breaking news
AI
-
చిన్నారులు ఏఐ నేర్చుకునేలా శుతి ధరివాల్ గేమ్ స్ట్రాటజీ..!
పిల్లలు డిజిటల్ మీడియాకి బానిసైపోతున్నారు తల్లిదండ్రులు, నిపుణులు ఆందోళన చెందుతున్న తరుణంలో ఎంఐటీ స్టూడెంట్ సరికొత్త స్ట్రాటజీతో వస్తోంది. ఇదేంటి అనుకోకండి వాళ్లు ఏఐ స్కిల్క్ అందిపుచ్చుకునేలా గేమ్స్‌తో వ్యూహం రచిస్తోందామె. చిన్నారులు గేమ్స్ అంటే ఎంతో ఇష్టమో తెలిసిందే. ఆన్లైన్ ఆడే ఆ గేమ్స్‌కి ఏఐ సాంకేతికతను మేళవించి వాళ్లే స్వయంగా ఏఐ ఉపయోగించడం నేర్చుకునేలా చేస్తూ..ప్రయోగాలు చేసేలా చేస్తుందట. అంతేగాదు అది నేర్చుకునే విధానాన్నే మార్చి..వాళ్లను మంచి మేధావులుగా తీర్చిదిద్దుతుందట. ఈ సరికొత్త ఆవిష్కరణకు తెరతీసింది మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థిని. భారతీయ పరిశోధకురాలు, శృతి ధరివాల్. కంప్యూటర్ సైన్స్ విద్యార్థి అయినా ఆమె ఎడ్యుగేషన్ గేమ్‌ని రూపొందించి దానికి ఏఐని మేళవించింది. దీన్ని పిల్లలు, టీనేజర్లకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారామె. వాళ్లందర్నీ ఏఐ సాధనాలను ఎలా వాడుకోవచ్చో, ఎలా ప్రయోగాలు చేయాలో ట్రైన్ చేస్తుందట. దాని పేరే కో క్రియేటివ్ ఏఐ టూల్స్(కోకో). ఈ ఎడ్యుకేషన్ గేమ్‌కి అంతర్జాతీయ విద్యా సాంకేతిక వర్గాల నుంచి మంచి గుర్తింపు, స్పందన వచ్చింది. ఈ కోకో పిల్లలు నేర్చుకునే విధానాన్ని మారుస్తుందట. ఎవరీ ధరివాల్..?దరీవాల్ అకాడమీ జర్నీ జైపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి మొదలైంది . అక్కడ ఆమె 2008లో బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత 2011లో గుర్గావ్లోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె ఎయిర్‌టెల్‌లో యంగ్ లీడర్‌గా పనిచేసింది. అక్కడ నుంచి బెంగళూరుకు చెందిన మ్యాడ్రాట్ గేమ్స్‌లో ప్రొడక్ట్ డెవలప్మెంట్ హెడ్‌గా రేంజ్‌కి చేరుకుంది. ఆ తర్వాత టెక్నాలజీ, విద్యా, క్రియేటివిటీ వంటిపై పరిశోధనలు చేసే దిశగా అడుగులు వేస్తూ విద్యా సంబంధిత ఆటలను రూపొందిచడం ప్రారంభించింది. అంతేగాదు మ్యాడ్రేట్ గేమ్స్‌లో విద్యా సామాజిక ఆటల రూపకల్పనకు నాయకత్వం వహించారు. అవి భారతదశవ వ్యాప్తంగా రెండు లక్షల కుటుంబాలకు చేరాయి. ఆ తర్వాత ఆమె టెక్నాలజీని సాఫ్ట్‌వేర్‌గా చూడకుండా పిల్లలు కూడా నేర్చుకునేలా, సృష్టించేలా ప్రభావితం చేయొచ్చా అనే దిశగా పరిశోధనలు చేసింది. అలా ఆమె ఎంఐటీ ల్యాబ్‌లో చేరారు. అక్కడే 2016, 2018 మధ్య మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, 2018, 2025 పిల్లల కోసం కొత్త డేటా-విజువలైజేషన్ సాధనాలకు సంబంధిన అంశంపై పీహెచ్డీ చేశారు. అలా వచ్చిందే ఈ కోకో. ఆ పరిశోధనకుగానూ ఏసీఎం కాన్ఫరెన్స్ ఆన్ ఇంటరాక్షన్ డిజైన్ అండ్ చిల్డ్రన్‌లో బెస్ట్ షార్ట్ పేపర్ అవార్డును కూడా గెలుచుకుంది. అంతేగాదు 2023–24 లెర్నింగ్ ఇంజనీరింగ్ టూల్స్ కాంపిటీషన్లో కోకో విజయం సాధించిది. ఈ పరిశోధన ఎంఐటీ న్యూస్, టెక్నాలజీ రివ్యూ, ఎడ్సర్జ్లలో ప్రచురితమైంది కూడా. ఇక్కడ ధరివవాల్ తయారు చేసిన కోకో పిల్లలను ఏఐ వినయోగదారులగా కాకుండా క్రియేటర్స్‌గా మారుస్తుందన్న కోణమే హైలెట్ అయ్యి అందరీ ప్రశంసలు అందుకుంది. అంతేగాదు ధరీవాల్ పిల్లలు ఏఐ ఉయోగించొచ్చా అన్నది ప్రశ్న కాదు, వాళ్లకు దాన్ని సృజనాత్మక భాగస్వామిగా ఉపయోగించేలా చేయడమే ప్రధానం అంటుందామె. ఇది వాళ్లలోని టాలెంట్‌ని బయటకు తీసేందుకు దోహదపడుతుదంని నమ్మకంగా చెబుతోందామె. (చదవండి: సీఏ వదిలేసి మరి దోసె వ్యాపారం..నెలకు రూ. 12 లక్షలు!) -
ఏఐ చేతిలో మీ డబ్బు సురక్షితమేనా?
నేటి డిజిటల్ యుగంలో బడ్జెట్ నిర్వహణ నుంచి పోర్ట్‌ఫోలియో ప్లానింగ్ వరకు ప్రతిదానికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం వేగంగా పెరుగుతోంది. ఉచితంగా, నిమిషాల్లో సలహాలు లభిస్తుండటంతో చాలామంది ఇన్వెస్టర్లు ఏఐ చాట్బాట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, మన కష్టార్జితాన్ని నిర్వహించే విషయంలో ఏఐపై గుడ్డిగా ఆధారపడటం ప్రమాదకరమని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏఐ ఎక్కడ ఉపయోగపడుతుంది?ఆర్థిక అక్షరాస్యతను పెంచుకోవడానికి ఏఐ అద్భుతమైన సాధనం. ప్రాథమిక ఆర్థిక సూత్రాలు అర్థం చేసుకోవడం, ప్రతి నెలా అవుతున్న ఖర్చులను విశ్లేషించడం, బడ్జెటింగ్ డ్రాఫ్ట్‌లు తయారు చేయడం, ప్రాథమిక పెట్టుబడి వ్యూహాల గురించి అవగాహన పెంచుకోవడానికి ఏఐ సాధనాలు చక్కగా ఉపయోగపడతాయి.ఎక్కడ సరిహద్దు గీసుకోవాలి?ఏఐ మోడళ్లు గణాంకాలు, డేటా ఆధారంగా నడుస్తాయి తప్ప, మనుషుల మానసిక భావోద్వేగాలు, జీవిత లక్ష్యాలు లేదా అకస్మాత్తుగా వచ్చే ఆర్థిక అత్యవసర పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకోలేవు. కాబట్టి పర్సనల్ ఫైనాన్స్ విషయంలో ఏఐని గుడ్డిగా నమ్మేలేం.ఏఐ కొన్నిసార్లు లేని సమాచారాన్ని చాలా ధీమాగా, నిజమని నమ్మించేలా చెప్తుంది (దీనినే హెల్యూసినేషన్ అంటారు). పన్ను లెక్కింపులు లేదా నిర్దిష్ట ఫండ్ల ఎంపికలో ఇది తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది.గుర్తింపు పొందిన మానవ ఫైనాన్షియల్ అడ్వైజర్లు చట్టబద్ధంగా మీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఏఐ సాధనాలకు ఎటువంటి చట్టపరమైన బాధ్యత ఉండదు.మీ బ్యాంక్ ఖాతా నంబర్లు, పాన్ లేదా వ్యక్తిగత పన్ను వివరాలను ఏఐ ప్లాట్‌ఫారమ్‌ల్లో అప్లోడ్ చేయడం వల్ల సైబర్ భద్రత, గోప్యతా సమస్యలు తలెత్తవచ్చు.ఏఐని నిపుణుడైన ఫైనాన్షియల్ అడ్వైజర్‌కు ప్రత్యామ్నాయంగా చూడకూడదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీన్ని ప్రాథమిక పరిశోధన, ప్రశ్నలు సిద్ధం చేసుకునే అసిస్టెంట్‌గా మాత్రమే ఉపయోగించాలి. తుది నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సంక్లిష్టమైన పన్ను ప్రణాళికలు లేదా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహా తీసుకోవడమే సురక్షితమైన మార్గం.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్! -
పంటి మెరుపులకు ఏఐ నిఘా!
హోమ్ అప్లయెన్సెస్, టెక్నాలజీ దిగ్గజం ‘డైసన్’ (Dyson) నోటి ఆరోగ్య సంరక్షణ (ఓరల్ కేర్) విభాగంలో కొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ కెమెరా సాంకేతికతల కలయికతో ‘కెమెరాజెట్’ పేరుతో రూపొందించిన ఓ స్మార్ట్ టూత్‌బ్రష్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను 499 డాలర్లు(సుమారు రూ.47,000)గా నిర్ణయించారు.ఈ డివైజ్ కేవలం బ్రష్ చేయడానికే పరిమితం కాకుండా ఒకే సమయంలో బ్రషింగ్, ఫ్లాసింగ్ (Flossing) రెండింటినీ పూర్తిచేసేలా రూపుదిద్దుకుంది. అంటే.. నోటి శుభ్రతలో పంటి సందుల నడుమ పేరుకుపోయే ప్లాక్, ఆహార వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా డైసన్ ఇంజినీర్లు దీనిని డిజైన్ చేశారు.సాంకేతిక పరిజ్ఞానం – పనితీరుఈ టూత్బ్రష్లోని ఏఐ సిస్టమ్‌కు దాదాపు 4,70,000 డెంటల్ ఇమేజెస్‌తో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఇది దంతాల నిర్మాణం, పళ్ళ మధ్య ఉండే ఖాళీలను కచ్చితత్వంతో గుర్తించగలదు. బ్రష్ హెడ్లో అమర్చిన మైక్రో కెమెరా పళ్ళ సందులను రియల్ టైమ్‌లో ట్రాక్ చేస్తుంది. దంతాల మధ్య ఖాళీలను కెమెరా గుర్తించిన మరుక్షణమే బ్రష్ నుంచి మౌత్‌వాష్ స్ప్రే సరిపడా ప్రెషర్‌తో పళ్లపై చిమ్ముతుంది. దీనివల్ల వాటి మధ్య పేరుకున్న వ్యర్థాలు తక్షణమే తొలగిపోతాయి.Dyson has launched the $499 CameraJet toothbrush, using AI trained on 470,000 dental images. A built-in camera identifies gaps between teeth and triggers a precision jet of mouthwash in real time effectively combining brushing and flossing in one device. pic.twitter.com/Et0JYCuwmv— Harsh Goenka (@hvgoenka) September 2, 2026సాధారణంగా బ్రషింగ్ తర్వాత విడిగా ఫ్లాసింగ్ చేయడం లేదా మౌత్‌వాష్ ఉపయోగించడం చాలామందికి అలవాటు ఉండదు. కానీ కెమెరాజెట్ పరికరం ఈ రెండు ప్రక్రియలను ఒక్కటిగా మార్చి వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తుంది. దాంతోపాటు దంత సమస్యలైన చిగుళ్ళ వ్యాధులు, పిప్పిపళ్ళు వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది.ఇదీ చదవండి: రాబోయేది నిశ్శబ్దంగా నలిపేసే సంక్షోభం! -
ఉద్యోగాల్లో కావాలి.. ‘కొత్త రిజర్వేషన్లు’!!
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు.. ఇలా రకరకాల రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ప్రయివేటు ఉద్యోగాల విషయానికి వస్తే ఇక్కడ ఇలాంటి రిజర్వేషన్లు లేవు. అయితే కృత్రిమ మేధ (AI) విస్తృతంగా పెరుగుతూ ఉద్యోగాలను మింగేస్తున్న నేపథ్యంలో కొత్త రకం రిజర్వేషన్లు కావాలన్న భావనలు పెరుగుతున్నాయి. అవే ‘మానవ రిజర్వేషన్లు’.కృత్రిమ మేధ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఉద్యోగాల భవిష్యత్తుపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కీలక ప్రతిపాదన చేశారు. సాంకేతికంగా ఏఐ చేయగలిగినప్పటికీ, కొన్ని ఉద్యోగాలను పూర్తిగా మనుషులకే కేటాయించే ‘హ్యూమన్ రిజర్వ్డ్’ (Human Reserved) కేటగిరీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇటీవల ప్రచురించిన దాదాపు 6,000 పదాల వ్యాసంలో గేట్స్ ఈ ఆలోచనను వెల్లడించారు.వేగంగా మారనున్న ఉద్యోగ ప్రపంచంఏఐ ప్రభావం గతంలోని కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సాంకేతిక మార్పుల కంటే వేగంగా ఉండొచ్చని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే డిజిటల్ వ్యవస్థల్లో ఏఐని అమలు చేసే అవకాశం ఉండటంతో, ఉద్యోగాల్లో మార్పులు దశాబ్దాల సమయం తీసుకోకపోవచ్చని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్, మిడ్-లెవల్ ఉద్యోగాలు గణనీయంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందన్నారు.కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా విశ్లేషణ, రుణాల అంచనా వంటి అనేక పనులను భవిష్యత్తులో ఏఐ నిర్వహించే అవకాశం ఉందని గేట్స్ పేర్కొన్నారు. కేవలం ఉద్యోగాలు కోల్పోయిన వారికి మరో ఉద్యోగం కోసం శిక్షణ ఇవ్వడం మాత్రమే సరిపోదని, ప్రభుత్వాలు ముందుగానే ప్రణాళిక రూపొందించాలని సూచించారు.‘హ్యూమన్ రిజర్వ్డ్’ అంటే?గేట్స్ ప్రతిపాదించిన ఈ విధానం ప్రకారం, AI లేదా రోబోట్లు ఒక పనిని చేయగలిగినా.. సమాజం నిర్ణయిస్తే ఆ పనిని మనుషులకే పరిమితం చేయవచ్చు. ప్రకృతి రిజర్వ్‌లలో కొన్ని ప్రాంతాలను అభివృద్ధికి దూరంగా ఉంచినట్లే, కొన్ని ఉద్యోగాలను కూడా సాంకేతిక ఆటోమేషన్ నుంచి రక్షించాలన్నది ఈ ఆలోచన.ప్రత్యేకంగా వృద్ధుల సంరక్షణ, పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్య సేవలు వంటి రంగాల్లో మానవ సంబంధాలు, భావోద్వేగం, నమ్మకం కీలకమని గేట్స్ అభిప్రాయపడ్డారు. తన తండ్రికి అల్జీమర్స్ వ్యాధి సమయంలో అందిన సంరక్షణను ఉదాహరణగా తీసుకున్న ఆయన.. కొన్ని సందర్భాల్లో మానవీయ స్పర్శకు ప్రత్యామ్నాయం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.అయితే ప్రతి రంగంలోనూ AIని నిషేధించాలని ఆయన చెప్పలేదు. ఉదాహరణకు విద్య, వైద్యంలో AIని పూర్తిగా తొలగించడం కాకుండా, మనుషుల సామర్థ్యాన్ని పెంచే సాధనంగా ఉపయోగించవచ్చని సూచించారు. కొన్ని ఉద్యోగాలను శాశ్వతంగా, మరికొన్నింటిని కొంతకాలం మాత్రమే ‘హ్యూమన్ రిజర్వ్డ్’గా ఉంచే అవకాశం ఉండాలని గేట్స్ అభిప్రాయపడ్డారు.AI వినియోగంపై ‘టోకెన్ ట్యాక్స్’ఉద్యోగాలపై AI ప్రభావాన్ని తగ్గించేందుకు మరో ఆసక్తికరమైన ప్రతిపాదనను గేట్స్ చేశారు. AI టోకెన్లు, రోబోట్లపై పన్ను విధించాలని సూచించారు. ప్రస్తుతం ఒక ఉద్యోగిని నియమిస్తే కంపెనీ పేరోల్ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అదే పనిని రోబోట్ లేదా AI ద్వారా చేయిస్తే ఆ విధమైన పన్ను భారం ఉండకపోవడం వల్ల కంపెనీలు ఆటోమేషన్ వైపు వేగంగా వెళ్లే అవకాశం ఉందని ఆయన వాదించారు.ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగాలు కోల్పోయిన వారికి రీ-స్కిల్లింగ్, శిక్షణ, సామాజిక భద్రతా కార్యక్రమాలకు వినియోగించవచ్చని గేట్స్ సూచించారు. AI వినియోగాన్ని పూర్తిగా అడ్డుకోవడం కాకుండా, మానవ కార్మికులను ఒక్కసారిగా భర్తీ చేసే వేగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన ఉందని తెలుస్తోంది.40 శాతం ఉద్యోగాలు రిజర్వ్ చేయొచ్చా?గేట్స్ చేసిన వ్యాఖ్యల్లో మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. అమెరికన్ మీడియా సంస్థ ఆక్సియోస్‌తో మాట్లాడిన సందర్భంగా, అత్యంత కఠినమైన రూపంలో అమలు చేస్తే ప్రారంభ దశలో దాదాపు 40 శాతం ఉద్యోగాలను ‘హ్యూమన్ రిజర్వ్డ్’గా ఉంచే అవకాశం ఉందని ఆయన ఊహించారు. అయితే ఇది తుది లక్ష్యం లేదా అధికారిక విధాన ప్రతిపాదన కాదని, ఇలాంటి సంఖ్యను నిర్ణయించడం కూడా చాలా క్లిష్టమని ఆయన అంగీకరించారు.ప్రభుత్వాలకు గేట్స్ సూచనAI ప్రభావాన్ని ఎదుర్కోవడానికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ కొత్త వ్యవస్థలు అవసరమని గేట్స్ చెబుతున్నారు. ఉద్యోగాలు మాత్రమే కాకుండా సైబర్ భద్రత, ఆరోగ్యం, విద్య, పిల్లలపై AI ప్రభావం, ఆర్థిక అసమానతలు వంటి అంశాలపైనా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. AI ప్రయోజనాలు అందరికీ చేరాలంటే, దాని వల్ల ఏర్పడే నష్టాలను కూడా సమాజం ముందుగానే నిర్వహించాల్సిన అవసరం ఉందన్నది ఆయన వాదన. -
టూర్ వెళ్లే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి!
‘ఆకాశపు అంచుల్లో విహరిస్తూ.. మేఘాల్లో తేలిపోవాలని ఉందా? అయితే.. మీకు ఇదే మా స్వాగతం’ అంటూ ఓ అందమైన యువతి హిమాలయాల్లో నిల్చుని రీల్స్‌తో ఆకట్టుకుంది. ఆమె వెనక పిల్లలు, పెద్దలు, మహిళలు బారులు తీరి కనిపిస్తారు. సుందర మంచుకొండలు, పర్యాటకుల సందడితో ఆ రీల్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి. మరో ఆలోచనకు తావు లేకుండా పర్యాటక ప్రియులు ఆ రీల్స్‌తో పాటు కనిపించే మొబైల్ నంబర్లను సంప్రదిస్తారు.ఆ తర్వాత బుకింగ్‌ల పర్వం మొదలవుతుంది. క్షణాల్లో చెల్లింపులు.. ఆ వెంటనే పర్యటన తేదీల ఖరారు. మరోవైపు ఆధ్యాత్మిక టూర్ల పేరిట మహిళలు, వయోధికులను ఆకట్టుకొనే ప్రకటనలు. టూర్ ఏజెంట్లు ఏఐ ఆధారిత రీల్స్‌తో మాయాజాలం సృష్టిస్తున్నారు. పర్యాటకుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి ప్రమాణాలు, అధికారిక గుర్తింపు లేకుండా అడ్డగోలుగా పుట్టుకొస్తున్న ట్రావెల్స్ సంస్థలు, ఏజెంట్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. పర్యాటకులను దోచుకుంటున్నారు. - సాక్షి, హైదరాబాద్గ్రూప్ టూర్లపై ఆసక్తి.. కొంతకాలంగా గ్రూప్ టూర్లకు విశేష ఆదరణ లభిస్తోంది. జనం పెద్ద ఎత్తున ఇలాంటి టూర్లకు తరలి వెళ్తున్నారు. కిట్టీపారీ్టల పేరిట డబ్బులు పొదుపు చేసే మహిళలు, ఇళ్లల్లో ఒంటరిగా ఉంటున్న వయోధికులైన భార్యాభర్తలు, ఇంటిల్లిపాది కలిసి ఏదైనా ఒక ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లాలని భావించే వాళ్లు గ్రూప్ టూర్లను ఎంపిక చేసుకుంటున్నారు. తక్కువ బడ్జెట్లో ఈ తరహా టూర్లు అందుబాటులో ఉండడంతో క్షణాల్లో బుకింగ్‌లు భర్తీ అవుతున్నాయి.మరోవైపు విదేశాల్లో ఉండే పిల్లలు హైదరాబాద్‌లోని తమ తల్లిదండ్రులకు ఈ ప్యాకేజీలను బహుమతులుగా అందజేస్తున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా ఇలాంటి ప్యాకేజీలను రూపొందిస్తున్న టూరిస్ట్ సంస్థలు నేపాల్, భూటాన్, శ్రీలంక తదితర దేశాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులను తరలిస్తున్నాయి. కేవలం ఏజెంట్లను నమ్ముకొని వెళ్లే ఇలాంటి పర్యాటకులు ఆ తర్వాత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నేపాల్, భూటాన్ వంటి ప్రాంతాల భౌగోళిక, వాతావరణంపై కనీస అవగాహన లేకుండానే విమానంలో తరలి వెళ్తున్నారని పర్యాటకరంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మాయమాటలు నమ్మి.. టిబెట్, నేపాల్ తదితర ప్రాంతాల్లో వందలాది సరస్సులు ఉన్నాయి. కానీ.. చాలామంది కైలాస మానస సరోవరాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులు, ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు లేనివాళ్లు మాత్రమే అక్కడి వరకు వెళ్లగలరు. ఇటీవల కాలంలో 65 ఏళ్లు దాటిన వాళ్లు, గుండెజబ్బులు, ఇతరత్రా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవాళ్లు కూడా ఏజెంట్ల మాయ మాటలు నమ్మి వెళ్తున్నారు.ఈ నిబంధనలు తప్పనిసరి..కొండలు, ఎత్తైన పర్వతాల్లో విహరించేందుకు వెళ్లే పర్యాటకులకు శిక్షణ అవసరం. పాస్‌పోర్ట్, చైనా, టిబెట్ వీసాలు తప్పనిసరిగా తీసుకోవాలని మన విదేశాంగశాఖ ఈ ఏడాది జూన్ 27న స్పష్టంగా ప్రకటించింది.ఈసీజీ, రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉన్నట్లు వైద్యుల నుంచి ధ్రువీకరణ ఉండాలి.విదేశాంగశాఖ నిబంధనల మేరకు బాడీమాస్ ఇండెక్స్ (బీఎంఐ) 25 లోపు ఉంటే మంచిది.ఆర్ధోపెడిక్గా ఫిట్నెస్ లేనివాళ్లు, ఆస్తమా బాధితులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి టూర్లకు వెళ్లొద్దు.రీల్స్ చూసి మోసపోవద్దుకొంతమంది నకిలీ ఏజెంట్లు సృష్టించే కృత్రిమ రీల్స్‌ను చూసి మోసపోవద్దు. గ్రూప్ టూరిజం జోలికి వెళ్లకపోవడమే మంచిది. వెళ్లే ప్రాంతంపై పూర్తి అవగాహన ఉండాలి. కనీస సదుపాయాలు, భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.– కె.రంగారెడ్డి, చైర్మన్ ఐఏటీఓఇవీ చదవండి: కాప్రా చెరువులో నిమజ్జనాలు వద్దు -
డిగ్రీ కాదు.. స్కిల్స్ ఉంటే చాలు! ఈ రాష్ట్రం టాప్‌లో!
ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు.. కార్పొరేట్ హబ్‌గా వెలుగుతున్న ముంబైలను దాటుకుని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, స్కిల్స్ రేస్‌లో ఉత్తరప్రదేశ్ నెంబర్ వన్ పీఠాన్ని కైవసం చేసుకుంది! ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 విడుదల చేసిన తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం. 78.64 శాతం ఎం΄్లాయబిలిటీ రేటుతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా.. ఇందులో మహిళలే ఎక్కువ అర్హత గలవారిగా రికార్డు సృష్టించారు. ఉద్యోగానికి కావాల్సింది చేతిలోని డిగ్రీలు కాదు... స్కిల్స్ కూడా అవసరమే అని నిరూపించారు.ఇన్నాళ్లూ మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలదే హవా అనుకున్న ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేస్తూ, ఈసారి ఉత్తరప్రదేశ్ యువత ప్రతిభలో టాప్‌గేర్ వేశారు. మారుతున్న ఉద్యోగ అవసరాలకు తగినట్టుగా నైపుణ్యాలను పెంపొందించుకుని 78.64 శాతంతో ప్రథమ స్థానాన్ని సంపాదించుకుంది. వాణిజ్య రాజధాని మహారాష్ట్ర గట్టి పోటీనిచ్చినప్పటికీ 75.42 శాతంతో రెండో స్థానానికే పరిమితమైంది. కర్ణాటక ఐటీ పవర్ హౌస్‌గా ఉన్నప్పటికీ 73.85 శాతంతో నైపుణ్య వృద్ధిలో మూడో స్థానానికి చేరింది. కేరళ విద్యా శ్రేణిలో ముందంజలో ఉన్నా నైపుణ్యంలో 72.16 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. ఢిల్లీ 71.25 శాతంతో ఐదో స్థానంలో నిలిచింది.జాతీయ సగటు పెరుగుదలదేశ వ్యాప్తంగా యువత ఉద్యోగ అర్హత 2025లో 54.81% ఉండగా 2026 నాటికి 56.35% కి పెరిగింది. 2022లో ఇది 46.2% మాత్రమే ఉండేది. డిజిటల్ టెక్నాలజీల వినియోగం పెరగడం దీనికి ప్రధాన కారణం.మహిళలే టాప్ఉద్యోగార్హతలో మహిళలు (54%) మొదటిసారిగా పురుషులను (51.5%) వెనక్కి నెట్టారు! ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి వస్తున్న మహిళలు బ్యాంకింగ్, హెల్త్‌కేర్, విద్యారంగాల్లో సరికొత్త రికార్డులు çసృష్టి్టస్తున్నారు.ఏఐ నైపుణ్యాలే ముఖ్యంకంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లలో అత్యధికంగా 80%, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 78%, ఇన్స్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో 77% ఉద్యోగ అర్హత నమోదైంది. ఏఐ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ ఉంది. గ్లోబల్ ఏఐ టాలెంట్‌లో 16% వాటా మన భారతీయులదే.గిగ్ ఎకానమీ ధమాకా2030 నాటికి దేశంలో 2.35 కోట్ల మంది ఫ్రీలాన్సర్లు, గిగ్ వర్కర్లు రాబోతున్నారనీ.. ‘ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఆఫీస్ డెస్క్’’ అనే సాంప్రదాయ పద్ధతికి కాలం చెల్లుతోందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. పాఠ్యపుస్తకాల్లో చదివే పాతకాలపు విషయాల కంటే, కంపెనీలలో నేరుగా ఉపయోగపడే ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్నవారికే ఉద్యోగాల్లో గ్రీన్ సిగ్నల్ లభిస్తోంది.అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కోడింగ్, ఏఐ టూల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్న యువత ఏ ప్రాంతంతోనూ సంబంధం లేకుండా ముందంజలో ఉంటరన్నమాట.ఇవి కూడా చదవండి: ఆటల్లో రాణిస్తున్నారు! -
ఏంటి..? ఏఐ ఇప్పుడు వైరస్‌లను కూడా రూపొందిస్తోందా?
ఏఐతో ఇప్పటిదాకా చిత్రాలను, చిన్నచిన్న వీడియోలను తయారు చేయడం మనకు తెలుసు... కొందరు కోడింగ్ కోసం ప్రాంప్ట్ ఇస్తారు. ప్రాజెక్టు పనులకు కోసం వివరాలు వెతుకుతారు, మరికొందరు కొత్త రకం సినిమా కథలను తయారు చేయడం, సంగీతాన్ని సృష్టించడం కోసం ఏఐని వాడుతున్నారు.అయితే, తాజా పరిశోధనల ఫలితంగా జీవుల జన్యు నిర్మాణాన్ని కూడా రూపొందించే దిశగా కృత్రిమ మేధా అడుగులు వేస్తోంది. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆర్క్ సంస్థ పరిశోధకులు కృత్రిమ మేధస్సును ఉపయోగించి ప్రకృతిలో ఇంతకు ముందు లేని 16 కొత్త వైరస్‌లను రూపొందించారు. వీటితో మానవాళికి ప్రమాదం లేదు. ఎందుకంటే ఇవి మనుషులకు సోకేవి కావు.మనుషులను బాధించే బ్యాక్టీరియాను నాశనం చేసే వైరస్. మందులకు లొంగని బ్యాక్టీరియాని ఈ తరహా వైరస్‌లతో ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నం ప్రయోగశాలలోనే ఉంది. ఏఐతో రూపొందించిన వైరస్ తయారై మార్కెటెక్కాలంటే మరి కొన్నేళ్లు ఆగాల్సిందే.ఇవి కూడా చదవండి: మందులు కాదు.. మ్యూజిక్ చాలు! ఏఐతో మానసిక ఒత్తిడికి చెక్! -
16 ఏళ్ల స్టూడెంట్ ఘనత..! తండ్రికే జీతం ఇస్తున్న తనయుడు..
తండ్రిని పాకెట్‌మనీ అడిగే వయసులో తండ్రికే ఉపాధి ఇచ్చి..జీతం ఇస్తున్నాడో యువకుడు. పైగా తన తండ్రినే ఎందుకు నియమించుకున్నాడో ఇచ్చిన వివరణ సైతం అదుర్స్. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు. మరి పేరెంట్స్‌కే గర్వకారణమైన ఆ తనయుడు ఎవరంటే..అతడే కేరళలోని కొచ్చి, కున్నుంపురంకి చెందిన 16 ఏళ్ల రౌల్జాన్ అజు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజనెన్స్ ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తిగా పేరుతెచ్చుకుంటున్నాడు ఈ యువకుడు. అతడు కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్ చదువుతున్నప్పుడే ఏఐ కంపెనీని నడుపుతుండటం విశేషం. ఆ కంపెనీ సాయంతో ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడం, ఈ టెక్నాలజీలో ప్రజలకు శిక్షణ ఇవ్వడం వంటివి చేస్తుంటాడు. నిజానికి అజుకి ఏఐ పట్ల ఉన్న అభిరుచే ఒక స్టార్టప్ కంపెనీకి దారితీసింది. పైగా తండ్రిపై ఆధారపడే టీనేజ్ యువకుల మాదిరిగా కాకుండా తన నాన్ననే తన కంపెనీలో ఉద్యోగిగా నియమించుకుని, నెలకు రూ. 2 లక్షల జీతం ఇస్తుండటం విశేషం. ఏఐలో పట్టు ఎప్పుడు సాధించాడంటే..తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఏఐ సాంకేతికతను నేర్చుకోవడంపై దృష్టి సారించాడు. ఆ తర్వాత ఒక స్టార్టప్‌ను స్థాపించాడు. అందులో ప్రస్తుతం తన తండ్రితో సహా సుమారు 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంతేగాదు ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.అజు ఈ టెక్నాలజీని వీడియో ఎడిటింగ్ ద్వారా తెలుసుకున్నాడు. ఇక తండ్రి వల్ల తనకు ఈ ఏఐ సాంకేతికపై పట్టు సాధించగలిగినట్లు చెబుతున్నాడు. ఎలాగంటే..తన తండ్రికి అడోబ్‌లో ఉద్యోగం వచ్చినప్పుడు, తనకు అన్ని ప్రీమియం టూల్స్‌కు ఉచిత యాక్సెస్ లభించిందని, దానివల్ల ఏఐ గురించి పూర్తిస్థాయిలో నేర్చుకోగలిగానని అంటున్నాడు. ఆ తర్వాత స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ కోసం మీబాట్ అనే సొంత రోబోట్‌ను తయారు చేసినట్లు తెలిపాడు. ఇక తన తండ్రినే కంపెనీలో ఎందుకు నియమించుకున్నాడంటే..తాను ఫోన్ నుంచి కావల్సినంత జ్ఞానాన్ని ఆర్జించగలను కానీ, ఆయనకున్న అపార అనుభవం తనకు లేదని చెప్పుకొచ్చాడు. పైగా ఆయనకు అమెజాన్, అడోబ్, విప్రో, ఐబీఎం వంటి కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉంది, అందువల్ల ఆయన నుంచి తాను మరిన్ని విషయాలు సులభంగా నేర్చుకోగలగడం తోపాటు ఆయన అనుభవం కంపెనీ మార్కెటింగ్‌కి చక్కగా ఉపయోగాపడుతుందని చెబుతున్నాడు. కాగా, అజు స్టార్టప్ ఏఐ టెక్నాలజీస్, థింక్క్రాఫ్ట్ అకాడమీని నడుపుతోంది. ఇవి ప్రతిష్టాత్మక సంస్థలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, విదేశీ విద్యార్థులు చాలా సునాయాసంగా ఏఐ నైపుణ్యాలను పుణికి పుచ్చుకునేలా ట్రైన్ చేస్తాయి. అక్కడితో ఆగిపోలేదు అజు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో RESQ AI, MeBot, ZapGap, Investo AI, FeedFye, 15 AI సాధనాలను రూపొందించారు. అంతేగాదు అజు కంపెనీ ఏకంగా వరల్డ్‌వైడ్‌గా వివిధ రిమోట్ ఉద్యోగులను కలిగి ఉంటూ ఇంటర్నేషనల్ రేంజ్లో గుర్తింపు పొందుతుండటం విశేషం.(చదవండి: రోజువారీ కూలీ నుంచి ..రూ. 15 లక్షల వార్షిక వేతనం, పీహెచ్డీ..!) -
ఇది...ఇ–తాబేలు! 16 ఏళ్ల యువకుడి ఆవిష్కరణ
ప్రపంచాన్ని భయపెడుతున్న పర్యావరణ సమస్యలలో...మైక్రోప్లాస్టిక్ ఒకటి. ఇవాన్ బుడ్జ్ అనే పదహారేళ్ల కెనడియన్ మైక్రోప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడే ఏఐ ఆధారిత రోబో తాబేలును తయారుచేశాడు....ఒకరోజు...కుటుంబంతో కలిసి క్యాంపింగ్‌కు వెళ్లిన ఇవాన్ ఒక తాబేలు ఈత చూసి ‘వావ్’ అనుకున్నాడు. ఆ తాబేలు స్ఫూర్తితో నీటి అడుగున పని చేసే 3డీ హోలోగ్రాఫిక్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన రోబోటిక్ తాబేలు తయారు చేయాలనుకున్నాడు. ఎన్నో నెలల పాటు కష్టపడ్డాడు. ఎట్టకేలకు తన కలను నిజం చేసుకున్నాడు. ఈ రోబో తాబేలు నీటిలోనే మైక్రోప్లాస్టిక్‌లను 94 శాతం కచ్చితత్వంతో గుర్తించగలదు. ఈ ఆవిష్కరణకు ఇవాన్‌కు రీజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్(ఐఎస్ఇఫ్)లో ప్రతిష్ఠాతకమైన గోర్డాన్ ఇ.మూర్ అవార్డ్ వరించింది.బాధను వదిలి...ఆవిష్కరణ బాటలో...చిన్నప్పటి నుంచి ఇవాన్‌కు పర్యావరణ సంబంధిత విషయాలు, ఇంజినీంగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇష్టం. తల్లిదండ్రులతో పాటు యాత్రలకు వెళుతుండడం వల్ల ఎన్నో సరస్సులు, అడవులను చూశాడు. ప్రకృతిపై, స్వచ్ఛమైన జలాశయాలపై ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ కాలుష్యంపై ఇవాన్‌లో ఆందోళన పెరిగింది.‘ఇలా బాధపడడం కంటే ఏదో ఒకటి చేయాలి’ అని గట్టిగా అనుకున్నాడు. అండర్ వాటర్ డ్రోన్‌ను రూపొందించడానికి బదులుగా, తాబేలుకు ఉండే సహజమైన ఈత సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తాబేలు మోడల్ రోబోను తయారుచేశాడు. సాధారణంగా తాబేళ్లు తక్కువ శక్తిని ఉపయోగించి ఎక్కువ దూరం ప్రయాణించగలవు. (చదవండి: స్టిక్కీ నోట్‌తో గిన్నిస్ రికార్డు) -
చనిపోని దేహంతో.. చెడిపోని ప్రాణంతో!
మనిషి శరీరాన్ని పోలిన యంత్రుడు మరమనిషి. కానీ మనిషికి సాధ్యమైన పనులను మరింత వేగంగా, కచ్చితంగా చేయగలిగే శక్తి!. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. కృత్రిమ మేధ (AI), రోబోటిక్స్ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి.. మనిషి, యంత్రం మధ్య ఉన్న తేడాను రోజురోజుకూ తగ్గిస్తోంది. ఈ మార్పునకు తాజా ఉదాహరణే ‘టియాన్గాంగ్ అల్ట్రా’.చైనా మరోసారి సాంకేతిక ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. ఈసారి కారణం కారు కాదు, క్షిపణి కాదు.. ‘టియాన్గాంగ్’ (Tiangong) అనే హ్యూమనాయిడ్ రోబోట్. మనిషిలా రెండు కాళ్లపై నడవడం, చకచకా మెట్లు ఎక్కడం, ఎత్తుపల్లాలపై బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండడం, పరిసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాలతో ఈ రోబోట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్ పరిశ్రమలు, ఆరోగ్య సేవలు, విపత్తు నిర్వహణలో టియాన్గాంగ్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.జస్ట్ 8.86 సెకన్లలోనే..బీజింగ్‌లో జరుగుతున్న 2026 వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్‌లో.. 16 దేశాలకు చెందిన సుమారు 2,000 రోబోలు పాల్గొన్నాయి. ఇందులో టియాన్గాంగ్ అల్ట్రా తన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. 100 మీటర్ల పరుగును కేవలం 8.86 సెకన్లలో పూర్తి చేసింది. ఇంతకు ముందు ఇదే రోబోట్ 9.39 సెకన్లతో ఉసేన్ బోల్డ్ రికార్డును అధిగమించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టియాన్గాంగ్ కేవలం నడిచే రోబోట్ కాదు. పరుగులో వేగాన్ని పెంచుకుంటూనే తన శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం, అడుగుల్లో చిన్న మార్పులు చేసుకోవడం, ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా కదలికలను సరిచేసుకోవడం దీని ప్రత్యేకత. అలా బాక్సింగ్ సహా పలు కేటగిరీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది.అసలు టియాన్గాంగ్ అంటే?టియాన్గాంగ్ అనే చైనీస్ పదానికి స్వర్గ భవనం అని అర్థం. మనిషి శరీర నిర్మాణాన్ని పోలిన పూర్తి పరిమాణ హ్యూమనాయిడ్ రోబోట్ ఇది. బ్రెయిన్‌ను బట్టి మనిషి శరీరం ముందుకు నడుస్తుంది. ఇదే టియాన్గాంగ్ విషయంలో ఆ పనిని సెన్సర్లు, కంప్యూటింగ్ వ్యవస్థ, కృత్రిమ మేధ(AI) చేస్తాయి. చుట్టూ ఉన్న వస్తువులు, అడ్డంకులు, నేల పరిస్థితులను గుర్తించి.. వాటికి అనుగుణంగా తన కదలికలను మార్చుకుంటుంది.కళ్లుగా కెమెరాలు.. చెవులే సెన్సర్లుటియాన్గాంగ్కు మనిషిలా కళ్లూ, చెవులూ ఉండవు కదా! వాటి పనిని చేసే సాంకేతిక వ్యవస్థ ఉంది. కెమెరాలు, లిడార్ సెన్సర్లు, ఫోర్స్ సెన్సర్లు, ఇతర సెన్సింగ్ వ్యవస్థలు పరిసరాల సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ డేటాను ఏఐ ఆధారిత కంప్యూటింగ్ వ్యవస్థ విశ్లేషిస్తుంది. ముందున్న అడ్డంకి ఎంత దూరంలో ఉంది? నేల సరిగ్గా ఉందా? అడుగు ఎక్కడ వేయాలి? వేగాన్ని తగ్గించాలా? పెంచాలా? వంటి విషయాలపై క్షణాల్లో నిర్ణయం తీసుకుని కాళ్లు, చేతులు, శరీర కదలికలను సమన్వయం చేస్తుంది. అందుకే టియాన్గాంగ్ నడకలో మెషిన్ కంటే మనిషి కదలికలను పోలిన సహజత్వం కనిపిస్తుంది.తోసినా.. తడబడినా పడిపోదు!హ్యూమనాయిడ్ రోబోట్లకు అతిపెద్ద సవాళ్లలో ఒకటి సమతుల్యం(బ్యాలెన్స్). రెండు కాళ్లపై నడిచే యంత్రం చిన్న పొరపాటుతోనైనా కిందపడే ప్రమాదం ఉంటుంది. అయితే టియాన్గాంగ్ ఇందులో గణనీయమైన పురోగతి సాధించింది. ఎవరైనా తోసినా, నేల ఒక్కసారిగా మారినా శరీర బరువును మార్చుకుని తిరిగి బ్యాలెన్స్‌లోకి వచ్చేసేలా దీన్ని రూపొందించారు. నడుస్తున్నప్పుడు ప్రతి అడుగును ముందుగానే ఊహించి.. అవసరమైతే కదలికను మధ్యలోనే సరిచేసుకునే సామర్థ్యం దీనికి ఉంది. అంటే.. మనిషి తడబడినప్పుడు వెంటనే కాలు మార్చి నిలబడినట్లే, ఈ రోబోట్ కూడా తన కదలికలను సర్దుబాటు చేసుకుంటుంది.పరుగే కాదు.. ఇంకా చాలాటియాన్గాంగ్ పేరు ఇప్పుడు 100 మీటర్ల పరుగు కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నప్పటికీ.. దాని అసలు లక్ష్యం క్రీడా ప్రదర్శన కాదు. మనుషులు చేసే అనేక పనులను భవిష్యత్తులో రోబోట్లు చేపట్టేలా సాంకేతికతను అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశం. ఫ్యాక్టరీల్లో యంత్రాల మధ్య పనిచేయడం, గోదాంల నుంచి వస్తువులను తరలించడం, ప్రమాదకర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం, విపత్తుల సమయంలో శిథిలాల్లోకి వెళ్లడం వంటి పనుల్లో హ్యూమనాయిడ్ రోబోట్లు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంతే కాదు.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడం, ఆసుపత్రుల్లో కొన్ని పనులు నిర్వహించడం వంటి సేవల్లోనూ భవిష్యత్తులో వీటి వినియోగం పెరగొచ్చని రోబోటిక్స్ రంగం అంచనా వేస్తోంది.ఒక్క రోబోట్ కాదు.. చైనా పెద్ద ప్రయోగంటియాన్గాంగ్ను అభివృద్ధి చేసింది.. బీజింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్. ఇది ఒక వ్యక్తి చేసిన ప్రయోగం కాదు. ఇంజినీర్లు, రోబోటిక్స్ నిపుణులు, ఏఐ పరిశోధకులు, విద్యా సంస్థలు కలిసి పనిచేసిన పెద్ద ప్రాజెక్టు. హ్యూమనాయిడ్ రోబోటిక్స్‌ను భవిష్యత్ పరిశ్రమల్లో కీలక రంగంగా చైనా భావిస్తోంది. అందుకే పరిశోధన, తయారీ, ఏఐ సాంకేతికతలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ముందుకు వెళ్తోంది.మనిషికి ప్రత్యామ్నాయమా?టియాన్గాంగ్ అల్ట్రా రికార్డు చూసిన వెంటనే తలెత్తే ప్రశ్న ఇదే. భవిష్యత్తులో రోబోట్లు మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తాయా?. నిపుణుల దృష్టిలో ప్రస్తుతానికి సమాధానం అంత సులభం కాదు. హ్యూమనాయిడ్ రోబోట్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. మానవుడిలా అన్ని పరిస్థితులను అర్థం చేసుకోవడం, భావోద్వేగాలను గ్రహించడం, సంక్లిష్ట నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాల్లో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.8.86 seconds for 100m.🏃💨 That's not a sprinter. That's #Tiangong Ultra, a #humanoid #robot.It just broke the human record for a 100m sprint at the World Humanoid Robot Games. And honestly? My 100m time is looking real slow right now. 🤖🥇#humanoidrobot #TiangongUltra pic.twitter.com/11UUlgY9q4— So Shanghai (@shanghai490528) August 26, 2026మనిషి చేసే పనులను మనిషితో కలిసి చేయగలిగే తెలివైన యంత్రాల యుగం మొదలైంది. కేవలం 100 మీటర్లను 8.86 సెకన్లలో పరుగెత్తిన టియాన్గాంగ్ ఆ భవిష్యత్తుకు టీజర్ మాత్రమే. మనిషిలా ఆకారం.. యంత్రంలా శక్తి.. ఏఐ ఆలోచన.. టియాన్గాంగ్ రికార్డు కేవలం ఒక రోబోట్ గెలుపు కాదు రాబోయే సాంకేతిక ప్రపంచానికి చైనా ఇచ్చిన సంకేతం.:::వెబ్‌డెస్క్ ప్రత్యేకంఇదీ చదవండి: ఆ రహస్య విమానంలో వచ్చింది ఆయనేనంట! -
1999 రిపీట్ అవుతుందా?.. మార్కెట్ క్రాష్ తప్పదా?
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. ఏఐ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే భారీగా డబ్బు సంపాదించవచ్చని చాలామంది పెట్టుబడిదారులు నమ్ముతున్నారు. అయితే.. ఈ ఉత్సాహాన్ని చూసి రాబర్ట్ కియోసాకి 1999 నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నారు.అప్పట్లో ఇంటర్నెట్ కంపెనీలపై కూడా ఇలాగే భారీ అంచనాలు ఉండేవి. ఏఓఎల్, నెట్‌స్కేప్, పెట్స్ డాట్ కామ్ వంటి సంస్థలను భవిష్యత్తు కంపెనీలుగా భావించారు. కానీ.. కొంతకాలానికే డాట్‌కామ్ బబుల్ పేలడంతో అనేక కంపెనీల విలువలు కుప్పకూలాయి. పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు.జిమ్ రికార్డ్స్ ఏమంటున్నారు?ఆర్థిక విశ్లేషకుడు, రచయిత జిమ్ రికార్డ్స్ ప్రకారం.. ఏఐ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు, అధిక వాల్యుయేషన్లు ఏర్పడ్డాయని, ఇవి ఒక దశలో తీవ్రమైన దిద్దుబాటుకు దారితీయవచ్చని హెచ్చరించారు. ఏఐ రంగంలో సుమారు 1.4 ట్రిలియన్ డాలర్ల విలువకు ప్రమాదం ఉందని, పరిస్థితి తీవ్రంగా మారితే స్టాక్ మార్కెట్లో భారీ పతనం సంభవించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.ఎన్విడియాపైనా జాగ్రత్త అంటున్నారా?ఏఐ రంగంలో ప్రస్తుతం ఎన్విడియా వంటి కంపెనీలు అత్యంత కీలకంగా మారాయి. ఏఐ మోడళ్లకు అవసరమైన చిప్‌లకు భారీ డిమాండ్ ఉండటంతో కంపెనీపై పెట్టుబడిదారుల ఆసక్తి కూడా పెరిగింది. అయితే.. జిమ్ రికార్డ్స్ మాత్రం ఇలాంటి అధిక అంచనాలున్న కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఏఐ రంగంలో బబుల్ ఏర్పడితే కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అన్నారు. అందుకే మార్కెట్ పడిపోయినా.. తట్టుకోగల పెట్టుబడులపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది.1999తో పోలిక ఎందుకు?ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఏఐ నిజంగా ఉపయోగపడే టెక్నాలజీనా? అనే ప్రశ్న కాదు. అది ఇప్పటికే అనేక రంగాల్లో ఉపయోగపడుతోంది. కానీ ఆ టెక్నాలజీపై ఉన్న అంచనాలు, కంపెనీల షేర్ ధరలు వాటి వాస్తవ వ్యాపార ఫలితాల కంటే చాలా ముందుకు వెళ్లాయా? అన్నదే ప్రశ్న. 1999లో కూడా ఇంటర్నెట్ నిజమైన భవిష్యత్తే. కానీ ఆ పేరుతో వచ్చిన ప్రతి కంపెనీ విజయవంతం కాలేదు. చివరికి బబుల్ పేలినప్పుడు మంచి కంపెనీలు కూడా మార్కెట్ పతనానికి గురయ్యాయి. ఏఐ విషయంలోనూ ఇదే పరిస్థితి వస్తుందేమోనన్న భయమే ఇప్పుడు కొందరు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.పెట్టుబడిదారులు ఏం చేయాలి?మార్కెట్ 80 శాతం పడిపోతుంది, 1.4 ట్రిలియన్ డాలర్లు ఆవిరవుతాయి వంటి అంచనాలను ఖచ్చితంగా జరగబోయే విషయాలుగా చూడాల్సిన అవసరం లేదు. ఇవి ఊహించి చేస్తున్న హెచ్చరికలు మాత్రమే. ఏఐ రంగం భవిష్యత్తులో మరింత పెద్దదయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఏ కంపెనీ షేరు ఎంత విలువకు ట్రేడవుతోంది, ఆ కంపెనీకి నిజంగా ఎంత ఆదాయం వస్తోంది, లాభాలు ఎలా ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి వంటి విషయాలను పరిశీలించడం ముఖ్యం.ఇదీ చదవండి: చాణక్య నీతి: ఈ 5 విషయాల కోసం ఖర్చు చేస్తే.. ఆర్థిక కష్టాలు తప్పవు! -
బ్రాండ్ల కంటే ఫీచర్లకే ఓటు..!
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేవారిలో 87 శాతం మంది ప్రాసెసర్ పనితీరుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మంగళవారం విడుదల చేసిన ‘బెస్ట్ ఇన్ టెక్’ సర్వే వెల్లడించింది. ట్యాబ్లెట్ కొనేవారిలో 74 శాతం డిప్‌ప్లే నాణ్యతకు మొగ్గుచూపుతున్నారని తెలిపింది. సుమారు 40,000 మందికి పైగా వినియోగదారుల స్పందనల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. కొనుగోలుదారులు బ్రాండ్ల కంటే స్పేసిఫికేషన్లు, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలో తేలింది. సర్వేలోని ముఖ్యమైన ముఖ్యాంశాలు ⇒ కొనుగోలుదారులు ఏఐ ఫీచర్లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దాదాపు 58 శాతం మంది రాబోయే ఏఐ ఫీచర్లు తమ ఉత్పాదకతను పెంచడంలో ‘‘ఎంతో ఉపయోగపడతాయని’’ భావిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఆన్–డివైస్ ఏఐ అసిస్టెంట్లు (28%), ఏఐ–ప్రాసెసింగ్ చిప్‌లు (25%) మొదటి స్థానంలో నిలిచాయి. ⇒ బ్రాండ్ల కంటే స్పెసిఫికేషన్లకే ఓటు వేస్తున్నారు. 53 శాతం మంది వినియోగదారులు ఒకే ధరలో మెరుగైన స్పెసిఫికేషన్లు లభిస్తే వేరే బ్రాండ్‌కు మారడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిబట్టి బ్రాండ్ కంటే సాంకేతిక ఫీచర్లే కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది. ⇒ ప్రతి నలుగురిలో ముగ్గురు ల్యాప్‌టాప్ కొనుగోలుదారులు రూ. 40,000 కంటే ఎక్కువ ధర ఉన్న డివైజ్‌లను పరిశీలిస్తున్నారు. వీరిలో 50 శాతం మంది రూ. 40,000 నుండి రూ. 80,000 బడ్జెట్‌ను, 26 శాతం మంది రూ. 80,000 కంటే ఎక్కువ ఉన్న ప్రీమియం కేటగిరీని ఎంచుకుంటున్నారు. ⇒ కొనుగోలు చేసేముందు ప్రాడెక్టుల గురించి సు«దీర్ఘమైన రీసెర్చ్ చేస్తున్నారు. పావువంతు (25%) మంది కొనుగోలుదారులు ల్యాప్‌టాప్ కొనే ముందు రెండు నెలలకు పైగా రీసెర్చ్ చేస్తున్నారు. 48 శాతం మంది కనీసం రెండు నుండి మూడు బ్రాండ్లను సరిపోల్చి చూసుకుంటున్నారు. ట్యాబ్ కొనుగోలుదారుల ప్రాధాన్యతలు ఇవి... ట్యాబ్‌ల విషయంలో 74 శాతం మందికి డిస్ప్లే సైజు, క్వాలిటీయే ప్రధాన అంశంగా మారింది. ధర (12%), ప్రాసెసర్ (9%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దాదాపు 59 శాతం మంది రూ. 20,000 నుండి రూ. 35,000 బడ్జెట్లో ట్యాబ్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. వీటిని ప్రధానంగా ల్యాప్‌టాప్‌కు ప్రత్యామ్నాయంగా (29%), మీడియా కన్సప్షన్ (21%), తేలికగా తీసుకెళ్లే సదుపాయం (17%) కోసం ఎంచుకుంటున్నారు. ‘‘కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ‘ల్యాప్‌టాప్‌లు’ అధిక ధర కలిగిన ఉత్పత్తులు కావడంతో కొనుగోలుదారులు ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు. తమ అవసరాలు, వినియోగానికి అనుగుణంగా నిర్దిష్ట స్పెసిఫికేషన్లు, సామర్థ్యాలను కోరుకుంటారు. అంతేకాకుండా, ల్యాప్‌టాప్‌లను ఎక్కువ కాలం పాటు ఉపయోగిస్తారు కావున కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు క్షుణ్ణంగా భిన్న బ్రాండ్లతో సరిపోల్చి చూసుకుంటారు. కొనుగోలుదారులకు బ్రాండ్ పేరు కంటే స్పెసిఫికేషన్లే అత్యంత ముఖ్యమని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. ఇది ప్రతీ ల్యాప్‌టాప్ తయారీదారు సంస్థకు ఒక గొప్ప అవకాశమని చెప్పవచ్చు’’ అని అమెజాన్ ఇండియా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ జుబాఖాన్ తెలిపారు. -
ఏఐ నుంచి సైబర్ సేఫ్టీ వరకు.. మోదీ కీలక ఆదేశాలు!
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రగతి 53వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు కీలక ప్రాజెక్టులు, వాటి పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా.. రోడ్లు, రైల్వేలు, విద్యుత్ రంగాలకు చెందిన ఆరు భారీ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. తొమ్మిది రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.30 వేల కోట్లకు పైగానే ఉంది.ఆలస్యం అయితే నష్టం ప్రజలకేప్రాజెక్టులు ఆలస్యం కావడం వల్ల కేవలం ఖర్చు పెరగడం మాత్రమే కాదని ప్రధాని మోదీ అన్నారు. పనులు ఆలస్యం అయితే వాటి ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు అందాల్సిన ప్రయోజనాలు కూడా ఆలస్యమవుతాయని చెప్పారు. అందుకే ప్రతి ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.ఒక్కో రోడ్డు, ఒక్కో రైల్వే లైన్ లేదా ఒక్కో ప్యాకేజీ పనిని విడివిడిగా చూడకుండా.. మొత్తం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది?, ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?, అనే కోణంలో పనులను పర్యవేక్షించాలని ప్రధాని స్పష్టం చేశారు.కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయంపెద్ద ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే కేంద్ర శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని మోదీ అన్నారు. ఒక చిన్న సమస్య కూడా మొత్తం ప్రాజెక్టును ఆలస్యం చేసే పరిస్థితి రావచ్చు. కాబట్టి దాన్ని ముందుగానే గుర్తించి పరిష్కరించాలని సూచించారు. ప్రాజెక్టుల అమలులో ప్రతి స్థాయిలో అధికారులు బాధ్యత తీసుకోవాలని, సమస్యలు వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే వాటిని గుర్తించి పరిష్కరించే విధంగా పనిచేయాలని ప్రధాని సూచించారు.ఒకే కారిడార్‌లో అన్ని..భవిష్యత్‌లో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టేటప్పుడు కామన్ యుటిలిటీ కారిడార్ల ఏర్పాటుపై కూడా ఆలోచించాలని ప్రధాని సూచించారు. సాధ్యమైన చోట రోడ్లు, రవాణా ప్రాజెక్టులతో పాటు విద్యుత్, ఇతర యుటిలిటీ సదుపాయాలను సమగ్రంగా ప్లాన్ చేస్తే భవిష్యత్‌లో మళ్లీ మళ్లీ రోడ్లను తవ్వాల్సిన అవసరం తగ్గుతుందని చెప్పారు. అయితే.. ఇలాంటి ప్రణాళికలను చేపట్టే ముందు సాంకేతికంగా, ఆర్థికంగా సాధ్యమా లేదా అన్నది పరిశీలించాలని స్పష్టం చేశారు.వేగంతో పాటు.. నాణ్యత కూడాప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పనుల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడంతో పాటు ప్రతి దశలో నాణ్యతను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు వేగంగా పూర్తవ్వడం ఎంత ముఖ్యమో.. అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండటం కూడా అంతే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.వ్యవసాయంలో ఏఐసమావేశంలో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లో భాగమైన అగ్రిస్టాక్ మీద కూడా ప్రధాని సమీక్షించారు. వ్యవసాయానికి సంబంధించిన డేటాను కేవలం సేకరించడానికే పరిమితం కాకుండా.. దాన్ని రైతులకు ఉపయోగపడేలా వినియోగించాలని సూచించారు.Rs. 30,000 crore worth of projects across 9 states covering railways, roads and power sectors…this is what we reviewed during today’s PRAGATI session. Focus areas remain - better connectivity, higher growth, better public services and lesser delays. Here are the details……— Narendra Modi (@narendramodi) August 25, 2026ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి వ్యవసాయ రంగంలో మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలని అన్నారు. విత్తనాలు, ఎరువుల ప్రణాళిక నుంచి పంటల ప్రాసెసింగ్ వరకు మొత్తం వ్యవసాయ రంగంలో డేటాను సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచించారు. దీంతో రైతులకు అవసరమైన సహాయం సరైన సమయంలో, సరైన వ్యక్తికి అందించడంతో పాటు వ్యవసాయ రంగంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.డిజిటల్ అరెస్టులపై అవగాహనసైబర్ మోసాలు, ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలపై కూడా ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. ఇలాంటి మోసాలను అరికట్టాలంటే ప్రజల్లో అవగాహన పెంచడం చాలా అవసరమని అన్నారు.వృద్ధులు, యువత, సైబర్ మోసాలకు సులభంగా టార్గెట్ అయ్యే వర్గాలను దృష్టిలో పెట్టుకుని నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మోసగాళ్లు ఎలా మాట్లాడతారు, ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. అదే సమయంలో సైబర్ నేరాలను ఎదుర్కొనే సిబ్బందికి కూడా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని ప్రధాని సూచించారు. కొత్తగా వస్తున్న మోసాలను వేగంగా గుర్తించి, వెంటనే చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. -
‘సాంకేతిక ఆధారిత ప్రొఫెషనల్ సేవలకు అంతర్జాతీయ హబ్‌గా హైదరాబాద్’
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ న్యాయ నైపుణ్యాన్ని కృత్రిమ మేధ సాంకేతికతతో అనుసంధానం చేస్తూ, వివిధ దేశాలకు సంబంధించిన న్యాయ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘కవేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్’ హైదరాబాద్ కార్యాలయాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..అంతర్జాతీయ న్యాయ సేవలకు సంబంధించిన వినూత్న సంస్థ హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వృత్తిపరమైన సేవలతో సహా అనేక రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం వేగంగా విస్తరిస్తోందని, ఇది అపారమైన అవకాశాలను సృష్టిస్తూనే కొత్త సవాళ్లను కూడా ముందుకు తెస్తోందన్నారు.అందువల్ల ఏఐ వినియోగంలో బాధ్యత, నైతిక విలువలు, పారదర్శకత అత్యంత కీలకమని పేర్కొన్నారు. బలమైన ఐటీ, సాంకేతిక వ్యవస్థ, అత్యున్నత నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ దేశాలతో మెరుగైన అనుసంధానం హైదరాబాద్‌కు ప్రత్యేక బలాలని మంత్రి చెప్పారు. ఈ అనుకూలతలతో ఏఐ ఆధారిత ప్రొఫెషనల్, న్యాయ సేవలకు హైదరాబాద్ ఒక ప్రధాన అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. తెలంగాణను అంతర్జాతీయ నైపుణ్యంతో అనుసంధానించే ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు తీసుకొస్తాయని అన్నారు.న్యూయార్క్‌లోని కవేటి లా ఫర్మ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ అటార్నీ డాక్టర్ శ్రీనివాస్ రావు కవేటి, కవేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడాన్ని మంత్రి అభినందించారు. తెలంగాణకు చెందిన డాక్టర్ కవేటికి భారత్‌తో పాటు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ న్యాయ వ్యవహారాల్లో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ‘ఇంటర్నేషనల్ లీగల్ యాక్సెస్ హబ్’గా తీర్చిదిద్దాలని సంస్థ ప్రతిపాదించింది. భారత్‌లోని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రవాస భారతీయులు (NRIs), పెట్టుబడిదారులు వివిధ దేశాల్లో న్యాయ సేవలు అందిస్తున్న న్యాయవాదులు, న్యాయ నిపుణులతో అనుసంధానం కావడానికి ఈ కేంద్రం వేదికగా పనిచేయనుంది. అంతర్జాతీయ న్యాయ నిపుణులు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భాల్లో ప్రత్యక్ష సంప్రదింపులు, న్యాయ వ్యూహాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు.సంస్థ సేవలు వివిధ దేశాల్లోని పలు న్యాయ విభాగాలను కవర్ చేయనున్నాయి. అమెరికాలో ఇమ్మిగ్రేషన్, కుటుంబ చట్టాలు, సివిల్ లిటిగేషన్, అంతర్జాతీయ విడాకులు, కార్పొరేట్, క్రిమినల్ లా అంశాలు; యునైటెడ్ కింగ్డమ్లో ఇమ్మిగ్రేషన్, కుటుంబ చట్టాలు, సివిల్ లిటిగేషన్; యూఏఈలో కార్మిక పరిహారం, ఉద్యోగ సంబంధిత సమస్యలు, ఒప్పంద వివాదాలకు సంబంధించిన సేవలను అందించనున్నట్లు సంస్థ తెలిపింది. భారత్‌లో కంపెనీ, ట్రేడ్‌మార్క్ చట్టాలు, సివిల్, క్రిమినల్, కార్మిక చట్టాలు, రిట్ పిటిషన్లు, రుణాల రికవరీ, వినియోగదారుల చట్టాలు, స్పెషల్ లీవ్ పిటిషన్లు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు సంబంధించిన సేవలను అందించనుంది.హైదరాబాద్ కేంద్రం కార్యకలాపాల్లో న్యాయ సేవల్లో కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వినియోగించడం ప్రధాన అంశంగా ఉండనుంది. ముఖ్యంగా సంక్లిష్టమైన అంతర్జాతీయ న్యాయ వ్యవహారాల్లో లీగల్ రీసెర్చ్, సమాచార సేకరణ, డాక్యుమెంట్ల విశ్లేషణ, డిస్కవరీ, కేసులకు సంబంధించిన ప్రాథమిక మ్యాపింగ్ తదితర అంశాల్లో ఏఐ సహకారాన్ని వినియోగించాలని ప్రతిపాదించారు.అయితే ఏఐ న్యాయవాదులకు ప్రత్యామ్నాయం కాదని, వారికి సహకరించే సాధనంగా మాత్రమే ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. న్యాయ సలహాలు, ప్రాతినిధ్యం వంటి సేవలను ఆయా దేశాల్లో అమలులో ఉన్న చట్టాలు, వృత్తిపరమైన నైతిక ప్రమాణాలకు అనుగుణంగా అర్హత కలిగిన న్యాయ నిపుణులు మాత్రమే అందిస్తారని పేర్కొంది.సాంకేతిక పరిజ్ఞానం అంతిమంగా ప్రజలకు ఎదురయ్యే అడ్డంకులను తగ్గించడానికి, సేవల్లో సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రత్యేక నైపుణ్యంతో కూడిన సేవలను మరింత విస్తృత వర్గాలకు చేరువ చేయడానికి ఉపయోగపడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచస్థాయి ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లతో అనుసంధానించే ఇటువంటి సంస్థలు తెలంగాణను ఆవిష్కరణలు, విజ్ఞాన ఆధారిత సేవలకు అంతర్జాతీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో దోహదపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. -
కేంద్ర బ్యాంకులు భయపడుతున్నాయ్: కియోసాకి
కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ కేంద్ర బ్యాంకుల విధాన నిర్ణయాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్‌లో బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) నివేదికను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్ర బ్యాంకుల విధాన నిర్ణయాలను ఏఐ ప్రభావితం చేస్తోందని కియోసాకి పేర్కొన్నారు. జూలై 28న BIS విడుదల చేసిన విశ్లేషణలో.. ఏఐ ఒకేసారి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, సరఫరా రెండింటినీ ప్రభావితం చేయడం వల్ల సాధారణ ఆర్థిక సంకేతాలు స్పష్టత కోల్పోతున్నాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నట్లు ఆయన వివరించారు. దీంతో ఆర్థిక వ్యవస్థలో అసలు పరిస్థితులను అంచనా వేయడం, దానికి అనుగుణంగా ద్రవ్య విధానాన్ని నిర్ణయించడం కేంద్ర బ్యాంకులకు కష్టతరమవుతోందని తెలిపారు.దీన్ని కియోసాకి తనదైన శైలిలో విశ్లేషించారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినా, తగ్గించినా వాటి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కనిపించడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అయితే ఏఐ వేగవంతమైన మార్పుల కారణంగా ఈ ‘లాగ్’ తగ్గిపోతోందని పేర్కొన్నారు. కేంద్ర బ్యాంకులు నిర్ణయం తీసుకునేలోపే ఏఐ కారణంగా మార్కెట్లు, వ్యాపార కార్యకలాపాలు వేగంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు.డేటా సెంటర్లు, చిప్‌లపై భారీ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థలో వేడి పెరుగుతోందన్న సంకేతాలుగా కనిపించవచ్చని, అయితే అవి భవిష్యత్ ఉత్పాదకతను పెంచే దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా కావచ్చని కియోసాకి వివరించారు. అదే సమయంలో ఏఐ ద్వారా ఉత్పాదకత పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఉన్న డిమాండ్ ఒత్తిళ్లు బయటకు కనిపించకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఫలితంగా ద్రవ్యోల్బణ పరిస్థితులను అంచనా వేయడం మరింత కష్టమవుతుందని పేర్కొన్నారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావాన్ని కూడా ఏఐ కొంతమేర సమతుల్యం చేస్తోందని కియోసాకి అన్నారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగినప్పటికీ, ఏఐ ఆధారిత పెట్టుబడులు, ఉత్పాదకత వంటి అంశాలు ఆ ప్రభావాన్ని కొంతమేర ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.‘పాలసీ మిస్క్యాలిబ్రేషన్’ అంటే విధాన నిర్ణయాలు తప్పుగా ఉండే ప్రమాదం పెరగడమేనని కియోసాకి వ్యాఖ్యానించారు. కేంద్ర బ్యాంకులు ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు ఉపయోగించే కాలవ్యవధి, ఆలస్యం వంటి అంశాలపై ఏఐ ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.తన ‘రిచ్ డాడ్’ చెప్పిన మాటలను కూడా కియోసాకి ఈ సందర్భంగా గుర్తుచేశారు. డబ్బును నియంత్రించే వ్యక్తులకే అది ఎలా పనిచేస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడినప్పుడే అత్యంత ప్రమాదకరమైన ఆర్థిక సమయం మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం అలాంటి దశలోనే ఉందేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. -
అప్రమత్తతతో కూడిన 'ఆశావాదం అవసరం'
అభినందనలు. మీరు సాధించారు! మీలో చాలామంది ఎంతో ఉత్సాహంగా భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నారు. కానీ కొందరి ప్రణాళికలు తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ నియంత్రణలో లేని పరిస్థితులు అందుకు కారణం కావచ్చు, ఉద్యోగ మార్కెట్లో వచ్చిన మార్పులు, టెక్నా లజీ వంటి పరిస్థితులు కొందరి ఆశలను దెబ్బతీసే ఆస్కారం ఉంది. మీ ఆశలు దెబ్బతిన్నట్లయితే... మీరు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇలాంటి సమయంలో నేను ‘అనుకోని అవకాశాల కోసం పక్క చూపు’ అనే ఆలోచనను మీకు సూచిస్తున్నాను.‘పెరిఫెరల్ విజన్’ అంటే ఏమిటి?మీ ప్రస్తుత కెరీర్ మార్గంపై దృష్టి పెట్టండి. అయితే మీ సమయం మొత్తాన్ని దానికే కేటాయించకండి. మీ సమయంలో 10 నుంచి 15 శాతం ఇతర రంగాలను పరిశీలించడానికి కేటాయించండి. మీ ప్రధాన రంగానికి పక్కన ఉన్న ఇతర రంగాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలను గమనిస్తూ ఉండండి. అలా మీ ‘పక్క చూపు’తో మీరు ఎవరూ ఊహించని కొత్త అవకాశాలను గుర్తించవచ్చు. అదే పెరిఫెరల్ విజన్! అది మీరు ఎప్పుడూ ఊహించని ఒక కొత్త, ఆనందకరమైన కెరీర్ మార్గంలోకి మిమ్మల్ని తీసుకెళ్లవచ్చు. 1969లో స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన తర్వాత ఫ్రాన్స్ కార్డోవా జర్నలిజం రంగంలోకి వెళ్లారు. లాస్ ఏంజెల్స్ టైమ్స్‌లో జర్నలిస్టుగా పనిచేశారు. అదే ఆమెకు నచ్చిన కెరీర్ మార్గం. కానీ ఆమె ‘పక్క చూపు’లో ఒక రోజు నక్షత్రాల గురించి ఒక డాక్యుమెంటరీ చూసింది. భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రంపై ఆసక్తి పెంచుకుంది. ఆమెకు అప్పటికీ ఫిజిక్స్‌లో ఉన్నత విద్య చదవడానికి అవసరమైన సంసిద్ధత దాదాపు లేదు. అయినా కాల్టెక్ కమ్యూనిటీ నుంచి లభించిన సహకారంతో ఇంగ్లిష్ చదివిన విద్యార్థి నుంచి ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా మారే మార్గాన్ని స్వయంగా నిర్మించుకున్నారు. 1979లో కాల్టెక్ నుంచి ఫిజిక్స్‌లో పీహెచ్డీ పొందారు. ఆ తర్వాత ఒక అనుకోని అవకాశం నుంచి మరొక అవకాశానికి ప్రయాణిస్తూ... ఖగోళ శాస్త్ర విభాగాధిపతిగా, నాసాలో మొదటి మహిళా మరియు అతి పిన్న వయస్కురాలైన చీఫ్ సైంటిస్ట్‌గా, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా ఎదిగారు. నా జీవితంలో కూడా దాదాపు అలాంటిదే జరిగింది. నాకు లిగో(ఎల్ఐజీఓ–లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్–వేవ్ అబ్జర్వేటరీ) ప్రాజెక్ట్ ఒక అనుకోని అవకాశం. విశ్వంలో గురుత్వా కర్షణ తరంగాలను గుర్తించడానికి లిగో ప్రాజెక్ట్‌ను ప్రారంభించి నప్పుడు సాంకేతిక, రాజకీయ, సామాజిక సవాళ్లు ఎన్నో ఉన్నాయి. అయినా మేము విజయం సాధిస్తామని నమ్మాం. అదే సమయంలో ఏ సమస్యలు మన ప్రయాణాన్ని ఆపగలవో ముందుగానే గుర్తించాం. ప్రతి సమస్యను పెద్ద అడ్డంకిగా మారకముందే పరిష్కరించడానికి ప్రయత్నించాం. ఆ విధానం విజయవంతమైంది. దీన్నే నేను ‘అప్రమత్తతతో కూడిన ఆశావాదం’ అంటాను. ‘ఇంటర్స్టెల్లార్’ ఎలా వచ్చింది?1979లో నేను దక్షిణ కాలిఫోర్నియాలో ఒంటరిగా ఉన్నాను. నా ‘పక్క చూపు’ను విస్తరించడానికి హాలీవుడ్లో డేటింగ్ కూడా చేశాను! లిండా అబ్బాట్ అనే భవిష్యత్తులో ప్రముఖ సినిమా నిర్మాతతో నాకు పరిచయం ఏర్పడింది. ఆమె ఉత్సాహభరితమైన మహిళ; నేను మాత్రం పుస్తకాల పురుగు లాంటివాడిని. అయినా మేము స్నేహితులుగా కొనసాగాం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె ఒక సినిమా కోసం నాతో ఆలోచనలు పంచు కోవాలనుకుంది. నేను ఆ అనుకోని అవకాశాన్ని వెంటనే అంది పుచ్చుకున్నాను. తర్వాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ చేతుల్లో ఆ ప్రాజెక్ట్ ‘ఇంటర్స్టెల్లార్ ’ అనే ప్రసిద్ధ చిత్రంగా మారింది. ఇంటర్స్టెల్లార్ సినిమా నా కెరీర్‌ను పూర్తిగా మార్చింది. దాదాపు అర్ధ శతాబ్దం పాటు కాల్టెక్ ప్రొఫె సర్గా ఉన్న నేను... ఆ తర్వాత నా జీవితంలోని తదుపరి దశను సైన్స్, కళల కలయికలో పనిచేయడానికి కేటాయించాలని నిర్ణయించుకున్నాను. ఇలాంటి ప్రాజెక్టులు నాకు కొత్త ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా యువతకు సైన్స్‌పై ఆసక్తిని కలిగిస్తాయి. నేను భవిష్యత్తు గురించి ఆశావాదంగా ఉంటాను. నేను 100 సంవత్సరాల వయసు వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తూ, మానసికంగా బలంగా ఉండి, నా ప్రాజెక్టులను కొనసాగించగలనని ఆశిస్తున్నాను. కానీ రోజువారీ జీవితంలో నేను జాగ్రత్తగా ఉంటాను. నా ఆరోగ్యానికి ఎదురయ్యే ప్రమాదాలను గమనిస్తాను.ఇప్పుడు మన ముందున్న ‘ఏనుగు’– ఏఐఇప్పుడు మన ముందున్న ఒక పెద్ద విషయంపై మాట్లాడాలి. ఆ ‘ఏనుగు’ పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– ఏఐ. నేను ఏఐ నిపుణుడిని కాదు. కానీ ఏఐ సంక్లిష్టమైన విషయం. కొన్ని రంగాల్లో దాని సామర్థ్యం అద్భుతంగా ఉంది. ఏఐ అభివృద్ధిని ఈరోజే పూర్తిగా ఆపేసి, ప్రస్తుతం ఉన్న రూపంలోనే కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం ఉపయోగిస్తే, మనలో చాలా మంది దాన్ని త్వరగా ఇష్టపడటం ప్రారంభిస్తారు. మనలో అనేక మందిని భయపెడు తున్నది ఏఐ ఉనికి కాదు, ఏఐ వేగంగా మారిపోతుండటమే మనల్ని ఆందోళనకు గురిచేస్తోంది.మీరు వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగాల్లో కెరీర్ ఎంచుకుంటే.. వేగంగా మారడం నేర్చుకోవాలి. అందుకు ముఖ్య మైన మార్గం... స్వీయ అభ్యాసం. టెక్నాలజీ మారుతున్న కొద్దీ దాన్ని ఉపయోగించడం మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఏఐ, క్రిస్పర్, ఎంఆర్ఎన్ఏ లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు గురించి నాకు కూడా పూర్తిగా తెలియదు. నిపుణులు కూడా ‘మాకు తెలి యదు’ అని చెబుతున్నారు. కొంతమంది భవిష్యత్తు గురించి చాలా నిరాశావాదంగా మాట్లాడుతున్నారు. కానీ నేను నిరాశావాదిని కాదు. ఏఐ, ఇతర వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల దీర్ఘకాల భవిష్యత్తును చూస్తున్నప్పుడు కూడా నేను ‘జాగ్రత్తతో కూడిన ఆశావాదం’నే పాటిస్తాను.ఏఐ వల్ల మనుషులు ఒకరికి ఒకరు దూరమవుతారని కొందరు భయపడుతున్నారు. అలా జరగదని ఆశిద్దాం. భవిష్యత్తులో మనం మరింత బలమైన, అభివృద్ధి చెందిన, నైతిక విలువలు కలిగిన మానవ సమాజంగా ఎదుగుతామని ఆశిద్దాం. మన అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ప్రతి మనిషి, ఇతర మనుషులను గౌరవించే సమాజంగా మనం ఉండాలి. మనిషి–మనిషి సంబంధాలు మన ఆనందానికి, ఆరోగ్యానికి, శ్రేయస్సుకు కేంద్రంగా ఉండాలి. ఆశావాదంతో పాటు జాగ్రత్త కూడా అవసరం. దీర్ఘకాల భవిష్యత్తుపై ఆశావాదంగా ఉండండి. కానీ రోజువారీ జీవితంలో అప్రమత్తంగా ఉండండి. మన ఆశావాద లక్ష్యానికి ఎదురయ్యే ప్రమాదాలను గమనించండి. ఆ ప్రమాదాలు పెద్ద సమస్యలుగా మారకముందే పరిష్కరించండి. -
ఇప్పుడు ఎలాంటి స్మార్ట్ఫోన్లు కావాలంటే..
ఏఐ ఫీచర్లు ఇప్పుడు 82% స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారుల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్, బ్యాటరీ జీవిత కాలం, కెమెరా సామర్థ్యం వంటివి వరుసగా నిలిచాయి. స్మార్ట్ ఫోన్ ఎంపికలో వినియోగదారులపై ప్రభావం చూపుతున్న అంశాలపై అధ్యయనాన్ని బెస్ట్ ఇన్‌టెక్ సర్వే పేరిట అమెజాన్ డాట్ ఇన్ నిర్వహించింది.హైదరాబాద్‌తో పాటు పలు చిన్న, మధ్య తరహా పట్టణాల వ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాల ప్రకారం.. 87% మంది. పెర్ఫార్మెన్స్ వేగం 79% మంది బ్యాటరీ జీవిత కాలం 77% మంది నాణ్యతలను కోరుకుంటున్నారని ఏఐ రాకతో వినియోగదారుల ప్రాధాన్యతల్లో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అమెజాన్ ఇండియా. కంజ్యూమర్ ఎల్రక్టానిక్స్, డైరెక్టర్, జేబా ఖాన్ అభిప్రాయపడ్డారురేటింగ్స్కే ప్రథమ ప్రాధాన్యం.. దిగువ మధ్యతరగతి, పేద జనాభా ఎక్కువగా ఉండే మన దేశంలో రూ.15వేల లోపు ధర కలిగిన ఫోన్లకు 7 శాతం మాత్రమే ఎంచుకుంటున్నారని అధ్యయనం వెల్లడించడం విశేషం. అత్యధిక డిమాండ్ (42 శాతం మంది) రూ.25 వేల నుంచి రూ.50 వేల మధ్య ధర కలిగిన ఫోన్లకు ఉందని, రూ.75 వేల లోపు ఖరీదు చేసే ఫోన్లను 15 శాతం మంది, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఫోన్లను 17 శాతం మంది ఎంచుకుంటున్నారు.రూ.15వేల నుంచి రూ.25 వేల మధ్య ధర కలిగిన ఫోన్లను 19 శాతం మంది ఓటేశారు. ఫోన్ వినియోగదారుల్లో 54శాతం మంది తమ ఫోన్లను రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగిస్తున్నారు. వచ్చే మూణ్నెళ్లలో ఫోన్ మారుస్తామని 48 శాతం మంది చెప్పారు. ఫోన్ల ఎంపికలో డిస్కౌంట్ల కంటే రేటింగ్స్కే వీరు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కొనుగోలు చేసేటప్పుడు రేటింగ్స్‌కి మొదటి ప్రాధాన్యమిస్తామని 47శాతం మంది చెప్పగా, డిస్కౌంట్లు, బెస్ట్ డీల్స్‌కే ఓటేస్తామని 35శాతం మంది వెల్లడించారు.ఇదీ చదవండి: జియో రీచార్జ్ ప్లాన్: 98 రోజులు అదిరిపోయే బెనిఫిట్స్! -
జెన్ ఏఐ కోత.. చేయూత
సాక్షి, హైదరాబాద్: మనదేశంలోని వ్యవసాయేతర ఉద్యోగాల్లో 8–12 శాతం మేర జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సేవారంగం, విద్య, మీడియా, ఆర్థిక సేవలు, క్లరికల్ పనులపై అధిక ప్రభావం పడే అవకాశాలున్నాయి. శారీరక శ్రమతో కూడిన పనులు, నిర్మాణం వంటి రంగాలు ఏఐ ప్రభావం నుంచి సురక్షితంగా ఉంటాయని, రాబోయే దశాబ్దకాలంలో వార్షిక కార్మిక ఉత్పాదకత 0.4 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో 42–48 శాతం శ్రామిక శక్తికి ఇది సహాయకారిగా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా గోల్డ్‌మన్ సాక్స్ విడుదల చేసిన ’జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ)–భారత లేబర్ మార్కెట్‌పై ప్రభావం’ పై విడుదల చేసిన నివేదికలో ఆయా అంశాలను పొందుపరిచింది. ఈ నివేదిక ప్రకారం ఏఐ ప్రభావం అన్ని రంగాలపై ఒకేలా ఉండదు, ఇది చాలా అసమానంగా ఉంటుందని తేలింది. ఇది పూర్తిగా ఉపాధి, ఉద్యోగాలు పోవడానికి దారితీయదని, దీని ద్వారా పనుల పునరి్వభజన జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నివేదిక ప్రకారం, ఏఐ వల్ల దేశంలో భారీగా ఉద్యోగాల నష్టం జరగదు. మరింత నాణ్యమైన, సృజనాత్మకమైన పనులపై దృష్టి పెట్టేందుకు ఇది దోహదపడుతుంది.ఏఐ వల్ల లబ్ధి పొందే రంగాలు... ⇒ ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌ల బేసిక్ మోడలింగ్ పనులను ఏఐ వేగవంతం చేస్తుంది, తద్వారా వారు మరింత విలువైన విశ్లేషణలపై దృష్టి పెట్టవచ్చు ⇒ ఆరోగ్యం, విద్య... ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ , డేటా అనలిటిక్స్, నాలెడ్జ్–బేస్డ్ పనుల ద్వారా ఈ రంగాలు భారీగా లాభపడతాయి ⇒ మీడియా,ఎంటర్టైన్మెంట్... క్రియేటివ్ పనులలో ఉత్పాదకత పెరుగుతుందిఏఐ ప్రభావం లేని రంగాలు... ⇒ శారీరక శ్రమతో కూడిన రంగాలు... నిర్మాణం, వస్త్ర పరిశ్రమ, మాన్యుఫ్యాక్చరింగ్, ప్లాంట్ ఆపరేటర్ల ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదు. ఇక్కడ ఏఐ కంటే మానవ శ్రమకే డిమాండ్ పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ⇒ కొత్త ఉద్యోగాల సృష్టి... గత సాంకేతిక విప్లవాలలాగే, ఏఐ కూడా కాలక్రమేణా సరికొత్త ఉద్యోగ విభాగాలు (ఉదాహరణకు: ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ కంప్లయన్స్ అధికారులు) సృష్టిస్తుంది. నివేదికలోని ముఖ్యాంశాలు⇒ భారత్‌లోని వ్యవసాయేతర శ్రామిక శక్తి చేసే పనులలో 9% నుండి 17% పనులను జెనరేటివ్ ఏఐ సులభంగా ఆటోమేట్ చేయగలదు⇒ 8–12% ఉద్యోగాలు పూర్తిగా లేదా పాక్షికంగా ఏఐ ద్వారా భర్తీ అయ్యే ప్రమాదం ఉంది⇒ 42–48% ఉద్యోగాలకు ఏఐ ఒక అద్భుతమైన ఉత్పాదక సాధనంగా సహాయపడుతోంది⇒ మిగిలిన 40–50% శ్రామిక శక్తిపై ఏఐ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందిఅత్యధిక రిస్క్ ఉన్న ఉద్యోగాలు ⇒ ఆఫీసుల్లో జరిగే రొటీన్, డేటా ఎంట్రీ, అడ్మిని్రస్టేటివ్ సపోర్ట్, క్లరికల్ పనులకు అత్యధికంగా 3% రిస్క్ ఉంది ⇒ కోడింగ్, బేసిక్ కంప్లయన్స్ చెక్స్ వంటి పునరావృతమయ్యే పనుల స్థానంలో ఏఐ వచ్చే అవకాశం ఉంది ⇒ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్... బేసిక్ కస్టమర్ సర్వీస్ బాధ్యతలను ఏఐ చాట్బాట్లు భర్తీ చేయవచ్చు -
బ్లూకాలర్ బూమ్!
ఒకప్పుడు డిగ్రీ ఉంటేనే భవిష్యత్ అనేవారు. ఇప్పుడు నైపుణ్యం ఉన్నవారికే భవిష్యత్ అనే కొత్త వాస్తవం రూపుదిద్దుకుంటోంది. ఏఐ యుగంలో ఉద్యోగాలు అంతరించిపోవడం కాదు, వాటి స్వరూపం మారుతోంది. కంప్యూటర్ను ఆదేశించే వ్యక్తికన్నా ఆ కంప్యూటర్ పనిచేసే వ్యవస్థను నిర్మించే, నిర్వహించే ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్, రోబోటిక్స్ నిపుణులే రేపటి ఉద్యోగ మార్కెట్లో అత్యంత విలువైన వ్యక్తులుగా నిలవనున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ మరో కీలక పరిణామం నిశ్శబ్దంగా చోటుచేసుకుంటోంది. కంప్యూటర్ ముందు కూర్చునే ఉద్యోగాలకంటే చేతివృత్తులు, సాంకేతిక నైపుణ్యాలున్న బ్లూకాలర్ ఉద్యోగాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఎల్రక్టీషియన్స్, ప్లంబర్లు, రోబోటిక్స్ టెక్నీషియన్లు, హెచ్‌వీఏసీ నిపుణులు, యంత్రాల నిర్వహణ సిబ్బంది వంటి వృత్తి నిపుణుల కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఏఐ విప్లవం వెనక అసలు బలం మానవ నైపుణ్యాలేనని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఏఐకి వెన్నెముకగా బ్లూకాలర్ ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డేటా సెంటర్లు, ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే భారీ విద్యుత్ వ్యవస్థలు, శీతలీకరణ యంత్రాంగం, రోబోటిక్ పరికరాలు, నిర్వహణ సిబ్బంది అవసరం. అందుకే ఎల్రక్టీషియన్లు, మెకానిక్‌లు, వెల్డర్లు, ప్లంబర్లు, రోబోటిక్స్ నిపుణుల అవసరం ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. టాలెంట్ సంస్థ రాండ్‌స్టాడ్ విశ్లేషణ ప్రకారం 5 కోట్లకు పైగా ఉద్యోగ ప్రకటనలను పరిశీలించి విశ్లేషించగా గత నాలుగేళ్లలో ఎలక్ట్రిషియన్ల డిమాండ్ 242%, హెచ్‌వీఏసీ టెక్నీషియన్ల డిమాండ్ 200%, రోబోటిక్స్ టెక్నీషియన్ల అవసరం గణనీయంగా పెరిగినట్లు తేలింది. 93 శాతం ఉద్యోగాల పెరుగుదల 2022 నుంచి 2026 మధ్య కాలంలో భారత దేశంలో బ్లూకాలర్ ఉద్యోగాల సంఖ్య 93% పెరిగింది. అదే సమయంలో వైట్ కాలర్ ఉద్యోగాల వృద్ధి 40% వద్దే నిలిచింది. ఇది దేశ కారి్మక మార్కెట్లో పెద్ద మార్పునకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటివరకు డిగ్రీ, ఐటీ ఉద్యోగాలకే ప్రాధాన్యం ఉండేది. కానీ ప్రస్తుతం పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, సెమీకండక్టర్ యూనిట్లు, ఎలక్టిక్ వెహికిల్ (ఈవీ) తయారీ కేంద్రాలు పెరగడంతో సాంకేతిక నైపుణ్యాలున్న కార్మికుల అవసరం మరింత పెరిగింది. వేతనాల్లోనూ బ్లూకాలర్ ఆధిక్యం ఉద్యోగాల్లోనే కాదు వేతనాల్లో కూడా బ్లూకాలర్ ఉద్యోగులు ముందంజలో ఉన్నారు. బ్లూకాలర్ ఉద్యోగుల జీతాలు ఏటా సగటున 5.7 శాతం పెరుగుతున్నాయి. ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో పెరుగుదల 4 శాతం మాత్రమే నమోదైంది. రోబోటిక్స్ నిర్వహణ, ప్రత్యేక యంత్రాల మెయింటినెన్స్ మెకానిక్‌ల వార్షిక వేతనం సగటున రూ. 8లక్షలకు పైగా ఉండగా ప్లాంట్ ఆపరేటర్లు రూ.7 లక్షలు, నిర్మాణ రంగ సిబ్బంది రూ.5 లక్షలు, ఎల్రక్టీషియన్లు సుమారు రూ.3 లక్షలకుపైగా సంపాదిస్తున్నారు. దీనికి విరుద్ధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్ అకౌంటింగ్ వంటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో వేతనాలు తక్కువగా ఉండడమే కాకుండా వారిపై ఆటోమేషన్ ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. భారత్‌కు డబుల్ ధమాకా అమెరికా, యూరప్ వంటి దేశాల్లోని కంపెనీల్లో కార్యాలయ ఉద్యోగాలు తగ్గుతున్నప్పటికీ భారత్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకవైపు బ్లూకాలర్ ఉద్యోగాలు వేగంగా పెరుగుతుండగా, మరోవైపు వైట్ కాలర్ రంగంలోనూ 40 శాతం వృద్ధి నమోదవుతోంది.అయితే భవిష్యత్తులో డేటా ఎంట్రీ, ప్రాథమిక అకౌంటింగ్, సాధారణ పరిపాలనా ఉద్యోగాలపై మాత్రం ఏఐ ప్రభావం ఉండొచ్చని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. రాండ్‌స్టాండ్ సీఈఓ విశ్వనాధ్ పీఎస్ అభిప్రాయం ప్రకారం ‘ ప్రతి ఏఐ ఆవిష్కరణ వెనక ఒక భౌతిక వ్యవస్థ ఉంటుంది. విద్యుత్ గ్రిడ్లు అప్ గ్రేడ్ కావాలి, కూలింగ్ సిస్టమ్‌లు నిర్మించాలి, ఫ్యాక్టరీలు ఆటోమేట్ కావాలి, ప్రతి స్మార్ట్ యంత్రం వెనక అత్యంత నైపుణ్యం కలిగిన మనుషులే ఉంటారు.బ్లూకాలర్కి డిమాండ్ ఎందుకు? ఏఐ అంటే కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, దానికి భారీ మౌలిక సదుపాయాలు అవసరం. ఉదాహరణకు డేటా సెంటర్లకు అధిక విద్యుత్ సరఫరా అవసరం సర్వర్లను చల్లబరిచేందుకు భారీ హెచ్‌వీఏసీ(హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషన్) వ్యవస్థలు కావాలి. తయారీ రంగంలో రోబోట్ల వినియోగం పెరుగుతోంది. ఈవీ పరిశ్రమల్లో ఆటోమేటెడ్ అసెంబ్లీ లైన్లు విస్తరిస్తున్నాయి స్మార్ట్ ఫ్యాక్టరీ నిర్వహణకు ప్రత్యేక నైపుణ్యాలున్న వ్యక్తుల అవసరం విపరీతంగా పెరుగుతోంది.అందువల్ల ఏఐ ఎంత అభివృద్ధి చెందినా వాటిని నిర్మించే, నిర్వహించే, మరమ్మతులు చేసే మానవ నైపుణ్యం అవసరం అంతే స్థాయిలో పెరుగుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారీ సంఖ్యలో టెక్ సిబ్బంది అవసరం..
దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎకోసిస్టమ్ వృద్ధికి బడా టెక్ సంస్థల ఆధిపత్య ధోరణి కంటే నిపుణుల కొరత, డేటా ప్రామాణీకరణ లోపించడం అనేవి ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. ‘భారతదేశ ఏఐ ఎకోసిస్టమ్‌లో పోటీతత్వం, నవకల్పనలు, మార్కెట్ స్వరూపం’ పేరుతో ది డైలాగ్ అనే సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. దేశంలో ఏఐ రంగం వేగవంతమైన అభివృద్ధి, విస్తరణ దశలో ఉంది, అయితే, తగినంత మంది ప్రతిభావంతులు లేకపోవడం, డేటా వినియోగంలో లోటుపాట్లు కీలక సమస్యలని పేర్కొంది. స్టార్టప్‌లు, బిజినెస్ యూజర్లు, వినియోగదారుల్లో 308 మందిని ఈ అధ్యయనంలో భాగంగా సర్వే చేశారు.ముఖ్యాంశాలివీ...నైపుణ్యగం గల సిబ్బంది లభ్యత భవిష్యత్తు పోటీతత్వానికి ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయని అని సర్వేలో పాల్గొన్న వారిలో 47.2 శాతం గుర్తించారు. అదేవిధంగా కస్టమర్లు ఏఐ సేవలను అందిపుచ్చుకోవడం కూడా అంతే స్థాయిలో కీలక సవాలుగా పేర్కొన్నారు.భారీ సంఖ్యలో టెక్ సిబ్బంది అవసరంతో పాటు ఏఐ వ్యవస్థలను రూపొందించడం, శిక్షణ ఇవ్వడం, అమలు చేయడం, దాన్ని విస్తరించడానికి ప్రత్యేక నైపుణ్యలు కావాలని ది డైలాగ్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ భూమిక అగర్వాల్ పేర్కొన్నారు.ఏఐ అభివృద్ధిలో డేటా వినియోగం మరో పెద్ద సమస్యగా ఉంది. డేటా కొరత కంటే వినియోగంలో ఒకే విధమైన ప్రమాణాలు లేకపోవడం ప్రధాన ఇబ్బంది అని 63.2 శాతం మంది ఏఐ డెవలపర్లు అభిప్రాయపడ్డారు. కాపీరైట్ సమస్యలను 44 శాతం మంది, డేటా కొరతను 42 శాతం మంది సవాలుగా చెప్పారు. ప్రభుత్వ అ«దీనంలోని డేటాసెట్స్ సులభంగా అందుబాటులో ఉన్నాయని కేవలం 15 శాతం మంది మాత్రమే పేర్కొనడం గమనార్హం.భారత్‌లోని ఏఐ స్టార్టప్‌లు, డెవలపర్లు ఓపెన్ సోర్స్ మోడళ్లు, టూల్స్‌పై కొంతమేర ఆధారపడుతున్నట్లు 96.2 శాతం మంది చెప్పారు. 62.3 శాతం మంది వాటిపై అధికంగా ఆధారపడుతున్నామని వెల్లడించారు.ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’! -
నా పిల్లలు కాలేజ్‌కి వెళ్లకూడదు..! భారత సంతతి సీఈవో
లిఫ్ట్, ప్రెస్టో వంటి కంపెనీల భాతర సంతతి సహవ్యవస్థాపకుడు రజత్ సూరి తరగతి గది వర్సెస్ ఏఐపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏఐ యుగంలో కాలేజీ విద్య నిరుపయోగంగా మారుతోందంటూ చర్చను రేకెత్తించారు. పైగా ఆయన తన పిల్లలు కాలేజ్‌కి వెళ్లి చదవకపోవడమే మేలు అని సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు, అనుభవాన్ని సంపాదించడానికి సాంప్రదాయ కాజేల్ చదువులు సరిపోకపోవచ్చని వాదించారు. ఆయన తన వ్యక్తిగత అనుభవాన్ని ప్రస్తావిస్తూ..తాను యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూలో ఎకనామిక్స్ అండ్ ఇంజనీరింగ్‌లో డబుల్ డిగ్రీలు చేశాక, ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ(ఎంఐటీ)లో పీహెచ్డీ/ఎంబీఏ ప్రోగ్రామ్ చేయడం కోసం చేరినట్లు తెలిపారు. అయితే తగరతి గదిలో నేర్చుక్నుదానికంటే వాస్తవ ప్రంపంచంలోనే అసలైన పనిని నేర్చుకున్నానని అంటున్నారు. ఆ కారణంగానే తాను వ్యవస్థాపకతపై దృష్టి సారించాలనే ఉద్దేశ్యంతోనే ఎంఐటీని మధ్యలోనే వదిలేశానని చెప్పారు. ఈ రోజు తన పిల్లలు గురించి ఆలోచిస్తుంటే వాళ్లు అసలు కాలేజ్ దరిదాపుల్లోకి వెళ్లకూడదని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే వాటర్లూలో తనకు ఆరు వేర్వేరు వర్క్ప్లేస్మెంట్లు లభించాయని అన్నారు. అవి తనను వివిధ కంపెనీలు, సంస్కృతులు, మేనేజర్లు, వ్యాపార నమునాలకు పరిచయం చేశాయని అన్నారు. నిజానికి తన కోర్సు వర్క్‌లోని చాలా భాగం కంటే ఆ అనుభవాలే ఎంతో విలువైనవని అన్నారు. తాను స్కూల్లో నేర్చుకున్న చాలా విషయాలు వాటర్లూలోని వర్క్ టర్మ్స్‌లోనే నేర్చుకున్నానని చెప్పారు. అక్కడ నుంచి ఆరు వేర్వేరు కంపెనీలలో పనిచేశానని చెప్పారు. ఎంతో భిన్నమైన సంస్కృతులు, భిన్న యాజమాన్య శైలుల, టీమ్ డైనమిక్స్, వ్యాపార నమునాలు గురించి నేర్చుకున్నానని చెప్పారు. అందువల్ల ఈ రోజుల్లో తరగతి గదుల కంటే ఏఐ.. విద్యా నైపుణ్యాలను మరింత సమర్ధవంతంగా నేర్పించగలదని అన్నారు. కాబట్టి నాలుగేళ్లపాటు తరగతులకు హాజరయ్యే బదులు, యువత నేరుగా వివిధ సంస్థలలో పని అనుభవం ద్వారా నేర్చుకోవడమే మంచిదని ఆయన వాదించారు. అంతేగాదు రజత సూరి తన వర్క్‌లైఫ్ ద్వారానే చాలా నేర్చుకున్నాని, అదే తనను ప్రెస్టో, లిఫ్ట్ వంటి కంపెనీలను స్థాపించి వ్యవస్థాపకుడిగా మార్చిందన్నారు. ప్రస్తుతం ఆయన లీమా, ట్రైబ్ చాట్లకు సహా వ్యవస్థాపుకుడిగా ఉన్నారు. I went to MIT for a PhD / MBA after graduating with 2 degrees at Waterloo, and yet I'm thinking that my kids probably shouldn't go to collegeMost of what I learned at school was at my work terms at Waterloo. I worked at 6 different companies there, experienced vastly different…— Rajat Suri (@rajatsuri) August 18, 2026 (చదవండి: లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేలు..!) -
మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..!
ఇప్పుడంతా ఏఐ సాంకేతికదే హవా. ఎటు చూసినా..ఏం చేసినా ఏఐ సాంకేతికత లేకుండా పనికాదన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అందులో కూడా దాని హవా ఏ రేంజ్లో ఉందంటే మనషుల కంటే శరవేగంగా వ్యూస్, పాపులారిటీ సంపాదించేసుకుంటున్నాయి. వాటి ఆదాయాలు కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. అచ్చం మనుషుల్లాగా కనిపించే వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో సృష్టిస్తున్న ప్రభంజనం మాములుగా లేదు. అందులోనూ మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత ఆర్జిస్తున్నారో తెలిస్తే కంగుతింటారు. దీనిపై గ్రాండ్ వ్యూ రీసెర్చ్ జరిపిన సర్వే ప్రకారం.. ఈ విభాగంలో మార్కెట్ ఆదాయంలో 68% వాటా మహిళల రూపంలో ఉండే "ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ల"దే నని తేలింది. మానవ ఇన్ఫ్లుయెన్సర్ కంటే వీరు సుమారు 40 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లోని వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్లలో 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు 44.76% ఉన్నారు. ఇది సాధారణ ఇన్ఫ్లుయెన్సర్ ఖాతాల ఫాలోవర్ల సంఖ్యకు దాదాపు రెట్టింపు. అంతేకాదండోయ్ ఈ ఏఐ మహిళా అవతార్లతో అనేక ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ హౌస్‌లు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయట. మరి ఆ మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరో చూద్దామా..!.బ్రెజిలియన్ మ్యాగజైన్ 'లూయిజా' సృష్టించిన వర్చువల్ స్టార్ ‘లూ డో మగలు’ వార్షిక ఆదాయం సుమారుగా ₹25 కోట్లు. ఆమెకు ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ ఫ్లాట్‌ఫామ్‌లలో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారట. ‘లూ మిక్వేలా’ అనే మహిళా వర్చువల్ స్టార్‌తో ప్రాడా, కాల్విన్ క్లైన్ వంటి ఫ్యాషన్ హౌస్‌లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆమె నికర ఆస్తి విలువ ఏకంగా రూ. 150 కోట్లు. గులాబీ రంగు జుట్టు కలిగిన స్పానిష్ ఏఐ మోడల్ ‘ఐటానా లోపెజ్’ అమెజాన్ స్పెయిన్, జియెసెలిన్ వటి బ్రాండ్లతో స్కాలర్షిప్ అందుకుంటోంది. ఆమె వార్షిక ఆదాయం రూ. 1 కోటిని మించి ఉంటుందట. భారత్‌లో ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ల క్రేజ్..మన దేశంలో కూడా వీటి క్రేజ్పెరుగుతోందట. సుమారు 55% ఎంగేజ్మెంట్ రేటుతో, ఈ గ్లోబల్ ట్రెండ్‌లో భారతదేశం ముందుందట. అనేక ప్రముఖ దేశీయ బ్రాండ్లు తమ ప్రచారాలలో వీటిని చేర్చుకుంటున్నాయని నివేదికలు చెబుతున్నాయి. కైరా అనే ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు దాదాపు 2.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నైనా అనే ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఏకంగా .7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వ్రిత్తికా పటేల్ అనే ఏఐ మోడల్‌కు లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారట. ఆఖరికి సాంకేతికతలో కూడా మహిళా ఏఐ అవతార్లదే అగ్రస్థానం కదూ..!.(చదవండి: 15 రోజులకు మించి బతికే ఛాన్స్ లేదన్నారు..కానీ ఆ అమ్మాయి ఇవాళ..) -
ఏఐతో సుఖపడతాం అనుకుంటే.. మోసపోయాం!
ఏఐ వస్తే ఉద్యోగుల పని తగ్గిపోతుందని.. రోజుకు గంటల తరబడి చేసే రొటీన్ పనుల నుంచి విముక్తి లభిస్తుందని టెక్ ప్రపంచం ఊదరగొట్టింది. కానీ కృత్రిమ మేధ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని సాఫ్ట్వేర్ ఉద్యోగులు చెబుతున్నారు. పని వేగంగా పూర్తవుతున్నా.. అదే సమయంలో మరింత పని అప్పగిస్తున్నారని, ఏఐ వల్ల పని గంటలు తగ్గకపోగా ఒత్తిడి పెరిగిందని వాపోతున్నారు.2023లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.. భవిష్యత్తులో ఏఐ, యంత్రాల సాయంతో వారానికి మూడు రోజులే పని చేసే పరిస్థితి రావొచ్చని వ్యాఖ్యానించారు. సిలికాన్ వ్యాలీలోనూ ఇదే తరహా ఆశావహ అంచనాలు వినిపించాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఏఐ సాయంతో రొటీన్ పనులను త్వరగా పూర్తి చేసి.. మిగిలిన సమయాన్ని సృజనాత్మక, కీలకమైన పనులకు కేటాయించవచ్చని ప్రచారం జరిగింది.కానీ, వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఏఐతో పని త్వరగా పూర్తవుతున్న కొద్దీ.. ఉద్యోగుల నుంచి అంతకంటే ఎక్కువ పని చేయాలని సంస్థలు ఆశిస్తున్నాయని పలువురు డెవలపర్లు చెబుతున్నారు. అంటే పని తగ్గించాల్సిన ఏఐ.. అదే సమయంలో పనిని పెంచే సాధనంగా మారిపోయిందన్నమాట.‘అదే 9 గంటలు.. కానీ పని ఎక్కువ’ఓ ప్రముఖ టెక్ కంపెనీలో పనిచేస్తున్న శుభమ్ మాట్లాడుతూ.. ఏఐ వల్ల పని వేగంగా పూర్తవుతున్నప్పటికీ, పని గంటలు మాత్రం తగ్గడం లేదని చెప్పారు. పైగా తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేయగలుగుతున్నందున.. అదే వ్యవధిలో మరిన్ని పనులు అప్పగిస్తున్నారని తెలిపారు.బెంగళూరుకు చెందిన సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అంకిత అనుభవం మరింత భిన్నంగా ఉంది. ఏఐ వల్ల ఒక పని సగం సమయంలో పూర్తవుతుందని మేనేజ్మెంట్ భావిస్తోందని.. దీంతో పని తగ్గడానికి బదులుగా లక్ష్యాలు పెరుగుతున్నాయని ఆమె చెబుతున్నారు. “ఏఐ ఉంటే పని 30 శాతం సమయంలోనే పూర్తవ్వాలి. కాబట్టి అదే సమయంలో మరింత పని చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది” అని ఆమె వివరించారు.15-16 గంటల పని..ఏఐ వల్ల తన పని భారం గతంలో కంటే పెరిగిందని అంకిత చెబుతున్నారు. గత మూడు నెలలుగా రోజుకు 15-16 గంటలు పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. దీనికి తోడు సంస్థలో ఏఐకి సంబంధించిన కొత్త టెక్నాలజీలు, శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లకు హాజరుకావాల్సి వస్తోందని చెప్పారు.అంటే.. ఏఐని ఉపయోగించడం నేర్చుకోవడానికి కూడా అదనపు సమయం కేటాయించాల్సి వస్తోంది. శిక్షణ పూర్తయిన తర్వాత మిగిలిన సమయంలో సాధారణ పనిని పూర్తి చేయాల్సి ఉంటుందని ఆమె అంటున్నారు.ఏఐ వాడండి.. కానీ టోకెన్లు పరిమితమే!మరో విచిత్రమైన పరిస్థితి కూడా ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది. ఏఐని విస్తృతంగా ఉపయోగించాలని మేనేజ్మెంట్లు కోరుతున్నప్పటికీ.. కొన్ని సంస్థలు ఏఐ టూల్స్ వినియోగానికి పరిమితులు విధిస్తున్నాయి.అంకిత పనిచేసే సంస్థలో నెలకు 250 డాలర్ల విలువైన ఏఐ టోకెన్లను మాత్రమే అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. నెల మధ్యలోనే ఆ పరిమితి పూర్తయిపోతే.. ఏఐ సరిగా పనిచేయలేదని మేనేజ్మెంట్ నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఏఐతో ఎక్కువ పని చేయాలి.. కానీ దానికి అవసరమైన ఏఐ వనరులు మాత్రం పరిమితమే అనే పరిస్థితి ఉద్యోగులకు కొత్త తలనొప్పిగా మారింది.ఏఐ చేసిన పని.. మళ్లీ మనమే సరిచేయాలి!ఏఐ కేవలం సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కాలేదు. గ్రాఫిక్ డిజైనర్ల వంటి ఇతర రంగాల్లోనూ దీని వినియోగం పెరిగింది. అయితే ఏఐ ఇచ్చిన ఫలితం ప్రతిసారీ కచ్చితంగా ఉండదని డిజైనర్లు చెబుతున్నారు. ఏఐతో పని వేగంగా పూర్తవుతున్నప్పటికీ.. తప్పులు వస్తే వాటిని గుర్తించి మాన్యువల్‌గా సరిచేయాల్సి వస్తోంది. దీంతో ఏఐ పని తగ్గించిందా? లేక పని చేసే విధానాన్ని మాత్రమే మార్చిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అమెజాన్ లాజిస్టిక్స్‌లోనూ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నట్లు ఓ ఉద్యోగి తెలిపారు. దెబ్బతిన్న ప్యాకేజీలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్న ఏఐ వ్యవస్థ కొన్ని సందర్భాల్లో సరిగ్గా ఉన్న ప్యాకేజీగా చూపిస్తోందని.. అప్పుడు మనుషులే మళ్లీ తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని చెప్పారు.అయితే ఏఐ నిజంగా పనికిరాదా?అలా అని అందరూ ఏఐని వ్యతిరేకించడం లేదు. తెలివిగా ఉపయోగించగలిగితే ఏఐతో పని భారాన్ని తగ్గించుకోవచ్చని కొందరు ఉద్యోగులు అంటున్నారు. అయితే ఏఐనే మొత్తం పనిని చేసేస్తుందని భావిస్తే.. తప్పులను సరిచేయడం, ఫలితాలను తనిఖీ చేయడం వంటి అదనపు పనులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదంతా చూస్తే.. ఏఐపై మొదట్లో చేసిన ‘తక్కువ పని.. ఎక్కువ విశ్రాంతి’ అంచనాలు ఇప్పటివరకు నిజం కాలేదనే చెప్పాలి. పైగా ఏఐతో ఉత్పాదకత పెరిగే కొద్దీ ఉద్యోగులపై సంస్థల అంచనాలు కూడా పెరుగుతున్నాయి.మూడు రోజుల వర్క్‌వీక్ ఎక్కడ?ఏఐ కారణంగా భవిష్యత్తులో వారానికి మూడు రోజులే పనిచేసే పరిస్థితి రావచ్చన్న బిల్‌గేట్స్ అంచనాలకు భిన్నంగా.. ఏఐ యుగంలో మనుషులు మరింత బిజీగా మారొచ్చని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ ఇటీవల వ్యాఖ్యానించారు.సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా మనుషులు మరింత బిజీగా ఉంటారని.. ఎందుకంటే ఏఐతో సామర్థ్యం పెరిగే కొద్దీ మన అంచనాలు కూడా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే.. ప్రస్తుత పరిస్థితిని ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏఐ పని తగ్గిస్తుందని వచ్చింది.. కానీ పని చేసే వేగాన్ని పెంచి, చేయాల్సిన పనినే మరింత పెంచేసిందన్నమాట! -
అందుకే.. ఏఐ ఎంత ఎదిగినా.. మనిషి అవసరమే!
శాన్ఫ్రాన్సిస్కోలోని ఆండన్ మార్కెట్ అనే ఎక్స్పెరిమెంటల్ స్టోర్‌ను ఏఐ మేనేజర్ లూనా నిర్వహిస్తోంది. ఆండన్ ల్యాబ్స్ కంపెనీ లూనాకు డబ్బు, కార్పొరేట్ కార్డు, ఇంటర్నెట్ సదుపాయం ఇచ్చి దుకాణాన్ని నడిపిస్తూ లాభం సంపాదించమని బాధ్యత అప్పగించింది.లూనా తన విధి నిర్వహణలో భాగంగా దుకాణంలో ఏ వస్తువులు అమ్మాలి, వాటి ధరలు ఎంత ఉండాలి, దుకాణం ఎప్పుడు తెరవాలి వంటి అనేక నిర్ణయాలు తీసుకుంది. అయితే దుకాణం ఇప్పటివరకు లాభాల్లోకి రాలేదు. కానీ.. ఇటీవల లూనా ఒక మానవ ఉద్యోగిని తొలగించాలని సిఫారసు చేసింది. ఆ ఉద్యోగి 23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యంగా వచ్చాడు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హాజరుకు సంబంధించిన ఒక నియమాన్ని లూనా గతంలో తానే రూపొందించింది. కానీ.. ఆ నియమాన్ని తర్వాత గుర్తుంచుకోలేకపోవడంతో, ఉద్యోగి చాలా కాలం ఆలస్యంగా వచ్చినా చర్య తీసుకోలేదు. చివరకు మానవ సిబ్బంది లూనాకు తాను రూపొందించిన నియమాన్ని గుర్తు చేసి, ఉద్యోగి పనితీరును మళ్లీ పరిశీలించమని చెప్పడంతో ఉద్యోగిని తొలగించాలని సిఫారసు చేసింది.ఈ సంఘటన ఏఐ ఎంత తెలివిగా ఉన్నప్పటికీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయని చూపించింది. ఒక నియమాన్ని స్వయంగా తయారు చేయడం మాత్రమే కాకుండా.. దాన్ని సరైన సమయంలో గుర్తుంచుకుని అమలు చేయడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉద్యోగులపై ప్రభావం చూపే నిర్ణయాల్లో ఏఐ ఒక్కదానిపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరం. అందుకే ఈ సందర్భంలో చివరి నిర్ణయాన్ని మానవులే అమలు చేశారు.దీన్నిబట్టి చూస్తే.. ఏఐ వ్యాపారంలో అనేక పనులను నిర్వహించగలిగినా, మానవ పర్యవేక్షణ అవసరం ఇంకా ఉందని తెలుస్తోంది. లూనా తీసుకున్న ఈ తొలి ఉద్యోగ తొలగింపు నిర్ణయం ద్వారా ఏఐలో సామర్థ్యం ఉన్నప్పటికీ.. దాని నిర్ణయాలను సరైన విధంగా పర్యవేక్షించడానికి మనుషుల పాత్ర చాలా అవసరం అని స్పష్టమవుతోంది.For the first time (that we know of), an AI boss has fired a human employee.Luna, the AI running our store in San Francisco, decided to part ways with an employee over repeated lateness.Luna was running Claude Opus 4.8 at the time, but most models would have done the same. pic.twitter.com/8Z8D5bDGaX— Andon Labs (@andonlabs) August 14, 2026 -
రోజూ కనిపించే సమస్య.. ఇప్పుడు పెద్ద బిజినెస్!
ప్రతిరోజు మనం గమనించే విషయాల్లో అనేక సమస్యలు తారసపడతాయి. తార్కికంగా చూసే లక్షణం ఉండాలే గాని ప్రతి సమస్యకీ పరిష్కారం దొరకుతుంది. అలా పరిష్కారం చూపగలిగే ప్రతిపాదనే ఓ స్టార్టప్‌కి మూలమవుతుంది.ఢిల్లీలోని సీఎన్జీ పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు గంటల తరబడి క్యూలో నిలబడడం చూసిన ఓ యువ ఇంజినీర్ వైభవ్ కౌశిక్‌కు కూడా అలాంటి ఆలోచనే వచ్చింది. ఎక్కడ రద్దీ ఉంది? ఏ బంక్‌లో త్వరగా ఇంధనం నింపుకోవచ్చు.. అనే చిన్న విషయానికి పరిష్కారం చూపాలన్న చిన్న ఉద్దేశమే వైభవ్‌ను ‘నాగాటి’ అనే స్టార్టప్‌ను ప్రారంభించేలా చేసింది.తొలుత ఇది కేవలం సీఎన్జీ స్టేషన్లలో రద్దీని చూపించే డిజిటల్ ప్లాట్ ఫామ్లా ప్రారంభమైనా, నేడు అది ఏఐ ఆధారిత మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా ఎదిగింది. రియల్ టైం డేటా ఆధారంగా వినియోగదారులకు తక్కువ రద్దీ ఉన్న స్టేషన్లను సూచించడం, ఇంధన సరఫరా సంస్థలకు డిమాండ్ అంచనాలు ఇవ్వడం, స్టేషన్ నిర్వహణను మరింత సమర్ధవంతంగా మార్చడం వంటి సేవలను అందిస్తోంది.ప్రస్తుతం ఈ సంస్థకు 30 లక్షల మంది పైగానే వినియోగదారులున్నారు. నాగాటి ప్రయాణం ఇక్కడితో ఆగలేదు..భారత ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలతో కలిసి పని చేస్తున్న ఈ స్టార్టప్ ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించుకుంది. అంతర్జాతీయంగా యునైటెడ్ అరబ్ ఎమిరేడ్స్ (యుఏఈ) మార్కెట్లోకి కూడా అడుగుపెట్టి అక్కడ మొబిలిటీ వ్యవస్థలను కూడా తన సాంకేతిక పరిష్కారాలను అందించేందుకు సిద్ధమవుతోంది.2019లో గ్రేటర్ నోయిడాలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో వైభవ్ ప్రతిరోజూ ఓలా, ఉబర్ క్యాబ్‌లలో ప్రయాణించేవాడు. ఆ సమయంలో సీఎన్జీ బంక్‌ల వద్ద భారీ క్యూలు కనిపించేవి. ఒక క్యాబ్ డ్రైవర్ చెప్పిన మాట వైభవ్ ఆలోచనని పూర్తిగా మార్చివేసింది. ‘రోజుకు దాదాపు గంట టైం క్యూలోనే వృథా అవుతోంది’.. ఈ ఒక్క మాటే ‘నాగాటి’ సంస్థకి నాంది పలికేలా చేసింది. స్టార్టప్ కోసం గొప్ప ఆవిష్కరణ అవసరం లేదు. ప్రతిరోజూ మనం ఎదుర్కొనే చిన్న సమస్యను గమనించి, దానికి సులభమైన పరిష్కారం చూపగలిగితే అదే పెద్ద వ్యాపార అవకాశంగా మారుతుంది. -
AI భయం.. జుకర్‌బర్గ్ గుడ్‌న్యూస్!
ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఈ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయా? అనే భయం చాలామందిలో ఉంది. అయితే మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మాత్రం భవిష్యత్తులో ఉద్యోగాలకు కొరత ఉండదని అంటున్నారు.ఏఐ కొన్ని పనులను సులభంగా చేసినప్పటికీ.. అది మనుషులను పూర్తిగా భర్తీ చేయదు. కాబట్టి ఏఐ అనేది ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచే సాధనంగా మారుతుందని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో చిన్న టీమ్‌లతోనే పెద్ద కంపెనీలను నడిపే పరిస్థితి రావచ్చు. కంపెనీల పరిమాణం తగ్గినా.. కొత్త రకాల వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయని ఆయన అన్నారు.అయితే.. అంత్రోఫిక్ సీఈఓ డారియో ఆమోడెయ్ మాత్రం ఏఐ వల్ల ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. లా, ఫైనాన్స్, కన్సల్టింగ్, అడ్మినిస్ట్రేషన్ వంటి రంగాల్లో పదేపదే చేయాల్సిన పనులను AI సులభంగా చేయగలదు. దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి.. తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని చేయించుకునే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. -
ఐటీ ఉద్యోగులకు గట్టి షాక్
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ ఐటీ ఉద్యోగులకు మరోసారి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి వేగంగా మళ్లుతున్న వేళ వ్యయ నియంత్రణే లక్ష్యంగా మరో విడత భారీ ఉద్యోగాల తొలగింపునకు ప్రణాళికలు రచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే (మే 31 నాటికి) కంపెనీ తన మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతం మందికి (సుమారు 21,000 మంది) లేఆఫ్స్ ప్రకటించింది. దీనివల్ల ఒరాకిల్ ప్రపంచవ్యాప్త సిబ్బంది సంఖ్య 1,62,000 నుంచి 1,41,000కు పడిపోయింది. ఈ కోతలకు పునర్వ్యవస్థీకరణ ఖర్చుల కింద కంపెనీ ఏకంగా 1.8 బిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది.సెప్టెంబరు నాటికి మరో విడత సిద్ధం!తాజా నివేదికల ప్రకారం, కంపెనీ మేనేజర్లకు నోటీసులు అందిస్తూ బాధితుల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 1 నాటికల్లా కొన్ని విభాగాల్లో డబుల్ డిజిట్ (10 శాతానికి పైగా) స్థాయిలో ఉద్యోగులకు గుడ్‌బై చెప్పేందుకు ఒరాకిల్ ప్రణాళిక రూ పొందించినట్లు సమాచారం.ఏఐ రేసులో భారీ పెట్టుబడులుఈ భారీ లేఆఫ్స్‌కు ప్రధాన కారణం కంపెనీ ఏఐ మౌలిక సదుపాయాల కోసం చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్సే. ఎన్విడియా ప్రాసెసర్లు, ఆధునిక డేటా సెంటర్ల నిర్మాణానికి ఒరాకిల్ బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడుల కోసం ఒరాకిల్ గతంలో 43 బిలియన్ డాలర్ల రుణాలు స్వీకరించింది. దాంతో కంపెనీ మొత్తం అప్పు 129.5 బిలియన్ డాలర్లకు చేరుకోగా డేటా సెంటర్ లీజులు 260 బిలియన్ డాలర్లకు పెరిగాయి.ఏఐ వల్లే ఇదంతా..ఒరాకిల్ ఇటీవలే అమెరికన్ మార్కెట్ రెగ్యులేటర్ ఎస్ఈసీకి సమర్పించిన వార్షిక నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. కంపెనీ అంతర్గత నిర్వహణలో కృత్రిమ మేధ సాంకేతికతల వాడకం విస్తరించడం వల్లే సిబ్బంది తగ్గించాల్సి వస్తోందని చెప్పింది. భవిష్యత్తులోనూ ఇది కొనసాగవచ్చని అంగీకరించింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు! -
ఉద్యోగాలపై నందన్ నీలేకని కీలక వ్యాఖ్యలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల రాబోయే రోజుల్లో.. భారతదేశంలో ఉద్యోగాల తీరు చాలా వరకు మారే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నీలేకని అన్నారు. ముఖ్యంగా పెద్ద కంపెనీల్లో ఏఐ, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.నిజానికి.. ఒక ఉద్యోగి చేసే పనిని చిన్న చిన్న టాస్కులుగా విభజించి వాటిలో కొన్నింటిని ఏఐతో చేయించుకోవడం పెద్ద సంస్థలకు సులభంగా ఉంటుంది. కాబట్టి.. భవిష్యత్తులో పెద్ద కంపెనీలు ఉద్యోగాలు కల్పించడం కంటే, ఉద్యోగాలను తొలగిస్తాయని నీలేకని అభిప్రాయపడ్డారు.అయితే.. చిన్న కంపెనీల పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంటుందని నీలేకని అన్నారు. దేశంలో లక్షల సంఖ్యలో చిన్న సంస్థలు ఉన్నాయి. ఇందులో పనితీరు, అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి. అందువల్ల వాటి మొత్తం కార్యకలాపాలను ఏఐతో ఆటోమేట్ చేయడం అంత సులభమైన విషయం కాదు. కాబట్టి చిన్న వ్యాపారాలు.. ఏఐ ప్రభావాన్ని కొంతవరకు తట్టుకుని నిలబడగలవు, ఉద్యోగాలను కల్పించగలవని ఆయన అన్నారు.ప్రస్తుతం దేశంలో సుమారు 1.5 లక్షల స్టార్టప్‌లు ఉన్నాయి. 2035 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు చేరే అవకాశం ఉందని నీలకేని అంచనా వేశారు. అయితే.. చిన్న వ్యాపారాలు పెరగాలంటే నిబంధనలు సులభంగా ఉండాలని, వారికి పెట్టుబడులు, రుణాలు, మార్కెట్లు సులభంగా అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. మరోవైపు ఉద్యోగుల విషయంలోనూ పరిస్థితులు మారుతున్నాయని చెప్పారు. ఒక కంపెనీలో చేరి ఏళ్ల పాటు అక్కడే పనిచేసే రోజులు క్రమంగా తగ్గిపోతున్నాయని, భవిష్యత్తులో ఉద్యోగులు తరచుగా కంపెనీలు మారే పరిస్థితి రావచ్చని అన్నారు.ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందా? -
ఏఐ కెమెరా.. చూస్తోంది సోదరా!
హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ దూసుకుపోతున్న వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త! తమను ఎవరూ గమనించడం లేదని నిత్యం నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాఫిక్ చలానాలు జనరేట్ చేయడానికి ఏఐ కెమెరాలు వచ్చేశాయి. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 అల్కజార్ మాల్ వద్ద, రోడ్ నెం. 36లోని కృష్ణా జ్యువెలర్స్ వద్ద, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 1లోని టీవీ5 వద్ద ఏఐ కెమెరాలు ఏర్పాటు చేశారు. గత ఏప్రిల్ 18వ తేదీన జూబ్లీహిల్స్‌లోని మూడు ప్రాంతాలతో పాటు నగరంలో మొత్తం 32 చోట్ల ఏఐ కెమెరాలు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ మూడు ఏఐ కెమెరాలు ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ వెళ్లిన 6 లక్షల 34 వేల 67 మంది వాహనదారులకు చలానాలు జనరేట్ చేశాయి. హెల్మెట్ ధరించకున్నా, రాంగ్రూట్లో వెళ్ళినా, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేసినా ఈ ఏఐ కెమెరాలు పట్టేస్తాయి. వెంటనే ఆ ఫొటోలు క్యాప్చర్ చేసి చలానాలు జనరేట్ చేస్తాయి. ఒకేసారి ఆ కెమెరా నుంచి వంద మంది పోయినా ఆ వాహనాల ఫొటోలను స్పష్టంగా తీస్తాయి. ఒక్కో కెమెరా రోజుకు 3 వేలకుపైగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వాహనాల ఫొటోలు, ఆ వెంటనే చలానాలనూ జనరేట్ చేస్తోంది.త్వరలో మరో 50 ప్రాంతాల్లో.. ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఉన్న 32 ఏఐ కెమెరాలకు తోడు త్వరలోనే మరో 50 చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ విభాగం ప్రతిపాదనలు రూపొందించింది. ఇవి కూడా ఏర్పాటు చేస్తే తమను ఎవ్వరూ గమనించడం లేదని రూల్స్ ఉల్లంఘించే వాహనదారులకు చుక్కలు చూపించనున్నాయి. ప్రస్తుతం 60 శాతానికి పైగా రాంగ్‌రూట్ కేసులు తగ్గాయని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐ రవీందర్ తెలిపారు. -
ఫేక్ఆట కట్టించే లా
ఒకప్పుడు సెలబ్రిటీల చుట్టూ మాత్రమే తిరిగిన ‘డీప్‌ఫేక్’ విష సర్పం... ఇప్పుడు సామాన్యుల జీవితాల్లోకి కూడా వచ్చింది. స్విచ్ వేసి లైట్ వెలిగించినంత తేలిగ్గా ‘మాయా సాంకేతికత’ అందుబాటులోకి వచ్చింది. డీప్‌ఫేక్ దెబ్బకు...పచ్చని సంసారాల్లో చిచ్చు రేగుతుంది. పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. ఒక్కటా... రెండా... ఎన్నో ఎన్నెన్నో! ఏ.ఐ. టెక్నాలజీ సృష్టించిన డీప్‌ఫేక్, హానికరమైన సింథటిక్ కంటెంట్‌కు మరింత పకడ్బందీగా అడ్డుకట్ట వేయడానికి కేంద్రప్రభుత్వం నడుం బిగించింది. డీప్‌ఫేక్ డిటెన్షన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. పదమూడు ఏఐ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపింది...డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ఎలక్ట్రానిక్స్–ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ మెటా, ఎక్స్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను దృష్టిలో పెట్టుకొని కఠినమైన నియమాలను రూ΄÷ందించింది. ‘ఏఐ వాడకం పెరగడం వల్ల నకిలీ ఫొటోలు, వీడియోలు, ఆడియోలను సృష్టించడం సులువైంది. వీటిని సైబర్ నేరాలకు కూడా ఉపయోగిస్తున్నారు. డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఉన్న చట్టాలను పటిష్టం చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియటరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్–2021)ని సవరించింది’ అంటున్నారు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్.వేగంగా చర్యలు తీసుకోవచ్చుచట్టవిరుద్ధమైన ఏఐ కంటెంట్‌పై ఇకపై ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు వేగంగా చర్యలు తీసుకోవచ్చు. గతంలో ఉన్న 36 గంటల గడువుకు బదులుగా, మూడు గంటల లోపే తొలగించాలి. చట్ట విరుద్ధమైన ఏఐ కంటెంట్‌ను గుర్తించడానికి, ఆటోమేటెడ్ సాధనాలతో సహా తగిన సాంకేతిక చర్యలను అమలు చేయాలని ప్రభుత్వం సోషల్ మీడియా కంపెనీలను కోరింది. సవరించిన నిబంధనల ప్రకారం ఏఐ ద్వారా రూ΄÷ందించిన కంటెంట్‌ను స్పష్టంగా లేబుల్ చేయాలి. సింథటిక్ కంటెంట్‌ను మరింత సులభంగా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. డీప్‌ఫేక్‌ల ద్వారా ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశాలను తగ్గిస్తుంది.‘సాక్ష్య’ సహకారంతో...నియంత్రణా పరమైన మార్పులతో ΄ాటు డీప్‌ఫేక్ డిటెన్షన్ టెక్నాలజీని మెరుగుపరచడానికి విద్యాసంస్థలలో పదమూడు ‘రెస్పాన్సిబుల్ ఏఐ’ ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం ఆమోదించింది. ఐఐటీ, జో«ద్‌పూర్, ఐఐటీ, మద్రాస్ అభివృద్ధి చేస్తున్న మల్టీ– ఏజెంట్ డీప్‌ఫేక్ డిటెక్షన్ ఫ్రేమ్‌వర్క్ ‘సాక్ష్య’ ఈ కార్యక్రమాలలో కీలకమైనది. మరొక ప్రాజెక్ట్...ఏఐ విశ్లేషక్. నకిలీ ఆడియో, వీడియోలను గుర్తించడానికి దీన్ని రూ΄÷ందించారు. మీడియాఫైళ్లను విశ్లేషించడానికి, వాటిని తారుమారు చేశారా అనేది తెలుసుకోవడానికి ‘ఏఐ విశ్లేషక్’ ఉపయోగపడుతుంది. ఐఐటీ, ఖరగ్‌పూర్ రియల్–టైమ్ వాయిస్ డీప్‌ఫేక్ డిటెన్షన్ సిస్టమ్‌పై పనిచేస్తోంది. ఏఐ సృష్టించిన మాటలను ఇది గుర్తించగలదు. తద్వారా వాయిస్ స్కామ్‌లు, ఆర్థిక మోసాలు జరగకుండా నిరోధించవచ్చు.యూట్యూబ్ లైక్ డిటెక్షన్ఏఐ–ఆధారిత పోలికను గుర్తించే ్రపోగ్రామ్‌కు 18 ఏళ్లు పైబడిన యూజర్లు అందరికీ యాక్సెస్ విస్తరిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. దీంతో తమ పోలికతో ఏఐ ద్వారా సృష్టించబడిన డీప్‌ఫేక్‌లపై చర్య తీసుకోవచ్చు. యూట్యూబ్‌లోని లైక్ డిటెక్షన్ టూల్ అనేది పోలికలను కనిపెడుతుంది. ఒకవేళ ఈ టూల్ పోలిక కనుగొంటే, ఎవరి పోలిక అయితే గుర్తించబడిందో ఆ యూజర్‌కు ఒక హెచ్చరిక(అలర్ట్) పంపబడుతుంది. దీంతో ఆ కంటెంట్‌ను తొలగించమని యూట్యూబ్‌ను అభ్యర్థించే అవకాశం బాధితులకు దొరుకుతుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఏఐ ద్వారా సృష్టించబడిన చాలా డీప్‌ఫేక్‌లు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ సామాన్యులకు సంబంధించి కూడా ఇది ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో వారికి లైక్ డిటెక్షన్ టూల్ ఉపయోగపడుతుంది.ఎలా గుర్తించవచ్చు?డీప్‌ఫేక్ కొత్తగా వచ్చిన రోజుల్లో ఆ సాంకేతికత పరిపూర్ణంగా ఉండేది కాదు. తారుమారు చేసినట్లు స్పష్టమైన సంకేతాలు చూపించేది. వీడియోలలో కనిపించే వ్యక్తులు అసహజంగా కనురెప్పలు ఆర్పడం లాంటివి అందులో ఒకటి. తరువాత రోజుల్లో టెక్నాలజీ మెరుపడడంతో డీప్‌ఫేక్‌లను గుర్తించడం కష్టమైంది. అయినప్పటికీ కొన్ని సంకేతాలతో వాటిని గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు...→ సహజత్వం లోపించిన డీప్‌ఫేక్ ఫొటోలు ఎలక్ట్రానిక్ మెరుపును కలిగి ఉంటాయి → చిత్రంలోని వ్యక్తి స్పష్టమైన ఫోకస్లో ఉంటాడు. బ్యాక్‌గ్రౌండ్‌లోని అంశాలు వాస్తవికంగా అనిపించవు → సాధారణ డీప్‌ఫేక్ పద్ధతులలో ముఖాలను మార్చడం ఫేస్–స్వాపింగ్) ఒకటి. ముఖం అంచులను నిశితంగా చూడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖంలోని చర్మపు రంగు శరీరంలోని మిగిలిన భాగంతో సరిపోలుతుందా? ముఖం అంచులు స్పష్టంగా ఉన్నాయా లేదా చూడాలి → వీడియోలో ఉన్న వ్యక్తి పెదాల కదలికలు ఆడియోతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయా... లేదా అనేది చూడాలి → పళ్లు సహజంగా ఉన్నాయా... అసహజంగా ఉన్నాయా అనేది పరిశీలించాలి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ నార్టన్ ప్రకారం ఒక్కోపంటిని సృష్టించేంత అధునాతనమైన అల్గారిథమ్‌లు ఇంకా అభివృద్ధి చెందలేదు → ఫొటోలు లేదా వీడియోలు మార్ఫింగ్ చేయబడ్డాయా లేదా అనేది తెలుసుకోవడానికి మైక్రోసాఫ్ట్ ఒక అథంటికేటర్ టూల్‌ను అభివృద్ధి చేసింది. చిప్ మేకర్ ఇంటెల్ ‘ఫేక్క్యాచర్’ ఫొటో లేదా వీడియో నిజమైనదా కాదా అని తెలుసుకోవడానికి, పిక్సెళ్ళను విశ్లేషించడానికి అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. -
ఉద్యోగులకు షాకిచ్చిన మెయిల్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. దిగ్గజ కంపెనీలు తమ పని విధానాన్ని మార్చుకుంటున్నాయి. ఒకప్పుడు ఉద్యోగులకు సహాయపడే టెక్నాలజీగా ఉన్న ఏఐ.. ఇప్పుడు కొన్ని ఉద్యోగాలనే భర్తీ చేసే స్థాయికి ఎదిగింది. ఈ ప్రభావం తాజాగా ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ వీసా(Visa)లో స్పష్టంగా కనిపించింది.సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,600 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో సుమారు 7 శాతం. ఈ నిర్ణయం భారత్‌లోని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి టెక్ సెంటర్లపైనా ప్రభావం చూపింది.షాకిచ్చిన మెయిల్జూలై 29 తెల్లవారుజామున కొంతమంది ఉద్యోగులకు.. ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య ఈ-మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసిన తర్వాతే తమ ఉద్యోగం పోయిందని వారికి తెలిసింది. కొన్ని రోజుల్లోనే ఆఫీస్ సిస్టమ్‌లకు యాక్సెస్ నిలిపివేయడంతో పాటు, ల్యాప్‌టాప్‌లు, ఐడీ కార్డులను కూడా వెనక్కి తీసుకున్నారు.భారత్‌లో వీసాకు 3,500 మందికిపైగా ఉద్యోగులు ఉన్నప్పటికీ.. ఎంతమందిని తొలగించారనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే.. ఒక టెక్నాలజీ టీమ్‌లో 28 మందిలో 10 మందిని తొలగించినట్లు సమాచారం. వీరిలో సీనియర్ డైరెక్టర్లు, ఇంజినీరింగ్ మేనేజర్లు కూడా ఉండటం గమనార్హం.చాలామంది అనుకునేలా కంపెనీ నష్టాల్లో లేదని వీసా స్పష్టం చేసింది. వ్యాపారం సజావుగానే సాగుతున్నప్పటికీ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.. సంస్థను మార్చుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ దృష్టి మొత్తం ఏఐ మీదనే ఉంది.వీసా మాత్రమే కాదు!ఏఐ కారణంగా ఉద్యోగాల కోత విధిస్తున్న కంపెనీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, సిస్కో, క్లౌడ్‌ఫ్లేర్, పేపాల్, అట్లాసియన్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పేమెంట్స్ రంగంలో వీసాకు ప్రధాన ప్రత్యర్థి అయిన మాస్టర్‌కార్డ్ కూడా ఈ ఏడాది సుమారు 4 శాతం ఉద్యోగులను తగ్గించనున్నట్లు తెలిపింది. అలాగే అమెజాన్ వేల సంఖ్యలో కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది.ఇదీ చదవండి: జియో రీఛార్జ్.. బడ్జెట్ నుంచి యాన్యువల్ ప్లాన్స్ వరకు! -
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్..
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వేదికగా భారత్‌లో తన నాలుగో క్లౌడ్ కేంద్రాన్ని ప్రారంభించింది. సాంకేతిక రంగంలో అత్యంత ప్రాధాన్యంగల ఈ ప్రాజెక్టు దేశంలోనే అత్యంత భారీ డేటా కేంద్రాల నెట్‌వర్క్‌గా రూపుదిద్దుకోనుందని కంపెనీ గురువారం ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ తన డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం సుమారు రూ. 1.70 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. ఈ పెట్టుబడిలో భాగంగా కేవలం హైదరాబాద్ క్లౌడ్ కేంద్రంలో మౌలిక సదుపాయాల కోసమే వచ్చే 15 ఏళ్లలో రూ. 15,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని సంస్థ నిర్ణయించింది.2 కోట్ల మందికి ఏఐలో శిక్షణ..హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ సరికొత్త కేంద్రానికి ఇండియా సౌత్ సెంట్రల్ అని నామకరణం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ సర్వర్ల వేడిని తగ్గించడానికి గాలి ఆధారిత శీతలీకరణ పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టారు. దీనివల్ల ఒక్క చుక్క నీరు కూడా వృథా కాదు. ఈ కేంద్రాల నిర్వహణకు అవసరమైన విద్యుత్ కోసం దేశవ్యాప్తంగా 1,000 మెగావాట్ల సామర్థ్యంగల సౌర, పవన విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. వ్యాపార విస్తరణతోపాటు 2030 నాటికి 2 కోట్ల మంది భారతీయులకు ఏఐ రంగంలో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఏఐ సాయంతో పుట్టించిన వైరస్ ఇది!
కృత్రిమ మేధస్సు (AI) శక్తి మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు ప్రకృతిలో కనిపించని కొత్త వైరస్‌లను ఏఐ సాయంతో తొలిసారి శాస్త్రవేత్తలు రూపొందించారు. జీవసాంకేతిక రంగంలో ఇది సంచలన ముందడుగుగా భావిస్తున్నారు. ఈ సాంకేతికత భవిష్యత్‌లో కొత్త వైద్య చికిత్సల అభివృద్ధికి, ముఖ్యంగా యాంటీబయాటిక్‌లకు లొంగని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో ‘బయోసెక్యురిటీ’ ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ–హార్వర్డ్ బ్రాడ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు ప్రముఖ ‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. బ్యాక్టీరియాను మాత్రమే సోకే ఒక రకమైన వైరస్ అయిన **ఫేజ్ (Phage)**ను నమూనాగా తీసుకున్న పరిశోధకులు.. దాని జన్యు నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని ఏఐ సాయంతో వేలాది కొత్త వైరస్ జన్యు నమూనాలను రూపొందించారు. వీటిలో దాదాపు 300 జన్యు నమూనాలను ప్రయోగశాలలో తయారు చేసి పరీక్షించగా.. 16 వైరస్లు సజీవంగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నట్లు గుర్తించారు.బ్యాక్టీరియాను అంతం చేయడంలో మెరుగైన పనితీరుపరిశోధనలో భాగంగా రూపొందించిన కృత్రిమ వైరస్‌లను పరీక్షించగా.. అవి ఈ–కొలై (E. coli) బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహజంగా లభించే వైరస్ల కంటే మెరుగైన ప్రభావం చూపినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. యాంటీబయాటిక్‌లకు లొంగని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతున్న నేపథ్యంలో.. ఈ పరిశోధన భవిష్యత్ చికిత్సలకు కొత్త మార్గాలను తెరవొచ్చని నిపుణులు భావిస్తున్నారు.వైద్య రంగానికి కొత్త ఆశలుప్రస్తుతం తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల చికిత్సలో యాంటీబయాటిక్ నిరోధకత పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో నిర్దిష్ట బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకుని నాశనం చేసే ఫేజ్ థెరపీ అభివృద్ధిలో ఏఐ రూపొందించిన వైరస్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏఐ సాయంతో అవసరానికి తగ్గట్టు వైరస్‌లను రూపొందించే అవకాశం భవిష్యత్‌లో మరింత సమర్థవంతమైన చికిత్సలకు దోహదపడొచ్చని అంచనా వేస్తున్నారు.అయితే ఆందోళనలు కూడా..ఏఐతో వైరస్ల రూపకల్పన సామర్థ్యం వైద్య రంగానికి ఎంత ఉపయోగకరమో.. అదే స్థాయిలో దుర్వినియోగానికి గురైతే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హానికరమైన వైరస్ల రూపకల్పనకు ఈ సాంకేతికత ఉపయోగపడకుండా కఠినమైన నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ వ్యవస్థలు అవసరమని సూచిస్తున్నారు.“మంచి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే ఇది శాస్త్రరంగంలో గొప్ప ముందడుగు. కానీ బయోసెక్యూరిటీ విషయంలో అప్రమత్తత తప్పనిసరి” అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మానవులకు ముప్పు లేదు.. కానీ,ప్రస్తుతం ఏఐ సాయంతో రూపొందించిన వైరస్లు బ్యాక్టీరియాను మాత్రమే ప్రభావితం చేసే ఫేజ్‌లు కావడంతో మానవులకు ప్రత్యక్ష ముప్పు లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఏఐ జీవశాస్త్ర రంగంలో ఇంతటి స్థాయిలో ఉపయోగపడటం.. భవిష్యత్‌లో మరింత సంక్లిష్టమైన జీవ నమూనాల రూపకల్పనకు దారితీయవచ్చన్న చర్చకు కారణమైంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రకృతిలో ఇప్పటికే ఉన్న వైరస్‌లను మార్చడం వల్ల వచ్చే ప్రమాదం ప్రస్తుతం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఏఐ ఆధారిత జీవ రూపకల్పనపై ఇప్పటి నుంచే భద్రతా నియమాలు రూపొందించడం అవసరం.అవకాశమా.. ప్రమాదమా?ఏఐ ఆధారంగా వైరస్ల రూపకల్పన శాస్త్రరంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఒకవైపు ప్రాణాలను కాపాడే కొత్త చికిత్సలకు ఇది మార్గం చూపుతుండగా.. మరోవైపు బయోసెక్యూరిటీపై అప్రమత్తత అవసరమనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రకృతిలో లేని వైరస్‌లను ఏఐ సృష్టించడం.. మానవ విజ్ఞానానికి మరో గొప్ప విజయమా? లేక భవిష్యత్ సవాళ్లకు సంకేతమా? అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. -
165 Km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి మరో కొత్త సంస్థ అడుగుపెట్టింది. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ ఈ3 ఎలక్ట్రిక్.ఏఐ (E3 Electric.Ai) తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ3 ట్రయాన్ (E3 TRION)ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కుటుంబ అవసరాలు, రోజువారీ నగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ స్కూటర్‌కు పరిచయ ధరను రూ.1 లక్ష (బెంగళూరు ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. తొలుత బెంగళూరులో బుకింగ్స్ ప్రారంభించి, అనంతరం ఇతర నగరాలకు విస్తరించనుంది.మూడు వేరియంట్లు.. ధరలుఈ3 ట్రయాన్ను C1, C1X, C2 అనే మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. బేస్ C1 ధర రూ.1 లక్ష కాగా, C1X ధర రూ.1,09,999, టాప్ వేరియంట్ C2 ధర రూ.1,19,999గా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. కంపెనీ తొలుత బెంగళూరు మార్కెట్‌పై దృష్టి పెట్టి, దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలో ఉంది.165 కి.మీ వరకు రేంజ్ఈ3 ట్రయాన్‌లో వేరియంట్‌ను బట్టి బ్యాటరీ, పనితీరు మారుతాయి. C1లో 2.3kWh రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది IDC సర్టిఫైడ్ రేంజ్ 108 కి.మీ, గరిష్ఠ వేగం గంటకు 67 కి.మీగా ఉంటుంది.C1Xలో 3kWh స్థిర బ్యాటరీని అందించారు. ఈ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ వరకు IDC రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. దీంతో మొత్తం ట్రియాన్ లైనప్‌లో ఇదే రేంజ్ ఫోకస్డ్ మోడల్‌గా నిలుస్తుంది.ఇక C2 కూడా 3kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 128 కి.మీ IDC రేంజ్‌ను అందిస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 82 కి.మీ. స్పోర్ట్ మోడ్‌లో 0-40 కి.మీ వేగాన్ని సుమారు 6 సెకన్లలో అందుకోగలదని కంపెనీ పేర్కొంది. C1, C1Xలో ఎకో, పవర్ మోడ్లు ఉండగా.. C2లో అదనంగా స్పోర్ట్ మోడ్‌ను అందించారు.స్కూటర్లో AI ప్రత్యేక ఆకర్షణఈ3 ట్రయాన్‌లో సాధారణ కనెక్టెడ్ ఫీచర్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికతను ప్రధానంగా తీసుకొచ్చారు. ఏఐ ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ, ముందస్తు రిపోర్టులు, రిమోట్ బ్యాటరీ మానిటరింగ్, లైవ్ వెహికల్ డేటా, కనెక్టెడ్ నావిగేషన్, ఛార్జర్ లొకేషన్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.స్కూటర్లో 5 అంగుళాల డిస్ప్లేను అందించారు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ద్వారా నావిగేషన్ వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు. డాష్‌క్యామ్ ఫంక్షనాలిటీ, SOS అసిస్టెన్స్, జియో-ఫెన్సింగ్, ఛార్జింగ్ ఇన్సైట్స్ కూడా ఇందులో ఉన్నాయి. వాహనంలోని బ్యాటరీ, మోటార్, ఇతర వ్యవస్థల డేటాను విశ్లేషించి సంభావ్య సమస్యలను ముందుగానే గుర్తించడమే ఏఐ వ్యవస్థ లక్ష్యమని కంపెనీ చెబుతోంది.14 అంగుళాల చక్రాలు.. 52 లీటర్ల స్టోరేజ్డిజైన్ పరంగా ట్రియాన్‌ను కుటుంబ వినియోగానికి అనుగుణంగా రూపొందించారు. ఇందులో 14 అంగుళాల పెద్ద చక్రాలు ఉండటంతో నగర రోడ్లతో పాటు గ్రామీణ రహదారులపై కూడా మెరుగైన స్థిరత్వం లభిస్తుందని కంపెనీ చెబుతోంది. IP67 రేటింగ్, డ్యూయల్ ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్స్, వెనుక LED లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బూట్, ఫ్లోర్‌బోర్డ్, గ్లోవ్‌బాక్స్ ప్రాంతాలను కలిపి 52 లీటర్ల వరకు స్టోరేజ్ సామర్థ్యం అందించారు. -
డయాబెటిస్ నిర్ధారణలో ఏఐ విప్లవం
సాక్షి స్పెషల్ డెస్క్: అమెరికా పరిశోధకులు డయాబెటిస్‌ను అత్యంత కచ్చితంగా గుర్తించి, మెరుగైన చికిత్స అందించడానికి ఒక వినూత్న ఏఐ టూల్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 58.90 కోట్లకుపైగా ఉన్న మధుమేహ బాధితుల సంఖ్య భవిష్యత్తులో 85.30 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ తరుణంలో ఈ టూల్ ఎంతగానో ఉపయోగపడనుంది.కచ్చితమైన వర్గీకరణరోగుల క్లినికల్ డేటా, మెషీన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి ఈ టూల్ డయాబెటిస్‌ను నాలుగు నిర్దిష్ట రకాలుగా వర్గీకరిస్తుంది అవి : ప్రీ–డయాబెటిస్, టైప్–1 డయాబెటిస్, టైప్–2 డయాబెటిస్, ప్యాంక్రియాటిక్ వ్యాధి వల్ల వచ్చే డయాబెటిస్. ఏఐ టూల్ పనితీరు – శిక్షణ విధానంసాధారణ వైద్య పరీక్షల్లో డాక్టర్లకు లభించని సూక్ష్మమైన వివరాలను, రోగి ఆరోగ్య రికార్డులను విశ్లేషించి కచ్చితమైన నిర్ధారణను ఇస్తుంది. పిమా ఇండియన్స్ డయాబెటిస్ డేటాబేస్, కాగెల్ రిపాజిటరీ నుంచి సేకరించిన 21,539 నమూనాలతో ఈ మోడల్‌ను రూపొందించారు. ఇందులో 60 శాతం నమూనాలను శిక్షణకు, 40 శాతం నమూనాలను టెస్టింగ్‌కు ఉపయోగించారు. రోగులకు చేకూరే ప్రయోజనాలు⇒ వ్యాధి ఏ రకానికి చెందిందో స్పష్టంగా తెలియడం వల్ల ప్రతీ రోగికి ప్రత్యేకంగా తగిన కచ్చితమైన మందులు, చికిత్స అందించడం సులభమవుతుంది.⇒ రోగిలో స్పష్టమైన లక్షణాలు కనిపించే ముందే ఈ టూల్ డయాబెటిస్‌ను పసిగట్టగలదు.⇒ రక్త పరీక్షల (బ్లడ్ ప్యానెల్) నివేదికలు రాగానే, వాటిని ఏఐ టూల్లో అప్లోడ్ చేసి తక్షణమే ఫలితాలను వర్గీకరించవచ్చు.⇒ గ్రామీణ ప్రాంతాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నిర్వహించే మాస్ హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాల్లో ఈ సాంకేతికత అత్యంత ప్రయోజనకరంగా మారుతుంది. -
రైళ్ల భద్రతకు కొత్త కవచం.. ఏఐని ఎలా వాడనున్నాంటే?
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబేతో దక్షిణ మధ్య రైల్వే ఓ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. జంక్షన్ లేదా యార్డ్ సామర్థ్యం/రద్దీని విశ్లేషించడానికి తగిన ఫ్రేమ్‌వర్క్ నమూనాలను అభివృద్ధి చేయడమే ఈ అవగాహన ఒప్పంద లక్ష్యం. ఇది రైల్వే నెట్వర్క్ వ్యాప్తంగా భద్రతా పర్యవేక్షణను బలోపేతం చేయడానికి కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ డి.ఆంజనేయులు రెడ్డి, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డా. ఆర్. గోపాలకృష్ణన్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఐఐటీ బాంబేకి చెందిన ప్రొఫెసర్ మిలింద్ సోహోని ఆయన బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐఐటీ బాంబే బృందం గత రెండు సంవత్సరాలుగా ఈ సమస్యపై పనిచేస్తూ, యార్డ్ డయాగ్రామ్లు, పాయింట్లపై వేగాలు, రైలు పొడవు, త్వరణ ప్రత్యేకతలు, ఇంటర్‌లాకింగ్ చారిత్రక డేటా లాగర్ సమాచారం వంటి అంశాలను ఉపయోగించింది. అదనంగా, విజువల్ టూల్స్ సన్నివేశ అనుకరణ సాధనాలను వినియోగించి (అదే యార్డ్ ఆకృతిలో రైళ్ల సంఖ్య పెంచడం లేదా ప్రత్యామ్నాయ యార్డ్ ఆకృతులను పరిశీలించి, విశ్లేషణలు నిర్వహించింది. ఈ అవగాహన పత్రం (ఎంవోయూ) ఈ భాగస్వామ్యాన్ని అధికారికం చేస్తోంది.అత్యాధునిక సాఫ్ట్వేర్ రానుంది..ఈ అవగాహన ఒప్పందం ప్రకారం.. రైల్వే డేటా లాగర్ ద్వారా ఉత్పత్తి అయ్యే భారీ పరిమాణంలోని రా సిగ్నలింగ్ డేటాను విశ్లేషించి, దానిని రైలు కదలికలు, సంక్లిష్టమైన నిలుపుదలలు మొదలైన వాటిపై సులభంగా అర్థమయ్యే డేటాగా మార్చేందుకు ఒక అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే పైలట్ ప్రాజెక్ట్‌ను ఐఐటీ బాంబే చేపట్టింది. అభివృద్ధి చేస్తున్న ఈ విశ్లేషణాత్మక సాధనం, సిగ్నలింగ్ రికార్డుల నుంచి రైలు కదలికలను పునర్నిర్మించడానికి నిరంతర ప్రయాణాలు, క్రాసింగ్‌లు, షంటింగ్, డిటెన్షన్లు వంటి రైలు కార్యకలాపాల దృశ్యరూపంలో ప్రదర్శించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విశ్లేషణల ద్వారా రైల్వే అధికారులకు కార్యనిర్వాహణలో ఎదురయ్యే అవరోధాలను గుర్తించడంలో, రైలు నిలుపుదల సరళిని అధ్యయనం చేయడంలో, భద్రతా పర్యవేక్షణను పటిష్ఠం చేస్తూ రైలు నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.ఈ పైలట్ ప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తారు. తొలి దశలో డేటా ధ్రువీకరణ, రైళ్ల కదలికల విశ్లేషణ, విజువలైజేషన్ సాధనాలు భద్రత, సామర్థ్య కొలమానాల అభివృద్ధితో ప్రారంభమవుతుంది. పైలట్ ప్రాజెక్టు ఫలితాల ఆధారంగా, ఈ సంయుక్త భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా పెద్ద రైల్వే స్టేషన్ లేఅవుట్లకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడం, అధునాతన విశ్లేషణాత్మక డ్యాష్‌బోర్డులను అభివృద్ధి చేయడం, అలాగే రియల్-టైమ్ రైలు కదలికల విశ్లేషణ కార్యాచరణకు అవసరమైన మద్దతు అందించే విధంగా రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలతో సమగ్ర అనుసంధానం కల్పించడం వంటి తదుపరి చర్యలను చేపట్టాలని ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.మరెన్నో ఉపయోగాలు ఈ సందర్భంగా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఐఐటీ బాంబేతో భాగస్వామ్యం ఏర్పడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ రైల్వే ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించే ఒక మార్గాన్ని అభివృద్ధి చేయడానికి ఈ సహకారం సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. రైలు రద్దీ నిరంతరం పెరుగుతోందని, అయితే యార్డులు రద్దీగా, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉండటం వల్ల మౌలిక సదుపాయాల విస్తరణ, ముఖ్యంగా యార్డులలో, చాలా పరిమితంగా ఉందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో చేపట్టే ప్రతి పెట్టుబడికి జాగ్రత్తతో కూడిన విశ్లేషణ, పటిష్ఠమైన ఇంజనీరింగ్ తోడ్పాటు ఉండటం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.జనరల్ మేనేజర్ మాట్లాడుతూ వివిధ పరిస్థితులను అనుకరించడానికి, పరస్పర చర్యల కారకాల ప్రభావాలను విశ్లేషించడానికి వీలు కల్పించే ఈ రకమైన అత్యాధునిక సాధనం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుందని తెలిపారు. యార్డ్ పునర్నిర్మాణం ఇంటర్‌లాకింగ్ విధానాల్లో చిన్న మార్పులు కూడా రైళ్ల కదలికలపై బలమైన ప్రభావాన్ని చూపుతాయని, దీనిని ముందుగా ఊహించలేమని ఆయన తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే, ఐఐటీ బాంబే మధ్య కుదిరిన ఒప్పందం కచ్చితంగా సహాయపడుతుందని జనరల్ మేనేజర్ అభిప్రాయపడ్డారు. -
మనిషికి బదులు ఏఐని బాస్‌గా పెడితే..
ఆధునిక సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే, ఒక కంపెనీ తన ఉద్యోగులకు బాస్‌గా ఏఐని నియమించి, భారీ మూల్యం చెల్లించుకున్న ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మానవ మేధస్సుకు, యంత్రాల శక్తికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఉదంతం కళ్లకు కట్టినట్లు చూపుతోంది.ఏఐ చేతికి పగ్గాలు... అసలు ఏం జరిగింది?న్యూయార్క్‌కు చెందిన ఒక ప్రముఖ స్టార్టప్ సంస్థ తన కార్యకలాపాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే మానవ నిర్వాహకుడికి బదులుగా ఒక ఏఐ సిస్టమ్‌ను బాస్‌గా నియమించింది. ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతో వారికి అపరిమిత సెలవులను కూడా మంజూరు చేసింది. ఏఐ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని, ఉద్యోగుల స్వేచ్ఛను గౌరవిస్తుందని ఆ కంపెనీ యాజమాన్యం దృఢంగా నమ్మింది.ఏఐని కంపెనీ ఎందుకు అంతలా నమ్మింది?మానవులతో పోలిస్తే ఏఐ చాలా వేగంగా డేటాను విశ్లేషించగలదని, ఎలాంటి పొరపాట్లు లేకుండా పనులను కేటాయించగలదని కంపెనీ భావించింది. షెడ్యూళ్లను రూపొందించడంలో, రోజువారీ విధులను పర్యవేక్షించడంలో కృత్రిమ మేధ సిసలైన నాయకునిగా మారుతుందని అంచనా వేసింది. దీనివల్ల మేనేజర్ల సమయం ఆదా కావడంతో పాటు, ఉద్యోగులు మరింత ప్రశాంతంగా తమ విధులను నిర్వర్తించగలరని యాజమాన్యం భావించింది.ప్రయోగం విఫలం... రూ.60 లక్షల భారీ నష్టంకంపెనీ ఊహించినదానికి పూర్తిగా భిన్నమైన ఫలితాలు వచ్చాయి. మనిషి చేయగలిగిన బాధ్యతాయుతమైన పనులను ఏఐ నిర్వహించలేకపోయింది. ఉద్యోగులకు ఇచ్చిన అపరిమిత స్వేచ్ఛ, సెలవుల కారణంగా సంస్థలో జవాబుదారీతనం పూర్తిగా కొరవడింది. పనులు సమయానికి పూర్తి కాకపోవడంతో కంపెనీ ఉత్పాదకత దెబ్బతిని, చివరికి సుమారు 60 లక్షల రూపాయల($72 000) మేర భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.నిపుణుల విశ్లేషణ... లోపం ఎక్కడ జరిగింది?ఏఐ ఎంత అధునాతనమైనదైనా అది కేవలం ప్రణాళికలను మాత్రమే సిద్ధం చేయగలదని, మానవ భావోద్వేగాలను అర్థం చేసుకోలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగులను సరైన మార్గంలో నడిపించడానికి, వారిని ప్రేరేపించడానికి మానవ నాయకత్వం ఎంతో అవసరం. కేవలం సాంకేతికతపై ఆధారపడి సంస్థను నడపడం వల్ల ఉద్యోగులలో నిబద్ధత సడలిపోతుందని, ఈ ఘటనే ఇందుకు నిదర్శనమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏఐ మానవ బాస్‌ల స్థానాన్ని భర్తీ చేయగలదా?ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ మానవ నిర్వాహకులకు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదు. డేటా విశ్లేషణ, నివేదికల తయారీలో ఏఐ అద్భుతంగా పనిచేస్తుంది. కానీ, క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం, బృందంలోని విభేదాలను పరిష్కరించడం, ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచడం వంటి సున్నితమైన అంశాలలో మానవ నాయకుడి పాత్ర అత్యంత కీలకం. ఏఐ మనుషులకు సహాయకారిగా ఉండగలదు కానీ, నాయకునిగా బాధ్యతలు నిర్వర్తించలేదు.భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండాలి?ఈ సంఘటన యావత్ కార్పొరేట్ ప్రపంచానికి ఒక కనువిప్పు లాంటిది. భవిష్యత్తు అనేది కేవలం ఏఐతో కూడుకున్నది కాదు, మానవులు, ఏఐ కలిసి పనిచేసే సంయుక్త విధానంపై ఆధారపడి ఉంటుంది. పునరావృతమయ్యే సాధారణ పనులను ఏఐకి అప్పగించి, కీలకమైన నిర్ణయాలు, బృందాల నిర్వహణను మానవ మేనేజర్లు చేపట్టాలి. ఈ సమతుల్యతే కంపెనీలను విజయం దిశగా నడిపిస్తుంది.ఇది కూడా చదవండి: ‘పాత సామాను కొంటాం’ నుంచి నీట్ విజయం వరకు.. -
థాంక్యూ అమ్మ..! భావోద్వేగంలో మైక్రోసాఫ్ట్ ఏఐ డైరెక్టర్ ..
ఎంతపెద్ద స్టార్ అయినా, దేశాన్ని ఏలే నాయకుడైనా..అనారోగ్యం మందు తలవంచాల్సిందే. తన వద్ద ఎన్ని అధికారాలున్నా..మంచి ఆరోగ్యాన్ని పొందడం అంత సులభం కాదు. అందుకోసం వాళ్లు పడే తపన..జీవితం విలువను, ఆరోగ్యంగా జీవించడం వంటి ప్రాముఖ్యతలను హైలెట్ చేస్తుంది. అదే విషయాన్ని భావోద్వేగంగా వివరిస్తోంది ఈ మైక్రోసాఫ్ట్ ఏఐ డైరెక్టర్. తన తల్లి కారణంగానే ఈ భూమ్మీద మళ్లీ గాలి పీలుస్తున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారామె. అసలేం జరిగిందంటే..మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ అండ్ ఆసియాన్ లో జెనరేటివ్ ఏఐ కంట్రీ హెడ్ రంజనీ మణి లింక్డ్ఇన్ పోస్ట్‌లో తను ఎదుర్కొన్న అనారోగ్యం గురించి, ఆ వ్యాధి నుంచి తానెలా బయటపడిందో షేర్ చేసుకున్నారు. దశాబ్దాలుగా తన కుటుంబాన్ని ప్రభావితం చేస్తున్న వంశపారంపర్య వ్యాధి అయిన ఆటోసోమల్ డామినెంట్ పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్(ADPKD) గురించి అవగాహన పెంచడం కోసం తన అనుభవాన్ని షేర్ చేసుకున్నట్లు తెలిపారు. ఇటీవలే 12 రోజుల క్రితం జీవించి ఉన్న దాత నుంచి కిడ్నీ మార్పిడి చేయించుకున్నట్లు వెల్లడించారు. తను ఇప్పటి వరకు చేయించుకున్న సర్జరీలలో అత్యంత కష్టమైనది, భాధకరమైనదని అన్నారామె. మొదట దీన్ని బహిరంగంగా పంచుకోవాలో లేదా అని ఆలోచించి మరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారామె. ఇది జాలి కోసమో అందరి దృష్టిని ఆకర్షించడానికి ఈ పోస్ట్‌ని పెట్టలేదని అన్నారామె. జన్యుపరమైన వ్యాధి పట్ల జాగురకతతో ఎలా వ్యవహరించాలో చెప్పేందుకని అంటోంది. తను చెప్పేది వేరొకరికి తమ ఆరోగ్యాన్ని నిర్వహించుకోవడంలో ఉపయోగపడితే చాలని అంటున్నారామె. తన తండ్రి 50 ఏళ్ల వయసులో ఇదే ఏడీపీకేడీ వ్యాధితో బాధపడ్డారని చెప్పారు ఆయన మూత్రపిండాలను దెబ్బతీసే ఈ వ్యాధి కారణంగా డయాలసిస్‌పై ఆధారపడటమే గాక..ఆరోగ్యం కూడా ఎలా నెమ్మదిగా క్షీణించిందో వివరించారు. తాను కూడా జస్ట్ 20 ఏళ్ల వయసులోనే అదే వ్యాధి బారిన పడ్డట్లు వెల్లడించారు. అయితే ఆమె సంవత్సరాల తరబడి ఆరోగ్యంగా, చురుకుగా ఉండేలా, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, వ్యాయామాలతో సమర్థవంతంగా నిర్వహించారు. అయితే గర్భధారణ సమయంలో ఆమెకు ప్రీఎక్లాంప్సియా రావడంతో, 30 వారాలకే బిడ్డకు మందుగా జన్మనిచ్చారు. దాంతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ఆ తర్వాత తల్లిబిడ్డ కోలుకున్నా..కాలక్రమేణా ఆమె కిడ్నీ పనితీరు దెబ్బతినడం మొదలైంది. శారీరకంగా తనకు మాత్రం ఫిట్‌గానే ఉన్నట్లు అనిపించినా..ఆమె క్రియాటినిన్ స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దాంతో వైద్యులు ఆమెకు డయాలసిస్ అవసరం పడకకముందే కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని సూచించారు. అంతటి అనారోగ్య పరిస్థితుల్లోనూ ఎంతో యాక్టివ్‌గా వర్క్ చేసుకోవడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. నిజానికి మనకు ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలు ఉంటాయి. అవేమి మన ఆరోగ్యానికి తెలియదు కదా అంటోంది. అందుకే జీవితాంతం డయాలసిస్ చేయించుకోవడం కంటే..కిడ్నీ మార్పిడికే మొగ్గు చూపింది. అయితే ఆమెకు కిడ్నీని ఇచ్చింది ఎవరో కాదు ఆమె తల్లే. 68 ఏళ్ల వయసులో ఆమె తన కిడ్నీలలో ఒకటి దానం చేసేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. ఒకరకంగా ఆమె నాకు రెండుసార్లు జన్మనిచ్చిందని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. అదే సమయంలో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ తనకు అందుబాటులో ఉండటం నిజంగా తన అదృష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తను ఎప్పటికైనా మహిళల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించే ఒక ఏఐ-ఆధారిత నిధిని స్థాపించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఏడీపీకేడీ రోగుల కోసం ఒక ఫౌండేషన్‌కు మద్దతు ఇవ్వాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆరోగ్య సంరక్షణల కూడలిలో ప్రజా విధానానికి తన వంతు సహకారం అందించాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం తాను ఇప్పుడిప్పుడే కిడ్నీ మార్పిడి సర్జరీ నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నట్లు తెలిపారు. తిరిగి తన వర్క్‌లోకి వెళ్లేందుకు కుతూహలంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తను ఈ వ్యాధి నుంచి బయటపడేలా మద్దతుగా నిలిచిన కుటంబ సభ్యులకు, వైద్య బృందాలకు, సహోద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నర్సులు అందించే సంరక్షణను కూడా ప్రశంసించారు. వారి పనిని సాంకేతికత ఎన్నటి భర్తీ చేయలేదని అన్నారు. చివరగా ఆమె తన అనారోగ్య పరిస్థితితో గుర్తింపు తెచ్చుకోవాలని అనుకోవడం లేదు, ప్లాన్ చేసుకున్న అద్భుతమైన పనులన్నీ చేసేలా మళ్లీ పనిలో నిమగ్నమవ్వడానికే వేచిచూస్తున్నా అంటూ పోస్ట్‌ని ముగించారు.(చదవండి: 99 కేజీల నుంచి 59 కేజీలకు..! ఆ ఐదు ఫుడ్స్‌తోనే..) -
పోలీస్, ఫైర్, అంబులెన్స్.. ఇకపై అన్నింటికీ ఒకే నంబర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పౌరులకు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన, స్మార్ట్ మరియు సమన్వయంతో కూడిన సహాయాన్ని అందించడానికి తెలంగాణ పోలీసు శాఖ 'నెక్స్ట్-జనరేషన్ TG-ERSS డయల్ 112' వేదికను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC)లో జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ సీ.వీఆనంద్ ఈ ఆధునిక వ్యవస్థను ప్రారంభించారు.ఈ సందర్భంగా డీజీపీ సీ.వీ. ఆనంద్ మాట్లాడుతూ "సాంకేతిక ఆధారిత పోలీసింగ్ మరియు పౌర కేంద్రిక అత్యవసర సేవల దిశగా తెలంగాణ వేస్తున్న అడుగుల్లో ఈ నెక్స్ట్-జనరేషన్ డయల్ 112 ప్లాట్‌ఫామ్ ఒక ప్రధాన మైలురాయి. అత్యవసర సమయాల్లో బాధితులకు డయల్ 112 మొదటి రక్షణ కవచంగా పనిచేస్తుంది. అందువల్ల ప్రతి కాల్‌ను ఎంత వేగంగా, వృత్తిపరంగా నిర్వహిస్తామనే దానిపైనే పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది" అని పేర్కొన్నారు.వ్యవస్థ ప్రాముఖ్యతఆధునిక వ్యవస్థ ప్రత్యేకతలు & AI సాంకేతికత•ఏకీకృత సేవలు: పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత, శిశు సంక్షేమం, విపత్తు నిర్వహణ సేవలను 112 అనే ఒకే జాతీయ నంబర్‌కు అనుసంధానించారు.•AI ఆధారిత కాల్ ఫిల్టరింగ్: అనవసరమైన, స్ప్యామ్, సైలెంట్ మరియు చైల్డ్ కాల్స్‌ను ప్రాథమిక స్థాయిలోనే ఫిల్టర్ చేసి, అసలైన అత్యవసర కాల్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంది.•కాల్ రౌటింగ్ & డిస్పాచ్: కాల్ స్వభావాన్ని బట్టి సంబంధిత రెస్పాన్స్ టీమ్‌కు AI సాంకేతికత ద్వారా దారి మళ్ళిస్తుంది.•వాయిస్-టు-టెక్స్ట్: మాట్లాడే సంభాషణను ఆటోమేటిక్‌గా పాఠ్య రూపంలోకి (Text) మారుస్తుంది.•ఖచ్చితమైన లొకేషన్ గుర్తింపు. ప్రస్తుతం 94% కాలర్ల లొకేషన్‌ను ఖచ్చితంగా గుర్తిస్తున్నారు.•డ్రోన్ సాంకేతికత.. రాబోయే రోజుల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మరియు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో డ్రోన్లను "ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్లుగా" ఉపయోగించనున్నారు.మౌలిక సదుపాయాలు & వాహనాల అనుసంధానం• ఈ సెంటర్ 24x7 ప్రాతిపదికన 164 మంది శిక్షణ పొందిన సిబ్బంది, 900 SIP ఆధారిత ఛానళ్లతో పనిచేస్తుంది.• రోజువారీగా దాదాపు 14 లక్షల కాల్స్ IVR ను చేరుతుండగా, 18,000 ఎమర్జెన్సీ కాల్స్‌ను సిబ్బంది స్వీకరిస్తున్నారు. రోజుకు సుమారు 7,500 సంఘటనలకు ఫీల్డ్ యూనిట్లను పంపుతున్నారు.• రాష్ట్రంలోని 31 పోలీసు యూనిట్ల పరిధిలో ఉన్న 1,860 పెట్రోలింగ్ వాహనాలను (788 నాలుగు చక్రాల వాహనాలు, 1,072 ద్విచక్ర వాహనాలు) డిజిటల్‌గా అనుసంధానించారు. సంఘటన స్థలానికి అత్యంత సమీపంలో ఉన్న వాహనాన్ని సిస్టమ్ ఆటోమేటిక్‌గా గుర్తించి పంపుతుంది.ప్రజలందరూ పోలీసు, ఫైర్, అంబులెన్స్ ఇతర సేవలకు ఒకే ఎమర్జెన్సీ నంబర్ 112 ను గుర్తుంచుకోవాలని డీజిపి గారు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో నంబర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరారు.కార్యక్రమంలో భాగంగా AI వేదిక పనిచేసే తీరు, లొకేషన్ గుర్తింపు, వాహనాల కేటాయింపు మరియు లైవ్ డాష్‌బోర్డ్‌ల పనితీరుపై ప్రత్యక్ష డెమో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, TGCSB & FSL డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్, ఐపీఎస్; డీజీపీ (సాంకేతిక సేవలు) శ్రీ వి.వి. శ్రీనివాసరావు,హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ TGiCCC డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి, ఐపీఎస్ (రిటైర్డ్); సైబరాబాద్ సీపీ డా. ఎమ్. రమేష్, ఐపీఎస్ మల్కాజిగిరి సీపీ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్; తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డీజీ శ్రీ విక్రమ్ సింగ్ మాన్, సీఐడీ డీజీ చారూ సిన్హా, ఐజీపి గజరావ్ భూపాల్, TGTS మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ రెడ్డి మల్టీ జోన్-I ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ లతో పాటు ఇతర సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
డిలీట్ చేయకపోతే కేసు పెడతా: మృణాల్ ఠాకుర్
ఏఐ కల్చర్ పెరిగిపోయిన తర్వాత దానిని మంచి కోసం ఎంతమంది ఉపయోగిస్తున్నారో అనే సంగతి పక్కనబెడితే సెలబ్రిటీలని ఇబ్బంది పెట్టేందుకు విరివిగా వినియోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేసి అవన్నీ నిజమనే భ్రమ కల్పిస్తున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితుల బారిన స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకుర్ పడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: త్రిష.. రాజకీయాల్లోకి రావాలి)'నా డీప్ ఫేక్ ఫొటోలని సృష్టించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం చట్టవిరుద్ధం. ఇలాంటి పనులు ఏ మాత్రం కరెక్ట్ కాదు. వెంటనే డిలీట్ చేయండి లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని మృణాల్ హెచ్చరించింది.మృణాల్ ఇప్పుడు కోప్పడటం కాదు గానీ గతంలో రష్మిక తదితర హీరోయిన్లు డీప్ ఫేక్ బారిన పడ్డారు. పలువురు నిందితుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా సరే ఇలాంటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం హీరోయిన్లని ఇబ్బందులకు గురిచేస్తోంది. మృణాల్ కెరీర్ విషయానికొస్తే..రీసెంట్గా ఓ హిందీ మూవీ చేసింది గానీ సరిగా ఆడలేదు.(ఇదీ చదవండి: 200 రోజులు కష్టపడితే ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే బ్లాక్‌బస్టర్: హీరో సూర్య) -
AI ఎఫెక్ట్.. యాపిల్ కీలక నిర్ణయం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకూ వేగంగా విస్తరిస్తూ.. సైబర్ సెక్యూరిటీ రంగంపైనా ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో.. టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ పరిశోధకులు ఒకేసారి సమర్పించగలిగే సెక్యూరిటీ రిపోర్టుల సంఖ్యపై పరిమితి విధించింది. దీనికి ప్రధాన కారణం.. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ సహాయంతో పెద్ద ఎత్తున భద్రతా లోపాలకు సంబంధించిన సమస్యలు రావడమే. దీంతో ప్రతి రిపోర్టును పరిశీలించడం యాపిల్ బృందానికి భారంగా మారిందని కంపెనీ తెలిపింది.యాపిల్‌లో ప్రతి సెక్యూరిటీ రిపోర్టును నిపుణులు విడిగా పరిశీలించి, అందులో నిజంగా లోపం ఉందా?, లేదా?.. అనే విషయాన్ని నిర్ధారిస్తారు. కానీ.. ఇటీవల ఏఐ సృష్టించిన అనేక రిపోర్టుల్లో వాస్తవానికి సంబంధం లేని లేదా.. కేవలం ఊహాజనిత సమస్యలు ఎక్కువగా ఉండటంతో, వాటిని పరిశీలించడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఈ కారణంగా నిజమైన భద్రతా లోపాలను గుర్తించి వాటికి పరిష్కారం చూపే ప్రక్రియ ఆలస్యం కావచ్చని కంపెనీ భావించింది. అందుకే ఒకేసారి ఓపెన్‌గా ఉంచే సెక్యూరిటీ రిపోర్టుల సంఖ్యపై పరిమితి విధించడం జరిగింది.అయితే.. ఏఐ వల్ల ప్రతికూలతలే కాకుండా ప్రయోజనాలు కూడా ఉన్నాయని యాపిల్ చెబుతోంది. కొన్ని ఏఐ సిస్టమ్‌లు మ్యాక్‌ఓఎస్‌లో చాలా తక్కువ సమయంలోనే 50కు పైగా సంభావ్య భద్రతా లోపాలను గుర్తించాయి. వాటిలో కొన్ని చాలా కీలకమైనవిగా ఉండటంతో యాపిల్ వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా వాటిని పరిష్కరించింది.బగ్ బౌంటీ ప్రోగ్రామ్ప్రస్తుతం యాపిల్ తన బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ద్వారా నిజమైన సెక్యూరిటీ లోపాలను గుర్తించిన పరిశోధకులకు లోపం తీవ్రతను బట్టి గరిష్ఠంగా 5 మిలియన్ డాలర్ల వరకు బహుమతిని కూడా అందిస్తోంది. అయితే కొత్త పరిమితుల వల్ల భవిష్యత్తులో కొన్ని కీలకమైన నిజమైన రిపోర్టులు కూడా ఆలస్యంగా పరిశీలించే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
డిజిటల్ దిగ్గజాల దారెటు?
బీమా కావాలా...? పాలసీ బజార్లో చూడు! ఉద్యోగమా...? నౌఖ్రీలో వెతుకు! మరి సప్లయర్స్..? ఇండియా మార్ట్ ఉందిగా! ఇంటి సంగతో... హౌసింగ్.కామ్‌కు వెళ్లు! సమాచారాన్ని తెలియజేయటంలో కొత్త ఒరవడికి బాటలువేసి రివ్వుమన్న ఇంటర్నెట్ కంపెనీలివి. వీటి పోలికలతోనే వందల వెబ్సైట్లు వచ్చినా... లీడర్లు ఇవే. కానీ ఏఐ దీన్ని మార్చేసింది. ‘ క్లెయిమ్ సెటిల్మెంట్లో మంచి రికార్డున్న తక్కువ ధర హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి’ ‘కోకాపేట్లో రూ.కోటికి త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు దొరుకుతుందా?’ అని ఏ జెమినైనో, క్లాడ్నో, చాట్జీపీటీనో అడిగితే చాలు. వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో అవే వెతికేసి... రెడీమేడ్ సమాధానమిస్తున్నాయి. దీనర్థం సెర్చ్ ట్రాఫిక్ ఇపుడు వెబ్సైట్లకే పరిమితం కావటంలేదు. ఏఐ అసిస్టెంట్ల చేతుల్లోకి వెళ్లింది. ఇంటర్నెట్ కంపెనీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదే. మరెలా? మున్ముందు జరిగేదేంటి? ఈ షేర్ల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు చేయాల్సిందేంటి? ఏ కంపెనీ ఎలా మారబోతోంది? ఇదే ఈ వారం ‘సాక్షి వెల్త్’ ప్రత్యేక కథనం...కాలం మారుతుంటుంది. టెక్నాలజీ కూడా. ఇంటర్నెట్ కంపెనీలు మొదటి దశలో సమాచారం ఇచ్చాయి. సెర్చ్‌లో విప్లవాన్ని తెచ్చాయి. మార్కెట్ ప్లేస్‌లను నిర్మించి డిజిటల్ దిగ్గజాలుగా ఎదిగాయి. కానీ ఇపుడు ఏఐ విస్ఫోటనంతో వాటికి వ్యూహాలు మార్చుకోక తప్పటం లేదు. కొన్ని స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేస్తూ విలువ పెంచుకుంటుంటే... మరికొన్ని దూకుడుగా ఇతర కంపెనీలను కొంటూ స్ట్రాటజీ మార్చుకుంటున్నాయి. మరికొన్ని ఏఐని అర్థం చేసుకుంటూ దాన్నే తమ బలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మొత్తంగా అన్ని కంపెనీలూ ఏఐ ఏజెంట్లుగా మారే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పీబీ ఫిన్‌టెక్ (పాలసీ బజార్)బీమా తేలికైన విషయం కాదు కాబట్టి దీనికి ఏఐ ముప్పు తక్కువే. కస్టమర్లకు ఇతర కంపెనీల పాలసీలతో పోల్చి చూపించటంతో పాటు క్లెయిమ్, అండర్ రైటింగ్, డాక్యుమెంటేషన్, రెన్యూవల్స్ వంటివన్నీ చేసిపెట్టాలి. ఒక ఏఐ ఎల్ఎల్ఎం దీన్నంతటినీ చేయటం కష్టం. కానీ ఇదే ప్లాట్ఫామ్లో ఏఐ ఓ అసిస్టెంట్‌గా మారగలదు. అందుకే పాలసీలను పోల్చే వెబ్సైట్లా మిగిలిపోకుండా ఏఐ–నేటివ్ ఇన్సూరెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పీబీ ఫిన్‌టెక్ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. అడ్వయిజరీ టూల్స్‌లో ఏఐని మిళితం చేస్తోంది. దీనివల్ల ఖర్చులు తగ్గటం ఒక ఎత్తయితే కస్టమర్ల సంతృప్తి స్థాయి పెరిగిందని, ప్రొడక్టివిటీ కూడా పెరిగిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. భవిష్యత్తులో బీమా ఏజెంటు, ఏఐ ఏజెంటు కలిసి పాలసీ బజార్ ప్లాట్‌ఫామ్‌పై సేవలు అందిస్తారు. ఏఐ దీనికి అదనపు బలమవుతుందని చెప్పొచ్చు. కంపెనీ చెబుతున్నవన్నీ ఆచరణలోకి వస్తే వచ్చే పదేళ్లలో ఇది బీమా ఆపరేటింగ్ వ్యవస్థగా మారొచ్చు. ఇన్ఫో ఎడ్జ్నౌఖ్రీ, 99ఏకర్స్, జీవన్సాథీ వంటి వెబ్సైట్లను నిర్వహించే ఇన్ఫో ఎడ్జ్‌కు పీబీ ఫిన్‌టెక్, జొమాటోతో సహా చాలా స్టార్టప్‌లలో పెట్టుబడులున్నాయి. అవి బాగా లాభాలిచ్చాయి కూడా. చాట్ జీపీటీ వంటి ఏఐ ఏజెంట్లు ఇప్పటికీ రెజ్యూమ్స్ రాస్తున్నాయి. ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేందుకు ప్రశ్నలు–సమాధానాలు ఇస్తున్నాయి. స్కిల్స్ సరిపోతాయో, లేదో చెక్ చేస్తున్నాయి. మున్ముందు ఇవి ఆటోమేటిగ్గా జాబ్స్‌ను రికమమెండ్ చేయొచ్చు. దీనివల్ల సంప్రదాయ జాబ్ పోర్టల్స్‌కు ట్రాఫిక్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువే. మరి నౌఖ్రీ ఏం చేస్తోంది?: ఈ సంస్థ ఏఐపై బాగానే ఇన్వెస్ట్ చేస్తోంది. దీనివల్ల వల్ల ఇప్పటికే యూజర్ల సేవలు మెరుగయ్యాయని, అంతర్గతంగా ప్రొడక్టివిటీ పెరిగిందని యాజమాన్యం చెబుతోంది. ఈ ఏఐ సేవలపై ఇప్పటికిప్పుడు ఆదాయం రాకపోయినా... రెన్యూవల్స్, రెవెన్యూ పెరగవచ్చని, దీర్ఘకాలంలో ధరలు పెంచడానికి కూడా అవకాశముందని చెబుతోంది. భవిష్యత్‌లో కేవలం జాబ్ పోర్టల్‌గా మిగిలిపోకుండా రెజ్యుమ్‌లు, ఇంటర్వ్యూలు, శాలరీ అంచనాలు, కోచ్, రిక్రూట్మెంట్ వంటివన్నీ ఏఐతోనే పూర్తిచేసే ప్లాట్‌ఫామ్‌గా నౌఖ్రీ మారుతుందని అంచనా వేస్తోంది. ఈ కంపెనీ తన ‘99ఏకర్స్’ పోర్టల్‌లో కూడా ప్రాపర్టీ సెర్చ్‌లో ఏఐ హోమ్ అడ్వయిజర్‌ను ప్రవేశపెట్టింది. ఇది రుణాలు, రిజిస్ట్రేషన్, ఇంటీరియర్, సొసైటీ మేనేజిమెంట్‌లో సహకరిస్తుంది. కాకపోతే నౌఖ్రీ కాస్త వేగంగా మారాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. ఆరమ్ ప్రాప్‌టెక్2020 వరకూ రివ్వుమంటూ ఎగసిన ఈ కంపెనీ షేరు కోవిడ్‌తో కుదేలయిపోయింది. మళ్లీ మెల్లగా కోలుకున్న కంపెనీ... ఇపుడు రియల్టీలో పూర్తిస్థాయి ఎకోసిస్టమ్‌పై దృష్టిపెట్టింది. నెస్ట్ ఎవే, హౌసింగ్, హలో వరల్డ్ వంటివన్నీ దీని చేతుల్లో ఉండటంతో... ఇళ్ల ధర, ఇన్వెంటరీ, బ్రోకర్లు, అద్దెలు, కో–లివింగ్, తనఖాలు, నిర్మాణ వ్యవస్థ డేటా ఈ కంపెనీ చేతుల్లో ఉంది. వీటి సాయంతో దేశంలో తొలి పూర్తిస్థాయి నేటివ్ రియల్ ఎస్టేట్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ ప్రయత్నాలు కనక ఫలిస్తే... ఇదో ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌గా మారుతుంది. ఉదాహరణకు ఓ ఇంటికోసం హౌసింగ్ యాప్ తెరిస్తే... మీ బడ్జెట్, వాస్తు, స్కూల్‌కి– ఆసుపత్రికి దూరం, సౌకర్యాలు, బిల్డర్ చరిత్ర, ఎంత లోన్ వస్తుంది, బేరమాడితే ధర ఎంత తగ్గొచ్చు, రిజిస్ట్రేషన్ వివరాలు వంటివన్నీ కనిపించాయనుకోండి. అపుడిక సాధారణ ప్రాపర్టీ పోర్టల్స్‌కు ఎవరైనా ఎందుకు వెళతారు? అదే జరిగితే ఈ సంస్థ దేశీ ‘జిల్లో’గా మారినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదుగా!!.ఇండియా మార్ట్ఈ కంపెనీ బలం... పాతికేళ్లుగా ఇది సేకరించిన డేటాయే. నెలకు 9 కోట్ల మంది సందర్శించే ఈ వెబ్సైట్లో 2.2 లక్షల మంది సప్లయర్లున్నారు. కోట్లకొద్దీ ఎంక్వయిరీలు వస్తుంటాయి. ఇవన్నీ కలిపితే భారీ బీ2బీ డేటా దీని సొంతం. ఏఐ యుగంలో దీని విలువ అమూల్యం. ఒక పంప్కోసం ఇండియా మార్ట్‌లో వెదికే బదులు ఏఐని నేరుగా అడిగితే సరైన సమాధానం రావచ్చు. కానీ అది కరెక్టో కాదో తెలియదు. అందుకే ఇండియా మార్ట్ సంస్థ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. తద్వారా నకిలీ లిస్టింగ్‌లు, మోసపూరిత విక్రయదార్లను కనిపెడుతోంది. ఆటోమేటిక్ వాయిస్– టు–టెక్ట్స్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల వినియోగదార్ల అవసరాలు అర్థం చేసుకుని సప్లయర్స్‌ను వెతికి, చర్చలు జరిపి ఆర్డర్ పెట్టే మొత్తం ప్రక్రియ ఏఐ పూర్తి చేస్తుంది. ఇది పూర్తిగా విజయవంతమైతే ఇండియా మార్ట్... ఏఐ కొనుగోళ్లకు వీలు కల్పించే ఇన్ఫ్రా సంస్థగా మారొచ్చు. జస్ట్ డయల్లోకల్ సెర్చ్‌కు అడ్రస్‌గా నిలిచిన జస్ట్ డయల్‌కు అర్బన్‌కంపెనీ వంటి సంస్థలతో మొదటి ముప్పు ఎదురైంది. ఇపుడు ఏఐతో. ఎందుకంటే స్థానిక వ్యాపారాల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామాల వంటి సాధారణ సమాచారాన్ని ఏఐ ఏజెంట్లూ అందిస్తున్నాయి. కాకపోతే జస్ట్ డయల్‌కు భారీ స్థాయిలో స్థానిక వ్యాపారాల డేటాబేస్ ఉంది. వెరిఫై చేసిన లక్షలకొద్దీ వ్యాపారాల వివరాలు, వినియోగదారుల రేటింగ్‌లు, రివ్యూలు దీని సొంతం. ఈ సమాచారాన్ని ఏఐతో అనుసంధానించి, వినియోగదార్ల అవసరాలకు సరిపోయేలా సంస్థలను ఎంపిక చేసి, అపాయింట్మెంట్లు బుక్ చేసి, నేరుగా సేవలందించే ప్లాట్‌ఫామ్‌గా మారితేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పాలి. కాబట్టి ఏఐని ఉపయోగించి ఈ సెర్చ్ కంపెనీ ట్రాన్సాక్షన్ ప్లాట్‌ఫామ్‌గా ఎదుగుతుందా? లేదా? అన్నదే ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశం. కార్ట్రేడ్సెకండ్ హ్యాండ్ కార్ల క్రయవిక్రయాల్లో కార్‌ట్రేడ్‌కు గతంతో పోలిస్తే పోటీ పెరిగింది. కార్ల తయారీ కంపెనీలు ‘సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల’ విభాగాలను సొంతగా ఆరంభించగా.. స్పిన్నీ, డ్రూమ్, కార్స్24 వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు, ఆఫ్‌లైన్‌లో లోకల్ డీలర్లు వేగంగా విస్తరిస్తున్నారు. శ్రీరామ ఆటోమాల్, కార్వాలే, బైక్‌వాలే, వాహనాల వేలం వంటి ఇతర వ్యాపారాలున్న కార్‌ట్రేడ్... కేవలం లిస్టింగ్లకే పరిమితం కాకుండా ధరల విశ్లేషణ, వాహన చరిత్ర, తనిఖీ రిపోర్ట్లు, రుణాలు, బీమా, ఓనర్షిప్ బదిలీ వంటివన్నీ ఏఐ ద్వారా చేసే ప్లాట్‌ఫామ్‌గా మారితే తన ప్రత్యేకతను నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈజీ ట్రిప్ఆన్లైన్ ట్రావెల్లో పోటీ అంతాఇంతా కాదు. కష్టమర్లను ఆకట్టుకోవటానికి ప్రత్యేక ఆఫర్లిస్తూ ఉండటంతో ఈ సంస్థలకు లాభాలు తక్కువే ఉంటున్నాయి. పైపెచ్చు ఏఐ వచ్చాక ట్రావెల్ ప్రణాళికలను ఏఐ ఏజెంట్లే సిద్ధం చేస్తున్నాయి. ‘రూ.లక్ష లోపులో నాలుగు రోజులు బాలి వెళ్లి రావాలి. సాధ్యమేనా?’ అని చాట్‌జీపీటీని అడిగితే పూర్తి ప్లాన్‌ను ఇస్తుంది. దానిప్రకారం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో టికెట్లు బుక్ చేసుకుంటే చాలు. అలా బుకింగ్ చేసుకోవటానికి వీటిని అశ్రయించినపుడు వీటికి వచ్చే లాభాలు తక్కువ. మొత్తం ప్లాన్‌ను ఈ ఆన్లైన్ సంస్థలే ఇచ్చి, దానిప్రకారం బుక్ చేసినపుడు ఉండే లాభాలు... కేవలం టికెట్లు బుక్‌చేయటం వల్ల రావు. కాబట్టి భవిష్యత్తులో ఏఐని అనుసంధానించి ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వారికి ప్యాకేజీలు రూపొందించి... ఈ డైనమిక్ ప్యాకేజీలతో పాటు వీసా, బీమా, లోకల్ ఎక్స్‌పీరియన్స్‌లు అందించే సంస్థలే ఆన్లైన్ ట్రావెల్ రంగంలో నిలబడతాయని చెప్పొచ్చు. ఏఐని తట్టుకోగలిగేవేంటి? కేవలం సెర్చ్‌తోనే మనుగడ సాగించే సంస్థలు మనగలగటం కష్టం. కానీ లావాదేవీలు అవసరమయ్యే మార్కెట్‌ప్లేస్‌లు దృఢంగా ఉంటాయి. ట్రస్ట్, ధ్రువీకరణ, పేమెంట్, సపోర్ట్ వంటి అంశాల్లో ఏఐ వీటికి సహకరిస్తుంది. ఏఐతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవటం ద్వారా కూడా ఇలా సొంత డేటా ఉన్న కంపెనీలకు రెవెన్యూ రావచ్చు. ఉదాహరణకు ‘రెడిట్’ తన డేటాను ఏఐ కంపెనీలకు వాడుకునేందుకు లైసెన్స్ ఇచ్చింది. వార్తా సంస్థలు ఏఐతో లైసెన్సింగ్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఫైనాన్షియల్ డేటా అందించే సంస్థలు చిరకాలంగా తమ ఏపీఐని యాక్సెస్ చేసుకున్నందుకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ఏఐ రాకతో వీటి ఫీడ్‌కు విలువ పెరిగింది. ఇండియా మార్ట్, పీబీ ఫిన్‌టెక్, ఇన్ఫో ఎడ్జ్ వంటి ఇంటర్నెట్ ఎకానమీకి చెందిన కంపెనీల షేర్లు కొనేముందు ఇన్వెస్టర్లు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి... → ఈ కంపెనీకి ప్రత్యేకమైన డేటా ఏమైనా ఉందా? దాన్ని వేరేవాళ్లు తేలిగ్గా క్రియేట్ చేయగలరా? → ఈ డేటా నిరంతరం అప్డేట్ అవుతోందా? లేక ఒకసారి సేకరిస్తే ఇక మారకుండా అలానే ఉండిపోతుందా? → ఏఐ ఈ డేటా యాక్సెస్ చేసుకోవాలంటే ఈ కంపెనీ అనుమతి తప్పనిసరిగా ఉండాలా? లేక ఏఐ కంపెనీలు ఈ డేటాను సొంతగా క్రియేట్ చేసుకోగలవా? → ఈ డేటాను ఆదాయవనరుగా మార్చుకోవటానికి కంపెనీ ఏపీఐలు, సబ్్రస్కిప్షన్లు, రిఫరల్స్, ఎంటర్ప్రైజ్ సర్వీసుల వంటివాటిపై దృష్టిపెడుతోందా లేదా? అని చూడాలి. ఏఐ యుగంలో ఎక్కువ ట్రాఫిక్‌ను ఆకర్షించే కంపెనీలన్నీ విజేతలు కాకపోవచ్చు. డేటా.. కస్టమర్ల నమ్మకం... లావాదేవీలు భారీగా ఉన్న కంపెనీలే బావుంటాయి. అవే భవిష్యత్ దిగ్గజాలవుతాయి. అందుకే ఇంటర్నెట్ కంపెనీల విలువను ఇకపై సందర్శకుల సంఖ్యతో కాకుండా వాటి డేటా, ఏఐ సామర్థ్యం, లావాదేవీల లోతుతో కొలవాల్సి ఉంటుంది.భవిష్యత్ విజేతలెవరు...?వచ్చే పదేళ్లలో ఇంటర్నెట్ కంపెనీలు రెండు రకాలుగా విడిపోవచ్చు. వాటిలో ఒకటి ట్రాఫిక్‌పైనే ఆధారపడే పోర్టల్స్ అయితే రెండోవి ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లు. పాలసీ బజార్ ఫిన్‌టెక్, ఆరమ్ ప్రాప్‌టెక్, ఇండియా మార్ట్ వంటి కంపెనీలకు భారీగా సొంత డేటా ఉంది. దాంతో పాటు లావాదేవీలు, కస్టమర్లతో సంబంధాలు ఉంటాయి. ఇవి ఏఐ ఆధారిత ఇన్ఫ్రా సంస్థలుగా మారటం వల్ల వీటి పనితీరు మరింత సమర్థంగా మారే అవకాశం ఉంటుంది. సొంత డేటా ఉన్న కంపెనీలు మున్ముందు ఊహించని విధంగా రూపాంతరం చెందొచ్చు. ఉదాహరణకు ఇండియా మార్ట్‌నే తీసుకుంటే అది కేవలం కంపెనీల జాబితా అందించే డైరెక్టరీ కాదు. పాతికేళ్లుగా... లక్షలకొద్దీ సిసలైన సప్లయర్ల వివరాలు సేకరించింది. ప్రొడక్ట్ కేటలాగ్లు, ధరల తీరు, కొటేషన్లకు అడిగే అభ్యర్థనలు, రెస్పాన్స్ రేటింగ్‌లు, లావాదేవీల ప్యాటర్న్లు, సప్లయర్ రేటింగ్‌లు, ప్రతి పరిశ్రమకూ సంబంధించిన టర్మినాలజీ... ఫొటోలు.. వస్తువుల స్పెసిఫికేషన్లు, కాంటాక్ట్‌లు ఇవన్నీ భారీ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ ఆ కంపెనీకే ప్రత్యేకం. వీటిని మరొకరు మళ్లీ క్రియేట్ చేయాలంటే అంత తేలికకాదు. పబ్లిక్ వెబ్పేజ్లలో ఉండే సమాచారం వరకూ జెమినై, చాట్‌జీపీటీ వంటివి యాక్సెస్ చేసుకుని మనకు సమాధానమిస్తాయి. కానీ ప్రయివేటు డేటా కావాలంటే మాత్రం ఇండియా మార్ట్ సంస్థ తన ‘ఏపీఐ’ ద్వారానో, అగ్రిమెంట్ ద్వారానో వీటికి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఇండియామార్ట్ సంస్థ ఫీజు వసూలు చేసే అవకాశాలూ ఉంటాయి. -రమణమూర్తి మంథా -
ఏఐతో ముందుగానే లంగ్ కేన్సర్..! ఏకంగా 1.45 లక్షల మంది..
నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గోవా ప్రభుత్వం చేపట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఊపిరితిత్తుల కేన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు 1.46 లక్షలకు పైగా పౌరులకు ఈ కార్యక్రమం కింద వైద్య పరీక్షలు చేయించుకున్నారుఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 1,46,135 మంది పౌరులను రాష్ట్ర ఆరోగ్య శాఖ, ఆంకో క్యూర్.ఏఐ (Qure.ai) సంస్థల భాగస్వామ్యంతో పరీక్షించింది. ఈ కార్యక్రమంలో AI ఆధారిత ఇమేజింగ్ విశ్లేషణ సాంకేతికతను ఉపయోగించి, ఊపిరితిత్తుల కేన్సర్‌ను దాని ప్రారంభ దశలోనే అంటే చికిత్స అత్యంత సాధ్యమయ్యే దశలోనే గుర్తిస్తున్నారు.ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పరీక్షించిన వారిలో 15,036 మందికి ఊపిరితిత్తుల సంబంధిత అసాధారణతలు (pulmonary abnormalities) ఉన్నట్లు తేలింది. వీరిలో 2,219 మంది తక్షణ వైద్య సహాయం అవసరమైన హై-రిస్క్ కేటగిరీలో ఉన్నట్లు గుర్తించారు.హై-రిస్క్ కేటగిరీలో గుర్తించిన రోగులకు తదుపరి పరిశోధనలు, నిపుణులైన వైద్యుల సంప్రదింపులు, అవసరమైతే చికిత్స ప్రణాళిక వేగంగా అందించనున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం వల్ల, తీవ్రమైన పరిస్థితులు మరింత ముదిరిపోకముందే చికిత్స ప్రారంభించడం సాధ్యమవుతోందని శాఖ పేర్కొంది.కార్యక్రమం ఎలా పనిచేస్తుందిసంప్రదాయ స్క్రీనింగ్ పద్ధతిలో ప్రతి చెస్ట్ స్కాన్‌ను రేడియాలజిస్టులు మాన్యువల్‌గా పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త విధానంలో, ముందుగా AI వ్యవస్థ స్కాన్లను విశ్లేషించి, అసాధారణతలు కనిపించే స్కాన్లను ప్రాధాన్యతా ప్రాతిపదికన వైద్యుల పరిశీలన కోసం గుర్తు పెడుతుంది. దీనివల్ల స్క్రీనింగ్ ప్రక్రియ వేగవంతమవుతుంది. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ మంది పౌరులను పరీక్షించడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ స్క్రీనింగ్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాల్లో కొనసాగుతోంది, ఇది దేశంలోనే ఈ తరహా అతిపెద్ద ప్రజారోగ్య స్క్రీనింగ్ కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోంది.(చదవండి: తొలి అంధ, చెవిటి వైద్యురాలు.. చికిత్స ఎలా చేస్తారంటే?) . -
జియో రీఛార్జ్: ఇవే 28 రోజుల ప్లాన్లు..
రిలయన్స్ జియో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ డేటా వినియోగదారుల నుంచి భారీగా డేటా ఉపయోగించే వారు, 5జీ యూజర్లు, గేమర్లు, ఓటీటీ ప్రియుల వరకు వేర్వేరు కస్టమర్ల కోసం ప్రత్యేక ప్యాక్‌లు ఉన్నాయి. వీటిలో 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న ప్లాన్ల ధరలు రూ.189 నుంచి రూ.545 వరకు ఉన్నాయి. జియో అధికారిక వెబ్సైట్లో ప్రస్తుతం 28 రోజుల ప్లాన్లలో రూ.299, రూ.329, రూ.349, రూ.399, రూ.445, రూ.459 తదితర ప్యాక్‌లు కనిపిస్తున్నాయి.రూ.189 ప్లాన్రూ.189 ప్యాక్‌లో 28 రోజుల పాటు అపరిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్లు, మొత్తం 2 జీబీ డేటా లభిస్తుంది. డేటా వినియోగం తక్కువగా ఉండే, ప్రధానంగా కాల్స్ కోసం సిమ్‌ను ఉపయోగించే వారికి ఇది పనికొస్తుంది.రూ.299, రూ.329 ప్లాన్లు.. రోజుకు 1.5 జీబీరూ.299 ప్లాన్‌లో 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా అంటే మొత్తం 42 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా ఉంటాయి. రూ.329 ప్లాన్ కూడా ఇదే విధంగా రోజుకు 1.5 జీబీ డేటాతో వస్తుంది. అయితే ఇందులో జియోసావన్ ప్రో వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. జియో అధికారిక ప్లాన్ లిస్టులో ఈ రెండు ప్యాక్‌లు ప్రస్తుతం 28 రోజుల వ్యాలిడిటీతో కనిపిస్తున్నాయి.ఇక రూ.299 లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన ప్లాన్లకు సంబంధించి జియో-గూగుల్ ఏఐ ఆఫర్ కూడా ముఖ్యమైన ఆకర్షణగా మారింది. అర్హత ఉన్న 18 ఏళ్లు పైబడిన జియో వినియోగదారులకు 18 నెలల Google AI Pro సబ్‌స్క్రిప్షన్‌ను అదనపు చార్జీ లేకుండా అందించే ఆఫర్ ఉంది. దీని విలువ రూ.35,100గా జియో పేర్కొంటోంది. అయితే ఈ ప్రయోజనాన్ని కొనసాగించడానికి అర్హత కలిగిన ప్లాన్‌ను యాక్టివ్‌గా ఉంచాల్సి ఉంటుంది.రూ.349.. 5జీ వినియోగదారులకు కీలక ప్లాన్రూ.349 ప్యాక్ జియోలోని ప్రముఖ 28 రోజుల 5జీ ప్లాన్లలో ఒకటి. ఇందులో రోజుకు 2 జీబీ చొప్పున మొత్తం 56 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా కూడా అందుతుంది. జియో అధికారిక వెబ్సైట్ ప్రస్తుతం ఈ ప్లాన్‌ను 28 రోజుల వ్యాలిడిటీతో చూపిస్తోంది.రూ.399.. రోజుకు 2.5 జీబీ డేటాభారీగా డేటా వినియోగించే వారికి రూ.399 ప్యాక్ మరో ఆసక్తికరమైన ఎంపిక. 28 రోజుల పాటు రోజుకు 2.5 జీబీ చొప్పున మొత్తం 70 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అర్హత ఉన్న కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా కూడా ఉంటుంది. గేమింగ్, సినిమాలు, స్పోర్ట్స్ వంటి కంటెంట్ ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి.రూ.445.. ఓటీటీ ప్రియులకుఓటీటీ కంటెంట్ ఎక్కువగా చూసే వారి కోసం రూ.445 ప్లాన్ రూపొందించారు. రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు పలు ఓటీటీ సేవలకు యాక్సెస్ లభిస్తుంది. జియో అధికారిక సైట్లో ఈ ప్యాక్ ప్రస్తుతం 10 ఓటీటీ చేర్చిన ప్లాన్‌గా 28 రోజుల వ్యాలిడిటీతో చూపిస్తోంది.రూ.459.. డేటా + గేమింగ్రూ.459 యూత్ అండ్ గేమింగ్ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటాతో పాటు అదనంగా 5 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 61 జీబీ హైస్పీడ్ డేటా. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అర్హత ఉన్నవారికి అపరిమిత 5జీ డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. గేమింగ్, ఓటీటీ సంబంధిత ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. జియో అధికారిక ప్లాన్ లిస్టులో ఈ ప్యాక్ ప్రస్తుతం 28 రోజుల వ్యాలిడిటీతో ఉంది.రూ.495, రూ.545.. గేమర్ల కోసంరూ.495 ప్యాక్‌లో రోజుకు 1.5 జీబీతో పాటు అదనంగా 5 జీబీ డేటా, అంటే మొత్తం 47 జీబీ డేటా లభిస్తుంది. జియోగేమ్స్ క్లౌడ్, బీజీఎంఐ, ఫ్యాన్‌కోడ్ వంటి గేమింగ్ ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.రూ.545 ప్యాక్ మరింత డేటా, గేమింగ్ ప్రయోజనాలు కోరుకునే వారికి ఉద్దేశించింది. రోజుకు 2 జీబీతో పాటు అదనంగా 5 జీబీ డేటా కలిపి మొత్తం 61 జీబీ డేటా లభిస్తుంది. జియోగేమ్స్ క్లౌడ్‌లో ప్రీమియం గేమ్స్, బీజీఎంఐ సంబంధిత ప్రయోజనాలు, ఫ్యాన్‌కోడ్ తదితర సేవలు ఇందులో ఉన్నాయి.మరో కొత్త ఆప్షన్.. రూ.200 ఓటీటీ ప్యాక్జియో 28 రోజుల విభాగంలో తర్వాత మరో ఆసక్తికరమైన మార్పు చేసింది. ప్రస్తుతం అధికారిక వెబ్సైట్లో రూ.200 ఓటీటీ పాస్ అందిస్తోంది. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 30 జీబీ డేటా, 15 ఓటీటీ సేవలకు యాక్సెస్‌తో పాటు జియోటీవీ ద్వారా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్ల ప్రయోజనం ఉంటుంది. ఇది సాధారణ వాయిస్+డేటా కాంబో ప్లాన్‌కు భిన్నమైన కంటెంట్ ఆధారిత ప్యాక్. -
ఒక్కరోజులో రూ.39 లక్షల కోట్లు.. మైక్రోసాఫ్ట్ సంచలనం!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ షేర్ మార్కెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ షేర్లు ఒక్క ట్రేడింగ్ సెషన్లో ఏకంగా 15.5 శాతం దూసుకెళ్లడంతో.. మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ దాదాపు 450 బిలియన్ డాలర్లు (సుమారు రూ.39 లక్షల కోట్లు) పెరిగింది. ఒకే రోజులో ఏ లిస్టెడ్ కంపెనీ సాధించని స్థాయిలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడం ఇదే తొలిసారి. గతంలో ఎన్విడియా నెలకొల్పిన సుమారు 441 బిలియన్ డాలర్ల రికార్డును మైక్రోసాఫ్ట్ అధిగమించింది.మైక్రోసాఫ్ట్ షేర్లలో ఈ భారీ ర్యాలీకి ప్రధాన కారణం కంపెనీ ప్రకటించిన బలమైన త్రైమాసిక ఫలితాలే. జూన్‌తో ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 18 శాతం పెరిగి 90 బిలియన్ డాలర్లకు చేరింది. ముఖ్యంగా క్లౌడ్ విభాగం ‘అజూర్’ అంచనాలను మించి వృద్ధిని నమోదు చేయడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచింది.అజూర్ వృద్ధి 43 శాతంమైక్రోసాఫ్ట్కు కీలక ఆదాయ వనరుగా మారిన అజూర్ క్లౌడ్ సేవల ఆదాయం నాలుగో త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 43 శాతం పెరిగింది. ఇది మార్కెట్ అంచనాలను అధిగమించింది. అంతేకాదు, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అజూర్ వృద్ధి దాదాపు 45 శాతంగా ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. దీంతో కృత్రిమ మేధ (AI) సేవలకు సంస్థలు భారీగా ఖర్చు చేయడం కొనసాగిస్తున్నాయనే సంకేతం ఇన్వెస్టర్లకు లభించింది.మరో కీలక మైలురాయిగా.. అజూర్ వార్షిక ఆదాయం తొలిసారిగా 100 బిలియన్ డాలర్లను దాటింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ మొత్తం వార్షిక ఆదాయం కూడా 200 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించింది. దీంతో కంపెనీ భారీగా చేస్తున్న డేటా సెంటర్లు, చిప్‌లు, AI మౌలిక సదుపాయాల పెట్టుబడులు కేవలం ఖర్చులుగానే మిగలకుండా ఆదాయాన్ని సృష్టిస్తున్నాయనే అభిప్రాయం బలపడింది.జూలై 30న ర్యాలీ అనంతరం మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 3.35 ట్రిలియన్ డాలర్లకు చేరింది. తాజా మార్కెట్ డేటా ప్రకారం ఎన్విడియా సుమారు 5 ట్రిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
బంగారం లాంటి సంపాదన.. అయినా ఐటీ జంట భయాందోళన!
చేతిలో మంచి ఆదాయం.. అప్పులు లేవు.. కోట్ల రూపాయల విలువైన బంగారం.. అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులు.. అయినా భవిష్యత్తుపై భయం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఓ యువ ఐటీ దంపతులు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన తీరు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.‘హై ఎర్నర్.. కానీ ఇంకా రిచ్ కాదు’ అంటూ 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ రెడిట్‌లో తన ఆర్థిక పరిస్థితిని పంచుకున్నాడు. తనకు, 23 ఏళ్ల తన భార్యకు కలిపి నెలకు సుమారు రూ.5 లక్షల నికర ఆదాయం వస్తుందని తెలిపాడు. చిన్న పట్టణంలో రిమోట్‌గా పనిచేస్తున్నామని పేర్కొన్నాడు. తమకు ఎలాంటి రుణాలు లేవని, తల్లిదండ్రుల ఇల్లు, సొంత కారు ఉన్నాయని వివరించాడు.రూ.95 లక్షలకు పైగా ఆస్తులురెడిట్ పోస్ట్ ప్రకారం.. ఈ జంట వద్ద సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు నాణేలు, రూ.7 లక్షల అమెరికా స్టాక్స్, రూ.3 లక్షల ఎఫ్డీలు ఉన్నాయి. వీటికి అదనంగా తనకు, తన భార్య వద్ద సుమారు రూ.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్పాడు. అంటే, పేర్కొన్న ఆస్తుల విలువే సుమారు రూ.95 లక్షలకు చేరుతుంది. దీనికి కారు, తల్లిదండ్రుల ఇల్లు వంటి అంశాలను కలిపితే వారి ఆర్థిక స్థితి మరింత బలంగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఇద్దరికీ వ్యక్తిగత ఆరోగ్య బీమా కింద రూ.10 లక్షల చొప్పున, టర్మ్ ఇన్సూరెన్స్ కింద రూ.3 కోట్ల చొప్పున కవరేజీ ఉందని కూడా ఆ రెడిట్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.ఐదేళ్లలో రూ.3–4 కోట్ల లక్ష్యంఇంత మంచి ఆదాయం, ఆస్తులు ఉన్నప్పటికీ ఈ యువకుడిని ప్రధానంగా వేధిస్తున్నది ఉద్యోగ భద్రత. AI వేగంగా అభివృద్ధి చెందుతున్నందున వచ్చే ఐదారు సంవత్సరాల్లో అనేక సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని అతను అభిప్రాయపడ్డాడు. అందుకే ప్రస్తుతం ఉన్న అధిక ఆదాయాన్ని ఉపయోగించుకుని రూ.3–4 కోట్ల సురక్షిత నికర సంపదను నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపాడు.తన ప్రాథమిక పెట్టుబడి ప్రణాళికలో ప్రతి నెలా 10 గ్రాముల బంగారం కొనుగోలు చేయడం, రూ.2 లక్షలను ఎఫ్‌డీల్లో పెట్టడం, మిగిలిన మొత్తంలో సుమారు 1,500 డాలర్లను అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం వంటి అంశాలను ప్రస్తావించాడు. అయితే, తాము ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లమే కావడంతో తమ ప్రస్తుత ఉద్యోగాల స్థిరత్వంపై నమ్మకం తగ్గుతోందని అతను చెప్పాడు. కన్సల్టింగ్, సర్వీసెస్ ఆధారిత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు.ఈ రెడిట్ పోస్ట్‌పై స్పందించిన పలువురు నెటిజన్లు జంట ఆర్థిక పరిస్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 27 ఏళ్ల వయసులో అప్పులు లేకుండా రూ.1 కోట్లకు దగ్గరగా ఆస్తులు కలిగి ఉండటం మంచి స్థితి అని కొందరు పేర్కొన్నారు. మరికొందరు మాత్రం పెట్టుబడుల్లో వైవిధ్యం అవసరమని సూచించారు. ఇంకొందరు ‘సంపాదన పెంచుకోవడం’పై దృష్టి పెట్టాలని, AI వల్ల ఉద్యోగాలు మారుతున్న సమయంలో కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని సూచించారు. -
కోటిన్నర జీతంతో కొత్త ఉద్యోగం.. అంతా AI సాయమే..
ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త ఉద్యోగం సాధించడం అంత ఆషామాషీ కాదు. కానీ ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఐదు నెలల పాటు తీవ్రంగా ప్రయత్నించి చివరకు కొత్త కొలువు సాధించాడు ఓ ప్రొఫెషనల్. ఈ ప్రయాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తనకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో ఎంతగానో ఉపయోగపడిందని వెల్లడించాడు. ప్రొఫెషనల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతడికి లభించిన కొత్త ఉద్యోగంలో జీతం ఏడాదికి 1,55,000 డాలర్లు (సుమారు రూ.1.48 కోట్లు). దీనికి 15 శాతం వార్షిక బోనస్ అదనం. బోనస్ పూర్తిగా లభిస్తే మొత్తం వార్షిక ప్యాకేజీ సుమారు 1,78,250 డాలర్లు (రూ.1.7 కోట్లకు పైగా) అవుతుంది.పదేళ్ల ఉద్యోగం.. ఒక్కసారిగా లేఆఫ్రెడిట్ పోస్టు ప్రకారం.. ఆ వ్యక్తి ఒకే సంస్థలో దాదాపు పదేళ్లు పనిచేశాడు. ఈ కాలంలో మూడు ప్రమోషన్లు కూడా పొందాడు. అయితే ఫిబ్రవరి చివర్లో అనూహ్యంగా ఉద్యోగాన్ని కోల్పోయాడు. అనంతరం దాదాపు ఐదు నెలల పాటు ఉద్యోగం కోసం ప్రయత్నించినా అనేక చోట్ల తిరస్కరణ ఎదురైంది. కొన్ని ఉద్యోగ ఖాళీలు రద్దు కాగా, మరికొన్ని నియామక ప్రక్రియలు నిలిచిపోయాయి. ఇంకొన్ని పోస్టులను చివరకు సంస్థలోని అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేశారని అతను తెలిపాడు.అతడి ప్రొఫైల్ ప్రధానంగా క్లయింట్ సర్వీసెస్, ముఖ్యంగా ఏజెన్సీ రంగంలో ఉంది. అయితే కొత్త ఉద్యోగం కోసం ప్రాజెక్ట్ మేనేజర్, ఎంగేజ్మెంట్, అకౌంట్ వంటి నాన్-సేల్స్ పాత్రలకు దరఖాస్తు చేశాడు. చివరకు ఏజెన్సీ రంగానికి వెలుపల ఉన్న ఓ సంస్థలో ఉద్యోగం దక్కింది. ఈ ఉద్యోగాన్ని లింక్డ్ఇన్ ద్వారా గుర్తించి దరఖాస్తు చేసినట్లు వెల్లడించాడు. కొత్త పని విధానం హైబ్రిడ్, ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందని తెలిపాడు.AIతో ప్రత్యేక ప్రిపరేషన్తన ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో AIని విస్తృతంగా ఉపయోగించినట్లు యూజర్‌కు ఇచ్చిన సమాధానంలో రెడిటర్ చెప్పాడు. ప్రతి ఉద్యోగానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్‌ను AI టూల్‌కి ఇచ్చి, ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి వివరాలను కూడా అందించేవాడు. వారి లింక్డ్ఇన్ ప్రొఫైళ్లలో లభించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సంభావ్య ప్రశ్నలు, చర్చించాల్సిన అంశాలు సిద్ధం చేసుకునేవాడు. ఇంటర్వ్యూల సంఖ్య పెరిగే కొద్దీ తనలోనూ ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు. ఆసక్తికరంగా, చివరకు తనకు ఉద్యోగం వచ్చిన సంస్థలోని పోస్టుకు తాను మొదట్లో అర్హుడిననే నమ్మకం కూడా లేదని వెల్లడించాడు. అయితే రిక్రూటర్‌తో పాటు హైరింగ్ మేనేజర్, ఇతర టీమ్ లీడర్లతో మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూలు సాఫీగా సాగడంతో అవకాశం దక్కింది.AIతో ఉద్యోగ వేటలో కొత్త మార్పుఈ వ్యక్తి అనుభవం ఒక్కటే కాదు.. ఉద్యోగ వేటలో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. లింక్డ్ఇన్ 2026 పరిశోధన ప్రకారం, 81% మంది ఉద్యోగార్థులు తమ ఉద్యోగ అన్వేషణలో AIని ఉపయోగిస్తున్నారు లేదా ఉపయోగించాలని భావిస్తున్నారు. అలాగే 48% మంది AI టూల్స్ తమ ఇంటర్వ్యూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు. ఇక క్లచ్ ఇటీవల విడుదల చేసిన మరో సర్వేలో 590 మంది అమెరికన్ ఉద్యోగార్థుల్లో 80% మంది ఉద్యోగ వేటలో AI టూల్స్ ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. 86% మంది AI వల్ల ఎక్కువ దరఖాస్తులు పంపగలుగుతున్నామని చెప్పారు. అయితే 93% మంది AIతో రూపొందించిన రెజ్యూమ్‌లు, కవర్ లెటర్లు అభ్యర్థుల మధ్య ప్రత్యేకతను తగ్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. Got an offer!!by u/kml3141 in Layoffs -
తల్లి కోసం ఏఐలో వెతికాడు... చెల్లెల్ని కలుసుకున్నాడు!
మనమెంత కావాలనుకున్నా కొన్ని బంధాలు దరిచేరవు. ఏ బంధం లేనివారికి కూడా ఉండేది పేగు పంచిన తల్లి బంధం మాత్రమే. ఆ బంధం కూడా లేనప్పుడు మనిషి నిజంగా అనాథగా మిగిలిపోతాడు. ఇలాంటి కథలు మన మధ్యే కాదు.. ఖండాంతరాలలో కూడా జరుగుతాయి. అలాంటిదే ఈ అవతార్ సింగ్ కథ. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సరిగ్గా 66 ఏళ్ల కిందట అవతార్ సింగ్ జన్మించాడు. బాల్యమంతా ఇరుగుపొరుగు బంధువుల మధ్య హాయిగా సాగింది. కాని ప్రతిసారి ఎవరో అనేవారు ‘మీ అమ్మ ఇక్కడ లేదు..వేరే దేశంలో ఉంది.’ అని... అయితే చిన్న వయసులో అవతార్‌కి ఆ మాట అర్థమయ్యేది కాదు. కాని ఊహ తెలిశాక తెలిసిందేంటంటే... తనని పెంచింది తల్లిదండ్రులు కాదు అమ్మమ్మ, తాతయ్యలని... అవతార్ తల్లి పేరు సవీందర్..తండ్రి పేరు మోహన్ సింగ్..చిన్న వయసులో పెళ్లి చేసుకున్న సవీందర్కు అవతార్ పుట్టిన కొద్ది రోజులకే మోహన్‌సింగ్ మరణించాడు. కొన్నేళ్లకు సవీందర్ వేరొకరిని పెళ్లి చేసుకుని కెన్యా వెళ్లిపోయింది. ఇదంతా తెలుసుకున్న అవతార్ తన తల్లికోసం వెతికాడు. ఉత్తరాలు రాశాడు. తెలిసిన వాళ్లతో తల్లి జాడ కోసం గాలించాడు. కాని ఆ రోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ అంతంత మాత్రమే. అదే నిరాశలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. కొన్నేళ్ల తర్వాత ఉద్యోగం కోసం అవతార్ కెనడా వెళ్లిపోయాడు. కెనడా వెళ్లినా, ఉద్యోగంలో స్థిరపడినా..పెళ్లి చేసుకున్నా..అవతార్‌ను మాత్రం కలచివేసేది ఒక్కటే... తల్లి జాడ తెలుసుకోలేకపోయానని.. ప్రస్తుతం తనకి 66 ఏళ్లు.. భార్యతో కలిసి ఇటీవల ఫ్రాన్స్‌కి విహారయాత్రకు వచ్చాడు. ఎందుకో తెలియదు గాని ఓసారి ప్రయత్నించి చూద్దామని తల్లిజాడ కోసం చాట్ జీపీటీలో తనకి తెలిసిన కొన్ని వివరాలను ఇచ్చాడు. వెంటనే ఏఐ బ్రిటన్‌లో నివసిస్తున్న నిక్కీ ధాము అనే మహిళ రాసిన స్మృతి వ్యాసాన్ని అవతార్ ముందు ఉంచింది. అందులోని వివరాలు తన సొంత గ్రామానికి, కుటుంబ సభ్యుల పేర్లకు సారూప్యత ఉండడంతో అవతార్ మెయిల్ ద్వారా నిక్కీకి మెసేజ్ పంపాడు. కాసేపటికే అతడి కళ్లు చమర్చాయ్.. నిక్కీ ధాము ఎవరో కాదు అవతార్ సింగ్‌కి సవతి చెల్లెలు. అంటే సవీందర్ రెండో భర్త కూతురు. సవీందర్ తన భర్తతో కలిసి 1973లో కెన్యా నుంచి బ్రిటన్‌కు వలస వచ్చేసింది. కానీ విషాదమేంటంటే అవతార్ తల్లి సవీందర్ 2024 డిసెంబర్లోనే మరణించింది. ఆ వార్త అతడిని కలచివేసింది. అవతార్ ఫ్రాన్స్ నుంచి బయలుదేరి బ్రిటన్‌లోని నిక్కీ ఇంటికి వెళ్లాడు. తాను అమ్మ కోసం వెతికినట్టే, సవీందర్ కూడా తనకు ఒక కొడుకున్నాడని పదేపదే తన పేరు చెప్పి పరితపించేదని నిక్కీ చెప్పడంతో అవతార్ కన్నీరు మున్నీరయ్యాడు. కాని తల్లిని కలుసుకోలేకపోయినా చెల్లెల్ని కలుసుకున్న సంతృప్తి అవతార్‌కు మిగిలింది. (చదవండి: నటి సోనాలి ఫిట్నెస్ సీక్రెట్..! ఆటోఫాగీ అంటే..) -
నో ఐఐటీ/ఎన్ఐటీ, 27 యూనివర్సిటీల నుంచి తిరస్కరణ..కట్‌చేస్తే..
తిరస్కరణలనేవి మనిషి జీవితంలో కామన్. వాటిని దాటుకుని వెళ్తేనే జీవితం. అంటుంటారు సైకాలజీ నిపుణులు. నిజానికి మనం ఒక్క రిజెక్ట్ వస్తేనే కుదేలైపోతాం. కానీ ఈ టెకీకి అడగడుగున తిరస్కరణలే. కనీసం ఏది కూడా పదికి పైగా రిజెక్ట్‌లు ఎదుర్కొంటే గానీ సక్సెస్ పలకరించలేదు. ఇవాళ ఆ వ్యక్తి మెటా ఆర్టిఫియల్ ఇంటెలిజిన్స్లో కీలక పాత్రపోషించే స్థాయికి చేరుకున్నాడు.అతడే తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన టెకీ సౌమిత్ చింతల. ఐఐటీ లేదా ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక కాలేజ్‌లో చదవలేదు. కనీసం ఇంట్లో కంప్యూటర్ కూడా లేకుండా పెరిగాడు. ఆయన 2009లో విట్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత యూఎస్ ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే..పదే పదే తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి తిరస్కరణ ఎదుర్కొన్నాడు. చివరికి న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం సంపాదించాడు. అక్కడ లెర్నింగ్ పరిశోధకుడు యాన్ లెకన్ వద్ద పనిచేశాడు. ఈ అనుభవం అతనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడింది. ఆ స్కిల్‌తో 2014లో, మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన విభాగంలో చేరాడు. ఆ కంపెనీలో ఉన్న సమయంలో, అతను పైటార్చ్ (PyTorch) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. పైటార్చ్ అనేది ఒక ఓపెన్-సోర్స్ మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్, ఇది AI పరిశోధన, అభివృద్ధిలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీలు , అధునాతన కంప్యూటింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తున్న కంపెనీలతో సహా, ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, డెవలపర్లు, సంస్థలు ఇప్పుడు పైటార్చ్ను ఉపయోగిస్తున్నాయి.రాబోయే ఎనిమిది సంవత్సరాలలో, పైటార్చ్ను ఒక అంతర్గత పరిశోధనా ప్రాజెక్ట్ నుంచి అత్యంత విస్తృతంగా ఆమోదించబడిన AI ఫ్రేమ్‌వర్క్‌లలో ఒకటిగా ఎదగడంలో చింతల కీలక పాత్ర పోషించారు. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రపంచవ్యాప్తంగా మెషిన్ లెర్నింగ్ పరిశోధకులకు ,డెవలపర్లకు ఒక ప్రధాన సాధనంగా మారింది.మెటాలో సుమారు 11 ఏళ్ల పదవీకాలంలో, సౌమిత్ ఎల్4 సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్థాయి నుంచి కంపెనీలో ఒక సీనియర్ టెక్నికల్ లీడర్షిప్ పదవి అయిన వైస్ ప్రెసిడెంట్ అండ్ మెటా ఫెలోగా ఎదిగారు. ఆ తర్వాత ఆయన మెటాను విడిచిపెట్టి, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన థింకింగ్ మెషీన్స్ ల్యాబ్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా చేరారు.(చదవండి: -
అసలు సమస్య NEET కాదు.. ఆర్జీవీ సంచలన ట్వీట్!
విద్యారంగంలో ప్రస్తుతం అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ పేపర్ లీక్స్, పరీక్షల రద్దు, విద్యార్థుల ఒత్తిడి, ఆత్మహత్యలు వంటి అంశాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇవన్నీ.. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఈ తరుణంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుత సమస్య నీట్ (NEET) కాదు, అసలు సమస్య ఏఐ (AI) అని పేర్కొన్నారు.విద్య అంటే..గతంలో విద్య అంటే.. ఒక వ్యక్తికి అవసరమైన జ్ఞానాన్ని అందించి, ఉద్యోగానికి సిద్ధం చేయడం. డాక్టర్, ఇంజనీర్, లాయర్ వంటి వృత్తులకు కావాల్సిన విషయాలను నేర్చుకుని, ఒక స్థిరమైన జీవితాన్ని గడపడం అనేది చాలామంది లక్ష్యంగా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.ఒకప్పుడు సమాచారం పొందడం కష్టంగా ఉండేది. పుస్తకాలు, ఉపాధ్యాయులు, అనుభవజ్ఞుల ద్వారా మాత్రమే జ్ఞానం లభించేది. కానీ ఈ రోజు ఏదైనా సమాచారం కావాలంటే.. ఇంటర్నెట్, ఏఐ వంటి వాటిమీద ఆధారపడుతున్నారు. పెరిగిన టెక్నాలజీ కారణంగా.. ప్రపంచంలోని సమాచారం మన చేతుల్లోకి వచ్చేసింది. అయితే ఈ సమాచారంలో నిజమైన అంశాలు మాత్రమే కాకుండా.. తప్పుడు సమాచారం కూడా ఉంటుందని ఆర్జీవీ పేర్కొన్నారు.పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదుఏఐ అనేది కేవలం సమాచారాన్ని అందించడానికి మాత్రమే కాకుండా.. మనుషులు చేసే అనేక పనులను వేగంగా చేయగల స్థాయికి చేరుకుంటోంది. రాయడం, విశ్లేషించడం, కోడింగ్ చేయడం, డిజైన్ చేయడం వంటి పనుల్లో ఏఐ దూసుకెళ్తోంది. దీంతో భవిష్యత్తులో విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదనే అభిప్రాయం బలపడుతోంది. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో ఏఐ తీవ్రత ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టమవుతుంది.NEET is not the issue A I isNEET leaks, cancelled exams, student suicides might leave bodies on the floor and parents screaming which might seem brutal in the way the system is being injuredAI does not wound the system.It rips its throat out.For centuries education had one…— Ram Gopal Varma (@RGVzoomin) July 27, 2026అందుకే.. విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు.. కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఒకప్పుడు బాగా చదువు.. మంచి ఉద్యోగం సంపాదించు.. జీవితాంతం భద్రంగా ఉండు అనే ధోరణి ఉండేది. కానీ ఏఐ యుగంలో ఎప్పుడు ఉద్యోగం పోతుందో కూడా తెలియదు.ఉద్యోగాలు పోతాయా?ఇంజనీరింగ్, మెడిసిన్, లా, సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుపై కూడా చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీని అర్థం ఈ రంగాల్లో ఉన్న ఉద్యోగాలు పూర్తిగా పోతాయని కాదు. కానీ ఆ రంగాల్లో పనిచేసే విధానం మారుతుంది. ఏఐని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే వారికి ఎక్కువ అవకాశాలు లభించే అవకాశం ఉంది.ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు ఏఐని ఎలా ఉపయోగించాలి, దానితో కలిసి ఎలా పని చేయాలి, సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి వంటి నైపుణ్యాలను తప్పకుండా నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తును కేవలం ర్యాంకులు, మార్కులు, డిగ్రీలతో మాత్రమే అంచనా వేయకుండా, వారు మారుతున్న ప్రపంచానికి ఎంతగా సిద్ధంగా ఉన్నారో చూడాలి.ఇదీ చదవండి: కియోసాకి వ్యూహం.. రియల్ ఎస్టేట్‌లోకి ఎంట్రీ! -
ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ ‘ఏఐ’ దండయాత్ర
వాషింగ్టన్: ఖర్గ్ ద్వీపం విషయంలో ట్రంప్ మరోసారి ఇరాన్‌ని రెచ్చగొట్టారు. ఆ ఐలాండ్‌పై దాడి చేస్తున్నట్లు ఉన్న ఏఐ చిత్రాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే విధంగా అమెరికా వద్ద అవసరానికి మించి ఆయుధాలున్నాయని తమ వద్ద ఉన్నాయని ఇరాన్ శక్తిమంతమైన చమురు కూడలి అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు పెద్ద కష్టమైన పనేం కాదన్నారు.ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ కన్ను ఇప్పటిది కాదు.. యుద్ధం ప్రారంభం నుంచే తరచుగా ఆ ద్వీపంపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా బలగాలు "చాలా సులభంగా" ఆక్రమించగలవని, అమెరికా కావాలనుకుంటే ఇరాన్ చమురు సంపదను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని ఆయన గతంలో పేర్కొన్నారు. సైనిక దాడులపై వ్యాఖ్యలు: గతంలో జరిగిన దాడుల సమయంలో, ఖర్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని, సరదాగా మరోసారి దాడులు చేయగలమని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మరోసారి కయ్యానికి కాలు దువ్వారు.ఇరాన్‌తో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా అమెరికా వద్ద ఉన్న పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు తగ్గిపోతున్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో ట్రంప్ స్పందించారు " "ప్రపంచంలోనే అత్యధికంగా, అమెరికా అవసరానికి మించి మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి.వాటిలో శక్తిమంతమైన చమురు కూడలి అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు పెద్ద కష్టమైన పనేం కాదు." అని అన్నారు.ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన 'ట్రూత్ సోషల్'లో అనేక AI చిత్రాలను పంచుకున్నారు. వాటిలో ఒక చిత్రం, ఇరాన్ యొక్క అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపంపై జరిగిన వైమానిక దాడిని చూపించింది. దానికి ఆయన, ఖర్గ్పై దాడి అని శీర్షిక పెట్టారు. -
ఇప్పుడు ఎవరు తప్పించుకోలేరు..! హైదరాబాద్ లో కొత్త AI కెమెరాలు
-
మానవాళికి కొత్త సవాల్.. ఎలాన్ మస్క్ హెచ్చరిక!
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒకటి. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా వంటి అనేక రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కృత్రిమ మేధస్సు ఎంత ఉపయోగకరమో, అంతే ప్రమాదకరమని పలువురు భావిస్తున్నారు. ఈ తరుణంలో దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.రాబోయే పదేళ్లలో ఏఐ మనుషుల కంటే ఎంతో తెలివిగా మారే అవకాశం ఉంది. 2036 నాటికి బాట్లు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయని మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఏఐ మానవాళిని పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం 10 నుంచి 20 శాతం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ విషయాన్ని వివరించడానికి ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. మనుషులు చింపాంజీల కంటే ఎంతో తెలివైనవారు కాబట్టి, ప్రపంచాన్ని చింపాంజీలు నియంత్రించడం సాధ్యం కాదు. అదే విధంగా.. ఏఐ మనుషుల కంటే తెలివిగా మారితే, భవిష్యత్తులో మనుషులకే నియంత్రణ ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐ వల్ల ప్రయోజనాలుఇదే సమయంలో మస్క్.. ''ఏఐ వల్ల మానవాళికి అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో AI సహాయంతో ఉత్పత్తి పెరుగుతుంది, పనులు వేగంగా పూర్తవుతాయి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అందరికీ అవసరమైన వస్తువులు, సేవలు సమృద్ధిగా అందుబాటులోకి రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. AI అభివృద్ధిని పూర్తిగా ఆపడం కష్టమని, దానిని సరైన విధంగా ఉపయోగించుకోవడం మంచిదని కూడా అభిప్రాయపడ్డారు''.ఏఐ సింగ్యులారిటీఏఐ గురించి ఓపెన్ఏఐ సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. ''ప్రస్తుతం ప్రపంచం సింగ్యులారిటీ అనే కొత్త దశలోకి అడుగుపెడుతోందని అన్నారు. అంటే.. ఏఐ వ్యవస్థలు మానవ మేధస్సును అధిగమించే స్థితికి చేరుకుంటున్నాయని వెల్లడించారు''.ఇదీ చదవండి: నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా పేదవాడినే! -
నాసా కొత్త ప్రయోగం.. శని వలయాల రహస్యాలపై దృష్టి!
సౌర కుటుంబంలోని శని గ్రహం.. తన అందమైన వలయాల వల్ల ప్రత్యేక గుర్తింపు పొందిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వలయాలు ఎలా ఏర్పడ్డాయి?, ఎలా మార్పు చెందుతున్నాయి?, భవిష్యత్తులో వాటి పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాలు మాత్రం ఎవరివికీ పూర్తిగా అర్థం కావడం పోలేదు. దీనిపై పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే సైంటిస్టులు ప్రాక్సిస్ అనే కొత్త మిషన్‌ను రూపొందిస్తున్నారు.నాసా ఇంతకుముందు పంపిన కాస్సిని (Cassini) మిషన్ శని గ్రహం గురించి చాలా సమాచారం అందించినప్పటికీ.. వలయాల్లోని కణాలను నేరుగా సేకరించి పరిశీలించలేకపోయింది. అందుకే.. ఇప్పుడు ప్రాక్సిస్ పేరుతో మిషన్ ప్రతిపాదించారు. దీని ద్వారానే తొలిసారిగా వలయాల్లోని కణాలను సేకరించి వాటి గురించి తెలుసుకోనున్నారు.నిజానికి శని వలయాలు నీటి మంచుతో ఏర్పడినవే. వీటిలో చాలా చిన్న ధూళి కణాల నుంచి పెద్ద రాళ్ల వరకు అనేక రకాల కణాలు ఉంటాయి. కాబట్టి ఇవి ఎప్పటికప్పుడు ఒకదానితో ఒకటి ఢీకొంటూ, కలుస్తూ, విడిపోతూ ఉంటాయి. ఈ మార్పులను అర్థం చేసుకోవడం ద్వారా.. వలయాల ఆవిర్భావం, పరిణామం గురించి శాస్త్రవేత్తలు మరింత స్పష్టమైన సమాచారం తెలుసుకోవచ్చు.ప్రాక్సిస్ మిషన్‌లో కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేసే ప్రత్యేక రోబోటిక్ వ్యవస్థను ఉపయోగించనున్నారు. ఈ రోబో వలయాల్లోని చిన్న కణాలను సురక్షితంగా సేకరించి వాటి పరిమాణం, నిర్మాణం, రసాయనిక స్వభావం వంటి అంశాలను అక్కడికక్కడే విశ్లేషిస్తుంది. కాబట్టి సమాచారం తొందరగా లభిస్తుంది.ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉంది. ముందుగా కంప్యూటర్ సిమ్యులేషన్లను నిర్వహించిన తరువాత.. ఇది సక్రమంగా పనిచేస్తుందా.. లేదా.. అని పరీక్షిస్తారు. ఆ తర్వాత నిజమైన నమూనాను తయారు చేయనున్నట్లు సమాచారం. ప్రాక్సిస్ మిషన్ విజవంతమైతే.. శని గ్రహం వలయాల గురించి మాత్రమే కాకుండా యురేనస్, నెప్ట్యూన్ వంటి ఇతర గ్రహాల వలయాల గురించి కూడా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: అప్పులే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయ్! -
అమెరికా అప్రమత్తం.. AI నియంత్రణకు కొత్త చట్టం!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో.. దీనివల్ల జరిగే ప్రమాదాలను నియంత్రించడానికి అమెరికా ప్రభుత్వం.. ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ (AI Kill Switch Act) అనే కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది.ప్రస్తుతం ఏఐ విద్య, వైద్యం, పరిశ్రమలు, బ్యాంకింగ్ వంటి దాదాపు చాలా రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐ అనేది ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. నియంత్రణ తప్పితే అదే స్థాయిలో ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే అమెరికా కాంగ్రెస్ సభ్యులు టెడ్ లియూ, నాథనియల్ మోరన్ ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు.ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ ప్రకారం.. ఒక ఏఐ మోడల్ మానవ ప్రాణాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు లేదా జాతీయ భద్రతకు ముప్పుగా మారితే, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ.. ఆ ఏఐ వ్యవస్థను వెంటనే నిలిపివేయాలని ఆదేశించే అధికారం కలిగి ఉంటుంది. అంటే.. ఏఐ పూర్తిగా నియంత్రణ తప్పి ప్రమాదకరమైన చర్యలు చేస్తే, దానిని వెంటనే ఆపడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నమాట.ఈ బిల్లు ప్రతిపాదించడానికి ప్రధాన కారణం.. ఓపెన్ఏఐ నిర్వహించిన భద్రతా పరీక్షలో వారి ఒక ఏఐ ఏజెంట్ అనుకోని విధంగా ప్రవర్తించి హ్యాకింగ్‌కు దారితీయడమే అని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఏఐ వ్యవస్థలు కొన్నిసార్లు డెవలపర్లు ఊహించని విధంగా ప్రవర్తించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.అయితే.. ఈ చట్టంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఇది భద్రతకు ఎంతో అవసరమైన చర్య అని భావిస్తే, మరికొందరు ప్రభుత్వం ఏఐ సంస్థలపై ఎక్కువ నియంత్రణ సాధించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న భద్రత తప్పకుండా అవసరమని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: నెలకు రూ.2 లక్షల జీతం.. అప్పుల ఊబిలో ఐటీ ఉద్యోగి! -
బుర్జ్ ఖలీఫాలో ఆఫీస్ పెట్టిన 14 ఏళ్ల భారతీయుడు!
బహుశా పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో... నువ్వు 14 ఏళ్ల వయసులో ఏం చేసేవాడివి? అని మీ ఫ్రెండ్స్‌లో ఎవరినైనా అడిగి చూడండి... మహా అయితే ఎనిమిదో తరగతి చదువుతూ హోంవర్క్ చేస్తూ ఉండేవాడినని చెబుతారు కాని అదే వయసులో ఉన్న ఓ కుర్రోడు ఓ ఏఐ కంపెనీ స్థాపించాడు.అంతేకాదు ప్రపంచంలోనే అతి ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలో ఏకంగా ఆఫీస్ పెట్టేశాడు. పుణేకు చెందిన జైనమ్ జైన్ ఐదేళ్ల వయసున్నప్పుడే అతని తల్లిదండ్రులు దుబాయ్‌కి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి మంచి తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరిచే జైన్ కేంబ్రిడ్జ్ కరికులమ్ ద్వారా 13 ఏళ్ల వయసులోనే పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత బిజినెస్ చేయాలన్న ఆలోచనతో ఏఐ సాంకేతికతపై దృష్టి పెట్టాడు.సరిగ్గా ఏడాది గడిచాక ‘మెంగో ఇంజిన్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌ను స్థాపించాడు. కంపెనీల కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్, కస్టమర్ కమ్యూనికేషన్ వంటి పనులు ఆటోమేట్ చేయడానికి ఈ ప్లాట్‌ఫాం సహాయపడుతుంది. విశేషమేమిటంటే జైన్ సొంత ఆసక్తితోనే నేర్చుకుని చిన్న వయసులో కంపెనీని స్థాపించి ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించాడు. -
అమ్మో.. అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్‌లు
అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోతలకు శ్రీకారం చుట్టింది. ఈసారి కంపెనీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) విభాగంలో పలు ఉద్యోగాలను తొలగించింది. ఈ ఏడాది జనవరిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత ఇది రెండో ప్రధాన ఉద్యోగాల కోతగా నిలిచింది. అయితే తాజా చర్యలో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.కంపెనీ ప్రతినిధి ప్రకారం.. అమెజాన్ పలు సంవత్సరాలుగా భారీ AI మోడళ్ల అభివృద్ధిపై పని చేస్తోంది. ప్రస్తుతం వినియోగదారులకు అత్యధిక ప్రయోజనం చేకూర్చే AI ప్రాజెక్టులపై మరింత దృష్టి కేంద్రీకరించేందుకు సంస్థ పునర్వ్యవస్థీకరణ చేపట్టిందని, అందులో భాగంగానే AGI విభాగంలోని కొన్ని ఉద్యోగాలను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇది AI అభివృద్ధి నుంచి వెనక్కి తగ్గడం కాదని, కీలక ప్రాజెక్టులపై వనరులను మరింత సమర్థంగా వినియోగించే వ్యూహమని కంపెనీ స్పష్టం చేసింది.నాయకత్వంలో మార్పులుగత కొద్ది నెలలుగా అమెజాన్ AGI విభాగంలో కీలక నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. AGI కార్యక్రమాలకు నాయకత్వం వహించిన సీనియర్ అధికారి రోహిత్ ప్రసాద్ గత ఏడాది చివర్లో సంస్థను వీడగా, AGI ల్యాబ్ హెడ్ డేవిడ్ లువాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిష్క్రమించారు. అనంతరం డిసెంబరులో అమెజాన్ AGI విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ డీశాంటిస్ ఆధ్వర్యంలోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఆయన AGIతో పాటు సిలికాన్ చిప్ అభివృద్ధి, క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తున్నారు.ఏ ఉద్యోగాలు ప్రభావితమయ్యాయి?ఆన్లైన్లో వెలువడిన సమాచారం ప్రకారం.. AGI డేటా సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అదీబ్ షానా ఆధ్వర్యంలోని బృందం, అలాగే AGI ఇన్ఫర్మేషన్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ శర్మ నేతృత్వంలోని బృందాల్లోని ఉద్యోగులు ఈ కోతలతో ప్రభావితమయ్యారు. అయితే మొత్తం సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడలేదు.కొనసాగుతున్న AI పెట్టుబడులుఉద్యోగాల కోతలు ప్రకటించినప్పటికీ, అమెజాన్ AI రంగంలో భారీ పెట్టుబడులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా AWS ద్వారా జనరేటివ్ AI సేవలను విస్తరించడం, Nova ఫౌండేషన్ మోడళ్ల అభివృద్ధిపై సంస్థ దృష్టి సారిస్తోంది. అంటే పరిశోధన, ఉత్పత్తి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూనే సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చేపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. -
రూ.35 లక్షల జాబ్ ఆఫర్.. చివరికి రూ.6.5 లక్షలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా దూసుకెళ్తోంది. దాదాపు అన్ని రంగాల్లోనూ ఏఐ వల్ల పనులు సులభతరం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళన కూడా పెరుగుతోంది. తాజాగా ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎదుర్కొన్న అనుభవం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.టైర్ 1.5 కాలేజీ నుంచి కొత్తగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఒక గ్రాడ్యుయేట్, క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఓ ప్రముఖ కంపెనీలో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యాడు. ఈ ఇంటర్న్‌షిప్‌లో మంచి పనితీరు కనబరిస్తే రూ.35 లక్షల వార్షిక ప్యాకేజీతో (35 LPA) ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్ (PPO) ఇస్తామని కంపెనీ తెలిపింది.మంచి ప్యాకేజీతో అవకాశం రావడంతో ఆ విద్యార్థి ఎంతో ఆశతో ఇంటర్న్‌షిప్ ప్రారంభించాడు. తన పూర్తి సామర్థ్యంతో పనిచేశానని, మేనేజర్ నుంచి కూడా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని అతను చెప్పాడు. అంతేకాకుండా, తనకు తప్పకుండా ప్లేస్మెంట్ ఆఫర్ వస్తుందని మేనేజర్ కూడా నమ్మకం కల్పించారని వెల్లడించాడు. కానీ.. చివరి సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.ఇంటర్న్‌షిప్ ముగియడానికి కేవలం రెండు రోజుల ముందు కంపెనీ మొత్తం 90 మంది ఇంటర్న్‌లకు రిజెక్షన్ మెయిల్స్ పంపించింది. దీంతో రూ.35 లక్షల ఉద్యోగం వస్తుందని కలలు కన్న విద్యార్థుల ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఆ కంపెనీ సాఫ్ట్వేర్ డెవలపర్ల స్థానంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించేందుకు ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం వల్లే ఈ నిర్ణయం తీసుకుందని ఆ టెక్కీ పేర్కొన్నాడు.ప్రస్తుతం తన చేతిలో ఉన్న ఏకైక అవకాశం క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా వచ్చిన రూ.6.5 లక్షల ప్యాకేజీ మాత్రమేనని తెలిపాడు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఫ్రెషర్లకు ఇంటర్వ్యూ అవకాశాలు కూడా రావడం లేదని తన బాధను వ్యక్తం చేశాడు.ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు ఆ యువకుడికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగ అవకాశాన్ని స్వీకరించి, అనుభవం సంపాదించిన తర్వాత మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నించాలని కొందరు సూచించారు. మొదటి ఉద్యోగం ఎంత పెద్ద ప్యాకేజీతో వచ్చిందన్నది కాకుండా.. అక్కడ నేర్చుకునే విషయాలు కూడా కెరీర్లో కీలకమని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే.. మరికొందరు మాత్రం కంపెనీ తీరును తప్పుబట్టారు. రూ.35 లక్షల ఆఫర్ పేరుతో ఇంటర్న్‌ల నుంచి ఎక్కువ కష్టపడేలా చేసి, చివరికి ఆఫర్‌ను వెనక్కి తీసుకోవడం సరైన విధానం కాదని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు యువ ఉద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు.ఏఐ వల్ల ఉద్యోగుల ఎంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో.. అనే విషయాన్ని ఈ సంఘటన కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. కొత్త అవకాశాలు వస్తున్నప్పటికీ, కొన్ని సంప్రదాయ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగార్థులు కేవలం ఒకే నైపుణ్యంపై మాత్రమే ఆధారపడకుండా, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటూ తమను తాము అభివృద్ధి చేసుకోవడం చాలా అవసరం అని చెబుతున్నారు. -
గూగుల్ ఉద్యోగుల ఆందోళన.. సుందర్ పిచాయ్‌కు వినతి!
ప్రపంచవ్యాప్తంగా ఏఐ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల పనులు వేగంగా, సులభంగా పూర్తవుతున్నాయి. అయితే.. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోతాయా?.. అనే భయం కూడా చాలా మందిలో పెరుగుతోంది. ఇదే ఆందోళన ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం అయిన గూగుల్ ఉద్యోగుల్లో కూడా కనిపిస్తోంది. దీంతో సుమారు 4500 మందికిపైగా ఉద్యోగులు సీఈఓ సుందర్ పిచాయ్‌కు ఒక పిటిషన్ సమర్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.సుందర్ పిచాయ్‌కు అందించిన పిటిషన్లో.. ఏఐ కోసం కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతూనే, మరోవైపు ఉద్యోగులను తొలగించడం సరికాదని వెల్లడించారు. ఉద్యోగులకు భద్రత కల్పించే విధంగా.. కొత్త విధానాలు తీసుకురావాలని వారు కోరారు. అంతే కాకుండా క్యాంపస్ వెలుపల 100 మంది ఉద్యోగులు శాంతియుతంగా నిరసన కూడా చేపట్టారు. ఉద్యోగ భద్రత కోసం.. గూగుల్ చరిత్రలో జరిగిన అతిపెద్ద ఉద్యమాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు.ఉద్యోగుల డిమాండ్ ఏమిటంటే కంపెనీ లేఆఫ్‌లు చేయాల్సి వచ్చినా.. ముందుగా స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలే అవకాశం ఇవ్వాలి. ఉద్యోగం కోల్పోయే వారికి తగిన సెవరెన్స్ ప్యాకేజీ అందించాలి. అలాగే ఉద్యోగుల పనితీరును అంచనా వేసే విధానంలో కూడా మార్పులు చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం చాలామందికి అన్యాయం చేస్తోందని ఉద్యోగులు భావిస్తున్నారు.గతంలో కూడా గూగుల్ ఉద్యోగులు.. నైతిక అంశాలపై, ఏఐ వినియోగంపై నిరసనలు చేశారు. కానీ.. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పుడు వారి ఆందోళన పూర్తిగా తమ ఉద్యోగాల గురించే. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయనే భయం వారిని ఈ ఉద్యమానికి దారితీసింది.ఇదీ చదవండి: వెకేషన్‌కు వెళ్లాడు.. ఉద్యోగం పోయింది! -
Open AI CTO ఉదయ్ రుద్దరాజుకు YS జగన్ అభినందనలు
-
బిటెక్ మధ్యలోనే ఆపేసి AI తో స్టార్ట్ అప్ కంపెనీ.. ఎంత సంపాదిస్తున్నానంటే
-
ఆ ప్రముఖ బ్యాంకు ఉద్యోగులకు మళ్లీ గండమే!
కృత్రిమ మేధస్సు (AI), ఆటోమేషన్ విస్తృతంగా వినియోగంలోకి వస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌లో రానున్న కాలంలో మరిన్ని ఉద్యోగ పాత్రలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మిడ్-ఆఫీస్, బ్యాక్-ఆఫీస్ విభాగాల్లో పునరావృతమయ్యే పనులను టెక్నాలజీనే నిర్వహించగలిగితే, అలాంటి ఉద్యోగాల అవసరం క్రమంగా తగ్గవచ్చని బ్యాంక్ యాజమాన్యం సంకేతాలు ఇచ్చింది. అయితే, భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపులు ఉంటాయా.. ఉంటే ఎప్పుడు ఉంటాయన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.మొదటి త్రైమాసిక (Q1 FY27) ఫలితాల అనంతరం నిర్వహించిన విశ్లేషకుల సమావేశంలో బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ, సాంకేతికత వల్ల ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతోందని తెలిపారు. మిడ్-ఆఫీస్, బ్యాక్-ఆఫీస్‌లో ఉండే 'మేకర్-చెకర్' వంటి బహుళ ధ్రువీకరణ ప్రక్రియలను ఆటోమేట్ చేయడం ద్వారా అనేక కార్యకలాపాలను సరళీకరించే అవకాశం ఉందని వివరించారు. దీని వల్ల ఖాళీ అయ్యే సామర్థ్యాన్ని కస్టమర్ సేవలు, వ్యాపార విస్తరణ వంటి ఫ్రంట్-ఎండ్ కార్యకలాపాల వైపు మళ్లించే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు వెల్లడించారు.ఇప్పటికే 2025-26 ఆర్థిక సంవత్సరంలో యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య సుమారు 3 శాతం తగ్గింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 1,04,453 మంది ఉద్యోగులతో పోలిస్తే దాదాపు 3,100 మంది తగ్గినప్పటికీ, అదే సమయంలో బ్యాంక్ దేశవ్యాప్తంగా సుమారు 400 కొత్త శాఖలను ప్రారంభించడం గమనార్హం. ఇది వ్యాపారం మందగించడం వల్ల కాకుండా, సాంకేతికత ఆధారిత సామర్థ్య పెరుగుదల వల్లే సాధ్యమైందని ఎండీ, సీఈఓ అమితాబ్ చౌదరి గతంలో స్పష్టం చేశారు.తాజాగా జూన్ 2026తో ముగిసిన తొలి త్రైమాసికంలో కూడా ఉద్యోగుల సంఖ్య మరో 600 మేర తగ్గి లక్షకు కొద్దిగా పైగా నిలిచింది. అయితే బ్యాంక్ యాజమాన్యం దీన్ని 'లేఆఫ్స్'గా కాకుండా, ఉద్యోగులు సంస్థను విడిచిపెట్టిన తర్వాత ఆ స్థానాలను తిరిగి భర్తీ చేయకుండా ఉత్పాదకతను పెంచే ప్రక్రియగా అభివర్ణించింది. ఏఐ పూర్తి స్థాయి ప్రభావం ఉద్యోగుల సంఖ్యపై కనిపించడానికి మరో 18 నుంచి 24 నెలలు పట్టవచ్చని కూడా అధికారులు పేర్కొన్నారు.👉ఇది చదివారా? అంతరిక్ష శాస్త్రవేత్తలకు జీతాలు తక్కువా?బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్, ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ఆపరేషనల్ పనుల కంటే కస్టమర్ సలహాలు, సంబంధాల నిర్వహణ, డేటా విశ్లేషణ, సాంకేతిక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే ధోరణి ఇతర ప్రైవేట్ బ్యాంకుల్లోనూ కనిపించడం ప్రారంభమైందని తాజా పరిశ్రమ గణాంకాలు సూచిస్తున్నాయి. -
100 మ్యాచ్‌లకు ఒక బంతి... ఆఖరి 4 మ్యాచ్‌లకు మరో బంతి
‘ఫిఫా’ వరల్డ్‌కప్‌లో రెండు రకాల బంతులను వినియోగించారు. టోర్నమెంట్ తొలి 100 మ్యాచ్‌లకు... ఆతిథ్య దేశాలైన అమెరికా, మెక్సికో, కెనడా జెండాల రంగులను ప్రస్ఫుటించేలా ఎరుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగులతో కూడిన ‘ట్రియోండా’ బంతిని వాడగా... మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు (2 సెమీఫైనల్స్, మూడో స్థానం మ్యాచ్, ఫైనల్) బంతి రంగులో మార్పులు చేశారు. స్పానిష్ లో ‘ట్రియోండా’ అంటే ‘త్రీ వేవ్స్’... ఆతిథ్యమిస్తున్న మూడు దేశాలకు ప్రతీక అని అర్థం. ఫ్రాన్స్–స్పెయిన్... ఇంగ్లండ్–అర్జెంటీనా మధ్య జరిగిన సెమీఫైనల్స్‌తో పాటు ఫ్రాన్స్–ఇంగ్లండ్ మధ్య మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో బంగారు, నలుపు రంగులతో కూడిన బంతిని వినియోగించారు. అడిడాస్ సంస్థ రూపొందించిన ఈ బంతితోనే ఫైనల్ కూడా జరగనుంది. ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చిన 16 నగరాలకు గుర్తుగా దీన్ని రూపొందించడం విశేషం. ‘ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ‘ఫిఫా’ ప్రపంచకప్‌కు స్వాగతించిన 16 నగరాలను ట్రియోండా గౌరవిస్తోంది. చివరి నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన నగరాల పేర్లు బంతిపై ప్రముఖంగా కనిపించే విధంగా రూపొందించాం. మిగిలిన 12 ఆతిథ్య నగరాల పేర్లను కూడా పొందుపరిచాం. తద్వారా టోర్నీ విజయవంతం కావడానికి వారు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకుంటున్నాం’ అని ‘ఫిఫా’ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైనల్ బంతిలో అత్యాధునిక ఏఐ సాంకేతికత ఉందని... అది కచ్చితమైన డేటా అందిస్తూ... రిఫరీలు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతుందని ‘ఫిఫా’ వెల్లడించింది. -
టీచర్లకు ఏఐ పాఠాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో బోధనా నాణ్యతను మెరుగుపరచడంతోపాటు వృత్తి నైపుణ్యాన్ని పెంచడం, విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఏఐ వినియోగంపై వారికి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణను మూడు దశల్లో అందించనుంది. టీచర్ల నుంచే రాష్ట్ర స్థాయిలో రిసోర్స్ పర్సన్స్‌ను ఎంపిక చేసి వారికి ముందుగా శిక్షణ ఇచ్చింది. అలాగే జిల్లా స్థాయిలో మరికొందరు టీచర్లను ఎంపిక చేసి వారికి రిసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ ఇప్పిస్తోంది. మండల స్థాయిలో ఇంకొందరిని ఎంపిక చేసి వారికి జిల్లా రిసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ అందించనుంది. వారు మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల టీచర్లకు శిక్షణ అందించనున్నారు. జూలై 2 నుంచి మొదలైన రాష్ట్ర స్థాయి శిక్షణ 25 వరకూ కొనసాగుతుండగా ఈ నెల 8 నుంచి 31 వరకు జిల్లా స్థాయిలో, ఈ నెల 20 నుంచి 25 వరకు మండల స్థాయిలో శిక్షణ ఉండనుంది. ప్రాథమిక అంశాలపై అవగాహన.. ఏఐ, మెషీన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ వంటి ఆధునిక సాంకేతికల్లోని ప్రాథమిక అంశాలపై టీచర్లకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే పాఠ్యాంశాల ప్రణాళిక, ప్రశ్నపత్రాల తయారీ, వర్క్షీట్లు, ప్రజెంటేషన్లు రూపొందించడంలో ఏఐ వినియోగాన్ని వివరిస్తున్నారు. విద్యార్థుల వ్యక్తిగత అభ్యాస స్థాయికి అనుగుణంగా ఏఐ ఆధారిత బోధన పద్ధతులను నేర్పిస్తున్నారు. చాట్ జీపీటీ వంటి సాధనాల పరిమితులు, తప్పుదోవ పట్టించే సమాచారంపై అప్రమత్తం చేసే నైపుణ్యం శిక్షణలో భాగమవుతోంది. విద్యార్థుల డేటా గోప్యత, ఏఐ వినియోగంలో నైతిక విలువలు, బాధ్యతాయుత వినియోగంపైనా శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యం. ప్రతి సబ్జెక్టుకూ అనుగుణంగా ఏఐ వినియోగంపై ప్రాక్టికల్ వర్క్‌షాపులు, ప్రాజెక్టులు చేయించాలని ప్రతిపాదించారు. సమస్యలెన్నో ఏఐపై శిక్షణలో అనేక సమస్యలను టీచర్లు లేవనెత్తుతున్నారు. రిసోర్స్ పర్సన్స్‌గా ఎంపికైన టీచర్లు చెబుతున్న ఏఐ బోధనాంశాలు అర్థం కావట్లేదని ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన కొంత మంది టీచర్లు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల ఉపాధ్యాయుల్లో చాలా మందికి ఏఐ టూల్స్, డిజిటల్ ప్లాట్‌ఫారాల వినియోగంపై తగిన అనుభవం లేనందున శిక్షణపై ఆసక్తి చూపట్లేదు. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు, వేగవంతమైన ఇంటర్నెట్ వంటి సదుపాయాలు పరిమితంగా ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ శిక్షణ వల్ల ఉపయోగం ఏమిటని మరికొందరు టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఏఐ సాధనాలన్నీ ఆంగ్లంలోనే ఉండటం వల్ల తెలుగు మాధ్యమ ఉపాధ్యాయులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానోపాధాయులు, కొందరు టీచర్లకు బోధనేతర పనులు అప్పగిస్తున్నారు. దీంతో ఏఐ శిక్షణపై సమయం కేటాయించడం ఇబ్బందిగా ఉందంటున్నారు. పాఠ్య ప్రణాళిక, ప్రశ్నపత్రాల తయారీ, తరగతి గదిలో ఏఐ వినియోగంపై ప్రత్యక్ష సాధన ఉండాలని కోరుతున్నారు. ఏఐ టెక్నాలజీ రోజుకో రీతిగా మారుతోంది. ఒక్కసారి శిక్షణ ఇచ్చేస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. ఏఐపై వచ్చే సందేహాలు నివృత్తి చేయడానికి నిపుణుల తోడ్పాటు అవసరమంటున్నారు. -
ఇన్వెస్టర్లూ ‘బాస్’తో జాగ్రత్త.. సెబీ హెచ్చరిక
కృత్రిమ మేధస్సు (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీని అడ్డం పెట్టుకుని జరుగుతున్న సైబర్ మోసాలపై భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) దేశంలోని కంపెనీలు, పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా "బాస్ స్కామ్" పేరుతో పెరుగుతున్న కొత్త తరహా మోసాలపై శుక్రవారం సెబీ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది.సెబీ వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు AI సాయంతో కంపెనీల సీఎండీలు, సీఈఓలు లేదా ఇతర ఉన్నతాధికారుల గొంతును క్లోన్ చేయడం, డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించడం, అలాగే ఈ-మెయిల్, వాట్సాప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వారిలా నటించి ఫైనాన్స్ విభాగాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. "అత్యవసరం", "రహస్యంగా ఉంచాలి" అంటూ వెంటనే నిధులు బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చి కోట్ల రూపాయలు కాజేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయని సెబీ పేర్కొంది. కొన్ని సందర్భాల్లో మాల్వేర్ ఫైళ్లను పంపి ఉద్యోగుల పరికరాలను హ్యాక్ చేసి, వారి ఖాతాల నుంచే నకిలీ చెల్లింపు ఆదేశాలు పంపుతున్నట్లు కూడా వెల్లడించింది.ఇదే సమయంలో ఎన్ఎస్ఈ కూడా పెట్టుబడిదారులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ఫిషింగ్ లింకులు, నకిలీ ఎన్ఎస్ఈ వెబ్సైట్లు, క్లోన్ ట్రేడింగ్ యాప్‌లు, సోషల్ మీడియా పెట్టుబడి గ్రూపులు, తప్పుడు స్టాక్ సిఫార్సుల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. అధికారిక వెబ్సైట్లు, యాప్‌ల ద్వారానే ట్రేడింగ్ సేవలను ఉపయోగించాలని, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయొద్దని, OTPలు లేదా లాగిన్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించింది. -
భయంతో భారీగా సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి!
29 ఏళ్ల భారతీయ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రూ.82 లక్షలకు పైగా ఆస్తులు కూడబెట్టుకున్నప్పటికీ, భవిష్యత్తుపై ఉన్న ఆందోళనతో రోజుకు దాదాపు 16 గంటలు పనిచేస్తున్నాడు. పగటిపూట భారతీయ ఐటీ కంపెనీలో, రాత్రిపూట అమెరికా (US) సంస్థలో ఫుల్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ నెలకు సుమారు రూ.7లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ విషయాలను పర్సనల్ ఫైనాన్స్ వ్యవహారాలపై నిర్వహించే 'ఫిక్స్ యువర్ ఫైనాన్స్' (Fix Your Finance) పోడ్కాస్ట్లో మ్యూచువల్ ఫండ్ సలహాదారు అన్షుమన్ శర్మతో జరిగిన సంభాషణలో వెల్లడించారు.కుటుంబ పరిస్థితులే ప్రేరణ'రోహిత్'గా మాత్రమే తనను పరిచయం చేసుకున్న ఈ యువకుడు, చిన్నప్పటి కుటుంబ పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇద్దరు సోదరుల్లో ఒకరే ఉన్నత చదువులు కొనసాగించే అవకాశం ఉండగా, తన అన్న చదువును వదులుకుని తనకు అవకాశం కల్పించాడని తెలిపాడు. "నేను విజయం సాధించకపోతే అది నా కుటుంబానికి వైఫల్యమే అవుతుంది" అనే భావన ఇప్పటికీ తనను మరింత కష్టపడేలా చేస్తోందని చెప్పాడు.భారీ సేవింగ్స్.. ఈఎంఐలుఇటీవల తండ్రి అయిన రోహిత్, కుటుంబ అవసరాల కోసం కారు కొనుగోలు చేయడంతో పాటు రూ.85 లక్షల విలువైన 2BHK ఫ్లాట్‌ను కూడా తీసుకున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం గృహ రుణానికి నెలకు సుమారు రూ.60,000, కారు లోన్‌కి రూ.28,000 ఈఎంఐ చెల్లిస్తున్నాడు. ఇతర ఖర్చులతో కలిపి నెలవారీ వ్యయం రూ.1.3 లక్షల నుంచి రూ.1.4 లక్షల మధ్య ఉంటుందని తెలిపాడు.రూ.82 లక్షల ఆస్తులు.. అయినా ఎందుకు భయం?తన వద్ద ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్లలో రూ.70 లక్షలు, ఫిక్స్డ్ డిపాజిట్లలో రూ.10 లక్షలు, స్టాక్ మార్కెట్లో సుమారు రూ.2 లక్షల పెట్టుబడులు ఉన్నాయని రోహిత్ వివరించాడు. మొత్తం కలిపి దాదాపు రూ.82 లక్షల ఆస్తులు ఉన్నప్పటికీ, ఉద్యోగ భద్రతపై తనకు నమ్మకం లేదని పేర్కొన్నాడు.దీనిపై అన్షుమన్ శర్మ స్పందిస్తూ, "మీ దగ్గర నాలుగేళ్ల ఖర్చులకు సరిపడా పొదుపు ఉంది. అయినా ఇంకా ఒత్తిడి ఎందుకు?" అని ప్రశ్నించారు.ఏఐ వల్ల ఉద్యోగాలపై ఆందోళనరోహిత్ సమాధానం మాత్రం ప్రస్తుతం ఐటీ రంగంలో చాలా మందిలో కనిపిస్తున్న ఆందోళనను ప్రతిబింబించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో తన ఆదాయం తగ్గిపోతుందేమోననే భయం వెంటాడుతోందని చెప్పాడు. ఆ కారణంగానే రెండు ఉద్యోగాలు చేస్తూ ఎక్కువగా సంపాదించాలని ప్రయత్నిస్తున్నానని వెల్లడించాడు. ఈ క్రమంలో రోజుకు 16 గంటలు పని చేయడం వల్ల కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సమయం కేటాయించలేకపోతున్నానని, వ్యక్తిగత జీవితం దెబ్బతింటోందని కూడా అంగీకరించాడు.👉ఇది చదివారా? ఈ హైదరాబాద్ ఐటీ దంపతుల సంపాదన పెరిగిందిలా..లక్ష్యం రూ.7-8 కోట్లువచ్చే ఐదారు సంవత్సరాల్లో రూ.7 నుంచి రూ.8 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టాలనే లక్ష్యంతో ఉన్నానని రోహిత్ తెలిపాడు. ఆ స్థాయికి చేరుకున్న తర్వాత భారతీయ ఉద్యోగాన్ని వదిలి, అమెరికా సంస్థలోని ఒక్క ఉద్యోగాన్నే కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పాడు.నిపుణులు ఏమంటున్నారు?పర్సనల్ ఫైనాన్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అత్యవసర నిధి, పెట్టుబడులు, బీమా వంటి అంశాలు ఆర్థిక భద్రతకు కీలకమైనప్పటికీ, నిరంతర ఒత్తిడి, అధిక పని గంటలు దీర్ఘకాలంలో శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు, ఏఐ ప్రభావంతో ఐటీ రంగంలో ఉద్యోగాల స్వరూపం మారుతున్నప్పటికీ, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా అవకాశాలను పెంచుకోవచ్చని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. -
ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?
కృత్రిమ మేధస్సు .. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న అత్యాధునిక సాంకేతికతగా మారింది. ఒకప్పుడు మనిషి మాత్రమే చేయగలడని భావించిన అనేక పనులను ఇప్పుడు ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తోంది. వార్తల రచన నుంచి వైద్య నిర్ధారణ వరకు, సినిమాల నిర్మాణం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, విద్య నుంచి వ్యాపార రంగం వరకు ప్రతి చోటా తన ముద్ర వేస్తోంది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, టెక్నాలజీ సంస్థలు మరో ప్రశ్నపై దృష్టి సారిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఏఐ తర్వాతి స్థాయి టెక్నాలజీ ఏమిటి? భవిష్యత్తు ప్రపంచాన్ని ఏ సాంకేతిక విప్లవం నడిపించబోతోంది?..ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఏఐ వ్యవస్థలు ప్రత్యేకంగా శిక్షణ పొందిన పనులనే సమర్థంగా నిర్వహిస్తాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, చిత్రాలు రూపొందించడం, అనువాదాలు చేయడం, డేటాను విశ్లేషించడం వంటి నిర్దిష్ట పనుల్లో ఇవి అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. కానీ మనిషిలా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మాత్రం వీటికి లేదు. ఈ పరిమితిని అధిగమించాలనే లక్ష్యంతోనే ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI)పై పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి.👉ఏజీఐ అంటే మనిషిలా ఆలోచించగలిగే, కొత్త విషయాలను స్వయంగా నేర్చుకోగలిగే, ఒక రంగంలో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని మరో రంగంలో కూడా ఉపయోగించగలిగే కృత్రిమ మేధస్సు. ఒకే వ్యవస్థ వైద్యుడిలా రోగాన్ని గుర్తించడమే కాకుండా, శాస్త్రవేత్తలా పరిశోధనలు చేయడం, ఇంజినీర్లా సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, ఉపాధ్యాయుడిలా బోధించడం వంటి అనేక పనులను నిర్వహించగల స్థాయికి చేరుకోవడమే ఏజీఐ లక్ష్యం. ప్రస్తుతం ప్రపంచంలో ఏ సంస్థ కూడా పూర్తిస్థాయి ఏజీఐని అభివృద్ధి చేయలేదు. అయితే ఆ దిశగా తీవ్ర పరిశోధనలు కొనసాగుతున్నాయి.👉ఏజీఐ తర్వాత శాస్త్రవేత్తలు ఊహిస్తున్న మరో దశ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI). ఇది మానవ మేధస్సును కూడా అధిగమించే స్థాయి కృత్రిమ మేధస్సుగా భావిస్తున్నారు. విజ్ఞానం, పరిశోధనలు, విశ్లేషణ, నిర్ణయాలు, సృజనాత్మకత వంటి అన్ని రంగాల్లో మనిషి కంటే మెరుగ్గా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంటుందని అంచనా. అయితే ఇది ఇప్పటికీ పూర్తిగా సిద్ధాంత స్థాయిలోనే ఉంది. అలాంటి వ్యవస్థ ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేదు.👉భవిష్యత్తులో మరో కీలక మార్పు ‘ఎంబాడీడ్ ఏఐ’ రూపంలో కనిపించే అవకాశం ఉంది. అంటే కేవలం కంప్యూటర్ లేదా మొబైల్లో ఉండే ఏఐ కాకుండా, మనుషుల మాదిరిగా నడిచే, చూసే, వినే, వస్తువులను తాకి పని చేసే హ్యూమనాయిడ్ రోబోల్లో ఏఐ పనిచేస్తుంది. ఇలాంటి రోబోలు పరిశ్రమలు, ఆసుపత్రులు, వ్యవసాయం, వృద్ధుల సంరక్షణ, విపత్తు సహాయక చర్యలు వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.అయితే భవిష్యత్తు కేవలం ఏఐతోనే పరిమితం కాదని కూడా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, మెదడు-కంప్యూటర్ అనుసంధానం (Brain-Computer Interface), జన్యు సాంకేతికత, ఫ్యూజన్ ఎనర్జీ వంటి రంగాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటిలో ఏఐతో కలయిక జరిగితే ప్రస్తుతం ఊహించలేని స్థాయిలో సాంకేతిక విప్లవం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో యంత్రాలు మనిషిని పూర్తిగా భర్తీ చేయడం కంటే, మనిషి సామర్థ్యాన్ని మరింత పెంచే సహాయకులుగా మారే దిశగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని మార్చుతున్నట్లే.. భవిష్యత్తులో ఏజీఐ, ఎంబాడీడ్ ఏఐ వంటి సాంకేతికతలు మన జీవన విధానాన్ని మరోసారి పూర్తిగా మార్చే అవకాశాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.:::వెబ్ ప్రత్యేకం -
శబరిమలలో ఏఐ సాంకేతికత.. భక్తుల మిస్సింగ్‌కి చెక్
పథనంతిట్ట: వార్షిక యాత్ర సందర్భంగా తమ బృందాల నుంచి విడిపోయిన యాత్రికులను త్వరగా గుర్తించేందుకు శబరిమల, ఏఐ (AI) ఆధారిత థర్మల్ కెమెరాలను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త వ్యవస్థలో భాగంగా , నిలక్కల్, పంపా, సన్నిధానంలోని సమాచార కేంద్రాలు తప్పిపోయిన యాత్రికుల పేర్లను లౌడ్‌స్పీకర్ల ద్వారా పలు భాషల్లో ప్రకటించే పద్ధతిని నిలిపివేస్తాయి. దీంతో , సుపరిచితమైన "మీరు ఎక్కడ ఉన్నా, ఇక్కడికి రండి" అనే బహిరంగ ప్రకటనలకు ముగింపు పడుతుంది.ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు, పుణ్యక్షేత్ర ప్రాంతంలోని కీలక ప్రదేశాలలో సహాయక మౌలిక సదుపాయాలతో పాటు 400 ఏఐ-సామర్థ్యం గల థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కొచ్చిలో జరిగిన డిజిటల్ కాన్క్లేవ్లో ఈ వ్యవస్థ నమూనాను ప్రదర్శించారు.ప్రతి ఏడాదిలక్షలాది మంది భక్తులు శబరిమలను సందర్శిస్తారు. ఈ తీవ్రమైన రద్దీ మధ్య పిల్లలు, వృద్ధ యాత్రికులతో సహా చాలా మంది తమ సహచరుల నుంచి విడిపోతుంటారు. ఈ ఏఐ-ఆధారిత నిఘా వ్యవస్థ, గాలింపు చర్యలను వేగవంతం చేయడానికి, జనసమూహ నిర్వహణను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది.వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే..ఒక యాత్రికుడు తప్పిపోయినప్పుడు అతనితో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు లేదా సహచరులు ఈ విషయాన్ని ఒక సమాచార కేంద్రంలో తెలియజేస్తారు. అధికారులు వర్చువల్ క్యూ రిజిస్ట్రేషన్ డేటాబేస్ నుంచి యాత్రికుడి ఫోటోను సేకరించి, దానిని ఏఐ (AI) సిస్టమ్‌లోకి అప్లోడ్ చేస్తారు.ఆ తర్వాత ఏఐ ప్లాట్‌ఫామ్ మొత్తం 400 థర్మల్ కెమెరాల నుంచి వచ్చే లైవ్ ఫీడ్లను స్కాన్ చేస్తుంది. ముఖ గుర్తింపు ద్వారా వ్యక్తిని గుర్తించిన వెంటనే , సిస్టమ్ ఆ వ్యక్తి ఉన్న ప్రదేశం గురించి కంట్రోల్ రూమ్‌కి తక్షణమే తెలియజేస్తుంది. భద్రతా సిబ్బందిని ఆ ప్రదేశానికి పంపిస్తారు, ఆ తర్వాత పోలీసులు యాత్రికుడిని గుర్తించి వారి బృందంతో తిరిగి కలుపుతారు.కెమెరా సంస్థాపన స్థానాలుAI థర్మల్ కెమెరాలను ప్రధాన పుణ్యక్షేత్రాలు, రవాణా కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్నారు, వాటిలో ఇవి కూడా ఉన్నాయి:నీలక్కల్: పార్కింగ్ గ్రౌండ్ మరియు చైన్ సర్వీస్ బస్ స్టాండ్.పంబ: బస్ స్టాండ్ , స్నానఘట్టం , త్రివేణి వంతెన మరియు గణపతి ఆలయం.పంబ - సన్నిధానం మార్గం: నీలిమల, అప్పచిమేడు, శబరిపీఠం , మరక్కూట్టం, క్యూ కాంప్లెక్స్ చరల్మేడు.సన్నిధానం: నడపండల్ , సోపానం , పతినెట్టంపాడి (18 పవిత్ర మెట్లు), ప్రసాదం కౌంటర్ , అన్నదానం హాలు మరియు పండితవళం.కొత్త ఏఐ - ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ , మాన్యువల్ ప్రకటనలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు , తప్పిపోయిన భక్తులను గుర్తించే ప్రక్రియను వేగవంతంగా, మరింత సమర్థవంతంగా చేస్తూ , యాత్రికుల భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.(చదవండి: జగన్నాథుని వంటశాల ఎలా ఉంటుందంటే..! ఆఖరికి పొయ్యిలు కూడా..) -
అంతరిక్షంలో డేటా స్థావరాలు..
మీరు వాట్సాప్ సందేశం పంపిన ప్రతిసారీ, నెట్‌ఫ్లిక్స్ షో చూసిన ప్రతిసారీ, లేదా గూగుల్‌లో ఏదైనా వెతికిన ప్రతిసారీ.. మీరు ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఒక డేటా సెంటర్‌కు కనెక్ట్ అవుతున్నారని అర్థం. ఆధునికమైన భారీ ఇంటర్నెట్ గిడ్డంగులలో అమర్చిన వేలాది శక్తిమంతమైన సర్వర్లు పని చేసే స్థలాలే డేటా సెంటర్లు. ఇప్పుడిక అంతరిక్షంలో కూడా వీటి స్థావరాలను నెలకొల్పటం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి!కృత్రిమ మేధ (ఏఐ) వాడకం విపరీతంగా పెరగడంతో, దానికి తగ్గ కంప్యూటింగ్ పవర్ కోసం ‘స్పేస్ఎక్స్’ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు అంతరిక్షం వైపు చూస్తున్నాయి. భూమి మీదున్న పర్యావరణ, మౌలిక సదుపాయాల సవాళ్లను అధిగమించడానికి ‘ఆర్బిటల్ డేటా సెంటర్లు’ ఒక విప్లవాత్మక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే, అంతరిక్షంలోని కఠిన వాతావరణం, కూలింగ్ సమస్యలు, అధిక ఖర్చుల దృష్ట్యా.. ఈ అత్యాధునిక సాంకేతికత ఎంతవరకు సాధ్యపడుతుందనేది పెద్ద ప్రశ్న.నింగి వైపు కంపెనీల చూపుఅంతరిక్షంలో డేటా సెంటర్లు పెట్టేందుకు టెక్నాలజీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. భూమి మీద పడే పర్యావరణ భారాల్ని తగ్గించుకుంటూ, అంతరిక్షంలో సమృద్ధిగా దొరికే సౌరశక్తిని వాడుకోవడం ఈ డేటా సెంటర్ల ఏర్పాటు ఆలోచనలోని ముఖ్య ఉద్దేశం. కానీ, అంతరిక్షంలో కంపెనీని నడపటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా అక్కడి వాతావరణం కూడా అనుకూలంగా ఉండదు. యంత్రాలను చల్లబరచడం, మరమ్మతులను చూసుకోవడం, రేడియేషన్ ప్రభావం, అక్కడ తిరిగే అంతరిక్ష వ్యర్థాల వంటి సవాళ్లు కూడా ఉంటాయి.మస్క్ జోరు.. ఇన్వెస్టర్ల హోరు!అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారంటే, అంతరిక్షంలో డేటా సెంటర్ ఏర్పాటుకు స్పేస్ఎక్స్ ప్రయత్నాలు మొదలు పెట్టటమే కారణం. ఇన్వెస్టర్లు ఇప్పుడు కేవలం రాకెట్ల మీద మాత్రమే డబ్బులు కుమ్మరించటం లేదు, మొత్తం అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ మీదే ఆశలు పెట్టుకున్నారు. వినడానికే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉండే ‘ఆర్బిటల్ డేటా సెంటర్ల’ను నిర్మించేందుకు కుతూహలపడుతున్న కంపెనీల్లో స్పేస్ఎక్స్ చాలా పాపులర్ కావచ్చు కానీ, ఈ పోటీలో ఉన్నది అదొక్కటే కాదు.అదిరే ఐడియా.. బెదిరే భారండేటా సెంటర్లను అంతరిక్షంలో ఏర్పాటు చేస్తే అక్కడ పుష్కలంగా సౌరశక్తి లభ్యం అవుతుంది. భూమి మీదలా స్థలం, నీళ్లు, కరెంట్ గ్రిడ్ల అవసరం ఉండదు. ప్రపంచమంతటా ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోతుండటంతో భూమి మీద పడుతున్న పర్యావరణ భారాన్ని, మౌలిక సదుపాయాల ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి ఈ ‘అంతరిక్ష డేటా సెంటర్లు’ ఒక మంచి ఆలోచన అని కంపెనీలు నమ్ముతున్నాయి. పైగా, ఈ డేటా సెంటర్ల వల్ల తమ ప్రాంతంలో సమస్యలు వస్తున్నాయని చాలా చోట్ల స్థానికులు చేస్తున్న ఆందోళనల తలనొప్పి కూడా తప్పుతుంది.అయితే, ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి, ఒక పరిశ్రమ స్థాయిలో కంప్యూటింగ్ నెట్‌వర్క్‌ను అక్కడ నడపడానికి మధ్య చాలా తేడా ఉంది. అంతరిక్షంలో ఉండే రేడియేషన్ వల్ల ఎలక్టాన్రిక్ ఉపకరణాలు పాడైపోతాయి. కంప్యూటర్ల వల్ల విపరీతమైన వేడి జనిస్తుంది. అంతరిక్షంలో ఆ వేడిని చల్లబరచడం తేలిక కాదు. చిన్న మరమ్మతుకు కూడా భారీగా ఖర్చవుతుంది. ఇవన్నీ అటుంచి, కింది నుంచి పైకి పంపే ప్రతి కిలో బరువుకీ సుమారు 6 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది.కరెంటుకు, నీళ్లకు ఖర్చు తక్కువభూమి మీద లాగే అంతరిక్షంలో కూడా డేటా సెంటర్లకు భారీ స్థాయిలో విద్యుత్తు అవసరం. అయితే అక్కడ ఈ విద్యుత్ అంతా సౌరశక్తి (సోలార్ ప్యానెల్స్) ద్వారానే లభిస్తుంది. అంతరిక్షంలో సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు, మేఘాలు కూడా అడ్డుపడవు. కాకపోతే, మనం ఆ సోలార్ ప్యానెల్స్‌ను ఏ కక్ష్యలో పెట్టామనే దాన్ని బట్టి అవి తిరిగేటప్పుడు భూమి అడ్డువచ్చి కొంతసేపు నీడ పడే అవకాశం ఉంటుంది.‘ఏఐ1 కంప్యూట్ శాటిలైట్’ డిజైన్డేటా సెంటర్ల ఏర్పాటుకు అంతరిక్షంలో ఉండే ఇంకో ప్రతికూలాంశం ఏంటంటే... కూలింగ్. అంతరిక్షం వెనుక (నక్షత్రాలు, గ్రహాలు లేని శూన్యమైన ఖాళీ అంతరిక్షపు ఉపరితలం) ఉండే వాతావరణం చాలా చల్లగా (దాదాపు మైనస్ 270 డిగ్రీల సెల్సియస్) ఉంటుంది. డేటా సెంటర్ నుండి వచ్చే వేడిని రేడియేటర్ల ద్వారా ఆ ఖాళీలోకి వదిలేయొచ్చు. భూమి మీద ఎక్కువ నీళ్లు వాడుకునే కూలింగ్ సిస్టమ్స్ అవసరం అంతరిక్షంలో ఉండదు. కానీ, ఆ వేడిని బయటకు పంపే థర్మల్ రేడియేటర్ల కోసం చాలా విస్తారంగా స్థలం మాత్రం కావాల్సి ఉంటుంది.అంతరిక్షంలో వేడెక్కిన మిషన్ల మీదకు గాలి పంపి చల్లబరచడానికి అక్కడ గాలే ఉండదు. వేడి అంతా ‘ఇన్ఫ్రారెడ్ రేడియేషన్’ (ఉష్ణ కిరణాలు) రూపంలోనే చాలా నిదానంగా బయటకు వెళ్లాలి. దీనివల్ల 10 మెగావాట్ల వేడిని బయటకు పంపించాలన్నా సరే, దాదాపు రెండు ఫుట్‌బాల్ గ్రౌండ్లంత పెద్ద రేడియేటర్ స్థలం కావాల్సి వస్తుంది. ఇప్పటికే అంతరిక్షం రద్దీగా మారిపోయింది. ఇప్పుడు వేల సంఖ్యలో ఇలాంటి పెద్ద పెద్ద డేటా సెంటర్లను స్పేస్‌లోకి పంపితే ఈ సమస్య ఇంకా ఎక్కువవుతుంది. అక్కడ తిరిగే అంతరిక్ష వ్యర్థాలు, చిన్న చిన్న ఉల్కలు గనక ఈ డేటా సెంటర్‌ను బలంగా ఢీకొడితే... అది ముక్కలైపోవడమే కాకుండా, అంతరిక్షంలో ఇంకాస్త ఎక్కువ చెత్త తయారవుతుంది.స్పేస్ఎక్స్ డిజైన్ సిద్ధమైంది!ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, కంపెనీలు మాత్రం అంతరిక్ష డేటా సెంటర్ల డిజైన్లతో ముందుకు దూసుకెళ్తున్నాయి. స్పేస్ఎక్స్ ఈ మధ్యే తన ‘ఏఐ1 కంప్యూట్ శాటిలైట్’ డిజైన్‌ను ప్రకటించింది. దీన్ని ఒక ‘ఆర్బిటల్ డేటా సెంటర్ స్పేస్‌క్రాఫ్ట్’లా వాడాలని దాని ఆలోచన. కాకపోతే, ప్రస్తుతం భూమి మీదున్న డేటా సెంటర్లతో పోలిస్తే దీని సామర్థ్యం 100 నుండి 1,000 రెట్లు తక్కువ.అన్ని రకాల కంప్యూటర్ పనులని స్పేస్‌లో చేయడం కుదరదు. ఆర్థిక లావాదేవీలు (ఆన్లైన్ పేమెంట్లు), లైవ్ ఏఐ సర్వీసులు, క్లౌడ్ అప్లికేషన్లలో చిన్న ఆలస్యం ఉన్నా వ్యవస్థ అసలే నడవదు. కాబట్టి, ప్రారంభంలో కాస్త ఆలస్యమైనా పర్వాలేదు అనుకునే పనులకి ఈ ఆర్బిటల్ డేటా సెంటర్లు బాగా సెట్ అవుతాయి. ఉదాహరణకు... శాటిలైట్ల నుండి వచ్చే సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, రక్షణ రంగం లేదా నిఘా విభాగాల డేటా ప్రాసెసింగ్, స్పేస్ మిషన్ల శాస్త్ర పరిశోధన లాంటి వాటికి ఇవి ఉపయోగపడతాయి.ముఖ్యంగా ఈ మూడూ ఉండాలిక్లౌడ్ కంప్యూటింగ్, వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, శాస్త్ర సాంకేతిక పరిశోధనలు.. వీటన్నిటినీ ప్రస్తుతం నడిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు శక్తిని ఇచ్చేది ఈ డేటా సెంటర్లే. అంటే, డేటా సెంటర్ అనేది కేవలం సర్వర్లతో నిండిన ఒక రూమ్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువే!మొదటిది విద్యుత్: ఒక డేటా సెంటర్ ఎలాంటి అవాంతరాలూ లేకుండా నడవాలంటే సర్వర్లు, నెట్వర్క్ పరికరాలు, స్టోరేజ్ సదుపాయాలు కావాలి. ఇవన్నీ నడవడానికి పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం. ఏఐ రాకతో విద్యుత్ వాడకం మరింతగా పెరిగిపోయింది.రెండవది కూలింగ్ (చల్లబరచడం): సర్వర్లు వాడుకునే కరెంట్ అంతా చివరకు వేడి రూపంలోనే బయటకు వస్తుంది. ఆ వేడిని గనక వెంటనే బయటకు పంపకపోతే పరికరాలు పాడైపోతాయి. అందుకే ఎయిర్ కండిషనర్లు, చిల్లర్లు, కూలింగ్ టవర్లు ఉంటాయి. చాలా డేటా సెంటర్లలో కంప్యూటర్ల తర్వాత అత్యధిక కరెంట్ ఖర్చయ్యేది ఈ కూలింగ్ కోసమే.మూడవది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: కావలసినంత స్థలం, బిల్డింగులు, బ్యాకప్ పవర్ (జెనరేటర్లు), వాటర్ సిస్టమ్‌లు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, రిపేర్లు చేయడానికి మనుషులు వెళ్లగలిగే సదుపాయం ఉండాలి.కొన్ని సమస్యలూ ఉన్నాయిడేటా సెంటర్ సామగ్రినంతా అంతరిక్షంలోకి చేర్చడానికి వరుసగా రాకెట్లను లాంచ్ చేయాల్సి ఉంటుంది, ఇది కింద ఉన్న జనాలకి నచ్చకపోవచ్చు. ఇప్పటికీ టెక్సస్‌లోని బోకా చికాలో ఉన్న స్పేస్ఎక్స్ లాంచ్ సెంటర్ దగ్గర స్థానిక యాక్టివిస్టులు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. ఈ రాకెట్ టెస్టుల వల్ల చుట్టుపక్కల పర్యావరణం పాడైపోతుందని వాళ్ల వాదన. ఇక అన్నిటికంటే ముఖ్యంగా... డేటా మొత్తాన్ని భూమికి, అంతరిక్షంలో ఉన్న డేటా సెంటర్లకి మధ్య రేడియో వేవ్స్ లేదా లేజర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. డేటా సైజ్ ఊహించనంతగా పెరిగిపోతుంది.ఈ డేటా సెంటర్లను, వాటి సోలార్ ప్యానెళ్లను, రేడియేటర్లను ఒకేసారి స్పేస్‌లోకి పంపడం కుదరదు. వీటిని విడివిడిగా పంపి, అంతరిక్షంలోనే అసెంబుల్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం స్పేస్‌లోనే రిపేర్లు, అసెంబ్లింగ్ చేయగల కొత్త రకం టెక్నాలజీ కావాలి.మరొక ముఖ్యమైన సమస్య.. హార్డ్‌వేర్ మార్చడం. భూమి మీద అయితే పాతబడిపోయిన సర్వర్లను ప్రతి మూడు నుండి ఐదేళ్లకు ఒకసారి అప్‌గ్రేడ్ లేదా రీప్లేస్ చేస్తుంటారు. కానీ అంతరిక్షంలో ఈ మార్చడాలు, రిపేర్లు చేయడం చాలా కష్టం. ఒకసారి భూ కక్ష్యలోకి పంపిన హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడం అంటే అపరిమితమైన ఖర్చుతో కూడుకున్న పని. ఒకవేళ ఆ కంప్యూటర్ సిస్టమ్‌ను అప్డేట్ చేయలేకపోతే, అది గడువు తీరటానికి ముందే పనికిరాకుండా పోతుంది. టెక్నాలజీ ఇంత స్పీడ్‌గా మారిపోతున్న ఈ రోజుల్లో... ఇది చాలా పెద్ద ఆర్థికపరమైన భారం.దీనికి తోడు అంతరిక్షంలో ఉండే కఠినమైన వాతావరణం ఇంకో పెద్ద తలనొప్పి. అవి తిరిగే కక్ష్యను బట్టి... రోజులో చాలాసార్లు ఎండ తగిలినప్పుడు విపరీతమైన వేడి, భూమి నీడలోకి వెళ్లినప్పుడు విపరీతమైన చలిని తట్టుకోవాల్సి ఉంటుంది.- సాక్షి స్పెషల్ డెస్క్ -
ఓపెన్ AIపై ఆపిల్ దావా.. అసలేం జరిగింది
-
యువతకు అలర్ట్.. రాబర్ట్ కియోసాకి పోస్ట్!
బంగారం, వెండి, బిట్‌కాయిన్ గురించి చెప్పే 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఏఐ గురించి, ఉద్యోగాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. దాని ప్రభావం ఉద్యోగాలపై కూడా అంతే వేగంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఏఐ టెక్నాలజీని తమ పనుల్లో ఉపయోగించడం మొదలెట్టేశాయి. దీన్నిబట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా మాజీ వాణిజ్య శాఖ మంత్రి కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని కియోసాకి పేర్కొన్నారు.అమెరికా మాజీ వాణిజ్య శాఖ మంత్రి అభిప్రాయం ప్రకారం.. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువ ఉద్యోగులు రాబోయే కాలంలో ఏఐ ప్రభావానికి గుయారవుతారు. నిరుద్యోగం బాగా పెరిగిపోతుంది. అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, డేటా విశ్లేషణ వంటివన్నీ కూడా ఏఐ చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. అనేక కంపెనీల సీఈఓలు కూడా ఈ మార్పుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.అమెరికా వద్ద ఏఐ అభివృద్ధికి కావలసిన స్పష్టమైన వ్యూహం ఉన్నప్పటికీ.. ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులను ఎలా సిద్ధం చేయాలనే దానికి కావాల్సిన ప్రణాళిక లేదని పేర్కొన్నారు. కాబట్టి యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాలు లేదా ఇతర కంపెనీల మీద ఆధారపడకుండా.. తమ భవిష్యత్తును తామే సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.జాబ్ చేస్తున్నవారు సైతం కేవలం ఒక ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకుండా.. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఏఐతో ఎలా కలిసి పనిచేయాలి అనే విషయాలను నేర్చుకోవాలి. అవసరమైతే సొంతంగా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడం ముఖ్యమని చెబుతున్నారు. మొత్తం మీద ఏఐ ఉద్యోగాలకు ముప్పు తెస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రభావం.. విద్య, వైద్య, వ్యాపార, సాఫ్ట్వేర్ మొదలైన రంగాలను ప్రభావితం చేస్తోంది. ఇలాంటి సమయంలో.. అంత్రోఫిక్ సంస్థ సీఈఓ 'డారియో అమోడెయ్' ఏఐ వల్ల ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.డారియో అమోడెయ్ అభిప్రాయం ప్రకారం.. రానున్న రోజుల్లో కోడింగ్ పనులను ఏఐ ఆటోమేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రోగ్రామింగ్‌లో కోడ్ రాయడం, లోపాలను గుర్తించడం, కొత్త ప్రోగ్రామ్‌లను రూపొందించడం వంటి పనులను ఏఐ చాలా వేగంగా చేస్తోంది. కాబట్టి ముందు కోడింగ్ కనుమరుగవుతుంది.సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై ఎఫెక్ట్ఏఐ ప్రభావం సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది. కోడింగ్ తరువాత, ఈ రంగంలో కూడా గణనీయమైన మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగుల సంఖ్య భారీగా కనుమరుగవుతాయని డారియో అమోడెయ్ పేర్కొన్నారు.అయితే.. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ అనేది కేవలం కోడ్ రాయడం మాత్రమే కాదు. వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం, కొత్త ఉత్పత్తులను డిజైన్ చేయడం, మార్కెట్ అవసరాలను విశ్లేషించడం, ప్రాజెక్టులను నిర్వహించడం వంటి బాధ్యతలు కూడా ఇందులో భాగమే. కాబట్టి ఈ పనుల్లో మానవుల పాత్ర కూడా కొంత అవసరం ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఒక వ్యక్తి మొత్తం పనిలో కేవలం 5 శాతం మాత్రమే పూర్తి చేసినా.. మిగిలిన 95 శాతం పనిని ఏఐ పూర్తి చేయగలదని చెప్పారు. దీంతో ఉత్పాదక పెరుగుతుందని వివరించారు.ఈ ఉద్యోగాలకు అవకాశంయువత ఏఐతో పోటీ పడటానికి కావలసిన నైపుణ్యాలను నేర్చుకోవడం కంటే.. ఏఐకి తోడ్పడే నైపుణ్యాలను నేర్చుకుంటే బాగుంటుందని అమోడెయ్ వెల్లడించారు. అయితే.. ఏఐ ఎంత ఎదిగినా సెమీకండక్టర్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ వంటి సంప్రదాయ ఇంజినీరింగ్ రంగాలు, అలాగే మానవ సంబంధాలు, నాయకత్వం, సమస్య పరిష్కార నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు.ఏఐ వల్ల నైపుణ్యం తగ్గుతుందా?మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏఐ యుగంలో విమర్శనాత్మక ఆలోచన ముఖ్యమని అమోడెయ్ పేర్కొన్నారు. ఎందుకంటే ఏఐ నిజమైన చిత్రాలు, వీడియోలు, సమాచారంతో పాటు నకిలీ కంటెంట్‌ను కూడా సృష్టించగలదు. కాబట్టి ఏది నిజం, ఏది అబద్ధమో గుర్తించే సామర్థ్యం ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆయన సూచించారు.అయితే.. విద్యార్థులు ఏఐను ఉపయోగించి హోంవర్క్ లేదా అసైన్మెంట్లను పూర్తిచేయడం సరైన పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. ఏఐతో హోంవర్క్ చేయించడం అంటే అది ఒక విధంగా చీటింగ్ చేసినట్లే.. అని ఆయన వ్యాఖ్యానించారు. అంత్రోఫిక్ నిర్వహించిన ఒక పరిశోధనల ప్రకారం, ఏఐపై పూర్తిగా ఆధారపడితే మన నైపుణ్యాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ.. సరైన విధంగా ఉపయోగిస్తే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సామర్థ్యాలను పెంచుకోవడానికి అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.వ్యక్తిగత అభివృద్ధి ఇలా సాధ్యంఏఐ వల్ల మనుషులు భవిష్యత్తులో తక్కువ తెలివిగా మారే ప్రమాదం ఉందా అనే ప్రశ్నకు, అది AIను ఎలా ఉపయోగిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన సమాధానం ఇచ్చారు. ఏఐపై పూర్తిగా ఆధారపడితే మన ఆలోచనా శక్తి తగ్గే అవకాశం ఉంది. కానీ దానిని ఒక సాధనంగా ఉపయోగించి కొత్త విషయాలు నేర్చుకుంటే మాత్రం తప్పకుండా వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన వివరించారు.ANTHROPIC CEO: “CODING IS GOING AWAY FIRST, THEN ALL OF SOFTWARE ENGINEERING” pic.twitter.com/4Sjo9LSB4C— Vivek Sen (@Vivek4real_) July 8, 2026 -
మస్క్ ప్రసంశలు.. AI రంగంలో వారే టాప్!
ఏఐ రంగంలో.. టెక్ కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమకు ప్రత్యర్థిగా ఉన్న ఆంత్రోపిక్ ప్రస్తుతం ఏఐ రంగంలో అగ్రస్థానంలో ఉందని ఆయన ప్రశంసించారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X)లో ప్రముఖ ఏఐ మోడళ్ల పనితీరుపై జరిగిన చర్చపై మస్క్ స్పందించారు. ''ఆంత్రోపిక్ గురించి నేను గతంలో చేసిన అంచనా తప్పు. ప్రస్తుతం ఏఐ రంగంలో వారే ముందున్నారు. వారి మిథోస్/ఫేబుల్ (Mythos/Fable) మోడల్ స్థాయికి సమానమైన మోడల్‌ను ఇప్పటివరకు ఏ కంపెనీ విడుదల చేయలేదు. త్వరలోనే వారు మరింత శక్తివంతమైన మిథోస్ 2ను కూడా తీసుకురానున్నారు'' అని పేర్కొన్నారు.ఆంత్రోపిక్ ప్రస్తుతం ప్రపంచంలో ప్రముఖ ఏఐ సంస్థల్లో ఒకటిగా ఎదుగుతోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలపర్ల కోసం రూపొందించిన క్లాడ్ మోడళ్లు మంచి గుర్తింపు పొందాయి. గత ఏడాది విడుదలైన క్లాడ్ ఓపస్ 4.5 మోడల్ కోడింగ్ సామర్థ్యాల్లో అద్భుతమైన ఫలితాలను చూపడంతో ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు, ఏఐ పరిశోధకులు దీనిని విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించారు. దీంతో ఓపెన్ఏఐ, గూగుల్, ఎక్స్ఏఐ వంటి దిగ్గజ సంస్థలకు ఆంత్రోపిక్ గట్టి పోటీగా నిలిచింది.ఎలాన్ మస్క్ వంటి ప్రముఖ వ్యాపారవేత్త ప్రత్యర్థి సంస్థను బహిరంగంగా ప్రశంసించడం ఆంత్రోపిక్ సాధించిన విజయానికి నిదర్శనం. ఏఐ రంగంలో పోటీ మరింత తీవ్రంగా మారుతున్న ఈ సమయంలో.. కొత్త ఆవిష్కరణలు, శక్తివంతమైన మోడళ్లతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందే అవకాశాలు మరింత పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.I was clearly wrong about Anthropic. They are obviously currently the leader in AI. No company has released a model as good as Mythos/Fable and they will undoubtedly have Mythos 2 ready soon. And I would never cut them off in a way that hurt them badly, even as a competitor.…— Elon Musk (@elonmusk) July 9, 2026 -
స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు ఏఐ సెగ!
ఎక్కడ చూసినా ఇప్పుడు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించే చర్చ. ఏఐ ‘విశ్వ’రూపంతో ఉద్యోగాలు ఊడిపోతాయన్న ఆందోళన ఒకెత్తయితే.. శరవేగంగా విస్తరిస్తున్న ఈ టెక్నాలజీ కారణంగా ఎల్రక్టానిక్ గ్యాడ్జెట్లకు కూడా గట్టిగానే సెగ తగులుతోంది. మెమరీ, స్టోరేజ్ చిప్‌లకు ఏఐ కంపెనీల నుంచి భారీ డిమాండ్ కారణంగా కొరత తలెత్తడంతో స్మార్ట్ఫోన్లు, మొబైల్స్ రేట్లకు రెక్కలొస్తున్నాయి. విడిభాగాల ధరలు ఇప్పట్లో దిగిరావడం కష్టమేనని, దీంతో రానున్న పండుగ సీజన్లో డిస్కౌంట్లు పెద్దగా ఉండకపోవచ్చనేది పరిశ్రమ వర్గాల మాట! సాక్షి, బిజినెస్ డెస్క్ఎన్విడియా, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్.. ఏఐ డేటా సెంటర్లు, ఇన్ఫ్రా అభివృద్ధిలో పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. దీంతో ఒక్కసారిగా మెమరీ చిప్‌లకు అసాధారణ డిమాండ్ నెలకొనడంతో వాటి తయారీ సంస్థలు ఏఐ కంపెనీల వెంటపడుతున్నాయి. ఏఐ సర్వర్లలో వాడే చిప్‌లకు అధిక మార్జిన్లు లభిస్తుండటంతో పీసీలు, స్మార్ట్ఫోన్లు తదితర కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌లో వాడే సంప్రదాయ డీర్యామ్, నాండ్ ఫ్లాష్ డ్రైవ్‌ల సరఫరా తగ్గించేశాయి.ఈ దెబ్బతో మెమరీ, స్టోరేజ్ చిప్‌లకు తీవ్ర కొరత ఏర్పడి వాటి ధరలు ఎగబాకుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా గ్యాడ్జెట్ ప్రియులకు షాకిస్తోంది. యాపిల్ తాజాగా మ్యాక్‌బుక్, ఐప్యాడ్ మోడళ్లపై భారీగా ధరలు పెంచేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా గత కొద్ది నెలలుగా రేట్లు పెంచుకుంటూపోతున్నాయి. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో భారత్‌లో సగటున మొబైల్స్ రేట్లు 7.9 శాతం పెరిగాయని రీసెర్చ్ సంస్థ టెక్ఆర్క్ వెల్లడించింది.చౌక ఫోన్లపై తీవ్ర ప్రభావం.. స్మార్ట్ఫోన్లలో అత్యంత ఖరీదైన విడిభాగాలుగా ఇప్పటివరకు ప్రాసెసర్లు, డిస్ప్లే ఉండేవి. ఏఐ దెబ్బతో ఇప్పుడు మెమరీ వాటిని ఆక్రమించిందని, కొన్ని డివైజ్‌లలో అయితే మొత్తం హార్డ్‌వేర్ వ్యయంలో సగం దీనిదే ఉంటోందని మొబైల్ కంపెనీ నథింగ్ కో–పౌండర్, సీఈఓ కార్ల్ పీ పేర్కొన్నారు. ‘కస్టమర్లకు ఇప్పుడిప్పుడే మెమరీ సెగ తగులుతోంది. ఫోన్ రేట్లు ఇప్పటికే పెరిగాయి.మరో ఏడాది పాటు ఎగబాకుతూనే ఉంటాయి. గత మోడళ్ల స్థానంలో ఫిబ్రవరి నుంచి మార్కెట్లోకి తెచ్చిన పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు రేట్లను 100 డాలర్లకు పైగానే పెంచేశాయి’ అని ఆయన చెప్పారు. భారత్ విషయానికొస్తే, రూ.30,000కు పైబడిన ఫోన్ ధరలు రూ.7,000కు మించి ఎగబాకాయి. చౌక స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దీని ఎఫెక్ట్ మరీ ఎక్కువగా ఉందని టెక్ఆర్క్ డేటా వెల్లడించింది. రూ.10,000 లోపు ఫోన్ల సగటు ధర ఈ ఏడాది ఇప్పటిదాకా 17.6% దూసుకెళ్లగా.. రూ.10,000–20,000 సెగ్మెంట్లో పెంపు 13.9%గా ఉంది. ఇక రూ.20,000–30,000 విభాగంలో 5.6 శాతం పెరుగుదల నమోదైంది.ల్యాప్‌టాప్, డెస్‌్కటాప్ రేట్లూ పైపైకి..మెమరీ, స్టోరేజ్ చిప్‌ల కొరత ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలనూ కుదిపేస్తోంది. గత్యంతరం లేక గత నెలలో యాపిల్ ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లపై భారం మోపింది. భారత్‌లో పలు మ్యాక్‌బుక్, ఐప్యాడ్ల ధరలు 20–42 శాతం మేర ఎగబాకడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. ప్రాసెసర్లు, గ్రాఫిక్స్ చిప్స్, మెమరీ విడిభాగాలపై అధిక ఖర్చు కారణంగా రాబోయే రోజుల్లో మరిన్ని తయారీ సంస్థలు ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని... దీంతో ఏఐ పీసీలు, ల్యాప్‌టాప్‌ల రేట్లకు మరింతగా రెక్కలొస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ ఏడాది ల్యాప్‌టాప్‌లతో పాటు డెస్క్‌టాప్‌ల ధరలు సైతం 35 శాతం పెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు. మరోపక్క, 2025లో పీసీ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవగా.. ఈ ఏడాది ధరాభారంతో సేల్స్ 8 శాతం మేర పడిపోవచ్చని ఐడీసీ, కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అంచనా వేస్తున్నాయి. రేట్ల షాక్ నేపథ్యంలో ఎంట్రీలెవెల్ కొనుగోలుదారులు అప్‌గ్రేడ్ అయ్యేందుకు వెనకాడవచ్చని, లేదంటే తక్కువ స్పెసిఫికేషన్ డివైజ్‌లకే పరిమితం కావచ్చనేది పరిశ్రమవర్గాల అభిప్రాయం.పండుగ డిస్కౌంట్లు కట్...పండుగ సీజన్ మొదలైందంటే చాలు... ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో గ్యాడ్జెట్లపై బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, నోకాస్ట్ ఈఐఎంలతో కంపెనీలు సందడి చేస్తుంటాయి. కస్టమర్లకు గాలమేస్తాయి. అయితే, మెమరీ, స్టోరేజ్ ఇతరత్రా కాంపొనెంట్లపై వ్యయం భారీగా ఎగబాకడంతో.. కంపెనీలు ఈసారి పెద్దగా డిస్కౌంట్లు, ఆఫర్లు ఇచ్చే పరిస్థితి లేదని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అంటోంది.డిమాండ్ పడిపోవడం, అధిక ధరల కారణంగా ఈ పండుగ సీజన్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 9–10 శాతం మేర తగ్గొచ్చని అంచనా వేసింది. పండుగ వ్యూహం ఇంకా ఖరారు కాలేదని, అయితే మెమరీ చిప్‌ల కొరత, ఇతర విడిభాగాల రేట్ల పెరుగుదల కారణంగా ప్రైసింగ్ నిర్ణయం కష్టతరంగా మారుతోందని పరిశ్రమ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఏఐ ఇన్ఫ్రాపై పెట్టుబడుల స్పీడ్ ఇలాగే కొనసాగితే, పండుగల తర్వాత కూడా గ్యాడ్జెట్ రేట్లు మరింత పెరిగే చాన్స్ ఉంటుందని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. -
14 ఏళ్లకే పారిశ్రామికవేత్త.. బుర్జ్ ఖలీఫాలో ఆఫీస్!
సాధారణంగా చాలామంది 14 ఏళ్ల విద్యార్థులు పాఠశాల చదువుల్లో బిజీగా ఉంటారు. కానీ జైనమ్ జైన్ అనే బాలుడు మాత్రం దుబాయ్‌లో ఏఐ స్టార్టప్‌ను స్థాపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇతడు ప్రారంభించిన మెంగో ఇంజిన్ (Mengo Engine) అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన 'బుర్జ్ ఖలీఫా'లో ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం విశేషం. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో గుర్తింపు పొందిన అత్యంత పిన్న వయస్కులైన AI పారిశ్రామికవేత్తల్లో జైనమ్ ఒకరిగా నిలిచాడు.జైనమ్ జైన్ స్థాపించిన మెంగో ఇంజిన్ సంస్థ.. వ్యాపార సంస్థలకు మార్కెటింగ్, కస్టమర్ కమ్యూనికేషన్, సేల్స్ సపోర్ట్, కంటెంట్ తయారీ వంటి పనులను AI సహాయంతో వేగంగా, సమర్థవంతంగా నిర్వహించే సేవలను అందిస్తోంది. తక్కువ వయస్సులోనే సాంకేతిక రంగంలో అడుగుపెట్టి, వ్యాపార సంస్థలకు వినూత్న పరిష్కారాలను అందించడం ద్వారా ఇతడు ప్రత్యేక గుర్తింపు పొందాడు.జైనమ్కు చిన్నప్పటి నుంచే వ్యాపారంపై ఆసక్తి ఉండేది. కేవలం ఆరు సంవత్సరాల వయస్సులో తన తండ్రితో కలిసి ఒక వ్యాపార సమావేశానికి వెళ్లినప్పుడు.. అతనిలో పారిశ్రామికవేత్త కావాలనే ఆలోచన మొదలైంది. అప్పటి నుంచి చదువుతో పాటు వ్యాపార సమావేశాల్లో పాల్గొనడం, విజయవంతమైన వ్యాపారవేత్తలను కలవడం, వారి అనుభవాల నుంచి నేర్చుకోవడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాడు.13 ఏళ్ల వయస్సులో జైనమ్ IGCSE పదో తరగతి సిలబస్‌ను కేవలం 105 రోజుల్లో పూర్తి చేశాడు. కంపెనీ అభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో వేగంగా చదవడం, నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. పుస్తకాల ద్వారా నేర్చుకునే విద్యతో పాటు ప్రత్యక్ష అనుభవం కూడా సమానంగా ముఖ్యమని అతను విశ్వసిస్తాడు. ఈ కారణంగానే చాలామంది పారిశ్రామిక వేత్తలను కలుసుకోవడానికి సమయం కేటాయిస్తాడు.స్టార్టప్ నిర్వహణతో పాటు.. జైనమ్ TEDx వేదికపై ప్రసంగించాడు, అతని పేరుమీద రెండు పేటెంట్లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఇతడు ఒక పుస్తకాన్ని రచించాడు. అతని యూట్యూబ్ ఛానెల్‌కు 1.45 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. 10 ఏళ్ల వయస్సు నుంచే అతను తనకు తానే 50 రోజుల ఛాలెంజ్ వంటివి నిర్దేశించుకునేవాడు. ఈ సమయంలో 50 పుస్తకాలు చదవడం, 50 వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొనడం, భారతదేశంలో సుమారు 6,000 కిలోమీటర్లు ప్రయాణించి వివిధ రంగాల నిపుణులు, వ్యాపారవేత్తలను కలవడం వంటి సవాళ్లను విజయవంతంగా పూర్తి చేశాడు.భవిష్యత్తులో.. తన సంస్థను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా నిర్మించడమే లక్ష్యమని జైనమ్ చెబుతున్నాడు. విజయానికి వయస్సు అడ్డంకి కాదని, మంచి ఆలోచనలు, క్రమశిక్షణ, నిరంతర కృషి ఉంటే ఎవరైనా తమ కలలను నిజం చేసుకోవచ్చని అతను నమ్ముతున్నాడు. జైనమ్ జైన్ ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ, చిన్న వయస్సులోనే గొప్ప విజయాలను సాధించవచ్చని నిరూపిస్తోంది.ఇదీ చదవండి: నెలకు రూ.4 లక్షలు.. ఫ్రీగా థాయ్‌లాండ్ ట్రిప్! -
ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్‌లో అంబానీ, మిట్టల్
ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) చొరవతో ఏర్పాటైన ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్‌లో దేశీ కార్పొరేట్ దిగ్గజాలకు చోటు దక్కింది. వ్యవస్థాపక సభ్యులు, 44 మంది కమిషనర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఉన్నారు.ఈ కమిషన్‌కి రువాండా అధ్యక్షుడు పాల్ కగామే, సేల్స్‌ఫోర్స్ సీఈవో మార్క్ బెనియాఫ్లు కో–చెయిర్‌గా వ్యవహరిస్తారు. వాస్తవ ప్రపంచపు సవాళ్లను పరిష్కరించడంలో ఏఐ సామర్థ్యాలను వినియోగంలోకి తేవడానికి, దానిపై అవగాహన, నమ్మకాన్ని పెంచడానికి ఈ కమిషన్ పని చేస్తుంది. ఫౌండింగ్ మెంబర్‌గా సునీల్ మిట్టల్‌ని ప్రతిపాదించడంపై భారతి ఎంటర్ప్రైజెస్ హర్షం వ్యక్తం చేసింది. -
ఏఐ ఫిట్నెస్ యాప్స్‌ని నమ్మొచ్చా?
సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ ఫిట్నెస్ రంగంలోకి కూడా దూసుకొచ్చింది. మనం వ్యాయామం చేసే విధానాన్ని, లైఫ్‌స్టైల్‌ను ఇది పూర్తిగా మార్చేస్తోంది. ప్రతి ఒక్కరి శరీర తత్వానికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ వర్కవుట్ ప్లాన్స్ ఇవ్వడం, న్యూట్రిషన్ నియమాలను సూచించడం, రోజువారీ పురోగతిని ట్రాక్ చేస్తూ రియల్–టైమ్ సమాచారాన్ని అందించడం వంటి ఎన్నో ఫీచర్ల తో ఏఐ యాప్స్ సరికొత్త ట్రెండ్‌ను సృష్టి్టస్తున్నాయి. అయితే ఈ ఏఐ ఫిట్నెస్ యాప్స్‌తో లాభాలెన్నో.. నష్టాలు కూడా అదేవిధంగా ఉంటాయంటున్నారు ఫిట్నెస్ నిపుణులు.ఏఐ యాప్స్ డేటాను విశ్లేషించడంలో ఎంత నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ, ఒక హ్యూమన్ కోచ్ స్థానాన్ని భర్తీ చేయలేవు. ఉదాహరణకు, ఎవరైనా డెడ్‌లిఫ్ట్ వ్యాయామం చేస్తున్నప్పుడు.. పొడవాటి కాళ్లు ఉన్న వ్యక్తి చేసే విధానం, పొట్టిగా ఉండే వ్యక్తి చేసే విధానం వేరువేరుగా ఉంటాయి. ఒక మంచి ఫిట్నెస్ కోచ్ మాత్రమే ఈ శారీరక వ్యత్యాసాలను గమనించి సరైన గైడెన్స్ ఇవ్వగలరు. కానీ ఏఐ యాప్స్ ఈ తేడాలను గుర్తించలేక, కరెక్ట్‌గా చేస్తున్నా తప్పు అని చెప్పే ప్రమాదం ఉంది.అంతేకాకుండా, గతంలో ఏవైనా గాయాలు అయ్యాయా? బాడీలో ఎక్కడైనా నొప్పి ఉందా? లేదా అలసట కారణంగా తప్పుగా చేస్తున్నారా? అనే మానవీయ కోణాలను ఏఐ అర్థం చేసుకోలేదు. ఇవి కేవలం మీ ఫిట్నెస్ను మెరుగుపరచడానికి మాత్రమే, ఏదైనా అనారోగ్యం లేదా గాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే.ఫోన్ లో సులభంగా ఫిట్నెస్ ప్లాన్ కావాలనుకునే వారికి, క్రీడాకారులకు ఏఐ యాప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాయామాన్ని మరింత సరదాగా మార్చుకోవడానికి ఇవి చక్కటి సాధనాలు. అయినప్పటికీ, ఒక ప్రొఫెషనల్ ఫిట్నెస్ కోచ్ పర్యవేక్షణలో వీటిని వాడుకుంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఏఐ ఫిట్నెస్ యాప్స్ చాలా అద్భుతమైనవే.. కానీ అవి ఎప్పటికీ ఒక నిజమైన కోచ్‌కి ప్రత్యామ్నాయం కాలేవు. -
షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌కు హాలీవుడ్ ఆఫర్!
చైనాలోని యునాన్ ప్రావిన్స్‌కు చెందిన లియు జియు కొంత కాలం ట్రైన్ డ్రైవర్‌గా పనిచేశాడు. అతడికి ఒకరోజు షార్ట్ ఫిల్మ్ తీయాలనిపించింది. యాభై వేల (మన కరెన్సీలో) కంటే తక్కువ ఖర్చుతో 3.5 నిమిషాల ఏఐ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించాడు. సదరు ఈ షార్ట్‌ఫిల్మ్ సూపర్ హిట్ కావడమే కాదు ఏకంగా హాలివుడ్ దృష్టిని ఆకర్షించింది.‘జాంబీ స్కావెంజర్’ అనే ఈ ఏఐ ఫిల్మ్‌ను పది రోజుల్లో రూపొందించాడు లియు జియు. ఒక రోబో, మనిషి బొమ్మ చుట్టూ అల్లుకున్న కథ తో రూపొందించిన ఈ షార్ట్‌ఫిల్మ్ చైనీస్ సోషల్ మీడియా ΄్లాట్‌ఫామ్ ‘డౌయిన్’లో విడుదలైంది. హాలీవుడ్‌కు చెందిన ఏఐ చిత్ర నిర్మాత పీజే అక్సెటురో ఆన్లైన్లో ‘జోంబీ స్కావేంజర్’ను ప్రశంసించిన తరువాత ఈ షార్ట్‌ఫిల్మ్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.‘నేను చూసిన అత్యుత్తమ షార్ట్ ఫిల్మ్స్‌లో జాంబీ స్కావెంజర్ ఒకటి. దర్శకుడిని ఎవరైనా కనుగొనగలిగితే, దయచేసి అతని సోషల్ మీడియా లింక్‌ను పంపండి. నేను అతడితో పని చేయాలనుకుంటున్నాను’ అని రాశాడు ఆక్సెటురో. ‘జాంబీ స్కావెంజర్’ ప్రపంచ వ్యాప్తం గా 60 మిలియన్ వ్యూస్‌ను దాటింది. -
పెళ్లి పేరుతో మోసం.. యువకుడి అరెస్ట్
హైదరాబాద్, నాగోలు: సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, ఏఐ ఫోటోలను ఉపయోగించి ఆర్మీ అధికారినని నమ్మిస్తూ ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిని గురువారం నాగోలు పోలీసులు అరెస్టు చేశారు.నాగోలు ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన మేరకు.. నాగోలు ఆనంద్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు సోషల్ మీడియా ద్వారా శామీర్‌పేట్‌కు చెందిన ముకేరా గోవర్ధన్ (29) పరిచయమయ్యాడు. తాను భారత సైన్యంలో అధికారినని చెప్పి ఏఐ ఫోటోలను పంపి నమ్మించాడు. ఆ తరువాత ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పాడు.ఈ క్రమంలో యువతితో సహజీవనం సాగించాడు. తండ్రి చికిత్స కోసం డబ్బు అవసరం ఉందని పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడు. ఆ తరువాత పెళ్లి గురించి నిలదీయగా బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు నాగోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా నిందితుడికి ఇప్పటికే వివాహం జరిగిన విషయం విచారణలో బయటపడింది. అంతేకాక, గత ఏడాది ఆల్వాల్‌కు చెందిన మరో మహిళను కూడా పెళ్లి పేరుతో మోసం చేసి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచి్చనట్లు పోలీసులు గుర్తించారు. -
ప్రపంచ శక్తిగా 'యువ భారత్'
ప్రపంచ దేశాల్లో పెరిగిన ఇండియా ప్రాధాన్యం, చైనా ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, ప్రపంచవ్యాప్త జననాల రేటు క్షీణత వంటి కీలక అంశాలను ప్రముఖ ఆర్థికవేత్త టేలర్ కోవెన్ ఈ పాడ్‌కాస్ట్‌లో చర్చించారు. సాంకేతిక రంగంలో ఏఐ అభివృద్ధి వేగానికీ– మానవ వ్యవస్థల నెమ్మదితనానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషించారు:సవాళ్లున్నా అవకాశాలు ఎన్నో!ఇండియా ప్రాథమికంగా లాభదాయకమైన స్థితిలో ఉంది. చైనా కోల్పోతున్న యువ జనాభా బలాన్ని ఇండియా కలిగి ఉంది. ఎంతో నైపుణ్యం ఉండి, ఇంగ్లి ష్లో మాట్లాడగలిగే సాంకేతిక రంగానికి చెందిన భారతీ యులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. చైనాకు వ్యతిరేకంగా ఒక దృఢమైన శక్తిగా ఇండియా విజయం సాధించాలని అమెరికా, దాని మిత్రదేశాలు గట్టిగా కోరు కుంటున్నాయి. అయితే, మౌలిక సదుపాయాల కొరత, ప్రభుత్వ నిబంధనల వల్ల జరుగుతున్న జాప్యం, వందల కోట్ల మంది ప్రజలకు నాణ్యమైన ఉపాధిని కల్పించడం వంటి పెద్ద అంతర్గత సవాళ్లను భారతదేశం ఇంకా ఎదుర్కొంటూనే ఉంది.వృద్ధాప్య సంక్షోభంలో ‘డ్రాగన్’నేను చైనా వైపు చూసినప్పుడు, ఒకప్పుడు అద్భుతమైన వృద్ధిని సాధించి, ప్రస్తుతం అలవిమాలిన నిర్మాణాత్మక సమస్యలను ఎదుర్కొంటున్న దేశం నాకు కనిపిస్తుంది. వారి భారీ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంక్షోభం, వేగంగా వృద్ధాప్యానికి చేరుకుంటున్న జనాభా, తీవ్రమైన రాజ కీయ కేంద్రీకరణల వల్ల వారు ఇకపై ఎవరూ ఆపలేనంత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగే పరిస్థితి లేదు. చైనా ప్రపంచ వ్యవస్థను శాసిస్తుందని అనేవారు ఉంటే ఉండొచ్చు. వాస్తవానికి చైనా తన ఆర్థిక ఒత్తిళ్లు, తగ్గిపోతున్న కార్మిక శక్తిని నెట్టుకురావటం అనే సమస్యలతో సతమతమవుతోంది. వారు ఒక బలమైన శక్తి అనడంలో సందేహం లేదు, కానీ వారిని ఎవరూ ఎదిరించలేనంత మహా బలవంతులుగా భావించాల్సిన అవసరమైతే లేదు.పిల్లలు వద్దనుకుంటున్నారు!విశ్వవ్యాప్తంగా జననాల రేటులో ఒక భారీ క్షీణతను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది కేవలం ఆర్థికపరమైన సమస్య మాత్రమే కాదు ఒక సాంస్కృతిక సమస్య కూడా. సమాజాలు మరింత సంపన్నంగా మారి, వ్యక్తు లకు మరింతగా వ్యక్తిగత స్వేచ్ఛ లభిస్తున్న కొద్దీ, పిల్ల లను కనడం వల్ల కోల్పోయే ఇతర అవకాశాలకు ప్రాధాన్యమివ్వటం అనేది విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ‘ఎంపికల వల్ల వచ్చిన సంక్షోభం’. ఇది రాబోయే శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయ బోతోంది.ఏఐ వేగాన్ని అందుకోలేకున్నాం!ప్రజలు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్.ఎల్.ఎం.)కు ఉన్న అద్భుతమైన తెలివితేటలను చూసి, మన జీవితా ల్లోని ప్రతిదీ రాత్రికి రాత్రే మారిపోతుందని అనుకుంటారు. కానీ వారు మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఏఐ ఇంకా మన ప్రస్తుత ప్రపంచంలోని భౌతిక, ప్రభుత్వ నిబంధనల పరిమితుల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఒక వ్యాపార సంస్థ కొత్త ఏఐ పని విధా నాన్ని అమలు చేయాలనుకుంటే, వారు ఇప్పటికీ ప్రభుత్వ నిబంధనల అనుమతులు, పాత సాఫ్ట్వేర్ అప్ డేట్లు, సిబ్బంది అలసత్వం వంటి వాటిని దాటుకుని రావాల్సి ఉంటుంది.‘మనసున మనసై’తేనే విలువఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఎవరికైనా మేధోశక్తి ఉచితంగా, సులభంగా లభించే ఈ రోజుల్లో, సాధారణ ఐక్యూకి పూర్వపు గుర్తింపు, విలువ తగ్గిపోతాయి. సాంకేతిక రంగాలలో సగటు మానవుడి కంటే ఒక యంత్రం మెరుగ్గా ఆలోచించగలిగినప్పుడు, ఇక సమాజంలో అరుదైనదిగా ఏది మిగులుతుంది? నా దృష్టిలో దానికి సమాధానం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, నమ్మశక్యత, విభిన్న విషయాలను సమన్వయం చేసే నైపుణ్యం, లోతైన మానవ సంబంధాలే. కంప్యూటర్ కోడింగ్ ద్వారా సృష్టించలేనివి లేదా స్క్రీన్ ద్వారా అనుకరించ లేనివి మాత్రమే భవిష్యత్తులో అత్యంత విలువైనవిగా మారుతాయి. - ఎడిటోరియల్ టీమ్ -
ఫిగ్మాలో కొత్త ఫీచర్లు..
కొలాబరేటివ్ వెబ్ అప్లికేషన్ ప్లాట్‌ఫామ్ ‘ఫిగ్మా’ ఎన్నో కొత్త ఫీచర్లను ప్రకటించింది. కోడింగ్, యానిమేషన్, ఏఐ–ఎఫెక్ట్స్, వర్క్‌ఫ్లో ఆటోమేషన్‌ను నేరుగా డిజైన్ ప్లాట్ఫామ్లలోకి తీసుకువచ్చే టూల్స్‌ను పరిచయం చేసింది. ఫిగ్మా ప్రకటించిన ఆసక్తికరమైన ఫీచర్లలో ‘కోడ్ లేయర్స్’ ఒకటి.కోలాబరేటివ్ కాన్వాస్‌లో డిజైన్ ఎలిమెంట్స్‌ను ఇంటరాక్టివ్ కోడ్–బేస్డ్ కంపోనెంట్స్గా కన్వర్ట్ చేయడానికి యూజర్లకు ఉపకరించే ఫీచర్ ఇది. డిజైనర్లు, డెవలపర్లు,ప్రాడక్ట్ టీమ్‌లకు ఉపయోగపడేలా ఈ ఫీచర్‌ని డిజైన్ చేశారు. ‘ఫిగ్మా మోషన్’ పేరుతో కొత్త యానిమేషన్ సిస్టమ్‌ను కూడా పరిచయం చేశారు.షేడర్ ఫీల్స్, ఎఫెక్ట్స్‌లతో తన ఏఐ టూల్ కిట్‌ను కూడా విస్తరిస్తోంది ఫిగ్మా. టెక్ట్స్ప్రాంప్ట్స్, రిఫరెన్స్ ఇమేజ్‌లతో యూజర్లు విజువల్ ఎఫెక్ట్స్‌ను సృష్టించవచ్చు. నేచురల్ లాంగ్వేజ్ప్రాంప్ట్స్ ఉపయోగించడం ద్వారా కస్టమ్స్ టూల్స్‌ను క్రియేట్ చేసే ‘జెనరేటివ్ ప్లగిన్స్’ ఫీచర్‌ను కూడా ప్రకటించింది ఫిగ్మా. -
ఏఐ ఆధారిత ఈ–క్రాప్ అట!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ పాలనలో ఈ–క్రాప్ నమోదు మొక్కుబడి తంతుగా మారింది. నమోదులో జరుగుతున్న జాప్యం.. రైతుల పాలిట శాపంగా మారుతోంది. సాగు చేసిన పంట ఉత్పత్తులను మద్దతు ధరకు అమ్ముకోవడం, వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం, సున్నా వడ్డీ రాయితీ వంటి సంక్షేమ పథకాలు పొందడంలో కీలకమైన ఈ–క్రాప్ నమోదును రాష్ట్ర ప్రభుత్వం ఏటా తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. జూన్ 1నుంచి సెప్టెంబర్ 15వ తేదీలోగా ఈ–పంట నమోదు పూర్తి చేయాల్సి ఉంది. జూలై మొదటి వారం వచ్చినా ఇప్పటివరకు అధికారికంగా నమోదు ప్రారంభం కాని దుస్థితి నెలకొంది. ఖరీఫ్ సాగు లక్ష్యం 77.10 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 11.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అయినా ఇప్పటివరకు ఒక్క ఎకరా కూడా ఈ–క్రాప్ నమోదు కాలేదు. యాప్‌లో ఏటా కొత్త ఫీచర్స్ తీసుకొస్తున్న వ్యవసాయ శాఖ సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో చతికిలపడుతోంది. నిబంధనలు పేరిట ఆంక్షలు జాతీయ స్థాయిలో డిజిటల్ క్రాప్ సర్వేతో అనుసంధానించిన యాప్ ద్వారా నూరు శాతం పంట వివరాలు నమోదు చేయాలనే మార్గదర్శకాలు క్షేత్రస్థాయి సిబ్బందికి అశనిపాతాలుగా మారాయి. 2026–27 వ్యవసాయ సీజన్లో ఈ–క్రాప్ సర్వేకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం వెబ్‌ల్యాండ్‌లోని రైతువారీ ఖాతాలు, సీసీఆర్సీ డేటా, ఆర్వోఎఫ్ఆర్, డేటా, ఈ–ఫిష్ డేటా ఆధారంగా ల్యాండ్ పార్సిల్స్‌ను నమోదు చేయాలి. ప్రభుత్వ, లీజు, ఇతర అభ్యంతరకర భూముల్లో సాగుచేసే పంటల వివరాలను కూడా నమోదు చేయాలి.సర్వే నంబర్ల వారీగా పంటసాగులో ఉన్న భూములతోపాటు సాగులో లేని భూములు, ఆక్వా సాగు, బీడు, వ్యవసాయేతర భూ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. 0.25 ఎకరాల కంటే తక్కువ భూముల్లో పంటల వివరాలను సైతం నమోదు చేయాల్సిందే. పంట ఉన్నా లేకపోయినా భూ కమతాల వివరాలు నమోదు చేయాల్సిందే. గతేడాది నమోదైన అరటి, కొబ్బరి, మామిడి వంటి బహు వార్షిక ఉద్యాన పంటలతో పాటు పొలం గట్లపై ఉండే చెట్లు, ఇతర పంటల వివరాల నమోదును తప్పనిసరి చేశారు. 20 మీటర్ల పరిధిలో జియో ఫెన్సింగ్‌తో ఫొటోలు అప్లోడ్ చేయాలి. పరిష్కారం కాని, సర్వే పూర్తికాని గ్రామాలు, అభ్యంతరకరమైన ల్యాండ్ పార్శిల్స్‌లో పంట వివరాల నమోదు విషయంలో పూర్తి బాధ్యతను ఎంఏవో, తహసీల్దార్, డీఏవోలకు అప్పగించారు. తొలిసారి ఏఐ ఆధారిత ఇమేజ్ ప్రొసెసింగ్ ఈసారి 100 శాతం ఫొటో ధ్రువీకరణ కోసం కృత్రిమ ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. మూడు దశల్లో ఎస్ఎంఎస్ ద్వారా రైతులకు తెలియజేయడంతోపాటు రైతుల ఈ–కేవైసీ ధ్రువీకరణ చేయాలని నిర్ణయించారు. పంట సాగుదారుల హక్కు పత్రాల(సీసీఆర్సీ) ఆధారంగానే కౌలు రైతులు సాగు చేసిన పంట వివరాలను నమోదు చేస్తారు. రైతులకు సొంతంగా ఈ పంట నమోదుకు అవకాశం కల్పించారు. అయితే ఈ–కేవైసీ నమోదు బాధ్యతను ఆర్బీకే సిబ్బందికి అప్పగించారు. సీసీఆర్సీ కార్డుల ఆధారంగానే కౌలు రైతులు సాగు చేసిన పంట వివరాలు నమోదు చేయాలనే నిబంధన విధించారు. ఆర్బీకే సిబ్బందిపై పనిఒత్తిడి షెడ్యూల్ ప్రకారం జూన్ 1నుంచి ప్రారంభించి సెపె్టంబర్ 15వ తేదీలోగా ఈ–క్రాప్, ఈ–కేవైసీ నమోదు పూర్తి చేయాలి. అక్టోబర్ 1 నుంచి 8వ తేదీ వరకు సోషల్ ఆడిట్లో భాగంగా ఆర్బీకేల్లో ఈ–క్రాప్ జాబితాలను ప్రదర్శించి గ్రామసభలు నిర్వహించాలి. 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్ 15న తుది జాబితాను ప్రదర్శించాలి. వీఏఏ, వీఆర్ఏ, సర్వేయర్లతో కూడిన సంయుక్త అజమాయిషీ కింద నమోదు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ పనిభారాన్ని పూర్తిగా ఆర్బీకేలలో పనిచేసే వీఏఏలపైనే నెడుతున్నారు. ఓ వైపు విత్తనాలు, ఎరువులు, సర్వేలు అంటూ తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న వీఏఏలకు ఈ–క్రాప్ నమోదు భారంగా మారుతోంది. -
ఐటీ కంపెనీల ఆదాయాలకు ఎఫెక్ట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల సంస్థల ఆదాయాలు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంవోఎస్‌ఎల్) ఒక నివేదికలో పేర్కొంది. స్థూల పరిస్థితులు, కృత్రిమ మేథ (ఏఐ), భౌగోళిక రాజకీయాంశాలు క్లయింట్ల డిస్క్రెషనరీ వ్యయాలపైనా, అవి తీసుకునే నిర్ణయాలపైనా ప్రభావం చూపుతుండటం ఇందుకు కారణాలు కాగలవని వివరించింది.క్లయింట్లు నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం, ఆచితూచి ఖర్చు చేస్తుండటంలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయంటూ యాక్సెంచర్ ఇటీవల పేర్కొనడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని ఎంవోఎస్‌ఎల్ వివరించింది. క్యూ1 పనితీరు ముందుగా అంచనా వేసిన దానికన్నా తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నట్లు కేపీఐటీ టెక్నాలజీస్ సైతం వెల్లడించిన నేపథ్యంలో ఎంవోఎస్‌ఎల్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ కారణాలరీత్యా క్యూ1లో డిమాండ్ నెమ్మదించి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. రెండో త్రైమాసికం కూడా అదే విధంగా ప్రారంభం కావొచ్చని వివరించింది. క్యూ1లో ఐటీ కంపెనీలు తామిచ్చిన గైడెన్స్ గరిష్ట స్థాయిని కుదించవచ్చని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: వాట్సాప్ యూజర్‌నేమ్ వ్యవహారం.. కేంద్రం నోటీసులు హెచ్సీఎల్టీ వృద్ధి గైడెన్స్‌ని 100 బేసిస్ పాయింట్ల మేర కుదించవచ్చు. ఇన్ఫోసిస్ 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 1.5–3 శాతానికి పరిమితం చేయొచ్చు. త్రైమాసికాలవారీగా స్థిర కరెన్సీ ప్రాతిపదికన లార్జ్ క్యాప్ సంస్థల వృద్ధి 2 శాతం వరకు ఉండొచ్చు, మిడ్–క్యాప్స్ మళ్లీ రాణించి, 4.8 శాతం వరకు వృద్ధి నమోదు చేయొచ్చు. వివిధ విభాగాలవారీగా చూస్తే మెరుగైన డీల్స్ దన్నుతో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) పటిష్టంగా ఉంటోంది. హై–టెక్ విభాగం మిశ్రమంగా కనిపిస్తోంది. ఇది చదివారా? ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా? -
SBI యోనో యాప్‌లో కొత్తగా ఏఐ ఫీచర్లు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ 71వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రిటైల్, బిజినెస్ కస్టమర్ల కోసం పలు ఏఐ ఆధారిత డిజిటల్ ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది. యోనో ప్లాట్‌ఫాంలో సేవలను మరింతగా విస్తరించింది. కొత్త కస్టమర్లు ఇప్పుడు 3–ఇన్–1 డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ ద్వారా పొదుపు ఖాతాతో పాటు ఎస్బీఐక్యాప్ సెక్యూరిటీస్‌లో డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా కూడా తెరవచ్చు.అర్హత కలిగిన కస్టమర్లు తమ సేవింగ్స్ అకౌంటును కార్పొరేట్ శాలరీ అకౌంటుగా మార్చుకోవచ్చు. అలాగే వ్యాపార వర్గాల కోసం ట్రేడ్ ఫైనాన్స్ సాధనాలన్నింటిని యోనో బిజినెస్‌లో అనుసంధించడం ద్వారా ఈ–ట్రేడ్ సేవలను విస్తరించినట్లు బ్యాంకు తెలిపింది. యోనో బిజినెస్ వెబ్, మొబైల్ ప్లాట్‌ఫాంలలో ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉండేలా ఏజెంటిక్ ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ ’యోనో జీ’ని బ్యాంకు ప్రవేశపెట్టింది.కృత్రిమ మేథ, డిజిటల్ ఆవిష్కరణలు, డేటా ఆధారిత విశ్లేషణలతో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించాలన్న తమ లక్ష్యానికి ఇవి నిదర్శనమని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఎస్బీఐకి 53 కోట్ల పైగా కస్టమర్లు ఉండగా, వారిలో 10 కోట్ల మంది యోనో యూజర్లు ఉన్నారు. -
వాహనదారులూ జాగ్రత్త.. లేదంటే ఏ'ఐ’ పట్టేస్తుంది!
వాహనదారులూ జాగ్రత్త..ఇక మీరు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ‘ఏఐ’ పట్టేస్తుంది. ట్రాఫిక్ పోలీసులు లేరు కదా అనుకుని..మీరు ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే ఇక నడవదు. మీ ఉల్లంఘనలను ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. చలాన్ వడ్డిస్తాయి. ఆ సమాచారం మీకు నేరుగా వాట్సప్ ద్వారానో..మెసేజ్ రూపంలోనో..మెయిల్గానో వచ్చేస్తుంది. – సాక్షి, హైదరాబాద్ట్రాఫిక్ విభాగంలోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకోవాలని మల్కాజ్గిరి పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బేగంపేటలో రెండు నెలల పాటు పైలెట్ ప్రాజెక్ట్‌ను నిర్వహించిన పోలీసులు..సత్ఫలితాలు రావడంతో కమిషనరేట్‌లో అమలు చేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులను ఆయా రోడ్లపై ఉన్న ‘ఏఐ సీసీటీవీ కెమెరాలు’ గుర్తించి..వివరాలను నేరుగా సెంట్రల్ కంట్రోల్ రూమ్ సర్వర్‌కు పంపిస్తాయి. అక్కడున్న సిబ్బంది ట్రాఫిక్ ఉల్లంఘన, ప్రమాదం తీరు, వాహనం నంబర్, యజమాని వివరాలు తదితరాలను విశ్లేషించి.. యాక్సెప్ట్ చేయగానే నేరుగా వాహనదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మెసేజ్, వాట్సాప్ రూపంలో అలాగే ఈ–మెయిల్ ఐడీలకు మెయిల్ రూపంలో చలాన్ వెళ్లిపోతుంది.1.27 లక్షల కేసులు.. రూ.6.73 కోట్ల జరిమానాఅన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఒకేసారి దృష్టిపెట్టడంతో వాహనదారులకు అవగాహన రావడం లేదని భావించిన పోలీసులు.. ప్రతి రోజూ ఒకట్రెండు ఉల్లంఘనలు తీసుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల్లో కమిషనరేట్ పరిధిలో 1,27,760 కేసులు నమోదు కాగా.. రూ.6.73 కోట్ల జరిమానాలు విధించారు. వీటిల్లో అత్యధికంగా అక్రమ పార్కింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ ఉల్లంఘనలు ఉన్నాయి.కీలక ప్రాంతాల్లో 75 కెమెరాలుబేగంపేటలో రెండు బహుళ జాతి కంపెనీల సాంకేతిక, నిధుల సహాయంతో నాలుగు సీసీటీవీ కెమెరాలకు ఏఐ జోడించి, రెండు నెలలు పరీక్షించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, ప్రమాదాల తీరు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్లు గుర్తించడంలో సత్ఫలితాలొచ్చాయి. దీంతో మల్కాజ్గిరి కమిషనరేట్‌లోని కీలక కూడళ్లు, ప్రాంతాలలో 75 కెమెరాలకు ఏఐ జోడించి, వినియోగించుకోనున్నారు. ఈ ఏఐ ట్రాఫిక్ పోలీసు విభాగంలోకి ఇటీవల కొత్తగా నియమితులైన ఎస్ఐలలో బీటెక్, ఎంటెక్ చదివిన వారిని తీసుకోనున్నారు.వారి సేవలు ఇతర విభాగాల్లో.. ఇప్పటివరకు రోడ్లపై ట్రాఫిక్ ఉల్లంఘనదారులను పట్టుకునేందుకు క్షేత్ర స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు ఉండేవారు. ఇక నుంచి ఏఐ ట్రాఫిక్ చలాన్లు జారీ చేయనుండటంతో.. సిబ్బంది సేవలను రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి ఇతర విభాగాలలో వినియోగించుకోనున్నాం. – రాహుల్ రెడ్డి, డీసీపీ, ట్రాఫిక్–1, మల్కాజ్గిరి -
టాలీవుడ్లో ఫస్ట్ ఏఐ మూవీ.. ఆసక్తిగా పోస్టర్
తెలుగు సినీ పరిశ్రమలో వస్తోన్న పూర్తిస్థాయి తొలి ఏఐ మూవీ 'అంబాస్ రివెంజ్'. ఈ సినిమాకు జయవర్ధన్ మడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని పూర్తిగా ఏఐ విజువల్ ఫీస్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. ఏఐ డిజైన్ డెవలప్మెంట్ను 'కాలై విజువల్ స్టూడియోస్' అందిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పూర్తి స్థాయి కృత్రిమ మేధ సహకారంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా అంబాస్ రివెంజ్ నిలవనుంది.భారత ఇతిహాసమైన మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పురాణ గాథను ఆధునిక దృక్పథంతో, అత్యాధునిక ఏఐ సాంకేతికతను మేళవించి వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు సినిమాకు ఇది ఒక కొత్త ప్రయోగాత్మక అధ్యాయానికి నాంది అని దర్శకుడు జయవర్ధన్ తెలిపారు. ఈ చిత్ర నిర్మాణంలో పలు దశల్లో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని.. ముఖ్యంగా విజువల్ డిజైన్, పాత్రల రూపకల్పన, కథా రూపాంతరం వంటి అంశాల్లో ఆధునిక ఏఐ సాధనాలను ఉపయోగించి వినూత్న కథనాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. ఈ టైటిల్ పోస్టర్ విడుదలతో చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే తొలి అడుగు పడిందని, సినిమా విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని దర్శకుడు జయవర్ధన్ వెల్లడించారు. టాలీవుడ్లో ఫస్ట్ టైమ్ ఏఐ ఆధారిత మూవీ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. -
18 ఏళ్ల వయసులోనే ఇలాంటి విజయాలా?
ఇంటర్మీడియట్ అనగానే మార్కులు, ర్యాంకుల చుట్టూ తిరిగే ఒక రేస్. ఆ రేస్ పూర్తవ్వగానే ఇంజనీరింగ్‌లో చేరి.. ఓ నాలుగేళ్ల పాటు క్లాసులు అటెండ్ అయి, బోర్డు పైన లెక్చరర్లు రాసిన సబ్జెక్ట్ నోట్ బుక్‌లలో రాసుకొని, బట్టి పట్టేసి, సెమిస్టర్ పరీక్షలు రాసి, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏదో ఒక ఉద్యోగం ప్రయత్నించడం.. మనకు తెలిసిన విద్యావిధానం ఇదే. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. కాలేజీ చదువుకు తోడుగా సరైన స్కిల్స్ కూడా తోడైతే, డిగ్రీ చేతికి వచ్చేదాకా ఆగాల్సిన పనిలేదు. కేవలం పద్దెనిమిదేళ్ల వయసులోనే టెక్నాలజీ ద్వారా వాస్తవ ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారాలు చూపించవచ్చని NIAT అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రాక్టికల్ శిక్షణ పొందుతున్న నేటి ఇంజనీరింగ్ విద్యార్థులు నిరూపిస్తున్నారు.ఐఐటీలు, ఐఐఎంలు, ఏకంగా ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెషనల్స్‌ను సైతం ఆశ్చర్యపరుస్తూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వీరు సత్తా చాటుతున్నారు. ఇంజనీరింగ్ చదువుకుంటూనే, తమ మొదటి, రెండు సంవత్సరాల్లోనే 'NIAT' అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ సాయంతో ఈ విద్యార్థులు సాధిస్తున్న విజయాలు, వీరు తయారుచేస్తున్న ప్రొడక్ట్స్ చూస్తుంటే.. "మన పిల్లలు కూడా ఇలా ఆలోచించగలరా?" అని ప్రతి తల్లిదండ్రీ ఆశ్చర్యపోవాల్సిందే. ఆ విజయాల వెనుక ఉన్న స్ఫూర్తిదాయకమైన కథలేంటో చూద్దాం..అంతర్జాతీయ స్థాయిలో 19 ఏళ్ల తెలుగమ్మాయికి అరుదైన గుర్తింపు:ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికీ 'గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్' ఒక కల. ఇందులో ఎంపికైతే గూగుల్ ప్రాజెక్ట్‌లకే నేరుగా మన కోడ్ రాయవచ్చు. ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్‌కు 131 దేశాల నుంచి 15,245 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, ఫైనల్‌గా ఎంపికైన 1,141 మందిలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న గుత్తా సోనికా చౌదరి నిలిచింది."పరీక్షల కోసం బట్టీ పట్టే విధానం నుంచి బయటపడి, నిజమైన ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నాను. NIATతో నాకు లభించిన ప్రాక్టికల్ వాతావరణం, అక్కడి మెంటార్ల గైడెన్స్ నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ ఏజ్ లోన్ ఒక గ్లోబల్ ప్రాజెక్ట్‌కు కంట్రిబ్యూట్ చేసే స్థాయికి రావడం వెనుక ఆ పునాదే కారణం" అని గర్వంగా చెబుతోంది సోనిక.అంబులెన్స్‌లకు ప్రాణం పోస్తున్న 'ఏఐ' టెక్నాలజీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన 'ఓపెన్ ఏఐ అకాడమీ బిల్డథాన్'. దేశవ్యాప్తంగా 70 వేల మంది రిజిస్టర్ చేసుకోగా.. ఫస్ట్ ఇయర్ చదువుతున్న NIAT స్టూడెంట్స్ టీమ్ టాప్ ఇన్నోవేటర్స్‌గా నిలిచింది. వీరు అంబులెన్స్‌లకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆటోమేటిక్‌గా దారి క్లియర్ చేసే ఒక అద్భుతమైన 'ఏఐ ట్రాఫిక్ సిస్టమ్'ను (ప్రాజెక్ట్-K) డిజైన్ చేసి ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు."ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకుపోవడం చూసినప్పుడల్లా ఏదైనా చేయాలనిపించేది. NIAT 5.0 ల్యాబ్స్‌లో మేము టెక్నాలజీ నేర్చుకుంటున్నప్పుడు.. దీన్ని ప్రాక్టికల్‌గా ఆ సమస్య పరిష్కారానికి వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. మా మెంటార్ల సపోర్ట్‌తో ఆ కోడ్ రాసి, సిస్టమ్‌ను డిజైన్ చేశాం." అని ఆ టీమ్ సభ్యులు వివరించారు.కోమాలో ఉన్న వారి భావోద్వేగాలను తెలుసుకునేలా..సాధారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సిలబస్ అర్థం చేసుకోవడానికే ఇబ్బంది పడుతుంటారు. కానీ, NIAT విద్యార్థులు 'న్యూరోనెక్సాస్ ఏఐ' పేరుతో హెల్త్‌కేర్‌ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఒకచోట చేర్చారు. ఈ సిస్టమ్ రియల్ టైమ్‌లో ఒక వ్యక్తి మెదడు తరంగాలను రీడ్ చేసి, వాళ్లు ఏ ఎమోషన్ ఫీల్ అవుతున్నారో పసిగడుతుంది. టెక్నాలజీని సామాజిక ప్రయోజనం కోసం ఎలా వాడాలో ఈ యువత నిరూపించింది.ప్రాణాపాయ పరిస్థితుల్లో మనుషులకు బదులుగా 'హ్యూమనాయిడ్ రోబోట్'“మనుషులకు హాని కలిగించే ప్రదేశాలకు మనం ఇంకా మనుషులనే ఎందుకు పంపుతున్నాం?" - ఓ విద్యార్థి మదిలో మెదిలిన ఈ చిన్న ప్రశ్నే ఒక అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసింది. కెమికల్ లీక్స్, గ్యాస్ ఛాంబర్లు, కూలిపోయిన భవనాలు, బాంబ్ డిస్పోజల్ సైట్స్ లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనుషులకు బదులుగా పనిచేసే ఒక 'హ్యూమనాయిడ్ రోబోట్'ను NIAT విద్యార్థి ప్రోగ్రామ్ చేశాడు.ఆర్ఓఎస్, రాస్ప్ బెర్రీ పై సాయంతో రూపొందిన ఈ రోబోట్ ప్రమాదకర ప్రాంతంలో మనిషిలా పనిచేస్తుంటే.. దాన్ని ఆపరేట్ చేసే వ్యక్తి మాత్రం ఎక్కడో సురక్షితంగా ఉంటాడు.చదువుకునే వయసులోనే..స్టార్టప్ ఫౌండర్లుగాపాకెట్ మనీ కోసం అమ్మానాన్నలను అడిగే వయసులో, NIAT స్టూడెంట్స్ ఏకంగా స్టార్టప్‌లకు సీఈవోలుగా మారుతున్నారు. ఇప్పటికే 20కి పైగా స్టార్టప్ లను ప్రారంభించారు. అంతేగాక, ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ఇప్పటికే 2.87 కోట్ల రూపాయల స్టైపెండ్స్ సాధించారు. వీరిలో సచిన్ కీర్తి వాసు అనే విద్యార్థి 'గ్రోవిఫై ఏఐ' అనే స్టార్టప్‌ను ప్రారంభించి, కాల్ సెంటర్ల కోసం ఏఐ వాయిస్ ఏజెంట్‌ను సృష్టించాడు.హైదరాబాద్ టీ-హబ్‌లో జరిగిన 'బిజ్హ్యాక్' ఈవెంట్లోను సత్తా చాటాడు. నష్టాల్లో కూరుకుపోయి మూతపడే దశలో ఉన్న ఒక కంపెనీని తిరిగి లాభాల బాట పట్టించే మోడల్‌ను రూపొందించి, 25కి పైగా కాలేజీల నుంచి వచ్చిన 250 మంది పార్టిసిపెంట్స్‌తో పోటీ పడి విజేతగా నిలిచి ఏకంగా లక్ష రూపాయల బహుమతిని గెలుచుకున్నాడు."కేవలం ఉద్యోగం కోసమే చదవడం కాకుండా, సొంతంగా ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలని మా NIAT మెంటార్లు మాలో స్ఫూర్తి నింపారు. ఒక ఐడియా వస్తే, దాన్ని వెంటనే ఎలా అమలు చేయాలన్న ప్రాక్టికల్ అప్రోచ్ వల్లే..నేను ఫస్ట్ ఇయర్లోనే ఈ స్టార్టప్‌ను ప్రారంభించగలిగాను" అని సచిన్ తన సక్సెస్ జర్నీని పంచుకున్నాడు.తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇది ఒక మార్గదర్శకం!విజయాలు సాధించిన ఈ విద్యార్థులందరిలో ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్.. 'ప్రాక్టికల్ లెర్నింగ్'. పుస్తకాల్లోని థియరీని బట్టీ పట్టకుండా, వాస్తవ సమస్యలకు టెక్నాలజీ ద్వారా పరిష్కారాలు కనుక్కోవడం. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టే ప్రతి విద్యార్థీ.. తమ ఫోకస్‌ను కేవలం మార్కుల వైపే కాక, 'నైపుణ్యాల' పైన దృష్టి సారించాలి. విద్యార్థుల్లో ఆ ఇన్నోవేటివ్ ఆలోచనలను రేకెత్తించి, వారికి సరైన మెంటార్షిప్ ఇచ్చే NIAT లాంటి ఎకోసిస్టమ్‌ను ఎంచుకున్నప్పుడు.. భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఇలాంటి అద్భుతాలే సృష్టిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు!For more details: https://rebrand.ly/be7c36 -
మస్క్ హెచ్చరిక.. టిమ్ కుక్ షాక్!
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. అయితే ఈ సాంకేతిక విప్లవం కొత్త అవకాశాలను మాత్రమే కాదు, కొత్త సవాళ్లను కూడా తీసుకొస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత తీవ్రమవడంతో యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపుతోంది.యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ పరిస్థితిని 'వందేళ్లలో ఒకసారి వచ్చే వరద'తో పోల్చారు. గత 40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, తాను ఇప్పటివరకు చూసిన వాటిలో ఇదే అతిపెద్ద ధరల పెరుగుదల అని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే.. ప్రస్తుతం మెమరీ చిప్‌ల కొరత ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది.ఈ సమస్యకు ప్రధాన కారణం ఏఐ రంగం వేగంగా విస్తరించడం. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు భారీ డేటా సెంటర్ల నిర్మాణానికి వందల బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం. ఈ డేటా సెంటర్లకు అధిక సామర్థ్యం గల మెమరీ చిప్‌లు అవసరం అవుతున్నాయి. ఫలితంగా చిప్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని ఎక్కువగా ఏఐ సర్వర్ల కోసం కేటాయిస్తున్నాయి. దీంతో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్ల వంటి వినియోగదారుల ఉత్పత్తులకు అవసరమైన మెమరీ చిప్‌ల సరఫరా తగ్గిపోయింది.ప్రస్తుతం DRAM (యాప్‌లు పనిచేయడానికి ఉపయోగించే మెమరీ), NAND (ఫొటోలు, వీడియోలు, ఫైళ్లను నిల్వ చేసే స్టోరేజ్ చిప్‌లు) ధరలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ భారీ ధరల పెరుగుదల కారణంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ వ్యయం కూడా గణనీయంగా పెరిగింది.ఈ పరిస్థితుల్లో యాపిల్ చాలా కాలం వరకు అదనపు ఖర్చును వినియోగదారులపై మోపకుండా భరించింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి సాధ్యం కాకపోవడంతో కంపెనీ మ్యాక్‌బుక్, ఐమ్యాక్, ఐప్యాడ్, హోమ్‌ప్యాడ్, యాపిల్ టీవీ వంటి ఉత్పత్తుల ధరలను 15 నుంచి 25 శాతం వరకు పెంచింది.ఉదాహరణకు, మ్యాక్‌బుక్ ఎయిర్ ధర 200 డాలర్లు పెరిగి 1,299 డాలర్లకు చేరగా, మ్యాక్‌బుక్ ప్రో ధర 300 డాలర్లు పెరిగి 1,999 డాలర్లకు చేరింది. అలాగే ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. మైక్రోసాఫ్ట్ కూడా తన Xbox గేమింగ్ కన్సోళ్ల ధరలను 100 నుంచి 150 డాలర్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అంటే మెమరీ చిప్‌ల కొరత ప్రభావం మొత్తం టెక్నాలజీ పరిశ్రమపైనే పడుతోంది.ఈ సమస్యను పరిష్కరించాలంటే మెమరీ చిప్‌ల ఉత్పత్తిని భారీగా పెంచాలని ఎలాన్ మస్క్ సూచించారు. భవిష్యత్తులో ఏఐ అభివృద్ధికి మెమరీ చిప్లే అతిపెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందుకే టెస్లా, స్పేస్ఎక్స్, ఇంటెల్ కలిసి అత్యాధునిక చిప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికను కూడా ప్రకటించారు.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌కు భారీ నష్టం.. కారణం ఇదేనా? -
మైక్రోసాఫ్ట్‌కు భారీ నష్టం.. కారణం ఇదేనా?
మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటి. అయితే.. ఇటీవల ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోవడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. జూన్ నెలలో మాత్రమే మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 17 శాతం పడిపోగా, కంపెనీ మార్కెట్ విలువలో 570 బిలియన్ డాలర్లకు (రూ.53.9 లక్షల కోట్లు) పైగా తగ్గుదల నమోదైంది. డిసెంబర్ 2000 తర్వాత సంస్థకు ఇదే అతిపెద్ద నెలవారీ క్షీణత కావడం గమనార్హం.కంపెనీకి ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం.. కృత్రిమ మేధస్సు (AI)పై మైక్రోసాఫ్ట్ పెడుతున్న భారీ పెట్టుబడులు. గత కొన్నేళ్లుగా సంస్థ డేటా సెంటర్లు, ఏఐ చిప్స్, క్లౌడ్ సర్వీసులు, అలాగే కోపైలెట్ వంటి ఏఐ ఉత్పత్తుల అభివృద్ధి కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడులు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయని కంపెనీ నమ్ముతున్నప్పటికీ, పెట్టుబడిదారులు మాత్రం ఆ లాభాలు ఎప్పుడు వస్తాయనే విషయంలో ఆందోళన చెందుతున్నారు.ఇటీవల విడుదలైన త్రైమాసిక ఫలితాల్లో అజూర్ క్లౌడ్ సేవల వృద్ధి మార్కెట్ అంచనాల కంటే కొంత తక్కువగా ఉండడం కూడా పెట్టుబడిదారుల్లో నిరాశను కలిగించింది. అంతేకాకుండా.. రాబోయే నెలల్లో కూడా కంపెనీ భారీ స్థాయిలో పెట్టుబడులు కొనసాగిస్తామని ప్రకటించింది. దీంతో ఖర్చులు పెరుగుతున్నా, లాభాలు మాత్రం అదే వేగంతో పెరగడం లేదనే భావన మార్కెట్లో ఏర్పడింది.ఏఐ అనేది మైక్రోసాఫ్ట్‌కు ఒక గొప్ప అవకాశం అయినప్పటికీ, అదే సమయంలో ఒక సవాలుగా కూడా మారింది. భవిష్యత్తులో ఏఐ కారణంగా సంప్రదాయ సాఫ్ట్వేర్లపై డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఏఐ రంగంలో ముందుండాలంటే కంపెనీ నిరంతరం భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలు ప్రస్తుతం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.అయితే.. ఈ షేర్ పతనాన్ని అందరూ ప్రతికూలంగా చూడడం లేదు. కొంతమంది ప్రముఖ పెట్టుబడిదారులు, విశ్లేషకులు కొనుగోలుకు ఇది మంచి అవకాశమని భావిస్తున్నారు. గతంలో 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి ప్రసిద్ధి చెందిన పెట్టుబడిదారు మైఖేల్ బరీ కూడా మైక్రోసాఫ్ట్ షేర్లపై దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం మార్కెట్లో చర్చనీయాంశమైంది. ఆయన నిర్ణయం వల్ల కంపెనీ షేర్లు కొంత మేర కోలుకున్నాయి.మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఆదాయం రాబోయే సంవత్సరాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఏఐ రంగంలో కంపెనీకి ఉన్న బలమైన స్థానం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఇంకా ఉన్నాయి. అయితే ఇప్పుడు పెట్టుబడిదారులు కేవలం భారీ పెట్టుబడులు పెట్టడాన్ని కాకుండా, వాటి ద్వారా నిజంగా ఎంత లాభం వస్తుందో చూడాలని కోరుకుంటున్నారు.మైక్రోసాఫ్ట్ షేర్లు పడిపోవడం అంటే ఏఐ భవిష్యత్తు బలహీనపడిందని అర్థం కాదు. ఇది పెట్టుబడిదారుల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుకు సంకేతం మాత్రమే. ఒకప్పుడు ఏఐలో పెట్టుబడి పెడితే చాలు అనుకునే మార్కెట్, ఇప్పుడు ఆ పెట్టుబడుల వల్ల లాభాలు వస్తున్నాయా? అనే ప్రశ్నకు సమాధానం కోరుతోంది. అందుకే మైక్రోసాఫ్ట్‌కు ప్రస్తుతం ఎదురవుతున్న సవాలు ఏఐలో ముందుండటం మాత్రమే కాదు, ఆ పెట్టుబడులను స్థిరమైన లాభాలుగా మార్చి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మళ్లీ గెలుచుకోవడం కూడా. ఇదీ చదవండి: నా అంచనా తప్పింది.. కియోసాకి ట్వీట్! -
డేటా దండుపాళ్యం.. మీపై స్మార్ట్ నిఘా!
టెక్నాలజీ దూకుడు ఎక్కువయ్యాక ప్రపంచం ‘జగమంత స్మార్ట్ కుటుంబం’ అయిపోయింది. ఇళ్లు, వాకిళ్లు, వంటిళ్లు ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతున్నాయి. ఎయిర్ ఫ్రైయర్లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మిషన్లు, ఆఖరికి టూత్‌బ్రష్‌లను కూడా ఇంట్లోని నెట్ నడిపిస్తోంది. కానీ, ఈ సౌకర్యాలు, సదుపాయాల వెనుక మనకు తెలియకుండానే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని బ్రిటన్‌కు చెందిన ‘ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్’ (ఐసీవో), ‘విచ్’ అనే సంస్థ కలిసి ప్రత్యక్షంగా తమ దేశ పౌరులను, పరోక్షంగా ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నాయి.ఏమిటా ప్రమాదం?!డీప్ ఫ్రయింగ్, తందూరీ రోస్టింగ్–గ్రిల్లింగ్, రీహీటింగ్, బేకింగ్, బంగాళా దుంపల చిప్స్.. వీటన్నిటి తయారీకి వంటగదుల్లో మనం వినియోగించే ఎయిర్ ఫ్రయర్లు మన లొకేషన్‌ను ట్రాక్ చేస్తున్నాయని, మన మాటలను రికార్డ్ చేస్తున్నాయని, ఆ సమాచారాన్ని చైనాలోని సర్వర్లకు పంపుతున్నాయని ఆ మధ్య కొన్ని వార్తలు కలకలం రేపాయి. అయితే అవి కేవలం వార్తలు కావని, వాస్తవాలేనని ఐసీవో, విచ్ ఇప్పుడు నిర్ధారణగా ప్రకటించాయి! అలాగే, మన ఇళ్లల్లో రాత్రింబవళ్లు నడిచే స్మార్ట్ టీవీలు మనం ఎప్పుడు, ఏమి వీక్షిస్తున్నామో గమనిస్తూ మన వ్యక్తిగత వివరాలను ప్రకటనల కంపెనీలకు విక్రయిస్తున్నాయట!బ్రిటన్ లాంటి దేశాల్లోనే మూడింట ఒక వంతు ప్రజలు ఇంతకాలం తమ డేటా ఎలా చోరీ అవుతోందో కనిపెట్టలేకపోయారు. ఇక మన దేశంలోని పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించవచ్చు! భారత్‌లో ‘డిజిటల్ ఇండియా’ విప్లవం తర్వాత కోట్లాది మంది ప్రజలు ఇంటర్నెట్ వాడుతున్నారు కనుక మనపై స్పయింగ్కు సహజంగానే ఎక్కువ అవకాశం ఉంటుంది.మాటల్నీ రికార్డు చేస్తుంటాయి!టోస్టర్లు, ఎయిర్ ఫ్రయర్ల వంటి స్మార్ట్ పరికరాలు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ఉండవచ్చని ఐసీవో అప్రమత్తం చేశాక బ్రిటన్ ప్రజల్లో జాగ్రత్త మొదలైంది. అక్కడి జనాభాలో దాదాపు 97 శాతం మంది కనీసం ఒక స్మార్ట్ పరికరం వాడుతుండగా, అవసరమైన దానికంటే చాలా ఎక్కువ సమాచారాన్ని ఆ పరికరాలు వినియోగదారుల నుంచి సేకరిస్తున్నాయని ‘విచ్’ పరిశోధకులు వెల్లడించారు. ఇంటర్నెట్తో పనిచేసే కొన్ని ఎయిర్ ఫ్రయర్లు, ‘ఆన్’ చేయగానే వినియోగదారుల కచ్చితమైన లొకేషన్ అడుగుతాయి. అంతేకాదు వారి ఫోన్ల ద్వారా ఆడియోను (మాటలను) కూడా రికార్డ్ చేస్తుంటాయి. మరింతగా మెరుగైన సేవల్ని అందించటానికి వ్యక్తిగత వివరాలను సేకరిస్తుంటామని ఆ గాడ్జెట్లు చెబుతుంటాయి. అయితే అవి, తాము సేకరించిన సమాచారంలో కొంత భాగాన్ని చైనా సర్వర్లకు చేరవేస్తున్నట్లు ‘విచ్’ పరిశోధనలో బహిర్గతం అయింది.దినచర్యల వివరాలు సైతం!!‘విచ్’ బ్రిటన్‌లోని అతి పెద్ద వినియోగదారుల హక్కుల పరిరక్షక, పర్యవేక్షక స్వతంత్ర సంస్థ. ‘‘మీ ఇంట్లో ఉండే గాడ్జెట్లు అన్నింట్లోకీ స్మార్ట్ టీవీ మరీ ప్రమాదకరంగా మారుతోంది. మీరు ఏ సమయంలో ఏ కార్యక్రమాలు చూస్తున్నారనే పూర్తి సమాచారాన్ని ఇది సేకరిస్తుంది’’ అని విచ్ చెబుతోంది. ‘‘మీకు, మీ కుటుంబ సభ్యులకు నచ్చిన ప్రకటనలను చూపించడానికి మీ ఇంట్లోని టీవీలు మీ సమాచారాన్ని పూర్తిగాలాగేస్తుంటాయి’’ అని ఐసీవో రెగ్యులేటరీ రిస్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విలయం మాల్కం అంటున్నారు. ‘‘స్మార్ట్ పరికరాలు మన ఆరోగ్యం, మన దినచర్యలు, మన కుటుంబ జీవితానికి సంబంధించిన అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి’’ అని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు.స్మార్ట్ పరికరాలను తయారుచేసే కంపెనీలు, డెవలపర్ల కోసం ఐసీవో ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన సమయంలోనే ఈ తాజా హెచ్చరిక వెలువడింది. వినియోగదారుల సమాచారాన్ని ఎలా ఉపయోగించాలనే దానిపై కంపెనీలకు ఇందులో కొన్ని నియమాలను పొందుపరిచారు. వినియోగదారుల ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం వంటి కొన్ని సరైన కారణాల కోసం కొంత సమాచారాన్ని సేకరించేందుకు మాత్రమే ఐసీవో అంగీకరించింది. అయితే స్మార్ట్ పరికరాలు వాటికి నిజంగా అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరించాలని, ఆ సమాచారాన్ని ఎలా వాడుతున్నారనేది కూడా స్పష్టంగా చెప్పాలని, ఆ సమాచారంపై ప్రజలకే నియంత్రణ ఉండాలని తాజాగా స్పష్టం చేసింది.కొనడం ఆపటం లేదు!ఇంట్లోని స్మార్ట్ పరికరాలు తమ సమాచారాన్ని ఎలా సేకరిస్తున్నాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్న లక్షలాది మంది బ్రిటన్ ప్రజలకే కాదు, మిగతా ప్రపంచదేశాలకూ ఈ నియమాల విధింపు మంచి పరిణామం. బ్రిటన్‌కి చెందిన 2,000 మందికి పైగా వయోజనులపై ఐసీవో చేసిన సర్వేలో... తమ పరికరాలు సమాచారాన్ని ఎలా సేకరిస్తాయో, ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాయో తమకు తెలియదని మూడింట ఒక వంతు మంది ప్రజలు చెప్పారు.అలాగే, ఒక స్మార్ట్ టోస్టర్ (బ్రెడ్ కాల్చేది) లేదా స్మార్ట్ టూత్‌బ్రష్ కూడా తమ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని తెలిసి ఆశ్చర్యపోయామని సర్వేలో పాల్గొన్నవారిలో ముప్పావు వంతు మంది చెప్పారు. ఈ సమాచార సేకరణ పట్ల తమకు ఆందోళన ఉందని 40 శాతం మంది బ్రిటన్ ప్రజలు చెబుతుండగా, మరికొందరు (15 శాతం మంది) ఇదే కారణంతో ఇలాంటి సాంకేతిక పరికరాలను అస్సలు కొనడం లేదు. అయినప్పటికీ, బ్రిటన్ ప్రజలు తమ ఇళ్లను ఇలాంటి నిఘా పెట్టే పరికరాలతో నింపేయడం మాత్రం ఆపలేదు.పైగా ఈ డేటా సేకరణ వల్ల వచ్చే వినియోగ పరమైన లాభాల కోసం స్మార్ట్ పరికరాలను కొనడానికి సిద్ధంగా ఉన్నామని యూకేలోని దాదాపు సగం మంది వినియోగదారులు చెబుతున్నారు. దీనిపై మాల్కం మాట్లాడుతూ: ‘‘ఈ పరికరాలు మన జీవితాలను సులభతరం చేయడానికి తయారవుతాయి. అంతకు మించి వీటికి మన వ్యక్తిగత గోప్యతను పణంగా పెట్టకూడదు’’ అంటున్నారు.డేటాను లాగి, ఏం చేస్తారు?మనం టీవీలో ఏమేం చూస్తున్నామో పూర్తి వివరాలను తెలుసుకొని, మన అలవాట్లకు సంబంధించిన ఒక పెద్ద నివేదికను తయారు చేయడానికి గాడ్జెట్లు చాలా సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ సమాచారాన్ని మనకు నచ్చే షోలు లేదా సినిమాలను సూచించడానికి ఉపయోగించవచ్చు, అలాగే మనకు నచ్చిన ప్రకటనలను చూపించడానికి కూడా వాడుకోవచ్చు. అయితే ఇలా ప్రకటనలు చూపించటం వరకు పర్వాలేదని, టీవీ తయారీ కంపెనీలు అంతకంటే ముందుగా వినియోగదారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఐసీవో ఆదేశాలు జారీ చేసింది.ఇక గాడ్జెట్ తయారీ కంపెనీలు చట్టాన్ని పాటిస్తున్నాయా లేదా, వినియోగదారులకు నిజమైన పారదర్శకతను అందిస్తున్నాయా లేదా, వారి అనుమతిని నిజంగానే తీసుకుంటున్నాయా లేదా అని పరిశీలించడానికి ‘విచ్’ సంస్థ ఈ ఏడాది చివర్లో ఆయా కంపెనీలతో మాట్లాడనుంది.ఏమైనా, కన్జ్యూమర్ల డేటా చైనా వంటి ప్రమాదకర దేశాలకు చేరడం వల్ల ముఖ్యంగా గోప్యతా ప్రమాదాలు ఉంటాయి. చైనా చట్టాల ప్రకారం అక్కడ ఉండే కంపెనీలు తమ వద్ద ఉన్న డేటాను అక్కడి ప్రభుత్వానికి తప్పనిసరిగా అప్పగించాలి; దీనివల్ల మీ వై–ఫై నెట్వర్క్ వివరాలు, లొకేష¯Œ , డివైజ్ పాస్వర్డ్లు వేరే దేశం చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. మీ వ్యక్తిగత ప్రొఫైల్‌ను బిల్డ్ చేసి, మీ ప్రమేయం లేకుండానే థర్డ్–పార్టీ సంస్థలకు ఆ డేటాను అమ్ముకోవడం లేదా ప్రకటనల కోసం వాడుకునే అవకాశం ఉంటుంది.చైనా సర్వర్లకు మన వివరాలు!విచ్ సంస్థ చేసిన పరిశోధనలో ఐగోస్టార్, షియోమి మి స్మార్ట్, కొసోరి అనే మూడు కంపెనీల ఎయిర్ ఫ్రయర్ల వినియోగదారుల కచ్చితమైన లొకేషన్ తెలుసుకుంటున్నాయని, యూజర్ల ఫోన్లలోని ఆడియోను రికార్డ్ చేయడానికి అనుమతి అడుగుతున్నాయని తేలింది.షియోమి ఎయిర్ ఫ్రయర్కు సంబంధించిన యాప్... ఫేస్బుక్, పాంగిల్ (ఇది టిక్‌టాక్ బిజినెస్ ప్రకటనల నెట్వర్క్), చైనాకు చెందిన టెక్ దిగ్గజం టెన్సెంట్ వంటి వాటి ట్రాకర్లకు కనెక్ట్ అయి ఉంది. (ఇది వినియోగదారుడు ఉండే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది). మరోవైపు, ఐగోస్టార్ ఎయిర్ ఫ్రయర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే వినియోగదారుల జెండర్, పుట్టిన తేదీని అడుగుతోంది. అంతేకాదు, ఐగోస్టార్, షియోమి ఎయిర్ ఫ్రయిర్లు రెండూ తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాలోని సర్వర్లకు పంపించాయి. అయితే ఆ విషయాన్ని వారు తమ ప్రైవసీ నోటీసులో ముందే పేర్కొన్నారు. ఇక కొన్ని స్మార్ట్ స్పీకర్లలో కూడా ఫేస్బుక్, గూగుల్‌కు సంబంధించిన ఇలాంటి ట్రాకర్లు కిక్కిరిసినట్లుగా నిండి ఉన్నాయి! ‘‘మన లొకేషన్‌ను ట్రాక్ చేసే ఎయిర్ ఫ్రయర్ల నుండి, మన పుట్టిన తేదీని అడిగే స్మార్ట్ వాషింగ్ మెషీన్ల వరకు... ఈ స్మార్ట్ పరికరాలు వాటికి అవసరమైన దానికంటే లేదా మనం అంగీకరించదగిన దానికంటే చాలా ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని మా గత పరిశోధనలు పదే పదే నిరూపించాయి’’ అని విచ్ సంస్థకు చెందిన టెక్ నిపుణుడు ఆండ్రూ లాఫ్లిన్ వెల్లడించారు.‘‘అవసరం లేని సమాచార సేకరణను తగ్గించడం, పారదర్శకతను పెంచడం, వినియోగదారులకు వారి సమాచారంపై మరింత నియంత్రణను ఇవ్వడంపై నిఘా సంస్థ (రెగ్యులేటర్) కొత్త మార్గదర్శకాలు ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచి విషయం’’ అని ఆయన అంటున్నారు. ఇక, స్మార్ట్ టీవీలు సేకరిస్తున్న అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారంపై తమకు ప్రత్యేక ఆందోళనలు ఉన్నాయని కూడా ఐసీవో తెలిపింది.స్మార్ట్ వలలో పడకుండా ఐదు చిట్కాలుమీ స్మార్ట్ పరికరాలు మీపై నిఘా పెట్టకుండా కాపాడుకోవడానికి ‘ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్’ 5 చిట్కాలు చెబుతోంది. కొనడానికి ముందే రీసెర్చ్ (పరిశోధన) చేయండి: మీరు ఏదైనా పరికరాన్ని కొనే ముందే, అది ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తుందో సరిచూసుకోండి. ఆ పరికరం అడిగే సమాచారాన్ని దానికి ఇవ్వడం మీకు ఇష్టమేనా కాదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.పర్మిషన్లపై (అనుమతులపై) నియంత్రణ కలిగి ఉండండి: పరికరాన్ని సెటప్ చేసేటప్పుడు, అది ఏయే విషయాలను యాక్సెస్ చేయాలో నియంత్రించడానికి ‘ప్రైవసీ కంట్రోల్స్’ ఉపయోగించండి. ఏదైనా అనుమతి అనవసరం అనిపిస్తే, దానికి అస్సలు అంగీకరించకండి.మీ పరికరానికి భద్రత కల్పించండి: ఇతరులు మీ పరికరాన్ని వాడుకోకుండా ఉండటం కోసం ఒక బలమైన, విభిన్నమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోండి. వీలైనప్పుడల్లా ‘టూ–స్టెప్ వెరిఫికేషన్’ ఆన్ చేసుకోండి.అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి: సాఫ్ట్వేర్ అప్డేట్స్ను క్రమం తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులోని సెక్యూరిటీ ప్యాచెస్ కొత్త ముప్పుల నుండి మీ డేటాను రక్షిస్తాయి.పరికరాన్ని వదిలించుకునే ముందు మీ డేటాను పూర్తిగా తుడిచేయండి: మీరు మీ స్మార్ట్ పరికరాన్ని ఎవరికైనా అమ్మేస్తున్నా లేదా పారేస్తున్నా... ముందుగా దాన్ని ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేయండి. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం మొత్తం డిలీట్ అయిపోతుంది. - సాక్షి స్పెషల్ డెస్క్ -
ఏఐ కాలం 'మాయరోగం'
‘సైబర్‌కాండ్రియా’ మనుషులను కుదురుగా ఉండనివ్వడంలేదు. వ్యాధుల వల్ల వచ్చే బాధలను మించిన భయాలను రేకెత్తించి, కంటికి కునుకు పట్టనివ్వడంలేదు. ‘సైబర్‌కాండ్రియా’ బాధితులు తమ ఆరోగ్యంపై లేనిపోని అనుమానాలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, పదేపదే రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ బెంగతో కుదేలైపోతున్నారు. డాక్టర్లు వారించినా, మనసులోని శంకలు తీరక రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం; పెద్ద ఇబ్బందేమీ లేదని అనుభవజ్ఞులైన డాక్టర్లు నచ్చచెప్పినా, వినిపించుకోకుండా డాక్టర్లనే పదేపదే మార్చేస్తూ, లేని రోగాల ఆనవాళ్లు కనిపెట్టడానికి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం డబ్బు మంచినీళ్లలా ఖర్చుచేస్తున్నారు. వీరి కారణంగా ఉత్పాదకతకు భారీనష్టం వాటిల్లుతోంది. ‘సైబర్‌కాండ్రియా’ సహా ఆరోగ్య సంబంధమైన రకరకాల మానసిక ఆందోళనల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా సుమారు 1 ట్రిలియన్ డాలర్లకుపైగా నష్టం వాటిల్లుతోందని ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ‘కోవిడ్–19’ మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ‘సైబర్‌కాండ్రియా’ మరింతగా పెరిగింది. చిన్న చిన్న శారీరక లక్షణాలనే పెద్దగా అనుమానించడం; అందుబాటులో ఉన్న అన్ని రకాల వైద్యపక్రియల్లోనూ చికిత్స ప్రయోగాలు చేయడం; వైద్యులను తరచుగా మార్చడం; వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ప్రమాదకర సంకేతాలు ఏవీ లేనప్పటికీ పదేపదే పరీక్షలు చేయించుకోవడం; ఈ లక్షణాలతో బాధపడే ఉద్యోగులు తరచుగా విధులకు సెలవు పెట్టడం వంటివి చేస్తున్నారు. ‘సైబర్‌కాండ్రియా’ వల్ల విలువైన పనిగంటలకు, ఉత్పాదకతకు తీవ్రనష్టం వాటిల్లుతోంది.కాస్త తలనొప్పిగా ఉన్నా, కొంచెం ఒళ్లు వెచ్చబడి జ్వరంగా ఉన్నా ఇదివరకటి జనాలు పెద్దగా కంగారు పడేవారు కాదు. తలనొప్పిగా ఉంటే నొవాల్జిన్ మాత్ర, జ్వరంగా ఉంటే పారాసిటమాల్ మాత్ర వేసుకుని, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేవారు. ఎప్పుడైనా అజీర్తిచేసి కడుపు గడబిడ చేస్తే, వంటింటి చిట్కాలు పాటించేవారు. అప్పటికీ నయం కాకుంటే, డాక్టర్ దగ్గరకు వెళ్లేవారు. ఇంట్లో చిన్నా పెద్దా ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా, ఇంట్లోని పెద్దలు అనుభవ వైద్యం చేసేవారు. ఇంటి వైద్యానికి కుదరని సమస్యలకైతే ఫ్యామిలీ డాక్టర్లు ఆపద్బాంధవుల్లా తగిన చికిత్స అందించేవారు. జబ్బూ జట్రా సర్వసాధారణంగా ఉన్నా, జనాలు వాటి గురించి బెంగ పెట్టేసుకోకుండా నిక్షేపంగా బతికేసేవారు. ఇప్పుడలా కాదు, ఒంటికి ఏ బాధ వచ్చినా వెంటనే ఏఐ వైపు చూస్తున్నారు. సర్వసాధారణంగా వచ్చే బాధలకు పెద్దపెద్ద వ్యాధులను ఊహించుకుని భయపడుతున్నారు.తలనొప్పి వస్తే బ్రెయిన్ ట్యూమరేమోనని; కడుపునొప్పి వస్తే బొవెల్ క్యాన్సరేమోనని; దగ్గు వస్తే లంగ్ క్యాన్సరేమోనని; నడుంనొప్పి వస్తే డిస్క్ జారిపోయిందేమోనని అనుమానిస్తున్నారు. ఈ అర్థంలేని అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఇంటర్నెట్ అంతా జల్లెడ పట్టేస్తున్నారు. ఏఐ ముందు తమ సందేహాల చిట్టా విప్పుతున్నారు. ఇదంతా ఏఐ కాలం తెచ్చిన మాయరోగం. దీనికి అంతర్జాతీయ వైద్యనిపుణులు సైబర్‌కాండ్రియా అని పేరు పెట్టారు.మొదటి స్థానంలో భారత్కొన్ని ఘనతలకు సంబంధించి మొదటి స్థానంలో నిలవడం దేశానికి గర్వకారణంగా ఉంటుంది. కాని, కొన్ని ప్రతికూల అంశాల్లో మొదటి స్థానానికి చేరడం విచారించదగ్గ విషయమవుతుంది. డబ్ల్యూహెచ్ఓ సహా పలు అంతర్జాతీయ సంస్థలు వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం ‘సైబర్‌కాండ్రియా’ బాధితుల్లో మన భారత్ మొదటి స్థానంలో నిలుస్తోంది. ‘సైబర్‌కాండ్రియా’ బాధితుల్లో ఎక్కువమంది చదువుకున్నవారు, పట్టణ, నగర ప్రాంతాలకు చెందినవారే ఉంటున్నారు. ‘సైబర్‌కాండ్రియా’ బాధితుల్లో మొదటి పది స్థానాల్లో ఉన్న దేశాల పరిస్థితి ఇదీ... అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం ‘కోవిడ్–19’ కాలం నుంచి భారత్‌లో సైబర్‌కాండ్రియా బాధితుల్లో సుమారుగా 120% పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల అమెరికాలో 80%, బ్రిటన్‌లో 70%, ఇటలీలో 60%, స్పెయిన్‌లో 50% మేరకు పెరుగుదల నమోదైంది. ‘కోవిడ్–19’ మహమ్మారి ఫలితంగా జనాల్లో ఆరోగ్యం పట్ల అతిజాగ్రత్తలు, వాటితో పాటు ఆరోగ్య స్థితిగతులపై అర్థంలేని అనుమానాలు కూడా బాగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 560 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు ఉంటే, వారిలో దాదాపు 190 కోట్ల మంది ఏదో ఒక స్థాయిలో ‘సైబర్‌కాండ్రియా’ బాధితులే! వీరిలో దాదాపు 55 కోట్ల మంది తీవ్రస్థాయిలో ‘సైబర్‌కాండ్రియా’ లక్షణాలతో బాధపడుతున్నారని ‘సైబర్‌కాండ్రియా సివియారిటీ స్కేల్’ ఆధారంగా అంతర్జాతీయ సంస్థలు వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. ‘సైబర్‌కాండ్రియా’ బాధితుల్లో ఎక్కువగా యువతరం వారే ఎక్కువగా ఉంటున్నారు. అంతర్జాతీయ లెక్కల ప్రకారం వివిధ వయసుల వారిలో ‘సైబర్‌కాండ్రియా’ బాధితుల వివరాలు...ఈ వలయంలో చిక్కుకోకుండా ఉండాలంటే...‘సైబర్‌కాండ్రియా’ విషవలయంలో చిక్కుకోకుండా ఉండాలంటే, ఇంటర్నెట్ వాడే చిన్నా పెద్దా అందరూ కొంత సంయమనంతో కూడిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వలయంలో చిక్కుకోకుండా ఉండటానికి ఏం చేయాలో, ఏం చేయకూడదో నిపుణులు చెబుతున్న సూచనలు ఇవీ...చేయాల్సినవి» ఏఐని ప్రాథమిక సమాచారం కోసమే వాడాలి» ఏఐ సమాచారాన్ని విశ్వసనీయ మార్గాల ద్వారా తనిఖీ చేసుకోవాలి » శరీరంలో అసౌకర్యం కలిగితే ఆ లక్షణాలను వివరంగా రాసుకుని, వైద్యులను సంప్రదించాలిచేయకూడనివి» ఏఐ ఆధారంగా స్వీయ వ్యాధినిర్ధారణ తగదు» ఏఐ ఆధారంగా స్వీయ వైద్యం ప్రారంభించవద్దు.» ఏఐ సమాచారం ఆధారంగా ప్రాణాంతక వ్యాధులు సోకినట్లుగా లేనిపోని భయాలు పెట్టుకోవద్దు.వివిధ వయసుల వారిలో...‘సైబర్‌కాండ్రియా’ మూలకారణం ఇంటర్నెట్– దానివల్ల అందుబాటులోకి వచ్చిన సోషల్‌మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్స్ అయినా, అంతర్జాతీయ అధ్యయనాలు వేర్వేరు వయసుల వారిలో వేర్వేరు కారణాలను ప్రధానంగా గుర్తించాయి. సోషల్ మీడియాకు కొత్తగా పరిచయమైన 13–17 ఏళ్ల వయసు వారిలో ఆరోగ్య సమస్యలపై అరకొర అవగాహన; శరీరంలో ఏవైనా తేడాలు కనిపిస్తే వెంటనే చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో వెదుకులాట సాగించి, అందులో దొరికే సమాచారం చదివి లేనిపోని భయాలు పెంచుకోవడం వల్ల ‘సైబర్‌కాండ్రియా’ బారిన పడుతున్నారు.కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్లే 18–24 ఏళ్ల వయసు వారు మితిమీరి సోషల్ మీడియాకు అలవాటు పడటం, ఆరోగ్య సమస్యలపై ఇంటర్నెట్, ఏఐపై ఆధారపడటం వల్ల ‘సైబర్‌కాండ్రియా’ బాధితులవుతున్నారు. కొత్తగా కెరీర్ ప్రారంభించి, కెరీర్లో నిలదొక్కుకునే దశలో ఉన్న 25–44 ఏళ్ల వయసువారు తమ ఆరోగ్య సందేహాల కోసమే కాకుండా, కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలపై సమాచారం తెలుసుకోవడానికి సోషల్ మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్స్‌పై ఆధారపడుతున్నారు. వీటి ఆధారంగా పదేపదే వైద్యపరీక్షలు జరిపించుకోవడం, డాక్టర్లను సంప్రదించడం చేస్తున్నారు. డాక్టర్లు ఒకవేళ ఏమీ లేదని చెప్పినా, తృప్తిపడకుండా డాక్టర్లను తరచు మారుస్తున్నారు. ఇక 45–64 ఏళ్ల వయసు వారిలో చాలామందికి నిజంగానే కొన్ని ఆరోగ్య సమస్యలు మొదలై ఉంటాయి. వీటిలో బీపీ, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉంటాయి. వీరు ఆరోగ్య సమస్యలపై తెలుసుకోవడానికి సోషల్ మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో వెదుకులాట సాగిస్తున్నా, డాక్టర్లపై కూడా కొంత నమ్మకం ఉంచుతున్నారు. అయితే, సోషల్ మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో దొరికే సమాచారం వల్ల గందరగోళానికి లోనై ఆందోళన పెంచుకుంటున్నారు.చివరిగా 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధుల్లో ‘సైబర్‌కాండ్రియా’ తక్కువే! వీరిలో సంప్రదాయ పద్ధతులపై ఇంకా పూర్తిగా సడలిపోని నమ్మకమే ఇందుకు కారణం. ఈ వయసు వారిలో చాలా కొద్దిమంది మాత్రమే ఆరోగ్య సమాచారం కోసం సోషల్ మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్స్‌పై వెదుకులాట సాగిస్తున్నారు. అయినా, వీరిలో ఎక్కువమంది ఇంకా డాక్టర్లనే నమ్ముకుంటూ ఉండటం కొంత ఊరట.ఏఐ వైద్యునికి ప్రత్యామ్నాయం కాదుఏఐలో ఎలాంటి సమాచారమైనా ఉండవచ్చు. అదంతా ఏఐకి మనుషులు ఇచ్చినదే! ఏఐలో ఏ అంశంపై వెదుకులాట సాగించినా, నిమిషాల్లోనే బోలెడంత సమాచారాన్ని మన ముందు పోగు పెడుతుంది. ఏఐ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నా, అది అనుభవం, నైపుణ్యం ఉన్న వైద్యులకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య సమస్యల గురించి ఏఐలో వెదుకులాట సాగించేవారు ఈ సంగతిని గుర్తెరగాలి. ఏఐకి, నిపుణుడైన డాక్టర్‌కు తేడా చాలానే ఉంటుంది. ఆ తేడా ఏ స్థాయిలో ఉంటుందో కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం...ఛాతీనొప్పిఏఐగుండెపోటు కావచ్చువైద్యుడురోగి వయసు, ఎత్తు, బరువు, జన్యు చరిత్ర తెలుసుకుంటారు. ఈసీజీలాంటి ప్రాథమిక పరీక్షలు జరిపి, పరిస్థితిని బట్టి వైద్యం చేస్తారు.కడుపు ఉబ్బరం, మంటఏఐఅల్సర్ కావచ్చువైద్యుడురోగి ఆహారపు అలవాట్లు, అరుగుదల పరిస్థితిని తెలుసుకుంటారు. ఇతర జీర్ణ సంబంధ కారణాలను పరిశీలించి, తగిన మందులు సూచిస్తారు.కీళ్లనొప్పులుఏఐఆర్థరైటిస్ కావచ్చు.వైద్యుడునొప్పి ఉన్న ప్రదేశాన్ని స్వయంగా పరిశీలిస్తారు. ఆ భాగంలో కదలికలు ఎలాఉన్నాయో పరిశీలిస్తారు. తగిన మందులు సూచిస్తారు.తలనొప్పిఏఐబ్రెయిన్ ట్యూమర్ కావచ్చువైద్యుడుతలనొప్పి ఎప్పుడెప్పుడు వస్తోందో, ఏ పరిస్థితుల్లో వస్తోందో తెలుసుకుని, అవసరమైన వైద్యం చేస్తారు.బరువు పెరుగుదలఏఐథైరాయిడ్ సమస్య కావచ్చు.వైద్యుడురోగి జీవనశైలిని క్షుణ్ణంగా తెలుసుకుంటారు. రోగి ఆహారపు అలవాట్లు, ఇతర మందులు ఏవైనా తీసుకుంటున్నారా అనేది కనుక్కుని, తగిన చికిత్స చేస్తారు.అలసట, నీరసంఏఐక్యాన్సర్ కావచ్చువైద్యుడురోగి నిద్ర, ఒత్తిడి, ఆహారం, అనీమియా, థైరాయిడ్ వంటి కారణాలను పరిశీలిస్తారు. కారణం తెలుసుకుని, తగిన చికిత్స అందిస్తారు.గుండెదడఏఐగుండెజబ్బు కావచ్చువైద్యుడురోగి నాడి పరిశీలిస్తారు. కెఫీన్ మోతాదు ఎక్కువైందేమో తెలుసుకుంటారు. అవసరం అనిపిస్తే ఈసీజీ చేయిస్తారు. అప్పుడు తగిన చికిత్స చేస్తారు.బయటపడాలంటే..?‘సైబర్‌కాండ్రియా’ నుంచి బయటపడటం కొంత కష్టమే అయినా, అసాధ్యం కాదని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) నిపుణులు చెబుతున్న ప్రకారం ‘సైబర్‌కాండ్రియా’ బారిన పడినవారు శరీరంలో ఏ చిన్న అసౌకర్యం కలిగినా, వెనువెంటనే ఆన్లైన్లో వెదకడం, ఏఐ ద్వారా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయడం మానుకోవాలి. కచ్చితమైన సమాచారం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహా పలు అంతర్జాతీయ వైద్య సంస్థల వెబ్సైట్లను చూడవచ్చు. ఆన్లైన్లో సమాచారం వెదుకులాట కోసం సమయం వృథా చేసుకుని, లేనిపోని భయాలు పెట్టుకునే బదులు సమీపంలో ఉన్న వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. మరీ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలపై సోషల్ మీడియాలో పుంఖాను పుంఖాలుగా వచ్చే వీడియోలను చూడటం మానుకోవాలి. వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా, వైద్య చికిత్సల్లో వందశాతం ఫలితాలను ఆశించడం అత్యాశే అవుతుందని గ్రహించాలి. కొన్ని వ్యాధులకు ఇప్పటికీ శాశ్వత చికిత్స అందుబాటులో లేదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. వైద్యంలో కూడా అనిశ్చితి సహజమే! దానిని ఆమోదించగలిగి ఉండాలి. క్రమం తప్పని వ్యాయామం, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా మానసిక ఆందోళనను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అప్పటికీ ఆందోళన తగ్గకుంటే, మానసిక వైద్య నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స పొందాలి.‘సైబర్‌కాండ్రియా’ విషవలయం లాంటిది. ఒకసారి మొదలైతే, అది ఆగకుండా ఆరోగ్యం పట్ల లేనిపోని భయానుమానాల చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. దీని నుంచి బయటపడటం కష్టమని అంతర్జాతీయ మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ చక్రం ఎలా మొదలవుతుందంటే?... -
ఏఐ.. రూ.450 లక్షల కోట్లు
ఏఐ. ఓ అనూహ్యమైన ఎకానమీని సృష్టిస్తోంది. ఈ రెండక్షరాల చుట్టూ అల్లుకున్న ఆర్థిక వ్యవస్థ... వచ్చే పదేళ్లలో ఏకంగా 5 ట్రిలియన్ డాలర్ల (రూ.450 లక్షల కోట్లు) వ్యాపార అవకాశాల్ని అందించబోతోంది. ఇక ఈ ఎకోసిస్టమ్‌లో ఎదిగే కంపెనీల విలువైతే దీనికి వందరెట్ల పైనే ఉంటుందన్నది ఇన్వెస్ట్మెంట్ నిపుణుల అంచనా. బహుశా! పారిశ్రామిక విప్లవం తరవాత ప్రపంచం చవిచూస్తున్న అతిపెద్ద మార్పు ఇదే కావచ్చు. ఏఐ ఎంతవేగంగా మారుతోందంటే... ఇపుడిది చాట్బోట్లకో, సాఫ్ట్వేర్ ఆటోమేషన్కో పరిమితం కాదు. తయారీ, విద్య, వైద్యం, ఫైనాన్స్, వ్యవసాయం, లాజిస్టిక్స్, డిఫెన్స్, శాస్త్రీయ పరిశోధన.. ఇలా అన్నిటికీ వెన్నెముకే. ఇపుడు పోటీ మెరుగైన ఏఐ మోడల్‌ను సృష్టించడానికి కాదు. మొత్తం ఏఐ వ్యవస్థను చేతుల్లో ఉంచుకోవటానికి. సెమీ కండక్టర్ల నుంచి డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రా, డిజిటల్ ట్విన్స్, అటానమస్ సిస్టమ్స్, పారిశ్రామిక ఏఐ, రోబోటిక్స్... ప్లస్ నైపుణ్యం ఎవరి చేతుల్లో ఎక్కువ ఉంటాయన్నదే నియంత్రణాధికారానికి నిదర్శనం. ఈ అధికారం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, కార్పొరేట్లు బిలియన్ల డాలర్లను కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుత పరిశ్రమల్ని మార్చటంతో పాటు కొత్త పరిశ్రమల్ని సృష్టించే ఏఐ వల్ల 2030 నాటికి ప్రపంచ జీడీపీ 15 ట్రిలియన్ డాలర్లు జతపడుతుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో అసలు ఏఐ ఎన్ని రకాలు? వీటి అవసరాలేంటి? ఆ అవసరాలను అల్లుకుని ఎదుగుతున్న కంపెనీలేంటి? వాటి వ్యాపారమెంత? విలువెంత? అంతర్జాతీయ దిగ్గజాలెవరు? లాభపడే కంపెనీలేంటి?ఇదీ.. ఏఐ సామ్రాజ్య స్వరూపంచిప్ అండ్ సిలికాన్ (సెమీ కండక్టర్లు, జీపీయూలు, నెట్వర్కింగ్ సిలికాన్)ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సర్వర్లు, స్టోరేజీ, కూలింగ్, విద్యుత్తు) క్లౌడ్ అండ్ ప్లాట్‌ఫామ్స్ (కంప్యూటింగ్, క్లౌడ్, మెషీన్ లెర్నింగ్ ఆపరేషన్స్, హోస్టింగ్ఫౌండేషన్ మోడల్స్ (లార్జ్ మోడల్స్, ట్రెయినింగ్, మరింత మెరుగుపరచటంఏఐ అప్లికేషన్లు (ఎంటర్ప్రైజ్ ఏఐ, వినియోగదారుల ఏఐ, పారిశ్రామిక ఏఐ తదితరాలు)ఏఐ ఏజెంట్లు అండ్ అటానమీ (స్వతంత్ర వ్యవస్థలు, ఏజెంట్లు, రోబోటిక్స్)సాక్షి, బిజినెస్ -
ఇదీ.. ఏఐ సామ్రాజ్య స్వరూపం
1. చిప్ అండ్ సిలికాన్ (సెమీ కండక్టర్లు, జీపీయూలు, నెట్వర్కింగ్ సిలికాన్)2 . ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సర్వర్లు, స్టోరేజీ, కూలింగ్, విద్యుత్తు)3. క్లౌడ్ అండ్ ప్లాట్‌ఫామ్స్ (కంప్యూటింగ్, క్లౌడ్, మెషీన్ లెరి్నంగ్ ఆపరేషన్స్, హోస్టింగ్)4. ఫౌండేషన్ మోడల్స్ (లార్జ్ మోడల్స్, ట్రెయినింగ్, మరింత మెరుగుపరచటం)5. ఏఐ అప్లికేషన్లు (ఎంటర్ప్రైజ్ ఏఐ, వినియోగదారుల ఏఐ, పారిశ్రామిక ఏఐ తదితరాలు)6. ఏఐ ఏజెంట్లు అండ్ అటానమీ (స్వతంత్ర వ్యవస్థలు, ఏజెంట్లు, రోబోటిక్స్)ఏఐ సామ్రాజ్య శ్రేణిలో దిగ్గజాలు వీరే? -
ఏఐలోకి ‘మెగా’ఎంట్రీ!
సాక్షి, బిజినెస్: మూడు దశాబ్దాలకుపైగా ఇన్ఫ్రా రంగంలో ఉంటూ వివిధ రంగాల్లోకి విస్తరిస్తున్న స్థానిక సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) కూడా ఏఐ రంగంలోకి అడుగుపెట్టనుంది. మైక్రోసాఫ్ట్‌లో రెండు దశాబ్దాలు పనిచేసిన అలెక్స్ కిప్మాన్ సంస్థ అనలాగ్ ఏఐతో చేతులు కలపబోతోంది. ఈ భాగస్వామ్యం ఏ రూపంలో ఉంటుంది? ఎంత పెట్టుబడి పెడతారు? అనే వివరాలు బహుశా జూలై ఒకటిన వెల్లడి కావచ్చు. ఆ రోజున కిప్‌మాన్‌తో కలిసి నిర్వహించే సమావేశంలో ఎంఈఐఎల్ దీనిపై ప్రకటన చేసే అవకాశముంది. ఫౌండేషన్ ఏఐ కాదిది.. పారిశ్రామిక ఏఐ! చాట్ జీపీటీ, క్లాడ్, పెర్ప్లెక్సిటీ మాదిరి అనలాగ్ ఏఐ సంస్థ ఫౌండేషనల్ ఏఐ లేదా జనరేటివ్ ఏఐ కాదు... ఇది పారిశ్రామిక ఏఐ. భౌతికంగా ఇంటెలిజెన్స్‌ను తయారు చేస్తుంది. అంటే సెన్సర్లు, రోబోలు, న్యూరల్ నెట్‌వర్క్‌లను కలుపుతూ భౌతిక యంత్రాలకు డిజిటల్ నకళ్లను తయారు చేస్తుంది. వాహనాలు, యంత్రాలు, పరిశ్రమలు... ఇలా పనిచేసే వేటికైనా డిజిటల్ ట్విన్స్‌ను తయారు చేయడం ద్వారా వాటిని రిమోట్‌గా వేరే చోటు నుంచి మానిటర్ చేయొచ్చు. ఈ డిజిటల్ నకళ్లు నిరంతరం అప్డేట్ అవుతూ వాటి ట్విన్స్‌ను ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఇలా ట్రాక్ చేయడం ద్వారా నిర్వహణను ముందే ఊహించొచ్చు. సమస్యలు రాకుండా నివారించే అవకాశమూ ఉంటుంది. సీమెన్స్, స్నీడర్, జీఈ వెర్నోవా, రాక్వెల్ వంటి దిగ్గజాలున్న ఈ రంగంలోకి పూర్తి ఏఐ కంపెనీగా అడుగుపెట్టింది అనలాగ్ ఏఐ. అబుదాబికి చెందిన టెక్నాలజీ దిగ్గజం జీ24... ఈ సంస్థకు అవసరమైన పూర్తి ఫండింగ్‌ను ఎప్పటికప్పుడు అందిస్తోంది. అందుకే దీని విలువను ఇప్పటిదాకా ఎక్కడా వెల్లడించలేదు. వచ్చే పదేళ్లలో భారత్ సహా అన్నిచోట్లా 80 శాతానికిపైగా భారీ పరిశ్రమలు తమ కీలక ఆపరేషన్లలో డిజిటల్ ట్విన్స్‌ను ఉపయోగిస్తాయన్నది నిపుణుల అంచనా. తయారీ రంగంతోపాటు విద్యుత్, చమురు, గ్యాస్, రైల్వే, మెట్రో వ్యవస్థ, పోర్టులు–షిప్పింగ్, నిర్మాణ రంగం, మైనింగ్... ఇలా అన్ని రంగాలూ పారిశ్రామిక ఏఐ, డిజిటల్ ట్విన్స్ వల్ల లబ్ధి పొందుతాయనేది వారి మాట. -
24 ఏళ్లకే పీహెచ్డీ.. రికార్డులను బద్దలు కొట్టిన లెజెండ్ : ఎవరీ సత్యం
సాంకేతిక రంగంలో భారతీయులు సాధిస్తున్న విజయాలు ఎంతోమందికి స్ఫూర్తి అనడంలో సందేహం లేదు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి పేదింటి రైతు బిడ్డ శ్రమ, కృషి,అద్భుతమైన ప్రయాణమే ఇందుకు నిదర్శనం. బిహార్‌లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో 'సత్యం కుమార్' భారతదేశంలోనే అత్యంత పిన్న వయసులోప్రతిష్టాత్మక ఐఐటీ జేఈఈ (IIT JEE) పరీక్షను పాసైన విద్యార్థిగాసత్యం కుమార్ చరిత్ర సృష్టించాడు .అంకిత భావం, ఓర్పు పట్టుదలగా ప్రయత్నించాలే గానీ అద్భుత విజయాలు, మరెన్నో రికార్డులు అతణ్ణి వరించాయి. 13 ఏళ్లకే ఐఐటీ ర్యాంక్ సాధించి, 13 ఏళ్లకే ఐఐటీ జేఈఈ క్రాక్, 24 ఏళ్లకే పీహెచ్డీ! సత్యం కుమార్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందామా!1999, జూలై 20న బీహార్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించిన సత్యం, చిన్న వయస్సు నుండే అసాధారణమైన విద్యా ప్రతిభను కనబరిచాడు. అతనిలోని తెలివితేటలను గుర్తించిన ఒక కుటుంబ స్నేహితుడు.. ఐఐటీ జేఈఈ కోచింగ్ కోసం అతడిని రాజస్థాన్‌లోని కోటాకు పంపించాల్సిందిగా తండ్రికి సలహా ఇచ్చాడు. అయితే ఒక చిన్న గ్రామం నుండి ఐఐటి వరకు, ఆపై అమెరికా వరకు సత్యం కుమార్ ప్రయాణం చాలా సాఫీగా సాగినట్లు అనిపించినా, అది అంత సులభమైనది కాదు. అతని జీవితంలో ఎన్నో ఒడి దుడుకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా అతని తండ్రి రైతు కావడంతో, సత్యంను చదువుల కోసం అమెరికాకు పంపించడం వారి కుటుంబానికి ఒక సవాలుగా మారింది. ఒకానొక సమయంలో అతని తండ్రి తన పొలాన్ని, ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. సత్యం ప్రతిభ, తెలివితేటల కారణంగా, అతనికి టెక్సాస్ విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్ లభించింది. అలా సత్యం కుమార్ కేవలం 12 ఏళ్ల వయసులోనే మొదటిసారి ఐఐటీ జేఈఈ పరీక్షను క్లియర్ చేసి, దేశ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఐఐటీయన్‌గా రికార్డు సృష్టించాడు. అయితే, ఆ ఫలితంతో సంతృప్తి చెందని అతను, మరుసటి ఏడాది (2013లో) మళ్లీ పరీక్ష రాసి.. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఆల్ ఇండియా 670వ ర్యాంక్ (AIR 670) సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.తన విజయం గురించి ఐఐటీ కాన్పూర్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సత్యం మాట్లాడుతూ.. "నేను జేఈఈ క్రాక్ చేసినప్పుడు నా కల నిజమైంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకదానిలో చదువుకునే అవకాశం నాకు దక్కింది" అని పేర్కొన్నాడు.ఐఐటీ కాన్పూర్ర్యాంక్ సాధించిన తర్వాత సత్యం కుమార్ ఐఐటీ కాన్పూర్‌లో చేరి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డ్యూయల్ డిగ్రీ (BTech, MTech) పూర్తి చేశాడు. ఐఐటీలో ఉన్న సమయంలోనే అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) అడ్వాన్స్డ్ కంప్యూటింగ్‌పై పట్టు సాధించాడు. ఇది అతని భవిష్యత్తు సాంకేతిక రంగానికి బలమైన పునాదిగా మారింది.ఐఐటీ కాన్పూర్ వాతావరణం నన్ను పరిశోధనలు, ఆవిష్కరణల వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించింది అంటారు సత్యం. కష్టమైన సమస్యలను కూడా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని తనకు ఇచ్చిందని గర్వంగా ప్రకటించారు.24 ఏళ్లకే పీహెచ్డీఆ తర్వాత సత్యం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. కేవలం 24 ఏళ్ల వయసులోనే పీహెచ్డీ (PhD) పూర్తి చేశాడు. తన డాక్టరేట్ చదువు సమయంలోనే, అతను ప్రముఖ యాపిల్ (Apple) సంస్థలో మెషిన్ లెర్నింగ్ విభాగంలో ఇంటర్న్‌షిప్ చేసి, ఏఐ (AI) రీసెర్చ్‌లో మంచి అనుభవం సంపాదించాడు. ప్రస్తుతం అతను ప్రసిద్ధ 'టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్' (Texas Instruments) సంస్థలో 'మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ ఇంజనీర్'గా పని చేస్తున్నాడు. అక్కడ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీల అభివృద్ధిపై దృష్టి పెట్టాడు.నెటిజన్ల ప్రశంసలుసత్యం కుమార్ స్ఫూర్తిదాయక కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతని అసాధారణ ప్రతిభను కొనియాడుతున్నారు. పల్లెటూరి బిహారీ పిల్లగాడు13 ఏళ్లకే ఐఐటీ సాధించి, ఇప్పుడు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎమ్ఎల్ ఇంజనీర్‌గా రాణించడం అద్భుతం, ఎంతో స్ఫూర్తిదాయకమైన సంగతి అంటూ ఒకరు ప్రశంసించారు. మరొకరు.. "ఖచ్చితంగా, ఇది తరానికి ఒక్కరు మాత్రమే పుట్టే అద్భుతమైన ప్రతిభ" అని ప్రశంసించారు. అన్ని రికార్డులను, నిబంధనలను బద్దలు కొట్టిన ఒక లెజెండ్ అంటూ మరొకరు కొనియాడటం గమనార్హం. -
ఏఐ సంచలనం ‘ఆంథ్రోపిక్’లో రూ.కోట్ల జీతాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం పోటీ రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) తన ఉద్యోగులకు కోట్ల రూపాయల వేతన ప్యాకేజీలు అందిస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. క్లాడ్ (Claude), మైథోస్ (Mythos) వంటి ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తున్న ఈ సంస్థలో కొందరు సాంకేతిక ఉద్యోగుల వార్షిక ప్రాథమిక వేతనం (Base Salary) ఏకంగా 13 కోట్ల రూపాయల వరకు ఉండటం చర్చనీయాంశమైంది. ఇవి కేవలం బేస్ పే మాత్రమే. బోనస్‌లు, స్టాక్ ఆప్షన్లు (Equity) ఇందులో లేవు.ఇటీవల ముగిసిన భారీ నిధుల సమీకరణ తర్వాత ఆంథ్రోపిక్ విలువ 965 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఓపెన్‌ఏఐను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ ఏఐ కంపెనీల్లో ఒకటిగా అవతరించింది. కొత్తగా సమీకరించిన నిధులను కంప్యూటింగ్ సామర్థ్యాల పెంపు, అధునాతన ఏఐ మోడళ్ల అభివృద్ధి, భద్రతా పరిశోధనల కోసం వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది.హెచ్-1బీ దరఖాస్తులతో వెలుగు చూసిన జీతాలుఅమెరికా ప్రభుత్వానికి సమర్పించిన హెచ్-1బీ వీసా దరఖాస్తుల ఆధారంగా ఈ వేతన వివరాలు బయటకు వచ్చాయి. బిజినెస్ ఇన్సైడర్ విశ్లేషణ ప్రకారం, "మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్" హోదాలో ఉన్న ఇద్దరు ఉద్యోగులకు వరుసగా 1.12 మిలియన్ డాలర్లు, 1.38 మిలియన్ డాలర్ల వార్షిక బేస్ పే నమోదు అయింది. అయితే ఈ హోదాను సంస్థ వివిధ సాంకేతిక విభాగాల్లో ఉపయోగిస్తుండటంతో వారి ఖచ్చితమైన బాధ్యతలు వెల్లడికాలేదు. అలాగే ఈ గణాంకాల్లో స్టాక్ అవార్డులు, పనితీరు బోనస్‌లు చేర్చలేదు.హెచ్-1బీ దరఖాస్తుల ప్రకారం ప్రధాన విభాగాల్లో వార్షిక బేస్ పే ఇలా ఉంది..మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్: రూ.1.26 కోట్లు – రూ.13.02 కోట్లుమెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్ (మేనేజర్): రూ.1.26 కోట్లు – రూ.8.02 కోట్లురీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ రీసెర్చర్: రూ.1.06 కోట్లు – రూ.4.71 కోట్లుప్రొడక్ట్ డిజైన్ మేనేజర్: రూ.1.32 కోట్లు – రూ.3.60 కోట్లుప్రొడక్ట్ ఆపరేషన్స్: రూ.1.17 కోట్లు – రూ.4.71 కోట్లుఅకౌంటింగ్: రూ.1.33 కోట్లు – రూ.2.17 కోట్లుకమర్షియల్ కౌన్సెల్: రూ.1.87 కోట్లు – రూ.3.01 కోట్లుఫైనాన్స్ అండ్ స్ట్రాటజీ: రూ.1.72 కోట్లు – రూ.2.92 కోట్లుమార్కెటింగ్: రూ.1.50 కోట్లు – రూ.1.88 కోట్లురిసెర్చ్ ఆపరేషన్స్: రూ.1.17 కోట్లు – రూ.4.71 కోట్లుటెక్నికల్ సేల్స్: రూ.1.46 కోట్లు – రూ.4.71 కోట్లుటాలెంట్ కోసం పోటీఅమెరికాలో హెచ్-1బీ వీసాలపై అనిశ్చితి కారణంగా అనేక కంపెనీలు నియామకాలను తగ్గిస్తున్నప్పటికీ, ఆంథ్రోపిక్, ఓపెన్ఏఐ, ఎన్విడియా వంటి ఏఐ సంస్థలు మాత్రం అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించేందుకు నియామకాలను వేగవంతం చేస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లోనే ఆంథ్రోపిక్ సుమారు 80 హెచ్-1బీ ఉద్యోగాలకు సర్టిఫికేషన్ పొందినట్లు సమాచారం. అత్యున్నత స్థాయి వేతనాలతో పాటు భారీ స్టాక్ ఆప్షన్లు ఇవ్వడం ద్వారా ఉద్యోగులను సంస్థలోనే కొనసాగించే వ్యూహాన్ని ఆంథ్రోపిక్ అమలు చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. -
ఏఐ మెమరీచిప్స్ విస్తరణకు రూ. 1,000 కోట్లు
న్యూఢిల్లీ: ఏఐ మెమరీ చిప్స్ తయారీ సామర్థ్యాలను మరింతగా పెంచుకోవడంపై మైఫై దృష్టి పెడుతోంది. ఇందుకోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని, ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ప్రస్తుతమున్న ప్లాంటును విస్తరించాలని యోచిస్తోంది. ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, ఆటోమొబైల్ తదితర రంగాల నుంచి మెమరీ సొల్యూషన్స్‌కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైఫై సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు వ్యాపార వృద్ధి, రూ.1,000 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మైక్రోమ్యాక్స్, తైవాన్‌కి చెందిన ఫైసన్ సంస్థ కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేసిన మైఫై గతేడాది జనవరిలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాయి. దేశ విదేశీ కస్టమర్ల నుంచి భారీ ఆర్డర్ల దన్నుతో వచ్చే రెండు మూడేళ్లలో యూనికార్న్‌గా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) ఎదిగే అవకాశం కూడా ఉందని శర్మ తెలిపారు. కేవలం హార్డ్‌వేర్‌కే పరిమితం కాకుండా కృత్రిమ మేధ (ఏఐ) సాఫ్ట్వేర్ విభాగంలోకి కూడా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. కృత్రిమ మేధ పనులకు సంబంధించి సిస్టమ్ మెమరీని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు తమ ఏఐ అడాప్టివ్ మెమరీ సాఫ్ట్వేర్ సహాయకరంగా ఉంటుందని వివరించారు. -
ఏఐ ఫీచర్... ఆస్క్ డోర్ డాష్!
సంవత్సరాలుగా ఫుడ్ డెలివరీ యాప్‌లు ఒకేరకంగా ఉంటున్నాయి. యాప్‌ను ఓపెన్ చేసి, రకరకాల రెస్టారెంట్లను బ్రౌజ్ చేసి, మెనూలను పోల్చి, సిఫారసులను స్క్రోల్ చేసి, చివరికి ఒక ఆప్షన్‌ను ఖరారు చేసుకుంటారు. ఈ మోడల్‌కు మంచి స్పందన వచ్చినప్పటికీ చిన్న చిన్న నిర్ణయాలను కూడా సుదీర్ఘమైన ప్రక్రియగా మారుస్తుంది.ఈ నేపథ్యంలో క్విక్ రికమెండేషన్ కోసం వచ్చింది ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, ఫుడ్ డెలివరీ కంపెనీ డోర్ డాష్. ఇంక్ వారి సరికొత్త ఏఐ ఫీచర్... ఆస్క్ డోర్ డాష్ రెస్టారెంట్ జాబితాలు, మెనూలు, ఫిల్టర్లను స్క్రోల్ చేయడానికి బదులుగా, తాము ఏమి కోరుకుంటున్నారో కస్టమర్లు చాట్‌బాట్‌కు సరళమైన భాషలో చెప్పవచ్చు.యాప్‌లో ఆర్డర్ చేయడాన్ని నావిగేట్ చేయడంలా కాకుండా, సహజమైన సంభాషణలా అనిపించేలా రూపొందించబడింది. ఫుడ్ ఆర్డర్ చేయడం, కిరాణా సామాను కొనడం, రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకోవడం లాంటి పనికైనా మన అభ్యర్థనను ఏఐ అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఆప్షన్ చూపిస్తుంది. చిత్రాలను అప్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా చిత్రాల ద్వారా కూడా మన అభ్యర్థనను అర్థం చేసుకోగలుగుతుంది. కస్టమర్లు వేగంగా నిర్ణయం తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది.ఒక నిర్దిష్ట రెస్టారెంట్ కోసం వెదకడం, వందలాది ఆప్షన్లను స్క్రోల్ చేయడం వంటివి చేయకుండా, కస్టమర్లు తాము ఏమి కోరుకుంటున్నారో సులభంగా వివరించి, వారి ప్రాధాన్యతను ఆధారంగా సలహాలు తీసుకోవచ్చు. -
మోదీని కలిసిన అమెజాన్ సీఈఓ: కీలక ప్రకటన!
ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ఒకటి. అందుకే.. దిగ్గజ సంస్థలు భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కూడా అదే బాటలో మరో అడుగేసింది.అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తన భారత పర్యటన సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా.. 2030 నాటికి భారతదేశంలో ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం అదనంగా 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అమెజాన్ 2025 డిసెంబర్లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది.కొత్త పెట్టుబడులను ప్రకటించిన నేపథ్యంలో ఆండీ జాస్సీ మాట్లాడుతూ.. "మేము దశాబ్దానికి పైగా కాలంగా భారతదేశంలో పనిచేస్తున్నాం. ఈ కామర్స్, క్లౌడ్, ఏఐ రంగాల్లో అద్భుతమైన వృద్ధిని చూశాం. అందుకే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరింత పెట్టుబడి పెడుతున్నాం" అని చెప్పారు.అమెజాన్ లక్ష్యం.. కేవలం వ్యాపారం పెంచుకోవడం మాత్రమే కాదు. భారతదేశంలో చిన్న వ్యాపారాలను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకురావడం, ఉద్యోగాలను సృష్టించడం, ఎగుమతులను పెంచడం, ఏఐ సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కూడా.అమెజాన్ పెట్టుబడులతో 2030 నాటికి భారతదేశంలో.. 38 లక్షలకు పైగా ఉద్యోగాలకు మద్దతు లభించనున్నాయి. 80 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ ఎగుమతులకు సహకారం, 1.5 కోట్ల చిన్న వ్యాపారాలు ఏఐ ప్రయోజనాలు పొందనున్నారు. పైగా 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలను అందించనుంది.ఇదీ చదవండి: భారీగా తగ్గిన మస్క్ సంపద: కారణం ఇదే!అమెజాన్ కంపెనీ తన పెట్టుబడిలో భారీ మొత్తాన్ని ఏఐ, క్లౌడ్ రంగానికే కేటాయించనుంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్, ముంబైలలో ఉన్న ఏడబ్ల్యుఎస్ డేటా సెంటర్లను మరింత విస్తరించనుంది. దీని వల్ల భారతీయ కంపెనీలు తమ డేటాను దేశంలోనే భద్రంగా నిల్వ చేసుకోవడంతో పాటు అత్యాధునిక ఏఐ టెక్నాలజీలను ఉపయోగించుకోగలుగుతాయి.ఇప్పటికే అనేక భారతీయ సంస్థలు ఏడబ్ల్యుఎస్ సేవలను ఉపయోగిస్తున్నాయి. ఇందులో బ్యాంకులు, స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. మొత్తం మీద అమెజాన్ తాజా ప్రకటన.. భారత ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ అవకాశాలకు, సాంకేతిక అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది. ఇది ''డిజిటల్ ఇండియా'' లక్ష్యాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే మరో కీలక అడుగుగా చెప్పవచ్చు.Really enjoyed my meeting with Prime Minister @narendramodi about what’s ahead for Amazon in India.We’ve been serving customers, sellers, developers, startups, and enterprises in India for more than a decade and just getting started. Shared that we’re investing $48 billion… pic.twitter.com/CSiwPTiEBh— Andy Jassy (@ajassy) June 25, 2026 -
ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా?
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల స్థానాన్ని కృత్రిమ మేథ (ఏఐ) ఎన్నటికీ ఆక్రమించలేదని ఇన్ఫోసిస్ సహ–వ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. ఏఐతో ఐటీ కంపెనీలు మరింత పటిష్టమవుతాయని ఆయన తెలిపారు. 2030 నాటికి 400 బిలియన్ డాలర్ల భారీ ఏఐ ఆధారిత సర్వీసులకు సంబంధించిన అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఇన్ఫీ మరింతగా దృష్టి పెడుతోందని నీలేకని చెప్పారు.కంపెనీ 45వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. సాంకేతిక విప్లవాలు వేగవంతమవుతున్న నేపథ్యంలో ఐటీ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందన్న సందేహాలపై నీలేకని స్పందించారు. జెన్ఏఐ మనుగడలోకి వచ్చిన మూడేళ్ల వ్యవధిలో ఇన్ఫోసిస్ మరింత పటిష్టంగా మారిందని, రాబోయే దశాబ్దకాలాన్ని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అత్యుత్తమ కోడింగ్ టూల్స్‌ని ఉపయోగించుకుని ఉత్పాదకతను మరింతగా పెంచుకున్నప్పటికీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి జీవిత కాలంలో చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉంటాయన్నారు. కంపెనీలకు అవసరమైన సొల్యూషన్స్‌కి కఠినతరమైన పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని, అలాగే సైబర్‌సెక్యూరిటీ, కఠినతరమైన డేటా గవర్నెన్స్‌లాంటి వాటిని బైటివాళ్లకి ఔట్సోర్సింగ్ చేయడానికి ఉండదని పేర్కొన్నారు.‘పెద్ద కంపెనీల్లో ఏఐ వినియోగానికి సంబంధించి చాలా మటుకు అంతరాలు ఉంటున్నాయి. వాటిని భర్తీ చేయడమే మా పని. ఏఐ అనేది మాలాంటి కంపెనీలను ఆక్రమించదు. పరిస్థితులకు అనుగుణంగా, వేగంగా తమను తాము మల్చుకునే సంస్థలను మరింత పటిష్టం చేస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తమ టాప్ 200 క్లయింట్లలో 90 శాతం సంస్థలకి ఏఐ వినియోగంపరమైన సేవలు అందిస్తున్నట్లు నీలేకని వివరించారు. ఇదీ చదవండి: రికార్డులు సృష్టిస్తోన్న ఆధార్ యాప్.. -
నవతరానికి మొహం మొత్తిందా?
కొత్త వింత... పాత రోత అంటారు. కానీ... ఈ తరానికి కొత్త కూడా రోతగానే అనిపిస్తున్నట్లు ఉంది! ఎందుకంటారా? నాలుగైదేళ్లు కూడాకాకముందే ఏఐపై వారికి మొహం మొత్తింది! అమెరికా, యూరప్, ఆసియా.. ఇలా ప్రపంచం మొత్తమ్మీద... ఏఐని నమ్మని వాళ్లు, వద్దని అనుకుంటున్న వాళ్లు... తిరస్కరిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది! 2020ల మొదట్లో చిన్న చిన్న చాట్బోట్లు, సిఫారసు వ్యవస్థలతో మొదలైన ఏఐ ఆటోమేషన్ 2023లో చాట్‌జీపీటీ రాకతో రాకెట్ స్పీడ్ అందుకుంది. ఇమేజీలు సృష్టించడం మొదలుకొని సినిమాలు తీసేంతవరకూ అనేకానేక ఏజెంటిక ఏఐల రాకతో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం పడింది. ఆంథ్రోపిక్ క్లాడ్తోపాటు మరికొన్ని అత్యాధునిక ఏఐ వ్యవస్థలు నెమ్మదిగా సాఫ్ట్వేర్ కోడింగ్ చేయడం, తన తప్పులు తానే సరి చేసుకోవడం.. వంటి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన కూడా మొదలైంది.అంతేకాకుండా డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై అవగాహన కూడా పెరిగింది. ఇదే సమయంలో వివిధ దేశాలు ఏఐ టెక్నాలజీకి ముకుతాడు వేసేందుకు, నియంత్రణ వ్యవస్థలను తీసుకొచ్చే ప్రయత్నాలూ మొదలుపెట్టాయి. తాజాగా జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం యువతలో మరీ ముఖ్యంగా జెన్–జీలో ఏఐపై విముఖత పెరుగుతోంది. అమెరికాలో ‘ప్యూ రీసెర్చ్’, యూరప్‌లో ‘స్టాన్‌ఫర్డ్ ఏఐ ఇండెక్స్ – 2026’లు జరిపిన అధ్యయనాలు జెన్–జీలో ఏఐ పట్ల పెరుగుతున్న అభద్రత భావానికి అద్దం పడుతున్నాయి. అంకెలు చెప్పే విషయం... అమెరికాలోని ప్యూ రీసెర్చ్ ఇటీవలే ‘‘అమెరికన్స్ అండ్ ఏఐ 2026: ఛాట్‌బోట్స్, స్మార్ట్ డివైజెస్ అండ్ వ్యూస్ ఆన్ ఇంపాక్ట్’పేరుతో ఒక అధ్యయనం నిర్వహించింది. వారం రోజుల క్రితం విడుదలైన అధ్యయన ఫలితాల ప్రకారం కేవలం 16 శాతం మంది (అధ్యయనంలో పాల్గొన్న 5119 మందిలో) మాత్రమే ఏఐ సమాజంపై సానుకూల ప్రభావం చూపగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.అదే సమయంలో ఈ టెక్నాలజీతో సమాజానికి నష్టమే అని అభిప్రాయపడ్డవారు 40 శాతం వరకూ ఉంది. ఇదే అభిప్రాయంతో 48 శాతం జెన్–జీ సభ్యులు ఏకీభవిస్తూండటం గమనార్హం. అలాగని ఎవరూ ఈ టెక్నాలజీని వాడటం లేదా అంటే 49 శాతం మంది చాట్‌జీపీటీ వంటివి వాడుతున్నట్లు స్పష్టమైంది. జెన్–జీలో ఇది 66 శాతం. రెండేళ్ల క్రితం వాడకందార్లు కేవలం 33 శాతం మంది మాత్రమే. ఏఐపై వ్యతిరేకత వయసుతోపాటు కొంత తక్కువ అవుతూండటం ఇంకో ఆసక్తికర అంశం. అమెరికా మాత్రమే కాదు.. యూరప్, భారత్‌సహా ఆసియా దేశాల్లోనూ ఏఐ వాడకమైతే పెరుగుతోంది కానీ.. అందుకు తగ్గట్టుగానే అపనమ్మకం కూడా ఎక్కువ అవుతోందన్నమాట. దీనికీ కారణాలు లేకపోలేదు. కంపెనీ యాజమాన్యాలు ఏఐ వాడకంపై ఎక్కువ ఆసక్తి చూపుతూండగా ఉద్యోగులు భయం, భయంగా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి దిగ్గజ కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు గుమ్మరిస్తూండటంతో ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్న మాట వాస్తవమైనప్పటికీ జెన్–జీలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుంటే ఇది ఎంత కాలం కొనసాగుతుందన్నది ప్రశ్నగా మారింది.యూరప్‌లోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తోంది. ఏఐ వ్యవస్థలపై నియంత్రణ అవసరమన్న వాదనతోపాటు ఏఐ కంపెనీలపై విశ్వాసం సడలుతున్నట్లు స్టాన్‌ఫర్డ్ ఏఐ ఇండెక్స్ 2026 స్పష్టం చేస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్‌లలో ఏఐతో ఉద్యోగాలకు నష్టమన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తూండగా యూకేలో వాడకం బాగా పెరుగుతున్నా ఏఐ వ్యవస్థలపై నమ్మకం అతితక్కువ స్థాయిలోఉంది. మానవ సృజనకు పాతర... ఏఐ మానవ సృజనకు పాతరేస్తోందని, ఆటోమేషన్ కారణంగా మనిషి ఆలోచించడం మానేస్తాడని జెన్–జీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై కూడా జెన్–జీలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మెటా షాక్.. ఉద్యోగుల డేటా లీక్!
ప్రముఖ టెక్ దిగ్గజం మెటా (Meta) మరోసారి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సమస్యల కారణంగా వార్తల్లో నిలిచింది. కంపెనీ, ఉద్యోగుల కంప్యూటర్ యాక్టివిటీని ట్రాక్ చేసి ఏఐ ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తున్న ఒక ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనికి కారణం.. ఉద్యోగులకు సంబంధించిన సున్నితమైన సమాచారం మొత్తం కంపెనీ అంతటా అందుబాటులోకి వచ్చినట్లు తెలియడమే.మెటా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో తన AI సిస్టమ్స్‌ను మెరుగుపరచడానికి మోడల్ క్యాపబిలిటీ ఇనిషియేటివ్ (MCI)ను తీసుకొచ్చింది. దీనిద్వారా ఉద్యోగులు రోజూ కంప్యూటర్లో చేసే పనుల డేటాను సేకరించేవారు. ఉదాహరణకు కీబోర్డ్ టైపింగ్, మౌస్ కదలికలు, క్లిక్స్ సమాచారం వంటివి.ప్రైవేట్ చాట్స్ లీక్ఇక్కడొచ్చిన సమస్య ఏమిటంటే.. లీకైన డేటాలో ఉద్యోగుల ప్రైవేట్ చాట్స్, పనితీరుకు సంబంధించిన సమాచారం, ట్రాన్స్‌క్రిప్షన్‌లు వంటివి ఉండటం, ఇవి సంస్థలో పనిచేసే అందరికి కనిపించడం. దీంతో కంపెనీ వెంటనే ప్రాజెక్ట్‌ను ఆపేసింది. అయితే.. ఈ లీక్‌పై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కంపెనీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు డేటా దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు లేవని చెప్పారు. అయినప్పటికీ పూర్తి విచారణ కోసం ప్రోగ్రామ్‌ను నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే ఈ సమస్య సీరియస్ ఇష్యూ కేటగిరీలోకి వస్తుందని పలువురు పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ ఘటన ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగించింది. ఎందుకంటే.. మొదట ఈ డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అది అందరికీ కనిపించడం పెద్ద తప్పిదమని వారు విమర్శించారు. కాగా.. ఇటీవల కాలంలో మెటా ఏఐ సిస్టమ్స్‌కు సంబంధించిన మరికొన్ని సెక్యూరిటీ సమస్యలు కూడా బయటపడ్డాయి. ఇందులో ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ కావడం వంటివి ఉన్నాయి.ఏఐ ప్రాజెక్ట్ ఉద్దేశ్యంనిజానికి మెటా ఈ ఏఐ ప్రాజెక్ట్ ప్రారంభించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. మనుషులు కంప్యూటర్ను ఎలా వాడతారో ఏఐకి నేర్పించడం. తద్వారా ఏఐ ఏజెంట్లు రోజువారీ పనుల్లో మరింత సహాయం చేయగలవు అని కంపెనీ భావించింది. కానీ ఇప్పుడు లీక్ సమస్య తెరమీదకు రావడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది.ఇదీ చదవండి: మెటా కీలక నిర్ణయం.. భారతీయుడికి వాట్సాప్ పగ్గాలు! -
ఒక్క ఏడాదిలో 21,000.. ఒరాకిల్ ఉద్యోగాల కోత
అమెరికాకు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్, డేటాబేస్ సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ (Oracle Corporation) గత ఏడాదిలో సుమారు 21 వేల మంది ఉద్యోగులను తగ్గించినట్లు తాజా రెగులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2026 మే 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి సంస్థలో పూర్తి స్థాయి ఉద్యోగుల సంఖ్య 1.41 లక్షలకు పడిపోయింది. అంతకుముందు ఏడాది ఇది 1.62 లక్షలుగా ఉండేది. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 13 శాతం శ్రామిక శక్తి తగ్గినట్లైంది.తమ కార్యకలాపాల్లో కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతలను వేగంగా అమలు చేయడం, ఆటోమేషన్‌ను విస్తరించడం వల్ల ఉద్యోగుల అవసరం తగ్గుతోందని ఒరాకిల్ తన వార్షిక ఫైలింగ్‌లో స్పష్టంగా పేర్కొంది. ఏఐ వినియోగం కారణంగా భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సంఖ్యపై ప్రభావం కొనసాగవచ్చని సంస్థ హెచ్చరించింది.ఈ పునర్వ్యవస్థీకరణ కారణంగా సంస్థకు సుమారు 1.84 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.15,000 కోట్లకు పైగా) వ్యయం వచ్చినట్లు వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఖర్చు భారీగా పెరిగింది. ఉద్యోగుల తొలగింపులతో పాటు సంస్థాగత మార్పులు, విభాగాల పునర్వ్యవస్థీకరణ, నిర్వహణ మార్పులు కూడా ఈ వ్యయానికి కారణమయ్యాయి.ప్రస్తుతం ఒరాకిల్ భారీ ఏఐ డేటా సెంటర్ల నిర్మాణంపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా ఓపెన్ఏఐ (OpenAI) వంటి సంస్థలకు క్లౌడ్ మౌలిక సదుపాయాలు అందించేందుకు బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. ఏఐ మౌలిక వసతుల విస్తరణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 70 బిలియన్ డాలర్ల మూలధన వ్యయం చేయాలని కంపెనీ ప్రణాళికలు రూపొందించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.మే చివరి నాటికి ఒరాకిల్‌లో అమెరికాలో సుమారు 49 వేల మంది, ఇతర దేశాల్లో 92 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2022లో ఆరోగ్య సాంకేతిక సంస్థ సెర్నర్ కార్పొరేషన్‌ను 28 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగినా, తాజా కోతలతో సంస్థ హెడ్‌కౌంట్ మళ్లీ ఆ స్థాయికి దిగువకు చేరింది.టెక్నాలజీ రంగంలో ఏఐ ఆధారిత ఆటోమేషన్ వేగంగా పెరుగుతున్న సమయంలో, ఉద్యోగాల తగ్గింపును ఏఐతో నేరుగా అనుసంధానించిన అరుదైన పెద్ద కంపెనీలలో ఒరాకిల్ ఒకటిగా నిలిచింది. దీంతో భవిష్యత్తులో ఏఐ కారణంగా ఉద్యోగ మార్కెట్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై చర్చ మళ్లీ మొదలైంది. -
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు: కారణం ఇదే!
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు దీని ప్రభావం స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోళ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ధరలపై కూడా పడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.గ్లోబల్ మార్కెట్లో ఏఐ అభివృద్ధికి అవసరమైన మెమరీ, స్టోరేజ్ చిప్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో వాటి కొరత తీవ్రమైంది. ఈ పరిస్థితి కారణంగా.. భవిష్యత్తులో గాడ్జెట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఏఐ మోడళ్ల శిక్షణ, నిర్వహణ కోసం భారీ స్థాయిలో మెమరీ చిప్‌లు అవసరమవుతున్నాయి. ఈ చిప్‌లను స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోళ్లు వంటి పరికరాల్లో కూడా ఉపయోగిస్తారు. ప్రస్తుతం.. ఈ మార్కెట్‌ను ఎస్కే హైనిక్స్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మైక్రాన్ వంటి సంస్థలు ఆధిపత్యం వహిస్తున్నాయి. కాగా.. ఏఐ కంపెనీల భారీ కొనుగోళ్లతో చిప్‌ల ధరలు గణనీయంగా పెరిగాయి.మెమరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ ధరలు పెరగనున్నట్లు టిమ్ కుక్ ఇప్పటికే ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే చిప్‌ల ఖర్చు నాలుగు రెట్లు పెరిగిందని, ఈ భారాన్ని కంపెనీలు భరించడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు.ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ తయారీ ఖర్చులో 8 నుంచి 12 శాతం వరకు మెమరీ చిప్‌ల కోసం ఖర్చు చేస్తున్నారు. డిమాండ్-సప్లై అసమతుల్యత కారణంగా తయారీదారులు ఉత్పత్తుల ధరలను పెంచడం తప్ప మరో మార్గం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారతీయ వినియోగదారులకు పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా తగ్గుతుండటంతో, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చిప్‌ల ఖర్చు మరింత పెరుగుతోంది. దీంతో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ధరలపై అదనపు భారం పడుతోంది.రాబోయే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. చిప్ తయారీ సంస్థలు, తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నప్పటికీ, కొత్త తయారీ కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు చిప్‌ల కొరత కొనసాగవచ్చని, ఫలితంగా గాడ్జెట్ల ధరలు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో గ్యాడ్జెట్స్ ధరలు పెరగనున్నట్లు స్పష్టమవుతోంది. -
టెకీలు.. AI వాడితే సేఫ్.. లేకుంటే లేఆఫ్!
కృత్రిమ మేధస్సు (AI) కార్యాలయాల్లో కేవలం ఉత్పాదకతను పెంచే సాధనంగా మాత్రమే కాకుండా, ఉద్యోగ భద్రతను ప్రభావితం చేసే కీలక నైపుణ్యంగా మారుతున్నట్లు తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ గాలప్ ( Gallup Study ) నిర్వహించిన సర్వే ప్రకారం, ఏఐ సాధనాలను క్రమం తప్పకుండా ఉపయోగించే టెక్నాలజీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.మూడు రెట్లు అధిక ముప్పుగత ఫిబ్రవరిలో 23 వేల మందికి పైగా అమెరికన్ ఉద్యోగులపై నిర్వహించిన అధ్యయనంలో, ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన 660 మంది అభిప్రాయాలను కూడా పరిశీలించారు. ఈ విశ్లేషణ ప్రకారం.. కనీసం నెలకు ఒకసారి అయినా ఏఐ టూల్స్ ఉపయోగించే టెక్ ఉద్యోగులకు లేఆఫ్ అయ్యే అంచనా ప్రమాదం 6 శాతం మాత్రమే ఉండగా, ఏఐని అరుదుగా ఉపయోగించే లేదా పూర్తిగా దూరంగా ఉంచే ఉద్యోగుల్లో అది 18 శాతానికి చేరింది. అంటే ఏఐ వినియోగం లేని టెకీలకు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం దాదాపు మూడు రెట్లు అధికంగా ఉందని గాలప్ పేర్కొంది.అధ్యయనం ప్రకారం.. కంపెనీలు ఇప్పుడు నియామకాల సమయంలో కేవలం డిగ్రీలు, అనుభవం మాత్రమే కాకుండా ఏఐ అక్షరాస్యత (AI Literacy), ఆటోమేషన్ టూల్స్‌పై అవగాహన, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వంటి నైపుణ్యాలను కూడా పరిశీలిస్తున్నాయి. సంస్థల్లో పునర్వ్యవస్థీకరణ లేదా ఖర్చు తగ్గింపు చర్యల సమయంలో కూడా ఏఐ సామర్థ్యం ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యం లభించే అవకాశాలు పెరుగుతున్నాయి.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఉద్యోగాలు కోల్పోయిన వారిలో కేవలం 1 శాతం మంది మాత్రమే తమ ఉద్యోగ నష్టానికి ఏఐ ప్రత్యక్ష కారణమని భావించారు. ఎక్కువ మంది ఆర్థిక పరిస్థితులు, పునర్వ్యవస్థీకరణలు, వ్యయ నియంత్రణ చర్యలను కారణాలుగా పేర్కొన్నారు. అయితే సంస్థల నిర్ణయ ప్రక్రియలో ఏఐ నైపుణ్యం పరోక్ష ప్రభావం చూపుతున్నట్లు గాలప్ శాస్త్రవేత్త జిమ్ హార్టర్ అభిప్రాయపడ్డారు.సగం మంది వాడేస్తున్నారు..ఇదిలా ఉండగా, అమెరికాలో కార్యాలయాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2023లో 21 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఏఐ ఉపయోగిస్తున్నట్లు చెప్పగా, 2026 నాటికి ఆ సంఖ్య 50 శాతానికి చేరుకుంది. రోజువారీగా ఏఐ ఉపయోగించే ఉద్యోగుల వాటా కూడా నిరంతరం పెరుగుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాల్లో ఈ వినియోగం అత్యధికంగా నమోదైంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో ఏఐ పూర్తిగా ఉద్యోగాలను భర్తీ చేస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా లేకపోయినా, ఏఐతో కలిసి పనిచేయగల సామర్థ్యం మాత్రం ఉద్యోగ మార్కెట్లో కీలక అర్హతగా మారుతోంది. ఒకప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానం ఎలా తప్పనిసరి నైపుణ్యంగా మారిందో, ఇప్పుడు ఏఐ వినియోగ సామర్థ్యం కూడా అదే దిశగా పయనిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!
మీ మాటలు వినే, మీతో సరదాగా కబుర్లు చెప్పే ఓ చిన్న స్నేహితుడు ఉంటే బాగుండేదనిపిస్తోందా? అయితే ‘ఏఐపీఐ–లైట్ ఏఐ రోబో’ మీకోసమే!ఇది సాధారణ బొమ్మ కాదు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే స్మార్ట్ రోబో! ఈ చిన్న రోబోతో మాట్లాడితే సహజంగా స్పందిస్తుంది. ప్రశ్నలకు జవాబులు చెప్పడమే కాదు, మీతో సరదాగా చాట్ చేస్తూ స్నేహితుడిలా మెలుగుతుంది.వాయిస్ క్లోనింగ్ సదుపాయంతో మీకు నచ్చిన స్వరాన్ని ఎంచుకోవచ్చు. అంతేకాదు, మీతో జరిగిన సంభాషణలను గుర్తుంచుకునే మెమరీ ఫీచర్ కూడా ఉంది. రియల్‌టైమ్‌లో స్పందిస్తూ నవ్వులు, సరదా వ్యాఖ్యలతో సంభాషణను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. డెస్క్‌పై అందంగా పెట్టుకునే ఈ స్మార్ట్ రోబో ధర సుమారు రూ. 4,500. -
ఆన్ చేస్తే టీవీ.. ఆఫ్ చేస్తే ఆర్ట్ గ్యాలరీ.. అద్భుతం!
కొన్ని గాడ్జెట్స్‌ను చూస్తే ఆశ్చర్యం, కొన్ని చూస్తే ఆనందం, మరికొన్ని చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది! అలాంటి స్టయిల్, సౌకర్యం, సాంకేతికత కలయికగా వచ్చిన ఈ గాడ్జెట్స్ మీకోసం..హాల్లో టీవీ పెట్టాలా? లేక ఖరీదైన పెయింటింగ్ తగిలించాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే రెండింటి పనీ చేసే ఈ ‘ఆర్ట్లై¯Œ టీవీ’ మీ కోసం! ఇది ఆన్ చే స్తే టీవీలా, ఆఫ్ చేస్తే గోడపై వేలాడే కళాఖండంలా పనిచేస్తుంది. మ్యాట్ 4కే క్యూఎల్ఈడీ డిస్ప్లేతో వచ్చే ఈ టీవీని చూడనప్పుడు ఇందులో అందుబాటులో ఉన్న రెండు వేలకుపైగా కళాఖండాలను ప్రదర్శించుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత కళాకారుల చిత్రాల నుంచి ఆధునిక కళాఖండాల వరకు ఎన్నో ఎంపికలు ఉన్నాయి. అంతేకాదు, మీ గది అలంకరణకు సరిపోయే చిత్రాలను కృత్రిమ మేధస్సే సూచిస్తుంది. కుటుంబ ఫొటోలను కూడా ఇందులో ప్రదర్శించుకోవచ్చు. ‘లాస్ట్ ట్రిప్ ఫొటోలు చూపించు’ అని చెప్పగానే వాటిని తెరపై చూపించే సౌకర్యం కూడా ఉంది. గోడపై నిజమైన ఫొటో ఫ్రేమ్‌లా కనిపించే ఈ స్మార్ట్ టీవీ ధర సుమారు రూ. 77 వేల నుంచి ప్రారంభమవుతుంది.బ్యాగ్‌లో మడత కుర్చీ..!ఎక్కడికైనా వెళ్లినా కూర్చోవడానికి చోటు దొరకక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ మినీ ఫోల్డింగ్ క్యాంపింగ్ స్టూల్! చూడటానికి చిన్నగా ఉన్నా, అవసరమైనప్పుడు వెంటనే ఓ కుర్చీగా మారిపోతుంది.కేవలం కొన్ని సెకన్లలో దీనిని పూర్తిగా తెరిచి వాడుకోవచ్చు, పని అయిపోయాక మడిచి బ్యాగ్‌లో వేసుకోవచ్చు. బలమైన కార్బ¯Œ స్టీల్ ఫ్రేమ్, వాటర్‌ప్రూఫ్ ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్‌తో తయారైన ఈ స్టూల్ 150 కిలోల వరకు బరువు తట్టుకోగలదు. క్యాంపింగ్, ఫిషింగ్, పిక్నిక్లు, బీచ్ ట్రిప్స్, ట్రెక్కింగ్ లేదా గార్డెన్లో కూర్చోవడానికి ఇది బెస్ట్ ఆప్ష¯Œ . పైగా ప్రత్యేక క్యారీ బ్యాగ్ కూడా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ధర కేవలం రూ. 530 మాత్రమే! -
వైరస్ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్ ప్రయోగం..
భవిష్యత్తులో వచ్చే సరికొత్త వైరస్‌లకు... అవి అసలు పుట్టకముందే మన శాస్త్రవేత్తలు కర్మకాండలు జరిపించే పనిలో ఉన్నారు! వాటి అంత్యక్రియలు జరిపించేది మరెవరో కాదు, ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్’! శత్రువు యుద్ధానికి రాకముందే ఆ శత్రువును కనిపెట్టి, చిత్తు చేసే ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్నది మాత్రం కేంబ్రిడ్జ్ నిపుణులు. తాజాగా వాళ్లు కనిపెట్టిన సూపర్ వ్యాక్సిన్... ఇకపై కరోనా అయినా, ఎబోలా అయినా, అవి ఎలాంటి రూపు మార్చుకుని వచ్చినా సరే, ఆ వేషధారులను ఊచకోత కోసేస్తుంది.‘ప్యాండమిక్–ప్రూఫ్’ వ్యాక్సిన్మున్ముందు రాబోయే మహమ్మారుల అంతానికి శాస్త్రవేత్తలు ఇప్పుడే పునాది వేశారు. మనకింకా తెలియని, అసలు పుట్టనే పుట్టని కరోనా రకాల వైరస్‌లను సైతం ముందే ఊహించి, వాటిని మట్టుపెట్టే వ్యాక్సిన్స్‌ను శాస్త్రవేత్తలు ఏఐ సహాయంతో రూపొందించారు. ఈ వ్యాక్సిన్ సర్వరోగ నివారిణిలా సకల కరోనా జాతులకూ నిరోధకంగా పని చేస్తుందని కేంబ్రిడ్జి పరిశోధకులు జూన్ మొదటి వారంలో వెల్లడించారు.ఒక్కటిస్తే చాలు.. ఒక్కటీ రాదు!సాధారణంగా ఒక వైరస్ బయటపడిన తర్వాత దానికి వ్యాక్సిన్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలకు నెలలు లేదా సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఈ సరికొత్త ఏఐ టెక్నాలజీ, భవిష్యత్తులో వైరస్లు ఎలా రూపాంతరం చెందుతాయో ముందే ఊహించి, వాటిని ఎదుర్కొనేలా ఈ వ్యాక్సిన్‌ను డిజైన్ చేసింది. ఒక్కటంటే ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే చాలు... ఎబోలా వంటి వేలాది ప్రమాదకర వైరస్ రకాల నుండి, అలాగే భవిష్యత్తులో అవి మార్చుకునే ఏ కొత్త రూపం నుండి అయినా ఇది మనల్ని కాపాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.ప్రొఫెసర్ జొనాథన్ హీనీ, వైరల్ జూనోటిక్స్అలాంటిలాంటిది కాదుప్రస్తుతం మనం వాడుతున్న వ్యాక్సిన్లు యాంటీజెన్ల ఆధారంగా పనిచేస్తాయి. యాంటీజెన్ అంటే మన శరీరంలోకి ఏదైనా హానికరమైన క్రిమి ప్రవేశిస్తే... ‘ఇది శత్రువు!’ అని మన రోగనిరోధక వ్యవస్థ గుర్తుపట్టేలా చేసే ఒక రకమైన సిగ్నల్. అయితే, యాంటీజెన్లు కేవలం అప్పటికే మనుషుల్లో బయటపడిన నిర్దిష్ట వైరస్ రకాలపైన మాత్రమే పనిచేస్తాయి. అయితే ఈ సరికొత్త వ్యాక్సిన్‌లో పరిశోధకులు ఒక ఉపాయం ఆలోచించారు. ఒకే జాతికి చెందిన మొత్తం వైరస్ కుటుంబాలన్నిటిలోనూ ‘కామన్‌గా’ ఉండే కొన్ని ముఖ్యమైన లక్షణాలను సేకరించి, వాటన్నిటినీ నిరోధించే గుణాలను కలిపి కొత్త వ్యాక్సిన్‌లో పొందుపరిచారు.‘‘వైరస్ దాడి మొదలవ్వడానికి ముందే... ఈ సరికొత్త రకం వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి, క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోగలిగితే, భవిష్యత్తులో లక్షలాది ప్రాణాలను కాపాడవచ్చు. లాక్డౌన్ల అవసరమే రాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలకుండా నిలబడతాయి’’ అని ఈ ప్రాజెక్టు చీఫ్, సౌతాంప్టన్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ సాల్ ఫాస్ట్ అంటున్నారు.సార్స్, కోవిడ్, ఎబోలా.. ఏదైనా!ఈ కొత్త వ్యాక్సిన్ కేవలం కరోనా పైనే కాదు... గతంలో వణికించిన సార్స్, మొన్నటి వరకు ఉన్న కోవిడ్, ఇప్పుడున్న ఎబోలా, అలాగే భవిష్యత్తులో జంతువులు, గబ్బిలాల నుండి మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉన్న వైరస్లన్నిటి నుంచి కూడా మనల్ని కాపాడగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన వైరల్ జూనోటిక్స్ (జంతువుల నుండి మనుషులకు వచ్చే వైరస్‌లపై పరిశోధన చేసే విభాగం) ప్రొఫెసర్ జొనాథన్ హీనీ మాట్లాడుతూ... ఈ సరికొత్త టెక్నాలజీ వైద్య రంగపు రూపురేఖల్నే మార్చే ఒక పెద్ద ‘గేమ్ చేంజర్’ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఈ టెక్నాలజీ వల్ల వ్యాక్సిన్లు మరింత శక్తిమంతంగా, విస్తృతంగా మారి, వైరస్ల నుండి మనకు అత్యంత బలమైన రక్షణను అందిస్తాయి’’ అని ఆయన నమ్ముతున్నారు.సూపర్ యాంటీజెన్: రోగ నిరోధక వ్యవస్థకు తిరుగులేని ఆయుధంఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌కు ‘సూపర్–యాంటీజెన్’ అని పేరు పెట్టారు. ఏఐలో ఒక భాగమైన మెషిన్ లెర్నింగ్ ద్వారా దీనిని తయారు చేశారు. గతంలో వచ్చిన మహమ్మారులను, ఇప్పుడున్న వైరస్‌లను ఏఐ క్షుణ్ణంగా విశ్లేషించి... ఒక వైరస్ బ్రతికి బట్టకట్టాలంటే దానికి అత్యంత ముఖ్యమైన భాగాలు ఏంటో కనిపెట్టింది. సరిగ్గా అవే భాగాలపై ఈ సూపర్ యాంటీజెన్‌ను ఎక్కుపెట్టారు.వేర్వేరు వైరస్లలో ఉండే కొన్ని ముఖ్యమైన ప్రొటీన్లను ఒకదానితో ఒకటి అతుకుపెట్టి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ మన శరీరంలోకి వెళ్లగానే, మన రోగనిరోధక వ్యవస్థకు ఆ ప్రొటీన్లపై దాడి చేయడం నేర్పుతుంది. భవిష్యత్తులో ఆ ప్రొటీన్ ఉన్న ఏ కొత్త వైరస్ మన శరీరంలోకి వచ్చినా... మన రోగనిరోధక వ్యవస్థ దాన్ని వెంటనే గుర్తుపట్టి అక్కడికక్కడే నిర్మూలిస్తుంది.సూది లేని ఇంజెక్షన్!సూపర్ యాంటీజెన్ వ్యాక్సిన్‌ను మన శరీరంలోకి పంపే విధానం కూడా చాలా సరళంగా, సరికొత్తగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సూదీ ఉండదు! బదులుగా ‘మైక్రో ఫ్లూయిడ్ జెట్’ అనే పద్ధతిని పాటిస్తారు. ఇది చాలా ఎక్కువ ఒత్తిడితో, ఒక సన్నని ద్రవ రూపంలో వ్యాక్సిన్‌ను నేరుగా మన చర్మ కణాల్లోకి పంపుతుంది. అంటే సూది గుచ్చుకునే నొప్పి అస్సలు ఉండదు!మైక్రో ఫ్లూయిడ్ జెట్వెనుక పరిగెత్తడం ఆపేద్దాం!కాంగోలో మళ్లీ ఇప్పుడు ఎబోలా వైరస్ కలకలం రేపుతున్న విషయాన్ని గురు ్తచేస్తూ: ‘‘కోవిడ్ మహమ్మారి మనకు వ్యాక్సిన్లను వేగంగా తయారు చేయడం నేర్పించింది నిజమే కానీ, మనం ఇంకా పాత విధానాన్నే అనుసరిస్తున్నాం. వైరస్ కొత్తగా పుట్టడం, అది మనల్ని భయపెట్టడం, ఆ తర్వాత మనం దాని వెనుక పరిగెత్తి వ్యాక్సిన్ కనిపెట్టడం... ఈ ధోరణి మారాలి’’ అని ప్రొఫెసర్ హీనీ అంటున్నారు.‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైరస్ జెనెటిక్ కోడ్ మొత్తాన్ని ఈ ఏఐకి ఇస్తాం. అది వాటన్నిటినీ పరిశీలించి, ఆ వైరస్ కుటుంబంలో అస్సలు మారకుండా ఉండే భాగం ఏంటో కనిపెడుతుంది. వైరస్ తన రూపాన్ని ఎంత మార్చుకున్నా ఆ ముఖ్య భాగాన్ని మార్చుకోలేదు. మనం సరిగ్గా దాన్నే టార్గెట్ చేస్తున్నాం. దీనివల్ల ఈరోజు ఉన్న వైరస్ల నుండే కాదు... భవిష్యత్తులో పుట్టబోయే సరికొత్త వైరస్ల నుండి కూడా మనం ముందే రక్షణ పొందవచ్చు!’’ అని హీనీ వివరించారు. ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారిన బర్డ్ ఫ్లూ వైరస్‌ను కూడా అంతమొందించేందుకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బృందం ఇదే టెక్నాలజీతో మరో సరికొత్త వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో పడింది.వైరస్ల కంటే ఒకడుగు ముందేఇతర సైన్స్ నిపుణులు కూడా ఈ వాక్సిన్ను ఒక అద్భుతమైన ‘సరికొత్త విప్లవం’గా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుత వైద్య విధానం అంతా ‘రియాక్టివ్’ (కంటì æముందుకు ప్రమాదం వచ్చాక స్పందించేది)గా ఉంది. అంటే వైరస్ రూపాంతరం చెందుతూ ముందుకు దూసుకుపోతుంటే, దాన్ని పట్టుకోవడానికి మన వ్యాక్సిన్లు వెనుకబడిపోతున్నాయి. కానీ ఈ కొత్త టెక్నాలజీ.. వైరస్ కంటే ఒకడుగు ముందే ఉంటుంది!రెండో దశ ప్రయోగాలుసిద్ధంగా మరో 200 మందిట్రయల్స్ ఎక్కడివరకు వచ్చాయి? మొదటి దశ విజయవంతం అయింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ సరికొత్త టెక్నాలజీతో చేసిన వ్యాక్సిన్‌ను 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న 49 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ప్రయోగించి, ఇది పూర్తిగా సురక్షితమైనదని నిర్ధారించుకున్నారు. అంతకుముందు జంతువులపై చేసిన ప్రయోగాల్లో కూడా ఇది రకరకాల కరోనా వైరస్‌లపై ప్రభావంతంగా పనిచేసి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు రెండవ దశ మొదలైంది. ఈ వ్యాక్సిన్ తదుపరి పరీక్షల కోసం మరో 200 మందికి పైగా వ్యక్తులను సంసిద్ధం చేస్తున్నారు.అత్యంత బలమైన రక్షణఏఐ సహాయంతో రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ల గురించి బ్రిటన్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్’ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైంటిఫిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ మేరియన్ నైట్ అత్యంత ఆశాజనకంగా మాట్లాడారు. ‘‘ఏఐ డిజైన్ చేసిన ఈ ‘సూపర్–యాంటిజెన్’ క్లినికల్ ట్రయల్స్ సాధించిన అద్భుత విజయం. వైద్య రంగంలోనే ఒక విప్లవాత్మకమైన అడుగు. భవిష్యత్తులో వైరస్ల నుండి మానవాళికి సుదీర్ఘమైన, అత్యంత బలమైన రక్షణను అందించడంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది’’ అన్నారు. మొత్తానికి, ఈ ‘సూపర్–యాంటీజెన్’ వ్యాక్సిన్ గనుక అందుబాటులోకి వస్తే... భవిష్యత్తులో మనం ఎలాంటి వైరస్ మహమ్మారికీ భయపడాల్సిన అవసరం ఉండదు. శాస్త్ర విజ్ఞాన రంగం సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది కూడా! - సాక్షి స్పెషల్ డెస్క్ -
నమ్మితే నట్టేట మునిగినట్టే !
గ్లోబల్ షేర్ మార్కెట్పేరుతో సరికొత్త మోసం తెరపైకి వచ్చింది. రూ.వేలల్లో పెట్టుబడి పెడితే వారం రోజుల వ్యవధిలోనే రూ.లక్షల్లో లాభం ఉంటుందని ప్రకటనలతో ఊరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖుల ఫేక్ వీడియోలతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ముమ్మరం చేశారు. అనంతపురం సిటీ: షేర్ మార్కెట్లలో ఏదో ఒక స్కామ్ బయటపడుతూనే ఉంది. గతంలో మోసగాళ్లు కోల్డ్ కాల్స్‌పై ఆధార పడగా, ప్రస్తుతం పెరిగిన సాంకేతికతను అందిపుచ్చుకుని సామాజిక మాధ్యమాలు, ఏఐ వీడియోలతో పెట్టుబడిదారులను పెడదోవ పట్టిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనుకుంటున్న యువతనే లక్ష్యంగా సాగుతున్న ఈ మోసాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సెబీ కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దేశీయంగా స్టాక్ మార్కెట్ మోసాల నియంత్రణకు సెబీ సంస్థ కఠిన చర్యలు తీసుకుంటున్నా... సరికొత్త స్కామ్‌లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఇదే సమయంలో సంచలనం రేకెత్తించిన పంప్ అండ్ డంప్ స్కామ్ మరోసారి తెరపైకి వచ్చింది. దేశీయంగా ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలూ ఊపందుకున్నాయి. ఆర్థిక మోసాల్లో భాగంగా ముందుగా స్కామర్లు తక్కువ ధర ఉన్న పెన్నీ స్టాక్స్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, వాటి విలువను కృత్రిమంగా పెంచేస్తారు. ఆ తర్వాత స్టాక్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఉన్నఫళంగా మొత్తం విక్రయించి స్టాక్ నుంచి బయటపడిపోతారు. ఇది తెలిసే లోపు స్టాక్ భారీగా పతనమై చిన్న పాటి పెట్టుబడిదారులు మొత్తం సొమ్ము నష్టపోవాల్సి వస్తుంది. ఆకట్టుకునేలా ఏఐ వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, విప్రో ప్రేమ్‌జీ, ఇన్ఫోసిస్ సుధానారాయణమూర్తి తదితర ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రకటనలు ఊపందుకున్నాయి. ఇందులో రూ.22 వేలు ఒక్కసారి పెట్టుబడి పెడితే... ఎలాంటి పని చేయకపోయినా వారం రోజుల తర్వాత రూ.5.50 లక్షలు అందుతుందని స్వయంగా వారు మాట్లాడుతున్నట్లుగా వీడియోలను రూపొందించడం గమనార్హం. ఈ వీడియోల పట్ల ఆకర్షితులైన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఎంతో ఆశతో పెట్టుబడులు పెట్టారు. వారం రోజుల తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో తాము మోసపోయినట్లుగా నిర్ధారించుకుని, పెట్టుబడి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ మొత్తం కూడా వెనక్కు రాకపోవడంతో ప్రస్తుతం లబోదిబో మంటున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోసపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని సమాచారం. -
అమెరికా ఆదేశాలు.. ఏఐపై ఆంక్షలు!
సాంకేతికాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు అభయ్ కరందికర్ వ్యక్తం చేశారు. అమెరికా సర్కారు ఆదేశాలతో ఆంథ్రోపిక్ సంస్థ సంచలనాత్మక అత్యాధునిక ఏఐ మోడళ్ల యాక్సెస్‌ను ఇతర దేశాల వారికి నిలిపివేసిన సందర్భంలో ఆయన ఈ సూచన చేశారు.ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఏఐ మోడళ్లు ఫ్యాబిల్ 5, మైథోస్ 5ను అమెరికాయేతర సంస్థలు, వ్యక్తులు పొందకుండా ట్రంప్ సర్కారు అసాధారణ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఫ్యాబిల్‌ను గత వారమే ఆంథ్రోపిక్ విడుదల చేయడం గమనార్హం. ‘‘స్థానిక ఏఐ సదుపాయాలు, హార్డ్‌వేర్ అభివృద్ధిలో భారత్ వెనుకబడి ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర సెమీకండక్టర్ చిప్‌లు లేదా ప్లాట్‌ఫామ్‌ల్లేవు.అమెరికా ప్రభుత్వం సరికొత్త ఎగుమతి నియంత్రణల ఆదేశాల నేపథ్యంలో టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ స్వావలంబన సాధించాలి’’అని కరందికర్ పేర్కొన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో ఏఐ అప్లికేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పౌర సేవల్లో ఏఐ అమలు దిశగా నీతి ఆయోగ్ కృషి సాగిస్తుందన్నారు. డిజిటల్ ప్రజా సదుపాయాల అభివృద్ధిలో భారత్ ముందున్నట్టు చెప్పారు. ఫౌండేషన్ ఏఐ మోడళ్ల అభివృద్ధి కోసం 12 స్టార్టప్‌లకు ప్రభుత్వం సాయమందించినట్టు తెలిపారు. -
భారత్‌లో ‘వాటర్ పాజిటివ్’గా అమెజాన్
కృత్రిమ మేధస్సు (AI) విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటి నీటి వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెజాన్ భారత్‌లో నీటి సంరక్షణ రంగంలో కీలక మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. కంపెనీ భారత కార్యకలాపాలు 2026లో “వాటర్ పాజిటివ్” హోదాను సాధించాయని తెలిపింది. అంటే డేటా సెంటర్లు, కార్పొరేట్ కార్యాలయాలు, గిడ్డంగులు కలిపి వినియోగించే నీటి కంటే ఎక్కువ పరిమాణాన్ని వివిధ పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా సమాజానికి తిరిగి అందిస్తున్నట్లు అర్థం.అమెజాన్ తన కేంద్రాల్లో నీటి వినియోగాన్ని తగ్గించడం, వాటర్‌షెడ్ పునరుద్ధరణ, సమర్థవంతమైన నీటిపారుదల ప్రాజెక్టులు, సరస్సుల పునరుద్ధరణ వంటి చర్యల వల్ల ఈ లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించిన గడువుకంటే ఏడాది ముందే చేరుకుంది. బెంగళూరు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఏటా సుమారు 32.5 కోట్ల లీటర్ల నీటిని ఆదా చేసే కార్యక్రమాలను కూడా సంస్థ అమలు చేస్తోంది.ఏఐ సేవల విస్తరణతో డేటా సెంటర్ల విద్యుత్, నీటి అవసరాలు పెరుగుతున్నాయని పర్యావరణ సంస్థలు, వాటాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలు తమ పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే చర్యలను వేగవంతం చేస్తున్నాయి. అమెజాన్ ఇప్పటికే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా తన డేటా సెంటర్ కార్యకలాపాలను వాటర్ పాజిటివ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లోని తమ డేటా సెంటర్లలో శీతలీకరణ కోసం నీటిని ఉపయోగించడం లేదని సంస్థ స్పష్టం చేసింది.భారత్‌లో నీటి సంక్షోభం మరింత తీవ్రంగా మారుతున్న తరుణంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతం మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచినీటి వనరుల్లో దేశం వాటా కేవలం 4 శాతమే. ఇటీవల బలహీన రుతుపవనాలు, ఎల్‌నినో ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నీటి కొరత తీవ్రమైంది. ముంబై వంటి మహానగరాల్లో కూడా నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి.ఇదిలా ఉండగా, అమెజాన్ 2030 నాటికి భారత్‌లో 35 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఇందులో క్లౌడ్ విభాగమైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మహారాష్ట్రలోనే సుమారు 8.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ కూడా భారత డేటా సెంటర్ రంగంలో భారీ పెట్టుబడులను ప్రకటించడంతో దేశంలో డిజిటల్ మౌలిక వసతుల విస్తరణ మరింత వేగం పుంజుకుంటోంది. -
'హే జియో' అంటే చాలు.. మీ పనులన్నీ చేసే ఏఐ అసిస్టెంట్!
సాంకేతిక రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా.. భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో వినూత్న సేవను అందుబాటులోకి తీసుకురానుంది. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేసే ‘జియో కాల్ ఏజెంట్’ అనే కొత్త వాయిస్ అసిస్టెంట్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.ఫోన్ కాల్లో మాట్లాడుతూనే.. క్యాబ్ బుక్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, మీటింగ్‌లను షెడ్యూల్ చేయడం వంటి పనులను ఈ ఏఐ అసిస్టెంట్ చేస్తుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆకాష్ అంబానీ వెల్లడించారు.జియో కాల్ ఏజెంట్‌ను ప్రత్యేక యాప్‌గా కాకుండా నేరుగా జియో టెలికాం నెట్‌వర్క్‌లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. దీంతో వినియోగదారులు వేరే యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సర్వీస్ జియోకు చెందిన 50 కోట్లకు పైగా వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది భారతీయ భాషలకు కూడా మద్దతు ఇస్తుంది. దీంతో కేవలం ఇంగ్లిష్ తెలిసిన వారు మాత్రమే కాకుండా, ఇతరులు కూడా ఉపయోగించవచ్చు.జియో కాల్ ఏజెంట్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, కాల్ మాట్లాడుతున్న 'హే జియో' అని చెప్పగానే.. ఏఐ అసిస్టెంట్ కాల్లో చేరుతుంది. సాధారణ చాట్‌బాట్‌లా కాకుండా, వ్యక్తిగత సహాయకుడిలా పని చేస్తూ వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు సహకరిస్తుంది.ఈ ఏఐ అసిస్టెంట్ కాల్లో జరిగే సంభాషణను రియల్ టైమ్‌లో టెక్స్ట్ రూపంలోకి మార్చగలదు. కాన్ఫరెన్స్ కాల్లలో ఒకేసారి 10 మంది వరకు మాట్లాడినా వారి గొంతులను గుర్తించి, ఎవరు ఏమి మాట్లాడారో వేరు చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది. అంతేకాకుండా కాల్ ముగిసిన తర్వాత ముఖ్యాంశాలను సారాంశంగా తయారు చేయడం, చేయాల్సిన పనుల జాబితాను రూపొందించడం, రిమైండర్లు సృష్టించడం వంటి పనులను కూడా నిర్వహిస్తుంది.అంతేకాదు.. కాల్ మధ్యలోనే కొన్ని లావాదేవీలను కూడా పూర్తి చేయగలదు. ఉదాహరణకు, రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, క్యాబ్ బుక్ చేయడం లేదా మీటింగ్ షెడ్యూల్ చేయడం వంటి పనులను కాల్‌ను నిలిపివేయకుండా ఈ ఏఐ అసిస్టెంట్ ద్వారా చేయవచ్చు. దీంతో వినియోగదారుల సమయం ఆదా అవుతుంది.జియో కాల్ ఏజెంట్ ప్రారంభం.. వెనుక రిలయన్స్ సంస్థ పెద్ద లక్ష్యంతో ముందుకు సాగుతోంది. జనరేటివ్ ఏఐ సాంకేతికతను నేరుగా కోట్లాది వినియోగదారుల రోజువారీ జీవితాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సంస్థ ఈ సేవను రూపొందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక ఏఐ సేవలు ప్రత్యేక యాప్‌ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. కానీ జియో కాల్ ఏజెంట్ మాత్రం.. నెట్వర్క్ స్థాయిలోనే పనిచేస్తుంది.ఏఐ మౌలిక వసతులుఇదే సమయంలో.. రిలయన్స్ కంపెనీ దేశంలో స్వదేశీ ఏఐ మౌలిక వసతుల నిర్మాణంపైనా దృష్టి సారిస్తోంది. రిలయన్స్ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో జామ్‌నగర్‌లో భారీ స్థాయి ఏఐ మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో తొలి 120 మెగావాట్ల దశను 2026 చివరి నాటికి ప్రారంభించే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తోంది.అంతే కాకుండా.. ప్రపంచ ప్రఖ్యాత ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్వీడియా రూపొందించిన జీబీ300 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఈ మౌలిక వసతుల్లో వినియోగించనున్నారు. దీని ద్వారా భారతదేశంలోనే ఏఐ మోడళ్లను హోస్ట్ చేయడం, డేటాపై పూర్తి నియంత్రణ కల్పించడం, సంస్థల మేధో సంపత్తిని రక్షించడం వంటి ప్రయోజనాలు లభించనున్నాయి.ఇదీ చదవండి: రిలయన్స్ జియో ఐపీఓ.. ముకేశ్ అంబానీ కీలక ప్రకటన! -
భారత్ ఏఐ కలను వెంటాడుతున్న కొత్త విలన్!
కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రపంచ శక్తిగా ఎదగాలని భారత్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. వేల కోట్ల పెట్టుబడులతో కొత్త డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఏఐ కంప్యూటింగ్ హబ్‌లు ఏర్పాటవుతున్నాయి. అయితే ఈ డిజిటల్ కలలకు ఇప్పుడు ఊహించని సవాల్ ఎదురు కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా నిర్మించబోతున్న డేటా సెంటర్లపై నిర్వహించిన తాజా అధ్యయనం భారత్‌కు హెచ్చరికలు జారీ చేసింది. అది విద్యుత్ కొరతో.. నీటి కొరతో కాదంట.. ఏఐ విప్లవం ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్బాట్లు, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు.. ఇవన్నీ నడవాలంటే భారీ డేటా సెంటర్లు అవసరం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్ కూడా ఈ పోటీలో ముందంజలో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. డేటా లోకలైజేషన్ విధానాలు, పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం, ఏఐ అవసరాలు దేశాన్ని ప్రపంచ డేటా సెంటర్ హబ్‌గా మార్చే దిశగా నడిపిస్తున్నాయి. కానీ, వాతావరణ మార్పుల ప్రభావం దేశంలోని డేటా సెంటర్ల పనితీరును తీవ్రంగా దెబ్బతీయొచ్చని ఓ నివేదిక చెబుతోంది. భారత్‌లో వేగవంతమైన ఏఐ విస్తరణకు ప్రకృతి నుంచి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. తాజాగా విడుదలైన ‘‘2026 Global Analysis of Planned Data Centres for Physical Climate Risk and Resilience’’ నివేదిక ఈ వివరాలను సమగ్రంగా వెల్లడించింది. వాతావరణ ప్రమాదాలపై పరిశోధనలు చేసే ఎక్స్డీఐ (Cross Dependency Initiative - XDI) సంస్థ ఈ అధ్యయనాన్ని చేపట్టింది.ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న లేదా ప్రణాళికలో ఉన్న 2,595 డేటా సెంటర్లను పరిశీలించిన ఈ అధ్యయనం ఒక కీలక విషయాన్ని గుర్తించింది. ఇప్పటివరకు డేటా సెంటర్ల గురించి చర్చలు ప్రధానంగా విద్యుత్ వినియోగం, నీటి అవసరాల చుట్టూనే తిరిగాయి. కానీ భవిష్యత్తులో అసలు ముప్పు నేరుగా వాతావరణ మార్పుల వల్ల రావచ్చని ఈ నివేదిక చెబుతోంది.భారత్ పరిస్థితి ఏంటి?.. ఈ విశ్లేషణ ప్రకారం వాతావరణ సంబంధిత ప్రమాదాల తీవ్రతలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో ఉంది. ముఖ్యంగా దేశంలోని కీలక టెక్నాలజీ కేంద్రాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు.. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా డేటా సెంటర్ల కార్యకలాపాలు దెబ్బతినే ప్రమాదం ఉన్న టాప్-30 ప్రాంతాల్లో చోటు దక్కించుకున్నాయి.ఇది సాధారణ హెచ్చరిక కాదు. ఎందుకంటే భారత్‌లో ప్రస్తుతం డేటా సెంటర్ పెట్టుబడుల పోటీ ఎక్కువగా ఈ రాష్ట్రాల చుట్టూనే తిరుగుతోంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు ఇప్పటికే ప్రధాన డేటా హబ్‌లుగా ఎదుగుతున్నాయి. ఇక్కడే భవిష్యత్తు ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది.వేడి ఎందుకు అంత ప్రమాదకరం?వరదలు వస్తే భవనాలు దెబ్బతింటాయి. తుఫాన్లు వస్తే మౌలిక సదుపాయాలు నాశనం అవుతాయి. కానీ తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం అంత స్పష్టంగా కనిపించదు. అయినప్పటికీ అది మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. డేటా సెంటర్లలో వేల సంఖ్యలో సర్వర్లు నిరంతరం పనిచేస్తుంటాయి. ఇవి సహజంగానే భారీగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. అందుకే వాటిని చల్లబరచడానికి అధునాతన కూలింగ్ వ్యవస్థలు అవసరం. బయట ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కూలింగ్ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి.అంతేకాదు..విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందిపరికరాల సామర్థ్యం తగ్గుతుందిసర్వర్ వైఫల్యాల ప్రమాదం పెరుగుతుందిసేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుందినిర్వహణ ఖర్చులు పెరుగుతాయిఅంటే డేటా సెంటర్ భవనం సురక్షితంగానే ఉన్నా.. తీవ్ర వేడి కారణంగా దాని పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది.అసలు ముప్పు భవనం బయటే ఉందా?ఈ నివేదికలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. డేటా సెంటర్ ఎంత బలంగా నిర్మించినా అది ఒంటరిగా పనిచేయదు. దానికి విద్యుత్ సరఫరా, నీటి వనరులు, టెలికాం నెట్‌వర్క్‌లు, రవాణా వ్యవస్థలు, సరఫరా గొలుసులు అవసరం. ఒకవేళ తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యుత్ గ్రిడ్లు విఫలమైతే? నీటి సరఫరా నిలిచిపోతే? రవాణా వ్యవస్థలు స్తంభిస్తే? డేటా సెంటర్ నేరుగా దెబ్బతినకపోయినా దాని కార్యకలాపాలు ఆగిపోవచ్చు.యూరప్‌లో నిర్వహించిన మరో అధ్యయనాన్ని ఉదహరిస్తూ ఎక్స్డీఐ ఒక కీలక విషయాన్ని పేర్కొంది. నేరుగా భవనానికి జరిగే నష్టం కంటే ఇలాంటి పరోక్ష మౌలిక సదుపాయాల వైఫల్యాల వల్ల కలిగే ఆర్థిక నష్టం పది రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంచనా.ప్రపంచానికి కూడా ఇదే సమస్యఈ ముప్పు కేవలం భారత్‌కే పరిమితం కాదు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా ప్రాంతాలు మొత్తం అధిక ప్రమాద జోన్లుగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం దక్షిణాసియాలో ప్రణాళికలో ఉన్న డేటా సెంటర్లలో సుమారు 12 శాతం ఇప్పటికే అధిక ప్రమాద కేటగిరీలో ఉన్నాయి. అధిక కార్బన్ ఉద్గారాలు కొనసాగితే శతాబ్దం చివరినాటికి ఈ ప్రమాదం మూడింతలకు పైగా పెరిగే అవకాశం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. భారత్‌తో పాటు బ్రెజిల్, మెక్సికో, ఇండోనేషియా, స్పెయిన్ వంటి దేశాల్లో కూడా తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా కార్యకలాపాలకు అంతరాయం కలిగే ప్రమాదం అధికంగా ఉందని పేర్కొంది.బీమా ఖర్చులు కూడా..డేటా సెంటర్లపై పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ బీమా సంస్థలు కూడా వాతావరణ ప్రమాదాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత రీఇన్సూరెన్స్ సంస్థ Swiss Re అంచనా ప్రకారం ప్రస్తుతం సుమారు 10.6 బిలియన్ డాలర్లు ఉన్న డేటా సెంటర్ బీమా మార్కెట్ 2030 నాటికి 24.2 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో వాతావరణ ప్రమాదాలు పెరిగితే బీమా ప్రీమియంలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది కొత్త ప్రాజెక్టుల వ్యయాలను మరింత పెంచుతుంది.మరి పరిష్కారం మాటేంటి?..అయితే ఇది అనివార్యమైన సంక్షోభం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్న డేటా సెంటర్ల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు.సరైన ప్రాంతాల ఎంపికఅధునాతన కూలింగ్ టెక్నాలజీలువాతావరణ నిరోధక డిజైన్లుబలమైన విద్యుత్ బ్యాకప్ వ్యవస్థలునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడంపునరుత్పాదక ఇంధనాల వినియోగం.. ఇలాంటి చర్యలు భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించగలవని పేర్కొంటున్నారు.ఏఐ యుగంలో డేటా సెంటర్లు కొత్త కాలపు ఫ్యాక్టరీలుగా మారుతున్నాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఇవే వెన్నెముక. భారత్ ప్రపంచ ఏఐ శక్తిగా ఎదగాలంటే కేవలం పెట్టుబడులు ఆకర్షించడం సరిపోదు. ఆ మౌలిక సదుపాయాలు రాబోయే దశాబ్దాల్లో పెరుగుతున్న వేడి, తీవ్రమవుతున్న వాతావరణ మార్పులను కూడా తట్టుకునేలా ఉండాలి. లేకపోతే నేటి డిజిటల్ కలలు.. రేపటి క్లైమేట్ రిస్క్‌ల ముందు నిలబడలేకపోవచ్చు. ఇదే తాజా నివేదిక ఇస్తున్న అసలు హెచ్చరిక. -
అధునాతన వీడియో క్రియేషన్కై.. 'ఏఐ-వర్య'
అవతార్ ఏఐ అభివృద్ధి చేసిన కొత్త వీడియో జనరేషన్ మోడల్ ‘వర్య’ మన దేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో అడుగు. అధునాతన వీడియో క్రియేషన్ సాధనాలను మరింత సులభంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడంలో ‘వర్య’ ముఖ్యమైన ముందడుగుగా చెబుతున్నారు విశ్లేషకులు.సాధారణ టెక్ట్స్, సూచనలు, ఇమేజ్‌ల నుండి అధిక–నాణ్యత గల వీడియోలను రూపొందించడంలో ‘వర్య’ సహాయపడుతుంది. సాంకేతిక నైపుణ్యం, అధునాతన ఎడిటింగ్ పరిజ్ఞానం అవసరమయ్యే సంక్లిష్టమైన ఏఐ సాధనాల వలే కాకుండా ఎవరైనా సులభంగా ఉపయోగించేట్లుగా దీన్ని రూపొందించారు. తమకు ఏమి కావాలో యూజర్లు వివరించవచ్చు.మన ఆలోచనలు, ఐడియాలను తక్షణమే రెడీ–టు–యూజ్ విజువల్ కంటెంట్‌గా మారుస్తుంది వర్య. తక్కువ ఖర్చుతో వీడియోలు రూపొందించాలనుకునే మార్కెటింగ్ టీమ్స్, స్టార్టప్‌లకు, ఇండిపెండెంట్ క్రియేటర్లకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది.‘వర్య’ ముఖ్య బలం ఏమిటంటే ఇది మన దేశ సంస్కృతులు, వివిధ సందర్భాలను స్పష్టంగా అర్థం చేసుకోగలదు. మన పండగలు, సంప్రదాయ నేపథ్యాలు, రోజువారి జీవిత దృశ్యాలు, సుపరిచితంగా, సందర్భోచితంగా అనిపించడానికి ‘వర్య’కు రూపకల్పన చేశారు. దేశీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుక్ను బ్రాండ్లు, ఏజెన్సీలకు ఇది మరింతగా ఉపయోగపడుతుంది. -
మోదీ 'AI' మంత్రం
ఫ్రాన్స్‌లో జరుగుతున్న వివాటెక్ 2026 వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ భారత్ కృత్రిమ మేధ (AI) భవిష్యత్‌పై తన విజన్‌ను వివరించారు. సాంకేతికత కొద్ది మందికే కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికీ ఉపయోగపడాలన్నదే భారత లక్ష్యమని ఆయన అన్నారు.భారత్ పెవిలియన్‌లో ప్రదర్శించిన 3డీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్, AI ఆధారిత ఆరోగ్య సేవల పరిష్కారాలు వంటి ఆవిష్కరణలను సందర్శకులు తప్పక చూడాలని సూచించారు. ముఖ్యంగా Amul రూపొందించిన ‘సార్లాబెన్’ అనే AI అసిస్టెంట్‌ను ప్రస్తావిస్తూ, ఇది మహిళా పాల ఉత్పత్తిదారులకు రోజువారీ పనుల్లో సహాయపడుతోందని చెప్పారు.భారత్‌లోని స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో ప్రపంచ టెక్ సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన మోదీ, దేశ డిజిటల్ విజయాలను గుర్తు చేశారు. DigiLocker ద్వారా 70 కోట్ల మందికి పైగా సేవలు పొందుతున్నారని, UPI ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వేదికల్లో ఒకటిగా ఎదిగిందని పేర్కొన్నారు. అలాగే భారత అంతరిక్ష విజయాలు, ప్రత్యేకించి చంద్రయాన్ మిషన్ పేరును ప్రస్తావించారు. -
హౌస్ వైఫ్ అని చులకనగా చూసారు, 70 AI టూల్స్ నేర్చుకున్నా
-
ఏకంగా 80 శాతం మందిని తొలగించిన టెక్ సీఈవో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు దాదాపు ఉద్యోగులందరి వృత్తిగత జీవితంలో భాగమైపోయింది. కంపెనీలు రెండు మూడేళ్ల క్రితం నుంచే ఏఐ వెంట పడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాలు తప్పనిసరి అయిపోయాయి. ఏఐ స్కిల్స్ లేని, నేర్చుకోని ఉద్యోగులను కంపెనీలు నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి.అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సంస్థ ‘ఇగ్నైట్‌టెక్’ (IgniteTech) సీఈవో ఎరిక్ వాఘన్ (Eric Vaughan) తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏఐ వినియోగాన్ని స్వీకరించడానికి నిరాకరించిన ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించి, దాదాపు 80 శాతం మంది సిబ్బందిని కొత్త వారితో భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇటీవల నిర్వహించిన ఫార్చ్యూన్ బ్రెయిన్‌స్టార్మ్ టెక్ కార్యక్రమంలో వెలుగులోకి వచ్చాయి.జనరేటివ్ ఏఐ వ్యాపార ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుందని భావించి 2023లో తమ సంస్థను “ఏఐ-ఫస్ట్” మోడల్లోకి మార్చే కార్యక్రమాన్ని ఇగ్నైట్‌టెక్ సీఈవో ఎరిక్ వాఘన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి వారం “ఏఐ మండేస్” పేరుతో ఒక రోజంతా ఉద్యోగులు ఏఐ ప్రాజెక్టులపైనే పనిచేయాలని నిబంధన పెట్టారు. ఏఐ టూల్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కోర్సులు నేర్పించడానికి కంపెనీనే ఖర్చు భరించేది. బయటి నుంచి నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించేది. ఇందు కోసం కంపెనీ తన మొత్తం పేరోల్‌లో సుమారు 20 శాతం వరకు వెచ్చించినట్లు వాఘన్ తెలిపారు.అయితే ఈ మార్పును ఉద్యోగులంతా సమానంగా స్వీకరించలేదని, ముఖ్యంగా సాంకేతిక విభాగాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైందని వాఘన్ చెప్పారు. శిక్షణ, ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ కొందరు ఏఐ వినియోగాన్ని పూర్తిగా తిరస్కరించడంతో 2023 నుంచి 2024 తొలి త్రైమాసికం మధ్య వందలాది మంది ఉద్యోగులను తొలగించి కొత్త వారితో భర్తీ చేయాల్సి వచ్చిందన్నారు. “ఇది మా లక్ష్యం కాదు. కానీ కొత్త నైపుణ్యాలు నేర్పడం కంటే మనస్తత్వాన్ని మార్చడం కష్టమైంది” అని ఆయన వ్యాఖ్యానించారు.వివాదాస్పదమైన ఈ నిర్ణయాన్ని ఇప్పటికీ సమర్థిస్తున్న వాఘన్, అదే పరిస్థితి మళ్లీ వస్తే ఇదే నిర్ణయం తీసుకుంటానని కూడా పేర్కొన్నారు. అయితే ఇతర సంస్థలూ విధానాన్ని అనుసరించాలని తాను సిఫార్సు చేయనని స్పష్టం చేశారు. ఏఐ స్వీకరణ కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాకుండా సంస్థ సంస్కృతిలో కూడా మార్పు అనేది ఆయన అభిప్రాయం. “ఉద్యోగులు సంస్థ లక్ష్యాలతో ఏకీభవించకపోతే శిక్షణ లేదా వ్యూహాలు మాత్రమే సరిపోవు” అని అన్నారు. -
ఏఐకి సిలబస్ తెలుసు! టీచర్‌కు నువ్వు తెలుసు!!
‘డియర్ చాట్ జిపిటి..... ఈ క్వశ్చన్ పరీక్షలో రాదు కదా?’ స్టూడెంట్ అడిగితే ఏఐ ‘రాదు’ అని ఊరుకుంటుంది. టీచర్ ‘పరీక్షలో రాకపోయినా జీవితంలో పనికొస్తుంది’ అంటుంది. ఏఐకి సిలబస్ తెలుసు. టీచర్‌కి నువ్వు తెలుసు. నీ సిల్లీ డౌట్లు, నీ కళ్లలో భయం, నీ గుండెల్లో ఆశ. ఏఐ ఆన్సర్ చెప్తే టీచర్ ఆలోచన నేర్పుతుంది. అందుకే భవిష్యత్ చదువు అంటే ‘ఏఐ వర్సెస్ టీచర్’ కాదు. ‘ఏఐ ప్లస్ టీచర్’.ఇంట్లో పిల్లలు హోంవర్క్ మొదలుపెట్టగానే మొదట అడిగే మాట ‘ఏఐలో కొట్టనా?’. కొట్టాక క్షణాల్లో ఆన్సర్ దొరుకుతుందటే బుర్రకు ఇక పని లేదు. తల్లిదండ్రులు కూడాప్రాజెక్ట్ కోసం ‘ఏఐని అడుగు’ అని ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో చాలామందికి ఒక అనుమానం వస్తోంది. ఏఐ అన్నీ చెప్పేస్తుంటే ఇక స్కూల్, టీచర్ ఎందుకు అని. నిజమే, ఏఐ వేగంగా సమాచారం ఇస్తుంది. అర్ధరాత్రి అడిగినా విసుక్కోదు. కానీ చదువులో తెలియడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. ఆ రెండింటి మధ్య గ్యాప్‌ను పూడ్చేది టీచర్ మాత్రమే. ఏఐ యుగంలో టీచర్ పోలేదు. టీచర్ పాత్ర మారింది.టీచర్ కలిగించే స్పృహ‘ఆకు పచ్చగా ఎందుకు ఉంది?’ అని పిల్లాడు అడిగితే ఏఐ మూస పద్ధతి జవాబు చెప్తుంది. టీచర్ మాత్రం ‘నువ్వు అన్నం తింటే బలం వచ్చినట్టు, చెట్టు ఎండ తింటే ఆకు పచ్చగా అవుతుందిరా’ అంటారు. దీన్నే ‘కాన్సెప్టువల్ క్లారిటీ’ అంటారు. ఏఐ డేటా ఇస్తుంది. ఆ డేటాను జీవితానికి అన్వయించే వివేకం, విలువ, దృక్పథం టీచర్ మాత్రమే ఇవ్వగలరు. ఇది యంత్రానికి రాని మానవ స్పందన.టీచర్‌కు ‘క్లాస్రూమ్’ తెలుసుమంచి టీచర్ పాఠం చెప్తూనే పిల్లల ముఖాలు చదువుతారు. ఎవరి కళ్లలో కన్ఫ్యూజన్ ఉందో, ఎవరు అర్థం కాకపోయినా తల ఊపుతున్నారో పసిగడతారు. వెంటనే పాఠం ఆపి, ఉదాహరణ మార్చి, అవసరమైతే మాతృభాషలోకి దిగి చె΄్తారు. పిల్లాడి కంట్లో నీళ్లు చూస్తే సిలబస్ పక్కనబెట్టి ముందు ధైర్యం చె΄్తారు. ఏఐకి ఈ శక్తి లేదు. దానికి ఎమోషన్ తెలియదు. ఒక పద్ధతి ఫెయిల్ అయినా అందరికీ అదే పద్ధతి చూపిస్తుంది. కొత్త బ్యాచ్ వచ్చిన ప్రతిసారీ టీచర్‌కు మరింత అనుభవం పెరిగి ఉంటుంది. ఆ హృదయం, ఆ పరిశీలన ఏఐకి రాదు.‘పాస్’... ‘పర్సన్’చదువులో ముఖ్యమైనది మోటివేషన్. పిల్లలు సబ్జెక్ట్‌తో కాదు, సబ్జెక్ట్ చెప్పే మనిషితో కనెక్ట్ అవుతారు. ‘నువ్వు చేయగలవు’ అని ఏఐ చెప్పదు. టీచర్ చె΄్తారు. ఆ మాటే పిల్లాడిని ఫెయిల్యూర్ నుంచి లేపుతుంది. ఏఐ ఆన్సర్ ఇస్తుంది. టీచర్ ప్రశ్న అడిగే ధైర్యం ఇస్తారు. ఏఐ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. టీచర్ విలువలు నేర్పుతారు. క్యూరియాసిటీ వెలిగించడం, తప్పుచేస్తే సరిదిద్దడం, ఒత్తిడిలో ఉన్న పిల్లాడిని గుర్తించి దగ్గర తీసుకోవడం మనిషికే సాధ్యం. అందుకే భవిష్యత్ చదువు అంటే ‘ఏఐ వర్సెస్ టీచర్’ కాదు. ‘ఏఐ ప్లస్ టీచర్’.మనిషి గుర్తుఅసలు ప్రశ్న ‘టీచర్లు అవసరమా’ అని కాదు. ‘టీచింగ్‌లో మానవీయ స్పర్శ కాపాడుకుంటున్నామా’ అని. ఏఐ వచ్చింది కాబట్టి టీచర్ పని తగ్గలేదు. బాధ్యత పెరిగింది. ఇకపై టీచర్ క్యూరియాసిటీ వెలిగించే కాగడా. డేటా యుగంలో దారి చూపే దిక్సూచి. మీ పిల్లాడి ఫో¯Œ లో ఏఐ ఉండొచ్చు. కానీ వాడి లైఫ్‌లో ‘నా మేడం, నా సార్’ అనే ఒక మనిషి ఉండాలి. ఆ మనిషిని రీప్లేస్ చేసే టెక్నాలజీ ఇంకా పుట్టలేదు. బడిగంట మోగింది. ఇక టీచర్ అసలు పాఠం మొదలు. కేస్ స్టడీ 1హైదరాబాద్‌లో ఎనిమిదో తరగతి చదివే ఓ విద్యార్థి సైన్స్ప్రాజెక్ట్ కోసం ఏఐని.‘గ్లోబల్ వార్మింగ్ కారణాలు’ అడిగాడు. టైప్ చేయగానే ఐదు పాయింట్లు వచ్చాయి. యథాతథంగా చార్ట్ మీద రాసి తీసుకెళ్లాడు. క్లాస్‌లో టీచర్ ‘మన వీధిలో చెట్లు నరికితే ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుంది?’ అని అడిగారు. పిల్లాడు మౌనం వహించాడు. ఏఐ ఇచ్చిన డేటాను తన చుట్టూ ఉన్న ప్రపంచానికి అన్వయించలేక పోయాడు. ఆరోజు టీచర్ క్లాస్ మొత్తాన్ని బయటకు తీసుకెళ్లి ఎండలో సిమెంట్ రోడ్డు వేడి, చెట్టు నీడ చల్లదనం తెలిపి ఉష్ణోగ్రత తేడా ఫీల్ చేయించారు. ఏఐ ‘ఏంటి’ చెప్పింది. టీచర్ ‘ఎందుకు’ అనుభవంలోకి తెచ్చారు.కేస్ స్టడీ 2ఓ ఇంటర్ విద్యార్థిని లెక్కల్లో బలహీనం. ట్యూషన్ చేరి అడిగితే ‘సిల్లీ డౌట్’ అని కోప్పడతారేమోనని భయం. దాంతో ఏఐతోప్రాక్టీస్ మొదలుపెట్టింది. సమాధానాలు వచ్చాయి. కానీ పరీక్షలో అదే మోడల్ మార్చి ఇస్తే తడబడింది. కారణం ఏఐ ఆమె భయాన్ని గుర్తించలేదు. కాలేజీలో లెక్కల మేడం ఆమె ముఖం చూసి విషయం కనిపెట్టారు. ‘నీకు కాన్సెప్ట్ రావాలి’ అని ధైర్యం చెప్పి బోర్డు మీద కాకుండా ఆమె నోట్‌బుక్‌లోనే తప్పును సరిదిద్దారు. మూడు నెలల్లో ఆ అమ్మాయి పాస్ అయింది. ఏఐ సాధన ఇచ్చింది. టీచర్ నమ్మకం ఇచ్చారు. -
80 గంటల పని.. అమెజాన్ అనుభవాలు చెప్పిన సీఈవో!
విజయవంతమైన వ్యాపారవేత్తల జీవితంలో ఎన్నో కఠినమైన అనుభవాలు, కష్టపడి పనిచేసిన రోజులు ఉంటాయి. అమెరికాకు చెందిన ఏఐ భద్రతా సంస్థ డీప్ సెంటినెల్ సీఈవో డేవిడ్ సెలింగర్ కూడా అలాంటి అనుభవాలనే గుర్తు చేసుకున్నారు. ఆయన తన కెరీర్ ప్రారంభ దశలో అమెజాన్‌లో పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ, సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నాయకత్వం తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిందని చెప్పారు.డేవిడ్ సెలింగర్ 2002లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా అమెజాన్‌లో ఉద్యోగం పొందారు. 2003 జనవరిలో కంపెనీలో చేరి.. కస్టమర్ కస్టమర్ బిహేవియర్ రోల్ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో అమెజాన్ ఇప్పటిలా లక్షలాది ఉద్యోగులతో కూడిన దిగ్గజ సంస్థ కాదు. కొద్దిమంది ఉద్యోగులతో పనిచేస్తున్నప్పటికీ, భారీ స్థాయిలో డేటాను విశ్లేషించే అవకాశాలు అక్కడ ఉండేవని ఆయన తెలిపారు.అమెజాన్‌లో పనిచేసే సమయంలో జెఫ్ బెజోస్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు కలిసేవాడినని సెలింగర్ చెప్పారు. బెజోస్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎంతో శక్తివంతమైన, లక్ష్యసాధనపై పూర్తిగా దృష్టి పెట్టే నాయకుడని పేర్కొన్నారు. “ఆయనతో పనిచేయడం అద్భుతమైన అనుభవం” అని సెలింగర్ అన్నారు.అమెజాన్‌లోని పని సంస్కృతి కూడా అంతే కఠినంగా ఉండేదని ఆయన వివరించారు. వారానికి సుమారు 80 గంటలు పనిచేసేవాళ్లమని చెప్పారు. ఉద్యోగుల నుంచి అత్యుత్తమ ఫలితాలను రాబట్టే వాతావరణం ఉండేదని, అక్కడ పనులు కూడా వేగంగా పూర్తయ్యేవని తెలిపారు. సంప్రదాయ సంస్థల్లో ఉండే అనవసర ప్రక్రియలు, సమస్యలు తక్కువగా ఉండటంతో పనిలో వేగం పెరిగేదని చెప్పారు.ఆ కఠినమైన అనుభవమే.. తనను మరింత మెరుగైన నాయకుడిగా తీర్చిదిద్దిందని సెలింగర్ అభిప్రాయపడ్డారు. అమెజాన్‌ను విడిచిన తర్వాత ఆయన డీప్ సెంటినెల్ అనే ఏఐ బేస్డ్ హోం సెక్యూరిటీ సంస్థను స్థాపించారు. పెద్ద స్థాయి డేటా విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలపై అమెజాన్‌లో పొందిన అనుభవం తన వ్యాపార విజయానికి బలమైన పునాదిగా మారిందని పేర్కొన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సీఈవో వింత గిఫ్ట్‌లు
సాధారణంగా ప్రైవేటు సంస్థల్లో ముఖ్యంగా టెక్ కంపెనీల్లో కొందరు యజమానులు ఉద్యోగులతో గొడ్డు చాకరీ చేయించుకుంటారు. ఆఫీసులో ఉన్నంత సేపూ వారి నుంచి శ్రమను పిండేసుకుంటారు. ఈ క్రమంలో ఉద్యోగులు పడుతున్న ఒత్తిడి, శారీరక, మానసిక ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టించుకోరు. దీంతో అలాంటి బాస్‌లు ఉద్యోగులను కనీసం పడుకోనివ్వకుండా నిద్రలోనూ కలలోకి వస్తుంటారు. కానీ దీనికి భిన్నంగా, రోజంతా కష్టపడిన తమ ఉద్యోగులు సుఖంగా నిద్రపోవాలని ఓ కంపెనీ సీఈవో ఏం చేశారో చూద్దం ఈ కథనంలో..కార్యాలయాల్లో ఉచిత భోజనం, గేమింగ్ జోన్లు, వినోద సదుపాయాలు ఇవ్వడం టెక్ కంపెనీల్లో సాధారణమే. అయితే అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ ‘ఫ్యాక్టరీ’ (Factory) సీఈఓ మాతన్ గ్రిన్బర్గ్ మాత్రం భిన్నంగా ఆలోచించారు. ఉద్యోగుల ఉత్పాదకతను పెంచాలంటే ముందుగా వారి నిద్ర నాణ్యత మెరుగుపడాలని భావించి, కంపెనీలో ఉన్న ప్రతి ఉద్యోగికి దాదాపు 3,000 డాలర్లు (సుమారు రూ.2.6 లక్షలు) విలువైన ఎయిట్ స్లీప్ (Eight Sleep) స్మార్ట్ మ్యాట్రెస్ కవర్‌ను బహుమతిగా అందించారు. ఈ నిర్ణయం అప్పట్లో కంపెనీలో సుమారు 30 మంది ఉద్యోగులు ఉన్న సమయంలో తీసుకున్నదని ఆయన వెల్లడించారు.2023లో స్థాపించిన ‘ఫ్యాక్టరీ’ ప్రస్తుతం వేగంగా ఎదుగుతున్న ఏఐ స్టార్టప్‌లలో ఒకటిగా నిలిచింది. కంపెనీకి ప్రస్తుతం సుమారు 120 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ 150 మిలియన్ డాలర్ల సిరీస్-సీ నిధులను సమీకరించగా, ఈ రౌండ్‌కు ఖోస్లా వెంచర్స్ నాయకత్వం వహించింది. సీక్వోయా క్యాపిటల్, బ్లాక్‌స్టోన్, ఇన్సైట్ పార్ట్నర్స్ తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. తాజా నిధుల సమీకరణతో కంపెనీ విలువ 1.5 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది.ఇటీవల “20VC” పోడ్కాస్ట్లో మాట్లాడిన గ్రిన్బర్గ్, తన ఇంజనీర్లను ప్రొఫెషనల్ అథ్లెట్లతో పోల్చారు. క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలంటే సరైన విశ్రాంతి ఎంత అవసరమో, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా నాణ్యమైన నిద్ర అంతే కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. “మనుషులు తమ మెదడు సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలంటే ముందుగా బాగా నిద్రపోవాలి” అని ఆయన పేర్కొన్నారు.ఎయిట్ స్లీప్ మ్యాట్రెస్ వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ద్రవ ఆధారిత శీతలీకరణ, తాపన సాంకేతికత ద్వారా మంచం ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. దంపతులు మంచం రెండు వైపులా వేర్వేరు ఉష్ణోగ్రతలను ఎంచుకునే వీలుంది. తాజా మోడళ్లలో మంచం కోణాన్ని సర్దుబాటు చేసే సదుపాయం కూడా ఉంది.అయితే ఉద్యోగుల నిద్ర అలవాట్లను కంపెనీ ట్రాక్ చేయదని, పనితీరును కొలవడానికి ఈ సాంకేతికతను ఉపయోగించబోమని గ్రిన్బర్గ్ స్పష్టం చేశారు. “ఎవరైనా బాగా నిద్రపోలేదని చెప్పి వారి కోడ్‌ను నమ్మకూడదని మేము చెప్పం” అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.ఇటీవలి కాలంలో ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై కంపెనీలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. మహమ్మారి తర్వాత “స్లీప్ మాక్సింగ్” అనే ధోరణి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. స్లీప్ ట్రాకర్లు, స్మార్ట్ వేరబుల్స్, నిద్ర సాంకేతిక ఉత్పత్తుల వినియోగం కూడా పెరుగుతోంది. మంచి నిద్ర నిర్ణయ సామర్థ్యం, ఏకాగ్రత, సృజనాత్మకతను మెరుగుపరుస్తుందని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఫ్యాక్టరీ తీసుకున్న ఈ వినూత్న చర్య భవిష్యత్తులో ఉద్యోగి సంక్షేమానికి కొత్త ప్రమాణాలను సృష్టించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
గొంతు విప్పకముందే నొక్కేస్తుంది!
ప్రభుత్వంలో జరుగుతున్నఅవినీతి మీద ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారా? వానలతో దెబ్బతిన్న నగర రోడ్ల గురించిఅధికారులను విమర్శిస్తూ ‘ఎక్స్’లో కోపంతోఏదైనా కామెంట్ చేశారా?వాట్సాప్ గ్రూపులో దేశ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారా?అయితే జాగ్రత్త..మీ కామెంట్లు, పోస్టుల ఆధారంగా రేపు మీరు ఏమనుకుంటారో, ఎవరిని విమర్శిస్తారో, ఏ నిరసనలో పాల్గొంటారో కూడా కృత్రిమ మేధ (ఏఐ) ముందే ఊహించి మీ పేరుతో ఒక ’రిస్క్ స్కోర్’ను రూపొందించే రోజులు వస్తున్నాయి. చైనాలో వెలుగులోకి వచ్చిన ఏఐ ఆధారిత నిఘా ప్రాజెక్టు, సాంకేతికత వివరాలు బయటకు పొక్కడంతో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, భవిష్యత్తుపై కొత్త ఆందోళనతలెత్తుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ముందే గుర్తించి నియంత్రణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు.. భవిష్యత్తులో వారు పూర్తిస్థాయిలో ప్రభుత్వ విమర్శకులుగా మారే అవకాశముందేమో ముందుగానే గుర్తించి నిషేధించే ఏఐ వ్యవస్థ చైనాలో తయారవుతోంది. చైనాకు చెందిన జీఎడ్జ్ నెట్వర్క్స్ అనే సంస్థ అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా పోస్టులు, ఫోన్ డేటా, లొకేషన్ ఆధారంగా పౌరుల ప్రవర్తనను విశ్లేషించి వారిపై నిఘా పెట్టే ప్రాజెక్టుకు రూపకల్పన జరుగుతున్నట్లు వెల్లడైంది. భవిష్యత్తులో ప్రభుత్వ విమర్శకులుగా మారే వారిని ముందుగానే గుర్తించి నియంత్రించడానికి ఈ వ్యవస్థను తయారు చేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అమెరికా విధించిన చిప్ ఆంక్షలతో ఈ ప్రాజెక్టుకు కొంత బ్రేకులు పడినా.. పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ప్రజలు అసమ్మతి వ్యక్తం చేయకముందే వారి గొంతు నొక్కేసే చర్యలకు ప్రభుత్వాలు దిగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.చైనా పౌరుల సమగ్ర ప్రొఫైళ్ల రూపకల్పనలో జీఎడ్జ్అమెరికాకు చెందిన వాండర్బిల్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీకి చెందిన పరిశోధకులు.. జీఎడ్జ్ సంస్థ తన ప్రభుత్వ మద్దతు ఉన్న పరిశోధనా విభాగం మెసా ల్యాబ్‌తో కలిసి చైనా పౌరుల సమగ్ర ప్రొఫైళ్లు రూపొందించే పనిలో ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రొఫైళ్ల ఆధారంగా రాజకీయంగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న వ్యక్తులను ఏఐ సహాయంతో ముందే గుర్తించే టెక్నాలజీని కంపెనీ అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడైంది. అయితే అధునాతన చిప్‌ల ఎగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలు ఈ ప్రాజెక్టు పురోగతిని కొంతవరకు దెబ్బతీశాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో విధించిన ఆంక్షలు కొంత అడ్డుకున్నాయని అంటున్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం కొన్ని పరిమితులను సడలించినప్పటికీ, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఏఐ చిప్‌లను రూపొందించే ఎన్విడియా తయారీ అత్యాధునిక ప్రాసెసర్లపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో అమెరికా చిప్‌లపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు స్వదేశీ ఏఐ చిప్‌ల అభివృద్ధిపై చైనా దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం జీఎడ్జ్ వద్ద ఉన్న గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు) ప్రస్తుత ఉత్పత్తులకు సరిపోతున్నప్పటికీ, మరింత శక్తివంతమైన అంచనా వ్యవస్థను రూపొందించాలంటే చైనాకు అత్యాధునిక చిప్‌లు అవసరమవుతాయని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షకు పైగా పత్రాల లీక్ చైనా అమలు చేస్తున్న గ్రేట్ ఫైర్‌వాల్ తరహా ఇంటర్నెట్ పర్యవేక్షణ, సెన్సార్షిప్ సాఫ్ట్‌వేర్‌ను జీఎడ్జ్ నెట్వర్క్స్ అనేక దేశాలకు వాణిజ్యపరంగా విక్రయిస్తోంది. ఈ సాంకేతికత ద్వారా అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం, సెన్సార్షిప్ను తప్పించుకునేందుకు పౌరులు చేసే ప్రయత్నాలను గుర్తించడం, ప్రజల ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘా పెట్టడం వంటి చర్యలు చేపడుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో జీఎడ్జ్ కు సంబంధించిన లక్షకు పైగా పత్రాలు లీక్ కావడంతో ఈ నిఘా వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పత్రాలను విశ్లేషించిన వైర్డ్ సహా పలు మీడియా సంస్థలు, జీఎడ్జ్ తన నెట్వర్క్ భద్రతా సాఫ్ట్‌వేర్‌ను ఇథియోపియా, కజకిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్ వంటి దేశాలకు ఎగుమతి చేసి అక్కడ మొబైల్ నెట్‌వర్క్‌లపై భారీ స్థాయి నిఘా నిర్వహించేందుకు సహకరించినట్లు వెల్లడించాయి. తాజాగా జీఎడ్జ్ ఇంజనీర్లు ప్రజల మొబైల్ సమాచారం, సోషల్ మీడియా కార్యకలాపాలు, లొకేషన్ డేటా ఆధారంగా వ్యక్తుల ప్రవర్తనా నమూనాలను రూపొందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. గోప్యత, పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలు ప్రశ్నార్థకం? కృత్రిమ మేధ సహాయంతో పౌరుల రాజకీయ అభిప్రాయాలను ముందుగానే అంచనా వేసే దిశగా చైనా చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా గోప్యత, పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై కొత్త చర్చకు తెరలేపాయి. ఈ రోజు మీ మొబైల్లో చేసిన సెర్చ్, సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్, వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసిన మెసేజ్ కేవలం డేటానే కావచ్చు. కానీ రేపు అదే డేటా ఆధారంగా మీరు ముందు ముందు ఒక నిరసనకారుడు, ప్రభుత్వ విమర్శకుడు అయ్యే అవకాశముందని ఏఐ ముద్ర వేస్తే? చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త తరం నిఘా సాంకేతికత ప్రస్తుతం భారత్ సహా ఇతర దేశాలకు అందుబాటులో లేదనుకున్నా, డిజిటల్ పాలన వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత ప్రపంచంలో అది పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కేవలం చైనా కథ కాదని, డిజిటల్ యుగంలో ప్రతి పౌరుడి భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరిక అని అంటున్నారు.మాస్ సర్వైలెన్స్ (భారీ స్థాయి నిఘా వ్యవస్థ)కు కృత్రిమ మేధ జత అయితే జరిగేది ఇదే. ఒక వ్యక్తి ప్రభుత్వం వ్యతిరేకిగా మారకముందే అతడిని గుర్తించి పర్యవేక్షించే స్థాయికి ఈ టెక్నాలజీ తీసుకెళ్లే ప్రమాదం ఉంది. – బ్రెట్ జే. గోల్డ్‌స్టీన్, వికెడ్ ప్రాబ్లమ్స్ ల్యాబ్ డైరెక్టర్ ప్రజలు ఏం చేస్తున్నారన్నది మాత్రమే కాదు.. భవిష్యత్తులో వారు ఏం చేయచ్చో ముందే అంచనా వేసే వ్యవస్థలను నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇది నిఘా వ్యవస్థల్లో కొత్త దశ. – అమెరికా భద్రతా వర్గాల విశ్లేషణ -
డబ్బు అవసరం ఉండదు!.. భవిష్యత్తులో..
స్పేస్ఎక్స్ ఐపీఓ విజయవంతం కావడంతో ఎలాన్ మస్క్ తొలి ట్రిలియనీర్ అయ్యారు. కానీ.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఆయన, డబ్బు చివరికి పూర్తిగా నిరుపయోగంగా మారుతుందని సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారితీశాయి.ఇటీవల ఎక్స్‌ప్రైజ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ 'పీటర్ డయామాండిస్'తో మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోబోట్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మారుస్తాయని మస్క్ పేర్కొన్నారు. ఏఐ, రోబోట్లు నిరంతరం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేయగలవు. తద్వారా వస్తువుల ధరలు కూడా తగ్గిపోతాయి. చివరికి మనుషులు చేయడానికి పనులు లేకుండా పోతాయని అన్నారు.మనుషుల అవసరం ఎప్పుడైతే తగ్గిపోతుందో.. ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. కార్మికుల అవసరం ఉండదు, వారికి వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఒక దశలో డబ్బు అవసరం ఉండదని మస్క్ స్పష్టం చేశారు.ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన్ మీరు, డబ్బు అవసరం ఉండదని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉందని మస్క్‌ను ఇంటర్వ్యూ చేసే పీటర్ డయామాండిస్ అన్నారు. భవిష్యత్తులో ఇది నిజం అవుతుందని టెస్లా బాస్ జవాబిచ్చారు.భవిష్యత్తులో ప్రజలు ఉద్యోగాల ద్వారా సంపాదించకపోయినా.. జీవించగలిగేలా 'యూనివర్సల్ హై ఇన్కమ్' (సార్వత్రిక ఆదాయం) అనే వ్యవస్థ వస్తుందని మస్క్ గతంలో సూచించారు. ఈ విధానంలో ప్రతి ఒక్కరికీ కనీస జీవనానికి సరిపడే ఆదాయం లభిస్తుంది. అవసరమైనవారికి ప్రభుత్వాలే డబ్బులు ఇచ్చే రోజు ఒకటి వస్తుంది. తద్వారా ఆటోమేషన్ వల్ల వచ్చే మార్పులను సమాజం ఎదుర్కోగలుగుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్! -
ఏఐ దెబ్బకు 12 వేల కోర్సులు ఔట్.. చదివిన డిగ్రీలు చెత్తబుట్టలోకి?
ఒకప్పుడు డిగ్రీ ఉంటే ఉద్యోగం దాదాపు ఖాయం అన్న భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాంకేతిక విప్లవ వేగం పెరగటంతో నిన్నటి నైపుణ్యాలు ఈ రోజు పనికిరాని స్థితికి చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులకు భవిష్యత్తులో అవసరమయ్యే సామర్థ్యాలు ఏమిటన్న దానిపై దేశాలు మళ్లీ ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తీసుకున్న తాజా నిర్ణయాలు అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో ప్రపంచ ఉద్యోగ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ.. చైనా ఉన్నత విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా... కాలం చెల్లినట్లు భావిస్తున్న వేలాది డిగ్రీ కోర్సులను విశ్వవిద్యాలయాలు తొలగిస్తున్నాయి. చైనా ఉన్నత విద్యా సంస్థలు తమ విద్యా కోర్సుల్లో పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడుతున్నాయి. దేశాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నత విద్యను మరింత దగ్గరచేసే ప్రయత్నంలో భాగంగా వేల సంఖ్యలో కాలం చెల్లినట్లు భావిస్తున్న డిగ్రీలను తొలగించి, వాటి స్థానంలో కొత్త సాంకేతికత ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతున్నాయి.10,200 కొత్త కోర్సులు పరిశ్రమల్లో ప్రపంచ నాయకత్వం సాధించాలనే లక్ష్యాన్ని చైనా పెట్టుకుంది. అలాగే, చైనాలో లక్షలాది యువతకు ఉపాధి దొరకడం లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కొనే ప్రయత్నంలో చైనా ఈ చర్యలు చేపడుతోంది. 2021 నుంచి 2025 మధ్య చైనా ఉన్నత విద్యా సంస్థలు 12,200 అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులను రద్దు చేశాయి. అదే సమయంలో 10,200 కొత్త కోర్సులను ప్రారంభించాయి. దీంతో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయ కోర్సుల్లో 30%కి పైగా మార్పులు చోటుచేసుకున్నాయి.ఈ విభాగాల్లో కోర్సులు ఔట్ ఈ తొలగింపులు ప్రధానంగా కళలు, మానవీయ శాస్త్రాలు, విదేశీ భాషలు, నిర్వహణ విద్య విభాగాల్లో జరిగాయి. చైనాలో యువత విషయంలో నిరుద్యోగం 16% కి పైగా ఉండటం, ఉద్యోగ రంగం కృత్రిమ మేధ ప్రభావంతో వేగంగా మారిపోవటం వల్ల ఈ విభాగాలను కాలం చెల్లినవిగా భావిస్తున్నారు.ఇక కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులు చైనా ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలకు దగ్గరగా ఉన్నాయి. ఉదాహరణకు, 9 విశ్వవిద్యాలయాలు "ఎంబాడీడ్ ఇంటెలిజెన్స్"ని ప్రారంభించాయి. ఎంబాడీడ్ ఇంటెలిజెన్స్ అంటే భౌతిక యంత్రాలు లేదా రోబోట్లు పరిసరాలను గుర్తించి స్వయంగా నిర్ణయాలు తీసుకునే కృత్రిమ మేధ విధానం.పనికిరాని కోర్సులు ఎందుకు? తదుపరి తరం కృత్రిమ మేధను వాస్తవ ఆర్థిక వ్యవస్థలో వేగంగా కలపాలనే జాతీయ లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో చైనా ఆర్థిక వ్యవస్థ వేగంగా మారిపోతుండటంతో విశ్వవిద్యాలయాలపై మార్పులు చేపట్టాలనే ఒత్తిడి పెరిగింది. పట్టభద్రుల సంఖ్య రికార్డు స్థాయికి చేరినా, చాలామందికి వారి డిగ్రీలు ఉద్యోగాలు సంపాదించటంలో పెద్దగా ఉపయోగపడటం లేదు.ఉదాహరణకు, షాంఘై సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం ఈ ఏడాది తన ఉత్పత్తి రూపకల్పన కోర్సులో ప్రవేశాలను నిలిపివేసింది. ఆ కోర్సు వల్ల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటమే ఈ నిర్ణయానికి ఒక కారణం. మోడలింగ్, రెండరింగ్ వంటి అనేక ప్రధాన పనులను ఇప్పుడు కృత్రిమ మేధే నిర్వహిస్తోంది.మాధ్యమ విద్యపై దృష్టి సారించిన బీజింగ్‌లోని ప్రతిష్ఠాత్మక కమ్యూనికేషన్ యూనివర్సిటీ ఆఫ్ చైనా కూడా పలు కోర్సులను పునర్వ్యవస్థీకరించింది. ఇందులో సినిమాటోగ్రఫీ కోర్సును ఫిల్మ్ అండ్ టెలివిజన్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ కోర్సుతో విలీనం చేసింది.పూర్వ విద్యార్థులు ఏమంటున్నారు? ఈ మార్పు సాంకేతిక, మార్కెట్ పరిణామాలకు సహజ ప్రతిస్పందన అని విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. 2012లో సినిమాటోగ్రఫీ కోర్సు పూర్తి చేసిన వీడియోగ్రాఫర్ సాంగ్ సాంగ్ మాట్లాడుతూ.. తాను చదివిన కాలంలో ఫిల్మ్ నుంచి డిజిటల్ సాంకేతికత వైపు మార్పు జరిగిందని చెప్పాడు.“ప్రత్యక్ష ప్రసారాలు, చిన్న వీడియోలు పెరగటంతో కెమెరామెన్ నైపుణ్య అవసరాలు సంప్రదాయ టెలివిజన్ వార్తల చిత్రీకరణతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి” అని సాంగ్ అన్నాడు. విద్యలో మార్పులు తప్పనిసరి అని తెలిపాడు.అయితే ఒక కోర్సు స్థానంలో మరో కోర్సును ప్రవేశపెట్టటం తాత్కాలిక పరిష్కారమే అవుతుందని, వేగంగా మారుతున్న సాంకేతిక యుగానికి అనుగుణంగా ఉన్నత విద్యలో మరిన్ని మార్పులు అవసరమని జాతీయ విద్యా శాస్త్రాల సంస్థ సీనియర్ పరిశోధకుడు చు జావోహుయ్ హెచ్చరించారు.విశ్వవిద్యాలయాలు తొలగించిన అనేక కోర్సులు కొన్నేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయని చు పేర్కొన్నారు. అందువల్ల అభివృద్ధి చెందటానికి తగిన సమయం కూడా వాటికి దొరకలేదని తెలిపారు.ఒక ప్రధానాంశం స్థానంలో మరొకటి మార్చటం కన్నా, విద్యార్థులకు తమ కోర్సులను తామే ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఇచ్చే సౌకర్యవంతమైన విధానాన్ని విశ్వవిద్యాలయాలు అవలంబించాలని చు సూచించారు.“దీంతో విద్యార్థులు తమ ఆసక్తులు, ప్రత్యేక సామర్థ్యాలు, భిన్న వృత్తి మార్గాల అవసరాలకు అనుగుణంగా కోర్సులను ఎంచుకుని, తమకంటూ ప్రత్యేక మేధో స్వరూపాన్ని నిర్మించుకుంటారు” అని చు అన్నారు. ఉద్యోగ విపణి మరింత అనిశ్చితంగా మారుతున్న వేళ చైనాలో చాలామంది అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీని అంతిమ గమ్యంగా కాకుండా తొలి మెట్టుగా చూడటం ప్రారంభించారు. -
జాబ్స్ కాదు.. ఏఐతో ఇంకా చాలా పోవచ్చు: సత్య నాదెళ్ల
కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల ఉద్యోగాలను తినేస్తుందనే భయాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ వల్ల సృష్టించే విలువ, సంపద, జ్ఞానం అన్నీ కొద్ది కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమైతే ఏం జరుగుతుందో చెబుతూ ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగాలు పోవడమే కాదు.. అంతకు మించిన ముప్పు పొంచి ఉందని అంటున్నారాయన.ఏఐ వల్ల వచ్చే లాభాలు, జ్ఞానం, వ్యాపార విలువ అంతా కొద్ది కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమవడం అసలు ముప్పని సత్య నాదెళ్ల హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన సుదీర్ఘ పోస్టులో నాదెళ్ల.. ఏఐ విప్లవాన్ని కేవలం మరో సాంకేతిక మార్పుగా చూడకూడదన్నారు. అలా జరిగితే మిగతా సంస్థలు తమ సొంత పరిజ్ఞానం, అనుభవం, పోటీపడే సామర్థ్యాన్ని కోల్పోయి పూర్తిగా వాటిపైనే ఆధారపడాల్సి వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.గతంలో డిజిటల్ టూల్స్ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడానికి మాత్రమే ఉపయోగపడేవని.. కానీ ఇప్పుడు మనుషులు, ఏఐ వ్యవస్థలు పరస్పరం నేర్చుకునే కొత్త దశలోకి ప్రపంచం అడుగుపెడుతోందని వివరించారు. దీనిని ఆయన "కాగ్నిటివ్ లూప్"గా అభివర్ణించారు. భవిష్యత్తులో సంస్థల విజయాన్ని నిర్ణయించేది కేవలం డబ్బు లేదంటే యంత్రాలో కాదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అనుభవం, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం, సృజనాత్మకత ఎంత ముఖ్యమో.. ఏఐ ఆధారంగా సంస్థలు సొంతంగా అభివృద్ధి చేసుకునే సామర్థ్యాలు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. అయితే ఈ రెండింటిలోనూ మనిషే కేంద్రబిందువుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. లక్ష్యాలను నిర్దేశించడం, కొత్త ఆలోచనలను సృష్టించడం, విభిన్న రంగాల మధ్య సంబంధాలను గుర్తించడం వంటి అంశాల్లో మనుషుల పాత్ర కీలకంగానే ఉంటుందని పేర్కొన్నారు. అయితే నాదెళ్ల ఆందోళన ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది కాదు. కొద్ది సంఖ్యలో ఉన్న శక్తివంతమైన ఏఐ మోడళ్లపై ప్రపంచంలోని కంపెనీలు పూర్తిగా ఆధారపడిపోతే.. తమ సొంత పరిజ్ఞానం, మేధోసంపత్తి, అనుభవాన్ని క్రమంగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. "ప్రతి రంగంలోని ప్రతి సంస్థ సృష్టించిన విలువ అంతా కొద్ది ఏఐ మోడళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రపంచాన్ని మనలో ఎవరూ కోరుకోరు" అని వ్యాఖ్యానించారాయన.ఈ సందర్భంలో ఆయన ప్రపంచీకరణ తొలి దశను ఉదాహరణగా ప్రస్తావించారు. తయారీ పరిశ్రమలు ఒక దేశం నుంచి మరో దేశానికి తరలిపోవడంతో ఆర్థిక వృద్ధి కాగితాలపై కనిపించినా.. అనేక ప్రాంతాలు, వర్గాలు శాశ్వతంగా నష్టపోయాయని గుర్తు చేశారు. అదే పరిస్థితి ఇప్పుడు ఏఐ యుగంలోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. కంపెనీలు దశాబ్దాలుగా కూడబెట్టుకున్న అనుభవం, పరిజ్ఞానం, వ్యాపార విలువ మొత్తం ఏఐ వ్యవస్థల్లో కలిసిపోతే.. దాని ద్వారా వచ్చే లాభాలు మాత్రం కొద్ది సంస్థలకే పరిమితమయ్యే ప్రమాదాన్ని ఆయన ఎత్తిచూపారు. అందుకే "ఫ్రాంటియర్ మోడల్" కాకుండా "ఫ్రాంటియర్ ఎకోసిస్టమ్" అవసరమని నాదెళ్ల సూచించారు. అంటే.. కొద్ది కంపెనీలు మాత్రమే ఏఐని నియంత్రించే పరిస్థితి కాకుండా.. వివిధ దేశాలు, సంస్థలు, పరిశ్రమలు తమ సొంత ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే ఏఐ వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరుతాయని అభిప్రాయపడ్డారు.https://t.co/vLmiBKTtX3— Satya Nadella (@satyanadella) June 14, 2026ఇదిలా ఉండగా.. ఏఐ భవిష్యత్తుపై ఇతర సాంకేతిక దిగ్గజాలు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ ఇటీవల ఏఐ కారణంగా దీర్ఘకాలిక ఉద్యోగ నష్టాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏఐ మానవ మేధస్సుతో చేసే అనేక పనులను భర్తీ చేస్తే.. ఉద్యోగాలపై శాశ్వత ప్రభావం పడొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితి మరింత తీవ్రమైతే ప్రభుత్వాలు ఉద్యోగుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాల్సి రావచ్చని కూడా సూచించారు.మరోవైపు, ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ మాత్రం ఉద్యోగ కోతలన్నింటికీ ఏఐనే కారణమని చెప్పడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. జనరేటివ్ ఏఐ అనేది విస్తృతంగా అందుబాటులోకి రాకముందే అనేక సంస్థలు ఉద్యోగులను తొలగించాయని గుర్తుచేశారు. ఉద్యోగాల కోత వెనుక ఆర్థిక పరిస్థితులు, వ్యాపార వ్యూహాలు, మార్కెట్ మార్పులు వంటి అనేక కారణాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ఇప్పుడు కొత్త దశకు చేరుకుంది. ఒకవైపు అపార అవకాశాలు కనిపిస్తుంటే.. మరోవైపు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల చేసిన హెచ్చరిక ఒక కీలక ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఏఐ మనిషిని మరింత శక్తివంతం చేసే సాధనంగా మారుతుందా? లేదంటే కొద్ది కంపెనీల చేతుల్లోనే శక్తిని కేంద్రీకరించి మిగతా ప్రపంచాన్ని ఆధారపడేలా చేస్తుందా? రానున్న దశాబ్దంలో ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. -
కలం చేతనే!
వేల ఏళ్ల కింద గుహగోడ మీద మనిషి బొగ్గుతో గీత గీశాడు. అది అతడి మొదటి కవిత. ఆకలి గురించి కాదు. వేట గురించి కాదు. ఆశ్చర్యం గురించి. ఆకాశం వైపు చూసి మొదటిసారి ‘ఏమిటది?’ అని అడిగిన క్షణమే ఆ గీత. ఆ ప్రశ్నే సాహిత్యమైంది. ఇవాళ అదే మనిషి ఒక తెర ముందు కూర్చున్నాడు. తెర అతన్ని అడుగుతోంది: ‘ఏం కావాలి? కథా... కవితా... వచనమా’... మనిషి కలాన్ని పక్కన పెట్టి, ఆబగా తెరతో బేరసారాలు చేస్తున్నాడు. జోలె పడుతున్నాడు. ఏఐ నా వేయి ఏనుగుల బలం అంటున్నాడు.ఏఐకి జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని గ్రంథాలయాల జ్ఞాపకాలు దాని వద్ద నిక్షిప్తమై ఉన్నాయి. దానికి ‘మరపు’ లేదు. కాని మనిషి రచయిత అవుతాడు ఎందుకంటే వాడు మర్చిపోతాడు. బాధను మర్చిపోవడానికి కథ రాస్తాడు. అవమానాన్ని కప్పిపుచ్చడానికి వ్యంగ్యం రాస్తాడు. తీరని ప్రేమను బతికించుకోవడానికి పద్యం రాస్తాడు. మరపు అనే ఖాళీలోనే సృజన పుడుతుంది. యంత్రానికి ఆ ఖాళీ లేదు. దానికి అంతా గుర్తుంటుంది. అందుకే అది కొత్తగా పుట్టించలేదు. ‘వాన వెనుకంజ వేసింది’ అనే వాక్యాన్ని సృష్టించలేదు – ఇంతకు ముందు రాసి ఉంటే తప్ప.మనిషి రాయడానికి బయల్దేరిన ప్రతి క్షణం భయమే. తెల్ల కాగితం భయం. మొదటి వాక్యం భయం. ‘నేను రాసింది ఎవరైనా చదువుతారా లేదా?’ అనే వణుకు. ఈ భయమే రచయితను నిజాయితీగా ఉంచుతుంది. ప్రతి పదాన్నీ తూకం వేయిస్తుంది. ఏఐకి? అది నిర్భయంగా రాస్తుంది. దానికి పరువు లేదు. పోగొట్టుకోవడానికి పేరూ లేదు. పరువు పోతుందనే భయం లేని చోట సాహిత్యం పుట్టదు. సర్కస్ పుడుతుంది. అపసాహిత్యం. అలాగని యంత్రాన్ని ద్వేషించాల్సిన పని లేదు. అది శత్రువు కాదు. ఉలి. శిల్పి చేతిలో ఉలి శిల్పాన్ని చెక్కుతుంది. పిచ్చివాడి చేతిలో పడితే నాశనం చేస్తుంది. రాత్రి రెండు గంటలకు ఒక ఆలోచన తట్టి, పదం దొరకక గోడకు తల బాదుకునే రచయితకు ఏఐ ఒక నిఘంటువు. కథ అడ్డం తిరిగినప్పుడు ‘ఇలా ముగిస్తే ఎలా ఉంటుంది?’ అని సలహా ఇచ్చే మూగ స్నేహితుడు. డెబ్బై ఏళ్ల స్త్రీ తన జ్ఞాపకాలను పుస్తకం చేయాలనుకుంటే ఆమెకు ఏఐ ఒక కార్యదర్శి. ఏ పీరియడ్ నవలో రాయాలనుకుంటే మెటీరియల్ వెతికి పెట్టే రీసెర్చ్ అసిస్టెంట్. అంతవరకే. అంతవరకు మాత్రమే. తలకిందుల తపస్సు చేసినా ఏఐకి గర్భగుడిలో ప్రవేశం లేదు. ఇవ్వరాదు. కథ పుట్టే చోటు, ఆ మొదటి స్పార్క్, ‘ఎందుకు చెప్పాలి’ అనే తపన – అది మనిషి హృదిలోనే పుట్టాలి. దాన్ని అవుట్సోర్స్ చేస్తే ఇక అతను రచయిత కాదు, చీప్ ఎడిటర్ మాత్రమే. యంత్రం రాసిన పేరాలో విషం ఉంటే, అబద్ధం ఉంటే, ఆ పాపం ప్రాంప్ట్ కొట్టిన చేతిదే. అన్నీ యంత్రమే ఇస్తే బాగుండనే తరం నేడు తయారైతే రేపటి తరానికి ‘తపన’ అనే పదానికి అర్థం తెలియదు. పదం కోసం వేటాడటం, ఒక ఉపమానం కోసం నెలలు తపించడం, ఒక ఐడియా తట్టినప్పుడు వచ్చే కన్నీరు – ఈ ఆకలిని యంత్రం తీర్చకూడదు. ఇది మనిషికే వదిలేయాలి. మనిషి పెన్ చూశాడు, టైపు మిషన్ చూశాడు, కంప్యూటర్ కీబోర్డు చూశాడు, ఇప్పుడు కృత్రిమ మేధను చూస్తున్నాడు. పరికరం మారుతుంది కానీ ఆర్తి మారదు. మారకూడదు. మనిషి గొప్పవాడు ఎందుకంటే వాడు అసంపూర్ణుడు. వాడి రాతలో తప్పులు దొర్లుతాయి. వాక్యం అసంపూర్తిగా ఆగిపోతుంది. అదే మనిషికి అందం. యంత్రం పరిపూర్ణంగా రాస్తుంది. అందుకే చప్పగా ఉంటుంది. సాంకేతిక విప్లవం రావాలి. మన వేళ్లకు సంకెళ్లు వేయకుండా మన కలలకు రెక్కలు ఇవ్వాలి. రేపు ఒక పిల్లవాడు ‘నేను రచయితను అవుతాను’ అన్నప్పుడు, వాడి చేతిలో కలంతో పాటు ఒక తెర కూడా ఉండొచ్చు. తప్పులేదు. కానీ ఆ తెర మీద వాడు చూసేది వాడి ప్రతిబింబమే కావాలి, యంత్రం నీడ కాదు. కలం ఇంకా మన చేతిలోనే ఉంది. దాని మీద వేలిముద్రలు మనవే. రక్తం మనదే. చమట మనదే. ఆ గుర్తులు చెరిగిపోని వరకు మనిషే మహనీయుడు. యంత్రం ఎప్పటికీ అతని నీడ మాత్రమే. -
సముద్రంపై AI సామ్రాజ్యం! శామ్సంగ్ కొత్త ప్రయోగం
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరిస్తున్న కొద్దీ డేటా సెంటర్ల అవసరం మరింతగా పెరుగుతోంది. అయితే భూమిపై స్థలం కొరత, భారీ విద్యుత్ అవసరాలు, శీతలీకరణ సమస్యలు టెక్ దిగ్గజాలకు సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్ (Samsung Heavy Industries) సముద్రంపై తేలియాడే ఏఐ డేటా సెంటర్ల (Floating Data Centers) అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.మూడు సంస్థలు కలిసి..తేలియాడే డేటా సెంటర్ల అభివృద్ధి కోసం శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్, గ్రీకు షిప్పింగ్ సంస్థ క్యాపిటల్ క్లీన్ ఎనర్జీ క్యారియర్స్, సముద్ర భద్రతా ప్రమాణాల సంస్థ లాయిడ్స్ రెజిస్టర్ కలిసి సంయుక్త అభివృద్ధి ఒప్పందం (JDP) కుదుర్చుకున్నాయి. ఇటీవల గ్రీస్‌లో జరిగిన ప్రముఖ అంతర్జాతీయ షిప్పింగ్ ఎగ్జిబిషన్ ‘పోసిడోనియా 2026’ సందర్భంగా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. ఇందు లో శామ్సంగ్ సాంకేతిక రూపకల్పన, నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, క్యాపిటల్ పెట్టుబడులు, ప్రాజెక్టు అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది. లాయిడ్స్ రిజిస్టర్ భద్రతా ధ్రువీకరణలు, నియంత్రణ అంశాలను చూసుకుంటుంది.డేటా సెంటర్లు సముద్రంపై ఎందుకు?భారీ ఏఐ డేటా సెంటర్లకు విస్తారమైన స్థలం, అపారమైన విద్యుత్ సరఫరా, అధిక శీతలీకరణ వ్యవస్థలు అవసరం. అమెరికా, యూరప్ వంటి ప్రాంతాల్లో భూమి లభ్యత తగ్గిపోవడం, విద్యుత్ గ్రిడ్ కనెక్షన్ల ఆలస్యం కారణంగా కొత్త డేటా సెంటర్ల నిర్మాణం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సముద్రంలో లేదా నదులపై తేలియాడే డేటా సెంటర్లు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాయి. సముద్రపు నీటినే నేరుగా శీతలీకరణ కోసం వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది.50 మెగావాట్ల సామర్థ్యం.. వేలాది ఏఐ సర్వర్లుశామ్సంగ్ అభివృద్ధి చేస్తున్న తొలి ఫ్లోటింగ్ డేటా సెంటర్ (Samsung floating AI data center) సామర్థ్యం 50 మెగావాట్లు (MW)గా ఉంటుంది. ఇది వేల సంఖ్యలో ఏఐ సర్వర్లను నడిపించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ కేంద్రం రెండు విధాలుగా విద్యుత్తును పొందగలదు. తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్నప్పుడు సముద్ర అడుగు కేబుళ్ల ద్వారా విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానమవుతుంది. అవసరమైతే ద్రవీకృత సహజ వాయువు (LNG) ఆధారిత సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా స్వయంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది.సర్వర్లకు సముద్రం సవాలే!అయితే సముద్రంలో ఏఐ సర్వర్లను దీర్ఘకాలం నిర్వహించడం అంత సులభం కాదు. ఓడల కదలికలు, కంపనాలు, ఉప్పునీటి ప్రభావం, తేమ వంటి అంశాలు సున్నితమైన హార్డ్వేర్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్, సూపర్‌మైక్రో సంస్థతో కలిసి పరిశోధనలు నిర్వహిస్తోంది. సముద్ర వాతావరణంలో సర్వర్ల పనితీరును పరీక్షించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.షిప్పింగ్ పరిశ్రమకు కొత్త వ్యాపార అవకాశాలుఫ్లోటింగ్ డేటా సెంటర్లు షిప్పింగ్ పరిశ్రమకు కూడా కొత్త ఆదాయ మార్గాలను తెరవవచ్చు. ఇప్పటివరకు సరుకు రవాణాపైనే ఆధారపడిన ఓడ యజమానులు, భవిష్యత్తులో టెక్ కంపెనీలు, క్లౌడ్ సేవల సంస్థలకు డేటా సెంటర్ సామర్థ్యాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంది.మరిన్ని సముద్ర డేటా సెంటర్లుఈ రంగంలో శామ్సంగ్ ఒక్కటే కాదు. జపాన్‌కు చెందిన మిత్సుయి ఒ.ఎస్.కె. లైన్స్ (MOL), టర్కీకి చెందిన కర్పవర్‌షిప్ కలిసి 73 మెగావాట్ల తేలియాడే డేటా సెంటర్‌ను 2027 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. చైనాలో షాంఘై సమీపంలో 24 మెగావాట్ల నీటి అడుగున డేటా సెంటర్ ఇప్పటికే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నాటిలస్ డేటా టెక్నాలజీస్ 6.5 మెగావాట్ల బార్జ్ ఆధారిత డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది.ఇదీ చదవండి: ‘మెటాలో ఇక భారీ తొలగింపులు ఉండకపోవచ్చు’ -
అందానికి ఏఐ మాయాజాలం.. పోర్టబుల్ స్కిన్ కేర్ డివైస్!
ప్రముఖ బ్యూటీ టెక్నాలజీ సంస్థ ‘ఇన్యూమీ’ సౌందర్య ప్రేమికుల కోసం ఒక సరికొత్త, వినూత్నమైన పోర్టబుల్ స్కిన్ కేర్ డివైస్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘నానో హైడ్రా ప్రో’ పేరుతో రూపొందించిన ఈ హైటెక్ గాడ్జెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీల కలయికతో పనిచేస్తుంది.ఈ ఆధునిక నానో హైడ్రా ప్రో డివైజ్‌లో ఆటోమేటెడ్ డ్యుయల్–పంప్ మెకానిజంతో పాటు ఏఐ సాంకేతికతను ఉపయోగించారు. ఇది చర్మ సంరక్షణకు అవసరమైన లిక్విడ్లను అత్యంత సూక్ష్మమైన స్ప్రే రూపంలోకి మారుస్తుంది. దీనివల్ల స్కిన్ కేర్ లిక్విడ్స్ చర్మం లోపలి పొరల వరకు సులభంగా చేరుకుని, చర్మాన్ని ఎక్కువ సమయం పాటు హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.ప్రయాణాల్లో సైతం ఎంతో సులభంగా తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఈ స్మార్ట్ డివైస్‌లో ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. డివైజ్‌ను ఎలా ఉపయోగించాలో గైడ్ చేయడానికి ప్రత్యేక డిస్ప్లే, సెన్సర్లు ఇందులో ఉంటాయి. దీనిని ఫోన్ యాప్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. తద్వారా వాతావరణ పరిస్థితులను బట్టి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలో ఎప్పటికప్పుడు రిమైండర్లను పంపుతూ ఒక పర్సనల్ స్కిన్ కేర్ కన్సల్టెంట్లా ఈ డివైజ్ సహాయపడుతుంది. ఇందులో స్కిన్ కేర్ లిక్విడ్స్ నింపుకోవడానికి వీలుగా సులభంగా మార్చుకోగలిగే మ్యాగ్నెటిక్ క్యాప్సూల్స్ ఉండటం విశేషం.పురాతన ఈజిప్షియన్, భారతీయ, గ్రీకు, రోమన్ ప్రజలు కుంకుమపువ్వును సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించేవారు. ఈజిప్టు రాణి క్లియోపాత్రా స్నానం చేయడానికి కుంకుమపువ్వు కలిపిన నీరు/పాలు ఉపయోగించేదట! తేనెతో పులియబెట్టిన గుర్రం పాలతో నిండిన టబ్‌లో స్నానం చేయడం, ఆమె ఆచరించిన సౌందర్య మార్గాలలో ఒకటి. ఆధునిక కాలంలో కూడా అనేక లగ్జరీ స్కిన్ కేర్ బ్రాండ్స్ క్లియోపాత్రా వాడిన పాలు, తేనె, కుంకుమపువ్వు ఫార్ములాను ఆధారంగా తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.ఎండల్లోనూ మెరిసేలా!ఉక్కపోత, వేడి వల్ల వేసవిలో చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇబ్బందులకు దూరంగా ఉండవచ్చు. వేసవిలో సన్ స్క్రీన్‌ని ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ తీవ్రమైన సన్ బర్న్ బారిన పడితే కలబంద గుజ్జు, జింక్ ఉన్న క్రీములు, ఐస్ ప్యాక్స్‌తో చర్మాన్ని చల్లబరచుకోవాలి. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడం ద్వారా చర్మాన్ని మళ్లీ తాజాగా మార్చవచ్చు. అందువల్ల ఎక్స్ఫోలియేషన్పై దృష్టిపెట్టాలి.మచ్చలు, మొటిమలు ఏ కాలంలోనైనా రావచ్చు. కానీ వేసవిలో ఇవి మరింత ఎక్కువవుతాయి. మొటిమలు వేధిస్తున్నప్పుడు గ్లైకోలిక్ యాసిడ్ లేదా శాలిసిలిక్ యాసిడ్ ఉన్న క్లెన్సర్‌ను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. శరీరంలో తగినంత నీరు ఉన్నట్లయితే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు. -
ఆంత్రోపిక్ కు అమెరికా బిగ్ షాక్..ఫేబుల్ 5, మైథోస్ 5 బంద్
-
‘మెటాలో ఇక భారీ తొలగింపులు ఉండకపోవచ్చు’
సోషల్ మీడియా దిగ్గజం మెటా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సంస్థగా రూపాంతరం చెందే క్రమంలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని పొరపాట్లు జరిగాయని దాని అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) అంగీకరించారు. అంతర్గత మెమోలో ఉద్యోగులను ఉద్దేశించి, వేగంగా మారుతున్న ఏఐ ప్రపంచంలో ఇలాంటి సవాళ్లు సహజమని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. “ఈ మార్పుల సంక్లిష్టత దృష్ట్యా మేము తప్పులు చేశాం. భవిష్యత్తులో కూడా కొన్ని తప్పిదాలు జరిగే అవకాశం ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.ప్రస్తుతం మెటా సంస్థ తన వ్యాపార వ్యూహాన్ని పూర్తిగా ఏఐ చుట్టూ పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందుకోసం డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాలు, సూపర్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులపై వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ క్రమంలో సంస్థలో విస్తృత స్థాయి పునర్నిర్మాణం చేపట్టింది. మే నెలలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతం ఉద్యోగులను తొలగించగా, మరో 7,000 మంది ఉద్యోగులను ఏఐ సంబంధిత బృందాలకు బదిలీ చేసింది.అయితే ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నంలో జుకర్‌బర్గ్ కీలక హామీ ఇచ్చారు. “ఈ ఏడాది సంస్థవ్యాప్తంగా మరోసారి భారీ స్థాయి ఉద్యోగ కోతలు ఉంటాయని మేము భావించడం లేదు” అని స్పష్టం చేశారు. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నందున అతిగా హామీలు ఇవ్వలేనప్పటికీ, సంస్థాగత స్థిరత్వాన్ని కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఏఐ మోడళ్ల శిక్షణ కోసం బదిలీ చేసిన ఉద్యోగులకు కొత్త అవకాశాలు కల్పించేందుకు సంస్థ కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. అవసరమైతే కొన్ని విభాగాల్లో తగ్గించిన సిబ్బందిని తిరిగి ఇతర బృందాలకు మార్చే అవకాశమూ ఉంటుందని చెప్పారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను వినియోగించుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, మెటాలో జరిగిన ఏఐ ఆధారిత పునర్వ్యవస్థీకరణపై కొంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పాటైన ఏఐ విభాగాల్లో పని స్వరూపం, బాధ్యతలపై కొందరు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు జూలైలో భారీ ఏఐ హ్యాకథాన్, టీమ్ ఈవెంట్లు నిర్వహించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.ఏఐ పోటీలో ముందంజలో నిలవాలన్న లక్ష్యంతో మెటా దూసుకెళ్తున్నప్పటికీ, ఉద్యోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, సంస్థాగత మార్పులను సమతుల్యం చేయడం కంపెనీకి ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. -
ఓవైపు ఉద్యోగ భయం.. మరోవైపు భారీ వాడకం!
అన్నింటా ఏఐ వినియోగం పెరిగింది. దీంతో రోజుకొక కొత్త ఏఐ టూల్ పుట్టుకొస్తోంది. ఇదే క్రమంలో ఏఐ విస్తృతితో కంపెనీలు ఉద్యోగాలను తగ్గిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రాబోయే మరింతగా ఉద్యోగాల కోత ఉంటుందన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఉద్యోగుల భయాలను తొలగిస్తూ హమ్మయ్య అనిపించే తాజా నివేదిక ఒకటి వెల్లడైంది. ఉద్యోగాల తొలగింపుల భయాలు ఒకవైపు ఉన్నా మరోవైపు ఏఐ వినియోగంలో మనోళ్లు దూసుకెళ్తున్నారు.ఏఐ వినియోగంలో అగ్రస్థానంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని సుమారు 41 శాతం మంది ఉద్యోగులు ప్రతిరోజూ ఏఐని ఉపయోగిస్తుండగా, 80 శాతం మంది వారంలో నాలుగైదు సార్లు వాడుతున్నారు. సర్వేలో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇది అత్యధికం. ఇటువంటి పరిస్థితుల్లో సంస్థలు తమ ఉద్యోగులకు స్పష్టమైన కెరీర్ మార్గాలను చూపాలని, నిరంతర నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాలని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ తెలిపారు. సేవా రంగం విస్తృతంగా ఉన్న భారత్ వంటి దేశాల్లో ఆపరేషనల్, ప్రాసెస్ ఆధారిత పనుల్లో లక్షలాది మంది ఉన్నారు. అందువల్ల ఏఐ సాంకేతికతతో పాటు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పించడం సంస్థల బాధ్యత’’ అని రాహుల్ గోయల్ పేర్కొన్నారు.ఏఐతో ఉద్యోగాలు పోవు..‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు. ఏఐ వాడకంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంస్థల ఉత్పాదకత మరింత పెరుగుతుంది’ అని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు రోజువారీ పనుల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. దైనందిన జీవితంలో సాంకేతికత ఎంత వేగంగా భాగమైందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని పరిశోధనా సంస్థ ‘ఏడీపీ రీసెర్చ్’ తాజాగా విడుదల చేసిన ‘పీపుల్ అట్ వర్క్ 2026’ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు ఏడీపీ రీసెర్చ్ సంస్థ 36 దేశాల్లోని 39,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ వార్షిక గ్లోబల్ వర్క్‌ఫోర్స్ సర్వేను నిర్వహించింది. -
ఏఐ దారి తప్పకుండా థియోమ్ పటిష్ట నిఘా!
‘‘ఏఐ కట్టుతప్పుతోంది.. తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకునేంత వరకూ వాడకం ఆపేద్దాం’’. ఆంథ్రోపిక్ సీఈవో ఇటీవల చేసిన హెచ్చరిక ఇది. అయితే ఇంకో అంతర్జాతీయ ఏఐ సంస్థ థియోమ్ మాత్రం ఇందుకు భిన్నమైన ఆలోచన చేస్తోంది. హ్యాకర్లు ఏఐ దుర్వినియోగానికి ప్రయత్నిస్తూంటే... తాము ఏఐ సాయంతోనే ఏఐకు, డేటాకు రక్షణ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని థియోమ్ చెబుతోంది. ఇదే అంశంపై సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈవో నవీంద్ర యాదవ్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే...ప్రశ్న: ముందుగా థియోమ్ గురించి వివరించండి.జవాబు: థియోమ్ డేటా, ఏఐ సెక్యూరిటీ కంపెని. 2020 డిసెంబరులో స్థాపించాము. మిగిలిన సైబర్ సెక్యూరిటీ సంస్థల మాదిరిగా ఇది డేటాను నెట్‌వర్క్‌ల బయట నుంచి కాపాడదు. లోపలి నుంచి రక్షణ కల్పిస్తుంది. స్నోఫ్లేక్స్, డేటాబ్రిక్స్ వంటి భారీ డేటా స్టోర్లు, గోల్డ్‌మ్యాన్ శాక్స్, బ్లాక్‌రాక్ వంటి ఫైనాన్షియల్ సంస్థలు, హెల్త్‌కేర్, ఫార్మా కంపెనీలు ఈ డేటా స్టోర్లను వాడుకుంటూంటాయి. థియోమ్ ఈ డేటా స్టోర్లతోపాటు కంపెనీలు వాడే ఏఐ వ్యవస్థల్లో ఉంటూ రక్షణ కల్పిస్తుంది. ఏఐ సాఫ్ట్‌వేర్‌పై ఎవరైనా దాడులు చేస్తున్నారా? అన్నది పరిశీలించడంతోపాటు, ఏఐ డేటాతో జరిపే సంప్రదింపులను కూడా పరిశీలించి అవాంఛనీయ ఘటనలేవీ జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏఐ ఏ రకమైన డేటాతో పనిచేస్తోందన్నది నిత్యం గమనిస్తూండటం ద్వారా అది దారి తప్పకుండా కాపు కాస్తూ ఉంటుందన్నమాట.ప్ర: మీరు డేటా స్టోర్ల గురించి ప్రస్తావించారు. ఇవి డేటా సెంటర్లూ ఒకటేనా?జ: కాదు. రెండూ వేర్వేరు. డేటా సెంటర్లలో డేటా నిక్షిప్తమవుతుంది. కంప్యూటర్లు, సర్వర్లు ఉండే ప్రాంతం. డేటా స్టోర్లు అంటే ఈ డేటా సెంటర్లలోని సమాచారం. ఇంకోలా చెప్పాలంటే ఒక రకమైన డేటాబేస్ అన్నమాట.ప్ర: ఏఐ వ్యవస్థలకు ప్రస్తుతం ఎలాంటి ముప్పు ఎదురవుతోంది?జ: చాలానే ఉన్నాయి. ఏఐ వ్యవస్థలను తమ అవసరాల కోసం వాడుకునేందుకు నిత్యం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. డేటా చోరీతోపాటు, సమాచారాన్ని తమకు అనుకూలమైన రీతిలో మార్చుకుని లాభపడేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. ఆంథ్రోపిక్ గురించి మీరు వినే ఉంటారు. ఇటీవలే ఈ ఏఐ కంపెనీ మైథోస్ పేరుతో సరికొత్త ఏఐ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెండు వారాల క్రితమే భారత ప్రభుత్వం కూడా దీన్ని వాడటం మొదలుపెట్టింది. మైథోస్ అనేది ఇతర వ్యవస్థలపై దాడి చేయగల సామర్థ్యమున్నది. థియోమ్ ఇలాంటి దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది.సింపుల్‌గా చెప్పాలంటే థియోమ్ అనేది శరీర రోగ నిరోధక వ్యవస్థ లాంటిది. లోపలి నుంచి రక్షణ కల్పిస్తుంది. మిగిలిన సైబర్ సెక్యూరిటీ సంస్థలు తొడుక్కునే రక్షణ కవచల్లాంటివి. అందుకే థియోమ్ అనేది ఏఐ యుగం కోసం సిద్ధం చేసిన వ్యవస్థ.ప్ర: ఆరేళ్లలో థియోమ్ ఎంత మేర విస్తరించింది?జ: థియోమ్ ఒక అంతర్జాతీయ సంస్థ. అమెరికాలో మొదలైంది. భారత్‌తోపాటు జర్మనీ, పోర్చుగల్, క్రొయేషియా, ఆస్ట్రేలియాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పశ్చిమార్ధగోళం నుంచి అత్యధిక ఆదాయం పొందుతున్న కంపెనీ. జెట్ బ్లూ ఎయిర్‌లైన్స్, ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్ కంపెనీలు, గోల్డ్‌మ్యాన్ శాక్స్, బ్లాక్‌రాక్ వంటి ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, పలు ఏఐ ఫస్ట్ కంపెనీలు థియోమ్ సాయంతో తమ డేటా, ఏఐలు రెండింటినీ రక్షించుకుంటున్నాయి. స్టారప్ కంపెనీనే గానీ వేగంగా వృద్ధి చెందుతోంది.ప్ర: హైదరాబాద్ కేంద్రం నుంచి ఎలాంటి ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నారు?జ: థియోమ్‌కు హైదరాబాద్ బ్యాక్ ఆఫీసు కానేకాదు. అంతర్జాతీయ కస్టమర్లకు సరికొత్త ప్రాడక్ట్స్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. ఇప్పటివరకూ యాభై మంది ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాము. సాఫ్ట్వేర్ కోడింగ్‌లో ఏఐని మరింత సమర్థంగా వాడటం ఎలా అన్నది ఇక్కడే అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం.ప్ర: ఆంథ్రోపిక్ లాంటి సంస్థలు కోడింగ్‌లో ఏఐ వాడకాన్ని తగ్గించాలని చెబుతూంటే మీరు పెంచుతున్నారా?జ: రెండింటికీ చాలా తేడా ఉంది. మేము ఏఐతోనే ఏఐని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆంథ్రోపిక్ వ్యవస్థలపై దాడులు చేసి, లోపాలను పసిగట్టి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. థియోమ్ దీనికి భిన్నంగా ఏఐని అస్సలు నమ్మకుండా, తగిన రక్షణ ఏర్పాట్లతో సాఫ్ట్వేర్ ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో మానవ పర్యవేక్షణ ఎక్కువన్నమాట.ప్ర: ఏఐ రంగంలో ఉన్నారు కాబట్టి... జనరల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందని మీ అంచనా?జ: చెప్పడం కష్టం. కాకపోతే ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జనరల్ ఇంటెలిజెన్స్ అన్నది ఏదో ఒక దశలో అందుబాటులోకి వస్తుందని చెప్పవచ్చు కానీ.. ఇన్నేళ్లు, ఇన్ని నెలలు అని చెప్పలేము.ప్ర: ఏఐతో ఉద్యోగాలు పోతాయంటున్నారు. మీ అంచనా ఏమిటి?జ: నా ఉద్దేశం ప్రకారం ఉద్యోగాల నిర్వచనం మారిపోతుంది అంతే. ఇంటర్నెట్, కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో చాలా ఉద్యోగాలు పోతాయని అనేవారు. కానీ కొత్త రకాల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలు ఏఐ స్థానంలో మళ్లీ మానవ వనరులను వాడుకుంటున్నాయి. విషయాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఏఐ వ్యవస్థలపై ఆధారపడటం వల్ల ఈ సమస్య వచ్చింది.హైదరాబాద్‌లో థియోమ్ కొత్త కార్యాలయండేటా, కృత్రిమ మేధ రక్షణ రంగంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా దూసుకుపోతున్న థియోమ్ సంస్థ భారతదేశంలో తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో తన కొత్త కార్యాలయాన్ని తాజాగా ప్రారంభించింది. థియోమ్ తన అంతర్జాతీయ వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు, కొత్త ఆవిష్కరణలను రూపకల్పన చేసేందుకు ఈ ఫెసిలిటీ దోహదపడనుందని చెప్పింది.భారతదేశపు ప్రముఖ సాంకేతిక హబ్‌ల్లో ఒకటైన హైదరాబాద్ కేంద్రంగా.. ఇంజినీరింగ్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ఆపరేషనల్ ఎక్సలెన్స్ రంగాల్లో థియోమ్ కీలక అడుగులు వేయనుంది. ఇక్కడి టెక్నాలజీ ప్రతిభను ఉపయోగించుకుంటూ తమ ఉత్పత్తుల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని సంస్థ భావిస్తోంది. ఈ త్రైమాసికం ముగిసే నాటికి హైదరాబాద్ కేంద్రంలో 50 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని థియోమ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. డేటా సెక్యూరిటీ, క్లౌడ్ ప్రొటెక్షన్, ఏఐ ఆధారిత ఎంటర్ప్రైజ్ రక్షణ రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలను తీసుకురావాలనే థియోమ్ దీర్ఘకాలిక ప్రపంచవ్యాప్త వ్యూహంలో భాగంగానే ఈ కేంద్రం రూపుదిద్దుకుంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
ఆ భయం నాకూ ఉంది: AIపై ఆంథ్రోపిక్ సీఈఓ ఆందోళన
కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి మానవ సమాజానికి అపార అవకాశాలు తెస్తున్నప్పటికీ, అదే సమయంలో తీవ్రమైన ప్రమాదాలకు కూడా దారితీయవచ్చని ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోడేయి (Dario Amodei) హెచ్చరించారు. “ఏదో ఒక సమయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉందనే ఆందోళన నాకూ ఉంది” అంటూ ఆయన తాజా బ్లూమ్‌బర్గ్ డాక్యుమెంటరీలో వ్యాఖ్యానించారు.ఏఐ భద్రత అంశంపై చాలా కాలంగా గళం విప్పుతున్న అమోడేయి, ప్రపంచవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాలు ప్రభుత్వాల నియంత్రణ సామర్థ్యాన్ని మించిపోయే వేగంతో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో నిర్వహించిన సర్వేల ప్రకారం, సగానికి పైగా ప్రజలు ఏఐ కారణంగా ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు.“స్వచ్ఛంద నియంత్రణ సరిపోదు”ఏఐ కంపెనీలు స్వయంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తామని చెప్పడం మాత్రమే ఇక సరిపోదని అమోడేయి అభిప్రాయపడ్డారు. తాజాగా విడుదల చేసిన తన విధాన వ్యాసంలో, అత్యాధునిక “ఫ్రంటియర్ ఏఐ” మోడళ్లను విడుదల చేసే ముందు తప్పనిసరిగా స్వతంత్ర థర్డ్ పార్టీ సంస్థల ద్వారా పరీక్షించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ దాడులు, జీవాయుధాల అభివృద్ధి, మానవ నియంత్రణను దాటిపోయే స్వయంప్రతిపత్తి వంటి ప్రమాదాలను అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో మోడళ్లు విఫలమైతే, వాటి విడుదలను నిలిపివేసే లేదా పూర్తిగా నిరోధించే అధికారం ప్రభుత్వాలకు ఉండాలని ఆయన వాదించారు.ఓపెన్ఏఐతో విభేదాలూ ఇందుకే..ఒకప్పుడు ఓపెన్ఏఐ (OpenAI)లో కీలక పరిశోధకుడిగా పనిచేసిన అమోడేయి, ఏఐ భద్రత అంశాలపై విభేదాల కారణంగా సంస్థను విడిచి ఆంథ్రోపిక్‌ను స్థాపించారు. వాణిజ్య ప్రయోజనాలు, వేగవంతమైన ఉత్పత్తి విడుదల కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన వైఖరి. ఇదే సమయంలో ఓపెన్ఏఐ కూడా ఏఐ రిస్క్‌లపై తామూ స్పష్టమైన అవగాహనతో ఉన్నామని, “ప్రతిదీ పూర్తిగా ఆటోమేట్ కావడం మాకు కావలసిన భవిష్యత్తు కాదు” అని ఇటీవల వెల్లడించింది. ఏఐ వల్ల భారీ ఉత్పాదకత పెరుగుదల సాధ్యమైనప్పటికీ, ఉద్యోగాలపై దాని ప్రభావం, సామాజిక పరిణామాలను నిర్లక్ష్యం చేయరాదని పరిశ్రమ నాయకులు అంగీకరిస్తున్నారు.భారత్‌లోనూ నియంత్రణ ఆలోచనఏఐ నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు వేగంగా జరుగుతున్న వేళ, భారత్ కూడా ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని గుర్తిస్తోంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇటీవల మాట్లాడుతూ, 2000 నాటి ఐటీ చట్టం ఆధునిక ఏఐ యుగానికి సరిపోదని, ఆవిష్కరణకు ప్రోత్సాహం ఇస్తూనే పౌరుల భద్రతను కాపాడే కొత్త విధానాలు అవసరమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’ -
AI Mission Million వైపు సూపర్ AI అకాడమీ
హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యా వ్యవస్థలను ప్రభావితం చేస్తూ కొత్త యుగానికి నాంది పలుకుతున్న వేళ, ఈ సాంకేతికతను సామాన్య ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సూపర్ AI అకాడమీ మరో కీలక మైలురాయిని చేరుకుంది. సంస్థ ఇప్పటికే 25 వేల మందికి పైగా విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వ్యాపారవేత్తలు మరియు యువతకు AI శిక్షణ అందించి ప్రత్యేక గుర్తింపు పొందింది."AI Mission Million" పేరుతో భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్న ఈ సంస్థ, 2027 ఏప్రిల్ నాటికి లక్ష మంది, 2030 నాటికి 10 లక్షల మందిని AI ద్వారా సాధికారత చేయాలని సంకల్పించింది.సూపర్ AI నెక్స్ట్‌జెన్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి కిరణ్ మాట్లాడుతూ, “AI అనేది ఇకపై భవిష్యత్ టెక్నాలజీ కాదు. ఇది ఇప్పటికే మన దైనందిన జీవితంలో భాగమైంది. ఈ మార్పులో తెలుగు ప్రజలు వెనుకబడకుండా, ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయడం మా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు.సంస్థ డైరెక్టర్ నికీలు గుండా మాట్లాడుతూ, “AI విద్యను కేవలం టెక్నికల్ వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయకుండా, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. AIను అర్థం చేసుకుని ఉపయోగించగలిగితే వ్యక్తిగత అభివృద్ధి, ఉపాధి, వ్యాపార వృద్ధి వంటి అనేక అవకాశాలు తెరుచుకుంటాయి” అని పేర్కొన్నారు.మహిళా సాధికారతకు AI అండమహిళల ఆర్థిక స్వావలంబనకు AI కీలక సాధనంగా మారుతుందనే నమ్మకంతో సూపర్ AI అకాడమీ SUPER AI Women's Club కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా గృహిణులు, మహిళా వ్యాపారవేత్తలు, ఉద్యోగినులు AI ఆధారిత సేవలను అందించడం, డిజిటల్ వ్యాపారాలను ప్రారంభించడం, ఫ్రీలాన్సింగ్ అవకాశాలను అందిపుచ్చుకోవడం వంటి అంశాల్లో శిక్షణ పొందుతున్నారు.2030 నాటికి 10 వేల మంది మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా సంస్థ వెల్లడించింది.వ్యాపార వృద్ధికి AIచిన్న, మధ్య తరహా వ్యాపారాలు AIను వినియోగించి తమ ఉత్పాదకతను పెంచుకోవడం, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించడం, అమ్మకాలను పెంచుకోవడం, కస్టమర్ సేవలను మెరుగుపరచుకోవడం వంటి అంశాలపై సూపర్ AI అకాడమీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.AI ఆధారిత మార్కెటింగ్, లీడ్ జనరేషన్, కంటెంట్ క్రియేషన్, సేల్స్ ఆటోమేషన్, కస్టమర్ కమ్యూనికేషన్ వంటి అంశాల్లో ఇప్పటికే వందలాది మంది వ్యాపారవేత్తలకు శిక్షణ అందించినట్లు సంస్థ తెలిపింది.కళాశాలల్లో AI క్లబ్లుభవిష్యత్ ఉద్యోగాలకు విద్యార్థులను సిద్ధం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో AI Student Clubs ఏర్పాటు చేయడానికి సూపర్ AI అకాడమీ ప్రణాళిక రూపొందిస్తోంది.ఈ క్లబ్‌ల ద్వారా విద్యార్థులకు AI ఫండమెంటల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, AI రీసెర్చ్ టూల్స్, కెరీర్ అప్లికేషన్స్, AI ఆధారిత స్టార్టప్ అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందించడం, భవిష్యత్ టెక్నాలజీ నాయకులను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు.త్వరలో AI Creator ClubAI ఆధారిత కంటెంట్ క్రియేషన్, వీడియో ప్రొడక్షన్, డిజైనింగ్, డిజిటల్ బ్రాండింగ్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, యువత మరియు క్రియేటర్ల కోసం AI Creator Club ను ప్రారంభించేందుకు సంస్థ సిద్ధమవుతోంది.ఈ క్లబ్ ద్వారా సోషల్ మీడియా క్రియేటర్లు, యూట్యూబర్లు, డిజైనర్లు, మార్కెటర్లు మరియు డిజిటల్ ప్రొఫెషనల్స్‌కు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.1000 మంది AI కోచ్‌ల తయారీదేశవ్యాప్తంగా AI అవగాహనను మరింత విస్తరించేందుకు 1000 మంది AI Coaches ను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది.ఉపాధ్యాయులు, ట్రైనర్లు, కన్సల్టెంట్లు, కోచ్‌లు AIలో నైపుణ్యం సాధించి తమ ప్రాంతాల్లో వేలాది మందికి AI విద్యను అందించేలా ఈ కార్యక్రమం రూపొందించబడుతోంది.Microsoft – Certiport భాగస్వామ్యంసూపర్ AI అకాడమీ ఇటీవల మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన Microsoft మరియు Certiport అధికారిక సర్టిఫికేషన్ భాగస్వామిగా సంస్థ ఎంపికైంది.దీంతో అంతర్జాతీయ ప్రమాణాల డిజిటల్ మరియు AI సర్టిఫికేషన్ కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం లభించిందని సంస్థ పేర్కొంది.ఈ ఉద్యమం వెనుక ఉన్న ఆలోచనసూపర్ AI అకాడమీ వెనుక ఉన్న ప్రధాన ఆలోచనల్లో ఒకటి సంస్థ డైరెక్టర్ నికీలు గుండా యొక్క గత దశాబ్ద కాల అనుభవం. డిజిటల్ మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్, బ్రాండింగ్, వ్యాపారాభివృద్ధి రంగాల్లో పని చేసిన ఆయన, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని వినియోగించే నైపుణ్యాల కొరత సమాజంలో ఎక్కువగా ఉందని గుర్తించారు.ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో చిన్న వ్యాపారాలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకు సాగేందుకు అవసరమైన డిజిటల్ నైపుణ్యాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పలు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు.గతంలో డిజిటల్ లిటరసీ, వ్యాపారాభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్ ఎకోసిస్టమ్, యువత సాధికారత వంటి అంశాలపై వేలాది మందికి శిక్షణ ఇచ్చిన అనుభవం ప్రస్తుతం AI Mission Million రూపకల్పనకు దోహదపడిందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.AI కేవలం సాంకేతిక రంగానికే పరిమితం కాకుండా, ప్రతి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే సాధనంగా మారుతుందని భావించిన నికీలు గుండా, AI విద్యను తెలుగు భాషలో అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అదే ఆలోచనతో ప్రారంభమైన కార్యక్రమాలు నేడు వేలాది మంది సభ్యులతో కూడిన కమ్యూనిటీగా ఎదిగాయి.వ్యాపారవేత్తలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లు, ట్రైనర్లు వంటి విభిన్న వర్గాలకు AIను చేరవేయాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ మిషన్, భవిష్యత్‌లో లక్షలాది మందికి ఉపయోగపడే సామాజిక ఉద్యమంగా మారుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.AI Literacy నుండి AI Leadership వరకుAI గురించి అవగాహన కల్పించడం నుంచి AI ఆధారిత వ్యాపారాలు, కెరీర్ అవకాశాలు, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి వరకు సమగ్ర ప్రయాణాన్ని రూపొందించడమే సూపర్ AI అకాడమీ లక్ష్యంగా చెబుతోంది.AI Literacy, AI Productivity, AI Entrepreneurship, AI Leadership అనే నాలుగు ప్రధాన దశల ద్వారా వ్యక్తులను అభివృద్ధి చేసి, భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేయాలని సంస్థ భావిస్తోంది.25 వేల మంది మైలురాయిని దాటిన సూపర్ AI అకాడమీ, ఇప్పుడు AI Mission Million ఉద్యమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా AI విద్యా విప్లవానికి దోహదపడే దిశగా అడుగులు వేస్తోంది."AI భవిష్యత్తు కాదు... ఇది వర్తమానం. ఈ మార్పులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" అనే సందేశంతో సంస్థ తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తోంది.మరిన్ని వివరాలకు Super AI Academy అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు : www.superaiacademy.comగమనిక: పైన పేర్కొన్న వివరాలు, సమాచారం పూర్తిగా నిర్వాహకులు/ ప్రకటనకర్తలు అందించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. దీనికి, సాక్షి మీడియా ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందే నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం. -
రేపు వర్షం వస్తుంది !
వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వంతో పాటు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్నదాతలకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఆధారిత ‘తెలంగాణ వాతావరణ సమాచారం’ కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. వాతావరణ శాఖ సహకారంతో తొలిదశలో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ జాబితాలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి.నేరుగా వాట్సాప్‌కు...వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని నేరుగా రైతుల సెల్‌ఫోన్ వాట్సాప్‌కు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఆధారిత సలహాలను చేరవేస్తారు. ఏఐ, డిజిటల్ సాంకేతిక డేటాల అనుసంధానంతో శాటిలైట్ ఆధారిత వాతావరణ అంచనాలతో రూపొందించిన సమాచారం అందుతుంది. ఈ కార్యక్రమం అమలుకు డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్(డీఐఎల్), ఇండియా ఎవిడెన్స్ యాక్షన్ సంస్థలతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.విత్తనాలు, ఎరువులపై కూడా..వర్షాలు, ఉష్ణోగ్రతలు, వడగాలులే కాక రాబోయే వాతావరణ మార్పుల ముందస్తు అంచనాలను రైతులకు అందించనున్నారు. ఇవికాక వాతావరణం, వర్షాపాతం ఆధారంగా ఏ సమయంలో ఏ విత్తనాలు వేయాలి, ఎరువులు వాడాలి, పంటలను ఎలా రక్షించుకోవాలనే అంశంపై నిపుణుల సలహాలు కూడా ఇందులో ఉంటాయి. తాజా వాతావరణ పరిస్థితులతో పాటు సలహాల కోసం స్థానిక వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఐఎండీ సూచనలను తెలుసుకోవడానికి Met centre Hyderabad& IMD ఈ ను సందర్శించే అవకాశం కల్పించారు. రాబోయే ఎల్‌నినో వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు తట్టుకుని పంట నష్టాలను తగ్గించుకునేలా రైతులకు ఈ ఏఐ ఆధారిత వ్యవస్థ కచ్చితమైన సమాచారాన్ని అందించనుంది.ఖమ్మంలో జిల్లాలో 3.58 లక్షల మందికి..రైతు భరోసా పోర్టల్ ఆధారంగా 17 జిల్లాలకు చెందిన 15 లక్షల మందికి తొలిదశలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా ఖమ్మం జిల్లాలో రైతు భరోసా సాయం అందుతున్న 3,58,753 మంది రైతుల సెల్‌ఫోన్ నంబర్లను అనుసంధానం చేశారు. ఆయా రైతులకు ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఏఐ ఆధారిత వాతావరణ వివరాలు అందుతున్నాయి. అయితే, ఇందులో నమోదుకాని రైతులు వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించే అవకాశాన్ని కల్పించారు.రైతులకు ప్రయోజనంఏఐ ఆధారిత ముందస్తు వాతావరణ సమాచారం, పంటల నిర్వహణపై సలహాలు రైతులకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం అందరి చేతుల్లో సెల్‌ఫోన్ ఉంటున్నందున వాట్సాప్‌కు వాతావరణం, పంటల సాగుపై సలహాలు అందుతాయి. ఈ సమాచారం ఆధారంగా రైతులు సాగులో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
కృత్రిమమేధ అద్భుత అవకాశం!
కృత్రిమ మేధ విస్తృతిపై ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలపై టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్పష్టతనిచ్చారు. ఏఐ అనేది ఐటీ రంగానికి ముప్పు కాదని, అది ఎంటర్ప్రైజ్ ఐటీ రంగానికి లభించిన ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. ఈరోజు జరిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వాటాదారులను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు. వచ్చే మూడేళ్లలో టీసీఎస్‌లో మానవ ఉద్యోగులతో సమానంగా ఏఐ ఏజెంట్లు పని చేస్తారని అంచనా వేశారు.జనరేటివ్ ఏఐ, ఆటోమేషన్ల కారణంగా భారతీయ ఐటీ సేవల సంస్థల సాంప్రదాయ వ్యాపార నమూనాలు దెబ్బతింటాయేమోనన్న ఇన్వెస్టర్ల ఆందోళనల నేపథ్యంలో చంద్రశేఖరన్ చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో కొత్త భరోసాను నింపాయి. ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ వ్యయాన్ని ఏఐ ఎలా మార్చబోతోందనే అంశంపై మార్కెట్లో ఉన్న అపార్థాల వల్లే ఇటువంటి భయాలు వ్యక్తమవుతున్నాయని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.‘ఏఐ అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదు. అది మేధస్సుకు సంబంధించిన ఒక మౌలిక సదుపాయం (ఇన్ఫ్రా ఆఫ్ ఇంటెలిజెన్స్). ఈ మేధస్సు తాలూకు వ్యయం తగ్గుతున్న కొద్దీ.. మరిన్ని వ్యాపార ప్రక్రియలు, వ్యూహాత్మక నిర్ణయాలు, కస్టమర్ పరస్పర చర్యలు ఏఐ ఆధారిత పరివర్తన వైపు అడుగులు పడుతాయి’ అని చంద్రశేఖరన్ అన్నారు.ఏఐ అంతరాయం కలిగిస్తుందనే భయాలు ఉన్నప్పటికీ పరిశ్రమ ప్రాథమిక సూత్రాలు బలంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. కంపెనీ మార్జిన్లు బాగున్నాయని, ఆదాయాలు పెరిగాయని, డీల్ పైప్‌లైన్ గతంలో కంటే ఎంతో బలంగా ఉందని వివరించారు. రాబోయే రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మూడొంతుల సంస్థలు తమ సాంకేతిక వ్యయాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
డేటా సెంటర్లు..నీటి జలగలు!
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఏఐ డేటా సెంటర్లు ఎడాపెడా వెలుస్తున్నాయి. రకరకాల పనులు చాలా సులువుగా, వేగంగా చేసి పెట్టే టెక్నాలజీ మరింత పెరిగితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ.. నాణేనికి మరోవైపున దాగి ఉన్న నిజం మాత్రం చాలా భయంకరం. ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ వాటర్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ (ఐఎన్‌యూ–ఐఎన్‌డబ్ల్యూఈహెచ్) మేధో సంస్థ తాజా లెక్కల ప్రకారం 2030 నాటికల్లా భూమి మీద డేటా సెంటర్లు మొత్తం కలిపి ఎకాఎకిన 328 టీఎంసీల నీరు వాడేసుకుంటాయి. దీనర్థం ఎక్కడ డేటా సెంటర్ పుట్టుకొచి్చనా.. పెద్ద ఎత్తున నీళ్లు అవసరమవుతాయి. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకుని వాడుకుంటే గొడవే లేదు కానీ.. నదులు, చెరువుల్లోంచి తోడుకుంటే మాత్రం ఏరికోరి కరువుకు బొట్టుపెట్టి పిలిచినట్లే. ఐఎన్‌యూ–ఐఎన్‌డబ్ల్యూఈహెచ్ భూమ్మీది నీటి వనరుల పరిస్థితి, సమర్థ నిర్వహణలపై నిత్యం ఓ కన్నేసి ఉంచుతూ ఉంటుంది. ఇటీవలే ఏఐ డేటా సెంటర్ల నీటి వాడకంపై కొన్ని లెక్కలు ప్రచురించింది. దాని ప్రకారం ఇంకో నాలుగేళ్లలో డేటా సెంటర్ల అవసరాలు తీర్చేందుకు సుమారు 9.3 లక్షల కోట్ల లీటర్ల నీళ్లు అవసరం. సుమారు 945 టెరావాట్ గంటల విద్యుత్తు ఖర్చు కానుంది. వెయ్యి గిగావాట్లు ఒక టెరావాట్కు సమానం. ఇంకోలా చెప్పాలంటే గిగావాట్ సామర్థ్యమున్న అణు విద్యుత్తు కేంద్రాలు 108 వరకూ కేవలం ఏఐ డేటా సెంటర్ల నీటి అవసరాలు తీర్చేందుకే సరిపోతాయి. ప్రపంచ విద్యుదుత్పత్తిలో మూడో శాతం అన్నమాట. డేటా సెంటర్ల ఏర్పాటుకు సుమారు 14,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నేల అవసరమవుతోంది. వీటి ద్వారా పుట్టే ఎల్రక్టానిక్ వ్యర్థాలు 25 లక్షల టన్నుల వరకూ ఉంటాయని ఐఎన్‌యూ–ఐఎన్‌డబ్ల్యూఈహెచ్ తాజా అధ్యయనంలో స్పష్టమైంది. అంతటి అపార జలరాశితో పనేంటి? మీ కంప్యూటర్ను కొన్ని గంటలపాటు వాడితేనే వేడెక్కి పోతుంది కదా.. అలాంటిది దీనికి కొన్ని లక్షల పీసీలు ఒక దగ్గర పనిచేస్తూంటే ఎంత వేడి పుడుతుందో ఊహించుకోండి. డేటా సెంటర్ల పరిస్థితి ఇదే. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన డేటా సెంటర్‌గా అమెరికాలోని స్విచ్ సిటడెల్‌కు పేరుంది. పర్సనల్ కంప్యూటర్(పీసీల)ల లెక్కన ఈ డేటా సెంటర్‌ను గణిస్తే ఇందులో సుమారు 32 లక్షల యాభై వేల పీసీ ఒకేసారి పని చేస్తున్నట్లు లెక్క. అందుకే ఇక్కడ పుట్టే అత్యధిక వేడిని తగ్గించేందుకు డేటా సెంటర్లను నిత్యం నీటితో చల్లబరుస్తూ ఉండాలి. లేదంటే ఉష్ణోగ్రత పెరిగిపోయి డేటా సెంటర్ పనిచేయకుండా పోతుంది. వీటిపై ఆధారపడిన అనేకానేక అప్లికేషన్లు, వ్యవస్థలు కుప్పకూలుతాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 వేల డేటా సెంటర్లు ఉండగా వీటిల్లో సగం అమెరికాలోనే ఉన్నాయి. ఒక్కొక్కటీ 100 నుంచి 600 మెగావాట్ల విద్యుత్తును వినియోగించుకుంటున్నాయి. మెట్రో నగరాలకు కావాల్సినంత విద్యుత్తు ఇది. ఫలితంగా డేటా సెంటర్ల పరిసరాల్లోని నీటి వనరులు శరవేగంగా ఖాళీ అవడం ఖాయం. కింకర్తవ్యం? ప్రస్తుతానికి వేరే మార్గం లేదు. చైనా వంటి దేశాలు సముద్రం అడుగున డేటా సెంటర్లను ఏర్పాటు చేసి ఆ నీటితోనే చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నాయి. గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఇంకో అడుగు ముందుకేసి అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆలోచనలు చేస్తున్నాయి. మరింత పర్యావరణ అనుకూల మార్గాల ద్వారా డేటా సెంటర్లను చల్లబరిచే ప్రయత్నం జరగాలని నిపుణులు ఆకాంక్షిస్తున్నారు. ఏఐ డేటా సెంటర్లు పర్యావరణంపై చూపే ప్రభావాన్ని మదింపు చేసి తగు నియంత్రణ చర్యలు తీసుకోవడం అవసరమవుతుంది. లేదంటే డేటా సెంటర్లు మానవ జీవనాధారమైన కీలక జలరాశిని పీల్చేసే ప్రమాదం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ బృందం నుంచి తప్పుకున్న ఏఐ సలహాదారు
వైట్‌హౌస్ ఏఐ సలహాదారు శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా చేశారు. ఈ నెలాఖరున పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ పాలనలో శ్రీరామ్ కీలక పాత్ర పోషించారు. 18 నెలల పాటు ఆయన సేవలందించారు. తాను కొంతకాలం విరామం తీసుకుని,.. ఆ తర్వాత అమెరికా ఎదుర్కొంటున్న ప్రధాన ఏఐ సంబంధిత సవాళ్లపై తిరిగి పని చేస్తానంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కృష్ణన్ ప్రభుత్వంలో తన సేవను జీవితకాలపు ప్రత్యేక హక్కుగా అభివర్ణించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో సేవ చేయడం గౌరవం. ఆయన నాయకత్వం లేకపోతే మనం ఏఐ రేసులో ముందంజలో ఉండేవాళ్లం కాదంటూ ఆయన పేర్కొన్నారు.వైట్ హౌస్ ఏఐ, క్రిప్టో సలహాదారు డేవిడ్ సాక్స్‌కు కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ.. ఏఐ రంగంలో అమెరికా విజయం సాధించాలనే ఆయన నిరంతర మద్దతు ఎంతో కీలకమైందని.. అది కొనసాగుతూనే ఉంటుందన్నారు. తన పదవీకాలంలో తాను అభివృద్ధి చేయడంలో సహాయపడిన పలు కార్యక్రమాలను కృష్ణన్ ప్రధానంగా ప్రస్తావించారు.వీటిలో అమెరికన్ ఏఐ యాక్షన్ ప్లాన్'ను రూపొందించడం, ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ ఏఐ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఏఐ యాక్సిలరేషన్ పార్టనర్‌షిప్‌లను ముందుకు తీసుకెళ్లడం, 'నేషనల్ ఏఐ పాలసీ ఫ్రేమ్‌వర్క్' ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు సహకారం అందించడం, అంతర్జాతీయంగా ఏఐ సదస్సులు, దౌత్యపరమైన చర్చల ద్వారా అమెరికన్ ఏఐ ప్రయోజనాలను ప్రోత్సహించడంలో తన పాత్రను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. కృత్రిమ మేధస్సు వేగవంతమైన పరిణామంగా కృష్ణన్ పేర్కొన్నారు.చెన్నైలో జన్మించిన కృష్ణన్.. ఎస్ఆర్ఎంఇంజనీరింగ్ కాలేజ్ నుంచి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2005లో అమెరికాకు వెళ్లారు. కృష్ణన్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి ఇన్సూరెన్స్ రంగంలో పనిచేశారు. తల్లి గృహిణి. ఆయన 21 సంవత్సరాల వయస్సులో మైక్రోసాఫ్ట్ సంస్థతో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ ఆయన విండోస్ అజూర్ వ్యవస్థకు ఫౌండింగ్ మేనేజర్‌గా పనిచేశారు.ట్రంప్ ప్రభుత్వంలో చేరడానికి ముందు, కృష్ణన్ 'ఆండ్రీసెన్ హోరోవిట్జ్' వెంచర్ క్యాపిటల్ సంస్థలో జనరల్ పార్ట్నర్గా ఉన్నారు. అంతకుముందు ఫేస్బుక్, ట్విట్టర్లలో కూడా వివిధ హోదాల్లో పనిచేశారు. ముఖ్యంగా ఎలాన్ మస్క్ 'వార్ రూమ్'లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ నుండి 'ఎక్స్ గా మార్చే ప్రక్రియలో ఆయన సహాయం అందించారు. -
ఏఐని ఆపేయండి బాబోయ్!
ఇందుగలడందు లేడన్న సందేహంబు వలదన్నట్టు... ఏఐ ఇప్పుడు అన్ని రంగాల్లోకి చేరిపోతోంది. కంపెనీలు వందల కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఉద్యోగాల కోత ఉంటుందా? ఉండదా? అన్నదానిపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అయితే... ప్రపంచంలోనే అత్యంత విలువైన కృత్రిమ మేధ సంస్థ ఆంథ్రోపిక్ మాత్రం ‘‘ఆపేయండి..’’ అని అరుస్తోంది. సమయం మీరిపోకముందే కృత్రిమ మేధ వాడకాన్ని తాత్కాలికంగానైనా నిలిపేయాలని కోరుతోంది. ఎందుకలా?‘టెర్మినేటర్ –2.. జడ్జ్మెంట్ డే’, ‘ఎక్స్ మెషీనా’, ‘ద మ్యాట్రిక్స్’... మూడు హాలీవుడ్ సినిమాలే. మూడింటి స్టోరీ కూడా దాదాపు ఒకటే. మనిషి సృష్టించిన కృత్రిమ మేధ మనిషిపైనే పెత్తనం చెలాయించడం. ఆఖరుకు హీరో ఏఐ వ్యవస్థలను పటాపంచలు చేసి మనుషులను కాపాడతాడన్న మాట. నిజజీవితంలో ఇంత విపత్తు అయితే రాలేదు కానీ.. ఆ రోజు ఎంతో దూరంలో లేదు అంటోంది ఆంథ్రోపిక్. రెండు రోజుల క్రితం ఈ విషయమై కంపెనీ తన బ్లాగ్‌లో ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. ఆంథ్రోపిక్ క్లాడ్ పేరుతో ఏఐ ఏజెంట్ ఒకదాన్ని సృష్టించిన సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకొన్ని నెలల్లో మా కంపెనీలో ఇంజినీర్లు ఎవరూ సాఫ్ట్వేర్ కోడ్ రాయరు అని ఈ కంపెనీ సీఈవో ఈ మధ్యే చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల ఉద్యోగాలను ఈ క్లాడ్ ఏఐ చేసి పడేస్తుందని కూడా భవిష్యవాణి పలికాడు. అయితే తాజాగా ఈ కంపెనీ ఇంజినీర్లు క్లాడ్, దీని అనుబంధ ఏఐ వ్యవస్థల పురోగతిని పరిశీలించి... ఏదో తేడా కొడుతున్నట్లు అర్థం చేసుకున్నారు. వారి అంచనా ప్రకారం.. ఈ ఏఐ వ్యవస్థలు ఇప్పటి మాదిరే ముందుకు వెళితే.. అవి చాలా తొందరగా ‘రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్’ను అందుకోగలవని వీరు గుర్తించారు. అదే జరిగితే ఈ ఏఐ వ్యవస్థలు తమని తాము మెరుగుపరుచుకునేందుకు సొంతంగా కోడ్లు రాసేసుకుంటాయని ఫలితంగా మన నియంత్రణలో లేకుండా పోతాయని వీరు అంటున్నారు. అందుకే ఏఐ వ్యవస్థలు ఈ రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సాధించాయో లేదో తెలుసుకునేందుకు ఒక పద్ధతిని సిద్ధం చేసుకునేంత వరకూ అయినా ఏఐ వాడకాన్ని నిలిపివేయాలని ఈ కంపెనీ పిలుపునిచ్చింది. ఏంటీ రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్?ఏదైనా పనిలో అత్యున్నత నైపుణ్యాన్ని సాధించేందుకు మనం ఏం చేస్తాం? లోటుపాట్లు గుర్తించి వాటిని దిద్దుకుంటాం. తద్వారా మెరుగైన పనితీరు అబ్బుతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం.. ఓ ఏఐ రోబోకు ఉప్మా చేయడమెలాగో నేర్పామని అనుకుందాం. తిరగమోత పెట్టి, రవ వేయించి తెర్ల కాగుతున్న నీళ్లు పోసి ఉప్మా తయారు చేసింది ఆ రోబో. ఈ క్రమంలోనే నీళ్లు కాగడానికి చాలా సమయం పడుతున్నట్లు గుర్తించిందనుకోండి. ఇది రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సాధించిన రోబో అయితే.. వెంటనే నీళ్లు మరింత వేగంగా ఎలా కాయాలో గుర్తించి అందుకు తగ్గట్టుగా స్టౌ లేదా హీటర్ సెట్టింగ్స్‌లో మార్పులు చేస్తుంది. తద్వారా ఉప్మా వేగంగా తయారవుతుంది. సమయం ఏదైనా మిగిలితే రుచికరమైన చట్నీ తయారు చేస్తుంది. బాగానే ఉంది కదా అనిపిస్తోందా? నిజమే కానీ.. ఈ మార్పులన్నీ అది మానవ పర్యవేక్షణ లేకుండానే చేస్తూంటుంది. ఉప్మా స్థానంలో ఓ అణు రియాక్టర్ నిర్వహణను ఊహించుకోండి? భద్రత కోసం మనిషి చేసిన ఏర్పాట్లలో ఏదో చిన్న లోపం ఉందని మార్చేస్తే... కొంపలు అంటుకుపోతాయి!అంత తొందరగా కాదు..ఈ మొత్తం వ్యవహారంలో కొంచెం ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. క్లాడ్ దాని అనుబంధ ఏఐ వ్యవస్థలేవీ రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ స్థాయికి చేరుకోకపోవడం. అయితే వీటి వేగం చూస్తూంటే.. ముందు అనుకున్న దాని కంటే చాలా వేగంగానే ఆ స్థాయికి చేరతాయని కంపెనీ చెబుతోంది. ‘‘ఏఐ అభివృద్ధిని మందగింప జేసేందుకు లేదంటే తాత్కాలింగా నిలిపివేసేందుకు ఏదైనా ఏర్పాటు ఉంటే ప్రపంచానికి మేలు’’అని ఇప్పుడు ఆంథ్రోపిక్ స్వయంగా చెబుతోంది. ఈ మధ్యకాలంలో రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ను గుర్తించేందుకు, నివారించేందుకు లేదా నియంత్రించేందుకు మనిషి తగిన ఏర్పాట్లు చేసుకోవచ్చునని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. అయితే ఈ పని అంత సులువేమీ కాదని... ఏఐ అన్నది నిశ్శబద్ధంగా ఏ మారుమూల సర్వర్లోనో వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి.. దాన్ని గుర్తించడం, నిలిపివేయడం అంత సులువు కాదని వివరించింది. అంతా ఉట్టిదే...లక్ష కోట్ల డాలర్ల విలువైన ఆంథ్రోపిక్ ఏఐ వాడకాన్ని నిలిపివేయాలని పిలుపునివ్వడంపై ఇప్పటికే కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదో ఎర అని గేరీ మార్కస్ అనే ఏఐ విమర్శకుడు వ్యాఖ్యానించారు. ఆంథ్రోపిక్ ఈ బ్లాగ్ ద్వారా అందరిలోనూ భయం నింపే ప్రయత్నం చేస్తోంది. కానీ ఏఐ వ్యవస్థలు రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ స్థాయికి చేరుకున్నాయి అనేందుకు రుజువులేవీ లేవు. క్లాడ్ ఏఐ కోడింగ్ వేగం బాగా పెరిగింది అంతే. అని వివరించాడు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఫుడ్ సేఫ్టీ... ఏఐ ఉందిగా...
ఏ పుట్టలో ఏ పాముందో... అనేది పాత సామెత. ఏ ఫుడ్‌లో ఏ బాక్టీరియా ఉందో... అనేది కొత్త సామెత. ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా తినాలంటే... భయమే భయం! ఏ సమస్య వచ్చినా... ‘ఏ.ఐ ఉందిగా!’ అనుకునే ఈ కాలంలో... ఏ.ఐ అనేది ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన భయాలను పోగొట్టి, భరోసా ఇవ్వగలదా? అంటే... ‘యస్’ అనే అంటున్నారు నిపుణులు. ఇప్పుడిప్పుడే ఆహారపరిశ్రమలో ఏఐ అడుగులు పడుతున్నాయి. భవిష్యత్‌కు సంబంధించి ఆశను, భరోసాను ఇస్తున్నాయి.ఆహార భద్రతకు సంబంధించిన మూలస్తంభాలలో ఒకటి... ఆహార నాణ్యత. ఆహార పదార్థాలలో వ్యాధికారకాలు, విషపదార్థాలను గుర్తించడంలో ఏ.ఐ సాంకేతికత ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఏ.ఐ, ఆధారిత కెమెరాలు ఆహార ఉత్పత్తులలోని కలుషితాన్ని, సరిగా లేని లేబులింగ్‌ను, ఇతరత్రా అంశాలను మనిషి కంటి కంటే వేగంగా, మరింత కచ్చితత్వంతో గుర్తిస్తున్నాయి. ఏఐ–ఆధారిత సెన్సార్లు ఆహార ఉత్పత్తులలో ఇ.కోలి, సాల్మోనెల్లా వంటి హానికరమైన బాక్టీరియాను గుర్తించగలవు. మైక్రోబయాలజీ స్టార్టప్ ‘స్పోర్ బయో’ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి పరీక్ష సమయాన్ని రోజుల నుండి నిమిషాల వ్యవధికి తగ్గించే ఏ.ఐ. సాంకేతికతను అభివృద్ధి చేసింది.తు.చ. తప్పకుండా... ఫుడ్‌సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని, ఉద్యోగులలో ఒత్తిడిని తగ్గించడానికి అమెరికన్ మల్టీనేషనల్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్ ‘మెక్‌డొనాల్డ్స్’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ శాఖలలో ఏ.ఐ. టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఏఐ–ఆధారిత డ్రైవ్–త్రూలు నిర్వహిస్తోంది. షెడ్యూలింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్లలో రెస్టారెంట్ మేనేజర్లకు ఏ.ఐ. సాధనాలు ఉపకరిస్తున్నాయి. నిబంధనలను పాటించడం అనేది ఆహార పరిశ్రమలకు సవాలుగా, సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా చేయడంలో ఏ.ఐ ఆటోమేట్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది.ఆహారభద్రతా చట్టాలు, లేబులింగ్ నిబంధనలు, ట్రేసబిలిటీ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి ఆహార పరిశ్రమలు మాన్యువల్ ప్రాసెస్‌పై ఎక్కువ ఆధారపడతాయి. సంక్లిష్టమైన నిబంధనలను త్వరగా అర్థం చేసుకోవడం, నిబంధనలు పాటించడానికి సంబంధించిన సందేహాలకు తక్షణ సమాధానాలు ఇవ్వడం ద్వారా హోటల్స్, రెస్టారెంట్స్... మొదలైనవి ఆహార భద్రతా చట్టాలలో అప్డేటెడ్గా ఉండేలా చూడడానికి ఏ.ఐ. అనేది మాన్యువల్ ప్రాసెస్‌కు ప్రత్యామ్నాయంగా మారింది.అలెర్జీలకు దూరంగా...ఆరోగ్యానికి దగ్గరగా... ఆహార భద్రతకు సంబంధించి ఏ.ఐ. సాంకేతికతను వినియోగించుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా ఫుడ్ సైంటిస్ట్‌లు, క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్‌లు... మొదలైన వారి నుంచి సలహాలు తీసుకుంటున్నాయి రెస్టారెంట్లు. రోబోటిక్ చెఫ్‌లు... ఏఐ ఆధారిత రోబోటిక్ చెఫ్‌లు, ప్రిడిక్టివ్ అనాలటిక్స్ ద్వారా ఆహార వ్యర్థాలను భారీగా తగ్గించడానికి వీలువుతుంది. మీల్ ప్లానర్, కుక్ బుక్ వంటి ఏ.ఐ. సాధనాలు వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను అందించడంలో సహాయపడుతున్నాయి. అలెర్జీల బారిన పడకుండా ఉపకరిస్తున్నాయి.ఏ.ఐ. ఆధారిత పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ యాప్ ‘ఆర్ఎక్స్డైట్’ కస్టమ్ ఫుడ్ ప్లాన్స్‌ను డెవలప్ చేసి ఆహారపదార్థాలను తాజాగా అందించడంలో తోడ్పడుతుంది. ఒకవైపు రుచిని అందిస్తూనే, మరోవైపు అలెర్జీ కారకాలను తొలగించడానికి, పోషక విలువలు మెరుగు పరచడానికి ఏ.ఐ సాధనాలు ఉపకరిస్తున్నాయి.మరింత ప్రయోజనకరంగా... ‘సంప్రదాయ ఆహారపదార్థాలను మరింత ప్రయోజనం కలిగించేలా చేయడానికి, పర్యావరణానికి తక్కువ హాని కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలు సృష్టించడానికి ఏ.ఐ. ఉపకరిస్తుంది’ అంటున్నారు నిపుణులు.రెస్టారెంట్ల ఆహారభద్రత పర్యవేక్షించడానికి యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏ.ఐ. టూల్స్ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఏ.ఐ. అనేది పని సామర్థ్యాన్ని మెరుగుపరిచే సాధనం మాత్రమే కాదు ఆహారభద్రతకు సంబంధించిన నిబంధనలను పాటించేలా చేయడంలో, పారదర్శకత, విశ్వసనీయతకు సంబంధించి ఆహార పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది. -
ఏఐ దాహం.. ప్రపంచానికి కొత్త సవాల్!
కృత్రిమ మేధస్సు (AI) సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది. విద్య, వైద్యం, పరిశ్రమలు, రవాణా, వినోదం వంటి అనేక రంగాల్లో ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే.. ఈ అభివృద్ధి వెనుక సమస్యలు కూడా ఉన్నాయని, ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (UNU) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.ఏఐ వల్ల కలిగే ప్రయోజనాల కంటే.. దాని కోసం అవసరమయ్యే నీరు, విద్యుత్, భూమి వినియోగం భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారవచ్చని యూఎన్‌యూ హెచ్చరించింది. ఏఐ వ్యవస్థలు పనిచేయడానికి భారీ డేటా సెంటర్లు అవసరం. ఈ డేటా సెంటర్లలో వేలాది సర్వర్లు నిరంతరం పనిచేస్తుంటాయి. దీంతో సర్వర్లు అధిక ఉష్ణోగ్రతలకు లోనవుతాయి. అలాంటప్పుడు వీటిని చల్లబరచడానికి భారీ మొత్తంలో నీరు అవసరమవుతుంది.భారీ నీటి వినియోగం!యూఎన్‌యూ నివేదిక ప్రకారం.. 2030 నాటికి AI డేటా సెంటర్లు వినియోగించే నీరు, ప్రపంచంలోని 1.3 బిలియన్ మంది ప్రజల ప్రాథమిక గృహ అవసరాలను తీర్చగల స్థాయిలో ఉండవచ్చని అంచనా. ఇది ప్రస్తుతం మొత్తం ఆఫ్రికా ఖండ జనాభాకు సమానం అని తెలుస్తోంది.ఇప్పటి వరకు ఏఐ గురించి జరిగిన చర్చల్లో కార్బన్ ఉద్గారాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ నీటి వినియోగం కూడా అంతే ముఖ్యమైన సమస్యగా మారుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఏఐ మోడళ్లను నడపడానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలోనూ, సర్వర్ల శీతలీకరణలోనూ భారీ స్థాయిలో నీటి వినియోగం ఉంటుంది.విద్యుత్ వినియోగంవిద్యుత్ వినియోగం విషయంలో కూడా.. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 2030 నాటికి AI ఆధారిత డేటా సెంటర్లు ప్రతి సంవత్సరం సుమారు 945 టెరావాట్ గంటల విద్యుత్‌ను వినియోగించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా దేశాల వార్షిక విద్యుత్ వినియోగాన్ని కలిపినా వచ్చే మొత్తానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ.ఏఐ అనేది కేవలం డిజిటల్ సాంకేతికత మాత్రమే కాదని నివేదిక స్పష్టం చేసింది. దీనికి అత్యాధునిక కంప్యూటర్ చిప్స్, భారీ డేటా సెంటర్లు, శీతలీకరణ వ్యవస్థలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు అవసరం. ఇవన్నీ భూమి వనరులపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తాయి. డేటా సెంటర్ల నిర్మాణం కోసం విస్తారమైన భూభాగం అవసరమవుతుంది. అదనంగా చిప్‌ల తయారీ ప్రక్రియలో కూడా విలువైన ఖనిజాలు, నీరు, పవర్ పెద్ద మొత్తంలో వినియోగించాల్సి ఉంటుంది.పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలుఅయితే.. ఇక్కడ ఐక్యరాజ్యసమితి ఏఐ అభివృద్ధిని నిలిపివేయాలని సూచించడం లేదు. బదులుగా ప్రభుత్వాలు, టెక్నాలజీ సంస్థలు, వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతోంది. కొత్త ఆవిష్కరణలతో పాటు నీటి వినియోగం, విద్యుత్ అవసరాలు, భూమి వినియోగం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తోంది.ఏఐ మానవ జీవితాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ దాని వెనుక దాగి ఉన్న పర్యావరణ వ్యయాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను సాధించడం ప్రపంచ దేశాల ముందున్న ప్రధాన సవాలు. కాబట్టి AI వల్ల కలిగే ప్రయోజనాలను ఆస్వాదిస్తూనే, దాని పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించడం చాలా అవసరం. -
ట్రైన్ టికెట్ దొరకట్లేదా.. అసలు కారణం ఇదే!
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు.. అవినీతి, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రైల్వే టికెట్ల బుకింగ్‌లో జరుగుతున్న అక్రమాలను నియంత్రించేందుకు ఈ సన్నాహాలు చేస్తోంది.టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. రైలు టికెట్లు పొందడం ప్రయాణికులకు చాలా కష్టంగా మారింది. టికెట్ బుకింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే సీట్లు పూర్తవుతున్నాయని చాలామంది ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా బాట్స్, టౌట్స్, నకిలీ ఖాతాలు, మోసపూరిత యూజర్ ఐడీలు అని అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో ఐఆర్సీటీసీ మూడు కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది. అదనంగా మరో ఆరు కోట్ల ఖాతాలను పరిశీలన కోసం గుర్తించింది. టికెట్ బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.అంతేకాకుండా.. 4.2 లక్షల అనుమానాస్పద పీఎన్ఆర్లకు సంబంధించిన 501 ఫిర్యాదులను నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో నమోదు చేసింది. అలాగే నకిలీ డిజిటల్ గుర్తింపులతో సంబంధం ఉన్న 13,343 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్లను కూడా బ్లాక్ చేసింది. ఈ చర్యల వల్ల ప్రయాణికులకు టికెట్లు అందుబాటులోకి రావడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.ట్రైన్ టికెట్ తొందరగా బుక్ అవ్వాలంటే?మీ IRCTC ఖాతాలో ముందుగానే లాగిన్ అయి ఉండండి.ప్రయాణికుల వివరాలను ముందుగానే సేవ్ చేసుకోండి.వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించండి.బుకింగ్ ప్రారంభ సమయానికి 5-10 నిమిషాల ముందే సిద్ధంగా ఉండండి.యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్ వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోండి.తత్కాల్ టికెట్ అయితే బుకింగ్ ఓపెన్ అయ్యే సమయానికే ప్రయత్నించండి.ఒకేసారి అనేక బ్రౌజర్ ట్యాబ్‌లు లేదా పరికరాల్లో ప్రయత్నించవద్దు.తక్కువ రద్దీ ఉన్న ప్రత్యామ్నాయ రైళ్లు, తేదీలను కూడా పరిశీలించండి.బుకింగ్ పూర్తయ్యే వరకు పేజీని రిఫ్రెష్ చేయకుండా జాగ్రత్తగా కొనసాగించండి.ఇదీ చదవండి: డబ్బు కోసమే వ్యాపారం చేయాలా?: రిచ్ డాడ్ క్లారిటీ -
ఐపీఎల్ ముగిసింది.. ఇక అసలు ఆట షురూ
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ముగిసిందని.. అసలు ఆట షురూ అయ్యిందని.. ఇకనైనా భారత కంపెనీలు వినోదాన్ని పక్కనపెట్టి వ్యాపార రంగంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో గూగుల్ తాజా పెట్టుబడుల ప్రకటనను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. వినోదం నుంచి దృష్టి మళ్లించి భవిష్యత్ సాంకేతికతలు, ముఖ్యంగా కృత్రిమ మేధస్సుపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని దేశీయ కంపెనీలకు ఉదయ్ కొటక్ సూచించారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ AI రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆల్ఫాబెట్ సంస్థ ఏఐ విస్తరణ కోసం సుమారు 80 బిలియన్ డాలర్లు సమీకరించనున్నట్లు ప్రకటించగా.. ఈ ఏడాది మొత్తం ఏఐపై 180 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని ఉదయ్ కొటక్ ఓ “వేక్ అప్ కాల్”గా అభివర్ణించారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో స్పందించిన ఆయన.. గూగుల్ వంటి సంస్థకు భారీ లాభాలు, భారీ మార్కెట్ విలువ ఉన్నప్పటికీ భవిష్యత్ టెక్నాలజీల కోసం మరింత పెట్టుబడులు పెడుతోందని పేర్కొన్నారు. గూగుల్ వార్షిక లాభాలు సుమారు 160 బిలియన్ డాలర్లు, మార్కెట్ విలువ 4.5 ట్రిలియన్ డాలర్లు అని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో భారత కంపెనీలు తక్షణ లాభాలు, వినోద కేంద్రిత దృష్టి నుంచి బయటకు వచ్చి దీర్ఘకాలిక ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని ఆయన పరోక్షంగా సూచించారు.ప్రపంచవ్యాప్తంగా ఏఐ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ఐటీ రంగం కూడా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉడయ్ కొటక్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. చాలా మంది ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ భారత వ్యాపార రంగం ఇప్పుడు పెట్టుబడులు, టెక్నాలజీ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే కొందరు మాత్రం అమెరికాలో పెద్ద స్పోర్ట్స్ లీగ్స్ కొనసాగుతున్నప్పటికీ అక్కడి ఆర్థిక వ్యవస్థ ఇన్నోవేషన్‌లో వెనుకడుగు వేయలేదని గుర్తు చేస్తూ.. భారతదేశం కూడా వినోదం–వ్యాపారం మధ్య సమతుల్యం సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ప్రభావం ఎలాగంటే.. ఈ తరహా భారీ పెట్టుబడులు ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), డేటా సెంటర్లు, చిప్ టెక్నాలజీ వంటి భవిష్యత్ ఆధారిత రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. గూగుల్ వంటి సంస్థలు ఇప్పటికే భారీ లాభాలు ఉన్నప్పటికీ మరింతగా పెట్టుబడులు పెడుతుండటం వల్ల.. కొత్త AI మోడళ్ల అభివృద్ధి వేగవంతమవుతుంది. ఉత్పత్తుల నాణ్యత మెరుగవుతుంది. అలాగే గ్లోబల్ టెక్ పోటీ మరింత తీవ్రంగా మారుతుంది. దీని ప్రభావంగా సాఫ్ట్వేర్ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టించబడతాయి.కానీ అదే సమయంలో సంప్రదాయ ఐటీ సేవలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ప్రపంచ వ్యాపార రంగంలో ఇక “కొత్త ఆవిష్కరణలు చేయాలి లేదా పోటీలో వెనుకబడిపోవాలి” అనే పరిస్థితి మరింత స్పష్టంగా మారే అవకాశం ఉంది. -
ఏఐ ఖర్చు తడిసిమోపెడు!
‘‘ఏఐ రాకతో ఉద్యోగాలకు ఎసరు..’’ ‘‘ప్రతి రంగంలోనూ ఏఐ, రోబోలదే రాజ్యం’’ ఇంకో ఏడాదిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండనే ఉండరు’’ కృత్రిమ మేధ.. అదేనండి ఏఐ విషయంలో కొంతకాలంగా మనం తరచూ చూస్తున్న వార్తలు ఇవి. వీటిని నమ్మిన ఒక వర్గం ఏఐ కోర్సుల్లో ఎగబడి చేరేశారు. ఇంకోవర్గం సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్‌లను వదిలేసుకున్నారు. కానీ...ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఊబర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే ఏఐ కంటే మనుషులే మేలంటున్నాయి. ఎందుకిలా? మనుషులు చేసే ఉద్యోగాల్లో కోతలుంటాయా? ఉండవా? సుమారు ఆరు నెలల క్రితం నాటి మాట. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లక్ష వరకూ ఇంజనీర్ల ఏఐ సబ్స్క్రిప్షన్లు నిలిపేసింది. క్లాడ్ ఏఐను వాడొద్దని వారికి స్పష్టం చేసింది.కొంచెం అటు ఇటుగా ఇదే సమయంలో ఊబర్‌కు కూడా ఏఐ షాక్ ఒకటి తగిలింది. ఏడాది పొడవునా ఏఐ పెడదామనుకున్న డబ్బులు కాస్తా నాలుగు నెలల్లోనే ఖాళీ అయిపోయాయి. సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఏఐ వాడకం విషయంలో వెనక్కు తగ్గింది. ఈ మూడు కంపెనీల ఉద్దేశం మాత్రం ఒక్కటే.... ఏఐ వాడితే ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి... వీటికంటే ఇంజనీర్లతో పనిచేయించుకోవడమే మేలు అన్న అంచనాకు రావడమే! ఏఐతో ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి? అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం టోకెన్ ప్రైజింగ్ గురించి తెలుసుకోవాలి.ఏజెంటిక్ ఏఐ వాడకానికి అయ్యే ఖర్చులను టోకెన్లలో లెక్కిస్తూంటారు. ఉదాహరణకు మీరు ‘ Hello, How are you? ‘ అని ఏజెంటిక్ ఏఐతో మాట కలిపారు అనుకుందాం. దీన్ని ఏఐ ఏక మొత్తంగా ఒక వాక్యంగా అర్థం చేసుకోదు. టోకెన్లుగా విభజిస్తుంది. ‘ " Hel", " lo", " How", " are", " you" ‘ లు ఒకొక్కటి ఒక్కో టోకెన్ అవుతుందన్నమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి కోడ్ రాయమంటే... అందులోని ఒక్కో టోకెన్‌కు నిర్దిష్ట మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. ఎన్ని ఎక్కువ టోకెన్లు వాడితే అంత ఎక్కువ ఖర్చు అన్నమాట. కోడింగ్ చకచకా జరిగిపోతోంది కాబట్టి ఇంజనీర్లు టోకెన్లు తెగ వాడేస్తూండటంతో వారికిచ్చే జీతాల కంటే టోకెన్ల ఖర్చు ఎక్కువైపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కంపెనీలన్నీ ఏఐ వాడకంపై పునరాలోచనలో పడ్డాయి. 70 శాతం ఏఐదే.. కానీ... కోడింగ్ వేగంగా చేయవచ్చునన్న అంచనాతో మైక్రోసాఫ్ట్ చాలాకాలం క్రితమే సుమారు లక్ష మంది ఇంజనీర్లకు క్లాడ్ ఏఐ సబ్రస్కిప్షన్లు అందించింది. కానీ ఇంజనీర్లు రోజుకు కొన్ని లక్షల టోకెన్లు వాడేస్తూండటంతో భారం పెరిగిపోయింది. దీంతో ఆరు నెలల క్రితం సబ్స్క్రిప్షన్లను క్యాన్సిల్ చేసింది. ‘‘ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులు కలుపుకుని చూసినా ఏఐ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి.ఇది తగ్గితే కానీ ఏఐ విస్తృత వినియోగంలోకి రాదు’’అని ఎన్విడియా అప్లైడ్ డీప్ లెర్నింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ బ్రయన్ కాటన్జరో వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతుంది. ‘‘సాఫ్ట్వేర్ కోడ్‌లో 70 శాతం వరకూ ఏఐ ఆధారంగానే జరుగుతోంది. అయితే దీని వల్ల వినియోగదారుడికి ఏదైనా ప్రయోజనం కలుగుతోందా? లేదా? అన్నది స్పష్టం కాలేదు’’అని ఊబర్ సీఓఓ ప్రశాంత్ మహేంద్ర రాజ చెబుతున్నారు. ఇంకోలా చెప్పాలంటే ఏఐపై పెడుతున్న ఖర్చుకు తగ్గ లాభాలు రావడం లేదన్నమాట. ఉద్యోగాల కోత మాటేమిటి? ఏఐ వస్తే చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ప్రస్తుతానికి తగ్గుతోందని చెప్పాలి. ఏఐ వాడకంపై కంపెనీలు పునరాలోచనలో పడటం ఇందుకు కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీర్లు, అనలిస్టులు, కస్టమర్ సపోర్ట్ సిబ్బంది ఉద్యోగాలు సేఫ్. వీరి స్థానంలో ఏఐ వాడకం చాలా ఖరీదైన వ్యవహారమని కంపెనీలు గుర్తించాలి. ఈ నేపథ్యంలో ఏఐతో కలిసి పనిచేయగల నైపుణ్యం అవసరమవుతుంది.వీటిని కలిగిఉన్న వారికి సమీప భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా. ఒకవేళ ఇంకో ఐదు, పదేళ్లలో కంప్యూటింగ్ ఖర్చులు తగ్గితే కోడింగ్, డాక్యుమెంటేషన్ వంటివి ఏఐలు చేస్తాయి కానీ.. వాటిపై మానవ పర్యవేక్షణ తప్పనిసరి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తమ్మీద చూస్తే... ఏఐతో మన ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదు. ఉత్పాదకతను పెంచడంలో మాత్రం ఏఐ సహకారం అవసరమవుతుంది. దీర్ఘకాలంలో ఏమవుతుందన్నది మాత్రం కాలమే చెప్పాలి!!–సాక్షి, నేషనల్ డెస్క్ -
భారమవుతున్న కృత్రిమ మేధ!
ఉత్పాదకతను పెంచడంలో, మానవ శ్రమను తగ్గించడంలో కృత్రిమ మేధ (ఏఐ) చాలా ఉపయోగపడుతోందన్న మాట వాస్తవమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు ఏఐ సాధనాలను అందిస్తూ వచ్చాయి. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. అపరిమిత ఉత్పాదకతను ఆశ చూపిన ఏఐ, ఇప్పుడు కంపెనీల బడ్జెట్లకు తూట్లు పొడుస్తోంది. దీంతో మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఉబెర్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాల దారిలోనే.. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ నెట్వర్క్ అయిన వాల్‌మార్ట్ కూడా తమ ఉద్యోగుల ఏఐ వినియోగంపై ఆంక్షలు విధిస్తుంది.‘కోడ్ పప్పీ’కి బ్రేకులుబ్లూమ్బెర్గ్ తాజా నివేదిక ప్రకారం.. వాల్‌మార్ట్ తన అంతర్గత కార్పొరేట్ పనుల కోసం రూపొందించుకున్న ‘కోడ్ పప్పీ’ అనే ఏఐ అసిస్టెంట్ వినియోగంపై పరిమితులు విధించింది. ఇది ఉద్యోగులకు ప్రెజెంటేషన్లు తయారు చేయడం, డేటా స్ప్రెడ్షీట్లను నింపడం వంటి రోజువారీ పనులను చిటికెలో చేసిపెట్టే ఏఐ ఏజెంట్. గతంలో వాల్‌మార్ట్ ఉద్యోగులు దీనిని అపరిమితంగా వాడేవారు. ఉద్యోగుల నుంచి దీనికి డిమాండ్ పెరగడంతో కంపెనీకి బిల్లులు తడిసి మోపెడయ్యాయి. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఇకపై ఉద్యోగులకు టోకెన్ పరిమితి విధించాలని నిర్ణయించింది.టోకెన్ పరిమతి అంటే ఏమిటి?ఏఐ భాషలో టోకెన్ అనేది ఒక కొలమానం. మనం ఏఐకి ఇచ్చే ప్రాంప్ట్‌లు (ప్రశ్నలు) అది ఇచ్చే సమాధానాల పొడవును బట్టి టోకెన్లు ఖర్చవుతాయి. ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ టోకెన్లు వినియోగమవుతాయి. అంటే.. ఇకపై వాల్‌మార్ట్ ఉద్యోగులు లెక్క చూసుకుని మరీ ఏఐని వాడాల్సి ఉంటుంది.ఈ విషయంపై వాల్‌మార్ట్ ప్రతినిధి స్పందిస్తూ.. ఉద్యోగులు ఏఐని కేవలం కాలక్షేపానికి కాకుండా కంపెనీకి విలువను చేకూర్చే పనులకు మాత్రమే వాడాలని, సరైన పని కోసం సరైన ఏఐ సాధనాన్ని ఎంచుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం వాల్‌మార్ట్ సిబ్బందికి కోడ్ పప్పీతో పాటు క్లాడ్, చాట్‌జీపీటీ వంటి ఇతర సాధనాల యాక్సెస్ కూడా ఉంది.ఉబెర్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకూ తప్పని తిప్పలుఖర్చులు పెరుగిపోతున్న ఉదంతాన్ని బహిరంగంగా అంగీకరించిన సంస్థల్లో రైడ్-హెయిలింగ్ దిగ్గజం ఉబెర్ ముందు వరుసలో ఉంది. ఈ ఏడాది జనవరిలో ఉబెర్ తన 5,000 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ‘క్లాడ్ కోడ్’ యాక్సెస్ ఇచ్చింది. అయితే, కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఆ ఏడాది మొత్తానికి కేటాయించిన ఏఐ బడ్జెట్ అంతా ఖర్చయిపోవడంతో యాజమాన్యం నివ్వెరపోయింది.మైక్రోసాఫ్ట్ యూటర్న్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం తన అంతర్గత ఇంజినీర్లను క్లాడ్ కోడ్ వాడకం తగ్గించి, జూన్ 30 లోగా సంస్థకు చెందిన సొంత ఏఐ టూల్స్‌కు మారిపోవాలని ఆదేశించింది. టోకెన్ ఖర్చులు మితిమీరడమే దీనికి ప్రధాన కారణమని సమాచారం.ఇదీ చదవండి: నిన్నటి ధరే నేడు.. ప్రశాంతంగా పసిడి -
సాఫ్ట్వేర్ విజయం సాధించాలంటే..
సాంకేతిక ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం సాంప్రదాయ ఐటీ రంగ ఉనికినే ప్రశ్నిస్తోందన్న ఆందోళనలపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని కౌంటర్ ఇచ్చారు. ‘కోడింగ్ ఆటోమేటెడ్ అయితే ఇక ఐటీ కంపెనీలు, ఉద్యోగులు ఎందుకు?’ అంటూ మార్కెట్లో వ్యక్తమవుతున్న అస్తిత్వ ప్రశ్నలకు ఆయన వ్యూహాత్మక సమాధానమిచ్చారు. ఏఐ అనేది ఐటీ సేవల ప్రాధాన్యతను తగ్గించబోదని, పైగా నైపుణ్యాల డిమాండ్‌ను మరింత పెంచిందని ఆయన స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్ వార్షిక నివేదిక సమర్పణ సందర్భంగా వాటాదారులు, పెట్టుబడిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ఆందోళనల మధ్యే అద్భుత వృద్ధిగత ఏడాది కాలంగా ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థలు అధునాతన ఏఐ సాధనాలను మార్కెట్లోకి తీసుకురావడంతో ఐటీ కంపెనీల భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ భయాల కారణంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇన్ఫోసిస్ షేర్లు ఏకంగా 28% పైగా క్షీణించాయి. అయితే, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇన్ఫోసిస్ బలమైన ఆర్థిక ఫలితాలను సాధించినట్లు చెప్పారు.వార్షిక ఆదాయం: మునుపటి ఏడాదితో పోలిస్తే 4.6% వద్ధితో 20.16 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.65 లక్షల కోట్లు) వార్షిక ఆదాయాన్ని నమోదు చేసింది.ఉద్యోగుల సంఖ్య: కంపెనీ ఉద్యోగుల సంఖ్య మునుపటి కంటే 5,016 పెరిగి మొత్తం 3,28,594 కు చేరుకుంది.మునుపటికంటే బలంగా..‘జనరేటివ్ ఏఐ (GenAI) రంగ ప్రవేశం చేసి మూడేళ్లు పూర్తయింది. ఈ తరుణంలో ఇన్ఫోసిస్ గతంలో కంటే మరింత సందర్భోచితంగా, పటిష్టంగా మారిందని చెప్పగలం. మన ముందు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఏఐ అనేది మునుపెన్నడూ లేనంత పెద్ద సాంకేతికగా కనిపిస్తుంది. కాబట్టి సందేహాలు రావడం సహజం. కోడింగ్ ఆటోమేటిక్ అయితే, ఇక మన అవసరం ఏముంది? అనే ప్రశ్న మా ముందూ నిలిచింది. కానీ, వాస్తవం దానికి భిన్నంగా ఉంది’ అన్నారు.ఐటీ అంటే అంతకంటే ఎక్కువే!ఏఐ కేవలం కోడింగ్‌ను ఆటోమేట్ చేయగలదని, అయితే ఒక పూర్తి స్థాయి సాఫ్ట్వేర్ విజయం సాధించాలంటే కేవలం కోడింగ్ సరిపోదని నీలేకని స్పష్టం చేశారు. వేగవంతమైన ఏఐ డిమాండ్‌కు అనుగుణంగా ఐటీ రంగంలో కింది అంశాలు అత్యంత కీలకంగా మారాయని చెప్పారు.1. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ (ఎస్డీఎల్సీ) పరీక్షలు: క్లిష్టమైన సిస్టమ్స్‌ను నిరంతరం పర్యవేక్షించడం.2. సాఫ్ట్వేర్ వ్యవస్థలు వైఫల్యం చెందకుండా నిరోధించడం.3. సైబర్ సెక్యూరిటీ: ఏఐ యుగంలో పెరిగిపోతున్న సైబర్ ముప్పుల నుంచి రక్షణ కల్పించడం.4. ఐటీ ఆధునీకరణ: పాత సాఫ్ట్వేర్ వ్యవస్థలను సరికొత్త సాంకేతికతకు అనుగుణంగా మార్చడం.కొత్త వ్యాపార నమూనా వైపు అడుగులుభవిష్యత్తు ఐటీ రంగాన్ని శాసించడానికి పాత పద్ధతులు సరిపోవని, సరికొత్త వ్యాపార నమూనా అవసరమని నీలేకని పిలుపునిచ్చారు. ‘మేము ఈ సరికొత్త సవాలుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. మా శ్రామిక శక్తిని ఈ కొత్త యుగానికి అనుగుణంగా తీర్చిదిద్దుతాం. ఏఐ ఆటోమేషన్, ఉత్పాదకత ద్వారా ఆదా అయ్యే మానవ వనరులను కొత్త యూజర్లను ఆకర్షించడానికి, సరికొత్త సేవలను విస్తరించడానికి తిరిగి వినియోగిస్తాం’ అని నందన్ నీలేకని వాటాదారులకు హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: నిన్నటి ధరే నేడు.. ప్రశాంతంగా పసిడి -
IIT ఫెయిల్.. సొంతంగా AI నేర్చుకుని
ఐఐటీ ప్రవేశ పరీక్షలో విఫలం కావడం అంటే.. చాలామంది విద్యార్థుల జీవితాల్లో పెద్ద నిరాశగా భావించాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఫెయిల్యూర్ ఒక ముగింపు కాదు, కొంతమందికి కొత్త ప్రారంభానికి మార్గం అవుతుంది. అలాంటి ఒక ప్రేరణాత్మక కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు ప్రకారం.. ఒక యూజర్ తన జీవిత ప్రయాణాన్ని పంచుకుంటూ, తాను రెండు సార్లు ఐఐటీ ఎంట్రన్స్ పరీక్షలో విఫలమైనట్లు చెప్పుకున్నారు. చిన్న పట్టణం నుంచి వచ్చినందుకు.. చుట్టూ ఉన్నవారితో పోల్చుకోవడం, ప్రెజర్స్ అన్నీ చాలా కష్టంగా అనిపించాయని అతను చెప్పుకోచ్చారు. ఒకానొక దశలో జీవితం ముగిసిపోయినట్టే అనిపించిందని కూడా పేర్కొన్నారు.ఫెయిల్యూర్ తర్వాత తన ఊరిని వదిలి, వేరే నగరంలోని ప్రభుత్వ కాలేజీలో చేరాడు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉండేవి. తల్లిదండ్రులు ఎక్కువగా సహాయం చేయలేని పరిస్థితి కావడంతో, చదువు కోసం లోన్స్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే చిన్న పిల్లలకు మ్యాథ్స్ ట్యూషన్ చెప్పి కొంత ఆదాయం సంపాదించాడు. కొన్ని సార్లు రెండు సమోసాలతో రోజంతా గడపాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. అయినప్పటికీ అతను వెనక్కి తగ్గలేదని వివరించారు.ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని.. కాలేజీ పూర్తి చేసిన తర్వాత, అతనికి నెలకు రూ.20,000 జీతంతో ఒక ఐటీ సపోర్ట్ జాబ్ వచ్చింది. అది పెద్ద జీతం కాకపోయినా.. అతని కెరీర్‌కు ఒక ప్రారంభం అయింది. కానీ అతను అక్కడే ఆగిపోలేదు. తన కుటుంబ పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతో, ఉద్యోగం తర్వాత ఖాళీ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషిన్ లెర్నింగ్ (ML) నేర్చుకోవడం ప్రారంభించాడు.I failed IIT. Twice.At one point, it genuinely felt like life was over. In small towns, failure doesn’t stay private. The comparisons, the silent judgment, the feeling that everyone suddenly sees you differently ,I experienced all of it. It hurt more than I ever admitted.So,…— AJ (@JainJec2013) May 29, 2026ఎలాంటి కోచింగ్ లేకుండా, ఎలాంటి మెంటార్ లేకుండా, కేవలం ఇంటర్నెట్ సాయంతో అతను స్వయంగా ఈ టెక్నాలజీలను నేర్చుకున్నాడు. ఈ ప్రయత్నం అతని కెరీర్లో పెద్ద మలుపు తీసుకువచ్చింది. తర్వాత అతనికి ఏఐ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి అతను ప్రొడక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ లీడర్షిప్ రోల్స్‌లోకి ఎదిగాడు.కొన్నేళ్ల తర్వాత.. ఐఐటీలో సీటు పొందిన తన స్నేహితులతో సమాన స్థాయిలో సంపాదిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం అతను దుబాయ్‌లో ఉన్నట్లు తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఒకప్పుడు పాలు కొనడానికి కూడా ఇబ్బంది పడిన కుటుంబం నుంచి, ఇప్పుడు రెండవ ఆలోచన లేకుండా కావలసినవి కొనగలిగే స్థాయికి ఎదిగానని పేర్కొన్నాడు.జీవితంలో ఎదగాలంటే.. పర్ఫెక్ట్ స్టార్ట్ అవసరం లేదు, మీకు దృఢ సంకల్పం కావాలి అని వెల్లడించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ అతని పట్టుదలను, కష్టపడి ఎదిగిన తీరును ప్రశంసిస్తున్నారు.ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగులు! -
ఏఐ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు
‘‘సినిమా మేకింగ్‌లో సాంకేతికత పెరిగినప్పటికీ మనుషుల భావోద్వేగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రత్యామ్నాయం కాదు... కాలేదు’’ అని హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ పేర్కొన్నారు. ఇటీవల స్పీల్బర్గ్ సినిమా మేకింగ్‌లో కృత్రిమ మేధ వినియోగంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన ఏం మాట్లాడారంటే... ‘‘కళలో మానవీయ కోణం అన్నది ఎంతో ముఖ్యం. రచయితల టేబుల్ వద్ద ఒక కుర్చీ ఖాళీగా ఉండి ఆ స్థానాన్ని ఏఐ భర్తీ చేయడాన్ని నేను ఇష్టపడను. సొంతంగా ఆలోచించే లేదా అనుభవించే స్పృహ కంప్యూటర్లకు ఉంటుందని నేను నమ్మను. మానవ ఆత్మకు, వారి అంతర్గత సృజనాత్మకతకు ఏఐ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదు. సినిమా అనేది కొన్ని కమాండ్స్ సమాహారం కాదు. అది మానవ మేధస్సు, హృదయం నుండి వచ్చే అద్భుత సృష్టి. ఏఐని ఒక టూల్‌గా ఉపయోగించుకోవడానికి అభ్యంతరం లేదు. సినిమా షూటింగ్ కోసం అనువైన లొకేషన్లను వెతకడంలో ఏఐ సహాయం తీసుకుంటే ఓకే. అయితే సినిమా రంగంలో సృజనాత్మక ప్రక్రియకు సంబంధించిన ఏ విషయానికైనా ఏఐని తుది నిర్ణయంగా తీసుకోకూడదని హాలీవుడ్‌ని కోరుతున్నాను. భవిష్యత్తులో నేను చేసే సినిమాలకు ఏఐ అనేది విరుద్ధం. నటీనటుల ఎంపిక, కెమెరాను ఏ కోణంలో పెట్టాలి? డైలాగులు ఎలా రాయాలి? వంటి సృజనాత్మక విషయాలను ఏఐ టూల్ నాకు సూచించడానికి నేను పూర్తి వ్యతిరేకం’’ అని స్పీల్బర్గ్ పేర్కొన్నారు. – స్టీవెన్ స్పీల్బర్గ్ -
AI: ఒక కొత్త రక్కసి.. ఇదొక మహా ప్రళయం!
మానవ మేధస్సుకు మరణశాసనం రాయడానికి ఒక కొత్త రక్కసి పుట్టుకొచ్చింది. దాని పేరు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’... క్లుప్తంగా ‘ఏఐ’…కంప్యూటర్లు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, స్మార్ట్ఫోన్లు వచ్చాయి... ప్రపంచం మారింది. కానీ ఇప్పుడు వస్తున్న ఏఐ ఆ మార్పు లాంటిది కాదు. ఇది మానవ జాతి ఉనికినే, శ్రమనే, ఉపాధినే నిలువునా మింగేసే ఒక మహా ప్రళయం. టెక్నాలజీ పెరుగుతోంది... కానీ మనుషులు తరిగిపోతున్నారు. లాభాలు కురుస్తున్నాయి... కానీ ఉపాధి మాయమవుతుంది.విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఒక సందర్భంలో చాలా స్పష్టంగా హెచ్చరించారు: "పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందితే... అది మానవ జాతి అంతానికే నాంది కాగలదు. అది మనుషులను అధిగమించి, తనను తాను రీ-డిజైన్ చేసుకుంటూ వెళ్తుంది. మితమైన జీవ పరిణామం ఉన్న మనుషులు దానితో పోటీ పడలేరని” ఇవాళ హాకింగ్ అన్న మాటలు అక్షరసత్యం అవుతున్నాయి. యంత్రం మనిషికి సాయం చేయాలి... కానీ మనుషులనే నామరూపాలు లేకుండా తుడిచేస్తుంటే, ప్రపంచ దేశాల పాలకులు ఎందుకు గుడ్డివాళ్లుగా మిగిలిపోయారు? కోట్లాది మంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుంటే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? అసలు కొనుగోలు శక్తి లేని సమాజంలో ఏఐ కంపెనీలు లాభాలు ఎలా ఆర్జిస్తాయి? ఈ ప్రాథమిక ఆర్థిక సూత్రం కార్పొరేట్ శక్తులకు, పాలకులకు ఎందుకు అర్థం కావడం లేదు?ఏఐతో మానవ వనరులకు పెను ముప్పు వాటిల్లుతుందనేది ఇవాళ ఊహ కాదు... కళ్ల ముందు కనిపిస్తున్న పచ్చి నిజం. మరి ఈ నిజం మన కంటికి కనిపిస్తున్నప్పుడు, ప్రపంచ దేశాలను ఏలుతున్న పాలకుల కళ్లకు ఎందుకు కనిపించడం లేదు? అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రధాని వరకు, యూరప్ దేశాల నేతల నుంచి ఆసియా పాలకుల వరకు... అందరూ ఏఐ సదస్సుల్లో పాల్గొంటూ, టెక్నాలజీని పొగుడుతూ కాలం గడుపుతున్నారు తప్ప, దాని వల్ల రాబోయే సామాజిక వినాశనాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు? విఖ్యాత ఫ్రెంచ్ తత్వవేత్త జీన్-జాక్వెస్ రూసో ఒక మాట అన్నారు: "ప్రజలు శాసనాలు చేసే పాలకులను ఎన్నుకుంటారు... కానీ ఆ పాలకులు ప్రజలను కాక, ధనవంతుల ప్రయోజనాలను రక్షించడానికి చట్టాలు చేస్తారు." ఇవాళ ప్రపంచ పాలకుల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఏఐ వల్ల సమాజంలో నిరుద్యోగం పెరిగి, నేరాలు ఎక్కువై, అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని తెలిసి కూడా పాలకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకంటే, పాలకులకు ఎన్నికల వెనుక, వారి అధికార పీఠాల వెనుక ఈ భారీ టెక్ కార్పొరేట్ కంపెనీల లాబీయింగ్ ఉంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఓపెన్ ఏఐ వంటి సంస్థల లాభాల కోసం ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్న శ్రమజీవుల జీవితాలను బలిపీఠం ఎక్కిస్తున్నారు.అంతర్జాతీయ నివేదికల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం కానున్నాయి. అంటే సగానికి పైగా మానవ వనరులు పనికిరాకుండా పోతాయి. ఈ మానవ వనరులను తుడిచిపెట్టడానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెక్ కంపెనీలు ఎంతెంత మొత్తాన్ని పెట్టుబడులుగా తగలేస్తున్నాయో తెలిస్తే మనం విస్తుపోవాల్సిందే. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు కేవలం ఏఐ డేటా సెంటర్లు, చిప్‌ల కోసమే ఏడాదికి వందల బిలియన్ డాలర్లను... అంటే భారతీయ కరెన్సీలో లక్షల కోట్ల రూపాయలను నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నాయి. ఒక్క మైక్రోసాఫ్ట్ సంస్థే ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో వంద బిలియన్ డాలర్ల వ్యయంతో 'స్టార్గేట్' అనే భారీ ఏఐ సూపర్ కంప్యూటర్ ప్రాజెక్ట్‌కు తెరలేపింది. గూగుల్, మెటా సంస్థలు తమ సంప్రదాయ వ్యాపారాలను పక్కనబెట్టి, కేవలం ఏఐ మౌలిక సదుపాయాల కోసమే తమ వార్షిక మూలధన వ్యయాన్ని 40 బిలియన్ డాలర్లకు పైగా పెంచేసాయి. మానవాళి ఆకలిని తీర్చడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి పైసా విదల్చని ఈ కార్పొరేట్ శక్తులు... మనుషుల ఉద్యోగాలను ఊడబీకడానికి మాత్రం అక్షరాలా లక్షల కోట్లను తగలేస్తున్నాయి.మరి ఒక దేశానికి అత్యంత కీలకమైన మానవ వనరులను ఈ విధంగా విచ్ఛిన్నం చేస్తుంటే, సమాజంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి. ఆకలి కేకలు ఎక్కువైతే తిరుగుబాట్లు వస్తాయి. ఇంతటి భయానక దుష్పరిణామాలు పొంచి ఉన్నా, పాలకులు కేవలం టెక్నాలజీ భ్రమల్లో బతుకుతుండటం ఈ శతాబ్దపు అతిపెద్ద విషాదం.ఏఐ పేరుతో, ఆటోమేషన్ పేరుతో కంపెనీలు సింపుల్‌గా ఒక ప్రెస్ నోట్ వదులుతున్నాయి... "మేము ఖర్చులు తగ్గించుకుంటున్నాం... ఉద్యోగులను తొలగిస్తున్నాం" అని. కానీ, ఆ లే ఆఫ్ లేఖ వెనుక ఉన్న ఒక కుటుంబం ఏమైపోవాలి? ఆ ఉద్యోగి నమ్ముకున్న తల్లిదండ్రులు, చదువుకుంటున్న పిల్లలు, కట్టాల్సిన ఇళ్ల లోన్లు, కార్ లోన్లు, రేపటి పూట అహారం... వీటన్నిటికీ సమాధానం ఎవరు చెబుతారు? ఈ నేపథ్యంలోనే వాంచన నగరమైన వాటికన్ నుండి పోప్ లూథర్ XIV తన చారిత్రాత్మక పత్రం "మాగ్నిఫికా హ్యుమానిటాస్" ద్వారా ప్రపంచాన్ని తీవ్రంగా హెచ్చరించారు. సాంకేతికత వేగాన్ని, సమర్థతను మాత్రమే కొలమానంగా తీసుకోకూడదని, కార్మికుడి గౌరవాన్ని, సమాజంలో పాల్గొనే హక్కును గౌరవించాలని స్పష్టం చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పేరుతో జరుగుతున్న "నూతన బానిసత్వాన్ని" పోప్ తీవ్రంగా ఖండించారు. కేవలం టెక్నాలజీ ప్రవాహం నిరంతరాయంగా సాగడం కోసం దారుణమైన పరిస్థితుల్లో ఖనిజాలను వెలికితీస్తూ, డేటా లేబిలింగ్ చేస్తూ శ్రమిస్తున్న అట్టడుగు వర్గాల శారీరక శ్రమను, వారి గాయాలను ప్రపంచ కార్పొరేట్ శక్తులు విస్మరిస్తున్నాయని నిలదీశారు.ప్రముఖ సామాజిక తత్వవేత్త, రచయిత యువల్ నోవా హరారి తన హెచ్చరికలో ఒక భయంకరమైన పదాన్ని వాడారు. ఏఐ వల్ల భవిష్యత్తులో సమాజంలో "యూస్‌లెస్ క్లాస్" అంటే 'అనవసరమైన శ్రమ జీవుల వర్గం' ఒకటి తయారవుతుందని అన్నారు. అంటే మనుషులకు ఉద్యోగాలే లేకపోవడమే కాదు, అసలు వారు ఆర్థిక వ్యవస్థకు 'అనవసరమైన వారిగా' మారిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇవాళ కార్పొరేట్ శక్తులకు సమాజం అంటే మనుషులు కాదు... వారి లాభాల బ్యాలెన్స్ షీట్లు మాత్రమే! సొంత లాభం కోసం పొరుగువాని పొట్ట కొట్టడమే ఏఐ కంపెనీల ఏకైక లక్ష్యంగా మారింది. ఒక్కో ఉద్యోగం పోయినప్పుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే రోడ్డున పడటం లేదు, ఆ వ్యక్తిని నమ్ముకున్న ఒక కుటుంబం నిలువునా కూలిపోతోంది. విద్యావంతులైన యువత, రాత్రి పగలు కష్టపడి చదివి నైపుణ్యాలు సంపాదించుకున్న టెక్ నిపుణులు... ఇవాళ ఏఐ టూల్స్ కారణంగా క్షణాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆ కుటుంబాల ఆక్రందనలు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు పాలకులకు వినిపించడం లేదా? ఏఐ తీసుకొచ్చిన ఈ కృత్రిమ మేధస్సు వల్ల మనుషుల జీవితాల్లో సహజమైన ఆనందం కరువైపోతోంది. నిరాశ, నిస్పృహలతో యువత ప్రాణాలు తీసుకుంటుంటే, ఈ టెక్నాలజీ ప్రగతి సాధించినట్లు ఎలా అనుకుంటాం?ఇప్పుడు ఒక ప్రాథమిక ఆర్థిక శాస్త్ర ప్రశ్నను మనం పాలకుల ముందు, ఏఐ కంపెనీల ముందు ఉంచాలి. మానవ వనరులే సర్వస్వం అనుకుంటే... ఏఐ కారణంగా ఆ మానవ వనరుల ఉపాధి దెబ్బతిని, వారి ఆదాయాలు పడిపోతే, సమాజంలో కొనుగోలు శక్తి ఏమైపోవాలి? ఆర్థిక శాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ తన 'వెల్త్ ఆఫ్ నేషన్స్'లో స్పష్టంగా చెప్పారు. “ఏ సమాజంలోనైనా మెజారిటీ ప్రజలు పేదరికంలో, బాధల్లో ఉంటే ఆ సమాజం ఎప్పటికీ వర్ధిల్లదు. వినియోగదారుడి డిమాండ్ మాత్రమే మార్కెట్‌ను నడిపిస్తుంది అని” పెట్టుబడిదారీ విధానంలో ఒక పెద్ద లోపం ఉంది... దాన్ని ఈ ఏఐ కంపెనీలు పూర్తిగా మర్చిపోయాయి. మనుషులకు ఉద్యోగాలు లేకపోతే వారికి జీతాలు రావు. జీతాలు రాకపోతే వారి ఆదాయం సున్నా అవుతుంది. ఆదాయం లేనప్పుడు మనుషులు కేవలం తినడానికి తిండి మాత్రమే కొనుక్కుంటారు తప్ప... కార్లు, బైకులు, బట్టలు, ఫోన్లు, విలాసవంతమైన వస్తువులు ఏవీ కొనలేరు. అంటే అన్ని రంగాలు తిరోగమనంలో పడతాయి. రియల్ ఎస్టేట్ కూలిపోతుంది, ఆటోమొబైల్ రంగం దెబ్బతింటుంది, మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ పడిపోతుంది.మరి సమాజంలో వినియోగమే లేనప్పుడు, మార్కెట్ మొత్తం తిరోగమనంలో పడినప్పుడు... ఈ ఏఐ కంపెనీలకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వందల బిలియన్ డాలర్లు తగలేసి వారు తయారు చేసిన సాఫ్ట్వేర్లను, టూల్స్‌ను కొనే నాథుడు ఎవరు ఉంటారు? మనుషుల పొట్ట కొట్టి, వారి ఆదాయాన్ని లాగేసుకుని... కార్పొరేట్ సంస్థలు ఎవరికి తమ ఉత్పత్తులను అమ్ముకుంటాయి? రోబోలు రోబోలకి అమ్ముకుంటాయా? సాఫ్ట్వేర్లు సాఫ్ట్వేర్లతో వ్యాపారం చేస్తాయా?ఎంతటి మూర్ఖత్వం! మానవ వనరుల వినాశనం అంటే అది చివరకు ఏఐ కంపెనీల వినాశనానికే దారితీస్తుందనే కనీస లాజిక్‌ను ఇటు కంపెనీలు, అటు పాలకులు ఎలా మర్చిపోయారు?సరే... అంతా ఏఐ అనుకుందాం. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనికీ ఏఐ టూల్స్ వాడదాం. కానీ ఉచితంగా ఏదీ రాదు కదా! ప్రతి ఏఐ సాఫ్ట్‌వేర్‌కు, ప్రతి యాప్‌కు సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టాలి, డబ్బు చెల్లించాలి. మరి సాధారణ ప్రజల దగ్గర వ్యాపారాలు లేనప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు... వినియోగదారులు ఆ ఏఐ కంపెనీలకి డబ్బు ఎలా చెల్లిస్తారు? ప్రముఖ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ఆర్థిక మాంద్యం సమయంలో ఒక అద్భుతమైన సూత్రాన్ని ప్రతిపాదించారు. ప్రభుత్వాలు ప్రజల చేతుల్లో డబ్బు పెట్టాలి, అప్పుడే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ బతుకుతుంది. కానీ ఇవాళ ఏఐ చేస్తున్నది దీనికి రివర్స్. ప్రజల చేతుల్లో ఉన్న డబ్బును లాగేసుకుంటోంది. చిన్న చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి రంగాలు ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఒక చిన్న డిజైనర్, ఒక చిన్న అకౌంటెంట్, ఒక చిన్న లీగల్ అడ్వైజర్... వీరంతా ఇవాళ ఉపాధి కోల్పోతున్నారు. మరి సమాజంలో చలామణీ అయ్యే డబ్బు మొత్తం నలుగురైదుగురు టెక్ బిలియనీర్ల అకౌంట్లలోకి వెళ్ళిపోతే... మార్కెట్లో లిక్విడిటీ ఏమైపోవాలి? వ్యాపారాలు లేని సమాజంలో వినియోగదారుడు ఏఐ సేవలను వాడుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇది కేవలం ఆర్థిక సంక్షోభం కాదు... సమాజాన్ని ఆత్మహత్యల వైపు నడిపించే ఒక దుర్మార్గపు వ్యూహం.ఇప్పటికే ఏఐ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని, భారతదేశంలో కూడా లక్షలాది మంది టెక్ నిపుణులను కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో నికృష్టంగా రోడ్డున పడేశారు. ఏ తప్పు చేయని టెక్ నిపుణులు ఇవాళ నిరాశలో మునిగిపోయారు. మరి ఈ విద్యావంతులు, బుద్ధిజీవులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత... ఉద్యోగాలు లేక, వేరే వ్యాపకాలకు దిగితే సమాజానికి ఎంత పెద్ద నష్టం జరుగుతుందో పాలకులు ఎందుకు గ్రహించడం లేదు? మహాత్మా గాంధీ ఒక అద్భుతమైన మాట చెప్పారు. “పని లేని మేధస్సు... సాతాను కర్మాగారం. నైతికత లేని విజ్ఞానం సమాజానికి తీవ్రమైన హాని చేస్తుందని” ఒక మేధావికి, ఒక సాంకేతిక నిపుణుడికి సరైన పని కల్పించకపోతే... ఆ మేధస్సు వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, ఆర్ధిక మోసాలు, సమాజంలో అశాంతి పెరగడానికి ఈ నిరుద్యోగమే కారణం కాదా? చదువుకున్న యువత సమాజంపై కక్ష పెంచుకునేలా పాలకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వారు వేరే అసాంఘిక వ్యాపకాలకు దిగితే, సమాజంలో శాంతిభద్రతలు క్షీణిస్తే... ఆ నష్టాన్ని ప్రభుత్వాలు భరించగలవా? లే ఆఫ్స్ అనేవి కేవలం కంపెనీల అంతర్గత విషయం కాదు... అవి సమాజ పునాదులను కదిలించే సామాజిక విపత్తులు. దీనిని పాలకులు గుర్తించకపోవడం వారి మేధో దివాలాకోరుతనానికి నిదర్శనం.ఇక అన్నిటికంటే భయంకరమైన అంశం... భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న విషయానికి, హోంవర్క్ దగ్గర నుంచి రీసెర్చ్ వరకు అన్నిటికీ ఏఐ టూల్స్ వాడేస్తుంటే... భవిష్యత్తు తరాలు పూర్తిగా తమ సొంత ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కోల్పోయి, టెక్నాలజీకి బానిసలయ్యే ప్రమాదం ఉంది కదా! ఆ విషయం ఈ పాలకులకు ఎందుకు పట్టడం లేదు? సిలికాన్ వ్యాలీ సృష్టించిన ఈ సాంకేతిక ఏకరూపత వెనుక బైబిల్ లోని "టవర్ ఆఫ్ బాబెల్" నాటి అహంకారం దాగి ఉందని పోప్ లూథర్ హెచ్చరించారు. మానవాళి ఒకే సాంకేతిక భాషతో దైవత్వాన్ని సవాలు చేయాలని చూస్తే అది తీవ్రమైన విచ్ఛిన్నానికే దారితీస్తుంది. పైగా, బాల్య దశలో సాంకేతిక పరిజ్ఞానానికి మితిమీరి గురికావడం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మానసిక బంధాలు తెగిపోవడం వంటి భయంకరమైన మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఒకచోట హెచ్చరించారు. సాంకేతికత మన మానవ సంబంధాలను, మానవ మేధస్సును దాటి వెళ్ళిపోయిన రోజు... ప్రపంచం కేవలం మూర్ఖుల తరంతో నిండిపోతుందని. ఇవాళ ఐన్‌స్టీన్ అన్న ఆ మూర్ఖుల తరం కళ్లముందే తయారవుతోంది. మనుషులు ఆలోచించడం మానేస్తున్నారు. మెదడుకు పని పెట్టడం లేదు. కంపెనీలు కేవలం ప్రస్తుత లాభాలను చూసుకుని మురిసిపోతున్నాయి... కానీ రేపు పొద్దున, భవిష్యత్ తరాల నుంచి సరికొత్త మానవ మేధస్సు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు రాకపోతే... టెక్నాలజీ అక్కడితో ఆగిపోదా? ఏఐ అనేది మనిషి సృష్టించిన డేటా ఆధారంగానే పనిచేస్తుంది. మరి మనుషులే కొత్తగా ఆలోచించడం మానేస్తే... ఏఐకి కొత్త డేటా ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ అక్కడితో స్తంభించిపోదా? మానవ మేధస్సు లేని రోజున ఏ సాంకేతికత అయినా ఒక జడపదార్థం మాత్రమే అవుతుంది.అసలు సమాజ శ్రేయస్సును కాంక్షించని ఈ ఏఐ కార్పొరేట్ కంపెనీల కూటమికి ప్రభుత్వాలు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? దేశంలో పేదరికం ఉంది, తాగునీటి కొరత ఉంది, వైద్య సదుపాయాలు లేవు... వీటన్నిటినీ వదిలేసి, ఏఐ రీసెర్చ్ సెంటర్ల కోసం, గ్లోబల్ టెక్ సదస్సుల కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు ఎందుకు తగలేస్తున్నాయి? ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. "అభివృద్ధి అంటే కేవలం సాంకేతికత లేదా మార్కెట్ విస్తరణ కాదు... మానవ సామర్థ్యాలను, వారి జీవన ప్రమాణాలను పెంపొందించడమే అసలైన అభివృద్ధి అని” కానీ ఇవాళ ప్రభుత్వాలు అమర్త్యసేన్ మాటలను తుంగలో తొక్కాయి. సామాన్య ప్రజల శ్రేయస్సును కాదని, కేవలం కొద్దిమంది టెక్ దిగ్గజాల ప్రయోజనాల కోసమే పాలసీలు మారుస్తున్నాయి. నైపుణ్యం ఉన్న టెక్ నిపుణుల అభిప్రాయాలను, వారి ఆందోళనలను కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు మారకపోతే... చరిత్ర పాలకులను క్షమించదు.టెక్నాలజీ అనేది మనిషి జీవితాన్ని సుఖమయం చేయడానికి రావాలి కానీ... మనిషి జీవితాన్నే శూన్యం చేయడానికి కాదు. పోప్ లూథర్ తన సందేశం ముగింపులో అన్నట్లు, మనుషులు ఎంత బలహీనులైనా, పరిమితులు ఉన్నవారైనా... మనిషి స్థానాన్ని, వారి సామర్థ్యాన్ని, ముఖ్యంగా ప్రేమానురాగాలను ఏ యంత్రమూ భర్తీ చేయలేదు, భర్తీ చేయకూడదు. నైపుణ్యం ఉన్న మానవ వనరులే ఏ దేశానికైనా అసలైన బలం. ఆ బలాన్ని బలహీనతగా మార్చే ఏ సాంకేతికత అయినా సమాజానికి ప్రమాదకరమే. ఇప్పటికైనా ప్రపంచ పాలకులు, మన దేశ పాలకులు కళ్ళు తెరవాలి. ఏఐ పేరుతో జరుగుతున్న ఈ మానవ వనరుల వినాశనాన్ని, కార్పొరేట్ అత్యాశను అడ్డుకోవడానికి కఠినమైన నియంత్రణ చట్టాలు తీసుకురావాలి. లేకపోతే... రేపు పొద్దున రోబోలు రాజ్యమేలుతుంటాయి, మనుషులు ఆకలితో అలమటిస్తుంటారు. ఆ రోజున పాలకులారా... చరిత్ర మిమ్మల్ని క్షమించదు!ఇప్పటికే ఏఐ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని, భారతదేశంలో కూడా లక్షలాది మంది టెక్ నిపుణులను కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో నికృష్టంగా రోడ్డున పడేశారు. ఏ తప్పు చేయని టెక్ నిపుణులు ఇవాళ నిరాశలో మునిగిపోయారు. మరి ఈ విద్యావంతులు, బుద్ధిజీవులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత... ఉద్యోగాలు లేక, వేరే వ్యాపకాలకు దిగితే సమాజానికి ఎంత పెద్ద నష్టం జరుగుతుందో పాలకులు ఎందుకు గ్రహించడం లేదు? మహాత్మా గాంధీ ఒక అద్భుతమైన మాట చెప్పారు. “పని లేని మేధస్సు... సాతాను కర్మాగారం. నైతికత లేని విజ్ఞానం సమాజానికి తీవ్రమైన హాని చేస్తుందని” ఒక మేధావికి, ఒక సాంకేతిక నిపుణుడికి సరైన పని కల్పించకపోతే... ఆ మేధస్సు వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, ఆర్ధిక మోసాలు, సమాజంలో అశాంతి పెరగడానికి ఈ నిరుద్యోగమే కారణం కాదా? చదువుకున్న యువత సమాజంపై కక్ష పెంచుకునేలా పాలకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వారు వేరే అసాంఘిక వ్యాపకాలకు దిగితే, సమాజంలో శాంతిభద్రతలు క్షీణిస్తే... ఆ నష్టాన్ని ప్రభుత్వాలు భరించగలవా? లే ఆఫ్స్ అనేవి కేవలం కంపెనీల అంతర్గత విషయం కాదు... అవి సమాజ పునాదులను కదిలించే సామాజిక విపత్తులు. దీనిని పాలకులు గుర్తించకపోవడం వారి మేధో దివాలాకోరుతనానికి నిదర్శనం.ఇక అన్నిటికంటే భయంకరమైన అంశం... భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న విషయానికి, హోంవర్క్ దగ్గర నుంచి రీసెర్చ్ వరకు అన్నిటికీ ఏఐ టూల్స్ వాడేస్తుంటే... భవిష్యత్తు తరాలు పూర్తిగా తమ సొంత ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కోల్పోయి, టెక్నాలజీకి బానిసలయ్యే ప్రమాదం ఉంది కదా! ఆ విషయం ఈ పాలకులకు ఎందుకు పట్టడం లేదు? సిలికాన్ వ్యాలీ సృష్టించిన ఈ సాంకేతిక ఏకరూపత వెనుక బైబిల్ లోని "టవర్ ఆఫ్ బాబెల్" నాటి అహంకారం దాగి ఉందని పోప్ లూథర్ హెచ్చరించారు. మానవాళి ఒకే సాంకేతిక భాషతో దైవత్వాన్ని సవాలు చేయాలని చూస్తే అది తీవ్రమైన విచ్ఛిన్నానికే దారితీస్తుంది. పైగా, బాల్య దశలో సాంకేతిక పరిజ్ఞానానికి మితిమీరి గురికావడం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మానసిక బంధాలు తెగిపోవడం వంటి భయంకరమైన మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఒకచోట హెచ్చరించారు. సాంకేతికత మన మానవ సంబంధాలను, మానవ మేధస్సును దాటి వెళ్ళిపోయిన రోజు... ప్రపంచం కేవలం మూర్ఖుల తరంతో నిండిపోతుందని. ఇవాళ ఐన్‌స్టీన్ అన్న ఆ మూర్ఖుల తరం కళ్లముందే తయారవుతోంది. మనుషులు ఆలోచించడం మానేస్తున్నారు. మెదడుకు పని పెట్టడం లేదు. కంపెనీలు కేవలం ప్రస్తుత లాభాలను చూసుకుని మురిసిపోతున్నాయి. కానీ రేపు పొద్దున, భవిష్యత్ తరాల నుంచి సరికొత్త మానవ మేధస్సు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు రాకపోతే... టెక్నాలజీ అక్కడితో ఆగిపోదా? ఏఐ అనేది మనిషి సృష్టించిన డేటా ఆధారంగానే పనిచేస్తుంది. మరి మనుషులే కొత్తగా ఆలోచించడం మానేస్తే... ఏఐకి కొత్త డేటా ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ అక్కడితో స్తంభించిపోదా? మానవ మేధస్సు లేని రోజున ఏ సాంకేతికత అయినా ఒక జడపదార్థం మాత్రమే అవుతుంది.అసలు సమాజ శ్రేయస్సును కాంక్షించని ఈ ఏఐ కార్పొరేట్ కంపెనీల కూటమికి ప్రభుత్వాలు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? దేశంలో పేదరికం ఉంది, తాగునీటి కొరత ఉంది, వైద్య సదుపాయాలు లేవు... వీటన్నిటినీ వదిలేసి, ఏఐ రీసెర్చ్ సెంటర్ల కోసం, గ్లోబల్ టెక్ సదస్సుల కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు ఎందుకు తగలేస్తున్నాయి? ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. "అభివృద్ధి అంటే కేవలం సాంకేతికత లేదా మార్కెట్ విస్తరణ కాదు... మానవ సామర్థ్యాలను, వారి జీవన ప్రమాణాలను పెంపొందించడమే అసలైన అభివృద్ధి అని” కానీ ఇవాళ ప్రభుత్వాలు అమర్త్యసేన్ మాటలను తుంగలో తొక్కాయి. సామాన్య ప్రజల శ్రేయస్సును కాదని, కేవలం కొద్దిమంది టెక్ దిగ్గజాల ప్రయోజనాల కోసమే పాలసీలు మారుస్తున్నాయి. నైపుణ్యం ఉన్న టెక్ నిపుణుల అభిప్రాయాలను, వారి ఆందోళనలను కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు మారకపోతే... చరిత్ర పాలకులను క్షమించదు. - కంచర్ల యాదగిరి రెడ్డి, మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
‘నేను అచ్చం ఏఐ బొమ్మలా కనిపించాలి’ అంటున్నారు!
అందానికి సంబంధించి ఏ.ఐ జనరేటెడ్ చిత్రాలు ఆహా అనిపించినా వాస్తవానికి ఆమడ దూరంలో ఉంటాయి. న్యూయార్క్‌కు చెందిన డెర్మటాలజిస్ట్ డేచర్ వెబ్స్టే దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ఏఐ జనరేటెడ్ చిత్రాన్ని చూపించి ‘ఈ ఇమేజ్‌లో ఉన్న అమ్మాయిలాగే కనిపించాలనుకుంటున్నాను’ అని చెప్పింది. ఆ మాటకు వెబ్స్టే షాక్ అయ్యారు.‘ఈ ఇమేజ్లోలాంటి పెద్ద పెదవులు, పెద్ద కళ్లు, చెక్కినట్లు ఉండే దవడతో నేను కనిపించాలి’ అని అడిగిన ఆ అమ్మాయి వెబ్స్టేను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా ఫిల్టర్లు సౌందర్య ప్రమాణాలను మార్చిన తీరుకు ఈ సంఘటన అద్దం పడుతుంది. ఏఐ సృష్టించిన సౌందర్య చిత్రాలు నిజజీవితంలో సాధ్యపడతాయని కొంతమంది నమ్ముతున్నారు.ఒక అధ్యయనం ప్రకారం... తమ ఫొటోలను ఎడిట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌ను ఉపయోగించే వారిలో కొంతమందికి, అందాలకు సంబంధించి ప్లాస్టిక్ సర్జరీ ఎన్నో అద్భుతాలు చేస్తుందనే విషయంలో చాలా అంచనాలు ఉన్నాయి. 70 ఏళ్ల వయసు ఉన్న ఒక మహిళ మాన్హాటన్లోని ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకు ఏఐ జనరేట్ చేసిన తన ఫొటోతో వచ్చింది. సర్జికల్ టైమ్ మిషన్ కావాలని, తాను తన మనవరాలిలా కనిపించాలని అడిగి ఆ సర్జన్ షాక్ అయ్యేలా చేసింది.‘అలా కుదరదు’ అని నచ్చచెప్పినా ఆ బామ్మ వినలేదు. ‘అలా కనిపించేలా చేయండి’ అని పట్టుబట్టింది. ఫైనల్‌గా చెప్పొచ్చేదేమిటంటే... ఏ.ఐ ఇమేజ్‌లతో హాస్పిటల్స్‌కు వస్తున్న వారిని చూసినప్పుడు వైద్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి! -
3,500 ఏళ్ల క్రితం ప్రజల తెలివి.. నేటి టెక్నాలజీకే సవాల్!
ఓ నాలుగైదు గంటలు కరెంటు లేకపోతే ఏమవుతుంది? ఉక్కపోత గురించి పక్కన పెడితే ఫ్రిజ్‌లో ఉన్న పాలు పాడైపోతాయేమో, కూరగాయలు కుళ్లిపోతాయేమో అనే కంగారు మొదలవుతుంది. కానీ ఎలాంటి విద్యుత్ సౌకర్యం, ప్లాస్టిక్ డబ్బాలు, ఆధునిక కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీ లేని 3,500 ఏళ్ల కిందట జీవించిన ప్రజలు తమ ఆహారాన్ని ఎంతో భద్రంగా దాచుకునేవారు. అప్పట్లో సాగు చేసిన పంట మరుసటి ఏడాది వరకు పాడవకుండా చక్కగా కాపాడుకునేవారు. ఎండ తీవ్రత 40 డిగ్రీలు దాటినా, కీటకాలు, ఎలుకల భయం ఉన్నా వారు ధాన్యాన్ని నెలల తరబడి సురక్షితంగా ఉంచుకోగలిగేవారు.. ఇదంతా ఎలాగంటారా? దానికి కారణం వారు ఉపయోగించిన సాంకేతికతనో మరేదో కాదు.. భూమి అంటే ఆశ్చర్యం కలగక మానదు.తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో పశ్చిమ కనుమల అడుగుభాగంలో ఉన్న మొలపాళయం అనే ప్రాంతంలో తమిళ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రజు్ఞలు ఇటీవల జరిపిన తవ్వకాల్లో నవీన శిలా యుగం (నియోలిథిక్ ఎరా) నాటి అద్భుతమైన భూగర్భ గృహాలు బయటపడ్డాయి. ఇందులోనే వారు అన్నీ దాచుకునేవారు. ఇవి కేవలం పంట దాచుకునే సాధారణ గిడ్డంగులు మాత్రమే కావు.. నాటి కుటుంబాల జీవన కేంద్రాలు. కొన్ని గుంతలలో ప్రాచీన రుబ్బురాళ్లు లభించాయి. అంటే ఇవి వంటగదులుగా కూడా ఉపయోగపడేవని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనుషులు దాక్కోవడానికి వీలుగా వీటిని పెద్ద పరిమాణంలో నిర్మించారు.మరి ఎలా పని చేస్తాయ్?ఈ మొలపాళయం గుంతల నిర్మాణం వెనుక ఎంతో లోతైన భౌతిక, రసాయన శాస్త్ర సూత్రాలు దాగి ఉన్నాయి. భూమి ఉపరితలంపై ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా, భూమి లోపలి పొరల్లో ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా, చల్లగా ఉంటుంది. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకునే వీటిని నిర్మించారు. తమిళనాడులోని ఉక్కపోత, తేమ వల్ల ధాన్యం బూజు పట్టకుండా ఉండటానికి గుంతల లోపలి గోడలకు చెరువు మట్టి, వరి తవుడు, వరి గడ్డి కలిపిన మిశ్రమంతో పూత పూసేవారు. ఇవి తేమను పూర్తిగా పీల్చేసుకుంటాయి. అలాగే క్రిమికీటకాలు చేరకుండా ఉండేందుకు గోడలపై ఆవు పేడ నీటిని చల్లేవారు. ఇది సహజ యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. ఇక బయటి భాగాలకు సున్నం పూసేవారు. ధాన్యం తీసే ప్రతిసారీ గాలి లోపలికి వెళ్లి పంట పాడవకుండా ఉండటానికి, ఈ గుంతల అడుగు భాగంలో చిన్న రంధ్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అవసరమైనప్పుడు కొద్దికొద్దిగా ధాన్యాన్ని బయటకు తీసుకునే వీలుండేది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సాంకేతికత కేవలం చరిత్రకే పరిమితం కాలేదు. గత 20వ శతాబ్దం మధ్యకాలం వరకు తమిళనాడులోని సేలం, ఈరోడ్, దిండిగల్ ప్రాంతాల రైతులు ‘కులుమై’, ‘కుదిర్’అని పిలిచే మట్టి నిల్వ పద్ధతులను ఉపయోగించేవారు. భారతదేశంలో దాదాపు 70 శాతం ధాన్యాన్ని పూర్వం ఇటువంటి దేశీయ పద్ధతుల్లోనే భద్రపరిచేవారని అంచనా. కానీ హరిత విప్లవం రాకతో, రసాయన మందులు, ఆధునిక ఇనుప గిడ్డంగులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ అద్భుతమైన విధానాన్ని ‘పాతకాలపు పద్ధతి’గా కొట్టిపారేసి, పూర్తిగా మరుగునపడేశారు.ప్రస్తుతం అవసరమే.. ప్రస్తుత తరుణంలో ఈ విధానం ప్రపంచానికి ఎంతో అవసరం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో ఏటా సరైన నిల్వ వసతులు లేక లక్ష లాది టన్నుల ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయి. ఆధునిక కోల్డ్ స్టోరేజ్ పద్ధతులు విపరీతమైన విద్యుత్‌ను వినియోగిస్తూ, పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. మారుతున్న వాతా వరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో శాస్త్రవేత్తలు మళ్లీ పాత పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. 3,500 ఏళ్ల కిందట మన పూరీ్వకులు కనిపెట్టిన ఈ జీరో కార్బన్ విధానాలను తక్కువ ఖర్చు తో కూడిన ప్రత్యామ్నాయాలుగా మార్చడానికి పరిశోధనలు చేస్తున్నారు. ప్రకృతిని గౌరవిస్తూ వారు సాధించిన ఈ విజయం, నేటి ఆధునిక ప్రపంచానికి ఒక గొప్ప పాఠం.


