scientist
-
వామ్మో..!ఈ తిమింగలం వలస రికార్డు మాములుగా లేదుగా..!
బలీన్ తిమింగలం జాతికి చెందిన ఒక మగ హంప్‌బ్యాక్ తిమింగలం వలస రికార్డు ఊహకందనిది. ఏకంగా మూడు మహా సముద్రాలు చుట్టొచ్చి.. రికార్డు క్రియేట్ చేసింది. ఈ మగ తిమింగలం దక్షిణ అమెరికా నుంచి ఆఫ్రికా వరకు సుమారు 8వేల మైళ్లకు పైగా ఈది ఆశ్చర్యపరిచింది. తన సహచర తిమింగలాన్ని వెతుక్కుఉంటూ ఇంత దూరం సముద్రంలో ఈది ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ తిమింగలం కదలికను శాస్త్రవేత్తల బృందం సుమారు 2013 నుంచి 2022 వరకు ట్రాక్ చేస్తూ వచ్చారు. ఇది దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి ఆఫ్రికాలోని జాంజిబార్లోని తిమింగలలా సంతానోత్పత్తి ప్రదేశం వరకు ఈదుకుంటూ వెళ్లినట్లు తెలిపారు. తిమింగలాల జాతిలోనే అత్యంత అరుదైన జాతి ఈ హంప్‌బ్యాక్ తిమింగలం. ఈ తిమింగల వెనుక ఉన్న విలక్షణమైన మూపురం కారణంగానే వీటిని హంప్‌బ్యాక్ తిమింగలంగా అని పిలుస్తారు. ఇవి మహాసముద్రాల్లోనే ఉంటాయి. వాణిజ్యపరంగా కూడా అత్యంత ఖరీదైన తిమింగలం ఇది.అయితే వేట కారణంగా ఈ జాతి అంతరించిపోతున్నదశలో ఉంది. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తల బృందం హంప్‌బ్యాక్ తిమింగలాల తీరు, వలస విధానంపై అధ్యయనం చేస్తోంది. ఆ క్రమంలోనే ఈ మగ హంప్‌బ్యాక్ తిమింగలం కదలికలను ట్రాక్ చేస్తూ వచ్చారు పరిశోధకులు. తొలిసారిగా ఈ తిమింగలాన్ని 2013లో గుర్తించి ఫోటోలు తీశారు. ఆ తర్వాత మళ్లీ 2022లో జాంజిబార్ తీరంలో నైరుతి హిందూ మహాసముద్రంలో గుర్తించారు.మొదట్లో అదే తిమింగలమా కాదనే అనుమానం కలిగింది. అయితే దాని దాని జననేంద్రియ ప్రాంతంలో తీసిన ఫోటోల ఆధారంగా ఆ తిమింగలమే అని నిర్థారించారు శాస్త్రవేత్తలు. ఇంతకుముందు తాము ఎన్నో విలక్షణమైన తిమింగలాల శక్తిమంతంగా ఈదడం గుర్తించామని, కానీ అవి మధ్యలోనే దారితప్పేవని అన్నారు. అయితే ఈ తిమంగలం మాత్రం ఏదో వెతుకుతూ వచ్చినట్లుగా ఇంత దూరం ప్రయాణించడమే ఆశ్చర్యం కలిగించిందన్నారు. వాస్తవానికి ఇవి చాలా శక్తిమంతంగా ఈదగలవు. కానీ ఇంతలా రికార్డు స్థాయిలో ఈదుకుంటూ వెళ్లడమే ఈ మగ హంప్బ్యాగ్ తిమింగలం ప్రత్యేకత అని చెప్పారు. అయితే కచ్చితంగా ఇలా అంత దూరం ఎందుకు ప్రయాణం చేసిందనేది చెప్పలేమన్నారు. కానీ ఇందుకు వాతావరణ మార్పు, పర్యావరణ మార్పులు పాత్ర ఉండొచ్చని అన్నారు. అలాగే ఆహార అన్వేషణ కూడా అయ్యి ఉండొచ్చన్నారు. ఒక రకంగా తమ పరిశోధన మహాసముద్రాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను హైలెట్ చేసిందని పరిశోధక బృందం తెలిపింది. ఈ అధ్యయనం రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. (చదవండి: ‘సౌత్ ఇండియన్ డైట్ ప్లాన్'తో అంతలా బరువు తగ్గొచ్చా..!) -
ఈ సైంటిస్ట్ జంట రూటే సెపరేటు! వెడ్డింగ్ కార్డు వేరేలెవెల్..!
శాస్త్రవేత్తలంటేనే అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచిస్తారు. అయితే వారి పరిశోధన వృత్తి వరకే పరిమితం కాకుండా అంతకు మించి ఉంటే.. ఈ సైంటిస్ట్ జంటలానే ఉంటుందేమో..!. ఇద్దరూ అగ్రికల్చర్ పరిశోధకులే..ఆ ఇష్టాన్నే తమ వివాహా ఆహ్వాన పత్రికలో కూడా చూపించి ఆశ్చర్యపరిచారు. అది పెళ్లి కార్డో, లేక రీసెర్చ్ పేపరో అర్థంకాకుండా భలే గందరగోళానికి గురి చేశారు. ఆలపాటి నిమిషా, ప్రేమ్ కుమార్ అనే వ్యవసాయ శాస్త్రవేత్తలిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు. వివాహబంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. అయితే వారిద్దరి అభిరుచి పరిశోధనే. ఐతే నిమిషా ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI)లో రీసెర్చ్ స్కాలర్ కాగా, ప్రేమ్ కుమార్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)లో అసిస్టెంట్ మేనేజర్. ఈ నేపథ్యంలోన వారిద్దరూ తమ రీసెర్చ్‌పై ఉన్న ప్రేమతో పరిశోధనా పత్రం స్టైల్లో వివాహ కార్డుని డిజైన్ చేశారు. చూసేవాళ్లకు ఇది ఆహ్వాన పత్రిక.. రీసెర్చ్పేపరో అర్థం కాదు. క్షుణ్ణంగా చదివితేనే తెలుస్తుంది. అందులో వివరాలు కూడా రీసెర్చ్ పేపర్ తరహాలో ఉన్నాయి. అయితే వారి వివాహ బంధాన్ని కూడా కెమిస్ట్రీలోని స్థిర సమయోజనీయ బంధంతో వివరించడం అదుర్స్. అవసరానికి ఉపయోగ పడని ఆస్తి, ఆపదల నుంచి గట్టేకించుకోలేని విజ్ఞానం రెండూ వ్యర్థమే అంటారు పెద్దలు. కానీ వీళ్లిద్దరూ తమ వ్యవసాయ పరిజ్ఞానాన్ని అన్ని విధాలుగా ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలవడమే గాక తమకు వ్యవసాయ పరిశోధనా రంగం పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సైంటిస్ట్‌ల రూటే సెపరేటు అన్నట్లుగా ఆహ్వానపత్రిక వేరేలెవెల్లో ఉంది. మరో విశేషమేమిటంటే ఆ శాస్తవేత్తల జంట తమ వివాహ తేదిని కూడా ప్రపంచ మృత్తికా దినోత్సవం రోజునే ఎంచుకోవడమే. (చదవండి: డిప్రెషన్‌తో పోరాడుతూనే.. ఐఏఎస్ సాధించిన అలంకృత!) -
ప్రపంచంలోనే పే....ద్ద కెమెరా!
ఏకంగా 3,200 మెగాపిక్సెల్స్. సామర్థ్యం. 5.5 అడుగుల ఎత్తు, ఏకంగా 12.25 అడుగల పొడవుతో పెద్ద సైజు కారును తలపించే పరిమాణం. దాదాపు 2,800 కిలోల బరువు! 320–1,050 ఎన్ఎం వేవ్‌లెంగ్త్ రేంజ్. ఒక్కో ఇమేజ్ కవరేజీ పరిధిలోకి కనీసం 40 పూర్ణ చంద్రులు పట్టేంత ఏరియా! ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా తాలూకు విశేషాల్లో ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంతకీ ఇది ఎక్కడుందంటారా? చిలీలో రూపుదిద్దుకుంటున్న వెరా రూబిన్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేస్తున్న సరికొత్త టెలిస్కోప్‌లో. రాజధాని శాంటియాగోకు 500 కి.మీ. దూరంలోని సెరో పాచ్న్ పర్వత శిఖరంపై 2015 నుంచీ నిర్మాణంలో ఉన్న ఈ అబ్జర్వేటరీ త్వరలో ప్రారంభం కానుంది. అందులోని ఈ అతి పెద్ద కెమెరా ప్రతి మూడు రోజులకోసారి రాత్రివేళ దాని కంటికి కని్పంచినంత మేరకూ ఆకాశాన్ని ఫొటోల్లో బంధించనుంది. అలా అంతరిక్ష శాస్త్రవేత్తలకు పదేళ్లపాటు రోజుకు కనీసం వెయ్యి చొప్పున ఫొటోలను అందుబాటులోకి తెస్తుంది! అంటే రోజుకు 20 టెరాబైట్ల డేటాను అందజేస్తుంది. ఇది ఒక యూజర్ నెట్‌ఫ్లిక్స్‌లో సగటున మూడేళ్లపాటు చూసే ప్రోగ్సామ్స్, లేదా స్పాటిఫైలో ఏకంగా 50 ఏళ్ల పాటు వినే పాటల డేటాకు సమానం! ఈ క్రమంలో మనకిప్పటిదాకా తెలియని ఏకంగా 1,700 కోట్ల కొత్త నక్షత్రాలను, 2,000 కోట్ల నక్షత్ర మండలాలను ఈ కెమెరా వెలుగులోకి తెస్తుందని భావిస్తున్నారు. దీన్ని లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ (ఎల్ఎస్ఎస్టీ) కెమెరాగా పిలుస్తున్నారు. అంతేగాక అంతరిక్షంలో సంభవించే చిన్నా పెద్దా మార్పులకు సంబంధించి ప్రతి రాత్రీ ఏకంగా కోటి అలెర్టులను కూడా ఈ టెలిస్కోప్ పంపనుందట కూడా! ‘‘ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే. వెరా రూబిన్ అబ్జర్వేటరీ మున్ముందు మరెన్నో ఘనకార్యాలు చేయనుంది’’ అని ఆ సంస్థ ఆస్ట్రానమిస్టు క్లేర్ హిగ్స్ చెబుతున్నారు. కృష్ణపదార్థం (డార్క్ మ్యా టర్), కృష్ణ శక్తి (డార్క్ ఎనర్జీ) వంటి పలు మిస్టరీలను ఛేదించడంలో కూడా కీలకపాత్ర పోషించే చాన్సుందన్నారు. ఈ టెలిస్కోప్‌కు 2016లో మరణించిన అమెరికా అంతరిక్ష శాస్త్రజు్ఞడు వెరా రూబిన్ పేరు పెట్టారు. ఇది ఏడాది లోపులో అందుబాటులోకి వస్తుందని అంచనా.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పట్టపగలు శాస్త్రవేత్త ఇంట్లో రూ. రెండు కోట్లు దోపిడీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణిలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఒక రిటైర్డ్ సైంటిస్ట్‌తో పాటు అతని భార్యను బంధించి దోపిడీకి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోహిణిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో తమ సొంత ఇంట్లో ఓ రిటైర్డ్ సైంటిస్ట్‌ను అతని భార్యను తుపాకీతో బెదిరించి, ఆ తర్వాత బందించి రూ. రెండు కోట్ల విలువైన నగలు నగదును దుండగులు దోచుకెళ్లారు. శాస్త్రవేత్త శిబు సింగ్, అతని భార్య నిర్మల ఇంట్లో ఉండగా, మధ్యాహ్నం సమయంలో ఇద్దరు యువకులు తాము కొరియర్ బాయ్స్మని చెబుతూ, వారి ఇంట్లోకి ప్రవేశించారు.తర్వాత వారు శిబు, అతని భార్య నిర్మలను తుపాకీతో బెదిరించి, బందించారు. ఈ క్రమంలో నిందితులు వారిపై దాడి చేశారు. దుండగుల తమ ఇంట్లోని రూ. రెండు కోట్ల విలువైన నగలు, నగదు దోచుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే బాధితులు ఈ విషయాన్ని తమ కుమారునికి తెలియజేశారు. ఆయన ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్లు ప్రారంభించారు. బాధితులిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా ఈ ఘటన తీరు చూస్తుంటే ఈ వ్యవహారంలో తెలిసినవారి ప్రమేయం ఉన్నట్లు కనిపిస్తోందని పోలీసులు అంటున్నారు. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇది కూడా చదవండి: వికాస్ యాదవ్ కథలో కొత్త మలుపు -
Subrahmanyan Chandrasekhar: చుక్కల్లో చంద్రుడు
నక్షత్రాల జీవిత చరిత్రను వెల్లడించిన శాస్త్రజ్ఞులు ప్రపంచంలో కొద్ది మందే ఉన్నారు. వారిలో ఒకరే సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ఆయన సాధించిన ఘనతను ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే ఆయనకు ప్రముఖ భౌతిక శాస్త్రేవత్త సర్ సీవీ రామన్‌తో గల సంబంధం ఏమిటో కూడా తెలుసుకుందాం.నక్షత్రాలపై పరిశోధనలు సాగించిన ప్రముఖ శాస్త్రవేత్తలు కోపర్నికస్, గెలీలియో, కెప్లర్, న్యూటర్ మొదలైన వారు వేసిన బాటలో పయనించి, నోబెల్ బహుమతిని సాధించిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ దక్షిణ భారతానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన 1910 అక్టోబర్ 19న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం(ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది)లోని లాహోర్ పట్టణంలో సీతాలక్ష్మి, చంద్రశేఖర సుబ్రహ్మణ్య అయ్యర్ దంపతులకు జన్మించారు.హైస్కూలు, కాలేజీ చదువులను మద్రాస్ (చెన్నై)లో పూర్తిచేశారు. 1953లో డాక్టర్ చంద్రశేఖర్ అమెరికా పౌరసత్వం స్వీకరించకపోతే, ఆయనను మన భారతీయ శాస్త్రవేత్తగా ప్రపంచానికి సగర్వంగా ప్రకటించుకునే వాళ్లం. తన 19వ ఏట ఉన్నత విద్యాభ్యాసం కోసం ఓడ మీద ఇంగ్లాండు వెళ్లిన ఆయన ఖగోళ శాస్త్ర సంబంధిత విషయాలపై అధ్యయనం సాగించారు. 1935 జనవరి 11న తన మిత్రుడు విలియం మాక్ క్రీ తో కలిసి ఇంపీరియల్ కాలేజీ నుంచి బర్లింగ్టన్ హౌస్ వెళ్లిన ఆయన తన పరిశోధనా పత్రాన్ని వేదికపై చదివి, భౌతిక ఖగోళ శాస్త్రవేత్తలను మంత్రుముగ్ధులను చేశారు. దీంతో కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజీ ఫెలోషిప్‌కు ఎన్నికయ్యారు. అక్కడ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌ను అందరూ ముద్దుగా ‘చంద్ర’ అని పిలిచేవారు.ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్య దశలు ఉన్నట్టే నక్షత్రాల్లోనూ పరిణామ దశలుంటాయని ‘చంద్ర’ తెలిపారు. వీటిలో చెప్పుకోదగ్గవి అరుణ మహాతార (రెడ్‌జెయంట్), శ్వేత కుబ్జ తార (వైట్‌డ్వార్ఫ్), బృహన్నవ్య తార (సూపర్నోవా), నూట్రాన్ తార, కృష్ణ బిలం (బ్లాక్‌హోల్) అనే దశలు ముఖ్యమైనవని పేర్కొన్నారు. తారలపై అవగాహనను పెంచే సిద్ధాంతాలను, పరిశోధనలను అందించిన చంద్రశేఖర్ 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు.సాపేక్ష, క్వాంటం సిద్ధాంతాల్లోని అంశాల ఆధారంగా నక్షత్రాల పరిణామాలకు సంబంధించిన పరిస్థితులను చంద్రశేఖర్ విశ్లేషించారు. ఒక నక్షత్రం వైట్‌డ్వార్ఫ్ దశకు చేరుకోవాలంటే ఎలాటి పరిస్థితులుండాలో తెలియజేసిన సిద్ధాంతమే 'చంద్రశేఖర్ లిమిట్'గా పేరొందింది. దీని ప్రకారం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.44 రెట్లకు తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలే వైట్‌డ్వార్ఫ్‌గా మారుతాయి. అంతకు మించిన ద్రవ్యరాశి ఉంటే అవి వాటి కేంద్రకంలోని గురుత్వశక్తి ప్రభావం వల్ల కుంచించుకుపోయి సూపర్నోవాగా, న్యూట్రాన్‌స్టార్‌గా మారుతూ, చివరికి బ్లాక్‌హోల్ (కృష్ణబిలం)గా అయిపోతాయని చంద్రశేఖర్ సిద్ధాంతీకరించారు.ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతులను మన దేశంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు మేథావులు సాధించడం ఓ అరుదైన విషయం. వారిలో ఒకరు నోబెల్ పొందిన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ కాగా, రెండో వ్యక్తి ఆయన అన్నకొడుకు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. 1995 ఆగస్టు 21న అమెరికాలో తన 85వ ఏట చంద్రశేఖర్ గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: భారత దౌత్యవేత్తలపై నిఘా: కెనడా -
ప్లాస్టిక్ బౌల్స్‌లో ఆహారం ఎందుకు తినకూడదంటే..?
ఇటీవల డైనింగ్ టేబుల్స్ మీద ఉండే కిచెన్ వేర్లలో అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్‌లో కూడా ఉంటున్నాయి. అందులో వేడివేడి కూరలూ, పులుసు, అన్నం వంటి ఆహారాలు తీసి ఉంచి వడ్డిస్తూ ఉండటం చాలా మంది ఇళ్లలో కనిపించేదే. పైకి అనేక డిజైన్లతో చాలా అందంగా కనిపించే ఈ బౌల్స్... అందులో ఉంచే ఆహారం విషయానికి వచ్చేటప్పటికి ఆరోగ్యానికి అంత మంచిది కాదని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణంగా ఈ బౌల్స్‌ను ‘మెలమైన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తయారు చేస్తారు. వేడి వేడి కూరలు, పులుసుల వంటి ఆహారపదార్థాలను ఇందులోకి తీయగానే ఆ వేడికి మెలమైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందనీ, దేహంలోకి ప్రవేశించే ఈ మెలమైన్ వల్ల మూత్రపిండాలకు సంబంధించిన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అధ్యయనం నిర్వహించిన తీరిది... ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్ బౌల్స్‌లో నూడుల్స్ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్‌లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి చేసిన మూత్ర పరీక్షల్లో మెలమైన్ బౌల్స్‌లో తిన్నవారి మూత్రంలో మెలమైన్ మోతాదులు దాదాపు ఎనిమిది రెట్లు ఉన్నాయని తేలింది. ఫలితంగా వారిలో కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశంతోపాటు కేన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఈ పని అస్సలు వద్దు... మెలమైన్తో చేసిన వంటపాత్రలలో వేడి ఆహారాన్ని తీయడమే చాలా ప్రమాదకరమంటే కొందరు మెలమైన్ బౌల్లో పెట్టిన ఆహారాన్నీ మైక్రోవేవ్ ఒవెన్‌లో ఉంచి వేడిచేస్తుంటారు.ఇలా అస్సలు చేయకూడదని అమెరికన్ ప్రమాణాల సంస్థ ఎఫ్‌డీఏ గట్టిగా చెబుతోంది. అనర్థాలేమిటంటే... ఈ మెలమైన్ దుష్ప్రభావాలు ముఖ్యంగా హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావాలపై ఉంటాయి. దాంతో ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యతలలో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చు. అలాగే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, వీర్య కణాల కదలికలు తగ్గడం, పురుష హార్మోన్ల స్రావం తగ్గడం వంటివి జరగవచ్చు. ఇక చాలామందిలో డయాబెటిస్ ముప్పు పెరుగుతున్నట్లుగా ఇలాంటిదే మరో అధ్యయనంలో తేలింది. ఈ ప్లాస్టిక్ పాత్రలలో తింటున్నవారిలో స్థూలకాయం కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రొమ్ము కేన్సర్ వంటి కేన్సర్ల రిస్క్‌లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు, అల్జిమర్స్ కేసులు కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే కూరలు, పులుసుల వడ్డింపునకు ప్లాస్టిక్ బౌల్స్‌కు బదులు పింగాణీ బౌల్స్ మంచిదన్నది నిపుణుల మాట. ఈ పరిశోధనల ఫలితాలన్నీ ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి.(చదవండి: దుర్గాపూజను శక్తిమంతంగా మార్చిన క్రెడిట్ ఆ సమరయోధుడికే దక్కుతుంది..!) -
50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూప్‌ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!
బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్హెచ్ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ (ఎన్హెచ్ఎస్బీటీ(NHSBT)) శాస్త్రవేత్తల బృందం కొత్త బ్లడ్ గ్రూప్‌ని కనుగొన్నారు. దీంతో దాదాపు 50 ఏళ్లుగా నిపుణులను కలవరపరుస్తున్న వైద్య రహస్యానికి తెరపడింది. ఈ సరికొత్త ఆవిష్కరణ రక్తమార్పిడి పద్ధతులను మార్చడమే కాకుండా రోగులకు కొత్త ఆశను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. పరిశోధకులు కనుగొన్న కొత్తబ్లడ్ రూప్ మాల్(MAL). ఇది ఏన్‌డబ్ల్యూజే యాంటిజెన్ నెగిటివ్ అనే బ్లడ్ గ్రూప్‌కి సంబంధించిన జన్యుపర మూలం. దీన్ని 1972లో మానవులు రక్తంలో గుర్తించారు. దీని వల్ల రక్త మార్పిడిలో ప్రతి చర్యలు లేదా సమ్యలు వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందనేది నాటి శాస్త్రవేత్తలు వివరించలేకపోయారు. నిజానికి ఏనడబ్ల్యూజే యాంటిజన్ అనేది అధిక సంఘటన యాటిజన్‌లని అర్థం. దాదాపుగా మానవులందరి ఎర్రరక్త కణాలపై ఈ యాంటిజెన్లు ఉంటాయి. అయితే కొందరిలో ఇవి ఉండవు. దీన్ని గుర్తించడం కష్టం కూడా. అందువల్ల రక్తమార్పిడిలో కొందరు రోగులకు సమస్యలు ఎదురయ్యేవి. ఇది వైద్య శాస్త్రంలో చేధించలేని మిస్తరీగా ఉండేది. అది ఈ కొత్త బ్లడ్ గ్రూప్ ఆవిష్కరణతో 50 ఏళ్ల మిస్టరీని చేధించగలిగారుఈ మేరకు దాదాపు 20 ఏళ్లుగా ఈ ఎన్హెచ్ఎస్ బ్లండ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ పరిశోధనకే అంకితమైన పరిశోధకుడు లూయిస్ టిల్లీ మాట్లాడుతూ.. తాము ఈ ఏన్‌డబ్ల్యూజే యాంటిజెన్ బ్లడ్ గ్రూప్ లేని వ్యక్తులను గుర్తించేందుకు ఈ పరిశోధన చేపట్టినట్లు తెలిపారు. తాము కనిపెట్టిన ఈ కొత్త రక్త నమునా అరుదైన రక్తరకాలు ఉన్న రోగులకు సంరక్షణ ఇస్తుందని చెబుతున్నారు. రక్తమార్పిడి సమయంలో ఎదురయ్యే ప్రతిచర్యలకు లేదా సమస్యలను నివారించడానికి ఈ పరిశోధన అత్యంత కీలకం. ప్రతిఏడాది దాదాపు 400 మంది రోగులు రక్తమార్పిడితో సమస్యలు ఎదుర్కుంటున్నారని చెప్పారు. వారికి రక్తం సరిపోలక పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు వెల్లడించారు. ఆ సమస్యలన్నింటికి ఈ కొత్త రక్తనమునా చెక్ పెట్టిందన్నారు. ఈ కొత్త బ్లడ్‌గ్రూప్ ఏన్‌డబ్ల్యూజే యాంటిజెన్ నెగిటివ్ ఉన్న దాతలు, గ్రహితలు ఇద్దరిని గర్తించడానికి జన్యు రూప పరీక్షలకి అనుమతిస్తుంది కాబట్టి అరుదైన కేసుల్లో రోగులకు ఎదురయ్యే రక్తమార్పిడి సమస్యలను ఇది నివారించగలుగలదని ధీమాగా చెబుతున్నారు. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగుల సంరక్షణను మెరుగుపరుచడమే కాకుండా రక్తమార్పిడి భద్రత, ప్రభావాన్ని మెరుగుపరిచేందుకు గొప్ప అద్భత ఆవిష్కరణగా పేర్కొన్నారు నిపుణులు.(చదవండి: ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినగా మిగిలింది డెలివరీ బాక్స్‌లోనే పెట్టి పడేస్తున్నారా?) -
బంగారు తల్లికి వీడ్కోలు
కారేపల్లి: ఆకేరు వాగు ఉధృతికి బలైన యువ శాస్త్ర వేత్త డాక్టర్ అశ్విని మృతదేహానికి మహబూబాబాద్ లో పోస్ట్‌మార్టం అనంతరం ఆదివారం రాత్రి స్వగ్రామమైన కారేపల్లి మండలం గంగారంతండాకు తీసుకొచ్చారు. ఇక సోమవారం మళ్లీ తనిఖీలు చేపట్టిన రెసూ్య్కటీం సభ్యులు ఆమె తండ్రి మోతీలాల్ మృతదేహాన్ని డోర్నకల్ మండలం చిలక్కొయలపాడు వద్ద గుర్తించారు. ఆపై పోస్టుమార్టం చేయించి స్వగ్రామానికి తీసుకురాగా అప్పటికే బంధువులు, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందలాదిగా తరలివచ్చారు. గంటల తరబడి కన్నీళ్లతో ఎదురుచూసుకున్న వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా అందరూ కంటతడి పెట్టారు. కన్నీటి సంద్రమైన గంగారంతండాగంగారం తండాకు చెందిన మోతీలాల్ – నేజీకి అశ్విని, అశోక్‌కుమార్ సంతానం. పదో తరగతి కారేపల్లిలో చదివి 550 మార్కులతో మండల టాపర్‌గా నిలిచిన అశ్విని విజయవాడలో ఇంటర్, అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేసింది. బీఎస్సీలో మూడు రజత పతకాలు, యూనివర్సిటీ స్థాయిలో ఆరు బంగారు పతకాలే కాక ఆపై ఎమ్మెస్సీలోనూ బంగారు పతకం సాధించింది. ఆతర్వాత జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందింది. ఇక జాతీయ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి(అగ్రికల్చర్ శాస్త్రవేత్తల రిక్రూట్మెంట్ బోర్డు) నిర్వహించిన పరీక్షలో వందల మంది పోటీ పడగా అశ్విని జాతీయ స్థాయిలోనూ ప్రథమ స్థానం సాధించి జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అశ్విని ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తోంది. గతనెల 29న సోదరుడు అశోక్ నిశ్చితార్థానికి హాజరైన ఆమె ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో విమానం ఎక్కాల్సి ఉంది. దీంతో తండ్రి మోతీలాల్ కారులో తీసుకెళ్తుండగా మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరులో గల్లంతైన విషయం విదితమే. ఇందులో అశ్విని మృతదేహం ఆదివారం మధ్యాహ్నం, మోతీలాల్ మృతదేహం సోమవారం లభించగా స్వగ్రామానికి తీసుకొచ్చారు. అప్పటికే చేరుకున్న స్థానికులు ఉజ్వల భవిష్యత్ ఉన్న శాస్త్రవేత్త అశ్వినిని ఆకేరు వాగు మింగిందా అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరి మృతదేహాలను ట్రాక్టర్‌పై ఊరేగింపుగా గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈక్రమంలో అశ్విని తల్లి నేజీ, సోదరుడు అశోక్‌కుమార్ రోదనలను ఆపడం ఎవరి వల్లా కాలేదు.వైరా ఎమ్మెల్యేకు నిరసన సెగవాగులో గల్లంతై మృతదేహాలు లభించక తాము నరకయాతన పడినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని మోతీలాల్ కుటుంబీకులు ఆరోపించారు. కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్‌ను వారు నిలదీశారు. అయితే, ఆకేరులో కారు గల్లంతైనప్పటికీ అక్కడి కలెక్టర్ సహా అధికారులతో తాను మాట్లాడానని, వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ రాకపోవడంతో వారిని కాపాడలేకపోయామని సర్దిచెప్పారు. ఆ కుటుంబానికి తక్షణ సాయంగా కింద రూ.50వేలు అందజేశారు. -
ఆ ఏజ్‌లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి
వయసు పెరిగే కొద్ది వృద్దాప్య ఛాయలు వస్తాయని అందరికి తెలుసు. అయితే ఏ ఏజ్‌లో వృధాప్యం వేగవంతం అవుతుందనేది తెలియదు. మనం కూడా గమనించం. చూస్తుండగానే మనకే తెలియని విధంగా వృద్ధాప్యంలోకి వచ్చేస్తాం. మన శరీరంలో ఈ మార్పు ఏ నిర్ధిష్ట ఏజ్ నుంచి మొదలవుతుందనేది తెలియదు. ఆ విషయాన్నే తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేగాదు అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటంటే..స్టాన్ఫోర్డ్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనం ఇన్నాళ్లు వృధాప్యం అనేది కాలానుగుణంగా వచ్చేది అనే సంప్రదాయ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది. మానవ శరీర పరమాణు కూర్పు పరంగా వృద్ధాప్యం అనేది రెండు నిర్ధిష్ట వయసులలో వేగవంతమవుతుందని నిర్ధారించారు పరిశోధకులు. ఆ సమయంలోనే శరీరం విపరీతమైన మార్పులకు లోనవుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. సరిగ్గా చెప్పాలంటే భూకంపం మాదిరిగా శరీరం ఒక్కసారిగా సడెన్ మార్పులకు లోనయ్యి వేలాదిగా అణువులు, సూక్ష్మజీవులు పెరగడం, పడిపోవడం జరుగుతుంది. సరిగ్గా అప్పుడే ఆరోగ్యం వేగంగా క్షీణించడం జరుగుతుంది. అదే వృద్ధాప్యం వేగవంతమవుతుందనడానికి సంకేతమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చెప్పాలంటే సరిగ్గా 44, 60 ఏళ్ల వయసులలో శరీరం వేగవంతమైన మార్పులకు లోనవ్వుతుందని వెల్లడించారు. అందుకోసం తాము 25 నుంచి 75 ఏళ్ల వయసు వారిపై పరిశోధనలు చేయగా వారిలో ఉండే విభిన్న అణువులు, సూక్ష్మజీవులు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా, వైరస్లు, శిలింధ్రాలను నిశితంగా గమనించారు. వాటి వృద్ధి కాలక్రమేణ మారదని, నిర్ధిష్ట వయసు 40, 60 ఏజ్‌లలో వేగవంతమైన మార్పులకు లేదా ఆకస్మిక మార్పులకు లోనవ్వడాన్ని అధ్యయనంలో గుర్తించారు.ఈ పెద్ద మార్పులే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. అంతేగాదు తమ అధ్యయనంలో ఈ రెండు నిర్ధిష్ల వయసుల్లోనే శరీరం గణనీయమైన మార్పులకు లోనవ్వుతుందని నిర్థారించారు. ముఖ్యంగా రోగనిరోధక పనితీరు బలహీనమవ్వడం 60వ దశకం నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ పరిశోధన పుట్టుక, మరణంలానే వృద్ధాప్యం అనేది సర్వసాదారణమే అని చెబుతున్నప్పటికీ..ఏఏ ఏజ్‌లో ఈ వృధ్ధాప్యం ప్రారంభమవుతుందనేది తెలియజేసిందన్నారు. పైగా ఈ పరిశోధన భవిష్యత్తులో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల గురించి సరైన అవగాహన ఇస్తుందని నమ్మకంగా చెప్పారు. (చదవండి: బాలీవుడ్ నటి అనుష్క శర్మ మోనోట్రోఫిక్ డైట్: నిపుణులు ఏమంటున్నారంటే..!) -
ఈ విటమిన్‌ని తక్కువగా తీసుకుంటే ఎక్కువ కాలం జీవించొచ్చట..!
వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో భారీ పాత్ర పోషిస్తున్న అంశాలలో, ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు ఫైబర్లతో కూడిన ఆహారం వృద్ధాప్య వ్యతిరేక ప్రభావం ఉంటుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం మంచి విటమిన్లు, మినరల్స్‌తో కూడిన ఆహారం తీసుకుంటాం. అయితే ఈ విటమిన్ మాత్రం తక్కువగా తీసుకుంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం..!.అసలేం జరిగిందంటే..టెక్సాస్ అగ్రిలైఫ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు వృద్ధాప్య జంతు నమూనాలలో తక్కువ ఫోలేట్ తినడం ఆరోగ్యకరమైన జీవక్రియతో ముడిపడి ఉందని గుర్తించారు. ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు, నారింజ, నిమ్మ, పుచ్చకాయలు, బఠానీలు తదితర ఇతర ఆహారాల్లో ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణం, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదల, పనితీరుకు కీలకం. పిల్లలు, యువకులు, గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే..? ఇది పెరుగుదల ప్రక్రియలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాంటి ఈ ఫోలేట్‌ను తక్కువగా తీసుకుంటే వృద్ధుల్లో దీర్ఘాయువుని పెంచుతుందని గుర్తించారు పరిశోధకులు. అదెలా అంటే..శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో ఫోలేట్ని తీసుకోవడం తగ్గిస్తే ఏం జరుగుతుంది అనే దానిపై పరిశోధన చేశారు. అందుకు మధ్య వయసు ఉన్న జంతు సముహానికి ఫోలేట్ తక్కువగా ఉన్న ఆహారాన్ని ఇచ్చారు. ఫోలేట్ పరిమిత నమునాలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు త్వరగా జీవక్రియగా మారగలవని గుర్తించారు. ఒక వ్యక్తి వయసును బట్టి ఫోలేట్ తీసుకోవడం మారుతుందని చెప్పారు. ఎదుగుదల, అభివృద్ధికి ప్రారంభ జీవితంలో అధిక ఫోటేట్ కీలకం. అదే తర్వాత జీవితంలో తక్కువగా తీసుకోవడం మొదలుపెడితే జీవక్రియ ఆరోగ్యం, దీర్ఘాయువుకి ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు పరిశోధకులు. సాధారణంగా మనిషి నిద్రిస్తున్నప్పుడూ కొవ్వులు కరిగిపోతాయి. అదే మెలకువగా, చురుకుగా ఉన్నప్పుడూ..కార్బోహైడ్రేట్లు వేగంగా శక్తి కోసం ఖర్చువుతాయని వివరించారు. అవే వయసు పెరిగే కొద్ది కొవ్వులు కరగడం, కార్బోహైడ్రేట్ ఖర్చు అవ్వడానికి ఎక్కువ సమసయం పడుతుంది కాబట్టి పరిమిత ఫోలేట్ మంచిదని నిర్ధారించి చెప్పారు. ఈ అధ్యయనం ప్రకారం..ఫోలేట్ పరిమత ఆహారం తీసుకునే మగవారిలో జీవక్రియ రేటులో మొత్తం పెరుగుదలను నమోదు చేశారు. అలాగే వృద్ధాప్యంలో శరీర బరువు, కొవ్వులను నిర్వహించగలదని గుర్తించారు. అలాగే ఈ అధ్యయనంలో రక్తహీనత, వంటి ప్రతికూల ఆరోగ్య పరిణామలను చూపించలేదు. ఎంత ఫోలేట్ తీసుకోవాలి.. ఫోలేట్ లేదా విటమిన్ బీ9 ఆహారంలో విడదీయరాని భాగం. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణంలోని ఆరోగ్యకరమైన కణాల పనితీరుకి కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకి 400 గ్రాముల ఫోలేట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఫోలేట్ మరింత కీలకమైనది. వారు రోజుకు 400 నుండి 1,000 మిల్లీ గ్రాముల వరకు మోతాదు ఉంటుంది. మెదడు, వెన్నెముక యొక్క పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ పోషకం శరీరంలో అందుబాటులో ఉండాలని చెప్పారు పరిశోధకులు. (చదవండి: ఆంధ్ర స్పెషల్ 'రాగి దిబ్బ రొట్టు'..ఎన్ని లాభాలో తెలుసా..!) -
రెండువేల ఏళ్లనాటి కంప్యూటర్..! విస్తుపోయిన శాస్త్రవేత్తలు
చాలా ఆవిష్కరణలు మనమే కొత్తగా కనిపెట్టాం అనుకుంటాం. కానీ మన పూర్వీకులు ఆ కాలంలోనే ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలోని అపార మేధాతో అద్భుత ఆవిష్కరణలు చేశారు. వాటికి సంబంధించిన ఆధారాలు లేదా ఆయా వస్తువులు బయటపడితే గానీ నమ్మం. ఆ టైంలోనే వాళ్లు ఇంత టెక్నాలజీని కనిపెట్టారా..? అని అబ్బురపడతాం. అలాంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది.ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న పని అయిన కంప్యూటర్ లేకుండా నడవదు అన్నంతగా మనం దానిపై ఆధారపడిపోయాం. అలాంటి కంప్యూటర్ వేల ఏళ్లక్రితమే మన పూర్వీకులు కనిపెట్టారంటే నమ్ముతారా..?. కానీ ఇది నమ్మకతప్పని నిజం. శాస్త్రవేత్తలు సైతం ఆ కంప్యూటర్ని చూసి అబ్బురపడ్డారు. అసలేం జరిగిందంటే..మొదటి కంప్యూటర్‌గా పిలిచే 'యాంటికిథెరా' అనే రెండు వేల ఏళ్ల పరికరాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు శాస్త్రవేత్తలు. ఇది ఒక ఖగోళ క్యాలెండర్‌గా పేర్కొన్వచ్చు. దీన్ని 1901 నాటి గ్రీకు నౌక ప్రమాదంలో కనుగొన్నారు. అంటే సుమారు 120 ఏళ్ల క్రితం ఈ పరికరాన్ని కనుగొన్నారు. అప్పట్లో ఈ పరికరం ఏంటో అర్థంగాక శాస్త్రవేత్తలు గందరగోళానికి గురయ్యారు. ఇది చేతితో నడిచే పరికరం. ఈ పరికరాంలో సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాల ఖగోళ కదలికలను ట్రాక్ చేసేలా విండ్-అప్ వ్యవస్థను ఉపయోగించారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రుని దశలు, గ్రహాణ సమయాలు గుర్తించే క్యాలెండర్ మాదిరిగా పనిచేసేది. ఇది సాధారణ ప్రయోజనాలకోసం ఉపయోగించి కంప్యూటరే అయినా వెయ్యి ఏళ్ల క్రితమే ఏ ఇతర సాధనల్లో ఇంత మెకానిజం లేదు. పైగా ఇది అధునాతమైనది కూడా. ఇక ఈ కంప్యూటర్ మెకానిజం 82 వేర్వేరు శకలాలుగా ఉంది. అసలు నిర్మాణంలో మూడింట ఒక వంతు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో 30 తుప్పుపట్టిన కాంస్య గేర్వీల్స్ కూడా ఉన్నాయి. అసలు ఇదేలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు లండన్ పరిశోధకులు త్రీడీ కంప్యూటర్ మోడలింగ్‌ను ఉపయోగించారు. అప్పుడే ఇది గొప్ప మేధావి సృష్టించిన అద్భుతంగా గుర్తించారు. తాము పునర్నిర్మించిన ఈ త్రీడీ మోడల్ తమ వద్ద ఉన్న ఆధారాలకు సరిపోలుతుందని చెప్పారు.అంతేగాదు ఈ పరికరం సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాల కదలికలను కేంద్రీకృత వలయాలపై ట్రాక్ చేస్తుందని చెప్పారు. ఆ రోజుల్లేనే ఖగోళ వస్తువులు భూమి చుట్టు తిరుగుతాయని పురాతన గ్రీకులు నమ్మేవారని తెలుస్తుందన్నారు. అంతేగాదు ఈ పురాతన పరికరాన్ని బాబిలోనియన్ ఖగోళశాస్త్రం, ప్లేటోస్ అకాడమీ గణిత, పురాతన ఖగోళశాస్త్ర సిద్ధాంతాల కలియికతో ఆవిష్కరించినట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. (చదవండి: మరణాంతరం భద్రపర్చడానికి ఏకంగా రూ. 1.8 కోట్లు..!) -
శుద్ధి చేసిన నూనెల కంటే ఆ నూనె బెస్ట్!
ఇంతవరకు మనం రకరకాల నూనెలు వినియోగిస్తున్నాం. అలాగే ఒకే రకం నూనెను వాడకూడదని పోషకాహార నిపుణులు చెప్పడంతో మనం సన్‌ఫ్లవర్, వేరుశెనగా అంటూ నూనెలు మారుస్తున్నాం కూడా. కానీ పోషకాహార శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఈ శుద్ధి చేసిన నూనెల కంటే ఆ నూనె బెటర్ అని తేలింది. ఈ నూనెని వినియోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని అంటున్నారు. ఇంతకీ ఏంటా నూనె అంటే..శుద్ధి చేసిన నూనెల కంటే ఆవాల నూనె మంచిదని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పోషకాహార శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంపద్రాయ ఆవాల నూనె వాడటమే మంచి నొక్కి చెప్పారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి చెందని పోషకాహార శాస్త్రవేత్త మోనికా చౌదరి మాట్లాడుతూ.."మునుపటి అధ్యయనంలో సాంప్రదాయా ఆవాల నూనెతో పోలిస్తే శుద్ధి చేసిన నూనెలే ఆరోగ్యానికి మంచిదని తేలింది. కానీ కాలక్రమేణ ఎలుకలపై జరిపిన అధ్యయనంలో అది తప్పు అని నిరూపితమయ్యింది. ఆవ నూనెలో దాదాపు 35-48% ఎరుసిక్ యాసిడ్ ఉంటుందని గత అధ్యయనాలు పేర్కొన్నాయి. అలాగే శుద్ధి చేసిన నూనెల్లో చమురు కంపెనీ ఎరుక్ యాసిడ్ అధిక మొత్తంలో వినియోగిస్తున్నాయని ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటూ తెగ ప్రచారం చేయడం జరిగింది. కానీ ఇటీవల ఎలుకలపై జరిపిన అధ్యయనంలో మానవులకు ఎరుసిక్ ఆమ్లాల ప్రభావం ఉండదని తేలింది. మొత్తం శరీరం బరువులో ఎరుసిక్ యాసిడ్ కిలోకు 7.5ఎంజీ అనుమతించదగినది అన్నారు. ఇక ఈ ఆవా నూనెలో కేవలం 2% కంటే తక్కువ ఎరుసిక్ యాసిడ్‌ని కలిగి ఉంటాయని, అందువల్ల ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని". చెబుతున్నారు. అలాగే ఆరోగ్యకరమైన నూనె అంటే కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్ రహితంగా ఉండాలి. పైగా సంతృప్త కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉండి, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ ఆవాల నూనెలో ఉంటాయని అన్నారు. ఇంతవరకు మంచివని చెప్పుకున్న శుద్ధి చేసిన నూనెల్లో ఒమేగా 6 కొవ్వు ఆమ్మాలు అధికంగా ఉంటాయని, ఇవి దీర్ఘకాల నిల్వకు ఉపయోగపడతాయని అన్నారు. అయితే ఇలాంటి నూనెలు తీసుకోవడం వల్ల శరీరంలో ఒమేగా 6, ఒమేగా 3 నిష్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. ఇలా చాలా స్థానికేతర నూనెల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల చాల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల సాంప్రదాయ నూనెలను తీసుకోవడమే మంచిదని సూచించారు. అందులోనూ ఆవాల నూనె ఇంకా మంచిదని చెబుతున్నారు. అలాగే ఆ శుద్ధి చేసిన నూనెల్లో ఉన్న మరో సమస్య పొగ పాయింట్ అని చెప్పారు. ఇక్కడ నూనెలను వేడిచేసినప్పుడల్లా.. అవి పొగ , ఆవిరిని ఉత్పత్తి చేసే సమయంలో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు (PUFA) ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లుగా విడిపోవడం జరుగుతుంది. ఇలాంటి నూనెలో వేయించిన పదార్థాలను తినడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. అవి కాలక్రమేణ కేన్సర్ కారకాలుగా మారి వివిధ రకాల కేన్సర్లకు దారితీస్తుంది. అయితే సాంప్రదాయ నూనెల్లోనూ, ఆవాల నూనెలను మరిగించినప్పుడూ వాటిలో అధిక పొగ పాయింట్ ఉంటుంది. ఇది కొవ్వు ఆమ్లాలను ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లుగా విడిపోవడాన్ని నిరోధిస్తుందని, అందువల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని వివరించారు. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆవాల నూనెను వాడమని పదేపదే నొక్కి చెబుతున్నారు పోషకాహార శాస్త్రవేత్తలు. (చదవండి: స్నేహితుడిలా ఉండే ఏఐ ఆధారిత నెక్లెస్..ధర ఎంతంటే..!) -
ఆ వ్యాధి ధనవంతులకే వస్తుందా?
ధనవంతులకే పెద్ద వ్యాధులు వస్తాయి అని పూర్వం అనుకునేవారు. డబ్బుతో వైద్యం కొనవచ్చునని, కావాల్సిన ఆహార పదార్థాలు తెప్పించుకు తినగలరని తద్వారా ఎలాంటి వ్యాధినైనా వారు తట్టుకోగలరని అంచనా. అలాగే కొన్ని రకాల వ్యాధులు వారికి మాత్రమే వస్తాయన్న అపోహ కూడా ఉండేది. కానీ ఇప్పుడూ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో అదే నిజమని తేలింది. ముఖ్యంగా ప్రాణంతక వ్యాధి అయిన కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎవరికి అధికమో సవివరంగా వెల్లడించారు పరిశోధకులు. అవేంటో చూద్దామా..!ఫిన్లాండ్లోని హెల్సింకీ విశ్వవిద్యాలయం నిర్వంహించిన సరికొత్త అధ్యయనం ప్రకారం... మనకొచ్చే వ్యాధులకూ, సామాజిక, ఆర్థిక పరిస్థితికీ మధ్య సంబంధం ఉంది. మరీ ముఖ్యంగా కేన్సర్ విషయంలో. ఈ ప్రాణాంతక వ్యాధి పేదల కంటే సంపన్నులకు వచ్చే అవకాశాలు ఎక్కువని వీరు తేల్చారు. ముఖ్యంగా ధనవంతులలో రొమ్ము, ప్రొస్టేట్, వంటి ఇతర రకాల కేన్సర్ వచ్చే జన్యుపరమైన ప్రమాదం ఎక్కవగా ఉందని పరిశోధన పేర్కొంది. తక్కువ సంపాదన కలవారు డిప్రెషన్‌కి గురై ఆల్కహాల్‌కి బానిసవ్వడంతో ఊపిరితిత్తుల కేన్సర్ తోపాటు మధుమేహం, ఆర్థరైటిస్‌ల వంటి వ్యాధులు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎక్కువ ఆదాయాలు ఆర్జించే సంపన్న దేశాల్లో సర్వసాధారణంగా వచ్చే 19 వ్యాధుల గురించి పేర్కొంది. ఉన్నత విద్యావంతులైన మహిళల్లో రోమ్ము కేన్సర్‌కి సంబంధించిన జన్యు ప్రమాదం గురించి ముందుగానే వైద్యులని సంప్రదించడం, చికిత్స తీసుకోవడం వంటివి చేస్తారు. ముఖ్యంగా తక్కువ జన్యు ప్రమాదం లేదా తక్కువ విద్య ఉన్న మహిళలు కంటే వీరే అధికంగా ఆస్పత్రులను సందర్శించడం జరుగుతుందని పరిశోధన పేర్కొంది. అందుకోసం శాస్త్రవేత్తల బృందం సుమారు 80 ఏళ్ల వయసుగల దాదాపు రెండు లక్షలకు పైగా ఫిన్లాండ్ పౌరుల ఆరోగ్య డేటాని సేకరించారు. దానిలో వారి సామాజిక పరిస్థితితో లింక్అప్ అయ్యి ఉన్న జన్యుసంబంధాన్ని ట్రాక్ చేశారు. అయితే ఇలా వ్యాధుల వచ్చే ప్రమాదం జెండర్ పరంగా చూస్తే ఆడ, మగలో మద్య చాలా తేడా ఉందని, ఇది వారి వయసు మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్ హగెన్ బీక్ చెప్పారు. ఇక్కడ వ్యాధి ప్రమాదానికి సంబధించిన జన్యు అంచనా అనేది సామాజిక ఆర్థిక నేపథ్యంపై ఆధారపడి ఉంటుందని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇక్కడ ఒక వ్యక్తిలో జన్యు సమాచారం అనేది జీవితకాలంలో మారదు. వయసు రీత్యా లేదా పరిస్థితులు మారినప్పుడూ వచ్చే వ్యాధుల ప్రమాదం కారణంగా జన్యుప్రభావం మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక నిర్థిష్ట వృత్తితో లింక్ అయ్యే వ్యాధి ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి వివిధ పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.(చదవండి: ఎద్దులు కాపలాకాస్తున్న సమాధి..ఏకంగా రెండువేల..!) -
అంతరిక్ష పర్యాటకం సాధ్యమే!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సాధ్యమేనని.. మన దేశం పూర్తిస్థాయి దేశీయ పరిశోధనలతో ముందుకు వెళ్తోందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి, మిస్సైల్ విమెన్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన డీఆర్డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్లో ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్టెల్లార్ జరీ్నస్’కార్యక్రమం నిర్వహించారు. ఫిక్కీ చైర్పర్సన్ ప్రియా గజ్దర్.. పలువురు శాస్త్రవేత్తలు, ఫిక్కీ ఆధ్వర్యంలోని 200 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్, కల్పన కాళహస్తి తమ అనుభవాలను పంచుకున్నారు. మార్స్‌పైకి మనిషి వెళ్లడం చూడాలి.. సైన్స్‌కు లింగ భేదం లేదని.. డీఆర్డీఓ, ఇస్రో వంటి వేదికల్లో పురుషులు, మహిళలు ఉమ్మడి లక్ష్యం కోసం కలసి పనిచేస్తున్నారని టెస్సీ థామస్ పేర్కొన్నారు. తాను డీఆర్డీఓ వేదికగా పరిశోధన రంగంలోకి అడుగుపెట్టినప్పుడు మహిళలు ఒకట్రెండు శాతమే ఉండేవారని.. ఇప్పుడు 15 శాతం ఉన్నారని తెలిపారు. వినయం, నిబద్ధతను తన గురువు అబ్దుల్ కలాం వద్ద నేర్చుకున్నానని చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థ కోసం అగ్ని క్షిపణులను రూపొందించడంలో కృషి తనకు జీవితకాల సంతృప్తిని ఇచి్చందన్నారు. అగి్న–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో దేశీయ సాంకేతికత వాడుతున్నామని వివరించారు.మార్స్‌పైకి మనిíÙని పంపడాన్ని చూడాలనేది తన కోరిక అని చెప్పారు. ఏలియన్స్ లేవని చెప్పలేం..: సాధారణ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో భారత్ మూన్ ల్యాండర్‌ను ప్రయోగించడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి తెలిపారు. ‘‘మూన్ ల్యాండర్ 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, అధిక వేగంతో చంద్రుడి సమీపానికి చేరుకుంది. ఆ వేగాన్ని సమర్థవంతంగా నియంత్రించి.. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాం. శక్తివంతమైన భారత పరిశోధనలకు ఇది మంచి ఉదాహరణ. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాం. ప్రయోగాల్లో పూర్తిస్థాయిలో దేశీయ సాంకేతికతను ఉపయోగించనుండటం గర్వకారణం..’’అని చెప్పారు. అంతరిక్ష పర్యాటకం దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. అంగారకుడిపై పరిశోధన కూడా తన కలల ప్రాజెక్టు అని చెప్పారు. ఏలియన్ల గురించి ప్రస్తావిస్తూ.. విశ్వంలో మనకు తెలియని అద్భుతాలెన్నో ఉన్నాయని, అందులో ఏలియన్స్ కూడా భాగం కావొచ్చని పేర్కొన్నారు. -
మొక్కలు కూడా అరుస్తాయి..శబ్దాలు చేస్తాయ్.!
మొక్కలకు భాష ఉంటుందని, నీళ్లు పోసినపుడు ఆనందంతో కొమ్మలు ఊపూతూ ఆనందాన్ని ప్రకటిస్తాయని చాలా సార్లు విన్నాం. తాజాగా మొక్కలకూ బాధ ఉందనే విషయాన్ని తొలిసారిగా గుర్తించారు. తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు మొక్కలు కూడా గట్టిగా అరుస్తాయని పరిశోధకులు వెల్లడించారు. చెట్లు, మొక్కలను కూకటి వేళ్లతో సహా పెకలించినప్పుడు, లేదా వాటి కాండాన్ని మధ్యలో నరికినప్పుడు మొక్కలు ఆక్రోశిస్తాయి. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తమ పరిశోధనలో ఈ విషయాలను గుర్తించారు. సెల్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. నిశ్శబ్దమైన మైదానంలో కూడా మనకు వినబడని శబ్దాలు చేస్తాయి. ఆ శబ్దాలకు అర్థం ఉంటుంది. ఈ శబ్దాలను వినగలిగే జంతువులూ ఉన్నాయి. కాబట్టి చాలా శబ్ద పరస్పర చర్య జరిగే అవకాశం ఉందని పరిణామాత్మక జీవశాస్త్రవేత్త లిలాచ్ హడానీ తెలిపారు. సాధారణ సమయాల్లో కూడా మొక్కలు కొన్ని రకాల శబ్దాలు చేస్తాయని, మనిషి వినలేని ఈ శబ్దాలను కొన్ని జంతువులు, కీటకాలు గుర్తిస్తాయని తేల్చారు. లిలాచ్ హడానీ డా. హడానీ , ఆమె బృందం ఈ ప్రయోగాల కోసం టమాటాలు, పొగాకు మొక్కలను పరిశీలించారు. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ ద్వారా ఒత్తిడి లేని మొక్కలు, కాండం పెకిలించిన మొక్కలు, నిర్జలీకరణ మొక్కలు ఉత్పత్తి చేసే శబ్దాల మధ్య తేడాను గుర్తించానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయాల్లో మొక్కలు మీటరు దూరం మేర వినబడేలా హై పిచ్ శబ్దాలు చేస్తాయని గుర్తించారు. ఒత్తిడి లేని మొక్కలు ప్రశాంతంగానే ఉంటున్నట్టు గుర్తించారు. ఒత్తిడిలో ఉన్న మొక్కలు చేసిన శబ్దాలు అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీల్లో ఉండే ఈ ధ్వనులు చిటికెలు లేదా క్లిక్ చేసినట్టుగా ఉంటాయని, మనుషులకు వినబడవని పేర్కొన్నారు. మొక్కలు తమ బాధలను తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి తెలియజేయడానికి ఉపయోగించే మార్గాలలో ఇదొకటి కావచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడి సమయాల్లో చెట్లు, మొక్కలు తమ రంగులు మార్చుకోవడం, లేదా ముడుచుకుపోవడం, ఇతర మార్పులకు లోనవుతాయని తెలుసు. అయితే, ఇవి శబ్దాలను కూడా వెలువరిస్తాయో లేదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.. అయితే, మొక్కలు ఈ శబ్దాలను ఎలా చేస్తాయనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. -
వాటర్ బాటిల్లోని నీరు ఎన్నాళ్లకు పాడవుతుంది?
నదిలో పారేనీరు నిత్యం శుభ్రంగా ఉంటుందని అంటారు. అయితే క్లోజ్డ్ బాటిల్లోని నీటికి గడువు తేదీ ఉంటుందా? అయితే ఆ నీరు ఎప్పుడు చెడిపోతుంది? దాని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడో ఒకప్పుడు వాటిర్ బాటిల్‌పై గడువు తేదీని చూసేవుంటాం. ఒక నివేదిక ప్రకారం వాటిర్ బాటిల్లోని నీటిని దాని ప్యాకింగ్ తేదీ నుంచి రెండేళ్లపాటు వినియోగించవ్చు. బాటిల్లోని ప్లాస్టిక్ నెమ్మదిగా నీటిలో కరగడం ప్రారంభిస్తుందని, అందుకే రెండేళ్ల తర్వాత ఆ నీరు తాగడానికి పనికిరాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి వాటర్ బాటిల్ గడువు తేదీ దానిలోని నీటికి సంబంధించినది కాదు. బాటిల్ గడువు తేదీ అని దాని అర్థం. వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం పంపు నీటిని ఆరు నెలల పాటు నిల్వ చేయవచ్చు. ఆ నీటిని ఉపయోగించవచ్చు. అయితే కార్బోనేటేడ్ పంపు నీరు రుచి క్రమంగా మారుతుంది. ఎందుకంటే దానిలో నుంచి గ్యాస్ నెమ్మదిగా బయటకు వస్తుంది. గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ నీటిలో కలిసిన తర్వాత, అది కొద్దిగా ఆమ్లంగా మారుతుంది. అయితే కంటైనర్లను ఆరు నెలల పాటు చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో ఉంచినట్లయితే ఆ నీటి రుచి ఎప్పటికీ మారదు. కంటైనర్లలో నీటిని నింపేటప్పుడు పైపులను నేరుగా ఉపయోగించకూడదని నిపుణులు చెబుతుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా ఫిల్టర్‌ను వాడాలని సూచిస్తుంటారు. ఆ నీటికి గాలి తగలకుండా ఉండేందుకు ఒక మూతను ఉంచాలి. నీటిని నిల్వ చేయడానికి మరొక మార్గం కూడా ఉంది. నీటిని సుమారు 15 నిమిషాలు మరిగించి, ఆ తరువాత చల్లబరిచి నిల్వ చేయవచ్చు. -
కొండచిలువలు తినడం మంచిదంటున్న శాస్త్రవేత్తలు!
ఇంతవరకు మాంసాన్ని ల్యాబ్‌లో తయారు చేయడం వంటి వాటి గురించి కథనాలు విన్నాం. దీని వల్ల శాకాహారులకు కూడా మేలు జరుగుతుంది. వారికి కావాల్సిన పోట్రీన్లు ఇలా కృత్రిమంగా తయారు చేసిన మాంసం ద్వారా అందుతుందని భావించారు కూడా. అవన్నీ పరిశోధన దశల్లో ఉన్నాయి. ఇప్పుడు అది ఇది కాదంటూ ఏకంగా కొండచిలువలనే ఆహారంగా తినమని చెబుతున్నారు. పైగా ఆరోగ్యానికి మంచిదంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఎందుకిలా అన్నారంటే.. ఇంతవరకు మనుషులు మేకలు, గొర్రెలు, కోళ్లు వంటి ఇతరత్ర మాంసాలను తినేవారు. అయితే వీటి వల్ల కేవలం వంద గ్రాములు ప్రోటీన్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే వీటి కారణంగా గాలిలో 49.89 కిలోగ్రాముల కార్బన్డయాక్స్డ్ విడుదలవుతుందని పరిశోధనల్లో తేలిందన్నారు. అందువల్ల మాంసాహారం ఎక్కువుగా తినడమనేది పర్యావరణాని హానికరమని నొక్కి చెబుతున్నారు పరిశోధకులు. వీటికి బదులు కొండచిలువలు తినడం చాలా మంచిదని, ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. ఈ మేరకు తాము ఒక పొలంలో దాదాపు 12 నెలలపాటు పెంచిన రెండు కొండచిలువలపై జరిపిన అధ్యయనంలో తేలిందని సరీసృపాల నిపుణుడు డాక్టర్ డేనియల్ నాటుష్ చెబుతున్నారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ పలు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఇవి నీరు లేకుండా దాదాపు నెలరోజులు జీవిస్తాయట. వీటి పొలుసుల మీద ఉండే నీటితోనే అన్ని రోజుల పాటు నీరు తీసుకోకుండా బతకగలవని అన్నారు. అలాగే దాదాపు ఒక సంవత్సరం పాటు ఏం తినకుండానే బతికేస్తాయట. అలాగే పంట బాగా పండటంలో వీటి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అన్నారు. అలాగే ఇవి తక్కువ గ్రీన్హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తాయని అన్నారు. ఇవి తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండగలవు, పైగా బ్లర్డ్ ఫ్లూ లేదా కోవిడ్ -19 వంటి వ్యాధులను వ్యాప్తి చేయవని అధ్యయనంలో వెల్లడయ్యిందని తెలిపారు. ఈ ఆసక్తికర పరిశోధన సైంటిఫిక్ రిసెర్చ్ ప్రచురితమయ్యింది. అలాగే వీటిని ఆహారంగా తీసుకుంటే మంచి ప్రోటీన్ పుష్కలంగా అందుతుందని అన్నారు. ఒక ఏడాదిపాటు సాగిన ఈ పరిశోధనలో తాము ఈ కొండచిలువలకు ఎలుకలు, చేపలు వంటి వాటిని ఆహరంగా అందించి ఎప్పటికప్పుడూ వాటి బరువుని కొలిచే వాళ్లమని చెప్పారు. అయితే ఈ రెండు పైథాన్‌లలో ఆడ కొండచిలువ వేగంగా బరువు పెరిగినట్లు పేర్కొన్నారు. వివి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కరువు ఏర్పడి పశువులు పెద్ద సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది. అలాంటి సమయాల్లో మాంసాహారంగా ఈ కొండచిలువలు ప్రత్యామ్నాయంగా ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తుల. వామ్మో కొండ చిలువ తినడమమా ఏందీ వింత పరిశోధన అని భావిస్తున్నారా?. టెన్షన్ పడొద్దు ఎందుకంటే..దీనిపై ఇంకా కూలంకషంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు పూర్తి అయ్యేతే గానీ కార్య రూపం దాల్చదు. అదీగాక కొండచిలువల పెంపకం అనే విషయంలో సాధ్యా సాధ్యాలు కూడ అంచాన వేయాల్సి ఉంటుంది. (చదవండి: 'కుమారీ ఆంటీ' లాంటీ ఇన్సిడెంట్..మరీ ఇదేమవుతుందో..!) -
ఆ బ్యాటరీలు మన నెత్తిన పడతాయా?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్) నుంచి మూడు టన్నుల బరువైన తొమ్మిది బ్యాటరీలు నేడు (శనివారం) భూమిపైకి దూసుకురానున్నాయి. 2021లో ఐఎస్ఎస్ నుంచి వేరుపడిన ఈ బ్యాటరీలు ఇప్పుడు భూమిపై పడనున్నాయి. దీనిపై పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత బరువైన ఎక్స్పోజ్డ్ ప్యాలెట్ 9 (ఈపీ9)ను 2021, మార్చి లో అంతరిక్ష కేంద్రం నుంచి తొలగించారు. దీనిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి పైకి విసిరిన అత్యంత భారీ వస్తువుగా గుర్తించారు. ఉపయోగించిన లేదా అనవసరమైన పరికరాలను ఈ విధంగా పారవేయడం అంతరిక్ష కేంద్రంలో సాధారణంగా జరుగుతుంటుంది. ఇవి భూ వాతావరణంలో ఎటువంటి హాని లేకుండా కాలిపోతాయి. ఈపీ9 దూసుకువచ్చే ముందు జర్మనీలోని నేషనల్ వార్నింగ్ సెంటర్ పౌర రక్షణ, విపత్తు ఉపశమనం కోసం ఈ సమాచారాన్ని విడుదల చేసింది. ‘మార్చి 8 మధ్యాహ్నం నుంచి, మార్చి 9 మధ్యాహ్నం మధ్య భారీ అంతరిక్ష శకలం భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది’ అని తెలిపింది. హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లోని వివరాల ప్రకారం ఈ ఖగోళ వ్యర్థాలు మార్చి 9న ఉదయం 7:30 నుంచి మార్చి 9 ఉదయం 3:30 మధ్య భూ వాతావరణంలోకి ప్రవేశించనున్నాయి. పలు నివేదికల ప్రకారం ఈ బ్యాటరీలు భూమికి ఎటువంటి హాని కలిగించవు. ఎందుకంటే అవి భూ వాతావరణంలోకి ప్రవేశించగానే, కాలిపోయి బూడిదగా మారతాయి. అయితే వాటిలోని కొన్ని శకలాలు భూమికి చేరవచ్చు. అయితే వీటి వలన భూమికి ఎలాంటి హాని జరగదని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్షం నుంచి దూసుకు వస్తున్న ఈ బ్యాటరీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అయితే ఇవి ఎక్కడ, ఎప్పుడు పడతాయనే దానిపై పలు అంచనాలు వేస్తోంది. దీనిపై ఖచ్చితమైన సమాచారం ఏజెన్సీకి ఇంకా అందుబాటులో రాలేదు. వాతావరణం తీరుతెన్నుల కారణంగా ఈ బ్యాటరీలు భూమిపై పడే ప్రాంతాన్ని ఖచ్చితంగా చెప్పడం శాస్త్రవేత్తలకు అసాధ్యంగా మారింది. అంతరిక్షం నుంచి భూమిపైకి శకలాలు దూసుకు రావడం కొత్తేమీ కాదు. ప్రతిరోజూ ఉపగ్రహాల నుండి వ్యర్థాలు భూమిపై పడుతుంటాయి. కొన్ని వేల సంవత్సరాలుగా ఇలా జరుగుతోంది. అయితే భారీ బ్యాటరీలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి దూసుకు వస్తున్నప్పుడు శాస్త్రవేత్తలలోనూ ఆందోళన నెలకొనడం సహజం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది అంతరిక్ష శాస్త్రవేత్తల పరిశోధనా కేంద్రం. ఇది అమెరికా, రష్యాతో సహా అనేక దేశాల ఉమ్మడి ప్రాజెక్ట్. శాస్త్రవేత్తల బృందం అంతరిక్ష సంబంధిత ప్రయోగాలను ఇక్కడ నిర్వహిస్తుంటుంది. అంతరిక్షంలో మరో అంతరిక్ష కేంద్రం కూడా ఉంది. దానిని చైనా నిర్మించింది. -
కిచెన్‌లో ఉండే ఆ రెండిటితోటే మైక్రోప్లాస్టిక్‌కి చెక్!
మైక్రోప్లాస్టిక్‌లు ప్రస్తుతం ఆహారం, నీరు, గాలిలో ఇలా ప్రతి చోట ఉంటున్నాయి. ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్యలా మారింది. వీటిని ఫిల్టర్ చేయడానికి శాస్త్రవేత్తలు పలు విధాల ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధించి పలు టెక్నిక్లను అభివృద్ధి చేశారు. అయితే తాజగా శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేసిన ఈ ప్రయోగం సమర్థవంతంగా మైక్రో ప్లాస్టిక్‌కు చెక్‌పెట్టింది. ఇక్కడ మైక్రోప్లాస్టిక్‌లు అంటే 5 మిల్లీమీటర్లు(0.2 అంగుళాలు) కంటే చిన్నగా ఉండే ప్లాస్టిక్‌లని అర్థం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలే సౌందర్య ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తాయి. ఇవి పెద్దగా ఉండే ప్లాస్టిక్ వస్తువుల కీణత కారణంగా వచ్చేవే ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు. ఇక యునెస్కో ఓషన్ లిటరసీ పోర్టల్ ప్రకారం ఈ మైక్రో ప్లాస్టిక్ ముక్కలు చాలా వరకు మహాసముద్రాల్లోనే కలిసిపోతాయని పేర్కొంది. వాటిలో సుమారు 50 నుంచి 70 మిలియన్ల వరకు పెద్ద, చిన్న సైజులో ప్లాస్టిక్ కణాలు ఉండొచ్చనేది అంచనా. ఈ ప్లాస్టిక్ రేణువుల్లో చాలా విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఆ తర్వాత ఇవే కాలక్రమేణ ఈ నానో ప్లాస్టిక్లుగా విచ్ఛిన్నమవుతాయి. ఇవి చాల చిన్నవి కాబట్టి ప్రేగులు, ఊపిరితిత్తులు గుండా నేరుగా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి మన హృదయం, మెదుడు వంటి అవయవాల్లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ సముద్రంలో ఉండే ఈ చిన్న కణాలు తాగు నీటిలో కూడా చేరడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఇవి శరీరంలోని సహజ హార్మోన్ల విడుదలకు అంతరాయం కలిగించడమే కాకుండా పునరుత్పత్తి లోపాలు, కేన్సర్ ప్రమాదాలను పెంచుతాయి. దీన్ని చెక్ పెట్టేందుకు చైనాలోని గ్వాంగ్జౌ మెడికల్ యూనివర్సిటీ, జినాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వంటగది సామాన్లనే ఉపయోగించింది. వీటితోనే మైక్రో ప్లాస్టిక్‌లకు సంబంధించి దాదాపు 80%పైగా తొలగించింది. కేవలం ఒక కేటిల్ సాధారణ వాటర్ ఫిల్టర్‌ని ఉపయోగించి మైక్రోప్లాస్టిక్‌లను ఈజీగా తొలగించింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్‌లో వెల్లడించారు. ఆ పరికరాలతో ఝాన్జున్ లీ, ఎడ్డీ జెంగ్ అనే శాస్త్రవేత్తల బృందం ఖనిజాలతో కూడిని నీటి నమునాలను సేకరించారు. వాటిలో నానో, మైక్రో ప్లాస్టిక్‌ల కణాల డోస్‌ని పెంచింది. వాటిని ఐదు నిమిషాల మరిగించింది. ఐతే ప్రతిసారి ఆ నీరు మరుగుతున్నప్పుడూ పైకిలేచే ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాస్టిక్ మొత్తాన్ని బృందం తొలగించే ముందు చల్లబరిచి వేరు చేసేది. ఖనిజాలతో కూడిని ఈ నీటిలో లైమ్‌స్కేల్, కాల్షియం కార్బోనేట్ వంటి పదార్థాలు ఉంటాయి. ఎప్పుడైతే మరిగిస్తామో అప్పుడు టీ, కాఫీ వంటివి కాచినప్పుడూ ఎలా పైకి నల్లటి తెట్టు వస్తుందో అలా తెట్టులాగా తెల్లటి ఒట్టు ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలను నీటి నుంచి వేరు చేస్తుంది. తద్వారా ఈజీగా తాగే నీటి నుంచి ప్లాస్టిక్ కణాలను వేరవ్వుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: భారతీయ సంగీతంతో అలరిస్తున్న జర్మన్ సింగర్!) -
భారతదేశం రెండు ముక్కలు కానుందా?
హిమాలయ పర్వత శ్రేణికి దిగువన భారత, యురేషియా ఖండాంతర టెక్టోనిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొంటున్న కారణంగా హిమాలయాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించారు. అయితే ఇండియన్ ప్లేట్లోని కొంత భాగం యురేషియన్ ప్లేట్ కింద జారిపోతున్నందున అది ‘డీలామినేట్’ అవుతున్నదని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. ఈ ప్రక్రియ భారత్‌ను బౌగోళికంగా విభజించే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు, ఒకదాని కిందకు మరొకటి కిందకి జారిపోతుంది. ఈ ప్రక్రియను సబ్డక్షన్ అంటారు. రెండు ఖండాంతర పలకలు సమానంగా ఉన్నందున, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు ఏ ప్లేట్ మరొకదానిపై అతివ్యాప్తి చెందుతుందో ఖచ్చితంగా గుర్తించలేరు. ఇండియన్ ప్లేట్లోని దట్టమైన దిగువ భాగం పై భాగానికి దూరంగా ఉంటుంది. వీటిమధ్య నిలువుగా ఏర్పడిన పగులును శాస్త్రవేత్తలు గుర్తించారు. భారత- యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య 60 మిలియన్ సంవత్సరాలకు పైగా జరుగుతున్న ఘర్షణ హిమాలయాలకు ఇప్పుడు మనం చూస్తున్న ఆకృతినిచ్చింది. సముద్రపు పలకల వలె కాకుండా, ఖండాంతర పలకలు మందంగా, తేలికగా ఉంటాయి, అవి భూమిలోని మాంటిల్లోకి సులభంగా ఇమిడిపోవు. భౌగోళిక భౌతిక శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఇటీవల టిబెట్ భాభూగం కింది భూకంప తరంగాలను విశ్లేషించింది. ఈ నేపధ్యంలో యురేషియన్ ప్లేట్ దాని కింద జారిపోతున్నందున భారత ప్లేట్ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది. ఈ బృదం యురేషియన్ ప్లేట్ మధ్య సరిహద్దు వద్ద పగుళ్లను కూడా కనుగొంది. భూకంప తరంగాలు, హీలియం వాయువులు ఉపరితలంపైకి చొచ్చుకు రావడం ఈ డీలామినేషన్ ప్రక్రియకు సాక్ష్యంగా నిలుస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నూతన పరిశోధనా ఫలితాలు మునుపటి పరికల్పనలను సవాలు చేస్తున్నాయి. భౌగోళిక ప్రక్రియలను మరింతగా గుర్తించేలా చేస్తున్నాయి. ఇన్నాళ్లూ పరిశోధకులు ఖండాలు ఏర్పడటం వెనుక ఇటువంటి ప్రక్రియ ఉంటుందనే దానిపై పరిశోధనలు సాగించలేదు. అయితే ఈ కొత్త అధ్యయనం మరిన్ని నూతన ఆవిష్కరణలకు నాంది పలకనుంది. ఈ పరిశోధన అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో సమర్పించారు. ఇది హిమాలయాల ఆవిర్భావాన్ని మరింతగా అర్థం చేసుకోవడంలో సహాయపడనుంది.అలాగే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భూకంప ప్రమాదాలను పసిగట్టేందుకు సహాయకారిగానూ ఉండవచ్చు. -
బీథోవెన్ డీఎన్ఏలో అంతుచిక్కని రహస్యాలు?
జర్మనీకి చెందిన అలనాటి స్వరకర్త లుడ్విగ్ వాన్ బీథోవెన్ సింఫనీ, పియానో, వయెలెన్ మొదలైన వాటితో మ్యూజిక్ కంపోజ్ చేయడంలో ఎంతో పేరొందారు. తాజాగా ఆయన జుట్టు నుంచి సేకరించిన డిఎన్ఏపై జరిపిన విశ్లేషణ అతనికి సంబంధించిన పలు రహస్యాలను వెల్లడించింది. బీథోవెన్ దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ 1827లో కన్నుమూశారు. అతను వినికిడి లోపం, కాలేయ వ్యాధి, ఉదర సంబంధిత వ్యాధులు, అతిసారంతో బాధపడ్డాడు. బీథోవెన్ తన చివరి రోజుల్లో తన మూలాల గురించి జనానికి సవివరంగా తెలియజేయమని తన సోదరులను కోరారు. డీఎన్ఏ విశ్లేషణ కోసం.. జర్మనీ, యూకేల నుండి వచ్చిన పరిశోధకుల బృందం బీథోవెన్ జుట్టుకు సంబంధించిన డీఎన్ఏను విశ్లేషించింది. బీథోవెన్ డీఎన్ఏని అతని బంధువులుగా భావిస్తున్నవారి డీఎన్ఏతో సరిపోల్చారు. అలాగే అతని ఇప్పుటి బంధువులు ఎవరో తెలుసుకునేందుకు పలు రికార్డులను కూడా పరిశీలించారు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్తో మృతి బీథోవెన్ జుట్టు నమూనాలలో ఒకటి బీథోవెన్కి చెందినది కాదని, గుర్తు తెలియని మహిళ నుండి వచ్చినదని పరిశోధకులు కనుగొన్నారు. బీథోవెన్ మరణం బహుశా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల సంభవించి ఉండవచ్చునని కూడా వారు కనుగొన్నారు. హెపటైటిస్ వ్యాధి అతని కాలేయాన్ని దెబ్బతీసింది. ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపింది. బీథోవెన్ విషప్రయోగం వల్ల మరణించారనే మునుపటి నమ్మకానికి విరుద్ధమైన ఫలితం వచ్చింది. తండ్రులు వేరా? బీథోవెన్కు చెందిన ‘వై’ క్రోమోజోమ్ అతని తండ్రి తరపు బంధువులతో సరిపోలడం లేదని పరిశోధకులు కనుగొన్నారు. అతని వంశవృక్షంలో తండ్రులు వేరుగా ఉండే అవకాశం ఉందని ఉందని కూడా వారు తెలిపారు. అంటే అతని పూర్వీకులలో ఒకరు వారి వంశానికి చెందిన తండ్రి కాకుండా వేరే వ్యక్తి అయివుంటాడని, అతని ద్వారా బీథోవెన్ జన్మించి ఉండవచ్చని కూడా పరిశోధకులు చెబుతున్నారు. -
1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు..ఇప్పటికీ లోపల పచ్చసొన..!
పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలతో నాటి కాలంలో వాడే పనిముట్లు, వారు ఉపయోగించిన టెక్నాలజీ తదితరాలను వెలికితీస్తుంటారు. నాటి పూర్వీకుల వైభవం కళ్లముందుకు తీసుకురావడమే గాక తెలియని ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తుంటారు. అలాంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణను తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చారు. మాములుగా ఏ గుడ్డు అయినా సాధారణంగా కొన్ని రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఆ తర్వాత కుళ్లిపోడవం లేదా పాడైపోవడం జరుగుతుంది. కానీ పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించిన అద్భుత ఆవిష్కరణ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఇంతకీ అదేంటంటే..? వివరాల్లోకెళ్తే..శాస్తవేత్తలు.2007-2016 నుంచి జరుపుతున్న ఐలెస్బరీ త్రవ్వకాల్లో ఏకంగా 17 వందల ఏళ్ల నాటి పురాతన రోమన్ గుడ్డుని గుర్తించి వెలికితీశారు. తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో మరో మూడు గుడ్లు ఉన్నప్పటికీ అవి బయటకీ తీసే క్రమంలో పగిలి దుర్గంధం వెదజల్లింది. అయితే ఈ గుడ్డుని శాస్త్రవేత్తలు జాగ్రత్తగా వెలికితీశారు. నీటితో నిండి ఉన్న గొయ్యి నుంచి వీటిని బయటకు తీయడం జరిగింది. ఇది నాటి రోమన్ల వైభవాన్ని గుర్తు చేస్తోంది. ఇక మైక్రో స్కాన్లతో ఆ గుడ్డుని పరీక్షించగా దానిలో పచ్చసొన, తెల్లసొనతో చెక్కు చెదరకుండా ఉన్నట్లు చూపించాయి. అన్ని వేల ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉండటం అందర్నీ చాలా ఆశ్చపర్చింది. నాటి రోమన్లు వాడే సాంకేతికత శాస్త్రవేత్తల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఈ మేరకు ఆక్స్ఫర్డ్ ఆర్కియాలజీ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎడ్వర్డ్ బిడ్డుల్ఫ్ మాట్లాడుతూ..అక్కడ తవ్వకాల్లో బయటపడిన వాటిని చూసి తాము ఒక్కసారిగా షాకయ్యామని, ఊహించని వాటిని కనుగొనడమే కాకుండా చెక్కుచెదరకుండా ఉండటం మమల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ప్రంపచంలోనే వేల ఏళ్ల నాటి నుంచి చెక్కుచెదరకుండా ఉన్న తొలి కోడిగుడ్డు ఇదే అన్నారు. నిజానికి ఆ గుడ్డు లోపల ద్రవాలు ఉండవని అనుకున్నాం. అయితే స్కాన్‌లో పచ్చసొన, అల్బుమెన్ వంటివి కనిపించడం నిజంగా అద్భుతం అనిపించింది. దీన్ని తాము లండన్‌లో ఉన్న నేచురల్ హిస్టరీ మ్యూజియమ్‌కు తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే ఆ గుడ్డుని సంరక్షించే పద్ధతుల గురించి ఆ మ్యూజియంలో ఉండే పక్షుల సంరక్షకులను సంప్రదించినట్లు పేర్కొన్నారు. (చదవండి: అతిపెద్ద ఉప్పు సరస్సు గుండా వెళ్తున్న రైలు..వీడియో వైరల్) -
న్యూటన్ ఎక్కడ పుట్టారు? రెండు పుట్టిన రోజులు ఎందుకు?
ప్రముఖ శాస్త్రవేత్త, గణిత మేథావి ఐజాక్ న్యూటన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పాఠశాల పుస్తకాలలో అతని పేరు తప్పక కనిపిస్తుంది. న్యూటన్ గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, వేదాంతవేత్త ఇలా మరెన్నో సుగుణాలు ఆయనలో ఉన్నాయి. అయితే న్యూటన్ తన గురుత్వాకర్షణ, చలన నియమాలకు ప్రసిద్ధి చెందారు. అయితే న్యూటన్ ఎక్కడ పుట్టారో తెలుసా? అలాగే ఆయనకు రెండు పుట్టిన రోజులు ఎందుకు వచ్చాయో తెలుసా? న్యూటన్ ఇంగ్లాండ్‌లోని లింకన్షైర్ కౌంటీలోని వూల్స్టోర్ప్-బై-కోల్స్టర్వర్త్లోని వూల్స్టోర్ప్ మనోర్‌లో 1642, డిసెంబరు 25న జన్మించారు. న్యూటన్ పుట్టిన మూడు నెలలకు అతని తండ్రి కన్నుమూశారు. అతని పూర్తి పేరు ఐజాక్ న్యూటన్. న్యూటన్‌కు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు, అతని తల్లి మరో వివాహం చేసుకుంది. ప్రపంచానికి వినూత్న ఆవిష్కరణలు అందించిన న్యూటన్ 1727 మార్చి 20న కన్నుమూశారు. వెస్ట్ మినిస్టర్ అబ్బేలో న్యూటన్ సమాధి ఉంది. న్యూటన్‌కు పిల్లలు లేరు. అతని ఆస్తిని బంధువులు స్వాధీనం చేసుకున్నారు. న్యూటన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. న్యూటన్‌కు రెండు పుట్టినరోజులు. నాటి రోజుల్లో అమలులో ఉన్న క్యాలెండర్ కారణంగా అతని పుట్టిన తేదీల మధ్య పది రోజుల తేడా ఉంది. న్యూటన్ పుట్టిన రోజు జనవరి 4నే కాకుండా, డిసెంబర్ 25న కూడా వస్తుంది. న్యూటన్ తన పుట్టినరోజును డిసెంబర్ 25న ఇంగ్లాండ్‌లో జరుపుకున్నారు. ఇంగ్లాండ్ వెలుపల అతని పుట్టినరోజు జనవరి 4 కింద లెక్కిస్తారు. ఆ సమయంలో జూలియన్ క్యాలెండర్‌ను ఇంగ్లాండ్‌లో ఉపయోగించారు. ఈ క్యాలెంటర్ యూరప్‌కు భిన్నమైనది. దీని ప్రకారం న్యూటన్ 1642, డిసెంబరు 25న జన్మించారు. ఆ సమయంలో ఐరోపాలో గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అనుసరించేవారు. దీని ప్రకారం న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. -
పక్షులు డైనోసార్ల వంశమా?
డైనోసార్లకు సంబంధించిన విషయాలను మనం వింటూనే ఉంటాం. డైనోసార్లు భూమిపై మనుగడసాగించిన అతిపెద్ద జంతువులనే విషయం మనకు తెలిసిందే. సుమారు ఆరున్నర బిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ ఉల్క భూమిని తాకింది. ఫలితంగా డైనోసార్ల ఉనికి తుడిచిపెట్టుకుపోయింది. అయితే డైనోసార్ల వంశం ఇప్పటికీ భూమిపై ఇంకా సజీవంగా ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోతారు. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇదే నిజం. పక్షులు డైనోసార్ల వంశం అని చెబుతారు. దీని వెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పక్షులు డైనోసార్ల వంశానికి చెందినవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనిని అనుసరించి చూస్తే డైనోసార్లు ప్రపంచం నుంచి పూర్తిగా అంతరించిపోలేదు. డైనోసార్లు, పక్షులు కలిసి జీవించడమే దీనికి కారణం. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతం అయ్యాయి. అయితే పక్షులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాయి. అయితే శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ఎటువంటి ప్రామాణిక రుజువును ఇంకా అందించలేదు. దీనిని నిరూపించడానికి భిన్నమైన సిద్ధాంతాలను వెలిబుచ్చారు. డైనోసార్ల శరీర నిర్మాణం.. పక్షుల శరీర నిర్మాణాన్ని పోలివుంటుందని తెలిపారు. నాడు జరిగిన మహా విపత్తు నుంచి పక్షులు ఎలా బతికాయనేదానికి శాస్త్రవేత్తలు ఇంకా ఖచ్చితమైన కారణం కనుగొనలేదు. అయితే గ్రహశకలం భూమిని ఢీకొన్న తర్వాత దంతాలు లేని పక్షులు మాత్రమే జీవించాయని వారు చెబుతున్నారు. దీనికి సరైన సిద్ధాంతం ఇంకా వెలువడలేదు. ఈ సిద్ధాంతాలను శాస్త్రవేత్తలు తమ పరిశోధనల నేపధ్యంలో వెల్లడించారు. -
మొక్కల ఊసులు రికార్డయ్యాయి ఇలా!
ఇంతకుమునుపు మొక్కలు మాట్లాడతాయని, అవి కూడా బాధలకు ప్రతిస్పందిస్తాయని విన్నాం. అందుకు సంబంధించిన విషయాలను శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా వెల్లడించారు కూడా. ఎప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసుకుని ప్రతిస్పందిస్తాయన్నది ఓ మిస్టరీగా మిగిలిపోయింది. దీన్ని పరిశోధకులు తాజాగా చేధించడమే గాక మొక్కలు మాట్లాడుకోవడాన్ని కెమెరాలో బంధించి మరీ వివరించారు. వివరాల్లోకెళ్తే..జపాన్‌కి చెందిన శాస్త్రవేత్తల బృందం అందుకు సంబంధించిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసింది.మొక్కలు ఒకదానికొకటి మాట్లాడుకోవడం నిజమేనని వీడియోలో బంధించి మరీ ప్రూవ్ చేసి చూపించారు. మొక్కలు కమ్యూనికేట్ చేయడానికి గాలిలో ఉండే సమ్మేళనాలను వినియోగించుకుంటాయిని, అవి పొగమంచుతో చుట్టబడి ఉంటాయని అన్నారు. ఈ సమ్మెళనాలను వాసనలుగా వినియోగించుగకుని ప్రమాదం గురించి మరొక మొక్కను హెచ్చరిస్తాయని చెబుతున్నారు. ఈ మేరకు జపాన్ శాస్త్రవేత్తలు రికార్డ్ చేసిన వీడియోలో.. మొక్కలు ఎలా ఆ సిగ్నల్స్‌ని స్వీకరించి ప్రతిస్పందిస్తాయన్నది ప్రత్యక్షంగా చేసి చూపించారు. సైతామ యూనివర్సిటీకి చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ మసాత్సుగు టొయోటా నేతృత్వంలోని పరిశోధకులు బృందం ఈ విషయాన్నికమ్యూనికేషన్స్ జర్నల్‌లో వెల్లడించింది. ఇక్కడ మొక్కలు కీటకాలు లేదా ఇతరత్ర కారణాల వల్ల గాయపడిన లేదా దెబ్బతిన్న మొక్కలు మరోక మొక్కను హెచ్చరించేందుకు అస్థిర కర్బన సమ్మేళనాలను(వీఓసీ) విడుదల చేస్తుందని తెలిపారు పరిశోధకులు. గాల్లో విడుదలైన ఆ వీఓసీలను గాయపడిన మొక్కలు గ్రహించి తక్షణమే వివిధ రక్షణ ప్రతిస్పందనలు ప్రేరేపిస్తాయని తెలిపారు. అస్థిర కర్బన సమ్మేళనాలలో కాల్షియం అయాన్లు ఉండటం వల్ల మొక్కలు జరిపే ఈ కమ్యూనికేషన్ ప్రక్రియను కాల్షియం సిగ్నలింగ్ అని పిలవొచ్చని సైంటిస్టులు అన్నారు. ఈ ప్రయోగంలో భాగంగా రెండు టమాటా మొక్కలు, ఆవాల జాతికి చెందిన రెండు అరబిడోప్సిస్ థాలియానా జాతి కలుపుమొక్కలను పక్కపక్కన తొట్టిల్లో ఉంచారు. కాల్షియం సిగ్నలింగ్ అనేది మొక్కల ఆకులపై స్పష్టంగా కనిపించేలా ఈ మొక్కలకు బయో సెన్సర్లను బిగించారు. అనంతరం ఒక టమాటా మొక్క, ఒక అరబిడోప్సిస్ థాలియానా మొక్క ఉన్న తొట్టిలలోకి గొంగళి పురుగులను వేశారు. ఆ వెంటనే పురుగులు మొక్కలపైకి ఎక్కి ఆకులను తినడం ప్రారంభించాయి. దీంతో ఈ మొక్కలు స్పందించి.. వెంటనే కాల్షియం సిగ్నళ్లను రిలీజ్ చేశాయి. ఆ పక్కనే ఆరోగ్యకర స్థితిలో ఉన్న రెండు మొక్కలు ఈ సిగ్నళ్లను గ్రహించడం కూడా జరిగిపోయింది. దీంతో వెంటనే మొక్కల్లోని బయోసెన్సర్లు స్పందించి.. ఆకుల్లో కాల్షియం అయాన్లు యాక్టివేట్ అయిన ప్రదేశాన్ని మెరుస్తున్నట్లుగా హైలైట్ చేసి చూపించాయి. ఇదంతా లైవ్‌లో కెమెరాలో రికార్డయింది. If #plants could talk, they’d do so thru chemical signals about predators (aphids, caterpillars, gardeners with shears/pesticides…). Plants CAN talk (which we’ve known), but molecular biologists at Saitama University in Japan caught it 1st on film. https://t.co/44gXzMerK5 pic.twitter.com/DcLAlV1iti — HoneyGirlGrows (@HoneyGirlGrows) January 20, 2024 (చదవండి: మగవాళ్లు రోజూ వేడినీటి స్నానాలు చేయకూడదా? పరిశోధనలో షాకింగ్ విషయాలు)