'నరకం' చూపించిన ఏఐ.. భయపడని వారే వీడియో చూడండి! | What Hell Looks Like Check This AI Version Video Goes Viral On Social Media, See Netizens Reactions | Sakshi
Sakshi News home page

'నరకం' చూపించిన ఏఐ.. భయపడని వారే వీడియో చూడండి!

Published Mon, Jul 8 2024 4:49 PM | Last Updated on Mon, Jul 8 2024 5:12 PM

What Hell Looks Like Check The AI Video

స్వర్గం, నరకం ఉన్నాయో.. లేదో తెలియదు!.. కానీ దశాబ్దాల క్రితం గరుడు పురాణం చదివి ఇలా ఉంటుందని కొందరు ఊహించుకుని ఉండొచ్చు. ఆ తరువాత తరం వాళ్ళు సినిమాలు చూసి ఇలాగే ఉంటాయని భావన పొంది ఉండవచ్చు. అయితే నేడు టెక్నాలజీ బాగా పెరిగింది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అభివృద్ధి చెందిన తరుణంలో ఏ ప్రశ్నకైనా.. ఇదిగో సమాధానం అన్నట్టు తయారైపోయింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి నరకం ఎలా ఉంటుందని 'ఏఐ'ను అడిగారు. దీనికి కూడా ఏఐ ఓ వీడియో క్రియేట్ చేసింది.

ఏఐ చూపించిన నరకం వీడియోను హిస్టారిక్ వీడియోస్ వారు తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియో షేర్ చేస్తూ.. నరకం చూపించమని ఏఐను అడిగాను' దానికి సమాధానంగా ఈ వీడియో వచ్చిందని పేర్కొన్నారు.

18 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఇందులో లెక్కకు మించిన చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుడు ఆ మధ్యలోకి ఒక శరీరం పడుతుంది. ఆ తరువాత ఆ శరీరం ముఖం ఆకృతి వక్రంగా మారుతుంది. ఒకేసారి నోటి నుంచి చేయి బయటకు వచ్చినట్లు కూడా కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్నంత సేపు తప్పకుండా భయం పుడుతుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. ఒకరు ఏఐను ఇలాంటి వింత ప్రశ్నలు కూడా అడుగుతారా? అని అన్నారు. మరొకరు రోజూ పబ్లిక్ బస్సులో వెళుతుంటే ఇలాంటి అనుభవమే ఎదురవుతుందని అన్నారు. మొత్తం మీద ఏఐ నరకం చూపించిందని చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement