
సాక్షి, సిటీబ్యూరో: కేపీహెచ్ బీ కాలనీకి చెందిన మేడిది లలితాకుమారి తన ఇద్దరు చిన్నారులు లీషా ప్రజ్ఞ (8) అభిజ్ఞ ( 5) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాందించారు. 18 దేశాలకు చెందిన కీబోర్డ్ సంగీత కళాకారులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రికార్డు నెలకొల్పడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వ్యవసాయ, సహకార మార్కెటింగ్ చేనేత వ్రస్తాల శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారిని అభినందించారు.
డిసెంబర్ 1, 2024న హాలెల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి గంట వ్యవధిలో ఇన్‌స్ట్రాగాం వేదికగా వీడియోలు అప్‌లోడ్ చేశారు. లండన్‌లోని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధినేత మిస్టర్ రిచర్డ్ స్టన్నింగ్ సంగీత కళాకారులను విజేతలను ప్రకటించి డిసెంబర్ 9, 2024న లండన్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా వారిని అభినందించారు. ఈనెల 14న హైదరాబాద్‌లోని మణికొండలో జరిగిన వేడుకల్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్, హాలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టీన్ దండింగి సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు.