ఇంతకుమునుపు మొక్కలు మాట్లాడతాయని, అవి కూడా బాధలకు ప్రతిస్పందిస్తాయని విన్నాం. అందుకు సంబంధించిన విషయాలను శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా వెల్లడించారు కూడా. ఎప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసుకుని ప్రతిస్పందిస్తాయన్నది ఓ మిస్టరీగా మిగిలిపోయింది. దీన్ని పరిశోధకులు తాజాగా చేధించడమే గాక మొక్కలు మాట్లాడుకోవడాన్ని కెమెరాలో బంధించి మరీ వివరించారు.
వివరాల్లోకెళ్తే..జపాన్‌కి చెందిన శాస్త్రవేత్తల బృందం అందుకు సంబంధించిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసింది.మొక్కలు ఒకదానికొకటి మాట్లాడుకోవడం నిజమేనని వీడియోలో బంధించి మరీ ప్రూవ్ చేసి చూపించారు. మొక్కలు కమ్యూనికేట్ చేయడానికి గాలిలో ఉండే సమ్మేళనాలను వినియోగించుకుంటాయిని, అవి పొగమంచుతో చుట్టబడి ఉంటాయని అన్నారు. ఈ సమ్మెళనాలను వాసనలుగా వినియోగించుగకుని ప్రమాదం గురించి మరొక మొక్కను హెచ్చరిస్తాయని చెబుతున్నారు. ఈ మేరకు జపాన్ శాస్త్రవేత్తలు రికార్డ్ చేసిన వీడియోలో.. మొక్కలు ఎలా ఆ సిగ్నల్స్‌ని స్వీకరించి ప్రతిస్పందిస్తాయన్నది ప్రత్యక్షంగా చేసి చూపించారు.
సైతామ యూనివర్సిటీకి చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ మసాత్సుగు టొయోటా నేతృత్వంలోని పరిశోధకులు బృందం ఈ విషయాన్నికమ్యూనికేషన్స్ జర్నల్‌లో వెల్లడించింది. ఇక్కడ మొక్కలు కీటకాలు లేదా ఇతరత్ర కారణాల వల్ల గాయపడిన లేదా దెబ్బతిన్న మొక్కలు మరోక మొక్కను హెచ్చరించేందుకు అస్థిర కర్బన సమ్మేళనాలను(వీఓసీ) విడుదల చేస్తుందని తెలిపారు పరిశోధకులు. గాల్లో విడుదలైన ఆ వీఓసీలను గాయపడిన మొక్కలు గ్రహించి తక్షణమే వివిధ రక్షణ ప్రతిస్పందనలు ప్రేరేపిస్తాయని తెలిపారు. అస్థిర కర్బన సమ్మేళనాలలో కాల్షియం అయాన్లు ఉండటం వల్ల మొక్కలు జరిపే ఈ కమ్యూనికేషన్ ప్రక్రియను కాల్షియం సిగ్నలింగ్ అని పిలవొచ్చని సైంటిస్టులు అన్నారు.
ఈ ప్రయోగంలో భాగంగా రెండు టమాటా మొక్కలు, ఆవాల జాతికి చెందిన రెండు అరబిడోప్సిస్ థాలియానా జాతి కలుపుమొక్కలను పక్కపక్కన తొట్టిల్లో ఉంచారు. కాల్షియం సిగ్నలింగ్ అనేది మొక్కల ఆకులపై స్పష్టంగా కనిపించేలా ఈ మొక్కలకు బయో సెన్సర్లను బిగించారు. అనంతరం ఒక టమాటా మొక్క, ఒక అరబిడోప్సిస్ థాలియానా మొక్క ఉన్న తొట్టిలలోకి గొంగళి పురుగులను వేశారు. ఆ వెంటనే పురుగులు మొక్కలపైకి ఎక్కి ఆకులను తినడం ప్రారంభించాయి. దీంతో ఈ మొక్కలు స్పందించి.. వెంటనే కాల్షియం సిగ్నళ్లను రిలీజ్ చేశాయి. ఆ పక్కనే ఆరోగ్యకర స్థితిలో ఉన్న రెండు మొక్కలు ఈ సిగ్నళ్లను గ్రహించడం కూడా జరిగిపోయింది. దీంతో వెంటనే మొక్కల్లోని బయోసెన్సర్లు స్పందించి.. ఆకుల్లో కాల్షియం అయాన్లు యాక్టివేట్ అయిన ప్రదేశాన్ని మెరుస్తున్నట్లుగా హైలైట్ చేసి చూపించాయి. ఇదంతా లైవ్‌లో కెమెరాలో రికార్డయింది.
If #plants could talk, they’d do so thru chemical signals about predators (aphids, caterpillars, gardeners with shears/pesticides…). Plants CAN talk (which we’ve known), but molecular biologists at Saitama University in Japan caught it 1st on film. https://t.co/44gXzMerK5 pic.twitter.com/DcLAlV1iti
— HoneyGirlGrows (@HoneyGirlGrows) January 20, 2024
(చదవండి: మగవాళ్లు రోజూ వేడినీటి స్నానాలు చేయకూడదా? పరిశోధనలో షాకింగ్ విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment