించిన చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుడు ఆ మధ్యలోకి ఒక శరీరం పడుతుంది. ఆ తరువాత ఆ శరీరం ముఖం ఆకృతి వక్రంగా మారుతుంది. ఒకేసారి నోటి నుంచి చేయి బయటకు వచ్చినట్లు కూడా కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్నంత సేపు తప్పకుండా భయం పుడుతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. ఒకరు ఏఐను ఇలాంటి వింత ప్రశ్నలు కూడా అడుగుతారా? అని అన్నారు. మరొకరు రోజూ పబ్లిక్ బస్సులో వెళుతుంటే ఇలాంటి అనుభవమే ఎదురవుతుందని అన్నారు. మొత్తం మీద ఏఐ నరకం చూపించిందని చెబుతున్నారు.Asked Al to show "Hell' pic.twitter.com/XxoHVE9HKu— Historic Vids (@historyinmemes) April 3, 2024 -
బంధించారు.. కర్రలతో కొట్టారు.. నరకం కనిపించింది!
టెల్ అవీవ్: 17 రోజులుగా తమ చెరలో ఉన్న యోచెవ్డ్ లిఫ్షిట్జ్(85), నురిట్ కూపర్(79) అనే ఇద్దరు మహిళలను హమాస్ మిలిటెంట్లు సోమవారం విడుదల చేశారు. మానవతా దృక్పథంతోపాటు వృద్ధాప్యంలో ఉన్న వారిద్దరి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విడుదల చేసినట్లు తెలిపారు. స్నేహితులైన వారిద్దరూ ఇజ్రాయెల్–గాజా సరిహద్దు లోని కిబుట్జ్ నిర్ ఓజ్ నివాసితులు. మంగళవారం టెల్ అవీవ్‌కు చేరుకున్నారు. మిలిటెంట్ల అధీనంలో తనకు ఎదురైన అనుభవాలను యోచెవెడ్ లిఫ్షిట్జ్ మీడియాతో పంచుకున్నారు. ‘ఈ నెల 7న మిలిటెంట్లు నన్ను బంధించారు. మోటార్‌బైక్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. ప్రతిఘటించినందుకు కర్రలతో కొట్టారు. రోదించినా పట్టించుకోలేదు. గాజాకు బలవంతంగా తరలించారు. ఒక సొరంగంలోకి తీసుకెళ్లారు. భూగర్భంలో సాలెగూళ్లలాంటి సొరంగాలు ఉన్నాయి. మేము వెళ్లేసరికి డాక్టర్లు, వైద్య సిబ్బంది అక్కడున్నారు. తాము ఖురాన్‌ను విశ్వసిస్తామని, ఎలాంటి హాని కలిగించబోమంటూ మిలిటెంట్లు మాతో చెప్పారు. డాక్టర్లు మాకు వైద్య సేవలు అందించారు. కావాల్సిన ఔషధాలు ఇచ్చారు. సొరంగాలు తడిగా, తేమగా ఉన్నాయి. అక్కడ పారిశుధ్య సౌకర్యాలు ఫరవాలేదు. మాకు ఎలాంటి అస్వస్థత కలగలేదు. పరుపులపై నిద్రించాం. మిలిటెంట్లు మొదట్లో గాజాకు తీసుకెళ్లేటప్పుడు హింసించినా అక్కడికి వెళ్లిన తర్వాత మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఇజ్రాయెల్–గాజా సరిహద్దులో నిర్మించిన రక్షణ కంచె గురించి చెప్పాలి. లక్షల డాలర్లు ఖర్చుచేసి ఇజ్రాయెల్ సైన్యం ఈ నిర్మించిన ఈ కంచెతో ఉపయోగం శూన్యం. దేశానికి అది ఏమాత్రం రక్షణ క ల్పించడం లేదు. అత్యంత ఖరీదైన ఈ ఫెన్సింగ్‌ను మిలిటెంట్లు సులభంగా ధ్వంసం చేసి వచ్చి, మమ్మల్ని అపహరించారు. హమాస్ నుంచి ఎదురవుతున్న ముప్పును ఇజ్రాయెల్ సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అని లిఫ్షిట్జ్ఆక్షేపించారు. లిఫ్షిట్జ్, నురిట్ కూపర్ భర్తలు ఇంకా హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు. -
దేవుడు సృష్టించిన వింతా?
-
కరెంట్ తీగ
ఆనందరావు ఒక ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ చూస్తూనే గుండె ఆగి గుటుక్కుమన్నాడు.అరగంటలోపే పైలోకానికి చేరుకున్నాడు.ఆనందరావుకు అయోమయంగా ఉంది.ఎందుకంటే అక్కడ ఎన్నో నరకాలు ఉన్నాయి.‘‘అయ్యా! ఇన్ని నరకాలు ఉన్నాయేమిటి?’’ అడిగాడు ఆనందరావు.‘‘రకరకాల దేశాలు ఉన్నట్లే... ఇక్కడ దేశానికొక నరకం ఉంటుంది. అదిగో అక్కడ కనిపిస్తున్నది అమెరికా నరకం... అటు వైపు కనిపిస్తున్నది చైనా నరకం... ఇటు వైపు ఉన్నది ఇండియా నరకం... దాని పక్కన ఉన్నది పాకిస్తాన్ నరకం...’’ చెప్పుకుంటూ పోతున్నాడు యమభటుడు.‘‘ప్లీజ్ ఒకసారి అమెరికా నరకం చూపించరా!’’ అడిగాడు ఆనందరావు.‘‘ఇక్కడ కూడా అమెరికా మీద మోజు పోలేదు’’ అని విసుక్కున్నాడు యమభటుడు.‘‘ఒకే ఒక్కసారి ప్లీజ్’’ బతిమిలాడుకున్నాడు ఆనందరావు.‘‘సరే పదా’’ అంటూ ఆనందరావును అమెరికా నరకానికి తీసుకెళ్లాడు యమభటుడు.నరకంలో సెంట్రల్ ఏసీ... హాయిగా ఉంది.ఒక గోడపై నరకానికి లేటెస్ట్గా వచ్చిన సెలబ్రిటీల ఫోటోలు కనిపిస్తున్నాయి.మరోగోడపై నీతి వాక్యాలు కనిపిస్తున్నాయి...‘నరకం నరకం అని భయపడతాంగానీ... నాలుగురోజులు ఉంటే అదే స్వర్గం అయిపోతుంది’‘బాధే సౌఖ్యమనే భావన రానీయండి... నరకలోక సౌఖ్యాలను ఆస్వాదించండి’‘‘నార్త్ కొరియా నరకాన్ని చూస్తావా?’’ అడిగాడు యమభటుడు.‘‘తప్పకుండా’’ అన్నాడు ఆనందరావు.నార్త్ కొరియా నరకంలో...ఎవరూ కనిపించడం లేదు.ఒక వ్యక్తి మాత్రం ఏదో నవల చదువుతూ కూర్చొని ఉన్నాడు.‘‘నార్త్ కొరియా నరకంలో మీరు తప్ప ఎవరూ లేరు ఏమిటి?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఆనందరావు.‘‘నేను నరకానికి వచ్చిన వాడిని కాదు. ఈ నరకానికి సీఈవోను’’ అన్నాడు ఆ వ్యక్తి గంభీరంగా.‘‘మరి మీరు తప్ప ఎవరూ కనిపించడం లేదేమిటి?’’ ఆసక్తిగా అడిగాడు ఆనందరావు.‘‘పేరుకు ఇది నరకమే కాని, మా ప్రధాన నరకం ‘ఉత్తర కొరియా’ అనే పేరుతో భూలోకంలోనే ఉంది. అక్కడ అంత పెద్ద నరకాన్ని విడిచి ఇక్కడికి రావాల్సిన పనేముంది? అందరితో పాటు మా నరకం కూడాఉండాలనే ఉద్దేశంతో పెట్టామే తప్ప...అసలు మా నరకం భూలోకంలోనే ఉంది. హ్యాట్సాప్ టూ...ప్రెసిడెంట్ కిమ్ జోంగ్–ఉన్’’ అని వివరించాడు నార్త్ కొరియా నరక సీఈవో. ‘‘ఇక్కడ ఉన్న నరకాల్లో ఏ నరకానికి వెళ్లాలనుకుంటున్నావు?’’ అడిగాడు యమభటుడు.‘‘అరే, ఈ ఛాయిస్ కూడా ఉందన్నమాట’’ ఆశ్చర్యపోయాడు ఆనందరావు.‘‘కాస్త ఖర్చువుతుందంతే’’ అని సిగ్గుతో మెలికలు తిరిగాడు యమభటుడు.‘‘ఏ దేశ నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో చెప్పు... తక్కువ శిక్షలు ఉన్న దేశాన్ని ఎంచుకుంటాను. డబ్బు ఎంతైనా సరే’’ అన్నాడు ఆనందరావు.‘‘అలాగే’’ అంటూ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు యమభటుడు...‘‘ముందు అమెరికా నరకం తీసుకుందాం... మార్నింగ్ లేవగానే ఎలక్ట్రికల్ బ్రష్ చేతికి ఇస్తారు. దాంతో పండ్లు తోముకోవాలి.పండ్లను ఎవరో తాళ్లతో కట్టి లాగేస్తున్నంత బాధ ఉంటుంది!ఆ తరువాత ఎలక్ట్రికల్ చైర్‌పై కూర్చో పెట్టి ‘షాక్ బాత్’ చేయిస్తారు. ఆ షాక్ తట్టుకోలేక పెడబొబ్బలు పెట్టాల్సిందే!ఆ తరువాత ఎలక్ట్రికల్ పియానో ముందు కూర్చోపెడతారు. ఈ పియానో ప్రత్యేకత ఏమింటే... దీనిలో ప్రతి కీ షాక్ కొడుతుంది... అలా షాక్ కొట్టించుకుంటూనే వాయించాల్సి ఉంటుంది. ఆ బాధ వర్ణనాతీతం! ఆ తరువాత చెవిలో రెండు కరెంట్ తీగలు దూరుస్తారు. చెవుల్లో వేడి లావా వ్రహిస్తున్ననట్లు...యమ బాధ...ఆ తరువాత ‘ఎలక్ట్రికల్ ర్యాంప్ వాక్’ ఉంటుంది.అరగంట పాటు కరెంటు తీగల మీద వాక్ చేయాల్సి ఉంటుంది. అమ్మో ఆ బాధ వర్ణనాతీతం! ఇక లాస్ట్...ఎలక్ట్రికల్ బెడ్లో పడుకో పెడతారు...నిద్ర సంగతి సరే... ఆ షాక్‌లు భరించడం ఎవరివల్లా కాదు...’’ చెప్పుకుంటూ పోతున్నాడు యమభటుడు.‘‘మరి చైనా సంగతి?’’ అడిగాడు ఆనందరావు.‘‘పొద్దునే లేవగానే...ఎలక్రికల్ బ్రష్ చేతిలో పెడతారు. ఆ తరువాత...ఎలక్ట్రికల్ చైర్‌పై షాక్ బాత్ చేయిస్తారు.ఆ తరువాత... ఎలక్ట్రికల్ పియానో ముందు కూర్చోపెట్టి రాగాలు వాయింపజేస్తారు.ఆ తరువాత... కరెంటు తీగలు చెవుల్లో దూరుస్తారు.ఆ తరువాత... ఎలక్ట్రికల్ ర్యాంప్ వాక్ చేయిస్తారు.ఆ తరువాత... ఎలక్ట్రికల్ బెడ్ మీద పడుకోబెడతారు...’’ చెప్పాడు యమభటుడు.‘‘అమెరికాకు, చైనాకు పెద్ద తేడా లేదే...మరి బ్రిటన్ సంగతి?’’ అడిగాడు ఆనందరావు.‘‘సేమ్ టు సేమ్ శిక్షలు! అన్ని దేశాల నరకాల శిక్షలూ ఒకేలాగుంటాయి’’ చెప్పాడు యమభటుడు.‘‘ఏమయ్యా... ప్రతి దేశ నరకంలోనూ ఒకేరకమైన శిక్షలు అమల్లో ఉన్నాయి. దీంట్లో ఎంచుకోవడానికి ఏముంది నా బొంద!’’ అని బాధ పడిపోయాడు ఆనందరావు.ఇంతలో ఆనందరావు బుర్ర ‘ఐడియా గురూ!’ అని ఠంగుమని మోగింది.‘‘నీ ల్యాప్‌టాప్ ఒక అయిదు నిమిషాలు ఇస్తావా?’’ అని యమభటుడి దగ్గరి నుంచి ల్యాప్‌టాప్ తీసుకున్నాడు ఆనందరావు.‘‘యమా! ఎంత ఖర్చయినా ఫరవాలేదు...నేను పాకిస్తాన్ నరకంలో ఉండాలనుకుంటున్నాను’’ అన్నాడు ఉత్సాహంగా ఆనందరావు.‘‘విక్రమార్కా! ఇప్పుడు చెప్పు...ఆనందరావు పాకిస్తాన్ నరకాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు? ఈ ప్రశ్నకు తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీ తల వెయ్యి వక్కలవుతుంది’’ అని బెదిరించాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు.‘‘జవాబు చాలా సింపుల్ భేతాళా! ప్రతి దేశ నరకంలోనూ శిక్షలన్నీ... కరెంట్‌తోనే ముడిపడి ఉన్నాయి.దీంతో ఆనందరావుకి ఒక ఐడియా వచ్చింది. ప్రపంచంలో కరెంట్‌కోత ఎక్కువగా ఉన్న దేశం ఏమిటి? అని నెట్లో కొడితే...పాకిస్తాన్ పేరు వచ్చింది. ఎన్ని ఎలక్ట్రికల్ శిక్షలు ఉంటే మాత్రం ఏమిటి? కరెంటే లేనప్పుడు!!’’ – యాకుబ్ పాషా -
రెండు డాలర్లంత వర్షం
ముసలి రెమిజియా గుర్రపు వీపును గట్టిగా కరచుకుని తన చిన్న ముఖాన్ని పైకెత్తుతూ ‘‘నరకంలో ఆత్మల కోసం ఇదిగో నా దమ్మిడీ. ఇక వర్షం పడుతుంది ఫెలిపా’’ అన్నది.ఫెలిపా చుట్ట తాగుతూ ఏ జవాబు ఇవ్వలేదు. కరువు గురించి ఎన్నో శోకాలను విన్నది ఆమె. అంతిమంగా చెయ్యి పైకెత్తి ఆకాశాన్ని ఒక కొస నుంచి మరో కొస వరకు పరీక్షగా చూసింది. ఆకాశం నిర్మలంగా ఉంది. ఒక్క మబ్బు కూడా లేదు. ఆకాశపు తెల్లదనం రెమిజియాకు ఆగ్రహాన్ని తెప్పించింది. ‘‘మన బ్రతుకులు అంతమయ్యే రోజు వచ్చింది రెమిజియా’’ అన్నది ఫెలిపా.పంటల్ని నాశనం చేస్తూ కరువు ప్రారంభమైంది. నిరాశ నిండిన ఎన్నో కుటుంబాలు పొలాలను వదిలేసి తమ గుర్రాల మీద ఎక్కి వర్షాభావం లేని ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్లిపోయారు.కాని వృద్ధులైన రెమిజియా అందుకు నిరాకరించింది ఏదో ఒకరోజు వర్షం వస్తుందనీ. తన కొడుకును స్ట్రెచర్ మీద తీసుకెళ్తూ మనవడినొక్కడినే తనకు వదిలిన నాటి నుండి రెమిజియా ముభావంగా ఉంటూ పొదుపును అవలంబించసాగింది. తన సొరకాయ బుర్రను కొంత బూడిదతో నింపి ఒకటొకటిగా నాణేలను అందులో వేస్తూ పోయింది. మనవణ్ణి గుండెకు వేలాడదీసుకుని జీవితాన్ని స్వీకరించింది ఆమె. ‘‘నేను బతుకుతున్నది నీ కోసమే బిడ్డా! నువ్వు కూడా నీ తండ్రి లాగా జీవితం కోసం విపరీతమైన తంటాలు పడటం, లేక వయసు మీరకముందే చనిపోవడం నాకిష్టం లేదు’’ అంటుంది ఆమె ఆ పిల్లవాడితో. అంతా సవ్యంగా జరిగిపోతుంది. కానీ కొన్నాళ్ల తరువాత ఎందుకు ఎలా అని తెలియకుండా కరువు వచ్చింది. ఒక నెల వర్షం లేకుండా గడిచింది. తర్వాత రెండు నెలలు, ఆపైన మూడు నెలలు. ఒక్కోసారి ‘నరకంలో ఉన్న ఆత్మల కోసం కొవ్వొత్తుల్ని వెలిగించాలి’’ అంటుంది. కానీ వర్షం కురవలేదు. ఎన్నో కొవ్వొత్తుల్ని వెలిగించినా మొక్కజొన్న చేను వడలిపోయింది. ముసలి రెమిజియా పడక మీదికి పోయి దేవుణ్ని ప్రార్థించింది. నరకంలోని ఆత్మలకు మరిన్ని కొవ్వొత్తుల్ని వెలిగిస్తానని వాగ్దానం చేసి నిరీక్షించింది. ఆమెకు కొండశిఖరాల మీద వర్షం కురుస్తున్న చప్పుడు వినిపించినట్టనిపించింది.ఆశాభావంతో రాత్రి ఆమె నిద్ర పోయింది. కానీ ఉదయం లేచి చూసేసరికి ఆకాశం తెల్లని తాజా దుప్పటిలా ఖాళీగా, నిర్మలంగా ఉంది.జనాలకు ధైర్యం సడలిపోయింది. ఒక చల్లని ఉదయం పూట రొసెండో తన భార్య, ఇద్దరు పిల్లలు, ఆవు, కుక్క, బక్కచిక్కిన గాడిదను తీసుకుని వెళ్లిపోయాడు. సామానంతా గాడిద వీపు మీద తీసుకెళ్తూ ‘‘దీన్ని నేను తట్టుకోలేను రెమిజియా, ఈ ఊరి మీద ఏ దుష్టశక్తివో పాపిష్టి కళ్లు పడ్డాయి’’ అన్నాడు. రెమిజియా గుడిసె లోపలికి పోయి రెండు రాగి నాణాలతో బయటకు వచ్చింది. వాటిని రొసెండోకు ఇస్తూ ‘‘నరకంలోని ఆత్మల కోసం నా పేరు మీద ఈ డబ్బుతో కొవ్వొత్తుల్ని కొని వెలిగించు’’ అన్నది. రొసెండో ఆ నాణాల్ని తీసుకుని, వాటిని చూసి, తలపైకెత్తి ఆకాశాన్ని చాలాసేపు చూశాడు.‘‘నీకు రావాలనిపించినప్పుడు టవేరాకు వచ్చెయ్. అక్కడ మాకు చిన్న భూమి చెక్క దొరికింది. నీకు ఎప్పుడూ మా స్వాగతం ఉంటుంది’’ అన్నాడు. ‘‘నేనిక్కడే ఉంటాను రొసెండో. ఈ కరువు ఇట్లానే ఉండిపోదు’’ అన్నది రెమిజియా.రెమిజియా మనవడు ఎండల ధాటికి నీగ్రో లాగా నల్లబడిపోయాడు.‘‘నానమ్మా! ఒక పంది చచ్చిపోయినట్టుంది’’ అన్నాడు వాడు.రెమిజియా పందుల దొడ్డి వైపు పరుగెత్తింది. ముట్టెలు వడలిపోయి తీగల్లాగా తయారయి పందులు గురగురమంటూ రొద చేస్తూ ఒగరుస్తున్నాయి. అవి అన్నీ ఒకచోట గుమిగూడాయి. వాటిని పక్కకు తరిమి చూడగానే చచ్చిపడి ఉన్న ఒక పంది కనిపించింది ఆమెకు. అది బతికి ఉన్న పందులకు ఆహారంగా పనికి వచ్చిందని ఆమెకు అర్థమైంది. తనే స్వయంగా వెళ్లి నీళ్లు తెస్తే పందులు బతుకుతాయి కనుక అలా చేయాలని నిశ్చయించుకున్నది ఆమె.సూర్యోదయం కాగానే ఆమె ముదురు గోధుమరంగులో ఉన్న తన చిన్న గుర్రాన్ని తీసుకుని బయలుదేరింది. తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నమైంది. సొరకాయ బరువు తగ్గింది. అయినా నరకంలోని ఆత్మలు జాలి చూపుతాయని తను పొదుపు చేసిన డబ్బుల్లో కొంత భాగాన్ని ఆమె వెచ్చించింది. గుర్రానికి శ్రమ ఇవ్వకూడదని ఆమె నడచి వెళ్లటం ప్రారంభించింది.జనాలు ఆ ఊరిని వదిలి వెళ్లటం కొనసాగింది. ప్రతిరోజూ ఒక గుడిసె ఖాళీ అవుతోంది. నేల బూడిదరంగుకు మారి దాని మీద పగుళ్లు కనబబడసాగినై.రెమిజియా ఆశను పోగొట్టుకోలేదు. వర్షం వచ్చే సూచనల కోసం ఆమె ఆకాశాన్ని పరీక్షగా చూసింది. తన మోకాళ్ల మీద వంగి ‘‘నరకంలోని ఆత్మలారా, మీరు సహాయం చేయకపోతే మేము మాడిపోతాము’’అని వేడుకుంది.కొన్నిరోజుల తరువాత ఒక ఉదయాన గుర్రం తన కాళ్ల మీద నిలబడలేక పోయింది. అదేరోజు మధ్యాహ్నం ఆమె మనవడు జ్వరంతో కాలిపోతూ మంచం పట్టాడు. రెమిజియా ప్రతి గుడిసెకూ పోయింది. చాలా దూరంలో వున్న గుడిసెలకు కూడా వెళ్లింది. ఆ గుడిసెల వాసులతో ‘‘మనం సెయింట్ ఇసిడోరోకు రుద్రాక్ష విత్తుల దండ చేయిద్దాం’’ అన్నది. వాళ్లు ఒక ఆదివారం పొద్దున పెందరాళే బయలుదేరారు. ఆమె తన మనవణ్ణి చేతిలో పెట్టుకొని నడుస్తోంది. పదిహేను ఇరవైమంది పురుషులు, స్త్రీలు ఎండకు నల్లబడిన శిథిల దేహాల పిల్లలు, బంజరు నేలల మీది తోవల మీదుగా సాగిపోతూ శోకాలు పెడుతున్నారు. వాళ్లు మేరీ కన్య బొమ్మను, వెలిగించిన కొవ్వొత్తుల్ని పట్టుకుని నడుమ నడుమ ఆగి మోకాళ్ల మీద వంగుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఒక బక్కపలచని వృద్ధుడు మండే కళ్లతో, నగ్నమైన ఛాతితో, పొడుగుగా పెరిగిన గడ్డంతో వుండి ఆ ఊరేగింపు మొదట్లో నడుస్తున్నాడు ఆకాశం వైపు చూస్తూ...‘సెయింట్ ఇసిడోరో, ఓ కర్షకుడా / సూర్యుణ్ని కప్పేసి వర్షాన్ని తెప్పించు’ అంటూ వేడుకుంటున్నాడు.అందరూ వెళ్లిపోయారు. రొసెండో వెళ్లిపోయాడు. బుద్దిమాంద్యం వున్న తన కూతుర్ని తీసుకుని టోరిబియో వెళ్లిపోయాడు. ఫెలిపె, ఇతరులు, వేరేవాళ్లుఅందరూ వెళ్లిపోయారు. కొవ్వొత్తులు వెలిగించడానికి ఆమె వాళ్లందరికీ డబ్బు ఇచ్చింది. ఆఖరున వెళ్లినవాళ్లు ఎవరో ఆమెకు తెలియదు. వాళ్లు ఒక రోగిష్టి అయిన వృద్ధుణ్ని తీసుకుపోయారు. దుఃఖభారంతోవాళ్లు కుంగిపోయారు. ఇక వర్షం పడుతుందనే ఆశ అందరిలో అడుగంటిపోయింది. ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లేముందు వృద్ధులు ‘దేవుడు ఈ ప్రాంతాన్ని శిక్షిస్తున్నాడు’ అనుకున్నారు.యువకులు, పిల్లలు అక్కడేదో దుష్టశక్తి తనపాడు దృష్టితో కీడు కలిగిస్తున్నదని అనుకున్నారు.రెమిజియా ఆశను వదులుకోలేదు. ఆమె కొన్ని నీటి చుక్కల్ని సేకరించింది. మళ్లీ మొదట్నుంచి ప్రారంభించాలని అనుకున్నదామె. ఎందుకంటే సొరకాయ బుర్ర దాదాపు ఖాళీ అయింది. తన చిన్న తోట లోని భూమి రహదారిలా మారిపోయి అంతటా ధూళి నిండింది.నరకంలోని ఒక మూలలో నడుముల దాక ఉన్న మంటల్లో కాలుతూ ఆ ఆత్మలు పరిశుద్ధమవుతున్నాయి. భూమ్మిద వర్షాన్ని కురిపించి జలమయం చేసే శక్తి ఆ ఆత్మలకే వుండటం విడ్డూరం, వ్యంగ్యభరితం. గడ్డం వున్న ఒక వికృతమైన ముసలి స్త్రీ ఇలా అన్నది ‘‘కారంబా! పోసో హోండో అనే వూళ్లో ముసలి రెమిజియా కొవ్వొత్తుల కోసం రెండు డాలర్లు వెచ్చించింది కాబట్టి అక్కడ వర్షం కురవాలి’’ఆమె సహచరులు అప్రతిభులయ్యారు. ‘‘రెండు డాలరా! అయ్య బాబోయ్’’మరొక ఆత్మ అన్నది ‘‘ఆమెకు ఎందుకు ఇంకా సహాయం అందలేదు. మనుషులతో మనం వ్యవహరించేది ఇలాగేనా’’‘‘ఆమె కోరికను మనం మన్నించాలి’’ అని గర్జించింది మరొక ఆత్మ.‘‘పోసొ హోండోకు రెండు డాలర్లంత వర్షం కురిపించాలి’’ఆ ఆత్మలన్నీ చాలా సంతోషించాయి. ఎందుకంటే వర్షం కోసం అంత పెద్ద మొత్తాన్ని ఇంతకు ముందెప్పుడూ ఎవ్వరూ చెల్లించలేదు. అంత డబ్బు వెచ్చించి కొవ్వొత్తులు వెలిగించినందుకు ఎంత పుష్కలమైన వర్షం కురిపించాలో తలుచుకునేసరికి నరకంలోని ఆ ఆత్మలు అదిరిపడ్డాయి. దేవుడు తమను తన దగ్గరికి పిలిపించుకునేదాకా ఇలా మంటల్లోకలుతున్నంత కాలం వర్షాన్ని కురిపిస్తూనే వుండాలి కదా అని నివ్వెరపోయాయి ఆ ఆత్మలు.పోసోహోండాలో ఒక ఉదయాన ఆకాశం నిండా ముబ్బులు కమ్మినయ్. రెమిజియా తూర్పు దిక్కున ఉన్న ఆకాశాన్ని చూసింది. ఆమెకు పలుచనైన ఒక నల్లని మేఘం కనిపించింది. ఒక గంట తరువాత పెద్ద పెద్ద మేఘాలు జంటలుగా గుమిగూడి ఒకదాన్నొకటి తోసుకుంటూ వేగంగా కదలసాగినయ్.రెండుగంటల తర్వాత చిక్కని చీకటి ఏర్పడి రాత్రి అయిందా అనిపించింది.తక కలుగుతున్న సంతోషం సున్నా అవుతుందేమోనన్న భయం కమ్ముకోగా రెమిజియా ఏమీ మాట్లాడకుండా కేవలం చూస్తూ ఉండిపోయింది. ఆమె మనవడు ఇంకా జ్వరంతో మంచం మీద పడి వున్నాడు. వడు ఎముకల గూడులా చాలా బక్కగా వున్నాడు. పెద్ద ఉరుము ఉరిమింది. ఆమె తనలో తానే నవ్వుకుని, చేతులతో చెంపలను గట్టిగా పట్టుకుని, కళ్లను విశాలంగా చేసింది. చాలాకాలం తర్వాత మళ్లీ వర్షం పడుతోంది. వేగంగా కదులుతూ టపటపనే చినుకులతో పాటు పడుతున్నట్లుగా వర్షం రోడ్డును చేరి, గుడిసె పై కప్పు మీద చప్పుడు చేస్తూ గుడిసె దాటేసి పొలాల మీద కురవడం ప్రారంభించింది. రెమిజియా వెనక గుమ్మం వైపు పరుగెత్తి చిన్న వరదలాంటి నీరు పారుతూ వస్తుంటే నేల అణగిపోయి దట్టమైన ఆవిరులను చిమ్మటం గమనించింది. ఆమె విజయోత్సాహంతో బయటికి పరుగెత్తింది.‘‘వర్షం వస్తుందని నాకు తెలుసు’’ అంటూ బిగ్గరగా అరిచింది. ఆకాశం వైపు చేతులు చాస్తూ ‘‘వాన పడుతోంది...ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు’’ అంటూ కేరింతలు కొట్టింది. ఆమె ఇంటి లోపలికి పరుగెత్తి మనవణ్ని చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుని వాడికి వర్షాన్ని చూపించింది. ఆకాశం నుండి వర్షం ధారాపాతంగా కురుస్తోంది. వర్షపు చినుకుల బలమైన తాకిడి ధాటికి తాటాకుల గుడిసె పైకప్పు పగులుతోంది. రెమిజియా కళ్లు మూసుకుని కొన్ని దృశ్యాలను దర్శించింది. విరగకాసిన తన పంటచేను చల్లని గాలి తరగల్లో కదలాడుతోంది. బయట ఎడతెరిపి లేకుండా బీభత్సంగా వర్షం. వారం రోజులు, పదిరోజులు, పదిహేను రోజులు గడిచాయి. వర్షం ఒక గంట సేపు కూడా ఆగక ఇంకా కురుస్తూనే వుంది. బియ్యం, వెన్న, అప్పుడు అన్నీ నిండుకున్నాయి. ఆహారపదార్థాల్ని కొనడానికి రెమిజియా వర్షంలోనే నగరానికి బయలుదేరింది. పొద్దున బయలుదేరిన ఆమె తిరిగి మధ్యరాత్రి ఇల్లు చేరింది. ఒక మధ్యాహ్నంవేళ పెద్ద కంచర గాడిద తలను లోపలికి దూర్చింది. ‘‘కిందికి దిగ లోపలికి వస్తే కొంచెం వెచ్చగా వుంటుంది’’ అన్నదామె.కంచర గాడిద బయటే వుండిపోయింది. అతడు ‘‘ఆకాశం నీళ్లుగా మారిపోయింది. నేను నీ పరిస్థితిలో వుంటే ఈ లోతట్టు ప్రదేశాల్ని వదిలి ఆ కొండమీదికి పోయేవాణ్ని’’ అన్నాడు.‘‘నేను యిక్కణ్నుంచి వెళ్లిపోవటమా? లేదు స్వామీ, ఈ వర్షం ఒకటి రెండు రోజుల్లో ఆగిపోతుంది’’ అన్నదామె.‘‘చూడమ్మా ఇది వరద పరిస్థితి. నేను కొన్ని భయంకర దృశ్యాల్ని చూశాను. వరద నీరు జంతువుల్నీ, ఇళ్లనూ, చెట్లనూ, మనుషుల్నీ లాక్కుపోతోంది. నేను దాటి వచ్చిన నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. పైగా నదుల జన్మస్థానాల్లో కుండపోతగా వర్షంకురుస్తోంది’’ అన్నాడతడు.‘స్వామీ, కరువు భయంకరంగా వుండింది. అందరూ పారిపోగా నేనొక్కదాన్నే తట్టుకుని ఇక్కడే వుండిపోయాను’’ అన్నది రెమిజియా.‘‘కరువు చంపకపోవచ్చు. కాని వరద ముంచేస్తుంది తల్లీ’’అన్నాడు ఆ ఆసామి. చీకటి పడుతుండటంతో అతడు వెళ్లిపోయాడు. ఆ రాత్రివేళ వెళ్లొద్దని ఆమె బతిమాలింది. కాని అతడు వినలేదు. ‘‘పరిస్థితి మరింత విషమించబోతుందమ్మా, నదులు గట్లను తెంపుకునిఅంతాజలమయం అవుతుంది’’ అంటూ వెళ్లిపోయాడు ఆ వ్యక్తి. రెమిజియా గుడిసె లోపలికి పోయింది. లోపల పిల్లవాడు జడుసుకుంటున్నాడు. ఆ ఆసామి చెప్పింది నిజమైంది. అబ్బ, అది ఎంత భయంకరమైన రాత్రి! మధ్యమధ్యన ఉరుములు మెరుపులతో అత్యంత ఉధృతమైన కుంభవృష్టి ఎడతెరిపి లేకుండా కురిసింది. మురికినీళ్లు సుళ్లు తిరుగుతూ గుమ్మం తలుపులోని సందులోంచి లోపలికవచ్చినేల మీద నిండిపోయాయి. దూరాన గాలి ఈల వేస్తోంది. చెట్టు విరిగిన చప్పుడు ఫెళఫెళమని వినిపించింది. రెమిజియా తలుపు తెరిచింది. దూరాన మెరిసిన మెరుపు పోసా హోండోను వెలుతురు మయం చేసింది. కొండవాలు మీంచి నీళ్లే నీళ్లు... రహదారి నదిగా మారిపోయింది.‘‘ఇది వరద కావచ్చునా’’ రెజిమియాకు మొదటిసారిగా అనుమానం వచ్చింది. కాని ఆమె గుమ్మం తలుపులు మూసి లోపలికి పోయింది. గడచిన కరువు తీవ్రత కన్న, రాబోయే వర్షపు తీవ్రత కన్న బలమైన ఆశాభావం కలిగింది ఆమెకు. ఒక మధ్యరాత్రి వేళ గుడిసె పక్క గోడ నుంచి దభీమని చప్పుడు రావటంతో ఆమెకు మెలకువ వచ్చింది. మంచంలోంచి కిందికి దిగేసరికి తన మోకాళ్ల దాకా నీళ్లు వచ్చిన సంగతి తెలిసింది ఆమెకు.అబ్బ, ఎంతటి కాళరాత్రి! నీళ్లు ప్రవాహరూపంలో లోపలికి దూసుకువచ్చి లోపల మొత్తం నిండిపోయాయి. మరో మెరుపు మెరిసింది. పెద్ద ఉరుముతో ఆకాశం వణికినట్టనిపించింది.‘‘మేరీ కన్యాకా కరుణించు’’ అంటూఏడ్చింది. కానీ ఈ పరిణామానికి కారణం మేరీ కన్యక కాదు.నరకంలోని ఆత్మలు. అవి ‘‘ఈ వర్షం సగం డాలరుకే సమానం, సగం డాలరుకే’’ అంటూ అరిచాయి.ఎప్పుడైతే ఆ వరద నీరు గుడిసెను కదపడం మొదలెట్టిందో అప్పుడు రెమిజియా ఆశాభావాల్ని వదలి తన మనవణ్ని చేతుల్లోకి తీసుకుంది. ఆమె వాడిని సాధ్యమైనంత గట్టిగా ఎదకు హత్తుకుని నీళ్లలోంచి అతి ప్రయత్నపూర్వకంగా నడిచింది.ఎలాగో ఆమె తన గుడిసె తలుపును తీసి బయటికి నడిచింది. తను ఎక్కడికి పోతుందో ఆమెకు తెలియదు. గాలికి ఆమె వెంట్రుకలు విడివడి పోయాయి. దూరాన ఒక మెరుపు మెరిసింది. నీటి మట్టం ఇంకాఇంకా పెరుగుతోంది. తన మనవణ్ని మరింత గట్టిగా హృదయానికి హత్తుకుంది ఆమె. తూలి పడబోయింది కాని ఎలాగో నిలదొక్కుకుంది.ఉధృతంగా వీస్తున్న గాలి ఆమె కంఠస్వరాన్ని కబళించి దాన్ని జలమయమైన ఆ ప్రదేశం మీద పరిచింది.‘‘ఆమె గౌను నీళ్ల మీద తేలింది. ఆమె జారిపోతోంది. ఏదో వస్తువు తన వెంట్రుకలకు తట్టుకుని తలను ముందుకు పోకుండా ఆపినట్టనిపించింది ఆమెకు.‘‘ఇదంతా ముగిసిన తర్వాత బంగాళాదుంపలు నాటుతాను’’ అనుకున్నదామె.తన మొక్కజొన్న చేను మురికి నీళ్లలో మునిగిన దృశ్యం కనబడింది ఆమెకు. ఆమె తన వేళ్లను మనవడి ఛాతీలోకి గుచ్చిపట్టింది. గాలి ఊళ వేసింది. ఆకాశాన్ని పగలగొడుతున్నట్లు పెద్ద ఉరుము ఉరిమింది.ఆమె వెంట్రుకలు ఒక ముళ్ల చెట్టుకు తట్టుకున్నాయి. గుడిసెల్నీ, చెట్లనీ లాక్కెళ్తూ వరద నీరు పొర్లింది. నరకంలోని ఆత్మలు ‘‘ఈ వర్షం సరిపోదు, రెండు డాలర్లంత వర్షం, రెండు డాలర్లంత వర్షం కురవాలి’’ అంటూ ఉధృతంగా గర్జించాయి. డొమినికన్ మూలం : ఖ్వాన్ బాష్ తెలుగు : ఎలనాగ -
నడవాలంటే నరకమే..!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. పొద్దున లేవగానే నడవటం అంటే నరకం కనిపిస్తుంది. ఏదైనా సపోర్ట్ తీసుకొనే నడవాల్సి వస్తోంది. మడమలలో విపరీతమైన నొప్పి వస్తోంది. దీనికి హోమియో పరిష్కారం చెప్పండి. - సునీత, హైదరాబాద్ వయసు పెరుగుతున్న కొద్దీ అరికాలులో ఉండే ప్లాంటార్ ఫేషియా అనే లిగమెంటు తన సాగే గుణాన్ని కోల్పోయి తాడులా మారుతుంది. నిజానికి ఇది ఫ్లాట్‌పాడ్‌లా ఉండి కాలికి షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. వయసు పెరిగి, ఇది సన్నగా మారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. దాంతో నడకతో కలిగే షాక్స్‌ను తట్టుకోలేక ప్లాంటార్ ఫేషియా దెబ్బ తింటుంది. ఫలితంగా అరికాలిలో నొప్పి వస్తుంది. దాంతో పాటు మడమ నొప్పి, వాపు కూడా కనిపిస్తాయి. ఉదయం పూట మొట్టమొదట నిల్చున్నప్పుడు మడమలో నొప్పి కలుగుతుంది. ఇలా ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అయి వచ్చే నొప్పిని ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు. ఇది పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా నొప్పిని కలగజేస్తుంది. కారణాలు: డయాబెటిస్ ఊబకాయం, ఉండాల్సినదాని కంటే ఎక్కువగా బరువు ఉండటం ఎక్కువ సేపు నిలబడటం, పనిచేయడంతక్కువ సమయంలో చురుకుగా పనిచేయడం ఎక్కువగా హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో) లక్షణాలు: మడమలో పొడిచినట్లుగా నొప్పి ప్రధానంగా ఉదయం లేవగానే కాలిని నేలకు ఆనించినప్పుడు నొప్పి కనిపించడం కండరాల నొప్పులు చికిత్స: హోమియోలో మడమనొప్పికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను విశ్లేషించి తగిన మందులను వైద్యులు సూచిస్తారు. మడమనొప్పికి హోమియోలో పల్సటిల్లా, రొడొడెండ్రాన్, కాల్కేరియా ఫ్లోర్, రూస్టాక్స్, అమోనియమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి వాటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. మీరు వెంటనే అనుభవజ్ఞులైన డాక్టర్‌ను సంప్రదించి, మీ లక్షణాలన్నీ తెలిపి, తగిన మందులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ రొమ్ము తొలగిస్తారనే ఆందోళనే వద్దు! క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. పన్నెండేళ్ల కిందట పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. ఈమధ్యనే ఎడమవైపు రొమ్ములో ఏదో తేడా వచ్చినట్లు గమనించాను. డాక్టర్‌ను కలిస్తే పరీక్ష చేసి మ్యామోగ్రామ్ చేయాలన్నారు. అసలు ఏమైందని అడిగాను. బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చేమోనని, బయాప్సీ చేస్తే తెలుస్తుందని అన్నారు. ఇదే విషయం నాకు బాగా దగ్గరివారితో చెబితే రొమ్ము తొలగిస్తారేమోనని అన్నారు. నాకు ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - ఒక సోదరి గతంలో కేవలం పెద్ద వయసు మహిళలు, 50 ఏళ్లు పైబడిన స్త్రీలే బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యతో బాధపడేవారు. కానీ గతం కొంతకాలంగా 30 ఏళ్లు చిన్న వయసు వారు కూడా ఈ సమస్యకు లోనవుతున్నారు. దీనికి అనేక కారణాలున్నప్పటికీ ప్రధానంగా వివాహాలు ఆలస్యంగా కావడం, బిడ్డలకు పాలు పట్టకపోవడం, హార్మోన్లలో మార్పుల వంటివి ముఖ్యమైనవి. ఇవే కాకుండా ఆధునిక జీవనశైలి, కొలెస్ట్రాల్, స్థూలకాయం, కుటుంబ నేపథ్యం, రేడియేషన్ లాంటి ఇతరత్రా కారణాల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. దీనిని గుర్తించడం కూడా ఒక్కోసారి కష్టంగా మారుతుంటుంది. చాలామంది స్త్రీలు తమ రొమ్ములో గడ్డలను గమనిస్తారు. కానీ నొప్పి లేకపోవడంతో అశ్రద్ధ చేస్తుంటారు. అయితే అలా చేయకూడదు. రొమ్ముల్లో గడ్డ కనిపించినా, అక్కడి చర్మభాగంలో మార్పులు (అంటే నల్లగా, ఎర్రగా మారడం), రొమ్ముపై సొట్టలు పడటం, వాటి పరిమాణంలో తేడాలు రావడం వంటి మార్పులు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని కలిసి పరీక్షలతో వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. ఇక మీ విషయానికి వస్తే మీరు వెంటనే మ్యామోగ్రామ్ అనే పరీక్ష చేయించుకోవాలి. అందులో మీకు క్యాన్సర్ ఉందా, లేదా అన్న విషయం తెలుస్తుంది. ఒకవేళ ఉందని అనుమానం వస్తే బయాప్సీ లేదా ఎఫ్ఎన్ఏసీ లాంటి చిన్న నీడిల్ పరీక్ష ద్వారా కూడా క్యాన్సర్‌ను నిర్ధారణ చేయవచ్చు. మీరు పెద్ద హాస్పిటల్స్‌కు వెళ్లి సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్‌ను సంప్రదించడం. వారు క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉందో పరీక్షించి దానికి తగ్గట్లు చికిత్స అందిస్తారు. క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉన్నప్పటికీ మీరు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి అత్యాధునిక వైద్య సదుపాయాలతో పాటు నిపుణులైన వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. మీరు భయపడుతున్నట్లుగానే చాలామంది మహిళల్లో కూడా అనుమానాలున్నాయి. కానీ అది కేవలం అపోహ మాత్రమే. మీ రొమ్మును ఏమాత్రం తీయకుండానే, దాని పరిమానాన్ని కూడా తగ్గించకుండానే సర్జరీ నిర్వహించి, క్యాన్సర్ గడ్డను విజయవంతంగా తొలగించవచ్చు. కానీ రొమ్ముతో పాటు దాని చుట్టుపక్కల (శాటిలైన్ లీజన్స్) మచ్చలుంటే క్యాన్సర్ అక్కడ కూడా వ్యాపించే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే పాక్షికంగా రొమ్మును తొలగించాల్సి రావచ్చు. అయితే అప్పుడు కూడా రొమ్ములో ఏర్పడ్డ ఖాళీ భాగాన్ని చుట్టుపక్కల ఉండే కండరం, ఇతర రొమ్ము భాగాలను సర్దుబాటు చేసి, రొమ్మును సంపూర్ణంగా కనిపించేలా చేస్తారు. లేదా సిలికాన్ ఇంప్లాంట్స్ ద్వారా కూడా రొమ్ము ఆకృతిని సరిదిద్దవచ్చు. రొమ్ములో ఏర్పడిన గడ్డలన్నీ చాలావరకు క్యాన్సర్ కాకపోవచ్చు కూడా. అయితే అవి క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకోవడం అత్యవసరం. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకుండా, నిర్భయంగా డాక్టర్‌కు చూపించుకోండి. డాక్టర్ కె.శ్రీకాంత్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
గతుకుల దారిలో.. దుమ్ముగాలిలో తప్పని ప్రయాణం
రోడ్డెక్కడో.. గుంతలెక్కడో తెలియదు పాపం.. ఇది శిథిల దారి అని తెలుసూ.. అది మట్టి ధూళీ అని తెలుసూ.. ముందు వాహనం కనిపించదని తెలుసూ.. దారి పొడువునా ఇంతేనని తెలుసూ ఇది ఉరుకుపరుగుల జీవితం.. అది అధికారుల చెలగాటం రోడ్డు శకలమై.. ఒళ్లు హూనమై.. సాగుతున్నదొక ప్రయాణం పట్టు జారినా.. రెప్ప మూసినా ఆగును జీవన పోరాటం.. నంద్యాల–గిద్దలూరు రహదారిపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. కర్నూలు, ప్రకాశం జిల్లాలకు రాకపోకలు సాగించే వాహనదారులకు ఈ దారే ప్రధానం. నంద్యాల నుంచి గుంటూరు, విజయవాడ తదితర ప్రధాన పట్టణాలకు కూడా ఈ దారి మీదుగానే వెళ్లాల్సిందే. నాపరాతి, ధాన్యం, గ్యాస్ సిలిండర్ల లోడ్లతో లారీలు భారీ సంఖ్యలో వెళ్తుంటాయి. ఓ వైపు ఘాట్‌రోడ్డు. మరో వైపు శిథిలమైన రహదారి. అడుగడుగునా గుంతలు. దుమ్ము చెలరేగి ఎదురెదురు వాహనాలు కనిపించని పరిస్థితి. వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మృత్యువు దాడి చేసే అవకాశం. గాజులపల్లె నుంచి ప్రకాశం జిల్లా వైపు సర్వనరసింహ క్షేత్రం వరకు.. ఇటు అయ్యలూరు మెట్ట వరకు పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. 30 కి.మీ. ప్రయాణం రెండు గంటల సమయం పడుతోంది. రాత్రి వేళ పరిస్థితి మరీ దారుణం. వాహనదారులకు ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. - మహానంది -
మెట్రోరూట్లలో రహదారులకు మరమ్మతులు షురూ
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో కారిడార్లలో దారుణంగా దెబ్బతిన్న రహదారులకు రూ.20 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ మరమ్మతులు చేపట్టింది. ప్రధానంగా ఎల్భీనగర్–దిల్సుఖనగర్–ఛాదర్‌ఘాట్, రంగ్‌మహల్ జంక్షన్ –నాంపల్లి–ఖైరతాబాద్, పంజాగుట్ట–ఎస్.ఆర్.నగర్– కూకట్పల్లి మార్గాల్లో రహదారులు దెబ్బతినడంతో వాహనదారులు, ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్న నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మరమ్మతు పనులను హెచ్ఎంఆర్ ఎండీ పరిశీలించారు. ఈ ప్రాంతంలో భారీగా వరదనీరు నిలుస్తుండడంతో ప్రధాన రహదారిపై భారీగా గోతులు ఏర్పడ్డాయి. వీటిని సిమెంట్ ఇటుకలు(పేవర్‌బ్లాక్స్)ఏర్పాటుతో పూడ్చివేశారు. సికింద్రాబాద్–బేగంపేట్, జూబ్లీహిల్స్ రోడ్‌నెం.5,36, సికింద్రాబాద్–ముషీరాబాద్–ఆర్టీసీ క్రాస్‌రోడ్–బడీచౌడి,పుత్లీబౌలీ ప్రాంతాల్లోనే రహదారులకు తక్షణం మరమ్మతులు చేపట్టేందుకు టెండర్లు పిలిచి పనులు అప్పగించినట్లు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ జంక్షన్, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్ ప్రాంతాల్లో సిమెంటు ఇటుకలతో(పేవర్‌బ్లాక్స్)ఏర్పాటుతో రహదారులపై భారీ గోతులు ఏర్పడకుండా శాశ్వత పరిష్కారం దిశగా మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. పలు యురోపియన్ దేశాలు, ముంబయి మహానగరంలోనూ లోతట్టు ప్రాంతాలు (వాటర్‌లాగింగ్ ఏరియా)లలో పేవర్‌బ్లాక్స్ ఏర్పాటుతో రహదారులు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. నెలరోజుల్లోగా మెట్రో కారిడార్లలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు పూర్తిచేస్తామని ఎండీ తెలిపారు. మియాపూర్–కూకట్పల్లి, ఒలిఫెంటా బ్రిడ్జి, గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడా ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు ఎల్అండ్టీ సంస్థ మరమ్మతులు చేపడుతుందని ఎండీ పేర్కొన్నారు. -
పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ
-
పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించబోమని, తమ భూభాగంలో ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాదులే లేరంటూ బుకాయిస్తూ వస్తున్న ఆ దేశానికి నోట్లో వెలగపండు ఇరికినట్లయింది. తమ ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలను వెంటనే ఖాళీ చేయించాలని, వాటి వల్ల తమ జీవితాలు నరకంలా మారాయని, వారి దుశ్చేష్టలు ఇక ఏమాత్రం సహించబోమంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ పౌరులు ఎదురు తిరిగారు. ఇస్లామాబాద్ వ్యతిరేక నినాదాలతో, పెద్దపెద్ద ప్లకార్డులతో ఆందోళన బాటపట్టారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్, కోట్లి, చినారి, మిర్పూర్, గిల్గిట్, దియామిర్, నీలం వ్యాలీ ప్రజలంతా గురువారం వీధుల్లోకి వచ్చి పాక్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అంతర్జాతీయ వేదికలపైనే, భారత్ తో గొడవలు జరుగుతున్న ప్రతిసారి తమ వద్ద ఉగ్రవాద శిక్షణ శిబిరాలు లేవని పాక్ చెబుతూ వస్తుందని, అదంతా బూటకం అని, ఉగ్రవాద శిబిరాల వల్లే తమ జీవితాలు నరకంలో ఉన్నట్లుగా మారాయని వారంతా నినదించారు. 'ఉగ్రవాద సంస్థలను, ఉగ్రవాద శిక్షణ శిబిరాలను నిషేధించండి. మాకు భోజనం పెట్టండి, ఆహార పదార్థాలు అందించండి. మేం ఈ పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం' అంటూ వారంతా ఓ టీవీ చానెల్ కు తమ బాధను వెల్లబోసుకున్నారు. తాలిబన్ టెర్రర్ క్యాంపులు కూడా తమ వద్ద ఉన్నాయని, వాటిని నివారించకుంటే పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అన్నారు. 'ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడాన్ని ఆపనంతకాలం ఉగ్రవాదాన్ని అంతమొందించడం సాధ్యం కాదు' అంటూ ఆ ప్రాంత వాసులు కుండబద్ధలు కొట్టారు. -
నగరంలో నరకయాతన!
-
కాలుష్య నరకాలు!
ఇప్పటికీ మన నగరాలు మృత్యువునే ఆఘ్రాణిస్తున్నాయని తాజాగా విడుదలైన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ధ్రువపరుస్తోంది. ఈ విషయంలో మన ప్రభు త్వాలు శ్రద్ధ పెట్టడం లేదని...అవసరమైన పర్యవేక్షణగానీ, దిద్దుబాటు చర్యలుగానీ ఉండటం లేదని ఈ నివేదిక నిరూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 103 దేశాల్లోని 3,000 నగరాలను అధ్యయనం చేసి సంస్థ ఈ నివేదికను వెలువరించింది. వీటితోపాటు కొన్ని పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ కూడా సర్వే చేసింది. ఒక ప్రాంతంలోని వాతావరణంలో ప్రతి ఘనపు మీటర్‌కు సగటున అత్యంత సూక్ష్మ ధూళి కణాలు ఎన్ని మైక్రోగ్రాముల్లో ఉన్నాయో లెక్కగట్టి అక్కడి కాలుష్యం ఏ స్థాయిలో ఉన్నదో అంచనా వేయడం ఈ సర్వేలోని ప్రధానాంశం. ఒక ఘనపు మీటర్లో ఉండే సూక్ష్మ ధూళి కణాలు 25 మైక్రో గ్రాములు మించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నాణ్యతా ప్రమాణాలు చెబుతున్నాయి. ఇంతకన్నా అధిక పరి మాణంలో ధూళి కణాలున్న నగరాలను కాలుష్య నగరాలుగా లెక్కేస్తారు. ఈ ప్రాతిపదికన రూపొందించిన అత్యంత కాలుష్య నగరాల జాబితాలో సగం మన దేశానికి చెందినవే కావడం ఆందోళన కలిగించే అంశం. గత నివేదికలో మొదటి స్థానంలో ఉన్న దేశ రాజధాని నగరం ఢిల్లీ ఈసారి 11వ స్థానానికి పడిపోయింది. ఈ నివేదిక వెల్లడయ్యాక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నగర పౌరులను అభినం దించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లో విడుదల చేసిన నివేదికతో పోలిస్తే ఢిల్లీ నగరం పరిస్థితి స్వల్పంగా మెరుగైన మాట వాస్తవమే అయినా...మరీ అంత సంబరపడేదేమీ లేదు. ప్రపంచంలో మరో నగరం ఢిల్లీని మించిపోయింది గనుక ఇది కాస్త వెనకబడింది. ఢిల్లీ స్థానాన్ని ఇరాన్‌లోని జబోల్ ఆక్రమించింది. వాయు కాలుష్యంవల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. మన దేశం విషయానికే వస్తే 2013లో ఈ కాలుష్యం బారినపడి 14 లక్షలమంది అర్ధంతరంగా మరణించారు. అంతకు మూడేళ్ల మునుపు ఇలాంటి అర్ధంతర మరణాలు అందులో సగం కన్నా తక్కువే. కనుక మన నగరాల పరిస్థితి రోజురోజుకూ దిగజారు తున్నదని అర్ధం. మనం పీల్చే గాలిలో నైట్రేట్, సల్ఫేట్, కార్బన్, సోడియం, కాడ్మి యం, పాదరసం అణువులు ఉంటున్నాయని...అవి ప్రాణాలను తోడేస్తున్నాయని పర్యావరణవేత్తలు తరచు హెచ్చరిస్తున్నారు. మునుపటి కాలంతో పోలిస్తే కేన్సర్ రోగుల సంఖ్య పెరగడం, క్షయ, ఆస్తమా వంటి వ్యాధులు ఉగ్రరూపం దాల్చడం ఈ దుస్థితి వల్లనే. వాయు కాలుష్యంవల్ల హృద్రోగాలు, గుండెపోట్లు కూడా పెరుగు తున్నాయి. ఇలాంటి వ్యాధులు ఆయా కుటుంబాలను మాత్రమే కాదు...మొత్తం దేశ ఆర్ధిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేస్తున్నాయి. మన జీడీపీలో 3 శాతాన్ని వాయు కాలుష్యం మింగేస్తున్నదని ప్రపంచ బ్యాంకు ఆమధ్య హెచ్చరించింది. ప్రపంచబ్యాంకు నివేదికను విశ్లేషిస్తే దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడ వుతున్నాయి. ప్రపంచ కాలుష్య నగరాల్లో మన దేశానికి చెందిన పది నగరా లుంటే అందులో అన్నీ ఉత్తరాది లేదా మధ్య భారత్‌లోనివే. పైగా ఇవన్నీ జనాభా సాంద్రత అధికంగా ఉండే నగరాలు. ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు నగరాలు- అలహాబాద్, కాన్పూర్, ఫిరోజాబాద్, లక్నోలు ఇందులో ఉన్నాయి. పంజాబ్‌లోని లూథియానా, ఖన్నా నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. వెనకబాటుతనం పోవడం, ఉపాధి అవకాశాలు పెంపొందడం, సౌకర్యాలు పెరగడం...ఆ క్రమంలో పట్టణాలు, నగరాలు ఏర్పడటం ఆహ్వానించదగ్గదే. ఉపాధి కల్పనవల్ల ప్రజల జీవనప్రమాణాలు పెరుగుతాయి. విద్య, వైద్యం, పౌష్టికాహారం మెజారిటీ ప్రజలకు అందుబాటులోకొస్తాయి. మంచిదే. కానీ ఈ క్రమంలో నిర్దిష్టమైన ప్రణాళిక, ముందుచూపు అవసరమవుతాయి. సర్వస్వం ఒకేచోట కేంద్రీకరిస్తే నలు మూలలనుంచీ అక్కడికి వలసలు మొదలవుతాయి. పెరుగుతున్న జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమైతే అది ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది. మురికివాడలు విస్తరించడం, ప్రజారోగ్యం చిక్కుల్లో పడటం, నేర సంస్కృతి పెరగడంలాంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఇందుకు భిన్నంగా నగరాలు, పల్లెసీమల మధ్య అంతరాలు తగ్గించడానికి ప్రయత్నిస్తే, గ్రామాల్లోనే తగిన ఉపాధి అవకాశాలను కల్పిస్తే నగరాలపై ఒత్తిడి తగ్గుతుంది. కానీ పాలకులు ఈ విషయంలో చేసిన తప్పే చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధానాలు, చేతివృత్తులకు తోడ్పాటునీయకపోవడం వంటివి నగరాలకు వలసలను పెంచుతున్నాయని గుర్తించడం లేదు. కాస్తో కూస్తో సంపాదించుకోవాలన్నా, పూట గడవాలన్నా వలస పోవడం తప్ప మార్గం లేదని పలువురు భావించే పరిస్థితులు కల్పిస్తున్నారు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా...అంటే 54 శాతం నగరాలు, పట్టణాల్లోనే నివశిస్తున్నదని ఐక్యరాజ్యసమితి ఆమధ్య ప్రకటించింది. ఇది అంతకంతకూ పెరుగుతుందని కూడా అంచనా వేసింది. దీన్ని అరికట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయని కూడా చెప్పింది. కానీ వినేవారెవరు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూపొందించిన ప్రణాళికలను చూస్తే భవిష్యత్తులో మరో కాలుష్య నగరం ఆవిర్భవించబోతున్నదని సులభంగానే చెప్పవచ్చు. అభివృద్ధిని అక్కడే కేంద్రీకరించి, ఉపాధి కోసం జనమంతా ఆ నగరానికి చేరుకోక స్థితిని కల్పించడం మంచిది కాదని ఆయనకు అర్ధం కావడం లేదు. ఇందువల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల్లో ఏర్పడే అసంతృప్తి మాట అటుంచి ఆరోగ్యకరమైన వాతా వరణం కాస్తా కాలుష్యమయం అవుతుందని ఆయన గుర్తించడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక అందరి కళ్లూ తెరిపించాలి. నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిస్తే సొంత వాహనాల వాడకం తగ్గుముఖం పడుతుంది. కాలుష్య కారక పరిశ్రమలనూ, వాహనాలనూ గుర్తించి చర్యలు తీసుకునే పటిష్టమైన నిఘా వ్యవస్థ కూడా పరిస్థితిని గణనీయంగా మెరుగు పరుస్తుంది. పది లక్షలకు పైబడిన జనాభా ఉన్న నగరాల్లో జాతీయ వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ)లను ఏర్పాటు చేయడం హర్షించదగిందే. అయితే ఆ గణాంకాలను విశ్లేషించి మరెలాంటి చర్యలు అవసరమవుతాయో ఎప్పటికప్పుడు మదింపు వేయడం, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఆ దిశగా ప్రభుత్వాలన్నీ కదలాలని జనం కోరుకుంటున్నారు. -
ఏడు గంటల నరకం.. ఆపై మరణం
జల్పాయ్ గురి: అసలే భారీ కాయం.. ఆ దారంతా బురదమయం.. ఒక్క తప్పటడుగు.. అంతే.. కాలుజారీ వర్షం నీళ్లతో నిండి ఉన్న కాలువలోకి జారిపోయింది. కాపాడాల్సినవాళ్లు చేతులెత్తేశారు. దీంతో ఏడుగంటపాటు నరకం అనుభవించిన ఓ ఏనుగు మంగళవారం సాయంత్రం మరణించింది. విదారకమైన ఈ ఘటన జైపూర్ లోని జల్పాయి గురి జిల్లా బిన్నాగురిలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి బిన్నాగురిలోని కర్బా టీ తోటల్లోకి ప్రవేశించిన ఓ ఏనుగు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. కొద్దిసేపటికే సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చారు. కానీ ఏనుగును కాలువ నుంచి బయటికి తీసే యంత్రాలేవీ వారికి అందుబాటులో లేవు. దీంతో మరో ప్రాంతం నుంచి కుంకీని రప్పించాలనుకున్నారు. కుంకీ అంటే ఫారెస్టు అధికారులచే శిక్షణ పొందిన ఏనుగు. కాగా, కుంకీ రాక అంతకంతకూ ఆలస్యమయింది. క్రేన్ లేదా ఏదైనా భారీ యంత్రంతో ఏనుగును బయటికి తీద్దామనుకుంటే అ ప్రాంతమంతా బురదే! ఇక చేసేదేమీలేక అధికారులు మిన్నకుండిపోయారు. మూడింట రెండొంతుల నీళ్లలో ఏడుగంలపాటు నరకం అనుభవించిన ఆ ఏనుగు చివరికి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కుంకీ అక్కడికి చేరుకుంది. ఏనుగు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి అది ఎలా చనిపోయిందో తేల్చిచెప్పే ప్రయత్నంలో ఉన్నారు డాక్టర్లూ, అటవీ అధికారులూ! -
నరకయాతన
నరకం ఎలా ఉంటుందో ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది.. నుజ్జు నుజ్జు అయిన కారులో ఇరుక్కు పోయిన ఓ యువకుడు.. అతని శరీరంలో నుంచి కారుతున్న రక్తపు ధారలు.. కారులో నుంచి బయటికి రావాలని అతని తపన.. కానీ రెండు కాళ్లు పూర్తిగా ఇరుక్కొని పోయి రాలేని నిస్సహాయత.. ఇలా ఆ యువకుడు రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి అతన్ని ప్రాణాలతో కాపాడగలిగారు. ప్రొద్దుటూరు క్రైం: స్థానిక ఎర్రగుంట్ల రోడ్డులోని పాలకేంద్రం సమీపంలో సోమవారం లారీ-కారు ఢీ కొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ తుమ్మలూరు మల్లికార్జునరెడ్డితోపాటు జ్యోతిరామసుదర్శనరెడ్డి, కాకమాని శివకుమార్, యాకవల్లి జయమ్మ, మల్లికార్జునరెడ్డి భార్య దివ్యతేజలకు గాయాలయ్యాయి. పెళ్లి వేడుకలు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో.. ముద్దనూరు మండలం ఉమ్మారెడ్డిపల్లె గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డి చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇతని సోదరుడు ప్రమోద్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కాగా ప్రమోద్‌రెడ్డి వివాహం సోమవారం ఉదయం 3 గంటల సమయంలో ప్రొద్దుటూరులోని వాసవీ కల్యాణ మంటపంలో జరిగింది. వివాహం అనంతరం నూతన దంపతులు తిరుమలలో కల్యాణం జరిపేందుకని ఉదయాన్నే కారులో బయలుదేరి వెళ్లారు. వారితో పాటు కొంత మంది ముఖ్యమైన బంధువులు కూడా కలిసి వెళ్లారు. మల్లికార్జునరెడ్డి దంపతులతో పాటు అతని స్నేహితుడు హైదరాబాద్‌కు చెందిన శివకుమార్, తాడిపత్రి సమీపంలోని పెద్ద పప్పూరుకు చెందిన బ్యాంక్ ఉద్యోగి రామసుదర్శనరెడ్డి, పని మనిషి జయమ్మలు ఇన్నోవా కారులో ముద్దనూరుకు బయలుదేరారు. అయితే ప్రొద్దుటూరు శివారులోని పాలకేంద్రం వద్దకు రాగానే లారీ ఢీకొన్న సంఘటనలో ఐదు మంది గాయ పడ్డారు. ప్రమాదం జరగగానే కారులోని ఎయిర్ బెలూన్ బయటికి రావడంతో కారులో ఉన్న వారికి ప్రాణాపాయం తప్పినట్లైంది. రెండు గంటల పాటు కారులోనే చిక్కుకుని.. ప్రమాద సంఘటలో శివకుమార్, దివ్యతేజలకు స్వల్ప గాయాలు కాగా రామసుదర్శన్రెడ్డి, జయమ్మలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయ పడిన వారిని వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటనలో కారు నుజ్జు నుజ్జు కావడంతో డ్రైవింగ్ చేస్తున్న మల్లికార్జునరెడ్డి అందులోనే ఇరుక్కొని పోయాడు. అతని రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయిన కారు బాడి కింద ఉండిపోయాయి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకొని మల్లికార్జునరెడ్డిని బయటికి తీసే ప్రయత్నం చేశారు. అయితే వారికి సాధ్యం కాలేదు. అతనికి రక్తం కారుతుండటంతో నీరసం రాకుండా ఉండేందు కోసం 108 సిబ్బంది అక్కడికి చేరుకొని సెలైన్ బాటిళ్లు పెట్టారు. శభాష్ పోలీస్.. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐలు సత్యనారాయణ, మహేశ్వరరెడ్డిలు కారులో ఉన్న మల్లికార్జునరెడ్డిని కాపాడటానికి తీవ్రంగా శ్రమించారు. ముందుగా సీఐలు ఇద్దరూ అతన్ని బయటికి తీసే ప్రయత్నం చేశారు. అయితే సాధ్యం కాకపోవడంతో వెంటనే గ్యాస్ కట్టర్‌ను తెప్పించారు. అక్కడ సహాయక చర్యలు చేపడుతూనే స్తంభించి పోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. వారితో పాటు ఎస్ఐలు లక్ష్మినారాయణ, మహేశ్, వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ శంకర్లు సిబ్బంది సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకుపోయిన అతనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీఐల సూచన మేరకు గ్యాస్ కట్టర్‌తో కారులోపలి భాగాలను తొలగించి మల్లికార్జునరెడ్డిని కాపాడగలిగారు. తీవ్రంగా గాయపడిన అతన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు రెండు కాళ్లు విరిగినట్లు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం గాయ పడిన వారిని హైదరాబాద్‌కు తరలించారు. సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీసు అధికారులు, సిబ్బందిని బాధితుల బంధువులు, స్థానికులు అభినందించారు. -
పనికి తీసుకెళ్లి నరకం చూపించారు..
పార్వతీపురం: పని ఇస్తామని చెప్పి తీసుకెళ్లి తమకు నరకం చూపించారని పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని గుమ్మలక్ష్మీపురం మండలం, మంత్రజోలకు చెందిన పు వ్వల కృష్ణారావు, విశాఖ జిల్లా జీకే వీధి మండలం తడకపల్లికి చెందిన జర్దా చిట్టిబాబులు వాపోయారు. అధిక జీతం, అన్ని వసతులు కల్పిస్తామని తమకు మాయమాటలు చెప్పి... విశాఖపట్నం నుంచి కర్ణాటక తీసుకెళ్లి తమను ఓ దీవిలో చిత్రహింసలకు గురి చేశారని వాపోయారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సుందరయ్య భవనంలో మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి, సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి, కొల్లి సాంబమూర్తిల వద్ద తమ బాధలు చెప్పుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... తాము విశాఖలో పనిచేసుకునేందుకు వెళ్లామని, అక్కడ పని బాగాలేక ఇంటికి వచ్చే సమయంలో రైల్వేస్టేషన్లో ఓ బ్రోకర్ కనిపించి కొవ్వూరులో చేపల చెరువులో రొయ్యల పెంపకం పని ఇప్పిస్తామని, నెలకు రూ.10,000 జీతంతోపాటు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి ఒప్పించాడన్నారు. అనంతరం అక్కడే బొందు నాగరాజు అనే కాంట్రాక్టర్‌కు తమను అప్పగించారన్నారు. ఆతను కొవ్వూరు తీసుకెళ్లి అక్కడ పని ఇవ్వకుండా కర్ణాటకలోని ఆయినొడిగెల్లా తాలూ కా, అంకెల గ్రామానికి ఎదురుగా ఉన్న తుంగభద్ర నదిలోని పాముల దిబ్బ అనే ఓ దీవిలో రాత్రి 8 గంటల నుంచి తెల్లవార్లూ పని చేయించేవారన్నారు. చలిలో నదిలో దిగి బోటు నుంచి విసిరిన వలను నదిలో దిగి నడిపే పని చేయమనేవారన్నారు. ఉదయం, రాత్రి భోజనం పెట్టి, జ్వరమంటే...కర్రలతో కొట్టి, చంపేస్తామని భయపెట్టి చిత్రహింసలకు గురి చేశారని వాపోయారు. తమతోపాటు అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా పనిచేస్తున్నారని చెప్పారు. ఓ మారు అక్కడ నుంచి కొంతమంది తప్పించుకోవడానికి యత్నిస్తే...రౌడీలను పెట్టి కొట్టించారన్నారు. అందులో ఓ ఆరుగురుం తప్పించుకుని హంసనంది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా కాంట్రాక్టర్ తమ్ముడు రాజు కొంతమంది రౌడీలతో వచ్చి పోలీసుల ముందే తమను చితకబాదారన్నారు. దీనిపై పోలీసులు కూడా పట్టించుకోకుండా వారి దగ్గరకే వెళ్లమ న్నారన్నారు. దీంతో తామంతా భయపడి, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామనగా విడిచిపెట్టారన్నారు. అక్కడ నుంచి తమ ఇద్దరితో పాటు కృష్ణ, రమణ, లక్ష్మణ తదితరులు తప్పించుకోగా, కొర్ర కామేశ్వర్రావు ఎటు వెళ్లిపోయాడో తెలియదన్నారు. చేత పైసా లేక అక్కడక్కడ కనిపించిన వాహనాలు ఎక్కి చివరకు పార్వతీపురం చేరుకున్నామని వాపోయారు. ఈ విషయమై తాము ఏఎస్పీ, ఐటీడీఏ పీఓ, సబ్-కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నామని మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి, సీపీఎం నాయకులు తెలిపారు. -
ఇదిగో..నరకం..
కర్నూలు ప్రభుత్వాస్పత్రి అత్యవసర విభాగంలో దుస్థితి కర్నూలు (హాస్పిటల్): ‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా ఉంది కర్నూలులోని సర్వజన ప్రభుత్వాసుపత్రి తీరు. ఇక్కడ రోగులకు అవసరమయ్యే అన్ని రకాల పరికరాలు ఉన్నాయి. అయితే వాటిని సక్రమంగా ఉపయోగించుకోలేని దుస్థితిలో యంత్రాంగం ఉంది. ఆస్పత్రిలోని క్యాజువాలిటీ(అత్యవసర విభాగం)లో స్ట్రెచర్లు, వీల్చైర్లు ఉన్నాయి. కానీ అవి రోగులకు ఏమాత్రం ఉపయోగపడడంలేదు. వాటిని ఓ గదిలో పెట్టి భద్రంగా తాళాలు వేశారు. దీంతో స్ట్రెచర్లు, వీల్చైర్లు లేక రోగులు, రోగుల సహాయకులు, ప్రమాద బాధితులు ఇబ్బందిపడుతున్నారు. సంబంధిత అధికారులు ప్రతి రోజూ క్యాజువాలిటీ మీదుగా రాకపోకలు సాగిస్తున్నా.. వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. క్యాజువాలిటీకి నిత్యం రోడ్డు ప్రమాద బాధితులు కర్నూలుతో పాటు ఇతర జిల్లాల నుంచి వస్తుంటారు. అప్పటికే కాళ్లు, చేతులు విరిగి తలకు గాయాలై నరకయాతన అనుభవిస్తు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే బాధితులకు కనీస సదుపాయాలు అందడంలేదు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన రోగులు, ప్రమాద బాధితులు అక్కడి నుండి క్యాజువాలిటీకి వెళ్లాలంటే 20 నుంచి 30 అడుగుల దూరం ఉంటుంది. నడవలేని స్థితిలో వచ్చిన బాధితులకు, ఇక్కడ నుండే నరకం ప్రారంభం అవుతుంది. క్యాజువాలిటీకి తరలించాలంటే స్ట్రెచర్లు, వీల్చైర్లు తప్పనిసరి. అయితే అవి అందుబాటులో ఉండడంలేదు. దాతలు ఉచితంగా ఇచ్చిన స్ట్రెచర్లు(కొత్తవి) వీల్చైర్లు క్యాజువాలిటీ విభాగం ఎదురుగా ఉన్న ఓ గదిలో మూలన పడేశారు. ఉన్న ఒకటి, రెండు స్ట్రెచర్లు కనబడితే ఉన్నట్లు.. లేకుంటే లేనట్లే. వీటిని తరలించే వార్డు బాయ్‌లు రమ్మన్నా రారు. బాధితుని బంధువులు ఓ స్థాయిలో ఉంటే స్ట్రెచర్ బయటికి వస్తుంది. లేకుంటే ప్రాధేయపడినా రాదు. అడిగేవారు లేరు. వార్డు బాయ్‌లకు నిక్కచ్చిగా చెప్పేవారు లేరు. దీంతో నిత్యం ప్రమాద బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల సీఎస్ఆర్ఎంఓ ప్రత్యేకంగా దృష్టి సారించి స్ట్రెచర్లు, వీల్చైర్లు ప్రధాన ద్వారం వద్ద పెట్టాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఆ అధికారి ఉన్నంత సేపు స్ట్రెచర్ కనబడుతుంది. ఆ తర్వాత మళ్లీ యథాతథం. ఇక ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా ఉండే రోగి వివిధ రకాల పరీక్షల నిమిత్తం మరో చోటుకి తరలించాలంటే స్ట్రెచర్లు అవసరం. అలాగే రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగిన వ్యక్తులకు ప్రాథమిక చిక్తిత్స అనంతరం ఆర్థోపెడిక్ వార్డుకు తరలించాలి. స్ట్రెచరు లేనిదే బాధితున్ని తరలించడం ఎంతో ఇబ్బంది. అయినా ఇబ్బందులు తప్పడం లేదు. రోగుల సహాయకులే భుజాన వేసుకుని తరలిస్తున్న సంఘటనలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వసాధారణం. ప్రజారోగ్యానికి రూ.కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ప్రమాద బాధితులకు, రోగులకు కనీస అవసరాలైన స్ట్రెచర్లు, వీల్చైర్లను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆసుపత్రి అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించాలి. ఇప్పటికైనా అధికారులు ఆసుపత్రిలో ఎన్ని స్ట్రెచర్లు ఉన్నాయి? ఎన్ని వీల్చైర్లు ఉన్నాయి? రిపేరీలో ఉన్నవి ఎన్ని? అన్న వాటిపై ఆరా తీయాల్సిన అవసరం ఉంది. క్యాజువాలిటీ ఎదురుగా ఉన్న గదిలో కొత్త వీల్చైర్లు, స్ట్రెచర్లను ఎందుకు మూలన పడేశారో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
గుండెలు గల్లంతే !
నాగరికతకు చిహ్నాలుగా నిలవాల్సిన రహదారులు నరకానికి నకళ్లుగా తయారయ్యాయి. అడుగుకో అతుకు... గజానికో గుంతతో పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. ఆర్ అండ్ బీ రోడ్లపై ప్రయాణం అంటేనే ప్రజలు గుం డెలు పట్టుకుంటున్నారు. జిల్లాలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్టు ఆ శాఖ అధికారుల వద్ద ఉన్న లెక్కలు ప్రయాణికుల దురవస్థకు అద్దంపడుతున్నాయి. పొరుగునే కొత్త రాజధాని ఏర్పాటు కానున్న నేపథ్యంలో నిధులు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన రోడ్లు నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వాల్సిన పాలకులు మీనమేషాలు లెక్కించడం విస్మయానికి గురిచేస్తోంది. సాక్షి, గుంటూరు జిల్లాలో ఆర్ అండ్ బీ పరిధిలోని రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారిక సమాచారం. తాత్కాలిక మరమ్మతులు కూడ చేపట్టకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. కొన్ని చోట్ల మోకాలి లోతు గుంతలు ఏర్పడ టంతో ప్రయాణం అంటేనే ప్రజలు హడలిపోతున్నారు. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ముఖ్యంగా తెనాలి డివిజన్లో అధికంగా రోడ్లు దెబ్బతిన్నాయి. ఇక్కడ నల్లరేగడి నేలలతోపాటు, కాలువలు నీటి సాకర్యం ఎక్కువగా ఉండటం వల్ల ఈ డివిజన్ల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల రోడ్లకు ఇరువైపుల కంపచెట్లు పెరిగాయి, బర్మ్‌లు కోతకు గురయ్యాయి. ముఖ్యంగా రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం ఇంత వరకు నిధులు మంజూరు చేయకపోవడం గమనార్హం. {పభుత్వం కొత్త రోడ్లను మంజూరు చేయకపోగా పురోగతిలో ఉన్న పనులను సైతం నిలిపివేసింది. దీంతో రోడ్లు భవనాల శాఖ పరిధిలో పనులు ప్రస్తుతం ఆగిపోయాయి. ప్రతిపాదనలతోనే సరి... జిల్లాలో కొత్త రోడ్లకు ప్రతిపాదనలు పంపడం మినహా ప్రభుత్వం నుంచి నిధులు మాత్రం మంజూరు కావడం లేదు. కర్నూలు-గుంటూరు దాదాపు 300 కిలో మీటర్ల మేర రహదారిని నేషనల్ హైవేకు అప్పజెపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో పాటు గుంటూరు-పర్చూరు, కొండమోడు-పేరేచర్ల, గుంటూరు-తెనాలి, గుంటూరు- బాపట్ల రోడ్లలను నాలుగు లేన్ల రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొత్త రాజధాని అని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గుంటూరు జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకొంది. జిల్లాలో రోడ్లను అభివృద్ధి చేసే నిమిత్తం వాటిని పరిశీలించేందుకు ఇటీవలే క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీరు వెంకటరెడ్డి సైతం జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించారు. రూ. 21 కోట్లతో ప్రతిపాదనలు.. జిల్లాలో రోడ్ల నిర్వహణ కోసం రూ. 21కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే వెంటనే మరమ్మతు లు చేపడతాం. - రాధాకృష్ణ, ఆర్ అండ్ బీ ఎస్ఈ, గుంటూరు. -
స్వర్గనరకాలు భూమి మీదే ఉన్నాయి!
పరమార్థం జీవితంలో సుఖం ఒక్కటే ఉండాలనుకునే వారికి అడుగడుగునా అసంతృప్తే మిగులుతుంది. అనుభవాలు నరక సదృశం అవుతాయి.జీవితంలో దొరికిన దానితో సంతృప్తి పడేవారికి, ఎంత కష్టం వచ్చినా ఓర్చుకోగలిగిన వారికి అనుక్షణం స్వర్గమే. మనలో చాలామంది స్వర్గనరకాలను నమ్ముతారు. అవి నిజంగా ఉన్నాయా? అనే ప్రశ్న కూడా ఒకోసారి మనకు కలుగుతుంది. అయితే పైలోకాల మాట ఎలా ఉన్నా ‘‘భూమి మీద నువ్వున్నది స్వర్గమా? నరకమా? అన్నది నీ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది’’ అన్నాడు గౌతమ బుద్ధుడు. ఒకరికి మనశ్శాంతి లేదు. ఎవరో ఏదో అన్యాయం చేశారనో, మరేదో కారణం వల్లనో అతడి మనసు గాయపడింది. అలజడి, ఆందోళన, ఒత్తిడి, నిరాశ, నిస్పృహ, అసూయ, ద్వేషం, కోపం.. ఇలా ఎన్నో అతడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. అంటే ఇప్పుడు అతడి మనసు నరకప్రాయం అయిందని అర్థం. ఇక్కడ నమ్మకంతో పని లేదు. అతడికది స్వానుభవం. ఇంకొకరి మనస్సులో నిర్మల ప్రశాంతత, ప్రేమ, కరుణ.. ఇలాంటివి నెలకొని ఉన్నాయి. ఇక్కడా నమ్మకంతో పనిలేదు. ఒక అపురూమైన అనుభూతితో మనసు నిండి ఉంటుంది. అదే అతడికి స్వర్గం. అతడికది స్వానుభవం. ప్రతి అనుభూతినీ పరిపూర్ణ సంతోషభావంతో గ్రహించగలిగిన స్థితప్రజ్ఞుడు ఎంతటి దుఃఖ భాజనుడితోనైనా నిశ్శబ్దంగా సంభాషించగలుగుతాడు. అతడి దుఃఖంలో పాలుపంచుకుంటాడు. సుఖాల్ని అందరికీ పంచిపెడతాడు. అతడిని అతడి నరకంలోంచి లాగి, తన స్వర్గంలోకి వెంటపెట్టుకుని వెళతాడు. ఇది సుఖపడే కాలం, ఇది బాధపడాల్సిన సమయం అంటూ ఎవరికీ జీవితంలోనూ ఎక్కడా రాసిపెట్టి ఉండవు. అంతా వ్యక్తి వర్తమాన స్థితిపై ఆధారపడి ఉంటుంది. తాను పరిమళాల్ని వెదజల్లాలని ఏ పువ్వూ ప్రత్యేకంగా అనుకోదు. అందరిని తన సువాసనలతో సరిసమానంగా సంతోషపరచడం దానికది ప్రకృతి ధర్మం. అలాగే తనకు ఉన్నంతలో తోడి వారి అవసరాలు తీర్చడం ఒక నిర్మల నిస్వార్థ హృదయానికి జన్మతో వచ్చే త్యాగ గుణం. స్వార్థంతో, అహంకారంతో, అసూయతో తాను సుఖపడకుండా, ఇతరులనూ సంతోషపెట్టకుండా తన బతుకును దుఃఖభరితం చేసుకునే మనిషి జీవితం అతడికే కాకుండా అందరికీ దుర్భరమే. మనిషి మరణానంతరం స్వర్గ నరకాల్లో దేనికి ప్రస్థానం జరుపుతాడో అన్న మీమాంసతో వర్తమానాన్ని అశాంతి పాలు చేసుకోనవసరం లేదు. ఇక్కడే ఈ భూమి మీదే స్వర్గ నరకాలలో దేనిని ఎంపిక చేసుకోవాలన్నా ఆ భగవంతుడు మనిషికి సమానమైన అవకాశాలు అడుగడుగునా సమకూరుస్తూనే ఉంటాడు. దేనిలో ప్రవేశించటమా అన్నది మనిషి చేతుల్లోనే ఉంది. - శొంఠి. విశ్వనాథం